19, జూన్ 2024, బుధవారం

100 భాషలలో ప్రావీణ్యం.

 కాస్త ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మాట్లాడగలిగితే చాలు...కాళ్ళు నేల మీదుండవు యువతకు.


యా...యప్...నోప్...

యు నో...కె.కె......డ్యూడ్...బ్రో...


ఇలా మాడ్లాడేస్తూ...మెసేజీ లు చేస్తుంటారు వాట్స్ అప్పుల్లో.


100 భాషలలో పాండిత్యం అన్నది విన్నారా మీరు ఎక్కడైనా!


ఆలాంటి వ్యక్తి ఒకరుండేవారని కూడా తెలియదేమో!


ఆయనెంతటి విద్వాంసుడో!


కాకపోతే...ఎంత విద్వత్తు ఉందో...అంత వినయమూ ఉంది. బాహ్యాడంబరాలు....అసలు తెలియవు.


ఆయన తెలుగు, సంస్కృతం లలో ఎం.ఏ.అని.....వేదాలు, మహాభాష్యం, బ్రహ్మసూత్రాలు..అభ్యసించి...


షుమారు 100 భాషలు తెలిసిన మహామేధావి అని ఎప్పుడూ...ఎవరికీ చెప్పుకోలేదు. 


ఒరియా, బెంగాలీ, అస్సామీ లే కాక...ఫ్రెంచ్, గ్రీక్, జపనీస్, జర్మన్, లాటిన్, చైనీస్....ఇలా బహు భాషా కోవిదుడు.


ఆయనే వచన రచనకు మేస్త్రీ....మల్లాది రామకృష్ణ శాస్త్రి.


ఓ రోజున ఆరుద్ర నేరుగా...గురువుగారూ మీకసలు ఎన్ని భాషలు తెలుసును? అని అడిగారు. 


దానికి సమాధానంగా శాస్త్రిగారు జాబితా రాసుకోమని చెబితే,.... 


అప్పుడు ఆరుద్ర... 

అలా కాదు. మీకెన్ని భాషల్లో కవిత్వం చెప్పగల సాధికారత ఉందో, అన్ని భాషల్లోనూ ఈ విసనకర్ర ఆకులపై ఒక్కో ఆకుమీద ఒక్కో సంతకం చొప్పున ఆయా భాషల్లోనే చేసివ్వండి...


అంటూ తాటాకు విసనకర్రను, ఇంకు పాళీ కలాన్ని ఆయన చేతికి ఇచ్చారు. 


అప్పుడు శాస్త్రిగారు ఒక్కో ఆకుమీద ఒక్కో భాషలో సంతకం చేస్తూపోతే మొత్తంగా ఆ తాటాకు విసనకర్రకు రెండు వైపులా ఉన్న ఆకులన్నీ నిండిపోయాయి! 


ఇది స్వయంగా రామకృష్ణశాస్త్రిగారి పెద్ద కుమారుడు మల్లాది నరసింహశాస్త్రిగారు చెప్పిన విషయం. 


కనుక రామకృష్ణశాస్త్రిగారికి వందకు పైగా భాషల్లో కవిత్వం చెప్పగలిగిన పాండిత్యం ఉండేదని నిష్కర్షగా చెప్పొచ్చు.


                                @@@@


అంతటి గొప్ప కవి....ఘోస్ట్ రచయితగా  ఉండేవారు సముద్రాల సీనియర్ కు.!


మల్లాది వారి ఎన్నో పాటలు....సముద్రాల వారి ఖాతాలో పడ్డాయంటే...


కారణం....ధనం.


విద్య కలవాడు, బలం కలవాడు, బలగం కలవాడు...

పసిడి గల వాడి బానిసలని అందుకే అన్నారు.


ఎంత పాండిత్యం ఉంటే ఏం లాభం.


సముద్రాల రాఘవాచార్య గారిని...ఏవిటండీ...శాస్త్రి గారి చేత పాటలు వ్రాయించుకుని....మీపేరు వేసుకుంటున్నారు?! అని అడిగితే...


ఇందులో తప్పేముంది. నాకు టైం లేదు. ఆయనకు డబ్బు అవసరం. అది నేనిచ్చి వ్రాయించుకుంటున్నాను.ఒక పండితుడికి అవకాశం ఇస్తున్నాను!...అనేవారట.


తన పేరు మీద రాని పాటలు...తనవి అని ఎప్పుడూ చెప్పుకోలేదు శాస్త్రి గారు. ఆ మాటలే చెప్తాయి అవి ఎవరు వ్రాశారో!


ఏమో తటిల్లతిక మేమెరుపు...

మేడలోనే అల పైడిబొమ్మా.....ఇలాంటి పదాలు ఇక ఎవ్వరూ వ్రాయలేరు..ఆ మాటల మేస్త్రీ తప్ప!


అసలు కుడి ఎడమైతే...పాటకు అర్థమేమిటండీ? అని అడిగితే....ఆ తాగుబోతు వాడి పాటకు అర్థాలు కూడానా...అని నవ్వుతూ తప్పుకునేవారు శాస్త్రి గారు.


శాస్త్రి గారి పేరు మీద మహా అయితే ఒక 200 పాటలు వచ్చిఉంటాయి. కానీ అజ్ఞాతం గా ఎన్నో పాటలు వ్రాశారు!


1967 లో రహస్యం మూవీ లోని గిరిజా కళ్యాణం యక్షగానం శాస్త్రి గారిదే. కాకపోతే...ఆయన ఎప్పుడో ముందే వ్రాసిపెట్టినది..ఆ సినిమాలో వాడుకున్నారు.


                              @@@@


100 భాషలలో ప్రావీణ్యం.....

వేదాల ఔపోసన,...

బ్రహ్మ సూత్రాలు...

మహాభాష్య జ్ఞానం...

మహా గ్రంథాల రచయిత....


ఇవేవీ కూడా....ఆ మహానుభావుని...దారిద్ర్యానికి బలి కాకుండా ఆపలేక పోయాయి!


కేవలం....

లౌక్య రాహిత్యం,... 

త్యాగశీలత,... 

అతి మంచి తనం,... 

నిస్వార్థత.....


ఇవి చాలు....కలిలో....కడతేరి పోవడానికి!


వారి వ్యక్తిగత జీవితం దుర్భరం అయినది. వారి భావాలు నచ్చకనో లేక వారికి కలిగిన వేదాంత ధోరణి వల్లో, భార్యా భర్తలు విడిపోయారు. 


ఆయన జీవితంలోని విషాదమంతా దేవదాసులోని పాటలో ప్రతిబింబిస్తుంది..... 


అన్నిటినీ, అందరినీ పోగొట్టుకొని, 'తన వారు పరులైన' జీవితాన్ని అనుభవించిన ఈ మహాకవి...


12-09-1965 న కీర్తిశేషులయ్యారు.


16- 6- 1905.....కీ.శే. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి జయంతి.


స్మృత్యంజలి.🌹


                                  @@@@


మల్లాది వారి అద్భుతమైన విరహ గీతం...

వారికి నా స్వర నివాళి.🌹


చిత్రం - జయభేరి.(1959).

రచన - మల్లాది రామకృష్ణ శాస్త్రి.

సంగీతం - పెండ్యాల.

గానం - ఘంటసాల. 


రాగమయి రావే అనురాగమయి రావే

రాగమయి రావే అనురాగమయి రావే

రాగమయి రావే.. 


నీలాల గగనాన నిండిన వెన్నెల ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

నీలాల గగనాన నిండిన వెన్నెల

నీ చిరునవ్వుల కలకల లాడగా

రాగమయి రావే అనురాగమయి రావే

రాగమయి రావే.. 


చివురులు  మేసిన చిన్నారి కోయిల మరి మరి మురిసే మాధురి నీవే

చివురులు మేసిన చిన్నారి కోయిల మరి మరి మురిసే మాధురి నీవే

తనువై మనసై నెలరాయనితో కలువలు కులికే సరసాలు నీవే సరసాలు నీవే సరాగాలు నీవే

రాగమయి రావే అనురాగమయి రావే

రాగమయి రావే... 


సంజెలలో సంజెలలో

హాయిగా సాగే చల్లని గాలిలో

మరుమల్లెల విరజాజుల పరిమళమే నీవు

చిలుగే సింగారమైన చుక్క చన్నెలు అంబరాన ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

చిలుగే సింగారమైన చుక్క చన్నెలు అంబరాన

సంబరపడు చక్కిలిగింతల పరవశమే నేను నవ పరిమళమే నీవు

రావే రాగమయి నా అనురాగమయి

రావే రాగమయి నా అనురాగమయి.. 


నీడచూసి నీవనుకొని పులకరింతునే అలవికాని మమతలతో కలువరింతునే

నీ కోసమే ఆవేదన నీ రూపమే ఆలాపన

కన్నెలందరు కలలుకనే అందాలన్ని నీవే

నిన్నందుకొని మైమరిచే ఆనందమంతా నేనే

రావే రాగమయి నా అనురాగమయి

రావే రాగమయి నా అనురాగమయి


🌹🌿🌹🌿🌹🌿

కామెంట్‌లు లేవు: