మనం ఏదైతే కాంతితో చూస్తామో దానిని భౌతికం అని అంటాము అంటే పదార్ధ సమ్మేళిత ప్రపంచం అంటే meterialistic world మనం ఈ ప్రపంచంలో ఎన్నో విషయాలను చూస్తున్నాము. అందులో కొన్ని చెలించేవి కొన్ని చెలించనివి. సాధారణంగా మనం చెలించే వాటిని జీవులు అంటాము. ప్రతి జీవి కూడా మూడు దశలు కలిగినట్లు మనకు తెలుస్తుంది అది పుట్టుక రెండు పెరుగుదల లేక మార్పు చెందటం మూడు నశించటం. పుట్టినప్పుడు ప్రతిదీ సుక్మా రూపంలో ఉండి కాలాంతరంలో మార్పు చెందుతూ తన పరిమాణంను మార్చుకుంటూ అంటే వృద్ధి చెందుతూ వుంది ఒకరోజు తన జీవితాన్ని వదులుతున్నది దానినే మనం మరణం అంటున్నాము. ఇదంతా మన కంటి ముందు జరుగుతున్న విషయం -
ఇక రెండవది అభౌతికం అంటే మన కంటి ముందు ఉండి కూడా మన కంటికి కనపడకుండా వుంటున్నది. దానినే మనం శక్తి అనికూడా అనవచ్చు. మనం నిత్యం అనేక రకాలైన శక్తులను అనుభవంలోకి తీసుకుంటున్నాము. మన ఎదురుగా ఒక రాగి తీగ వుంది అది మన కంటికి కనపడుతూ వున్నది. కానీ మన కంటికి కనపడకుండా దానిలో దాగి విద్యుత్ శక్తి వుంది. మనకు కనపడక పోయిన దాని ఉనికిని మనం చూడగలుగుతున్నాము. అంటే ఆ రాగి తీగను ఒక విద్యుతు బలుపుకు కలిపితే అది ప్రకాశిస్తుంది, ఒక ఫ్యానుకు కలిపితే అది తిరిగి మనకు గాలిని ఇస్తున్నది. తీగలో విద్యుతు మన కంటికి కనిపించలేదని మనం విద్యుతు లేదని అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది.
మనం చూసే ప్రతి వస్తువుకు ఏదో ఒక రకమైన శక్తి వుంది. కానీ దానిని మనం చూడలేము. ఆ శక్తి బహిర్గతం అయ్యే సమయం వచ్చినప్పుడు మాత్రమే మనం ఆ శక్తిని గమనించగలము. ఒక రాయి ఉందనుకోండి అది చూడటానికి ఒక జడ పదార్ధంగానే గోచరిస్తుంది. కానీ నీవు ఆ రాయిని ఒక మామిడి చెట్టు మీద విసిరితే అది అక్కడి మామిడి కాయ తొడిమను తెంపి కాయ కింద పడేటట్లు చేస్తుంది. ఇక్కడ మనం రెండు విషయాలను గమనించాలి జడంగా వున్న రాయి నీవు విసిరినప్పుడు శక్తిని పుంజుకొని కాయ తొడిమను తెంపి వేసింది అంటే ఆ రాయి శక్తి ఆ పని చేయటానికి తోడ్పడింది. ఆ శక్తి ఎక్కడిది నీ చేతిలోంచి వచ్చిందనుకుందాం. అప్పుడు నీవు రాయి లేకుండా చేయి విసిరితే కాయ తెగాలికదా కానీ అట్లా తెగలేదు. అంటే నీవు నీచేతితో ఇచ్చిన శక్తిని పుంజుకొని రాయి వేగంగా చెట్టు కొమ్మను తాకింది. ఈ ప్రక్రియ మనకు చాలా సాధారణంగానే కనపడుతుంది కానీ లోతుగా ఆలోచిస్తే మనకు శక్తికి సంబందించిన విషయాలు తెలుస్తాయి. ఇక రెండో విషయం ఏమిటంటే ఎప్పుడైతే తొడిమ తెగిందో అప్పుడు చెట్టు నుండి కాయ రాలి పడింది. అంటే చెట్టునుండి కాయాను రాలకుండా తొడిమ పట్టుకుంది. అంటే తొడిమకు కాయకు మధ్య ఏదో ఒక శక్తి కాయ రాలకుండా చూస్తున్నది. ఈ విధంగా మనం రోజు ఎన్నో శక్తులను గమనిస్తున్నాము. కొండమీద వున్న నీరు జలపాతరూపంలో క్రిందికి జాలువారుతుంది. మరి ఏ శక్తి ఆ నీటిని క్రిందికి కదలటానికి సహకరిస్తుంది. నదిలో నీరు ప్రవహించటానికి ఏ శక్తి కారణం. విత్తుగా వున్న గింజ భూమిలో తేమతో మొలకెత్తటానికి ఏ శక్తి కారణం. ఇలా ఆలోచిస్తూ పొతే మనకు అనేక శక్తులు అనుభవంలో వస్తున్నాయి. \
మన ఆధునిక విజ్ఞాన శాస్త్రం కొన్ని శక్తులను తెలుసుకొని వాటిలో ఎన్నో పేర్లు పెట్టి ఉండవచ్చు. గురుత్వాకర్షణ శక్తి, కైనెటిక్ శక్తి అని ఏవేవో అనవచ్చు. కానీ మన ఆధునిక శాస్త్రాజ్ఞులకు బోధపడని అనేక శక్తులు మనకు కనపడుతున్నాయి.
మన మహర్షులు వారి దివ్య జ్ఞానంతో ఇప్పుడు మనం చూసిన శక్తులకన్నా విశేషంగా అనేక శక్తులను కనుగొన్నారు. ఆ శక్తుల పరాకాష్ట పరా బ్రహ్మగా గుర్తించారు. ఆ పరబ్రహ్మను చేరుకోవటానికి అన్వేషించారు.
ఇంకా వుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి