6, ఏప్రిల్ 2023, గురువారం

గుండెజబ్బు

 గుండెజబ్బు నివారించే అద్బుత యోగం - 


     మంచి గోధుమలను శుభ్రపరచి రవ్వగా పట్టించి ప్రతిరోజు ఒక చిన్న గ్లాస్ రవ్వని నాటు ఆవునెయ్యిలో వేయించి నాటు ఆవు పాలలో పాతబెల్లం కలిపి పాయసం లా చేసుకొని ప్రతిరోజు భుజిస్తుంటే కొద్దికాలం లోనే గుండెజబ్బు నివారణ అగును.


      గోధుమలు , మద్దిచెక్క చూర్ణం ని మేకపాలు లొ కలుపుకొని గాని , ఆవునెయ్యి వేడి చేసి దానిలో ఈ చూర్ణం ని వేసి దానికి చెక్కర కలిపి త్రాగినచో హుద్రోగం హరించును . 


           

*శ్రీ హనుమాన్ విజయోత్సవం విశిష్టత

 *శ్రీ హనుమాన్ విజయోత్సవం విశిష్టత🚩*

శ్రీరామునికి అత్యంత నమ్మకమైన బంటు హనుమంతుడు...


శ్రీరాముడు సీతను ఎడబాసి మానసిక క్షోభను అనుభవిస్తూ, సీత జాడ వెతుకుతున్న సందర్భ సమయంలో అడవిలో రాముడుకి హనుమంతునితో పరిచయం ఏర్పడినది... పరిచయం ఏర్పడిన నాటి నుండి శ్రీరామచంద్రున్ని హనుమంతుడు విడిచి ఉండలేదు, రాముడే తన సర్వస్వంగా భావించిన వాయునందనుడు తన ప్రభువైన రాముని మాట ఏనాడు జవదాటలేదు.


నేటి విశేషాన్ని పురస్కరించుకొని రెండు కథలు వున్నాయి...


1 , నేటి రోజున హనుమంతుడు సీత జాడను కనుగొని, తిరిగి ప్రయాణము అయి చేరిన రోజుగా పరిగణిస్తారు ... అందుకే వానరులు అంతా కలసి విజయోత్సవ దినంగా చేసుకొని, హనుమంతుణ్ణి పొగిడిన రోజు కాబట్టి ఈరోజు , హనుమద్ విజయోత్సవ దినంగా జరుపుకుంటారు...


-- -- -- -- 


2, హనుమంతుని సహాయంతో సీత జాడను వెతకడం, లంకేశ్వర్వునితో రాముడు పోరాటం చేయుటకు సముద్రంపై వారది కట్టుటలో హనుమంతునిది ప్రధాన పాత్ర, లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సంజీవిని పర్వతాన్ని తెచ్చి ప్రాణాపాయం నుండి రక్షించడము, ఇలా ఎన్నో సందర్భాలలో హనుమంతుడు తన రాముని కొరకు నిర్విరామ కృషి చేసాడు. 

హనుమంతుని శరీరంలోని రోమ రోమానికి తన రాముని స్మరణ తప్ప వేరే లేదని నిరూపించాడు. 

తన హృదయాన్ని చీల్చి సీతా రాములను చూపించాడు, ఇలా హనుమంతునికి రామునికి మధ్యన అన్యోనతలు ఎన్నో కనబడతాయి.


చివరికి రాముడు రావణునితో యుద్ధం చేసి సీతను తీసుకుని అయోధ్యకు వచ్చి శ్రీ రామ పట్టాభిషేకం అయిన తర్వాత రామునికి అనిపిస్తుంది… హనుమంతుని అమోఘమైన సేవల కారణంగానే సీత తిరిగి వచ్చినది, తిరిగి అయోధ్య నగరంలో రాముని పట్టభిషేకంతో ప్రజలు ఆనందంగా ఉండడం గ్రహించిన రాముడు నాకు అన్ని వేళల హనుమంతుడు సహాయంగా ఉన్నాడు అని తన విజయం హనుమంతుని సహకారం ఎంతగానో తోడ్పడినది అని రాముడు చైత్ర పౌర్ణమి రోజు హనుమంతునికి ఘనమైన సన్మానం చేసి ఆలింగనం చేసుకుంటాడు.


నాటి నుండి ఆ రాజ్య ప్రజలు హనుమంతుని ఘనతను దృష్టిలో పెట్టుకుని తమ రాజైన రాముడు ఆంజనేయుని ఏ చైత్ర పౌర్ణమి రోజు సన్మానం చేసాడో ప్రతి సంవత్సరం చైత్రపౌర్ణమి రోజు శ్రీ హనుమత్ విజయోత్సవంగా నాటి నుండి నేటి వరకు ఘనంగా వేడుక జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.


ఈ ఏడాదిలో ప్రథమ పౌర్ణమి, చంద్రుడు పదహారు కళలతో సూర్యేందు సంగమ కాలాన్నే పర్వ సంధి కాలం అని అంటారు. 

అమావాస్య నుంచి పౌర్ణమి వరకు గల పదహారు దినాలలో ఒక్కొక్క రోజుకి చంద్రునికి ఒక్కొక్క కళ హెచ్చుతూ, తిరిగి పౌర్ణమి నుండి అమావాస్య వరకు పదహారు దినాలలో ఒక్కొక్క రోజుకు చంద్రునికి ఒక్కొక్క కళ తగ్గుతూ వస్తాడు.


ఇలా పదహారు కళలతో చంద్రుడు సంవత్సరానికి 12 పౌర్ణమిలు అత్యంత కాంతివంతుడై, ప్రతీ మాసంలోని పౌర్ణమి నాటి నక్షత్రంతో కూడి వుండటం వల్ల, ఆ నక్షత్రాన్ని బట్టి ఆ పౌర్ణమికి ఆ పేరుతో వస్తుంది. ఇలా ఏడాదిలోని పండ్రెండు పౌర్ణమిలు పండ్రెండు పర్వ దినాలుగా అందిస్తూ చంద్రుడు సర్వ మానవాళికి ప్రకాశవంతమైన జీవనాన్ని అందిస్తున్నాడు. 

అందుకే ఉగాదితో సంవత్సరం ప్రారంభం అవుతుంది అందుకే రాముడు చైత్ర పౌర్ణమి హనుమత్ విజయోత్సవానికి ఎంచుకున్నాడు


కలౌ కపి వినాయకౌ అంటే కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతా రూపాలు వినాయకుడు, హనుమంతుడు.


హనుమంతుని నైజం :-


యత్ర యత్ర రఘునాధ కీర్తనం – తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్

బాష్పవారి పరిపూర్ణ లోచనం – మారుతిం నమత రాక్షసాంతకమ్

శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునికి నమస్కరిస్తున్నాను



కేసరి, అంజనాదేవీల కుమారుడు శ్రీ హనుమంతుడు. ఏకాదశ (11) రుద్రులలో ఒకరు. 

పరమశివుని అంశతో జన్మించారు, సప్త (7) చిరంజీవులలో ఒకరు, ఆంజనేయస్వామి వారు హిమాలయాల్లో కైలాస మానస సరోవరం సమీపంలో రామ నామ జపం చేస్తూ ఈనాటికి జీవించి ఉన్నారు. 

ఎక్కడ రామనామం చెప్తారో, ఎక్కడ శ్రీ రామాయణం చెప్తుంటారో, ఎక్కడ రామజపం జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలు కారుస్తూ, నమస్కరిస్తున్న తీరులో చేతులు జోడించి శ్రీ ఆంజనేయస్వామి కూర్చుని ఉంటారు. 

చినిగిపోయిన వస్త్రాలు ధరించిన ముసలి వయసు వ్యక్తి రూపంలో వచ్చి, రామకధ చెప్పే సభలో ఒక మూలున కూర్చుంటారు. 

అందరు రాక ముందే వచ్చి, అందరు వెళ్ళిపోయేవరకు ఉంటారు.

భూతప్రేతపిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తేనే భయపడి పారిపోతాయి. 

మహా రోగాలు నయమవుతాయి, చేసేపని పట్ల శ్రద్ధ పెరుగుతుంది. 

శని బాధలు తొలగిపోతాయి, బుద్ధి కలుగుతుంది, బలం పెరుగుతుంది, కీర్తి లభిస్తుంది, దైర్యం వస్తుంది. హనుమతుడికి 5 సంఖ్య చాలా ఇష్టం. 

5 ప్రదక్షిణలు చేయండి, అరటిపళ్ళు, మామిడి పళ్ళంటే చాలా ఇష్టం, వీలుంటే 5 పళ్ళు సమర్పించండి, 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల స్వామి వారి అనుగ్రహము కలుగుతుంది అని నమ్మకం...


శ్రీ రామ జయ రామ జయజయ🙏🍃☘️

: శ్లోకం:

: శ్లోకం:☝️

*సాహాయ్యం కస్యచిత్ కర్తుం*

  *అవసరస్త్వయాప్యతే l*

*భవతు సారథిస్తస్య*

  *స్వార్థీ మా కదాచన ll*


భావం: ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేయవలసి వస్తే, వారికి సారధిగా ఉండండి కాని స్వార్థంతో ఉండవద్దు! చేతనైతే శ్రీకృష్ణుడిలా దగ్గరుండి గెలిపించండి, కానీ స్వార్థంతో శల్య సారథ్యం చేయవద్దని భావం!🙏

[06/04, 9:10 am] +91 76590 87625: *మృత్యువును జయించడం అంటే జీవన్ముక్తి పొందడమే... అదెలా?*

 

మృత్యువును జయిస్తే మరణం ఉండదు.. 


*అసలు మృత్యువును జయించడం అంటే ఏమిటి?* 


మరణం అంటే శరీరంలో

ప్రాణం పోవడం ఒకటే కాదు... భయాల కారణంగా నీవు పడుతున్న మానసిక ఒత్తిడి కూడా మరణమే .. అందుకే

*నీ భయమే నీకు మరణం* అంటాను......అనవసర భయాలతో అనుక్షణం మరణించే కంటే... ఆ భయాన్నే వదిలేస్తే, అసలు మరణమే ఉండదు కదా!!


*మరి ఈ భయాన్ని వదిలేయడం ఎలా?*

 

భయాన్ని వదలడం అంటే ఏ భావన లేకుండా ప్రతి అనుభవాన్నీ కూడా ఒక కర్మ ఫలితంగా స్వీకరించడమే.. అంతిమ మరణంతో సహా.....

మనం చేసే కర్మల ఫలితాన్ని సుఖ దుఃఖాల రూపంలో ఎలా అనుభవిస్తామో అలాగే మరణాన్ని కూడా ఒక కర్మ ఫలితం అనుకుని అనుభవించడమే మనం చేయవలసింది... అలా అనుకున్నప్పుడు తిరిగి ఏ జన్మ లభిస్తుందో అనే భయం ఉండదు... మరణం తరువాత జీవి గతి ఏమిటి అనే ప్రశ్న ఉదయించదు. అప్పుడే జీవన్ముక్తి లభిస్తుంది.. 



నా మరణం తరువాత నేను లేని నా కుటుంబం ఏమవుతుందో అనే భయం ఉండకూడదు... నీ కుటుంబంలో నీ పూర్వీకులు లేకుండా నీవు బ్రతకడం లేదా? కొంతకాలానికి నీవు కూడా ఆ పూర్వీకుల జాబితాలోకి చేరిపోతావు... అంతే.. అంతకు మించి ఏమీ జరగదు.. 


అందుకే అన్ని వ్యర్థమైన ఆలోచనలు మానేసి భగవన్నామ స్మరణ చేయాలి అని పెద్దవారు అంటూ ఉంటారు... 


అలా భగవన్నామ స్మరణ ఫలితంగా మరణం తరువాత శూన్యంగా, చీకటిగా, అంతుచిక్కని ప్రశ్నగా కనబడే జీవితం, ప్రకాశవంతంగా కనిపిస్తుంది... 

*అదే జ్ఞానం..* 

*అదే మృత్యువును జయించడం అంటే...*

*అదే జీవన్ముక్తి....*


 

*నామస్మరణాధన్యోపాయం*

*నహిపశ్యామో భవతరణే*

*రామ హరే.. కృష్ణ హరే*

*తవ నామవదామి సదా నృహరే...*




*భయవిమోచన ప్రాపిరస్తు!!* 

*తథాస్తు!తథాస్తు!తథాస్తు.!*

💐🙏💐🙏💐

[06/04, 11:29 am] +91 92988 01428: 🙏 నమస్కారం అండి 🙏


🙏 *ఓం నారాయణ- ఆది నారాయణ* 🙏


*గ్రంథం:* నమ్మిన వారికి సొమ్ము - నమ్మకుంటే (వారి ప్రారబ్దం),  భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 


*శ్రీ స్వామివారి ఆజ్ఞ - పాక్షిక ఆచరణ ఫలితం*


 చీట్ల ద్వారా వచ్చే ఆజ్ఞలను శ్రీ స్వామివారి ఆజ్ఞగా భావించలేరు మరియు తృణీకరించలేరు. మన మధ్య వుండగా శ్రీ స్వామివారిని దర్శిస్తే భక్తురాలకు చీటీ వ్రాయిస్తూ 'మీ వాముల దొడ్డి కంచె బడీగా మునగ చెట్లు, చింత చెట్లు పెంచండి' అని వ్రాయించారు. వాళ్ళీ ఆజ్ఞలను పూర్తిగా పాటించలేరు, పాటించకుండా వుండలేరు. శ్రీ స్వామివారు చెప్పారు కాబట్టి రెండు చింత గింజలు వాముల దొడ్డి కంచె వెంబడి వేశారు. ఆ గింజలు మొలచి చక్కగా పెద్ద మానులయ్యాయి. 


ఇరవై సంవత్సరాలలో ఆ ప్రాంతంలో తెలుగు గంగ ప్రాజెక్టు కాలువ త్రవ్వుచున్నారు. కాలువ త్రవ్వకానికి అడ్డు వచ్చిన చెట్లకు ఒక్కొక్క మానుకు పదివేల రూపాయలు గవర్నమెంటు వారు ఆయా రైతులకిచ్చి ఆ మానులు కొట్టించి వేసారు. శ్రీ స్వామివారి మాట ప్రకారం కంచె చుట్టూ కనీసం ఒక వంద చెట్లు పెంచినా 10,00,000 (పది లక్షల) రూపాయలు వారికి ప్రభుత్వం చెల్లించేది గదా. అయ్యో శ్రీ స్వామివారి మాట ప్రకారం ఇంకా కొన్ని విత్తనాలు గుచ్చి పెడితే లక్షలు వచ్చేవి గదా! అని ఇప్పుడు ఏడ్చి ఏమి ప్రయోజనం.


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*శ్రీ సాయిమాస్టర్ స్మృతులు*

       *సంకలనకర్త :- లక్ష్మీ నరసమ్మ*

                   *టాపిక్ :- 22*

                   *స్థిత ప్రజ్ఞుడు*

                              - శ్రీ రామచంద్రరావు


ఒకసారి నాతో "సినిమాల్లో ఏముంది? సందేశాత్మకత లేదు. అలాంటి సినిమాలు చూస్తూ టైమిని వేస్ట్ చేసుకొనే బదులు ఎన్నో మంచి కార్యాలకు వుపయోగించుకోవచ్చు" అని అన్నారు. ఆయన మాటల్లో ఏ సమ్మోహనా శక్తి వుందో గాని అప్పట్నించీ నాకు సినిమాలపై కోరిక నశించి పోయింది. మాస్టర్ గారి బుక్స్ ఏది నిజం, నిజానికి నిచ్చెనలు మొదలైన వారి బుక్స్ ఎంతో విలువైనవని గ్రహించాను. ఆధ్యాత్మిక జీవితం గడపాలని నిశ్చయించుకున్నాను.


                    🙏జై సాయిమాస్టర్🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*సాయి అంటే...?*

   సాయి యింతటి మహనీయులు గాబట్టే భగవదాదేశంగా ఆ పేరు ఆయనకు సార్థకంగా నిలిచింది. 'సాయి' అంటే 'మహాత్ములలో శ్రేష్ఠుడు' అని బెంగాల్ రాష్ట్రంలో వాడుక. ఆ పేరుకు *సర్వానికీ అతీతుడు'* అని అర్థమని శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పారు. (వచనామృతము, i1, 55)

  ఒకనాడు పరమహంస, *తమకు చిలిం పీలుస్తున్న మహాత్ముని చిత్రపట మొకటి, ధుని నిర్వహించే మహనీయుని పటమొకటి కావాలని కోరి, “వాటిని చూడటంవలన తీవ్రమైన భక్తి కలుగుతుంది” అన్నారు.* 

 ఎప్పుడూ చిలిం పీల్చేవారు షేగాం నివాసి శ్రీ గజానన్ మహరాజ్, నిరంతరమూ ధుని నిర్వహించినది, చిలిం త్రాగినది శ్రీ సాయిబాబా.(షిరిడీ)..

సాయి లీలామృతం నుంచి

ఆన్లైన్ లో పారాయణ చేయుటకు

www.saibharadwaja.org 

ను పరిశీలించ గలరు..

జై సాయి మాస్టర్👏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*కుమారుడి వివాహం..*


"ఎన్నో ఏళ్లనుంచీ స్వామివారిని నమ్మి కొలుస్తున్నాము..మా పిల్లలకూ స్వామివారంటే అపరిమితమైన భక్తీ..విశ్వాసం..ఏనాడూ ఏ కోరికా కోరుకోలేదు..మా సంసారాన్ని చల్లగా చూడు తండ్రీ అని మాత్రం ఎప్పుడూ మొక్కుకునేవాళ్ళము..ఎందుకిలా జరిగిందో అర్ధం కావడం లేదు.." అంటూ విశ్వేశ్వరరావు, అతని భార్య వెంకటలక్ష్మి పరి పరి విధాల నా దగ్గర వాపోయారు..నిమిషానికోసారి.."మేము ఏ పాపం చేయలేదు కదా..మరి మాకెందుకీ తలవంపులు కలిగాయి.."? అంటూ ఆక్రోశపడసాగారు..ముఖ్యంగా వెంకటలక్ష్మి మరీ ఎక్కువగా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకోసాగింది..


విశ్వేశ్వరరావు వెంకటలక్ష్మి దంపతులు చాలా కాలంగా మొగిలిచెర్ల లో సిద్ధిపొందిన శ్రీ దత్తాత్రేయ స్వామివారి పట్ల భక్తి భావం కలిగి ఉండేవాళ్ళు..వాళ్లకు ఇద్దరు పిల్లలు..అమ్మాయి పెద్దది..అబ్బాయి రెండవ సంతానం..వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం తలపెట్టినా..ముందుగా మొగిలిచెర్ల కు వచ్చి, శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకొని..ముందుగా తాము తలపెట్టిన కార్యక్రమం గురించి స్వామివారి సమాధి వద్ద విన్నవించుకొని..ఆపై ఆ కార్యక్రమాన్ని జరిపేవారు..అంతటి భక్తి ప్రపత్తులు కలిగి ఉండేవారు..విశ్వేశ్వరరావు పిల్లలకు కూడా స్వామివారి పట్ల అపరిమిత భక్తి ఉండేది..అమ్మాయి పెళ్లీడు కొచ్చిన తరువాత సంబంధాలు చూడసాగారు..అమ్మాయికి పెళ్లి చేయదల్చుకున్నారని బంధువులకు తెలిసిన రెండు మూడు రోజుల్లోనే..వెంకటలక్ష్మి తాలూకు దూరపు బంధవులు తమంతట తామే వచ్చి, అమ్మాయిని తమ అబ్బాయికి ఇవ్వమని అడిగారు..పైగా పైసా కట్నం వద్దన్నారు..ఈడూ జోడూ సరిపోయింది..విచారించుకుంటే మంచి సంబంధం అని తెలిసింది..నిశ్చితార్థం కూడా స్వామివారి సన్నిధిలో చేశారు..ఆపై పెళ్లి కూడా ఉన్నంతలో చక్కగా జరిపారు..పిల్లలిద్దరూ హాయిగా కాపురం చేసుకుంటున్నారు.."మేము ఏమాత్రం శ్రమ పడకుండా..మా అమ్మాయికి మంచి సంబంధం స్వామివారి దయవల్ల దొరికింది.." అని చెప్పుకునేవారు..


మరో రెండేళ్లకు అబ్బాయికి వివాహం చేయాలని విశ్వేశ్వరరావు దంపతులు నిశ్చయించుకున్నారు..విశ్వేశ్వరరావు కుమారుడు చండీగఢ్ లో ఉద్యోగం చేస్తున్నాడు..ఎప్పటిలాగానే స్వామివారి మందిరానికి వచ్చి దర్శనం చేసుకొని, తమ మనసులోని కోరికను చెప్పుకొని వెళ్లారు..మూడురోజుల తరువాత..విజయవాడ నుంచి ఒక సంబంధం వచ్చింది..తల్లిదండ్రులకు ఒకటే కూతురు..తానూ ఇంజినీరింగ్ చదివింది..విశ్వేశ్వరరావు తనకున్న పరిధిలో విచారిస్తే..వాళ్ళది మంచి కుటుంబం అని తెలిసింది..ఆ తరువాత వారం రోజుల్లోనే..పిల్లలిద్దరూ ఇష్టపడటం..నిశ్చితార్థం చేసుకోవటం చక చకా జరిగిపోయాయి..మరో ఇరవై రోజుల్లో ముహూర్తం అని కూడా అనుకున్నారు..శుభలేఖలు అచ్చు వేయిద్దామని విశ్వేశ్వరరావు అనుకున్న రోజు.."మేము ఈ సంబంధం చేసుకోవటం లేదు..మాకున్నది ఒకటే కూతురు..దూరం పంపలేము..బాగా ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకున్నాము.." అని అమ్మాయి తరఫు తల్లిదండ్రులు ఫోన్ చేసి చెప్పారు..విశ్వేశ్వరరావు వెంకటలక్ష్మి ఈ మాటవిని బాగా బాధపడ్డారు..బంధువులందరికీ చెప్పుకున్నాము..ఇలా జరిగిందేమిటా అని తల్లడిల్లిపోయారు..నేరుగా స్వామివారి మందిరానికి వచ్చి వాపోయారు..


"దిగులు పడకండి..స్వామివారిని నమ్ముకుంటే ఎటువంటి ఇబ్బందీ జరగదు..ఏదో బలమైన కారణం వల్లే ఆ సంబంధం తప్పిపోయిందని భావించండి..చూద్దాం..ఏం జరుగుతుందో.." అని శతవిధాల నచ్చచెప్పాను..వాళ్ళ కు ఉపశమనం కలుగలేదు కానీ.."స్వామీ నీదే భారం .." అని పదిసార్లు చెప్పుకొని తిరిగి వెళ్లారు..


ప్రక్కరోజు విశ్వేశ్వరరావు చిన్ననాటి స్నేహితుడు కనబడి..ఆమాటా ఈమాటా చెప్పుకుంటూ..తాను రిటైర్ అయిన తరువాత పెళ్లి సంబంధాలు చూస్తున్నానని..ఆర్ధిక లాభం కొఱకు కాకుండా సేవా దృక్పథంతో చేస్తున్నానని..ప్రస్తుతం ఒక మంచి సంబంధం ఉందనీ..ఆ అమ్మాయికి తగ్గ అబ్బాయి కోసం వెతుకుతూ ఉన్న సమయం లో విశ్వేశ్వరరావు కుమారుడి గురించి తెలిసిందని..అందుకోసమే ఇంతదూరం వచ్చానని చెప్పాడు..విశ్వేశ్వరరావు దాచుకోకుండా జరిగిన విషయమంతా చెప్పేసాడు..ఆ స్నేహితుడు నవ్వి.."ఈ సంబంధం మీవాడికే కుదురుతుంది..అమ్మాయి తల్లిదండ్రులది చాలా పెద్ద మనసు..రెండురోజుల్లో ముందుగా ఆ తల్లిదండ్రులతో మీరిద్దరూ మాట్లాడే ఏర్పాటు చేస్తాను.."అన్నాడు..అనుకున్న విధంగానే మాట్లాడుకున్నారు..ఫోటోలు మార్చుకున్నారు..పిల్లలిద్దరూ ఒకరికొకరు నచ్చారు..మరో పదిరోజుల్లో ముహూర్తం ఉన్నది..దానికే పెళ్లిచేయాలని అనుకున్నారు..


విశ్వేశ్వరరావు, వెంకటలక్ష్మి లకు అంతా కలగా ఉంది..తాము ముందు సంబంధానికి అనుకున్న ముహూర్తం కూడా ఇదే..నేరుగా మొగిలిచెర్ల వచ్చారు..ఈసారి వాళ్ళిద్దరి ముఖాల్లో పట్టరాని ఆనందం ఉంది..స్వామివారు తమకు అన్నివిధాలా తోడ్పడి..మంచి సంబంధాన్ని కుదిర్చారని..తామే తొందరపడి ఏదో మాట్లాడామని..నాతో చెప్పుకొని..శ్రీ స్వామివారి సమాధివద్ద క్షమాపణలు చెప్పుకొని వెళ్లారు..అబ్బాయి వివాహం ఏ ఇబ్బందీ లేకుండా జరిగింది..


తన భక్తులకు..ఏది, ఎప్పుడు, ఎలా అమర్చాలో స్వామివారికి తెలుసు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

[06/04, 12:43 pm] +91 93971 15559: *మహాభారతంలో ధృతరాష్ట్రుడు అంటే తెలియని వారు ఉండరు... అసలు ఆ మాటకు అర్థం తెలుసా??* 


ధృత అంటే దృఢమైన, నిశ్చయమైన నిశ్చితమైన అని అర్థం... 


రాష్ట్ర అనే మాటకు ఉనికి, స్పేస్ అని అర్థంగా తీసుకోవచ్చు... 


కాసేపు నిశ్చయమైన ఉనికి అనుకుందాం ... 


అంటే ఏమిటి?  


ఉనికిని శరీరంగా అనుకుంటే.. 


శరీరమే *నేను* అనుకునే దృఢత కలిగిన వాడు...


శరీరమే *నేను* అనుకునే అహంకారి..  


ఇప్పుడు *ధృతరాష్ట్రుడు* అనే మాటకు అర్థం ఏం చెప్పొచ్చు అంటారు?  


నేనైతే జీవుడు అంటాను...  

ఈ జీవుడే ధృతరాష్ట్రుడు... 

ఈ ధృతరాష్ట్రుడు అంధుడు... 

*నేను* ఆత్మగా గుర్తించలేని అంధుడు.. 

 

మహా భారతంలో ధృతరాష్ట్రుడు అంధుడైనా శక్తి సామర్థ్యాలు కలవాడు.. మహా యోధుడు కూడా... 

  

నేటి సమాజంలో జీవుడు, అంధుడు కాకపోయినా శక్తి సామర్థ్యాలు ఎన్ని ఉన్నా కూడా అహంకారంతో కళ్ళు మూసుకు పోయి అంధుడిగానే ప్రవర్తిస్తాడు.... అలాంటి వాడు ధృతరాష్ట్రుడితో సమానం...


అలాంటి ధృతరాష్ట్రులే ఎక్కువగా కనిపిస్తారు ఈ సమాజంలో... 


🙏🙏🙏🙏

[06/04, 4:54 pm] +91 94409 42213: మానవ జాతి అంతానికి ఏర్పడిన మతం... కమ్యునిజం


కమ్యునిస్టు మతం...మరొక విదేశీ మతం...అడవుల్లో ఎక్కువ ఉండడానికి కారణం....


నదీ తీరాల్లో ఉన్న అడవుల్లో అపారమైన ఖనిజ సంపద...


అద్భుతమైన వృక్ష సంపద...గంధం..చందనం వంటి విలువైన చెట్లు...


అరుదైన అటవీ ఉత్పత్తులు ...ఔషధీ మొక్కలు...


మరెన్నో వాటిపై ఆధిపత్యం సాధించడం...


దాన్ని సొమ్ము చేసుకోవడం..


విదేశాలకి సహకరించడం కోసం..ఇక్కడి ఖనిజ అన్వేషణ ఆపడం...


అటవీ వివరాలు విదేశాలకు కీలక సమయాల్లో అందజేయడం ...


ఇంకా ఘోరం...వనవాసుల మతాన్ని మార్చి..వారి సంస్కృతి సాంప్రదాయాలు...నాశనం చేయడం...


పర్యావరణం పరిరక్షణ పేరుతో...ప్రభుత్వాన్ని...కంపెనీలను బ్లాక్ మెయిల్ చెయ్యడం...


వీళ్ల అసహజ కదలికల వల్ల జీవ జంతు జాలానికి విపరీత హాని చేశారు... చేస్తున్నారు...


దీనివెనుక ఉన్న మరొక విషం..దేశాన్ని నిట్ట నిలువుగా చీల్చే ప్రణాళిక... నిలువెల్లా కంపింప జేస్తుంది...


అదే...రె..డ్...కా..రి..డా..ర్...


ఇది నేపాల్ దగ్గర మొదలై వయనాడ్ తో ముగియడం బహుశా యాదృచ్చికం కాదేమో...


ఇక్కడ జల విద్యుత్..లేదా అణు విద్యుత్ ఉత్పాదలు అడ్డుకోవడం ద్వారా...బయటి దేశాలకు ఇతోధిక లాభం కలిగించారు...


బాగా గమనించండి...


వీళ్ళు విద్వంసం ఊపిరిగా జీవిస్తారు...దాన్ని ప్రణాళికా బద్దంగా చేస్తారు...


దేన్నైనా వ్యతిరేకించడం..ధ్వంసం చెయ్యడమే పనిగా ఉంటుంది...


నిర్మాణాత్మక మైన పని ఏమీ ఉండదు...


ఈ అటవీ ప్రాంతంలో వీరి ఆయుధాలకు...యుద్ధానికి నిధులు ఎలా వస్తాయి...


ఏ విదేశీ సహకారం లేకుండా...కేవలం పేద వనవాసుల డబ్బుతో..వాళ్ల విముక్తి చేసేస్తారా...


ఈ వర్గాలకు నిధులు పాకిస్తాన్ నుంచి కూడా అందుతుండడం ఏం సూచిస్తుంది...


దేశాన్ని విధ్వంసం చేసే కుట్రలో విదేశీ మూడు మతాలు చేతులు కలిపాయనే కదా అర్థం...


ఇంక మరోవైపు..మనకు మన పోలీసులపై ఎటువంటి సానుభూతి రాకుండా...


మన ఎమోషన్స్ అటువైపు మరలేట్టుగా..సినిమాలూ...కథలూ..కవితలూ.. కావ్యాలను వదులుతారు...


మన సైన్యాన్ని కించపరుస్తూ...ప్రచారం ఉధృతంగా చేస్తారు..


మన జవాన్లను విలన్లుగా చూపిస్తూ ప్రజల స్థైర్యం సడలిపోయెట్టు కళా రూపాలు ప్రదర్శిస్తారు...


అందుకే మన పోలీసులపై.. జవానులపై అమానుషంగా దాడులు జరుపుతూ...పొట్టన పెట్టుకుంటున్నారు..


ఈ మావోయిస్ట్ హింసలో కేవలం ఈ రెండు దశాబ్దాల్లో చనిపోయిన పౌరులే పన్నెండు వేలు...


భద్రతా బలగాలు రెండువేల ఏడువందల మంది...


ఏ ప్రజా విముక్తికి ఈ ప్రస్థాన

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

 🙏 


*గ్రంథం:* నమ్మిన వారికి సొమ్ము - నమ్మకుంటే (వారి ప్రారబ్దం),  భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 


శ్రీ పెసల సుబ్బరామయ్య సార్ గారు ఇలా చెప్తున్నారు.


నాకొక పొలం వుండేది. దాన్ని మా తండ్రిగారు 500రూ॥లకి 55 సం॥ల క్రితం కొన్నారు. దాన్ని కౌలుకిస్తే మనకు ఆదాయం రాకపోగా ప్రతి సంవత్సరం కనీసం 200రూ|| నష్టం వస్తూంది. కౌలుకు మరియొకరికి ఇచ్చాను. ఇతడు నమ్మకంగా సంవత్సరానికి వెయ్యి రూపాయలు యిస్తున్నాడు. ఆ పొలం అమ్మితే 20,000రూపాయలొస్తాయి. 20,000 రూ॥ బ్యాంకులో వేస్తే ఆర్.డి క్రింద నెలకు 200 రూ॥ వస్తుంది. అప్పుడు బ్యాంకు వడ్డీ రేట్లు ఎక్కువ. ఒక సంవత్సరానికి 2400 రూ॥ ఆదాయం. కౌలుకిస్తే వెయ్యి రూపాయలు, అమ్మి బ్యాంకులో వేస్తే 2400 రూ॥ వస్తుంది కదా అనుకొని అమ్మదలచి శ్రీ స్వామివారి దగ్గర చీట్లు 1) అమ్మమని శ్రీ స్వామివారి ఆజ్ఞ 2) అమ్మ వద్దని శ్రీ స్వామివారి ఆజ్ఞ అని వ్రాసి రెండు చీట్లు వేస్తే అమ్మవద్దని ఆజ్ఞాపించారు.


 ఒక 5 సం॥ల తర్వాత మరలా అమ్మాలని తలచి చీట్లు వేస్తే అమ్మవద్దన్నారు. పొలం చేసే వాడు 60,000 రూ॥లకి కొంటానన్నాడు. 2 సం॥ల తర్వాత మరలా చీట్లు వేస్తే వద్దన్నారు. ఇక వేయకూడదనుకున్నాను. ఆ తర్వాత పొలం సాగు చేసేవాడు లక్షరూపాయల కంటే ఎక్కువ ధరకు కొనలేనన్నాడు. మరి నాలుగు సంవత్సరాలకి మరొకరు వచ్చి పది లక్షలకు అడిగారు. నేను ఇవ్వలేదు నేను చీట్లు పెట్టలేదు. ఆ తర్వాత రెండు సంవత్సరాలకు ఇరవై లక్షలకు కొంటామని వచ్చారు. ఎందుకోగాని ఈసారి చీట్లు శ్రీ స్వామివారి సమాధి మీద పెడితే అమ్మమని వచ్చింది. ఇరవై నాలుగు లక్షలకు అమ్మేశాను. 


ఇరవై వేల నుండి పదమూడు సంవత్సరాలలో ఇరవై నాలుగు లక్షలకు అమ్మించారు. చీట్లద్వారా శ్రీ స్వామివారు పలుకుతారని విశ్వసిస్తే మనకు ఎంత మేలు జరుగుతుందో చూడండి. *చీట్లు వేసేటప్పుడు మనకొచ్చిన చీటీ (శ్రీ స్వామివారి ఆజ్ఞ) ప్రకారం మనం నడుచుకోవాలి. ఆశ పడి చీటీ ద్వారా శ్రీ స్వామివారి ఆజ్ఞకు భిన్నంగా నడుచుకుంటే నష్టము - కష్టము మనకే గదా!*


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*శ్రీ సాయిమాస్టర్ స్మృతులు*

       *సంకలనకర్త :- లక్ష్మీ నరసమ్మ*

                   *టాపిక్ :- 22*

                   *స్థిత ప్రజ్ఞుడు*

                              - శ్రీ రామచంద్రరావు


మాస్టర్ గారింటి దగ్గరగా వున్న యింట్లో కొంత మంది ఆడవాళ్ళుండేవారు. వాళ్ళ మీద ఏదో గొడవలు జరిగితే పబ్లిక్ నుంచి విమర్శనెదుర్కోవాల్సి వస్తుందని తెలిసినా "న్యాయం ఎటువైపుంటే అటే సపోర్ట్ చేయాలి. అన్యాయాన్ని ఎంత కష్టనష్టాలొచ్చినా ఎదుర్కోవాలి అని చెప్పటమే కాక ఆచరించి చూపారు. 


విద్యానగర్ దగ్గర్లో గుణపాడు అనే గ్రామం వుంది. అక్కడ శివాలయం వుంది. అప్పుడప్పుడు సాయంత్రం పూట మాస్టర్ గారు మమ్మల్ని అక్కడకు తీసుకొని వెళ్తూండేవారు. ఆ రాత్రి అక్కడ శివాలయంలో పూజచేసి, అక్కడ వున్న వాగులో కూర్చోని సత్సంగం, భజన చేసుకునే వాళ్ళం ధ్యానం చేసుకునే వాళ్ళం. మాస్టర్ గారు సాధన గురించి ఎన్నెన్నో విషయాలు చెప్పేవారు.


                          🙏జై సాయిమాస్టర్🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*గ్రంథం:-నేను దర్శించిన మహాత్ములు*

*శ్రీ ఆనందమాయి అమ్మ దివ్య చరిత్ర*

*రచన:-*

*శ్రీఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు*


   కొంతకాలానికి శిరిడీలో ఒక వారం రోజులు నిత్యమూ సాయి సమాధికి 108 ప్రదక్షిణలు, చరిత్ర పారాయణ చేస్తూవుండి, విరామ సమయమంతా నాటి సజీవులుగావున్న ప్రత్యక్ష సాయి సేవకుల నుండి శ్రీ సాయిబాబాకు సంబంధించిన వివరాలు, వారి అనుభవాలు సేకరింపదలచాను. ఆప్రకారమే శిరిడీ వెళ్ళి రెండవ రోజు నుండి నా కార్యక్రమం ప్రారంభించాను. ఆరోజంతా ఎంతో అమోఘమైన ధ్యానపారవశ్యంలో గడిచిపోయింది. కాని అదేమి చిత్రమో, మరురోజు తెల్లవారుతూనే మొదట పూనాలో నివసిస్తున్న ఆ పాత విద్యార్థి గుర్తుకొచ్చి నా మనస్సు చెప్పలేనంత బలంగా అతని దగ్గరకు వెళ్ళాలని ఆరాటపడసాగింది. ఎన్ని విధాల ప్రయత్నించినా అది సమాధానపడలేదు. దాని వలన శిరిడీలో వున్న సమయమంతా వికల్పాలతో వ్యర్థం కాసాగింది. అంతకంటే ఒక్కసారి పూనా వెళ్ళి ఆ గుంజాటన వదిలించుకొని తర్వాత మరలా శిరిడీ వచ్చి నా కార్యక్రమం చేసుకోవడం ఒక్కటే మార్గమనిపించింది.


*********************************

ఆన్లైన్ లో చదువుటకు ఈ లింక్ ను ఉపయోగించుకోగలరు.


https://saibharadwaja.org/books/readbook.aspx?book=Sri-Aanandamai-Amma-Charitra&page=1

అత్యద్భుతమైన కథ ఇది ప్రతి భారతీయుడికి వస్తుంది

 అత్యద్భుతమైన కథ ఇది ప్రతి భారతీయుడికి వస్తుంది


🙏🏾


అనగనగా ఒక అడవి,

ఆ అడవిలో ఎన్నో జంతువులు. 

ఆ అడవికి సింహం రారాజు..


సింహం ఆకలేసినపుడు మాత్రమే వేటాడుతూ మిగతా సమయంలో తన గుహలో నిద్రపోయేది,


ఇదిలా ఉండగా పక్క ఇంకో అడివి నుండి కొన్ని అడవి పందులు వచ్చాయి,

వాటిని చూసి సింహం .."ఆ పందులే కదా మనకు ఏందిలే"అని ఊరుకుంది ,


ఆ పందులు కొన్నాళ్ళకు గుంపులు, గుంపులుగా పిల్లల్ని కని అడవంతా ఆక్రమించుకుని అడవిని నాశనం చేయసాగాయి.


సింహం ఎప్పటిలాగే ఆకలేసినపుడు లేడినో, జింకనో వేటాడి, తిని గుహలో పడుకునేది. 


ఇంకొంత కాలం పోయాక ఆ అడవిలో కొండగొర్రెలు ప్రవేశించాయి, 


బద్దకానికి అలవాటు పడిన సింహం వాటిని వేటాడక దొరికింది తిని పడుకునేది. 


మరి కొంతకాలం గడిచే సరికి అడవి నిండా పందులూ, గొర్రెలే కనిపించసాగాయి. 


పందులు .. దుంపలు, వేర్లు పెకలిస్తూ చెట్లు నాశనం చేస్తుంటే, గొర్రెలు పచ్చని ఆకులు, చక్కని కాయలు తినేస్తూ అడవిని ఎడారిలా మార్చేసాయి ,


ఇది చూసిన మిగతా జంతువులు వేరే అడవికి వలస పోగా, మిగిలినవి ఆకలితో చచ్చాయి.


సింహం పరిస్థితి చేయిదాటి పోతుందని గ్రహించి సమావేశం పెట్టిి. "నేను రాజుగా అజ్ఞాపిస్తున్నా, వెంటనే ఈ అడవి వదిలి పోండి" అని పందులు,గొర్రెలను హెచ్చరించింది 


కానీ సంఖ్యాబలం ఉన్న పందులూ, గొర్రెలూ కలిసి సింహాన్ని చంపేసాయి..


ఇక్కడ సింహం చేసిన తప్పులు👇


1.తన సంతానాన్ని పెంచుకోకపోవడం.


2.తన అడివి లోకి వచ్చిన రోజే పందుల్ని, గొర్రెల్ని తరిమేయక పోవడం.


3.నాకెందుకులే , నా ఆహారం, నా ఆధారం ఉంటే చాలు అని అనుకోవడం.


4.తన అడివి పట్ల బాధ్యత, కృతజ్ఞత లేకపోవడం.


5.తన దాకా వచ్చే వరకు ముప్పుని గ్రహించకపోవడం.


6.తన బద్దకంతో దుష్టులకు ఆశ్రయం ఇవ్వడం.


7.ఆకులు, దుంపలు తినే పందులు, గొర్రెలు నన్ను ఏం చేస్తాయిలే అనే మొద్దు స్వభావం తో వుండడం.


*నీతి :-* శత్రువు ఆకారం కాదు, వాడి ఆలోచన చూసి జాగ్రత్త పడాలి..

సంకెళ్లు

 *శుభోదయం* 🙏💐


నీ ఊహలే నీకు సంకెళ్లు... 

నీ కోరికలే నిన్ను ముంచే కెరటాలు.. 

నీ బంధాలే నిన్ను పట్టి లాగే పాశాలు... 

నీ సంసారమే నీకు జైలు.. 


సంకెళ్లతో పోరాడుతూ, 

కెరటాలలో మునిగి తేలుతూ, 

పాశంతో మరిన్ని చిక్కుముడులు వేసుకుంటూ 

సాగే ఈ సంసారమనే జైలులో

ఆనందాన్ని వెతుక్కునే అజ్ఞాని జీవుడు...  


🙏🙏🙏🙏🙏శ్లోకం:☝️

*య ఈర్షుః పరవిత్తేషు*

 *రూపే వీర్యే కులాన్వయే ।*

*సుఖసౌభాగ్యసత్కారే*

 *తస్య వ్యాధిరనన్తకః ॥*


భావం: ఇతరుల సంపద, అందం, పరాక్రమం, ఉన్నత కుటుంబం, సంతోషం, అదృష్టం మరియు గౌరవం పట్ల ద్వేషము, ఈర్ష్యా పడే వ్యక్తి ఒక కోలుకోలేని రోగి. అతని ఈ వ్యాధి ఎప్పటికీ నయం కాదు.



ధీరతతో రాణిస్తుంది*...

 .


             _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లో𝕝𝕝


*దరిద్రతా ధీరతయా విరాజతే*

*కురూపతా శీలగుణేన రాజతే*

*కుభోజనంచోష్ణతయా విరాజతే*

*కువస్త్రతా శుభ్రతయా విరాజతే॥*


తా𝕝𝕝 

*దారిద్ర్యం ధీరతతో రాణిస్తుంది*..... 

*రూపహీనత శీలంతో, సద్గుణంతో రాణిస్తుంది*...... 

*రుచిలేని భోజనం వేడిగా ఉండటంతో రాణిస్తుంది*..... 

*చిరిగిన బట్ట పరిశుభ్రతతో రాణిస్తుంది*".....


.

             _*సూక్తిసుధ*_


*రాక్షసులు:* 

రాజాజ్ఞ మీరినవాడును, సఖులమాటవినక కోపించువాడును, సభకునెదిరించినవాడును, ప్రభువునకు అణగని సేవకుడును, పురుషునకు అణగని ఆడుదియు, తనవంటివాడులేదని గర్వించినవాడును, తల్లిదండ్రులను కష్టపరచువాడును, చేసిన ఉపకారము మఱచువాడును, అబద్ధములను చెప్పువాడును, వీరలు రాక్షసులతో సమానులు.


*శ్రీ హనుమాన్ విజయోత్సవం

 *శ్రీ హనుమాన్ విజయోత్సవం విశిష్టత🚩*

శ్రీరామునికి అత్యంత నమ్మకమైన బంటు హనుమంతుడు...


శ్రీరాముడు సీతను ఎడబాసి మానసిక క్షోభను అనుభవిస్తూ, సీత జాడ వెతుకుతున్న సందర్భ సమయంలో అడవిలో రాముడుకి హనుమంతునితో పరిచయం ఏర్పడినది... పరిచయం ఏర్పడిన నాటి నుండి శ్రీరామచంద్రున్ని హనుమంతుడు విడిచి ఉండలేదు, రాముడే తన సర్వస్వంగా భావించిన వాయునందనుడు తన ప్రభువైన రాముని మాట ఏనాడు జవదాటలేదు.


నేటి విశేషాన్ని పురస్కరించుకొని రెండు కథలు వున్నాయి...


1 , నేటి రోజున హనుమంతుడు సీత జాడను కనుగొని, తిరిగి ప్రయాణము అయి చేరిన రోజుగా పరిగణిస్తారు ... అందుకే వానరులు అంతా కలసి విజయోత్సవ దినంగా చేసుకొని, హనుమంతుణ్ణి పొగిడిన రోజు కాబట్టి ఈరోజు , హనుమద్ విజయోత్సవ దినంగా జరుపుకుంటారు...


-- -- -- -- 


2, హనుమంతుని సహాయంతో సీత జాడను వెతకడం, లంకేశ్వర్వునితో రాముడు పోరాటం చేయుటకు సముద్రంపై వారది కట్టుటలో హనుమంతునిది ప్రధాన పాత్ర, లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సంజీవిని పర్వతాన్ని తెచ్చి ప్రాణాపాయం నుండి రక్షించడము, ఇలా ఎన్నో సందర్భాలలో హనుమంతుడు తన రాముని కొరకు నిర్విరామ కృషి చేసాడు. 

హనుమంతుని శరీరంలోని రోమ రోమానికి తన రాముని స్మరణ తప్ప వేరే లేదని నిరూపించాడు. 

తన హృదయాన్ని చీల్చి సీతా రాములను చూపించాడు, ఇలా హనుమంతునికి రామునికి మధ్యన అన్యోనతలు ఎన్నో కనబడతాయి.


చివరికి రాముడు రావణునితో యుద్ధం చేసి సీతను తీసుకుని అయోధ్యకు వచ్చి శ్రీ రామ పట్టాభిషేకం అయిన తర్వాత రామునికి అనిపిస్తుంది… హనుమంతుని అమోఘమైన సేవల కారణంగానే సీత తిరిగి వచ్చినది, తిరిగి అయోధ్య నగరంలో రాముని పట్టభిషేకంతో ప్రజలు ఆనందంగా ఉండడం గ్రహించిన రాముడు నాకు అన్ని వేళల హనుమంతుడు సహాయంగా ఉన్నాడు అని తన విజయం హనుమంతుని సహకారం ఎంతగానో తోడ్పడినది అని రాముడు చైత్ర పౌర్ణమి రోజు హనుమంతునికి ఘనమైన సన్మానం చేసి ఆలింగనం చేసుకుంటాడు.


నాటి నుండి ఆ రాజ్య ప్రజలు హనుమంతుని ఘనతను దృష్టిలో పెట్టుకుని తమ రాజైన రాముడు ఆంజనేయుని ఏ చైత్ర పౌర్ణమి రోజు సన్మానం చేసాడో ప్రతి సంవత్సరం చైత్రపౌర్ణమి రోజు శ్రీ హనుమత్ విజయోత్సవంగా నాటి నుండి నేటి వరకు ఘనంగా వేడుక జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.


ఈ ఏడాదిలో ప్రథమ పౌర్ణమి, చంద్రుడు పదహారు కళలతో సూర్యేందు సంగమ కాలాన్నే పర్వ సంధి కాలం అని అంటారు. 

అమావాస్య నుంచి పౌర్ణమి వరకు గల పదహారు దినాలలో ఒక్కొక్క రోజుకి చంద్రునికి ఒక్కొక్క కళ హెచ్చుతూ, తిరిగి పౌర్ణమి నుండి అమావాస్య వరకు పదహారు దినాలలో ఒక్కొక్క రోజుకు చంద్రునికి ఒక్కొక్క కళ తగ్గుతూ వస్తాడు.


ఇలా పదహారు కళలతో చంద్రుడు సంవత్సరానికి 12 పౌర్ణమిలు అత్యంత కాంతివంతుడై, ప్రతీ మాసంలోని పౌర్ణమి నాటి నక్షత్రంతో కూడి వుండటం వల్ల, ఆ నక్షత్రాన్ని బట్టి ఆ పౌర్ణమికి ఆ పేరుతో వస్తుంది. ఇలా ఏడాదిలోని పండ్రెండు పౌర్ణమిలు పండ్రెండు పర్వ దినాలుగా అందిస్తూ చంద్రుడు సర్వ మానవాళికి ప్రకాశవంతమైన జీవనాన్ని అందిస్తున్నాడు. 

అందుకే ఉగాదితో సంవత్సరం ప్రారంభం అవుతుంది అందుకే రాముడు చైత్ర పౌర్ణమి హనుమత్ విజయోత్సవానికి ఎంచుకున్నాడు


కలౌ కపి వినాయకౌ అంటే కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతా రూపాలు వినాయకుడు, హనుమంతుడు.


హనుమంతుని నైజం :-


యత్ర యత్ర రఘునాధ కీర్తనం – తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్

బాష్పవారి పరిపూర్ణ లోచనం – మారుతిం నమత రాక్షసాంతకమ్

శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునికి నమస్కరిస్తున్నాను



కేసరి, అంజనాదేవీల కుమారుడు శ్రీ హనుమంతుడు. ఏకాదశ (11) రుద్రులలో ఒకరు. 

పరమశివుని అంశతో జన్మించారు, సప్త (7) చిరంజీవులలో ఒకరు, ఆంజనేయస్వామి వారు హిమాలయాల్లో కైలాస మానస సరోవరం సమీపంలో రామ నామ జపం చేస్తూ ఈనాటికి జీవించి ఉన్నారు. 

ఎక్కడ రామనామం చెప్తారో, ఎక్కడ శ్రీ రామాయణం చెప్తుంటారో, ఎక్కడ రామజపం జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలు కారుస్తూ, నమస్కరిస్తున్న తీరులో చేతులు జోడించి శ్రీ ఆంజనేయస్వామి కూర్చుని ఉంటారు. 

చినిగిపోయిన వస్త్రాలు ధరించిన ముసలి వయసు వ్యక్తి రూపంలో వచ్చి, రామకధ చెప్పే సభలో ఒక మూలున కూర్చుంటారు. 

అందరు రాక ముందే వచ్చి, అందరు వెళ్ళిపోయేవరకు ఉంటారు.

భూతప్రేతపిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తేనే భయపడి పారిపోతాయి. 

మహా రోగాలు నయమవుతాయి, చేసేపని పట్ల శ్రద్ధ పెరుగుతుంది. 

శని బాధలు తొలగిపోతాయి, బుద్ధి కలుగుతుంది, బలం పెరుగుతుంది, కీర్తి లభిస్తుంది, దైర్యం వస్తుంది. హనుమతుడికి 5 సంఖ్య చాలా ఇష్టం. 

5 ప్రదక్షిణలు చేయండి, అరటిపళ్ళు, మామిడి పళ్ళంటే చాలా ఇష్టం, వీలుంటే 5 పళ్ళు సమర్పించండి, 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల స్వామి వారి అనుగ్రహము కలుగుతుంది అని నమ్మకం...


శ్రీ రామ జయ రామ జయజయ🙏🍃☘️

దుష్టునికి బహుదూరంలోనూ

 *శకటం పంచహస్తేషు, దశహస్తేషు వాజినమ్*

*గజం సహస్ర హస్తేషు, దుష్టం దూరేణ వర్జయేత్.*


రథానికి ఐదు మూరల దూరంలోనూ, గుఱ్ఱానికి పది మూరల దూరంలోనూ, ఏనుగుకు వెయ్యి మూరల దూరంలోనూ, దుష్టునికి బహుదూరంలోనూ ఉండాలన్నారు.


కానీ గ్రహచారం సరిగా లేనప్పుడు అప్పుడప్పుడు కొంత కాలం దుష్టులతో సన్నిహితంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అట్టి సమయాల్లో మౌనంగా, ఆధ్యాత్మిక చింతనతో జీవించడం అత్యున్నతం.

సుభాషితమ్

 .


           _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లో𝕝𝕝


*ధర్మస్య దుర్లభో జ్ఞాతా*

*సమ్యక్ వక్తా తతోఽపి చ౹*

*శ్రోతా తతోఽపి శ్రద్ధావాన్* 

*కర్తా కోఽపి తతః సుధీః॥*


భావం:

*ధర్మం తెలిసినవారు చాలా అరుదు....ధర్మాన్ని చక్కగా వివరించేవారు ఇంకా అరుదు.... వివరించేవారు లభించినా దానిని భక్తి శ్రద్ధలతో వినేవారు చాలా అరుదు.... విని ఆ ధర్మాన్ని ఆచరించే బుద్ధిమంతులు అందరికంటే అరుదు*....

ఆదిశేషుని ప్రశస్తి...

 ఆదిశేషుని ప్రశస్తి...!!


🌿ఆదికాలంనుండి శ్రీమన్నారాయణుని పానుపై సర్వశక్తి సంపన్నుడైన భగవంతుడు తన పైన ఆశీనుడైనప్పుడు  అంతటి భారాన్ని మోసిన ఘన కీర్తి ఆది శేషునిదే.


🌸సంకర్షణ నామంతో

శ్రీ మన్నారాయణుని రూపంలో వచ్చినది ఆదిశేషువే.


🌿శ్రీ వైకుంఠం లో, వీరాసనంలో, దర్శనమిస్తున్న పరవాసుదేవమూర్తికి

కావలసిన సేవలు తక్షణమే అందించే, నిత్య సేవకులకి  పర్యవేక్షక నాయకుడు

ఆదిశేషువే. 


🌸భూలోకానికి అడుగున పాతాళ లోకం వున్నది.పాతాళ లోకానికి క్రింద మరో 

పధ్నాలుగు లోకాలు వున్నట్లు మన

పురాణాలు చెప్తున్నాయి.యీ పధ్నాలుగు లోకాలకి అధిపతి ఆదిశేషువు.


🌿శ్రీవైష్ణవ ఆలయాలలో

శ్రీ మన్నారాయణుడు

శేషతల్ప శయన మూర్తిగా

దర్శనమిస్తాడు.


🌸ప్రకృతి ప్రళయాల వలన,

దుష్టశక్తులవలన,దేవతామూర్తులకు ఎట్టి ఛేదము జరుగకుండా,

యీ విగ్రహాల పరిరక్షణకు

నాగులను ఏర్పాటు చేసేది ఆదిశేషువు.


🌿అష్టసర్పాల నాయకులకు

అధిపతి ఆదిశేషువు.

మహాభారతం లో శ్రీ కృష్ణుడు రధసారధ్యం వహించిన  అర్జునుని రధం కూడా ఆదిశేషువే.


🌸ఆదిశేషుని, అపరమితమైన శక్తిని

'అయస్కాంత' శక్తి అంటారు. 

భూలోకానికి, సూర్యుని తో అనుసంధానం చేసి నడిపించేది యీ అయస్కాంత శక్తి. లేక భూమ్యాకర్షణ శక్తి.


🌿ఆదిశేషుని తల తిరుపతి

సప్తగిరులు, దేహం ఆహో బిలం, తోక 

శ్రీ శైలమని అంటారు.

శ్రీ వైష్ణవమతాన్ని,స్ధాపించిన

శ్రీ రామానుజాచార్యులవారు సాక్షాత్తు ఆదిశేషుని అవతారమని శ్రీవైష్ణవులంతా ఆయనను భక్తిశ్రధ్ధలతో ఆరాధిస్తారు..🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 ఇలాంటి మరిన్ని పోస్ట్‌లను చూడటానికి మరియు All India Arya Vysya Sangam చేరడానికి, ఇక్కడ క్లిక్ చేయండి


https://kutumbapp.page.link/?isi=1598954409

 మంగళవారం

శంకరాభరణం సమూహం వారు ఇచ్చిన

సమస్య - 4386

5-4-2023 (బుధవారం)

 ఇది...


*“చచ్చిన పామునే మరలఁ జంపుట న్యాయము సత్యశోధనన్”*


నా ప్రయత్నం ఇలా.....


ఉ.


నచ్చినవాడు మన్మథుడు నాకము నొందుట తప్పుగాదనెన్

రెచ్చిన కామపీడితయె, రెల్లు వనంబున భర్తకందగా

గ్రుచ్చుచు కత్తిచేఁ బతితఁ గోపముతోఁ బ్రతిఘాత వాక్కుగా

*చచ్చిన పామునే మరలఁ జంపుట న్యాయము సత్యశోధనన్.*


.. డా.. అయ్యలసోమయాజుల సుబ్బారావు.

 Tnraoo: 

గయ్యాళి భార్య నిత్యమూ వేధించుచున్ననూ 


సయ్యాటకు ఉపక్రమింప సహకరింపని


భార్యతో చచ్చిన పాముని మరల చంపుట


న్యాయము సత్యశోధనన్ పరికింపగన్.