ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
2, మార్చి 2026, సోమవారం
కవిత్వము చెప్పుమనగా
〽️〽️〽️〽️〽️〽️〽️〽️〽️
కృష్ణదేవరాయల వారొకమారు కవిత్వము చెప్పుమనగా పెద్దన సమాధానముగా:
*"నిరుపహతి స్థలంబు రమణీ ప్రియ దూతిక తెచ్చి యిచ్చు క*
*ప్పుర విడె, మాత్మ కింపయిన భోజనము, య్యెల మంచమొప్పు త*
*ప్పరయు రసజ్ఞులూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్*
*దొరికిన గాక, యూరక కృతుల్ రచియింపు మటన్న శక్యమే."*
అని చమత్కారముగా జవాబు చెప్పినాడు. ఈ పద్యమానాడు రాజాశ్రితులగు కవుల భోగలాలస జీవనమును చాటి చెప్పుచున్నది.
*విస్తృత భావవ్యాఖ్యానం:*
ఈ పద్యంలో పెద్దన గారు చెప్పినది ఏమిటంటే: కవిత్వ సృష్టి అనేది కేవలం ప్రతిభతోనే సంభవించదు. దానికి అనుకూల వాతావరణం, శారీరక - మానసిక సౌఖ్యం, ఆర్థిక భద్రత అవసరం. రాజాశ్రయములో ఉన్న కవులు సాధారణంగా: విలాసవంతమైన జీవితం గడుపుతూ, రుచికరమైన భోజనం, సౌకర్యవంతమైన నివాసం, సుందరీ సహవాసం వంటి భోగాలను అనుభవిస్తూ, తమ కవిత్వాన్ని ఆస్వాదించే రసజ్ఞుల సమక్షంలో రచనలు చేసేవారు. అటువంటి సౌకర్యాలు లేకుండా కవిత్వం సృష్టించడం కష్టమని పెద్దన గారు హాస్య రసంతో తెలిపారు. వెంటనే శ్రీకృష్ణదేవరాయలు వారు గ్రహించి అల్లసాని పెద్దలు గారికి ఐదు ఊళ్ళు బహుమతిగా ఇచ్చిరట
〽️〽️〽️〽️〽️〽️〽️〽️〽️〽️
స్వర్ణభస్మం ఉపయోగాలు
స్వర్ణభస్మం ఉపయోగాలు - సంపూర్ణ వివరణ .
కొన్నిరకాల వ్యాధులలో మరియు కొన్ని మొండి జబ్బులలో ఔషధాలుగా మూలికలు కు బదులుగా భస్మాలు ఉపయోగించడం జరుగుతుంది. వీటి ఫలితం కొన్ని సమయాలలో ఎలా ఉంటుంది అంటే అల్లోపతి వైద్యవిధానంలో ఇంజక్షన్ మందు పనిచేసే సమయంకంటే లోపలే ఈ భస్మ ఔషధం అత్యంత వేగంగా ఫలితాన్ని ఇవ్వగలదు .
ప్రస్తుత పరిస్థితులలో కూడా ఇంకా భస్మాలు తయారు చేసే ప్రక్రియ మరియు తయారుచేసే వ్యక్తులు ఇంకా ఉన్నారు . మూలికలు ఉపయోగించి ఔషదాలు తయారు చేసే ప్రక్రియకు పూర్తి బిన్నదిశలో ఈ భస్మ తయారి ప్రక్రియ ఉంటుంది.
మొదట మనం తయారు చేయాలి అనుకుంటున్న భస్మానికి మూల ధాతువుని సేకరించుకోవాలి . ఉదాహరణకి చెప్పాలంటే స్వర్ణభస్మ తయారి విధానం గురించి మీకు వివరిస్తాను .
. మంచి స్వర్ణపు రేకులను సేకరించుకొనవలెను . అది అత్యంత స్వచ్ఛమైనది అయి ఉండవలెను . ఆ రేకులను మొదట కాల్చి నువ్వులనూనె , పుల్లటి మజ్జిగ , ఉలవ కట్టు , ఆవుపంచితం వీనిలో 7 పర్యాయములు వేసిన శుద్ది అగును. లేదా ఎర్రటి ముండ్ల తోటకూర నూరి ఆ రసము నందు బంగారు రేకులను 2 దినములు నానబెట్టినను స్వర్ణం శుద్ది అగును.
ఆ విధంగా శుద్ది అయినటువంటి స్వర్ణపు రేకులను చిన్న కుండ యందు ఉంచి పైన ఒక మట్టిచిప్ప బోర్లించి లోపలికి వాయుప్రసారం జరగకుండా చుట్టూ చీల మన్ను ఉపయోగించి సీలు వేయవలెను . దానిని నడుము వరకు తీసినటువంటి గొయ్యి మధ్యభాగం నందు ఉంచి అన్నివైపులా సెగ తగిలేవిధంగా చుట్టూ ఆవుపిడకలని పేర్చుకుంటూ రావలెను . ఆ పిడకల సంఖ్య 500 వరకు ఉండవలెను . దీనినే ఆయుర్వేద పరిభాషలో
" గజపుటం " అంటారు .
ఈ విదంగా అన్నివైపుల సమానంగా పేర్చిన తరువాత మన ఇష్టదైవాన్ని మరియు ధన్వంతరిని ప్రార్ధించి ఒక క్రమ పద్దతిలో ఆ పిడకలని వెలిగించవలెను . ఆయొక్క పిడకల వేడికి లోపల ఉన్నటువంటి స్వర్ణపు రేకులు భస్మంగా మారతాయి. ఆ తరువాత దానిని జాగ్రత్తగా సేకరించుకుని తగిన మోతాదుల్లో ఔషదాల్లో వాడుకోవచ్చు . ఇది అత్యద్బుతంగా పనిచేయును . తరుచుగా కొన్ని ప్రత్యేక ఔషధాలలో నేను దీనిని వాడుతాను.
దీనిని ఉపయోగించుట వలన త్రిదోషములు అనగా వాత ,పిత్త ,కఫములు దోషం పొందడం వలన కలుగు వ్యాదులను పొగొట్టును. ముఖ్యంగా వాతవ్యాధులను హరించుటలో చాలా ఉపయోగపడును. లొపలికి తీసుకోవడడం వలన నేత్రవ్యాధులను హరించును . ఆయుషుని వృద్ధిపరుచును. బుద్దిని పెంచును. నేను ఇప్పటివరకు దీనిని చాలా రోగాలపై ప్రయోగించి విశేషమైన ఫలితాలు పొందాను. క్షయరోగం నివారించుటలో ఇది నాకు చాలా సహాయపడింది. అజీర్ణం వలన కలుగు జ్వరాన్ని నివారించును. ఎంతో బలమైన ఔషదాలు వాడినను తగ్గని మొండి వ్యాదులను ఈ స్వర్ణభస్మ సేవన వలన తగ్గించవచ్చు.
విషము తిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి ముందు తామ్రభస్మంతో ముందు వాంతిని చేయించి ఒక పావుతులం స్వర్ణ భస్మమును లొపలికి ఇచ్చిన విషము కంటే వేగముగా హృదయమును చేరి హృదయం నకు విషమును చేరకుండా అడ్డుకొనును . కాని పావుతులం ఒకేసారి ఒక్క మోతాదుగా ఇవ్వవలెను .
ఈ స్వర్ణభస్మముని 10 గ్రాములను 60 మోతాదులుగా లేదా 100 మోతాదుగా విభజించి వాడుకోవచ్చు . దీనిని ఎంత పెద్ద మోతాదులో వాడినను ఎటువంటి విపరీత పరిణామాలు సంభవించవు. మీకు ఎటువంటి సమస్యలు లేకున్నను ధనమును ఖర్చుపెట్టగలవారు వాడుకొనవచ్చు.
. మంచి ఆరోగ్యం , మేధాశక్తి, హృదయమునుకు బలమునిచ్చును. రక్తపోటు వ్యాధి ఉన్నవారు దీనిని వాడటం వలన మంచిఫలితాన్ని పొందవచ్చు. ఇది పూర్తిగా రసాయన ఔషదం దీనిని ఉపయోగించువారికి పెట్టుడు మందులు మరియు విషములు వారిపై పనిచేయవు. ఆపకుండా 20 సంవత్సరములు ఉపయొగించువారికి "కాయసిద్ధి " కలగచేయును . అనగా వయస్సు పెరుగుతున్నా ముసలి లక్షణములు కలగవు.
ఈ స్వర్ణభస్మానికి మరికొన్ని భస్మాలు కలిపి మధుమేహరోగులు తీసుకోవచ్చు. ఈ స్వర్ణభస్మ సేవించడం వలన మధుమేహ రోగులలో అంతర్గత అవయవాలు మధుమేహం పెరగటం వలన దెబ్బతినకుండా కాపాడవచ్చు. అదేవిధముగా స్త్రీలకు , పిల్లలకు లేహ్యాలలో కలిపి ఇవ్వడం ద్వారా వయస్సురీత్యా వచ్చు హార్మోనల్ సమస్యలకు మరియు శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందించుటకు అద్భుతముగా పనిచేయును . పిల్లలకు మంచి తెలివితేటలు కలుగును. మేధస్సు పెరుగును . శరీరదోషాలు పోగొట్టును.
మరికొన్ని ఉపయోగాలు కూడా మీకు వివరిస్తాను.
* స్వర్ణభస్మం త్రిదోష జనితవ్యాధులను పోగొట్టును . విశేషముగా వాతవ్యాధులను హరించును .
* శరీరం నందలి వాత, పిత్త , శ్లేష్మాలను సమానస్థితి యందు ఉంచును.
* వీర్యమును అభివృద్ది చేయును . బలాన్ని కలిగించును. గొప్ప రసాయనఔషధము .
* స్వర్ణసేవన వలన నేత్రరోగములు హరించి నేత్రాలకు బలము కలుగును.
* ఆయుష్షుని పెంచడంలో దీనికిదే సాటి . ఆయువుని వృద్ధిచేయు ఔషధములు లోకము నందు బహు అరుదుగా ఉన్నవి. ఆ ఔషధములలో స్వర్ణభస్మం ప్రధానమైనది.
* ఇది అత్యంత శ్రేష్టమైనది బుద్ధిబలాన్ని , జ్ఞాపకశక్తిని , ఆలోచనాశక్తిని అనగా బుద్ది , స్మృతి , మతిని కలిగించును.
* ఉన్మాదం వంటి మానసిక రోగములను పోగొట్టును .
* రక్తాన్ని శుభ్రపరచును. శరీరకాంతి కలిగించును.
* పాపము వలన సంక్రమించు రోగములను పోగొట్టు శక్తి కలిగినది .
* క్షయరోగమును పోగొట్టటంలో శక్తివంతముగా పనిచేయును .
* వ్యాధివలన కాని లేక మరేదైనా కారణం వలన శరీరం చిక్కిపోయినవారికి శరీరాన్ని బాగుచేసి కండపుష్ఠి కలిగించును.
* రక్తము నందలి , ఉపిరితిత్తుల యందలి క్రిములను నాశనం చేయును .
* జ్వరములను హరించును .
* ఇతర ఔషధముల వలన తగ్గని మొండివ్యాధులు ఈ స్వర్ణభస్మ సేవన వలన తగ్గును .
* పంచకర్మలు చేసినప్పుడు ఇది ఉపయొగించవలెను .
* స్వర్ణభస్మ సేవన చేయువానికి పెట్టుడు మందులు , విషాలు ఎక్కవు.
* ఇది ఎంత పెద్ద మోతాదు వాడినను ప్రమాదము లేదు . వ్యాది బలాన్ని అనుసరించి 1 తులము 60 మోతాదుల నుండి 100 మోతాదులుగా వాడుకోవచ్చు .
.* శరీరం నందలి కండరాలు , ఎముకలు , నరాలకు అత్యంత శక్తికి ప్రసాదించును.
* రక్తపోటు ( BP ) సమస్య నివారించును .
* ఇది ఆపకుండా వాడిన ముసలితనమును దగ్గరకు రానివ్వదు. సమస్త వాతరోగములను హరించును .
పైన చెప్పిన యోగాలు మాత్రమే కాకుండా మరికొన్ని ఔషధాలలో స్వర్ణాన్ని కలపడం ద్వారా ఔషధ బలం పెరిగి ఫలితం త్వరగా రావటం నేను గమనించాను. స్త్రీలకు , పిల్లలకు దీనికి మూలికాలేహ్యములలో కలిపి ఇవ్వవచ్చు. ముఖ్యముగా స్త్రీలలో గర్భశయ దోషాలు , నెలసరి సమస్యల నివారణ జరిగింది. ముత్యభస్మమునకు దీనికి కలిపి ఇవ్వడం వలన స్త్రీలలో శరీరబలం పెరిగి స్త్రీలు ఎదుర్కొనే క్యాల్షియం సమస్య నివారణ అగును. శరీరకాంతి పెరుగును . ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో శిశువుకు చేయు స్వర్ణప్రాసన గురించి చాలా చక్కగా వివరించారు . పుష్యార్కయోగం అనగా గురువారం పుష్యమి నక్షత్రం లేదా ఆదివారం పుష్యమి నక్షత్ర సమయాన శిశువునకు స్వర్ణప్రాసన చేయించవలెను .
స్వర్ణప్రాసన అనగా ప్రస్తుతం చేతికి ఉన్న ఉంగరం తీసి శిశువు నాలికమీద రాస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు. ఒక గుండుపిన్ను లేదా ఏదైనా సన్నటి వస్తువు తీసుకుని తేనె తగిలించి ఆ తరువాత ఆవునెయ్యి తగిలించి తరువాత స్వర్ణభస్మానికి తగిలించి అప్పుడు శిశువు నాలిక మీద అంటించి లొపలికి ఇవ్వవలెను. కొన్ని ఆయుర్వేద గ్రంథాలలో తల్లి కడుపు నుంచి శిశువు బయటకి వచ్చిన తరువాత శుభ్రపరచి తేనెతో పాటు స్వర్ణభస్మాన్ని నాలికపైన రాయవలెను అని ఉన్నది. ఈ స్వర్ణభస్మం నిత్యం పిల్లలకు వాడించుచున్న బ్రహుస్పతితో సమానమైన తెలివితేటలు కలవారు , ఏకసంధాగ్రాహుకులుగా తయారగును .
ప్రస్తుత పరిస్థితుల్లో రోగనిరోధక శక్తి క్షీణించి వైరస్ లకు సంబంధించిన అనేక మహమ్మరులు ప్రభలుతున్న ఈ సమయాలలో రోగనిరోధకశక్తి పెరగడానికి స్వర్ణభస్మ సేవన చేయుట అత్యంత ప్రధానం. ఈ స్వర్ణభస్మం కొంచం ఖరీదు ఎక్కువుగా ఉండును. అవకాశం ఉన్నవారు , ధనమును వెచ్చించ గలిగినవారు తప్పక స్వర్ణభస్మ సేవన చేయదగిన సూచన . అనుభవ వైద్యుల సలహా ప్రకారం మాత్రమే వాడగలరు .
గమనిక -
ఈ స్వర్ణభస్మాన్ని సరైన ఆయుర్వేద వైద్యుల చేత చేయించుకోండి. ఖరీదు ఎక్కువగా ఉండును.
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
శివ స్తుతి🙏 శుక్రవారం*_ 🌹 *🪷27ఫిబ్రవరి2026🪷* *దృగ్గణిత పంచాంగం*
🌸శివ స్తుతి🙏
సీ . శంకరా !సర్వేశ! సారంగ సర్గుడా !
విశ్వనాథా! వినువిన్నపాలు
పాలనేత్రా! హర!పశుపతి ! పరమేశ !
పాలింప రావయ్య పరమ పురుష!
పురహరుడా! శివ! మదనారి !నటరాజ !
నాగాభరణ! రుద్ర! నన్ను కావు !
గంగాధరా! రావ!గౌరిపతి! గిరీశ!
గోపతి !ఖట్వాంగి! కూర్మితోడ
తే,,, కోర్కెలను తీర్చ గౌరి తో కూడిరమ్ము!
శశిధరా!భవహర!శివ! సత్యపాల!
జడల శిఖదేవ! విశ్వేశ! జంగమయ్య!
మమ్ముకావగరావయ్య !మమత తోడ
సాహితీ శ్రీ జయలక్ష్మి
సరస్వతీదేవి స్తోత్రం
సరస్వతీదేవి స్తోత్రం
🙏🙏🌸🌸🌸🌸🙏🙏
యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యావీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనా/
యాబ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి: దేవై: సదా వందితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాఢ్యాపహా ||
భావము:-
మల్లెపువ్వు వలె, చంద్రుని వలె, మంచు వలె, ముత్యము వలె తెల్లగా, స్వఛముగా ఉండి, తెల్లని చీర ధరించి, చేతిలో వీణతో, తెల్లని పద్మమునందు ఉండు ఓ సరస్వతి దేవీ! బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సహా అందరు దేవతలచే ఎల్లప్పుడు పూజింపబడు ఓ భగవతీ!! నాలోని అజ్ఞానమును పోగొట్టి నన్ను ఎల్లప్పుడూ రక్షించుము.
ఈ శ్లోకములో సరస్వతి దేవి ధరించినవన్నీ తెలుపులో ఉన్నాయి. తెలుపు సాత్విక గుణము. జ్ఞానము. తెల్లపువ్వు వలె, చంద్రునివలె,(తుషార)మంచు వలె, హారధవళ - ముత్యాలహారము. తెల్లని వస్త్రములు ధరించినది. తెల్లని పద్మములో ఆసీనురాలయినది, వీణ ధరించినది. సరస్వతి బొమ్మను పిల్లలకు చూపాలి.
సరస్వతి అనగా = చదువుల తల్లి.
సర+స్వ+తి= జ్ఞానము+మనలోని+ఇచ్చునది.
మనలో ఉన్న ఆ జ్ఞాపకశక్తిని అభివృద్ధి చేస్తుంది.
సరస్వతి ధరించే వీణ పేరు - కఛ్ఛపి
చేతిలో జపమాల - ఆధ్యాత్మికతను అభివృద్ధి చేయును
మరొక చేతిలో వేదములు - అనగా జ్ఞానమును ఇచ్చును
వీణ - సంగీత సాహిత్యము నాదము
సరస్వతికి ఇంకా పేర్లు ఉన్నాయి: వాక్కుకు అధిపతి, వాగ్దేవి, బ్రాహ్మారీ, శారదా, వాణి, విద్యావతి.
సరస్వతిని ప్రార్థిస్తే మనకు విద్యా, బుద్ధిని, జ్ఞానమును (జ్ఞాపక శక్తిని), ప్రజ్ఞను ఇచ్చును.
🙏🙏
సోమవారం*🕉️ *🌹02 మార్చి,2026🌹*
*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🕉️ *సోమవారం*🕉️
*🌹02 మార్చి,2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ విశ్వావసు*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*
*ఫాల్గుణమాసం - శుక్ల పక్షం*
*తిథి : చతుర్దశి* సా 05.55 వరకు ఉపరి *పౌర్ణమి*
*వారం : సోమవారం* ( ఇందువాసరే )
*నక్షత్రం : ఆశ్లేష* ఉ 07.51 వరకు ఉపరి *మఘ*
*యోగం : అతిగండ* మ 12.29 వరకు ఉపరి *సుకర్మ*
*కరణం : గరజి* ఉ 06.29 *వణజి* సా 05.55 ఉపరి
*భద్ర* రా.తె 05.28 వరకు ఆపైన *బవ*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 06.00 - 7.00 & 11.00 - 12.00*
అమృత కాలం : *ఉ 06.18 - 07.51*
అభిజిత్ కాలం : *ప 11.56 - 12.43*
*వర్జ్యం : రా 07.41 - 09.16*
*దుర్ముహూర్తం : మ 12.43 - 01.31 & 03.05 - 03.53*
*రాహు కాలం : ఉ 07.53 - 09.22*
గుళికకాళం : *మ 01.48 - 03.17*
యమగండం : *ఉ 10.51 - 12.20*
సూర్యరాశి : *కుంభం*
చంద్రరాశి : *కర్కాటకం/సింహం*
సూర్యోదయం :*ఉ 06.34*
సూర్యాస్తమయం :*సా 06.22*
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు* *వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 06.25 - 08.47*
సంగవ కాలం : *08.47 - 11.09*
మధ్యాహ్న కాలం : *11.09 - 01.31*
అపరాహ్న కాలం : *మ 01.31 - 03.53*
*ఆబ్ధికం తిధి : ఫాల్గుణ శుద్ధ చతుర్దశి*
సాయంకాలం : *సా 03.53 - 06.15*
ప్రదోష కాలం : *సా 06.15 - 08.40*
రాత్రి కాలం :*రా 08.40 - 11.55*
నిశీధి కాలం :*రా 11.55 - 12.44*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.47 - 05.35*
<><><><><><><><><><><><><><><>
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🕉️ *ఓం నమః శివాయ*🕉️
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌷🕉️🕉️🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🕉️🕉️🌹🌷
🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹
*శ్రీ మహావిష్ణు పురాణం* *12వ భాగం*
🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹
*ఆదివారం 1 మార్చి 2026*
*శ్రీ మహావిష్ణు పురాణం*
*12వ భాగం*
*భూమండలం - సప్త ద్వీపాలు:*```
బ్రహ్మదేవుడు భూమండలాన్ని సప్త ద్వీపాలుగా విభజించి,జంబూ ద్వీపం, ప్లక్ష ద్వీపం, శాల్మలీ ద్వీపం, కుశ ద్వీపం, క్రౌంచ ద్వీపం, శాక ద్వీపం, పుష్కర ద్వీపం అని పేర్లు పెట్టాడు.
#జంబూద్వీపం తొమ్మిదివర్షములు (దేశాలు)గా విస్తరించి ఉంది. తొమ్మిది వర్షములలో భరత వర్షము ఒక్కటే కర్మ క్షేత్రం. భగవంతునికే కాదు, దేవతలందరికి ప్రియమైనది. ఇక్కడ మానవులుగా జన్మించి పుణ్య కర్మలు, తపస్సులు చేసి జన్మరాహిత్యమైన మోక్షము పొందాలి అని దేవతలు కూడా కోరుకుంటారు. కర్మక్షేత్రం, ధర్మ క్షేత్రం అయిన ఈ భూమిలో మహావిష్ణువు అనేక అవతా రాలు ఎత్తి ధర్మపరిరక్షణ చేశాడు.
జంబూద్వీపానికి నాభి కేంద్రంగా లక్ష యోజనాల మేరు పర్వతము ఉంది. భరతవర్షానికి ఉత్తరాన నిషధ హోమకూట హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఇవి సరిహద్దులుగా హరివర్ష, కింపురుష వర్షములు ఉన్నాయి. భరతవర్షానికి పశ్చిమాన మాల్యవంత పర్వతము, తూర్పున గంధమాదన పర్వతాలు ఉన్నాయి. వీటికి సరిహద్దులుగా నీల, నిషధ పర్వతాలు ఉన్నాయి. దేవజాతుల వారు ఇక్కడ నివసిస్తారు.
వీటి సరిహద్దులుగా ఉన్న కేతుమాల, భద్రాశ్వ వర్షాలలో ఆయా దేశ జాతుల వారు నివసిస్తారు. మంధర, మేరు మంధర, సుపార్స్మక, కుముద పర్వతాలు మేరు పర్వత పాదగిరులుగా ఉన్నాయి. ఈ పర్వతాలపై క్షీర సరస్సు, మధు సరస్సు, ఇక్షు సరస్సు, శుద్ధోదక సరస్సులున్నాయి. దేవతలు ఈ సరస్సుల నీటిని స్పర్శించి ఐశ్వర్య యోగ సిద్దులను పొందుతారు.
నాలుగు పర్వతాల పై నందన, చైత్రరథక, వైభ్రాజక, సర్వభద్రక అనే నాలుగు ఉద్యానవనాలు ఉన్నాయి. ఈ నాలుగు వనాలలో గీత వాయిద్య నర్తకీమణులైన అప్సరసలు నివసిస్తారు. దేవతాగణాలు ఈ నాలుగు వర్షాలలో విహరిస్తూ సుఖ భోగాలు పొందుతారు.
మేరు పర్వత శిఖరం పై పెద్ద నేరేడు (జంబు) వృక్షము ఉంది. జంబూద్వీపము అనే పేరు ఈ వృక్షము వలనలే వచ్చింది. ఈ జంబూవృక్షానికి ఏనుగు తలంత నేరేడు ఫలాలు కాస్తుంటాయి. జంబూ ఫలాలు పగిలి వాటి రసం ప్రవహించి జంబూనది ఏర్పడింది. జంబూనది తీరంలో శక్తి స్వరూపిణి "జంబాద్విని" గా వెలిసింది. తొలి సృష్టి మానవులు జంబూఫలాలను ఆహారంగా సేవించేవారు. దేవతల హస్త స్పర్శ తగిలి ఎండిపోయిన జంబూరసము బంగారంగా మారుతుంది. ఈ బంగారాన్ని జంబూరసంగా పిలుస్తారు.
జంబూద్వీపములో భరతవ వర్షము ఒక్కటే మానవులు నివసించే భూమిగా ఉంది. మిగిలిన ఎనిమిది వర్షాలు "దేవభూములు" గా ప్రసిద్ది చెందాయి. ఇక్కడ దేవతా జాతుల వారు నివసిస్తారు.
#రెండవ ద్వీపం ప్లక్ష ద్వీపము. జంబుద్వీపమంత పరిమాణమే కలిగి ఉంటుంది. ఇక్షు సముద్రం ప్లక్షద్వీపం చుట్టూ ఉంటుంది. ఇక్కడ అరుణ, నృమ్ణ,అంగీరస,సావిత్రి, సుప్రభాతిక, ఋతంభర, సత్యంభర అనే సప్త నదులు ఉన్నాయి. మణికూట, ఇంద్రసేన,జ్యోతిష్మతి,సువర్ణ, హరిణ్యష్టీవ, మేఘమాల అనే ఏడు పర్వతాలు ఉంటాయి. ఇక్కడ హంస, పతంగ, ఊర్థ్వాయన, సత్యాంగ అనే నాలుగు సంజ్ఞలు గల నాలుగు వర్ణాల వారు నిసిస్తుంటారు. ప్రజలు వేయి సంవత్సరాలు ఆయుర్దాయం కలిగి ఉంటారు. సూర్యోపాసన చేస్తుంటారు.
#మూడవ ద్వీపం శాల్మల ద్వీపం. పరిమాణంలో ప్లక్ష ద్వీపానికి రెట్టింపు ఉంటుంది. ఈ ద్వీపాన్ని సురా సముద్రం చుట్టుముట్టి ఉంటుంది. ద్వీపం మధ్యలో శాల్మలీ వృక్షము ఉండటం వలన ద్వీపానికి ఈ పేరు వచ్చింది. గరుత్మంతుడు ఈ వృక్షము పై నివసిస్తుంటాడు. ఇక్కడ ఏడు పర్వతాలు, ఏడు నదులు ఉన్నాయి. శ్రుతధర, వీర్యధర, వసుంధర, ఇషుంధర అనే నాలుగు వర్ణాల వారు నివసిస్తుంటారు. వేదమయుడైన సోమేశ్వరుని పూజిస్తారు.
#నాలుగవ ద్వీపం కుశ ద్వీపం. ఈ ద్వీపాన్ని పరివేష్టించి ఘృత సముద్రం ఉంటుంది. ద్వీపం లోని కుశస్థంభం స్వయం ప్రకాశమై వెలుగుతూ నాలుగు వైపుల వెలుగులు ప్రసరిస్తూ ఉంటుంది. ఈ ద్వీపంలో కూడా ఏడుపర్వతాలు, ఏడు నదులు ఉన్నాయి. కుశల, కోవిధ, అభియుక్త, కులక అనే నాలుగు వర్ణాల ప్రజలు నివసిస్తూ, అగ్నిదేవుని పూజిస్తూ యజ్ఞయాగాదులు చేస్తుంటారు.
#ఐదవ ద్వీపం క్రౌంచ ద్వీపము. కుశద్వీపానికి పరిమాణంలో రెండు రెట్లు ఉంటుంది. క్షీర సముద్రం ఈ ద్వీపాన్ని పరివేష్టించి ఉంటుంది. ఇక్కడ గల క్రౌంచ పర్వతాన్ని కుమారస్వామి తన శక్తి ఆయుధంతో ఛేదించి ఏడు భాగాలు చేశాడు. ఏడు నదులు, ఏడు పర్వతాలు ఈ ద్వీపంలో ఉన్నాయి. పురుష, ఋషభ, ద్రవిణ, దేవిక అనే నాలుగు వర్ణాల వారు ఈ ద్వీపంలో నిసిస్తుంటారు. అగ్నిని ఉపాసిస్తూ యజ్ఞాలు చేస్తారు.
#ఆరవది శాకద్వీపం. ఈ ద్వీపం మధ్యలో పెద్దదైన శాక వృక్షము ఉండటం వలన ద్వీపానికి శాకద్వీపము అని పేరు వచ్చింది. ఇక్కడ కూడ ఏడు పర్వతాలు, ఏడు నదులు ఉన్నాయి. సత్యవ్రత, క్రతువ్రత, దానవ్రత, అనువ్రత అనే చాతుర్వర్ణాల ప్రజలు నిసిస్తుంటారు. ఇక్కడ పరమేశ్వరుని పూజిస్తారు.
#ఏడవది పుష్కర ద్వీపం. లక్ష బంగారు రేకులు కలిగిన పద్మము అనగా పుష్కరము ఉండటం వలన ద్వీపానికి ఈ పేరు వచ్చింది. ఈ పుష్కరమే బ్రహ్మదేవుని ఆసనం అంటారు. మహర్షులు "మానసోత్తరం" అని ఈ ద్వీపాన్ని కీర్తించడం వలన మానసోత్తర ద్వీపం అనే పేరు కూడా ఉంది. అవధిగిరి అనే పర్వతం ఈ ద్వీపాన్ని రమణ-ఘాతకి అనే రెండు భాగాలుగా విభజించి సరిహద్దుగా ఉంది. లక్ష యోజనాల ఎత్తు గల ఈ పర్వత శిఖరం పై ఇంద్రాది దిక్పాలకులు ఉండే నాలుగు నగరాలు ఉన్నాయి.
మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తూ లోకసంచారం చేసే సూర్యుడు ఈ అవధిగిరి పర్వతము నుంచే ఉదయిస్తాడు. మానవుల ఒక్క సంవత్సర కాలం ఇక్కడి వారికి ఒక రోజు అవుతుంది. ఈ ద్వీప ప్రజలు పరబ్రహ్మను ఉపాసన చేస్తారు.
*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం.*
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
క్షణిక వైరాగ్యాలు:
*"క్షణిక వైరాగ్యాలు:"*
వీటి వల్ల మనిషికి మోక్షం రాదు, ఎందుకంటే....
ఇవి భయం వల్లనో లేదా కష్టం వల్లనో పుడతాయి.
పరిస్థితి చక్కబడగానే ఇవి మాయమైపోతాయి.
నిజమైన వైరాగ్యం అంటే... లోకంలోని వస్తువులన్నీ అశాశ్వతమని జ్ఞానంతో తెలుసుకుని, ఏ కష్టం లేకపోయినా, అన్ని సుఖాలు ఉన్నా కూడా వాటిని అంటిపెట్టుకోకుండా ఉండటం.
భారతీయ తత్వశాస్త్రం మరియు వేదాంతం ప్రకారం వైరాగ్యాన్ని ప్రధానంగా నాలుగు రకాలుగా
విభజించారు.
*"యతమాన వైరాగ్యం"*
మనస్సులో ఉన్న రాగద్వేషాలను (ఇష్టాయిష్టాలను) గుర్తించి, వాటిని తొలగించడానికి ప్రయత్నించే ప్రాథమిక దశ ఇది. ఇంద్రియాలను నియంత్రించే మొదటి మెట్టు.
*"వ్యతిరేక వైరాగ్యం"*
కొన్ని విషయాల పట్ల మక్కువ తగ్గినప్పటికీ, మరికొన్నింటిపై ఇంకా ఆశ ఉండటం. అంటే, ఏయే ఇంద్రియాలు ఇంకా లోబడలేదో గుర్తించి, వాటిని క్రమంగా దూరం చేసుకోవడం.
*"ఏకేంద్రియ వైరాగ్యం"*
ఇక్కడ బాహ్య ఇంద్రియాలు (కళ్లు, చెవులు మొదలైనవి) అదుపులోకి వస్తాయి. కానీ, మనస్సులో మాత్రం ఇంకా సూక్ష్మ రూపంలో కోరికలు లేదా వాసనలు మిగిలి ఉంటాయి. కేవలం 'మనస్సు' అనే ఒక్క ఇంద్రియం దగ్గరే పోరాటం జరుగుతుంది.
*"వశీకార వైరాగ్యం"*
ఇది అత్యున్నతమైన స్థితి. ఈ ప్రపంచంలోని ఏ వస్తువు పట్ల గానీ, స్వర్గాది లోకాల పట్ల గానీ ఎటువంటి ఆశ లేకపోవడం. మనస్సు పూర్తిగా తన వశంలో ఉండటమే వశీకార వైరాగ్యం.
సందర్భాన్ని బట్టి వైరాగ్యంలో మరో మూడు రకాలు.
సాధారణ వాడుకలో....
*"శ్మశాన వైరాగ్యం:"*
ఎవరైనా మరణించినప్పుడు శ్మశానంలో కలిగే తాత్కాలిక వైరాగ్యం. బయటకు రాగానే మళ్ళీ పాత అలవాట్లే మొదలవుతాయి.
*"ప్రసూతి వైరాగ్యం:"*
ప్రసవ వేదన అనుభవించే సమయంలో స్త్రీలకు కలిగే తాత్కాలిక వైరాగ్యం.
*"పురాణ వైరాగ్యం:"*
మంచి ప్రవచనాలు లేదా పురాణాలు వింటున్నప్పుడు కలిగే తాత్కాలిక మార్పు.
శ్రీ విద్యారణ్య స్వామి తన *"జీవన్ముక్తి వివేకము"* లో వైరాగ్యము కూడా తీవ్రతను బట్టి మూడు ముఖ్యమైన విభజనలు చేశారు.
సోమవారం రాశి ఫలితాలు
శ్రీ గురుభ్యోనమః 🙏
02-03-2026 సోమవారం రాశి ఫలితాలు
మేషం
ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. దీర్ఘ కాలిక అనారోగ్యాల నుండి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.
---------------------------------------
వృషభం
మిత్రులతో విహారయాత్రలలో పాల్గొంటారు. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. సన్నిహితులతో కుటుంబమున ఉత్సహంగా గడుపుతారు. చేపట్టిన పనులలో కార్యజయం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
---------------------------------------
మిధునం
బంధు మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. ఋణ సమస్యలు అధికమై మానసిక ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఋణయత్నాలు చేస్తారు. ప్రయాణాలు ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
---------------------------------------
కర్కాటకం
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది.
---------------------------------------
సింహం
చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. వృత్తి, వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. ఉద్యోగమున కొన్ని వ్యవహారాలలో చిక్కులు అధిగమిస్తారు.
---------------------------------------
కన్య
కొన్ని పనులలో సమస్యలు తొలగి ఊరట కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. ఆప్తుల వలన కొన్ని విషయాలు తెలుసుకుంటారు. ఆధ్యాత్మిక, సేవ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి.
---------------------------------------
తుల
ధన, వస్తు,వాహన లాభాలు ఉన్నవి. కొన్ని వివాదాల నుండి తెలివితేటలతో బయట పడగలుగుతారు. సంఘంలో పెద్దల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి.
---------------------------------------
వృశ్చికం
చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు ఏర్పడతాయి. వృత్తి,ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహంగా ఉంటాయి.
---------------------------------------
ధనస్సు
దూరప్రయాణంలో వాహన ఇబ్బందులు ఉంటాయి. ఇంటాబయటా ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఋణ ప్రయత్నాలు అనుకూలించవు. వృత్తి, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. ఆరోగ్య విషయమై వైద్య సహాయం అవసరం అవుతుంది.
---------------------------------------
మకరం
వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. స్థిరాస్తి లాభం కలుగుతుంది. దైవారాధన వలన శుభ ఫలితాలు కలుగుతాయి. వృత్తి,వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
---------------------------------------
కుంభం
ముఖ్యమైన పనులలో కావాల్సిన వారి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆత్మీయులు నుండి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. వ్యాపార,ఉద్యోగాలలో మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి.
---------------------------------------
మీనం
ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపార,ఉద్యోగాలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఆకస్మిక ధన వ్యయ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండవు. పనులు మందకొడిగా సాగుతాయి.
---------------------------------------
పంచాంగం 02.03.2026 Monday
ఈ రోజు పంచాంగం 02.03.2026 Monday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాస శుక్ల పక్ష చతుర్దశి తిథి ఇందు వాసర ఆశ్రేష నక్షత్రం అతిగండ యోగః వణిజ తదుపరి భద్ర కరణం.
రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.
యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.
శ్రాద్ధ తిథి: చతుర్దశి
నమస్కారః , శుభోదయం
ఆర్యా శతకం - 1*
*శ్రీ మూకశంకర విరచిత*
*మూక పంచశతి*
*ఆర్యా శతకం - 1*
*శ్లోకము - 45*
*జంతోస్తవ పదపూజన సంతోషతరంగితస్య కామాక్షి బంధో|*
*యది భవతి పునః సింధోరంభస్సుబంభ్రమీతి శిలా॥*
*భావము :*
*జగన్మాతా! ఏ భక్తుడైతే నిరంతరము నీ పాదపూజలో నిమగ్నమై ఉంటాడో, వానిని ఈ సంసారము బాధించగలదా. నీ పాదముల ధ్యానమే సాధకుని సంసార బాధల నుండి విముక్తుని చేసి నీటిపై రాతి బండలను తేలేలా చేస్తుంది.*
🙏🙏🙏 *శ్రీమాత్రే*శ్రీ మూకశంకర విరచిత*
*మూక పంచశతి*
*ఆర్యా శతకం - 1*
*శ్లోకము - 45*
*జంతోస్తవ పదపూజన సంతోషతరంగితస్య కామాక్షి బంధో|*
*యది భవతి పునః సింధోరంభస్సుబంభ్రమీతి శిలా॥*
*భావము :*
*జగన్మాతా! ఏ భక్తుడైతే నిరంతరము నీ పాదపూజలో నిమగ్నమై ఉంటాడో, వానిని ఈ సంసారము బాధించగలదా. నీ పాదముల ధ్యానమే సాధకుని సంసార బాధల నుండి విముక్తుని చేసి నీటిపై రాతి బండలను తేలేలా చేస్తుంది.*
🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏 నమః* 🙏🙏🙏
భగవద్గీత-
-------------------- భగవద్గీత. -------------------
తృతీయోధ్యాయ: కర్మ యోగము.
దేవాన్భావయతానేన తే దేవా భావయంతు వః ।
పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ ।। 11 ।।
ప్రతిపదార్థ:
దేవాన్ — దేవతలు; భావయతా — ప్రీతి చెందుతారు; అనేన — వీటి ద్వారా (యజ్ఞములు); తే — వారు; దేవాః — దేవతలు; భావయంతు — సంతోషిస్తారు; వః — మీరు; పరస్పరం — ఒకరినొకరు; భావయంతః — తృప్తి పరుచుకొంటూ; శ్రేయః — శ్రేయస్సు; పరం — గొప్ప/పరమ; అవాప్స్యథ — పొందెదరు.
తాత్పర్యము :
మీ యజ్ఞముల చేత దేవతలు ప్రీతి చెందుతారు. దేవతల, మనుష్యుల పరస్పర సహకారం వలన అందరికీ గొప్ప శేయస్సు/సౌభాగ్యం కలుగుతుంది.
వివరణ:
ఈ విశ్వం యొక్క నిర్వహణకు దేవతలు అధికారులు. భగవంతుడు ఈ విశ్వాన్ని నిర్వహించే తన పనిని వారి ద్వారా చేస్తాడు. ఈ దేవతలు భౌతిక బ్రహ్మాండం యొక్క పరిధిలోనే వసిస్తారు, అవే స్వర్గాది ఉన్నత లోకాలు. దేవతలు అంటే భగవంతుడు కారు; వారూ మనవంటి ఆత్మలే. ప్రపంచ వ్యవహారాలు నడిపించటానికి నిర్దిష్ఠమైన పదవులలో ఉంటారు. ఒక దేశం యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని ఉదాహరణగా తీసుకోండి. అందులో ఆర్థిక మంత్రి, రక్షణ మంత్రి, హొమ్ మంత్రి వంటి వారు ఉంటారు. ఇవన్నీ పదవులు అన్నమాట, మరియు పరిమిత కాలం వరకు, కొంత మంది ఎంపిక చేయబడిన వారు, ఈ పదవులను నిర్వహించటం జరుగుతుంది. పదవీ కాలం ముగిసిన తరువాత, ప్రభుత్వం మారుతుంది మరియు ఆయా పదవులలో ఉన్న వారు కూడా మారతారు. ఇదే విధంగా, ఈ ప్రపంచ వ్యవహారాలు అజమాయిషీ చేయటానికి అగ్ని దేవుడు, వాయు దేవుడు, వరుణ దేవుడు, ఇంద్రుడు, వంటి పదవులు ఉన్నాయి. గత జన్మలలో చేసిన పుణ్య కార్యముల ఫలముగా ఎంపిక చేయబడిన జీవాత్మలు ఈ పదవులలో ఉండి, విశ్వం యొక్క వ్యవహారాలు నడిపిస్తాయి. వీరే దేవతలు.
దేవతలను సంతృప్తి పరచటానికి, వేదాలు ఎన్నో రకాల కర్మకాండలను, ప్రక్రియలను చెప్పాయి. ప్రతిఫలంగా దేవతలు భౌతిక అభ్యుదయం కలిగిస్తారు. మనం చెట్టు వేరు దగ్గర నీరు పోస్తే ఆ నీరు పూవులకు, ఫలములకు, ఆకులకు, కొమ్మలకు, చిగురులకు తప్పకుండా ఎలా చేరుతుందో, అదే విధంగా మనం చేసే యజ్ఞం ఆ భగవంతుని ప్రీతి కోసం చేసినప్పుడు, అప్రయత్నపూర్వకంగానే దేవతలు కూడా సంతోషిస్తారు. స్కంద పురాణం ఇలా పేర్కొంటున్నది:
అర్చితే దేవ దేవేశే శంఖ చక్ర గదాధరే
అర్చితాః సర్వే దేవాః స్యుర్ యతః సర్వ గతో హరిః
‘దేవదేవుడు శ్రీ మహా విష్ణువుని పూజించినప్పుడు, మనం అప్రయత్నపూర్వకంగానే అందరు దేవతలను పూజించినట్టే, ఎందుకంటే, వారంతా తమ శక్తిని ఆయన నుండే పొందుతారు.’ ఈ ప్రకారంగా, యజ్ఞాన్ని చేయటం సహజంగానే దేవతలకు ప్రీతి కలిగిస్తుంది. అలా ప్రీతి నొందిన దేవతలు, భౌతిక ప్రకృతి మూల-భూతములను జీవులకు అనుకూలంగా మార్చటం ద్వారా తిరిగి వారికి సంపత్తి/సౌభాగ్యాన్ని కలిగిస్తారు.
క్షణిక వైరాగ్యాలు:
*"క్షణిక వైరాగ్యాలు:"*
వీటి వల్ల మనిషికి మోక్షం రాదు, ఎందుకంటే....
ఇవి భయం వల్లనో లేదా కష్టం వల్లనో పుడతాయి.
పరిస్థితి చక్కబడగానే ఇవి మాయమైపోతాయి.
నిజమైన వైరాగ్యం అంటే... లోకంలోని వస్తువులన్నీ అశాశ్వతమని జ్ఞానంతో తెలుసుకుని, ఏ కష్టం లేకపోయినా, అన్ని సుఖాలు ఉన్నా కూడా వాటిని అంటిపెట్టుకోకుండా ఉండటం.
భారతీయ తత్వశాస్త్రం మరియు వేదాంతం ప్రకారం వైరాగ్యాన్ని ప్రధానంగా నాలుగు రకాలుగా
విభజించారు.
*"యతమాన వైరాగ్యం"*
మనస్సులో ఉన్న రాగద్వేషాలను (ఇష్టాయిష్టాలను) గుర్తించి, వాటిని తొలగించడానికి ప్రయత్నించే ప్రాథమిక దశ ఇది. ఇంద్రియాలను నియంత్రించే మొదటి మెట్టు.
*"వ్యతిరేక వైరాగ్యం"*
కొన్ని విషయాల పట్ల మక్కువ తగ్గినప్పటికీ, మరికొన్నింటిపై ఇంకా ఆశ ఉండటం. అంటే, ఏయే ఇంద్రియాలు ఇంకా లోబడలేదో గుర్తించి, వాటిని క్రమంగా దూరం చేసుకోవడం.
*"ఏకేంద్రియ వైరాగ్యం"*
ఇక్కడ బాహ్య ఇంద్రియాలు (కళ్లు, చెవులు మొదలైనవి) అదుపులోకి వస్తాయి. కానీ, మనస్సులో మాత్రం ఇంకా సూక్ష్మ రూపంలో కోరికలు లేదా వాసనలు మిగిలి ఉంటాయి. కేవలం 'మనస్సు' అనే ఒక్క ఇంద్రియం దగ్గరే పోరాటం జరుగుతుంది.
*"వశీకార వైరాగ్యం"*
ఇది అత్యున్నతమైన స్థితి. ఈ ప్రపంచంలోని ఏ వస్తువు పట్ల గానీ, స్వర్గాది లోకాల పట్ల గానీ ఎటువంటి ఆశ లేకపోవడం. మనస్సు పూర్తిగా తన వశంలో ఉండటమే వశీకార వైరాగ్యం.
సందర్భాన్ని బట్టి వైరాగ్యంలో మరో మూడు రకాలు.
సాధారణ వాడుకలో....
*"శ్మశాన వైరాగ్యం:"*
ఎవరైనా మరణించినప్పుడు శ్మశానంలో కలిగే తాత్కాలిక వైరాగ్యం. బయటకు రాగానే మళ్ళీ పాత అలవాట్లే మొదలవుతాయి.
*"ప్రసూతి వైరాగ్యం:"*
ప్రసవ వేదన అనుభవించే సమయంలో స్త్రీలకు కలిగే తాత్కాలిక వైరాగ్యం.
*"పురాణ వైరాగ్యం:"*
మంచి ప్రవచనాలు లేదా పురాణాలు వింటున్నప్పుడు కలిగే తాత్కాలిక మార్పు.
శ్రీ విద్యారణ్య స్వామి తన *"జీవన్ముక్తి వివేకము"* లో వైరాగ్యము కూడా తీవ్రతను బట్టి మూడు ముఖ్యమైన విభజనలు చేశారు.
చంద్ర గ్రహణం
చంద్ర గ్రహణం
ఈ సం|| ఫాల్గున శుక్ల పూర్ణిమా మంగళవారమ
03–03–2026 నాడు సింహరాశిలో పూర్వఫల్గునీ నక్షత్రమున కేతుగ్రస్త చంద్రగ్రహణం సంభవించును.
స్పర్శ కాలం
పగలు
Χο
03:20
సూర్యాస్తమయం (హైదరాబాద్)
సాయం
Χο
06:20
మోక్ష కాలం
రాత్రి
06:47
మొత్తం పుణ్యకాలం
໕໐ 00:27
(గ్రహణ ఆరంభము ప గం. 03:20 అయినను పుణ్యకాలము మాత్రం సూర్యాస్తమయము నుండి ప్రారంభమగును.)
-: నిత్య భోజన ప్రత్యాబ్దికాది నిర్ణయము :-
గ్రస్తోదయే విధోః పూర్వం నాహర్భోజన మాచరేత్ | గ్రస్తోదయే భవేదిన్దోః దివా శ్రాద్ధం న కారయేత్ | రాత్రావపి తదా కుర్యాత్ ప్రత్యబ్దం మను రబ్రవీత్ ||
ఇత్యాది శాస్త్రవాక్యములను బట్టి సమర్థులు ఈరోజు పగలు ఏ రకమైన ఆహారాదులు తీసుకొనకూడదు. శుద్ధ మోక్షానన్తరము (రా 06:47 తరువాత) నిత్యభోజన, ప్రత్యాబ్దికములను ఈ రాత్రియే యథాప్రకారము జరుపుకొనవలెను. అశక్తులు (పిల్లలు, రోగగ్రస్థులు, గర్భిణులు, వృద్ధులు) ఈనాడు పగలు గం.11:00 లోపు భుజింప వచ్చును.
ఈనాటి రాత్రికాలమున శ్రాద్ధాచరణము విశేష ధర్మ శాస్త్రమును బట్టి నిర్ణయము. అయితే విధవాకర్తృకశ్రాద్ధ మగుచో ఈ రోజు (పగలు - రాత్రి) ఉపవసించి మరునాడే జరుపవలసియుండును. అట్లే ఈనాడు జరుపవలసిన విశేష పూజాదులన్నియు గ్రహణానంతరమే జరుప కొనవలయును.
గ్రహణ గోచారము :- ఈ గ్రహణమును పూర్వఫల్గుని నక్షత్రము వారును, పూర్వాషాఢ నక్షత్రము వారును, భరణి నక్షత్రము వారును, అధమ ఫలము నిచ్చు రాశుల వారును అసలు చూడరాదు.
శుభ ఫలము : మిథున, తుల, వృశ్చిక, మీన రాశులవారలకు
మధ్యమఫలము : మేష, కర్కాటక, ధనుః, కుంభ రాశులవారలకు
అధమ ఫలము : వృషభ, సింహ, కన్య, మకర రాశులవారలకు
మాతృమూర్తి - మాతృభూమి - మాతృభాష
ధర్మ తపస్వి శ్రీ దశిక సత్యశేషయ్యశాస్త్రి చారిటబుల్ ట్రస్ట్
ລ້, ລ້ -47:: 9849795167
