🙏🌹💐🌺🌸 భారతీయ సనాతన వైదిక ధార్మిక సంస్కృతీ పరిరక్షణకు అహర్నిశలూ శ్రమించాల్సిన సమయం ! పరమ పవిత్రమైన వేదాలు అపౌరుషేయంగా ఆవిర్భవించిన పుణ్య భూమి, భరతఖండం ! వేద ధర్మం, సదా బోధించే సమైక్య భావనాత్మక సన్మైత్రీ జీవన విధానం, విశ్వ మానవాళి తమలో సయోధ్య ఏనాడూ విడువరాదన్న సత్య చైతన్య స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం ! ప్రకృతి సృష్టి జరిగి కోటానుకోట్ల సహస్రాబ్దాలు గడిచినా, ఆ ప్రకృతి నిత్యం బోధించే సన్మైత్రీ జీవన మార్గం ఇంకా ఈ భువిపై సరైన రీతిలో ఆకళింపు కాకపోవడం విచారకరం ! "సృష్టి కర్త బ్రహ్మ ", విశ్వ మానవాళి సృష్టిలో మిక్కిలి శ్రద్ధతో వ్యవహరించి ఈ ఇలపై వారి ప్రాధాన్యత బహు దొడ్డదని చెప్పకనే చెప్పాడు ! నిశిత పరిశీలన, నిత్య నూత్న నిరంతర పరిశోధన కొంగ్రొత్త రీతుల జీవన పథ మార్గ అన్వేషణ, వారి జీవన గమనంలో అత్యంత కీలకమైన విషయంగా తెలిపి యున్నాడు ! విశ్వ వ్యాప్త చరాచర జీవజాల సంరక్షణ, విశ్వ మానవాళి నిత్య కర్తవ్యంగా, వారి కనీస బాధ్యతగా మార్గ నిర్దేశం చేసియున్నాడు ! ఈ పవిత్ర భువిపై నిత్య ప్రశాంత సకల ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధికై విశ్వ మానవాళికి ప్రత్యేక శక్తులను వారి మస్తిష్కంలో పొందుపరిచాడు ! ప్రతి వ్యక్తీ, ఈ పావన భూభాగంలో తమ ప్రత్యేక బాధ్యతగా సకల జీవ నిత్య ప్రశాంత మనుగడకై అనునిత్యం పాటుపడాల్సిన విషయం, మరువరాదెన్నటికీ ! " జీవకారుణ్యతా భావన ", అత్యంత శక్తివంతమైన నిత్య ప్రశాంత జీవన పథ సన్మార్గమన్న సత్యాన్ని ప్రతి వ్యక్తీ గుర్తించాల్సిన తరుణమిది ! పవిత్ర వేదాలు ఏనాడో అపౌరుషేయంగా ఆవిష్కరించబడ్డ మన పవిత్ర భరత భూమి, యావత్ విశ్వ నిత్య జీవన గమనంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్న సత్యాన్ని గ్రహించి, త్వరితగతిన ఈ విశాల విశ్వంలో " వసుధైక కుటుంబక ", స్థాపనకై ప్రతి వ్యక్తీ కృషి చేయాల్సిన అవసరం గుర్తించాల్సిన సమయం ! విశ్వ జీవజాలపు ప్రశాంత మనుగడ, ప్రతి మానవుని నిత్య కదలికలో నిక్షిప్తమై ఉన్న సత్యాన్ని గ్రహించాల్సిన తరుణమిది ! సృష్టి కర్త బ్రహ్మ ఇచ్చిన ప్రత్యేక శక్తులను వినియోగించి, విశ్వ వ్యాప్త మానవాళి ఈ పుణ్య భూమిపై యావత్ విశ్వ జీవరాశి ఎట్టి బేధ భావాలకు లోబడకుండా, సుస్నేహ మాధుర్యాన్ని అనునిత్యం ఆస్వాదించేలా నడుచుకోవాలన్నదే ఇక్కడ ప్రధాన ఇతివృత్తం ! మన భారత దేశం, ఎన్నో కష్టనష్టాలకు గురియై అనేకానేక బాధలననుభవించి, సన్మిత్రుల కృషి వలన స్వాతంత్ర్యాన్ని సాధించిన విషయం మరువకూడదు ! స్వాతంత్ర్య సాధనానంతరం, విశ్వ జీవన నిత్య ప్రశాంత మనుగడలో మన భారత జాతి బాధ్యత మరింత పెరిగిందన్న విషయం మరువకూడదు ! ఇటీవల కాలంలో యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న విష వ్యాధుల నిర్మూలనకు మన దేశం ఆదర్శమైన సత్యాన్ని గ్రహించాల్సిన తరుణమిది ! కోటానుకోట్ల వత్సరాలకు పూర్వమే మన భారత పుణ్య భూమిపై ఎంతో శక్తివంతమైన ఓషధీ సంపద ఆవిష్కరించబడ్డ విషయం తెలుసుకోవాలందరూ ! మన ఆయుర్వేద సంస్కృతీ వైభవం, ఈనాడు విశ్వ జీవరాశికి వలసిన నిత్యావశ్యక ఓషధులు సమకూరుస్తున్న యథార్థాన్ని గుర్తించాల్సిన సమయం ! మనందరం మన మన పరిధిలో మన దేశ ప్రశాంత జీవనానికి, అలాగే విశ్వ ప్రశాంత జీవనానికి కృషి చేయాలి, మరియు ఏనాడూ సన్మైత్రీ భావనకు ఆటంకం కలుగచేయరాదన్న నిత్య సత్య చైతన్య స్ఫూర్తితో ముందుకు సాగాలి ! మన పూర్వీకులు సాధించిన స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛను సమన్వయంతో, మంచి భావనతో సన్మిత్రులుగా పరిరక్షించుకోవాలి ! " జయహో భారత మాతా, జయ జయహో భారత మాతా, అందుకో మా వందనం, అభివందనం " ! 🙏🙏🙏🙏🙏 రచన : గుళ్లపల్లి ఆంజనేయులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి