రక్త పుష్టి నొసగు రమణీయ ఫలమేది?*
శ్రీగణేశు పూజ చేయనేది?*
పలువరుసల పోల్చు పండు పేరేమిటి?*
దాడిమనుచు పిల్వ తగినదిద్ది*
*నాగమంజరి గుమ్మా*
ఫలవిలాసం 26/108 వ పద్యం
రక్తం చేకూరాలి అనగానే గుర్తుకు వచ్చే పండు దానిమ్మ. విఘ్నేశ్వరుని పూజలో దాడిమీ పత్రం అంటే దానిమ్మ ఆకులే. అలాగే చక్కని పలువరుసను దానిమ్మ గింజల వంటి పలువరుస అంటారు. (దానిమ్మలో ఎర్ర దానిమ్మ, తెల్ల దానిమ్మ రెండు రకాలున్నాయి లెండి) దాడిమీ అనే పేరు సంస్కృతంలో దానిమ్మకు ఉంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే తాంబూలంతో ఎర్రనైన పెదవులు దానిమ్మ పూవులా మెరుస్తున్నాయట ఎవరివి? శ్రీ లలితా అమ్మవారివి. తాంబూల పూరిత ముఖీ దాడిమీ కుసుమ ప్రభా... వినే ఉంటారుగా...
ఇక ఉపయోగాల విషయానికి వస్తే...
దానిమ్మ బెరడు, తొక్క, గింజలను విరోచనాల నివారణకు ఔషధంగా వాడుతారు.
దానిమ్మ పండు రసం కుష్టు వ్యాధికి పనిచేస్తుంది.
దానిమ్మ పండ్ల తోలు, పూలను బట్టలకు రంగు అద్దే పరిశ్రమలో ఉపయోగిస్తున్నారు.
ఈ ఆకులను కొద్దిగా దంచి కాచి కషాయం చేసి దానిలో తగినంత చక్కెర కలిపి సేవిస్తే.. ఉబ్బసం, అజీర్తి వంటి దీర్ఘ రోగాలే కాక, దగ్గు, వడదెబ్బ, నీరసం నుండి ఉపశమనం కలుగుతుంది. కాళ్ళ వాపులకు ఈ ఆకును వాపు ఉన్న చోట కడితే.. తగ్గుతాయి.
గర్బవతులు ప్రతి రోజు 600 మి.గ్రా నుండి 400 మి.గ్రా ఫోలిక్ ఆమ్లం తీసుకోవాలి. దానిమ్మ రసం ఒకసారి తాగడము వలన 60 మి.గ్రా ఫోలేట్ వస్తుంది.
దానిమ్మ సహజ యాస్పిరిన్. రక్తసరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది.
ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలా మంచిది. ఆస్టియోఆర్థ్రయిటిస్‌తో బాధపడేవారికి అత్యంత రుచికరమైన మందు దానిమ్మ పండు, రసం. వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను కూడా నివారిస్తుంది దానిమ్మ రసం. నీళ్లవిరేచనాలతో బాధపడేవారికి మంచి మందు ఇది. దానిమ్మ రసాన్ని శరీరం మీద రాయడం చేత అలర్జీలు, కీటకాలు కుట్టడం వలన వచ్చిన పొక్కులు మానిపోతాయి. దానిమ్మ పండు తొక్క గాయాలకు ఔషధం, వాపును అరికడుతుంది. గొంతు రోగాలకు ఔషధం దానిమ్మ. దానిమ్మ పళ్ళు, పువ్వులు, ఆకులు, వేర్లు అన్ని ఔషధ గుణాలు కలిగినవై ఉంటాయి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి