14, జులై 2024, ఆదివారం

*శ్రీ రామలింగేశ్వర ఆలయం*

 🕉 *మన గుడి : నెం 378*





⚜ *కర్నాటక  : అవని - కోలార్ *


⚜ *శ్రీ రామలింగేశ్వర ఆలయం*



💠 అవని ​​పేరు ద్రావిడ మూలానికి చెందినది. దీని అర్థం "భూమి". 

ఈ గ్రామం చరిత్రలో రామాయణ ఇతిహాస కథల రోజుల నాటి ప్రస్తావనను కనుగొంది. 

వాల్మీకి మహర్షి ఆశ్రమం సమీపంలోని అవని బెట్ట అనే కొండపై ఉందని గట్టి నమ్మకం.


💠 సీతను రాముడు అడవులకు పంపడం, అక్కడ వాల్మీకి ఆశ్రమంలో ఆమె లవకుశులకు జన్మనివ్వడం, తర్వాత అశ్వమేధయాగ సమయంలో రామలక్ష్మణులతో లవకుశులు యుద్ధంచేయడం రామాయణంలో మనకు బాగా తెలిసిన ఘట్టాలే. 

మరి సీతాదేవి లవకుశలకు జన్మనిచ్చిన ప్రదేశం ఎక్కడ ఉంది? ఆ ప్రదేశంలో ఉన్న ఆనవాళ్లు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.


💠 కర్ణాటక రాష్ట్రం, కోలారు జిల్లా, ముల్‌బాగల్‌ తాలూకాలోని ఆవని అనే పుణ్యక్షేత్రం ఉంది. అయితే శ్రీరాముడు లేకుండా సీతాదేవి మాత్రమే దర్శనం ఇచ్చే ఆలయం ఇది ఒక్కటే అని చెబుతారు.

 ఇక్కడ రామలక్ష్మణులూ, భరత,శత్రుఘ్నులతో పాటు సుగ్రీవాది వానరులూ తమ తమ పేర్లతో శివలింగాలను ప్రతిష్ఠించారు. 

వాల్మీకి తపస్సు చేసిన గుహనీ ఇక్కడ చూడొచ్చు.

 మొత్తంగా ఆవనిలోని ప్రతి అణువూ పరమ పవిత్రమే.



💠 గర్భవతైన సీతమ్మను రాముడి ఆజ్ఞ మేరకు అడవుల్లో వదులుతాడు లక్ష్మణుడు. 

తర్వాత ఆమె వాల్మీకి ముని ఆశ్రమానికి చేరుతుంది. 

సీతమ్మను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటాడు వాల్మీకి మహర్షి. 

ఆశ్రమంలోనే లవకుశులకు జన్మనిస్తుంది సీత. లవకుశులు అక్కడే పెరుగుతూ సకల విద్యలనూ అభ్యసిస్తారు. 


💠 ఆశ్రమం దగ్గరలోనే ఓ చోట సీతమ్మ పార్వతీదేవిని పూజించేదట.

 తర్వాత రాముడు అశ్వమేధయాగం చేస్తాడు. అప్పుడు వదిలిన గుర్రాన్ని లవకుశులు కట్టేయడంతో రాముడూ ఆయన సోదరులకీ, లవకుశులకూ మధ్య యుద్ధం జరుగుతుంది. తర్వాత విషయం తెలుసుకున్న రామభద్రుడు కన్నబిడ్డల మీద యుద్ధానికి దిగినందుకు ఎంతో వ్యధ చెందుతాడు. ఈ పాపానికి పరిహారంగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు సహా వానరులూ రామ పరివారమంతా అక్కడే శివలింగాలను ప్రతిష్ఠించి ప్రార్థిస్తారు.


💠 10వ శతాబ్దంలో నొలంబ రాజవంశంచే నిర్మించబడిన ఈ దేవాలయం తరువాత చోళ రాజవంశం మరియు విజయనగర రాజులచే పునరుద్ధరించబడింది.

  

💠 ఈ ఆలయంలో రామలింగేశ్వరుడు అనే పేరు శివునికి రాముడితో ఉన్న అనుబంధం నుండి ఉద్భవించింది.


💠 ఉత్తర రామాయణంలోని ఈ ఘట్టం జరిగిన చోటు ఇదేనని ఆవని స్థలపురాణంలో తెలుస్తోంది. అప్పుడు రాముడు ప్రతిష్ఠించిన లింగమే రామలింగేశ్వర స్వామిగా ఆవనిలో పూజలందుకుంటోంది. 

అంతేకాదు లక్ష్మణేశ్వర లింగమూ, భరత శత్రుఘ్నులు ప్రతిష్ఠించిన లింగాలనూ మనం ఇప్పటికీ దర్శించొచ్చు.


💠 నిజానికి ఆవనిలో మొత్తం 1100 దాకా శివలింగాలుండేవట. 

తురుష్కుల దండయాత్ర కారణంగా ఇప్పుడు వీటిలో కొన్నే మిగిలి ఉన్నాయి.

 ఆవనిలోని శివలింగాలకు చోళరాజులు గుళ్లు కట్టించారు. పల్లవులూ, విజయనగర రాజులూ వీటిని అభివృద్ధి చేశారు.


💠 సీతాదేవి పూజించినట్టుగా చెబుతున్న పార్వతీదేవి స్వయంభూ విగ్రహాన్ని ఇప్పుడు కూడా ఆవని కొండమీద ఉన్న సీతాపార్వతి ఆలయంలో చూడొచ్చు. 

తొలుత ఈ గుళ్లొ పార్వతీ దేవి మాత్రమే ఉండేదట. 


💠 ఒకసారి ఆదిశంకరాచార్యులు ఈ ఆలయాన్ని దర్శించినప్పుడు ఆయనకు ఆదిశక్తి కలలో కనిపించి తన విగ్రహం పక్కనే సీతాదేవి విగ్రహాన్నీ ప్రతిష్ఠించమని చెప్పిందట. 

శంకరులు దాన్ని శిరసావహించారు. 

ఇక ఇక్కడి కొండ మీద వాల్మీకి తపస్సు చేసుకున్న గుహగా పిలిచే ఓ గుహను మనం చూడొచ్చు. 


💠 లవకుశుల జన్మప్రదేశం, పవళించిన తొట్టె, ఉగ్గుగిన్నె, పసుపు కుంకుమ గిన్నెలు, నీళ్లు కాచే కాగు తదితరాల శిలామయ చిహ్నాలు ఇక్కడ కనిపిస్తాయి. 

సీతాదేవి బట్టలుతికిన బావి, స్నానం చేసిన కొలను, రామచంద్రుడితో లవకుశులు యుద్ధం చేస్తున్నారని తెలిసి ఆమె దుఃఖించిన చోటు తదితరాలుగా చెప్పే కొన్ని ప్రదేశాలూ దర్శనమిస్తాయి. కొండమీద లవకుశులు, బృహస్పతి, జాంబవంతుడు, ఆంజనేయుడు ప్రతిష్ఠించిన లింగాలకు చిన్న గుళ్లున్నాయి.


💠 ఇది ప్రస్తుత కోలార్ మరియు తుమకూరును కలిగి ఉంది.

 వారు శైవులు మరియు వారు నిర్మించిన దేవాలయాలు శివునికి అంకితం చేయబడ్డాయి . 

వారు 735 నుండి 1052 వరకు పాలించారు మరియు నంది హిల్స్ లో భోగనందీశ్వర ఆలయాన్ని సృష్టించిన ఘనత కూడా ఉంది .


💠 ఆలయ సముదాయంలో నలుగురు సోదరులు - రాముడు, లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నులకు అంకితం చేయబడిన నాలుగు ప్రధాన మందిరాలు ఉన్నాయి.


💠ఇలా వెలసిన ఈ పుణ్యక్షేత్రానికి ఆంధ్రా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

కానీ ఆలయ నిర్వహణ సరిగా లేదు.  రామలింగేశ్వర క్షేత్రం మినహా మిగిలిన అన్ని క్షేత్రాల్లో పురాణగాథలు చెప్పేందుకు సరైన వెలుతురు, నోటీసు బోర్డులు కూడా లేకుండా అంధకారంలో ఉన్నాయి.

అయినప్పటికీ ఇది సందర్శించదగినది. 

సోమవారం / రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️


•••••┉━•••••┉━•••••┉━•••••

*15-07-2024 / సోమవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━•••••┉━•••••

మేషం


సమాజంలో  ప్రముఖ వ్యక్తులతో  విలువైన విషయాలు గూర్చి చర్చిస్తారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణ సూచనలున్నవి. వృత్తి  వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.  ఉద్యోగస్తులకు  పదోన్నతులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో  శుభకార్యాలలో పాల్గొంటారు.

---------------------------------------

వృషభం


బంధు, మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు  అందుకుంటారు. ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. శత్రు సంభందమైన  సమస్యలు నుండి ఉపశమనం కలుగుతుంది. చేపట్టిన పనులలో ఆలోచనలు  కార్యరూపం దాలుస్తాయి. వృత్తి  వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాలలో   నూతన అవకాశాలు అందుకుంటారు.

---------------------------------------

మిధునం


ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఇతరులతో  మాటపట్టింపులు ఉంటాయి.నిరుద్యోగ  ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది.

---------------------------------------

కర్కాటకం


ఇంటా బయట అదనపు  బాధ్యతల వలన చికాకు పెరుగుతుంది. మానసిక అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. నూతన  ఋణాలు చెయ్యవలసి వస్తుంది. బంధు, మిత్రులతో స్పల్ప మాట పట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా  లాభిస్తాయి.   ఉద్యోగస్తులకు  ఆకస్మిక స్థానచలన సూచనలున్నవి.

---------------------------------------

సింహం


కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో  పాల్గొంటారు. అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. వ్యాపార విస్తరణకు లభించిన  అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది.

---------------------------------------

కన్య


అవసరానికి మించిన  ఖర్చులు  పెరుగుతాయి. కీలక విషయాలలో ద్విస్వభావ  ఆలోచనలు చెయ్యడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు కొంత  నిదానంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలలో మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు నిరుద్యోగులకు కొన్ని విషయాలలో నిరాశ పెరుగుతుంది.

---------------------------------------

తుల


ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. స్నేహితుల నుండి ఊహించని సహాయం అందుతుంది. నూతన వ్యాపారాల్లో మరింత పురోగతి  సాధిస్తారు. ఇంటా బయట   మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వృత్తి  ఉద్యోగాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

---------------------------------------

వృశ్చికం


ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం  మంచిదికాదు. నిరుద్యోగులు కొంత ఓర్పుతో ప్రయత్నాలు చేయాలి. నేత్ర   సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్ధిక  విషయంలో  లోటుపాట్లు ఉంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన  ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంతమాత్రంగా  సాగుతాయి.

---------------------------------------

ధనస్సు


సంఘంలో గౌరవ మర్యాదలు  పెరుగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆలోచనలు  కార్యరూపం దాల్చుతాయి.   వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలలో  ఆశించిన పురోగతి సాధిస్తారు.

---------------------------------------

మకరం


ధనపరంగా  అనుకూల వాతావరణం ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దూర ప్రయాణాలు  లాభసాటిగా సాగుతాయి. సమాజంలో  ప్రముఖుల నుండి   ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో  సమస్యలు అధిగమించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు  లభించిన  అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.

---------------------------------------

కుంభం


దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. గృహమున కొందరి ప్రవర్తన  మానసికంగా  చికాకు కలిగిస్తుంది. జీవితభాగస్వామితో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో తొందరపాటు  నిర్ణయాలు చేసి ఇబ్బందిపడతారు. వ్యాపారమున ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయి.  

---------------------------------------

మీనం


కుటుంబ వ్యవహారాలలో  అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. నిరుద్యోగ  ప్రయత్నాలు నిరాశపరుస్తాయి. ఆర్ధిక ఇబ్బందులు బాధిస్తాయి. వాహనప్రయాణలో అప్రమత్తంగా  వ్యవహరించాలి.  వ్యాపారాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో  అదనపు పనిభారం ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

•••••┉━•••••┉━•••••┉━•••••

🍁 *శుభం భూయాత్* 🍀

ఉప్పు గురించి

 ఉప్పు గురించి సంపూర్ణ వివరణ  - 


       ఆయుర్వేదం నందు లవణమును ( ఉప్పు ) 6 రకాలుగా వర్గీకరించారు. అవి 


  *  సైన్ధవ లవణము . 


  * సాముద్ర లవణము.


  *  బిడా లవణము . 


  *  సౌవర్చ లవణము . 


  *  రోమక లవణము . 


  *  ఔద్బిద లవణము . 


           లవణములు అన్నియు లవణ రసమును కలిగి ఉండి వేడిచేయు గుణమును కలిగి ఉండును. ఆహారంలో ఉపయోగించుటకు అన్ని లవణముల  కంటే సైన్ధవ లవణము మంచిది . 


 *  సైన్ధవ లవణము  - 


      హృద్రోగము నందు , వాపుల యందు , రక్తపోటు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారికి ఉప్పు నిషిద్ధమైనప్పటికీ సైన్ధవ లవణమును కొద్దిమోతాదులో వాడవచ్చు . సింధుపర్వత ప్రాంతమున భూగర్భగనుల నుండి సేకరించుట చేత దీనికి సైన్ధవ లవణం అని పేరువచ్చింది. ఇది సహజముగా పరిశుద్ధం అయినది. ఆకలిని పుట్టించును . ఆహారమును జీర్ణం చేయును . చలువ చేయును . నేత్రములకు మంచిది . వాత, పిత్త, కఫ దోషముల యందు పనిచేయును . 


              వ్రణములను శోధించి మాన్పును . నేత్రరోగులకు మంచిది . దాహమును అణుచును . విరేచనం చేయును . శ్లేష్మాన్ని కరిగించును. పాలతో కలిపి పుచ్చుకొనవచ్చు. దీనిని అమితముగా పుచ్చుకొనిన పైత్యమును చేయును . అతిసార రోగమును పుట్టించును . 


 *  సాముద్ర లవణము  - 


         ఈ లవణమును సముద్రపు నీరు ఎండబెట్టి చేయుదురు . ప్రతిరోజు మనం వాడుకునే ఉప్పు ఈకోవలోకే వచ్చును. ఇది విరేచనకారి , ఆకలిని పెంపొందించును. శ్లేష్మాన్ని వృద్ధిచెందించును . వాతాన్ని అణుచును. కఫవాతము , గుల్మము , విషము , శ్వాసకాస వీనిని హరించును . నేతిలో ఉప్పు వేసి పుచ్చుకొనిన శూలలు ( నొప్పులు ) తగ్గును. పరిణామ శూలతో అనగా ఆహారం అరుగు సమయములో నొప్పితో ఇబ్బందిపడేవారు భోజనం చేసే సమయములో మొదటిముద్దలో కొంచం ఉప్పు కలుపుకుని తినుచున్న పరిణామశూల నయం అగును. 5 గ్రాముల సాముద్ర లవణమును చల్లని నీటితో కలిపి ఇచ్చిన రక్తముతో కూడిన వాంతులు నయం అగును.  


                      తేలు కుట్టినప్పుడు 5 గ్రాముల ఉప్పు నీటితో కలిపి కరిగిన తరువాత ఇచ్చిన తేలు విషం వెంటనే తగ్గును. వేడినీటితో పుచ్చుకొనిన వాంతి చేయును . కడుపులో నొప్పి , గుండెల్లో నొప్పి వచ్చు సమయమున ఉప్పును ఒక కడాయిలో వేసి వేయించి ఒక గుడ్డలో పోసి మూటకట్టి నొప్పి భాగములో కాపడం పెట్టిన తగ్గును. వాతము , శ్లేష్మములను హరించి శరీరానికి వేడిపుట్టించును. 


         ఉప్పును అధికంగా తీసుకోవడం వలన కొన్నిరకాల దుర్గుణాలు కలుగును. ఎముకలు మరియు వీర్యము యొక్క బలాన్ని తగ్గించును . నేత్రవ్యాధులు , రక్తస్రావము , కుష్ఠు , విసర్పి , వెంట్రుకలు రాలిపోవుట , తెల్లబడుట వంటి దుర్గుణాలు కలుగును. 


       మిగిలిన లవణాలు అయిన సౌవర్చలవణము , బిడా లవణము , ఔద్బధ లవణము , రోమక లవణము వంటివి సురేకారముతో తయారుచేయును . వాటిని ఔషధముల యందు మాత్రమే ఉపయోగిస్తారు . ఆహారం నందు వాడుటకు పనిచేయవు . 


               సమాప్తం  


       ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

Panchaag


 

శాంతి మంత్రం*

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

      *శాంతి మంత్రం*

🕉️🕉️🕉️🕉️☸️☸️🕉️


*ఓం  పూర్ణమదః  పూర్ణమిదం*

*పూర్ణాత్పూర్ణ ముదచ్యతే  !*

*పూర్ణస్య   పూర్ణమాదాయ*

 *పూర్ణమేవావశిష్యతే  !!*


*ఈ ప్రపంచమూ, జీవరాశులూ  భగవంతుని నుండే ఉద్భవించాయి. అందుచేత   ప్రకృతిని,   ఇతర జీవులను ప్రేమించడం, భగవంతుణ్ణి ప్రేమించడమే, అన్న సత్యాన్ని సూచిస్తూంది , ఈ మంత్రం.*


*ఈశ, బృహదారణ్యక ఉపనిషత్తులకు  ఈ మంత్రం శాంతి మంత్రమై వెలుగొందుతూన్నది.*


ప్రతి పదార్ధం;-


*అదః = భగవంతుడు,*

*పూర్ణం = పూర్ణుడు,*

*మిదం = ఈ ప్రపంచం,*

*పూర్ణం = పూర్ణమైనది ,*

*పూరణాత్ = పూర్ణుడైన భగవంతుని నుండే*

*పూర్ణం = పూర్ణమైన ప్రపంచం,*  

*ఉదచ్యతే = ఉద్భవించింది,*

*పూర్ణస్య = పూర్ణంనుండి ,*  *పూర్ణం = పూర్ణాన్ని,*

*అదాయ = తీసివేసినా,*

*పూర్ణం ఏవ = పూర్ణం మాత్రమే,*

*అవశిష్యతే = మిగిిలి వున్నది.* 


తాత్పర్యం:-


*భగవంతుడు  పూర్ణుడు. ఈ ప్రపంచం పూర్ణమైనది . పూర్ణుడైన ఆ భగవంతుని నుండే  పూర్ణమైన ప్రపంచం ఉద్భవించింది.  పూర్ణం నుండి పూర్ణాన్ని తీసిన పిదప  సైతం పూర్ణమే మిగిలి వుంది.*


*ఓం శాంతిః శాంతిః శాంతిః!!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!!*

*ఓం నమః శివాయ॥*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*సంకలనం: దైవానుగ్రహంతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి.*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

మోదీ అంటే

 ఇది చూడండి మన దేశానికి,,, మన ప్రధానికి ఎంత గౌరవం దక్కిందో..... రష్యా పర్యటన ముగించుకొని వెళ్తున్న మోదీ కి రష్యా ప్రధాని పుతిన్,,, వాళ్ళ దేశం లో ని అత్యంత పౌర పురస్కారం అందించాడు.... మన దేశం లో భారత రత్న ఎలాగో వాళ్ళ దేశం లో ఇది అలాగా... దాని పేరు Order Of The Saint Andrew The aposo.... రష్యా ప్రధాని మన ప్రధాని మెడలో వేసాడు... కేంద్రం లో మోదీ బీజేపీ రాకముందు 14 మంది ప్రధానులు పాలించారు,,, ఎప్పుడైనా ఏ ప్రధాని కి అయిన ఏ దేశం లో అయిన ఇలా అంత్యంత పౌర పురస్కారం ఇచ్చారా... కానీ చాలా దేశాల్లో మోదీ కి ఇచ్చారు ఇదివరకు,,,, ఇప్పుడు రష్యా కూడా ఇచ్చింది.... కానీ మన దేశం లో ఉన్న దేశ ద్రోహ పార్టీలు,,, ఉగారావాదులకు సపోర్ట్ చేసే పార్టీలు,,, వాళ్లకు చెంచా గిరి చేసేవాళ్ళు,,,, దొంగలు దేశ ద్రోహులు అని తెల్సి కూడా ఓట్లు వేసే వాళ్లు అందరు మోదీ ఎం చేయలేదు అని తిడతారు,, అబద్దాలు ప్రచారం చేస్తారు.... మోదీ మా దేశానికి ఎప్పుడు ఒస్తారు అని ఏన్నో దేశాలు ఎదురు చూస్తున్నాయి... ఇక్కడున్న సన్నాసులకు మన ప్రధాని విలువ అర్థం కావట్లేదు.... ఎంత సేపు మోదీ అంటే బీజేపీ ప్రధాని అనుకుంటున్నారు కానీ మన దేశాన్ని అభివృద్ధి చేసే నాయకుడు అనుకోవట్లేదు....

దివ్యమైన జీవితం!*

 


            *దివ్యమైన జీవితం!*

                  ➖➖➖🙏


*మనం జీవించాల్సింది ‘దీర్ఘ’ జీవితం కాదు ‘దివ్య’ మైన జీవితం !*


*చాలా మంది ఆరోగ్యం కోసం పొద్దున్నా సాయంత్రం నడవడం చేస్తుంటారు, కొంతమంది వ్యాయామ శాలకి వెళ్లి రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు, కొంతమంది ఆసనాలు అవీ వేస్తుంటారు, కొంత మంది అలాటివి ఏమీ చేయకుండా రకరకాల ఖరీదైన పళ్ళు, పళ్ళ రసాలు, ఇంకా ఏవేవో ఎవరి స్థాయికి తగ్గవి వాళ్ళు తిని తాగుతూ ఉంటారు.*


*ఇలా రకరకాలుగా ఆరోగ్యం కోసం ఏవేవో చేస్తుంటారు. ఇలా ఎవరు ఏమి చేసినా ఆరోగ్యం తో     దీర్ఘమైన జీవితం గడుపుదామనే తప్ప వాళ్ళు కోరుకునే ఆ ఆరోగ్యం .. ఆ దీర్ఘమైన జీవితం ఎందుకోసమో వాళ్ళకే తెలియదు.*


*అటువంటి కార్యక్రమాలు అన్నీ కొంతమంది ఆరోగ్యం కోసం శ్రద్ధ తో చేస్తారు, కొంత మంది శారీరక ఆకర్షణ కోసం చేస్తారు, కొంత మంది సరదాకోసం చేస్తారు, కొంతమంది అలవాటుగా చేస్తారు, కొంతమంది అవతల వాళ్ళు చేస్తున్నారు కదాని వాళ్ళని చూసి చేస్తారు, కొంత మంది ఆడంబరం కోసం చేస్తారు .. కాని ఎవరు అలా రకరకాలు గా వ్యాయామాలు చేసి ఆరోగ్యవంతమైన శరీరం తో ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటున్నారో వాళ్ళు అలా ఆరోగ్యంతో బ్రతికున్నంత కాలం ఏమి చేయాలని అనుకుంటున్నారో అన్నది చాలా ముఖ్యం.*


*ఆరోగ్యంతో ఎక్కువ కాలం బ్రతకాలి అనుకునేవాళ్లు ఆ దీర్ఘాయుషుని మంచి, మానవత్వంతో, నిరంతరం సత్కార్యాలు చేస్తూ తోటి మానవాళికి….      తనకు చేతనైనంత సహాయ సహకారాలు అందిస్తూ నిస్వార్ధంగా ఉంటూ సద్వినియోగం చేసుకున్నప్పుడే ఆ ఆరోగ్యానికి ఆ జీవితానికి ఒక పరమార్ధం సిద్ధిస్తుంది.* 


*మనం ఆరోగ్యంగా ఎన్ని ఏళ్ళు బ్రతికాము అన్నది కాదు కావాల్సింది ఉన్నన్నాళ్ళు పదిమందికి ఆదర్శంగా బ్రతికామా లేదా అన్నది కావాలి.* 


*లేక పోతే మనతో పాటు ఆకులు అలములు తింటూ దీర్ఘమైన జీవితం గడిపే జంతువులకి మనకి పెద్ద తేడా ఏమీ ఉండనట్టే లెక్క.* 


*అందుకే మనం ఆరోగ్యం కాపాడుకునేది భోగవంతమైన దీర్ఘజీవితం గడపడం కోసం కాదు ఆదర్శవంతమైన ఒక దివ్యమైన జీవితం గడపడం కోసం !*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

డోనేషన్ ఇచ్చేవారికి

 *తిరుమల శ్రీవారి కి  లక్ష నుండి కోటి రూపాయలు కు పైగా డోనేషన్ ఇచ్చేవారికి కల్పించే సౌకర్యాలు*


🕉️ *లక్ష - ఐదు లక్షల రూపాయల డొనేషన్ :*


తిరుమలలో లక్ష నుంచి 5 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం ఒకరోజు 5 మందికి సుపథం దర్శనం కల్పిస్తారు. 1 రోజు 100/- రూమ్ ఇస్తారు . 6 చిన్న లడ్డులు ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు.



🕉️ *ఐదు - పది లక్షల రూపాయల డొనేషన్*


తిరుమలలో ఐదు నుంచి 10 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం మూడు రోజులు 5 మందికి సుపథం దర్శనం కల్పిస్తారు. 3 రోజులు 100/- రూమ్ ఇస్తారు . 10 చిన్న లడ్డులు మరియు ఒక మహాప్రసాదం ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు.



🕉️ *పది - 25 లక్షల రూపాయల డొనేషన్ : -*


తిరుమలలో 10 - 25 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం మూడు రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 3 రోజులు 500/- రూమ్ ఇస్తారు . 20 చిన్న లడ్డులు మరియు 10 మహాప్రసాదాలు ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు మరియు 1 సిల్వర్ కాయిన్ (50 గ్రాములు )




🕉️  *25 - 50 లక్షల రూపాయల డొనేషన్ :*


తిరుమలలో 25 - 50 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం ఒక రోజు సుపథం దర్శనం మరియు మూడు రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 3 రోజులు 1500/- రూమ్ ఇస్తారు . 4 పెద్ద లడ్డులు 5 చిన్న లడ్డులు మరియు 10 మహాప్రసాదాలు ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు మరియు 1 గోల్డ్ డాలర్ ( 5 గ్రాములు ) +ఒక సిల్వర్ కాయిన్ (50 గ్రాములు )



🕉️  *50 - 75 లక్షల రూపాయల డొనేషన్ :*


తిరుమలలో 50 - 75 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం ఒక రోజు సుప్రభాత సేవ మరియు 2 రోజులు సుపథం దర్శనం మరియు మూడు రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 3 రోజులు 2000/- రూమ్ ఇస్తారు . 6 పెద్ద లడ్డులు 10 చిన్న లడ్డులు మరియు 10 మహాప్రసాదాలు ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు మరియు 1 గోల్డ్ డాలర్ ( 5 గ్రాములు ) +ఒక సిల్వర్ కాయిన్ (50 గ్రామ)




🕉️  *కోటి రూపాయల డొనేషన్ :*


తిరుమలలో 75 లక్షల - 1 కోటి రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం రెండు రోజులు సుప్రభాత సేవ మరియు 3 రోజులు సుపథం దర్శనం మరియు 3 రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 3 రోజులు 2500/- రూమ్ ఇస్తారు . 8 పెద్ద లడ్డులు 15 చిన్న లడ్డులు మరియు 10 మహాప్రసాదాలు ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు మరియు 1 గోల్డ్ డాలర్ ( 5 గ్రాములు ) +ఒక సిల్వర్ కాయిన్ (50 గ్రాములు )



🕉️  *కోటి రూపాయల పైన డొనేషన్ :*


తిరుమలలో 1 కోటి రూపాయల పైన డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం 3రోజులు సుప్రభాత సేవ మరియు 4 రోజులు సుపథం దర్శనం మరియు 3 రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 3 రోజులు 3000/- రూమ్ ఇస్తారు . 10 పెద్ద లడ్డులు 20 చిన్న లడ్డులు మరియు 10 మహాప్రసాదాలు ఒక దుప్పట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు మరియు 1 గోల్డ్ డాలర్ ( 5 గ్రాములు ) +ఒక సిల్వర్ కాయిన్ (50 గ్రాములు ) మరియు వేద ఆశీర్వచనం.🙏🙏🙏🙏

ఏయే చెట్లు నాటాలి.*

 *మానవాళికి ఎక్కువ లబ్ది చేకూ రాలంటే ఏయే చెట్లు నాటాలి.*


*స్కంద పురాణం*లో ఒక అందమైన *శ్లోకం* ఉంది.


*అశ్వత్థామేకం పిచ్చుమండమేకం*

*న్యాగ్రోధమేకం దశ చించినికన్.*

*కపిత బిల్వా మాలకత్రయాంచ* *పంచా ఆమ్రముప్త్వా నరకన్న పశ్యేత్.*


*అశ్వత్థ* = *పీపాల్*= రావి  (100% కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది)


 *పిచుమందా* = *వేప* (80% కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది)


*న్యాగ్రోధ* = *మర్రి చెట్టు* (80% కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది) 


*చించి* = *చింతపండు* (80% కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది)


*కపితః* = *కవిత్* (80% కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తుంది)


*బిల్వా* = *బెల్* = బిల్వం  (85% కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తుంది)


*అమలకా* = *ఉసిరి* (74% కార్బన్ డయాక్సైడ్ గ్రహిస్తుంది)

ఆమ్రాహ్= మామిడి (70% కార్బండయాక్సైడ్ గ్రహిస్తుంది) 



*అర్థం* 

ఈ చెట్లను ఎవరు నాటినా, వాటిని సంరక్షించినా నరకం చూడాల్సిన అవసరం ఉండదు. (ప్రస్తుత కలుషిత వాతావరణం)


ఈ నిజమైన విషయాలను పాటించకపోవడం వల్లే ఈరోజు వాతావరణంలో నరకాన్ని చూస్తున్నాం


ఇంకా ఏమీ తప్పులేదు, మన తప్పును సరిదిద్దుకోవచ్చు.


మరియు

*గుల్మోహర్*, *నీలగిరి* లాంటి చెట్లు మన దేశ పర్యావరణానికి ప్రాణాంతకం.


పాశ్చాత్య దేశాలను గుడ్డిగా అనుకరించడం వల్ల మనకు మనమే గొప్ప హాని చేసుకున్నాం.


పీపాలు, మొగ్గ, వేప వంటి మొక్కలు నాటడం ఆగిపోవడంతో కరువు సమస్య పెరుగుతోంది.


ఈ చెట్లన్నీ వాతావరణంలో ఆక్సిజన్‌ను పెంచుతాయి. 

అలాగే, ఇవి భూమి ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి.


ఈ చెట్లను పూజించే సంప్రదాయాన్ని మూఢనమ్మకాలుగా భావించి, సత్వర సంస్కృతి పేరుతో ఈ చెట్లకు దూరం చేసుకుని రోడ్డుకు ఇరువైపులా *యూకలిప్టస్* *(నీలగిరి)* చెట్లను నాటడం ప్రారంభించాం. యూకలిప్టస్ త్వరగా పెరుగుతుంది, కానీ ఈ చెట్లు చిత్తడి నేలను ఆరబెట్టడానికి నాటబడతాయి. 

ఈ చెట్ల వల్ల భూమిలో నీటి మట్టం తగ్గుతుంది. గత 40 ఏళ్లలో యూకలిప్టస్ చెట్లను విరివిగా నాటడం వల్ల పర్యావరణం దెబ్బతింది.


*గ్రంధాలలో*, *పీపాల్* ( రావి ) ని *చెట్ల*⤵️ *రాజు* అని పిలుస్తారు.


*మూలే బ్రహ్మ చర్మం విష్ణు శాఖ శంకరమేవచ.*


*పత్రే పాత్రే సర్వదేవయం వృక్ష రాజ్ఞో నమోస్తుతే.*


*అర్థం-* ఎవరి *మూలంలో* నివసిస్తుంది *బ్రహ్మాజీ*, *కాండ* నివసిస్తారు *శ్రీ హరి* *విష్ణుజీ* మరియు *శాఖలు* *మహాదేవ్ లార్డ్ శంకర్‌జీ* మరియు *ఆ చెట్టులోని ప్రతి ఆకు* *నివసిస్తుంది* *దేవతలందరికీ*, అటువంటి చెట్ల రాజు పీపాల్‌కి *నమస్కారాలు*.


రాబోయే సంవత్సరాల్లో ప్రతి 500 మీటర్లకు ఒక పీపల్, మర్రి, వేప తదితర చెట్లను నాటితేనే మన భారతదేశం కాలుష్య రహితంగా మారుతుంది.


*తులసి* మొక్కలు *ఇళ్లలో* నాటాలి.


మన సంఘటిత ప్రయత్నాల ద్వారానే మన "భారతదేశాన్ని" ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడుకోగలము.


భవిష్యత్తులో మనకు *సహజ ఆక్సిజన్* సమృద్ధిగా అందేలా ఈరోజు నుంచే ప్రచారం ప్రారంభించాల్సిన అవసరం ఉంది.


*పెప్పలు*, *మర్రి*, *బెల్*, *వేప*, *ఉసిరి* మరియు *మామిడి* * మొక్కలు నాటడం ద్వారా రాబోయే తరానికి *ఆరోగ్యకరమైన* మరియు *"ప్రకాశవంతమైన* *పర్యావరణాన్ని"* అందించడానికి ప్రయత్నిద్దాం. చెట్లు*.


🌳🌳👏🌳🌳

శాంతులు

 🔸🔸🔸🔸🛟🔹🔹🔹🔹


*గ్రంథాలలో చెప్పబడిన శాంతులు*

----------------------------------


"55వ పుట్టిన రోజు - భీమ శాంతి"


"60వ పుట్టిన రోజు - ఉగ్ర రథ శాంతి"


"61వ పుట్టిన రోజు - షష్టిపూర్తి"


"70వ పుట్టిన రోజు - భీమ రథ శాంతి"


"72వ పుట్టిన‌ రోజు - రథ శాంతి"


"78వ పుట్టిన రోజు - విజయశాంతి" (77 సంవత్సరాల 7 నెలల 7 రోజులు)


"80వ పుట్టిన రోజు - శతాభిషేకం" (80 సంవత్సరాల 8 నెలల 8 రోజులు)


"85వ పుట్టిన రోజు - మృత్యుంజయ" శాంతి 


"88 సంవత్సరాల 8 నెలల 8 రోజులు - దేవ రథ" శాంతి 


"99 సంవత్సరాల 9 నెలల 9 రోజులు - దివ్య రథ" శాంతి 


"100వ పుట్టిన రోజు - పూర్ణాభిషేకం" 


"105 సంవత్సరాల 8 నెలల 8 రోజులు - మహా దివ్య రథ" శాంతి 


*ఈ గ్రూపులోని ప్రతి సభ్యుడు "మహా దివ్య రథ" శాంతిని జరుపుకోవాలని కోరుకుంటున్నాను*!!!!!


🙏🙏🙏🙏🙏

అతిరథ మహారథులందరూ

 అతిరథ మహారథులందరూ వచ్చారని మనం అంటూ ఉంటాం.


అంటే చాలా గొప్పవారొచ్చారనే విషయం మాత్రం

మనకు అర్థమవుతుంది.

అయితే ఆ పదాలకు సరైన అర్థం మాత్రం మనలో చాలామందికి తెలియకపోవచ్చు.


మహామహా గొప్పవాళ్ళు వచ్చారనే అర్థంలో వాడతామనేది అందరికీ తెలుసు.


ఆ పదాలకు అర్థాలేమిటో చూద్దాం.


యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లివి.

ఇందులో 5 స్థాయులున్నాయి. అవి..


రథి,

అతిరథి,

మహారథి,

అతి మహారథి,

మహామహారథి.


1) రథి..

ఏక కాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలడు.

సోమదత్తుడు,

సుదక్షిణ,

శకుని,

శిశుపాల,

ఉత్తర,

కౌరవుల్లో 96మంది,

శిఖండి,

ఉత్తమౌజులు,

ద్రౌపది కొడుకులు -

వీరంతా..రథులు.


2) అతి రథి (రథికి 12రెట్లు)..

60,000మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.

లవకుశులు,

కృతవర్మ,

శల్య,

కృపాచార్య,

భూరిశ్రవ,

ద్రుపద,

యుయుత్సు,

విరాట,

అకంపన,

సాత్యకి,

దృష్టద్యుమ్న,

కుంతిభోజ,

ఘటోత్కచ,

ప్రహస్త,

అంగద,

దుర్యోధన,

జయద్రథ,

దుశ్శాసన,

వికర్ణ,

విరాట,

యుధిష్ఠిర,

నకుల,

సహదేవ,

ప్రద్యుమ్నులు

వీరంతా..అతిరథులు.


3) మహారథి (అతిరథికి 12రెట్లు).

7,20,000 మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.

రాముడు,

కృష్ణుడు,

అభిమన్యుడు,

వాలి,

అంగద,

అశ్వత్థామ,

అతికాయ,

భీమ,

కర్ణ,

అర్జున,

భీష్మ,

ద్రోణ,

కుంభకర్ణ,

సుగ్రీవ,

జాంబవంత,

రావణ,

భగదత్త,

నరకాసుర,

లక్ష్మణ,

బలరామ,

జరాసంధులు

వీరంతా..మహారథులు.


4) అతి మహారథి (మహారథికి 12రెట్లు).

86,40,000 (ఎనభై ఆరు లక్షల నలభైవేలు) మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు.

ఇంద్రజిత్తు,

పరశురాముడు,

ఆంజనేయుడు,

వీరభద్రుడు,

భైరవుడు -

వీరు..అతి మహారథులు.

రామరావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరే ఇద్దరు అతి మహారథులు,

అటు ఇంద్రజిత్తు -

ఇటు ఆంజనేయుడు.

రామలక్ష్మణ రావణ కుంభకర్ణులు మహారథులు మాత్రమే.


5) మహామహారథి (అతిమహారథికి 24రెట్లు) .

ఏకకాలంలో 207,360,000

(ఇరవై కోట్ల డెబ్భై మూడు లక్షల అరవై వేలు) మందితో ఏకకాలంలో యుద్ధం చేయగలడు.

బ్రహ్మ విష్ణు మహేశ్వరులు,

దుర్గా దేవి,

గణపతి మరియు

సుబ్రహ్మణ్య స్వామి,

వీరంతా..మహామహారథులు.


మహామహారథులలో అమ్మవారు కూడా ఉండడం

హిందూ ధర్మంలోనున్న మహిళా సాధికారతకు నిదర్శనం. మహిళ..యుద్ధంలో పాల్గొన్న సంగతే ఇతర మతాల్లో మనకు కనిపించదు.

అలాంటిది, ఒక మహిళయైన దుర్గా దేవి ఏకంగా ఇరవైకోట్ల మంది కంటే ఎక్కువ మందితో యుద్ధం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్టుగా గుర్తించడం మామూలు విషయం కాదు.

పూరీ జగన్నాథ క్షేత్ర రథోత్సవం

 _*🚩 పూరీ జగన్నాథ క్షేత్ర రథోత్సవం🚩*_


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*పూరీ జగన్నాథ ఆలయ చరిత్ర ఏమిటి ? పూరీ పట్టణాన్ని పూర్వం ఏమని పిలిచేవారు ?*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


మన భారతదేశంలో పురాణకాలం నుండీ ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరీ ఒకటి. ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్ కి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని , శ్రీ క్షేత్రం అని కూడా పిలిచేవారు. ఈ పట్టణంలో విష్ణువు జగన్నాధుని పేరిట కొలువై పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయం వైష్ణవ దివ్యదేశాల్లో ప్రముఖమైనది మరియూ హిందువులు అతి పవిత్రంగా భావించే *"చార్ ధాం"* పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయాన్ని 1078 లో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడగంగాదేవ ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్‌ పాలనలో పూర్తయింది. అంతకు ముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు. దీని వెనకో కథ ఉంది.


జగన్నాథుడిని పూజించిన విశ్వావసుడు

ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడనీ , నీలమాధవుడనే పేరుతో పూజలందుకున్నాడనీ స్థలపురాణం. అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుణ్ని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట. విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు , ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ని అడవికి పంపుతాడు. విశ్వావసుడి కూతురైన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్ళాడతాడు. ఈ జగన్నాధ విగ్రహాన్ని చూపించమని పదేపదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవర రాజు , అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు. విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళే ఆ దారి పొడుగునా ఆవాలు జారవిడుస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే అతను ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు.


కలలో కనిపించిన జగన్నాథుడు

రాజు అడవికి చేరుకునే లోగా అక్కడ ఆ విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహారదీక్ష మొదలుపెట్టి , అశ్వమేథయాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా , జగన్నాథుడు కలలో కనిపించి సముద్రతీరంలో చాంకీనది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయనీ వాటితో విగ్రహాలు చేయించమనీ ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ , విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తాననీ , ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోననీ , ఆ 21 రోజులూ అటువైపు ఎవరూ రాకూడదనీ , తన పనికి ఆటంకం కలగకూడదనీ షరతు విధిస్తాడు. రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు. దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తికాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు.


*పూరీ విగ్రహాలకు కనిపించని అభయహస్తం , వరదహస్తం*


శిల్పి కనిపించడు. చేతులూ కాళ్లూ లేని , సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇకమీదట అదేరూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతిస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందుకే పూరీ ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం , వరదహస్తం కనిపించవు. చతుర్దశ భువనాలనూ వీక్షించడానికా అన్నట్టు ఇంతింత కళ్లు మాత్రం ఉంటాయి. దేశంలో ఎక్కడ లేనివిధంగా పూజలందుకుంటున్న ఇక్కడి ఈ దారు దేవత మూర్తులను 8-12 లేదా 19 సంవత్సరాలకి ఒకసారి మార్చి నూతన దేవతా మూర్తులను ప్రతిష్టించుతూ ఉంటారు. దీనిని నవ కళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. *" జగన్నాథ రథయాత్ర "* గా పిలవబడే ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు..


*12 రోజుల పాటు జరిగే ఉత్సవం*


సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా సరే , ఊరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్లా చూసేదే. ఈ సంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఒడిశాలోని ఈ పూరీ జగన్నాథ స్వామి ఆలయం. బలభద్ర , సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ఏటా కొత్తరథాలను నిర్మిస్తారు. అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాడ శుధ్ధ విధియ రోజున ప్రారంభమై 3 కిలోమీటర్ల దూరంలోని గుండిచా ఆలయం వరకు సాగుతుంది. ఆ తరువాత సుభద్ర , బలబద్ర సమేత జగన్నాథుని ఉత్సవ మూర్తులు బహుదా యాత్ర పేరిట తిరిగి పూరీ ఆలయానికి చేరటంతో ముగుస్తుంది. ఇది 12 రోజులు పాటు జరిగే ఉత్సవం. ఈ యాత్రకి రెండు నెలలముందు నించే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతాయి.


*రథం ఇలా ఉంటుంది*


వైశాఖ బహుళ విదియనాడు రథనిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరీ రాజు. అందుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరీకి తరలిస్తారు. ప్రధాన పూజారి , తొమ్మిది మంది ముఖ్య శిల్పులు , వారి సహాయకులు మరో 125 మంది కలిసి అక్షయ తృతీయనాడు రథ నిర్మాణం మొదలుపెడతారు. 1072 వృక్ష భాగాలనూ నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా ఖండిస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం తయారీకీ , 763 కాండాలను బలరాముడి రథనిర్మాణానికీ , 593 భాగాలను సుభద్రాదేవి రథానికీ వినియోగిస్తారు. ఆషాఢ శుద్ధ పాడ్యమినాటికి రథనిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి. ఇందులో జగన్నాథుడి రథాన్ని *" నందిఘోష "* అంటారు. 45 అడుగుల ఎత్తున ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండిటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఎర్రటిచారలున్న పసుపువస్త్రంతో *‘నందిఘోష'ను* అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని *" తాళధ్వజం "* అంటారు. దీని ఎత్తు 44 అడుగులు. పద్నాలుగు చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నీలివస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు. సుభద్రాదేవి రథం *" పద్మధ్వజం "*. దీని ఎత్తు 43 అడుగులు. పన్నెండు చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు. ప్రతిరథానికీ 250 అడుగుల పొడవూ ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు. ఆలయ తూర్పుభాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ మూడు రధాలనీ నిలబెడతారు.


*అంతా ఒక పద్ధతి ప్రకారం...*


రధయాత్ర మొదటి రోజున మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్ళే పండాలు అని పిలవబడే ఇక్కడి పూజరులు ఉదయకాల పూజాదికాలు నిర్వహిస్తారు. శుభముహూర్తం ఆసన్నమవగానే *‘మనిమా (జగన్నాథా) '* అని పెద్దపెట్టున అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు. ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు , అరుణస్తంభం మీదుగా వాటిని వూరేగిస్తూ బయటికి తీసుకువస్తారు. ఈ క్రమంలో ముందుగా దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు. బలభద్రుడ్ని చూడగానే *" జై బలరామా, జైజై బలదేవా "* అంటూ భక్తులు చేసే జయజయధ్వానాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతుంది. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజం పై ప్రతిష్ఠింపజేస్తారు. అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెడతారు. వాటి కోసం భక్తులు ఎగబడతారు. అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటికి తీసుకువచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు.


*జగన్నాథుడి దర్శనం కోసం భక్తుల ఎదురు చూపులు*


ఇక ఆ జగన్నాథుడిని దర్శించుకునే క్షణం ఎప్పుడెప్పుడా అని తహతహలాడిపోతుంటారు భక్తులు. దాదాపు ఐదడుగుల ఏడంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నుంచి బయటికి తీసుకువస్తుండగానే *" జయహో జగన్నాథా "* అంటూ భక్తిపారవశ్యంతో జయజయధ్వానాలు చేస్తారు. ఇలా మూడు విగ్రహాలనూ రథాలపై కూర్చుండబెట్టే వేడుకను *" పహాండీ "* అంటారు. ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు. ఈ మూడు విగ్రహాలనూ తీసుకువచ్చేవారిని దైత్యులు అంటారు. వీరు ఇంద్రద్యుమ్న మహారాజుకన్నా ముందే ఆ జగన్నాథుడిని నీలమాధవుడి రూపంలో అర్చించిన సవరతెగ రాజు విశ్వావసు వారసులు. ఆలయ సంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూలవిరాట్టులను అంతరాలయం నుంచి బయటికి తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపచేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది.


*బంగారు చీపురుతో శుభ్రం చేసే సంస్థానాదీశులు*


సుభద్ర , జగన్నాథ , బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరీ సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటాడు. జగన్నాథుడికి నమస్కరించి రథం మీదికి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు. ఈ వేడుకను *" చెరా పహారా "* అంటారు. అనంతరం స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందికి దిగి రథం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేస్తాడు. ఇదే తరహాలో బలరాముడినీ , సుభద్రాదేవినీ అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాడు. అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటిమెట్లను తొలగిస్తారు. ఇక యాత్ర మొదలవడమే తరువాయి. జగన్నాథుడి రథం మీదుండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరి కళ్లాపి చల్లి హారతిచ్చి *" జై జగన్నాథా "* అని పెద్దపెట్టున అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలుపెడతారు. విశాలమైన బోడోదండ అని పిలవబడే ప్రధానమార్గం గుండా ఈ యాత్ర మందగమనంతో సాగుతుంది.


*నెమ్మదిగా కదిలే రథం*


లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్నే ఘోషయాత్ర అంటారు. భక్తుల తొక్కిసలాటలో చక్రాలకింద ఎవరైనా పడినా , దారిలో ఏ దుకాణమో అడ్డువచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకే నడిపిస్తారు.ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడి గుడి నుంచి కేవలం మూడు మైళ్ల దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండుగంటల సమయం పడుతుంది. గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూలవిరాట్లకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళతారు. వారం రోజులపాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమినాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని *" బహుదాయాత్ర "* అని అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలూ జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడిబయటే ఉండిపోతాయి.


*స్వామి వారిని దర్శించుకునేందుకు బారులు తీరే భక్తులు*


మర్నాడు ఏకాదశినాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. సునావేషగా వ్యవహారించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు. ద్వాదశినాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే. యాత్ర పేరిట పదిరోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకుని కొత్తకళ సంతరించుకుంటుంది. ఇలాంటి ఎన్నో విశిష్టతలూ , భిన్న సంస్కృతులూ , సాంప్రదాయాలు కలగలిసిన ఈ పూరీ జగన్నాధుని ఆలయాన్ని ఏటా ఎన్నో లక్షల మంది సందర్శిస్తారు.


             ఒక భక్తుడు 

  *పంపినది పంపినట్లుగా* 

భాగస్వామ్యం చేయబడినది.

🙏🌹🌷🪷🛕🪷🌷🌹🙏

           *న్యాయపతి*     

        *నరసింహారావు*

మయూరధ్వజుడు


              *మయూరధ్వజుడు*

                  ➖➖➖✍️


*పంచమవేదంగా ఖ్యాతిగాంచిన మహాభారతం .. నేటీ మానవ జీవన విధానానికి సోపానం. రామాయణం మనిషి ఎలా జీవించాలో నేర్పిస్తే.. మహాభారతం ఎలా జీవించకూడదో తెలుపుతుంది.*


*మహాభారతంలోని   శ్రీకృష్ణుడు, పాండవులు, కౌరవులు, కర్ణుడు, భీష్ముడు, శకుని, ద్రౌపతి, కుంతి ఇలా అనేకమంది ఉన్నారు. స్త్రీ, పురుషుల జీవితాలను తరచి చూస్తే మనకు జీవితంలో మంచి చెడులు అర్ధమవుతాయి.* 


*ఈరోజు మహాభారతంలోని గొప్ప వ్యక్తి మయూరధ్వజుడు గురించి అతని త్యాగ నిరతి గొప్పదనం గురించి తెలుసుకుందాం…*


*ధర్మరాజు అశ్వమేధయాగం చేస్తూ.. యాగాశ్వాన్నివిడిచాడు. ఆ యాగాశ్వాన్ని వీర ధర్మం పాటిస్తూ పట్టుకున్నాడు మయూరధ్వజుడనే రాజు.     అతడు ధర్మాత్ముడు అమిత పరాక్రమవంతుడు      శ్రీ కృష్ణుని పరమ భక్తుడు. యాగాశ్వం విడిపించడానికి మయూరధ్వజునితో యుద్ధం చేయటానికి శ్రీ కృష్ణార్జునులు వచ్చారు. శ్రీ కృష్ణుడు.. అర్జునుని ప్రార్థనపై మయూరధ్వజుడితో యుద్ధం చేశాడు. భగవంతునితో యుద్ధం చేయకూడదని ఉన్నా యుద్ధనీతి పాటించి ప్రతి బాణం వేసే ముందు                శ్రీ కృష్ణ నామ స్మరణ చేస్తూ  యుద్ధం చేశాడు మయూరధ్వజుడు. భక్తులచేతిలో ఓడిపోవటం భగవంతునికి పరిపాటి. అందుకే శ్రీకృష్ణారుజునులు మయూరధ్వజుని గెలవలేకపోయారు.*


*దీంతో అర్జునుడు యాగాశ్వం సంపాదించడానికి .. మయూరధ్వజుడిని సంహరించాల్సిందిగా శ్రీకృష్ణుని  అడిగాడు.* 


*అప్పుడు కృష్ణుడు "ఫల్గుణా..  నీ గాండీవం కాని, నా సుదర్శన చక్రం కాని ఈ పరమభక్తుని మీద పని చేయవు. అతని ధర్మబుద్ధి నీకు చెబుతా విను.” అంటూ చెప్పడం ప్రారంభించాడు            శ్రీ కృష్ణుడు.*


*మర్నాడు శ్రీ కృష్ణార్జునులు బ్రాహ్మణుల వేషంలో మయూరధ్వజుని వద్దకు అతిథులుగా వెళ్లారు. అతిథులకు తగు మర్యాద చేసి మయూరధ్వజుడు తన ఇంట ఆతిథ్యం స్వీకరించమని ప్రార్థించాడు.* 


*అది విన్న శ్రీకృష్ణుడు "రాజా! నీ యింట భుజించుటకు వ్యవధి లేదు. మాకొక చిక్కు వచ్చింది. అది తీరిన తరువాతే మేము ఇంకొక విషయం పై దృష్టిపెడతాం!” అని అన్నాడు.*


*దీంతో మయూరధ్వజుడు “మీ కష్టం ఏమిటి చెప్పండి.. నాకు చేతనైన సాయం చేస్తా!” అని అడిగాడు.* 


*దీంతో….  "రాజా.. మేము అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు నా కుమారుని                ఓ పెద్దపులి పట్టుకుంది. ఆ పసివాడి శరీరాన్ని సగం తిన్న తరువాత ఒక అశరీరవాణి ఇలా పలికింది… ‘మయూరధ్వజుని శరీరంలో సగభాగం ఈ పులికి అర్పిస్తే నీ పుత్రుడు సజీవుడు అవుతాడు’. నాకు పుత్రభిక్ష పెట్టమని నిన్ను ప్రార్థిస్తున్నాను" అని మారు వేషంలో ఉన్న శ్రీ కృష్ణుడు చెప్పాడు.*


*దీంతో మయూరధ్వజుడు  "ఆహా.. ఈరోజు కదా ఈ దేహానికి సార్థకత ఏర్పడింది. ఒక పసివాడి ప్రాణాలు కాపాడటానికి ఉపయోగపడుతోంది. నిస్సందేహంగా నా శరీరములోని అర్ధభాగమును తీసుకుని ఆ వ్యాఘ్రేశ్వరునికి సమర్పించండి" అని అర్థించాడు మయూరధ్వజుడు. వెంటనే తన భార్యాబిడ్డలను పిలిచి తన శరీరాన్ని రెండుగా చేసి అతిథులకు ఇవ్వమని చెప్పాడు.* 


*అతని అర్ధాంగి తన భర్త ఇలా చేయమన్నాడు అంటే.. ఏ పరమధర్మ సంరక్షణార్థమో  ఏ మహత్తర కార్యానికో చేయమని వుంటాడని గ్రహించి తన బాధను దిగమింగుకుంది. వెంటనే మయూరధ్వజుని శరీరాన్ని ఛేదించడం మెదలుపెట్టారు. అప్పుడు శ్రీకృష్ణార్జులకు ఒక దృశ్యం కనిపించింది.*


*మయూరద్వజుని ఎడమ కన్ను నుండి కన్నీరు కారుతోంది. దీంతో శ్రీ కృష్ణుడు… "రాజా! బాధపడుతూ దానం ఇవ్వకూడదు. సంతోషంగా, మనస్ఫూర్తిగా చేస్తేనే అది త్యాగమవుతుంది. ఎదుటి వాడి కష్టాలు చూసి బాధపడటం దివ్యత్వమ”ని చెప్పాడు.* 


*విప్రుని మాటలకు మయూరధ్వజుడు స్పందిస్తూ..”అయ్యా .. నా శరీరం మనస్ఫూర్తిగానే మీకు సమర్పించాను. కాని నా శరీరము యొక్క కుడి భాగమే పరోపకారార్థం వినియోగపడుతోంది. ఎడమ భాగ శరీరం ‘నాకా అదృష్టం లేదే’ అని విచారిస్తూ కన్నీరు కారుస్తోంది. మిగిలిన శరీరం దేనికీ ఉపయోగపడకుండానే నాశనమవుతున్నదనే నా బాధ!" అని అమృతవాక్కులు పలికాడు మయూరధ్వజుడు.* 


*ఆ రాజు పరోపకార బుద్ధికి సంతోషించి        శ్రీ కృష్ణుడు తన నిజరూప దర్శనం ఇచ్చి మయూరధ్వజునికి యథా రూపం కల్పించి దీవించాడు.* 


*మయూరధ్వజుడు నరనారాయణులకు మ్రొక్కి యాగాశ్వాన్ని సమర్పించి కృతార్థుడయ్యాడు.*


*ఈ కథలోని నీతి:*


*మయూరధ్వజుని పరోపకారబుద్ధి అనన్యం  అసామాన్యం. శ్రీ కృష్ణుడు అడిగినదే తడవుగా సంతోషంగా బాలుని ప్రాణ రక్షణ కోసం తన శరీరాన్ని త్యాగంచేయటానికి సిద్ధపడ్డాడు. అంతేకాక అర్ధ శరీరమే ఉపకరిస్తున్నది మిగిలిన శరీరం వ్యర్థమవుతున్నదని చింతించాడు. అతని త్యాగనిరతితో గొప్ప వ్యక్తిగా నిలిచిపోయాడు.*✍️


**ఇటువంటి మంచి విషయాలు అందించే అదృష్టమిచ్చిన ఆ శ్రీకృష్ణ పరమాత్మకు అనంతకోటి నమస్కారములు.*

.                      🌷🙏🌷

            *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏



ఒకరికొకరు గౌరవించుకోకపోవడం,

 *"భీష్మ పితామహ"* ఇలా ప్రకటించాడు -


*"నేను రేపు పాండవులను చంపుతాను"*


అతని ప్రకటన గురించి తెలిసిన వెంటనే, పాండవుల శిబిరంలో ఆందోళన పెరిగింది - భీష్ముని సామర్ధ్యాల గురించి అందరికీ తెలుసు, కాబట్టి ప్రతిఒక్కరూ కొంత చెడు భయంతో కలవరపడ్డారు. అప్పుడు..  శ్రీ కృష్ణుడు ద్రౌపదితో చెప్పాడు, ఇప్పుడు నాతో రండి. 


శ్రీ కృష్ణుడు ద్రౌపదిని నేరుగా భీష్మ పితామహ శిబిరానికి తీసుకెళ్లాడు - శిబిరం వెలుపల నిలబడి, అతను ద్రౌపదికి ఇలా చెప్పాడు - *లోపలికి వెళ్లి తాతకు నమస్కరించండి -* 


ద్రౌపది లోపలికి వెళ్లి తాత భీష్ముడికి నమస్కరించినప్పుడు, అతను - *"అఖండ సౌభాగ్యవతి భవ" అని ఆశీర్వదించిన తర్వాత  ద్రౌపదిని అడిగాడు !!* "ఏంటమ్మా?! ఇంత రాత్రి మీరు ఒంటరిగా ఇక్కడకు ఎలా వచ్చారు? శ్రీ కృష్ణుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాడు కదా"?


 అప్పుడు ద్రౌపది ఇలా చెప్పింది - *"అవును తాతయ్యా.!  వారు గది బయట నిలబడి ఉన్నారు"* అంది ద్రౌపది. అప్పుడు భీష్ముడు కూడా గది నుండి బయటకు వచ్చాడు. మరియు ఇద్దరూ ఒకరికొకరు నమస్కరించుకున్నారు.


*భీష్ముడు చెప్పాడు-*


*"నా ఇతర పదాల నుండి నా మాటలలో ఒకదాన్ని కత్తిరించే పనిని శ్రీ కృష్ణుడు మాత్రమే చేయగలడు"*


శిబిరం నుండి తిరిగి వస్తున్నప్పుడు, శ్రీ కృష్ణుడు ద్రౌపదికి ఇలా చెప్పాడు -*


*"మీ తాతకు ఒకసారి వెళ్లి నమస్కరించడం ద్వారా మీ భర్తలు జీవితాన్ని పొందారు"* -


"మీరు ప్రతిరోజూ భీష్ముడు, ధృతరాష్ట్రుడు, ద్రోణాచార్యుడు మరియు ఇతరులకు నమస్కరిస్తే మరియు దుర్యోధనుడు - దుశ్శాసనుడి భార్యలు మొదలైనవారు కూడా పాండవులకు నమస్కరిస్తే, బహుశా ఈ యుద్ధం జరగకపోవచ్చు" -


 *...... అంటే ......*


ప్రస్తుతం మన ఇళ్లలో అనేక సమస్యలకు మూల కారణం -*ఒకరికొకరు గౌరవించుకోకపోవడం,

అహంకారం,ఒకరినొకరు నమస్కారం చేసుకోకపోవడం,నామాట వినాలనుకోవడం,చులకనగా చూడడం ఇలా తెలియకుండానే ఇంటి పెద్దలు తరచుగా నిర్లక్ష్యం చేయబడతారు".


"ఇంటి పిల్లలు మరియు కోడలు ప్రతిరోజూ ఇంటి పెద్దలందరికీ నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటే, అప్పుడు ఏ ఇంట్లోనూ ఎలాంటి ఇబ్బంది ఉండదు."*


*పెద్దలు ఇచ్చిన ఆశీర్వాదాలు కవచం లాగా పనిచేస్తాయి, ఏ "ఆయుధం" వాటి నుండి చొచ్చుకుపోదు -*


"అభ్యర్థన 🙏 

ప్రతి ఒక్కరూ ఈ సంస్కృతిని నిర్ధారించుకోండి మరియు నియమాలను పాటించండి, అప్పుడు ప్రతీ ఇల్లు స్వర్గం అవుతుంది."*


               *ఎందుకంటే*:-


         *నమస్కారం ప్రేమ.*

         *నమస్కారం క్రమశిక్షణ.*

         *నమస్కారం చల్లదనం.*


🔸 *నమస్కారం గౌరవాన్ని నేర్పుతుంది.*


🔸 *నమస్కారం నుండి మంచి ఆలోచనలు వస్తాయి.*


🔸 *నమస్కారం సంస్కరించడం నేర్పుతుంది.*


🔸 *నమస్కారం కోపాన్ని తొలగిస్తుంది.*


🔸 *నమస్కారం కన్నీళ్లను కడిగివేస్తుంది.*


🔸 *నమస్కారం అహాన్ని నాశనం చేస్తుంది.*


నీటి చుక్క నదిలో పడితే గుర్తింపు ఉంటుందా చెప్పండి. అదే నీటి చుక్క ఆకు మీద పడితే, మెరిసి పోతుంది ఔనా !. *నీటి చుక్క లాగ ఎక్కడ సజ్జన సాంగత్యం లభిస్తుందో అక్కడ నీ ప్రతిభ ఇనుమడిస్తుంది.దుష్ట సంస్కారాలు వదిలి మంచి సంస్కారాలు అలవర్చుకొంటే తరతరాలుగా వంశాభివృద్ధి  జరుగుతుంది.

 *సర్వేజనాఃసుఖినోభవంతు*

ఘనతరమైన దానము.

 🌸🪷 *సుభాషితమ్* 🪷🌸


*అన్నదానం మహా దానం*

*విద్యా దానం తతః పరమ్*

*అన్నేన క్షణికా తృప్తిః*

*యావజ్జీవం చ విద్యయా*


భావము. అన్నము మహా ఘనతరమైన దానము. విద్యా దానము అంతకంటెను ఘనతరమైనది. అన్నదానము కలిగించే తృప్తి తాత్కాలికమైనదే. విద్యాదానము కలిగించే తృప్తి జీవితమంతయు ఉండును.

పోతనగారి మనో విశ్లేషణ!

 


పోతనగారి  మనో విశ్లేషణ!


              శా:  "  లగ్నంబెల్లి , వివాహముంగదిసె ,  నేలారాడు  గోవిందు ,  డు


                      ద్విగ్నంబయ్యెను  మానసంబు ,  వినెనో వృత్తాంతమున్ , బ్రాహ్మణుం


                     డగ్నిద్యోతనుఁడేటికిం దడసె , నాయత్నంబు  సిధ్దించునో ?


                     భగ్నంబై  చనునో ? , విరించి కృత  మెభ్భంగిన్   బ్రవర్తించునో ?  


                             రుక్మిణీ కళ్యాణము- ఆం- భాగవతము-దశమస్కంధము- 1773 పద్యం:  బమ్మెఱ పోతన మహాకవి.


                                 చిన్న నాటినుండి  కన్నయ్యను  పెండ్లియాడాలనే  రుక్మిణి తలంపునకు భిన్నంగా  శిశుపాలునితో  ఆమెవివాహం

నిశ్చయింప బడింది. అతనిని పెండ్లియాడే  ఉద్దేశ్యంలేని  రుక్మిణి,  అగ్నిద్యోతనుడను బ్రహ్మణుని  ద్వారా  కృష్ణునకు ప్రణయ సందేశ

మంపింది. " కృష్ణా నేను నీయందు బధ్ధానురాగను. శిశుపాలుని బారి నుండి తప్పించి నన్నేలుకొనుము. నీవు ససైన్యముగ విచ్చేసిన చో

నీవెంట వచ్చెదను. నన్ను నమ్ముమని " సందేశసారాంశము.


                              అగ్ని ద్యోతను డామె సందేశమును గొని ద్వారక కేగెను. అతని నుండి సమాధానమా ,లేదు. గోవిందుడా, రాలేదు. రేపే వివాహము. బలిమిమై  వివాహము జరిపించుటకు అన్నరుక్మి  సర్వ సన్నధ్ధుడైనాడు. ఈస్థితిలో డోలాయమానమైన  యామె  మనో విచేష్టతములను బమ్మెఱపోతన బహు రమ్యముగా  చిత్రించినాడు.


                  తొలుత   "ఘనుడాభూసురుడేగెనో? " యనుపద్యముతో  నీమనో విశ్లేషణ మారంభమైనది. అసలా ముసలిబ్రాహ్మణుడంతదూరం  వెళ్ళియుంటాడా? మార్గాయాసంతో  మధ్యలో యెక్కడైనా  కూలబడి యుండడుగదా? 

ఇతను చెప్పింది కృష్ణుడు విన్నాడో  వినలేదో? వస్తాడో రాడో?  నాఅదృష్టం యెలాఉందో మరి?  


                      ఇలా సాగిపోతున్నాయి.రుక్మిణి ఆలోచనలు. ముహూర్తం దగ్గర పడిన కొద్దీ  ఆమెకు కంగారు యెక్కువౌతున్నది.


              "  రేపే  వివాహం. ముహూర్తంకూడా దగ్గరపడింది. ఇంతవరకూ గోవిందునిజాడ లేదు. మనస్సు  ఉద్విగ్నంగా ఉంది ( కంగారు గాబరా యేడుపు యివన్నీ కలిస్తే  వచ్చే వికారం)  ఈబ్రాహ్మణుడు చెప్పనది విన్నాడో లేదో?  బ్రహ్మణుడేల యాలసించెనో?  నాప్రయత్నం  ఫలవంతమగునో లేదో?  బ్రహ్మ నిర్ణయం  యేవిధంగా ఉందో? "-  ఇది ఆమె మనస్సులోని  డోలాయమాన మగుచున్న

భావనలు.


                 లోకంలో  మనకు అనుభవమే ! యేదైనా పనిమీద  మనంపంపినవారు  సరియైన సమయానికి రాకపోతే, వారినుండి యెలాటి వర్తమానం  లేకపోతే  మనం పడే మనోవేదన  చెప్పటానికి మాటలుండవు. అలాంటి సన్నివేశచిత్రణను మనవారిప్పుడు

"చైతన్యశిల్పం"- అనేపేరుతో వ్యవహరిస్తున్నారు. ఇదే వ్యవహారాన్ని యింత చక్కగా మనకందిన  పోతనగారి  మనోవిశ్లేషణా  సామార్ధ్యన్ని బహుధా ప్రశంసిస్తూ, ఆమహాకవికి కైమోడ్పులతో  


                                                      స్వస్తి!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

_హైదరాబాద్ లో ప్రసాదాల తయారీ రెడీ_

 *_హైదరాబాద్ లో ప్రసాదాల తయారీ రెడీ_* 


*_మామూలుగా ఇంట్లో తినడానికి కూడా చేసి పంపబడును_*


*_ORDER NOW IN WHATSAPP : 9701609689_*


మడితో, శుచితో , మంచి వస్తువులతో చక్కగా మీకు కావాల్సిన ప్రసాదాలు అప్పటికి అప్పుడు చేసి ఇవ్వబడును. చేసేవారు బ్రాహ్మణ సంక్షేమ భవన్ కిచెన్ లో చేస్తారు, మడి కట్టుకుని, చేసి ఒక పురోహితునితో పంపుతారు . అయన కూడా మడితో వెహికల్ పై వచ్చి మీకు అందచేస్తారు. 


చక్కర పొంగలి, లడ్డు, రవ్వలడ్డు , 

ప్రసాదం వడ , పాయసం, 

నేతి అరిసెలు, 

బొబ్బట్లు (భక్ష్యాలు), 

పులిహోర, 

పప్పు, (మీకు కావాల్సిన పప్పు)

కూర (మీకు కావాల్సిన కూర)


ఐటెం ను బట్టి రేటు ఉంటుంది ... అన్నం ఒకటి మీరు ఇంటి దగ్గర పెట్టుకుంటే చాలు. 


*బ్రహ్మిణ్స్ కిచెన్ బర్కత్ పుర హైదరాబాద్* 

వాట్సాప్ : 9701609689 (No Calls)


NB. Blogger is not concern to the add


భాషావిర్భావము-వాఙ్మయ వికాసము🙏 రెండవ భాగము

 🙏 తెలుగు భాషావిర్భావము-వాఙ్మయ వికాసము🙏               రెండవ భాగము

               

ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర క్రీస్తుకు పూర్వం కొన్ని శతాబ్దాల వెనకకు మనము తెలుసుకోవచ్చు, కానీ తెలుగు చరిత్రను మనము క్రీస్తు శకం 6 వ శతాబ్దము నుండి ఉన్న ఆధారములను బట్టి నిర్ణయించవచ్చు. తెలుగు లోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శకం ఎ.డి.కి చెందినది. శాసనాలలో మనకు లభించిన తొలితెలుగు పదం 'నాగబు'. చక్కటి తెలుగు భాషా చరిత్రను (సాహిత్యమును) మనము క్రీస్తు శకం 11 వ శతాబ్దం నుండి గ్రంథస్థము చేయబడినదిగా గమనించ వచ్చు.

 13వ శతాబ్దంలో అథర్వణ ఆచార్య తెలుగు వ్యాకరణాన్ని త్రిలింగ శబ్దానుశాసనము (లేదా త్రిలింగ వ్యాకరణం) అని పిలిచారు. 17వ శతాబ్దానికి చెందిన అప్పకవి త్రిలింగ నుండి తెలుగు ఉద్భవించిందని స్పష్టంగా రాశాడు. అప్పకవి పూర్వీకులకు అటువంటి వ్యుత్పత్తి గురించి తెలియదు కాబట్టి ఇది "విచిత్రమైన భావన" అని పండితుడు చార్లెస్ పి. బ్రౌన్ వ్యాఖ్యానించాడు. 



మరొక కథనం ప్రకారం తెనుగు అనేది ద్రావిడ పదం *తెన్ అంటే దక్షిణం కు అంటే భాష.  దక్షిణ దిశలో నివసించే ప్రజలు మాట్లాడుకునే భాష తెనుగు. మునుగు అనే పదం ములుగు అయినట్లే తెనుగు అనే పదం తెలుగు అయింది.

అమరావతిలోని నాగబు అనే పదము విక్రమేంద్రవర్మ చిక్కుళ్ళ సంస్కృత శాసనంలోని "విజయరాజ్య సంవత్సరంబుళ్" మనకు కనిపిస్తున్న మొదటి తెలుగు పదాలు. నాగార్జునకొండ వ్రాతలలో కూడా తెలుగు పదాలు కనిపిస్తాయి. ఇవన్నీ ప్రాకృత శాసనాలు లేదా సంస్కృత శాసనాలు. కనుక తెనుగు అప్పటికి జనసామాన్యంలో ధారాళమైన భాషగా ఉన్నదనడానికి ఆధారాలు లేవు. ఆరవ శతాబ్ది తరువాత బ్రాహ్మీలిపినే కొద్ది మార్పులతో తెలుగువారు, కన్నడంవారు వాడుకొన్నారు. అందుచేత దీనిని "తెలుగు-కన్నడ లిపి" అని పరిశోధకులు అంటారు.


6,7 శతాబ్దాలలో పల్లవ చాళుక్య సంఘర్షణల నేపథ్యంలో రాయలసీమ ప్రాంతం రాజకీయంగా చైతన్యవంతమయ్యింది. ఈ దశలో రేనాటి చోడులు సప్తసహస్ర గ్రామ సమన్వితమైన రేనాడు (కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలు) పాలించారు. తెలుగు భాష పరిణామంలో ఇది ఒక ముఖ్యఘట్టం. వారి శాసనాలు చాలావరకు తెలుగులో ఉన్నాయి. వాటిలో ధనంజయుని కలమళ్ళ శాసనం (కడప జిల్లా కమలాపురం తాలూకాలో ఉంది ) మనకు లభిస్తున్న మొదటి పూర్తి తెలుగు శాసనంగా చరిత్రకారులు భావిస్తున్నారు. అంతకుముందు శాసనాలలో చెదురు మదురుగా తెలుగు పదాలున్నాయి గాని సంపూర్ణమైన వాక్యాలు లేవు.


ఆ తరువాత జయసింహవల్లభుని విప్పర్ల శాసనము 641 సంవత్సరానికి చెందినది. 7,8, శతాబ్దులలోని శాసనాలలో ప్రాకృత భాషా సంపర్కము, తరువాతి కాలంలో సంస్కృత భాషా ప్రభావం అధికంగా కానవస్తాయి. 848 నాటి పండరంగుని అద్దంకి శాసనములో ఒక తరువోజ పద్యమూ, తరువాత కొంత వచనమూ ఉన్నాయి. 934 నాటి యుద్ధమల్లుని బెజనాడ శాసనములో ఐదు సీసము (పద్యం) పద్యాలున్నాయి. వేయి ప్రాంతమునాటిదని చెప్పబడుతున్న విరియాల కామసాని గూడూరు శాసనములో మూడు చంపకమాలలు, రెండు ఉత్పల మాలలు వ్రాయబడ్డాయి.వీటి ఆధారాల కారణంగా నన్నయకు ముందే పద్య సాహిత్యం ఉండి ఉండాలని నిశ్చయంగా తెలుస్తున్నది. కాని లిఖిత గ్రంథాలు మాత్రం ఇంతవరకు ఏవీ లభించలేదు.

తెలుగు బాష కొల్లలుగా క్రొత్త పదాలను తనలో కలుపుకుంది.తెలుగు బాష కోటి కిటికీల గాలి కలిగిన మేడవంటిది . అన్నీ వైపుల నుండి వీచే గాలులను ఆహ్వానించి, ఆతిధ్యమిచ్చి గౌరవించింది. తెలుగుకి గల హృదయ వైశాల్యము అనన్యము. తెలుగు,సంస్కృత పదాలు క్షీరనీర న్యాయంలో కలిసిపోతాయి. అదే తెలుగు బాష విశిష్టత.

                          సశేషం 

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

పవి పుష్పంబగు

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


          !! *పద్యం* !! 


   పవి పుష్పంబగు నగ్ని మంచగు నకూపారంబు భూమీస్థలం

   బవు శత్రుం డతిమిత్రుఁడౌ విషము దివ్యాహారమౌ నెన్నఁగా

   నవనీమండలిలోపలన్ శివ శివే త్యాభాషణోల్లాసికిన్

   శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వరా!


          [  *!! పవి పుష్పంబగు !!*  ]


శ్రీ కాళహస్తీశ్వరా! నిరంతరము నీ నామము స్మరించుచు దాని అర్ధము భావన చేయుచు ఉచ్చరించినో దాని మహిమచే ఉపాసకులకు లోకములో ఏదియు హానికరము, బాధాకరము కాదు. పైగా సాధారణముగ హాని బాధాకరములు సుఖమును కల్గించునవియే అగును. నీ ఉపాసకులకు పిడుగు కూడ పుష్పమగును, అగ్నిజ్వాలలు మంచుగా అగును, మహాసముద్రము జలరహిత నేలయై నడువ అనుకూలమగును, ఎంతటి శత్రువు మిత్రుడగును, విషము కూడ దివ్య ఆహారమైన అమృతమగును. ఇవి *అన్నియు నీ నామము సర్వవశీకరణ సాధనమగును*....

రాశిఫలాలు 14-07-2024

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️


•••••┉━•••••┉━•••••┉━•••••

*14-07-2024 / ఆదివారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━•••••┉━•••••

మేషం


ఆకస్మిక ధనప్రాప్తి  కలుగుతుంది. బంధు మిత్రుల  నుండి శుభకార్య  ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి  శ్రీకారం చుడతారు. సమాజంలో పెద్దల  అనుగ్రహంతో   కీలకమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

---------------------------------------

వృషభం


ప్రయాణ విషయంలో  అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగ  ప్రయత్నాలు నిదానంగా  సాగుతాయి. కీలక విషయాలలో  ఆలోచించి ముందుకు సాగాలి. నూతన ఋణ  ప్రయత్నాలు కలసిరావు. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు  మానసికంగా కొంత చికాకు కలిగిస్తాయి.

---------------------------------------

మిధునం


చేపట్టిన పనులలో  మార్గ అవరోధాలు కలుగుతాయి. అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగాలలో అధికారులతో  వివాదాలు కలుగుతాయి. మాతృ వర్గ బంధు మిత్రులతో  స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారములలో నష్ట సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో  పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.

---------------------------------------

కర్కాటకం


చేపట్టిన పనులు ఉత్సాహంగా  పూర్తి చేస్తారు. బంధు, మిత్రులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగమున పని ఒత్తిడి నుండి ఉపశమనం  పొందుతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది. నూతన  వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------

సింహం


నేత్ర సంభందిత సమస్యలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు  వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి   నిరుత్సాహపరుస్తుంది. వృత్తి ఉద్యోగములలో  బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు కలుగుతాయి.  సోదరులతో  స్ధిరాస్తి  వివాదాలు కలుగుతాయి.

---------------------------------------

కన్య


ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మొండి బాకీలు  ఋణాలు తీర్చగలుగుతారు. కుటుంబ సభ్యులతో  దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి  పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశములు అందుతాయి. భాగస్వామ్య  వ్యాపారాలకు నూతన పెట్టుబడులు లభిస్తాయి.

---------------------------------------

తుల


గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. కీలక  వ్యవహారాలలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు  నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ఇంటా బయట సమస్యాత్మక  వాతావరణం ఉంటుంది.

---------------------------------------

వృశ్చికం


చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా  సాగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.  కొన్ని పనులు అనుకూలంగా పూర్తిచేస్తారు. ఆర్థికంగా వ్యవహారాలు  సంతృప్తి  కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. 

---------------------------------------

ధనస్సు


దైవ  సేవా కార్యక్రమాలు నిర్వహించి పెద్దల నుండి  ప్రశంసలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో అనుకూలత  పెరుగుతుంది. మొండి  బాకీలు సకాలంలో వసూలు అవుతాయి.  బంధు మిత్రులతో సంతాన వివాహ విషయమై చర్చలు జరుగుతాయి. పాత  మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.  

---------------------------------------

మకరం


ఇతరులతో  తొందరపడి  మాట్లాడటం మంచిది. ఆదాయానికి మించి   ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత నిరాశ  కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.   వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.

---------------------------------------

కుంభం


బంధు మిత్రుల నుండి  ఊహించని మాటలు వినవలసి వస్తుంది. దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి.  నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక  సమస్యలు  కలుగుతాయి. ఉద్యోగమున సహోద్యోగులతో  మాటపట్టింపులు కలుగుతాయి.

---------------------------------------

మీనం


వ్యాపార విషయమై  పెద్దల  సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో   పదోన్నతులు పెరుగుతాయి. చాలాకాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాల నుండి బయటపడతారు. ఆర్ధిక విషయంలో  ఆలోచనలు  కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశములు లభిస్తాయి. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు.

•••••┉━•••••┉━•••••┉━•••••

🍁 *శుభం భూయాత్* 🍀

గెట్ టు గెదర్

 


🤝 *గెట్ టు గెదర్* 🤝


🌷🤝

_*పూర్వ విద్యార్థుల*_

_*ఆత్మీయ సమ్మేళనం*_

                        🤝🌷


*విచ్చేశారు అందరూ*

*బానపొట్టలూ అరగుండ్లతో*

*పురుష పుంగవులు.!*


*బారెడు జడలు మూరెడు కాగా సోడాబుడ్డీ కళ్ళద్దాలతో మహిళా మణులు .!!*


*వాడు వీడేనా*

*వీడు వాడేనా.?*

*ఆమె ఈమేనా*

*ఈమె ఆమేనా ?*

*గుర్తింపుల గుబాళింపు.!!*


పలకరింపులూ

షేక్ హాండ్ లూ

కౌగిలింతలూ

పరామర్శ లూ 


తాతలుగామారిన

అలనాటి అబ్బాయిలు

అమ్మమ్మలూ నానమ్మలుగా

మారిన అమ్మాయిలు


*మరోవైపు*


కాళ్ళనొప్పులు కీళ్ళనొప్పులు

కవర్ చేస్తూ 

చెంగు చెంగున అలనాటి

గెంతులస్ధానంలో

జాగ్రత్తగా అడుగు లేస్తూ

చేరారంతా ఒకచోటికి


అలనాటి అల్లరులూ

కొట్లాటలు

ఆటలు పాటలు

సరదా సన్నివేశాలు

క్లాస్ రూమ్ లన్నీ

కలయ తిరుగుతూ 

నాటి జ్ఞాపకాలు కలబోసుకుంటూ


ఎన్నెన్నో జ్ఞాపకాలలో

మరెన్నో మార్పుల వాస్తవాలు.!


బ్రతుకు పండించుకున్న 

వారు కొందరైతే

పోగొట్టుకున్న వారు కొందరు.!

అందరి మోములోనూ

చెరగని చిరునవ్వు 


నాటిమేటి విద్యార్ధి

ఏదో సాధిస్తాడను కున్నవాడు

బడుగు జీవిలా

సంసార సాగరాన్ని

ఈదుతూ అలసి పోగా

ఎందుకూ పనికిరాడను కున్నవాడు

గొప్పవాడై కనుల ముందు .!!


అరేయ్ ఒరేయ్

మావ బావ నాటి పిలుపుల

ఆప్యాయతల స్థానాల్లో

సార్, గారు మర్యాదల మార్పులు.!!


కాలగర్భంలో జారిపోయి

కరిగిపోయిన కొందరు

నేస్తాల కన్నీటి జ్ఞాపకాలు.!


ఏదైతేనేం

సుఖదుఃఖాల కలబోత

జ్ఞాపకాల దొంతరల వెదుకులాట.!


చేరుకున్నావా? జాగ్రత్త.

చరవాణి హెచ్చరికల మోత.!

తెలియకుండానే కరిగి పోయిన కాలం.!!


బాధాతప్త హృదయాలతో

అడ్డుపడే కన్నీటి పొరల

మసకచూపుల తడిలో

వీడ్కోలు తీసుకునే సమయం.!!

మరలా కలిసే మరో రోజుకు

అందరూ కలవాలనే ఆశతో.!


కాలగమనంలో ఎందరో .!!

చదువులు ముగించి

వెళ్ళేవారికి వీడ్కోలు

వచ్చేవారికి స్వాగతాలు పలుకుతూ!!

ఏమార్పులేని పాఠశాల

చిద్విలాసంగా నవ్వుకుంటూ

 వెళ్ళి రండని  ఆప్యాయంగా

ఆశీర్వదిస్తూ, మరోకలయిక కోసం

ఎదురుచూస్తూ..!!


✍️

( *ఓ ఆజ్ఞత కవి రాత ఇది.*

 *కానీ, ప్రతి వ్యక్తి వ్యధే ఇది.* )

మనసున గల నైర్మల్యము

 *2035*

*కం*

మనసున గల నైర్మల్యము

జనులకు నిరతప్రమోద సాధకమెపుడున్.

మనసును స్వాధీనపరచు

మనిషియె నిజమగు మనీషి మహిలో సుజనా.

*భావం*:-- ఓ సుజనా! మనస్సు లోని నిర్మలత్వం అందరికీ ఎల్లప్పుడూ గొప్ప సంతోషసాధకము. అటువంటి మనస్సు ను తన అధీనంలో ఉంచుకొనగలిగిన మనిషియే భూలోకంలో నిజమైన తెలివిగలవాడు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

Support this blog

 Support this blog


Do you think this blog is useful. 

Please support financially by donating via G Pay Or phone pay to this Mbl. 9848647145

గరిమెళ్ళ సత్యనారాయణ

 *🙏జై శ్రీమన్నారాయణ 🙏*

14.07.2024 ఆదివారం.



గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి


*వీరి గళానికి తెల్లదొరలే హడలెత్తిపోయారు.. అతనెవరో మీకు తెలుసా..*


స్వాతంత్ర్యోద్యమ కవుల్లో గరిమెళ్ళ సత్యనారాయణ (జూలై 14, 1893 - డిసెంబర్ 18, 1952) ది విశిష్టమైన స్థానం. గరిమెళ్ళ గేయాలు జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాన్ని ఉర్రూతలూగించాయి. అతను వ్రాసిన ' మా కొద్దీ తెల్ల దొరతనం .... " పాట సత్యాగ్రహులకు గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించింది. అలాగే " దండాలు దండాలు భారత మాత ' అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్ర్య ఉద్యమంలోకి ఉరికే తెగువను కలగజేసింది. దేశభక్తి కవితలు వ్రాసి జైలుశిక్ష అనుభవించిన వారిలో ప్రథముడు గరిమెళ్ళ. నిజాయితీకి, నిర్భీతికి గరిమెళ్ళ మారుపేరుగా నిలిచాడు. మాకొద్దీ తెల్ల దొరతనం పాట ఆనాడు ప్రతి తెలుగు వాడి నోటా మార్మోగేది. 


1915వ సంవత్సరంలో స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత సబర్మతీ ఆశ్రమాన్ని స్థాపించి, గాంధీజీ ఒకసారి జాతీయ గీతాల కవుల సమావేశాన్ని నిర్వహించారు. ఆహ్వానితుల్లో గరిమెళ్ళ కూడా ఒకరు. వచ్చిన కవులు తమ గీతాల్ని వరుసగా వినిపించసాగారు. గరిమెళ్ళ తనవంతు వచ్చాక “మా కొద్దీ తెల్ల దొరతనం” అంటూ పై గీతాలన్నీ ఆలపించి, దానికి బహుమతి ఒక సంవత్సరం జైలు శిక్ష అని చెప్పారు. గాంధీజీ పాటను విని ఆశ్చర్యచకితులై అదే బాణీలో పాటలు వ్రాయమని మిగతా కవులకు సలహా ఇచ్చారట.


ఆయనంత ప్రసిద్ధినొందిన జాతీయకవి ఆ రోజుల్లో మరొకరులేరు. తెలుగునాట జాతీయ కవిత్వానికి ఒరవడి పెట్టిన కవి ప్రముఖుడు గరిమెళ్ళ.

కాలమున కతీతులుయనగాలేరునిలన్

 కాలమె పరమావధి, నిధి

కాలమె జీవన విధియని గమనించు నదే

కాలము పెంచును చంపును

కాలమున కతీతులుయనగాలేరునిలన్

మానవ జన్మకు సార్థకత

 *మానవ జన్మకు సార్థకత ఏమిటి???*


మనకు వచ్చే మృత్యువు అనేది ఫోటోగ్రాఫర్ లాంటిది కాదు, మనం రెడీగా ఉన్నపుడు మాత్రమే తీసుకుపోవడానికి!

అది నిత్యం మనతోనే ఉంటున్నది....

 సమయం వచ్చినపుడు దాని పని అది చక్కగా చేసుకుపోతుంది. 

'నావి' అనుకున్న ఈ సంపదలు, భూములు, భవనాలు, భార్య బిడ్డలు, బంధుమిత్రులు ఎవరూ కూడా మనలను మృత్యువు నుండి కాపాడలేరు. 

ఇవేవీ మనతో వచ్చేవి కావు కూడా , కనుక వీరి నిమిత్తం మనం మంచిని విడువకూడదు, చెడుపైపు మరలకూడదు...

నేడు మనం చేసిన ప్రతీ తప్పుకు మరణాంతరం దేవుని ముందు ఒంటరిగా నిలబడి సమాదానం చెప్పవలసి ఉంటుంది...

నేడు మనం చేసుకున్న పుణ్య, పాప కర్మలే అప్పటి మన సాక్ష్యాలు... 

కనుక నిజముగా ఆత్మోద్ధారణ కోరుకొనువారు పాప ఫలితాలనిచ్చే హింసాది పాపకర్మలకు దూరముగా ఉండాలి. 

పుణ్య ఫలితాలను ఇచ్చే పరోపకారాలు, మాధవసేవగా సర్వప్రాణిసేవ సమాజ సేవలు చేస్తుండాలి, మనోశుద్ధి కొరకు భగవంతుని స్మరిస్తుండాలి. ఎందరెందరో మహనీయులు తరించిన. మార్గాన్ని అనుసరించాలి


భగవంతుడు చూపిన మార్గంలో నడచుకోవడము వలనే జన్మకు సార్థకత చేకూరుతుందన్న సత్యంను గ్రహించి ఆ దివ్యమార్గంలో నడచుకోవాలి...


               *_శ్రీ సద్గురు పీఠం  శుభమస్తు_*

 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

నీ తీరు మార్చుకో

 నా చిన్నప్పుడు విజయవాడ దుర్గ గుడిలో ప్రతి శుక్రవారం రాత్రి పవళింపు సేవ జరిగేది..మా అమ్మ నన్ను తీసుకుని వెళ్ళేది..కాసేపు పూజ చూసాక నేను అక్కడ ఉన్న నా ఈడు పిల్లలతో ఆడుకుని ఇంటికి వచ్చేవాడిని..మా అమ్మ అక్కడ ఇచ్చిన ప్రసాదం ఇంటికి తెచ్చి రాత్రి అట్టి పెట్టి పొద్దున్న లేచాక స్నానం చేయగానే దానిని తినిపించేది..ఇవాళ అలా కనీసం వారానికి ఒక సారి అన్నా పిల్లలను గుడికి తెచ్చే తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా? గుడిలో వారానికి ఒక సారి అన్నా ఏదో ఒక వైదిక కార్యక్రమం చేసి భక్తులు సామూహికంగా కలిసే అవకాశం ఏర్పడుతోందా?.. హిందూ ధర్మానికి ఆపద వేరే వాళ్ళ వల్లే కాదు..మన సంస్కృతి ని మనం సరిగాఆచరణ చేయని మూలంగా కూడా వస్తుంది..ఇది సరిదిద్దుకోకుండా ఏవేవో రాలీలు,కేసులు అంటే ఉపయోగం ఏముంటుంది?..నీ తీరు మార్చుకో నేడు.. లోకం ఎలా మారుతుందో చూడు..👌👌

తెలుగు భాషావిర్భావము

 🙏తెలుగు భాషావిర్భావము-వాఙ్మయ వికాసము🙏

సంస్కృత సాహిత్య విషయాలతోపాటు తెలుగు భాషా చరిత్ర కూడా తెలుసుకొని ఇద్దరు తల్లులను సేవిద్దాము.

             మొదటి భాగము 

తెలుగు మాట్లాడేవారు వారిని తెలుగు వారు అని అంటారు తెలుగుకు పాత రూపాలు తెనుంగు తెలింగా, తెనుగు అనునవి.

తెలుగుభాష మూలాన్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు.

శాసనాలను పరిశీలించిన అచ్చులలో అ,ఆ,ఇ,ఈ,ఉ,ఊ,ఎ,ఒ అను నెనిమిది మాత్రమే గానవచ్చును.'ఐ'కి బదులు అయి 'ఔ'కు బదులు అవు, అగు అనునవి వాడబడుచుండెను. శకము 898 నాటి, అనుమల శాసనములో 'ఐన' అని ఐ వాడబడెను. 'ఔ'అక్షరము యొక్క ఉపయోగము కనిపించదు. హల్లులలో వర్గాక్షరములందు అల్ప ప్రాణములు, అనునాసికములగు ఙ,ఞా,ణ,న,మ,లు విశేషముగ గానవచ్చును. య,ర,ల,వ,శ,,స,హ,ళ.వర్ణములు వాడుకయందుండెను. కాగా అందుశకట రేఫము ఒకటి.ఇది ఇప్పటివరకు వాడబడుచున్నను ప్రస్తుతము దాని ఉపయోగము తగ్గిపోవు చున్నది.సుమారు క్రీస్తు పదవశతాబ్ది అంతము వఱకు అనగా నన్నయ భట్టారకుడు గ్రాంథికభాషను శాసించువఱకు శాసనములందు 'ఱ'అనురూపమున వ్రాయబడు అక్షరముండెడిది.ఇది బండి 'ఱ' లోని అడ్డుగీటును తొలగించి వ్రాసినట్లు శాసనములందు కనుపించును. దీనిని గూర్చి కీర్తిశేషులు జయంతి రామయ్య పంతులుగారు,వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, మల్లంపల్లి సోమశేఖర శర్మగారు మున్నగు పలువురు పరిశోధనలు జరిపి అది మనకిప్పుడు వాడుకలో లేని వేరొక అక్షరమని నిర్దారణము గావించిరి. అదిక్రమముగా కొన్నిచోట్ల 'డ'గాను,కొన్ని చోట్ల 'ళ'గాను,మరికొన్ని చోట్ల 'ద' గాను మార్పునొంది అదృశ్యమైనట్లు చెప్పిరి.ఈ సందర్భమున వారి అభిప్రాయ భేదములెట్లు న్నను ఈయక్షరమొకటి పూర్వము తెలుగు భాషలో గలదని నిశ్చయముగా శాసనములనుబట్టి తెలియుచున్నది.అది 'చోఱ' 'పదములలో(ఱలో లోపలి గీత తొలగించగా మిగిలిన అక్షరము దాన్ని డ్జ గా పలికే వారు ఈ వ్యాసములో ఎక్కడ ఱ వ్రాసినను బండి ర గా పలక కూడదు డ్జ గా పలకాలి పూర్తి సంయుక్తము గా కాకుండా కొంచెం తేలికగా పలకాలి ఈ విషయం మరచిపోవద్దు ) 'చోఱ ( చోడ్జ గా పలకాలి కన్నడిగుల వల్లనే డ్జ అని పలకాలని ఉచ్చారణ తెలిసింది ఈ అక్షరం కన్నడం లో ఎక్కువ కాలము ఉంది.)p అనే పదం చోడ' లేక 'చోళ' అనియు;'నోఱంబ' పదములో 'నోళంబ' అనియు,ఱెందలూరు అనుచోట దెందులూరు గాను, క్టిన్ద అనునది క్రిన్ద(క్రింద) గాను 'ఱ' క్ఱొచె'అనుపదము 'క్రొచ్చె';వ్ర్ ​కన్నడములోకూడ చాల కాలముముండినట్లు నిఘంటువు లందిదిగల పదములనేకములు చేర్చబడి యుండుట వలన తెలియుచున్నది. తమిళమునందిది 'వాళైప్పళం'(=అరటిపండు) వంటి పదము లలో వాడబడుచున్నదని కొందరు భావించారు.తెలుగు శాసనములలో చొఱ అని వ్రాయ బడిన కాలమునకు చెందిన పుణ్యకుమారుని చోళకేరళానామధిపతిః' అని 'ళ' కారము వ్రాయబడింది. కనుక 'ఱ' ( బండి ర కాదు డ్జ) అనేది తెలుగు భాషకి చెందిన అక్షరమే; సంస్కృత ములో 'ళ'గనో 'డ'గనో మారుచుండెడిది.

 అయినా కూడా, క్రీ.పూ. మొదటి శకంలో శాతవాహన రాజులు సృష్టించిన "గాధాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత్ పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారై ఉంటారని నిర్ణయించవచ్చు. తెలుగు భాష మూలపురుషులు యానాదులు అని చరిత్రకారులు పేర్కొన్నారు . పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత 2,400 సంవత్సరాలనాటిది అని తెలుస్తోంది

                          సశేషం .

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

గో రక్షణ అవసరం

 🙏🐂🙏🐂🙏

🔯 గోవుల మధ్యలో గోవుల కాపరిగా ఉండటం వలన పోతులూరి వీర బ్రహ్మం గారికి , భవిష్యత్తు తెలిసి కాలజ్ఞానం రాశారు.🐂


🔯 గంగిగోవు పాలు గరిటడైనను చాలు అని గోవు మహత్యం గుర్తించిన వేమన ఒక గొప్ప యోగి అయ్యాడు.🐂


🔯 గోవధ నిషేధం, గో రక్షణ , స్వతంత్రం కన్నా గొప్పదని చెప్పిన గాంధీ ఒక మహాత్ముడు అయ్యాడు.🐂


🔯 అవు మాంసం తో తుపాకీలు చేస్తున్నారని తెలిసి, మొట్టమొదటిగా సిపాయిలతో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు మొదలుపెట్టాడు మంగళ్ పాండే.🐂


🔯 అవుల శాల లో జీవిస్తూ జీవిత పరమార్థం తెలుసుకొని ఒక గొప్ప గురువు అయ్యాడు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి.🐂


🔯 సాక్షాత్తు మహా విష్ణువు , గోవుల మధ్య శ్రీ కృష్ణుడి అవతారం ఎత్తి గీత ను బోధించాడు.🐂


🔯  తిరుమల వేంకటేశ్వరుడు, పుట్టలో తపస్సు చేసుకొంటూ గోవు పాలు తాగి కలియుగ దైవంగా వెలిశాడు.🐂


🐂🕉️🐂 గో రక్షణ అవసరం గుర్తిస్తే గొప్ప జీవితం అనుభవిస్తాము.


👎 గో భక్షణ కు సహకరిస్తే అధహ్ పాతాళానికి చేరుతాం.


🐂జై గోమాత🐂

ముఖ్యమైన విషయాలు.

 🙏🌟🌟🌟🙏


* ముఖ్యమైన విషయాలు...*


*పూజ* :-పూర్వజన్మవాసనలను నశింపచేసేది. జన్మ మృత్యువులను లేకుండా చేసేది. సంపూర్ణ ఫలాన్నిచ్చేది.


*అర్చన*:- అభీష్ట ఫలాన్నిచ్చేది. చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయ మైనది, దేవతలను సంతోషపెట్టేది.


*జపం*:- అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పరదేవతను సాక్షాత్కరింప చేసేది జపం. ఇది జివుణ్ణి , దేవుణ్ణి చేస్తుంది.


*స్తోత్రం*:- నెమ్మది నెమ్మదిగా మనస్సుకి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం.


*ధ్యానం*:- ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింప చేసేది.


*దీక్ష*:- దివ్యభావాలను కల్గించేది. పాపాలను కడిగివేసేది.సంసార బంధాల నుండి విముక్తిని కల్గించేది దీక్ష.


*అభిషేకం* :- అభిషేకం చేస్తే , చేయిస్తే సకల శుభాలు కలుగు తాయి. అభిషేకం అహంకారాన్ని పోగొట్టి పరా తత్వాన్ని అందిస్తుంది.


*మంత్రం*:- తత్త్వం పై మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం. అఖండ శక్తి నీ ఇస్తుంది.


*ఆసనం*:- ఆత్మసిద్ధి కల్గించేది, రోగాలను పోగొట్టేది, క్రొత్తసిద్ధిని, లేదా నవసిద్ధులను కల్గించేది ఆసనం.


*తర్పణం*:- పరివారంతో కూడిన పరతత్త్వానికి క్రొత్త ఆనందాన్ని కల్గించేది.


*గంధం*:- గంధంలో  సర్వ దేవత కొలువై ఉన్నారు. మేము కూడా మీ పూజలో ఉండేలా వరం ఇవ్వు తల్లీ అని దేవతలంతో అమ్మవారిని కోరారు. 


అప్పుడు అమ్మవారు మీరు గంధంలో కొలువై ఉందురుగాక అని వరం ఇచ్చారు. అప్పటినుండి గంధానికి పూజలో ఉన్నత స్థానం లభించింది.


*అక్షతలు*:- కల్మషాలను పోగొట్టడం వల్ల తత్ పదార్ధంతో తదాత్మ్యాన్ని కల్గించేవి. పసుపు, కుంకుమ,నూకలు (విరిగిన బియ్యం) లేని మంచి బియ్యం కలిపి చేయాలి.


*పుష్పం*:- పుణ్యాన్ని వృద్ధిచేసి, పాపాన్ని పోగొట్టేది. మంచి బుద్ధిని ఇచ్చేది.అలాగే ముండ్లు కలిగిన పువ్వులు వాడితే కష్టాలు వస్తాయి.

మంచి సువాసన కలిగిన పువ్వులు వాడితే శుభం కలుగుతుంది.


(ఈమధ్య పుష్పాలను చించి రేకలను విడదీసి వాడుతున్నారు. అలా చేయవద్దు. కాగాతొడిమలను తప్పకుండా తుంచివేశాకే పుష్పాలను పూజలో వినియోగించాలి.


*ధూపం:*- చెడువాసనలవల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది. పరమానందాన్ని ప్రసాదించేది. ధూపం ద్వారా చాలా మంచి జరుగుతుంది. ప్రేత , పిశాచాలు పారిపోతాయి.


*దీపం*:- సుదీర్ఘమైన అఙ్ఞానాన్ని పొగొట్టేది. అహంకారం లేకుండా చేసేది. పరతత్త్వాన్ని ప్రకాశింప చేసేది. ఈ దీపం జ్ఞానానికి సంకేతం. 

పూజగది.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - గ్రీష్మ ఋతువు - ఆషాడ మాసం - శుక్ల పక్షం  -‌ అష్టమి  - చిత్ర -‌‌ బాను వాసరే* (14.07.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

కృష్ణానదిని కాపాడుకునేందుకు

 పద్యం:☝️

*తీరంబందు విసర్జనల్‌ సలుపు ఈ దీన ప్రజాకోటికిన్‌*

*దారిద్య్రంబున్‌ బాపు శుభ్రతను విద్యా గంధమున్‌ గూర్చుచున్‌*

*సారంబే నవ సుఖజీవనంబునిడి శ్రీచైతన్యంబున్‌ గూర్చుమా?*

*వేరేదారిక లేదు వీరలకు నీవె దిక్కు కృష్ణానదీ*

-కృష్ణానది శతకం

-జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు 


కృష్ణానదిని కాపాడుకునేందుకు సూచనలను ఈ పద్య రూపంలో పెట్టారు.

భావం: నీటిలో ప్లాస్టిక్కులు వేయవద్దని, మల మూత్రాలను విసర్జించరాదని, ఇలాంటి తప్పిదాలు చేసేవారిని కృష్ణవేణీ నది కరుణించి వారికి సద్బుద్ధిని ప్రసాదించి నదులను శుభ్రంగా స్వచ్ఛంగా ఉంచేటట్లు చేయాలి.🙏

పంచాంగం 14.07.2024 Sunday.

 ఈ రోజు పంచాంగం 14.07.2024 Sunday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం గ్రీష్మ ఋతు ఆషాఢ మాస శుక్ల పక్ష  అష్టమి తిధి భాను వాసర: చిత్ర  నక్షత్రం శివ యోగ: బవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


అష్టమి సాయంత్రం 05:22 వరకు .

చిత్ర  రాత్రి 10:00 వరకు.


సూర్యోదయం : 05:53

సూర్యాస్తమయం : 06:50


వర్జ్యం : తెల్లవారుఝామున 04:09 నుండి ఉదయం 05:57 వరకు.


దుర్ముహూర్తం : సాయంత్రం 05:06 నుండి 05:58 వరకు.


అమృతఘడియలు : మధ్యాహ్నం 02:54 నుండి 04:41 వరకు.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.



శుభోదయ:, నమస్కార: