1, జులై 2020, బుధవారం

దానిమ్మ పండు పద్యం

రక్త పుష్టి నొసగు రమణీయ ఫలమేది?*
శ్రీగణేశు పూజ చేయనేది?*
పలువరుసల పోల్చు పండు పేరేమిటి?*
దాడిమనుచు పిల్వ తగినదిద్ది*

*నాగమంజరి గుమ్మా*
ఫలవిలాసం 26/108 వ పద్యం

రక్తం చేకూరాలి అనగానే గుర్తుకు వచ్చే పండు దానిమ్మ. విఘ్నేశ్వరుని పూజలో దాడిమీ పత్రం అంటే దానిమ్మ ఆకులే. అలాగే చక్కని పలువరుసను దానిమ్మ గింజల వంటి పలువరుస అంటారు. (దానిమ్మలో ఎర్ర దానిమ్మ, తెల్ల దానిమ్మ రెండు రకాలున్నాయి లెండి) దాడిమీ అనే పేరు సంస్కృతంలో దానిమ్మకు ఉంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే తాంబూలంతో ఎర్రనైన పెదవులు దానిమ్మ పూవులా మెరుస్తున్నాయట ఎవరివి? శ్రీ లలితా అమ్మవారివి. తాంబూల పూరిత ముఖీ దాడిమీ కుసుమ ప్రభా...  వినే ఉంటారుగా...

ఇక ఉపయోగాల విషయానికి వస్తే...
దానిమ్మ బెరడు, తొక్క, గింజలను విరోచనాల నివారణకు ఔషధంగా వాడుతారు.
దానిమ్మ పండు రసం కుష్టు వ్యాధికి పనిచేస్తుంది.
దానిమ్మ పండ్ల తోలు, పూలను బట్టలకు రంగు అద్దే పరిశ్రమలో ఉపయోగిస్తున్నారు.
ఈ ఆకులను కొద్దిగా దంచి కాచి కషాయం చేసి దానిలో తగినంత చక్కెర కలిపి సేవిస్తే.. ఉబ్బసం, అజీర్తి వంటి దీర్ఘ రోగాలే కాక, దగ్గు, వడదెబ్బ, నీరసం నుండి ఉపశమనం కలుగుతుంది. కాళ్ళ వాపులకు ఈ ఆకును వాపు ఉన్న చోట కడితే.. తగ్గుతాయి.
గర్బవతులు ప్రతి రోజు 600 మి.గ్రా నుండి 400 మి.గ్రా ఫోలిక్ ఆమ్లం తీసుకోవాలి. దానిమ్మ రసం ఒకసారి తాగడము వలన 60 మి.గ్రా ఫోలేట్ వస్తుంది.
దానిమ్మ సహజ యాస్పిరిన్‌. రక్తసరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది. 
ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలా మంచిది. ఆస్టియోఆర్థ్రయిటిస్‌తో బాధపడేవారికి అత్యంత రుచికరమైన మందు దానిమ్మ పండు, రసం. వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను కూడా నివారిస్తుంది దానిమ్మ రసం. నీళ్లవిరేచనాలతో బాధపడేవారికి మంచి మందు ఇది. దానిమ్మ రసాన్ని శరీరం మీద రాయడం చేత అలర్జీలు, కీటకాలు కుట్టడం వలన వచ్చిన పొక్కులు మానిపోతాయి. దానిమ్మ పండు తొక్క గాయాలకు ఔషధం, వాపును అరికడుతుంది. గొంతు రోగాలకు ఔషధం దానిమ్మ. దానిమ్మ పళ్ళు, పువ్వులు, ఆకులు, వేర్లు అన్ని ఔషధ గుణాలు కలిగినవై ఉంటాయి.

మోది కే మళ్ళీ చాన్స్ ఎందుకో(2023)?


(వీడెవడో మోదీ భజనకారుడు అనుకోవడం సహజమే కానీ యదార్ధాలు చూడండి, వీటిలో ఫలానా విషయం తప్పు అని చెప్పగలరేమో ప్రయత్నించండి)

నరేంద్ర మోది దేశానికి, ధర్మానికి ఈ ఆరు సంవత్సరాలలో ఏమి చేసాడు..?"

1) జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి అధికారికంగా నిర్వహించడానికి, భారతీయ సంప్రదాయాల విశిష్టతను ప్రపంచదేశాలు గుర్తించడానికి కారణం ఎవరు..?
2) అమాయక హిందూ యువకుల్ని మతబోధల ద్వారా ముస్లింలుగా, ఆపై తీవ్రవాదులుగా మారుస్తున్న జకీర్ నాయక్ దేశం వదిలి పారిపోయాడు ఎందుకు..? వాడి తండ్రి అంత్యక్రియలకి కూడా హాజరు కానంతగా అతను ఎవర్ని చూసి భయపడుతున్నాడు..?
3)15 నిమిషాలు సమయమిస్తే 100 కోట్ల మంది హిందువుల అంతు చూస్తామన్న ఒవైసి ఉగ్రవాద సోదరులు కిమ్మనకుండా కాషాయ తలపాగాలు పెట్టుకుని, ఫోటోలు దిగుతున్నారెందుకు..?
4) దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి యోగి ఆదిత్యానాధ్ వంటి వాడిని ముఖ్యమంత్రిని చేయడం సాధారణ విషయమా..? అక్కడ హిందువులపై దాడులు చేసే ముస్లిం గ్యాంగ్ స్టర్ లు ఎన్ కౌంటర్లలో లేచిపోవడం, మిగిలినవాళ్ళు అండర్ గ్రౌండ్ లోకి పారిపోవడం ఎవరివల్ల..?
5) వేదాలలో అల్లాహ్, మొహమ్మద్ అని బహిరంగసభలు పెట్టే UIRC షఫీ, సిరాజ్ రెహ్మాన్ అవి ఆపేసి, పెర్సనాలిటీ డెవలప్ మెంట్, మోటివేషన్ క్లాస్ లు చెప్పుకుంటున్నారెందుకు..?
6) రాహుల్ గాంధి నేను కూడా హిందువునే..శివ భక్తుణ్ణే అని విభూతి బొట్లు పెట్టుకుని ఆలయాల చుట్టూ తిరుగుతున్నాడు ఎప్పటినుంచి..?
7) క్రిస్టియన్ మిసనరీస్ కి విదేశీ నిధుల ప్రవాహం ఆగిపోయి లబోదిబోమంటూ మళ్లీ నరేంద్రమోది ప్రభుత్వం రాకూడదని గుండెలు బాదుకుంటున్నారెందుకు..?
😎 భారతప్రధాని అంటే మరబొమ్మ అనే స్థాయినుంచి భారతప్రధాని సమక్షంలో అమెరికా అధ్యక్షుడు కూడా అటెన్షన్ లో నిలబడే స్థాయికి మనదేశ గౌరవాన్ని పెంచినది ఎవరు..?
9) పాకిస్థాన్ సైన్యం మన భూభాగంలోకి చొరబడి మన సైనికుల తలలు తీసుకుపోయే స్థితి నుంచి.. మన సైన్యం వాళ్ళ భూభాగం లోకి చొచ్చుకెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసి, పాక్ అధికారులకు ఫోన్ చేసి, మీవాళ్ళ శవాలు పట్టుకుపోండి అని చెప్పే స్థితి తీసుకొచ్చింది ఎవరు..?
10) డ్రాగన్ చైనా మనల్ని బెదిరించే స్థాయి నుంచి బ్రతిమిలాడుకునే స్థాయికి తీసుకొచ్చింది ఎవరు..?
11) కాంగ్రెస్ హయాంలో నిత్యకల్యాణం - పచ్చ తోరణంలా రోజుకో స్కామ్ తో కళకళలాడిన కేంద్రప్రభుత్వాన్ని ఆరు సంవత్సరాలుగా అవినీతిరహిత, సుస్థిరమైన పాలనతో నడిపిస్తున్నది ఎవరు?
12) టెర్రరిస్టుల బాంబ్ దాడులు,కాశ్మీర్ లో అల్లర్లు ఆగిపోయిందిఎవరివల్ల..?
13) కర్ణాటక లో లింగాయత్ లను హిందువుల నుంచి విడదీసి, నేను ఆవుమాంసం తింటానని బహిరంగంగా ప్రకటించిన సిద్ధరామయ్య, 150 స్థానాలలో డిపాజిట్ లు రాకపొడానికి కారణం ఎవరు????
14) ఈ రోజున రాజకీయాల గురించి మాట్లాడే భావప్రకటనా స్వేచ్ఛగాని, మన ఆలోచనలని, అభిప్రాయాల్ని వెల్లడించే సొంత అస్తిత్వం (అనగా మోది గారికి అనుకూలంగా గాని లేదా వ్యతిరేకంగా గాని) రావడానికి కారణం ఎవరు????
15) మన్మోహన్ గారు మాట్లాడుతున్నారు కారణం ఎవరు????
16) రాహుల్ గాంధి గారు గుళ్ళకి వెళ్తున్నారు కారణం ఎవరు????
17) కాశ్మీర్ లో రాళ్ల దాడులు ఆగిపోయాయి కారణం ఎవరు????
18) పాకిస్థాన్ లో మెరుపు దాడులు జరిగాయి కారణం ఎవరు????
19) మోది దెబ్బకు చైనా డోక్లాం నుండి పారిపోయింది కారణం ఎవరు????
20) రామ మందిరానికి అడ్డంకులు తొలగుతున్నాయి కారణం ఎవరు????
21) రామసేతు నిజమని తేలింది కారణం ఎవరు????
22) దేశంలో ఒక్క తీవ్రవాద దాడి కూడ జరగడం లేదు కారణం ఎవరు????
23) హిందూ మతాన్ని నాశనం చేయడం కోసం విదేశాల నుండి అడ్డగోలుగా వచ్చే మిషనరిస్ సొమ్ము ఆగిపోయింది కారణం ఎవరు????
24) భారత దేశ సంపదను హవాలా మార్గం ద్వారా విదేశాలకు మళ్లించే సుమారు 3 లక్షల దొంగకంపెనీల తాళాలను పగులగొట్టి బయటకు లాగింది ఎవరు????
25) ముస్లిం సోదరీమణులకు తలాక్ వంటి దారుణాలు నుండి విముక్తి కలిగించింది ఎవరు. ?? ??
26) ఎవరు ఎన్ని ఏడుపులు ఏడ్చినా అతి క్రూరులైన రోహింగ్యాలను భారతదేశం లోకి రాకుండా అడ్డుకున్నది ఎవరు????
27) ప్రభుత్వంలో అవినీతిని అరికట్టడమే కాకుండా... పోతూపోతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇరాన్ లో చేసిన 7 బిలియన్ డాలర్ల చమురు అప్పును తీర్చింది ఎవరు????
28) పాకిస్థాన్ కు భారత్ సత్తా అర్దం అయ్యే విధంగా అన్ని దేశాలతో మిత్రత్వాన్ని పెంచుకుని పాకిస్తాన్ ను ఏకాకి ని చేయగలిగినది ఎవరు???.
29) సౌదీఅరేబియా మనకు ఇంతవరకూ క్రూడ్ ఆయిల్ దిగుమతులపై "On time delivery premium charges" వేస్తూ వచ్చింది. సమయానికి వస్తువు అందించినందుకు అధిక రుసుము వసూలు చేస్తూ వచ్చేది. మన పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరియు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ లు ఈ రుసుము రద్దు చేయించలిగారు, తద్వారా దేశానికి కొన్ని వేల కోట్ల ఆదాయం మిగిలింది. కారణం ఎవరు????
30) భూటాన్ లో మనదేశం 4 హైడ్రోఎలక్ట్రిక్ విద్యుత్ కేంద్రాలు మరియు ఆనకట్టలు నిర్మించదానికి కాంట్రాక్ట్ పొందింది.భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ ( ప్రాకృతిక వనరుల ద్వారా వచ్చే ఎనర్జీ) లో సింహ భాగం మనకు అందుబాటులో ఉంటుంది. కారణం ఎవరు????
31) నేపాల్ లో భారత్ అతి పెద్ద ఆనకట్ట నిర్మించబోతోంది. చైనా ఈ కాంట్రాక్ట్ పొందటానికి విశ్వప్రయత్నం చేసింది. కాని మన దేశం ఇది సాధించుకుంది. భవిష్యత్తులో 83% గ్రీన్ ఎనర్జీ దీనివల్ల మనం ఉచితంగా పొందే వీలుంది. కారణం ఎవరు????
32) జపాన్ తో సంబంధాలు ఎంతో మెరుగుపడ్డాయి. ఆ దేశం DMIC [ Delhi Mumbai Investment Corridor] లో 30 బిలియన్ డాలర్లు పెట్టుబడి కి సిద్ధమయింది. కారణం ఎవరు????
33) వియత్నాం తో వ్యూహాత్మకంగా భారత్ సంబంధాలు మెరుగు పరచుకుంది. దక్షిణచైనా సముద్రంలో చమురు అన్వేషణకు ఆ దేశం మనకు కాంట్రాక్ట్ ఇచ్చింది. UPA ప్రభుత్వం ఇన్నాళ్ళు చైనా కు తొత్తుగా వ్యవహరిస్తూ ఈదిశగా అసలు ఏ అడుగూ వేయలేదు. మోది చైనా తొత్తు కాదు కాబట్టి మరియు అంతర్జాతీయంగా చైనాకు వ్యతిరేకంగా సమర్థన కూడాగట్టడంలో విజయం సాధించి దేశక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్ళటం వల్ల ఇది సాధ్యపడింది. కారణం ఎవరు????
34) ఇరాన్ నుంచి పెట్రోల్ దిగుమతులను భారత్ పెంచుకుంది, పైగా దిగుమతులకు రుసుము మనం రూపాయిలలో చెల్లించడానికి ఇరాన్ అంగీకరించింది. దీనివల్ల మనకు ఏంతో విదేశీకరెన్సీ ఆదా అవుతుంది. పైగా మన కరెన్సీ విలువల హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా చెల్లింపులకు ఇరాన్ ఒప్పుకుంది. " చాబహార్" పోర్టు నిర్మాణంలో కూడా మన దేశం ఇరాన్ నుండి కాంట్రాక్ట్ పొందింది. దీనివల్ల ఈ పోర్ట్ నకు రాకపోకలలో మన నౌకలు ప్రత్యేక వీలు కలిగి ఉంటాయి. దీనివల్ల పాకిస్థాన్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటుంది. కారణం ఎవరు????
35) ఆస్ట్రేలియా ను మనకు యురేనియం అమ్మడానికి భారత్ ఒప్పించగలిగింది. ఈ విషయంలో తన రాజనీతిజ్ఞత తో టోనీ అబ్బోట్ ను ఒప్పించగలిగారు. కారణం ఎవరు????
36) శ్రీలంక లో రాజపక్సే ఎన్నికలలో ఓడిపోయారు. చైనా ప్రభావం శ్రీలంక పై దీనితో తుడిచిపెట్టుకుపోయింది. శ్రీలంక విదేశీనీతి లో చైనా ప్రాబల్యం పోయి భారత్ వైపు మొగ్గు ప్రారంభం అయింది. ఇందులో RAW పాత్ర ఎంతో ఉన్నదని అమెరికా గూధచారి సంస్థ అయిన CIA బయటపెట్టింది. కారణం ఎవరు????
37) చైనా తో వాణిజ్యలోటు బాగా పెరిగిపోయింది. మోది ప్రభావంతో చైనా మన దేశం లో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడికి ఒప్పుకుంది. అంటే 1,40,000 వేల కోట్లు అన్నమాట. దీనివల్ల చైనా వస్తు నిల్వలు తగ్గుముఖం పట్టి వాణిజ్యలోటు తగ్గుముఖం పడుతుంది. కారణం ఎవరు????
38) ఇక దేశరక్షణలో జాతీయ భద్రతా సలహాదారు అయిన అజిత్ దోవాల్ ఒక తురుపు ముక్క అనే చెప్పాలి. పెంటగాన్ కానివ్వండి, ఇజ్రాయిల్ కానివ్వండి, జపాన్ కానివ్వండి - భారత్ తో ఎన్ని ఒప్పందాలు చేసుకున్నాయో చూడండి. 2008 నవంబర్ తరహా దాడులు ఇంకొకసారి పునరావృతం కాకుండా పాకిస్తాన్ పడవలను మన ప్రభుత్వం సముద్రంలోనే ఎలా పేల్చివేసి భారతీయులను కాపాడిందో గుర్తు తెచ్చుకోండి. " ఇంకొక సారి పాకిస్థాన్ అటువంటి దాడికి తెగబడిందా - ఇక అది బెలూచిస్తాన్ ను వదలుకోవాలసిందే" అని ధైర్యంగా గర్జించిన ప్రధానిని మీరు ఇంతకుముందు చూసారా? చెప్పండి. కారణం ఎవరు????
39) మన ఈశాన్య రాష్ట్రాలలో సరిహద్దు రోడ్ల నిర్మాణానికి అనుమతించింది ఈ ప్రభుత్వమే. ఇంతవరకు ఈ ఫైలు UPA హయాంలో పక్కన పెట్టబడింది. Asian Development Bank కూడా చైనా ఆక్షేపణలను దృష్టిలో ఉంచుకుని మనకు నిధులు విడుదల చేయలేదు. దీనివల్ల మన రక్షణ విషయంలో గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య ధోరణి వహించిందో తెలుస్తోంది. ఇప్పుడు చూడండి మన సైన్యం ఎంత రెట్టించిన ఉత్సాహంతో ఉరకలు వేస్తోందో! కారణం ఎవరు????
40) భారత్ యుద్ధవాతావరణం లో ఉన్న "యెమెన్" దేశం నుంచి 4500 పైగా భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకు వచ్చింది. ఆ సమయంలో సౌదీ అరేబియా దేశం యెమెన్ పై దాడులు చేస్తోంది. కొన్ని గంటలు కాల్పుల విరమణకు సౌదీ అరేబియా ను ఒప్పించి మన దేశం విమాన సర్వీసులను నడిపింది. అవన్నీ మన మంత్రులు సుష్మా స్వరాజ్, జనరల్ వీ.కే. సింగ్ మరియూ మన భద్రతా అధికారి అజిత్ దోవాల్ లు దగ్గర ఉండి మరీ పర్యవేక్షించారు. అదికాక 41 దేశాలనుంచి ఇబ్బందులలో ఉన్న వివిధ భారతీయులను వివిధ సమయాలలో క్షేమంగా ఇంటికి చేర్చింది. భారత్ నిబద్ధత పట్ల ప్రపంచ దేశాలు ఎన్నో భారత్ ను కీర్తించాయి. కారణం ఎవరు????
41) భారత వైమానిక దళం రోజు రోజుకూ బలహీనపడుతూ వస్తూ ఉంటే, మోడీ ప్రభుత్వం రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. ఫ్రాన్స్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన 36 విమానాలకు పచ్చజెండా ఊపింది. మధ్యవర్తులు లేరు. కమిషన్లు లేవు. కారణం ఎవరు????
42) 42 ఏళ్లుగా ఏ ప్రధాని కూడా కెనడా వెళ్ళలేదు, కానీ మోది అక్కడకు వెళ్ళింది సరదా కోసం కాదు, కెనడా ని ఒప్పించి రాబోయే 5 సంవత్సరాలకు మన అణువిద్యుత్ కేంద్రాలకు యురేనియం ను కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది మన ప్రభుత్వం.
43) ఇంతవరకూ మనం అణు రియాక్టర్ లకై అమెరికా, రష్యా లను అడుక్కుంటూ వస్తున్నాం. వారు మనపై ఉన్న అనుమానాలతో ఎంతవరకూ అవసరమో అంతవరకే ముష్టి వేస్తూ మనం అడిగినవన్నీ కాక వారు ఇవ్వదలచుకున్నవే ఇస్తూ వచ్చేవారు. అటువంటిది మోది ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని ఒప్పించి Make in India లో భాగంగా ఫ్రాన్స్ మనతో కలసి అణుశక్తి నిర్మాణాలలో భాగం పంచుకునేలా చేయగలిగారు. కారణం ఎవరు????
44) అమెరికా అధ్యక్షుడు ఒబామా రిపబ్లిక్ డే ఉత్సవాలకు భారత్ వచ్చినపుడు ఆయనను ఒప్పించి Nuclear Fuel Tracking అనే నియమాన్ని అమెరికా పక్కన పట్టేలా చేసారు మన ప్రధాని. దీనివల్ల 16 కొత్త అణు రియాక్టర్ లకు మార్గం సుగమం అయింది.దీనితో మన దేశం లో ఇక విద్యుత్ కొరత అనేది లేకుండా చేయడంలో మన కృషికి మార్గం సులువైంది. కారణం ఎవరు????
45) భారత్ ను తిట్టిన నేపాల్ ప్రధానితోనే భారత్ కు జై కొట్టడానికి కారణం ఎవరు???
46) మా దేశనాశనానికి, విచ్ఛిన్నానికి భారత్ కుట్రలు పన్నుతుంది. చైనా కు దగ్గరవడంతో మా దేశంలో అల్లర్లు సృష్టించి, నన్ను దింపడానికి భారత ప్రధాని ప్రయత్నిస్తున్నారు. చైనాకు మద్దతు తెలియజేసినందు వల్లనే నా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాడు అని 2016 లొ భారత్ ను తిట్టి రాజీనామా చేసిన నేపాల్ ప్రధాని ఓలి.. ఇప్పుడు మరలా ప్రధాని అయిన తరువాత మూడు రోజుల భారత పర్యటనకు వచ్చి మరీ భారత్ ను పొగడ్తలతో ముంచెత్తారు, భారత్ ను ఆకాశానికెత్తాడు. కారణం ఎవరు???
47) అంతేకాదు 58 మంది డెలిగేట్స్ ను తీసుకువచ్చి, భారత తో పెద్దఎత్తున ధ్వైపాక్షిక సంబంధాలు కుదుర్చుకోవడమే కాకుండా.. భారత్ నుండి నేపాల్ కు రైల్వే లైన్ నిర్మాణానికి (Khathmandu to Raxaul) ఒప్పందం చేసుకోవడం విశేషం. ఇది చైనాకు అసలు మింగుడు పడని అంశం. ఎందుకంటే ఇంతకుముందు ఓలి ని తన చెప్పు చేతలలోకి తీసుకున్న చైనా.. భారత్ కు వ్యతిరేకంగా పెద్ద కుట్ర చేసింది. కాగా ఇప్పుడు అదే ఆటను మోది, చైనా పైన ప్రయోగిస్తున్నారు. కారణం ఎవరు???
48) ఇన్కమ్ టాక్స్ పరిధిలోకి ఇప్పటిదాకా ఎగ్గొట్టిన 24 లక్షల మంది వచ్చారు నోట్ల రద్దుతో.. దీనికి కారణం ఎవరు???
49) ప్రతి గ్రామా పంచాయతి 100% నిధులు కేంద్ర ప్రభుత్వం వే.. కారణం ఎవరు???
50) ఉపాధి హామీ పథకం "సంబంధించిన ప్రతీ రూపాయి కేంద్రం నిధులే... కారణం ఎవరు???
51) జాతీయ సహకార అభివృద్ధి తరపున యాదవులకు గొర్రెల పంపిణి కోసం మొత్తం కేంద్రం నిధులే...అక్షరాల 4,000 కోట్లు కేంద్రనివే... కారణం ఎవరు???
52) ఇప్పుడు TRS నాయకులు అందుకుంటున్న సబ్సిడీ ట్రాక్టర్ లు 100% కేంద్రం నిధులే.. కారణం ఎవరు???
53) నేడు ప్రతి గ్రామంలో ప్రతి పట్టణం లో 24 గంటలు కరెంటు వుంటుంది అంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వమే 100% నిధులు కేంద్రం వే..  కారణం ఎవరు???
54) ముద్రయోజన పథకం కింద బ్యాంకు ద్వారా లాభపడ్డ చిన్నచిన్న చిరువ్యాపారుల నిధులు కేంద్రానివే.. కారణం ఎవరు???
55) అన్ని కార్పోరేషన్ నిధులు కేంద్రనివే... కారణం ఎవరు???
56) ప్రధాన మంత్రి వికాస్ యోజన కింద "ప్రతి మండలంలో మోడల్ స్కూల్స్ నిధులు 100% కేంద్రంవే'.. కారణం ఎవరు???
57) స్వచ్ఛ్ భారత్ కింద ప్రతి మరుగు దొడ్లు.. కేంద్రం నిధులే..... కారణం ఎవరు???
58) ఉజ్వల యోజన కింద...పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు...100% కేంద్రము నిధులే.... కారణం ఎవరు???
59) బాలింతకు ఇచ్చే 12,000 రూపాయలతో 6,000 రూపాయలు కేంద్రనివే.... కారణం ఎవరు???
60) పన్నులు సరిగ్గా కట్టిస్తా , అవినీతిని పెకిలిస్తా, పెద్ద నోట్లు రద్దు చేస్తా , నల్లధనం బయటికి రప్పిస్తా, GST అమలు చేస్తా , కఠినమైన సంస్కరణలు తీసుకొస్తా అని చెప్పే దమ్మున్న నాయకుడు ఎవరు???
61) మా కులపోళ్లు, మా కొడుకులు , కూతుళ్లు , మనవళ్లు , బామ్మర్దులు, అల్లుళ్లు మీకు నాయకులు తరతరాలుగా మీరు అంతా మాకు ఓట్లేసి మా దొడ్డి లో పాలేర్లు గా హాయిగా బ్రతకండి అని కాకుండా మీరు అందరూ నాకు సమానం అని చెప్పే నాయకుడు ఎవరు????
62) రూపాయి అప్పు చేయకుండా ప్రభుత్వాన్ని నడిపిన ధీరుడు ఎవరు???
63) దేశం ప్రథమం, పార్టీ మథ్యం , స్వార్ధం అథమం అనే సూత్రాన్ని మనసా వాచా కర్మణా ఆచరించి చూపించిన నాయకుడు ఎవరు????

మోది, మోది, మోది, మోది, మోది, మోది, మోది, మోది, మోది, మోది, మోది, మోది, మోది, మోది, మోది, మోది

మోదీజీ నాయకత్వంలో మార్పు వచ్చిందా లేదా? చెప్పండి.
1) 2014 లో కందిపప్పు 180 రూపాయలు.
ఇప్పుడు 80 రూపాయలు
2) 2014 లో మినపప్పు 160 రూపాయలు.
ఇప్పుడు 70 రూపాయలు
3) 2014 లో నూనె 120 రూపాయలు.
ఇప్పుడు 90 రూపాయలు.
4) 2014 లో బియ్యం 25 కేజీలు 1300 రూపాయలు. ఇప్పుడు 1,000 రూపాయలు
5.ఇళ్ల స్థలాలు,ప్లాట్లు రేట్లు తగ్గాయి.
6) సిలిండర్ రేటు 2014 లో 1,200 రూపాయలు.
ఇప్పుడు 750 రూపాయలు. బుక్ చేసిన 5 రోజుల్లో సిలిండర్ వస్తున్నది.
7) పేదప్రజలకు కేంద్రప్రభుత్వం 2లక్షల ఇల్లు ఉచితముగా మంజూరు చేసింది.
😎 మరుగుదొడ్లు ఉచితంగా కట్టి, ఇస్తుంది. ముద్ర లోనులు మంజూరు చేస్తుంది.
9) రేషన్ బియ్యాన్ని కేంద్రం ఇస్తుంది. రూ.29.
60 kg
10) పెన్షన్ 750 రూపాయలు కేంద్రం ఇస్తుంది.
11) వికలాంగులకు 1,300 రూపాయలు కేంద్రం ఇస్తుంది.
12) గ్రామములో ప్రతిపనికి కేంద్ర నిధులు. MGNRGES
13) 26 రాష్ట్రాలలో 24 గంటల విద్యుత్ ను కేంద్రం ఇస్తుంది.అసలు విద్యుత్తే లేని 18,000 గ్రామాల్లో పూర్తిగా విద్యుత్ ని ఇస్తుంది.
14) రైతులకు ట్రాక్టర్లకు సబ్సిడీ కేంద్రం ఇస్తుంది. యూరియా లో వ్యాపా ను కలపడం కల్తీని అరికట్టడం జరిగింది.
15) రూపే కార్డ్ ద్వారా 1.62 లక్షల కోట్ల ను ఆదా చేయడం జరుగుతుంది. మీరు కుడా Visa, Master కార్డ్ లను తక్షణం తిరిగి ఇచ్చి, Rupay కార్డును తీసుకోండి. 1 రూపాయి నుండి 2 రూపాయల వరకు దేశానికి ఆదా అవుతుంది.
16) అసంఘిత కార్మికులకు బీమా కేంద్రం ఇస్తుంది.
17) సామాన్యప్రజలు బతకడానికిఎన్నో పథకాలను ప్రవేశ పెట్టింది. వీటిలో సుకన్య యోజన పథకం, అటల్ పెన్షన్ యోజన, ముద్రయోజన..
ఇవి అన్నీకేంద్రానివే.
18) నోట్ల రద్దువలన దొంగనోట్లు పనికిరాకుండా పోయాయి. డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. కాశ్మీర్ అల్లర్లు తగ్గాయి.
19) 2014లో ఒక GB డేటా Rs.350/-,
2017లో కేవలం
Rs. 5/-,కాల్స్ పూర్తిగా ఉచితం

ఇది మోది యుగం

20) 2014 కి ముందు కనీస విమాన టికెట్ 5,000/-
ఆ తరువాత 1,900/- లకన్నా తక్కువ
21) అంగన్వాడీ వర్కర్లకు వచ్చే నిధులు (పిల్లలకు పౌష్టికాహారం, గుడ్లు మధ్యాహ్న భోజనం) కేంద్రం నిధుల నుంచే అని ఎంతమందికి తెలుసు?
22) గుండెజబ్బులతో బాధపడే సామాన్యులకు మేలు చేకూరేలా స్టంట్ ధరలను తగ్గించిన మోది ప్రభుత్వం.
రు.1,21,000 గా ఉన్న సగటు గరిష్ట స్టంట్ ధర..
ప్రస్తుతం రు.27,890 గా ఉంది
23) ఆథార్ ద్వారా నిజమైన లభ్దిదారులకు లాభం. 57 వేల రూపాయల ఆదా అయింది.
24) ఇప్పటి వరకు ఒక అవినీతి వాసన తగలలేదు.
25) చైనాను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు.
26) ప్రపంచంలో పాకిస్థాన్ ని ఏకాకిని చేయడం జరిగింది.
27) 10 ASEN దేశాలతో  మంచి మైత్రి నెలకొల్పారు.
యూపీఏ సర్కారు ముగింపు దశలో జీడీపీ 4.4% అని మర్చిపోయారు.
మీరు ఇప్పుడు 7+, దేశ భద్రతను కట్టు దిట్టం చేశారు. ఒకేసారి పాక్ చైనా యుద్ధానికి వస్తే నిలువరించేందుకు అస్త్రశస్త్రాలను దేశానికి సమకూర్చారు, ఈరోజు ఇండియాకు ప్రపంచ దేశాలు సెల్యూట్ చేస్తున్నాయంటే సంపన్న దేశమనే కాదు.. ఆయుధ సంపత్తి ఉన్న దేశమని కూడా. ముందు దేశభద్రత కట్టుదిట్టంగా ఉంటేనేగా మనం స్వేచ్ఛగా జీవించగలం, లేదంటే మన దేశం శవాల దిబ్బలుగా మారుతుంది.

నరేంద్ర మోదికి ఇతర నాయకులలా Xmas తాతయ్య వేషాలు వేయడం, ఇఫ్తార్ విందులకి వెళ్లి తలపై టోపీలు పెట్టుకుని వెకిలివేషాలు వేసి, ప్రజల్ని ఏమార్చడం తెలీవు.
అమెరికా వెళ్లినా దసరా నవరాత్రులలో ఉపవాస దీక్ష ఆచరించడం మాత్రమే తెలుసు. తరతరాలకి సరిపడా ఆస్తులు కూడబెట్టాలనే ఆశ, అవసరం కూడా ఆయనకి లేవు. ఎందుకంటే మనలాగా కుటుంబ బాంధవ్యాలు లేవు గనుక. తన తర్వాత అర్హత ఉన్నా, లేకున్నా (చాలా మంది నాయకుల్లా) యువరాజ పట్టాభిషిక్తుణ్ణి చేసి, మంది మీద రుద్దడానికి కడుపున పుట్టిన వారసుడూ లేడు.
నేను చెప్పినవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఎవరి పరిపాలనలో అయినా మంచి - చెడు..... రెండూ జరుగుతాయి. టోటల్ గా దేశానికి ఎక్కువ మంచి జరిగిందా... లేదా? అని చూడాల్సి ఉంది. ఎవరు ఎంత గింజుకున్నా మా అభిమాన నాయకుడు నరేంద్రుడే అని చెప్తాం.. అలా చెప్పడానికి గర్వపడతాం! దేశభక్తులం కదా? మాకు దేశ సౌభాగ్యమే ముఖ్యం. దేశమంటే మనుషులు, మట్టి దిబ్బలు కాదు!
భారత్ మాతా కీ జై..
జై జవాన్ - జై కిసాన్..
జై హింద్..!!
note: ఒక వాట్సాప్ సమాచారంనుండి. 

irony in the present situation:

Someone has nicely explained the irony in the present situation:

“ Never have I seen
such a mess in life.

The air is pure but
wearing a mask is
mandatory.

Roads are empty
but it is impossible
to go on long drive.

People have clean
hands but there is a
ban on shaking hands.

Friends have time to
sit together but they
cannot get together.

The cook inside you
is crazy, but you cannot
call anyone for lunch or
dinner.

Every Monday,
the heart longs to go out, but the weekend does not seem to end.

Those who have money
have no way to spend it.

Those who don't have
money have no way to
earn it.

There is enough time
on hand but you can't
fulfill your dreams.

The culprit is all around
but cannot be seen.

Normally, everyone should live positive, now scared to be 'positve'

A world full of irony!
Be positive but test negative.”

ఆత్మావలోకనం (రెండు కట్టెలు)

యథా కాష్టా౦చ కాష్ట౦చ
సరుయేతాం మహోదదే
సమత్వ చవ్యపే ఏతాం
తద్యద్భూత సమాగ మమ్.

''సముద్రంలో కొట్టుకొస్తున్న రెండుకట్టెలు తడిసి ,
ఒకదానికి ఒకటి అంటుకుపోతాయిఅలాకొంత దూరం
జంటగా వెళ్ళాకఅలల తాకిడికివిపరీతమైన గాలికి ,
అవి మళ్ళీ విడిపోతాయిఒకటికిఒకటి దూరమై మళ్ళీ కలసుకోవు.

మన ఆర్యులు చిన్న చిన్న శ్లోకాలలో యెంతో నిగూఢ అర్ధాలతో మన మేధస్సుకి పదును పెట్టె టటువంటివి 
మన హిందూ వాగ్మయంలో కోకొల్లలు. ఈ శ్లోకం చుడండి యెంత చిన్నగా వుంది అనంతమైన జీవిత పరమార్ధాన్ని చెప్పుతున్నది.   
ఇక్కడ కట్టెలు అంటే రెండు జీవితాలు అవి సముద్రములో కొట్టుకొని వస్తువున్నాయి అంటే కాల ప్రవాహంలో కొట్టుకొని వస్తువున్నాయి అంటే ఒక జీవి ముందుగా వున్నది దానికి ఇంకొక జీవి కాల ప్రవాహంలో కొట్టుకొని వచ్చి కలిసి వున్నది అంటే.  ముందుగా వున్న నీ తల్లితండ్రులు మొదలైన పెద్దవారితో నీవు కాల ప్రవాహంలో కొట్టుకొచ్చి కలిసి వున్నావు.  తరువాత భార్య, పిల్లలు అనే కట్టెలు నీ కట్టెకు కొంత కాలం కలిసి ఉన్నతాయి.  అంతా కాల ప్రవాహంలో కొంతకాలమే కలిసి ఉంటాయి తరువాత కాల ప్రవాహంలో వేటికి అవే విడిపోతాయి. చివరికి ఏ కట్టెకు ఆ కట్టే మిగిలివుంటుంది.  తరువాత అది కూడా నాశనం అయి పోతున్నది. ఇప్పుడు చెప్పండి మన జీవితంలో కొంత కాలం కలిసి వుండే ఈ కాల సముద్రంలో మనం విడిపోతాం అని తెలిసికూడా ఒక కట్టమీద ఇంకొక కట్టెకు మమకారం, వ్యామోహం, వ్యాకులత, చింత ఎందుకు.  ఎట్లాగో ఆ కట్టే అంటే సంబంధం కొంత కాల ప్రవాహం తరువాత విడిపోయేదే కదా. ఈ ఒక్క శ్లోకం చాలు మనిషిని అద్వయితం  వైపు మళ్లించటానికి. ఇది నాది, వీళ్ళు నా వాళ్లు  వాళ్లు పరాయి వాళ్ళు అనే భావన యెంత ముర్కమైనదో అని అనిపిస్తుంది. కేవలం కొంత కాలం కలిసి వుండే కొట్టుకోవచ్చిన కట్టెల వంటి వాళ్ళం అనే నిజం తెలుసుకుంటే ప్రతి మనిషి మనస్సులో ఆధ్యాత్మిక భావనాలు కలుగుతాయి. జిజ్ఞాసువులుగా మారుతారు. మోక్షార్థులు  అవుతారు. చివరికి మోక్షాన్ని పొందుతారు.   
అహంభావానికి  కొంతమంది ఆత్మాభిమానం అనే ముసుకు వేసుకుంటారు.  తానే గొప్ప వాడని, తనకే అన్ని తెలుసని. అందరిని చిన్న చూపు చూస్తూ అందరికి కంటు అవుతారు.  వినయ విదేతలు వున్నవారు అందరిని కలుపుగోలుగా కలుపుకొని తాను ఉన్న స్థితిని ఇతరులు గుర్తించేరట్లు ప్రవర్తించి నలుగురికి మంచి నేర్పుతారు తానూ మంచి నడవడిక కలిగి వుంటారు. అహంభావాన్ని వీడటమే ముముక్షువు చేయవలసిన మొదటి సాధన.  
అందరు జిజ్ఞాసువులు గా మారాలని ఆకాంషించే 
బుధజన విధేయుడు 
భార్గవ శర్మ 



కేశవ నామాల విశిష్టత



మనము ఏ శుభకార్యం చేయాలన్నా, ఏ వ్రతము, ఏ నోము నోయాలన్నా, ఏ యజ్ఞము చేయాలన్నా సంకల్పానికి ముంచుగా ఆచమనము చేస్తూ

 కేశవాయనమః,,నారాయణాయనమః,,
మాధవాయనమః

    అని ఉద్ధరిణితో నీళ్ళు తీసుకుని 3సార్లు తీర్థము తీసుకుని,తరువాత గోవిందాయనమః అని నీరు వదలుతాము.ఈ 24 కేశవ నామాలు  చెప్పడంలో విశిష్టత ఏమి? దాని విషయము, అర్థము తెలుసుకొని ఆచరిస్తే కార్యము అర్థవంతము అవుతుంది.ఏదైనా దాని విశిష్టత తెలుసుకొని చేస్తే  ఆ కార్యము పైన ఎక్కువ భక్తి శ్రద్ధలు ఏర్పడి మనస్సులో దానిపైన పరిపూర్ణమైన విశ్వాసము కలుగుతుంది.ప్రీతితో కార్యము చేస్తాము.

1. ఓం కేశవాయనమః
(శంఖం చక్రంగద_పద్మం)

    బ్రహ్మ రుద్రులకు ప్రవర్తకుడూ,నియామకుడూ అయినందువల్ల శ్రీహరి ‘కేశవుడు’అనబడుతున్నాడు.ఈ కేశవుడు గాయత్రిలోని ‘తత్’ అన్న మొదటి అక్షరానికీ,‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అన్న మహామంత్రం లోని ‘ఓం ’అన్న అక్షరానికీ,ఇరవై నాలుగు తత్వాలలో మొదటిదైన అవ్యక్త తత్వానికీ,మార్గశీర్షమాసానికీ,శుక్లపక్షంలో లలాటంమీద ధరించే ద్వాదశ ఊర్ధ్వపుండ్రాలలో ఒకటైన నామానికీ,మేషరాశికీ,ఆహారపదార్థాలలో ఒకటైన అన్నానికీ నియామకుడు.

2. ఓం నారాయణాయనమః (పద్మంగదచక్రం_శంఖం)

    నాశరహితుడైనందువల్ల విష్ణువు ‘నరుడు’ ఆయన చేత,సృష్టించబడిన జలం ‘నార’అనబడుతోంది.ప్రళయోదకం మీద శయనించిన విష్ణువు ‘నారాయణుడు’ అయ్యాడు.
    ఈయన వాసుదేవ మహామంత్రంలోని‘న’అక్షరానికీ,గాయత్రిలోని‘స’అన్న అక్షరానికీ,మహత్తత్వానికీ,పౌష్యమాసానికీ,శుక్లపక్షంలో ఉదరం మీద ధరించే నామానికీ,వృషభరాశికీ, పరమాన్నానికీ,     ప్రాతఃకాలానికీ     నియామకుడు.

3. ఓం మాధవాయ నమః
(చక్రంశంఖంపద్మం_గద)

    ‘మధు’నామక యదువంశ శాఖలో జన్మించడంవల్లా,రమాదేవికీ పతి అయినందువల్లా,సర్వోత్తముడు అయినందువల్లా,శ్రీహరి ‘మాధవుడు’ అయ్యాడు.
    ఈ మాధవుడు వాసుదేవ మహామంత్రంలోని‘మో’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘వి’అన్న అక్షరానికీ,అహంకారతత్వానికీ,మాఘమాసానికీ,శుక్లపక్షంలో హృదయంమీద ధరించే నామానికీ,మిథునరాశికీ,భక్ష్యాలకూ నియామకుడు.

4. ఓం గోవిందాయ నమః
(గదపద్మంశంఖం_చక్రం)

    వేదాల మూలంగా పొందబడేవాడూ,భూమినీ,గోవులనూ రక్షించేవాడూ,మోక్షప్రదుడూ అయినందువల్ల శ్రీహరి ‘గోవిందుడు’ అనబడుతాడు.ఈ గోవిందుడు వాసుదేవ మంత్రంలోని‘భ’అన్న అక్షరానికీ’గాయత్రిలోని“తుః”అన్న అక్షరానికీ,మనస్తత్త్వానికీ,పాల్గుణ మాసానికీ,
    శుక్లపక్షంలో కంఠ మధ్యలో ధరించే నామానికీ,కర్కాటక రాశికీ,నేయికీ నియామకుడు.

5. ఓం విష్ణవే నమః
(పద్మంశంఖంచక్రం_గద)

జ్ఞానానందాది సమస్త గుణాలతో,దేశతఃకాలతః వ్యాప్తుడైనందువల్లా సర్వోత్తముడై ఉన్నందువల్లా శ్రీహరి “విష్ణువు” అనబడుతున్నాడు.
ఈ విష్ణువు వాసుదేవ మహా మంత్రంలోని‘గ’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘వ’అన్న అక్షరానికీ కర్ణతత్త్వానికీ,చైత్రమాసానికీ,శుక్లపక్షంలో ఉదరం యొక్క దక్షిణ పార్శ్వంలో ధరించే నామానికీ,సింహరాశికీ,పాలకూ నియామకుడు.

6.ఓం మధుసూదనాయ నమః (శంఖంపద్మంగద_చక్రం)

    “మధు”నామక దైత్యుడిని సంహరించినందువల్లా,సాత్త్విక లోకానికి సుఖాన్ని ప్రసాదించేవాడైనందువల్లా శ్రీహరి‘మధుసూదనుడు’  అనబడుతున్నాడు. ఈ మధుసూదనుడు వాసుదేవ మహామంత్రంలోని‘వ’అన్న అక్షరానికీ,గాయత్రిలోని
    ‘రే’అన్న అక్షరానికీ,త్వక్ తత్త్వానికీ,వైశాఖమాసానికీ,శుక్లపక్షంలో కుడిస్తనంమీద ధరించే నామానికీ,కన్యారాశికీ,మధుర భక్ష్య విశేషానికీ నియామకుడు.ఈ మధుసూదనుడు‘హస్తిని’నాడిలో ఉంటాడు

7. ఓం త్రివిక్రమాయ నమః (గదచక్రంశంఖం_పద్మం)

    మూడు వేదాలనూ,మూడు కాలాలనూ,సత్త్వాది మూడు గుణాలనూ,భూరాది మూడు లోకాలనూ,త్రివిధ జీవులనూ,చేతన అచేతన మిశ్రములన్న త్రివిధ ద్రవ్యాలనూ తన స్వరూపంతో వ్యాపించి నెలకొన్న కారణంగా శ్రీహరి ‘త్రివిక్రముడు’ అనబడుతాడు.
    వాసుదేవ మహామంత్రంలోని “తే”అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘ణి’అన్న అక్షరానికీ,నేత్ర తత్త్వానికీ,జ్యేష్ఠమాసానికీ,శుక్లపక్షంలో కుడిభుజం మీద ధరించే నామానికీ,తులా రాశికీ,వెన్నకూ నియామకుడు.

8. ఓం వామనాయ నమః
(చక్రంగదపద్మం_శంఖం)

అపేక్షిత సుఖాలనూ,అభీష్టాలనూ కరుణించేవాడూ,మోక్ష విరోధులైన దైత్యులను అంధకారంలో నెట్టివేసేవాడూ అయినందువల్ల శ్రీహరి‘వామనుడు’ అనబడుతున్నాడు. 
ఈయన వాసుదేవ మహామంత్రంలోని‘వా’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘యం’అన్న అక్షరానికీ  జిహ్వాతత్త్వానికీ,ఆషాడమాసానికీ,శుక్ల పక్షంలో కంఠం కుడివైపున ధరించే నామానికీ,వృశ్చికరాశికీ,పెరుగుకూ నియామకుడు.

9. ఓం శ్రీధరాయ నమః
(చక్రంగదశంఖం_పద్మం)

శ్రీ శబ్దవాచ్య అయిన మహాలక్ష్మికి కూడా ధారణకర్తా,పోషణకర్తా అయినందువల్లా లక్ష్మిని సర్వదా తన వక్షస్థలంలో ధరించి ఉండడం చేతా శ్రీహరి‘శ్రీధరుడు’ అనబడుతున్నాడు.

    ఈయన వాసుదేవ మహామంత్రంలోని‘సు’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘భ’అన్న అక్షరానికీ,ఘ్రాణతత్త్వానికీ,శ్రావణమాసానికీ,శుక్లపక్షంలో ఉదరం ఎడమ భాగంలో  ధరించే నామానికీ,ధనూరాశికీ,ముద్దపప్పుకూ నియామకుడు.

10. ఓం హృషీకేశాయ నమః
(చక్రంపద్మంశంఖం_గద)

ఇంద్రియ నియామకుడూ,రమ,బ్రహ్మ,రుద్రాదులకు ఆనందాన్ని ఇచ్చేవాడూ అయినందువల్ల శ్రీహరి ‘హృషీకేశుడు’  అనబడుతున్నాడు.

    ఈయన వాసుదేవ మహామంత్రంలోని ‘దే’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘ర్గో’అన్న అక్షరానికీ,వాక్‍తత్త్వానికీ,భాద్రపద మాసానికీ,శుక్లపక్షంలో ఎడమ భుజంమీద ధరించే నామానికీ,మకర రాశికీ,ఆకుకూరలతో తయారుచేసిన పదార్థాలకూ నియామకుడు.

11. ఓం పద్మనాభాయ నమః
(పద్మంచక్రంగద_శంఖం)

నాభిలో పద్మాన్ని కలిగినవాడూ,భక్తుల మనస్సులో ప్రకాశించేవాడూ,సూర్యకాంతి వంటి కాంతి కలిగినవాడూ అయినందువల్ల శ్రీహరి‘పద్మనాభుడు’ అనబడుతున్నాడు.

    ఈయన వాసుదేవ మహామంత్రం లోని‘వా’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘దే’అన్న అక్షరానికీ,పాణితత్త్వానికీ,
    ఆశ్వయుజమాసానికీ,శుక్ల పక్షంలో కంఠం ఎడమభాగంలో ధరించే నామానికీ,కుంభరాశికీ,కూరగాయలతో తయారుచేసే పదార్థాలకు నియామకుడు.

12. ఓం దామోదరాయ నమః
(శంఖంగదచక్రం_పద్మం)

యశోదచేత పొట్టకు బిగించబడిన
తాడుగలవాడూ,ఇంద్రియనిగ్రహం కలిగిన ఋషులతో క్రీడించేవాడూ,దానశీలురకు ఆనందాన్ని ఇచ్చేవాడూ,దైత్యులకు దుఃఖం కలిగించేవాడూ,దయాయుక్తులైన జీవులతో క్రీడించేవాడూ అయినందువల శ్రీహరి‘దామోదరుడు’ అనబడుతున్నాడు.

    ఈయన వాసుదేవ మహామంత్రంలోని‘య’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘వ’అన్న అక్షరానికీ,పాదతత్త్వానికీ,కార్తీకమాసానికీ,శుక్లపక్షంలో మెడపైన ధరించే నామానికీ,మీనరాశికీ,అన్ని రకాల పుల్లని పదార్థాలకీ నియామకుడు.

13. ఓం సంకర్షణాయ నమః
(శంఖంపద్మంచక్రం_గద)

భక్తుల చిత్తాన్ని ప్రాపంచిక విషయాలనుండి మరలించి వైరాగ్య భావాన్ని కరుణించేవాడైనందువల్ల శ్రీహరి‘సంకర్షణుడు’ అనబడుతున్నాడు.

    ఈయన గాయత్రిలోని‘స’అన్న అక్షరానికీ,పాయు తత్త్వానికీ,కృష్ణపక్షంలో నుదిటిపై ధరించే నామానికీ,ఆమ్ల మిశ్రమాలు కాని పదార్థాలకీ,
    మనోమయకోశానికీ,క్షత్రియవర్ణానికీ,స్త్రీశరీరానికీ,ఋతుసామాన్యానికీ,రుద్రునికీ,మధ్యాహ్నసవనానికీ,ఆవేశరూపాలకూ,రాజసద్రవ్యాలకూ,త్రేతాయుగానికీ,శరదృతువుకూ నియామకుడు.

14. ఓం వాసుదేవాయ నమః
(శంఖంచక్రంపద్మం_గద)

త్రిలోకాలకూఆవాసస్థానమైనవాడూ,సర్వాంతర్యామీ,సర్వశక్తుడూ,సర్వచేష్టకుడూ,సర్వాభీష్టప్రదుడూ,యోగ్యజీవులకు ముక్తిని అనుగ్రహించేవాడూ,వసుదేవసుతుడూ అయినందువల్ల శ్రీహరి ‘వాసుదేవుడు’అనబడుతున్నాడు.

    ఈయన గాయత్రిలోని‘ధీ’అన్న అక్షరానికీ,ఉపస్థతత్త్వానికీ,కృష్ణపక్షంలో ఉదరమధ్యంలో ధరించే నామానికీ,పంచదారకూ,బెల్లానికీ,బ్రాహ్మణవర్గానికీ,పురుషశరీరానికీ,సాయంసవనానికీ,అవతారరూపాలకూ,శుభద్రవ్యాలకూ,కృతయుగానికీ,హేమంత ఋతువుకూ నియామకుడు.

15. ఓం ప్రద్యుమ్నాయ నమః
(శంఖంగదపద్మం_చక్రం)

అసదృశమైన కాంతీ,యశస్సు కలిగి ఉన్నందువల్ల శ్రీహరి ‘ప్రద్యుమ్నుడు’అనబడుతున్నాడు.

    ఈయన గాయత్రిలోని‘మ’అన్న అక్షరానికీ,శబ్దతత్త్వానికీ,కృష్ణపక్షంలో హృదయభాగంలో ధరించే నామానికీ,వడపప్పు మొదలైన పదార్థాలకూ,వైశ్యవర్ణానికీ,స్త్రీ శరీరానికీ,అయనానికీ,ప్రాతఃసవనానికీ,లీలారూపాలకూ,పీతవర్ణ ద్రవ్యాలకూ,ద్వాపరయుగానికీ,వర్ష ఋతువుకూ నియామకుడు.

16. ఓం అనిరుద్ధాయ నమః
(గదశంఖంపద్మం_చక్రం)

ఎవ్వరిచేతా నిరోధించబడనివాడూ,సర్వశక్తుడూ,గుణపూర్ణుడూ,మనస్సుతో సంపూర్ణంగా తెలియబడనివాడూ,జ్ఞానుల మనసులలో ధ్యానంతో బంధించబడేవాడూ,వేదవిరుద్ధ ఆచార నిరతులను సంహరించేవాడూ అయినందువల్ల శ్రీహరి ‘అనిరుద్ధుడు’అనబడుతున్నాడు.

    ఈయన గాయత్రిలోని‘హి’అన్న అక్షరానికీ,స్పర్శతత్త్వానికీ,కృష్ణపక్షంలో కంఠ మధ్యభాగంలో ధరించే నామానికీ,చేదుపదార్థాలకూ,శూద్ర వర్ణానికీ,అన్నమయకోశానికీ,భోగ్యవస్తువులన్నింటికీ,  అబ్దానికీ,           నల్లని  ద్రవ్యాలకూ, కలియుగానికీ,  గ్రీష్మఋతువుకూ   నియామకుడు.

17. ఓంపురుషోత్తమాయనమః
(పద్మంశంఖంగద_చక్రం)

దేహనాశంగల సర్వజీవులూ క్షరపురుషులు.ఏ విధమైన నాశనమూలేని అప్రాకృత శరీరంగల శ్రీమహాలక్ష్మిదేవి అక్షరపురుష.ఈ ఉభయ చేతనులకంటే సర్వోత్తముడైనందువల్ల శ్రీహరి‘పురుషోత్తముడు’అనబడుతున్నాడు

    ఈయన గాయత్రిలోని ‘థి’అన్న అక్షరానికీ,రూపతత్త్వానికీ,కృష్ణపక్షంలో ఉదరం కుడిభాగంమీద ధరించే నామానికీ,ఇంగువ,యాలకులు,ఆవాలు,కర్పూరాలకూ నియామకుడు.

18. ఓం అధోక్షజాయ నమః
(గదశంఖంచక్రం_పద్మం)

ఇంద్రియ నిగ్రహం కలిగిన వసుదేవాదులవల్ల ప్రాదుర్భవించినవాడూ,నిత్యజ్ఞానస్వరూపుడూ,అక్షయకుమారుడిని సంహరించిన హనుమంతుడిచేత తెలియబడేవాడూ  అయినందువల్ల  శ్రీహరి    ‘అధోక్షజుడు’     అనబడుతాడు.

    ఈయన గాయత్రిలోని‘యో’అన్న అక్షరానికీ,రసతత్త్వానికీ,కృష్ణపక్షంలో కుడిస్తనంమీద ధరించే నామానికీ,పాలకూ,పానకమూ,మజ్జిగకూ,పచ్చిపులుసుకూ,నేతితో,నూనెతో వేయించిన పదార్థాలకూ నియామకుడు.

19. ఓం నారసింహాయ నమః
(పద్మంగదశంఖం_చక్రం)

నరుడిలాగా,సింహంలాగా ఉభయాత్మకమైన శరీరం కలిగివున్నందువల్ల శ్రీహరి ‘నారసింహుడు’అనబడుతాడు.

    ఈయన గాయత్రిలోని ‘యో’అన్న అక్షరానికీ,గంధతత్త్వానికీ, కృష్ణపక్షంలో కుడిభుజం మీద ధరించే నామానికీ,బూడిద గుమ్మడికాయ,నువ్వులు,మినుములతో తయారుచేసిన వడియాలు మొదలైన పదార్థాలకూ,ఈశాన్య దిక్కుకూ నియామకుడు.

20. ఓం అచ్యుతాయ నమః
(పద్మంచక్రంశంఖం_గద)

శుద్ధజ్ఞానానందాలే దేహంగా క

లవాడూ,సకలగుణ పరిపూర్ణుడూ,సత్య సంకల్పుడూ అయినందువల్ల సర్వదా పూర్ణకాముడూ,దోషరహితుడూ అయినందువల్లా శ్రీహరి ‘అచ్యుతుడు’అనబడుతున్నాడు.

    ఈయన గాయత్రిలోని‘నః’అన్న అక్షరానికీ,ఆకాశతత్త్వానికీ,కృష్ణపక్షంలో కంఠం కుడివైపున ధరించే నామానికీ,ఉద్దిపప్పుతో తయారుచేసే వడ మొదలైన వాటికి నియామకుడు.

21.ఓంజనార్థనాయనమః
(చక్రంశంఖంగద_పద్మం)

సముద్రంలో ఉండి తరచుగా దేవతల్ని పీడించే మధు,కైటభ,హయగ్రీవాది దైత్యులను మర్దనం చేసినవాడూ,  మోక్షప్రదుడూ,     జన్మలేనివాడూ,    సంసారదుఃఖాన్ని పరిహరించేవాడూ,సుజీవులచేత పొందబడేవాడూ అయినందువల్ల శ్రీహరి‘జనార్ధనుడ’య్యాడు.

    ఈ జనార్ధనుడు గాయత్రిలోని ‘ప్ర’అన్న అక్షరానికీ,వాయుతత్త్వానికీ,కృష్ణపక్షంలో ఉదరం ఎడమ భాగంలో ధరించే నామానికీ,ఉప్పుకూ,నైరుతి దిక్కుకూ నియామకుడు.

22.ఓంఉపేంద్రాయనమః
(గదచక్రంపద్మం_శంఖం)

ఇంద్రుడిని అనుజుడిగా పొంది ఉన్నందువల్ల శ్రీహరి   ‘ఉపేంద్రుడు’   అనబడుతున్నాడు.

    ఈ ఉపేంద్రుడు గాయత్రిలోని‘చో’అన్న అక్షరానికీ,తేజోతత్త్వానికీ,కృష్ణపక్షంలో ఎడమ స్తనం మీద ధరించే నామానికీ,అరటిపండు,కొబ్బరికాయ మొదలైన ఫలాలకీ,వాటి రసాలకీ,తూర్పు దిక్కుకూ నియామకుడు.

23. ఓంహరయేనమః
  (చక్రంపద్మంగద_శంఖం)

భక్తుల పాపాలను పరిహరించేవాడు కావడంచేత నారాయణుడు‘హరి’అనబడుతున్నాడు.

    ఈ హరి గాయత్రిలోని ‘ద’ అన్న అక్షరానికీ,అపోతత్త్వానికీ,కృష్ణపక్షంలో ఎడమ భుజంమీద ధరించే నామానికీ,తాంబూలానికీ నియామకుడు.

24. ఓంకృష్ణాయనమః
(గదపద్మంచక్రం_శంఖం)

  సృష్టి,స్థితి,సంహార నియమనాదుల వల్ల సకల జగత్తునూ తనలోనికి లాగికొనువాడూ,పూర్ణానంద స్వరూపుడూ,  నీలవర్ణ దేహకాంతికలవాడూ అయినందువల్ల శ్రీహరి“కృష్ణుడు”అనబడుతున్నాడు.

    ఈ కృష్ణుడు గాయత్రిలోని‘యాత్’ అన్న అక్షరానికీ,పృథ్వీతత్త్వానికీ,కృష్ణపక్షంలో మెడమీద ధరించే నామానికీ, త్రాగేనీటికీ,  దైహిక  కర్మకూ    నియామకుడు.
(సేకరణ)

అన్నదానం


అన్నం పరబ్రహ్మ స్వరూపం...ఏది లోపించినా బ్రతకగలం. కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అని చెప్తారు. ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా... ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కాని అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్నవారిని మనం సంతృప్తిపరచలేకపోవచ్చు కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తిపరచవచ్చు. అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారిని కూడా చూడవచ్చు. అన్నదానం చేయలేకయినా అన్నం పెట్టే ఇంటినన్నా చూపించమని పెద్దలు చెప్తారు. ఆకలితో ఉన్నవాడికి పట్టెడంత అన్నం పెడితే వచ్చే పుణ్యం ఎన్ని యజ్ఞాలు చేసినారాదని పూర్వీకులు చెప్పేవారు.

మనలో చాలా మందికి ” అన్నము” అంటే తెలియదు . బియ్యాన్ని ఉడికించి చేసిన పదార్ధాన్నే అన్నము అంటారని అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి ప్రతి మనిషికి పంచ కోశములు అని అయిదు కోశములు ఉంటాయి. అవి అన్నమయ , ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు . అన్నమయ కోశము స్థూల శరీరానికి సంబంధించినది. ఈ అన్నమయ కోశములో ప్రవేశించే అన్నము ప్రాణశక్తిగా మారుతున్నది.కనుక అన్నమయ కోశములోనికి వెళ్ళే ఆహారమే అన్నము అని అర్ధం. మనము ఏది తిన్నా అది అన్నమే అవుతుంది కేవలం బియ్యం ఉడికించినది మాత్రమే కాదు. అన్నమే అన్నకోశములో ప్రవేశించి ప్రాణంగా మారుతున్నందువలన అన్నదానం అంటే ప్రాణాన్ని దానం చేయడమే . అంతే కాదు ఒక ప్రాణం నిలవడానికి కావలసినది అన్నమే. కనుక అన్నదానం చేయడం శ్రేష్టం అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఏదైనా దానం చేసేప్పుడు విచక్షణ అవసరం కానీ అన్నదానానికి మాత్రం ఈ నియమం లేదు. అన్నదానం చేయడం అంటే వాళ్ళ ప్రాణాన్ని నిలపడమే కనుక అత్యంత శ్రేష్టం అయినది అన్నదానం.

దీనికి సంబంధించి ఒక కథనాన్ని కూడా చెప్తారు. మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించిన తరువాత స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ కర్ణునికి అన్ని సౌకర్యాలు లభించాయి. స్వాగత సత్కారాలు లభించాయి. ఏది కావాలంటే అది పొందే అవకాశం ఉంది. అన్నీ అందుబాట్లో ఉన్నాయి. ఏం లాభం...! కర్ణుడికి ఏదో అసంతృప్తి. ఏదో వెలితి. ఎంత తిన్నా కడుపు నిండినట్టుండడంలేదు. సంతృప్తినేది లేదు. ఎందుకు ఈ విధంగా ఉంటుందో అతనికర్థం కావడంలేదు. ఇదే మాట దేవేంద్రుడిని అడిగాడు కర్ణుడు. అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో, నీవు అనేక దానాలు చేసావని, అడిగినవాడికి లేదనకుండా ఇచ్చే దానకర్ణుడివని చెప్తారు. మరి.. ఎప్పుడైనా అన్నదానం చేసావా?’’ అనడిగాడు. దానికి సమాధానంగా లేదు.. నేనెన్నో దానాలు చేశాను గాని అన్నదానం మాత్రం చేయలేదు అన్నాడు కర్ణుడు. ‘‘పోనీ అన్నం పెట్టే ఇల్లయినా చూపించావా?’’ అనడిగాడు దేవేంద్రుడు. కాస్త ఆలోచించిన కర్ణుడు చెప్పాడు- ‘‘అవును. ఓ బీద బ్రాహ్మణుడు నా దగ్గరకు వచ్చి అన్నం పెట్టించమని అడిగాడు. అపుడు నేను ఏదో ధ్యాసలో ఉండి, నాకు అవకాశం లేదు గానీ... అక్కడ ఆ ఇంటికి వెళ్ళు అని ఒక ఇంటిని చూపించాను’’ అని. నీవుఅన్నదానం చేసిన ఇంటిని చూపించిన వేలిను నోట్లో పెట్టుకో’’ అన్నాడు ఇంద్రుడు. సరేనని ఆ వేలిని నోట్లో పెట్టుకున్నాడు కర్ణుడు. ఒక్క గుటక వేసాడు. ఆ క్షణంలోనే అతని కడుపు నిండిపోయింది. అంతవరకున్న అసంతృప్తి మటుమాయమైంది. ఎనలేని తృప్తి కలిగింది. ఈ కథనం ద్వారా అన్నదానం యొక్క మహత్మ్యం, దాని ప్రాశస్త్యం తెలుస్తోంది.

నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అనేక ఇబ్బందులనుండి, ఇక్కట్ల నుండి బయటపడడానికి చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది అన్నదానం అని చెప్తారు పండితులు. అన్నదానం వలన ఎన్ని సమస్యలున్నా పరిష్కారమవుతాయని చెప్తారు. ఓ వ్యక్తి ఉపవాసం ఉండి పరమేశ్వరునికి పెట్టే నైవేద్యాన్ని... పరమేశ్వరుడు తాను మాత్రమే స్వీకరించకుండా తాను సృష్టించిన 84 లక్షల జీవరాశులకు పంచిపెడతాడని పురాణాలు చెప్తున్నాయి. అన్నదానం చేసేటప్పుడు దైవభక్తులకు తాంబూలంతో పాటు దక్షిణ ఉంచి దానం ఇస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని ప్రతీతి. కొందరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఎంత ప్రయత్నించినా సరైన రాబడి లేకపోవడం, దానికితోడు విపరీతమైన ఖర్చులతో సతమతమవడం జరుగుతుంది. అలాంటివారు అన్నంతో లడ్డు పెట్టి, తాంబూల సహితంగా దానం ఇస్తే అధిక ఆదాయం పొందడంతో పాటు శ్రీమంతులయే అవకాశం ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక అనారోగ్యంతో బాధపడుతున్నవారు, దీర్ఘ రోగాలతో సతమతమవుతున్నవారు అన్ని రోగాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. కొన్నిసార్లు ఇంటిపై మాంత్రిక దోషాలు కూడా కలుగుతుంటాయి. అటువంటప్పుడు చిత్రాన్నంతోపాటు వడ దానం చేస్తే గృహంపై జరిగే ఏ విధమైన మంత్ర, తంత్ర సంబంధమైన దోషాలైనా తొలగిపోతాయి. బెల్లం అన్నం దానం చేస్తే శ్రీమంతులవుతారు. భోజనం చేసేముందు మొదటి ముద్దను పరమేశ్వరార్పణం చేసి దానిని కాకులకో, ఇతర పక్షులతో ప్రాణులకో పెడతారు. ఇలా చేయడంవలన భగవంతునికి సమర్పించినట్లు అవుతుంది. ఇక అన్నం తినేముందు కొద్దిగా అన్నాన్ని కాకులకు వేయడం వలన శని దోషాలనుంచి బయటపడవచ్చని కూడా చెప్తారు.ఆకలి అన్నవారికి అన్నం పెట్టడం, దాహం అన్నవారికి నీళ్ళివ్వడం ప్రతి మనిషి చేయాల్సిన కనీస ధర్మం. అన్ని దానాలకన్నా అన్నదానం గొప్పది. వేయి ఏనుగులు, కోటి ఆవులు, లెక్కకు మిక్కిలి బంగారం, వెండి, భూములు, జీవితం మొత్తం ఓ వంశానికి సేవ చేయడం, కోటి మంది మహిళలకు వివాహం చేసినా అన్నదానానికి సాటిరావు.

'అన్నం' గురించి నలుగురు మంచి మనుషులు చెప్పిన నాలుగు గొప్ప మాటలు...

1. " నేను వంటింట్లోకి వేరే పనిమీదవెళ్ళినా కూడా , వంట చేస్తున్న మా అమ్మగారు. " పెట్టేస్తా నాన్నా ఒక్క అయిదు నిముషాలు " అనేవారు నొచ్చుకుంటూ- నేను అన్నం కోసం వచ్చాననుకుని ! ఎంతయినా అమ్మ అంటే అన్నం. అన్నం అంటే అమ్మ ! అంతే ! - జంధ్యాలగారు

2. మంచి భోజనం లేని పెళ్ళికి వెళ్ళటం - సంతాపసభకి వెళ్ళినదానితో సమానం ! - విశ్వనాధ సత్యనారాయణ గారు

3. రాళ్లు తిని అరిగించుకోగల వయసులో వున్నప్పుడు తినటానికి మరమరాలు కూడా దొరకలేదు ! వజ్రాలూ , వైడూర్యాలూ పోగేసుకున్న ఈ వయసులో మరమరాలు కూడా అరగట్లేదు ! అదే విధి ! - రేలంగి వెంకట్రామయ్య గారు

4. ఆరురోజుల పస్తులవాడి ఆకలి కన్నా, మూడురోజుల పస్తులవాడి ఆకలి మరీ ప్రమాదం ! ఆహారం దొరికినప్పుడు ముందు వాడ్నే తిననివ్వాలి ! - ముళ్ళపూడి వెంకటరమణ గారు

5. ఏటా వందబస్తాల బియ్యం మాకు ఇంటికి వచ్చినా మా తండ్రిగారు " అన్నీ మనవికావు నాయనా " అని బీదసాదలకి చేటలతో పంచేసేవారు. అన్నీ మనవికావు అనటంలో వున్న వేదార్ధం నాకు పెద్దయితేనేగానీ అర్ధం కాలేదు ! - ఆత్రేయ గారు

6. అమ్మ చేతి అన్నం తింటున్నాను అని చెప్పగలిగినవాడు ధన్యుడు ! - చాగంటి కోటే శ్వర రావుగారు

7. ఆకలితో వున్న వాని మాటలకు ఆగ్రహించవద్దు ! - గౌతమ బుద్దుడు

8. ఆత్మీయులతో కలసి తినే భోజనానికి రుచి ఎక్కువ ! చారుకూడా అమృతంలా రుచిస్తుంది ! - మాతా అమృతానందమయి

9. vమీ పిల్లలు ఎంతదూరంలో, ఎక్కడవున్నా , వేళపట్టున ఇంత అన్నం తినగలుగుతున్నారంటే అది వాళ్ళ గొప్పాకాదూ , మీ గొప్పాకాదు మీ పూర్వీకుల పుణ్యఫలమే అని గుర్తించు. "అన్ని దానము లలో అన్నదానము మిన్న "

విష్ణుమూర్తికి సుదర్శన చక్రాన్ని ఇచ్చింది ఎవరు

విష్ణుమూర్తికి సుదర్శన చక్రాన్ని ఇచ్చిందెవరో తెలుసా?

శ్రీమహావిష్ణువు చేతిలోని చక్రం చాలా శక్తివంతమైందని పురాణాల్లో పేర్కొన్నారు. శివుడి చేతిలో శూలం, విష్ణువు చేతిలో చక్రం రెండూ శక్తివంతమైనవి. శ్రీహరి కుడిచేతి చూపుడు వేలికి ఉండే చక్రానికి అద్భుతమైన శక్తులున్నాయి. దీని గురించి విష్ణు పురాణంలో చాలా ఆసక్తికరమైన కథనాలను తెలిపారు. శ్రీమహావిష్ణువుకు ఈ ఆయుధం మధ్యలోనే వచ్చిందట. వెయ్యి సంవత్సరాలు కఠోర తపస్సు చేసి దీన్ని వరంగా పొందారని వివరించారు.

సుదర్శన చక్రంలో బ్లేడును పోలిన పదునైన ఆకారాలు 108 ఉంటాయి. రెప్పపాటులో కొన్ని మిలియన్ యోజనాల దూరం ప్రయాణిస్తుంది. ఒక యోజనం అంటే ఎనిమిది కిలోమీటర్లు.

చక్రాన్ని కేవలం శత్రువుల మీద మాత్రమే ప్రయోగించాలి. శత్రువు ఎంత శక్తివంతమైనవాడైనా దీని ముందు నిలబడలేడు. ఒకసారి చేతి నుంచి బయటపడితే శత్రువును వేటాడిగానీ తిరిగి రాదు. లక్ష్యం పూర్తయిన తర్వాతే వెనక్కు మళ్లుతుంది. సుదర్శన చక్రం దాడి నుంచి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. పరిగెత్తడం ఆపేసి శ్రీహరిని శరణు వేడితే ఆగిపోతుందని పురాతన గ్రంథాల్లో పేర్కొన్నారు.

ఎనిమిదో అవతారమైన ద్వాపర యుగంలోని కృష్ణావతారంలో అగ్ని దేవుడి నుంచి ఈ చక్రాన్ని పొందాడని కొందరంటారు. కేవలం పరశురాముడికి మాత్రమే సుదర్శన చక్ర ప్రావీణ్యత గురించి శ్రీకృష్ణుడు ఉపదేశించాడు.

పురాణాల ప్రకారం శివుడి గురించి మహావిష్ణువు వేయి సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చిన మహాదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. అసుర సంహారం కోసం తనకు శక్తివంతమైన ఆయుధం ప్రసాదించమని శ్రీహరి కోరడంతో పరమేశ్వరుడు సుదర్శన చక్రాన్ని అందించాడు. అప్పటి నుంచి మహావిష్ణువు అన్ని అవతారాల్లోనూ కుడిచేతి చూపుడి వేలికి చక్రం ఉంటుంది.

శక్తి ఉనికి వక పరిశీలన

శక్తి ఉనికి వక పరిశీలన. యిది పుట్టుక తెలియదు అది సూక్మమైనది అణువు అణువు కన్నా సూక్మమైనది. దీని ఉనికి తెలియుట శబ్దము ప్రమాణము అది వినికిడి వలననే శక్తి లక్షణము తెలియును. దానిని భాషా పరంగా వస్తు తత్వాన్ని బట్టి గుర్తులుగా అనగా చిహ్నంగా తెలిపారు. అంతకు ముందు లిపి లేనప్పుడు వాక్కు రూపమే బాల్యంలో కొన్ని పదములు లిపి లేకుండానే అభ్యాసం తల్లి వడినుండే. దీని ప్రకారమే శక్తి లక్షణం వినికిడి వలననే. అచ్చులు అనగా అఆఇఈ లు కచటతప లు కలిపి శబ్ద లక్షణం పూర్ణమైనపూర్ణమైనట్లు తెలిసినది. భాష ముఖ్యం. కొన్ని పదములు శక్తి చాలా సూక్మమైన అర్ధం దాగి యుండును ఆ ఈ ఊ ఏ ఓ లు వీటి దీర్ఘ స్వరమేగదా శక్తి వ్యాప్తమే లక్షణమని దాని ఫలితమే ధాతు లక్షణము గల ప్రకృతి గా మనకు గోచరించుచున్నది. వినికిడి అనగా శ్రవణం శక్తి లేని జీవి ప్రకృతి తత్వం తెలియదు.శ్రవణం నక్షత్ర శక్తి భూమికి మధ్యన గల డిగ్రీ ద్వారా అనగా మకర రేఖను గల ఆశ్రయించిన గమన శక్తి యే కాంతి రూపంగా మనము ప్రభావితం చేసి శబ్ద రూపంలో తెలియుచున్మది. శ్రవ  అణి  ౦ పూర్ణునిగా తెలియును. శృతి శ్రవా...విష్ణ సహస్రం.శ నగా ఈశ  శక్తి చైతన్యమే రుద్రశక్తిగా శ్రవణ వింటున్నాం. అది ప్రణవ రూపమైన ఓం అనే శక్తి. రెండుగా మారిన పదార్ధాలు శక్తి ఆర్ అనే వ్యాసార్ధం వలననే తెలియుచున్నది. రెండుగా మారిన గాని తెలియదు. అదియే ఆర్ అనే ఆంగ్ల శక్తి రుద్ర శక్తి. రాహు శక్తి శబ్దం పుట్టుకకు మూల భాగమని ఆదిలో శబ్దం వలననే చైతన్యం శ్రవణం వలన మననం శ్రవణమే లేనియెడల మనస్సు లేదు అది లేని బుధ్దిలేదు. బుధ్ది లేని కర్మ లేదు. కర్మ లేనిదే  జీవం లేదు. జీవం లేనిదే సృష్టికి మూలం లేదు. కనుక శబ్ద శ్రవణశక్తియే అన్నింటికి మూలం. విన్నా మన్నా కన్నా శబ్దమే ప్రాధాన్యం. శబ్దమే మనిషికి శక్తి.అది విషు విష్ణు వ్యాప్తి అని తెలియుచున్నది. భాష శక్తి మంత్రము. మనస్సుతో అనిన గాని శబ్ద లక్షణము తెలియదు. అందుకే నమః శివాయ తో మెుదలుకావాలి.అక్షర అభ్యాసం.మననంతో మాత్రమే శబ్ద లక్షణము తెలియును. ఎందుకనగా శబ్దం యెుక్క మూలం ప్రణవం తో ప్రాణము అనుసంధానం. ముందుగా శబ్ద లక్షణము దేహంలో గల శక్తి ద్వారా తెలుసుకొని పలుకుచున్నారు. తెలుసుకుంటూనే ఉందాం ఆచరిస్తూనే ఉందాం.

ఓం నమో నారాయణాయ

" ఓం నమో నారాయణాయ " అను ఎనిమిది అక్షరముల యొక్క మంత్ర స్మరణము అనంత పుణ్యప్రదం, అనంత పాపరాశిని ద్వంసం చేస్తుంది. ఇట్టి అష్టాక్షరి మంత్ర అధిష్టాన పురుషోత్తముడే శ్రీమన్నారాయణుడు. స్వామి స్థితి కారకుడై అష్ట ఐశ్వర్యములను ప్రసాదించునప్పుడు లక్ష్మీనారాయణునిగా, విధ్యజ్ఞానము ప్రసాదించునపుడు లక్ష్మీ హయగ్రీవునిగా, ఆరోగ్య ప్రధాతగా నిలిచిన సమయాన ధన్వంతరిగా, సంకల్ప దీక్ష నొసగు లక్ష్మీ నారసింహునిగా, సమస్త మానసిక రుగ్మతలు తొలగించు లక్ష్మీ సుదర్శనునిగా, భక్తి జ్ఞాన వైరాగ్యములు ప్రసాదించు అనఘ దత్తత్రేయునిగా, సర్వ మంగళకరుడగు శ్రీ వేంకటనాయకుడైన వేంకటేశ్వరునిగా భక్తులకు సుఖ శాంతులను ప్రసాదించుచున్నాడు.

మానవాళిని తరింపచేసే ఈ పవిత్ర మంత్రం గురించి ప్రత్యేకంగా వివరిస్తోంది నరసింహ పురాణం పదిహేడో అధ్యాయం. వ్యాసభగవానుడు తన కుమారుడైన శుక మహర్షికి ఆ మంత్రాన్ని గురించి వివరించాడు. సంసారబంధాల నుంచి విముక్తులు కావటానికి, మానవాళి జపించాల్సిన మంత్రం ఓం నమో నారాయణాయ అనేది. ఇది అష్టాక్షరి. అంటే ఎనిమిది అక్షరాలతో కూడుకొని ఉంటుంది. మంత్రాలన్నింటిలోకి ఎంతో ఉత్తమమైంది ఈ మంత్రం. నిత్యం దీన్ని జపిస్తే ముక్తి లభిస్తుంది. ఈ అష్టాక్షరిని జపించేటప్పుడు శ్రీమహావిష్ణువును మనసులో ధ్యానిస్తుండాలి. అలాగే పవిత్ర నదీప్రాంతాలలో, ఏకాంత ప్రదేశాలలో, జలాశయాల దగ్గర శ్రీమహావిష్ణు విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకొని అష్టాక్షరిని జపించటం మేలు, లేదా మనోఫలకం మీద శ్రీమన్నారాయణను నిలబెట్టి మంత్రం జపించటం అత్యుత్తమం .

అష్టాక్షరిలో ఉండే ఒక్కొక్క అక్షరానికి ఒక్కో ప్రత్యేక వర్ణం ఉంది. వరుసగా ఓంకారం శుక్ల (తెలుపు) వర్ణం, నకారం రక్త (ఎరుపు) వర్ణం, మో అనే అక్షరం కృష్ణ (నలుపు), నా అనే అక్షరం ఎర్రగానూ, రా అనే అక్షరం కుంకుమరంగులోనూ, య అనే అక్షరం పసుపుపచ్చని రంగులోనూ, ణా అనే అక్షరం కాటుకరంగులోనూ ఉంటుంది. ఓం నమోనారాయణాయ అనే ఈ మంత్రం ఇన్ని వర్ణాలతో విడివిడిగా ఉంటూ అన్ని వర్ణాల సమ్మిళితమైన తెల్లని రంగులో చివరకు కనిపించటం సత్వగుణ ప్రాధాన్యతను తెలుపుతుంది. ఈ మంత్ర ప్రభావం వల్ల స్వర్గ, మోక్ష ఫలాలతోపాటు కోరిన కోర్కెలు కూడా సిద్ధిస్తుంటాయి. దీనిలో సకల వేదార్థాలు నిండి ఉన్నాయని పండితులు విశ్లేషించి చెబుతుంటారు. ఈ మంత్రాన్ని స్నానం చేసి శుచి అయిన తర్వాత పవిత్ర ప్రదేశంలో కూర్చొని జపించాలి.

సర్వకాల సర్వావస్థలలోనూ తాను పవిత్రంగా ఉన్నాననుకొన్నప్పుడు లేదా ఆ భావన మనస్సులో ఏర్పరుచుకిని భక్తుడు ఈ మంత్రాన్ని జపించవచ్చు. ఏ పనినైనా మొదలు పెట్టేటప్పుడు, పని అయిన తర్వాత దీన్ని జపించటం మేలు. ప్రతి నెలలోనూ ద్వాదశినాడు శుచి అయి, ఓంనమోనారాయణాయ అనే ఈ మంత్రాన్ని ఏకాగ్రచిత్తంతో వందసార్లు జపించాలి. అలా జపించిన వారికి మోక్ష స్థితులలోని సామీప్యస్థితి లభిస్తుంది. స్వామిని గంధపుష్పాలతో పూజించి ఈ మంత్రాన్ని జపిస్తే పాపాలు హరించుకుపోతాయి. అష్టాక్షరీ మంత్రజపంలో మొదటి లక్ష పూర్తి కాగానే ఆత్మశుద్ధి కలుగుతుంది. రెండో లక్ష పూర్తి అయ్యేసరికి మనశ్శుద్ధి, మూడో లక్ష పూర్తి అయినప్పుడు స్వర్గలోక అర్హత, నాలుగో లక్ష పూర్తికాగానే శ్రీహరి సామీప్యస్థితికి అర్హతలు లభిస్తాయి. అయిదు లక్షలసార్లు ఈ మంత్రజపం చేసిన వారికి నిర్మలజ్ఞానం కలుగుతుంది. ఆరో లక్షతో విష్ణులోకంలో స్థిర నివాస అర్హత, ఏడో లక్షతో స్వస్వరూప జ్ఞానం. ఎనిమిదో లక్షతో ముక్తి లభిస్తాయి. నిత్యజీవితంలో చేసుకొనే పనులు చేసుకుంటూనే అష్టాక్షరీ మంత్రాన్ని జపించవచ్చు.

నిత్యం ఈ మంత్రజపం చేసేవారికి దుస్వప్నాలు, పిశాచాలు, సర్పాలు, బ్రహ్మరాక్షసులు, దొంగలు, మోసగాళ్లు, మనోవ్యాధులు, వ్యాధులవల్ల బాధలుండవు. ఓంకారంతో మొదలయ్యే ఈ అష్టాక్షరీ మంత్రం ఎంతో విశేషమైందని వేదాలు కూడా వివరిస్తున్నాయి. జ్ఞానులు, మునులు, పితృదేవతలు, దేవతలు, సిద్ధులు, రాక్షసులు ఈ మంత్రాన్ని జపించి పరమసిద్ధిని పొందిన సందర్భాలున్నాయి. ప్రాణాన్ని విడిచే సమయంలో ఒక్కసారి ఈ మంత్రాన్ని అనుకున్నా వైకుంఠం లభిస్తుంది. వేదాన్ని మించిన శాస్త్రం,   నారాయణుడిని మించిన దైవం లేదన్నట్లు ఈ మంత్రాన్ని మించిన మంత్రం మరొకటి లేదు. ఒక్కోసారి శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాల జయంతులు. పూజలు వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాలలో ఆయా అవతారాలకు సంబంధించిన మంత్రాలు కానీ, స్తోత్రాలు కానీ తెలియనప్పుడు ఓంనమోనారాయణాయ అనే ఈ అష్టాక్షరీ మంత్రాన్ని నూటఎనిమిది సార్లు జపించినా ఆయా అవతారాల పూజాఫలితం దక్కుతుంది,అని ఇలా నరసింహ పురాణంలో సాక్షాత్తు వ్యాసభగవానుడే ఈ విషయాన్ని తన కుమారుడైన శుకయోగికి వివరించి చెప్పడంతో అష్టాక్షరీ మంత్ర ప్రభావం ఎంతటిదో తెలుస్తోంది.