15, ఆగస్టు 2021, ఆదివారం

పర్యవసానం

 దేశ విభనకు ఒప్పుకున్న తరువాత జరగబోయే సంఘటనలు ఊహించడం లో కానీ వాటిని ఎదుర్కోడానికి సరైన ప్రణాళికలు రచించడంలో కానీ పూర్తిగా విఫలమయ్యారు నాటి పెద్దలు. 


పర్యవసానం?


కొన్ని లక్షల మంది హిందువులు ఊచకోత కాబడ్డారు. ఎంత మంది చనిపోయి వుంటారో లెక్కలు కూడా లేవు. పాకిస్తాన్ లో ఉండే హిందూ, సిఖ్ నిరుపేదలే కాదు కోటీశ్వరులు కూడా ఆస్తులు అన్ని వదలుకొని కట్టుబట్టలతో భారత్ కు కాందిశీకులు గా బయలుదేరారు.


మనం దక్షిణాది వారం అదృష్టవతులం.


ముఘల్ దండయాత్రల అప్పుడు కానీ దేశ విభజన జరిగినప్పుడు కానీ, చైనా దండయాత్ర అప్పుడు కానీ మనం ఉత్తరాది వారు అనుభవించిన కష్టాల్లో ఒక్క శాతం కూడా అనుభవించలేదు. అందుకే మనకు దేశభక్తి, హిందూ పదం అంటే అంత నిర్లక్ష్యం.


లక్షల మంది హిందువులు పాకిస్తాన్ లో అన్ని వదులుకుంది కి సిద్ధపడ్డారు కానీ మెడ మీద కత్తి పెట్టినా తమ హిందూ ధర్మం వదులుకోడానికి సిద్ధపడలేదు.. 


అందుకే అక్కడ వారికి హిందుత్వం అన్నా, భారత మాత అన్నా ఒక బంధం, ఒక ఉద్వేగం. అందుకే ఈ దేశభక్తి, హిందూ పిలుపులకు వారు స్పందించినంతగా మనం స్పందించలేము. దక్షిణాది తో పోలిస్తే అందుకే ఉత్తరాదిలో మత మార్పిడులు కూడా తక్కువ.


నిన్నటి రోజు అంటే ఆగస్టు 14 గా తేదీని 75వ స్వాతత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ #PartitionHorrorsRemembranceDay గా గుర్తించారు. అలా పాత సంఘటనలను తవ్వుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి? వాటిని మరిచి పోయి ముందుకు సాగాలి ఆని మేధావులు సూక్తులు చెపుతున్నారు. మొఘల్ పాలకుల అకృత్యాలు మీద వీరిది అదే వైఖరి. కానీ వీరి యేజెండాకు సరిపోయే హిందూ ధర్మంలో వివక్ష, 2002 గోధ్రా వంటి సంఘటనలు మాత్రం రోజూ గుర్తు చేసుకుంటూ జనల మనసుల్లోంచి పోకుండా జాగ్రత్త పడతారు.


పాత ఘోర సంఘటనల వల్ల ఇబ్బంది పడ్డ సమూహం వాటిని గుర్తు పెట్టుకొని అవి ఎందుకు జరిగాయి వాటి వల్ల జరిగిన నష్టం ఏమిటి అని ఆలోచిస్తేనే అటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా యే చర్యలు తీసుకోవాలి అనే ఆలోచనలు వస్తాయి. తరువాత తరాలు కూడా బాధ్యతాయతంగా మెలుగుతారు.


సరే! నోట్ల రద్దు అప్పుడు వేల మందిని క్యులలో నిలబెట్టారు, వందల మంది(ఎక్కడా ఆధారాలు లేకపోయినా) చనిపోయారు అందుకు నేటి పాలకులను శిక్షించాలి అనే పెద్దలు, 2002 లో రెండువైపుల వారు మత ఘర్షణలో వెయ్యి మంది చనిపోతే పాలకులపై అన్ని రకాల సంస్థలతో దర్యాప్తు చేయించాలి అని కోరిన మేధావులు యే ముందస్తు ప్రణాలికలు లేకుండా దేశాన్ని అడ్డంగా విభజించి లక్షల మంది చావుకి కారణం అయి, కొన్ని లక్షల మందిని కాందిశీకులుగా మార్చిన అప్పటి పాలకులపై యే విచారణలు లేవు, యే చర్యలు లేవు. లక్షల మంది చనిపోయినా స్వాతంత్య్ర సంగ్రామం అహింసాయుతంగా నడిపారు అని పై పెచ్చు వారు మహాత్ములు గా దేశ నిర్దేశకులుగా కీర్తింపబడ్డారు.


విభజన అప్పుడు ఒక్కో కుటుంబానిది ఒక్కో వ్యధ.

తమ ప్రాణాలు నిలుపుకుందికి అప్పుటి వారు ఎంత నరక యాతన అనుభవించారు ఈ తరం వారు తెలుసుకోడానికి ప్రత్యక్ష సాక్షుల కథనాలు నేను కొన్ని భాగాలుగా ఇస్తాను.


.... శాస్త్రి...

చీమల పుట్టలోకి

 చీమల పుట్టలోకి పాములు దూరాయి" స్వాతంత్రోద్యమ సంగ్రామమనే చీమల పుట్టలోకి పాములు దూరాయి..

దేశానికి స్వాతంత్య్రం రావటానికి కారణం ఎవరు అని ప్రశ్న అడిగిన మరుక్షణం, ఏ ఒక్కరి పేరు మాత్రమే చెప్పారు అంటే అంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదు..

నాతరానికి అసలు ఏమి తెలుసు..

స్వాతంత్రోద్యమ సంగ్రామాన్ని రాజకీయంగా తొలి మలుపు తిప్పిన కురువృద్దుడు దాదాబాయి నౌరోజీ గోప్పతనాన్ని దాచిపెట్టేసారు ..

దేశం కోసం 19 ఏళ్ళకే ఉరితాడు కు వేలాడిన ఖదీరాం బోస్ బోసు తల నాకు కనిపించనివ్వలేదు..

"నాకు మీ రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్య్రన్నీ ఇస్తాను" అన్న సుభాష్ చంద్రబోస్ పిలుపును జాతికి వినపడనివ్వలేదు.. పాతిక సంవత్సారాలు కూడా నిండని భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు ల ఉరి తాడుని ముద్దాడిన సంఘటన నాకు తెలియనివ్వలేదు..

చంద్రశేఖర్ ఆజాద్ మీస కట్టు పౌరుషాన్ని అవహేళన చేసారు.. భారతీయుడి పగ అంటే తాచుపాము పగ అని నిరూపించిన ఉద్దావ్ సింగ్ ని ఊసే లేదు..

ప్రజాస్వామ్య హక్కులనే కాలరాసే మీకు "స్వాతంత్య్రం నా జన్మ హక్కు" అని నినదించిన బాలగంగాధర్ తిలక్ ఎలా కనిపిస్తాడు.. లాటి దెబ్బల గాయాలు తో చావుని కౌగిలించుకున్న లాలా లజిపతిరాయ్ ఎక్కడ!!

ముక్కలవ్వబోతున్న దేశాన్ని ఒక్కతాటిపైకి తెచ్చిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఊసెక్కడ

అగ్ని పర్వతం అల్లూరి జాడే లేదు..

ఇలా ఎంతమంది మహనీయుల కోసం చెప్పిన ఒకరు మిగిలిపోతూనే ఉంటారు..

ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఎంతో మంది బలిదానల తో ముందుకు నడిచిన ఈ స్వాతంత్య్రం సంగ్రామం ఒక చీమల పుట్ట, త్వరలోనే ఆ చీమల చేతి కే ఆ పుట్ట రాబోతుంది..

విష సర్పాలను ప్రజలు గుర్తించే రోజులు త్వరలోనే రానున్నాయ్..అప్పుడు ప్రతీ భారతీయుడు తమ జాతి ఔన్నత్యాన్ని గుర్తించటం తో పాటు భారత్ మాతాకీ జై అని ఎందుకు అనాలి లాంటి ప్రశ్నలకు ఆస్కారమివ్వడు.. ప్రతీ ఒక్కరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.. 

సంస్కృత మహాభాగవతం

*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఎనుబది ఎనిమిదవ అధ్యాయము*


*వృకాసురుని వృత్తాంతము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*88.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*యది వస్తత్ర విశ్రంభో దానవేంద్ర జగద్గురౌ|*


*తర్హ్యంగాశు స్వశిరసి హస్తం న్యస్య ప్రతీయతామ్॥12043॥*


దానవరాజా! నీవు ఎంతో గొప్పవాడివై యుండికూడా, ఇంత చిన్న చిన్న మాటలను నమ్మెదవా ఏమి? ఒకవేళ నీవు ఇప్పటికిని ఆయనను జగద్గురువుగా విశ్వసించుచున్నచో ఆయన ఇచ్చిన వరముయొక్క ప్రభావమును పరీక్షించుటకై వెంటనే నీ చేతిని నీ శిరస్సుపై ఉంచుకొనుము.


*88.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*యద్యసత్యం వచః శంభోః కథంచిద్దానవర్షభ|*


*తదైనం జహ్యసద్వాచం న యద్వక్తానృతం పునః॥12044॥*


దానవవీరా! ఆ శంభుని పలుకులు అసత్యములైనచో మఱల అతడు ఎప్పటికిని అబద్ధములు ఆడకుండునట్లుగా ఆ అసత్యవాదిని సంహరింపుము"


*88.35 (ముప్పది ఐదవ శ్లోకము)*


*ఇత్థం భగవతశ్చిత్రైర్వచోభిః స సుపేశలైః|*


*భిన్నధీర్విస్మృతః శీర్ష్ణి స్వహస్తం కుమతిర్వ్యధాత్॥12045॥*


శ్రీహరి (వటువు) ఇట్లు మనోహరమై, భ్రమగొలుపునట్టి (తికమకలో పడవేయునట్టి) మాటలను పలుకగా వృకాసురుడు వివేకమును కోల్పోయెను. అంతట ఆ బుద్ధిహీనుడు తాను పొందిన ఆ వరమువలన కలిగెడి ప్రమాదమును మఱచి, తన చేతిని తన తలపై పెట్టుకొనెను.


(శ్రీహరి శంకరుని గూర్చి అసత్యవాదిగా పేర్కొనినట్లు పైకి కనబడుచున్నను, సారాంశమునుబట్టి ఆ పరమశివునిగుఱించి సత్యవాదిగనే పేర్కొనినట్లు స్పష్టమగును. ఆ రాక్షసుని బోల్తాకొట్టించుటకే ఆ ప్రభువు ఇట్లు నుడివెను. పరమశివుడు సత్యవచనుడగుటవలననే ఆయన రాక్షసునకు తానిచ్చిన వరముపై (తన వచనముపై) నమ్మకమును ఉంచి పరుగిడెను. రాక్షసుడు తమోగుణాన్వితుడు గావున శ్రీహరి మాటల అంతరార్థమును తెలిసికొనలేక ఇట్లు బోర్లపడెను)


*88.36 (ముప్పది ఐదవ శ్లోకము)*


*అథాపతద్భిన్నశిరాః వజ్రాహత ఇవ క్షణాత్|*


*జయశబ్దో నమఃశబ్దః సాధుశబ్దోఽభవద్దివి॥12046॥*


మరుక్షణమే పిడుగుపాటునకు గుఱియైనట్లుగా వృకాసురుని తల బ్రద్దలైపోవుటతో అతడు నేలపాలయ్యెను. అంతట ఆకాశమునుండి *జయము-జయము*, *నమో నమః*, *సాధు సాధు* అను వచనములు వినవచ్చెను.


*88.37 (ముప్పది ఏడవ శ్లోకము)*


*ముముచుః పుష్పవర్షాణి హతే పాపే వృకాసురే|*


*దేవర్షిపితృగంధర్వా మోచితః సంకటాచ్ఛివః॥12047॥*


పాపాత్ముడైన వృకాసురుడు హతుడు కాగా, పరమశివుని సంకటస్థితి తొలగిపోవుటతో దేవతలు, మహర్షులు, పితృదేవతలు, గంధర్వులు మొదలగువారు సంతోషముతో పుష్పవర్షమును కురిపించిరి.


*88.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*


*ముక్తం గిరిశమభ్యాహ భగవాన్ పురుషోత్తమః|*


*అహో దేవ మహాదేవ పాపోఽయం స్వేన పాప్మనా॥12048॥*


*88.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*


*హతః కో ను మహత్స్వీశ జంతుర్వై కృతకిల్బిషః |*


*క్షేమీ స్యాత్కిము విశ్వేశే కృతాగస్కో జగద్గురౌ॥12049॥*


పురుషోత్తముడైన శ్రీహరి ఆపదనుండి బయటపడిన శంకరుని సమీపించి ఇట్లు పలికెను - "మహాదేవా! కైలాసపతీ! భళీ! ఈ దుష్టుడు (వృకాసురుడు) తాను చేసికొనిన పాపముల ఫలితముగా హతుడయ్యెను. పరమేశ్వరా! మహాత్ములయెడ అపరాధములకు పాల్పడినవాడు ఎవడు క్షేమముగా ఉండును? అందునా లోకకల్యాణకారకుడవు, విశ్వేశ్వరుడవు ఐన నీకు హాని తలపెట్టినవాడు ఎవడు బాగుపడును?


*88.40 (నలుబదియవ శ్లోకము)*


*య ఏవమవ్యాకృతశక్త్యుదన్వతః పరస్య సాక్షాత్పరమాత్మనో హరేః|*


*గిరిత్రమోక్షం కథయేచ్ఛృణోతి వా విముచ్యతే సంసృతిభిస్తథారిభిః॥12050॥*


శ్రీమన్నారాయణుడు అవాఙ్మానస గోచరుడు, అనంత శక్తి సంపన్నుడు, ప్రకృతి పురుషులకంటెను విలక్షణమైనవాడు. సకలలోకములకు ఆధారమైనవాడు. ఆశ్రయించినవారి యొక్క దుఃఖములను పోగొట్టువాడు. అట్టి పరమాత్మునివలన శంకరుడు ఆపదనుండి బయటపడెను. అట్టి వృత్తాంతమును ప్రవచించినవారు, వినినవారు, సాంసారిక దుఃఖములనుండియు, శత్రు (అంశ్శత్రు, బహిశ్శత్రు)వుల భయమునుండియు విముక్తులగుదురు.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్ధే రుద్రమోక్షణం నామాష్టాశీతితమోఽధ్యాయః (88)*


ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, ఉత్తరార్ధమునందలి *వృకాసురుని వృత్తాంతము* 

అను

ఎనుబది ఎనిమిదవ అధ్యాయము (88)



🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

*పితృ దోషము పరిష్కారము

 *పితృ దోషము నుండి బయటపడే సులువైన పరిష్కారము*

పితృ దోషం' ...

మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులను వంశపారంపర్యంగా అనుభవించటానికి మనం ఎలాగ హక్కు అర్హత పొందుతామో ...

అలాగే... 

తాతలు తండ్రులు చేసిన పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి.

మన పెద్దలు పుణ్యాలు మంచిపనులు చేస్తూ ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది.

అలాగే అదే పూర్వికులు పాపాలు గనుక చేసి ఉంటే అది తెలుసు కావచ్చు తెలియక కావచ్చు ఏదైనా గాని వారు చేసిన పాప కర్మలు ఆ వంశపారంపర్యంగా ఆ కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు -

 మేము తెలిసి తెలియక ఏ తప్పు చేయలేదు కానీ బాధలను కర్మలను అనుభవిస్తున్నాను అనే బాధ పడేవారు ముఖ్యంగా తెలుసుకోవలసినది ముఖ్యమైనది ఒక్కటే.

అదే

" పితృ దోషం "

ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయం.

అందుకే ఈ పోస్టు పెడుతున్నాను.

పితృ దోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాప కర్మలను చేయకపోయినా కుటుంబం ఇబ్బందులపాలు అవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది.

ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు.

వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా కచ్చితంగా పంచుకొని తీరవలసిందే.

పితృదోష వలన కలిగే దుష్పరిణామాలు కొన్ని చర్చించుకుందాము...

చిన్న వారు అకాలమరణం పొందడం 

శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఆస్పత్రి పాలవడం.

అప్పులపాలు అవ్వడం లేనిపోని అపనిందల పాలు అవ్వడం మన ప్రమేయం లేకుండా

ప్రమాదాలకు గురయ్యే జీవితాంతం కర్మలను అనుభవించడం

మన కళ్ళ ముందు మన పిల్లలు చెడు వ్యసనాలకు బానిస అయ్యి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించడం

ఇలా వీటన్నిటికీ కారణం పితృ దోషం కారణం

దీని నుండి విముక్తి పొందడానికి ఏకైక పరిష్కారం.

స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకోవడమే ...

అయితే ఈ స్మశాన నారాయణుడి ఆలయాలు ఈ భారతదేశంలో రెండే రెండు ఉన్నాయి.

1. కాశీ

2. పాపనాశి ( అలంపురం 'జోగుళాంబ గద్వాల జిల్లా)

అలంపురంలోని ఈ స్మశాన నారాయణుడి ఆలయం గురించి కేరళ తాంత్రిక శాస్త్రంలో చెప్పడం జరిగింది.

విచిత్రం ఏమిటంటే ఈ స్మశాన నారాయణ ఆలయం అలంపురంలో ఉన్నదన్న విషయం ఎవరికీ తెలియదు .

అయితే ఈ స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకుని మన బాధల నుండి విముక్తి పొందాలంటే ఏమి చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం -

స్మశాన నారాయణుని ప్రసన్నం చేసుకోవాలంటే....

పాలు అన్నముతో చేసిన పాయసం,

అన్నము, ముద్దపప్పు, నేయి,

వడ ఇవి నైవేద్యంగా పెట్టాలి ! ఈ విధంగా స్మశాన నారాయణుడికి నైవేద్యం పెడతారో ఆ ప్రసాదాన్ని వారి ఇంటి పేరు గల వంశస్థులు మాత్రమే దానిని స్వీకరించాలి. ఇతరులకు ఇవ్వరాదు . 

స్వామికి తెల్లటి కండువా అలంకరించాలి.

ఈ వంటలను స్వయంగా వండుకొని తీసుకొని వెళ్ళి నివేదన చేయాలి లేదా ( వెళ్ళడానికి వీలు లేనివారు ఖర్చులను ఇచ్చి అక్కడి బ్రహ్మణులచే చే చేయించ వచ్చును ) 

అలంపురం తెల్లవారుజామునే వెళ్లి తుంగభద్రా నదీ స్నానం చేసి అమ్మవారిని అయ్యవార్ల ను దర్శనం చేసుకున్న తరువాత ఈ స్మశాన నారాయణుడిని సేవించుకొని ఇంక వేరే చోటకి వెళ్లకుండా ఇంటికి చేరుకోవాలి.

ఈ ఆలయ ప్రాముఖ్యము మా గురువు గారు అయిన తంత్ర గురు "వేణు మాధవ నంబూద్రి " ద్వారా1983 లో తెలుసుకోవడం జరిగింది ' ఈ అలంపుర స్మశాన మోక్ష నారాయణుడి దాని ప్రాముఖ్యము కేరళ తంత్ర శాస్త్రంలో లిఖించబడి ఉన్నదట !

ఎంతోమంది పితృదోషం తో బాధపడే వారు ఉన్నారు . అలాంటివారికి ఈ విషయం ఉపయోగపడుతుందని గ్రూపులో పెట్టడం జరిగింది !

చేరుకొనే విధానం :

అలంపూర్ "హరిత హోటల్ " కు ప్రక్కన ఒక చిన్న దారి ఉంటుంది . ఆ చిన్న దారి ఎడమవైపున 1.2 కిలోమీటర్ల దూరంలో పాపనాశేశ్వర ఆలయ సముదాయం ఉంటుంది . ఆలయ సముదాయంలో ఒక ప్రత్యేక ఆలయం "స్మశాన నారాయణుని ఆలయం "

ఇంకొక ముఖ్య విషయం : స్మశాన నారాయణుడి ఆలయ సమూహాలలో ప్రధాన దైవం శ్రీ పాపనాశేశ్వరుడు ' 7వ శతాబ్దం నాటి అతి పురాతన ' అతిపెద్ద మరకత లింగం ' దక్షిణ కాశి అంటారు . ఈ స్వామిని దర్శించుకున్న నంతనే పాపాలు నాశనం అవుతాయని ప్రతీతి !

ఈ ఆలయ విశేషాల గురించి ' స్మశాన నారాయణుడి మోక్ష నారాయణ పిండ శ్రద్ద పూజ గురించి సంప్రదించవలసిన పురోహితులు నంబర్లు :

9440544759,

9491298422.

పదిమందికి ఉపయోగపడే విషయం . దయవుంచి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి

*సర్వేజనా సుఖినోభవంతు*

*గురుభ్యోన్నమః*

ఆదిత్య హృదయం ||

 || ఆదిత్య హృదయం ||

🌺🌺🌺🌺🌺🌺

ధ్యానం ||

నమస్సవిత్రే జగదేక చక్షుసే

జగత్ప్రసూతి స్థితి నాశహేతవే

త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణే

విరించి నారాయణ శంకరాత్మనే


తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం ।

రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం ॥ 1 ॥


దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం ।

ఉపాగమ్యా-బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః ॥ 2 ॥


రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ।

యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి ॥ 3 ॥


ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం ।

జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివం ॥ 4 ॥


సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం ।

చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం ॥ 5 ॥


రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం ।

పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం ॥ 6 ॥


సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః ।

ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ॥ 7 ॥


ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః ।

మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః ॥ 8 ॥


పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః ।

వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః ॥ 9 ॥


ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ ।

సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః ॥ 10 ॥


హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తి-ర్మరీచిమాన్ ।

తిమిరోన్మథనః శంభుః త్వష్టా మార్తాండకోంఽశుమాన్ ॥ 11 ॥


హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః ।

అగ్నిగర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః ॥ 12 ॥


వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్యజుఃసామ-పారగః ।

ఘనావృష్టి రపాం మిత్రః వింధ్యవీథీ ప్లవంగమః ॥ 13 ॥


ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః ।

కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః ॥ 14 ॥


నక్షత్ర గ్రహ తారాణాం అధిపో విశ్వభావనః ।

తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్-నమోఽస్తు తే ॥ 15 ॥


నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః ।

జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః ॥ 16 ॥


జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః ।

నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః ॥ 17 ॥


నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః ।

నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః ॥ 18 ॥


బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్య-వర్చసే ।

భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః ॥ 19 ॥


తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయా మితాత్మనే ।

కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః ॥ 20 ॥


తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే ।

నమస్తమోఽభి నిఘ్నాయ రుచయే లోకసాక్షిణే ॥ 21 ॥


నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః ।

పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ॥ 22 ॥


ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ।

ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్ని హోత్రిణాం ॥ 23 ॥


వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ ।

యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః ॥ 24 ॥


ఫలశ్రుతిః


ఏన మాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ ।

కీర్తయన్ పురుషః కశ్చిన్-నావశీదతి రాఘవ ॥ 25 ॥


పూజయస్వైన మేకాగ్రః దేవదేవం జగత్పతిం ।

ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి ॥ 26 ॥


అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి ।

ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం ॥ 27 ॥


ఏతచ్ఛ్రుత్వా మహాతేజాః నష్టశోకోఽభవత్-తదా ।

ధారయామాస సుప్రీతః రాఘవః ప్రయతాత్మవాన్ ॥ 28 ॥


ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ ।

త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ ॥ 29 ॥


రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ ।

సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోఽభవత్ ॥ 30 ॥


అధ రవిరవదన్-నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః ।

నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి ॥ 31 ॥


||ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మికీయే ఆదికావ్యే యుద్ధకాండే పంచాధిక శతతమః సర్గః ॥

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


🌹🌞🌞 *సేకరణ*🌞🌞🌹

           *న్యాయపతి*

        *నరసింహా రావు*

అహర్నిశలూ శ్రమించాల్సిన సమయం

 🙏🌹💐🌺🌸 భారతీయ సనాతన వైదిక ధార్మిక సంస్కృతీ పరిరక్షణకు అహర్నిశలూ శ్రమించాల్సిన సమయం ! పరమ పవిత్రమైన వేదాలు అపౌరుషేయంగా ఆవిర్భవించిన పుణ్య భూమి, భరతఖండం ! వేద ధర్మం, సదా బోధించే సమైక్య భావనాత్మక సన్మైత్రీ జీవన విధానం, విశ్వ మానవాళి తమలో సయోధ్య ఏనాడూ విడువరాదన్న సత్య చైతన్య స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం ! ప్రకృతి సృష్టి జరిగి కోటానుకోట్ల సహస్రాబ్దాలు గడిచినా, ఆ ప్రకృతి నిత్యం బోధించే సన్మైత్రీ జీవన మార్గం ఇంకా ఈ భువిపై సరైన రీతిలో ఆకళింపు కాకపోవడం విచారకరం ! "సృష్టి కర్త బ్రహ్మ ", విశ్వ మానవాళి సృష్టిలో మిక్కిలి శ్రద్ధతో వ్యవహరించి ఈ ఇలపై వారి ప్రాధాన్యత బహు దొడ్డదని చెప్పకనే చెప్పాడు ! నిశిత పరిశీలన, నిత్య నూత్న నిరంతర పరిశోధన కొంగ్రొత్త రీతుల జీవన పథ మార్గ అన్వేషణ, వారి జీవన గమనంలో అత్యంత కీలకమైన విషయంగా తెలిపి యున్నాడు ! విశ్వ వ్యాప్త చరాచర జీవజాల సంరక్షణ, విశ్వ మానవాళి నిత్య కర్తవ్యంగా, వారి కనీస బాధ్యతగా మార్గ నిర్దేశం చేసియున్నాడు ! ఈ పవిత్ర భువిపై నిత్య ప్రశాంత సకల ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధికై విశ్వ మానవాళికి ప్రత్యేక శక్తులను వారి మస్తిష్కంలో పొందుపరిచాడు ! ప్రతి వ్యక్తీ, ఈ పావన భూభాగంలో తమ ప్రత్యేక బాధ్యతగా సకల జీవ నిత్య ప్రశాంత మనుగడకై అనునిత్యం పాటుపడాల్సిన విషయం, మరువరాదెన్నటికీ ! " జీవకారుణ్యతా భావన ", అత్యంత శక్తివంతమైన నిత్య ప్రశాంత జీవన పథ సన్మార్గమన్న సత్యాన్ని ప్రతి వ్యక్తీ గుర్తించాల్సిన తరుణమిది ! పవిత్ర వేదాలు ఏనాడో అపౌరుషేయంగా ఆవిష్కరించబడ్డ మన పవిత్ర భరత భూమి, యావత్ విశ్వ నిత్య జీవన గమనంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్న సత్యాన్ని గ్రహించి, త్వరితగతిన ఈ విశాల విశ్వంలో " వసుధైక కుటుంబక ", స్థాపనకై ప్రతి వ్యక్తీ కృషి చేయాల్సిన అవసరం గుర్తించాల్సిన సమయం ! విశ్వ జీవజాలపు ప్రశాంత మనుగడ, ప్రతి మానవుని నిత్య కదలికలో నిక్షిప్తమై ఉన్న సత్యాన్ని గ్రహించాల్సిన తరుణమిది ! సృష్టి కర్త బ్రహ్మ ఇచ్చిన ప్రత్యేక శక్తులను వినియోగించి, విశ్వ వ్యాప్త మానవాళి ఈ పుణ్య భూమిపై యావత్ విశ్వ జీవరాశి ఎట్టి బేధ భావాలకు లోబడకుండా, సుస్నేహ మాధుర్యాన్ని అనునిత్యం ఆస్వాదించేలా నడుచుకోవాలన్నదే ఇక్కడ ప్రధాన ఇతివృత్తం ! మన భారత దేశం, ఎన్నో కష్టనష్టాలకు గురియై అనేకానేక బాధలననుభవించి, సన్మిత్రుల కృషి వలన స్వాతంత్ర్యాన్ని సాధించిన విషయం మరువకూడదు ! స్వాతంత్ర్య సాధనానంతరం, విశ్వ జీవన నిత్య ప్రశాంత మనుగడలో మన భారత జాతి బాధ్యత మరింత పెరిగిందన్న విషయం మరువకూడదు ! ఇటీవల కాలంలో యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న విష వ్యాధుల నిర్మూలనకు మన దేశం ఆదర్శమైన సత్యాన్ని గ్రహించాల్సిన తరుణమిది ! కోటానుకోట్ల వత్సరాలకు పూర్వమే మన భారత పుణ్య భూమిపై ఎంతో శక్తివంతమైన ఓషధీ సంపద ఆవిష్కరించబడ్డ విషయం తెలుసుకోవాలందరూ ! మన ఆయుర్వేద సంస్కృతీ వైభవం, ఈనాడు విశ్వ జీవరాశికి వలసిన నిత్యావశ్యక ఓషధులు సమకూరుస్తున్న యథార్థాన్ని గుర్తించాల్సిన సమయం ! మనందరం మన మన పరిధిలో మన దేశ ప్రశాంత జీవనానికి, అలాగే విశ్వ ప్రశాంత జీవనానికి కృషి చేయాలి, మరియు ఏనాడూ సన్మైత్రీ భావనకు ఆటంకం కలుగచేయరాదన్న నిత్య సత్య చైతన్య స్ఫూర్తితో ముందుకు సాగాలి ! మన పూర్వీకులు సాధించిన స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛను సమన్వయంతో, మంచి భావనతో సన్మిత్రులుగా పరిరక్షించుకోవాలి ! " జయహో భారత మాతా, జయ జయహో భారత మాతా, అందుకో మా వందనం, అభివందనం " ! 🙏🙏🙏🙏🙏 రచన : గుళ్లపల్లి ఆంజనేయులు

సుభాషితమ్

 🌹🌹 *సుభాషితమ్*🌹🌹

---------------//////////---------------


*శ్లోకం*


దేశ రక్షా సమం పుణ్యం 

దేశ రక్షా సమం వ్రతం

దేశ రక్షా సమం యోగో 

దృష్టో నైవచ నైవచ


*తాత్పర్యం*


దేశ రక్షణతో సమానమైన పుణ్యము, సమానమైన వ్రతము, సమానమైన యజ్ఞమును ఎక్కడనూ చూడలేము. అనగా దేశరక్షణే సర్వశ్రేష్ఠ కార్యము.


*శ్లోకం*


అపి స్వర్ణమయీ లంకా 

న మే లక్ష్మణ రోచతే ।

జననీ జన్మ భూమిశ్చ

 స్వర్గాదపి గరీయసీ ॥


*తాత్పర్యం*


“ఓ లక్ష్మణా! లంక స్వర్ణమయమైననూ నాకు రుచించదు, ఇష్టం లేదు. ఎందుకంటే జనని మరియు జన్మ భూమి స్వర్గము కంటెనూ ఉత్కృష్టమైనవి”



*నేలబట్ల మణికంఠ శర్మ*

ముకుందమాల స్తోత్రమ్ Mukunda Mala Stotram శ్లోకం : 19

 ॐ मुकुन्दमाला स्तोत्रम्   

           ముకుందమాల స్తోత్రమ్ 

       Mukunda Mala Stotram    


                                    శ్లోకం : 19    

                           SLOKAM : 19  


पृथ्वीरेणुरणुः पयांसि कणिकाः 

                      फल्गुस्फुलिङ्गो लघुः

तेजो निश्श्वसनं मरुत् तनुतरं 

                          रन्ध्रं सुसूक्ष्मं नभः ।

क्षुद्रा रुद्रपितामह प्रभृतयः 

                      कीटाः समस्ताः सुराः

दृष्टे यत्र स तावको विजयते 

                  भूमावधूतावधिः ॥ १९ ॥


పృధ్వీ రేణురణు: పయాంసి కణికా: 

                      ఫల్గుస్ఫులింగోనల:

తేజో ని:శ్వసనం మరుత్ తనుతరం 

                రంధ్రం సుసూక్ష్మం నభ: I        

క్షుద్రా రుద్రపితామహ ప్రభృతయ: 

                    కీటాస్సమస్తాస్సురా: 

దృష్టే యత్ర స తావకో విజయతే 

                   భూమావధూతావధి: ॥19


    పరబ్రహ్మ స్వరూపమగు నారాయణుని దర్శించినచో అందు ఈ పృథ్వి ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన రేణువు. 

    ఈ జగము నీటి తుంపర.    

    తేజస్సు సూక్ష్మమగు అగ్నికణము. 

    వాయువు నిశ్వాసము. 

    ఆకాశము సన్నని చిన్న రంధ్రము. 

    రుద్రా పితామహాది దేవతాకోటి సమస్తము క్షుద్ర కీటకములు. 

    ఆ పరబ్రహ్మమగు నారాయణుని అతిశయము అవధులు మీరి విరాజిల్లు చున్నది.    


    Once our savior has been seen, 

  - the whole earth becomes no greater than a speck of dust, 

  - all the waters of the ocean become mere droplets, 

  - the totality of fire becomes a minute spark, 

  - the winds become just a faint sigh, and 

  - the expanse of space becomes a tiny hole. 

  - Great lords like Rudra and Grandfather Brahmā become insignificant, and 

  - all the demigods become like small insects. 


    Indeed, even one particle of dust from our Lord’s feet conquers all.                                       


https://youtu.be/ZTs6tcgm0lE  


                                        కొనసాగింపు  


                    =x=x=x=    


    — రామాయణంశర్మ    

             భద్రాచలం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*శ్రీ బొగ్గవరపు చిన మీరాశెట్టి గారు..*


శ్రీ స్వామివారు మొగలిచెర్ల సమీపం లోని ఫకీరు మాన్యం భూమిని తన ఆశ్రమం కోసం ఎంపిక చేసుకోవటం..అందుకు శ్రీధరరావు, నిర్మలప్రభావతి గార్లు సంతోషంగా సమ్మతి తెలపడం..ఆ భూమిని శ్రీ స్వామివారి పేరిట రిజిస్ట్రేషన్ చేయటం చక చకా జరిగిపోయాయి..ఇక ఆశ్రమ నిర్మాణం జరగాలి..

"శ్రీధరరావు గారూ..మీరు గృహస్థులు..మీకూ బాధ్యతలున్నాయి..ఆశ్రమనిర్మాణానికి మీమీద భారం పడదు.. అందుకు వేరేవాళ్ళు వస్తారు.." అని శ్రీ స్వామివారు చెప్పారు..


నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొట్టిగుండాల గ్రామ వాస్తవ్యులు శ్రీ బొగ్గవరపు చిన మీరాశెట్టి గారు ఆ బాధ్యత నెత్తిమీద తీసుకున్నారు..శ్రీ స్వామివారి మీద  అచంచల విశ్వాసం మీరాశెట్టి దంపతుల స్వంతం..తమ గ్రామం నుంచి నడుచుకుంటూ ఆశ్రమ నిర్మాణ స్థలానికి వచ్చేవారు..మీరాశెట్టి గారికి సంతానం లేదు..శ్రీ స్వామివారు ఆ విషయంలో చాలా స్పష్టంగా "మీరాశెట్టీ మీకు సంతాన యోగం లేదు..నాకు ఆశ్రమం కట్టిస్తే మీకు పిల్లలు పడతారని అపోహ పడొద్దు.." అని ముందుగానే చెప్పారు..మీరాశెట్టి గారు కూడా తాను ఆశ్రమాన్ని నిర్మించి ఇవ్వదల్చుకొన్నాననీ..మరేవిధమైన కోరికా లేదని తేల్చి చెప్పేసారు..


ఆశ్రమం నిర్మాణం పూర్తయిన తరువాత కూడా..మీరా శెట్టి దంపతులు శ్రీ స్వామివారి దర్శనార్ధం తరచూ వచ్చేవారు..ఒక్కొక్కసారి తమతో పాటు కొంతమంది వ్యక్తుల ను కూడా తీసుకొచ్చేవారు..అలా వచ్చినవారి ప్రాప్తాన్ని బట్టి శ్రీ స్వామివారి దర్శనం జరిగేది..శ్రీ స్వామివారు తనకు నచ్చినప్పుడే మనసు విప్పి మాట్లాడేవారు..అందుకు ఒక నిర్దిష్ట సమయమంటూ లేదు..తన దగ్గరకు ఎవరు ఏ కోరికతో వస్తున్నారో ముందుగానే శ్రీ స్వామివారికి ముందుగానే తెలుసు..అందుకు తగ్గట్టు గానే మాట్లాడేవారు..ఈ విషయం లో శ్రీధరరావు దంపతులకు(మా తల్లిదండ్రులు) మీరాశెట్టి దంపతులకు చాలా అనుభవాలు కలిగాయి..శ్రీ స్వామివారు సిద్ధిపొందిన తరువాత కూడా మీరాశెట్టి గారు ఆశ్రమానికి వస్తూ వుండేవారు..వారి ప్రోద్బలం, కృషి తోనే..శ్రీ చెక్కా కేశవులు గారు, శ్రీ మెంటా మస్తానరావు గారు, శ్రీ గోనుగుంట పెద్దిశెట్టి గారు..అందరూ కలిసి..శ్రీ స్వామివారి మందిర వెనుకవైపు స్థలంలో..మందిరానికి అతి సమీపంలో "ఆర్యవైశ్య అన్నదాన సత్రాన్ని" కట్టించారు..ప్రతి సంవత్సరం శ్రీ స్వామివారి ఆరాధానోత్సవానికి, మహాశివరాత్రి పర్వదినానికి.. ఆర్యవైశ్య అన్నదాన సత్రం తరఫున అందరికీ అన్నదానం చేసేవారు..ప్రస్తుతం వారెవ్వరూ జీవించి లేకపోయినా..వారిచ్చిన స్ఫూర్తి తో ఆ సత్రం తరఫున యధావిధిగా సేవలు జరుగుతున్నాయి..శ్రీ స్వామివారిని దర్శించడానికి వచ్చే ఆర్యవైశ్య భక్తులకు ఉచిత వసతి, భోజనం ఏర్పాటు చేస్తున్నారు..


మీరాశెట్టి గారు జీవించి ఉన్నంత కాలమూ..తనకు తెలిసిన వాళ్ళెవరికి ఏ సమస్య వచ్చినా..వారి సమస్య పరిష్కారం కోసం శ్రీ స్వామివారి సమాధిని దర్శించి, మ్రొక్కుకోమని చెప్పేవారు..అలా ఎంతోమంది స్వాంతన పొందేవారు..మీరాశెట్టి గారికి సంతానం లేకపోయినా..సంతానం లేని వారికి మాత్రం..శ్రీ స్వామివారి సమాధి వద్ద మ్రొక్కుకుంటే చాలు సంతానం కలుగుతుందని గట్టిగా చెప్పేవారు..చిత్రంగా ఆయన నమ్మకం ఏనాడూ వమ్ము కాలేదు..అలా సంతానం పొందిన వారి వద్ద ముందుగానే శ్రీ స్వామివారి మందిర అభివృద్ధికి సహాయం చేయాలని ఒప్పించేవారు..అలా మీరాశెట్టి గారి ద్వారా శ్రీ స్వామివారి మందిరాన్ని దర్శించి, సంతానం పొందిన అనేక మంది భక్తులలో..వింజమూరు గ్రామానికి చెందిన కామేశ్వర రావు గారొకరు..శ్రీ కామేశ్వర రావు గారు మీరాశెట్టి గారికి దగ్గర బంధువు కూడా..మీరాశెట్టి గారిని "పెదనాయనా" అని పిలిచేవారు..


ఆ కామేశ్వర రావు గారు ఈమధ్య తన కూతురి వివాహం కుదిరందనీ..ఆ వివాహానికి మందిరం లో ఉన్న మమ్మల్ని అందరినీ రమ్మని పిలువడానికి వచ్చినప్పుడు, తనకు సంతానం కలగడానికి శ్రీ స్వామివారి ఆశీర్వాదమే కారణమని..అందుకు శ్రీ మీరాశెట్టి గారి ప్రోద్బలమే కారణమని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు..


మీరాశెట్టి గారి సలహాతో శ్రీ స్వామివారి సమాధి మందిరాన్ని దర్శించి తరించిన భక్తుల అనుభవాలను..మీరాశెట్టి గారి ద్వారా స్వయంగా నేను విన్నవీ..భక్తుల ద్వారా సేకరించినవీ..కొన్నింటిని..రేపటి నుంచీ..ముందుగా శ్రీ కామేశ్వర రావు గారి అనుభవంతో మొదలుపెట్టి..ఓ నాలుగైదు రోజుల పాటు ఈ సోషల్ మీడియా వేదికగా చదువుకుందాము..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).