సరస్వతీదేవి స్తోత్రం
🙏🙏🌸🌸🌸🌸🙏🙏
యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యావీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనా/
యాబ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి: దేవై: సదా వందితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాఢ్యాపహా ||
భావము:-
మల్లెపువ్వు వలె, చంద్రుని వలె, మంచు వలె, ముత్యము వలె తెల్లగా, స్వఛముగా ఉండి, తెల్లని చీర ధరించి, చేతిలో వీణతో, తెల్లని పద్మమునందు ఉండు ఓ సరస్వతి దేవీ! బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సహా అందరు దేవతలచే ఎల్లప్పుడు పూజింపబడు ఓ భగవతీ!! నాలోని అజ్ఞానమును పోగొట్టి నన్ను ఎల్లప్పుడూ రక్షించుము.
ఈ శ్లోకములో సరస్వతి దేవి ధరించినవన్నీ తెలుపులో ఉన్నాయి. తెలుపు సాత్విక గుణము. జ్ఞానము. తెల్లపువ్వు వలె, చంద్రునివలె,(తుషార)మంచు వలె, హారధవళ - ముత్యాలహారము. తెల్లని వస్త్రములు ధరించినది. తెల్లని పద్మములో ఆసీనురాలయినది, వీణ ధరించినది. సరస్వతి బొమ్మను పిల్లలకు చూపాలి.
సరస్వతి అనగా = చదువుల తల్లి.
సర+స్వ+తి= జ్ఞానము+మనలోని+ఇచ్చునది.
మనలో ఉన్న ఆ జ్ఞాపకశక్తిని అభివృద్ధి చేస్తుంది.
సరస్వతి ధరించే వీణ పేరు - కఛ్ఛపి
చేతిలో జపమాల - ఆధ్యాత్మికతను అభివృద్ధి చేయును
మరొక చేతిలో వేదములు - అనగా జ్ఞానమును ఇచ్చును
వీణ - సంగీత సాహిత్యము నాదము
సరస్వతికి ఇంకా పేర్లు ఉన్నాయి: వాక్కుకు అధిపతి, వాగ్దేవి, బ్రాహ్మారీ, శారదా, వాణి, విద్యావతి.
సరస్వతిని ప్రార్థిస్తే మనకు విద్యా, బుద్ధిని, జ్ఞానమును (జ్ఞాపక శక్తిని), ప్రజ్ఞను ఇచ్చును.
🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి