13, మే 2021, గురువారం

అక్షయ తృతీయ

 తెలుసుకోండీ...12521

తెలియజేయండీ....

*అక్షయ తృతీయ* 2/2


           ‌      ఇక వనవాసంలో ఉన్న పాండవులు శ్రీకృష్ణుడి కృప వల్ల అక్షయ పాత్రను పొందిన రోజూ కూడా ఇదే. అందుకే ఈనాడు భగవంతునికి అర్పించినదేదైనా అమిత ఫలాలనిస్తుందనీ, కొనుగోలు చేసినది ఏదైనా అక్షయమై నిలుస్తుందనీ భక్తులు నమ్ముతారు. 


ప‌విత్ర‌మైన రోజు

చైత్ర శుద్ధపాడ్యమి, ఆశ్యయుజ శుద్ధ దశమి (విజయదశమి), వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) ఈ 3 రోజులూ హిందువులకు పవిత్రమైనవి. హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... ఈ 3 రోజులూ తిథి సంపూర్ణంగా ఉంటుంది. అక్షయ తృతీయను నవన్న పర్వం అని కూడా అంటారు. అక్షయ తృతీయ రోహిణి నక్షత్రం నాడు వస్తుంది.


 ఈ తిథి ఇంటికి శుభాలను, విజయాలను చేకూర్చుతుందని హిందువుల విశ్వాసం. ఈ రోజు కనక ఎవరికైనా దానం చేస్తే, భగవంతుడు వారికి వరాలనిస్తాడని, ఆశీర్వాదాలు అందచేస్తాడని విశ్వసిస్తారు. నూత‌న కార్యాలు ఆరంభించడానికి ఈ తిథిని అమోఘమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజున ప్రారంభించిన పని అక్షయంగా వృద్ధిచెందుతూ ఉంటుందని ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.


ఈ రోజున ఉపవాసం ఉండి, విష్ణుమూర్తిని బియ్యపు గింజలతో పూజిస్తారు. ఈ రోజున గంగలో స్నానం చేస్తే మంచిదని పండితులు చెబుతారు. ఈ రోజు జ్ఞానసముపార్జన చేయాలనుకున్నా, దానాలు చేసినా ఎంతో ఫలవంతం అవుతుందని ప్రతీతి. ఈ రోజు బియ్యం, ఉప్పు, నెయ్యి, పంచదార, కూరలు, చింతపండు, పండ్లు, బట్టలు... ఏది దానం చేసినా మంచిదే. బెంగాలీయులు ఈ తిథినాడు ఎన్నో హోమాలు నిర్వర్తిస్తారు. వినాయకుడికి, లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. సుదర్శన కుబేర యంత్రాన్ని పూజించడం ఆనవాయితీ. ఇక‌ పెళ్ళిళ్లకు కూడా అద్భుతమైన ముహూర్తంగా పరిగణిస్తారు.


సర్వంశ్రీపరమేశ్వరార్పణమస్తు.

 శైలజావాస్తుజ్యోతిషాలయము  9059743812⁠⁠⁠⁠

కామెంట్‌లు లేవు: