రేపు బ్రేక్ ఫాస్ట్ కి రారా ..
తను స్పెషల్ ఐటం చేస్తోంది ..
"నిన్న రాత్రి ఫోన్ చేసాడు మా ఫ్రెండ్ గాడు .
ఎప్పుడూ లేనిది మా ఫ్రెండ్ గాడు ఆప్యాయంగా పిలిచాడు. వాడిలోనూ ఇలాంటి ఓ మంచి యాంగిల్ వుందని హ్యాపీ గా అనిపించింది. పైగా ఎదో స్పెషల్ చేయించాడని పొద్దున్నే వాకింగ్ ఫినిష్ చేసి వాడింటికి పోయాను.
పలకరించి నేను కూర్చోగానే కాఫీ తెచ్చి ఇచ్చిన వాళ్లావిడతో
*ఇదిగో ఆ boiled chick peas mix with tempering spices and onions* తీసుకురా కాస్త స్పైసీ గా వుండాలి
అని వీడు అన్నాడు .
స్టార్ హోటల్ మెన్యు ఆర్డర్ లా వీడు చెప్పిన ఐటెం ఏంటో నాకు అర్ధం అయ్యేలోగా వాళ్ళావిడ
ఉడక బెట్టి పోపేసి ఉల్లిపాయ చల్లిన శనగల గిన్నె తెచ్చి బల్లమీద పెడుతూ ..
"నిన్న శ్రావణ శుక్రవారం అని నలుగురు ఇళ్ళకి పేరంటానికి వెళ్ళా అన్నయ్యగారు .
వాయనంగా శనగలు బోల్డు పోగయ్యాయి.
ఇన్నేం చేసుకుంటాం, పని మనిషికి, వీధి వూడ్చే పిల్లలకి ఇచ్చేస్తానంటే ఈయన గారు ఎగిరిపడి వేస్ట్ చేస్తావా. బుద్ధిలేదా అని ఆవిడ చెబుతుంటే
*చెప్పింది చాలు గాని నిమ్మకాయ ముక్క తీసుకురా* అని ఆవిడని తరిమేసి
*లైట్ గా లెమెన్ పిండి, పెప్పర్ జల్లుకుంటే, ఈ బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఈ సీజన్ లోనే దొరుకుతుంది* వేడిగా తినచ్చు అండ్ చల్లగాను చెబుతున్నాడు వెధవ.
ఖర్మ. వీడి బ్రేక్ఫాస్ట్ నమ్ముకుని ఇంట్లో చేసిన పూరీలు పని పిల్లకి ఇచ్చేమన్న నన్ను నేను తిట్టుకుని ఉడక బెట్టిన వాయనం శనగలు తినటం మొదలెట్టా🤦🏽🤦🏽🤦🏽
Decided ఈ శ్రావణ మాసం అయ్యేవరకు ఎవడి కొంప కేసి చూడకూడదు / రాకూడదు అని. 🤨
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి