13, జనవరి 2023, శుక్రవారం

భగవద్గీత

 🙏💐🌹🙌 Establishment of Supreme Court Bench in AP for South India is our prime aim🙌🌹💐👍

🌹భగవద్గీత🌹         

రెండవ అధ్యాయము. సాంఖ్యయోగము నుండి 37 వ శ్లోకము . పదచ్ఛేద ,టీకా ,తాత్పర్య సహితముగా.

హతో వా ప్రాప్స్యసి స్వర్గం 

జిత్వా వా భోక్ష్యసే మహీమ్ ౹

తస్మాదుత్తిష్ఠ కౌన్తేయ 

యద్ధాయ కృతనిశ్చయః ౹౹ (37)

హతః , వా , ప్రాప్స్యసి , స్వర్గమ్ ,

జిత్వా , వా , భోక్ష్యసే , మహీమ్ ౹

తస్మాత్ , ఉత్తిష్ఠ , కౌంతేయ ,

యుద్ధాయ , కృతనిశ్చయః ౹౹   (37)

వా = ఒకవేళ ;

హతః = (నీవు) చంపబడినచో ;

స్వర్గమ్ = స్వర్గమును ;

ప్రాప్స్యసి = పొందగలవు ;

వా = లేక (అట్లుగాక) ;

జిత్వా = (నీవు యుద్ధమున) జయించినచో ;

మహీమ్ = భూమండల రాజ్యమును ;

భోక్ష్యసే =  అనుభవించెదవు ;

తస్మాత్ = అందువలన.;

కౌంతేయ ! = కుంతికుమార ! (అర్జున!) ;

యుద్ధాయ = యుద్ధము చేయుట కొఱకు ;

కృతనిశ్చయః = తిరుగులేని నిశ్చయము గలవాడవై ;

ఉత్తిష్ఠ = లెమ్ము (కటిబద్ధుడవు కమ్ము) .

తాత్పర్యము :- ఓ అర్జున !  రణరంగమున  మరణించినచో  నీకు  వీరస్వర్గము ప్రాప్తించును . యుద్ధమున జయించినచో రాజ్యభోగములను అనుభవింపగలవు . కనుక  కృతనిశ్చయుడవై యుద్ధమునకు లెమ్ము . (37)

  Good morning to all of you

               Yours Welwisher

Yennapusa Bhagya Lakshmi Reddy

Advocate AP High Court Amaravathi

ఆహారపు రుచులు

 ఆహారపు రుచులు మరియు వాటివలన మానవ శరీరముకు కలుగు ఉపయోగాలు  - 

    రుచులు మొత్తం 6 రకాలు .  అవి 

  తీపి , పులుపు , ఉప్పు , చేదు , కారము , వగరు  అని 6 రకాలుగా ఉంటాయి. మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థంలో ఈ ఆరు రుచులు అంతర్లీనంగా ఉంటాయి. మనుష్య శరీరం నందు రోగాలు పుట్టుటకు మరియు రోగాలు తగ్గుటకు మనకి ఈ ఆరు రుచులు సమ్మిళితమైన ఆహారమే ప్రధాన కారణం .

        ప్రథమంగా ముందు మన ప్రాచీన ఆయుర్వేదం లో మానవ శరీరం గురించి మీకు వివరిస్తాను.  మానవశరీరం నందు ఏడు చర్మములు , ఏడు ధాతువులు , ఏడు ఆశయాలు , ఏడు వందల శిరలు , అయిదు వందల పేశిలు , తొమ్మిది వందల స్నాయువులు , మూడు వందల ఎముకలు కాని చరకుడు వివరించిన దానిప్రకారం ఎముకలు మూడువందల ఆరు. పాశ్చాత్త్యా సిద్ధాంతం ప్రకారం రెండువందల పదియే కలవు. రెండు వందల పది సంధులు , నూట ఏడు మర్మస్థానములు , ఇరవైనాలుగు ధమనులు , మూడు దోషములు , మూడు మలములు , తొమ్మిది స్రోతస్సులు , పదహారు కండరములు , పదహారు సన్నని జాలములు అనగా సన్నని నరముల అల్లికలు , ఆరు కూర్చములు అనగా ఎముకల కట్టలు నాలుగు మరియు శిరల కట్టలు రెండు రకాలు . నాలుగు పెద్దతాళ్లు , ఏడు కుట్లు , పదనాలుగు ఎముకల కూటములు , పదనాలుగు సీమంతములు , ఇరువది రెండు శ్రోతస్సులు , రెండు ప్రేవులు , మూడున్నరకోట్ల రోమకూపములు.   ఇంత ఉత్క్రుష్టమైనది మానవశరీరం . నిద్రాహార విహారాలలో మార్పులు మరియు హెచ్చుతగ్గుల వలన శరీరంలో రోగాలు సంభవిస్తాయి.

           కొన్ని రకాల ద్రవ్యములను తినిన యెడల శరీరంలో రోగాలు నశించగలవు. కొన్నిరకాల ఆహారపదార్థాలను తినిన యెడల శరీరం నందు కొత్తకొత్త రోగాలు పుట్టును . అసలు రోగం అంటే ఏంటో మీకు తెలియచేస్తాను .శరీరధారకములు అగు వాత, పిత్త, శ్లేష్మములలో ఉండవలసిన ప్రమాణం కంటే హెచ్చుతగ్గులు ఉండుటయే రోగం . 

          మనం తీసుకునే ప్రతి ఆహారం 6 రకాల రుచులతో సమ్మిళతం అయి ఉంటుంది అని చెప్పాను కదా .  ఇందులో మొదటివగు తీపి , పులుపు , ఉప్పు ఇవి వాత దోషమును పోగొట్టును . చేదు , కారం , వగరు ఇవి కఫాన్ని హరించును . వగరు, చేదు , తీపి రసములు పిత్తదోషమును హరించును . ఆహారం జీర్ణం అయిన తరువాత వేడిచేయుట , చలువచేయుట అను రెండు విధాలుగా మాత్రమే ఉండును.  

     ఇప్పుడు మీకు రుచులు వాటి యొక్క గుణాలు తెలియచేస్తాను .

  మధురరస గుణములు  - 

 *  తీపిగా ఉన్న పదార్థాలను తినటం వలన , పుట్టినప్పటి నుండి అలవాటు పడిన సప్త ధాతువులకు బలం కలుగును.

 *  చిన్నపిల్లలకు , ముసలివారికి , దెబ్బలు తగిలిన వారికి , బలం క్షీణించినవారికి , రక్తమాంసములు క్షీణించినవారికి తీపి పదార్థాలు చాలా హితకరం అయినవి.

 *  శరీరవర్ణం పెరుగుటకు , వెంట్రుకల వృద్ధికి , ఇంద్రియ బలం పెరుగుటకు , ఓజస్సు వృద్ది చెందుటకు ఈ మధుర రసం ఉపయోగపడును.

 *  శరీరంకి మంచి పుష్టిని ఇచ్చును.

 *  కంఠస్వరం పెరుగును .

 *  బాలింతలగు స్త్రీలకు ఎండిపోయిన పాలను వృద్ది పరుచును.

 *  ఆయుష్షుకు కారణం , ప్రాణరక్షణకరమైనది .

 *  వాత, పిత్త, విషాలను హరించును . 

  గమనిక  - 

          ఈ మధుర రసమును అధికంగా వాడిన మేధస్సుతో కూడిన కఫ వ్యాధులను పుట్టించును .శరీరం లావెక్కును . అగ్నిబలం తగ్గును అనగా జఠరాగ్ని తగ్గును. ఇరువది అగు మేహరోగాలు జనించును. అర్బుదం అనగా గడ్డతో కూడిన కేన్సర్ వచ్చును.

 ఆమ్లరసం గుణములు  - 

 *  ఈ ఆమ్లరసం ( పులుపు ) అగ్నిదీప్తి అనగా జఠరాగ్ని పెంచును.

 *  హృదయముకు బలమునిచ్చును.

 *  ఆహారాన్ని అరిగించును.

 *  రుచిని పుట్టించును . 

 *  శరీరం నందు వేడి కలుగచేయును .

 *  మలాన్ని విడిపించును.

 *  తేలికగా జీర్ణం అగును.

 *  కడుపులో బిగిసి ఉన్న వాయువుని బయటకి వెడలించును.

  గమనిక  - 

        దీనిని అధికంగా వాడినచో కఫమును పెంచును , రక్తపిత్త వ్యాది అనగా నోటివెంట రక్తం పడువ్యాధిని పుట్టించును , శరీర అవయవాల పట్టు సడలించును , తిమ్మిరి , భ్రమ , దురదలు , పాండురోగం , విసర్పవ్యాధి , శరీర భాగాల్లో వాపు , దప్పిక, జ్వరం వంటి వ్యాధులను పుట్టించును . 

  లవణ రస గుణాలు  - 

 *  ఈ లవణ రసం శరీరంలో స్తంభించిన దోషాన్ని విడిపించి బయటకి పంపును . 

 *  జఠరాగ్ని పెంచును.

 *  చమురు కలది.

 *  చెమట పుట్టించును . 

 *  తీక్షణమైనది , రుచిని పుట్టించును . 

 *  వ్రణములు అనగా గడ్డలు పగిలేలా చేయును .

 *  శరీరం నందు మలినపదార్థాలు విడగొట్టి బయటకి పంపును 

  గమనిక  - 

           ఈ లవణ రసాన్ని అధికంగా వాడటం వలన వాతారక్త వ్యాధిని కలిగించును . బట్టతలను తగ్గించును .  వెంట్రుకలు నెరిసిపోవును , శరీరం ముడతలు పడును. దప్పికను కలిగించును , కుష్టు రోగము కలుగును. విసర్పి రోగం కలుగును. బలమును  హరించును .

  తిక్త ( చేదు ) రస గుణాలు  - 

 *  ఇది అరుచిని హరించును .

 *  శరీరం నందలి క్రిములను , దప్పిక , విషమును , కుష్టు , మూర్ఛని హరించును . 

 *  మూర్చ, జ్వరాలను , శరీరం నందలి మంటలను, వేడిని , కఫాన్ని హరించును .

 *  శరీరం నందలి వ్రణాల నుండి కారు దుష్టజలాన్ని , మాంసం నందలి కొవ్వుని కరిగించును. ఎముకల్లో మూలుగను , శరీరంలో మలమూత్రాలను హరించును .

 *  తేలికగా జీర్ణం అగును.

 *  బుద్దిని పెంచును.

 *  చమురు హరించును .

 *  స్త్రీల పాలు యందు మరియు కంఠం నందలి దోషాలు పొగొట్టును.

  గమనిక  - 

          అధికంగా తీసుకున్న ధాతువులను క్షీణింపచేసి వాత రోగాల్ని పుట్టించును .

  కటు ( కారం ) రసం గుణాలు  - 

 *  ఈ కటు రసం కంట రోగం , కుష్టు , వాపు పోగొట్టును .

 *  వ్రణములు తగ్గించును 

 *  శరీరం నందలి దుష్ట జలాన్ని , కొవ్వుని హరించును . 

 *  జఠరాగ్ని పెంచును.

 *  అన్నమును జీర్ణింపచేయును .

 *  రుచిని పుట్టించును .

 *  సన్నని నరములలోని దోషాలు కూడా శోధించి వ్యర్థాలను బయటకి పంపును .

 *  నవరంధ్రాలు ను తెరిపించును.

 *  కఫాన్ని హరించును .

 గమనిక  - 

        దీనిని అతిగా తీసుకున్నచో దప్పిక పుట్టించును . శుక్రమును , బలాన్ని నశింపచేయును. మూర్చని కలిగించును. అంగములు ముడుచుకున్నట్లు చేయును . వణుకు పుట్టించును .నడుము , వీపు నందు నొప్పి కలుగచేయును .

  కషాయ ( వగరు ) రస గుణములు  - 

 *  వగరు పదార్థం పిత్తశ్లేష్మాలని హరించును .

 *  రక్తాన్ని శుద్దిచేయును .

 *  నొప్పిని కలిగించును.

 *  వ్రణాలను మాన్చును.

 *  శరీరం నందలి దుష్ట జలాన్ని తీసివేయును .

 *  ఆమమును స్తంభింపచేయును .

 *  మలాన్ని గట్టిపరుచును.

 *  చర్మాన్ని నిర్మలంగా చేయును .

  గమనిక  - 

       దీనిని అతిగా సేవించిన మలబద్దకం , కడుపు ఉబ్బరం , గ్యాస్ , గుండెజబ్బులు , దప్పిక, లివరు చిక్కిపోవుట, సంభోగ శక్తిని నశింపచేయును . మలబద్దకం కలిగించును.

       పైన చెప్పిన విధంగా మనం తీసుకునే ఆహార పదార్థం యొక్క రుచిని బట్టి మన ఆరోగ్యం అధారపడి ఉండును.

        ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.

 గమనిక  -

      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

            9885030034 

         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

కామెర్ల వ్యాధి

 కామెర్ల వ్యాధి  - లక్షణాలు - ఒకే మూలిక ఉపయోగించి చికిత్స చేసే విధానం . 

     కామెర్ల వ్యాధిని జాండిస్ అంటారు. ఇది సాధారణంగా నీటి కాలుష్యం వలన వస్తుంది. బాగా వరదలు వచ్చే ప్రాంతంలో కూడా ఎక్కువుగా వచ్చే అవకాశం ఉన్నది. ఇది వైరస్ వల్ల వచ్చే వ్యాధి . దీని మూలంగా చర్మం , కళ్లు , మల , మూత్రాదులు పసుపు రంగులో మారతాయి. విరేచనం తెల్లగా లేదా బూడిద రంగులో మారుతుంది . దీనికి ప్రధాన కారణం రక్తంలోని "బైలురూబిన్ " శాతం ఎక్కువ అవ్వడమే . 

           ఆయుర్వేదంలో కామెర్లని మూడు రకాలుగా విభజించారు .  అవి 

    1 .  కోష్ఠశ్రీత కామల .

    2 .  శాఖాశ్రీత కామల .

    3 .  కుంభ కామల 

      కామల అనగా ఆయుర్వేదంలో కామెర్ల వ్యాధికి ఉన్న మరొక పేరు . 

  వ్యాధి లక్షణాలు  -

     రోగిని పరీక్షించినప్పుడు కాలేయం ( liver ) ఆకారం పెరిగి ఉంటుంది. 

  1 .  కళ్లు పసుపు రంగులో ఉంటాయి.

   2 .  శరీరం కూడా వ్యాధితీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు పసుపు వర్ణంలో మారుతుంది . 

   3 .  అన్నం తినాలనిపించదు.

   4 .  వాంతులు అవుతాయి.

   5 .  కొంతమందిలో దురద వస్తుంది . 

  పాటించవలసిన ఆహారనియమాలు  -

    కొవ్వు పదార్ధాలు , సిగిరెట్లు , ఆల్కాహాల్ , మాంసం మానివేయాలి . నూనె పదార్దాలు , స్వీట్స్ , నెయ్యి , పూరి , చపాతీ తినకూడదు. తేలికైన మరియు త్వరగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవాలి . పాలు , మజ్జిగ , ఆకుకూరలు తినవచ్చు. గ్లూకోజ్ బాగా తాగాలి. పళ్లరసాలు , కాచి చల్లార్చిన నీరు , చెఱుకురసం బాగా త్రాగాలి.

  ఒకే మూలికని ఉపయోగించి చికిత్స చేసే విధానం  - 

 *  నేల ఉసిరి సమూల రసం తీసి మజ్జిగతో సేవిస్తే కామెర్లు తగ్గును. నేల ఉసిరికి కామెర్లని కలగజేసే వైరస్ ని సంహరించే గుణం ఉన్నది.

 *  నేల వేము 50ml కషాయం , 2 గ్రాముల శొంఠి కలిపి రోజుకి రెండుసార్లు సేవించాలి . 

 *  తిప్పతీగ స్వరసం ( చెట్టు మొత్తాన్ని దంచి తీసిన రసం ) 14ml తీసుకుని 14 మిల్లి గ్రాముల తేనెలో ఉదయం , సాయంత్రం సేవించాలి . 

 *  ఏరణ్డ మూల చూర్ణం తేనెతో కలిపి తీసుకున్న కామెర్ల వ్యాధి నయం అగును. 

 *  కటుకరోహిణి చూర్ణం 2 నుంచి 3 గ్రాములు తేనెతో సేవించిన కామెర్ల వ్యాధి నయం అవ్వును. 

 *  త్రిఫలా చూర్ణం 3 గ్రాములు తేనెతో కలిపి తీసుకున్న కామెర్ల వ్యాధి నయం అగును.

 *  చింతాకు చిగుళ్లు 4 గ్రాములు , వేపాకు చిగుళ్లు 1 గ్రాము ముద్దగా చేసి ఉదయం పరగడుపున మ్రింగించి పాలు త్రాగిస్తే కామెర్ల వ్యాధి నయం అగును.

        కఠిన ఆహారనియమాలు పాటిస్తే తొందరంగా వ్యాధి నుంచి బయటపడగలరు. 

  ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.

 గమనిక  -

      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

            9885030034 

         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

మొలలు వ్యాధి

 మొలలు వ్యాధి  ఉన్నవారు పాటించవలసిన జాగ్రత్తలు  -

 *  పాతబియ్యం , పాతగోధుమలు వాడవలెను.

 *  బార్లీ , సగ్గుబియ్యం జావ వాడవలెను.

 *  బీరకాయ, పొట్లకాయ కూరలు తినవలెను .

 *  పెసరపప్పు తినవలెను . కందిపప్పు , మినపపప్పు తినవద్దు.

 *  కోడి మాంసం , గుడ్డు నిషిద్దం . ఎప్పుడైనా ఒకసారి మేకమాంసం అతి తక్కువ మోతాదులో మసాలా చాలా తక్కువ మోతాదులో కలిపి తీసుకొవచ్చు.

 *  పాతపచ్చళ్ళు పూర్తిగా నిషిద్దం.

 *  ఎక్కువసేపు ప్రయాణాలు చేయరాదు .

 *  పళ్ల రసాలు తీసుకోవచ్చు . ముఖ్యంగా యాపిల్ రసం తీసుకోవలెను .

 *  కఠినంగా ఉండే చెక్క కుర్చీల పైన ఎక్కువసేపు కూర్చోరాదు. స్పాంజితో చేసినవి కూడా వాడకూడదు . బూరుగు దూది లేదా పత్తితో చేసినవి వాడవలెను.

 *  పెరుగుతోటకూర, మెంతికూర, పాలకూర, గంగపాయల కూర , చక్రవర్తికూర వంటి ఆకుకూరల తరుచుగా తీసికొనవలెను.

 *  మలబద్దకం లేకుండా చూసుకొనవలెను. సుఖవిరేచనం అయ్యేలా చూసుకోవాలి .

 *  ఆవునెయ్యి , ఆవుమజ్జిగ, ఆవుపాలు వాడుకుంటే మంచిది .

 *  శరీరానికి వేడిచేసే పదార్థాలు తీసుకోరాదు . వీలయినంత ఎక్కువ మజ్జిగ తీసికొనవలెను.

 *  కొత్తబియ్యం, కొత్తగోధుమలు వాడరాదు.

 *  కొత్తచింతపండు , కొత్తబెల్లం నిషిద్దం.

 *  నువ్వులు , ఆవాలు , నువ్వు చెక్క వాడరాదు.

 *  ఆహారంలో నూనె తగ్గించి వాడుకొనవలెను.

 *  కొడి చేప , రొయ్యలు వాడరాదు.

 * చద్దన్నం, చల్లబడినవి , మెత్తపడిన ఆహారాన్ని తినకూడదు.

 *  వంకాయ , గోంగూర, సొరకాయ, బచ్చలి ఎట్టి పరిస్థితుల్లోనూ మొలల సమస్య ఉన్నవారు తీసుకోకూడదు .

       మొలల సమస్య ఉన్నవారు శరీరంలో వాతం , వేడి పెరగకుండా జాగ్రత్తపడుతూ సరైన వైద్యుడుని సంప్రదించి చికిత్స తీసుకొనవలెను .

     మొలలకు సంబంధించి సంపూర్ణ చికిత్సకు నన్ను సంప్రదించవచ్చు. రక్తం కారే తీవ్రమైన సమస్య ఉన్నను కేవలం 10 రోజులలోపు రక్తం ఆగిపోయి నొప్పి తగ్గుతుంది . మొలల పిలకలు కూడా ఎటువంటి సర్జరీ లేకుండా ఊడిపోతాయి.

   ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

 గమనిక  -

      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

            9885030034 

         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

పంటలు వేయుటకు శుభ సమయాలు

 పంటలు వేయుటకు శుభ సమయాలు, తిధులు , నక్షత్రాలు  -

 * హస్తా నక్షత్రం, మృగశిర నక్షత్రం, మాఘ నక్షత్రం, ధనిష్టా నక్షత్రం, రేవతి నక్షత్రం, ఉత్తర ఫాల్గుణ నక్షత్రం, ఉత్తరాషాడ నక్షత్రం, ఉత్తరాబాద్ర నక్షత్రం, నందు భూమి యందు విత్తనములు చల్లినచొ చక్కగా ఫలించును.

 * పుష్యమి నక్షత్రం, పునర్వసు నక్షత్రం, రోహిణి నక్షత్రం, యందు భూమి యందు చల్లిన వడ్లు , చామలు సమృద్ధిగా పండును. మూలా నక్షత్రం నందు చల్లిన అన్ని ధాన్యములు చక్కగా ఫలించును.

 * అశ్వని నక్షత్రం, పుబ్బా నక్షత్రం, పుర్వాషాడ నక్షత్రం, ఆర్దా నక్షత్రం, పూర్వాభాద్ర నక్షత్రం, నాడు ప్రత్తి విత్తనములు నాటిన పక్షమున అవి మొలచి చక్కగా పెరిగి ప్రత్తి బాగుగా పండును. శతబిష నక్షత్రం, విశాఖ నక్షత్రం, నాడు నాటబడిన భుమిలో పెరుగు దుంప దినుసులు, చెరకు తోటలు లెస్సగా ఫలించును. శ్రవణా నక్షత్రం నాడు మొలక వేసిన చెన్నంగి అను వడ్లు చక్కగా పండును. ఉత్తర ఫాల్గుని నక్షత్రం నాడు తమలపాకు తీగలు నాటిన యెడల హద్దు లేకుండా పెరుగును. 

 * కృత్తికా నక్షత్రం నాడు , హస్తా నక్షత్రం నాడు, చల్లిన శెనగలు భూమి యందు జనులు తృప్తి పొందునట్టు హెచ్చుగా పండును. భరణి నక్షత్రం నాడు గొధుమలు నాటిన యెడల అవి ఫలించును. అనగా ఆయా నక్షత్రం నాడు ఆయా గింజలు నాటవలెను.

 * పుబ్బా నక్షత్రం నాడు శెనగ గింజలు చల్లిన పక్షమున ఆ పంట పండక చెడిపోవును. ఆర్దా నక్షత్రం నాడు చల్లిన యెడల ఏదేని జబ్బు తగిలి చేను పెరగక ఉండును. చిత్తా నక్షత్రం నాడు శెనగ విత్తనములు నాటినచో ఆ పైరుని అతివేగముగా మిడుతలు తినివేయును.

 * భూమి యందు మృగశిరా నక్షత్రం నాడు చల్లిన గొధుమ పంటను మృగములు తృప్తిగా తినిపోవును. అదే జైష్టా నక్షత్రం నాడు చల్లిన పంటలు పండవు . ఒకవేళ పండినా ఆ పంట దొంగలపాలు అగును.

 * ఆశ్లేషా నక్షత్రం నాడు ప్రత్తి విత్తనాలు చల్లినచొ స్వల్పముగా ఫలించును. కాని ఫలిన్చవలసినంతగా ఫలించవు. కావున నక్షత్రం మంచిదో కాదో ఆలోచించకుండా విత్తనములు వేసినచో అవి పండినట్లే పండి చెడిపోవును.

 * శతబిష నక్షత్రమున , విశాఖ నక్షత్రమున అవిసె గింజలు, మునగ విత్తనములు నాటిన యెడల ఆ సస్యములు వృద్ది నొందక మిక్కిలి ఆశ్చర్యముగా పురుగుపట్టి పాడుచేయును.

 * పాపగ్రహములు ఉన్న లగ్నముల యందు ఆ పాపగ్రహములను చూచుచున్న లగ్నముల యందు విత్తనములు నాటుట మంచిది కాదు.

 * శుక్రుడు లగ్నము నందు ఉండిన ఆ లగ్నమునకు సూటిగా 7 వ ఇంట ఉండిన ను భూమి యందు నెల్ల ధాన్యములను నాటవచ్చును .

 * చంద్రుడు కేంద్ర స్థానం నందు ఉండిన పాపగ్రహములు మంచివిగా కాకున్నను వేసిన సస్యములు అన్నియు ఫలించును.

 * సూర్యుడు ఆర్ద నక్షత్రం నందు ప్రవేశించి నప్పుడు మొదలుకొని భూమి యందు చల్లిన విత్తనములు అన్నియూ , ఆ సమయం చాలా మంచి సమయం అగుటచే వృద్ది నొంది చక్కగా ఫలించును.

 * శ్రవణా నక్షత్రం నందు చల్లిన రాజనములు అను ఒక దినుసు ధాన్యము స్వల్పముగా ఫలించును. ఆరుద్రా నక్షత్రము నందు , పుష్యమి నక్షత్రము నందు, భరణి నక్షత్రము నందు, పునర్వసు నక్షత్రము నందు, రోహిణి నక్షత్రము నందు, మాఘ నక్షత్రము నందు, నాటిన విత్తనములు వృద్ది నొంది చక్కగా ఫలించును.

 * స్వాతి నక్షత్రము నందు, పుర్వాషాడ నక్షత్రము నందు, పుర్వాబాద్ర నక్షత్రము నందు, ప్రత్తి గింజలు నాటు వేసిన  పక్షమున హెచ్చుగా ప్రత్తినిచ్చును. జైష్టా నక్షత్రమున మినుములు చల్లిన యెడల పంట హెచ్చుగా పండును.

 * హస్తా నక్షత్రము నందు,పెసర విత్తనములు, ఆరుద్రా నక్షత్రము నందు నువ్వు విత్తనములు , మూలా నక్షత్రము నందు కంది విత్తనములు నాటిన పక్షమున అనురాధా నక్షత్రము న పత్తి విత్తనములు నాటిన చక్కగా పండును.

 * అశ్వని నక్షత్రము నందు శెనగ విత్తనములు , పుర్వాషాడ నక్షత్రము నందు అలసంద విత్తనములు నాటిన పక్షమున చక్కగా ఫలించును.

 * ఉత్తరా నక్షత్రం నందు, అనురాధా నక్షత్రం నందు, మూలా నక్షత్రం నందు, రోహిణి నక్షత్రం నందు, రేవతి నక్షత్రం నందు విత్తనాలు నాటు వేయుట చాలా మంచిది. 

 * ఉత్తరా నక్షత్రం, రోహిణి నక్షత్రం, అనురాధా నక్షత్రం, రేవతి  నక్షత్రం, యందు జొన్న విత్తనాలు నాటుట చాలా మంచిది.

 * భుమి మీద విత్తనములు నాటుటకు అశ్వని నక్షత్రం, ధనిష్టా నక్షత్రం, శతబిష నక్షత్రం, శ్రవణా నక్షత్రం, పునర్వసు నక్షత్రం మధ్యమములు.

 * మకర రాశి యందు , సింహరాశి యందు , వృషభ రాశి, మీనరాశి, కర్కాటక రాశి, విత్తనములు చల్లుటకు చాలా మంచిది. అది చల్లునట్టి లగ్నమున గురుడు ఉండిన బుదుడు, శుక్రుడు ఉండుట చాలా మంచిది.

 * చాయాదేవి కొడుకైన శని మేషము నందు ఉన్నప్పుడు గురుడు వృషభ రాశి యందు ఉన్నప్పుడు ధనస్సు నందు సూర్యుడు ప్రవేశించి  మొదలుకుని మాఘ మాసం వరకు స్వాతి నక్షత్రం నందు, ములా నక్షత్రం నందు, అనురాధా నక్షత్రం నందు, మకర రాశి యందు , మీనరాశి యందు , కర్కాటక రాశి యందు చల్లిన పక్షమున జొన్న పంట హెచ్చుగా పండును.

 * పైన వివరించిన నక్షత్రములను ఆ రాశులకు కాక మిగిలిన నక్షత్రముల యందును, రాశుల యందును, జొన్న విత్తనములు నాటవేసిన పక్షమున మూడు వంతుల పంట ఎర్రబడి చెడిపోవును. ఒక్క వంతు మాత్రమే ఫలించును.

 * ముందుగా గంధము , అక్షంతలు, ధూపము, నైవేద్యము అనునవి దున్నిన పొలము మీదను, దున్నేడు యంత్రముకు కుడా సమర్పించవలెను. అలాగే విత్తనములు చల్లు యంత్రముకు కుడా సమర్పించవలెను. అటుపైన సంతోషముతో జొన్నలు మొదలయిన విత్తనములు నాటిన పక్షమున తక్కువ కాకుండా ఫలించును. విత్తనములు చల్లునప్పుడు వేగముగా పగ్గములు అయినను, మోకులు అయినను తెగిపోయినట్లు అయినను , ఎద్దులు మూలిగినను , ఎద్దులు పడిపోయినను ఆ పండిన పంట రాచకార్యముల చేత పాడైపోవును. ముందుగా ఎద్దు పడిపోయిన ఆ దొషం చేత ఆ పంట దొంగలపాలు అయినను పడును. అంతేకాకుండా  పండించే డి కాపునకు, వాని తమ్మునుకు గట్టిగా కీడు తగలవచ్చు.

 * విత్తనములు చల్లుటకు పోవునప్పుడు పైడికంటి అను పక్షి, ఎడమవైపు కూసి , నిలిచినను , కుడివైపు గాడిద కాని , ముంగీస కాని , కాకి కాని పోయినను, కుక్క ఎడమ దిక్కుకు పోయినను సంతోషించి ముత్తైదువులు నేసలు చల్లినను, సంతోషంతో బ్రాహ్మణులు వేదములు పటించు చున్నను , విత్తనములు చల్లుచున్నప్పుడు ఎద్దు ఎడమవైపు చాలు చేసిననూ ఆ పైరు చక్కగా ఫలించును.

 * శుక్రుడు , బుదుడు ఉన్న లగ్నం నందు, చంద్రుడు ఉన్నటువంటి యానవంశముల యన్ధైనను ఈ భూమి మీద కలిగిన ధాన్యములు ఏవి చల్లినను తప్పక ఫలించును.

 * దేవతల గురువగు బృహస్పతి లగ్నము నందు ఉండగా విత్తనములు చల్లుట యును , నాల్గోవ ఇంట ఉండగా పైరు కాలం తప్పకుండా కొయుట యును , సప్తమ స్థానం నందు ఉండగా వేగముగా ఆ పైరులు జాగ్రత్తగా పెట్టుకొనుట చాలా మంచిది. కాబట్టి గురుబలం విచారించి మరియు విత్తనములు చల్లవలెను.

 * కొరిక కలిగి పంటలను కోయుటకు పోవుచున్నప్పుడు కాకి కుడి ప్రక్కకు వచ్చి కర్రకర్ర అని కూసినను, దాని కుడి అవయవముల తో ఏదేని చేష్ట చేసినను పంట విస్తారముగా లబించును.

 * పండిన చేను కోయుటకు పోవునప్పుడు ఆలోచించగా విధవ కాని , చెవుల పిల్లికాని, నిప్పు కాని , కసువు కాని ఎదురుగా వచ్చిన పక్షమున పండించుకొన్న పంట దక్కదు.