13, జనవరి 2023, శుక్రవారం

కామెర్ల వ్యాధి

 కామెర్ల వ్యాధి  - లక్షణాలు - ఒకే మూలిక ఉపయోగించి చికిత్స చేసే విధానం . 


     కామెర్ల వ్యాధిని జాండిస్ అంటారు. ఇది సాధారణంగా నీటి కాలుష్యం వలన వస్తుంది. బాగా వరదలు వచ్చే ప్రాంతంలో కూడా ఎక్కువుగా వచ్చే అవకాశం ఉన్నది. ఇది వైరస్ వల్ల వచ్చే వ్యాధి . దీని మూలంగా చర్మం , కళ్లు , మల , మూత్రాదులు పసుపు రంగులో మారతాయి. విరేచనం తెల్లగా లేదా బూడిద రంగులో మారుతుంది . దీనికి ప్రధాన కారణం రక్తంలోని "బైలురూబిన్ " శాతం ఎక్కువ అవ్వడమే . 


           ఆయుర్వేదంలో కామెర్లని మూడు రకాలుగా విభజించారు .  అవి 


    1 .  కోష్ఠశ్రీత కామల .

 

    2 .  శాఖాశ్రీత కామల .


    3 .  కుంభ కామల 


      కామల అనగా ఆయుర్వేదంలో కామెర్ల వ్యాధికి ఉన్న మరొక పేరు . 


  వ్యాధి లక్షణాలు  -


     రోగిని పరీక్షించినప్పుడు కాలేయం ( liver ) ఆకారం పెరిగి ఉంటుంది. 


  1 .  కళ్లు పసుపు రంగులో ఉంటాయి.


   2 .  శరీరం కూడా వ్యాధితీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు పసుపు వర్ణంలో మారుతుంది . 


   3 .  అన్నం తినాలనిపించదు.


   4 .  వాంతులు అవుతాయి.


   5 .  కొంతమందిలో దురద వస్తుంది . 


   

  పాటించవలసిన ఆహారనియమాలు  -


    కొవ్వు పదార్ధాలు , సిగిరెట్లు , ఆల్కాహాల్ , మాంసం మానివేయాలి . నూనె పదార్దాలు , స్వీట్స్ , నెయ్యి , పూరి , చపాతీ తినకూడదు. తేలికైన మరియు త్వరగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవాలి . పాలు , మజ్జిగ , ఆకుకూరలు తినవచ్చు. గ్లూకోజ్ బాగా తాగాలి. పళ్లరసాలు , కాచి చల్లార్చిన నీరు , చెఱుకురసం బాగా త్రాగాలి.


  ఒకే మూలికని ఉపయోగించి చికిత్స చేసే విధానం  - 


 *  నేల ఉసిరి సమూల రసం తీసి మజ్జిగతో సేవిస్తే కామెర్లు తగ్గును. నేల ఉసిరికి కామెర్లని కలగజేసే వైరస్ ని సంహరించే గుణం ఉన్నది.


 *  నేల వేము 50ml కషాయం , 2 గ్రాముల శొంఠి కలిపి రోజుకి రెండుసార్లు సేవించాలి . 


 *  తిప్పతీగ స్వరసం ( చెట్టు మొత్తాన్ని దంచి తీసిన రసం ) 14ml తీసుకుని 14 మిల్లి గ్రాముల తేనెలో ఉదయం , సాయంత్రం సేవించాలి . 


 *  ఏరణ్డ మూల చూర్ణం తేనెతో కలిపి తీసుకున్న కామెర్ల వ్యాధి నయం అగును. 


 *  కటుకరోహిణి చూర్ణం 2 నుంచి 3 గ్రాములు తేనెతో సేవించిన కామెర్ల వ్యాధి నయం అవ్వును. 


 *  త్రిఫలా చూర్ణం 3 గ్రాములు తేనెతో కలిపి తీసుకున్న కామెర్ల వ్యాధి నయం అగును.


 *  చింతాకు చిగుళ్లు 4 గ్రాములు , వేపాకు చిగుళ్లు 1 గ్రాము ముద్దగా చేసి ఉదయం పరగడుపున మ్రింగించి పాలు త్రాగిస్తే కామెర్ల వ్యాధి నయం అగును.


        కఠిన ఆహారనియమాలు పాటిస్తే తొందరంగా వ్యాధి నుంచి బయటపడగలరు. 


  ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.


   

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

            9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

కామెంట్‌లు లేవు: