25, ఆగస్టు 2021, బుధవారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*978వ నామ మంత్రము* 24.8.2021


*ఓం త్రిపురా శ్రీవశంకర్యై నమః*


పంచమచక్రమైన సర్వార్థ సాధక చక్ర అధిష్ఠాన దేవత అయిన త్రిపురాశ్రీని వశము చేసికొన్న జగదీశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *త్రిపురాశ్రీవశంకరీ* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం త్రిపురాశ్రీవశంకర్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధనచేయు భక్తులకు ఆ పరమేశ్వరి శాంతిసౌఖ్యములు, సిరిసంపదలు, వంశాభివృద్ధి అనుగ్రహించును.


శ్రీచక్రమునందలి పంచమ చక్రము సర్వార్థసాధక చక్రము. ఇది శ్రీచక్రంలోని తొమ్మిది ఆవరణలలో ఐదవ ఆవరణ. ఈ సర్వార్థసాధక చక్రము పది కోణములు గల పద్మము. దీన్ని బహిర్దశారము అంటారు. దీనిలోని పదికోణాలు విష్ణుమూర్తి యొక్క పది అవతారాలకు ప్రతీక. ఇందులో ఉండే దేవతలు.


1.సర్వసిద్ధిప్రద  

2.సర్వసంపత్రద  

3.సర్వసౌభాగ్యదాయిని

4.సర్వపియంకరి 

5. సర్వకామప్రద

6. సర్వదుఃఖవిమోచని

7. సర్వమృత్యుప్రశమని 

8. సర్వవిఘ్ననివారిణి

9. సర్వాంగసుందరి

10.సర్వమంగళకారిణి


ఈ ఆవరణకు అధిదేవత *త్రిపురాశ్రీ*. ఇక్కడ ఉండే యోగిని పేరు కులోతీర్ణయోగిని.


తొమ్మిది ఆవరణలలోని అధిదేవతలు అమ్మవారి వశంలో ఉందురు. అలాగే ఐదవ ఆవరణ అధిదేవతయైన త్రిపురాశ్రీ అమ్మవారి వశంలో ఉంటుంది గనుక పరమేశ్వరి *త్రిపురాశ్రీవశంకరీ* యని అనబడినది.


పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం త్రిపురాశ్రీవశంకర్యై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: