13, జనవరి 2023, శుక్రవారం

భగవద్గీత

 🙏💐🌹🙌 Establishment of Supreme Court Bench in AP for South India is our prime aim🙌🌹💐👍


🌹భగవద్గీత🌹         


రెండవ అధ్యాయము. సాంఖ్యయోగము నుండి 37 వ శ్లోకము . పదచ్ఛేద ,టీకా ,తాత్పర్య సహితముగా.

 

హతో వా ప్రాప్స్యసి స్వర్గం 

జిత్వా వా భోక్ష్యసే మహీమ్ ౹

తస్మాదుత్తిష్ఠ కౌన్తేయ 

యద్ధాయ కృతనిశ్చయః ౹౹ (37)


హతః , వా , ప్రాప్స్యసి , స్వర్గమ్ ,

జిత్వా , వా , భోక్ష్యసే , మహీమ్ ౹

తస్మాత్ , ఉత్తిష్ఠ , కౌంతేయ ,

యుద్ధాయ , కృతనిశ్చయః ౹౹   (37)


వా = ఒకవేళ ;

హతః = (నీవు) చంపబడినచో ;

స్వర్గమ్ = స్వర్గమును ;

ప్రాప్స్యసి = పొందగలవు ;

వా = లేక (అట్లుగాక) ;

జిత్వా = (నీవు యుద్ధమున) జయించినచో ;

మహీమ్ = భూమండల రాజ్యమును ;

భోక్ష్యసే =  అనుభవించెదవు ;

తస్మాత్ = అందువలన.;

కౌంతేయ ! = కుంతికుమార ! (అర్జున!) ;

యుద్ధాయ = యుద్ధము చేయుట కొఱకు ;

కృతనిశ్చయః = తిరుగులేని నిశ్చయము గలవాడవై ;

ఉత్తిష్ఠ = లెమ్ము (కటిబద్ధుడవు కమ్ము) .


తాత్పర్యము :- ఓ అర్జున !  రణరంగమున  మరణించినచో  నీకు  వీరస్వర్గము ప్రాప్తించును . యుద్ధమున జయించినచో రాజ్యభోగములను అనుభవింపగలవు . కనుక  కృతనిశ్చయుడవై యుద్ధమునకు లెమ్ము . (37)


  Good morning to all of you


               Yours Welwisher

Yennapusa Bhagya Lakshmi Reddy

Advocate AP High Court Amaravathi

కామెంట్‌లు లేవు: