13, మే 2021, గురువారం

"B12 విటమిన్

 *మనం తినే ఆహారంలో "B12 విటమిన్" లోపం వల్ల కూడా 'కరోనా' దాడి*


 ఈ పోస్ట్ చదవటం మిస్ కావొద్దు. *దయచేసి "ముఖ్యంగా శాకాహారులు" మీ బంధువులతో స్నేహితులతో ఈ విషయాల్ని పంచుకోండి.* నాకు క్రెడిట్ వద్దు. నా పేరు పెట్టాల్సిన అవసరం లేదు. జనాలకు మంచి జరిగితే చాలు . ప్రాణాలు పోకుంటే  చాలు . 


*సైటోకిన్ స్ట్రామ్.. ఈ మాట ఎప్పుడైనా విన్నారా?* మన ప్రముఖ గాయకుడు మరణించడానికి ప్రధాన కారణం అర్థం చేసుకున్నారా ? కరోనా కారణంగా శాఖాహారుల్లో ఎక్కువ మరణాలు ఎందుకు జరుగుతున్నాయో ఆలోచించారా ?


కరోనా కారణంగా వృద్దులకు తప్పించి యువకులకు పెద్దగా అపాయం లేదు అని నేను గత సంవత్సరం ఏప్రిల్ లో అనుకొనే వాడిని . అప్పుడు పేస్ బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా కొంత మంది మిత్రులు కరోనా కారణంగా కొంత మంది తమకు తెలిసిన యువకులు చనిపోవడాన్ని నాకు తెలియచేసారు . 


*నేను మెడికల్ ఆంథ్రోపాలజీ బోధకుడిని. అంటువ్యాధులు, పోషకాహారం గురించి లోతైన అధ్యనం చేసినవాడిని.* మన చుట్టూరా జరుగుతున్నది ఏమిటో అర్థం చేసుకొనే ప్రయత్నం చేశాను . 


 కరోనా మరణాలకు కారణం రక్తం లో గడ్డలు కట్టడం ఒకటైతే సైటోకిన్ స్ట్రామ్ రెండవది . 


సైటోకిన్ స్ట్రామ్ అంటే మన రక్షక వ్యవస్థ CONFUSE  అయ్యి వైరస్ కు బదులుగా మన అంగాలు { గుండె ఊపిరి తిత్తులు మొదలైన వాటి పై దాడి చెయ్యడం . దీనితో గుండె పోటు , ఊపిరి తిత్తులు పాడైపోవడం జరుగుతుంది . దీని తొందరగా గుర్తిస్తే స్టెరాయిడ్ ఇస్తారు . స్టెరాయిడ్ తో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి . ప్రముఖ గాయకుడూ చెన్నై ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే నాటికి అక్కడ స్టెరాయిడ్ ఇచ్చే ప్రోటోకాల్ లేదు . అయన హైదరాబాద్ లో చేరి ఉంటే సజీవంగా   ఉండేవారని అప్పుడే నేను పోస్ట్ పెట్టాను . అప్పటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టెరాయిడ్ ఇవ్వడం జరుగుతోంది . సరే ఈ వివాదాన్ని పక్కన పెడుదాము . ఇప్పుడు పాయింట్ లోకి వద్దాము . 


నేను ఏప్రిల్ మే నెలలో గమనించింది ఏమిటంటే *శాఖాహారుల్లో మాత్రమే ఎక్కువగా ఈ సైటోకిన్ స్ట్రామ్ వస్తోంది. శాఖాహారుల్లో బి 12 లోపం ఉంటుంది అని నాకు తెలుసు. *నన్ను హైదరాబాద్కు చెందిన కొందరు ఆర్య వైశ్య మరియు బ్రాహ్మణ ప్రముఖులు జూన్ నెలలోనే  జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా వారి కుటుంబ సభ్యులను ఎడ్యుకేట్ చేయమని కోరారు . అప్పటికే బి 12  లోపానికి సైటోకిన్ స్ట్రామ్ కు మధ్య ఉన్న సంబంధం నాకు అర్థం అయ్యింది . శాఖాహారం ద్వారా బి 12 విటమిన్ అందదు . దయ చేసి బి 12  టాబ్లెట్స్ తీసుకోండి అని చెప్పాను. అలాగే అనేక మంది శాఖాహార మిత్రులకు సూచించాను . ఆలా తీసుకొన్న వారు కరోనా   బారిన పడినా సులభంగా కోలుకున్నారు . ఒక్కరంటే ఒక్కరికి సీరియస్ కాలేదు .* 


అప్పటినుంచి ఇప్పటిదాకా కనీసం వెయ్యి ఉదహారణలు . నా సూచన మేరకు బి 12  తీసుకొన్న వారు కరోనా సోకినా మైల్డ్ లక్షణాలతో బయట పడ్డారు . మరణాలు జరిగిన అనేక కేసులను నేను విశ్లేషించాను . యువకులు మరణిస్తున్నారు అంటే అది సైటోకిన్ స్ట్రామ్ వల్లే .. దాని వల్ల గుండె పోటు ... ఊపిరి తిత్తులు పాడై పోవడం జరుగుతుంది . ఆలా మరణించిన వారందరూ  ..  శాఖాహారులు .. అంటే బి 12  లోపం కచ్చితంగా ఉంటుంది .ఇలా నేను ఎప్పుడో ఈ నిర్దారణకు వచ్చాను . 


అయ్యా లారా ! అమ్మ లారా ! నేను డాక్టర్ ని కాదు .. నా ఫేస్బుక్ లాన్సెట్ మేగజైన్ కాదు . బి 12 విటమిన్ కు సైటోకిన్ స్ట్రామ్  కు మధ్య వున్న సంబంధాన్ని నేను ప్రయోగశాలలో ప్రయోగాల ద్వారా రుజువు చెయ్యలేదు . ఆలా చేసే ఆసక్తి అవకాశం నాకు లేదు . కొన్ని వేల కేసుల్ని చూసిన   అనుభం తో చెబుతున్నా. దయ చేసి బి 12  విటమిన్ టాబ్లెట్ తీసుకోండి . సైటోకిన్ స్ట్రామ్ మరణం నుండి మిమ్మల్ని మీ స్నేహితుల్ని బంధువులను రక్షించుకోండి. 


ఇలా టాబ్లెట్ తీసుకొంటే రక్షణ గ్యారంటీ నా అని ఎవరైనా అడగవచ్చు . పెద్ద పుండిగి లాగ శాస్త్రవేత లాగా చెబుతున్నావేంటి అని ఎవరైనా అడగవచ్చు . నేను గ్రహించిన దాన్ని చెబుతున్నా. ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోలేక చెబుతున్నా .  నేను బి విటమిన్ టాబ్లెట్ బ్రోకర్ కాదు . నాకు ఎలాంటి మందుల వ్యాపారాలు లేవు . 


మనవారికి విదేశాల్లో ఎవరైనా పరిశోధన చేసి చెబితే అదే తీర్థం అవుతుంది . ఎండ - డి విటమిన్ ; వర్క్ అవుట్    చేసే వారిలో కరోనా ప్రభావం తక్కువ ఇలాంటి ఎన్నో విషయాలను గత సంవత్సరం మే నెల నుండి చెబుతున్నా . నేను చెబుతున్నప్పుడు ట్రాష్ అంటూ కొట్టి పడేసిన వారే ఇప్పుడు విదేశీ విశ్వ విద్యాలయాలు అదే విషయం చెప్పిందని న్యూస్ సీర్క్యూలేట్ చేస్తున్నారు . శంఖం లో పోస్తేనే తీర్థం . నాకు తెలుసు . కానీ ఇప్పుడు ఇది మెడికల్ ఎమర్జెన్సీ . విదేశాల్లో మన దేశం లో ఉన్నట్టు శాఖాహార కమ్యూనిటీస్ వుండవు . ఎక్కడో కొంత వ్యక్తులు మాత్రమే ఆలా వుంటారు . కాబట్టి శాకాహాహారానికి , బి 12 విటమిన్ లోపానికి , సైటోకిన్ స్ట్రామ్ కు , కరోనా మరణాలకు మధ్య వున్న లింక్ పై అక్కడ ఇప్పుడప్పుడే పరిశోధనలు జరగవు . వారి పరిశోధించి దాన్ని ఏదో ఒక మేగజైన్ పబ్లిష్ చేసే దాకా ఇక్కడ మరణాలు ఆగవు . 


 బి 12  తీసుకొంటే సైటోకిన్ స్ట్రామ్ రాదు అనే నా పరిశీలన తప్పు అనుకోండి . కానీ ఈ లోపం ఉంటే రక్త హీనత వస్తుంది . నరాలు బలహీన పడుతాయి . ఆలోచన అలాగే మెమరీ కూడా ప్రభావితం అవుతుంది . పోనీ అందుకోసమైనా బి 12  తీసుకోండి . బెనిఫిట్ అఫ్ డౌట్ నాకు ఇవ్వండి . రెండేళ్లకో మూడేళ్లకో ఏదో విదేశీ మేగజైన్ ఈ విషయాన్ని చెబితే ఈ అనామకుడ్ని గుర్తు చేసుకోండి . 


 బి 12  టీసుకొంటే కరోనా రాదా అని అడగకండి . ఒక ముక్కు రెండు నాసికా రంద్రాలు వున్న ఎవరికైనా కరోనా సోకుతుంది . సోకినప్పుడు ఇది రక్షణ నిస్తుంది . మాస్క్ పెట్టుకోండి . వాక్సిన్ వేసుకోండి . ఇంకా మిగిలిన జాగ్రత్తలు ట్టేసుకోండి .  ఈ బి 12  విటమిన్ నా కోసమైనా తీసుకోండి . మీ పిల్లలు పాపలు   తండ్రులు తల్లులు  చల్లగా ఉండాలి . నాకు B12  విటమిన్ వ్యాపారం లేదు . మరో సారి విన్నవించుకొంటున్నా ! మీ....

*Amarnath Vasireddy* 

(The Slate)

 

ఈ పోస్ట్ శాఖహారుల్లో అవగాహన చేయడం కోసం మాత్రమే..

*బ్రాహ్మణ చైతన్య వేదిక*

కామెంట్‌లు లేవు: