4, ఏప్రిల్ 2021, ఆదివారం

రెండు రూపాయలు

 2 జూన్ 2001.. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురించబడిన ఈ కథ కేవలం రెండుపేజీలే వుంటుంది. కానీ కథ పూర్తయాక రెండునిమిషాలయినా  మనం ఆలోచించకుండా వుండలేం... 

  ఈ కథలో చెప్పినదానికన్నా చెప్పకుండా వున్నదే ఎక్కువగా కనిపిస్తుంది.


               ఒఖ్ఖ రెండు రూపాయలు

           "నేనేం వందలడిగానా? వేలడిగానా? ఒఖ్ఖ రెండు రూపాయలేగా! దానికే అంత దండకం చదవాలా?"

       గట్టిగా వినిపిస్తున్న తల్లి గొంతు చెవిన పడుతూనే మెలకువ వచ్చింది నూకరాజుకి. గబుక్కున లేచి కూర్చున్నాడు.

       "ఆ!...ఒఖ్ఖ రెండు రూపాయలేగా అని ఎంత తీసి పడేస్తున్నావు? పిల్లలు ఖర్చుల కడిగేదీ అదే. పుస్తకాల కడీగేదీ అదే. రెండూ రెండూ అంటూ నాలుగు సార్లు కలిపితే ఎనిమిదవదా? పదీ పదీ కలుపుకుంటూ పోతే వందవదా? ఇలాగే లెక్కలు పెడతాడు నీకొడుకు. రోజురోజుకీ  పెరిగి పోతున్న ధరలతో, నీ కొడుకిచ్చే డబ్బులకి లెక్కలు చెప్పలేక నా తలప్రాణం తోకకొస్తోంది. అయినా ముసల్దానివయిపోయావు. ఇంట్లోంచి బైటకి కదలవు. భోజనం, కాఫీ, టిఫినూ అన్నీ చెల్లిస్తూనే వున్నావాయె. ఇంకా నీకు ఆ ఒఖ్ఖ రెండు రూపాయలు మటుకు ఎందుకటా? ఏం చేసుకుందామనీ?" 

    సాగదీస్తూ అడుగుతున్న భార్య పంకజం నోటి దురుసుకి చెవులు  మూసుకుంటూ మంచం దిగాడు నూకరాజు. కాఫీ ఇస్తున్న భార్య నడిగాడు సంగతేమిటని? వెంటనే ఆమె స్వరం సౌమ్యంగా మారిపోయింది.

        "ఆ? ఏముందీ? మీ అమ్మగారికి రెండు రూపాయలు కావాలిట. మీరిచ్చిన డబ్బుతో పిల్లలకి ఫీజులు కట్టి, స్కూల్లో పుస్తకాలు, పెన్సిళ్లు కొనేసాను. ఇంక నాదగ్గర డబ్బుల్లేవు. అయినా మీ అమ్మగారికి డబ్బెందుకండీ? భోజనం, టిఫినూ, కాఫీ అన్నీ గడచిపోతుంటేనూ?" నెమ్మదిగా పాయింటు లేవదీసింది పంకజం.

నిజమే, అమ్మకు డబ్బులెందుకు?

       టైము చూసుకున్నాడు నూకరాజు. అప్పుడే ఎనిమిదయింది. అబ్బా, అప్పుడే షాపు తెరిచే టైమవుతోంది. గబగబా తయారయి షాపుకి బయలు దేరుతున్న అతనితో తల్లి అంది. 

       "ఒరేయ్ రాజూ, చూడరా మీ ఆవిడ... ఒఖ్ఖ రెండు రూపాయలడిగితే..." 

          "అబ్బబ్బ ఏంటమ్మా. అసలే టైమయిపోతోందని కంగారు పడుతుంటే. అయినా నీకు డబ్బులెందుకు చెప్పు?”

అంటూనే హడావిడిగా చెప్పులేసుకు బయటకొచ్చేసాడు. వెనక్కి తిరిగి తల్లికి నెమ్మదిగా నచ్చచెప్పి రమ్మని మనసు బాధిస్తున్నా, పరిగెడుతున్న టైము అతన్ని ముందుకే నడిపించింది.

      నెలలో మొదటి వారం, షాప్ రష్‌గా వుంది. నాలుగు చేతులతో పని చేస్తున్నట్లు చేస్తున్న నూకరాజుకి ఊపిరి పీల్చుకుందుకు కూడా సమయం దొరకలేదు. పదకొండు దాటేక జనం కొంచెం పలచబడ్డారు. అమ్మయ్య అనుకుంటూ వాటర్ బాటిల్‌లో నీళ్లు తాగుదామని తలయెత్తిన అతనికి, ఆ షాపు వైపే వస్తున్న రామ్మూర్తిగారు  కనిపించారు. నూకరాజు ముఖం విచ్చుకుంది. రూపాయలు, పైసల లెక్కల్తో కొట్టుకొంటున్న అతనికి రామ్మూర్తి గారితో మాట్లాడటం గొప్ప రిలీఫ్. చుట్టుపక్కల ప్రాంతంలో ఏం జరుగుతోందో తెలియనంత బిజీగా వుండే అతనికి మధ్యమధ్యలో రామ్మూర్తిగారు చెప్పే మాటల్లోనే ప్రపంచం తీరు తెన్నుల గురించి తెలుస్తూంటుంది. 

      రామ్మూర్తిగారు ఒక రిటైరైన గర్నమెంటు ఆఫీసరు. మనవలతో ఆడుకుంటూ హాయిగా కొడుకింట్లో కాలం గడిపేస్తున్నారు. ఏదో హోదాగల ఉద్యోగమే చేసుంటారు. అందుకే అభిమానం, పౌరుషం గల మనిషిలా కనిపిస్తారు. 

      ఎప్పుడైనా ఆయన ఉద్యోగపు రోజులు గుర్తుకు వస్తే "ఏమిటోనయ్యా, ఆ రోజులే వేరు. ఎంతసేపు సిన్సియర్‌గా పనిచేసి పేరు తెచ్చుకుందామనే గాని వేరే దృష్టి ఎక్కడిదయ్యా? ఇప్పుడేమో అంతా ఖాళీయే. ఎవరితోనన్నా మాట్లాడదామన్నా వాడి టైము పాడు చేస్తున్నానేమోనని ఫీలింగు" అంటూ పకపకా నవ్వేస్తారు.

        "మీకేం సార్. మాలా బిజినెస్ కాదు కదా! చేసినన్నాళ్లు చేసారు. పెన్షన్ వస్తుంది. హాయిగా కొడుకు దగ్గర ఉంటున్నారు" అంటే,

         "నీకొక జీవిత సత్యం చెబుతాను వినవయ్యా నూకరాజూ, ఎవరి జీవితం వాళ్లదేననుకో కాని, కొంతమంది ఇవ్వడానికే పుడతారు, మరికొంతమంది పుచ్చుకోవడానికే పుడతారు. కాలం మారుతూంటుంది కదయ్యా అదెప్పుడూ ఒక్కలాగే ఉండదు. మా తరం తల్లిదండ్రులని చూడవలసిన బాధ్యత కొడుకులది అనే నమ్మే తరం. అల్లాగే చూసాం. కాని మా కొడుకుల తరం వచ్చేసరికి, వాళ్లింట్లో ఉంటున్నందుకు మాకొచ్చే పెన్షన్ వాళ్ల చేతుల్లో పెట్టవలసిన పరిస్థితి వచ్చేసింది. ఏంచేస్తాం? ఈ కాలమిలా వుంది. వాళ్ల వైపు నుంచి ఆలోచిస్తే సమర్థించుకోవచ్చేమో కాని, మాతరం వాళ్లం సర్దుకోలేకపోతున్నామాయే!" అంటూ బరువైన విషయాన్ని కూడా చాలా తేలికగా తీసుకుంటూ చెప్పేసారు.

       రామ్మూర్తిగారు కొంచెం భోజనప్రియులు అయివుండాలి. గతం గుర్తొస్తే మటుకు వెంటనే ఆయన చెప్పే మాట "అప్పుడు బజార్లోకి కొత్తరకం ఏదొచ్చినా సరే తెచ్చి పిల్లలకి తినిపించాల్సిందేనయ్యా. అప్పుడూ మాకు తినడానికి టైముండేది కాదు, ఇప్పుడు టైమున్నా పెట్టేవాళ్లు లేరు" అంటూ నవ్వేస్తారు.

       ఇలా మంచీ చెడూ చెపుతూ, లోకం పోకడ గురించి ముచ్చటిస్తూ ఆయన కోడలు రాసిచ్చిన సరుకుల లిస్టు, ఖాతా పుస్తకం నూకరాజు చేతికిచ్చేవారు. కావలసిన సరుకులిచ్చి, లెక్క ఖాతా పుస్తకంలో రాసే వరకు అతనేదో అడుగుతూండడం, ఆయన జవాబిస్తూండడం వాళ్లిద్దరికీ అలవాటయిపోయింది.

   "ఏంటి మాస్టారూ విశేషాలు?" అడిగాడు నూకరాజు సరుకుల లిస్టు అందుకుంటూ.

       "ఆ! ఏముందోయ్... అన్నట్లు మీ పిల్లలెలా చదువుతున్నారు?" కుశల ప్రశ్నలు వేసారు రామ్మూర్తిగారు.

         "ఏం చదువులోనండి, వీళ్లు చదివి ఏం ఉధ్ధరిస్తారో తెలీదుకానండి ఫీజులు మటుకు చుక్కలంటుతున్నాయండి. పుస్తకాలు, డ్రెస్సులు, పాకెట్‌మనీ తడిసి మోపెడవుతున్నాయి" అన్నాడు నూకరాజు.

   "ఊ! అయితే పిల్లలకి పాకెట్ మనీ కూడా ఇస్తావేమిటోయ్?" అడిగారు ఆయన.

       "ఏదోనండి, రూపాయో, రెండో. పక్క పిల్లలు ఏదో కొనుక్కుంటారు కదండీ, వాళ్లకి అనిపిస్తుంది కదా, మళ్లీ చిన్న పుచ్చుకుంటారనీ..." సమర్థించుకున్నాడు నూకరాజు.

        "నిజమేనోయ్, నీకొక సంగతి చెప్పనా? మా తాతగారంటూండేవారు... చిన్నపిల్లలూ, ముసలివాళ్లూ ఒకటేనని. అంటే వాళ్లిద్దరి మనస్తత్వం ఒక్కలాగే వుంటుందని, ఏదో అస్తమానం తింటూండాలనిపిస్తుందనీ, చపలత్వం, చాదస్తం ఎక్కువవుతాయనీ అంటూండేవాడు. పిల్లలకే కాదు పెద్దలకి కూడా చేతిలో ఓ రూపాయుంటే ఏ గుళ్లోనో దేవుడికిచ్చుకోవాలనిపిస్తుంది కదా!" అన్నారు ఆయన.

        నూకరాజుకి వెంటనే తల్లి గుర్తుకు వచ్చింది. 'అమ్మ గుడిలో దేవుడి కోసం అడిగిందా ప్రొద్దున్నే రెండు రూపాయలు?' ఆలోచనలు తప్పించుకుందుకు తల విదిలించి సరుకుల లిస్టు చూడడంలో మునిగిపోయాడు. సరుకుల ధరలు రాసి, మొత్తం కూడి, ఖాతా పుస్తకంలో రాస్తున్నాడు.

    "నూకరాజూ..."

  రామ్మూర్తిగారి గొంతు నెమ్మదిగా వినిపించింది. తలెత్తాడు నూకరాజు.

    "ఏదో ఒక సరుకులో రెండు రూపాయలు ఎక్కువెయ్యవయ్యా..." నసుగుతూ అన్నాడాయన.

         ఆశ్చర్యపోతూ తలెత్తాడు నూకరాజు. ఆయన అతన్ని ఓ చూపు చూసి గబుక్కున తల దించుకున్నాడు. అభిమానంతో ఆయన నోటి వెంట వచ్చిన మాటలు "ఏం లేదయ్యా... కొత్తరకం బిస్కెట్లేవో వచ్చాయన్నావు కదా... ఎలా వుంటాయో రుచి చూద్దామనీ... అంతే. ఒఖ్ఖ రెండు రూపాయలే..."

         వింటున్న నూకరాజుకి ఛెళ్లున లెంపకాయ కొట్టినట్టయింది. కళ్లమ్మట గిఱ్ఱున నీళ్లు తిరిగాయి. తమలాంటి కొడుకులందర్నీ చంపి పాతరేసినా పాపం లేదనిపించింది. పాప భారంతో ఎత్తలేని తల భూమిలోకి దించుకున్నాడు నూకరాజు. 

------------------------------------------------------------------------------------------------------------------------

  2 జూన్ 2001.. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక ప్రచురణ..

విష్ణుమూర్తికి

 *కేశవ నామాలు-గణిత భూమిక*



విష్ణుమూర్తికి 24 పేర్లున్నాయి. వాటిని కేశవనామాలంటారని మనకు తెలుసు. ఇవి 24 మాత్రమే ఎందుకు ఉన్నాయి?వీటికి కాలచక్రానికి,గణితానికి ఏమైనా సంబంధం వున్నదా?

ఈ *24 కు గణిత పరమైన భూమిక ఏమిటి*? చూద్దాం.


విష్ణుమూర్తిని చతుర్భుజుడు అంటాం.అంటే నాలుగు చేతులు గలవాడని కదా?

ఈ నాలుగు చేతుల్లో శంఖం,చక్రం, గద,పద్మాలను ధరించి మనకు దర్శనమిస్తాడు.


నిశితంగా పరిశీలిస్తే, ఈ నాలుగు ఆయుధాల యొక్క అమరికలలో వచ్చే మార్పుల వల్ల ఖచ్చితంగా 24 వేరువేరు రూపాలు విష్ణువునకు ఏర్పడతాయి. ఈ 24 రూపాలనే కేశవ నామాలంటారు.


*1.కేశవ నామాలలో మొదటి నామం కేశవ.*

కేశవ రూపంలో స్వామి కుడివైపు ఉన్న రెండు చేతులతో 

*పద్మము, శంఖము*

ధరించి ఎడమ వైపు ఉన్న రెండు చేతులతో 

*గద,చక్రం* 

ధరించి ఉంటాడు.

*2.విష్ణువు యొక్క మరొక నామము మాధవ.*

ఈ రూపంలో కుడి వైపు రెండు చేతులతో

*గద,చక్రం* ధరించి,ఎడమవైపు ఉన్న రెండు చేతులతో

*పద్మము,శంఖము* ధరించి ఉంటాడు.

*3.మధుసూధన రూపంలో*

కుడివైపు చేతులతో *చక్రం, శంఖము* 

మరియు ఎడమవైపు చేతులతో

*గద,పద్మము* ధరించి ఉంటాడు.

*ఈవిధంగా ప్రతి పదిహేను రోజులకు*(పక్షానికొకసారి)

*పౌర్ణమికి, అమావాస్య కు* తన ఆయుధాలను చేతులు మార్చుకుంటూ ఉంటాడు శ్రీ మహా విష్ణువు.


*ఈ మార్పులు లేదా అమరికలను* మనం గణిత శాస్త్ర పరిభాషలో *ప్రస్తారాలు (permutations)* 

అంటాం. అనగా 4 వస్తువులను 4! 

(4 factorial) విధాలుగా అమర్చవచ్చు.

4! = 4×3×2×1=24


శ్రీమన్నరాయణుని గాయత్రి మంత్రం


*శంఖాన్ని* 'శ' తోను,

*చక్రాన్ని* 'చ' తోను,

*గదను* 'గ' తోను,

*పద్మాన్ని* ' ప'తోను సూచిస్తే,

*ఆ 24 అమరికలు* క్రింది విధంగా వుంటాయి.

*1) శచగప 2) శచపగ*

*3) శపచగ 4) శపగచ*

*5)శగచప 6)శగపచ*

*7)చపగశ 8)చపశగ*

*9)చగపశ 10)చగశప*

*11)చశగప 12)చశపగ*

*13)గపశచ 14)గపచశ*

*15)గచశప 16)గచపశ*

*17)గశపచ 18)గశచప*

*19)పచగశ 20)పతశగ*

*21)పశగచ 22)పశచగ*

*23)పగశచ 24)పగచశ.*

[పైవన్నీ *ఒక క్రమంలో* ఉన్నట్లు పరిశీలించి ఉంటారు.]

ఈ 24 నామాలు పెద్దలందరికీ తెలిసినా‌...

మరోసారి క్రింద ఉదహరిస్తున్నాను.

*కేశవ,నారాయణ*

*మాధవ,గోవింద*

*విష్ణు,మధుసూధన*

*త్రివిక్రమ,వామన*

*శ్రీధర,హృషీకేశ*

*పద్మనాభ,దామోదర*

*సంకర్షణ,వాసుదేవ*

*అనిరుధ్ధ,ప్రద్యుమ్న,*

*పురుషోత్తమ,అధోక్షజ*

*నారసింహ,అచ్యుత*

*జనార్ధన,ఉపేంద్ర*

*హరి శ్రీకృష్ణ.*

ఈ నాలుగు ఆయుధాలను అన్ని విధాలుగాను మార్చుకోవటానికి 

*24 పక్షాలు* అంటే

*12 నెలలు*

అనగా *ఒక సంవత్సరం* పడుతుంది.


*కంచి పరమాచార్య వైభవం*

 🌺🌻 *కంచి పరమాచార్య వైభవం* 🌻🌺


*అన్నదమ్ములు - ఆస్తి పంపకం* 


ఒకరోజు కంచిలో మహాస్వామి వారి దర్శనానికి కేరళలోని ఒక ఉన్నతమైన కుటుంబం నుండి దంపతులొకరు వచ్చారు. అతని ప్రకారం వారి కుటుంబ ఆస్తి వారిరువురు అన్నదమ్ముల మధ్య స్నేహపూర్వకంగా పంచుకోవడం సాధ్యపడదు. అతని అభిప్రాయంలో తన తమ్ముడు చాలా మొండివాడు. తన మాటకు విలువ ఇవ్వకుండా వేరుకాపురం పెట్టాడు. తను సమానంగా అస్తిని పంచి ఇద్దాము అని అనుకున్నా తను చెప్పే మాటలకు విలువ ఇవ్వడు. కాబట్టి ఆస్తి పంపకాల కోసం కోర్టులో దావా వెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అదే విషయమై స్వామివారిని కలిసి వారి ఆశీస్సుల కోసం వచ్చాడు. 


అంతా విన్న స్వామివారు, “సరే నువ్వు దావా వేస్తే ఎంత డబ్బుకి స్టాంప్ పేపర్స్ కొనవలసి ఉంటుంది?” అని అడిగారు. 


ఆ మొత్తం కొన్ని వేలల్లో ఉంటుందని చెప్పాడు. ”మరి న్యాయవాదికి ఎంత ఇవ్వాలి?”


అదీ కొంచం పెద్ద మొత్తం చెప్పాడు. 


”అది పూర్వీకుల ఆస్తి కాబట్టి చాలా ప్రభుత్వ శాఖల నుండి వాటికి సంబంధించిన కొన్ని పత్రాలను తెచ్చుకోవలసి ఉంటుంది. మరి దానికి కొంచం ఖర్చు అవుతుంది కదా? మరి ఆ ఖర్చు ఎంతవుతుంది?”


అవును అని అందుకు కొంచం మొత్తం అవుతుందని చెప్పాడు. 


”సరే! సమాన్యంగా ఇటువంటి దావాలు తొందరగా పూర్తి కావు. కాబట్టి ఈ దావా ఎంత కాలానికి ముగుస్తుంది అని అనుకుంటున్నావు?”


“అది చాలా కాలం పట్టవచ్చు” 


”అవును. అది చివరికి ముగిసినా, తీర్పు నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు కదా?”


“అలా అవుతుందని నేను అనుకోవడం లేదు”


“సరే! నీకు అనుకూలంగానే వచ్చింది అనుకుందాము. నీ తమ్ముడు పై న్యాయాలయానికి వెళ్ళవచ్చు కదా?”


“అవును. వెళ్ళవచ్చు”


“మరి అప్పుడు ఎంతో ఉన్నతమైన మీ కుటుంబం విషయం ప్రముఖ పత్రికల్లో ప్రచురించబడి అందరికి తెలియబడుతుంది. అవును కదా?”


అప్పుడు అతను కొంచం ఆలోచిస్తున్నట్టుగా చిన్నగా అవును అన్నాడు. ”కాబట్టి ఈ విషయమై న్యాయస్థానానికి వెళ్తే డబ్బు, సమయం, శక్తి వృధా. మీ ఇంటి గౌరవ మర్యాదలు, మీ అన్నదమ్ముల పరువు ప్రతిష్టలు దిగజారిపోతాయి. మరి దాని గురించి ఆలోచించావా?”


“ఏమి జరిగినా పర్వాలేదు నాకు సమ్మతమే అంటావా? ఇదేనా నీకు కావాల్సింది”


ఆ భక్తుడు మనసులో ఏ ఆలోచనతో అయితే వచ్చాడో ఇప్పుడు అది మాయమైపోయింది. కానీ ఇప్పుడు ఏమి చేయాలో అతనికి అర్థం కావటం లేదు. 


“పెరియవ మీరు చెప్పినట్టు దావా వెయ్యడం సరికాదు. నేను ఇప్పుడు ఏమి చెయ్యాలో నా తక్షణ కర్తవ్యం ఏంటో మీరే సెలవివ్వాలి” అని వేడుకున్నాడు. 


”ఏదో కారణానికి అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయినంత మాత్రాన అలాగే ఉండిపోవాలని లేదు కదా? నువ్వు ఎవరు? తను ఎవరు? మీ మధ్య గొడవ ఎంత పెద్దదైనా కావచ్చు ఇద్దరూ మళ్ళా కలవాల్సిందే. ఎందుకు మీరు ఇలాంటి మనస్థత్వాన్ని పెంపొందించుకోకూడదు?”


మహాస్వామి వారు కొద్దిసేపు ఆలోచించి, “సరే మీరిద్దరు ఏమి చెయ్యాలో నేను చెప్తాను. చాలా పళ్ళు, పూలు కొనుక్కుని నేరుగా మీ తమ్ముడి ఇంటికి వెళ్ళు. అతనిపై గుండెలనిండా ప్రేమతో వెళ్ళు. అతను తన భార్యతో కలిసి నిన్ను ఆదరంతో స్వీకరిస్తాడు. ప్రేమతో గుండేల్లోనుండి ఈ మాటలు చెప్పు ‘ఏదో జరిగినదేదో జరిగిపోయింది. నువ్వు ఎవరు? నేను ఎవరు? మొత్తం ఆస్తి అంతా నీ దగ్గరే ఉన్నా అది నా వద్ద ఉన్నట్టే. నాకూ సంసారం ఉంది కాబట్టి నీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వు. ఈ జన్మకే మనం అన్నదమ్ములం. చక్కగా ఉందాం’ అని చెప్పమని” చెప్పారు.


మహాస్వామి వారి మాటలననుసరించి, తమ్ముని ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకుని స్వామి వారి వద్ద సెలవు తీసుకున్నారు. 


వారు వెళ్ళిన తరువాత స్వామి వారు అక్కడున్నవారితో, “తనకుతానుగా వచ్చిన అన్నను చూసినవెంటనే వాళ్ళ శతృత్వం సగం పోతుంది. ప్రేమతో పలకరించిన అన్న మాటలను విన్న వెంటనే మొత్తం మరచిపోయి ఇతణ్ణి ఆదరిస్తాడు. కోర్టుకు వెళ్ళకుండానే వారు సంతోషంగా ఆస్తిని పంచుకుంటారు. మనం మంచి ఆలోచనలతో ప్రేమతో వెళ్తే, వారు కూడా మనల్ని అలానే ఆదరిస్తారు”


పరమాచార్య స్వామి వారి సలహా పనిచేసింది. కొన్ని రోజుల తరువాత అంతా సవ్యంగా జరిగినదనే వార్త శ్రీమఠానికి వచ్చింది.


*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం*


*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం॥*


🙏జై శ్రీ సాయి మాస్టర్🙏

స్థలపురాణానికి

 స్థలపురాణానికి ఆధారాలుండవు, నమ్మకం మాత్రమే వుటుంది.

............................................................


శ్రీకృష్ణదేవరాయలకు ఇద్దరు భార్యలు. పట్టపురాణి తిరుమలాంబ, రెండవభార్య చిన్నమదేవి. శ్రీకృష్ణదేవరాయలు పరమవైష్ణవుడు. తిరుమల రాయుడు ఇతని ఇలవేలుపు. 1514 నుండి 1527 వరకు ఏడుసార్లు దేవేరులతో కలిసి తిరుమల తిరువెంగడనాథుని దర్శించి అనేకకానుకలు సమర్పించినాడు.


సాళువ నరసింహదేవరాయలు నిర్మించిన గోరంట్లలోని మాధవరాయస్వామి దేవాలయ గాలిగోపురం అసంపూర్తిగా ఎందుకుందో అక్కడి స్థలపురాణం ఏం చెబుతోందో చూద్దాం.ఎందుకో తెలియదు కాని చిన్నమదేవిని స్థానికకథ ప్రకారం సానువుల చిన్నమ్మ అని పిలుస్తారు. ఆవాలునే రాయలసీమలో సాసువులు అనడం కద్దు.


ఈ సాసువుల చిన్నమ్మ ఒకసారి భర్త అనుమతితో  పరివారంతో విజయనగరంనుండి హొసకోట, బళ్ళారి, ఉదిరిపికొండ, పెనుకొండ ల మీదుగా  తిరుమల బయలుదేరింది. గోరంట్ల అప్పటికి ఓ సీమకేంద్రం. సీమంటే ఇప్పటి జిల్లా అనుకోవచ్చు. దళవాయి ఆదెప్పనాయకుడు స్థానికకార్యకర్త అనగా ప్రతినిధిగా  గోరంట్ల సీమను పాలించేవాడు. రాణి గోరంట్ల దుర్గానికి రాగానే సాయంత్రమైంది. రాత్రిప్రయాణం కుదరదు కాబట్టి గోరంట్లదేవాలయంలోనే ఆ వెన్నెల రాత్రిలో బసచేసింది పరివారంతో.


ఆ సాయంత్రపు వెలుగులో ఆలయమూర్తికి పూజలు సమర్పించి చిన్నమ్మ ఆలయశిల్పసౌందర్యాన్ని చూచి ఆనందించింది.



ఆ పండు వెన్నెల రాత్రిలో ఆదెప్పనాయకుడు భార్య సమేతంగా రాణి చిన్నమదేవికి విందుభోజనం ఏర్పాటు చేశాడు. భోజనానంతరం తనతండ్రి వయసున్న అదెప్పనాయకుడితో రాణిగారు  పిచ్చాపాటి మాట్లాడుకొన్నారు.


దేవాలయం అద్భుతశిల్పకళతో అలరారుతోందని కాని నలుదిశలా గాలిగోపురాలు లేవని వాటిని తాను తిరుమల నుండి వచ్చేలోగా వాటిని పూర్తిచేయాలని అతనిని ఆదేశించింది. కాలినడక, అందలంలో ప్రయాణంకాబట్టి గోరంట్లకు తిరిగిరావటానికి  ఎంతలేదన్న నెలరోజులైనా పడుతుంది ఈలోగా గాలిగోపుర నిర్మాణాలు పూర్తైతే వాటిని చూచి దేవుడిసన్నిధిలో గడపాలని చిన్నమ్మ ఉద్దేశ్యం. అందుకు సరిపడ  ధనాన్ని కూడా అందచేస్తానని రాణి చెప్పింది.


అందుకు ఆ దళావాయి, కార్యకర్త అయిన ఆదెప్పనాయకుడు నెలరోజుల సమయంలో నాలుగుగోపుర నిర్మాణాలు పూర్తి చేయలేనని కనీసం ఆరునెలలైనా గడువుకావాలని విన్నవించుకొన్నాడు. అంత సమయం అక్కరలేదని నెలరోజులు చాలని చెప్పింది.


వారి మాటలు పంతాల వరకు వెళ్ళాయి. నేనైతే ఒక గొపుర  నిర్మాణాన్ని ఐదు రోజులలో పూర్తి చేయించగలనని రాణి పలికింది.సాధ్యంకాదని ఆదెప్పనాయకుడు పలికాడు.


నేను 5 రోజులలో పూర్తిచేయించగలనని ఒకవేళ పూర్తి చేయించకపోతే ఆదెప్పనాయకుడిని  గోరంట్ల మండలేశ్వరునిగా చేయించగలనని, అలా నిర్మాణం పూర్తిచేసినట్లైతే కార్యకర్తను కారాగారంలో బందీచేయించగలనని పంతం కాసింది.


ఆదెప్ప అందుకు సరేనన్నాడు. రాజు తలచుకొంటే ఏ పనైనా ఆగగలదా. చుట్టుపట్ల దుర్గాలనుండి నేర్పరులైన శిల్పులు వాస్తుపురుషులు పనివారు వచ్చారు. పనులు చకచక మొదలుపెట్టారు. నాలుగు పగల్లు నాలుగు రాత్రులు గడిచాయి. ఇక ఒక రోజే గడువుంది.తూర్పు గోపుర నిర్మాణం రాత్రిలోగా పూర్తిచేయాలి. వేగంగా గోపురనిర్మాణ పనులు కోడికూసేలోగా పూర్తిచేయాలి.ఆ వేగాన్ని చూచిన ఆదెప్పనాయకుడు భయపడ్డాడు.


శిక్షనుండి తప్పించుకోటానికి కపటోపాయం చేశాడు. తెల్లవారటానికి ఇంకా రెండుఝాములందనంగా కోడిపుంజు తెచ్చి ఆలయానికి దగ్గరలో కోక్కొరకోయని కూయించాడు.


తెల్లవారిందని అందరు భ్రమపడినారు. అనుకొన్న గడువులోగా తూర్పు గోపురనిర్మాణం చేయించ లేకపోయానని అవమానంగా భావించి సాసువుల చిన్నమ్మ  అదెప్పనాయకుడిని మండలేశ్వరునిగా నియమించాలని రాయలకు ఉత్తరం వ్రాయించి, అప్పటికప్పుడే తిరుమలకు బయలుదేరి వెళ్ళిపోయింది.


నా దృష్టిలో గోపుర అసంపూర్తి నిర్మాణానికి యుద్ధాలు, అంటురోగాలు, ఆత్మీయుల మరణాలు, లేదా ప్రకృతి వైపరీత్యాలు కారణం కావచ్చును.


స్థలపురాణానికి ఆధారాలుండవు, నమ్మకం మాత్రమే వుటుంది.

.....................................................................................................................................జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

ఇన్ఫెక్షన్

 ఇన్ఫెక్షన్ అనే పదాన్ని తెలుగులో సంక్రమణ అని అనువదించవచ్చు . ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సోకడం .  డిసీజ్  అంటే వ్యాధి . వైరస్ సోకడం వేరు . వ్యాధి బారిన పడడం వేరు 


వైరస్ సోకడం అనేదాన్ని పెద్దగా ఆపడం కుదరదు . జలుబు చేసే వైరస్ లు సోకుతూనే వున్నాయి . అమెరికా లాంటి దేశాల్లో కామన్ ఫ్లూ కు టీకా లు వున్నాయి . అయినా ఆ వైరస్ సోకుతూనే ఉంటుంది . మరో మూడు నెలలకో ఆరు నెలలలకో దేశం మొత్తానికి కరోనా టీకా ఇచ్చినా వైరస్ సోకడం అనేదాన్ని పూర్తిగా ఆపలేరు . ఇదో నిరంతర ప్రక్రియ గా సాగుతూ ఉంటుంది . టెస్ట్ లు చేసి కేసు లు కేసులు లు అంటూ  ఇప్పటిలా హైరానా పడితే ఇక జీవితాలు ఎప్పటికీ అంతే ! 


వైరస్ సోకడం , వ్యాధి బారిన పడడం    అనేదాని మధ్య ఉన్న తేడాను మనం అర్థం చేసుకోవాలి . వైరస్ సోకినప్పుడు మనలో ఇమ్మ్యూనిటి బలంగా ఉంటే అది వైరస్ ను మూడు రోజుల్లో చంపేస్తుంది . అలాంటి వ్యక్తులకు కనీసం జలుబు దగ్గు లాంటివి రావు . ఇన్ని రోజులు వారిని asymptomatic అంటూ పిలుస్తూ  వచ్చారు . పిల్లలు  అందరూ ఇదే క్యాటగిరీకి వస్తారు . లక్ష మంది పిల్లలకు కరోనా సోకితే ఒక్కరే వ్యాధి బారిన పాడుతారు అనేది నిరూపితమైన సత్యం . 


ఇన్నాళ్లు అసిమ్పటోమాటిక్ వ్యక్తుల నుంచి మిగతా వారికి సోకుతుందేమో అనే భయం ఉండేది . ఇప్పుడు టీకా వచ్చింది . టీకా వేసుకొన్న వారికి కరోనా సోకడం అనేదాన్ని ఆపలేము . కానీ టీకా ప్రభావం వల్ల వారు అసిమ్పటోమాటిక్ గా మారిపోతారు . అంటే వారికి వైరస్  సోకుతుంది కానీ వారు వ్యాధిగ్రస్తులు కారు . అంటే వారికి వ్యాధి లక్షణాలు పెద్దగా వుండవు . మహా ఉంటే ఒకటి రెండు రోజులు జలుబు దగ్గు .. అంతే . 


ఇప్పటికే మన దేశం లో వంద మందికి వైరస్ సోకితే 95 మంది అసిమ్పటోమాటికిగా వుంటున్నారు . మరో నలుగురు కూడా కేవలం మైల్డ్ గానే వ్యాధి బారిన పడుతున్నారు . తీవ్రంగా వ్యాధి  బారిన పడేది వందలో ఒక్కరే లేదా ఇంకా తక్కువ అంటే వెయ్యి లో ఒక్కరే ! ఇది నిరూపితమైన సత్యం . 


ఇన్ఫెక్షన్ { వైరస్ సోకడం } డిసీస్ { వ్యాధి బారిన పడడం } అనేదాని మధ్య తేడా గుర్తించనంత కాలం మన బతుకులు ఇలాగే   కునారిల్లు తాయి . అమాయకులైన ప్రజలు ఈ తేడా ను అర్థం చేసుకోలేక భయబ్రాంతులకు గురవుతారు . ఇది మారాలి . ఈ తేడా ను గుర్తించాలి . 


టీకా లు ఎంతో కొంత మేర కరోనా నుండి రక్షణ నిస్తాయి . అంటే డీసీసీ బారిన పడకుండా కాపాడుతాయి . అంటే టీకా వేసుకొన్న వారికి కరోనా సోకినా వారు పెద్దగా వ్యాధి గ్రస్తులు కారు . అంతకంటే మించి మన శరీరం లో డి విటమిన్ { రోజూ ఇరవై నిముషాలు ఎండలో కూర్చోవడం } సి విటమిన్ { కర్రీ లో నిమ్మకాయ పిండుకోవడం లేదా నారింజ పండు తినడం ; బి 12 విటమిన్ కోసం శాఖాహారులు టాబ్లెట్ తీసుకోవడం , ఐరన్ { ఆకుకూరలు } జింక్ { రోజుకు రెండు ఎండు ద్రాక్షలు } glycene { నువ్వులు } మాంసకృత్తులు { మాంసాహారులకు చికెన్ , మటన్ ఎగ్ { శాఖాహారులకు జామ కాయ, సొయా , పుట్టగొడుగులు , పనీర్ } ఉండేలా ఆహారం తీసుకోవడం జరగాలి . మన ఇమ్మ్యూనిటి వ్యవస్థ బలంగా ఉంటే ఎలాంటి వైరస్ అయినా మనల్ని ఏమీ చెయ్యలేవు . 1 . డైట్ .. అంటే పైన చెప్పినట్టు సమతుల ఆహారం } 2 . భయాందోళనలకు గురికాకుండా సంతోషంగా ఉండడం .. పాజిటివ్ ఫీలింగ్స్ ఇమ్మ్యూనిటి ను వంద రేట్లు బలోపేతం చేస్తాయి .  భయం లాంటి నెగటివ్ ఫీలింగ్ ఇమ్మ్యూనిటి ని చంపేస్తుంది . ౩. వర్కౌట్ .. అంటే కనీసం నడక . 4 . మంచి నిద్ర .. ఈ నాలుగు సూత్రాల దారంగా ఎనభై ఏళ్ళ వ్యక్తి కూడా వరం పది రోజుల్లో ఇమ్మ్యూనిటి ని బలోపేతం చేసుకోవచ్చు . ఇలా చేసుకోకపోతే ఇక పై ప్రపంచం లో వైరస్ లాబరేటరీ లు సృష్టించనున్న కొత్త వైరస్ ను ఎదుర్కోలేము . భయం నేడు ఒక వ్యాపార  వస్తువు . ప్రజల్లో భయాన్ని వ్యాపింప చేయడాన్ని ప్రపంచ వ్యాపితంగా అనేక శక్తులు తమకు లాభాలు కురిపించే వస్తువుగా మార్చుకొంటున్నారు . అప్రమత్తత అవసరం . బయన్దోళనలు అనవసరం . జాగరూకత అవసరం . లేక పొతే బతుకు సాగదు.


Wassapp forward

🙏🙏🙏🙏🙏🙏

వెల్లుల్లి ఉపయోగాలు

 వెల్లుల్లి ఉపయోగాలు - సంపూర్ణ వివరణ . 


     వెల్లుల్లి మిక్కిలి ఉష్ణమును పుట్టించును .  కఫ , వాత , శ్లేష్మములను , సూతికా , సన్నిపాతము , శీతల వాతము , వాత పురాణ జ్వరములను , శూల , అగ్నిమాంద్యము , అరుచి , అజీర్ణవికారములు , నంజు రోగములు , కడుపులో బల్లలు , ఉదరములు  ,  గుల్మ , శ్వాస , కాస , మూలరోగములు , క్షయ , కుష్టు మున్నగు వానిని నివారించును. 


               యునాని వైద్యము నందు ఈ వెల్లుల్లితో లేహ్యములు , షర్బత్తులు మొదలైన వాటిని యునాని వైద్యులు విస్తారంగా తయారుచేసి వాడుదురు . సర్వాంగవాతములు , ఆమవాత , పక్షవాతములు , తలతిప్పుట , నరముల రోగములు  పోగొట్టి ఆకలిని , అగ్నిదీప్తిని , కాంతిని , బలమును కలుగచేయును . వీర్యవృద్ధి , ఆయుర్వృద్దిని కలుగచేయును . రక్తశుద్దిని కలుగచేయును . కడుపులోని దుర్వాతములు , స్త్రీల రజో , రక్త సంబంధ దోషములు , మూత్రబద్ధకములు దీనివలన నెమ్మదించును. వెల్లుల్లిపాయలు మరియు మేకపాలతో కలిపి చేసిన లేహ్యము మిక్కిలి ధాతుపుష్టి కలిగించును. ఈ పాయలను నూనెలో కాచి చల్లార్చి దానిని చెవిలో పోసిన కర్ణరోగములు , చెవుడు మొదలైనవి హరించును . ఈ తైలమును పక్షవాతమునకు మర్దన చేయవచ్చు . విషములు హరించును . చిడుము మొదలైన చర్మరోగములు నశించును. లోపలికి పుచ్చుకున్న బహుమూత్రములు కట్టును . 


                 వెల్లుల్లి గడ్డలను కుమ్ములో ఉడికించి తినిన మూలవ్యాధులు నశించును. వెల్లుల్లి రసమును పూసినను లేక ఉప్పుతో నూరి కట్టినను గాయములు , బెణుకులు , వాత , మేహ వాతపు పోట్లు , కీళ్లపోట్లు నశించును. లోపలికి పుచ్చుకున్నచో ఉబ్బసరోగులకు వాత , పక్షవాత రోగులకు ఇది చాలా హితకరము . 


  గమనిక  - 


          దీనిని ఎక్కువ మోతాదులో , అతిగా వాడరాదు . అతివేడి కలిగించును. రక్తపిత్తము కలిగించును. మగతనం నశింపచేయును . మూలరోగము , గ్రహణి , రక్తవిరేచనాలు కలిగించును. దీనికి విరుగుళ్లు నెయ్యి , పులుసు , పాలు , ఉప్పు . వీటితో కలిపి వండిన దోషము నశించును.



           మరింత సమాచారం కోసం నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


   గమనిక  -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

కరోనా మళ్ళీ విజృంభిస్తుంది

 కరోనా మళ్ళీ విజృంభిస్తుంది 

మొదటిసారి మనచేతిలో 

ఆయుధంలేదు 

ఇప్పుడువున్నా చాలామంది 

అవివేకంతో ఉపయోగించుకోవటంలేదు 


భ్రమలో బ్రతకకండి 

కొంచెం ఆలోచించండి 


వ్యాక్సిన్ వేసుకుంటే జ్వరమొస్తుంది 

అక్కడ వారుపోయారు 

ఇక్కడ వీరుపోయారు అని 

ఎవరోచెప్పిన సొల్లుకబుర్లు వింటారేతప్ప 

మీరు ఆలోచించలేరా ?


ఇప్పటికి 

5 కోట్లకు పైగా మనదేశంలో వ్యాక్సిన్ 

వేయించుకున్నారు 


వ్యాక్సిన్ వల్ల ప్రమాదం వుంటే 

ఈపాటికి అల్లకల్లోలంగావుండేది 

కానీ ఇదిమనం ఆలోచించం 


మనపక్కింటివారో ,ఎదురింటివారో 

కనీసపు అక్షరజ్ఞానంలేనివారో 

చెప్పిందిమాత్రం వేదవాక్యంలా 

మనమనసులో నింపుకుంటాం 


మనకు ఎవరుచెపుతున్నారో 

ఆలోచించాలి 

కనీసపు అవగాహనలేనివారిని 

మనం మార్చాలి 


70 దేశాలకు భారతదేశం ఉచితంగా 

కరోనా వ్యాక్సిన్ అందిస్తుంటే  

ప్రపంచదేశాలు భారతదేశాన్ని 

సగౌరవంగా గౌరవిస్తుంటే  

మనంమాత్రం మనవ్యాక్సిన్ 

వేసుకోవటానికి ఆలోచిస్తున్నాం 


ఎవరికుటుంబం వారు కాపాడుకోవాలి 

నీతోఅవసరం ఉంటేతప్ప 

నీకోసం ఎవరురారు 

ఇది కలియుగధర్మం 


ఎవరోవస్తారు, ఏదోచేస్తారని  

ఆలోచించకుండా మిమ్మల్ని 

మీకుటుంబాన్ని కరోనానుండి 

మీరే రక్షించుకోండి  


అవసరాన్నిబట్టి వ్యాపారంచేసే 

ఈరోజుల్లో 

ప్రాణాలతో చెలగాటమాడి 

ప్రపంచాన్ని గడగడ లాడించిన

 కరోనా వ్యాక్సిన్ తో 

మనదేశం వ్యాపారం చెయ్యలేదు 

70 దేశాలకు ఉచితంగా 

వ్యాక్సిన్ అందించి భారతదేశ 

 హిందూధర్మమును చాటింది 


ఇంకా చాలాదేశాలు మనవ్యాక్సిన్ కోసం 

వేయికళ్ళతో ఎదురుచూస్తున్నాయి 


మనంమాత్రం   

మనగడపముందుకువచ్చిన 

మన వ్యాక్సిను అనుమానించి 

అవమానిస్తున్నాం 


అపోహలు మానండి, 

అవగాహన కల్పించండి, 

అందరూకలిస్తేనే సమాజమని 

మరువకండి, 

మళ్ళీ కరోనా విజృంభించకుండా 

ఎవరికర్తవ్యం వారు నిర్వర్తించండి 


కరోనా కన్న అతిభయంకరమైనది 

చాలమంది ఉపాధిని కోల్పోతున్నారు 

వారినిచూసి నవ్వకుండా చేయుతను 

ఇవ్వండి 


అవసరానికి ఉపయోగపడని ధనం 

మనిషి ఏదైనాసరే వ్యర్ధమే

హృదయాన్ని గెలవడానికి

 *హృదయాన్ని గెలవడానికి పద్దెనిమిది మెట్లు..!*


ఈ సృష్టిలో ఎదుటివారు చెప్పినది విని దాంట్లోని మంచి, చెడులను, నిజానిజాలు పరిశీలించే శక్తి 'విజ్ఞత' మానవుడికి మాత్రమే ఉన్నది. కానీ దురదృష్టం ఏమనగా ఈ రోజులలో నేను నమ్మిందే కరెక్టు ( పిడివాదం ) , నా ఇష్టం వచ్చిందే నేను చేస్తాను " ( మూర్కత్వంతో కూడిన అజ్ఞానం ) అనడమే గొప్ప విషయంగా చలామణి అవుతోంది. మహాభారతంలో దుర్యోధనుని వెంట భీష్మ, ద్రోణ, కృపాచార్యులున్నా ఎందుచేత మట్టుపెట్టబడ్డాడనేదానికి ఒకటే కారణం చెబుతారు పెద్దలు. దుర్యోధనుడితో మహర్షులందరూ చెప్పారు.


 ‘‘నీవు చేస్తున్నది తప్పు, నీ ఈ అనాలోచిత పని వలన పాడైపోతావు. మా మాట విను. ఇలా చెయ్యకు’’ అన్నారు. అందుకాయన ‘‘మీరు చెప్పేది మంచని తెలిసినా నేను పాటించను. మీరు చెప్పేది చెడని తెలిసినా నేను పాటించకుండా ఉండలేను’’ అన్నాడు. ఆ తత్వం పశువు కన్నా హీనం, అత్యంత ప్రమాదకరం.


మనిషి మనసులో దైవత్వం ఉంటే, మనిషి హృదయం ఒక పవిత్రమైన దేవాలయం అవుతుంది. ఈ ౧౮ (18) మెట్లను అధిరోహించి  దైవత్వాన్ని పొందగలిగిన మనిషి ధన్యుడవుతాడు.


౧. సంస్కారబలం ఉండాలి:- సంస్కారమనే మాట గొప్పది. చదువు దేనికోసం? సంస్కారబలం కోసం. చదువుకు సంస్కారం తోడైతే మీరు లోకానికి ఏ హితకార్యమైనా చేయగలరు. యుక్తాయుక్త విచక్షణ ఏర్పడుతుంది. సంస్కారబలంతో మీకు తెలియకుండానే గొప్ప వ్యక్తిత్వం ఏర్పడుతుంది.


౨. మోహాన్ని పోగొట్టుకోవాలి:- మిమ్మల్ని పొగుడుతూ మాట్లాడేవాళ్లు ఎక్కడికెళ్ళినా దొరుకుతారు. మీ క్షేమం కోరి, మీతో కఠినంగా మాట్లాడే వ్యక్తి దొరకడం కష్టం. దొరికినా అటువంటి మాట వినేవారు ఉండరు. ఒకవేళ అలా ఇద్దరూ దొరికితే జన్మ సార్థకమౌతుంది. మోహంలో పడిన అర్జునుడికి భగవద్గీతంతా చెప్పాడు కృష్ణ పరమాత్మ. చివరన ‘నీకేం అర్థమయింది’ అని అడిగాడు. ‘‘నాకు మోహం పోయింది. స్మృతి కలిగింది. నేను యుద్ధానికి బయల్దేరుతున్నా’’ అన్నాడు అర్జునుడు.


౩. తప్పొప్పుల కూడిక:- ఈ ప్రపంచంలో ఎవరూ ఒప్పులకుప్ప కాదు. నాలో దోషం తెలుసుకుంటే క్షమార్పణ అడుగుతా. మారీచుడు చెప్పాడు రావణుడికి ‘‘నీకేంలోటు, ఇంత మంది భార్యలున్నారు. కాంచన లంక ఉంది, భటులున్నారు. రాముడి జోలికి వెళ్ళకు. వెళ్ళావా, అన్నీపోతాయి’’ అన్నాడు. అన్నీ విన్న రావణుడు ‘‘నువ్వు చెప్పేది అయిపోయిందా. అయితే విను. నువ్వు చచ్చిపోవడానికి ఎలాగూ సిద్ధం. నామాట వింటే రాముడిచేతిలో చచ్చిపోతావు. వినకపోతే నా చేతిలో చస్తావు. ఎలా చచ్చిపోతావో చెప్పు’’ అన్నాడు. అంతేతప్ప నేను వింటానని అనలేదు. అలా అననందుకు అంత తప:శ్శక్తి ఉన్న రావణాసురుడు చివరకు ఏమై పోయాడు


౪. మాట వినడమన్నది తెలుసుకోవాలి:- మహాభారతం సమస్త సారాంశం ఇదే. దుర్యోధనుడి దగ్గరకెళ్ళి మహర్షులందరూ చెప్పారు, కొన్ని గంటలపాటూ చెప్పారు, అన్నీ విన్నాడు. అన్నీ విని వెటకారమైన మాటొకటన్నాడు. అహంకారబలం అది  ‘‘నాకు ధర్మం తెలియదా! తెలుసు. కానీ అలా చెయ్యాలనిపించడం లేదు. అయినా నేను తప్పులు చెయ్యడమేమిటి! నాకు చెబుతారెందుకు’’ అన్నాడు. మహర్షులు మాట్లాడుతుంటే సరిగా వినకుండా తొడలుకొట్టాడు, చివరకు తొడలు విరిగి పడి పోయాడు.


౫. పెద్దలమాట శిరోధార్యంగా స్వీకరించు:- తల్లి, తండ్రి, గురువులు, అనుభవజ్ఞులు, సమాజంలోని పెద్దలు చెప్పేది శ్రద్ధగా వినాలి. అయితే వారెప్పుడూ మన దగ్గరే ఉండి ఇలా చెప్పడం సాధ్యపడుతుందా ? పడదు కాబట్టి సత్పురుషుల చరిత్రలు చదువుతూ, సన్మార్గంలో ఉండే వారితో సహవాసం చేయాలి. 


౬. బాగుపడినా, పాడయిపోయినా కారణం - జడత్వమే:- జడమనే మాట ఒకటుంది. జడం - అంటే చైతన్యముంటుంది, కానీ ప్రతిస్పందన ఉండదు. ఒక రాతిలో చైతన్యం లేదని చెప్పలేం. కానీ దానిలో ప్రతిస్పందన ఉండదు. మీరు వెళ్ళి ఒక చెట్టును కొట్టారనుకోండి. మీకు వినబడకపోవచ్చు కానీ, దానిలో ప్రతిస్పందన ఉంటుంది. ఈ ప్రతి స్పందించగల శక్తి జడత్వానికి విరోధి. జడత్వం - అంటే చైతన్యం ఉండి కూడా ప్రతిస్పందించలేని బతుకు. ఒక మాటంటే ప్రతిస్పందన ఉండదు. అలాంటి ప్రతిస్పందనలేని లక్షణంలో నుంచి జడత్వం ఆవహిస్తుంది. అసలు లోకంలో ఒక వ్యక్తి వృద్ధిలోకి వచ్చినా, ఒక వ్యక్తి పాడయిపోయినా కారణమేమిటని అడిగింది శాస్త్రం. అందుకు జడత్వమే కారణం.


౭. ఆదర్శాలు చెప్పడమే కాదు ఆదర్శంగా మారాలి:- ఎప్పుడు ఏం చేస్తున్నా శ్రీరామాయణంలో చెప్పిన విషయాలను ఆదర్శంగా తీసుకుని ఆచరణలోకి తీసుకు వచ్చే ఒక కార్యశీలిని ‘నడిచే రామాయణం’ అంటారు. తాను చెప్పడం వేరు, తానే ఆ వస్తువుగా మారడం వేరు. చెప్పడం అందరూ చెప్తారు. ‘‘సర్వోపదేవ ఉపదేశాయ సర్వే వ్యాసపరాశరః:’’. ఇంకొకడికి చెప్పమంటే ప్రతివాడూ వ్యాసుడే, ప్రతివాడూ పరాశరుడే. కానీ నీవు చెప్పినదాంట్లో నీవెంత ఆచరిస్తావన్నదాన్నిబట్టి నీవు ఆదర్శంగా మారడమనే వస్తువు సిద్ధిస్తుంది.


౮. ఎవరిలోపాన్ని వారే దిద్దుకోవాలి:- నాకు ఇలా ఉండటం తప్ప ఇంకోలా రాదనుకోవడం చాలా భయంకరమైన స్థితి. అది దిద్దుకోవలసిన స్థితి. మనిషి తాను తనలో ఉండకూడని లోపాన్ని దిద్దుకుంటే పదిమందికీ అతను పనికొస్తాడు. పదిమంది మీతో మాట్లాడటానికి అవకాశం ఇస్తే, మీరేమీ చేయాలో మీరు నిర్ణయం చేసుకోగలరు. మీ అభిప్రాయానికి ఒక స్పష్టత వస్తుంది. అసలు అందరూ మీ దగ్గరికి రావడానికి భయపడిపోయే స్థితిని కలిగిస్తే, ‘‘మీరు ఎక్కడ ఎలా ఉండి ఏం ప్రయోజనం’’ చెప్పండి.


౯. కోపాన్ని తగ్గించుకోవాలి:- మీ కోపాన్ని మీకు మీరుగా పరిశీలించి దిద్దుకోవాలి తప్ప. నాకు కోపం వచ్చేసిందండీ. నేను కోపిష్టివాడినండీ అన్న తరువాత మీ ఆ కోపాన్ని తగ్గించగలిగే వాడు ఉండడు. దానికన్నా శత్రువు లేడు. నేను ఇలా ఉండవచ్చా? ఇంతటి కోపమేమిటి నాకు. ఈ కోపం వల్ల నేను సాధించేదేమిటి? అని కోపం వచ్చినప్పుడు మీరు కాసేపు ఏకాంతంలో కూర్చుని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. మీకు వచ్చిన కోపాన్ని మీరు పరిశీలనం చేసుకొని కోపాన్ని విడిచిపెట్టగలిగిన వాడెవరో వాడు దేశానికి, సమాజానికి పనికొచ్చి తీరుతాడు.


౧౦. జీవితం ప్రణాళికా బద్ధంగా ఉండాలి:- అధికారులు కింది వారిని సంప్రదించాలి. పని చేయడంలోని సాధకబాధకాలను తెలుసుకోవాలి. అధికారి చేతిలో వేలకోట్ల రూపాయల నిధులు విడుదల చేసే అధికారం ఉంటుంది. అవి సక్రమంగా ఖర్చుకావాలి. ప్రజలకు ఉపయోగపడాలి. అందుకు సరైన ప్రణాళిక ఉండాలి. రేపు మీరే ఆ అధికారి అయితే? అందుకే కత్తికి రెండు వైపులనూ అర్థం చేసుకుని ప్రణాళిక రచన చేయడానికి తగిన నైపుణ్యాన్ని అలవరుచుకోవాలి.


౧౧. వినండి, వినడం నేర్చుకోండి:- ఒక సమస్యను బాగా పరిశీలించి, అవసరం అయితే కిందికి వచ్చి విని దానిని విశ్లేషణం చేసే నైపుణ్యం ఉండాలి. ఎవరైనా మాట్లాడటం మొదలు పెట్టేటప్పటికి రంధ్రాన్వేషణ చేయడం అన్నది జీవితంలో అలవాటు అయిపోయిందనుకోండి. అంతకన్నా ప్రమాదకరమైన అలవాటు ఇంకోటి లేదు. మీ జీవితంలో పైకి రావాల్సిన మార్గాలన్నీ మూసేసుకున్నట్టే. ఎవరు మాట్లాడుతున్నారన్నది కాదు. ఆ మాటలలో మనకు ఏమైనా సారాంశం అందుతుందా? అని ఎదురు చూసి, అందులో ఒక్క మంచి మాటను పట్టుకుని జీవితాన్ని మార్చుకోగలిగితే వారి జీవితం చక్కబడుతుంది.


౧౨. మీరు ఏది ఎందుకు చేస్తున్నారో స్పష్టమైన అభిప్రాయంతో ఉండండి:- నేను ఒక మాట చెబుతాను. మహాపురుషుడు వేరు, ఆ మహాపురుషుడు రాసిన పుస్తకం వేరు కాదు. వాల్మీకి వేరు, వాల్మీకి రామాయణం వేరు కాదు. ఇవి కలిసే ఉంటాయి.


౧౩. రబ్బరు బంతిలా ఉండాలి:- పది మందికి ఉపయోగపడకుండా ఎప్పుడు పోతారో తెలుసా? మీలో తట్టుకునే శక్తి లేనప్పుడు. మట్టి ముద్దను మీరు ఇలా పట్టుకుంటే పొరపాటున మీ చేతిలోంచి జారికిందపడిపోయిందనుకోండి. ఇహ అది పైకి లేవదు. అదే రబ్బరు బంతి అయితే ఎంత కిందపడిందో అంతపైకి లేస్తుంది. చిన్న పొరపాటు కూడా జరగకుండా మీ జీవితం ముందుకు సాగదు. మీరు ఎంత గొప్పవాళ్లయినా మీకు వంక పెట్టకుండా ఉండలేరు. ఎవరో ఒకరు వంకపెట్టారని మీరు మృత్పిండమై పాడైపోకండి. మీవల్ల ఏదో ఒకనాడు పొరపాటు జరగవచ్చు. జరిగిననాడు మట్టి ముద్దలా కిందపడిపోకండి.


౧౪. నిరాశను దరిచేరనివ్వకండి:- అబ్దుల్‌ కలాంగారి కెరీర్‌ ఎక్కడ నుండి ప్రారంభం. ఆయన కోరుకున్న ఉద్యోగం ఒకటి. ఆయనకు వచ్చిన ఉద్యోగం ఒకటి ఆయన నిరాశతో ఋషికేశ్‌లోని ఒక స్వామిజీ దగ్గరికి వెళ్లి కూర్చున్నారు. స్వామిజీ అలా వెళుతూ నీరసంగా కూర్చున్న కలాంగారిని పిలిచి అడిగారు. ఏం ఎందుకలా కూర్చున్నావని. ఈయనన్నారు. ‘‘నేను ఫలానా ఉద్యోగానికి  ఇంటర్వకు వెళ్లాను, అది పొందడం నాకిష్టం. కాని నేను సెలెక్ట్‌ అవ్వలేదు. ఏదో ఈ ఇంటర్వు అని మరో దానికి వెళ్లాను,  సెలెక్ట్‌ అయ్యాను. ఇప్పుడు నాకీ ఉద్యోగం చేయాలని లేదు. నాకిష్టంలేదు’’ ఆ స్వామీజీ ఒక చిరునవ్వు నవ్వి అన్నారు. ‘‘నీవు కోరుకుంటున్నదే దొరకాలని ఎందుకనుకుంటున్నావు. ఏమో ఈశ్వరుడు నీ ద్వారా ఈ జాతికి యేం చేయించాలనుకుంటున్నాడో’’ ఆ మాట ఆయన మీద పనిచేసింది. అంతే ఈ దేశానికి ఉపగ్రహాలు తయారు చేసుకోవడానికి సత్తానిచ్చిన మహాపురుషుడయ్యాడు.


౧౫. మంచి మంచి పుస్తకాలు చదవండి:- ఏ పుస్తకం పడితే అది చదవకండి. వివేకానందుని ఉపన్యాసాలు చదవండి. మీకెంతో ధైర్యం వస్తుంది. పేడలో పురుగుపుట్టి పెరిగినట్లు బ్రతకకూడదు. మంచిగా బ్రతకడానికి కలేజా కావాలి. రామకృష్ణ పరమహంస కథలు చదవండి. సాహితీ సభలకు వెళితే చక్కగా తెలుగులో మాట్లాడండి. పోతన గారి నాలుగు పద్యాలు చెబుతూ ప్రసంగం చేయండి. గురువుల పట్ల, పెద్దల పట్ల మర్యాదను సంతరించుకోండి.


౧౬. ఆరాధించడం కాదు ఆదర్శంగా తీసుకోవాలి:-  ప్రపంచ ప్రఖ్యాత బ్యాట్స్‌మన్‌ సచిన్‌ టెండూల్కర్‌కు ఉత్థాన పతనాలున్నాయి. ఎంత కిందకి పడిపోయాడో అంతపైకి లేచాడు. టెండూల్కర్‌ క్రికెట్‌ చూడటం కాదు. టెండూల్కర్‌ వెనుక ఆ స్థాయికి ఎదగడానికి ఉన్న కారణం చూడండి. ఒక బాల్‌ వస్తున్నప్పుడు గ్రద్ద ఆకాశంలో ఉండి కోడిపిల్లను చూస్తున్నట్టు చూస్తూ ఉంటాను. బంతి ఎక్కడ పడుతుంది. దీన్ని ఏ డైరెక్షన్లో కొట్టాలి? అని... అంతే! స్ట్రోక్‌ అప్లై చేస్తాను అన్నాడు. అలా మీరు కూడా మీ గురువుల గురించి చెప్పేటటువంటి శీలాన్ని అలవాటు చేసుకోండి.


౧౭. విజయాన్నీ, వైఫల్యాన్నీ సమానంగా తీసుకోవాలి:- మనం చేసే ప్రతి ప్రయత్నంలో విజయం, వైఫల్యం అంటూ ఉంటుంటాయి. ఒక చోట విజయం వరిస్తే ఇక నా అంతటి వాడు లేడని రొమ్ము విరుచుకుని తిరగకూడదు, అక్కరలేని భేషజాలకు పోయి పాడయి పోకూడదు. అలాగే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రయత్నం ఫెయిల్‌ అయినట్లు కనబడుతుంటుంది. అలా ఫెయిలవడం నీ జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణం కావాలి. కాబట్టి ఎప్పుడైనా ఎవరికైనా వైఫల్యం సంభవిస్తే బెంగపెట్టుకుని స్తంభించి పోకూడదు. మళ్ళీ ఉత్సాహంగా పట్టుదలతో వృద్ధిలోకి రావాలి.


౧౮. పొగడ్తకు పొంగిపోకండి:- ఎప్పుడైనా సరే పొగడ్తకు మించిన మత్తు ఉండదు. పొగడ్తకు మించి లోకంలో పాడవడానికి మరొక కారణం కూడా కనిపించదు. జీవితంలో పొగడ్త అన్నది ఎంత మోతాదులో పుచ్చుకోవాలో అంతే మోతాదులో పుచ్చుకోవాలి. మందులే కదా అని మోతాదుకు మించి తీసుకుంటే విషమై చచ్చిపోతారు. అలాగే నీవు వృద్ధిలోకి రావడానికి పొగడ్త కూడా ఎంతవాడాలో అంతే వాడాలి.


*ఓం నమో నారాయణాయ*



🕉🕉🕉🕉🕉🕉

ఆది పర్వము -9

 దశిక రాము


      కవిత్రయ


  మహా భారతం



ఆది పర్వము -9


వినతా కద్రువల పందెం :


ఇంద్రుని ఉచ్ఛైశ్వం సముద్రతీరంలో తిరగటం చూసిన కద్రువ వినతతో అంతటి తెల్లని అశ్వం తోక మాత్రం నల్లగా ఉందని చెప్పింది. అందుకు వినత తోక తెల్లగా ఉంది కదా అని చెప్పింది. దీనితో సవతులకు పంతం పెరిగి పందెం కాచారు. ఆ పందెం ప్రకారం గెలిచిన వారు ఓడిన వారికి దాస్యం చేయాలని ఒప్పందం కుదుర్చు కున్నారు. వినత అప్పుడే కావాలంటే దగ్గరకి వెళ్ళి చూద్దామని చెప్పింది. కద్రువ వినతను వారించి మరునాడు చూద్దామని ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన కద్రువ తన కుమారులను పిలిచి ఆగుర్రం తోక నల్లగా మార్చి తల్లిని దాస్య బాధ నుండి కాపాడమని అడిగింది.

 అది అధర్మమని చేయలేమని నిరాకరించిన కుమారులను సర్పయాగంలో పడి మరణించమని శాపం ఇచ్చింది. ఇది చూసి భయపడిన కర్కోటకుడు అశ్వం తోకకు చుట్టుకున్నందు వలన తోక నల్లగా ఉందని భ్రమపడిన వినత కద్రువకు దాస్యం చేయటం మొదలుపెట్టింది.


వినత దాస్యవిమిక్తి :


తరువాత వినత రెండవ అండం నుండి అతి బలవంతుడైన గరుత్మంతుడు జన్మించాడు. గరుత్మంతుడు తల్లితో చేరి దాస్యం అనుభవిస్తున్నాడు. ఒక రోజు కద్రువ గరుడా ! నీ తల్లి నాకు దాసి నీవు దాసీ పుత్రుడవు. కనుక నీవు రోజూ నీ సోదరులైన నాగులను రెక్కలమీద విహారానికిని వెళ్ళు అన్నది. ఒక రోజు గరుత్మంతుడు నాగులను రెక్కలమీద ఎక్కించుకుని సూర్య మండల సమీపానికి వెళ్ళాడు. వేడికి తట్టుకోలేని నాగులు సొమ్మసిల్లి పడిపోయాయి. కద్రువ ఇంద్రుని ప్రార్ధించి వర్షం కురిపించి పుత్రులను సేద తీర్చింది. పుత్రుల అవస్థకు కారణమైన గరుత్మంతుని తీవ్రంగా దూషించింది. అది సహించలేని గరుత్మంతుడు తమ దాస్యానికి కారణం ఏమిటని వినతను అడిగి తెలుసుకున్నాడు. తల్లి దాస్యాన్ని తాను తీర్చగలనని తెలుసుకున్నాడు. గరుత్మంతుడు తమ దాస్య విముక్తి చేయడానికి ఏమి కావాలని కద్రువను అడిగాడు. ఆమె తన కుమారులకు అమృతం తెచ్చి ఇస్తే దాస్య విముక్తులు కాగలరని చెప్పింది. గరుత్మంతుడు అమృతం తీసుకు రావడానికి బయలు దేరాడు. మార్గమధ్యంలో తనకు తీవ్రంగా ఆకలి అయింది. ఆకలి తీర్చమని తండ్రిని అడిగాడు. కశ్యపుడు కుమారా విభావసుడు సుప్రీతకుడు అనే అన్నదమ్ము ఉన్నారు. తమ్ముడు ఆస్తిలో భాగం అడిగినందుకు కోపించి అతడి ఏనుగువు కమ్ము అని విభావసుడు శపించాడు. తమ్ముడు కోపించి అన్నను తాబేలువు కమ్ము అని ప్రతి శాపం ఇచ్చాడు. అప్పుడు వారిరువురు మూడు యోజనములు పొడవు పది యోజనము వెడల్పు గల తాబేలు గానూ, ఆరు యోజనముల పొడవు పన్నెండు యోజనముల వెడల్పు కలిగిన ఏనుగుగానూ మారి పోయారు. కానీ ఇప్పటికీ కలహించుకుంటూ ఉన్నారు. నీవు వారిరువురిని పట్టి తిని ఆకలి తీర్చుకో అన్నాడు . గరుడుడు సంతోషించి విభావసుడు అనే ఏనుగుని సుప్రతీకుడు అనే తాబేలును తీసుకుని రోహణుడు అనే వృక్షపు కొమ్మ మీద కూర్చున్నాడు. ఆ బరువుకు ఆ కొమ్మ విరిగింది. ఆ వృక్షపు శాఖలో తపసు చేసుకుంటున్న మునులను చూసాడు. వారు క్రింద పడతారని భావించి ఆ కొమ్మను పట్టుకుని తండ్రి దగ్గరకు వెళ్ళి ఏమి చేయాలి అని అడిగాడు. కశ్యపుడు మునులను చూసి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకొమ్మని ప్రార్ధించాడు. మునులు అంగీకరించి కొమ్మను విడిచి వెళ్ళారు. గరుత్మంతుడు ఆహారాన్ని భుజించి దేవలోకానికి చేరాడు. దేవలోకానికి చేరిన గరుత్మంతుడు అమృత రక్షకులను ఓడించి అమృతాన్ని తీసుకు వెళుతున్నాడు. అప్పుడు విష్ణుమూర్తి గరుడుని వద్దకు వచ్చి నీ సాహసానికి మెచ్చాను వరం ఏమి కావాలి అని అడిగాడు. అందుకు గరుత్మంతుడు దేవా సేవించకుండానే చిరంజీవిగా ఉండాలి, విష్ణుమూర్తికి వాహనం కావాలి అని కోరుకున్నాడు. ఇంతలో ఇంద్రుడు గరుత్మంతునిపై వజ్రాయుధాన్ని వేసాడు. తనపై వేసిన వజ్రాయుధాన్ని గౌరవించి ఒక ఈకను మాత్రం తుంచమని చెప్పాడు. ఇంద్రుడు గరుడుని బలానికి అచ్చెరువు చెంది అతనితో మైత్రి చేసుకున్నాడు. గరుడా క్రూరులైన నాగులకు అమృతాన్నిచ్చి లోకాలకు కీడు చేయవద్దని వేడుకొన్నాడు. అందుకు సమ్మతించిన గరుత్మంతుడు నేను అమృతాన్నిచ్చి నా తల్లితో సహా దాస్య విముక్తులము అవుతాము. ఇంద్రా నీవు వారు అమృతం సేవించే లోపు తిరిగి తీసుకొని వెళ్ళు అని చెప్పాడు. అలాగే చేసి తల్లిని దాస్య విముక్తి చేసి తన రెక్కలపై పెట్టుకొని తీసుకు వెళ్ళాడు. అమృతం త్రాగే ముందు నాగులు శుచి అగుటకు నదిలో స్నానమాచరించే సమయంలో ఇంద్రుడు అమృతాన్ని తీసుకు వెళ్ళాడు. నిరాశ పడిన నాగులు అమృతం ఉంచిన దర్భలు నాకాయి. ఆ కారణంగా వాటి నాలుకలు రెండుగా చీలి పోయాయి. ఆనాటి నుండి నాగులు ద్విజిహ్వులు అయ్యారు. అమృతం పెట్టిన కారణంగా దర్భలు పవిత్రం అయ్యాయి. ఇదంతా చూసిన ఆదిశేషుడు తల్లి మీద తమ్ముల మీద అసహ్య పడి వారిని విడిచి వెళ్ళి బ్రహ్మను గురించి తపస్సు చేసాడు. అతని సత్య సంధతకు ధర్మనిష్టకు మెచ్చిన బ్రహ్మ దేవుడు భూభారాన్ని మోసే భారాన్ని ఆది శేషునకు అప్పగించాడు.


నాగులను రక్షించే ప్రయత్నం :


ఆది శేషువు వెళ్ళగానే కద్రువ కుమారులకు సర్పయాగం భయం పట్టుకుంది. అందు వలన కలత చెందిన వాసుకి నాగులను పిలిచి తనకు పాలసముద్ర మధనంలో సహాయపడిన కారణంగా దేవతలందరూ బ్ర


హ్మతో చెప్పి నాకు చిరంజీవత్వం లభించేలా చేసారు. మిగిలిన నాగులను రక్షించే ప్రయత్నం చేయాలని చెప్పాడు. అది విని ఏలా పుత్రుడు అనే పాము అమ్మ శాపం ఇచ్చే సమయంలో నేను అమ్మ ఒడిలో పడుకుని దేవతల మాటలు విన్నాను. దేవతలంతా బ్రహ్మదేవా ఏ మాత్రం దయ లేకుండా కద్రువ కుమారులకు శాపం ఇచ్చింది. దీనికి విమోచన లేదా అన్నారు. బ్రహ్మ దేవుడు దేవతలతో పాములు లోకానికి హాని చేస్తాయి కనుక ఈ శాపం మంచిదే. అయినా మంచి సర్పాలను రక్షించే ప్రయత్నం జరత్కారుడు జరత్కారువు దంపతులకు పుట్టిన ఆస్తీకుడు చేస్తాడు అని దేవతలు చెప్పగా విన్నాను. ఆ తరువాత వాసుకి తన సోదరి జరత్కారువుని వివాహమాడటానికి జరత్కారుని కోసం ఎదురు చూస్తున్నాడు. జరత్కారువు ఒక ముని. అతడు వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నాడు. ఒక రోజు ఒక మడుగు సమీపంలో ఎలుకలు కొరకగా మిగిలిన రెల్లు దుబ్బులను చూసాడు. వాటిని ఆధారం చేసుకుని వేలాడుతున్న ఋషులను చూసి మహాత్ములారా ఇలా తలకిందులుగా ఎందుకు వేలాడుతున్నారు. ఇదేమి తపస్సు అని అడిగాడు. అందుకు వారు మా వంశంలో పుట్టిన జరత్కారువు అనే పాప కర్ముడు వివాహం చేసుకుని వంశాభివృద్ధి చేయలేదు. అందువలన అతని పితృ దేవతలమైన మాకు ఉత్తమ గతులు కలుగలేదు. నీకు అతడు కనిపిస్తే మా సంగతి వివరించి మాకు ఉత్తమ గతులు కలుగచేయమని చెప్పు అన్నారు. అది విని జరత్కారువు పితృరుణం తీర్చుకొనే నిమిత్తం వివాహం చేసుకోవడానికి తనపేరు కలిగిన కన్య కోసం వెతకసాగాడు. కానీ అతనికి తన పేరు కలిగిన కన్య లభ్యం కాలేదు. అది తెలుసుకున్న వాసుకి తన చెల్లెలిని తీసుకుని జరత్కారుని దగ్గరకు వెళ్ళాడు. వాసుకి జరత్కారునితో మహాత్మా ఈమె నీ పేరు కలిగిన కన్య ఈమెను వివాహం చేసుకోండి అన్నాడు. అందుకు సమ్మతించి జరత్కారువును వివాహం చేసుకున్నాడు. అతడు భార్యతో నీవు నా మాటను ఎప్పుడూ మన్నించాలి నీవు నాకు ఎదురు చెప్పిన రోజు నేను నిన్ను విడిచి తపస్సు చేసుకోవడానికి వెళతాను అన్నాడు. ఆమె అందుకు అంగీకరించింది. జరత్కారువు గర్భవతి అయింది. ఒకరోజు సంధ్యా వందనం చేసుకునే సమయం అయిందని తన తొడపై తల పెట్టి నిద్రిస్తున్న భర్తను నిద్ర లేపి చెప్పింది. అందుకు జరత్కారుడు కోపించి నన్ను నిద్ర లేపి అవమానించావు. కనుక మన ఒప్పందం ప్రకారం నేను నిన్ను విడిచి తపస్సుకు వెళతాను. నీవు నీ అన్న వాసుకి దగ్గరకు వెళ్ళు అన్నాడు. జరత్కారువు వాసుకి ఇంటికి వెళ్ళింది. వాసుకి ఇంటికి చేరిన జరత్కారువు ఆస్తీకునికి జన్మ ఇచ్చింది. ఆస్తీకుడు చ్యవన మహర్షి కుమారుడైన ప్రమతి వద్ద విద్యాభ్యాసం చేసాడు.

🙏🙏🙏

సేకరణ