8, ఏప్రిల్ 2026, బుధవారం

పంచాంగం


  

గురువారం🌷* *09ఏప్రిల్2026* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

  *🌷గురువారం🌷*

     *09ఏప్రిల్2026*  

*దృగ్గణిత పంచాంగం*  

                    

           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్రమాసం - కృష్ణ పక్షం* 


*తిథి : సప్తమి* రా 09.19 వరకు ఉపరి *అష్టమి*

*వారం    : గురువారం* (బృహస్పతివాసరే)

*నక్షత్రం  : మూల* ఉ 08.48 వరకు ఉపరి *పూర్వాషాఢ*

*యోగం : పరిఘ* సా 05.58 వరకు ఉపరి *శివ*

*కరణం  : భద్ర* ఉ 08.12 *బవ* రా 09.19 ఉపరి *బాలువ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.00 - 10.00 & 11.00 - 12.00*               

అమృత కాలం  : *ఈరోజు లేదు*

అభిజిత్ కాలం  : *ప 11.44 - 12.34*

*వర్జ్యం    : ఉ 07.01 - 08.48 & రా 07.28 - 09.15*

*దుర్ముహూర్తం  : ఉ 10.05 - 10.55 మ 03.03 - 03.53*

*రాహు కాలం   :మ01.42- 03.15*

గుళికకాళం      : *ఉ 09.03 - 10.36*

యమగండం    : *ఉ 05.57 - 07.30*

సూర్యరాశి : *మీనం*                      

చంద్రరాశి : *ధనస్సు*

సూర్యోదయం :*ఉ 06.05*  

సూర్యాస్తమయం :*సా 06.31*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం       :*ఉ 05.57 - 08.26*

సంగవ కాలం       :*08.26 - 10.55*

మధ్యాహ్న కాలం    :*10.55 - 01.24*

అపరాహ్న కాలం  :*మ 01.24-03.53*

*ఆబ్ధికం తిధి  :చైత్ర బహుళ సప్తమి*

సాయంకాలం     :*సా 03.53- 06.22*

ప్రదోష కాలం      :*సా 06.22- 08.40*

రాత్రి కాలం        :*రా 08.40 - 11.46*

నిశీధి కాలం       :*రా 11.46 - 12.32*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.23 - 05.10*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

          *🌷ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌹🕉️ఓం శ్రీ సద్గురుబ్యోనమః.🕉️🌹*


*సత్యరూపసదాచార*

*సత్యధర్మపరాయణ*

*సత్యాశ్రయపరోక్షాయ*  

*దత్తాత్రేయ నమోఽస్తుతే* 

           

  *ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


        🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

*శ్రీ మహావిష్ణు పురాణం

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*బుధవారం 8 ఏప్రిల్ 2026*


       *శ్రీ మహావిష్ణు పురాణం*

`` *51వ భాగం*``


*సతీ సుమతి కథ-*```


నారద మహర్షి త్రిమూర్తుల భార్యలైన సరస్వతి లక్ష్మి పార్వతిలకు భూలోకం పతివ్రతా స్త్రీలకు నిలయం అని సతీ సుమతి కథ వివరించి చెప్పసాగాడు.


“ప్రతిష్ఠానపురంలో సద్ర్బాహ్మణ వంశంలో కౌశికుడు జన్మించాడు. తల్లిదండ్రులు ఇరువురు నారాయణ భక్తులు కావడంతో వారి ఇంటి లో నిత్య హరినామ సంకీర్తనం జరుగుతుండేది.‘ఓంనమోనారాయణ’ మంత్రం కౌశికుడు పుట్టిన దగ్గర నుంచి వినడం వలన మనస్సులో ఇరవైనాలుగు గంటలు అనుకోవడం తెలియకుండానే అలవాటైంది.


పెరిగి వేదవిజ్ఙానం నేర్చుకున్నా కౌశికుడు దుష్టజన సాంగత్యం వలన చెడువ్యసన పరుడయ్యాడు. తల్లిదండ్రుల మాటలు పట్టించుకోకుండా జూదం, మద్య పానము, వేశ్యాసాంగత్యంలో పగలు, రాత్రి గడిపేవాడు. అన్ని చెడు అలవాట్లు ఉన్న కౌశికుడికి ఒకటే సద్గుణం ఉంది. నారాయణ నామాన్ని మనస్సులో సదాస్మరణ చేసుకోవడం.


వంశం పరువు పోతుండటంతో బంధువుల, మిత్రుల సలహాతో ‘పెళ్ళి చేస్తే బాగుపడతాడు’ అని విని తల్లిదండ్రులు కౌశికుడికి సుమతి అనే అమ్మాయితో వివాహం చేశారు. సుమతి అందంతో పాటు దైవభక్తి కలిగిన సద్గుణ వతి. భర్త చెడు వ్యసనములు గురించి తెలిసి కూడా పతియే ప్రత్యక్షదైవమని భావించి సేవలు చేసేది. కౌశికుడు మాత్రం తన ప్రవర్తన మార్చుకోలేదు. సహించే భార్య దొరకడంతో రోజుల తరబడి వేశ్యావాటికలలోనే కాలం గడిపేవాడు. వారానికో నెలకో ఇంటికి వచ్చేవాడు.


సుమతి ఒక్క మాట కూడా అనకుండా ఉన్న నాలుగు రోజులు చక్కగా పతికి సేవ చేసేది. కోడలు పడే బాధ చూడలేక, కొడుకును మంచి దారిలో పెట్టలేక దిగులు చెందిన కౌశికుడి తల్లిదండ్రులు కొంత కాలానికి మరణించారు. కౌశికుడి చెడు వ్యసనాలకు ఉన్న సంపద అంతా కరిగిపోయింది. అప్పుల వాళ్ళు ఇల్లు స్వాధీనం చేసుకుని భార్యాభర్తలను బయటకు పంపారు.


కౌశికుడు సుమతి ఒక ధర్మ సత్రంలో తలదాచుకున్నారు. చెడు వ్యసనాల వలన కౌశికుడికి భయంకరమైన కుష్ఠురోగం వచ్చింది. సత్రం అధికారులు ఈ విషయం గ్రామాధికారికి చెప్పగా దంపతులను గ్రామం నుంచి బహిష్కరించారు. ఊరి వెలుపల స్మశానానికి సమీపంలో సుమతి ఒక గుడిసె నిర్మించి కుష్ఠురోగి అయిన భర్తను అందులో ఉంచి సేవలు చేయసాగింది.


తెల్లవారుజామున లేచి భర్తకు స్నానం చేయించి కుష్టు పుళ్ళకు మందులు పూసి మంచి బట్టలు వేసి ఇంటి వసారాలో అరుగు మీద కూర్చోబెట్టేది. తాను స్నానంచేసి తెలిసినవారి ఇండ్లకు వెళ్లి కులభంగం, వ్రతభంగం కాని పనులు చేసేది. సుమతి మంచి తనం తెలిసిన వారు ధనంతో పాటు ఆహార పదార్థాలు, తిను బండారాలు ఇచ్చేవారు. సుమతి అవి తెచ్చి భర్తకు తినిపించేది.


గ్రామ ప్రజలతో పాటు దేవతలు కూడా సుమతి పతిభక్తికి, పతిసేవకు ఆశ్చర్యపోయేవారు, ప్రశంసించేవారు. కుష్ఠురోగంతో బాధపడుతున్న కౌశికుడు భార్య చేసే సేవలు చూసి పరివర్తన చెందాడు. తన జీవితం పూర్తిగా సర్వనాశనం అయ్యింది, సుమతి తనను వదిలి వెళతే ఆమె జీవితమైనా బాగుపడతుందని తిడుతూ తనకు దూరంగా వెళ్లపోమన్ని కసిరికొట్టేవాడు. ‘నాలాంటి వాడికి చాకిరి చేసి నీజీవితం నాశనం చేసుకోకు! నారాయణుడు నాలాంటివారిని చూసుకుంటాడు. నన్ను వదలి వెళ్లి పో’ అని చీదరించుకునేవాడు.


భర్త మనస్సులోని భావాన్ని గ్రహించిన సుమతి ‘నారాయణుడే మీకు సేవ చేయమని భార్యగా పంపాడు’ అని సేవలు చేసేది. 


కౌశికుడు చూడలేక మనస్సులో స్మరించే నారాయణుని ‘నారాయణా! ఈ సుమతి నన్ను వదలదు. నీవే నన్ను తీసుకు వెళ్ళు’అని అరచేవాడు. 


కొంతకాలానికి అతని మాటలు విన్న తథాస్తు దేవతలు తథాస్తు అన్నారు. విష్ణువు అనుగ్రహించాడు


నారాయణుడి ప్రేరణ చేత ఆ రోజు రాత్రి రాజభవనంలో దొంగలు పడి ధన రత్న బంగారు ఆభరణాలు మూటలు కట్టుకుని తీసుకువెళ్లుతుంటే రాజభటులు చూసి వెంటబడ్ఢారు. దొంగలు తమను తరుముకుంటూ వస్తున్న భటులను తప్పించుకోవడానికి ఊరి చివర ఒక చెట్టు క్రింద తపస్సు చేసుకుంటున్న మాండవ్య ముని వద్ద ఒక రత్నాభరణాల మూట పారవేసి అడవిలోకి పారిపోయారు.


రాజభటులు ఆ ఆభరణాల మూట మాండవ్య ముని వద్ద చూసి ఆయన దొంగలలో ఒకడని భావించి బంధించి రాజుగారి వద్దకు తీసుకు వెళ్లారు. మాండవ్యముని మౌనదీక్షలో ఉండటం వలన నోరు తెరచి మాటాడలేక పోయాడు. అంతకుముందు ఎప్పుడూ మాండవ్య మునిని చూడని రాజు మౌనంగా ఉండటం చూసి ఆగ్రహించి శిక్షగా మునిని కొరత వేయమని ఆదే శించాడు. భటులు మునిని తీసుకువెళ్లి కొయ్యస్థంభానికి మేకులు కొట్టి దారిలో నిలుచో బెట్టి కొరత శిక్ష వేసారు.


తెల్లవారింది. సుమతి భర్తకు యధావిధిగా స్నానం చేయించి ఇంటి బయట అరుగు పై కూర్చోబెట్టి లోన పనికి వెళ్లింది. అదే సమయంలో పల్లకిలో అందమైన వేశ్య ఒకతి ఆ ఇంటి ముందు నుంచి వెళ్ళింది. కౌశికుడు చూసి సుమతి తనను అసహ్యించుకుని వదిలి వేసేందుకు ఒక ఉపాయం ఆలోచించాడు. మధ్యాహ్నం తనకు భోజనం పెట్టడానికి వచ్చిన సుమతితో ‘తనను ఆ వేశ్య దగ్గరకు తీసుకు వెళితేనే తింటాను’ అని పట్టుబట్టాడు.


కుష్ఠురోగం ఉన్నా ఇటువంటి కోరిక కోరినందుకు తనను చీదరించుకుని సుమతి వెళ్లి పోతుంది అని కౌశికుడు అనుకున్నాడు. కానీ సుమతి రాత్రికి తీసుకు వెళతాను అని చెప్పి భోజనం పెట్టింది. రాత్రి అవ్వగానే సుమతి కౌశికుని ముస్తాబు చేసి తట్టలో కూర్చోబెట్టి తట్టను తల మీద పెట్టుకుని బయలు దేరింది.


చీకట్లో నడుస్తున్న సుమతిని కౌశికుడు నన్ను వదలి వెళ్లమని తిడుతున్నాడు. కాళ్లు చేతులు ఆడిస్తూ కొడుతున్నాడు. అదే దారిలో మాండవ్య మునిని వ్రేలాడదీసిన కొయ్య స్థంభం ఉంది. చీకట్లో కౌశికుడి జాడించిన కాలు మాండవ్య ముని తలకు బలంగా తగిలింది. కొట్టిన మేకుల బాధకు తోడు కౌశికుడి కాలు దెబ్బ మాండవ్య మునిని మరింతగా బాధపడేట్టు చేసింది.


ఆ బాధ తట్టుకోలేక మౌనవ్రతం వీడి మాండవ్య ముని బిగ్గరగా అరుస్తూ ‘ఎవరి కాలు నా తలకు తగిలి నన్ను అంతులేని బాధకు గురిచేసిందో, అతని తల సూర్యోదయానికి వేయి ముక్కలు ఔతుంది’ అనిశపించాడు. కౌశికుడు విని తన బాధ సుమతికి తొలగిపోతుంది అని ఆనందపడ్డాడు. భార్యను వెనక్కి ఇంటికి తీసుకెళ్లమని చెప్పాడు.


సుమతి మాత్రం ఏ మాత్రం కంగారు పడకుండా తన పాతివ్రత్యం పై ఒట్టు పెట్టి "రేపు సూర్యోదయం కాకుండు గాక" అని ప్రతిశాపం ఇచ్చింది. మహా పతివ్రత మాటకు సూర్యరథం ఆగింది. సూర్యుడు ఆగిపోయాడు. జగత్తు అంధకారంలో ఉండి పోయింది. ముల్లోకాలలో అలజడి మొదలైంది.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

ఈ ప్రశ్నకు బదులేది 16

 ఈ ప్రశ్నకు బదులేది 16

ఈరోజు మన ప్రశ్న  ఆధ్యాత్మికత కు సంబంధించింది.


  ఉమా భారతి ఎవరి ధర్మపత్ని ఆమె నిర్వహించిన గొప్ప కార్యము ఏమిటి


ఆదిశంకరాచార్యుల వారు పరకాయ ప్రవేశం చేయటానికి ఆమెకు సంబంధం ఏమిటి

 సవివరంగా వివరించగలరు.

ఇంకొక ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం.


ఇట్లు 

మీ 

చేరువేల భార్గవ శర్మ


గమనిక:: మీ జాబును కామెంట్ రూపంలో తెలియజేయండి

అన్నం మహాత్మ్యంసరస్వతీ దేవి: చదువుల తల్లి

 *అన్నం మహాత్మ్యం*


అన్నిదానములను నన్నదానమే గొప్ప

కన్నతల్లికంటే ఘనములేదు

ఎన్నగురునికన్న నెక్కుడు లేదయా

విశ్వదాభిరామ వినురవేమ.


అన్నానికున్న ప్రాధాన్యతని వేదాలు కూడా వక్కాణించాయి. అన్న సూక్తాన్ని పఠించడం కూడా అన్నం మీద మన భక్తి భావాన్ని నిలుపుకోవడమే. అందుకే ఆర్యులు `అన్నం పరబ్రహ్మ స్వరూపం' అన్నారు. అన్నమే జీవిని బతికిస్తుంది. అన్నమే పోషిస్తుంది. అన్నమే ఆరోగ్యాన్నిచ్చి కాపాడుతుంటుంది. అన్నమే మనుగడకి ఆలంబనగా ఉంటుంది. అలాగని మితిమీరి భుజిస్తే ప్రాణం తీస్తుంది. అన్నం తిననిరోజు నీరసించి, ఆత్మ అసంతృప్తికి లోనవుతుంది. చంపినా, పోషించినా సర్వులకూ అన్నమే ప్రదానం. `సహనా వవతు+సహనౌ భునక్తు+సహ వీర్యం కరవావహైః+ తేజస్వినామదీతమస్తు మా విద్విషావహైః ఓం శాంతిః శాంతిః శాంతిః' ఇదే అన్న సూక్తం.


సకలజీవరాసులకూ అన్న ప్రదాత ఆ సూర్యభగవానుడు. గ్రహాధిపతి అయిన సూర్యుని కరుణ వలన బుతువులు సక్రమంగా ఉండి, వర్షాలు పడి పంటలు పండి అందరూ సుఖజీవనం సాగిస్తున్నారంటే అందుకు కర్త ఆ ప్రత్యక్షనారాయణుడు సూర్యుడే. సూర్యరస్మి లేనిదే ఏ మొక్కా మొలకెత్తదు. అలాగే వరి ధాన్యాలు కూడా అంకురించవు. ప్రత్యక్షంగా సూర్యుని ప్రభావంతో మనకి జీవనాధారం అయిన అన్నాన్ని భక్తి శ్రద్ధలతో భుజిస్తేనే ఆయురారోగ్యాలు కలుగుతాయి.


ఇప్పుడు మనం చేస్తున్నదేమిటీ..? తిన్నంత తిని, మిగిలింది పెంటకుప్పలపాలు చేస్తున్నాం. అసలు అన్ని దానాల్లోకీ అన్నదానం గొప్పదని పెద్దల వాక్కు. అది కూడా ఈరోజుల్లో మనం చేయలేకపోతున్నాం. పూర్వం అన్ని లోగిళ్ళలోను నిత్యం ఇంటిల్లిపాదికీ వండే టప్పుడు ఒక గుపెడు బియ్యం ఎక్కువ పొయ్యిమనేవారు. ఎందుకంటే, అతిధి, అభ్యాగతుల కోసం, అన్నార్తులెవరైనా వస్తే పెట్టాలనే ఉద్దేశ్యంతోను అలా చేసేవారు. మనకి అన్నదానాలు చేసే గొప్ప మనసూ లేదు, అన్నాన్ని బ్రహ్మ స్వరూపంగా భావించే గుణమూ లేదు. అందుకే ఒకనాటి కాలంలో లేని అనేక రుగ్మతలు మనల్ని పట్టి పీడిస్తున్నాయి. అన్నం తినకుండా ఇతర పదార్థాలతో కడుపు నింపుకున్నా జవసత్వాలు క్రమేపీ క్షీణించడం మనలోనే చూస్తూవుంటాం. అలాగే అన్నం ముట్టని వారికి మనస్సు కూడా స్వాధీనం తప్పి విపరీత ఆలోచనలతో ఎప్పుడు అస్తిమితంగా ఉంటారు. అన్నం తినడం అనేది కూడా ఒక యోగమే. ఎంతో డబ్బువ్యామోహంతో అనేక రకాల పనులుచేసి అక్రమంగా కోట్లు కూడబెట్టినవాడికి అన్నం తినే యోగం లేకుండా అజీర్తివ్యాధో, అంతకన్నా భయంకరమైన దీర్ఘవ్యాధో పట్టుకుని జీవితాంతం అవస్తపడుతూంటాడు.


చక్కెర వ్యాధిగ్రస్తులకి వైద్యులు కూడా అన్నం మాని రొట్టెలు తినమంటారు. ఇది ఎంతటి దౌర్భాగ్య పరిస్థితి!. ఇటువంటివి కర్మానుగుణంగా సంక్రమిస్తాయి. అందుకే మనకి అన్నీ బాగున్నప్పుడే, అతిధి, అభ్యాగతుల్ని, బంధువర్గాన్నీ, అన్నార్తుల్ని, గృహస్తుని, పెద్దవారిని, గురువుల్ని, భాగవతోత్తముల్ని, పండితుల్ని ఆదరిస్తూ వారికి తృప్తిగా అన్నం వడ్డించి భోజన సదుపాయం చేస్తూవుంటే, పెట్టింది ఎక్కడికీ పోదు. రెండింతలై తిరిగి వస్తుంది. అలా పెట్టిన వారికి అన్న యోగ్యం కలుగుతుంది. అందుకే 'పెట్టినమ్మకి పెట్టినంత' అనే సామెత పుట్టుకొచ్చింది. నలుగురికి పంచింది నాలుగింతలవుతుందన్నది కూడా దీనికి పర్యాయమే.


భోజన విధానం


అన్నాన్ని భుజించేటప్పుడు కూడా పద్దతి పాటించాలి. శుభ్రంగా అలికిన నేల మీద కంచంలోగానీ, అంతకన్నా శ్రేష్టమైన అరటి ఆకులో గానీ అన్నం, శాకాలు వడ్డించుకుని పీటలు వేసుకుని ఇంటిల్లిపాదీ కింద కూర్చుని భుజించడం చాలా ఉత్తమం. అందువల్ల వండిన పదార్ధాలు ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ అయ్యాయేమో అనే శంక లేకుండా ఉన్నదానినే అందరూ సర్దుకునే అలవాటు అవుతుంది. భుజించే ముందు అందరూ అన్నానికి నమస్కరిస్తూ దానిని మనకి ప్రసాదించిన దేవుని దివ్యప్రసాదంగా భావించి, కళ్ళ కద్దుకుని తినడం ప్రారంభించాలి. సోఫాల్లోను, కుర్చీలోను కూర్చుని భుజించడం నిషిద్ధం. వీలైతే అన్న సూక్తం పటించడం మరీ మంచిది. అన్నం భుజించేటప్పుడు మనం అన్నం మీదే దృష్టి నిలిపి తింటే అది వంటపడుతుంది.


అన్నానికి ఉన్న మరో శక్తి ఏమిటంటే, అన్నం తినే సమయంలో మన భావాలు ఏవి ఉంటాయో, శారీరకంగా అందుకు తగిన ఫలితాలే తిన్న అన్నం వలన కలుగుతాయి. అందుకే టీవీలు చూస్తూ, కబుర్లు చెప్పుకుంటూ, చాడీలు మాట్లాడుకుంటూ తింటే నెగెటివ్ ఆలోచనలు వృద్ధిచెందుతాయి. అలాకాకుండా భగద్భక్తితో, మనసులోకి ఎటువంటి ఆలోచనల్నీ రానీయకుండా, పద్దతిని పాటిస్తూ భుజిస్తే పాజిటివ్ ఆలోచనలు వృద్ధిచెందుతాయి. మనసు ప్రశాంతంగా ఉండి చేసే అన్ని పనులు విజయవంతంగా ముందుకు సాగుతాయి. ఎవరైనా భోజనం చేసి వెళ్ళమని ఒకటికి రెండు సార్లు అడిగితే తిరస్కరించకూడదు. వండి వడ్డించిన వారిని లోపాలు ఎంచకూడదు. మనకు దంత సిరి ఉంటే వండిన పదార్ధాలు రుచికరంగానే ఉంటాయి. అది లేకపోతే ఆరోజుకి కనీసం అన్నం తినే ప్రాప్తం కలిగిందని సంతోషించాలి తప్ప అదిబాగాలేరు, ఇది బాగాలేదు అంటూ తినేటప్పుడు విమర్శించకూడదు.


ఇంట్లో పెద్దవారు, పిల్లలు ఉంటే, ముందుగా వారికి భోజనం పెట్టాలి. అందువల్ల ఆకలితో వేచివున్న వారి ఆత్మ శాంతిస్తుంది. అందుకే చాలామంది ఇప్పటికీ కడుపునిండా భోజనంచేసి, 'హమ్మయ్య! ఆత్మారాముడు శాంతించాడు' అంటూవుంటారు. భర్త భుజించిన తరువాతే, భార్య భుజించడం ఉత్తమ సంప్రదాయం. అది వీలుపడనివారు ఇద్దరూ కలిసి భుజించడం మధ్యమం. ముందు ఇల్లాలు తినడం అథమం.


ఇలా చిన్న చిన్న విషయాలు పాటిస్తుంటే మనకి, ఇంటిల్లిపాదికీ ఆయురా రోగ్యాలకి ఎటువంటి లోటూ వుండదు. అందరి ఆలోచనలు సన్మార్గంలో నడుస్తాయి. తినే పదార్ధాలని వృధా చేయకుండా, సద్వినియోగం చేస్తూవుంటే ఆ అన్నపూర్ణమ్మ తల్లి నిత్యం మనింట్లో ధాన్యరాసుల్ని కురిపిస్తుంది. అలక్ష్యం చేస్తే భుక్తికోసం వెంపర్లాడక తప్పని పరిస్థితిని చవిచూడవలసి వస్తుంది. కనుక అన్నాన్ని గౌరవిద్దాం.. నలుగురిని ఆదరిద్దాం... తృప్తిగా జీవిద్దాం.

సరస్వతీ దేవి: చదువుల తల్లి

 సరస్వతీ దేవి: చదువుల తల్లి సరస్వతీ దేవి ధరించే వీణ పేరు కచ్ఛపి.


నారదుడు: దేవముని అయిన నారదుడి వీణ పేరు మహతి. నిరంతరం హరినామ స్మరణ చేస్తూ ఆయన ఈ వీణను వాయిస్తారు.


తుంబురుడు: గంధర్వులలో శ్రేష్ఠుడైన తుంబురుని వీణ పేరు కళావతి.


రావణుడు కేవలం రాక్షస రాజు మాత్రమే కాదు, గొప్ప శివ భక్తుడు మరియు సామవేద పండితుడు.


 సంగీతంలో ఆయనకు ఉన్న ప్రవేశం అసాధారణమైనది.


రావణుని వీణ: రావణుడి వీణ పేరు రావణహస్తం (దీనినే 'రావణ హస్త వీణ' అని కూడా అంటారు). ఇది ఆధునిక వయోలిన్ వంటి వాయిద్యాలకు మూల రూపం.


ఎవరి కొరకు వాయించాడు?: రావణుడు పరమ శివుని ప్రసన్నం చేసుకోవడం కోసం వీణను వాయించాడు. ఒక సందర్భంలో రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించినప్పుడు, శివుడు తన కాలి బొటనవేలితో పర్వతాన్ని నొక్కగా రావణుడు దాని కింద చిక్కుకుపోతాడు. అప్పుడు శివుని శాంతింపజేయడానికి తన నరాలను తంత్రులుగా చేసి, శివ తాండవ స్తోత్రాన్ని పఠిస్తూ అద్భుతంగా వీణ వాయించి శివుని అనుగ్రహాన్ని పొందుతాడు.


రావణుడు కనుగొన్న రాగం: సంగీత శాస్త్రం ప్రకారం రావణుడు కాంబోజి రాగాన్ని కనుగొన్నట్లు లేదా ఆ రాగంలో విశేషమైన ప్రావీణ్యం సంపాదించినట్లు చెబుతారు. 


మరికొన్ని కథనాల ప్రకారం శంకరాభరణం రాగం అన్నా ఆయనకు అత్యంత ప్రీతి అని అంటారు.


రావణుడు శాస్త్రీయ సంగీతంలో 'రావణ ఛాయ' అనే ఒక ప్రత్యేకమైన ప్రక్రియను కూడా ప్రాచుర్యంలోకి తెచ్చాడని పురాణ వచనం.

రేల చెట్టు

 



పైన చూపిన చెట్టు రేల చెట్టు (Cassia fistula), దీనిని గోల్డెన్ షవర్ ట్రీ అని కూడా పిలుస్తారు, ఇది పసుపు రంగు పూలతో చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. సాంప్రదాయకంగా, రేల చెట్టు పూయడం వర్షాలు సమీపిస్తున్నాయని (45 రోజులలో) సూచించే ప్రకృతి సంకేతంగా రైతులు నమ్ముతారు. ఈ చెట్టు చర్మ వ్యాధులు, కామెర్లు వంటి సమస్యలకు ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. 


రేల చెట్టు - వర్షం సంబంధిత ముఖ్య వివరాలు:

వర్ష సూచిక: రేల చెట్టు పూలు విరిసిన సుమారు 45 రోజులకు వర్షాలు పడతాయని పూర్వకాలం నుండి రైతులు నమ్ముతారు.


పత్తి విత్తనాల సేకరణ: ఈ పూలు పూయడం చూసి, రైతులు పత్తి విత్తనాలను సిద్ధం చేసుకుంటారు.



ఔషధ గుణాలు: ఆయుర్వేదంలో, ఈ చెట్టు ఆకులు, బెరడు, పళ్ల గుజ్జును చర్మ వ్యాధులు, కామెర్లు, కడుపునొప్పి నివారణకు ఉపయోగిస్తారు.

నివాసం: ఇది అడవులలో, పొలం గట్లపై, రోడ్ల పక్కన పెరుగుతాయి 

ఈ చెట్టు కేవలం అందానికే కాకుండా, ప్రకృతి మార్పులను ముందుగానే తెలియజేసే ఒక పర్యావరణ సూచికగా కూడా వ్యవహరిస్తుంది.


సంస్కృతంలో ఆరగ్వథ అనీ స్వర్ణవృక్ష అనీ పిలిచే ఈ ఆకు రాల్చే వృక్షం 25 మీటర్ల ఎత్తు వరకు కూడా పెరుగుతుంది. బంగారు వన్నె కలగలిసిన ప్రకాశవంతమైన పసుపు పచ్చని పుష్పగుచ్ఛాలు వేలాడే పెద్ద షాండ్ లేర్స్ లా అనిపిస్తాయి. మార్చి- మే నెలల మధ్యలో ఆకులు పూర్తిగా రాల్చేసి, ఒళ్ళంతా పూల గుత్తులతో ఈ చెట్లు మనోహరంగా ఉంటాయి. జూలై నెలకల్లా చెట్లు కొత్త చిగుళ్లు వేసి చిలకపచ్చని హరితశోభతో అలరారుతూ ఉంటాయి. అక్టోబర్ దాకా ఈ వృక్షాలు పుష్పిస్తాయి. మునగ కాయలలా బారుగా ఉండే రేల కాయలు చకచకా పెరుగుతూ అక్టోబర్ లో ఆకుపచ్చగా ఉండి, తరువాత క్రమంగా పండి నల్లగా అవుతాయి. వీటిలోని తియ్యటి గుజ్జు విరేచనకారి. 30 నుంచి 60 సెంటీమీటర్ల వరకు పొడవు పెరిగే రేలకాయలు ఏప్రిల్ నెలలో పండి రాలటం మొదలవుతుంది.

ఈ ప్రశ్నకు బదులేది 15

 ఈ ప్రశ్నకు బదులేది 15



ఈరోజు మన ప్రశ్న పురాణాలకు సంబంధించింది.



  సరస్వతీ దేవి వీణ పేరు ఏమిటి


  నారదుని వీణ పేరు ఏమిటి


 తుంబురుని వీణ పేరు ఏమిటి


రావణుని వీణ పేరు తెలపండి


  ఎవరిని ప్రసన్నుల చేసుకొనుట కొరకు వాయించాడు


 రావణాసురుడు కనుగొన్న రాగము పేరు ఏమిటి? 


 సవివరంగా వివరించగలరు.


ఇంకొక ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం.


ఇట్లు 

మీ 

చేరువేల భార్గవ శర్మ


గమనిక:: మీ జాబును కామెంట్ రూపంలో తెలియజేయండి

కావేరీ నది కథ

 భారతీయ పురాణాలలో కావేరీ నది కథ చాలా ఆసక్తికరమైనది. ఇది భక్తి, అంకితభావాన్ని మాత్రమే కాకుండా, ఒక వ్యక్తి యొక్క సంకల్పం ప్రజా సంక్షేమానికి ఎలా దారితీస్తుందో కూడా తెలియజేస్తుంది.


కావేరి పుట్టుక కథ రెండు ప్రధాన భాగాలుగా విభజించబడింది: విష్ణువు కుమార్తెగా ఆమె జననం మరియు అగస్త్య మహర్షి కమండలం నుండి ఆమె నదిగా మారడం.


పురాణాల ప్రకారం, బ్రహ్మదేవునికి విష్మయ అనే ఒక మానస పుత్రిక ఉండేది. ఆమె విష్ణుమూర్తికి సేవ చేయడానికి కఠోర తపస్సు చేసింది. విష్ణుమూర్తి ఆమెకు ఒక వరం ఇచ్చాడు, అదేమిటంటే ఆమె తన మరుజన్మలో కావేరి అనే రాజుకు కుమార్తెగా జన్మిస్తుంది.


కావేరి రాజు సంతానం కోసం బ్రహ్మగిరి పర్వతంపై తపస్సు చేశాడు.


ఆ వరం ఫలితంగా, అతనికి కావేరి అనే పేరుగల అదే దైవిక కుమార్తె జన్మించింది.


కావేరి చిన్నప్పటి నుంచే చాలా ఆధ్యాత్మిక భావాలు కలది. తన జన్మ ప్రపంచ పాపాలను కడిగివేసి, భూమి దాహాన్ని తీర్చే విధంగా ఉండాలని ఆమె కోరుకుంది.


అనగనగా ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో తీవ్రమైన కరువు వచ్చింది. ఋషులు, సాధువులు దానికి పరిష్కారం కోసం ప్రార్థించారు. ఆ సమయంలో, గొప్ప ఋషి అయిన అగస్త్యుడు, కావేరి సౌందర్యానికి, భక్తికి ముగ్ధుడై, ఆమెను వివాహం చేసుకోవాలని ప్రతిపాదించాడు.


కావేరి ఒక షరతు మీద అంగీకరించింది:


"ప్రభూ, మీరు ఎప్పుడైనా నన్ను ఒంటరిగా వదిలి దూరంగా వెళ్ళిపోతే, నేను స్వేచ్ఛగా ప్రవహిస్తాను."


కథా సంగ్రహంలోని పోస్టులు మీకు నచ్చితే, ఈరోజే కథా సంగ్రహానికి సబ్స్క్రైబ్ చేసుకోండి


అగస్త్య మహర్షి ఈ షరతును అంగీకరించాడు. కానీ ఒక రోజు, అగస్త్య మహర్షి ఒక లోతైన చర్చలో ఎంతగా నిమగ్నమయ్యారంటే, ఆయన కావేరిని తన కమండలంలో సురక్షితంగా వదిలి, సమీపంలోని ఒక జలాశయంలో స్నానం చేయడానికి వెళ్ళాడు.


దక్షిణ భారతదేశంలోని కరువును అంతం చేయడానికి కావేరి ఒక నదిగా మారాలని ఇంద్రుడు మరియు ఇతర దేవతలు కోరుకున్నారు. అందుకని వారు గణేశుడి సహాయం కోరారు.


అగస్త్య ముని తపస్సు చేస్తుండగా, గణేశుడు ఒక చిన్న కాకి రూపం ధరించి అగస్త్య ముని కమండలంపై వాలాడు.


అగస్త్య ముని ఆ కాకిని తొలగించడానికి చేయి ఊపగా, ఆ కాకి చాకచక్యంగా కమండలాన్ని పడగొట్టింది.


కమండలంలోని పవిత్ర జలం నేలపై పడగానే, కావేరి నది ఒక మహానదిగా మారి కొండ కిందికి ప్రవహించడం ప్రారంభించింది.


తన కమండలం పడిపోయి, కావేరి నదిలా ప్రవహించడం చూసి అగస్త్య ముని ఆగ్రహానికి గురై ఆ కాకి వెంట పరుగెత్తాడు. అప్పుడు గణేశుడు తన నిజరూపంలో ప్రత్యక్షమై, ఇదంతా ప్రజల సంక్షేమం కోసమే జరిగిందని వివరించాడు.


కావేరి తన పరిస్థితిని గుర్తుచేసింది: తనను ఒంటరిగా వదిలేశారని, అందుకే ఇప్పుడు నది రూపంలో ప్రజల దాహాన్ని తీరుస్తానని చెప్పింది. అగస్త్య ముని అది దైవ సంకల్పమని నమ్మి అంగీకరించాడు.


కావేరి (తలకావేరి) ప్రాముఖ్యత


ఈ నది పుట్టిన కర్ణాటకలోని కొడగు జిల్లాలో, 'తలకావేరి' అనే ప్రదేశం నేటికీ ఉంది.


ప్రతి సంవత్సరం అక్టోబరు నెలలో ఇక్కడ 'తుల సంక్రమణ' ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున ఒక నిర్దిష్ట సమయంలో, చెరువులోని నీరు అకస్మాత్తుగా పైకి ఉబికి వస్తుందని, ఇది కావేరీ దేవి యొక్క ప్రత్యక్ష రూపంగా భావిస్తారని నమ్ముతారు.


ఉత్తర భారతదేశంలో గంగానదికి ఎంతటి భక్తిశ్రద్ధలు ఉన్నాయో, దక్షిణ భారతదేశంలో కావేరికి కూడా అంతే భక్తిశ్రద్ధలు ఉన్నాయి.


ఒక ఆసక్తికరమైన విషయం: ప్రసిద్ధ శ్రీరంగం ఆలయం (విష్ణుమూర్తి నివాసం) కావేరి నది ఒడ్డున ఉంది. ఇది, ఎల్లప్పుడూ స్వామి పాదాల చెంత ఉండాలన్న ఆమె కోరికను కూడా నెరవేర్చింది.


© సర్వ హక్కులు సంరక్షించబడినవి – కథా సంగ్రహ. అనధికారికంగా కాపీ చేయడం, తిరిగి అప్‌లోడ్ చేయడం లేదా పునరుత్పత్తి చేయడం ఖచ్చితంగా నిషిద్ధం.

మాధవుని’ ఆరాధన

 కాలచక్రపు అనంత ప్రవాహంలో, ఒకానొక సందర్భంలో యమలోకంపై ఒక వింత నిశ్శబ్దం ఆవహించిందని చెబుతారు. సాధారణంగా, అక్కడ యమదూతల రాకపోకలు నిరంతరం కొనసాగుతుండేవి—వారు ఆత్మల లోకం నుండి ఆత్మలను తీసుకురావడం గానీ, లేదా వారి కర్మలకనుగుణంగా వారికి తగిన మార్గాలను చూపించడం గానీ చేస్తుండేవారు. కానీ ఆ రోజు మాత్రం, నరక ద్వారాలు తెరుచుకోలేదు, యమదూతలు తిరిగి రాలేదు, ఏ పాపాత్మల ఆర్తనాదాలు ఆ ప్రాంగణాల్లో ప్రతిధ్వనించలేదు. యమలోకం అంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయినట్లు అనిపించింది.

యమరాజు తన సింహాసనంపై ఆసీనుడై ఉన్నప్పటికీ, ఆయన మనసులో ఒక గాఢమైన ఆందోళన చోటుచేసుకుంది. ఆయన చిత్రగుప్తుని పిలిపించారు.

"చిత్రగుప్తా! ఈ రోజు లెక్కల పుస్తకాలు (పద్దులు) ఎందుకంత నిశ్శబ్దంగా ఉన్నాయి? ఏమైనా పొరపాటు జరిగిందా?"

చిత్రగుప్తుడు అత్యంత వినయంతో ఇలా బదులిచ్చాడు:

"ప్రభూ! లెక్కల పుస్తకాలు పూర్తిగా కచ్చితంగానే ఉన్నాయి. గత మూడు రోజులుగా, ఒక్క కొత్త ఆత్మ కూడా నరక మార్గం వైపు మళ్ళించబడలేదు. అందరి పాపాలు ఏదో అద్భుతంగా కరిగిపోతున్నట్లు అనిపిస్తోంది."

ఆశ్చర్యంతో యమరాజు కనుబొమ్మలు ముడిపడ్డాయి.

"ప్రపంచం నుండి పాపం పూర్తిగా అంతరించిపోయిందా? ప్రజలందరూ ఒక్కసారిగా పూర్తిగా పవిత్రులైపోయారా?"

చిత్రగుప్తుడు కూడా అయోమయానికి గురయ్యాడు:

"ప్రభూ! పాపాన్ని పూర్తిగా నిర్మూలించడం అనేది అసంభవమే... అయినప్పటికీ, ఏదో ఒక అదృశ్య శక్తి ప్రపంచంలోని పాపాలన్నింటినీ కడిగివేసినట్లుగా అనిపిస్తోంది."

యమరాజు మనసులో సందేహం, కుతూహలం రెండూ ఒకేసారి కలిగాయి.

ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు:

"ఈ రహస్యానికి సమాధానం కేవలం శ్రీహరి విష్ణుమూర్తి మాత్రమే చెప్పగలరు."


వెంటనే, యమరాజు తన తెల్లని మహిషంపై అధిరోహించి వైకుంఠం వైపు బయలుదేరారు. వైకుంఠ ద్వారాలు ఎప్పటిలాగే కాంతులీనుతున్నాయి; కానీ ఆ రోజు మాత్రం, వాటి తేజస్సు మరింత దివ్యంగా వెలుగుతున్నట్లు అనిపించింది.

శ్రీమహావిష్ణువు శేషనాగునిపై పవళించి ఉండగా, లక్ష్మీదేవి ఆయన పాదాల వద్ద సేవలు అందిస్తోంది.

తన ప్రణామాలను అర్పించిన యమరాజు ఇలా ప్రశ్నించారు:

"ప్రభూ! పాపాత్మలు యమలోకానికి రావడం ఎందుకు ఆగిపోయింది? ప్రపంచం నుండి పాపం నిజంగానే అంతరించిపోయిందా? నా దూతలందరూ నిరుద్యోగులై కూర్చున్నారు, నరకాగ్నులు చల్లారిపోయాయి, చిత్రగుప్తుని లెక్కల పుస్తకాలు ఖాళీగా ఉన్నాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది?" శ్రీమహావిష్ణువు మృదువైన చిరునవ్వుతో యమధర్మరాజు వైపు చూశారు—

“యమా! ఇది నీ అధికారానికి కలిగిన లోపం కాదు, అలాగే ఈ లోకం నుండి పాపం పూర్తిగా తొలగిపోలేదు... ఇది కేవలం వైశాఖ మాసం యొక్క ప్రభావం మాత్రమే.”

**వైశాఖ మాస మహిమ వెనుక ఉన్న రహస్యాన్ని విష్ణువు వెల్లడించడం**

యమధర్మరాజు ఆశ్చర్యచకితుడై నిలబడ్డాడు:

“ప్రభూ! కేవలం ఒక్క మాసానికి నిజంగా ఇంతటి అద్భుతమైన శక్తి ఉంటుందా?”

విష్ణువు ఇలా బదులిచ్చారు:

“యమధర్మరాజా! దేవతల దృష్టిలో, వైశాఖ మాసాన్ని ‘మాధవ మాసం’ (మాధవునికి ప్రీతికరమైన మాసం) అని పిలుస్తారు. ఈ మాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి నదీస్నానం చేసేవారు, పవిత్రమైన తులసి మొక్కను శ్రద్ధగా పూజించేవారు, లేదా దాహంతో అలమటించే బాటసారులకు చల్లని నీటిని అందించేవారు—ఇలాంటి వారి కోట్లాది జన్మల పాపాలు భస్మీపటలమైపోతాయి.

ఈ సమయంలో, మానవులు చేసే అత్యంత చిన్న పుణ్యకార్యం కూడా వారికి వెయ్యి రెట్ల ఫలితాన్నిస్తుంది.

మరియు వైశాఖ మాస మహిమను కీర్తించే పవిత్ర గాథలను శ్రద్ధగా వినేవారు—

వారి ప్రయాణం యమలోకం వైపు సాగదు...

వారు నేరుగా నా దివ్య నివాసమైన వైకుంఠాన్ని చేరుకుంటారు.”

విష్ణువు ఇలా కొనసాగించారు:

“ఈ మాసంలో ఉండే తీవ్రమైన ఎండల కారణంగా భూమి కూడా ఉడికిపోతుంది, నదులలోని నీరు కూడా అడుగంటడం మొదలవుతుంది. ఇలాంటి సమయంలో, ఎవరైనా ఒక మానవుడు ఇతరుల దాహం తీర్చడానికి చల్లని నీటిని ఏర్పాటు చేస్తే—అది కోట్లాది పాపాత్ములకు ప్రాణదానం చేసినంత పుణ్యంతో సమానం.

అటువంటి వ్యక్తి నీ శిక్షకు అర్హుడు కాడు, యమా!”

**యమధర్మరాజుకు లభించిన గుణపాఠం**

యమధర్మరాజు అత్యంత వినయంతో ఇలా అడిగాడు:

“ప్రభూ! దీని అర్థం ఈ మాసంలో నా విధులన్నీ నిష్ప్రయోజనమైపోతాయనా?”

విష్ణువు చిరునవ్వుతో ఇలా అన్నారు:

“కాదు యమా! నీ విధులు ఎప్పటికీ నిష్ప్రయోజనం కావు. అయితే, ఈ మాసం అత్యంత విశేషమైన క్షమాగుణానికి ప్రతీక.

పాపాత్ములకు శిక్ష విధించే అధికారం నీకు ఉన్నట్లే, వారిపై కరుణ చూపించే అధికారం నాకు ఉంది.

వైశాఖ మాసంలో, నేను ఈ లోకంపై నా కరుణను మరింత విశేషంగా ప్రసరింపజేస్తాను.”

చేతులు జోడించి అత్యంత భక్తిశ్రద్ధలతో యమధర్మరాజు ఇలా అన్నాడు:

“ఓ విష్ణూ! నిజమే, ఈ మాసం మానవాళికి లభించిన ఒక గొప్ప వరం. వైశాఖ మాసం ఇంతటి అపారమైన ఆధ్యాత్మిక పుణ్యాన్ని ప్రసాదిస్తుందంటే—నేను కూడా ఈ పవిత్ర మాసానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.” విష్ణువు ఇలా ముగించారు:

“యమా! దేవతలలో, నీవు సాక్షాత్తు న్యాయానికి ప్రతిరూపానివి. అయితే, ఆ న్యాయం కరుణతో మేళవించినప్పుడే నిజంగా పరిపూర్ణమవుతుంది. వైశాఖ మాసం సరిగ్గా ఆ కరుణనే సూచిస్తుంది.” ప్రపంచ వాతావరణంలో ఒక మార్పు

ఆ రోజు నుండి, యమరాజు తన దూతలకు ఒక ఆదేశాన్ని జారీ చేశారు:

“వైశాఖ మాసంలో పవిత్ర స్నానాలు, దానధర్మాలు, పవిత్రమైన తులసి మొక్క సేవ మరియు తాగునీటిని అందించే సేవలలో నిమగ్నమయ్యే వారు ఎవరూ భయానికి గురికావలసిన అవసరం లేదు. వారు శ్రీ మాధవునికి అత్యంత ప్రియమైనవారు.”

యమదూతలు కూడా ఒక విషయాన్ని గమనించారు: భూమిపై ప్రజలు తెల్లవారుజామునే నిద్రలేచి పవిత్ర నదులలో స్నానాలు ఆచరిస్తున్నారు; బావుల వద్ద చల్లని నీటితో నింపిన మట్టి కుండలను ఉంచుతున్నారు; మరియు ఏ బాటసారి కూడా దాహంతో అలమటించకూడదని దృఢమైన సంకల్పాలు పూనుతున్నారు.

ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ ప్రజల కోసం నీటి కేంద్రాలు (చలివేంద్రాలు) ఏర్పాటు చేయబడుతున్నాయి.

మరియు నిజంగా—

నరక ద్వారాలు నిశ్శబ్దంగా మారిపోయాయి.

పాపం యొక్క ఛాయలు మసకబారిపోయాయి.

భూమిపై కరుణ, ధర్మం మరియు భక్తి పరిఢవిల్లాయి.

ఈ కథ యొక్క సారాంశం

ఆ సమయం నుండి, ఒక సంప్రదాయం వాడుకలోకి వచ్చింది:

వైశాఖ మాసంలో ‘మాధవుని’ ఆరాధన, పవిత్ర స్నానాలు, దానధర్మాలు మరియు నీటిని అందించే సేవలను ఆచరించడం ద్వారా, ఒక వ్యక్తి యమభయం నుండి విముక్తుడవుతాడు.

మానవ ఆత్మ తేలికగా, స్వచ్ఛంగా మరియు పవిత్రంగా మారుతుంది; దాని ప్రయాణం పాప లోకం వైపు కాకుండా, సాక్షాత్తు భగవంతుని దివ్య ధామం వైపు సాగుతుంది.

మరియు యమరాజు స్వయంగా ఇలా ప్రకటిస్తారు:

“వైశాఖ మాసంలో ఆర్జించిన ఆధ్యాత్మిక పుణ్యం సాక్షాత్తు దేవతలను కూడా స్పృశిస్తుంది.”

సుభాషితమ్

 🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


   శ్లో𝕝𝕝  *న వ్యాప్తిరేషా గుణినో*

           *గుణవాన్ జాయతే ధ్రువమ్* |

           *చన్దనోఽనలసన్దగ్ధో*

           *న భస్మ సురభిః క్వచిత్* ||


        *--- దృష్టాన్తకలికాశతకమ్ ---*


తా𝕝𝕝 *చందనం* సువాసనా భరితమైనప్పటికి, అది *అగ్నిచేత కాల్చబడినప్పుడు* దాని భస్మానికి ఆ *సువాసన ఎట్లుండదో*, అలానే *గుణవంతునికి గుణవంతులైన సంతానమే కలుగుతారనే నియమమేమీ లేదు*.... 🧘‍♂️🙏


✍️🌹💐🌸🙏

భాగవతం వింటే బాగవుతాం'*

 *'భాగవతం వింటే బాగవుతాం'*

శ్రీ పోతన భాగవత మధురిమలు 


(7-320-క.)

రత్నములను మత్కాంతా

రత్నంబుల బుచ్చికొన్న రక్కసు నురమున్

యత్నమున వ్రచ్చి వైచితి;

పత్నులు రత్నములుఁ గలిగి బ్రతికితి మీశా!


*భావము:-* ఓ దేవా! ఈశ్వరా! హిరణ్యకశిపుడు మా శిరోరత్నాలను, స్త్రీరత్నాలను లాక్కున్నాడు. ఆ రాక్షసుడి వక్షస్థలం వ్రక్కలుచేసి. ఓడించి, సంహరించావు. మా మణులూ, రమణులూ తిరిగి లభించేలా చేసి మమ్ము కాపాడావు.


శ్రీ ఆధ్యాత్మిక రామాయణ కీర్తనతో....... *శ్రీ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం*.... శుభోదయం.


*శ్రీ కృష్ణం వందే జగద్గురుం*

ధర్మో రక్షతి రక్షితః

వేద చరిత్ర

  వేద చరిత్ర (History of Vedas) – పూర్తి వివరణ

🔹 వేదాల ఆవిర్భావం (Origin of Vedas)

వేదాలు మనుషులు రచించినవి కావు. వాటిని “అపౌరుషేయం” అంటారు.

👉 ఋషులు దీర్ఘకాల ధ్యానం ద్వారా దైవ జ్ఞానాన్ని “శ్రవణం” చేసి పొందారు

అందుకే వేదాలను “శృతి” అని కూడా అంటారు (వినబడిన జ్ఞానం).

🔹 కాల నిర్ధారణ (Time Period)

వేదాల కాలం గురించి ఖచ్చితమైన తేదీ లేదు, కానీ పండితుల అభిప్రాయం ప్రకారం:

సుమారు క్రీ.పూ. 1500 – 500 మధ్య వేద సంస్కృతి విస్తరించింది

కొన్ని భారతీయ ఆచార్యులు దీనిని ఇంకా ప్రాచీనంగా (క్రీ.పూ. 3000+) భావిస్తారు

🔹 వేదాల వికాసం (Development)

మొదట ఒకే వేదం ఉండేది. తరువాత దాన్ని మహర్షి అయిన

వేదవ్యాస మహర్షి

నాలుగు వేదాలుగా విభజించాడు:

ఋగ్వేదం

యజుర్వేదం

సామవేదం

అథర్వవేదం

🔹 గురుకుల వ్యవస్థ (Oral Tradition)

వేదాలు చాలా కాలం వరకు లిఖితం కాలేదు.

👉 గురువులు శిష్యులకు:

మౌఖికంగా (మాటల ద్వారా)

ఖచ్చితమైన స్వరాలతో (ఘనపాఠం, జటాపాఠం)

బోధించేవారు

👉 అందువల్లే వేదాలు అచ్చుతప్పకుండా కాపాడబడ్డాయి

🔹 వేద కాలం విభజన

వేద చరిత్రను 4 దశలుగా చూడవచ్చు:

1. సంహిత కాలం

మంత్రాల సృష్టి

దేవతారాధన (ఇంద్ర, అగ్ని, వరుణ)

2. బ్రాహ్మణ కాలం

యజ్ఞాలు, కర్మకాండాలు

హోమ విధానాలు

3. ఆరణ్యక కాలం

అరణ్యాలలో ధ్యానం

తపస్సు, ఉపాసన

4. ఉపనిషత్తుల కాలం

ఆత్మ, బ్రహ్మ తత్వం

మోక్ష మార్గం

🔹 వేదాల రచన (Written Form)

మొదట మౌఖికంగా మాత్రమే ఉండేవి

తరువాత కాలంలో భూర్జపత్రాలు, తాళపత్రాలపై వ్రాయబడ్డాయి

ఆధునిక కాలంలో పుస్తకరూపంలో ప్రచురించబడ్డాయి

🔹 వేద సంస్కృతి ప్రభావం

వేదాలు భారతీయ సంస్కృతికి పునాది:

ధర్మం

సంస్కారాలు (ఉపనయనం, వివాహం)

యజ్ఞాలు

యోగా, ఆధ్యాత్మికత

👉 తరువాత వచ్చిన:

రామాయణం

మహాభారతం

పురాణాలు

ఇవన్నీ వేదాల ఆధారంగా అభివృద్ధి చెందాయి

🔹 ముఖ్య లక్షణాలు

✔ అపౌరుషేయం (దైవ మూలం)

✔ శృతి (వినబడిన జ్ఞానం)

✔ మౌఖిక పరంపర

✔ శాశ్వత జ్ఞానం

🔹 సారాంశం

👉 వేదాలు:

ప్రాచీన భారత జ్ఞాన సంపద

ఋషులు పొందిన దివ్య జ్ఞానం

గురుకుల పద్ధతిలో పరిరక్షించబడ్డాయి

వేదవ్యాసుడు వాటిని నాలుగుగా విభజించాడు

పంచాంగం 08.04.2026

  ఈ రోజు పంచాంగం 08.04.2026 Wednesday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాస కృష్ణ పక్ష షష్ఠి తిథి సౌమ్య వాసర మూల నక్షత్రం వరీయాన్ యోగః వణిజ కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

 

యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

  


శ్రాద్ధ తిథి: షష్ఠి


 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత

 -------------------- భగవద్గీత. -------------------

తృతీయోధ్యాయ: కర్మ యోగము.


 

 తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ ।

పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనమ్ ।। 41 ।।



ప్రతిపదార్థ:


తస్మాత్ — కాబట్టి; త్వం — నీవు; ఇంద్రియాణి — ఇంద్రియములను; ఆదౌ — మొదట్లోనే; నియమ్య — నియంత్రించి; భరత-ఋషభ — అర్జునా, భరతులలో శ్రేష్ఠుడా; పాప్మానం — పాపిష్టిదైన; ప్రజహి — సంహరింపుము; హి — నిజముగా; ఏనం — ఇది; జ్ఞాన — జ్ఞానము; విజ్ఞాన — అనుభవ జ్ఞానమును; నాశనం — నశింపచేసేటటువంటిది.



తాత్పర్యము : 


కాబట్టి ఓ భరత శ్రేష్ఠుడా, మొదట్లోనే ఇంద్రియములను నియంత్రణ లోనికి తెచ్చి, జ్ఞాన విజ్ఞానములను నశింపచేసే ఈ పరమ పాపిష్టి కామము (కోరికలు) అనే శత్రువును నిర్మూలించుము.



  వివరణ:


అన్ని అరిష్టములకు మూలకారణ మైన కామాన్ని ఎలా అధిగమించాలో ఇక శ్రీ కృష్ణుడు ఇప్పుడు వివరిస్తున్నాడు. కామము మానవ అత్మోద్దరణకు ఎంతో హానికరమైనది. కామము యొక్క నిక్షేప స్థానాన్ని గుర్తింపచేసిన శ్రీ కృష్ణుడు మొదట ఈ ఇంద్రియముల కోరికలను నిగ్రహించమంటున్నాడు. వాటిని పెంచుకోవటం మన దుఃఖాలకు మూలకారణం, వాటిని నిర్మూలించుకోవటం శాంతికి మార్గం. ఈ క్రింది ఉదాహరణని గమనించండి.


రమేష్, దినేష్ అనే ఇద్దరు సహ-విద్యార్థులు హాస్టల్లో ఒకే గదిలో ఉండేవారు. ఒక రోజు రాత్రి 10 గంటలకు రమేష్‌కి సిగరెట్టు తాగాలనే కోరిక కలిగింది. అతను అన్నాడు, ‘నాకు బాగా సిగరెట్టు తాగాలనిపిస్తోంది.’ అని.


దినేష్ అన్నాడు, ‘చాలా రాత్రయింది. సిగరెట్టు గురించి మర్చిపోయి పడుకో’ అని.


రమేష్ అన్నాడు ‘కాదు... కాదు... నేను పొగాకు పీల్చనిదే నిద్ర పోలేను’ అని.


దినేష్ నిద్ర పోయాడు, కానీ రమేష్ సిగరెట్టు కోసం బయటికి వెళ్ళాడు. అప్పటికే దగ్గరి కొట్లు మూసేశారు. చివరికి అతనికి సిగరెట్టు దొరికి, ధూమపానం చేసి హాస్టల్ కి తిరిగి రావటానికి రెండు గంటలు పట్టింది.


ఉదయాన్నే దినేష్ అతన్ని అడిగాడు, ‘రమేష్, ఎన్నింటికి పడుకున్నావు రాత్రి?’


‘మధ్యరాత్రి.’


‘నిజంగా! అంటే నువ్వు సిగరెట్టు కోసం రెండు గంటలు వ్యాకుల పడి, నీ ధూమపానం అయిన తరువాత మళ్లీ నువ్వు 10గంటలకు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితికి చేరుకున్నావు.’ అని.


‘అంటే, నువ్వనేదేమిటి’ అన్నాడు రమేష్.


‘చూడు, 10 గంటలప్పుడు నీకు సిగరెట్టు మీద ఎలాంటి కోరిక లేదు, అప్పుడు ప్రశాంతంగా ఉన్నావు. తర్వాత నీకు నీవే వాటి మీద కోరిక పుట్టించుకున్నావు. 10 గంటల నుండి మధ్యరాత్రి వరకు సిగరెట్టు కోసం పరితపించావు. చివరికి ధూమపానం చేసిన తరువాత, నీకునీవే పుట్టించుకున్న వాంఛ తీరింది, ఇక నిద్ర పోయావు. అదే నేను ఎలాంటి కోరికలు పుట్టించుకోలేదు, ఇక 10 గంటలకే ప్రశాంతంగా పడుకున్నాను.’


ఈ విధంగా, శారీరక ఇంద్రియ వస్తు/విషయముల కొరకై కోరికలను మనమే సృష్టించుకుంటాం, తరువాత వాటిచే ఉద్విగ్నతకు లోనవుతాము. మనకు కావలసిన వస్తువు చేజిక్కిన తరువాత మనంతమనమే సృష్టించుకున్న రోగం నిర్మూలించబడుతుంది, దాన్నే మనము ఆనందం అనుకుంటాము. కానీ, మనలని మనము జీవాత్మగా పరిగణించుకుంటే, మరియు ఆత్మ ఆనందమే మన లక్ష్యం అయితే, ఈ ప్రాపంచిక కోరికలను త్యజించటం సులువౌతుంది. తన ఇంద్రియములను నియంత్రణలోకి తెచ్చుకోమని అర్జునుడికి శ్రీ కృష్ణుడు ఉపదేశిస్తున్నాడు. ఆ విధంగా వాటిలో వసించే కామాన్ని నిర్మూలించవచ్చు. దీనిని సాధించటానికి, తదుపరి శ్లోకంలో చెప్పినట్టుగ్గా, భగవంతుడు మనకు ప్రసాదించిన ఉన్నతమైన పరికరములను వాడుకోవాలి.

బుధవారం రాశి ఫలితాలు

  శ్రీ గురుభ్యోనమః 🙏

08-04-2026 బుధవారం రాశి ఫలితాలు


మేషం


సమాజంలో విశేషంగా పలుకుబడి పెరుగుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. పాత మిత్రుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పొందుతారు . ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి.

---------------------------------------


వృషభం


ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. స్ధిరాస్తి వివాదాలకు సంబంధించి ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఉత్తమ ఫలితాలు పొందుతారు. విద్యార్థుల ఫలితాలు సంతృప్తి కలిగిస్తాయి.

---------------------------------------


మిధునం


కుటుంబ విషయంలో స్థిరమైన ఆలోచనలు చెయ్యలేరు. సన్నిహితులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ఒత్తిడి తప్పదు.

---------------------------------------


కర్కాటకం


దీర్ఘకాలిక ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో కలహా సూచనలున్నవి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. 

---------------------------------------


సింహం


గృహమున వివాహ శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఆశించిన స్థాన చలనాల కలుగుతాయి.

---------------------------------------


కన్య


ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. చేపట్టిన పనులు శ్రమతో కాని పూర్తికావు. ముఖ్యమైన వ్యవహారాలలో నమ్మినవారే మోసగిస్తారు. వ్యాపారమున అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

---------------------------------------


తుల


సోదరులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ విషయంలో జాప్యం కలిగిన అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు మరింత కష్టపడాలి.  

---------------------------------------


వృశ్చికం


దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. జీవితభాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. స్ధిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి.

---------------------------------------


ధనస్సు


వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. సమాజంలో విశేషమైన గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు అధికారుల అనుగ్రహంతో నూతన అవకాశాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

---------------------------------------


మకరం


బంధు మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత కలవరపెడతాయి. చేపట్టిన పనులలో నిదానంగా ముందుకు సాగడం మంచిది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు వలన విశ్రాంతి ఉండదు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

---------------------------------------


కుంభం


ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అవసరానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో ఇబ్బందులు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

---------------------------------------


మీనం


ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తికావు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. ఇంటా బయట వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా వేస్తారు.

---------------------------------------

రామాయణం - 29)

 శ్రీరామ ( వాల్మీకి రామాయణం - 29)

                (పరశురాముడు - 6)


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 

సర్వే జనాః సుఖినో భవన్తు 🙏

                              ----


       (7-4-'26 పోష్టు తరువాయి భాగము)


చాలామంది తెలియక,

' పరశురాముని గర్వభంగం ' అంటారు.

శ్రీమహావిష్ణువు అవతారమైన పరశురామునికి గర్వభంగం ఏమిటి ?


భూభారం అణచటానికి వచ్చిన భగవంతునిగా పురాణాలన్నీ పరశురాముని కీర్తిస్తున్నాయి.

పాలక వర్గమైన క్షత్రియ జాతి అధర్మవర్తనులైనప్పుడు వారిని శిక్షించేందుకు విష్ణువు పరశురాముడి ఉపాధి స్వీకరించాడు.


అయితే ఆ ఉపాధి ఋచీక మహర్షి క్షత్రియ స్వభావంతో కూడినవాని జన్మకొఱకు 

నిర్మించిన ' చరువు ' వల్ల ఏర్పడింది.


ఆ ఉపాధి దోషం తొలిగి పరశురాముడు బ్రహ్మజ్ఞాని అవటమే శ్రీరాముడు భార్గవరాముని నుండి వైష్ణవ ధనస్సును స్వీకరించడం అనే ఈ సంఘటన తాత్పర్యం.


శ్రీరాముడు, శీఘ్రమైనపరాక్రమముతో,

పరశురాముని చేతిలోని వైష్ణవ ధనస్సును గ్రహించి, బాణం సంధించాడు.

వెంటనే జగత్తంతా కంపించింది.

శ్రీరాముడు భార్గవరామునితో ఇలా అన్నాడు.


 "ఓ పరశురామా! నీవు బ్రాహ్మణుడవగుట చేతను,

 విశ్వామిత్రునకు బంధువు వగుట చేతను,

 నాకు పూజ్యుడవు. 

అందువలన, నీ ప్రాణములు హరించేందుకు ఈ శరాన్ని, ప్రయోగింపజాలను.


శ్లో//ఇమాం పాదగతిం రామ తపోబల సమార్జితాన్/

లోకా న ప్రతిమాన్వా తే హనిష్యామి యదిచ్ఛసి//


(భార్గవరామా! నీ పాదగమన శక్తిని గాని,

తపోబలముతో నీవు సంపాదించుకున్న,సాటిలేని ఉత్తమ లోకములను గాని,

ఈ బాణముతో కొట్టివేసెదను.

నీకు ఏది ఇష్టమో చెప్పుము).


దివ్యమైన ఈ వైష్ణవ శరము వ్యర్ధమగుటకు వీలు లేదు, అన్నాడు.


ఆ విధంగా శ్రీరాముడు వైష్ణవ ధనస్సును స్వీకరించగానే, అవతార ప్రయోజనము పూర్తి అయిన పరశురాముడు నిర్వీర్యుడైనాడు.


శ్లో// జడీకృతే తదా లోకే రామే వర ధనుర్ధరే/

నిర్వీర్యో జామదగ్న్యో౽సౌ రామో రామ ముదీక్షత//


(రాముడు, శ్రేష్ఠమైన ఆ ధనస్సును ఎక్కుపెట్టగానే, అత్యంత ప్రభావంతో కూడిన ఆ దివ్య వైష్ణవ శరమును చూచి లోకమంతా భయపడి, స్తంభించి పోయింది. పరశురాముడు నిర్వీర్యుడు అయిపోయినాడు.

ఆయన రామునివంక అత్యాశ్చర్యముతో చూచాడు).


క్షత్రియులపై ద్వేషం వల్ల ఉత్పన్నమైన పరశురాముడి అజ్ఞానం తొలగిపోయింది.

ఆయనలో జ్ఞానం భాసించింది.

ధర్మరక్షణకు అవతరించిన శ్రీ మహావిష్ణువే రాముడని పరశురాముడు అప్పుడు గ్రహించాడు.


రామునకు నమస్కరించాడు.


శ్లో//అక్షయ్యం మధుహన్తారం జానామి త్వాం సురేశ్వరమ్/

ధనుషో౽స్య పరామర్శాత్ స్వస్తితేస్తు పరంతప//


(ఈ ధనస్సును గ్రహించుటవల్ల, నీవు అక్షయుడవు, మధువు అనే రాక్షసుని సంహరించిన వాడవు, సర్వదేవతలకు ఈశ్వరుడవు అయిన శ్రీమహావిష్ణువు వని తెలుసుకొన్నాను. ఓ పరంతపా! నీకు స్వస్తియగుగాక.)


త్రిలోకనాధుడవైన నీ చేత నిర్జింపబడటం వల్ల నేను సిగ్గుపడటం లేదు. 


అదృష్టంగా భావిస్తున్నాను.


ఈ భూమిని కశ్యపునకు దానమిచ్చినందున నేను మహేంద్ర పర్వతముపై నివసిస్తున్నాను. 

నేను అక్కడకు వెళ్ళాలి. అందువల్ల నా గమన శక్తిని నశింపజేయవలదు.


నీ బాణం ప్రయోగించి నేను తపశ్శక్తితో సంపాదించిన పుణ్యలోకాలు నశింపజేయుము,అన్నాడు.


బ్రహ్మజ్ఞానికి, పుణ్యము, పాపము, రెండూ ఉండకూడదు కాబట్టి, పరశురాముని కోరిక ప్రకారము, రాముడు ఆ పుణ్యలోకాలనన్నింటినీ బాణప్రయోగంతో నశింపజేశాడు.


పరశురాముడు, దశరథ రాముని స్తోత్రం చేసాడు.


ప్రదక్షిణము చేసి మహేంద్రపర్వతానికి వెళ్ళిపోయాడు.


శ్రీమద్భాగవతంలో శుక మహర్షి పరీక్షిన్మహారాజుకు ఈ విధంగా చెబుతున్నారు.


"ఓ మహారాజా!వంశోద్ధారకుడైన పుత్రుడు పరశురాముని వల్ల, జమదగ్ని మహర్షి సంకల్ప శరీరం పొంది,తన తపోబలంతో ఆకాశంలోని సప్తర్షి మండలంలో ఏడవ ఋషిగా వెలుగొందుచున్నాడు.


శ్లో// జామదగ్న్యో౽పి భగవాన్ రామః కమలలోచనః/

ఆగామిన్యంతరే రాజన్ వర్తయిష్యతి వై బృహత్//

( ఓ పరీక్షిన్మహారాజా! భగవంతుడు,కమలముల వంటి నేత్రములు గల వాడు,జమదగ్ని పుత్రుడు, అయిన పరశురాముడు రాబోయే మన్వంతరంలో సప్తర్షులలో ఒకడై వేదములను ప్రవర్తింపజేస్తాడు)


 పరశురాముడు చిరంజీవి.


ఈనాటికీ, ప్రసన్నమైన అంతఃకరణముతో భక్తులను అనుగ్రహిస్తూ మహేంద్ర పర్వతంపై ఉన్నాడు.


దేవతలు, సిద్ధులు, గంధర్వులు,చారణులు, ఆయన చరితమును కీర్తిస్తూ ఉంటారు.


పోతన మహాకవి ఇలా అంటున్నారు.


క// ఆ జమదగ్ని తనూజుడు,రాజీవాక్షుండు, ఘనుడు,రాముడధికుడై/

యోజను వేదర్షులలో,రాజిల్లెడు మీది మనువు రా నవ్వేళన్//

(వచ్చే మన్వంతరంలో ఆ జమదగ్ని తనూజుడు,కమల నేత్రుడు అయిన పరశురాముడు, సప్తర్షులలో ఒకడై ప్రకాశిస్తాడు).


ఆ// శాంత చిత్తుడగుచు, సంగ విముక్తుడై,భవ్యుడై, మహేంద్ర పర్వతమున/

నున్నవాడు రాముడోజతో గంధర్వ, సిద్ధవరులు, నుతులు సేయుచుండ//


(గంధర్వులు, సిద్ధులు,తన పవిత్ర చరితమును గానం చేస్తుండగా,ఆ పరశురాముడు ఐహిక బంధములన్నింటి నుండీ విముక్తుడై, ప్రశాంత చిత్తంతో, తేజోవంతుడై, ఇప్పటికీ మహేంద్ర పర్వతంపై తపస్సులో నిమగ్నుడై ఉన్నాడు).


           🙏 శ్రీ పరశురామాయ నమః🙏


                  శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.

                   ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః


       శ్లో// స్వస్తి:ప్రజాభ్య:పరిపాలయంతాం/

              న్యాయ్యేన మార్గేణమహీం మహీశా:/

              గో బ్రాహ్మణేభ్య:శుభమస్తు నిత్యం/

              లోకా: సమస్తాః సుఖినో భవంతు//



(సశేషం)

శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

8-4-'26.

వినడం నేర్చుకుందాము

 🤫 *వినడం నేర్చుకుందాము* 🤫


సభ్యులకు నమస్కారములు.


*శ్రోతుమిచ్ఛామి శుశ్రూషా*. వినాలి అను కోరిక కల్గి ఉండడాన్ని శుశ్రూషా అని అంటారు. శుశ్రూష (సేవ, విను ఇచ్చ) *తక్కువ* మాట్లాడమని, *తక్కువ* తినమని, *ఎక్కువగా* వినమని సూచిస్తూ భగవంతుడు *ఒక* నోటిని, *రెండు* చెవులను మనకిచ్చాడు. తల్లి పలికే మాటలను, ఆమె నేర్పించే శబ్దాలను వినడం వల్లనే ప్రతి వ్యక్తి భావ వ్యక్తీకరణకు అవసరమయ్యే భాషను అభ్యసించగలుతున్నాడు. తత్వ దృష్టలైన మహాత్ములు ఉపదేశించే హితోపదేశాలను వినగలిగితే మానవ జన్మకు సార్థకత ఏర్పడుతుంది. అవుతే, వినాలనే ఆసక్తికలవారు లభించడం అంత సులువు కాదు. 


*శతేషు జాయతే శూర:, సహస్రేషుచ పండిత:, వక్తా దశ సహ్రేషు, శ్రోతాభవతి వానవా*

అర్థం:- వందలలో ఒక్కడైనా శౌర్య పరాక్రమాలు కలవాడు లభిస్తాడు. వేలల్లో ఒక్కడైనా పండితుడు కాగల్గుతాడు. పది వేల మందిలో ఒక్కడైనా ఆకర్షణీయంగా మాట్లాడగల్గే సామర్థ్యాన్ని కలిగి వక్తగా రాణిస్తాడు. కాని, మనసు లగ్నం చేసి సంపూర్ణమైన ఏకాగ్రతతో తత్వాన్ని, హితాన్ని వినగలిగే *ఉత్తమ శ్రోత* లక్షల్లో *ఒకరైనా లభిస్తారో లేదో* చెప్పలేము అని పై సూక్తి తెలియజేస్తుంది. 


Listening skills are more important than communication skills. అని పెద్దలంటారు. శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. *సగం సమస్యలు మాటల కంటే సరిగ్గా వినకపోవడం వల్లే వస్తాయి*.ఎదుటి వారు మాట్లాడుతూ ఉంటే వెంటనే కల్పించుకునే అలవాటు మానుకోవాలి. అవతలి వారు చెప్పేది పూర్తిగా, సహనంగా వింటే సగం సమాధానాలు అందులో మనకు లభిస్తాయి.


అమూల్యమైన విషయాలను, తత్వ రహస్యాలను, హితోపదేశాలను వినాలనే కోరిక (శుశ్రూష) కలవారు అరుదుగా లభిస్తారని, శ్రద్ధగా వినగల్గే వారు తమను తాము ఉద్దరించుకోవడమే గాకుండా మరెందరినో ఉద్ధరించగలరని మన పెద్దలు ఉద్బోధించారు. *అందుచేత మనమందరం సుభాషితాలను శ్రద్ధగా విను అభిలాషను కల్గి ఉండే ప్రయత్నం చేద్దాం*.


ధన్యవాదములు

వివేక చూడామణి

 గ్రంథకర్త: జగద్గురు ఆది శంకరాచార్యులు


వివేక చూడామణి గ్రంథాన్ని రచించినది ఆది శంకరాచార్యులు. ఈయన గొప్ప తత్వవేత్త మరియు సంస్కర్త.


 'వివేక చూడామణి' అంటే 'వివేకము అనే రత్నాలలో శిరోరత్నం వంటిది' అని అర్థం. 


ఇది ఒక ప్రకరణ గ్రంథం, అంటే వేదాంత సారాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా ప్రశ్నోత్తర రూపంలో వివరించే అద్భుతమైన కావ్యం.



ఆధ్యాత్మిక సిద్ధాంతం: అద్వైత వేదాంతం

శంకరాచార్యులు స్థాపించిన (ప్రచారంలోకి తెచ్చిన) సిద్ధాంతం అద్వైతం. 


"అద్వైతం" అంటే 'రెండు కానిది' అని అర్థం. దీని ముఖ్య ఉద్దేశం జీవాత్మ, పరమాత్మ వేరు వేరు కాదు, రెండూ ఒక్కటే అని నిరూపించడం.


అద్వైత సిద్ధాంతంలోని ముఖ్య అంశాలు:

బ్రహ్మ సత్యం జగన్మిథ్యా: పరబ్రహ్మం మాత్రమే శాశ్వతమైన సత్యం. మన కళ్ళకు కనిపించే ఈ భౌతిక ప్రపంచం మార్పు చెందేది, కాబట్టి ఇది 'మిథ్య' (అంటే అశాశ్వతం లేదా సాపేక్ష సత్యం).


జీవో బ్రహ్మైవ నాపరః: ప్రతి జీవిలో ఉన్న ఆత్మ నిజానికి ఆ పరబ్రహ్మ స్వరూపమే. అజ్ఞానం (అవిద్య) వల్ల మనం మనల్ని దేహంగా భావిస్తున్నాం, కానీ జ్ఞానం కలిగినప్పుడు మనం బ్రహ్మమేనని అర్థమవుతుంది.


మాయ: ఒక తాడును చూసి పాము అని భ్రమపడినట్లు, మాయ వల్ల మనం ఏకైక సత్యమైన బ్రహ్మాన్ని అనేక రూపాలున్న ప్రపంచంగా చూస్తున్నాం. ఈ మాయను తొలగించుకోవడమే మోక్ష మార్గం.


ఈ గ్రంథంలో శంకరాచార్యులు మోక్షాన్ని పొందేందుకు మూడు మెట్లు అవసరమని చెప్పారు.


శ్రవణం - గురువు ద్వారా వేదాంత వాక్యాలను వినడం.


మననం - విన్న విషయాలను తర్కంతో ఆలోచించి రూఢి చేసుకోవడం.


నిదిధ్యాసన - తెలుసుకున్న సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ధ్యానం చేయడం.


చివరగా, "ఆత్మజ్ఞానం" ద్వారా మాత్రమే మనిషి జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది పరమానందాన్ని పొందుతాడని ఈ గ్రంథం బోధిస్తుంది.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - చైత్ర మాసం - కృష్ణ పక్షం - ‌షష్టి - మూల -‌‌ సౌమ్య వాసరే* (08.04.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.




 

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*