6, ఏప్రిల్ 2023, గురువారం

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

 🙏 


*గ్రంథం:* నమ్మిన వారికి సొమ్ము - నమ్మకుంటే (వారి ప్రారబ్దం),  భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 


శ్రీ పెసల సుబ్బరామయ్య సార్ గారు ఇలా చెప్తున్నారు.


నాకొక పొలం వుండేది. దాన్ని మా తండ్రిగారు 500రూ॥లకి 55 సం॥ల క్రితం కొన్నారు. దాన్ని కౌలుకిస్తే మనకు ఆదాయం రాకపోగా ప్రతి సంవత్సరం కనీసం 200రూ|| నష్టం వస్తూంది. కౌలుకు మరియొకరికి ఇచ్చాను. ఇతడు నమ్మకంగా సంవత్సరానికి వెయ్యి రూపాయలు యిస్తున్నాడు. ఆ పొలం అమ్మితే 20,000రూపాయలొస్తాయి. 20,000 రూ॥ బ్యాంకులో వేస్తే ఆర్.డి క్రింద నెలకు 200 రూ॥ వస్తుంది. అప్పుడు బ్యాంకు వడ్డీ రేట్లు ఎక్కువ. ఒక సంవత్సరానికి 2400 రూ॥ ఆదాయం. కౌలుకిస్తే వెయ్యి రూపాయలు, అమ్మి బ్యాంకులో వేస్తే 2400 రూ॥ వస్తుంది కదా అనుకొని అమ్మదలచి శ్రీ స్వామివారి దగ్గర చీట్లు 1) అమ్మమని శ్రీ స్వామివారి ఆజ్ఞ 2) అమ్మ వద్దని శ్రీ స్వామివారి ఆజ్ఞ అని వ్రాసి రెండు చీట్లు వేస్తే అమ్మవద్దని ఆజ్ఞాపించారు.


 ఒక 5 సం॥ల తర్వాత మరలా అమ్మాలని తలచి చీట్లు వేస్తే అమ్మవద్దన్నారు. పొలం చేసే వాడు 60,000 రూ॥లకి కొంటానన్నాడు. 2 సం॥ల తర్వాత మరలా చీట్లు వేస్తే వద్దన్నారు. ఇక వేయకూడదనుకున్నాను. ఆ తర్వాత పొలం సాగు చేసేవాడు లక్షరూపాయల కంటే ఎక్కువ ధరకు కొనలేనన్నాడు. మరి నాలుగు సంవత్సరాలకి మరొకరు వచ్చి పది లక్షలకు అడిగారు. నేను ఇవ్వలేదు నేను చీట్లు పెట్టలేదు. ఆ తర్వాత రెండు సంవత్సరాలకు ఇరవై లక్షలకు కొంటామని వచ్చారు. ఎందుకోగాని ఈసారి చీట్లు శ్రీ స్వామివారి సమాధి మీద పెడితే అమ్మమని వచ్చింది. ఇరవై నాలుగు లక్షలకు అమ్మేశాను. 


ఇరవై వేల నుండి పదమూడు సంవత్సరాలలో ఇరవై నాలుగు లక్షలకు అమ్మించారు. చీట్లద్వారా శ్రీ స్వామివారు పలుకుతారని విశ్వసిస్తే మనకు ఎంత మేలు జరుగుతుందో చూడండి. *చీట్లు వేసేటప్పుడు మనకొచ్చిన చీటీ (శ్రీ స్వామివారి ఆజ్ఞ) ప్రకారం మనం నడుచుకోవాలి. ఆశ పడి చీటీ ద్వారా శ్రీ స్వామివారి ఆజ్ఞకు భిన్నంగా నడుచుకుంటే నష్టము - కష్టము మనకే గదా!*


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*శ్రీ సాయిమాస్టర్ స్మృతులు*

       *సంకలనకర్త :- లక్ష్మీ నరసమ్మ*

                   *టాపిక్ :- 22*

                   *స్థిత ప్రజ్ఞుడు*

                              - శ్రీ రామచంద్రరావు


మాస్టర్ గారింటి దగ్గరగా వున్న యింట్లో కొంత మంది ఆడవాళ్ళుండేవారు. వాళ్ళ మీద ఏదో గొడవలు జరిగితే పబ్లిక్ నుంచి విమర్శనెదుర్కోవాల్సి వస్తుందని తెలిసినా "న్యాయం ఎటువైపుంటే అటే సపోర్ట్ చేయాలి. అన్యాయాన్ని ఎంత కష్టనష్టాలొచ్చినా ఎదుర్కోవాలి అని చెప్పటమే కాక ఆచరించి చూపారు. 


విద్యానగర్ దగ్గర్లో గుణపాడు అనే గ్రామం వుంది. అక్కడ శివాలయం వుంది. అప్పుడప్పుడు సాయంత్రం పూట మాస్టర్ గారు మమ్మల్ని అక్కడకు తీసుకొని వెళ్తూండేవారు. ఆ రాత్రి అక్కడ శివాలయంలో పూజచేసి, అక్కడ వున్న వాగులో కూర్చోని సత్సంగం, భజన చేసుకునే వాళ్ళం ధ్యానం చేసుకునే వాళ్ళం. మాస్టర్ గారు సాధన గురించి ఎన్నెన్నో విషయాలు చెప్పేవారు.


                          🙏జై సాయిమాస్టర్🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*గ్రంథం:-నేను దర్శించిన మహాత్ములు*

*శ్రీ ఆనందమాయి అమ్మ దివ్య చరిత్ర*

*రచన:-*

*శ్రీఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు*


   కొంతకాలానికి శిరిడీలో ఒక వారం రోజులు నిత్యమూ సాయి సమాధికి 108 ప్రదక్షిణలు, చరిత్ర పారాయణ చేస్తూవుండి, విరామ సమయమంతా నాటి సజీవులుగావున్న ప్రత్యక్ష సాయి సేవకుల నుండి శ్రీ సాయిబాబాకు సంబంధించిన వివరాలు, వారి అనుభవాలు సేకరింపదలచాను. ఆప్రకారమే శిరిడీ వెళ్ళి రెండవ రోజు నుండి నా కార్యక్రమం ప్రారంభించాను. ఆరోజంతా ఎంతో అమోఘమైన ధ్యానపారవశ్యంలో గడిచిపోయింది. కాని అదేమి చిత్రమో, మరురోజు తెల్లవారుతూనే మొదట పూనాలో నివసిస్తున్న ఆ పాత విద్యార్థి గుర్తుకొచ్చి నా మనస్సు చెప్పలేనంత బలంగా అతని దగ్గరకు వెళ్ళాలని ఆరాటపడసాగింది. ఎన్ని విధాల ప్రయత్నించినా అది సమాధానపడలేదు. దాని వలన శిరిడీలో వున్న సమయమంతా వికల్పాలతో వ్యర్థం కాసాగింది. అంతకంటే ఒక్కసారి పూనా వెళ్ళి ఆ గుంజాటన వదిలించుకొని తర్వాత మరలా శిరిడీ వచ్చి నా కార్యక్రమం చేసుకోవడం ఒక్కటే మార్గమనిపించింది.


*********************************

ఆన్లైన్ లో చదువుటకు ఈ లింక్ ను ఉపయోగించుకోగలరు.


https://saibharadwaja.org/books/readbook.aspx?book=Sri-Aanandamai-Amma-Charitra&page=1

కామెంట్‌లు లేవు: