ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
16, ఆగస్టు 2024, శుక్రవారం
తీవ్రమైన గ్యాస్
తీవ్రమైన గ్యాస్ సమస్య నివారణ కొరకు అద్భుత యోగం -
ప్రస్తుత కాలంలో చాలామంది తీవ్రమైన గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం సరైనటువంటి ఆహారం సరైనవేళల్లో తీసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం . ఇప్పుడు నేను చెప్పబోవు ఈ అద్భుత చిట్కా మిమ్మల్ని గ్యాస్ సమస్య నుంచి మిమ్మల్ని అద్భుతంగా బయటపడవేయును.
వాము ౨50 గ్రాములు .
జీలకర్ర ౨50 గ్రాములు .
ధనియాలు ౨50 గ్రాములు .
మూడింటిని వేరువేరుగా నూనె కాని నీరు కాని వేయకుండా కడాయిలో ఒక నిమిషంపాటు సన్నటి సెగ మీద వేయించి మూడింటిని కలిపి మెత్తటి చూర్ణంగా చేయవలెను . ఆ చూర్ణమును ఒక డబ్బా యందు గాలి పోకుండా నిలువ చేసుకొనవలెను . ఒక గ్లాసు నీటిని బాగా మరిగించి పొయ్యి మీద నుంచి కిందకి దింపిన తరువాత 2 స్పూనుల చూర్ణాన్ని మరిగించిన నీటిలో వేసి మూత పెట్టవలెను కొంచం ఆగి గోరువెచ్చగా అయినతరువాత వడకట్టుకొని తాగవలెను. ఇలా ప్రతి ఉదయం బ్రష్ చేసిన వెంటనే మరియు సాయంత్రం ఆహారానికి గంట ముందు మరలా చేసుకుని తాగవలెను.
పైన చెప్పిన యోగం 40 రోజులపాటు చేసినచో మీ గ్యాస్ సమస్య సంపూర్ణంగా పోవును . అలాగే ఆహారం తీసికొనుటకు అర్థగంట ముందు చిన్న అల్లం ముక్క కు ఉప్పు అద్ది నోటి యందు ఉంచుకుని రసం మింగుతూ ఉండవలెను . దీనివలన జీర్ణక్రియ మెరుగుపడి ఆహారం సంపూర్ణంగా జీర్ణం అగును.
అజీర్ణరోగముతో బాధపడువారు పాటించవలసిన ఆహార నియామాలు -
పాటించవలసిన నియామాలు -
తేలికయిన పాతబియ్యపు అన్నం . పాతబియ్యపు నూకల జావ , బార్లీ జావ , పెసలు , పేలాలు , పెసరకట్టు , మేక మాంసం , చిన్న చేపలు , అల్లం , ఉప్పు , తక్కువ కారం , లేత ముల్లంగి , వెల్లుల్లి , ఉల్లిపాయ , లేత అరటికాయలు , లేత మునగ కాయ , పొట్లకాయ , బీరకాయ , లేత వంకాయ , కాకరకాయ , నక్క దోసకాయ , చుక్కకూర , పెరుగు తోటకూర , పొన్నగంటి కూర , మెంతికూర , ఉశిరికాయ , దానిమ్మ , నారింజ పండు , బత్తాయి , మజ్జిగ , పలచని మిరియాల చారు , తాంబూలం , వేడినీరు , తేనె , చేదు , నూనె పలచటి పదార్దాలు , వగరు , చేదుగల పదార్దాలు తీసికొనవలెను . వ్యాయమం చేయవలెను .
పాటించకూడనివి -
కొత్త బియ్యపు అన్నం , పెద్ద చేపలు , బచ్చలికూర , అధికంగా నీరు తాగరాదు , ఆలస్యముగా జీర్ణం అయ్యే పదార్ధాలు . కంద , పెండలం , చామ , ఆలుగడ్డ , నేరేడు పండ్లు , గోధుమలు , పాలు , పాలతో చేసిన పదార్థాలు , చారపప్పు , జీడిపప్పు , నూనె అధికంగా ఉపయోగించి చేసే పదార్దాలు , వేపుళ్లు , పాతపచ్చళ్లు , ఉడకని పదార్దాలు , ముందు తినిన ఆహారం జీర్ణం కాక మునుపే మరలా తినరాదు . అమిత భోజనం , నిద్ర మేలుకుని ఉండటం , మలమూత్ర నిరోధం . టీ మరియు కాఫీ నిషిద్దం
పైన చెప్పిన ఆహారనియమాలు పాటిస్తూ నేను చెప్పిన యోగాన్ని పాటించుచుండిన అతి త్వరగా మీ సమస్య నుంచి విముక్తి పొందగలరు.
విరేచనం సాఫీ లేనప్పుడు కూడా గ్యాస్ వచ్చును . దానికొరకు ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఆహారం + మీరేదన్న ఇతర సమస్యలకు ఔషధాలు వాడుచున్న అవన్నీ తీసుకున్న గంటన్నర తరువాత ఒక చిన్న స్పూన్ త్రిఫల చూర్ణం ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి లోపలికి తీసుకోవలెను. మీరు తీసుకున్న ఆహారం మరియు మీరు నిద్రించడానికి మధ్య సమయం కనీసం రెండు గంటలు ఉండాలి .
మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
శిరా వేధ పద్ధతి
శిరా వేధ పద్ధతి - ప్రాచీన చికిత్సా పద్దతి .
ఈ శిరావేధ చికిత్స మన ఆయుర్వేదము నందు తప్ప ఏ ఇతర వైద్యము నందు లేదు . ఈ శిరావేధ పద్దతి ద్వారా అసాధ్యవ్యాధులను పోగొట్టవచ్చు .
శిరావేధ పద్ధతిని "రక్తమోక్షణం " అని కూడా అంటారు.ఇప్పుడు ఈ ప్రాచీన చికిత్స గురించి మీకు సంపూర్ణముగా వివరిస్తాను.
మానవ శరీరం నందు మన ఆయుర్వేద శాస్త్ర ప్రకారం 700 శిరలు కలవు . ఈ శిరలు శరీరమంతటా వ్యాపించి చిన్నచిన్న నీటికాలువలు తోటలోని అన్ని చెట్లకు నీటిని ఎలా అందచేయునో అదేవిధముగా శరీరంలోని అన్ని భాగములకు మనము తినిన ఆహారపదార్ధము వలన జనించు రసాధి ధాతువులను అందచేసి శరీరంను పోషించుచున్నవి. శరీరంలో అవయవములు ముడుచుకొనుట , చాచుట వంటి కార్యక్రములకు తోడ్పడుచున్నవి. శరీరంలోని వాత,పిత్త,కఫములు రక్తమునందు చేరి శరీరము అంతటా ప్రసరించుచున్నవి. శరీరము నందలి వాతాదులు అధికంగా వహించు శిరలకు వెఱువేఱు రంగులు , పనులు ఉండును. హస్త, పాదముల యందు 400 శిరలు కలవు. ఉదరము నందు 136 , శిరస్సు నందు 164 ఇలా మొత్తం 700 శిరలు కలవు. వీటిలో హస్తము , పాదముల యందు 16 శిరలు , ఉదరము నందలి 32 శిరలు , మెడకు పైభాగము వేధింపతగినవిగా గుర్తించవలెను. "ఇక్కడ వేధింపడం అనగా శిరకు రంధ్రం చేసి దుష్టరక్తం తీయటం " శిరావేధ చేయు వైద్యుడు మర్మలకు సన్నిహితముగా ఉండు శిరలను వేధించరాదు . శిరల గురించి వాటి స్థానము గురించి సంపూర్ణ అవగాహన ఉన్న వైద్యుడు మాత్రమే చికిత్స చేయవలెను .
మర్మలకు సన్నిహితముగా ఉన్న శిరలను వేధించిన కొత్తరోగములు వచ్చుట , అంగవైకల్యము సంప్రాప్తిచుట జరుగును . ఒక్కోసారి ప్రాణములు పోవటం కూడా జరుగును. సరిగ్గా చికిత్స చేసిన అసాధ్యరోగములు పోగొట్టవచ్చు .మర్మలు మరియు మర్మస్థానములు అనగా శరీరము నందు వాయుప్రసరణ జరుగు నాడీ జంక్షనులు .ఈ శిరావేధనము బాలలు , వృద్దులు , క్షీణించినవారు , తాత్కాలిక కారణాల వలన నీరసించినవారు మొదలగువారికి నిషిద్దం . ఒకవేళ పాముకాటుకు గురైన నిషేధింపబడిన వారికి కూడా శిరావేదన చికిత్స చేయవచ్చు . అలా చేసిన బ్రతకగలరు . ఇప్పుడు మీకు ఈ శిరావేదన పధ్ధతి గురించి సంపూర్ణముగా వివరిస్తాను.
శిరలను వేధించుటకు ముందుగా శిరస్సు , పాదములు , హస్తములు , ఉదరము , పార్శ్వములు మొదలగు స్థానములందలి శిరలు స్పష్టముగా కనపడేలా గుడ్డతో కట్టిన పిమ్మట వ్రీహిముఖము అను ఒక శస్త్రముతో ఆయాస్థానములు అనుసరించి యవగింజ ప్రమాణము , అర్ధయావగింజ అంత లోతుగా వేధించవలెను . వేధ చేయవలసిన కాలములను సరిగ్గా గుర్తించవలెను . వేధ చేసిన పిమ్మట సువిద్ద ,దుర్విద్ధ లక్షణములు , దుష్టరక్త స్వరూపము , మంచి రక్తస్వరూపము , రక్తము వేధన చేసినను రాకుండా ఉండటం , లేక అధికరక్తస్రావం అగుట , ఎట్టివారికి ఎంత రక్తము తీయవలెను ఇత్యాది లక్షణములను , విధులను బాగుగా గుర్తించి రక్తమోక్షణము చేయవలెను .
ఈ రక్తమోక్షణం ఏయే భాగాలలో చేస్తే ఏయే వ్యాధులు తగ్గునో మీకు వివరిస్తాను .
* పాదదాహము , పాద హర్షము ( గుర్రం మూతి ) , చిప్పము , విసర్పి , వాతరక్తం ( గౌట్ ) , వాత కంటము , విచర్చికా , పాదదారి మొదలగు వ్యాధుల యందు హస్తపాదముల మధ్య ఉండు క్షిప్రమర్మములకు పైభాగమున రెండు అంగుళములలో విహ్రీ ముఖము ( సన్నటి పరికరం ) తో శిరకు రంధ్రం చేసి దుష్టరక్తమును తీయవలెను .
* క్రోష్టుక శీర్షము , ఖంజము , పంగు వంటి వాతవ్యాధులకు చీలమండకు పైన నాలుగు అంగుళములలోని పిక్క యందు శిరకు రంధ్రం చేయవలెను .
* గృదసీవాతం ( సయాటికా ) నందు మోకాలు సంధికి నాలుగు అంగుళముల కింద గాని , పైన గాని శిరకు రంధ్రం చేయవలెను .
* గళ గండ రోగము నందు తొడ మొదట ఆశ్రయించి ఉండు శిరను వేధించిన కంఠమును ఆశ్రయించి ఉండు గళగండ రోగము నివృత్తి అగును.
* ప్లీహ ( spleen ) రోగము నందు ఎడమచేయి మోచేతి సంధి యందు ఉండు శిరను గాని లేక చేతి యొక్క చిటికెనవ్రేలుకు , ఉంగరం వ్రేలుకు మధ్య యందు ఉండు శిరను వేధించవలెను .
* కాలేయరోగము నందు ప్లీహమునకు చెప్పినట్టు కుడివైపున చేయవలెను . శ్వాసకాసలకు కూడ కుడి పార్శ్వముల యందు ఉండు శిరలను వేధించవలెను .
* పరివర్తిక , ఉపదంశ , శుక్రదోషముల యందు , శుక్రవ్యాధుల యందు శిశ్నము మధ్యయందలి శిరను వేధించవలెను .
* అసాధ్యములగు అంతర్విద్రదుల యందు , పార్శ్వశూల ( ఒకవైపు తలనొప్పి ) కక్షా స్థనభాగముల మధ్యవుండు శిరను వేధించవలెను .
* అసాధ్యమగు తృతీయక జ్వరం నందు ముడ్దిపూసకు మధ్య వెన్నెముక క్రింద ఉన్న శిరను వేధించవలెను .
* అసాధ్యమగు చాతుర్ధికా జ్వరం నందు భుజశిరస్సులకు క్రిందగా రెండు పార్శ్వముల యందు ఉండు సిరలలో ఎదైనా ఒకదానిని వేధించవలెను .
ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతిరోగానికి ఏయే భాగములో శిరావేధ చేయవచ్చో అత్యంత ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో వివరణాత్మకంగా ఉన్నది . నేను అటువంటి గ్రంథాలను నా పరిశోధన నిమిత్తం అధ్యయనం చేయుచుండగా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకోగలిగాను . ఆ విజ్ఞానాన్ని మీకు అందించాలన్న సదుద్దేశముతో మీకు సంపూర్ణ సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది.
మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
డెంగ్యూ జ్వరం
డెంగ్యూ జ్వరం వచ్చినపుడు ప్లేట్లెట్స్ సంఖ్య హఠాత్తుగా పడిపోతున్నప్పుడు ఉపయోగించవలసిన అద్బుత యోగం -
మొదట ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ తేనే కరిగేలా చేసి దానిలో ఒకస్పూన్ గోధుమగడ్డి చూర్ణం కలిపి వెంటనే రోగికి తాగించాలి. కొంతసేపట్లో ప్లేట్లెట్ల సంఖ్య పెరగడం మొదలవుతుంది. ఒక గంట తరువాత ఒక పెద్ద గ్లాస్ నీటిలో ఒక బొప్పాయి ఆకు మొత్తం చిన్నచిన్న ముక్కలుగా చేసి పొయ్యి మీద పెట్టి అందులొ తాటిబెల్లం వేసి సగం గ్లాస్ కషాయం మిగిలేలా కాచి దానిని కూడా తాగించడం వలన వేగంగా ప్లేట్లెట్స్ సంఖ్య పెరిగి రోగి ప్రాణాయాపాయ స్థితి నుంచి బయటపడతాడు. ఇది ప్రతి మూడు గంటలకు ఒకసారి ఇవ్వవలెను.
ఇది నా అనుభవ యోగం
ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము త్రీ84 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము త్రీ52 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 98850త్రీ00త్రీ4 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
వినయం లేని విద్య
*
"వినయం లేని విద్య, సుగుణం లేని రూపం, ఉపయోగం కాని ధనం, శౌర్యం లేని ఆయుధం, ఆకలి లేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్థం."
"నచ్చితే పెద్ద తప్పు కూడా చిన్నదే.
నచ్చకపోతే చిన్న తప్పు కూడా పెద్దదే."
పనిమనిషి
ఫ్రెండ్స్ కొన్ని నెలల క్రితం, కొత్తగా ఒక పనిమనిషి చేరింది, నాకు పనిమనిషి అన్న పదం పలకడం ఇష్టం ఉండదు, మీకందరికి అర్థం కావటానికి ఇలా రాశా, ఇక ఈ వ్యాసంలో ఈ పదాన్ని ఊయోగించను. ఆవిడ పేరు.......
మూడు నాలుగు రోజుల తరువాత అడిగా..
అమ్మా! ఎక్కడ మీ ఇల్లు, ఎంత మంది పిల్లలు అని.
ముగ్గురు అమ్మాయిలు అండి,
పెళ్లిళ్లు అయ్యాయా, లేదండి ఇంకా చదువుకుంటున్నారు.
O.K, ఏం చదువు కుంటున్నారు అని క్యాజువల్ గా అడిగా, పెద్ద అమ్మాయి M.Sc ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి డిగ్రీ కాలేజ్ లో కాంట్రాక్ట్ లెక్చరర్ గా చేస్తోంది,
ఆ అంటూ నోరు తెరిచా,
రెండో అమ్మాయి M.Sc Computers మొదటి సంవత్సరం,
మూడో అమ్మాయి ఎంబీబీస్ రెండో సంవత్సరం.
ఆ అని నోరు వెళ్ల బెట్టా. నర్సింగా అన్నా,
కాదు సార్ M.B.B.S అంది.
నాకు అర్థం కావటం లేదు, ఈవిడ ఏమంటోంది,
ఏం మాట్లాడుతోంది. ఈవిడకు ఏం మాట్లాడుతోందో అర్థం అవుతోందా?
మళ్ళీ అడిగా, అవే సమాధానాలు,
M.B.B.S ఫ్రీ సీటా అని అడిగా, అవును సార్,
ఫ్రీ సీట్ యే,
అదేదో బిల్డింగ్ ఫీజ్ అంటా, దానికే తంటాలు పడుతున్నా కట్టడానికి.
ఏ స్కూలులో చదువుకున్నారు అమ్మా మీ పిల్లలు అని అడిగా?
ఇక్కడే, మన ఊరి బడి లొనే 10 వ తరగతి వరకు.
లాంగ్ టర్మ్ గట్రా వెళ్లిందా ఎంబీబీస్ అమ్మాయి అని అడిగా, ఏం లేదయ్యా, మన ఊరి కాలేజ్ యే, నాకు ఈ చదువుల గోల ఏం తెలీదయ్యా, ఇప్పుడు ఇప్పుడే కాస్త నోరు తిరుగుతోంది.
ఏం చదువుకున్నావు అమ్మా నువ్వు అని అడిగా,
రెండులో మానేశానయ్యా, నాకు కూడికలు, తీసి వేతలు కూడా రావు. చాలా కష్టాలు పడ్డాను పిల్లలను ఈ స్థాయికి తీసుకు రావటానికి.
మీ ఆయన ఏం చేస్తాడు అని అడిగా,
ఆయనా అందరి లాగే, ఇంటి విషయాలు ఏం పట్టవు.
ఆయన త్రాగుతాడు,
100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఇంట్లో ఇవ్వడం కూడా గగనం. ఇప్పుడు ఇప్పుడు కొంచం మారుతున్నడు, పాప డాక్టర్ కోర్స్ లో చేరిన తరువాత.
మా పెద్ద అమ్మాయిని ఏడో తరగతిలో చదువు మానిపించేసా, కానీ వాళ్ల టీచర్ ఇంటికి వచ్చి, నన్ను మందలించి, మంచి తెలివి గల అమ్మాయి, చక్కగా చదువు కొంటోంది అని చెప్పి బడికి తీసుకొని వెళ్ళింది. అప్పటికి అర్థం అయ్యింది నాకు, నా పిల్లలు తెలివి గల వాళ్ళు అని, నా పిల్లల చదువులు ఆగ కూడదు అని ఇంకో రెండు ఇల్లులు ఎక్కువ ఒప్పుకోవటం మొదలు పెట్టా.
ఇంట్లో సరిగ్గా కరెంట్ కూడా ఉండేది కాదు, మూడు మూడు నెలలు బిల్ కట్టలేక పోయే దాన్ని, పిల్లలు ఆలాగే బుడ్డి దీపాల్లో చదువుకున్నారు.
ఇప్పుడు కాస్త పర్వాలేదు, పెద్ద అమ్మాయి కాస్త సంపాదిస్తోంది. ఎలాగో కిందా మీదా పడుతున్నాను అంది.
నాకు నోట మాట రాలేదు. ఒక చదువుకోని మహిళ,
భర్త త్రాగుబోతు, ఇంతగా కష్టపడి పిల్లలను ఇంతగా వృద్ధిలోకి తెచ్చిందా.
లక్షలు, లక్షలు ఫీజులు పోస్తుంటే నాపిల్లలు అస్సలు చదవట్లేదు. నా పిల్లలు వీళ్ళలో సగం చదువుకున్నా చాలు అనుకున్నా.
అంతే, నాకు అర్జంట్ గా వీళ్ళ ముగ్గురు పిల్లలని కలవాలి అనిపించింది.
నేను మీ ముగ్గురు అమ్మాయిలతో మాట్లాడాలి, నాకు పరిచయం చేయ్యాలి అని అడిగా, అలా మా పిల్లలను చూపించినట్లు ఉంటుంది అన్నా.
నేను ఆడిగినట్లే, ముగ్గురిని తీసుకొని సాయంత్రం ఇంటికి వచ్చింది ........
ముగ్గురు వాళ్ళ అమ్మతో పాటు నేలపై కూర్చున్నారు. నా మనస్సు చివుక్కుమంది. ఎంతగానో బ్రతిమాలితే గాని, కుర్చీలపై కూర్చో లేదు.
ఆమె నేల పైనే. నాకు అలవాటే సారూ అంది,
నా పిల్లలు నాలా మిగిలి పోకూడదు అనే ఈ నా శ్రమ అంతా. మీలాంటి గొప్ప వాళ్ళతో పాటు సరి సమానంగా కూర్చున్నారు చూడండి, ఇది చాలు, అంది కళ్ళ నీళ్లతో.....
నేను కాదు, వీళ్లు కాదు,
నువ్వూ ... గొప్ప దానివి అన్నా.
మొదటి పది నిమిషాలు ముగ్గరు ముడుచుకు కూర్చున్నారు, తరువాత కొంచం కొంచం మాట్లాడ్డం మొదలు పెట్టారు.
తాము పడిన కష్టాలు, పడుతున్న కష్టాలు, ఎలా సీట్లు తెచ్చుకొంది, ఎంతో కొంత స్కాలర్షిప్ లు రావటం, అవి సహాయ పడ్డం. నిజంగా ఇలాంటి వారే పథకాలకు అర్హులు.
వీళ్లకు ఏదన్నా సహాయం చేద్దాం అని గట్టిగా మనసులో అనుకున్నా.
ఏం కావాలి అని అడిగా,
ఎంత అనుకువగా ఉన్నారో, అంత ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం మెండుగా ఉన్నాయి. ఏమి అడిగినా, ఆహా వద్దు అనే సమాధానం.
నేను, నా అర్ధాంగి అడగంగా, అడగంగా, ఒక Two వీలర్ ఇప్పించండి, ముగ్గరము కలిసి ఊయోగించు కుంటాం, మీకు నెల నెలా ఇస్తాం, మేము లోన్లో తీసుకోలేము, అనవసరమైన వడ్డీ అన్నారు. Two వీలర్ ఉంటే, కాస్త సౌలభ్యoగా ఉంటుంది, సగం డబ్బులు ఆటోలకు అయి పోతున్నాయి, మా ఏరియా దగ్గర షేర్ ఆటోలు దొరకవు, దొరికే స్టాప్ వరకు నడచి అలిసిపోవటం, సమయం కూడా వ్యర్థం అవుతున్నాయి. Two వీలర్ ఉంటే అలిసిపోము, మిగిలిన సమయాన్ని చదువు కునేందుకు ఉపయోగించు కుంటాము అన్నారు.
Two వీలర్ ఇప్పించా డబ్బులు కట్టి,
ఒక తొమ్మిది నెలల్లో నాకు ఒక పైసా వదలకుండా మొత్తం తీర్చేశారు, ఒక పది వేలు ఉంచుకోండి అని అన్నా వినకుండా.
పెద్ద అమ్మాయి ఇద్దరిని డ్రాప్ చేసిన తరువాత తన కాలేజ్ కు వెళ్లి పోతుంది. మళ్ళీ ఇద్దరని పికప్.
పెద్ద అమ్మాయి J.L పోస్టులకు సన్నద్ధం అవుతోంది. రెండో అమ్మాయి Software ఫీల్డ్ వైపు వెళ్ళాలి అని.
చెప్పటం మరిచా ఇప్పుడు పెద్ద అమ్మాయి మా పిల్లలకు హోమ్ ట్యూటర్. ప్రతి రోజు రెండు గంటలు.
ఏదో సినిమాలో అమ్మకంటే పెద్ద యోధురాలు ఎవరు ఉండరు అంటాడు హీరో, మనకు తెలియని ఈ తల్లి లాంటి యోధురాళ్లు ఎందరో..
ఒకసారి ఆమె తో అన్నా, ఇంకో రెండు సంవత్సరాలు కష్టం మీకు, తరువాత పిల్లలు చూసుకుంటారు మిమ్మల్ని అని,
ఏం సారూ నన్ను పనిలో నుంచి తీసేయ్యాలి అనుకుంటున్నారా, నా ఒంట్లో శక్తి ఉన్నoత వరకు నేను నా పని మానను.
ఆమెను అడిగా, మీ ఆయన మీద కోపం లేదా అని,
లేదు అన్నది, పిల్లలకు ఉంది, అయినా వీళ్లు తమ చదువులు అయిపోయి, పెళ్లిళ్లు చేసుకొని వెళ్లి పోతే తను నేనే కదండి, కోపాలు, తాపాలు పెట్టుకుంటే అవుతుందా అని సమాధానం. చిన్న చిన్న వాటికి గొడవలు పడి విడి పోతున్న జంటలకు ఈమె పెద్ద సమాధానం.
ఒక సారి పెద్ద అమ్మాయి అంది, మా నాన్న తన స్నేహితుల ముందర మా గురుంచి గొప్పగా చెబుతుంటాడు, అక్కడే ఆయన మొహం ముందరే వారికి చెబుతాం, ఇదంతా మా అమ్మ కష్టం అని......
ఎందరో అమ్మల నిజమైన కథ..!!!
అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే మాటకు .
కుదిరితే ఈ వ్యాసం అందరికి పంపండి. కనీసం చదువు కున్న వాళ్లకు అర్థం అవుతుంది.
శ్రీవైష్ణవ మాధ్వ ఏకాదశి
జై శ్రీమన్నారాయణ
16.08.2024,శుక్రవారం.
ఈరోజు వరలక్ష్మీ వ్రతం
శ్రీవైష్ణవ మాధ్వ ఏకాదశి
శ్రావణమాస పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. భక్తుల పాలిట వరాల కల్పవల్లి అయిన వరలక్ష్మి రూప, గుణ విశేషాలన్నీ శ్రీసూక్తంలో ప్రస్తావితమై ఉన్నాయి.
భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలుకలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అనే అర్థం కూడా ఉంది.
*సిద్ధ లక్ష్మీ మోక్ష లక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి*
*శ్రీ లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా*
కార్యసిద్ధి, సంసారబంధ విమోచనం వల్ల సిద్ధించే మోక్షం, ఆటంకాలను అధిగమించి పొందే జయం, విద్య, సంపద, శ్రేష్టత... ఇవన్నీ వరలక్ష్మీ స్వరూపమైన సద్గుణాలు. ఆ గుణాలను పొందడానికి ఉద్దేశించినదే వరలక్ష్మీ వ్రతం. ఇది అన్ని వ్రతాలలోనూ శ్రేష్టమైనదని పురాణాలు చెబుతున్నాయి. అంతటి విశిష్టమైన ఈ వ్రతాన్ని ఆచరించి, లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి తగిన ప్రవర్తన కలిగి ఉండాలని చారుమతి పాత్ర ద్వారా శ్రీ వరలక్ష్మీ వ్రతకథ చెబుతోంది.
దేవాలయాలు - పూజలు 12*
*దేవాలయాలు - పూజలు 12*
దేవాలయాలలో పూజల అనంతరం అర్చక స్వాముల వారు మనకిచ్చే పావనోదకమే /అభిషేక (మన్త్ర,తన్త్ర విగ్రహాలచే పునీతమైనవి) *తీర్థం*. తీర్థం అంటే తరింప జేసేది అని అర్థం. పాపాల ప్రవాహం నుండి జీవుడిని అవతల (అలౌకిక) గట్టుకు చేర్చేదే *తీర్థం*. సకల కల్మశ ప్రభావాలను ఉత్తరింపజేసేదే గంగ (జలము). దురితములను అంటే పాపాలను క్షయింపజేయగల గలదె *తీర్థం*. పావన గంగా జలమైనా, భగవత్ సన్నిధిలో ఇచ్చే తీర్థమైనా, భక్తి పూర్వకంగా మాత్రమే గాకుండా *అనుగ్రహపూర్వకంగా* అర్చక స్వాములిచ్చినా, ఇతర పెద్దలు, మహాభావులు ఇచ్చినా ఆ తీర్థం *మహా తీర్థమవుతుంది*.తప్పనిసరిగా భక్తులు స్వీకరించాల్సిందే. తీర్థాలు ఎన్ని రకాలో గత వ్యాసంలో తెలుసుకున్నాము.
*ప్రసాదాలు* భగవంతునికి నివేదించిన *నైవేద్యమే*, భగవంతుని దృష్టి పథాన నిల్చి దోషరహితమై నిర్మలమై దైవత్వమై పూజల అనంతరం భక్తులకు అందజేసినప్పుడు
ఆ పదార్థాలే, ఆ వంటకాలే *ప్రసాదాలుగా* పరిగణింప బడుతాయి. అమిత భక్తితో స్వీకరించే ప్రసాదాల వలన భక్తులలో పారమార్థిక ఆనందము, తన్మయము, అంతరంగ సామరస్యము, బుద్ధి ప్రకాశము కలగడమే గాకుండా *పరతత్వాన్ని దర్శింప జేసేది కూడా ప్రసాదమే*. *ప్రసాదం* భగవత్ అనుగ్రహ సంకేతం, అత్యంత పవిత్రమైన పదార్థం. *ఏ రూపంలో ఉన్నా భగవత్ నైవేద్య పదార్థాలను భక్తులు స్వీకరించినప్పుడు "ప్రసాదం" అని మాత్రమే వ్యవహరించాలి*.
ఈ మధ్య కాలంలో దేవాలయం నుండి వస్తున్న భక్తులు కొందరు *పులిహోర, కొబ్బరి* ఇస్తున్నారు అని అనడానికి అలవాటు పడ్డారు. *ఆలా అనడం కూడదు*. *పులిహోర ప్రసాదం, దద్దోజనం ప్రసాదం, పాయస ప్రసాదం, కొబ్బరి ప్రసాదం అని అనవల్సిందే*. అదే సనాతన సంప్రదాయము.
*దేవతలందరికీ ఒకే రకమైన నైవేద్యం ఆనవాయితి కాదు.*. వివిధ దేవతలకు వివిధ ప్రాంతాలలో, వివిధ సందర్భాలలో (అనగా పండుగలు, పబ్బాలు, నవరాత్రులు, ద్వాదశ ఏకాదశులు ఇతరత్రా)
వివిధ రకాల నైవేద్యాలను అర్పించడం, సమర్పించడం జరుగుతూ ఉంటుంది. *ఆ నైవేద్యములే భక్తులకు ప్రసాదముల రూపంలో భక్తులకు అందజేయబడుతాయి*.
*మాన్యులకు విజ్ఞప్తి*
*దేవాలయములు - పూజలు* అను అంశముపై ధారావాహిక వ్యాసంగము బహు సున్నితమే గాకుండా బహు విస్తృతము, క్రమానుసారము, ప్రామాణిక, సుస్థాపిత విశేషముగల విషయము కాబట్టి, ఈ గ్రూప్ లోని మాన్యులు.... ఈ రచనలలో అన్యమైన, అసంగత, అసంబద్ధ, అప్రస్తుత అనంగీకార ప్రస్తావనలు ఉంటే తెలుపగలరు, సరిదిద్దగలరు. ఆగమ శాస్త్రాల ,పురాణేతిహాసాల మరియు శృతి , స్మృతి , ఉపనిషత్ప్రామాణికతను అందజేయగల్గుతే చదువరులకు మరింత జ్ఞానదాయకంగా ఉంటుంది.
ధన్యవాదములు.
*(సశేషము)*
తప్పని నెంచెన్
తనకొమరుని యాగడములు
మనమందున నాటుకొనగ మానవుడొకడున్
దనతండ్రికి మది మ్రొక్కియు
తనపనులను తలచి మరల తప్పని నెంచెన్
వేదాంత శాస్త్ర సిద్ధాంతం*
*వేదాంత శాస్త్ర సిద్ధాంతం*
వేదాంత సిద్దాంతాన్ని అనుసరించే బ్రహ్మయే జగత్కారణం అని భగవత్పాదులు చెప్పిన ఈ విషయంలో ఏ విధమైన ఆక్షేపణ లేదు. జగత్తులో ప్రతివాడూ విషయాలను అనుభవిస్తున్నాడు, ఆస్వాదిస్తున్నాడు. ఈ ఆస్వాదింపబడే విషయాలను శాస్త్రంలో భోగ్యం అంటారు. వాటిని భుజించేవాడు, ఆస్వాదించేవాడూ భోక్త కాబట్టి చేతనుడైన జీవుడే భోక్త అని, భోగ్యం అంటే శబ్ద, స్పర్శ, రసాది విషయ సమూహమనీ అంటారు. అద్వితీయమైన బ్రహ్మనే ఈ జగత్తుకు ఉపాదాన కారణంగా చెపుతున్నారు. అందువల్ల కార్యకారణాలు రెండూ ఒకటి అవుతున్నాయి. అంటే భోగ్యవస్తువులకే భోక్తృత్వం కూడా లభిస్తోంది. అంటే భోగ్యమైన అన్నం మనలను తింటోందా? లేక మనం అన్నాన్ని తింటున్నామా అన్నట్లు.
కాబట్టి వేదాంతంలో చెప్పబడే భోక్త భోగ్యవిభాగం కుదరదుగదా అని ఆక్షేపణ. బ్రహ్మము జగత్తుకు ఉపాదాన కారణం అని అన్నట్లయితే ఈ భోక్త రూపంలోనూ భోగ్య రూపంలోనూ కనిపించే జగత్తు అంతా బ్రహ్మము కంటె భిన్నమైనదికాదు. మనం భోగ్యం అనుకునే శబ్దాది విషయాలన్నిటికీ భోక్త యొక్క రూపం కలుగుతుంది. అందువల్ల ఇక భోక్త, భోగ్యము విభాగము ఉండదు. అంటే ఈ విభాగం లోకంలో మనం చూస్తున్నట్లుగానే వుంటుంది - అని లోక దృష్టాంతాన్ని చూపి సమాధానం చెపుతున్నారు. అంటే సముద్రంలో ఉండే నురుగు, అలలు, బుడగలు అనేవి వేరుగా కనిపించినా వాటి అన్నింటికీ కారణమైనది సముద్రము ఒక్కటే. ఈ జగత్తు తనకు ఉపాదాన కారణమైన
బ్రహ్మము కంటే భిన్నము కాకపోయినా ప్రపంచంలోని రూపాలలో స్వస్వరూపాలలో భేదం కనిపించవచ్చు.
లేకపోతే లోక వ్యవహారం ఎట్లా నడుస్తుంది? ఏదో ఒక తర్కాన్ని చెప్పటం తప్పుగదా! దీనికి వేదం మాత్రమే ప్రమాణం. కార్యం అసత్యమైతే కారణం కూడా అసత్యమే అవుతుంది గదా! వేదవాక్యం ఎట్లా ప్రమాణమవుతుంది? అంటే భగవత్పాదులు ఛాందోగ్యోపనిషత్తులో ఈ విషయాన్ని చెప్పారు. కార్యకారణాలకు వుండే భిన్నత్వం కేవలం శ్రుతి ప్రమాణమే అనకుండా ప్రత్యక్ష ప్రమాణం ద్వారా కూడా చూపించారు. కుండ పుట్టిన తరువాత కూడా అది మట్టి కంటే భిన్నం కాదు. అంటే కార్యం పుట్టిన తరువాత కూడా కారణం కంటె భిన్నం కాదు. ఈ జగత్తుకు కారణమైన బ్రహ్మతో సమానమైన అన్వయత్వం చెప్పబడ్డది. కాబట్టి కార్యకారణాలు భిన్నముకావు. కారణమైన బ్రహ్మ మూడు కాలాలలో వున్నట్లే కార్యమైన జగత్తు కూడా మూడు కాలాలలోనూ వుంది.
వేదవాక్య ప్రమాణం అని ఎట్లా చెప్పగలరు? అని కుతర్కం చేస్తే ప్రయోజనం వుందా? అంటే లోకసిద్ధమైన స్వప్న వృత్తాంతాలకు, పురాణేతిహాసములలోని స్వప్నఫలితాలకు కలిగిన ప్రమాణత్వాన్ని కూడా తెలిపి అన్వయించ వచ్చును. కాని విశ్వసించని సంశయాత్మకు ఏమి చెప్పినా యేమి ప్రయోజనము? తాతగారు చెప్పినది మనుమడు నమ్మకపోతే, ఆ సమయానికి తాతగారు గతిస్తే తాతగారే లేరని అనగలమా? *'సంశయాత్మ వినశ్యతి'* అనుకోవలసినదే.
కాబట్టి శాస్త్రార్థ విచారణ, తమ ప్రజ్ఞను ఉపయోగించి, ప్రయోజనాన్ని బలపరచి భగవత్పాదులు ప్రతిపాదించిన అథ్వైత సిద్ధాంతాన్ని, శృతి వాక్యాలను అన్వయించుకొని శాస్త్రాన్ని బాగా అర్ధం చేసుకోవాలి.
|| हर नमः पार्वतीपतये हरहर महादेव || --- *జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు* .
వరలక్ష్మి వ్రతం
#వరలక్ష్మి వ్రతం (పూజా విధానం )....!!
🍒🌸🥥🍋🍎🍌🌺🌻🌻
#పూజ #సామగ్రి :-
పసుపు ................. 100 grms
కుంకుమ ................100 grms
గంధం .................... 1box
విడిపూలు................ 1/2 kg
పూల మాలలు ........... 6
తమలపాకులు............ 30
వక్కలు..................... 100 grms
ఖర్జూరములు..............50 grms
అగర్బత్తి ....................1 pack
కర్పూరము.................50 grms
చిల్లర పైసలు .............. Rs. 30/- ( 1Rs coins )
తెల్ల టవల్ .................1
బ్లౌస్ పీసులు .............. 2
మామిడి ఆకులు............
అరటిపండ్లు ................ 1 dazans
ఇతర రకాల పండ్లు ........ ఐదు రకాలు
అమ్మవారి ఫోటోల ......................
కలశము .................... 1
కొబ్బరి కాయలు ............ 3
తెల్ల దారము లేదా నోము దారము లేదా పసుపు రాసిన కంకణం 2............
స్వీట్లు ..............................
బియ్యం 2 kg
కొద్దిగా పంచామృతం లేదా పాలు 100 ML
#వస్తు #సామాగ్రి :-
దీపాలు ....
గంట
హారతి ప్లేటు
స్పూన్స్
ట్రేలు
నూనె
వత్తులు
అగ్గిపెట్టె
గ్లాసులు
బౌల్స్
శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయవచ్చు.వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రిసమయంలోచారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం. “శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే” శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలు పాపాలు పోవడంతోపాటు, లక్ష్మీ ప్రసన్నత కలుగుతాయి.
వ్రత విధానం :-
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటినిశుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటుచేసుకోవాలి. అమ్మవారి ఫొటో అమర్చు కోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరాలు ముందుగానే సిద్ధం చేసుకునిఉంచాలి. అక్షతలు, పసుపు గణపతిని సిద్ధంగా ఉంచు కోవాలి.
కావలసినవి :-
పసుపు, కుంకుమ, వాయనం ఇవ్వడానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికె వస్త్రం, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములు కట్టుకోవడానికి దారం, టెంకాయలు, దీపపుకుందులు, ఐదువత్తులతో, హారతి ఇవ్వడానికి, అవసరమైన పంచహారతి, దీపారాధనకునెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యం, శనగలు మొదలైనవి.
తోరం ఎలా తయారుచేసుకోవాలి :-
తెల్లటి దారాన్ని ఐదు లేక
తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపురాసుకోవాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటేఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆవిధంగా తోరాలనుతయారుచేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.
గణపతి పూజ:-
అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥
ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన
పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥
గణపతిపై అక్షతలు చల్లాలి. యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి.
ఓం సుముఖాయ నమః,
ఓం ఏకదంతాయ నమః,
ఓం కపిలాయ నమః,
ఓం గజకర్ణికాయ నమః,
ఓంలంబోదరాయ నమః,
ఓం వికటాయ నమః,
ఓం విఘ్నరాజాయ నమః,
ఓం గణాధిపాయ నమః,
ఓంధూమకేతవే నమః,
ఓం వక్రతుండాయ నమః,
ఓం గణాధ్యక్షాయ నమః,
ఓం ఫాలచంద్రాయ నమః,
ఓం గజాననాయ నమః,
ఓం శూర్పకర్ణాయ నమః,
ఓం హేరంబాయ నమః,
ఓం స్కందపూర్వజాయనమః,
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూస్వామిపై పుష్పాలు ఉంచాలి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి.
స్వామివారి ముందు పళ్ళుగానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి.
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం,
భర్గోదేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్!!
నీటిని నివేదన చుట్టూ జల్లుతూ … సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి… ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహాగుడ సహితఫల నివేదనం వతా సుప్రీతసుప్రసన్న వరదాభవతు! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు!!
వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి. ఈ విధంగామహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప
్రారంభించాలి.
🙏☝️
🪷🌸🌻🍒🌼 ❀꧁గోవింద ꧂❀ 🥥🍒🍓🍌🌺🪻🍈🪷
కలశపూజ :-
కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః
మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ ఃస్థితాః
కుక్షౌతుస్సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో అధర్వణః
అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః
ఆయాంతు గణపతి పూజార్థం దురితక్షయకారకాఃగంగేచ యమునేచైవ గోదావరి సరస్వతినర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు॥
అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపైన, పూజాద్రవ్యాలపైన, పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి.
అధాంగపూజ:-
పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి.
చంచలాయై నమః – పాదౌ పూజయామి, చపలాయై నమః – జానునీ పూజయామి, పీతాంబరాయైనమః – ఉరుం పూజయామి, కమలవాసిన్యైనమః – కటిం పూజయామి, పద్మాలయాయైనమః -నాభిం పూజయామి, మదనమాత్రేనమః – స్తనౌ పూజయామి, కంబుకంఠ్యై నమః- కంఠంపూజయామి, సుముఖాయైనమః – ముఖంపూజయామి, సునేత్రాయైనమః – నేత్రౌపూజయామి, రమాయైనమః – కర్ణౌ పూజయామి, కమలాయైనమః – శిరః పూజయామి, శ్రీవరలక్ష్య్మైనమః – సర్వాణ్యంగాని పూజయామి. (ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని ఈ అష్టోత్తర శతనామాలతో పూజించాలి)
శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి :-
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృతై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూత హితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓంపరమాత్మికాయై నమః
ఓం వాచ్యై నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం శుచయే నమః
ఓంస్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓంహిరణ్మయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యైనమః
ఓం ఆదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం రమాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓంకామాక్ష్యై నమః
ఓం క్రోధ సంభవాయై నమః
ఓం అనుగ్రహ ప్రదాయై నమః
ఓంబుద్ధ్యె నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓంఅమృతాయై నమః
ఓం దీపాయై నమః
ఓం తుష్టయే నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓంలోకశోకవినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓంలోకమాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓంపద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓంపద్మముఖియై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓంపద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మ గంధిన్యైనమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖీయైనమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓంచంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్ర రూపాయై నమః
ఓంఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యెనమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం దారిద్ర నాశిన్యై నమః
ఓం ప్రీతా పుష్కరిణ్యైనమః
ఓం శాంత్యై నమః
ఓం శుక్లమాలాంబరాయై నమః
ఓం శ్రీయై నమః
ఓంభాస్కర్యై నమః
ఓం బిల్వ నిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యైనమః
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓంహేమమాలిన్యై నమః
ఓం ధనధాన్యకర్యై నమః
ఓం సిద్ధ్యై నమః
ఓం త్రైణసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశగతానందాయై నమః
ఓంవరలక్ష్మ్యై నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓంహిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః
ఓంమంగళాదేవ్యై నమః
ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః
ఓం ప్రసన్నాక్ష్యైనమః
ఓం నారాయణసీమాశ్రితాయై నమః
ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః
ఓంసర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓంబ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
ఓంభువనేశ్వర్యై నమః
తోరపూజ :-
తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ క్రింది విధంగా పూజ చేయాలి.
కమలాయైనమః – ప్రథమగ్రంథిం పూజయామి,
రమాయైనమః – ద్వితీయ గ్రంథింపూజయామి,
లోకమాత్రేనమః – తృతీయ గ్రంథింపూజయామి,
విశ్వజనన్యైనమః – చతుర్థగ్రంథింపూజయామి,
మహాలక్ష్మ్యై నమః – పంచమగ్రంథిం పూజయామి,
క్షీరాబ్ది తనయాయై నమః – షష్ఠమ గ్రంథిం పూజయామి,
విశ్వసాక్షిణ్యై నమః – సప్తమగ్రంథిం పూజయామి,
చంద్రసోదర్యైనమః – అష్టమగ్రంథిం పూజయామి,
శ్రీ వరలక్ష్మీయై నమః – నవమగ్రంథిం పూజయామి.
ఈ కింది శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి
బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే.
కథా ప్రారంభం :-
శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా! స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమ శివుడు పార్వతికిచెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను.శ్రద్ధగా వినండి.
పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారదమహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రములతో పరమశివుడ్ని కీర్తిస్తు న్నారు.
ఆమహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని అడిగింది. అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది.అది వరలక్ష్మీవ్రతం.దానిని శ్రావణమాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు.
అప్పుడు పార్వతీదేవి...దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరుచేశారు?ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది.కాత్యాయనీ...పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆపట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒకబ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తిగౌరవాలు గలయోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించు కునిప్రాతఃకాల గృహకృత్యాలు పూర్తిచేసుకుని అత్తమామలను సేవించు కుని మితంగాసంభాషిస్తూ జీవిస్తూ ఉండేది.
వరలక్ష్మీ సాక్షాత్కారం :-
వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతీ...ఈ శ్రావణపౌర్ణమి నాటికి ముందువచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలనుఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి. "హే జననీ! నీకృపా కటాక్షములు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరివిధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది.
అంతలోనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలిజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీవ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఊరిలోని ముత్తైదువలు చారుమతి కలను గురించివిని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూచూడసాగారు.శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు.
చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యంపోసి పంచ పల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో
సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే !! అంటూ ఆహ్వానించి ప్రతిష్టించింది.
అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల కంకణాన్ని చేతికి కట్టుకున్నారు.ప్రదక్షిణ నమస్కారాలు చేశారు.
మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి గజ్జేలు ఘల్లు ఘల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్న ఖచిత కంకణాలు ధగధగా మెరవసాగాయి.మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వా భరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆపట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి.ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతరగరథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకుతీసుకెళ్లారు.
వారంతా మార్గమధ్యంలో చారుమతిని ఎంతగానో పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీ దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీ వ్రతంతో మనల్ని కూడా భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు.
వారంతా ప్రతీ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలు కలిగి సుఖ జీవనంతో గడిపి ముక్తిని పొందారు.
మునులారా శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీవ్రత విధానాన్ని సవివరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నాను ఈ వ్రతం చేసినను ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు కలిగుతాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు.ఈ కథ విని అక్షతలు శిరసుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు పసుపు బొట్టు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి.అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినేయాలి,రాత్రి ఉపవాసం ఉండాలి.
భక్తితో వేడుకొంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృప కలిగి సకల శుభాలుకలుగుతాయి.
సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. 'వర' అంటే శ్రేష్ఠమైన అర్థం కూడా ఉంది.🙏🌺🌷🪷🌸🍒🍅
*శ్రీ కాళహస్తీశ్వర శతకము - 12*
💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
𝕝𝕝 శ్లోకం 𝕝𝕝
*నిను సేవింపగ నాపద ల్పొడమనీ, నిత్యోత్సవం బబ్బనీ*
*జనమాత్రుం డననీ, మహాత్ముఁడననీ, సంసారమోహంబుపై*
*కొననీ, జ్ఞానము గల్గనీ, గ్రహగతుల్ గుందింపనీ, మేలువ*
*చ్చిన రానీ యవి నాకు భూషణములే, శ్రీకాళహస్తీశ్వరా!!!!*
*శ్రీ కాళహస్తీశ్వర శతకము - 12*
*తాత్పర్యము: ప్రభో శ్రీకాళహస్తీశ్వరా! నేను నిన్ను సేవించుచున్నప్పుడు, నాకు ఆపదలే రానీ, లేక సుఖములు కలగనీ, సామాన్యమానవుడు అని జనులు అనుకొననీ లేక మహాత్ముడు అని పొగడనీ, సంసారము మీద మోహము కలగనీ లేక వైరాగ్యమబ్బనీ, గ్రహములు అడ్డము తిరగనీ లేక మంచి జరగనీ అవి నాకు మంచే చేయునని భావించెదను*.....
✍️🙏
మంటపం-మండపం.
మంటపం-మండపం.
* * *
నిన్న ఒక బంధువు నాకు ఫోన్ చేసి ''పై రెండు పదాలలో ఏది సరి అయినది?''అని అడిగాడు.నేను " 'మంటపం' సంస్కృత పదం.మౌలికంగా అదే సరైనది.అయితే 'మండపం' అని కూడా
వ్యవహారంలో ఉంది. ఎక్కువగా తమిళులు ఈ పదాన్ని ఉపయోగిస్తారు. రామేశ్వరానికి వెళ్లే రైలు మార్గంలో 'మండపం' అని ఒక స్టేషన్ కూడా ఉంది" అని చెప్పాను.
2.'మంటపం' సరి అయినది- అని నేను చెప్పడానికి ఆధారం సాధారణంగా పూజలలో 'మంటపస్థిత ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యోనమః' అనీ, దేవీ స్తుతిలో 'శ్యామాం విచిత్రాం-నవరత్న శోభితాం... స్వర్ణ,మణి మయ మంటపమధ్యే' అనీ చదువుతారు కదా!-అని.
3.నాకు తెలిసినంతలో తమిళులకు కచటతప-అనే పరుషాలు,గజడదబ-అనే సరళాలు విడిగా లేవు.
సాధారణంగా పద ఆదిలో ఉన్న కకారాదులను
పరుషాలుగాను, పదమధ్యంలో ఉండే వాటిని సరళంగాను ఉచ్చరించడం వాళ్ల అలవాటు/సంప్రదాయం.
4.అందుకే చాలామంది తమిళ శాస్త్రీయ గాయకులు
త్యాగరాజ స్వామి వారి
కీర్తనలను ఆలపించేటప్పుడు
'బంటు రీతి' అనే పదాలను 'పండు రీతి' అని పలకడం వింటూ ఉంటాం.
5.దీనికి కారణం పదఆదిలో ఉన్న 'బ' (సరళం) తమిళంలో 'ప' అనే పరుషంగాను, పదమధ్యం(చివర)లో ఉన్న 'టు'(పరుషం) 'డు' అని
సరళంగాను మారడమే.
అర్థంతో నిమిత్తం లేకుండా పాడేవాళ్ళతోనే ఈ సమస్య.
6.వర్ణ ఉత్పత్తి స్థానాలను
వివరించే సంస్కృత వ్యాకరణ సూత్రం 'అ,కు,హ, విసర్జనీయానాం కణ్ఠః' అని చెప్తుంది(లఘు సిద్ధాంత కౌముదీ-సంజ్ఞాప్రకరణం-10వ
సూత్రం 'తుల్యాస్య ప్రయత్నం సవర్ణం-వివరణ.)అందుకే 'అ, య,హ'-లకు యతి మైత్రిని కూడా చెప్పారు.
7.ఈ కారణంగానే కొంతమంది తమిళ గాయకుల ఉచ్ఛారణలో 'ఎందరో మహానుభావులు..' అనే కీర్తన
'.. మగానుభావులు'(హా->గా)
అని వినిపిస్తుంది.
8.ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి వంటి తమిళ మహా గాయనీమణులు,మహా గాయకులు మాత్రం తమ మాతృభాషా సంప్రదాయాన్ని పక్కనపెట్టి సంస్కృత పదాలను యథాతథంగా
ఉచ్చరిస్తారు వారికి అనేక ప్రణామాలు🙏
9.అవసరమైతే నా ఈ అవగాహనను నిస్సంకోచంగా సరిచేయాలని పెద్దలకు, మిత్రులకు విజ్ఞప్తి.
-మోతుకూరు నరహరి
ఒకటి వదిలితే చాలు
ఒకటి వదిలితే చాలు
ఒకసారి రామారావుకు కాళ్ళు, చేతులు తిమ్మిరులు ఎక్కటం, అప్పుడప్పుడు కళ్ళు తిరగటం అవుతుంటే ఎందుకైనా మంచిదని ఒకసారి డాక్టరు దగ్గరకు వెళ్లి చూపెట్టుకుందాం అనుకోని సమీపంలో ఉన్న ఒక ఫ్యామిలీ డాక్టారు వద్దకు వెళ్ళాడు. డాక్టరు పరీక్షించిన తర్వాత నాకు అనుమానంగా వున్నదండి మీ లక్షణాలు చూస్తుంటే మీకు షుగర్ ఉన్నట్లు అనిపిస్తున్నది. ఒకసారి రక్త పరీక్ష చేయించుకోండి అని సలహా ఇచ్చాడు. వెంటనే ఆయన సమీపంలోవున్న లాబులో రక్త పరీక్ష చేయించుకున్నాడు. అతని ధీమా ఏమిటంటే నాకు షుగర్ ఎందుకు వస్తుంది. నేనేమయినా రోజు స్వీట్లు తింటావా ఏమన్ననా నేను ఎప్పుడో కానీ స్వీట్ తినను. స్వీట్ తినే వాళ్లకు షుగరు వస్తుంది కానీ నాకెందుకు షుగరు వ్యాధి వస్తుంది అని అనుకున్నాడు. సాయంత్రం రక్త పరీక్ష రిపోర్ట్ ఇవ్వగానే అనుమాన నివృత్తి చేసుకోవడానికి అక్కడి టెక్నీషియన్ని అడిగాడు. నాకు షుగర్ ఉన్నదా లేదా అని. దానికి అతను మీరు వెళ్లి మీ డాక్టరుకు చూపించండి అన్ని ఆయన చెపుతారు అని అన్నాడు. . మనసులో ఏదో తెలియని గుబులు. నిజంగా నాకు షుగరు వ్యాధి వచ్చిందా రాలేదా రాకుంటే అతను అలా ఎందుకు చెప్పాడు అని ఇంటికి వెళ్ళాడు. రేపు ఉదయం డాక్టరు వద్దకు వెళ్ళాలి. రాత్రంతా నిద్ర రాలేదు. ఏదో తెలియని గుబులు. ఉదయం లేచి ముఖ ప్రక్షాళన చేసుకొని గడియారం వైపే చూస్తున్నాడు. కాలు కాలిన పిల్లిలాగా అటుఇటు తిరుగుతున్నాడు. అతని ప్రవర్తన చిత్రంగా తోచిన ఆయన శ్రీమతి రేణుక ఏమైందండీ మీకు ఏదో చిత్రంగా ప్రవర్తిస్తున్నారు అని అడిగింది. అప్పుడు గత దినం డాక్టరు వద్దకు వెళ్లిన దగ్గరినుండి ల్యాబ్ టెక్నీషియన్ చెప్పిన మాట దాకా పూసగుచ్చినట్లు చెప్పాడు.రామారావు. రేణుక మంచి సమయస్పూర్తి, సద్బుద్ధి కల ఇల్లాలు . ఆమెకు వెంటనే తన భర్త మానసిక స్థితి అర్థం అయ్యింది. తాను షుగరు వ్యాధి వస్తుందేమో అనే ఆందోళనలో ఉన్నట్లు తెలుసుకొని భర్తకు ఊరట కలిగించ తలంచి అతనిని అనునయిస్తూ మీకేమైనా చాదస్తమా ఏమిటి మీకు షుగర్ రావడం ఏమిటి మన ఇంటా వంట అటువంటి దరిద్రపు జబ్బు లేదు. మీరు నిశ్చింతగా వుండండి. టిఫిను చేసి డాక్టరు వద్దకు వెళ్ళండి అని అన్నది. ఆయనకూడా మీకు షుగరు లేదని అంటాడు అని భర్తకు ధైర్యం చెప్పింది. నిజానికి భర్త యెంత పిరికివాడు అయినా కూడా భార్య మాటలే ధైర్యాన్ని ఇస్తాయి. అప్పుడు కానీ మన రామారావుకు పూర్తిగా ధైర్యం వచ్చింది. తృప్తిగా ఇడ్లీలు తిని బట్టలు కట్టుకొని మోటారు సైకిలు మీద డాక్టారు దగ్గరకు వెళ్ళాడు. డాక్టరు దగ్గరకు వెళుతున్నా కూడా మనసులో ఏవో తెలియని సందేహాలు. డాక్టరు ఏమి చెపుతాడో ఏమో అనే గుబులు ఇంకా వేధిస్తూ వున్నది. ఒకవైపు భార్య ఇచ్చిన భరోసా వున్నా కూడా తనను తాను నిభాయించుకోలేక పోతున్నాడు. చిన్నగా డాక్టరు వద్దకు కాంపౌండరు పిలవగానే చేతులు కాళ్లు వణుకుతూ లోపలి వెళ్ళాడు.
ఆ రండి రామారావు గారు ఎలావున్నారు అని మంచి ఉత్సాహంగా పలకరించాడు డాక్టరు. తనకు తెలుసు డాక్టర్ల మాటలకే రోగుల సగం రోగాలు తగ్గుతాయని ఇంకొక గంటలో చనిపోతాడన్న పేషంటుని కూడా నొప్పించకుండా మీకేమి భయంలేదు ఇంకొక గంట దాకా అని ప్రోత్సాహకరంగా భయం లేదు అనే మాటను పెద్దగా ఇంకొక గంట దాకా అనే మాటలు చిన్నగా చెప్పటం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. ఏమిటి నాకు ఈ రోజు అనేక విధాలుగా ఆలోచనలు వస్తున్నాయి అని అనుకుంటుంటే రామారావు గారు అనే డాక్టర్ పిలుపుతో ఈ లోకానికి వచ్చాడు. ఏమండీ ఇంతకు ముందు కూడా ఇట్లా మీరు బాధపడే వార. లేదండి అన్నాడు. సరే ఎన్నాళ్ళ నుండి మీకు ఈ ప్రాబ్లమ్ వుంది అని మరలా ప్రశ్నించాడు. ఇటీవలే బహుశా రెండు మూడు నెలల నుంచి అని జవాబు చెప్పాడు రామారావు. అదేమిటి ఈ డాక్టారు నాకు షుగరు ఉందా లేదా అని చెప్పకుండా అనవసరపు ప్రశ్నలు వేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని మనసులో అనుకోని. ఇక ఆలస్యం చేస్తే తట్టుకునేటట్లు లేదని తానే ధైర్యం చేసి డాక్టరుగారు ఇంతకూ నాకు షుగరు ఉన్నట్లా లేనట్లా అని ఓపెనుగా అడిగేశాడు. రామారావు అవస్ధచూసి డాక్టరు చావు వార్త చల్లగా చెప్పాడు. చూడండి మీకు షుగరు చాలా వుంది మీరు ఇన్నాళ్లు నిర్లక్ష్యం చేశారు. ఇంకా నయం ఇట్లానే మీరు మందులు వాడకుండా ఉంటే చాలా ప్రమాదం లోకి వెళ్లేవారు అని అన్నాడు. ఆ మాటలు వింటుంటే ఒక్కసారి తన క్రింద వున్న భూమి మొత్తం మాయమైనట్లు తోచింది తాను ఏ ఆధారం లేకుండా గాలిలో ఉన్నానా అని అనిపించింది. భగవంతుడా నాకే ఎందుకు ఇల్లాంటి పరీక్షలు పెడతావు. అవును పొద్దున నా భార్య నాకు యెంత ధైర్యం చెప్పింది మీకు షుగరు ఎందుకు వస్తుంది అని అన్నదే. ఈ డాక్టరు ఏమైనా డబ్బులు గుంజడానికి అబద్ధం చెపుతున్నాడా అని మనసులో అనుకున్నాడు. అప్పుడు రామారావు మోహంలో కత్తివేటుకు రక్తపు చుక్క లేదు.
రామారావు గారు మీకు కొన్ని మందులు వ్రాస్తున్నాను. వాటిని నిర్లక్ష్యం చేయకుండా రోజు ఉదయం రాత్రి భోజంనం చేసిన తరువాత వేసుకోండి. ఒక వారం చూద్దాం. అప్పుడు మరల రక్త పరీక్ష చేయిద్దాము ఆ రిజల్ట్ పట్టి మందులు నిర్ణయిద్దాం. మీరేమి భయపడనవసరం లేదు ఈ రోజుల్లో షుగరు వ్యాధి చాలా కామన్ అని ధైర్యం చెప్పాడు. డాక్టరు గారు ఈ మందులు ఎన్నాళ్ళు వాడాలి అని అడిగాడు అమాయకంగా. . షుగరు వ్యాధి రావటమే కానీ పోవటం అనేది ఉండదు. మందులు కేవలం దానిని నియంత్రించటమే. ఇంకా మీరు అదృష్టవంతులు ఇంకా ఆలస్యం చేస్తే ఇన్సులిన్ ఇంజక్షన్ మొదలు పెట్టాల్సి వచ్చేది అని అన్నాడు. నా అదృష్టం అడుక్కొని తిన్నట్లే ఉందిలే అని గోనుకుంటూ మందులు కొనుక్కొని ఇంటి దారి పట్టాడు.
అప్పటినుండి రామారావు కనపడ్డ ప్రతి మనిషికి షుగరు ఎలా తగ్గించుకోవాలి అని అడిగేవాడు. గూగుల్ సెర్చ్ చేసి చిట్కాలు, వెతకటం మొదలు పెట్టాడు. అలా రోజులు గడుస్తున్నాయి. రోగం వచ్చిన నెలరోజులకు సగం అయ్యాడు రామారావు. ఇప్పుడు రామారావు మదిలో ఎప్పుడు ఒకటే ఆలోచన షుగరు ఎలా తగ్గించుకోవాలి. అసలు భగవంతుడు ఈ షుగరు ఎందుకు మనుషులకు పెట్టాడు అది నా లాంటి మంచివాళ్లకు. దేవుడా ఎందుకయ్యా నా మీద ఇంత కోపం. నేనేమైనా తప్పు చేస్తే క్షమించు స్వామి. ఈ షుగరు కనక పూర్తిగా తగ్గితే వచ్చే శనివారం నీకు కొబ్బరికాయ కొడతా అని మొక్కుకున్నాడు. ఇందులో లాజిక్ ఏమిటంటే చెప్పకుండానే దేవుడికి తనకు షుగరు వచ్చే శనివారం లోగా తగ్గాలని కోరుకున్నాడన్న మాట. కానీ దేముడు ఇలాంటి రామారావులని ఎంతమందిని చూసాడు. నాయనా అది నీ ప్రలబ్దమ్ అనుభవించక తప్పదు అని దేముడు నవ్వుకున్నాడు.
రామారావు ఏ డాక్టరు వద్దకు వెళ్లిన అది తినకు ఇది తినకు అని తినే వాటి లిస్టు తినని వాటి లిస్టు చెప్పేవారు. ఇందులో గమ్మత్తు ఏమిటంటే తినని వాటి లిస్టు చాంతాడంట తినే వాటి లిస్టు చిటికెన వేలంత ఉండేది. ఇక డాక్టర్ల మాటలు వినాలంటే చిరాకు వేసింది. ఆలా అలా తిరుగుతుంటే ఎవరో చెప్పారు మిత్రమా కుక్కుటేశ్వరరావు అనే డాక్టరు షుగరుకు మంచి డాక్టరు ఆయన తినని పదార్ధాల లిస్టు పెద్దగా చెప్పడు కేవలం "ఒక్కటి తినకుండా ఉంటే చాలు" అంటాడట అని ఒక ఆశాకిరణాన్ని వదిలాడు. బతుకు జీవుడా అని ఆఘమేఘాల మీద వెతుక్కుంటూ డాక్టరు కుక్కుటేశ్వర రావు గారి వద్దకు వెళ్ళాడు.
రామారావుని చూడంగానే కుక్కుటేశ్వరరావు చిన్నగా నవ్వాడు. ఈ నవ్వుకు అర్ధం ఏమిటి ఒరే అమాయకుడా నా దగ్గరకు వచ్చావు ఇక నీ సంగతి చూస్తా అనా లేక ఇంకేమన్నానా అని అనుకున్నాడు. రామాయణంలో లక్ష్మణుడి నవ్వులా తోచింది. నమస్కారం డాక్టారు గారు నాకు షుగరు వుంది అన్నాడు. ఆ సంగతి మీరు చెప్పక్కర్లేదు మీ మొహం చూస్తేనే తెలుస్తుంది అని అన్నాడు.
అయ్యా ప్రతి డాక్టరు షుగరు పేషంట్లు అది తినకూడదు ఇది తినకూడదు అని పెద్ద లిస్టు చెపుతారు, కానీ మీరు ఒక్కటి తినకుండా ఉంటే చాలు అంటారని ఎవరో చెపితే వచ్చాను అని రామారావు అన్నాడు. దానికి డాక్టరు పెద్దగా ఒక వెకిలి నవ్వు నవ్వి అదేనండి అందరు అంటుంటారు. నేను వెరీ సింపుల్ గా చెపుతాను. ఏమిటి సింపుల్ గా చెపుతావా ఇక్కడ ప్రాణాలు ఉగ్గబట్టుకుని నేను చస్తుంటే అని మనసులో అనుకున్నాడు మన హీరో రామారావు. ఏమీ లేదండి మీకు ఇష్టమైనవి తినటం మానండి చాలు అని అన్నాడు. ఇదేదో బాగుందే అవును తనకు ఇష్టమైనవి తినటం మానితే షుగరు తగ్గుతుందా డాక్టరుగారు అని అడిగాడు పసివానివలె. అవునండి అంతే మీరేమి కంగారు పడనవసరం లేదు అని యేవో మందులు వ్రాసి ఇచ్చాడు.
మందు బిళ్ళలు కొనుక్కొని సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. సంతోషంగా ఇంటికి వచ్చిన భర్తను చూసి రాగిణి అడిగింది ఏంటండీ ఇంత సంతోషంగా ఉన్నారు ఏమైంది మీకు ఈ వేళ అని అడిగింది జరిగిందంతా చెప్పి ఇకనుంచి నేను అది తినకూడదు ఇది తినకూడదు అని నేను తిండి మానవలసిన పనిలేదు డాక్టరుగారు నాకు కేవలం నాకు ఇష్టమైనది మాత్రమే తిన నవసరం లేదు అని చెప్పాడు అని అన్నాడు. బాగుంది మీ తెలివి తెల్లారినట్టే వుంది ఆ డాక్టరు మిమ్మల్ని పిచ్చివాడిని చేసాడండి అని అన్నది. ఆ. అదెలా అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి మీకు చామగడ్డల వేపుడు ఇష్టమా కాదా ఇష్టం కదా అని అన్నది. ఇష్టం కాకపోవటం ఏమిటి ఎప్పుడు నీకు కూడా మిగల్చకుండా నేనే తింటాను అని అంటావుగా. అయితే చెప్పండి ఆలుచిప్స్, గుత్తి వంకాయ కూర, కంద కూర, ఆవకాయ పచ్చడి, నీళ్లవకాయ, మాగాయ, మిరపకాయ బజ్జిలు, ఆలు బొండాలు,అరటికాయ బజ్జిలు, జిలేబీలు, మైసూరుపాకులు, జహాంగీరీలు, కోవా, కిస్మిస్, జీడిపప్పు, ఇలా మన రామారావుకు ఇష్టమైన తినుబండారాల లిస్టు మొత్తం చెప్పింది. అబ్బా అబ్బా ఇలా నన్ను ఊరించకే ఇవన్నీ రేపు పండగకు చేసే ప్రొపోజల్ ఏమైనా ఉన్నదా చెప్పు అని అన్నాడు. ఆ మాట అంటుంటే రామారావు మొహం వెయ్యి వాట్ల బలుపు వెలిగి నట్టు వున్నది. నా మొహం అవన్నీ నేనెందుకు చేస్తానండి మీకే మీ డాక్టరు అవన్నీ తినకూడదని చెప్పాడని ఇప్పుడే చెప్పారుగా అని అనే సరికి రామారావు ట్యూబులైటు మెదడు టుపుకు టుపుకు అని వెలిగింది. అదా సంగతి అని అనుకోని అప్పుడు కానీ రామారావుకు అది చెప్పినప్పుడు డాక్టరు పెద్దగా వెకిలి నవ్వు ఎందుకు నవ్వడో తెలియలేదు. .
ఇది సాధారణంగా సమాజంలో సగటు మనిషి షుగరు వ్యాధి సోకినప్పుడు కలిగే ఆవేదన, మనలో చాలామందికి రామారావుకు కలిగినటువంటి అనుభవాలు ఉండి ఉండవచ్చు ఒక్కసారి వెనుకకు తిరిగి చూసి చెప్పండి. అయ్యా వెనుకకు అంటే మీ వెనుకకు కాదు మీ గతంలోకి తెలిసిందా.
ఇక అసలు విషయానికి వద్దాం. ఏ రకంగా అయితే ఒక షుగరు వ్యాధి గ్రస్తుడు తనకు షుగరు వ్యాధి జీవితాంతం ఉంటుండదని తెలుసుకొని కూడా షుగరు తగ్గుతుందనే ఆశతో ఉంటాడో అదే విధంగా ప్రతి సాధకుడు కూడా ఈ భవ బంధాలు జీవితాంతం వుంటాయని తెలుసుకొని నిత్యం తన సాధనతో వాటిని తెంచుకోవాలని చూస్తాడు. ఒక గుర్రం రౌతు తానూ గుర్రం దిగిన తరువాత రోజు దానికి తాడు కట్టి ఒక గుంజకు కట్టి వేసేవాడట ఒకరోజు తాను రోజు కట్టే తాడు తెగి ముక్కలు అయ్యింది ఇప్పుడు యెట్లా గుర్రాన్ని కట్టివేయాలి అని ఆలోచించాడు. అప్పటి కప్పుడు ఇంకొక తాడు తేవాలంటే అది జరిగే పని కాదు. అప్పడు అతనికి ఒక ఆలోచన వచ్చింది వెంటనే గుర్రం మేస్తున్న గడ్డి పరకలను కొన్నిటిని తీసుకొని దాని మెడ వద్ద తాడుతో కట్టినట్లు దానిమీద నిమిరాడు అంటే ఆ గుఱ్ఱం తన యజమాని తనను తాటితో కట్టాడని అనుకోని రోజులాగే అక్కడే వుండినదట . మరుసటి రోజు రౌతు గుర్రాన్ని తీసుకొని వెళ్ళటానికి అదిలిస్తే అది ఆ గుంజ చుట్టే తిరుగుతున్నది కానీ దానిని వదిలి రావటం లేదు అప్పుడు మరల ఆ రౌతు కొన్ని గడ్డి పరకాలలో దాని మెడను నిమిరితే అప్పుడు అది అక్కడినుండి కదిలినదట. అంటే నిజానికి దాని మేడలో పలుపు (తాడు) లేదు కానీ అది వున్నట్లుగా భావించి తనకు తాను బంధించినట్టు భావిస్తున్నది. సాదాకా నీవు కూడా ఆ గుర్రం వలెనె నిజానికి ఎటువంటి బంధనాలు లేకుండా వున్నావు. కానీ సంసారం ఒక బంధనం అనుకోని దానికి నీవు కట్టివేయబడినట్లు నీ అంతట నీవే ఊహల్లో ఉంటున్నావు. ఈ సత్యాన్ని తెలుసుకుంటే సంసార బంధనాలను వీడటం ఏమి సమస్య కాదు. గృహస్థ జీవనం చేస్తూ కూడా మోక్షాన్ని చేరుకోవచ్చు మనకు అనేకమంది సాధకులు ఉదాహరణగా వున్నారు.
భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే మన మహర్షులు ఏమన్నారంటే "మనః ఏవ కారణాయ మనుష్యాణాం బంధః ఏవ మోక్ష" అందువలన మనస్సును సదా ఆ పరమేశ్వరుని మీద లగ్నాత చేసి మన దైనందిక కార్యక్రమాలను మన ధర్మంగా భావించి ఏ సాధకుడైతే నిరంతర సాధన చేస్తాడో తప్పకుండా అతడు మోక్షాన్ని పొందగలడు. అందులో ఇసుమంత కూడా అసత్యం లేదు. కేవలము దృఢ సంకల్పము, అకుంఠిత దీక్ష నిరంతర కృషి ఉండాలి. "సాధనేన సాధ్యతే సర్వం" ఇంకా ఎందుకు ఆలస్యం ఎందుకు ఇప్పుడే నీ సాధనను మొదలు పెట్టు మోక్షపదాన్ని ఈ జన్మలోనే పొందు.
ఓం తత్సత్
ఓం శాంతి శాంతి శాంతిః
ఇట్లు
మీ భార్గవశర్మ