🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*శాంతి మంత్రం*
🕉️🕉️🕉️🕉️☸️☸️🕉️
*ఓం పూర్ణమదః పూర్ణమిదం*
*పూర్ణాత్పూర్ణ ముదచ్యతే !*
*పూర్ణస్య పూర్ణమాదాయ*
*పూర్ణమేవావశిష్యతే !!*
*ఈ ప్రపంచమూ, జీవరాశులూ భగవంతుని నుండే ఉద్భవించాయి. అందుచేత ప్రకృతిని, ఇతర జీవులను ప్రేమించడం, భగవంతుణ్ణి ప్రేమించడమే, అన్న సత్యాన్ని సూచిస్తూంది , ఈ మంత్రం.*
*ఈశ, బృహదారణ్యక ఉపనిషత్తులకు ఈ మంత్రం శాంతి మంత్రమై వెలుగొందుతూన్నది.*
ప్రతి పదార్ధం;-
*అదః = భగవంతుడు,*
*పూర్ణం = పూర్ణుడు,*
*మిదం = ఈ ప్రపంచం,*
*పూర్ణం = పూర్ణమైనది ,*
*పూరణాత్ = పూర్ణుడైన భగవంతుని నుండే*
*పూర్ణం = పూర్ణమైన ప్రపంచం,*
*ఉదచ్యతే = ఉద్భవించింది,*
*పూర్ణస్య = పూర్ణంనుండి ,* *పూర్ణం = పూర్ణాన్ని,*
*అదాయ = తీసివేసినా,*
*పూర్ణం ఏవ = పూర్ణం మాత్రమే,*
*అవశిష్యతే = మిగిిలి వున్నది.*
తాత్పర్యం:-
*భగవంతుడు పూర్ణుడు. ఈ ప్రపంచం పూర్ణమైనది . పూర్ణుడైన ఆ భగవంతుని నుండే పూర్ణమైన ప్రపంచం ఉద్భవించింది. పూర్ణం నుండి పూర్ణాన్ని తీసిన పిదప సైతం పూర్ణమే మిగిలి వుంది.*
*ఓం శాంతిః శాంతిః శాంతిః!!*
*సర్వేజనా సుఖినోభవంతు!!*
*ఓం తత్సత్!!!*
*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!!*
*ఓం నమః శివాయ॥*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*సంకలనం: దైవానుగ్రహంతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి.*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి