11, డిసెంబర్ 2022, ఆదివారం

మహా విష సర్పములు

 విషములు వాని లక్షణములు  - 


 మహా విష సర్పములు  - 


 శ్మశానము , రచ్చ చావిళ్ళు, పాడుబడిన యజ్ఞ స్థానములు, పాడుబడిన ఇండ్లు, నాలుగు దోవలు కలిసిన తావు, నీళ్ల గట్టు, పాడు తోటలు, మాణి తొర్రలు, పాలమాను, వేపచెట్టు, సెలయేళ్ళు, గుహలు, వీనియందు ఉండు సర్పములు , జడలు ధరించిన సర్పములు , చత్రరేఖలు, మత్స్యరేఖలు, కుంభ రేఖలు , త్రిశుల రేఖలు , గల సర్పములు , ఎర్ర ముఖము , ఎర్ర కన్నులు గల సర్పములు కరచిన యెడల వీనికి కాల నియమం లేదు . విషము ఎక్కుటకు క్రమము లేదు . ఈ విషమును తిప్పుటకు మంత్ర ఔషదములు లేవు . ఒకవేళ బలి, నమస్కార , జప, శాంతి, మంత్ర ఔషధుల చేత ఎవడన్నా బ్రతికినా రూపము చెడును. అంగవైకల్యం కలుగును.


 స్థాన విధి దోషము  - 


 శ్మశానము, రచ్చ మాకులు వీని యందు పంచమి, పక్ష సంధులు, అష్టమి, నవమి, సంధ్యలు, అర్ధరాత్రి ఈ కాలముల యందు ఎట్టి పాము కరిచినను విషం ఎక్కును.


 నక్షత్ర దోషము  - 


 భరణి, కృత్తిక, ఆశ్లేష, విశాఖ, పుబ్బ, పుర్వాబాద్ర, పుర్వాషాడ , మఖ, శతబిషం , నైర్రుత ముహూర్తం , పర్వములు వీని యందు పాము గరిచిన యెడల మనుష్యుడు జీవించుట దుర్లభం .


 విష సాధ్య లక్షణములు  - 


  పాము కరిచిన వానికి తలవెంట్రుకలు రాలుట , మూర్చ, శ్వాసము, వెక్కిళ్ళు, దగ్గు , వాంతి , రొమ్ము బరువు, వణుకు, వికారము , వేదన, కన్నులు ఎరుపు ఎక్కుట , గొంతు పట్టుట, పండ్లు నేరేడు పండ్లు వలే నల్లనగుట, నవ రంధ్రముల నుండి రక్తము కనిపించుట, నోట నురుగు వచ్చుట, కాళ్ళు, చేతులు నల్లగా అగుట ఈ లక్షణాలు కనిపించిన ఆ మనుష్యుడు బ్రతకడు. 


 తేలు విషము  - 


  సర్ప శరీరములు మురగిన యెడల తేళ్ళు జనించును.మరియు పేడ లొను , శ్మశాన దగ్ధ స్థలముల యందు బుట్టును. వీని విశములు మంత్ర ఔషధములకు సాద్యం కాదు. అవి తెలుపు,ఎరుపు,నలుపు వర్ణములు కలిగియుండును. వీని విషం ఎక్కినవానికి నాలుక మంధమేక్కును , మిక్కిలి నొప్పి , ముక్కున నెత్తురు వచ్చుట, శరీరం చెమర్చుట, మూర్చ, నోరెండుట కలుగును. 


 గర విష లక్షణము  - 


 స్త్రీలు పురుషులను వశపరుచుకోనుటకు , అట్లే పురుషులు , స్త్రీలను వశపరుచుకోనుటకు నానా జంతువుల బస్మ, మల, మూత్రాదులు, ఔషధములను , అల్ప వీర్యములు గల విషములు మొదలగు వానితో కుడా చేర్చి అన్నపాన తాంబూలం, మద్యపానం తో నోసంగేదరు. దీనినే గర విషము , పెట్టుడు మందు అనికూడా అంటారు. 


 పెట్టుడు మందు లక్షణము  - 


 ముఖము తెల్లగా అగుట,ఓడలు చిక్కుట, అగ్నిమాంద్యము, దగ్గు , ఉబ్బసము , వాత ప్రకోపము, మహోదరము, గుండెలలో నొప్పి , బలహీనత, హీన స్వరము, మోహము, కడుపు ఉబ్బరము, నిద్ర యందు భ్రమ. స్వప్నం నందు నక్క,పిల్లి, ముంగీస, పాము , కోతి, ఎండిన గుంటలు, కాలిన మానులు , వీనిని చూచుట, తన దేహము నానా వర్ణములు గా కనిపించుట, ముక్కు విరిగినట్టుగా ఉండుట, కన్నులు గుంటలు పడుట ఈ లక్షణములు పెట్టుడు మందు వలన కలుగును. ఇవి కనిపించిన వెంటనే చికిత్స చేసిన బ్రతుకును. లేనిచో మరణం తప్పదు. 


 విషాన్న లక్షణము  - 


 విషముతో కూడిన అన్నము తేలికగా నుండక దట్టముగా ఉండును.చిరకాలమునకు పక్వమగును. పక్వమైన అన్నము చద్ది అన్నము వలే ఉండును. అన్నం ఉడుకుతున్నప్పుడు దాని మీద ఆవిరి నెమలి కంట మ్ రంగు వలే ఉండును. ఆ అన్నం చూసినప్పుడు మొహము, మూర్చ , నోట నీళ్ళను కనిపించును. వర్ణము, వాసనయు హీనమగును. ఆవిరి యందు తళుకులు కలిగి ఉండును. 


 విషము కలిపిన కూరలు  - 


 విషముతో కలిసిన కూరలు ఎండి నట్టు ఉండును. కాషాయ వర్ణం కలిగి రుచిహీనమై వేరొక వికారm చెందును. ఆ కూరల పైన నురుగు వలెను , సీమంత రేకల వలెను , బుగ్గల వలెను కనపడును. ఇలా ఉండిన కూరల యందు విషం కలిసినట్టు . 


 విషాన్న పరీక్ష  - 


  విషముతో కూడిన అన్నమును అగ్నిలో వేసిన జ్వాల పుట్టాక ఉండును. పొగ , దుర్గంధం పుట్టును. ఆ అన్నం మీద ఈగలు వాలిన చచ్చును. కాకి చూచినా హీన స్వరముగా కూయును . నెమలికి మంద దృష్టి కలుగును . చిలుకలు, గోరువంకలు చూచిన మిక్కిలి కూయును . కొతి మలం జార్చుకోనును. కావుణ బుద్ధిమంతుడు అయిన వాడు పరీక్షించి తినవలెను. 


 

   ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


 

సాధన ఎలా ఉండాలి

 *శ్రీ గురు బ్యో నమః**


      *_నేటి మాట_*


*భక్తుడు అనుకునే వారి సాధన ఎలా ఉండాలి??? - భగవంతునికి ఇష్టమైన భక్తి ఏమిటి???*


" మానవునిలో హృదయ పరివర్తనం రానంతవరకు ఎన్ని సాధనలు చేసిననూ ప్రయోజనము లేదు "...

దయాగుణం, దానగుణం లేనిదే దైవమును ఎన్ని పూజలు చేసిననూ ఉపయోగం ఏమీ ఉండదు...

నేడు చాలామంది పుణ్యం వస్తుందని నదులలో స్నాన్నములు చేస్తుంటారు, ఉపవాసాలు చేస్తుంటారు, ప్రదక్షిణలు ,జపాలు చేస్తుంటారు...

కానీ వీటి వలన పుణ్యం రాదు, ఇవన్నీ మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి చేసే సాధనలు మాత్రమే! ...


నదులలో స్నానం చేస్తే పాపం పోయి పుణ్యం వస్తుందనుకుంటే, చేపలు కంటే పుణ్యాత్ములు ఈ సృష్టిలోనే ఉండవు!

ఉపవాసాలు ఉండడం వలన కోరికలు తీరుతాయి అనుకుంటే, నిత్యమూ ఆకలితో పస్తులుండే పేదవాడు ఎప్పుడో ధనవంతుడు అయ్యేవాడు! ...


అత్యాశ, సోమరితనం వలన మానవుడు ఇట్టి భ్రమకు లోనగుచున్నాడు...


ఇవన్నీ చేయకూడదు అని కాదు, చేయాలి.... కానీ అంతటితో ఆగిపోకుండా ఆత్మతత్వమును అర్ధం చేసుకుని హృదయము పరిశుద్ధం చేసుకుని పరమాత్మను అంతరాత్మలో  ఆరాధించుకోవాలి,


ఏనాడు మన హృదయాలు పరిశుద్ధమై పరమాత్మ కొరకు పరితపిస్తాయో ఆనాటి నుంచి మీరు నిజమైన పుణ్యాత్ములవుతాము... దన్యాత్ములవుతామని తెలుసుకుని ఆ ప్రకారం నడచుకోవడమే ఆధ్యాత్మిక సాధన...


                 *_🌺శుభమస్తు🌺_*

        🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

దేహాభిమానమే

 దేహాభిమానమే ప్రపంచం


సమస్యలకుమూలం?


దేముడున్నీ వెతికే వారు


ఆస్తికడు నేను ఎవరు అని


వెతికేవాడువివేకవంతుడు.


నీకు నీవు బానిసలుగా


పనిచేయకు యజమనిలా


పనిచేయు నీవు అనేది


"మనస్సు" దేహం అనేది.


బానిస.

దిల్ కి బాత్

 దిల్ కి బాత్


భర్తకు దక్కని భార్య రాజస్థాన్ ముఖ్యమంత్రయ్యింది


భార్యకు దక్కని భర్త దేశానికి ప్రధాని అయ్యాడు


చాయ్ దగ్గర మొదలైన ప్రభుత్వం ఆవు దగ్గర ఆగిపోయింది


వికాసమనే తల్లి దారి తప్పి, ఎక్కడో ఆగమైంది


అమ్మాయిలు భావోద్వేగాలు తింటున్నారు


అబ్బాయిలు మోసపు కలలు తింటున్నారు


ఉద్యోగులు లంచం తింటున్నారు


నేతలు కరెన్సీ తింటున్నారు


రైతులు విషం తింటున్నారు


ఉద్యమకారులు బుల్లెట్లు తింటున్నారు


అందరూ ఏదో ఒకటి సుష్ఠుగా తింటూనే ఉన్నారు


ఎవరంటారు భారత్ ఆకలితో అలమటిస్తోందని?


ఎవరంటారు భారత్ ఆర్థికంగా దిగజారిపోయిందని?


ఊడ్చేవాడు ముఖ్యమంత్రయ్యాడు


పన్నెండు చదివినమ్మ విద్యామంత్రయ్యింది


గోచీ సన్నాసులంతా మంత్రులయ్యారు


వేలిముద్రగాళ్ళు ఎమ్మెల్యేలయ్యారు


నేరగాళ్ళేమో యం.పి. లయ్యారు


పీజీలు చేసిన వాళ్ళంతా ఫేస్ బుక్, వాట్సప్ ల్లో ఇరుక్కున్నారు


ఒంటరిగా ఉన్నవాడు వ్యవస్థల్ని ముక్కలు చేస్తున్నాడు


వివాహితుడు మార్కెట్లో కూరలు కొనలేకపోతున్నాడు


వినేవాళ్ళకే కదా మిత్రో – ఎవరైనా చెవుల్లో పూలు పెడతారూ?


తెలివిగల జపాన్ వాళ్ళు బెల్లెట్ ట్రయిన్ నడుపుతారు


మన మేధావులు పదకొండు మందికి ఓం నమశ్శివాయ – పంపుతారు


దాంతో ఫ్రీ బాలెన్స్ చమత్కారం జరుగుతుందని ఆశపడతారు


అగర్ బత్తులు రెండు రకాలుగా ఉంటాయి


ఒకటి భగవంతుడికి మరోటి దోమలకు


భగవంతుడు వచ్చేది లేదు-దోమలు పోయేది లేదు!


ఉన్నవి ఖాళీ కడుపులు, యోగా చేయమంటారు


జేబులో చిల్లి గవ్వ ఉండదు, బ్యాంక్ ఎకౌంట్ తెరవమంటారు


ఉండటానికి ఇల్లు లేదురా నాయనా అంటే


మరుగుదొడ్లు కట్టిస్తామంటారు


ఊళ్ళో కరెంటు ఉండదు, డిజిటల్ ఇండియా అయిందంటారు


నగరాల్లో ఇంటర్నెట్ ఉంటుంది కాని, ఆపేస్తారు


దొరికేవన్నీ విదేశీ కంపెనీల వస్తువులు


దాన్నే ‘మేకిన్ ఇండియా’ అనమంటారు


పప్పు ఉప్పు బియ్యం జనం కొనలేకపోతున్నారు


టాటాకార్లు, సెల్ ఫోన్లూ అగ్గువైపోయాయంటున్నారు


మెదట్లో జాతి మతాల ద్వేషం నింపుతారు


స్వచ్ఛ భారత్ అభియాన్ గూర్చి గొప్పగా చెపుతారు


నిషా కరోనా వైరస్ లను ఎదుర్కోగలిగే జనం,


దేశంలో కాషాయ వైరస్ ను ఎదుర్కోలేకపోతున్నారు


అసమాన్యుడి ‘మన్ కీ బాత్’ లో –ఏదీ- వినిపించదు?


సామాన్యుడి ‘దిల్ కి బాత్!’


(కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, జీవశాస్త్రవేత్త)

Dr. Devaraju Maharaju

సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

పెళ్ళికి ముందు

 ఒక పెద్ద పులి పెళ్ళి చేసుకుంటుంది..!


పెళ్లి చూడటానికి  జంతువులు హాజరయ్యాయి..!


జంతువులన్నీ పులికి దూరంగా నిలబడి శుభాకాంక్షలు చెప్తున్నాయి..!


ఒక పిల్లి మాత్రం పెళ్ళి స్టేజి మేదకి దూకి దాని స్టైల్లో డాన్స్ చేసి పులికి షేక్ హ్యాండ్ ఇచ్చి శుభాకాంక్షలు చెప్పింది..!


పులి కోపంగా "ఎంత ధైర్యం నీకు..! చివరకు చిరుతపులి కూడా  దూరంగా నిలబడి శుభాకాంక్షలు చెప్పింది... నువ్వు స్టేజీ మేదకు వస్తావా...!? 😡


అపుడు పిల్లి చెప్పిన సమాధానం విని పులి ని‌ర్ఘాంతపోయింది..!


పిల్లి ఏమని సమాధానం చెప్పి ఉంటుంది.

ఏడిశావులే...పెళ్ళికి ముందు నేనూ పులినే 😃😂😃