19, జూన్ 2024, బుధవారం

సప్త ఋషులు

 సప్త ఋషులు 🌷

🏵️

ఈరోజుల్లో సప్త ఋషులు మనకు కనపడతారా?

 అంటే ఖచ్చితంగా కనబడతారు అని చెప్పవచ్చును.

 ఇంకా గట్టిగా చెప్పాలంటే...అందరికీ కనపడతారు, చూడగలిగితే ప్రతీరోజూ కనపడతారు. ఇంకా చెప్పాలంటే ప్రతీ దంపతులూ సాయంత్రంపూట సప్త ఋషులకు, అరుంధతీ వశిష్ఠులకు నమస్కరించుకోవాలికూడా.*

👉 *ఎక్కడ ఉంటారు?* *ఎలా ఉంటారు?* *అనేది మన పెళ్ళిళ్ళలో 'అరుంధతీ దర్శనం' చేయిస్తూ పురోహితులు తెలియజేస్తారు.*

*సాయంత్రం పూట ఆకాశంలో ఉత్తరం దిక్కున ప్రతీరోజూ వారిని మనం దర్శించుకోవచ్చు.*

👉 *ఇంతకీ సప్త ఋషులు ఎవరు? వారి వివరాలు ఏమిటి? అంటే..*

*కశ్యప అత్రి భరద్వాజ*

*విశ్వామిత్రోథ గౌతమః!*

*వశిష్టో జమదగ్నిశ్చ*

*సప్తైతే ఋషయః స్మృతాః!!*

*భారతీయ పురాణ కథనాల ప్రకారం ప్రతివారి వంశానికి ఓ ఋషి మూలపురుషుడిగా ఉంటారు. ప్రాచీన ఋషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి. కొందరికి గోత్రరూపంలో వారి పూర్వ ఋషులు ప్రతిరోజూ స్మరణీయులే. మరికొందరికీ వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు ఋషులున్నారు.*

*ఎంతోమంది ఋషుల ప్రతినిధులుగా సప్తర్షులను పూజించటం ఆనవాయితీగా వస్తున్నది.*

1. *కశ్యపుడు,*

2. *అత్రి,*

3. *భరద్వాజుడు,*

4. *విశ్వామిత్రుడు,*

5. *గౌతముడు,*

6. *జమదగ్ని,*

7. *వసిష్ఠుడు... వీరు ఏడుగురు పూజనీయులే.*

*రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు, పురాణాల రూపేణా మనకందించాడు. వ్యాసుడు నాలుగు తలలు లేని బ్రహ్మ, రెండు బాహువులు గల విష్ణువు, మూడో కన్ను లేని శివుడని అంటారు.*

⭐ 1. *కశ్యప మహర్షి:- సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి. మరీచి, కళల పుత్రుడు. దక్షప్రజాపతి పుత్రికల్లో 13 మందిని, వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్ళాడాడు. వారి ద్వారా దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్ష లతా త్పణ జాతులు, సింహ, మృగ, సర్పాలను, పక్షులను, గోగణాలను, అనూరుడు, గరుడుడు, నాగులు, కాలకేయులను, పౌలోములను, పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు.*

⭐ 2. *అత్రి మహర్షి:-*

*సప్తర్షుల్లో రెండోవాడైన అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు. అతని భార్య అనసూయ. అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు. అత్రి భార్య అనసూయ పతివ్రతా శిరోమణి.*

⭐ 3. *భరద్వాజ మహర్షి:-*

*భరద్వాజుడు ఉతథ్యుని పుత్రుడు. తల్లి పేరు మమత. బృహస్పతి కృప వలన జన్మించి, ఘృతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది, ఘటంలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు.*

⭐ 4. *విశ్వామిత్ర మహర్షి*:- 

*విశ్వామిత్రుడు రాజర్షి. త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని, హరిశ్చంద్రునిచే అసత్యమాడించ కొంత ఫలాన్ని, మేనక వల్ల తపోవిఘ్నం పొంది శకుంతలా జననానికి మూలపురుషుడయ్యాడు. దుష్యంతుడు, శకుంతలల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు.*

⭐ 5. *గౌతమ మహర్షి:-*

*తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు ఋషులు, మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు. ఇతర ఋషుల ఈర్ష్య వలన మాయా గోవును దర్భతో అదిలించి, బ్రహ్మహత్యా పాతకం అంటగట్టుకొన్నాడు. ఆ దోష పరిహారం కొరకు గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి, తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చిందీ ఆయనే.*

⭐ 6. *వశిష్ఠ మహర్షి:-*

*ఇతని భార్య అరుంధతి.* *వసిష్ఠుడు బ్రహ్మమానస* *పుత్రుల్లో ఒకడు. వైవస్వత* *మన్వంతరాన సప్తర్షుల్లో* *ఒకడు. శక్తి మొదలైన వందమంది పుత్రులు* *గలవాడు. దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు,* *గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు, శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు.*

*సప్తర్షులు తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయంటారు.*

⭐ 7. *జమదగ్ని మహర్షి:-*

*జమదగ్ని ఋషి- రుచికముని, సత్యవతుల కుమారుడు. జమదగ్ని కుమారుడే పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్యపురుష వ్యామోహం వలన, ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు. ఆ తరవాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలిని చేశాడు.*

👉 *మరణం ఆసన్నమైన వారికి అరుంధతీ దర్శనం, సప్తర్షి మండల దర్శనం కాదట.*

👉 *మీరంతా మీకు వీలున్న సాయంత్రపు వేళ "సప్తర్షి మండల దర్శనం" చేసుకుంటారు కదూ...*

 🙌 *సప్తర్షి మండల దర్శన ఫల ప్రాప్తిరస్తు* 🙌........

Support this blog

 Support this blog


Do you think this blog is useful. 

Please support financially by donating via G Pay Or phone pay to this Mbl. 9848647145.

వర్షోత్సాహ మిక్కాలమున్

 ఒకచో హీరము లుద్ధతిం గురిసి దివ్యోత్పాతముల్ క్రాలెడిన్ 

నొకచో వానలు ముంచి యెత్తుఁ బ్రజ మొర్రో యంచు వాపోవగా 

నొకచో నాతప మార్భటిన్ నిలచు యయ్యో యంచు నల్లాడగా 

ఒకచో శంప తళుక్కునన్ మెఱయు వర్షోత్సాహ మిక్కాలమున్ 

----------------------------

హీరము=పిడుగు 

*~శ్రీశర్మద*

8333844664

100 భాషలలో ప్రావీణ్యం.

 కాస్త ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మాట్లాడగలిగితే చాలు...కాళ్ళు నేల మీదుండవు యువతకు.


యా...యప్...నోప్...

యు నో...కె.కె......డ్యూడ్...బ్రో...


ఇలా మాడ్లాడేస్తూ...మెసేజీ లు చేస్తుంటారు వాట్స్ అప్పుల్లో.


100 భాషలలో పాండిత్యం అన్నది విన్నారా మీరు ఎక్కడైనా!


ఆలాంటి వ్యక్తి ఒకరుండేవారని కూడా తెలియదేమో!


ఆయనెంతటి విద్వాంసుడో!


కాకపోతే...ఎంత విద్వత్తు ఉందో...అంత వినయమూ ఉంది. బాహ్యాడంబరాలు....అసలు తెలియవు.


ఆయన తెలుగు, సంస్కృతం లలో ఎం.ఏ.అని.....వేదాలు, మహాభాష్యం, బ్రహ్మసూత్రాలు..అభ్యసించి...


షుమారు 100 భాషలు తెలిసిన మహామేధావి అని ఎప్పుడూ...ఎవరికీ చెప్పుకోలేదు. 


ఒరియా, బెంగాలీ, అస్సామీ లే కాక...ఫ్రెంచ్, గ్రీక్, జపనీస్, జర్మన్, లాటిన్, చైనీస్....ఇలా బహు భాషా కోవిదుడు.


ఆయనే వచన రచనకు మేస్త్రీ....మల్లాది రామకృష్ణ శాస్త్రి.


ఓ రోజున ఆరుద్ర నేరుగా...గురువుగారూ మీకసలు ఎన్ని భాషలు తెలుసును? అని అడిగారు. 


దానికి సమాధానంగా శాస్త్రిగారు జాబితా రాసుకోమని చెబితే,.... 


అప్పుడు ఆరుద్ర... 

అలా కాదు. మీకెన్ని భాషల్లో కవిత్వం చెప్పగల సాధికారత ఉందో, అన్ని భాషల్లోనూ ఈ విసనకర్ర ఆకులపై ఒక్కో ఆకుమీద ఒక్కో సంతకం చొప్పున ఆయా భాషల్లోనే చేసివ్వండి...


అంటూ తాటాకు విసనకర్రను, ఇంకు పాళీ కలాన్ని ఆయన చేతికి ఇచ్చారు. 


అప్పుడు శాస్త్రిగారు ఒక్కో ఆకుమీద ఒక్కో భాషలో సంతకం చేస్తూపోతే మొత్తంగా ఆ తాటాకు విసనకర్రకు రెండు వైపులా ఉన్న ఆకులన్నీ నిండిపోయాయి! 


ఇది స్వయంగా రామకృష్ణశాస్త్రిగారి పెద్ద కుమారుడు మల్లాది నరసింహశాస్త్రిగారు చెప్పిన విషయం. 


కనుక రామకృష్ణశాస్త్రిగారికి వందకు పైగా భాషల్లో కవిత్వం చెప్పగలిగిన పాండిత్యం ఉండేదని నిష్కర్షగా చెప్పొచ్చు.


                                @@@@


అంతటి గొప్ప కవి....ఘోస్ట్ రచయితగా  ఉండేవారు సముద్రాల సీనియర్ కు.!


మల్లాది వారి ఎన్నో పాటలు....సముద్రాల వారి ఖాతాలో పడ్డాయంటే...


కారణం....ధనం.


విద్య కలవాడు, బలం కలవాడు, బలగం కలవాడు...

పసిడి గల వాడి బానిసలని అందుకే అన్నారు.


ఎంత పాండిత్యం ఉంటే ఏం లాభం.


సముద్రాల రాఘవాచార్య గారిని...ఏవిటండీ...శాస్త్రి గారి చేత పాటలు వ్రాయించుకుని....మీపేరు వేసుకుంటున్నారు?! అని అడిగితే...


ఇందులో తప్పేముంది. నాకు టైం లేదు. ఆయనకు డబ్బు అవసరం. అది నేనిచ్చి వ్రాయించుకుంటున్నాను.ఒక పండితుడికి అవకాశం ఇస్తున్నాను!...అనేవారట.


తన పేరు మీద రాని పాటలు...తనవి అని ఎప్పుడూ చెప్పుకోలేదు శాస్త్రి గారు. ఆ మాటలే చెప్తాయి అవి ఎవరు వ్రాశారో!


ఏమో తటిల్లతిక మేమెరుపు...

మేడలోనే అల పైడిబొమ్మా.....ఇలాంటి పదాలు ఇక ఎవ్వరూ వ్రాయలేరు..ఆ మాటల మేస్త్రీ తప్ప!


అసలు కుడి ఎడమైతే...పాటకు అర్థమేమిటండీ? అని అడిగితే....ఆ తాగుబోతు వాడి పాటకు అర్థాలు కూడానా...అని నవ్వుతూ తప్పుకునేవారు శాస్త్రి గారు.


శాస్త్రి గారి పేరు మీద మహా అయితే ఒక 200 పాటలు వచ్చిఉంటాయి. కానీ అజ్ఞాతం గా ఎన్నో పాటలు వ్రాశారు!


1967 లో రహస్యం మూవీ లోని గిరిజా కళ్యాణం యక్షగానం శాస్త్రి గారిదే. కాకపోతే...ఆయన ఎప్పుడో ముందే వ్రాసిపెట్టినది..ఆ సినిమాలో వాడుకున్నారు.


                              @@@@


100 భాషలలో ప్రావీణ్యం.....

వేదాల ఔపోసన,...

బ్రహ్మ సూత్రాలు...

మహాభాష్య జ్ఞానం...

మహా గ్రంథాల రచయిత....


ఇవేవీ కూడా....ఆ మహానుభావుని...దారిద్ర్యానికి బలి కాకుండా ఆపలేక పోయాయి!


కేవలం....

లౌక్య రాహిత్యం,... 

త్యాగశీలత,... 

అతి మంచి తనం,... 

నిస్వార్థత.....


ఇవి చాలు....కలిలో....కడతేరి పోవడానికి!


వారి వ్యక్తిగత జీవితం దుర్భరం అయినది. వారి భావాలు నచ్చకనో లేక వారికి కలిగిన వేదాంత ధోరణి వల్లో, భార్యా భర్తలు విడిపోయారు. 


ఆయన జీవితంలోని విషాదమంతా దేవదాసులోని పాటలో ప్రతిబింబిస్తుంది..... 


అన్నిటినీ, అందరినీ పోగొట్టుకొని, 'తన వారు పరులైన' జీవితాన్ని అనుభవించిన ఈ మహాకవి...


12-09-1965 న కీర్తిశేషులయ్యారు.


16- 6- 1905.....కీ.శే. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి జయంతి.


స్మృత్యంజలి.🌹


                                  @@@@


మల్లాది వారి అద్భుతమైన విరహ గీతం...

వారికి నా స్వర నివాళి.🌹


చిత్రం - జయభేరి.(1959).

రచన - మల్లాది రామకృష్ణ శాస్త్రి.

సంగీతం - పెండ్యాల.

గానం - ఘంటసాల. 


రాగమయి రావే అనురాగమయి రావే

రాగమయి రావే అనురాగమయి రావే

రాగమయి రావే.. 


నీలాల గగనాన నిండిన వెన్నెల ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

నీలాల గగనాన నిండిన వెన్నెల

నీ చిరునవ్వుల కలకల లాడగా

రాగమయి రావే అనురాగమయి రావే

రాగమయి రావే.. 


చివురులు  మేసిన చిన్నారి కోయిల మరి మరి మురిసే మాధురి నీవే

చివురులు మేసిన చిన్నారి కోయిల మరి మరి మురిసే మాధురి నీవే

తనువై మనసై నెలరాయనితో కలువలు కులికే సరసాలు నీవే సరసాలు నీవే సరాగాలు నీవే

రాగమయి రావే అనురాగమయి రావే

రాగమయి రావే... 


సంజెలలో సంజెలలో

హాయిగా సాగే చల్లని గాలిలో

మరుమల్లెల విరజాజుల పరిమళమే నీవు

చిలుగే సింగారమైన చుక్క చన్నెలు అంబరాన ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

చిలుగే సింగారమైన చుక్క చన్నెలు అంబరాన

సంబరపడు చక్కిలిగింతల పరవశమే నేను నవ పరిమళమే నీవు

రావే రాగమయి నా అనురాగమయి

రావే రాగమయి నా అనురాగమయి.. 


నీడచూసి నీవనుకొని పులకరింతునే అలవికాని మమతలతో కలువరింతునే

నీ కోసమే ఆవేదన నీ రూపమే ఆలాపన

కన్నెలందరు కలలుకనే అందాలన్ని నీవే

నిన్నందుకొని మైమరిచే ఆనందమంతా నేనే

రావే రాగమయి నా అనురాగమయి

రావే రాగమయి నా అనురాగమయి


🌹🌿🌹🌿🌹🌿

అనగనగా

 🔔 *అనగనగా...* 🔔



*🌱రాత్రి భోజనాల తర్వాత ఒకటీచర్ ఆమె విద్యార్థులు రాసిన వ్యాసరచన పేపర్లను దిద్దడం ప్రారంభించింది* . 


ఆమె పిల్లలు పడుకున్నారు!


భర్త కుర్చీలో కూర్చొని తన స్మార్ట్ ఫోన్లో 'క్యాండీ క్రష్'లో లీనమైయున్నాడు.


చివరి పేపర్ దిద్దాడానికి తీసి చదివిన ఆ టీచర్ నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంది.


ఆ ఏడుపు వెక్కిళ్ళ శబ్దానికి భర్త తలతిప్పి చూసి ఆశ్చర్యపోయాడు!


"ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది?" అడిగాడతను టెన్షన్తో.


 నిన్న నా సెకండ్ క్లాస్ విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చాను. "మీరు ఏం కావాలనుకుంటున్నారు" అనే అంశంపై ఏదైనా రాసుకుని రమ్మని.


"అయితే...?"


"ఇదిగో! ఈ చివరి పేపర్ దిద్దుదామని చదువుతుంటే ఏడుపును ఆపుకోవడం నా తరం కావడంలేదు!!"


భర్త ఆసక్తిగా...."అంత ఏడిపించే విధంగా ఏం రాశాడు?"


హెడ్డింగ్ ఇలా పెట్టాడు


💥నేనుస్మార్ట్ ఫోన్ అవ్వాలని నా కోరిక.💥


అమ్మానాన్నలు స్మార్ట్ ఫోన్ ను చాలా ప్రేమిస్తారు!


వాళ్ళు స్మార్ట్ ఫోనును చాలా కేర్ గా... శ్రద్ధగా... ఇష్టంగా చూసుకుంటారు. నాకన్నా ఎక్కువగా...!!


నాన్న ఆఫీసు నుండి అలసటతో వచ్చినప్పుడు, అతనికి స్మార్ట్ ఫోన్ రిలాక్స్ ను ఇస్తుంది. నాన్నకి స్మార్ట్ ఫోన్ కోసం సమయముంది. కానీ, నా కోసం లేదు! ఎందుకంటే నాతో ఆడుకోవడం మా నాన్నకు రిలాక్స్ ను ఇవ్వడంలేదు!


అమ్మానాన్నలు ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు కూడా స్మార్ట్ ఫోన్ రింగౌతుంటే... ఒకటి రెండు రింగులు వచ్చేలోపే వాళ్ళు.. ఫోన్ చేతిలోకి తీసుకుని జవాబిస్తారు!


కానీ... నేను ఎన్నిసార్లు పిలిచినా దానికిచ్చే ప్రిఫరెన్స్ నాకివ్వరు!! ...

నేను ఏడుస్తూ వుంటే కూడా వాళ్ళు నాతో కాకుండా స్మార్ట్ ఫోన్లతో గడుపుతుంటారు!


వాళ్ళు నాతో కన్నా స్మార్ట్ ఫోన్లతో ఆడు కోవడానికే ఎక్కువ ఇష్టపడుతారు!


వాళ్ళు తమ స్మార్ట్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేనేం చెప్పినా వినిపించుకోరు! 

అది నాకు ముఖ్యమైన విషయమైనా సరే!


అదే ఒకవేళ నాతో మాట్లాడుతున్నప్పుడు రింగ్ వస్తే మాత్రం వెంటనే ఫోన్ కి జవాబిస్తారు!


అమ్మానాన్నలు

స్మార్ట్ ఫోన్ని కేర్ గా చూసుకుంటారు!

ఎప్పుడూ తనతోనే ఉంచుకుంటారు!

దానికి చాలా ప్రాధాన్యతనిస్తారు!

దాన్ని చాలా ఇష్టపడుతారు!!

దానితో రిలాక్స్ అవుతుంటారు!!

దానికి తమ ఖాళీ సమయాన్ని కేటాయిస్తారు!!


దానిని ఎపుడు పనివాళ్ళకి అప్పగించరు


నేను ఒకరోజు మాట్లాడకపోయినా బాధపడరు కానీ స్మార్ట్ ఫోన్ ఒక్కగంట పనిచేయకపోతే చాలా కంగారుపడతారు హడావిడి చేస్తారు 


రాత్రి పడుకున్నప్పుడు కూడా ప్రక్కనే ఉంచుకుంటారు!!

ఉదయం లేవగానే దాన్నే చేతిలోకి తీసుకుంటారు!!


కాబట్టి! నా కోరిక ఏమిటంటే... నేను అమ్మానాన్న చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నాను!! 


భార్య చదువుతుంటే... విన్న భర్తకు మనసంతా పిండేసినట్లైంది!! అతని కళ్ళలో కూడా కొంచెం తడి వస్తుండగా...

"ఎవరు రాశారది? " అడిగాడు భార్యని.


"మన కొడుకు" అంది భార్య కన్నీరు కారుతుండగా!


వస్తువులను ఉపయోగించుకోవాలి!

బంధాలను ప్రేమించాలి!!


అన్ని బంధాలకన్నా ఎక్కువగా వస్తువులపై బంధాన్ని ఏర్పరచుకుని ప్రేమించడం మొదలుపెడుతూవుంటే... క్రమంగా అసలైన బంధాలు వెనక్కి నెట్టివేయబడతాయి!......


ఇది నిజంగా జరిగిన కథ.. 


 *కాబట్టి ఇలాంటి కథలో* *తల్లిదండ్రులు మీరు* *కాకండి* ..🙏


🙏 *దయచేసి ప్రతిఒక్కరూ* *ఆలోచించండి* 🙏


 *మీ గుండెను తాకితే* ... *మరికొన్ని గుండెలకు* *చేర్చండి ,,, కొంతమందైనా* *మారే* *అవకాశం కల్పించండి* 




🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

చేసిన కర్మలకు ఫలాలు

 శ్లోకం:☝️

*ఏవం సంచిన్త్య మనసా*

 *ప్రేత్య కర్మఫలోదయమ్ |*

*మనోవాఞ్గూర్తిభిర్నిత్యం*

 *శుభం కర్మ సమాచరేత్ ||*


భావం: "మరణానంతరం చేసిన కర్మలకు ఫలాలు ఖచ్చితంగా లభిస్తాయి", అనే ఆలోచనను మదిలో ఎల్లప్పుడు జ్ఞాపకం ఉంచుకుని - ఎల్లప్పుడూ మనస్సు, వాక్కు మరియు శరీరంతో మంచి పనులే చేయడానికి ప్రయత్నించాలి.

మాతృగయ

 హిందూ గ్రంధాలలో పేర్కొన్నట్లుగా, మాతృగయ తీర్థం అని పిలువబడే సిద్ధ్‌పూర్ మన తర్పణం లేదా అమ్మపై ఉన్న రుణాన్ని తీర్చడానికి ప్రసిద్ధి చెందింది.


ఆమె స్వర్గలోకానికి వెళ్లే వరకు తల్లి యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తించలేము.


తన ఇల్లు, భర్త మరియు పిల్లల కోసం నిస్వార్థంగా జీవించిన జీవితం, తల్లిని దేవతలు కూడా పూజిస్తారు.

ఆమె పిల్లల పట్ల ఆమె చేసిన త్యాగాలు ఎనలేనివి. ఈ తర్పణం మన పూర్వీకులను మరియు మన తల్లిని జీవితం మరియు మరణం యొక్క దుర్మార్గపు వృత్తం నుండి కృతజ్ఞతాపూర్వకంగా మరియు విముక్తి చేస్తుంది.

మాతృ గయా తీర్థం అని పిలువబడే ఈ పవిత్ర స్థలం మన పూర్వీకులు లేదా పితృ మోక్షాన్ని (మోక్షం) పొందేందుకు వీలు కల్పిస్తుందని చెప్పబడింది.


కాబట్టి మీరు కొడుకు లేదా కుమార్తె అయినా, వారికి ముక్తిని సాధించడంలో సహాయం చేయడం మా కర్తవ్యం.


ఈ పూజ మా అమ్మ ఋణం తీర్చుకుంటుంది.... అందుకే మాతృ గయ అని పేరు...భగవత్గీతలో కూడా చెప్పబడింది.


పూజకు దాదాపు 2 గంటల సమయం పడుతుంది, అయితే బ్రాహ్మణులు అధిక రుసుము వసూలు చేస్తారని గుర్తుంచుకోండి. కనీస ఛార్జీలు రూ.5000. అంతేకాదు పూజలో అనేక వస్తువులు సమర్పించాలని డిమాండ్ చేస్తారు.


అందుకే సిద్ధ్‌పూర్ వెబ్‌సైట్‌కి వెళ్లండి లేదా సిద్ధ్‌పూర్‌లోని బ్రాహ్మణుల జాబితాను చూడండి, వారిలో కొందరికి కాల్ చేయండి, ధరలను చర్చించి, ఆపై వాటిని బుక్ చేయండి.


ఈ తర్పణాన్ని అందించడానికి ఉత్తమ నెలలు చైత్రం. హిందూ క్యాలెండర్ ప్రకారం కర్టక్ మరియు భాద్రపద నెలలు.


అహ్మదాబాద్ నుండి రోడ్డు మార్గంలో సిద్ధపూర్ సులభంగా చేరుకోవచ్చు. ఇది కారు లేదా టాక్సీలో 2.30 గంటల ప్రయాణం.


టాక్సీలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు దాదాపు 2000-3000 రూపాయలు వసూలు చేస్తారు....

ఇది చాలా చిన్న పట్టణం.


చాలా పరిశుభ్రమైన ప్రదేశం, పవిత్రమైన మరియు మతపరమైన వాతావరణం, ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం, ఇది మిమ్మల్ని ఇక్కడికి తీసుకువస్తుంది.మాతృగయ కపిలమహర్షి తల్లికి శ్రాద్ధకర్మలు నిర్వహించిన పవిత్రప్రదేశం. పరశురాముడు తన తల్లికి శ్రాద్ధకర్మలు నిర్వర్తించిన పవిత్ర ప్రదేశమిది. ధదీచి ఇంద్రుడికి తన ఎముకలను దానంగా ఇచ్చిన ప్రదేశం. పంచ సరోవరాల్లో బిందుసరోఈవరం ఒకటి. మిగిలిన నాలుగు సరోవరాలు టిబెట్‌లోని మానస సరోవరం, రాజస్థాన్‌లోని పుష్కర్ సరోవరం, గుజరాత్‌లోని బిందుసరోవరం, కర్నాటక రాష్ట్రం లోని హంపీలో ఉన్న పంపా సరోవరం.


స్వాయంభువు మనువు - శతరూప దంపతులకు ఆకూతి, ప్రకూతి, దేవహూతి అంటూ ముగ్గురు కుమార్తెలు. యుక్తవయస్కురాలైన దేవహుతికి తగిన వరుని కోసం వెదికే ప్రయత్నంలో పడిన స్వాయంభువు దేశదేశాలకు తిరిగాడు. చివరకు ఇక్కడకు రాగానే కర్దముడు అతని కంటబడ్డాడు. అతడే తన కూతురికి తగిన వరుడని సంతోషిస్తున్న సమయంలో అతని కళ్ళ నుండి ఆనందబాష్పాలు వెలువడ్డాయట. ఆ బాష్పాల వెల్లువతో ఓ సరోవరం ఏర్పడిందనీ, అదే బిందు సరోవరమని కథనం. 


 బ్రహ్మ దేవుడు భూలోకమందు సృష్టి కార్యము చేయుటకు కొందరు ప్రజా పతులును సృష్టించాడు. అందులో ఒకరు కర్దమ ప్రజాపతి. బ్రహ్మ దేవుడు సృష్టి కార్యము చేయవలసినదని కర్దమ ప్రజాపతిని ఆజ్ఞాపించాడు. కర్దమ ప్రజాపతి బ్రహ్మ దేవుడి ఆజ్ఞ మేరకు, మంచి గుణవంతురాలైన ధర్మ బద్ధమైన భార్య కోసం శ్రీ మహావిష్ణువు కోసం 10 వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై అంతటి మహా భక్తుడిని చూసి ఆయన కన్నుల నుండి ఆనందభాష్పములు పడ్డాయి. ఆ ఆనంద బాష్ప ములు పడిన చోట ఒక బిందు సరోవరం ఏర్పడింది. ఆ సరోవరమే ఈ బిందు సరోవరం. సరస్వతీ నది ఈ బిందు సరోవరాన్ని చుట్టి పారింది అనడానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. 


గుజరాత్‌లోని సిద్ధపూర్‌లో ఉన్న బిందు సరోవరం కర్దమ ప్రజాపతి శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేసి విష్ణువు ప్రత్యక్షమైన ప్రాంతము. బిందు సరోవరం పరమశివుని కృప వలన ఏర్పడిన సరోవరమనీ, కపిలముని తపస్సు చేసిన ప్రాంతమంటూ బిందుసరోవరానికి అనేక ప్రత్యేకతలున్నాయి.


కర్దమ - దేవహూతిల వివాహం అయిన తరువాత సంతానప్రాప్తి కోసం కర్దమ ముని ఓ విమానాన్ని సృష్టించి, తద్వారా లోకమంతా తీర్థయాత్రలు చేస్తూ పుణ్యస్నానాలు చేయసాగారు. అలా వారు సరస్వతీ నదిలో పుణ్యస్నానం చేయగా వారికి కళ, అనసూయ, శ్రద్ధ, హరిర్భువు, గతి, క్రియ, ఖ్యాతి, అరుంధతి, శాంతి అంటూ తొమ్మిదిమంది కుమార్తెలు కలిగారు. కూతుళ్లకు పెళ్లుళ్ళు చేసిన కర్దముని మనసులో తనకు ఓ కొడుకు కూడ ఉంటే బాగుంటుందనిపించింది. భార్యను పిలిచి శ్రీమన్నారాయణుని పూజచేయమన్నాడు. అలా దేవహుతి ప్రార్థనలతో ప్రసన్నుడైన విష్ణుదేవుడు ఆమెకు పుత్రభాగ్యాన్ని కలిగించాడు. ఆ పుత్రుడే కపిలుడు‌.


కపిలముని, కర్దమ - దేవహూతిల సన్నిధులున్నాయి. ఈ బిందు సరోవరం ప్రక్కనున్న రావిచెట్టు క్రింద తర్పణాలు చేస్తుంటారు. ఇక్కడ మాతృదేవతలకు మాత్రమే తర్పణాలను చేయడం విశేషం. ఇలా మాతృదేవతలకు మాత్రం తర్పణాలు ఇవ్వడాన్ని దేశంలో మరెక్కడా చూడలేము.


చలికాలం వెళ్ళడానికి ఉత్తమం‌. కన్నడ బ్రాహ్మణులు, వారి‌ మఠములు‌ ఉన్నాయి ‌.

విషానికి విరుగుడు

 శ్రీ గరుడ ప్రయోగ మంత్రం..🚩

 విషానికి విరుగుడు..🚩


ఎటువంటి విషానికైనా ఇది విరుగుడు మంత్రం విష జ్వరాలు ఇతర అనారోగ్య సమస్యలు, విష ప్రయోగం తో ఆరోగ్యం దెబ్బతిన్నవారు అందరికి ఇది అమృతం లాంటి గరుడ ప్రయోగ మంత్రం. విష ప్రయోగం చేసిన వారు ఉంటే వారికి తగిన శిక్ష పడుతుంది. రోజూ 108 సార్లు ఒకే ఆసనం తో పఠించాలి అటుఇటు తిరుగుతూ చదవకూడదు. ఇలా మండలం రోజులు చేస్తే విష జ్వరాలు రాకుండా ఉంటాయి.


మంత్రం:-


*ఓం ఈం ఓం నమో భగవతే శ్రీ మహా గరుడాయ పక్షీంద్రాయ విష్ణు వల్లభాయ త్రైలోక్య పరిపూజితాయ ఉగ్రభయంకర కాలానల రూపాయ వజ్ర నఖాయ వజ్ర తుండాయ వజ్ర దంతాయ వజ్ర దంష్ట్రాయ  వజ్ర పుచ్చాయ వజ్ర పక్షోలక్షిత శరీరాయ ఓమికేయెహి శ్రీ మహా గరుడా ప్రతిమా శాసనాస్మిన్న విషా విష దుష్టానాం విషం దూషయ దూషయ స్ప్రుష్టానాం నాశయ నాశయ దంత శూకానాం విషం ధారయ ధారయ ప్రలీనం విషం ప్రణాశయ ప్రణాశయ సర్వ విషం  నాశయ నాశయ హన హన ధహ ధహ పచ పచ భస్మీ కురు భస్మీ కురు  హుం ఫట్ స్వాహా ||


చంద్ర మండల సంఖాష సూర్య మండల ముష్టిక పృథ్వీ మండల ముధ్రాంగ  శ్రీ మహా గరుడాయ విషం హర హర హుం    ఫట్ స్వాహా | ఓం క్షిప స్వాహా ఓం ఈం సచ్చరథి  సచ్చరథి తత్కారి మత్కారి విషానాంచ విషరూపిణి విషదూషిని విష షోషిని విషనాశిని విషహారిణీ హతం విషంనష్టం విషం అంత ప్రలీనం విషం ప్రణస్తం విషం హతం త బ్రహ్మణా విషం హతం |

హతమింద్రస్చ్య  వజ్రేన స్వాహా🌺


గరుడ వాహనా గోవిందా



ఉడిపీకి శ్రీ కృష్ణుడు

 ఉడిపీకి శ్రీ కృష్ణుడు ఎలా వచ్చాడు? స్వయంగా రుక్మిణీ దేవి చేయించిన 'ఉడిపి శ్రీ కృష్ణ విగ్రహ రహస్యం'!...

 

శ్రీ కృష్ణుని ఆలయాలలో, నాలుగు ఆలయాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇవి ఉత్తరాన ఉత్తర ప్రదేశ్ లోని మథుర, గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక, దక్షిణ భారతదేశంలో కేరళలోని గురువాయూరు, కర్ణాటకలోని ఉడిపి. 


 ద్వైత సిద్ధాంత ప్రతిపాద్యులు, త్రిమతాచార్యులలో ఒకరైన శ్రీ మధ్వాచార్యుల వారి జననం, జీవితం, ప్రసిద్ధ శ్రీ కృష్ణ క్షేత్రం, కర్ణాటకలోని ఉడిపితో ముడిపడి ఉంది.


 ఒక రోజు శ్రీ మధ్వాచార్యుల వారు, వేకువజామునే, సముద్ర తీరానికి వెళ్లి స్నానం చేసి, ప్రాత: సంధ్యాదికాలు ముగించుకుని, ఆ తీరంలోనే కూర్చుని, ద్వాదశ స్తోత్ర రచనను ప్రారంభించారు. తపోదీక్షతో, ద్వాదశ స్తోత్ర రచన సాగుతోంది. ఆ రోజు పర్వదినం కావడంతో, అనేక మంది ప్రజలు కూడా వచ్చి, సముద్రస్నానం చేశారు.


 

ప్రశాంతమైన ప్రాత: కాలం, భక్తి ప్రపత్తులు ప్రసరించడానికి అనువైన సమయం. అలాంటి నేపద్యంలో, శ్రీ మధ్వాచార్యుల వారు నిరాటంకంగా, ద్వాదశ స్తోత్రంలోని అయిదు అధ్యాయాల రచన పూర్తి చేశారు. ఆరవ అధ్యాయం ప్రారంభం కాబోతున్న సమయంలో, ద్వారక నుండి సరుకులు తీసుకువస్తోన్న ఒక నౌక తీరం వెంట వెళుతుండగా, అకస్మాత్తుగా, విపరీతంగా గాలులు ప్రారంభమయ్యాయి. ఈ గాలులకు సముద్ర కెరటాలు, ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. నౌక ప్రమాదంలో చిక్కుకుంది. 


దానిని రక్షించుకోవడానికి, అందులోని నావికులు చేస్తోన్న ప్రయత్నాలు, ఫలించడం లేదు. క్రమంగా నౌకలోకి నీరు చేరడం ఆరంభమైంది. ఏ క్షణాన్నైనా, నౌక మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. నావికులందరూ భయాందోళనలకు గురైన సమయంలో, చివరి ప్రయత్నంగా, నౌకకు సంబంధించిన ముఖ్య వ్యాపారి ఒకతను, తీరం వైపు చూస్తూ, రక్షించేవారి కోసం ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. 


 

అంత దూరం నుంచి కూడా, ఒడ్డున నిశ్చలంగా కూర్చొని రచన చేసుకుంటున్న శ్రీ మధ్వాచార్యుల వారు, ఆ వ్యాపారికి స్పష్టంగా గోచరించారు. ఆయననుద్దేశించి, మరింత ఆర్తితో ప్రార్థించసాగాడు. 


ద్వాదశ స్తోత్ర రచనలలో లీనమై ఉన్నప్పటికీ, అంతటి హోరుగాలిలోనూ అంత దూరంనుంచి వ్యాపారి చేస్తోన్న ప్రార్థన, మధ్వాచార్యుల చెవిని తాకింది. అప్రయత్నంగా అటుకేసి తల తిప్పారు. జాలి కలిగింది. వెంటనే తన ఉపవస్త్రం, ఒక కొసను పట్టుకుని గాలిలో నావ కేసి విసిరి, వెనక్కు తీసుకున్నారు. అంతే, ఆ క్షణం వరకూ సముద్రంలో మునిగిపోతుందా? అన్నట్లున్న నౌక, ఒక్కసారిగా స్థబ్దతకు వచ్చింది. ఎవరో తాళ్లు పట్టి లాగినట్లుగా, తీరానికి చేరి స్థిరంగా నిలిచింది. 


నావికులందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు. అంతకు మునువు ప్రార్థన చేసిన వ్యాపారి, వడివడిగా మధ్వాచార్యుల వారిని సమీపించి, సాష్టాంగ నమస్కారం చేశాడు. అనేక విధాలుగా స్తుతించాడు. అనంతరం లేచి నిలబడి, అంజలి ఘటించి, ‘స్వామీ, నా వద్ద అమూల్యమైన వస్తువులు అనేకం ఉన్నాయి. వాటిలో మీరు కోరుకున్నది ఏదైనా సరే, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి కాదనకండి’. అని అనేక విధాల ప్రాధేయపడ్డాడు. 

 

మధ్యాచార్యుల వారు చిరునవ్వు నవ్వి, చివరకి అతని కోరికను మన్నించారు. అయితే, ‘నువ్వు నాకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్న అమూల్యమైన వస్తువు, నీ నౌకలో ఉన్న రెండు గోపీ చందనపు గడ్డలు, ఈయగలవా’ అన్నారు. వ్యాపారి ఆశ్చర్యపోయాడు. 


ఎందుకంటే, గోపీచందనం, ద్వారకలో ఎక్కడపడితే అక్కడ దొరికే మట్టి. పడవలలో సరుకులు ఎక్కించేటప్పుడూ, దించేటప్పుడూ, బరువు సమతూకం తప్పిపోకుండా, గోపీ చందనపు గడ్డల సహాయంతో, నౌకలో సరుకును అటూ ఇటూ సర్దుతూ ఉంటారు. 


అలాంటి గోపీ చందనం మట్టి గడ్డలు, ఈ మహానుభావుడు కోరడం, ఆ వ్యాపారికి సుతరామూ నచ్చలేదు. ఎంత ప్రార్థించినప్పటికీ, మధ్వాచార్యుల వారు, తాను కోరిన గోపీ చందనానికి మించి, మరే బహుమతినీ తీసుకోవడానికి అంగీకరించలేదు. చివరికి ఆ వ్యాపారి, స్వామి కోరిన ఆ గోపీ చందనం గడ్డలను ఇవ్వడానికి సిద్ధపడి, అవే కోరడంలోని పరమార్థం ఏమిటో, ఆ మట్టి గడ్డల మహిమ, విశేషాలేమిటో, కనీసం అవైనా తెలుపమని, ప్రార్థించాడు. 


స్వామి మళ్లీ చిరునవ్వు చిందిస్తూ, ‘నువ్వే చూడు’ అంటూ, ఆ గడ్డలను అందరూ చూస్తుండగానే, నీటితో కరిగించారు. ఆ సమయంలో, అక్కడ ఓ అద్భుతం జరిగింది. ఒక గడ్డ నుండి బలరాముని విగ్రహం, రెండవ దాని నుండి శ్రీ కృష్ణుని విగ్రహం బయటపడ్డాయి. 


అక్కడున్నవారందరూ, సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు. శ్రీ కృష్ణ విగ్రహ దర్శనం జరిగిన వెంటనే, మధ్వాచార్యులు, ద్వాదశ స్తోత్రంలోని ఆరవ అధ్యాయంలో, దశావతారాన్ని వర్ణించారు. బలరాముని విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి, శ్రీ కృష్ణుని విగ్రహం తీసుకుని, ఉడిపికి ప్రయాణమయ్యారు. శ్రీకృష్ణ ప్రాప్తి తరువాత, ద్వాదశ స్తోత్రాన్ని పరిసమాప్తి చేశారు. అందుకే, ద్వాదశ స్తోత్రం అత్యంత పవిత్రమైనది. 


అమృతరూపమైనటువంటి శ్రీ కృష్ణుని ఆగమనానికి కారణమైంది. అది విషాహార స్తోత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇంతకీ శ్రీ కృష్ణుని విగ్రహ రహస్యం ఏంటి? వాస్తవానికి జరిగిందేంటి? అనే కథ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. 


 

ఆ శ్రీకృష్ణుని విగ్రహం, సామాన్యమైనదికాదు. ఒకసారి దేవకీదేవి, ‘కృష్ణా.. నీ బాల్య లీలలు చూసే భాగ్యం, యశోదకు కలిగినట్లు నాకు కలుగలేదు. వాటి గురించి వినీ, వినీ, ఎప్పటికైనా చూడాలని, నా మనస్సు ఉవ్విళూరుతోంది. చూపించవా కృష్ణా’ అని ప్రార్థించింది. 


కృష్ణుడు అనుగ్రహించాడు. మరుక్షణంలో శైశవ దశలో కృష్ణుడిగా మారిపోయాడు. తప్పటగులు వేస్తూ నడిచాడు. దేవకీ దేవి ఒడిలో కూర్చున్నాడు. ఆమె స్తన్యాన్ని త్రాగాడు. కేరింతలు కొట్టాడు. కుండ పగులగొట్టి వెన్న తిన్నాడు. ఒంటినిండా రాసుకున్నాడు. పామును తాడులాగా పట్టుకుని, మజ్జిగ చిలికినట్లు నృత్యం చేశాడు. మరీ ముఖ్యంగా, తనతో పాటు అన్న బలరాముణ్ణి కూడా చూపించాడు. 


ఈ చేష్టలను చూసి దేవకీ దేవి పరవశించి, మైమరచిపోగా, ఇదంతా గమనిస్తున్న రుక్మిణీ, తన పతి దేవుని శైశవ రూపాన్ని, ప్రపంచమంతా చూసి తరించాలని భావించి, వెంటనే విశ్వకర్మను పిలిపించి, ఆయా రూపాల్లో, శైశవ కృష్ణుడూ, బలరాముని విగ్రహాలను చేయించింది.


 ముందుగా తానే, సకల వైభవాలతో, విగ్రహాలను స్వయంగా పూజించింది. కృష్ణావతారం ముగిసింది. మరికొంత కాలానికి, ద్వారక సముద్రంలో మునిగిపోయే సమయం, ఆసన్నమైంది. దూరదృష్టితో అర్జునుడు, ఆ విగ్రహాలను తీసుకువెళ్లి, ఒక ప్రదేశంలో ప్రతిష్ఠించి, దానికి రుక్మిణీ వనం అని నామకరణం చేశాడు. 


కాలక్రమంలో, ఆ వనం యావత్తూ, గోపీ చందనం మట్టిలో కలిసి, కనుమరుగైపోయింది. నావికులు తమ నౌకల్లో, సమతూకాన్ని పాటించడం కోసం, గోపీ చందనం గడ్డల్ని మోసుకెళ్లే అలవాటు ప్రకారం, కాకతాళీయంగా, ఈ విగ్రహాలున్న గోపీ చందనం గడ్డల్ని కూడా, నౌకలోకి చేర్చారు. వాటి విలువ తెలియకుండానే, వాటిని తీసుకెళ్లే భాగ్యం, ఆ వ్యాపారికి లభించింది. ఆ విగ్రహం, ఆ నౌకలో వస్తోందని మధ్వాచార్యులవారి దివ్య దృష్టికి ముందే తెలుసు. ద్వాదశ స్తోత్రాన్ని రచిస్తూ, ఆ విగ్రహాలను ఆహ్వానించడానికే, ఆయన ఆరోజు, ఆ తీరానికి వెళ్లారు. శ్రీ కృష్ణుని ప్రతిమను మధ్వాచార్యులు, తమ శిష్యుల చేత, మాధవ సరోవరంలో, ప్రక్షాళన చేయించారు. తరువాత తానే స్వయంగా అభిషేకించారు. ఈ అభిషేకానికి మునుపు, నలుగురు శిష్యులు సునాయాసంగా ఎత్తిన ఆ విగ్రహం, మధ్వాచార్యుల వారు అభిషేకించిన తరువాత, 30 మంది కలిసినా ఎత్తడం సాధ్యం కాలేదు. ఎందుకంటే, మధ్వాచార్యుల అభిషేకంతో, ఆ విగ్రహంలో, శ్రీ కృష్ణుని దివ్య శక్తి పరిపూర్ణంగా ఏర్పడింది. 


 

మంత్ర విధులతో, మధ్వాచార్యులు అత్యంత శాస్త్రోకంగా, శ్రీ కృష్ణ విగ్రహాన్ని, విళంబి నామ సంవత్సరం, మాఘ శుక్ల తదియ నాడు, సామాన్య శకం, 1236 వ సంవత్సరంలో, ఉడిపిలో ప్రతిష్ఠింపజేశారు.


 ఆనాటి నుంచి, ఉడిపి ప్రాంత యాజ్ఞికులందరూ, శ్రీ మధ్వాచార్యుల వారు అవలంభించిన విధానాలనే, అనుసరిస్తున్నారు. శ్రీ కృష్ణ మఠంగా పిలువబడే ఈ దేవాలయానికి అనుబంధంగా, తన 8 మంది శిష్యులచే నిర్వహింపబడేటట్లుగా, పెజావరు మఠం, పుట్టిగే, పాలిమరు, ఆడమారు, సోదే, కాణియూరు, శిరూరు, కృష్ణ పురా అనే ఎనిమిది మఠాలను, శ్రీ మధ్వాచార్యులు ఏర్పరచారు. వీటిని అష్టపీఠాలు అంటారు. ఇవన్నీ, ఉడిపి కేంద్రంగా, శ్రీ కృష్ణ మఠానికి చుట్టు ప్రక్కల ఉన్నాయి.


సేకరణ

మెదడుకు మేత.

  మెదడుకు మేత. పూరించండి

.

 *అన్నీ మూడు అక్షరాల పదాలే రావాలి.* 

1. బంగారం. ......డి.

2. లోహము. ......డి.

3. మాయాజాలం ......డి.

4. శబ్దము. ......డి.

5. కూరగాయ. .....డి.

6. దొంగతనం. ......డి.

7. మనోవేదన. ......డి.

8. దుకాణం. ......డి.

9. ఆదాయం. .......డి.

10. రద్దీ. .......డి.

11. నోటిలోభాగం ......డి.

12. పుష్పభాగం. .......డి.

13. జలుబు వల్ల. ......డి.

14. తోడుగా. .......డి.

15. మోస గాడు. ....... డి

16. నూర్చుట. ........డి.

17. మార్చుట ........డి.

18. కలసి ఉండుట. .......డి.

19. ఉత్సాహాం. ........డి.

20. రాచుకొను. ........డి.

21. తినుబండారం. .........డి

22. బరువు మోసే సాధనం. .....డి

23. పుల్లగా, కమ్మగా. .....డి

24. రాజస్థానీ వర్తకుడు. ........ డి

25. పండు. ....... డి

26. అదుపు చేయడం. ....... డి

27. చుట్టూ మూగడం. ..........డి

28. సామెత ..........డి

29. ఆంగ్ల హాస్యం. .........డి

30. పాత నాణెం. ........డి

31. గిరిజన జాతి. ........డి 

32. తలపాగా (హిందీలో)..........డి 

అన్నీ మూడు అక్షరాల పదాలే రావాలి……

పంచాంగం 19.06.2024 Wednesday.

 ఈ రోజు పంచాంగం 19.06.2024  Wednesday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం గ్రీష్మ ఋతు జ్యేష్ఠ మాస శుక్ల పక్ష: ద్వాదశి తిధి సౌమ్య వాసర: విశాఖ   నక్షత్రం సిద్ధ యోగ: బాలవ తదుపరి కౌలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


ద్వాదశి  ఉదయం 07:26 వరకు.

విశాఖ సాయంత్రం 05:18 వరకు.


సూర్యోదయం : 05:46

సూర్యాస్తమయం : 06:49


వర్జ్యం : రాత్రి 09:25 నుండి 11:05 వరకు.


దుర్ముహూర్తం : పగలు 11:51 నుండి మధ్యాహ్నం12:44 వరకు.


అమృతఘడియలు : పగలు  07:58 నుండి 09:40 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.


యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

 

ఈ రోజు రామలక్ష్మణ ద్వాదశి 



శుభోదయ:, నమస్కార:

ఏడు కొండల పేర్లు.

 తిరుమలలోని ఏడు కొండల పేర్లు..


1. శ్రీవారి ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు తెచ్చిన కొండ పేరు "గరుడాద్రి"


2. శ్రీ మహావిష్ణువు చేతిలో హతమయిన వృషభాసురుడి పేరిట " వృషభాద్రి" .


3. హనుమంతుని తల్లి అంజనీ దేవి తపమాచరించిన కొండగా " అంజనాద్రి"


4. కొండపై తొలిసారి తలనీలాలు ఇచ్చిన భక్తురాలు నీలాంబరి పేరిట "నీలాద్రి"


5. ఆదిశేషుడి పేరిట " శేషాద్రి"


6. పాపాలను దహించే (వేం=పాపాలను, కట:=దహించునది) కొండగా "


వేంకటాద్రి:


7. పుష్కరిణి తీరాన తపస్సు చేసిన భక్తుడు నారాయణుడు పేరిట "నారాయణాద్రి "