ఆదిశేషుని ప్రశస్తి...!!
🌿ఆదికాలంనుండి శ్రీమన్నారాయణుని పానుపై సర్వశక్తి సంపన్నుడైన భగవంతుడు తన పైన ఆశీనుడైనప్పుడు అంతటి భారాన్ని మోసిన ఘన కీర్తి ఆది శేషునిదే.
🌸సంకర్షణ నామంతో
శ్రీ మన్నారాయణుని రూపంలో వచ్చినది ఆదిశేషువే.
🌿శ్రీ వైకుంఠం లో, వీరాసనంలో, దర్శనమిస్తున్న పరవాసుదేవమూర్తికి
కావలసిన సేవలు తక్షణమే అందించే, నిత్య సేవకులకి పర్యవేక్షక నాయకుడు
ఆదిశేషువే.
🌸భూలోకానికి అడుగున పాతాళ లోకం వున్నది.పాతాళ లోకానికి క్రింద మరో
పధ్నాలుగు లోకాలు వున్నట్లు మన
పురాణాలు చెప్తున్నాయి.యీ పధ్నాలుగు లోకాలకి అధిపతి ఆదిశేషువు.
🌿శ్రీవైష్ణవ ఆలయాలలో
శ్రీ మన్నారాయణుడు
శేషతల్ప శయన మూర్తిగా
దర్శనమిస్తాడు.
🌸ప్రకృతి ప్రళయాల వలన,
దుష్టశక్తులవలన,దేవతామూర్తులకు ఎట్టి ఛేదము జరుగకుండా,
యీ విగ్రహాల పరిరక్షణకు
నాగులను ఏర్పాటు చేసేది ఆదిశేషువు.
🌿అష్టసర్పాల నాయకులకు
అధిపతి ఆదిశేషువు.
మహాభారతం లో శ్రీ కృష్ణుడు రధసారధ్యం వహించిన అర్జునుని రధం కూడా ఆదిశేషువే.
🌸ఆదిశేషుని, అపరమితమైన శక్తిని
'అయస్కాంత' శక్తి అంటారు.
భూలోకానికి, సూర్యుని తో అనుసంధానం చేసి నడిపించేది యీ అయస్కాంత శక్తి. లేక భూమ్యాకర్షణ శక్తి.
🌿ఆదిశేషుని తల తిరుపతి
సప్తగిరులు, దేహం ఆహో బిలం, తోక
శ్రీ శైలమని అంటారు.
శ్రీ వైష్ణవమతాన్ని,స్ధాపించిన
శ్రీ రామానుజాచార్యులవారు సాక్షాత్తు ఆదిశేషుని అవతారమని శ్రీవైష్ణవులంతా ఆయనను భక్తిశ్రధ్ధలతో ఆరాధిస్తారు..🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 ఇలాంటి మరిన్ని పోస్ట్‌లను చూడటానికి మరియు All India Arya Vysya Sangam చేరడానికి, ఇక్కడ క్లిక్ చేయండి
https://kutumbapp.page.link/?isi=1598954409
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి