25, ఆగస్టు 2021, బుధవారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*978వ నామ మంత్రము* 24.8.2021


*ఓం త్రిపురా శ్రీవశంకర్యై నమః*


పంచమచక్రమైన సర్వార్థ సాధక చక్ర అధిష్ఠాన దేవత అయిన త్రిపురాశ్రీని వశము చేసికొన్న జగదీశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *త్రిపురాశ్రీవశంకరీ* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం త్రిపురాశ్రీవశంకర్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధనచేయు భక్తులకు ఆ పరమేశ్వరి శాంతిసౌఖ్యములు, సిరిసంపదలు, వంశాభివృద్ధి అనుగ్రహించును.


శ్రీచక్రమునందలి పంచమ చక్రము సర్వార్థసాధక చక్రము. ఇది శ్రీచక్రంలోని తొమ్మిది ఆవరణలలో ఐదవ ఆవరణ. ఈ సర్వార్థసాధక చక్రము పది కోణములు గల పద్మము. దీన్ని బహిర్దశారము అంటారు. దీనిలోని పదికోణాలు విష్ణుమూర్తి యొక్క పది అవతారాలకు ప్రతీక. ఇందులో ఉండే దేవతలు.


1.సర్వసిద్ధిప్రద  

2.సర్వసంపత్రద  

3.సర్వసౌభాగ్యదాయిని

4.సర్వపియంకరి 

5. సర్వకామప్రద

6. సర్వదుఃఖవిమోచని

7. సర్వమృత్యుప్రశమని 

8. సర్వవిఘ్ననివారిణి

9. సర్వాంగసుందరి

10.సర్వమంగళకారిణి


ఈ ఆవరణకు అధిదేవత *త్రిపురాశ్రీ*. ఇక్కడ ఉండే యోగిని పేరు కులోతీర్ణయోగిని.


తొమ్మిది ఆవరణలలోని అధిదేవతలు అమ్మవారి వశంలో ఉందురు. అలాగే ఐదవ ఆవరణ అధిదేవతయైన త్రిపురాశ్రీ అమ్మవారి వశంలో ఉంటుంది గనుక పరమేశ్వరి *త్రిపురాశ్రీవశంకరీ* యని అనబడినది.


పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం త్రిపురాశ్రీవశంకర్యై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

సంస్కృత మహాభాగవతం*

 *23.08.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - మొదటి అధ్యాయము*


*యదువంశమునకు ఋషుల శాపము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*1.17 (పదిహేడవ శ్లోకము)*


*తచ్ఛ్రుత్వా తేఽతిసంత్రస్తా విముచ్య సహసోదరమ్|*


*సాంబస్య దదృశుస్తస్మిన్ ముసలం ఖల్వయస్మయమ్॥12183॥*


మునుల వచనములను విన్నంతనే ఆ యదుకుమారులు మిగుల భీతిల్లిరి. వెంటనే వారు సాంబుని చూడగా వారికి ఒక ఇనుప ముసలము కనబడెను.


*1.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*కిం కృతం మందభాగ్యైర్నః కిం వదిష్యంతి నో జనాః|*


*ఇతి విహ్వలితా గేహానాదాయ ముసలం యయుః॥12184॥*


అంతట వారు ఖిన్నులై 'నిజముగా మనము బుద్ధిహీనులము. దురదృష్ట వంతులము. ఎంతటి తగనిపని చేసితిమి. మనము చేసిన ఈ పిచ్చిపనికి మన పెద్దలు మనలను ఎంతగా నిందింతురోగదా!' అని ఆందోళన చెందుచు ఆ ముసలమును దీసికొని తమ ఇండ్లకు చేరిరి.


*1.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*తచ్చోపనీయ సదసి పరిమ్లానముఖశ్రియః|*


*రాజ్ఞ ఆవేదయాంచక్రుః సర్వయాదవసన్నిధౌ॥12185॥*


అనంతరము ఆ యదుకుమారులు దానిని రాజసభకు తీసికొనివెళ్ళిరి. అప్పుడు వారి ముఖములు వాడిపోయియుండెను. వారు ఆ సభలోనే సమస్త యాదవుల సమక్షమున తామొనర్చిన మహాపరాధమును, తత్ఫలితముగా లభించిన మునుల శాపమును ఉగ్రసేన మహారాజునకు సమగ్రముగా వివరించిరి.


*1.20 (ఇరువదియవ శ్లోకము)*


*శ్రుత్వామోఘం విప్రశాపం దృష్ట్వా చ ముసలం నృప|*


*విస్మితా భయసంత్రస్తా బభూవుర్ద్వారకౌకసః॥12186॥*


పరీక్షిన్మహారాజా! తిరుగులేని ఆ విప్రోత్తముల శాపమును విని, ముసలమును గాంచి, ఆ ద్వారకానగర వాసులందరును ఎంతయు భయసంభ్రమములకు లోనై గజగజవణికిపోయిరి.


*1.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*తచ్చూర్ణయిత్వా ముసలం యదురాజః స ఆహుకః|*


*సముద్రసలిలే ప్రాస్యల్లోహం చాస్యావశేషితమ్॥12187॥*


అంతట యాదవరాజైన ఉగ్రసేనుడు ఆ ముసలమును పిండిపిండిగావించి, ఆ చూర్ణమును మిగిలియున్న ఇనుపముక్కను సముద్ర జలములలో పడవేయించెను.


*1.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*కశ్చిన్మత్స్యోఽగ్రసీల్లోహం చూర్ణాని తరలైస్తతః|*


*ఉహ్యమానాని వేలాయాం లగ్నాన్యాసన్ కిలైరకాః॥12188॥*

పరీక్షిన్మహారాజా! ఆ లోహపుముక్కను ఒక చేప మ్రింగెను. ఆ చూర్ణపు రేణువులు అలలకు కొట్టుకొనివచ్చి తీరమునకు (ఒడ్డునకు) చేరెను. అవి తుంగగడ్డిగా మొలిచెను.


*1.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*మత్స్యో గృహీతో మత్స్యఘ్నైర్జాలేనాన్యైః సహార్ణవే|*


*తస్యోదరగతం లోహం స శల్యే లుబ్ధకోఽకరోత్॥12189॥*


జాలరులు వలవేసి సముద్రము నందలి ఇతర చేపలతో పాటు, ఈ మత్స్యమును (ఇనుపముక్కను మ్రింగిన మత్స్యమును) గూడ పట్టుకొనిరి. దాని కడుపులోని లోహపుముక్కను ఒక వేటగాడు తన బాణమునకు ములికగా చేసెను.


*1.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*భగవాన్ జ్ఞాతసర్వార్థ ఈశ్వరోఽపి తదన్యథా|*


*కర్తుం నైచ్ఛద్విప్రశాపం కాలరూప్యన్వమోదత॥12190॥*


శ్రీకృష్ణభగవానుడు సర్వజ్ఞుడు. ఆ విప్రశాపమును అన్యథా చేయుటకును సమర్థుడు. కానీ కాలపురుషుడైన ఆ ప్రభువు అట్లొనర్పక ఆ శాపమును ఆమోదించెను (ఆ శాపవిషయమును పట్టించుకొనక నిర్లిప్తుడై యుండెను).


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే ప్రథమోఽధ్యాయః (1)*


ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి *యదువంశమునకు ఋషుల శాపము* అను

మొదటి అధ్యాయము (1)


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని మొదటి అధ్యాయము ఇంకను కొనసాగును)

*24.08.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - రెండవ అధ్యాయము*


*జనకమహారాజునకును - తొమ్మిదిమంది యోగీశ్వరులకును మధ్య జరిగిన సంవాదమును తెలుపుట - నారదుడు వసుదేవునివద్దకు వచ్చుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*


*2.1 (ప్రథమ శ్లోకము)*


*గోవిందభుజగుప్తాయాం ద్వారవత్యాం కురూద్వహ|*


*అవాత్సీన్నారదోఽభీక్ష్ణం కృష్ణోపాసనలాలసః॥12191॥*


*శ్రీశుకుడు వచించెను* పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుని బాహుబల రక్షణలో ద్వారకానగరము సకలసంపదలతో వర్ధిల్లుచుండెను. శ్రీకృష్ణుని దర్శించుటయందు మిక్కిలి ఔత్సుక్యముగల నారదమహర్షి ఆ నగరమునకు పదే పదే విచ్చేయుచు అచట నివసించుచుండెడి వాడు.


*2.2 (రెండవ శ్లోకము)*


*కో ను రాజన్నింద్రియవాన్ ముకుందచరణాంబుజమ్|*


*న భజేత్సర్వతో మృత్యురుపాస్యమమరోత్తమైః॥12192॥*


మహారాజా! అమరులైన బ్రహ్మాది దేవతలకు సైతము శ్రీకృష్ణుని చరణాంబుజములు సర్వదా ఉపాస్యములు. ఇక అనుక్షణము మృత్యువుకోరలలో చిక్కుపడియుండెడి మానవుడు చక్షురాది ఇంద్రియములు కలవాడయ్యును కృష్ణప్రభు పాదారవిందములను ఎందుకు సేవింపకుండును?


*2.3 (మూడవ శ్లోకము)*


*తమేకదా తు దేవర్షిం వసుదేవో గృహాగతమ్|*


*అర్చితం సుఖమాసీనమభివాద్యేదమబ్రవీత్॥12193॥*


ఒకానొకప్పుడు దేవర్షి (నారదుడు) వసుదేవుని భవనమునకు ఏతెంచెను. అప్పుడు వసుదేవుడు ఆ మహర్షిని అర్ఘ్యపాద్యాదులతో అర్చించెను. పిమ్మట సుఖాసీనుడైయున్న ఆ మహామునికి ప్రణమిల్లి ఇట్లడిగెను.


*వసుదేవ ఉవాచ*


*2.4 (నాలుగవ శ్లోకము)*


*భగవన్ భవతో యాత్రా స్వస్తయే సర్వదేహినామ్|*


*కృపణానాం యథా పిత్రోరుత్తమశ్లోకవర్త్మనామ్॥12194॥*


*వసుదేవుడు పలికెను* "మహాత్మా! తల్లిదండ్రులయొక్క రాక (దర్శనము) వారి సంతానమునకు ఆనందదాయకము. భగవత్సాక్షాత్కారమును పొందిన మహానుభావులయొక్క ఆగమనము తాపత్రయ పీడితులైన దీనులకు శుభప్రదము. పూజ్యుడవైన నీవు సాక్షాత్తుగా భగవత్స్వరూపుడవు. పుణ్యపురుషుడవైన నీయొక్క సంచారము లోకకల్యాణకారకము.


*2.5 (ఐదవ శ్లోకము)*


*భూతానాం దేవచరితం దుఃఖాయ చ సుఖాయ చ|*


*సుఖాయైవ హి సాధూనాం త్వాదృశామచ్యుతాత్మనామ్॥12195॥*


ప్రాణులపట్ల దేవతల ప్రవృత్తి విచిత్రముగా ఉండును. తమను పూజించినప్పుడు సంతసించి ప్రాణులకు సుఖమును కూర్చెదరు. ఏదేని పొరపాటు సంభవించినచో కోపగించి దుఃఖముల పాలు చేయుదురు. కానీ, నిరంతరము కృష్ణధ్యాన పరాయణులైన మీవంటి సాధుపురుషుల సంచారము మాత్రము సకలప్రాణులకును కల్యాణదాయకమే అగును.


*2.6 (ఆరవ శ్లోకము)*


*భజంతి యే యథా దేవాన్ దేవా అపి తథైవ తాన్|*


*ఛాయేవ కర్మసచివాః సాధవో దీనవత్సలాః॥12196॥*


దేవతలు తమను సేవించిన మానవులకు తదనుగుణముగనే (సేవా తారతమ్యములను బట్టి) ఫలములను ప్రసాదించుచుందురు. ఏలయన వారు ఛాయవలె కర్మాధీనఫలములను ఇచ్చుచుండెడివారు. కాని మీవంటి సత్పురుషులు తాపత్రయ బాధితులయెడ సమానముగా ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండ అవ్యాజకృపను ప్రసరింపజేయుచుందురు.


*2.7 (ఏడవ శ్లోకము)*


*బ్రహ్మంస్తథాఽపి పృచ్ఛామో ధర్మాన్ భాగవతాంస్తవ|*


*యాన్ శ్రుత్వా శ్రద్ధయా మర్త్యో ముచ్యతే సర్వతోభయాత్॥12197॥*


మహాత్మా! నీ దర్శనభాగ్యము చేతనే మేము కృతార్థులమైతిమి. ఐనను భగవంతుడు ప్రసన్నుడగుటకై ఆచరించవలసిన ధర్మములను గూర్చి నిన్ను అడుగుచున్నాము. వాటిని భక్తిశ్రద్ధలతో (సావధానముగా) విన్నవారు వివిధములగు సాంసారిక భయములనుండి విముక్తులగుదురుగదా!


*2.8 (ఎనిమిదవ శ్లోకము)*


*అహం కిల పురాఽనంతం ప్రజాఽర్థో భువి ముక్తిదమ్|*


*అపూజయం న మోక్షాయ మోహితో దేవమాయయా॥12198॥*


మహర్షీ! నేను పూర్వజన్మమున దేవమాయా మోహితుడనై ముక్తికొరకుగాక సంతానప్రాప్తికై ఆ సర్వేశ్వరుని పూజించియుంటిని (ఈ విషయమును సూతాకాగృహమున కృష్ణపరమాత్మయే తెలిపియుందెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235g

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

ఒక్కడే యజమాని

 ఆ ఒక్కడే యజమాని..మరి మనమో? (నా అంతరంగ తరంగం)

.....................

నా ఇంటికి నేను యజమానా? తర్కించుకుంటే దొరికిన సమాధానం..కాదు అనే. ఆ మాటకు వస్తే ఎవరికి ఎవరూ యజమాని కాదు. అందరికీ యజమాని ఆ సర్వాంతర్యామే. మనమంతా సేవకులమే. నా భార్యకు, పిల్లలకు, తల్లిదండ్రులకు కూడా నేను సేవకుడినే. నేను యజమానిని అనుకుంటే నా పైన ఒకడు, అతనిపై మరొకడు, అతనిపై ఇంకొకడు, ఆపైన చిట్ట చివరన ఒకడు. ఇక లేడు. వాడే కదూ..యజమాని. సమస్త సృష్టిలో భౌతిక ప్రకృతి ఒక భాగం మాత్రమే. తక్కిన ప్రధాన భాగమంతా ఆధ్యాత్మిక ప్రకృతే. అలాంటి అవ్యక్తమైన వైకుంఠ ధామమే నా ధామం అన్నారు గీతా భగవానుడు. అందరూ అక్కడికే చేరాలనుకుంటారు. ఈ కనిపించే సృష్టి భగవానుడిదే అనుకుంటే సృష్టికి ముందు ఆయన ఉన్నట్టేగా. మరి...ఆయనే యజమాని అనడానికి అభ్యంతరం ఏముంది? భౌతిక దృష్టికి నువ్వు, నేను, తక్కిన వారు కుటుంబ యాజమానులమని చెప్పుకోవడం కద్దు. కానీ, నిజమైన యజమాని ఆయనే..అనే స్పృహ మాత్రం ఉండాలి. మన పైన యజమాని అని చెప్పుకునే వాళ్ళను ఆ విధంగానే చూదాలి, తప్పదు. కానీ ఆయన కూడా నీకు యజమాని కాదనే స్పృహ అంతరంలో ఉండాలి. ఏదో సాధించాలని మానవ జన్మ ఎత్తి, ఎంత సాధించినా తృప్తి లేని మనం, రాగం- విరాగంలోనే మగ్గిపోయి భళ్లున తెల్లారిటనట్టు ఎప్పుడు జీవితానికి తెరపడుతుందో తెలియని మనం యాజమానులం ఎలా అవుతాం? దాస దాసులం, దాసాను దాసులం. ఆ సకల జగన్నియంత ముందు ఏ నియంతా..నియంత కాదు. ఎవడూ యజమాని కాడు, కాలేడు. హరి ఓం.// ఆదూరి వేంకటేశ్వర రావు.

ముక్కలు చెయ్యమంటోంది

 కులపతి గారి ముఖపుస్తకము నుండి  


●గాంధార లో మతం మారారు ఆఫ్ఘనిస్తాన్ అయ్యింది

●సింధ్ లో మతం మారారు పాకిస్తాన్ అయ్యింది

●ఉత్తరంలో మతం మారారు టిబెట్ ముక్క అయ్యింది

●ఈశాన్యంలో మతం మారారు బర్మా ముక్కలు అయ్యింది

●బెంగాల్ లో మతం మారారు బంగ్లాదేశ్ గా మారింది

ఇప్పుడు...

కాశ్మీర్ లో మతం మారారు ఇంకొక ముక్క అవ్వబోతుంది

కేరళలో మతం మారారు - మరొక ముక్క కాబోతోంది

నాగాలాండ్ లో మతం మారారు - ముక్కలు చెయ్యమంటోంది

ముల్లాలు - పాస్టర్లు ఒక్కటే గోల 

మతం మారండి మతం మారండి అని.... 

మతం మారితే తెలియని పరలోకం ఏమో కాని , మిగిలిన భారత దేశం కూడా మరిన్ని ముక్కలు అవుతుంది.... 

మతం మారితే దేశాన్ని ముక్కలు చెయ్యడానికి సహాయం చేసినట్టే...

మతం మారితే దేశ ద్రోహం..... చరిత్ర లో.....

■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి 

-----> ఈజిప్ట్ నాగరికత నాశనం అయ్యింది

■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి

------> బాబిలోనియా నాగరికత నాశనం అయ్యింది

■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి

-------> పెర్షియన్ నాగరిత నాశనం అయ్యింది

■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి

--------> గ్రీకు నాగరికత నాశనం అయ్యింది

■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి

-------> మాయన్ నాగరికత నాశనం అయ్యింది

■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి

-------> ఆస్ట్రేలియా నాగరికత నాశనం అయ్యింది

■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి

--------> మంగోలియా నాగరికత నాశనం అయ్యింది


ప్రస్తుతం.....భారత్ లో

■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి

--------> అఖండ భారతం ముక్కలయ్యింది

■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి

--------> కుల గొడవలు పెంచారు

■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి

-------> సనాతన సామాజిక వ్యవస్థను కూల్చారు..కూలుస్తున్నారు

■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి

-------> మొత్తం దేశాన్ని అంతర్యుద్ధంలోకి నెట్టారూ.. నెడుతున్నారు

ఇకనైనా మేలుకోండి #హిందువులారా..... 

భారత దేశాన్ని కాపాడుకోండి......

అది మీ బాధ్యత.....

అఖండ భారత దేశంలో ప్రతి అంగుళం హిందువుల సొంతం.


జై భారత్ మాత....జై భారత్!!!

వైద్యనాథాష్టకము

 వైద్యనాథాష్టకము

పరమశివుడు వైద్యులకు అధిపతిగా కూడా పేరొందాడు. శ్రీ రుద్రాభిషేచనంలో చాలా భాగం దీన్ని వక్కాణిస్తుంది. నమకం, చమకంలో పూర్తి ప్రార్థన, ఫలితం కూడా రోగ నివారణ, ఆరోగ్యము, దీర్ఘాయుష్షు గురించి చెపుతాయి. అందుకనే శివుని వైద్యనాథుడిగా కొలుస్తారు. దీనికి జ్యోతిర్లింగ స్వరూపమే మహారాష్ట్ర అంబజోగై సమీపం లోని వైద్యనాథ దేవాలయం. అలాగే, తమిళనాట చిదంబరం దగ్గర వైదీశ్వరన్ కోవిల్ ఈ స్వామి మహాత్మ్యాన్ని తెలిపేదే.
జటాయు అంత్యక్రియలు, కుష్ఠు వ్యాధితో బాధపడుతున్న అంగారకునికి (కుజ గ్రహం) రోగ నివారణ ఇక్కడే జరిగాయని గాథ. సుబ్రహ్మణ్యునికి శూలము కూడా ఇక్కడ శివుని ప్రార్థించిన తర్వాతే లభించిందని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఇక్కడి సిద్ధామృత తీర్థం (పుష్కరిణిలో నీరు), అంగసనాతన తీర్థంలో స్నానం చేసి, వేప చెట్టు క్రింద మట్టి తీసుకుని పవిత్ర భస్మముతో కలిపి దేవునికి సమర్పించి ఆ సిద్ధామృత తీర్థంతో తీసుకుంటే సర్వ రోగ నివారణ అవుతుందని గట్టి విశ్వాసంv. అలాగే ఆ వైద్యనాథుని ఈ క్రింది స్తోత్రము రోజుకు మూడు సార్లు చదివితే ఆరోగ్యం కలుగుతుందట. అంతటి మహిమాన్వితమైన వైద్యనాథ అష్టకం, తాత్పర్యము మీకోసం.
శ్రీ రామ సౌమిత్రి జటాయు వేద
షడాననాదిత్య కుజార్చితయ
శ్రీ నీలకంఠాయ దయామయాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ
తాత్పర్యము: శ్రీ రాముడు, లక్ష్మణుడు, జటాయువు, వేదములు, సుబ్రహ్మణ్య స్వామి, సూర్యుడు, అంగారకుడిచే పూజించబడిన, నీలకంఠము కలవాడు, దయామయుడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములుl.
గంగా ప్రవాహేందు జటాధరయ
త్రిలోచనాయ స్మర కాల హంత్రే
సమస్త దేవైరపి పూజితాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ
తాత్పర్యము: ప్రవహించే గంగను, చంద్రుని జటా ఝూటములో ధరించిన, మూడు కన్నులు కలవాడు, మన్మథుని, యముని సంహరించిన వాడు, దేవతలందరి చేత పూజించ బడినవాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.
భక్త ప్రియాయ త్రిపురాంతకాయ
పినాకినీ దుష్ట హరాయ నిత్యమ్
ప్రత్యక్ష లీలాయ మనుష్య లోకే
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ
తాత్పర్యము: భక్త ప్రియుడు, త్రిపురములను నాశనము చేసిన వాడు, పినాకమును (త్రిశూలమును) చేతిలో ధరించిన వాడు, నిత్యము దుష్టులను సంహరించే వాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.
ప్రభూత వాతాది సమస్త రోగ
ప్రణాశ కర్త్రే ముని వందితాయ
ప్రభాకరేంద్ర్వగ్ని విలోచనాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ
తాత్పర్యము: వాతము, కీళ్ళనొప్పులు మొదలగు రోగములను నాశనము చేసే వాడు, మునులచే పూజించబడిన వాడు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని నేత్రములుగా కలవాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.
వాక్శ్రోత్ర నేత్రాంఘ్రి విహీన జంతోః
వాక్శ్రోత్ర నేత్రాంఘ్రి సుఖ ప్రదాయ
కుష్ఠాది సర్వోన్నత రోగ హంత్రే
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ
తాత్పర్యము: వాక్కు, వినికిడి శక్తి, కాంతి చూపు, నడిచే శక్తి కోల్పోయిన జీవ రాశులకు ఆ శక్తులను తిరిగి కలిపించే వాడు, కుష్ఠు మొదలగు భయంకరమైన రోగములను నిర్మూలము చేసి ఆరోగ్యాన్ని ప్రసాదించే వాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.
వేదాంత వేద్యాయ జగన్మయాయ
యోగీశ్వర ధ్యేయ పదాంబుజాయ
త్రిమూర్తి రూపాయ సహస్ర నామ్నే
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ
తాత్పర్యము: వేదముల ద్వారా తెలుసుకొనే దైవము, విశ్వమంతా వ్యాపించి యున్నవాడు, యోగులచే ధ్యానింపబడిన పాద పద్మములు కలిగిన వాడు, త్రిమూర్తుల రూపమైన వాడు, సహస్ర నామములు కలవాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.
స్వతీర్థ మృడ్భస్మ భృతాంగ భాజాం
పిశాచ దుఃఖార్తి భయాపహాయ
ఆత్మ స్వరూపయ శరీర భాజాం
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ
తాత్పర్యము: ఆయన దేవాలయమున ఉన్న పుణ్య పుష్కరిణీ స్నానము వలన, వేపచెట్టు క్రింద మట్టి మరియు భస్మము వలన - భూత ప్రేతముల బాధ, దుఃఖములు, కష్టములు, భయములు, రోగములు తొలగించే, ఆత్మ స్వరూపుడై దేహము నందు నివసిస్తున్న, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.
శ్రీ నీలకంఠాయ వృష ధ్వజాయ
స్రక్గంధ భస్మాద్యభి శోభితాయ
సుపుత్రదారాది సుభాగ్యదాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ
తాత్పర్యము: నీలకంఠుడు, వృషభమును (ఎద్దును) పతాకమందు చిహ్నముగా కలవాడు, పుష్పములు, గంధము, భస్మముచే అలంకరించబడి శోభిల్లే వాడు, సుపుత్రులు, మంచి ధర్మపత్ని, సత్సంపదలు, అదృష్టములు ఇచ్చే వాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములుl.
ఫల శ్రుతిః
బాలాంబికేశ వైద్యేశ భవ రోగ హరేతి చ
జపేన్నామ త్రయం నిత్యం మహారోగ నివారణం
ఫల శృతి: బాలాంబిక పతి, జరామరణముల భయమును పోగొట్టేవాడు అయిన వైద్యనాథుని ఈ వైద్యనాథాష్టకం ప్రతి దినము మూడు సార్లు పఠించే వారికి సకల రోగ నివారణ కలుగును.
(సేకరణ)

ముకుందమాల స్తోత్రమ్ శ్లోకం : 29 h

 ॐ मुकुन्दमाला स्तोत्रम्   

           ముకుందమాల స్తోత్రమ్ 

       Mukunda Mala Stotram    


                                    శ్లోకం : 29    

                           SLOKAM : 29  

                                                

मदन परिहर स्थितिं मदीये

मनसि मुकुन्दपदारविन्दधाम्नि ।

हरनयनकृशानुना कृशोऽसि

स्मरसि न चक्रपराक्रमं मुरारेः ॥ २९॥


మదన పరిహర స్థితిం మదీయే 

మనసి ముకుంద పదారవింద ధామ్ని I    

హరనయన కృశానునా కృశోఽసి 

స్మరసి న చక్రపరాక్రమం మురారే:।। 29    


ఓ మన్మథుడా! 

    భగవంతుని పాదారవిందాలను ధ్యానించు నా మనస్సులో మోహం కలిగించకు. 

    హరుని కంటి మంటలకన్నా తీక్షణమైన నారాయణుని సుదర్శన చక్రం యొక్క శక్తిని నీ వెరుగకున్నావేమో!    


O Cupid, 

    abandon your residence in my mind, which is now the home of Lord Mukunda’s lotus feet. 

    You have already been incinerated by Lord Śiva’s fiery glance, 

    so why have you forgotten the power of Lord Murāri’s disc?  



https://youtu.be/ZTs6tcgm0lE  


                                        కొనసాగింపు  


                    =x=x=x=    


    — రామాయణంశర్మ    

             భద్రాచలం

భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏

 *24.08.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2240(౨౨౪౦)*


*10.1-1350-వ.*

*10.1-1351*


*క. వల్లవులు పెనఁగి రున్నత*

*గల్లులతో భిన్నదిగిభకరవల్లులతో*

*మల్లురతో రిపుమానస*

*భల్లులతో భీతగోపపల్లులతోడన్.* 🌺



*_భావము: ఈ విధముగా మదించిన చెక్కిళ్ళు కలవారు, దిగ్గజముల తొండములను ఛేదించగల ఇనుప కడ్డీల వంటి చేతులు కలవారు, శత్రువుల మనస్సులకు బల్లెముల వంటివారు, గోపాలకులను భయభ్రాంతులకు లోను చేయగలవారగు మల్ల యోధులతో గోపబాలకులైన బలరామకృష్ణులు పెనుగులాడారు._* 🙏



*_Meaning: Balarama and Sri Krishna fought with those two wrestlers, who have powerful jaws, iron rods like hands with which they can break the trunks of wild elephants, who appeared like spears in minds of their foes and who generated fear and terror in the cowherds._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

స్పెషల్ ఐటం

 రేపు బ్రేక్ ఫాస్ట్ కి రారా ..

తను స్పెషల్ ఐటం చేస్తోంది ..

"నిన్న రాత్రి ఫోన్ చేసాడు మా ఫ్రెండ్ గాడు .

ఎప్పుడూ లేనిది మా ఫ్రెండ్ గాడు ఆప్యాయంగా పిలిచాడు. వాడిలోనూ ఇలాంటి ఓ మంచి యాంగిల్ వుందని హ్యాపీ గా అనిపించింది. పైగా ఎదో స్పెషల్ చేయించాడని  పొద్దున్నే వాకింగ్ ఫినిష్ చేసి వాడింటికి  పోయాను.

పలకరించి నేను కూర్చోగానే కాఫీ తెచ్చి ఇచ్చిన వాళ్లావిడతో  

*ఇదిగో ఆ boiled chick peas mix with tempering spices and onions* తీసుకురా కాస్త  స్పైసీ గా వుండాలి

అని వీడు అన్నాడు .

స్టార్ హోటల్ మెన్యు ఆర్డర్ లా వీడు చెప్పిన ఐటెం ఏంటో నాకు అర్ధం అయ్యేలోగా వాళ్ళావిడ 

ఉడక బెట్టి పోపేసి ఉల్లిపాయ చల్లిన శనగల గిన్నె తెచ్చి బల్లమీద పెడుతూ ..

"నిన్న శ్రావణ శుక్రవారం అని నలుగురు ఇళ్ళకి పేరంటానికి వెళ్ళా అన్నయ్యగారు .

వాయనంగా శనగలు బోల్డు పోగయ్యాయి.

ఇన్నేం చేసుకుంటాం, పని మనిషికి, వీధి వూడ్చే పిల్లలకి  ఇచ్చేస్తానంటే ఈయన గారు ఎగిరిపడి  వేస్ట్ చేస్తావా. బుద్ధిలేదా అని ఆవిడ చెబుతుంటే 

*చెప్పింది చాలు గాని నిమ్మకాయ ముక్క తీసుకురా* అని ఆవిడని తరిమేసి 

*లైట్ గా లెమెన్ పిండి, పెప్పర్ జల్లుకుంటే, ఈ బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఈ సీజన్ లోనే దొరుకుతుంది* వేడిగా తినచ్చు అండ్ చల్లగాను చెబుతున్నాడు వెధవ.

ఖర్మ.  వీడి బ్రేక్ఫాస్ట్ నమ్ముకుని ఇంట్లో చేసిన పూరీలు పని పిల్లకి ఇచ్చేమన్న  నన్ను నేను తిట్టుకుని ఉడక బెట్టిన వాయనం శనగలు తినటం మొదలెట్టా🤦🏽🤦🏽🤦🏽

Decided ఈ శ్రావణ మాసం అయ్యేవరకు ఎవడి కొంప కేసి చూడకూడదు / రాకూడదు అని. 🤨