7, జనవరి 2022, శుక్రవారం

పాశురము

 *🚩రేపటి తిరుప్పావై ఇరవై రెండో రోజు పాశురం🚩*_ 


🚩 *తిరుప్పావై 22 వ ప్రవచనం*🚩


🕉🌴🌿🌹🌷🌿🌴🕉️


*☘పాశురం☘*


*అఙ్గణ్ మాఞాలత్తరశర్, అబిమాన*

*బఙ్గమాయ్ వన్దు నిన్ పళ్లిక్కటిల్ కీళే*

*శఙ్గమిరుప్పార్ పోల్ వన్దు తలైప్పెయ్ దోమ్*

*కిఙ్గిణివాయ్ చ్చెయ్ ద తామరై ప్పూప్పోలే*

*శెఙ్గణ్ శిఱిచ్చిణిదే యెమ్మేల్ విళియావో;*

*తిఙ్గళు మాదిత్తియను మెళున్దాఱ్పోల్* 

*అఙ్గణిరణ్డు ఙ్గొణ్డు ఎఙ్గళ్ మేల్ నోక్కుదియేల్* 

*ఎఙ్గళ్ మేల్ శాబ మిళిన్దులో రెమ్బావాయ్.*


*🌿భావం :-🌿*


ఈ సుందర సువిశాలమైన భూమిని ఏకఛత్రాధిపత్యముగ నేలిన రాజులందరును తమ కెదురెవ్వరు లేరను అహంకారమును వీడి, అభిమానులై నీ శరణు జొచ్చిరి. అనన్య శరణాగతిని చేయుచు నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేమును అనన్య ప్రయోజనులమై వారివలె నీ శరణుజొచ్చినాము. మాకు నీవు దక్క వేరు దిక్కులేదు స్వామీ! చిరుమువ్వలు నోళ్ళు తెరచినట్లుగను, సగము విరిసిన తామరపూవువలెను మెల్లమెల్లగా విప్పారిన నీ సుందర నేత్రాలనుంచి జాలువారు వాత్సల్య కరుణారస దృక్కులను మాపై ప్రసరింపనిమ్ము. సూర్యచంద్రులుదయించెయనునట్లు కనిపించు నీ కన్నుదోయి నుంచి జాలువారే కరుణ వాత్సల్యం రసదృక్కులు మాపై ప్రసరించినచో మా కర్మ బంధములన్నీ తొలగిపోవును కనుక మా కర్మబంధములు తొలగగనే మేము నిన్ను చేరుకొందము కద! మా వ్రతమునకు పొందవలసిన ఫలము గూడ యిదియేగదా! యని ఆండాళ్ తల్లి కర్మ బంధం. తొలగితే ముక్తి లభిస్తుందని' తెలియజేస్తోంది. 


*🌴అవతారిక :-🌴*


పరమాత్మను పొందాలని కోరుకొనేవారు స్వామికి సంపూర్ణ శరణాగతులవ్వాలి. సంపూర్ణ ప్రపత్తిని చేయాలి. స్వామి పాదాలచెంత వ్రాలి 'నీవు దక్క మాకు దిక్కులేదు. మేము పూర్తిగా నీవారమే' అనే శరణాగతి చేసి పాదాల నాశ్రయించాలని ఆండాళ్ తల్లి బోధిస్తోంది. ఈ మాలికలో - మేము నిన్ను స్తుతిస్తుండగా నీ అతిలోక సుందరమైన రూపాన్ని - అనగా మెల్లమెల్లగా నీ సూర్యచంద్రులవంటి కన్నులను వికసింపచేస్తుండగా అందుండి నీ కరుణా కటాక్ష వీక్షణాల వాత్సల్యరసపూర్ణధారలను తనివితీరా పొంది ఆనందించాలని వచ్చామని గోపికలు తెలిపారు. కర్మల కారణంగా పరమాత్మకు బహుదూరమైన జీవులు తిరిగి కలుసుకొనేటట్లు చేసేదే యీ ధనుర్మాస వ్రతమంటుంది మన ఆండాళు తల్లి.


*🌳(కల్యాణిరాగము - రూపక తాళము)🌳*



ప.. చిరు మువ్వలు నవ్వి నటుల వికసించిన కలువల వలె - ఆ 

ఎరుపులీను కన్నుదోయి కరుణణు ప్రసరింపనీవె!


అ..ప.. సూర్యచంద్రులుదయించెనో? యట్టుదోచు కనుదోయిని 

పరమాత్మా! మా పాపములన్ని బోవ చూడరావె!


1. చ.. అహంకార మమకారములణచి వచ్చి రాజులు - నీ 

సింహాసనమునకు క్రిందగుంపు గూడియున్నట్టుల 

అహము వీడి నీ సన్నిధి నంజలి ఘటియించినాము 

మహాప్రభో! యింకనైన కటాక్షింపరావె! స్వామి 

ఎరుపులీను కన్నుదోయి కరుణను ప్రసరింపనీవె!


🙏🙏🙏🙏🙏🙏🙏🙏


_*🚩తిరుప్పావై ప్రవచనం‎ - 22 వ రోజు🚩*_ 


🌴🍃🌿🌹🌷🌿🍃🌴


*అనన్య గతిత్వం*

*ఆండాళ్ తిరువడిగలే శరణం* 


☘☘☘☘☘☘☘☘


*పాశురము*


*అంగణ్ మా ఞాలత్తరశర్, అబిమాన*

*పంగమాయ్ వందు నిన్ పళ్ళికట్టిల్ కీరే*

*శంగమ్ ఇరుప్పార్ పోల్ వందు తలై ప్పెయ్-దోమ్*

*కింగిణివాయ్ చ్చేయ్ద* *తామరై ప్పూప్పోలే*

*శెంగణ్ శిఱుచ్చిఱిదే* *యెమ్మేల్ విరయావో*

*తింగళుమ్* *ఆదిత్తియనుమ్ ఎరుందాఱ్పోల్*

*అంగణ్ ఇరండుం కొండు ఎంగళ్మేల్ నోక్కుదియేల్*

*ఎంగళ్మేల్ శాపం ఇరింద్-ఏలోర్ ఎమ్బావాయ్* 


మనిషి వస్తువులపై ఏర్పర్చుకున్న అభిమానము, ఎప్పటికీ వాటిని పట్టుకొని వ్రేలాడుటూనే ఉంటాడు ఎంత దుఃఖాల పాలైనా. అసలు ఇవన్నీ వాడివే అని ఒక మాట అనుకుంటే, ఏడవ వల్సిన అవసరము ఉండదు. ఒక మహానుభావుడు ఉండేవాడట, ఎంత సంపదలు అనుభవించేవాడంటే ఏనుగు ఎక్కి ఎప్పటికి పైకే చూసేవాడట, క్రిందకి చూడటము కూడా మరచి పోయాడట. వీడి దయకోసం రారాజులే వీడి పాదాల వద్ద వాళ్ళ కిరీటాలు ఉంచేవారట. ఇలాంటి వాడికి ఒకనాడు ఏమైందంటే వాడి రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించారు. వాడు తన వాళ్ళని వదిలి వచ్చేసాడు. ఊరు దాటి బయటికి వెళ్ళలేడు, ఒక పూరి గుడిసెలో దాక్కున్నాడు. మరి ఎవరికైనా తెలిస్తే అభిమానం అడ్డొస్తుంది. తినటానికి అడుక్కోవాలంటే పగలు బయటికి రాలేడు. ఒక పెంకు ముక్కను తీసుకొని రాత్రి బయలుడేరాడు ఎవ్వరు చూడరని, అది కూడా వెలుతురు ఉండదని ఇండ్ల చూరు కింద నడుస్తూ వెళ్ళాడు. అక్కడ ఒక పిల్లలు కల కుక్క పడుకొని ఉండట, వీడేదో చేయటానికి వచ్చాడని, వీడి కాలు పట్టి కరిచిండి. అమ్మో అంటూ అరవడం మొదలు పెట్టాడు. అంతలోనే వచ్చి రాజు అని గుర్తు పట్టే సరికి వాడు అభిమానంతో తల దించుకున్నాడట. *"ఒరు నాయగమాయ్ ఓడ ఉల ఉడ ఆండవర్ కరునాయ్ కవరంద కాలర్ సిదగీన పానయర్ పెరునాడు కాన ఇమ్మయిలే పిచ్చితాన్ కరువర్"* ఏక ఛత్రాదిపతిగా పరిపాలించిన మహనీయుడే, ఒక నాడు కిరీటాలు తగిలించుకున్న కాలు, ఈనాడు కుక్క కరిచిన కాలు. ఒకనాడు బంగారు పాత్రలలో తినేవాడు, ఇప్పుడు చితికిన పెంకు ముక్క చేత పట్టుకున్నవాడు. అభిమానం పెంచుకున్న వాళ్ళ బ్రతుకులు ఇలా ఉంటాయి అని అళ్వారులు చూపిస్తారు.


మనిషి వస్తువులను సంపాదించటం, వాటిని అనుభవించటం తప్పు కాడు, అవి నావల్ల అని అనుకోవడం తప్పు. వాడిచ్చింది అనుకుంటే అన్ని మనకు సుఖంగా ఉండేట్టు చేస్తాడు, నేనార్జిస్తున్న అనుకుంటావా చుట్టు ఉండే వాటితో నిన్ను వదిలేస్తా, నీవే కాపాడుకో అని నిన్ను వదిలేస్తాడు. ఎంతవరకు అని మనం రక్షించుకోగలం కనుక. ఈ భూమి మీద అభిమానాలు అంతలా పెంచుకొని, భగవంతుడిదీ అని మరచి, బ్రతుకుతే వాడికి గతి ఉండనే ఉండదు. 


*“అంగణ్ మా ఞాలత్తరశర్”* ఈ అందమైన భుమి మీద *“అబిమాన పంగమాయ్ వందు”* అభిమానాలను వదులుకొని వచ్చి *“నిన్ పళ్ళికట్టిల్ కీరే”* నీ పడక మంచం క్రింద దాగి ఉండే రారాజుల వలె మేము వచ్చామయ్యా. మనిషి తన శరీరం పై కూడా అలాగే అభిమానం కల్గి ఉంటున్నాడే, చూస్తూ చూస్తూ ఉంటే నలుగురు అసహ్యించుకొనేలా మన శరీరం మారిపోతుందే. ఈ అభిమానాలను మనిషి వీడాలి. అన్నీ భగవంతుడు ఇచ్చినవి అని భావించాలి. ఈ దేహాల పై అభిమానాలు పెంచుకుని ఈ ప్రకృతి మండలాల్లో సంచరిస్తున్నమో ఆ అభిమానాలను అన్నీ వదులుకొని నీ పద సన్నిధి చేరామయ్యా. ఎవరైనా వదులుకొని రావాల్సిందే. మన లాంటి సామాన్యులకే అది సులభం, చతుర్ముఖ బ్రహ్మాదులకు అన్నీ లోకాలను వదులుకొని రావాలనంటె అది కష్టం, కాని తరించాలి అంటె ఆయన కూడా వదులుకు రావడం తప్పదు.


*“శంగమ్ ఇరుప్పార్ పోల్”* అయిటే వాళ్ళు ఒంటరిగా ఉంటే ఎవరైనా శంకిస్తారేమోనని గుంపులు గుంపులుగా ఎట్లా ఐతే చేరి ఉన్నారో, మేము కూడా అలాగే నీ వద్దకు చేరాము. *“వందు తలై ప్పెయ్-దోమ్”* ఈ చేరటం కూడా మాకు ఎంత ఆశ్చర్యంగా ఉంది అంటే, ఇది మా ప్రయత్నం కాదు సుమా, దురభిమానంతో మేం తప్పించుకు తిరుగుతుంటే మాపై లేని సుకృతాలు మామీద ఆరోపణ చేసి మాకు ఎంతలా ఉపకారం చేసావు, మాకు ఎక్కడో గుర్తులేని స్థితిలో మేముంటే ఒక శరీరాన్ని ఇచ్చి, ఇంద్రియాలను ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి, మహానుభావులను ఇచ్చి వారి ఉపదేశాలు వినేట్టు మాలో ఉండి మమ్మల్ని సంస్కరించి, మాలో నీ పై ద్వేశాన్ని తగ్గించి ని పై ప్రేమ కల్గి నీ సన్నిధికి పరుగు పరుగున వచ్చాం, ఇదంతా నీవే చేసిన ప్రయత్నం కదయ్యా. నీ కృషి ఫలించేట్టు చేయడానికి వచ్చాం. 


ఇక నీ సన్నిధి చేరాం, ఇక మాకు ఫలితం దక్కాలికదా, *“కింగిణివాయ్ చ్చేయ్ద”* చిన్నటి సిరిమువ్వ గజ్జలు ఒక గీతగా కనిపిస్తాయే, అట్లా కనిపించే ఆనేత్రాలని *“తామరై ప్పూప్పోలే”* పద్మాల్లా *“శెంగణ్ శిఱుచ్చిఱిదే”* అందముగా, మెల్లి మెల్లిగా *“యెమ్మేల్”* మాపై *“విరయావో”* ప్రసరించేట్టు చెయ్యి. *“తింగళుమ్”* చంద్రుడి చల్లటిచూపులాగా *“ఆదిత్తియనుమ్”* సూర్యుడి కాంతి వలె *“ఎరుందాఱ్పోల్”* ఇద్దరు కలిసి నట్లుగా ఉంది, ప్రేమించేవారికి ప్రేమను కురిపించేట్లు, ద్వేశించేవారికి ప్రతాపం కల్గి ఉంటాయి ఆ చూపులు. మరి ఈ రెండు ఒక్కసారి సంభవిస్తాయా అంటే సంభవిస్తాయి *“ప్రసన్నం ఆదిత్య వర్చసమ్ రామం”* అంటారు, సూర్యుడు తన మాధ్యాత్మిక కాంతిని చంద్రుడి చల్లటి చూపులలా ఇస్తె ఎలా ఉంటుందో మాకు నీ చూపులను అందించు.


తప్పు తప్పు *“అంగణ్ ఇరండుం”* ఆకళ్ళు అవే. నీ కళ్ళను పోల్చటానికి ఏ ఉపమానం లేదు, *“కొండు ఎంగళ్మేల్”* వాటిని మాపై పడేట్లు చెయ్యి. *“నోక్కుదియేల్ ఎంగళ్మేల్”* ఆచూపులు మాపై పడితే *“శాపం ఇరింద్”* మాకున్న శాపాలన్నీ తొలగుతాయి. ఆహల్యకున్న శాపం నీ పాద స్పర్షతో పోయింది-మాకూ నీ పాద స్పర్ష కావాలి, చంద్రపుష్కరిణి లో స్నానం ఆడితే దక్షుడికి శాపం పొయ్యింది- మాకూ నీ కళ్యాణగుణపుష్కరిణి లో స్నానం కావాలి, శివుడికి బ్రహ్మ తల తీసిన శాపం నీ వక్షస్పర్శచే తొలగింది-మాకూ అది కావాలి. నిన్ను ఎడబాసి ఉండడమే మాకు ఒక శాపం, నీవు అనుగ్రహించాలి. *“చకృషా తమ సౌమ్యేన పూతాస్మీ రఘునందన”* నీ చూపు నాపై పడిండయ్యా ఇక నా పాపాలన్నీ తొలగుతాయి అని శభరి అన్నట్లుగా మనవాళ్ళు ఆయన చూపులు మనపై ప్రసరింపచేయ్యమని స్వామిని కోరుతూ తమ అనన్య గతిత్వాన్ని తెలుపుతూ ఇవన్నీ ఆయన చేసుకున్నవి అని భావిస్తున్నారు. ఇక స్వామిని చేరే వరకే శాస్త్రాలు, ఇకపై ఆయనకు వీళ్ళ మాటలు వినక తప్పదు.


          🌷 *సేకరణ*🌷

      🌴 *న్యాయపతి*🌴 

    🌹 *నరసింహారావు*🌹


🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ఉపవాసం

 ఉపవాసం లోని రకాలు - ఉపయోగాలు .


    ఉపవాసం అనగా ఏమి తినకుండా కేవలం మంచినీరు తాగి ఉండటమే ఉపవాసం . దీర్ఘ ఉపవాసం చేయువారు రసాహారము తీసికొనవలెను. కొందరు దేవునికి ఒకపొద్దు ఉంటున్నాం అని ఆ తరువాత అరడజను అరటిపళ్ళు, 10 ఇడ్లిలు, అరకిలో ఉప్మా లాగించేస్తారు . అన్నం మాత్రం తినరు.బహుశా వారి దృష్టిలో ఇదో రకం ఉపవాసం కావొచ్చు.కాని అలా చేయడం ఉపవాసం అనిపించుకోదు.


         ఉపవాసం చేయడం వలన ముఖ్య ఉపయోగం శరీరంలోని మాలిన్యాలను బహిష్కరింపచేసి వ్యాధి నిర్మూలనం అవుతుంది. పొట్ట , కన్ను, వ్రణములు , జ్వరములు, జలుబు మొదలగు వ్యాదులను కనీసం 5 రోజులపాటు ఉపవాసం చేసి వ్యాధి తగ్గించుకోవచ్చు. ఏ వ్యాధిలోనైనా ఉపవాసం చేయుట వలన వ్యాధి తొందరగా తగ్గించుకోవచ్చు . లేనిచో ఒకపూట ఉపవాసం ఉండి తరువాత ఆ వ్యాధికి సంబంధించిన పథ్యకరమైన ఆహారం తీసుకోవచ్చు.


          ఉపవాసంలో 4 రకాలు ఉన్నాయి అవి 


           1 - నిర్జలోపవాసం .


           2 - జలోపవాసం .


           3 - రసోపవాసం .


           4 - ఫలోపవాసం .


 * నిర్జలోపవాసం -


          మంచినీరు కూడా ముట్టకుండా చేయు ఉపవాసమును నిర్జలోపవాసం అంటారు. ఈ ఉపవాసం ముఖ్యంగా శరీరంలో నీరు ఎక్కువ చేరినప్పుడు అనగా శరీరం వాచినప్పుడు రెండు లేదా మూడు దినములు ఈ ఉపవాసం చేయవలెను . మూడురోజులకు మించి ఈ ఉపవాసం చేయరాదు .


 * జలోపవాసం -


          కేవలం మంచినీరు మాత్రమే తాగి చేయు ఉపవాసమును జలోపవాసం అందురు. దీనిని మూడురోజుల నుంచి ఏడు రోజుల వరకు మాత్రమే చేయవలెను . అంతకు మించి చేయరాదు . శరీరంలో మాలిన్యాలు అధికంగా చేరి ఏ రసాహారమును కూడా జీర్ణం చేసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు కేవలం మంచినీరు తాగించి ఉపవాసం చేయించవలెను. అనగా సుమారు రెండులీటర్లు మంచినీరు త్రాగించవలెను.


 * రసోపవాసం -


           ఈ రసోపవాసమును సాధారణంగా ప్రకృతిచికిత్సాలయాల్లో రసోపవాసం చేయిస్తారు. కేవలం పండ్లరసాలతో చేయు ఉపవాసమును రసోపవాసం అంటారు. ఈ ఉపవాసం వారం రోజులు మొదలుకుని నెలరోజులు వరకు కూడా చేయవచ్చు . రసోపవాసంలో ముఖ్యంగా నిమ్మరసం , పలుచని నారింజరసం , బత్తాయిరసం , కమలారసం , తేనెనీరు, కొబ్బరినీరు , బార్లినీరు మొదలగునవి రోజుకు మూడుసార్లు నుండి అయిదుసార్లు లోపలికి తీసుకోవచ్చు .


 * ఫలోపవాసం -


        ఉపవాసం చేయలేనివారు ఫలోపవాసం చేయవచ్చు . కేవలం రసము నిండిన ఫలములు మాత్రమే ఆహారంగా తీసికొనవలెను . అరటిపండు తీసుకోకూడదు . ఎక్కువ బత్తాయి, నారింజ, కమలా , ద్రాక్షా, అనాస , దానిమ్మ, మామిడి, పుచ్ఛ మొదలగు పండ్లు తినవచ్చు . 


        ఈ ఉపవాసం రోగిని అనుసరించి పది నుంచి నలుబది రోజుల వరకు అనుసరించవచ్చు.


 * ఉపవాసం చేయుట వలన వివిధ అవయవాలలో కలుగు మార్పులు -


 జీర్ణక్రియకు మంచి విశ్రాంతి లభించి అజీర్ణం తొలగిపోయి ఆకలివృద్ధి అగును.


  మలాశయంలో మురికి బహిష్కరింపబడి అజీర్ణం తొలగించబడి క్రిములను, బాక్టీరీయా నాశనం చేయబడును.


  మూత్రపిండాలలోని విషపదార్ధాలు, రాళ్లు బహిష్కరింపబడును.


  ఊపిరితిత్తులలోని నంజు, నీరు బహిష్కరించబడి ఆయాసం నివారించబడును. శ్వాసక్రియ చక్కగా జరుగును.


  గుండెచుట్టు , లోపల చేరిన కొవ్వు, నీరు తగ్గి గుండె చక్కగా కొట్టుకొనును. గుండెజబ్బులలో రసోపవాసం మంచిది.


  లివర్ మరియు స్ప్లీన్ ఆహారం జీర్ణం అగుటకు ఇవి చక్కగా పనిచేయాలి. ఈ ఉపవాసం చేయుట వలన వీటికి విశ్రాంతి దొరుకును . వాటిలోని మాలిన్యం తొలగించబడి జీర్ణక్రియ వృద్ది అగును.


  శరీరంలో రక్తప్రసారం చురుకుగా ఉండును. ఉపవాసం చేయుట వలన రక్తదోషములు నివారించబడును. తిమ్మిర్లు, మంటలు , నొప్పులు కూడా తగ్గును.


  కీళ్లలో పేరుకుపోయిన కొవ్వు, నీరు, మాంసము వంటి మాలిన్యాలు తొలగించబడి వ్యాధి నివారణ అగును.


  నాడీమండలం శుభ్రపరచబడును.


  జ్ఞానేంద్రియాలలో మాలిన్యాలు అన్ని పోవును .


  చర్మం కాంతివంతం అగును. చర్మవ్యాధులు హరించును . శరీరానికి చక్కటిరంగు వచ్చును.


    మనస్సు ప్రశాంతంగా ఉండి కోపం వంటివి మన అదుపులో ఉండగలవు.


 * ఉపవాసం చేయకూడని వారు -


       చాలా బలహీనంగా ఉన్నవారు, గుండెజబ్బులు కలవారు , బాలురకు, వృద్దులకు గర్భిణీస్త్రీలకు , బాలింతలకు , క్షయ మరియు రక్తహీనత కలిగిన రోగులు , మధుమేహంతో ఉన్నవారికి ఎక్కువ రోజులు ఉపవాసం చేయకూడదు .


 * ఉపవాసం చేయదగిన వారు -


       స్థూలకాయులు , ఉబ్బసం, సంధివాతం, రక్తపుపోటు,చర్మవ్యాధులు మొదలగు దీర్ఘకాలిక రోగులకు ఉపవాసం చేయుట మంచిది.


    ఉపవాసం ముగించిన వెంటనే ఘనాహారం తీసుకోకూడదు . ఉపవాసం తరువాత ఎక్కువ ఆహారం తీసుకొకూడదు. క్రమేపి ఆహారాన్ని పెంచుకుంటూ రావలెను. కారం , మసాలా పదార్దాలు , పిండివంటలు పచ్చళ్ళు తినకూడదు. అలా తీసుకున్నచో విరేచనాలు , వాంతులు , కడుపులో మంట, నొప్పి వస్తాయి

క్షమ - పగ

 *😊క్షమ - పగ😡*

🕉️🌞🌏🌙🌟🚩


*మన మనసులో రెండు వైరుధ్య భావా లుంటాయి. ఒకటి క్షమించడం, రెండోది పగ తీర్చుకోవడం. ఈ రెంటికీ సదా సమరం జరుగుతూ ఉంటుంది. క్షమ గెలిస్తే హృదయం ఆనంద మయం అవుతుంది. మనసులో అంతు లేని సంతోషం కలుగుతుంది. మనలో ఉండే ప్రేమ ఎప్పుడూ 'క్షమించు క్షమించు' అని చెబుతూనే ఉంటుంది. ప్రేమిస్తే ప్రేమ ను పొందుతాం. ద్వేషిస్తే ద్వేషాన్నే తిరిగి పొందుతాం.*



*గుండెలో పగ దాచు కోవడం అంటే 'పామున్న ఇంటిలో ఉండటమే' అంటుంది భారతం. పగ వల్ల పగ పోదనీ.. ఏ విధంగా చూసి నా పగని అణచడం లెస్స అనీ..భారత మహేతి హాస ఉద్బోధ...!!!*



*'నా కన్ను నువ్వు పొడిస్తే..నీ కన్ను నేను పొడుస్తా' అని 'కన్ను'కు కన్ను... పన్నుకు పన్ను' సిద్ధాంతం తో అందరూ ముందుకు దూకితే- లోకం అంతా..గుడ్డి వాళ్ల తో..బోసి నోటి వాళ్ల తో నిండి పోతుంది.*

 


*ప్రతీకారం అనే విష చక్రం నుంచి బయట పడాలంటే "క్షమించడం" ఒక్కటే ఉపాయం. ఇందు వల్ల రెండు లాభాలున్నాయి. ఒకటి- క్షమించే వారు, ఆదర్శ వ్యక్తులుగా గౌరవం పొందుతారు. రెండోది- క్షమ పొందేవారు, తమ జీవితాలను సరి దిద్దుకుంటారు.*



*క్షమా గుణం శత్రువును సైతం మిత్రుడి గా...మార్చేస్తుంది. 'పొరపాటు' అనేది. మానవ సహజ గుణం. క్షమ దైవ విశిష్ట గుణం' అని ఆంగ్ల సామెత.*



*మహా భక్తుల జీవితాలన్నీ...ప్రేమ మయాలు.*



*ఏక నాథుడు పాండు రంగడి భక్తుడు. ప్రశాంత చిత్తుడు. సదా స్వామి సేవలో, భజన లో కాలం గడిపే వాడు. ప్రజలందరూ ఆయన్ని ప్రశంసించడం చూసి కొందరు ఈర్ష్య పడ్డారు. ఎలా గైనా ఏక నాథుడికి కోపం తెప్పించాలని ప్రయత్నించ సాగారు. ఒక దుష్టుడికి డబ్బు ఆశచూపి, ఆ పనికి నియోగించారు.*

 


*ఏక నాథుడు రోజూ తెల్లవారు జామునే నది లో స్నానం చేసి వచ్చేవాడు. ఆ సమయం లో ఆ దుష్టుడు ఏక నాథుడి పై ఉమ్మి వేశాడు. ఏక నాథుడు ప్రశాంత చిత్తంతో చిరు నవ్వు చెరగ నీయ కుండా మళ్ళీ... వెనక్కి వెళ్లి నదీ స్నానం ఆచరించాడు..*



*ఇలా మొత్తం నూట ఏడు సార్లు జరిగింది.*

 


*ఏకనాథుడు ఏమాత్రం నిగ్రహం వీడ కుండా మందస్మిత వదనం తో అన్ని సార్లూ మరల మరల స్నానం చేసి వస్తున్నాడు.*



*దీంతో ఆ కుటిలుడి హృదయం చలించి పోయింది!*



*ఆయన ఏక నాథుడి కాళ్లపై పడ్డాడు. 'స్వామీ, మీరు నిజం గా దైవ స్వరూపులు. మీ నిగ్రహం చెడ గొట్టి, ఎలా గైనా మీకు కోపం తెప్పించాలని కొందరు నన్ను పురమా యించారు. మీకు ఆగ్రహం తెప్పించ గలిగితే నాకు ధనం ఇస్తా మని ఆశ చూపారు. "మీ క్షమాగుణం" తెలియక నేను ఈ నీచ కృత్యానికి అంగీకరించాను!' అన్నాడు ఆ వ్యక్తి పశ్చాత్తాపం తో.*



*ఏకనాథుడు అతడికి నమస్కరిస్తూ ఇలా అన్నాడు. 'నాయనా, నీవు నా కెంతో మేలు చేశావు. నా చేత నూట ఎనిమిది సార్లు పవిత్ర నదీ స్నానం చేయించిన మహాను భావుడివి నువ్వు! నేను నీ మేలు ఎన్నటికీ మరచి పోను!'* 



*ఏక నాథుడి పలుకులు విని అవతలి వ్యక్తి నిర్విణ్ను డయ్యాడు.* 



*ఆ భక్తా గ్రేసరుడి "క్షమాగుణం' ఆ ఉమ్ము వేసిన వ్యక్తి హృదయాన్ని ప్రక్షాళనం గావించింది. పశ్చాత్తాపం తో అతడు కన్నీరు కార్చాడు.*



*క్షమ అంటే భూమి. భూమి ఓర్పు గల తల్లి కను కనే మనం ఎంత బాధ పెట్టినా భూ మాత మన పై పగ తీర్చు కోవాలను కోదు. క్షమించే గుణం ఉన్నది కదా అని మనం భూమాతను అదే పనిగా హింసించ కూడదు.*

 


*క్షమా గుణానికీ హద్దులుంటాయని గుర్తుంచు కోవాలి! క్షమాగుణం పురాణాలకు, ప్రాచీన ఇతి హాసాలకే పరిమితం కాదు.* 



*ఇటీవలి చరిత్రలో క్షమాగుణం తో చరితార్థు లైన మహాపురుషు లెందరో ఉన్నారు.*



*ఆర్య సమాజ స్థాపకు లైన మహర్షి దయానంద నిష్కాపట్యం, నిర్భయత్వం సమాజం లో అనేకులకు కంట గింపైంది.* 



*ఆయన వద్ద వంట వాడికి లంచం ఇచ్చి, ఆహారం లో విషం పెట్టించారు.*



*దయానందులు మృత్యుశయ్యపై ఉన్నారు.*



*తన వంటవాడిని దగ్గరకు పిలిచారు. కొంత డబ్బు అతడి చేతి లో పెట్టి ఇలా అన్నారు. 'వెంటనే నువ్వు నేపాల్‌కి వెళ్లిపో! నా శిష్యులకు నువ్వు చేసిన పని తెలిస్తే నిన్ను బతక నీయరు!'*



*తనకు ప్రాణ హాని కలిగించిన వ్యక్తిని సైతం క్షమించి, అతడికి ప్రాణ దానం చేసిన మహర్షి దయానంద చరితార్థులయ్యారు.*



*క్షమాగుణం మానసిక రుగ్మతలకు మంచి మందు.*



*పగ తీర్చుకుంటే ప్రశాంతత చిక్కుతుందను కోవడం కేవలం భ్రాంతి మాత్రమే!*



*నిజానికి అభద్రత మిగులు తుంది. చిత్త వికారం ఏర్పడుతుంది. చివరకు జీవితం విషాదాంతం అవుతుంది.*



*ఒక సామెత ఇలా చెబుతుంది--*


*ఇతరులు మనకు చేసిన అప కారాలను ఇసుక పై రాయాలి. ఇతరులు మనకు చేసిన ఉప కారాలను చలువ రాయి పై చెక్కు కోవాలి!'*


🕉️🌞🌏🌙🌟🚩

*థర్డ్ wave

 *థర్డ్ wave తో జాగ్రత్త*  

 *WHO ICMR* భారతదేశాన్ని హెచ్చరించిందిట 

 దీనికి ఏకైక పరిష్కారం మిమ్మల్ని మీరు మాత్రమే రక్షించుకోవడం. *

 * కుటుంబ సభ్యులందరూ దయచేసి గమనించండి: *

 * 01 కడుపులను ఖాళీగా ఉంచకండి *

 * 02 ఉపవాసం చేయవద్దు *

 * 03 రోజూ ఒక గంట సూర్యరశ్మిని ఆస్వాదించండి.

 * 04 ఎసి ఉపయోగించవద్దు *

 * 05 వెచ్చని నీరు త్రాగండి, గొంతు తడిగా ఉంచండి *

 * 06 ముక్కుకు  ఆవ నూనె రాయండి *

 * 07 ఇంట్లో హారతి కర్పూరం కాల్చండి *

 * 08 ప్రతి కూరగాయకు అర టీస్పూన్ పొడి అల్లం జోడించండి *

 * 09 దాల్చినచెక్క వాడండి *

 * 10 రాత్రి కప్పు పాలతో ఒక స్పూన్ పసుపు త్రాగాలి 

 * 11 వీలైతే ఒక చెంచా చ్యవన్ ప్రాష తినండి.

 * 12 ఇంటిలో కర్పూరం మరియు లవంగాలతో పొగ వేయండి. 

 * 13 ఉదయం టీలో లవంగం వేసి మరిగించి తాగండి 

 * 14 పండ్లలో ఎక్కువ నారింజ మాత్రమే తినండి 

 * మీరు కరోనాను ఓడించాలనుకుంటే, దయచేసి ఇవన్నీ చేయండి. *

 * పాలలో పసుపు మీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది

 *