13, మే 2021, గురువారం

అక్షయ తృతీయ

 తెలుసుకోండీ...12521

తెలియజేయండీ....

*అక్షయ తృతీయ* 2/2


           ‌      ఇక వనవాసంలో ఉన్న పాండవులు శ్రీకృష్ణుడి కృప వల్ల అక్షయ పాత్రను పొందిన రోజూ కూడా ఇదే. అందుకే ఈనాడు భగవంతునికి అర్పించినదేదైనా అమిత ఫలాలనిస్తుందనీ, కొనుగోలు చేసినది ఏదైనా అక్షయమై నిలుస్తుందనీ భక్తులు నమ్ముతారు. 


ప‌విత్ర‌మైన రోజు

చైత్ర శుద్ధపాడ్యమి, ఆశ్యయుజ శుద్ధ దశమి (విజయదశమి), వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) ఈ 3 రోజులూ హిందువులకు పవిత్రమైనవి. హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... ఈ 3 రోజులూ తిథి సంపూర్ణంగా ఉంటుంది. అక్షయ తృతీయను నవన్న పర్వం అని కూడా అంటారు. అక్షయ తృతీయ రోహిణి నక్షత్రం నాడు వస్తుంది.


 ఈ తిథి ఇంటికి శుభాలను, విజయాలను చేకూర్చుతుందని హిందువుల విశ్వాసం. ఈ రోజు కనక ఎవరికైనా దానం చేస్తే, భగవంతుడు వారికి వరాలనిస్తాడని, ఆశీర్వాదాలు అందచేస్తాడని విశ్వసిస్తారు. నూత‌న కార్యాలు ఆరంభించడానికి ఈ తిథిని అమోఘమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజున ప్రారంభించిన పని అక్షయంగా వృద్ధిచెందుతూ ఉంటుందని ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.


ఈ రోజున ఉపవాసం ఉండి, విష్ణుమూర్తిని బియ్యపు గింజలతో పూజిస్తారు. ఈ రోజున గంగలో స్నానం చేస్తే మంచిదని పండితులు చెబుతారు. ఈ రోజు జ్ఞానసముపార్జన చేయాలనుకున్నా, దానాలు చేసినా ఎంతో ఫలవంతం అవుతుందని ప్రతీతి. ఈ రోజు బియ్యం, ఉప్పు, నెయ్యి, పంచదార, కూరలు, చింతపండు, పండ్లు, బట్టలు... ఏది దానం చేసినా మంచిదే. బెంగాలీయులు ఈ తిథినాడు ఎన్నో హోమాలు నిర్వర్తిస్తారు. వినాయకుడికి, లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. సుదర్శన కుబేర యంత్రాన్ని పూజించడం ఆనవాయితీ. ఇక‌ పెళ్ళిళ్లకు కూడా అద్భుతమైన ముహూర్తంగా పరిగణిస్తారు.


సర్వంశ్రీపరమేశ్వరార్పణమస్తు.

 శైలజావాస్తుజ్యోతిషాలయము  9059743812⁠⁠⁠⁠

భౌతికం- అభౌతికం

మనం ఏదైతే కాంతితో చూస్తామో దానిని భౌతికం అని అంటాము అంటే పదార్ధ సమ్మేళిత ప్రపంచం  అంటే meterialistic world మనం ఈ ప్రపంచంలో ఎన్నో విషయాలను చూస్తున్నాము.  అందులో కొన్ని చెలించేవి కొన్ని చెలించనివి. సాధారణంగా మనం చెలించే వాటిని జీవులు అంటాము. ప్రతి జీవి కూడా మూడు దశలు కలిగినట్లు మనకు తెలుస్తుంది అది పుట్టుక రెండు పెరుగుదల లేక మార్పు చెందటం మూడు నశించటం. పుట్టినప్పుడు ప్రతిదీ సుక్మా రూపంలో ఉండి కాలాంతరంలో మార్పు చెందుతూ తన పరిమాణంను మార్చుకుంటూ అంటే వృద్ధి చెందుతూ వుంది ఒకరోజు తన జీవితాన్ని వదులుతున్నది దానినే మనం మరణం అంటున్నాము. ఇదంతా మన కంటి ముందు జరుగుతున్న విషయం  - 

ఇక రెండవది అభౌతికం అంటే మన కంటి ముందు ఉండి కూడా మన కంటికి కనపడకుండా వుంటున్నది. దానినే మనం శక్తి అనికూడా అనవచ్చు. మనం నిత్యం అనేక రకాలైన శక్తులను అనుభవంలోకి తీసుకుంటున్నాము. మన ఎదురుగా ఒక రాగి తీగ వుంది అది మన కంటికి కనపడుతూ వున్నది. కానీ మన కంటికి కనపడకుండా దానిలో దాగి విద్యుత్ శక్తి వుంది. మనకు కనపడక పోయిన దాని ఉనికిని మనం చూడగలుగుతున్నాము. అంటే ఆ రాగి తీగను ఒక విద్యుతు బలుపుకు కలిపితే అది ప్రకాశిస్తుంది, ఒక ఫ్యానుకు కలిపితే అది తిరిగి మనకు గాలిని ఇస్తున్నది. తీగలో విద్యుతు మన కంటికి కనిపించలేదని మనం విద్యుతు లేదని అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. 

మనం చూసే ప్రతి వస్తువుకు ఏదో ఒక రకమైన శక్తి వుంది.  కానీ దానిని మనం చూడలేము. ఆ శక్తి బహిర్గతం అయ్యే సమయం వచ్చినప్పుడు మాత్రమే మనం ఆ శక్తిని గమనించగలము. ఒక రాయి ఉందనుకోండి అది చూడటానికి ఒక జడ పదార్ధంగానే గోచరిస్తుంది.  కానీ నీవు ఆ రాయిని ఒక మామిడి చెట్టు మీద విసిరితే అది అక్కడి మామిడి కాయ తొడిమను తెంపి కాయ కింద పడేటట్లు చేస్తుంది. ఇక్కడ మనం రెండు విషయాలను గమనించాలి జడంగా వున్న రాయి నీవు విసిరినప్పుడు శక్తిని పుంజుకొని కాయ తొడిమను తెంపి వేసింది అంటే ఆ రాయి శక్తి ఆ పని చేయటానికి తోడ్పడింది. ఆ శక్తి ఎక్కడిది నీ చేతిలోంచి వచ్చిందనుకుందాం. అప్పుడు నీవు రాయి లేకుండా చేయి విసిరితే కాయ తెగాలికదా కానీ అట్లా తెగలేదు.  అంటే నీవు నీచేతితో ఇచ్చిన శక్తిని పుంజుకొని రాయి వేగంగా చెట్టు కొమ్మను తాకింది. ఈ ప్రక్రియ మనకు చాలా సాధారణంగానే కనపడుతుంది కానీ లోతుగా ఆలోచిస్తే మనకు శక్తికి సంబందించిన విషయాలు తెలుస్తాయి. ఇక రెండో విషయం ఏమిటంటే ఎప్పుడైతే తొడిమ తెగిందో అప్పుడు చెట్టు నుండి కాయ రాలి పడింది. అంటే చెట్టునుండి కాయాను రాలకుండా తొడిమ పట్టుకుంది.  అంటే తొడిమకు కాయకు మధ్య ఏదో ఒక శక్తి కాయ రాలకుండా చూస్తున్నది. ఈ విధంగా మనం రోజు ఎన్నో శక్తులను గమనిస్తున్నాము. కొండమీద వున్న నీరు జలపాతరూపంలో   క్రిందికి జాలువారుతుంది.  మరి ఏ శక్తి ఆ నీటిని క్రిందికి కదలటానికి సహకరిస్తుంది. నదిలో నీరు ప్రవహించటానికి ఏ శక్తి కారణం. విత్తుగా వున్న గింజ భూమిలో తేమతో మొలకెత్తటానికి ఏ శక్తి కారణం. ఇలా ఆలోచిస్తూ పొతే మనకు అనేక శక్తులు అనుభవంలో వస్తున్నాయి.  \

మన ఆధునిక విజ్ఞాన శాస్త్రం కొన్ని శక్తులను తెలుసుకొని వాటిలో ఎన్నో పేర్లు పెట్టి ఉండవచ్చు. గురుత్వాకర్షణ శక్తి, కైనెటిక్ శక్తి అని ఏవేవో అనవచ్చు. కానీ మన ఆధునిక శాస్త్రాజ్ఞులకు బోధపడని అనేక శక్తులు మనకు కనపడుతున్నాయి. 

మన మహర్షులు వారి దివ్య జ్ఞానంతో ఇప్పుడు మనం చూసిన శక్తులకన్నా విశేషంగా అనేక శక్తులను కనుగొన్నారు.  ఆ శక్తుల పరాకాష్ట పరా బ్రహ్మగా గుర్తించారు. ఆ పరబ్రహ్మను చేరుకోవటానికి అన్వేషించారు. 

ఇంకా వుంది. 

పాకుతూ వెళ్ళింది

 "ఇటే పాకుతూ వెళ్ళింది" అన్నారు.


అందరు కంగారుగా అటు వెళ్ళారు.


"డిపార్టుమంటు వాళ్ళకు ఫోన్ చెయ్యండి" అన్నారెవరో ....


"వద్దొద్దు .... " అన్నారు మరెవరో.


అందరిలోనూ ఆందోళన, కంగారు, భయం ....


"ఇప్పుడే చూసామండి .... ఇటే పాకుతూ వెళ్ళింది" అన్నాడొకాయన.


ఆ వైపు వెళ్ళారు ....


జాగ్రత్తగా వెదికారు. కనిపించలేదు,


మళ్ళీ అందరిలో ఆందోళన, కంగారు, భయం ....


"ఎటెళ్ళుంటుందో?" అన్న అనుమానం ప్రతి ఒక్కరి ముఖంలో స్పష్టంగా కనపడుతోంది.


"జాగ్రత్త బాబు, అటువైపు స్లోపుగా ఉంది" అన్నాడొక పెద్దాయన.


"పర్లేదులెండి .... " అన్నాడతను.


ఆమెకు కూడా ఆందోళన, కంగారు, భయం ....


అక్కడంతా పొదలు గుబురు గుబురుగా ఉన్నాయి.


"జాగ్రత్తండీ, ముళ్ళ పొదలు" అన్నది ఆమె.


చేతి కఱ్ఱతో పొదల్ని కదిలించాడు. ఎటువంటి అలికిడి లేదు.


మళ్ళీ వెనక్కి వచ్చాడతను. ఆయనతో పాటు ఆమె కూడా వచ్చింది.


అందరిలోను అదే ఆందోళన, అదే కంగారు, అదే భయం ....


'ఇంతలో ఎలా మాయమయింది?' అన్న ప్రశ్న అందరిలోను ఆందోళన కలిగిస్తోంది.


'కనపడకపోతే ఏం చెయ్యాలి?' అన్న ప్రశ్న అందరిలో ఉదయించింది.


ఇంతలో గేటు తీసుకుని ఒక వ్యక్తి లోపలకు వచ్చాడు.


అతడి చేతిలో ఉన్న పాప ఒక్కసారిగా 'ఆమా' అంటూ ఆమె చేతిలోకి దూకింది.


('పాక్కుంటు వెళ్ళేవన్నీ పాములు కావు. భయపడకండి')

సభ్యులకు గమనిక

మన సభ్యులు కొంతమంది వారి గుర్తింపుని గోప్యంగా ఉంచి కామెంట్లు చేస్తున్నారు. అటువంటి కామెంటలు అంగీకరించ బడవు. కాబట్టి. ప్రతి సభ్యుడు ఏదైనా కామెంటు చేసేముందు ముందుగా ఫాలోవర్ అయి తదుపరి వారి కామెంటును వారి పేరు, నివాసముతొ పాటు పోస్టు చేయగలరు. తద్వారా ఇక్కడ ఎవరు ఎక్కడి నుండి కామెంటు చేస్తున్నారో సభ్యులందరికి తెలియగలదు. గమనించ గలరు. 


గురువు లేకుంటే

 గురువు లేకుంటే వచ్చిన నష్టమేమిటి?

ఓ మహానగరంలో ఓ గురువుగారు తన వద్దకు వచ్చేవారికి ఆధ్మాత్మిక శిక్షణ ఇస్తూ, ధర్మప్రబోధం చేస్తుండేవారు. మహాసంపన్నుడొకడు ఈ గురువుగారి దగ్గరకు వచ్చి అసలు గురువు అవసరమా?

గురువు లేకుంటే వచ్చిన నష్టమేమిటి? అని ప్రశ్నించాడు.

గురువుగారు నవ్వుకుని, మీరేం చేస్తుంటారని అడిగారు.

నాకు అతిపెద్ద సూపర్ బజార్ ఉంది అని సమాధానమిచ్చాడు సంపన్నుడు.

అయితే! ఒకసారి మీ సూపర్ బజార్ కు నన్ను తీసుకువెళ్లండని గురువుగారు అడిగారు.

ఇద్దరూ కలిసి సూపర్ బజార్ కు వెళ్లారు. ఆ రోజు సెలవు కావడంతో నిర్మానుష్యంగా ఉంది.

ఏడంతస్థుల పెద్ద భవంతి. అందులో దొరకనిదంటూ ఉండదు. దానిని చూసిన గురువుగారు నవ్వుకున్నారు.

అక్కడే ఈ సంపన్నుడు ఆవులను, కుక్కలను పెంచుతున్నాడు.

ఆ మందలోంచి ఒక ఆవును సూపర్ బజార్ లోపలికి వదలవలసిందిగా గురువుగారు కోరారు.

కోరినట్లుగానే ఆవును లోపలికి ప్రవేశపెట్టారు. అది అన్నీ తిరుగుతూ, తిరుగుతూ చివరకు ఒక మూల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఉన్న పండ్ల దుకాణంలోకి వెళ్లింది. కడుపునిండా , తృప్తిగా మేసింది. రెండుగంటల వ్యవధిలో తిరిగి వచ్చేసింది.

తదుపరి తను పెంచుతున్న కుక్కను లోపలికి వదలమని కోరారు గురువుగారు. దానిని కూడా లోపలికి పంపారు. అది కూడా తిరుగుతూ, తిరుగుతూ వాసన చూస్తూ, మూడవ అంతస్థులో మాంసం అమ్మే దుకాణంలోకి వెళ్లింది. తృప్తిగా తినేసింది. మూడు గంటల వ్యవధిలో అది కూడా తోక ఊపుకుంటూ యజమాని దగ్గరకు వచ్చేసింది.

ఈసారి ఒక సామాన్యుడిని పిలిచి, నీకు నచ్చినన దానిని తీసుకో అని చెప్పి పంపారు గురువు.

ఉత్సాహంతో లోపలికి ప్రవేశించిన మనిషి అన్నింటినీ చూసి, ఉక్కిరిబిక్కిరైపోయాడు. ఏం తీసుకోవాలో అర్ధం కావటం లేదు.

రెండు, మూడు, నాలుగు గంటలు గడిచిపోయినా బయటకు రావడం లేదు. అందరూ ఆశ్చర్యపోయారు.

గురువుగారు యజమానిని కలిసి అతడున్న చోటకి చేరుకున్నాడు. నెత్తిమీద చేతులు పెట్టుకుని దిక్కులు చూస్తున్న ఆ వ్యక్తికి ఏం కావాలో అర్ధం కావడం లేదు. ఈ వస్తులన్నింటినీ చూస్తుంటే పిచ్చెత్తిపోతోంది అన్నాడు ఆ వ్యక్తి.

దీనిని విన్న సంపన్నుడు అవాక్కయ్యాడు.

ఆవుకీ, కుక్కకీ పిచ్చెక్కలేదు. వాటికి ఏం కావాలో వెతుక్కుని తృప్తిగా ఆరగించి వచ్చాయి.

మనిషి మాత్రం ఏం కావాలో తనకే తెలియదు. తనకే అన్ని తెలుసనుకుంటాడు.

పాపం! అందుకే వీడికి గురువు కావాలి.

ఎలా జీవించాలో జీవిత ఔన్నత్యాన్ని ఎలా పొందాలో తెలుసుకోవాలి.

అందుకే వాటిని తెలియజెప్పే గురువు అత్యంత అవసరమని గురువుగారు చెప్పడంతో యజమానికి ధనగర్వం తొలగింది.

గురువుతోనే గమ్యం సాధ్యమని తెలుసుకున్నాడు.

టెలిగ్రామ్’ ద్వారా (గురుగీత) పొందాలనుకునేవారు:

HTTPS://T.ME/GURUGEETA

"B12 విటమిన్

 *మనం తినే ఆహారంలో "B12 విటమిన్" లోపం వల్ల కూడా 'కరోనా' దాడి*


 ఈ పోస్ట్ చదవటం మిస్ కావొద్దు. *దయచేసి "ముఖ్యంగా శాకాహారులు" మీ బంధువులతో స్నేహితులతో ఈ విషయాల్ని పంచుకోండి.* నాకు క్రెడిట్ వద్దు. నా పేరు పెట్టాల్సిన అవసరం లేదు. జనాలకు మంచి జరిగితే చాలు . ప్రాణాలు పోకుంటే  చాలు . 


*సైటోకిన్ స్ట్రామ్.. ఈ మాట ఎప్పుడైనా విన్నారా?* మన ప్రముఖ గాయకుడు మరణించడానికి ప్రధాన కారణం అర్థం చేసుకున్నారా ? కరోనా కారణంగా శాఖాహారుల్లో ఎక్కువ మరణాలు ఎందుకు జరుగుతున్నాయో ఆలోచించారా ?


కరోనా కారణంగా వృద్దులకు తప్పించి యువకులకు పెద్దగా అపాయం లేదు అని నేను గత సంవత్సరం ఏప్రిల్ లో అనుకొనే వాడిని . అప్పుడు పేస్ బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా కొంత మంది మిత్రులు కరోనా కారణంగా కొంత మంది తమకు తెలిసిన యువకులు చనిపోవడాన్ని నాకు తెలియచేసారు . 


*నేను మెడికల్ ఆంథ్రోపాలజీ బోధకుడిని. అంటువ్యాధులు, పోషకాహారం గురించి లోతైన అధ్యనం చేసినవాడిని.* మన చుట్టూరా జరుగుతున్నది ఏమిటో అర్థం చేసుకొనే ప్రయత్నం చేశాను . 


 కరోనా మరణాలకు కారణం రక్తం లో గడ్డలు కట్టడం ఒకటైతే సైటోకిన్ స్ట్రామ్ రెండవది . 


సైటోకిన్ స్ట్రామ్ అంటే మన రక్షక వ్యవస్థ CONFUSE  అయ్యి వైరస్ కు బదులుగా మన అంగాలు { గుండె ఊపిరి తిత్తులు మొదలైన వాటి పై దాడి చెయ్యడం . దీనితో గుండె పోటు , ఊపిరి తిత్తులు పాడైపోవడం జరుగుతుంది . దీని తొందరగా గుర్తిస్తే స్టెరాయిడ్ ఇస్తారు . స్టెరాయిడ్ తో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి . ప్రముఖ గాయకుడూ చెన్నై ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే నాటికి అక్కడ స్టెరాయిడ్ ఇచ్చే ప్రోటోకాల్ లేదు . అయన హైదరాబాద్ లో చేరి ఉంటే సజీవంగా   ఉండేవారని అప్పుడే నేను పోస్ట్ పెట్టాను . అప్పటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టెరాయిడ్ ఇవ్వడం జరుగుతోంది . సరే ఈ వివాదాన్ని పక్కన పెడుదాము . ఇప్పుడు పాయింట్ లోకి వద్దాము . 


నేను ఏప్రిల్ మే నెలలో గమనించింది ఏమిటంటే *శాఖాహారుల్లో మాత్రమే ఎక్కువగా ఈ సైటోకిన్ స్ట్రామ్ వస్తోంది. శాఖాహారుల్లో బి 12 లోపం ఉంటుంది అని నాకు తెలుసు. *నన్ను హైదరాబాద్కు చెందిన కొందరు ఆర్య వైశ్య మరియు బ్రాహ్మణ ప్రముఖులు జూన్ నెలలోనే  జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా వారి కుటుంబ సభ్యులను ఎడ్యుకేట్ చేయమని కోరారు . అప్పటికే బి 12  లోపానికి సైటోకిన్ స్ట్రామ్ కు మధ్య ఉన్న సంబంధం నాకు అర్థం అయ్యింది . శాఖాహారం ద్వారా బి 12 విటమిన్ అందదు . దయ చేసి బి 12  టాబ్లెట్స్ తీసుకోండి అని చెప్పాను. అలాగే అనేక మంది శాఖాహార మిత్రులకు సూచించాను . ఆలా తీసుకొన్న వారు కరోనా   బారిన పడినా సులభంగా కోలుకున్నారు . ఒక్కరంటే ఒక్కరికి సీరియస్ కాలేదు .* 


అప్పటినుంచి ఇప్పటిదాకా కనీసం వెయ్యి ఉదహారణలు . నా సూచన మేరకు బి 12  తీసుకొన్న వారు కరోనా సోకినా మైల్డ్ లక్షణాలతో బయట పడ్డారు . మరణాలు జరిగిన అనేక కేసులను నేను విశ్లేషించాను . యువకులు మరణిస్తున్నారు అంటే అది సైటోకిన్ స్ట్రామ్ వల్లే .. దాని వల్ల గుండె పోటు ... ఊపిరి తిత్తులు పాడై పోవడం జరుగుతుంది . ఆలా మరణించిన వారందరూ  ..  శాఖాహారులు .. అంటే బి 12  లోపం కచ్చితంగా ఉంటుంది .ఇలా నేను ఎప్పుడో ఈ నిర్దారణకు వచ్చాను . 


అయ్యా లారా ! అమ్మ లారా ! నేను డాక్టర్ ని కాదు .. నా ఫేస్బుక్ లాన్సెట్ మేగజైన్ కాదు . బి 12 విటమిన్ కు సైటోకిన్ స్ట్రామ్  కు మధ్య వున్న సంబంధాన్ని నేను ప్రయోగశాలలో ప్రయోగాల ద్వారా రుజువు చెయ్యలేదు . ఆలా చేసే ఆసక్తి అవకాశం నాకు లేదు . కొన్ని వేల కేసుల్ని చూసిన   అనుభం తో చెబుతున్నా. దయ చేసి బి 12  విటమిన్ టాబ్లెట్ తీసుకోండి . సైటోకిన్ స్ట్రామ్ మరణం నుండి మిమ్మల్ని మీ స్నేహితుల్ని బంధువులను రక్షించుకోండి. 


ఇలా టాబ్లెట్ తీసుకొంటే రక్షణ గ్యారంటీ నా అని ఎవరైనా అడగవచ్చు . పెద్ద పుండిగి లాగ శాస్త్రవేత లాగా చెబుతున్నావేంటి అని ఎవరైనా అడగవచ్చు . నేను గ్రహించిన దాన్ని చెబుతున్నా. ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోలేక చెబుతున్నా .  నేను బి విటమిన్ టాబ్లెట్ బ్రోకర్ కాదు . నాకు ఎలాంటి మందుల వ్యాపారాలు లేవు . 


మనవారికి విదేశాల్లో ఎవరైనా పరిశోధన చేసి చెబితే అదే తీర్థం అవుతుంది . ఎండ - డి విటమిన్ ; వర్క్ అవుట్    చేసే వారిలో కరోనా ప్రభావం తక్కువ ఇలాంటి ఎన్నో విషయాలను గత సంవత్సరం మే నెల నుండి చెబుతున్నా . నేను చెబుతున్నప్పుడు ట్రాష్ అంటూ కొట్టి పడేసిన వారే ఇప్పుడు విదేశీ విశ్వ విద్యాలయాలు అదే విషయం చెప్పిందని న్యూస్ సీర్క్యూలేట్ చేస్తున్నారు . శంఖం లో పోస్తేనే తీర్థం . నాకు తెలుసు . కానీ ఇప్పుడు ఇది మెడికల్ ఎమర్జెన్సీ . విదేశాల్లో మన దేశం లో ఉన్నట్టు శాఖాహార కమ్యూనిటీస్ వుండవు . ఎక్కడో కొంత వ్యక్తులు మాత్రమే ఆలా వుంటారు . కాబట్టి శాకాహాహారానికి , బి 12 విటమిన్ లోపానికి , సైటోకిన్ స్ట్రామ్ కు , కరోనా మరణాలకు మధ్య వున్న లింక్ పై అక్కడ ఇప్పుడప్పుడే పరిశోధనలు జరగవు . వారి పరిశోధించి దాన్ని ఏదో ఒక మేగజైన్ పబ్లిష్ చేసే దాకా ఇక్కడ మరణాలు ఆగవు . 


 బి 12  తీసుకొంటే సైటోకిన్ స్ట్రామ్ రాదు అనే నా పరిశీలన తప్పు అనుకోండి . కానీ ఈ లోపం ఉంటే రక్త హీనత వస్తుంది . నరాలు బలహీన పడుతాయి . ఆలోచన అలాగే మెమరీ కూడా ప్రభావితం అవుతుంది . పోనీ అందుకోసమైనా బి 12  తీసుకోండి . బెనిఫిట్ అఫ్ డౌట్ నాకు ఇవ్వండి . రెండేళ్లకో మూడేళ్లకో ఏదో విదేశీ మేగజైన్ ఈ విషయాన్ని చెబితే ఈ అనామకుడ్ని గుర్తు చేసుకోండి . 


 బి 12  టీసుకొంటే కరోనా రాదా అని అడగకండి . ఒక ముక్కు రెండు నాసికా రంద్రాలు వున్న ఎవరికైనా కరోనా సోకుతుంది . సోకినప్పుడు ఇది రక్షణ నిస్తుంది . మాస్క్ పెట్టుకోండి . వాక్సిన్ వేసుకోండి . ఇంకా మిగిలిన జాగ్రత్తలు ట్టేసుకోండి .  ఈ బి 12  విటమిన్ నా కోసమైనా తీసుకోండి . మీ పిల్లలు పాపలు   తండ్రులు తల్లులు  చల్లగా ఉండాలి . నాకు B12  విటమిన్ వ్యాపారం లేదు . మరో సారి విన్నవించుకొంటున్నా ! మీ....

*Amarnath Vasireddy* 

(The Slate)

 

ఈ పోస్ట్ శాఖహారుల్లో అవగాహన చేయడం కోసం మాత్రమే..

*బ్రాహ్మణ చైతన్య వేదిక*