12, సెప్టెంబర్ 2022, సోమవారం

బుుణానుబంధ రూపేణా

 ❤️ *పుత్రులు ఏడు రకాలుగా జన్మిస్తారు.*

💕 *గతజన్మలో తన సొమ్మును దాచమని ఒక వ్యక్తికి ఇచ్చి, తన సొమ్మును తిరిగి తీసుకోకుండానే మరణించినవాడు తాను దాచిన సొమ్ము తీసుకోవడానికి ఆ ఇంట్లో పుత్రుడుగా జన్మిస్తాడు.*

💕 *తాను పూర్వ జన్మయందు బాకీపడిన అప్పును (ఋణాన్ని) తిరిగి చెల్లించుటకు పుత్రుడుగా జన్మిస్తాడు.*

💕 *పూర్వ జన్మలోని శత్రుత్వం తీర్చుకోవడానికి ఈ జన్మలో పుత్రునిగా జన్మిస్తాడు.*

💕 *పూర్వ జన్మలో తనకు ఒకడు అపకారం చేసాడు. దానికి ప్రతీకారం తీర్చుకోలేదు. ఈ జన్మలో ప్రతీకారం తీర్చుకోవడానికి అపకారం చేసినవాడికి పుత్రునిగా జన్మిస్తాడు.*

💕 *పూర్వ జన్మలో తాను అనుభవించిన సేవ,సుఖములకు బదులు తీర్చడానికి పుత్రునిగా జన్మించి తల్లిదండ్రులకు సేవ చేస్తాడు.*

💕 *పూర్వ జన్మలో తాను ఏ వ్యక్తి నుండి ఉపకారం పొందుతాడో, ఆ ఉపకారానికి బదులుగా ఉపకారం చేయుటకు పుత్రునిగా జన్మిస్తాడు.*

💕 *ఏమీ ఆపేక్షించనివాడు కూడా పుత్రునిగా జన్మించి, తన విధులను తీరుస్తాడు.*

🌺 *ఇలా పుత్రులుగా జన్మించినవారు కర్మానుసారముగా తమ పనులు పూర్తికాగానే మరణిస్తారు, లేదా దీర్ఘకాలం జీవించి ఉపకారం చేయడమో, ప్రతీకారం తీర్చుకోవడమో చేస్తారు.*

❤️ *కేవలం పుత్రులే కాదు, భార్య - భర్త - సోదరుడు - పనిమనిషి - ఆవు - కుక్క మొదలైన పశువులు కూడా కర్మరుణం తీర్చుకోవడానికి మనతో ఉంటారు.*

💕 *”బుుణానుబంధ రూపేణా పశు పత్నీ సుతాలయాః” అన్నారు కదా ఋణము తీరగానే వదిలి వెళ్ళడమో, పరలోకానికి చేరడమో జరుగుతుంది.*

❤️ *బుుణ సంబంధమే లేనప్పుడు పుత్రులు కలగరు. పుత్రులు లేనివాళ్లు తాము ఎవరికీ బుుణపడిలేమనీ, తమకు ఎవరూ బుుణపడి లేరనీ తృప్తిపడి సంతృప్త జీవనాన్ని సొంతం చేసుకోవాలి.*

❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*

చమత్కారం

 090922f1252.   100922-8.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*తెలుగు భాషాభిమానులకోసం…*


          *శ్లేష తో  చమత్కారం !*

                 ➖➖➖✍️



*కవుల మాటలేకాదు. కవిత్వభాష వంటబట్టినవారు కూడా చమత్కార భాసురంగా మాటలాడగలరు.* 


*ఆమాటలలోని  చమత్కారం ఆభాష తెలిసినవారికే అర్థమవుతుంది!*


*ఈ కింద కంద పద్యం చిన్నదే కానీ చమత్కార రంజితమై, సరసుల హృదయరంజకంగా మారింది.*


*క: చవిగొని ఫలములుఁ గొననా?*

*చవిజూచిన పండ్లురాలు; చక్కగ బొమ్మా!!*

*కవినేను, కనులఁ గనవా?*

*కవి వైనచొ, చంకనాకు, ఘంటంబేదీ?*


*పూర్వం కవులకు సంఘంలో మంచి గౌరవముండేది. వారెక్కడికి వెళ్ళినా అందరూ వారిని గౌరవించి అడిగినవి సమర్పించేవారు.*


*ఒక కవిగారు అరటిపండ్ల కోసం బజారుకు వచ్చారు. కొట్టు దగ్గర నిలబడ్డారు. పాపం వచ్చేటప్పుడు ‘ఘంటం, తాటియాకులు’ మరచారు.(అవి వారు కవులని సూచించే గుర్తులు. ’బొడ్డు దగ్గర ఘంటం, చంకలో నాలుగు తాటాకులు’ ఇదీవారి ఆహార్యం).*


*కవిగారు దుకాణదారునితో, "చవిగొని ఫలములుఁ గొననా?" అన్నారు.* 


*”రుచిచూచి నచ్చితే పండ్లు కొంటానయ్యా! రుచికి పండ్లు తీసికోనా?”అన్నారు.*


*దానికాదుకాణదారు, "చవిజూచిన పండ్లురాలు, చక్కగబొమ్మా?" అన్నాడు.*


*”రుచి కోసం చేతులేస్తే పళ్ళు రాలుతాయి, చక్కగా పో!” అన్నాడు.*


*ఒక అర్ధం ‘పళ్ళురాలుతాయి!’ అని తిట్టినట్టు. మరొకఅర్ధం ‘గెలకున్న పళ్ళు రాలిపోతాయి కెలకవద్దు!’ అని.*


*కవిగారికికోపంవచ్చింది. "కవి నేను కనుల గనవా?" అన్నారు.*


*”ఓ ఆసామీ యెవరనుకుంటున్నావు నన్ను, నేను కవిని, ఆమాత్రం మర్యాద తెలియదా?” అని.*


*దుకాణదారుకూడా తక్కువవాడు కాదు మరి, "కవివైనచొ చంకనాకు", అన్నాడు.*

*అదిపెద్ద తిట్టు మరి! వెంటనే నాలిక కఱచుకొని, "ఘంటంబేదీ?" అన్నాడు.*


*”పోవయ్యా! ‘నీవు కవివైతే ఏమి గొప్ప చంకనాకవయ్యా?’ అని దూషించినట్టు ఒకఅర్ధం. ‘తమరు కవియైతే చంకలో ఆకులు, ఘంటమూ కనబడవేం?’ అని మరో అర్ధం.*


*చూశారా? శ్లేష సాయంతో  కవి తన మాటలలో రెండర్ధాలను జోడించాడు. ఇదీ ఈ కందం లోని చమత్కారం!*


*తెలుగు భాషను ఆదరించండి, పోషించండి, రక్షించండి!*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం...

*“భగవంతుని విషయాలు గ్రూప్ “* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ మెసేజ్ పెట్టండి...944065 2774.

లింక్ పంపుతాము.🙏

కాకి_నేర్పే_అద్వైతం

 🎻🌹🙏కాకి_నేర్పే_అద్వైతం..!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


ఒకసారి భక్తుడొకరు పరమాచార్య స్వామి వారిని..., “మహాలయంలో మనం కాకులకు ఆహారం ఎందుకు పెడతాము.? మన పూర్వీకులు కాకులుగా మారారా?  అయితే ఇంతటి అల్ప పక్షిగా ఎందుకు మారారు? ఏదైనా పెద్ద స్థాయిలో ఉన్న పక్షిగా ఎందుకు మారలేదు?” అని అడిగాడు.


స్వామివారు ఒకసారి చిరునవ్వి, “తమిళంలో మనం కాకిని ‘కాకా’ అని పిలుస్తాము.. ఇక ఏదైనా ప్రాణిని మనం అవి చేసే శబ్దాలతో పిలుస్తామా.? పిల్లిని ‘మ్యావ్’ అని, చిలుకలు కికి అంటాయి కాబట్టి వాటిని ‘కికి’ అని పిలుస్తామా? లేదు..! కాకిని దాని అరుపుతో పిలుస్తాము. అదే దాని ప్రత్యేకత.


క అంటే కాపాత్తు (కాపాడు), రక్షించు అని అర్థం.. కనుక నువ్వు కాకికి ఆహారం పెట్టి  ‘కా కా’ అని పిలిస్తే., కాపాడు అని పితృదేవతలని అడిగినట్టు!


విరివిగా ఉంటాయి.., ఏది పడితే అది తింటాయి కాబట్టి కాకిని నువ్వు అల్ప పక్షి అంటున్నావు.. కాకి ఎంత గొప్పదో ఇప్పుడు చెబుతాను విను.


అది బ్రహ్మముహూర్తంలో లేస్తుంది. కా కా అని అరచి నిన్ను నిద్రలేపుతుంది.. ఒక్కోసారి కోళ్ళు సరిగ్గా సమయానికి లేవవు. కాని కాకి సరైన సమయానికి లేస్తుంది. అది కాకా అని అరుస్తూ నీ జపానికి సరైన సమయమైన బ్రహ్మముహూర్తంలో నిన్ను నిద్రలేపుతుంది. 


అది పూజకు సరైన నిర్దేశం. అవును కదా?


అంతేకాక, దానికి ఆహరం దొరికితే ఇతర కాకులను పిలుస్తుంది. ఆహారాన్ని పంచుకుని తినండి అని మనకు తెలిపే వేరే ప్రాణుల్లో కనపడని ఒక ప్రత్యేక లక్షణం కలిగినది..


మరలా సాయంత్రం నిద్రకు ఉపక్రమించే ముందు.., మరలా కా కా అని అంటుంది. ఆరోజు జరిగిన అన్ని విషయాలకు భగవంతునికి కృతజ్ఞతగా... అలాగే, కాకులు సూర్యాస్తమయం తరువాత ఏమీ తినవు. ఇది శాస్త్రములు చెప్పిన ఉత్తమమైన విషయం కూడా.


ఇది ఎంతమంది పాటిస్తున్నారు?


కనుక నాకు తెలిసి కాకి అల్ప ప్రాణి కాదు. అది మనకు ఎంతో నేర్పుతుంది.. అందుకే పితృ దేవతలు కాకి రూపంలో వస్తారు.

మరొక్క విషయం . . . కేవలం మహాలయం లోనే కాదు.., ప్రతిరోజూ కాకికి ఆహారం పెట్టు.


కాకి మనకు అద్వైతాన్ని కూడా నేర్పుతుంది.


నువ్వు పెట్టిన ఆహారాన్ని చూడగానే కాకి ఎంతో సంతోషపడి ఆ ఆహారాన్ని స్వీకరిస్తుంది.. అది తినడం చూడడం వల్ల నువ్వు కూడా ఆనందాన్ని పొందుతావు. కనుక ఇరువురు ఆనందంగా ఉంటారు. ఇద్దరూ భగవత్ స్వరూపులే!” అని తెలిపారు.


ఇది వినగానే ఆ భక్తుడు, అక్కడున్న వారందరూ స్వామివారికి నమస్కారం చేసి, అందరూ ఒక్కసారిగా “జయ జయ శంకర, హర హర శంకర” అని పెద్దగా పలికారు.

పరమాచార్య స్వామివారి అద్భుతమైన అందమైన విశ్లేషణను మనమందరం పాటించి మన పూర్వీకుల ఆశీస్సులను పొందుదాము.


అపార కరుణాసింధుం 

జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం 

ప్రణమామి ముదావహం...🚩🌞🙏🌹🙏


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


ఈశ్వరార్పణం చేసి,

 భగవంతుని కి నివేదింపక,పర ప్రొణికి పెట్టక పంచభక్ష్య పరమాన్నములను ఆరగించిననూ విషము తినినట్లేయగుననియు,ఈశ్వరార్పణం చేసి,భూతకోట్ల కింత త్యాగం చేసి,గంజి త్రాగిననూ,అది అమ్రుతమేయగు ననియూ భగవద్గీత లో వెల్లడిఃపబడినది.

మరియూ మానవుడు తన నిత్య జీవితంలో ఏదైనా కోయునప్పుడు,నూరునప్పుడు,విసరుచున్నప్పుడు,వండునప్పుడు,ఊడ్చునప్పుడు, తెలియకుండా కొంత ప్రాణిహింస జరుగుతుంది.

దానినే పంచ సూనములందురు.

ఆ పాపమును పరిహరించుటకు

పంచమహాయజ్ణములు ఏర్పడు చున్నవి.అవి ఏవన 1.దేవయజ్ణం

(హోమం)2.పిత్రు యజ్ఞం (తర్పణం)3.న్రుయజ్ణం(అతిధి పూజ)4.బ్రహ్మయజ్ణం(వేదాధ్యయనం)5.భూతయజ్ణం(ప్రొణులకు

అన్నివైపులా). కావున ఇవి అన్నియూ భగవదారాధన రూపములై,పరోపకార సంబంధములైనట్టి ఇతరములునునగు యజ్ఞం లు నాచరోంచుచు, యజ్ఞశేషమును

మాత్రము భుజించుచు నుండు వారు పొపరహితులై, క్రమముగా పరమశ్రేయము నొందగలరని భగవానుడు తెల్పుచంన్నాడు.

కోరికలే గుర్రాలయితే?

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*🌷"కోరికలే గుర్రాలయితే?"🌷*        

        అనే డోపమైన్ హై కథ!                   


 *"ఏం ఐఏఎస్ అండీ బాబు?* 

ఆ గ్లామర్ ఎప్పుడో పోయింది . ఒకప్పుడు కలెక్టర్ బంగాళా  రాజ ప్రాసాదంలా ఉండేది.  ఇప్పుడు కొత్త జిలాల్ల్లో కనీసం సరైన అద్దె కొంప దొరకడం లేదు.  పిల్లల చదువుకు మంచి స్కూల్ ఉండదు. వీధి స్థాయి ఛోటా నాయకుడు సైతం కలెక్టర్ ను నిలదీసేవాడే! రాత్రి - పగలు గొడ్డు చాకిరీ.   పగవాడికి కూడా ఈ శాపం వద్దు" అంటాడో ఐఏఎస్ అధికారి.


" అధికారం లో ఉన్న పార్టీ లకు ఊడిగం చేయడంతోటే సరిపోతోంది.  మిగతా ప్రభుత్వ విభాగాలు చేయలేని పనులన్నీ మాకు అప్పచెబుతారు.  ఒకప్పుడు ఎస్సై  బులెట్ వేసుకొని తిరుగుతుంటే ఆ ఊళ్ళో రౌడీ లకు తడిచిపోయేది.  ఇప్పుడు ఎస్పీ అంటే కూడా వీధి రౌడీ  లెక్క చెయ్యని స్థితి"  వాపోతాడో సీనియర్ ఐపీఎస్. 


రెవిన్యూ ఉద్యోగులు, డాక్టర్ లు, ప్రభుత్వ-  ప్రైవేట్ టీచర్ లు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, ఎవరిని కదిపినా అసంతృప్తి."  ఒకప్పుడు ఇలా ఉండేది కాదు.  ఇప్పుడు ఉద్యోగం చేయడం కష్టమై పోతోంది.  బతక లేక ఈ ఉద్యోగంలో వేగాల్సి వస్తోంది అంటారు.


   రోగి ప్రాణాన్ని కాపాడడానికి తమ వంతు ప్రయత్నం  చేసినా తమ పై దాడి చేసారంటూ డాక్టర్ ల సమ్మె . పిల్లల్ని కొట్టడం కాదు, తమపైనే బెదిరింపులు వస్తున్నాయంటూ టీచర్ లు.  అందరికీ న్యాయం చెప్పాల్సిన న్యాయమూర్తులు తమకు న్యాయం జరగడం లేదు అంటూ వ్యవస్థపట్ల అసంతృప్తితో.


అందరినీ నడిపించేది రాజకీయనాయకుడు.  "నేను ఎంపీ గా ఎంపికయిన కొత్తలో ఏదో లక్షల్లో ఖర్చు.  ఇప్పుడు వంద కోట్లు చాలడం లేదు.  కౌన్సిలర్ పోస్ట్ కు,   సర్పంచ్ పోస్ట్ కు కోట్లు ఖర్చుపెట్టాల్సిన స్థితి.  ఎక్కడినించి తేవాలి?  తిరిగి ఆ ఆ సొమ్మును ఎలా రాబట్టాలి " వాపోతాడో సీనియర్ రాజకీయనాయకుడు.


"ప్రైవేట్ ఉద్యోగం అయితే గొడ్డు చాకిరీ .. బానిసత్వం .. ప్రభుత్వ ఉద్యోగం అయితే హాయి" అంటాడో ప్రైవేట్ ఉద్యోగి . 


   "ప్రభుత్వ ఉద్యోగమా?  కంటికి నిద్ర లేదు.  ఒకప్పుడు నలుగురు చేసే పని నేనొక్కడే చెయ్యాల్సి వస్తోంది.  మంచి పోస్టింగ్ రావాలంటే లక్షల్లో ఖర్చు.  ట్రాన్స్ఫర్ అంటే ఖర్చు.  ముందుగా పెట్టుబడి. ఆ తరువాత లంచాలతో సంపాదన.  దిగితే లోతు తెలుస్తుంది.  ఈ ప్రుభుత్వ ఉద్యోగాల గ్లామర్ పాతకాలం మాట.  అందుకే నా పిల్లలని మంచి కంపెనీ ల్లో పని చేయమని చెప్పా. సొంత బిజినెస్ అయితే తానే రాజు .. తానే మంత్రి .. రిటైర్మెంట్ ఉండదు" అంటాడో ప్రభుత్వోద్యోగి. 


"కళ్ళకెదురుగా నాతోటి పరిశ్రమాధిపతులు నాశనం!   వందలకొద్దీ పరిశ్రమలు మూతపడ్డాయి.  మల్టీనేషనల్ కంపెనీ లనుంచి తట్టుకోలేని  పోటీ. వారివి మోసపూర్తిత పద్ధతులు. ప్రభుత్వ విధానాలు కూడా వారికే అనుకూలం.  అధికారులకు, రాజకీయనాయకులకు లంచాలు ఇవ్వలేము.  ఇదో నరకం .. నా పిల్లల్ని అమెరికా కు పంపిస్తున్నా. ఎక్కడయితే హాయిగా బతికేస్తారు " అంటాడు మూడు తరాలుగా పరిశ్రమ నడిపి దివాళా అంచుల్లో ఉన్న కోయింబత్తూర్ పారిశ్రామిక వేత్త. 


ఇండియా లో బతికలేము అంటూ అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలకు వలస పోయే వారు ఎంతో మంది.  అమెరికాలో ఎన్నో తరాలుగా స్థిరపడిన వారు అమెరికాలో హ్యాపీ  లైఫ్ గడపలేము అంటూ డబ్బెట్టి గోల్డెన్ వీసా కనుక్కొని వెళ్ళిపోతున్నారు  గ్రీస్ కు లేదా స్కాండినేవియన్ దేశానికి.  


అసలు భూమి నివాసయోగ్యం కాదు, త్వరగా మార్స్ పైకి వెళ్ళిపోతే   బాగుండు అని మరి కొందరు.


అసంతృప్తి .. కలెక్టర్ మొదలు బిల్లబంట్రోతు వరకు .. స్టార్ట్ అప్  మొదలు ఫామిలీ బిజినెస్ మాన్  వరకు .. రాజకీయనాయకుడు మొదలు కార్యకర్త వరకు .. అందరిలో అసంతృప్తి. 


ఎందుకు?


👇👇👇👇👇👇👇👇👇


1950  లో ప్రపంచ జనాభా 250  కోట్లు . ఇప్పుడు 800  కోట్లు .


 డెబ్భై  సంవత్సరాల్లో మూడు రెట్లకు కు పైగా పెరిగిన జనాభా ! ఇల్లు కట్టు కోవడానికి పంటలు పండించడానికి భూమి అవసరం .

  కానీ  అప్పుడూ ఇప్పుడూ అదే భూమి .  


 *అంటే?* 

 


పరిమతమైన వనరులు .. అపరిమితంగా పెరిగిపోతున్న డిమాండ్ ..


తిండి కోసం , నివాసం కోసం .. బతకడం కోసం పోటీ .విపరీతమైన పోటీ . 

  పోటీ తెచ్చే  ఒత్తిడి . 


ఇదీ నేడు సర్వత్రా కనిపించే స్థితి .


కానీ శాస్త్రసాంకేతిక రంగాల్లో అభివృద్ధి పుణ్యమా అంటూ జనాభా ఇంతగా  పెరిగినా,  అందరి అవసరాలూ తీర్చగలిగిన స్థితి లో నేడు మానవాళి ఉంది. ఎనభై ఏళ్ళ క్రితం బెంగాల్ లో కరువు వల్ల ముప్పై లక్షల మంది చనిపోయారు అంటే నమ్మగలరా ?  నేటి ప్రపంచం లో ఆకలి చావులు , కరువులు కాటకాలు ఎక్కడో కొన్ని ఆఫ్రికా దేశాలకు పరిమితం .


ఆవసరాలు తీరుతాయి .


  మరి కోరికలు ? 


👎👎👎👎👎👎👎


స్కూటర్ కొన్నాయనకు కారు కావాలి . కారు కొన్నాయనకు లగ్జరీ కారు కావాలి . దాన్ని కొన్నాయనకు ప్రైవేట్ జెట్ కావాలి . 


ఫ్లాట్ కొన్నాయనకు ఇండిపెండెంట్ హౌస్ కావాలి . అది కొన్నాయనకు విల్లా కావాలి . గేటెడ్ కమ్యూనిటీ కావాలి . అది కొన్నాయనకు డిజైనర్ బంగాళా కావాలి . అది ఉన్నాయనకు సొంత దీవి కావాలి .


గ్రామ సర్పంచి గా గెలిచినాయనకు ఎంపీటీసీ అయ్యేదాకా నిద్ర ఉండదు . ఆదియితే జడ్పీటీసీ కావాలి .. ఎమ్మెలే కావాలి .. మంత్రి కావాలి .. మంత్రి అయితే సీఎం కావాలి . సీఎం అయితే పీఎం కావాలి . రాష్ట్రపతి పదవి రాలేదని అసంతృప్తి తో గుండెఆగి చనిపోయాడో పెద్దాయన . ప్రధాని కావాలని కలలు కని కని తీవ్ర ప్రయత్నాలు చేసి  విసిగి తీవ్ర నిరాశ తో వృద్ధాప్యం లో పడి కొట్టుమిట్టాడుతున్న వృద్ధ జంబూకాలెన్నో !  


ఆవసరాలు పరిమితం . గుర్రాలయిన కోరికలు ! 


కోరికలే మనిషి బాధలకు మూలం అన్నాడు గౌతమ బుద్ధుడు . 


2500 ఏళ్ళ  క్రితమే మనిషి కోరికలకు పగ్గాలు ఉండేవి కావు . ఇప్పుడు గ్లోబల్ సమాజం . కోరికలు ఇప్పుడు గుర్రాలు కావు  .. రాకెట్ లు .. సూపర్ సోనిక్ జెట్ లు!

 నలభై ఏళ్ళ ప్రపంచీకరణ ! అప్పటిదాకా ఏదైనా సామజిక విలువలు మిగిలుంటే దాన్ని తుడిచి పెట్టేసింది ! 


తనకు రాముడు లాంటి భర్త కావాలనుకొనేది ఒక నాటి స్త్రీ ! అంటే మరో స్త్రీని తలపులోకి కూడా రానివ్వ కూడదు . తనకు సీత లాంటి భార్య కావాలి అనుకునేవాడు ఒకప్పటి యువకుడు . అంటే కష్టాల్లో నష్టాల్లో తనవెంట నిలవాలి . న్యాయం కదా ?


ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ప్రపంచం . తనకు రష్మిక మందన లాంటి భార్య కావాలి !  సరిపోతుందా ? లేదు వీలైతే మృణాల్ ఠాకూర్ రెండో  భార్య గా ! పోనీ అక్కడితో ఓకే ?   సన్నీ లియోన్ లాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలి ! పూనమ్ పాండే  షెర్లీన్ .. ఇంకా ఇంకా కావాలి ! 


వ్యయసాయం చేసే భర్త వద్దు . సిటీ లో ఉద్యోగం చేసేవాడు కావాలి . అక్కడితో హ్యాపీ నా ? పక్కింటాయనకు కారుంది . మనకు లేదు . ఆఫీస్ లో పని చేసే కొలీగ్ కు సిక్స్ ప్యాక్ వుంది . నీకు లేదు .


  "  లైఫ్  ఈజ్  షార్ట్ .  చేతకానోళ్లే నీతులంటూ ఉపన్యాసాలిస్తారు . ఎంజాయ్ . దానికోసం ఏమైనా చేయొచ్చు . ఆన్లైన్ గేమ్ లో డబ్బు కోసం అమ్మనైనా చంపొచ్చు . పక్కింటి కుర్రాడితో సుఖం కోసం భర్తకు అన్నంలో విషం పెట్టొచ్చు . ఎంజోయ్మెంట్ ముఖ్యం . " ఇదీ గ్లోబల్  యుగం లో మిలీనియం యూత్ ఫిలాసఫీ . 


 స్మగ్లర్ లు  గూండా లు రౌడీ షీటర్లు నేటి యువత కు ఆదర్శ పురుషులు .


తెలంగాణకు చెందిన ఒక నాయకుడు తన నియోజకవర్గం లో యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేసాడు . అబ్బే ప్రైవేట్ ఉద్యోగాలు ఎవరికీ కావాలి అని ఎక్కువ శాతం నోరు చప్పరించేసారుట ! తమ కళ్ళకెదుట రాజకీయాల్లో చేరి కోట్లు కూడబెట్టిన వారు వీరికి ఆదర్శం . సంవత్సరం లో వంద కోట్లు కూడబెట్టాలనుకున్నోళ్లకి నెలకు ఇంత జీతం చొప్పున చేసే ఓపిక ఉంటుందా ?

జీవితం చిన్నది . నిజమే ! ఆనందంగా బతకాలి . కరెక్ట్ .. కానీ ...  

✔️✔️✔️✔️✔️✔️✔️

ఆనందం అంటే ?  

వస్తువుల్లో ఆనందాన్ని  వెతుక్కోంటోంది  నేటి సమాజం .


వేలకోట్ల సంపద వున్నా తీవ్ర అనారోగ్యం తో చనిపోయిన రాకేష్ జున్ఝున్వాలా , గోవా బీచ్ లు .. బికిని మోడల్స్ .. క్యాలండర్ గర్ల్స్  విజయ్ మాల్యా .. నేడు  లండన్ లో బోడి మల్లయ్య గా మారిన తీరు  .. సమకాలీన ప్రపంచం ఎన్ని ఉదారణలను విసిరేసినా నేర్చుకోలేని స్థితికి చేరుకొంది మానవాళి . 


ఆనందం అనేది కిలోల్లో టన్నుల్లో దొరికే వస్తువు కాదు . డబెట్టి దాన్ని కొనలేవు . డబ్బు అవసరమే ! ధర్మార్థకామమోక్ష అన్నారు . అర్థం అంటే డబ్బు కావాలి . కామ అంటే సెక్స్ { సెక్స్ ఒక్కటే కాదు } .. అదీ  కావాలి . కానీ ధర్మ ముఖ్యం అని  చెప్పే గురువులు లేకపోయారు . చెప్పినా...  వారి రీచ్ తక్కువ .ప్రవచనాలు ముసలాళ్లకే ! నేటి తరానికి చెప్పేవారెవరు ? 


ధర్మం అంటే ? 


ధర్మం అంటే జడ పదార్థం కాదు . కాల ధర్మం .. దేశ ధర్మం .  ఆపద్ధర్మం . దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా మారుతుంది . 


ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో చెప్పేదే ధర్మం . భూప్రపంచం లో నువ్వొక్కడే ఉంటే నీ ఇష్టం . నువ్వు ఆడిందే అట.. పాడిందే పాట ! కానీ ఒక్కడే బతకలేవే ! కన్న వెంటనే తల్లి వదిలిస్తే గంటలో శవం అయిపోయేవాడివి . పొద్దునే నువ్వు వాడే బ్రష్ మొదలు రాత్రి పడుకొనే బెడ్ దాకా నలుగురి శ్రమ  తో వచ్చిందే . నీకు నచ్చినా నచ్చక పోయినా నువ్వు సంఘ జీవి . పట్టుకముందు నుంచి కట్టే కాలే దాక ! 


సమాజమంటే మనుషులు . నీ లాంటి వారు . పెద్దవారు .. చిన్న వారు .

  నువ్వేమి చెయ్యాలి .. ఏమి చేయకూడదు చెప్పేదే ధర్మం ! అదొక సామజిక  నియంత్రణా సూత్రం . 


నువెక్కిన బోట్ లో ఎవడో చిల్లు పెడితే?  నీ మునక గ్యారంటీ . నా బోట్ నా ఇష్టం అంటూ నువ్వు దాన్ని తగలేస్తే అందరూ పోవడం  గ్యారంటీ ! 


సమాజం అలాంటిదే ! ప్రేమ ,  పెళ్లి , పెటాకులు , పిల్లలు , చదువులు,  ఉద్యోగాలు అన్నిటికీ రూల్స్ వున్నాయి . ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో చెప్పే సూత్రాలు వున్నాయి .  నేటి నీ సుఖం .

 అన్నింటినీ కాలదన్ని నా సుఖమే నే కోరుకొన్నా అంటే ? 


పోనీ సుఖాన్నయినా అనుభవిస్తున్నావా ? 


 *ఒకప్పుడు శుక్రవారం అరగంట చిత్ర లహరి చూసి ఫుల్ హ్యాపీ అయిన మహిళా నేటి బామ్మ. ఎంటో!  యు ట్యూబ్ లో అన్ని* గంటలు పాటలు చూసినా సంతృప్తి రాలేదంటుంది . ఆది వారం సంక్షిప్త శబ్ద చిత్రం విని ఆనంద  బాష్పాలు రాల్చిన మొన్నటి బాలుడు  నేడు వృద్ధాప్యం లో స్మార్ట్ టీవీ లో ఎన్ని సినిమా లు చూసినా సాటిస్ఫాయ్ కావడం లేదు . సిల్క్ స్మిత మోకాటి పై దుస్తులకే గంగవెర్రులెత్తిన నాటి తరం .. పూర్తి నగ్న చిత్రాలను చూసిన కిక్ రాని నేటి తరం .


ఏంటిది ?


   కాలం మారిందా ?


    అది మారుతూనే  ఉంటుంది . మీరు ఈ మెసేజ్ చదవడం మొదలెట్టి నిముషాలు గడిచిపోయాయి . సమస్య కాలం కాదు . జెనెరేషన్ గ్యాప్ కాదు . 


సమస్య  డోపామైన్ హై .


   దీన్ని  అందరికీ అర్తం అయ్యేలా చెప్పాలంటే ఇప్పటికే కొండవీటి చేంతాడంటయినా ఈ మెసేజ్ మరీ లాంగ్ అయిపోతుంది . తోలి సారి ఒక బీర్ కే కిక్ . ఆరు నెలలు గడిస్తే రెండు పెగ్గులు . ఆరేళ్లు గడిస్తే ఫుల్ బాటిల్ కొట్టినా కిక్ రాదు . అదే డోపామైన్ హై . 


నేడు జరుగుతోంది ఇదే ! 


గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ .. విల్లా .. విమానం .. అమెరికా .. అంటార్కిటికా టూర్.. ఏదైనా సరి పోవడం లేదు . ఇంకా ఇంకా కావాలి . 


ఇంకేం ఇంకేం కావాలి .. చాల్లే ఇది చాల్లే .. 


ఆనందం ఒక గుణాత్మక అంశం . అదో అమూర్త భావన . దీన్ని  అందరికీ  అర్థం అయ్యేలా చెప్పి సమాజం లో మార్పు తెచ్చే గురువులు కావాలి . నేడు ఉపాధ్యాయ దినోత్సవం . తల్లే  మొదటి గురువు . అటు పై బడి . తల్లి ఒడి లో అటు పై బడిలో మనిషి నేర్చేదే ధర్మం . అంటే మంచి చెడు.


ధర్మో రక్షతి రక్షితః ! చాల సింపుల్ సామజిక సూత్రం . "అరే వెర్రి నాగన్నా! బోట్ లో ఉన్నావు. ఎలా కూర్చోవాలి? ఎలా లేవాలి ?ఎప్పుడు లేవాలి? ఇలా అన్నిటికీ పద్దతులున్నాయి ..అని చెప్పేదే ధర్మం .


నీ సుఖం కోసం ధర్మాన్ని తుంగలోకి తొక్కితే దాని ఫలం  నిన్ను వెంటాడుతుంది 


సిస్టం సెల్ఫ్ కరెక్షన్ చేసుకొంటుంది .


 అందరూ తమకు తోచిన రీతిలో వ్యవహరిస్తే ?


 రేప్ లు .. హత్యలు .. మర్డర్ లు అంతర్యుద్ధాలు .. ఇలా సమాజం సర్వనాశనం అయిపోతుంది . వినాశంనుండి సమాజం అంటే భావి తరాలు పాఠాన్ని  గ్రహిస్తారు . ధర్మ సంస్థాపనార్థం సంభవామి యుగే యుగే అంటే ఇదే .. అన్ని మతాల్లో దేవుడొస్తాడు .. బాగుచేస్తాడు అని నమ్మకం వెనుకనున్న సామజిక శాస్త్రం ఇదే . సమాజము - సెల్ఫ్  కర్రెక్క్షన్ . అప్పటికీ మీరు నేను  ఉండము. 


నేడు మీరు తేల్చుకోవాలింది ఒక్కటే .. ఏది దారి ? ధర్మాన్ని రక్షించి మన ఓడను ఒడ్డుకు చేర్చడమా ? లేక ప్రళయాన్ని సృష్టించి తిరిగి ఎప్పుడో ధర్మం మొలిచేలా కాల చక్రానికి  ఒదిలెయ్యడమా ?


గురువుల దారా ? 


స్మశాన దారా ?


  తేల్చుకోవాల్సిన సమయం ఇదే !


తల్లి తో మొదలెట్టి మంచిచెడు చెప్పి ధర్మాన్ని రక్షించిన గురువులందరికీ వందనములు.

సేకరణ:  వాట్సాప్ పోస్ట్.

కోడిగుడ్డంత గోధుమ గింజ

 కోడిగుడ్డంత గోధుమ గింజ 

—-------------------------------------

-లియోటాల్స్టాయ్.


   ఒక రోజు ఒక లోయలో పిల్లలు ఆడుకుంటూండగా కోడిగుడ్డు ఆకారంలో అంతే ప్రమాణంలో ఉన్న ఒక గోధుమ గింజ వారికి దొరికింది.ఆ దారి వెంటే వెళ్తున్న ఒక ప్రయాణీకుడు ఒక కానీ ఇచ్చి దాన్ని కొనేసి, పట్నంలో ఉన్న రాజుకు అదొక అపూర్వ పురాతన వస్తువని అమ్మేసాడు. 


   రాజు తన రాజ్యంలో విజ్ఞులందరినీ పిలిపించి ఆ వస్తువు ఏమిటని అడిగాడు. వారెవరికీ ఎంత చూసినా ఆ వస్తువేమిటో అర్ధం కాలేదు. ఒకరోజు ఒక కోడి ఎక్కడనుంచో  కిటికీలోంచి ఎగిరొచ్చి ముక్కుతో పొడిచి   ఆ గోధుమ గింజకు కన్నం చేసింది. అప్పుడు అందరు విజ్ఞులూ  దాన్ని తరచి  చూసి "రాజా! ఇది కోడిగుడ్డంత ఆకారంలో ఉన్న గోధుమ గింజ" అన్నారు.


    అది వినగానే రాజు ఆశ్చర్యపోయి ఆ విజ్ఞులందరితో అలాంటి గోధుమ గింజ ఈ రాజ్యంలో ఎక్కడ పండుతోందో తెలియజేయమని ఆదేశించాడు. గ్రంథాలన్నీ తిరగేసి తల బద్దలు కొట్టుకున్నా వారికి ఏమీ దొరక్కపోవడంతో  వారందరూ రాజు దగ్గరకు వచ్చి " ప్రభూ! ఎన్ని గ్రంథాలు తిరగేసినా మాకు ఆ ప్రదేశం సంగతి తెలియలేదు. మనం రైతులనే అడగాలి. బహుశా వారిలో ఎవరికైనా వారి తండ్రుల ద్వారా ఇలాంటి గోధుమ గింజలు పండే ప్రాంతం గురించి తెలిసి ఉండవచ్చు" అన్నారు. వెంటనే రాజు తన రాజ్యంలో బతికున్న అత్యంత ముసలి రైతుని వెదకి తన ముందు హాజరు పరచమని ఆదేశించాడు.  వయసుడిగి నడుం వంగిపోయి, పళ్ళన్నీ రాలిపోయి, రెండు కర్రల ఊతతో కష్టం మీద నడవగలిగే ఓ ముసలి రైతును సైనికులు రాజు ముందు హాజరు పరిచారు.

రాజు ఆ గోధుమ గింజను ఆ రైతుకు చూపించినా, తన చూపు బాగా మందగించటంతో అదేమిటో తెలియక చేతుల్లోకి తీసుకుని తడిమాడు. ఆ తరువాత రాజు ఆ రైతుతో " ఓ వృద్ధ కర్షకా! ఇలాంటి గోధుమ గింజలు ఎక్కడ పండుతాయో తెలుసా? నీవెప్పుడైనా ఇలాంటి గోధుమ గింజలు చూడ్డమో లేక పండించడమో చేసావా?" అని అడిగాడు కానీ చెవుడుతో బాధపడుతూండడం మూలాన్న అతి కష్టంతో రాజు అడిగిన ప్రశ్నను అర్ధం చేసుకుని "ప్రభో! ఇలాంటి గోధుమ  గింజలు నేనెప్పుడూ  నాటనూ లేదు, పండించనూ లేదు. అసలు చూడనూ లేదు. బహుశా మా తండ్రి గారికి ఏమైనా తెలిసే అవకాశం ఉంది" అన్నాడు. వెంటనే రాజు ఆ ముసలి రైతు తండ్రిని హాజరు పరచమని ఆదేశించాడు. ఒక చేతికర్ర సహాయంతో నడుస్తూ ఆ రైతు తండ్రి రాజు సభలోకి వచ్చాడు. రాజు అతనికి ఆ గోధుమ గింజను చూపిస్తూ "ఓ వృద్ధ కర్షకా! నీవైనా ఇలాంటి గింజలు మన రాజ్యంలో ఎక్కడ పెరుగుతున్నాయో చెప్ప గలవా? నీవు ఇటువంటి గింజలు ఎప్పుడైనా తెచ్చావా? నీ పొలాలలో ఎప్పుడైనా నాటావా? " అని అడిగాడు.

 

    ఆ వృద్ధుడికీ కొంచం చెవుడు ఉన్నా కొడుకు కన్నా వినికిడిలోనూ, చూపులోనూ కాస్త నయమే. 


     "లేదు. ఇలాంటి గింజలు నా పొలంలో ఎప్పుడూ నాటలేదు, పండించనూలేదు. నేనెప్పుడూ తేలేదు అయినా ఆ రోజుల్లో ఇంకా డబ్బులు చెలామణీలోకి ఇంకా రాలేదు. ప్రతీ మనిషీ తన పంట తానే పండించుకొనేవాడు. ఏదైనా అవసరం ఉంటే ఒకరికొకరు సహాయం చేసుకునే వాళ్ళం. ఇలాంటి గింజలు ఎక్కడ పండేవో నాకు తెలియదు. ఇప్పటికన్నా అప్పుడు పంటలో గింజలు చాలా ఎక్కువే పండేవి. నేనెప్పుడూ ఇలాంటి గింజలు చూడలేదు కానీ మా నాన్న తన కాలంలో గోధుమ గింజలు ఇంతకన్నా చాలా పెద్దవిగా ఉండి ఎంతో పిండినిచ్చేవి అనేవాడు. మీరు అతన్ని అడిగితే ఏమైనా తెలుస్తుంది" అన్నాడు. 


    రాజు ఆ వృద్ధుని తండ్రిని పిలిపించాడు. ఆ వృద్ధుడు  ఏ కర్ర సహాయమూ లేకుండా చక్కగా నడుచుకుంటూ వచ్చాడు. అతడి చూపూ మందగించలేదు. వినికిడి శక్తి బాగా ఉండడమే కాక మాట్లాడే తీరూ ప్రత్యేకంగా ఉంది. రాజు అతనికి ఆ గోధుమ గింజను చూపించాడు. ఆ వృద్ధుడు దాన్ని చేతిలోకి తీసుకుని తిప్పి చూసాడు. 


   "ఇంత మంచి గింజని చాలా కాలం తరువాత చూసాను" అంటూ చిన్న ముక్క తృంచి నోట్లో వేసుకుని రుచి చూసాడు. " ఇది అదే రకమైన గింజే" అన్నాడు.


    "చెప్పు తాతా!" అంటూ రాజు "ఎప్పుడు ఎక్కడ అలాంటి గింజలు పండించబడ్డాయి. మీరు ఎప్పుడైనా అలాంటి గింజలు తీసుకొచ్చారా? మీ పొలాల్లో నాటారా?" అని అడిగాడు. 


     "ఇలాంటి గింజలు మా కాలంలో అన్నిచోట్లా పండేవి. నా యవ్వనపు రోజుల్లో ఇలాంటి గింజలు తినే బతికాను, ఇతరులకూ ఇవే తినిపించాను.  ఇలాంటి గింజలే నాటి పంటలూ పండించే వాళ్ళం" అన్నాడు ఆ వృద్ధుడు.


     రాజు "తాతా! చెప్పు మీరెక్కడైనా కొనేవారా? లేక మీరే పండించేవారా?" అని అడిగాడు.


     వృద్ధుడు చిరునవ్వు చిందించాడు. 


     ఆ వృద్ధుడు "మా రోజులలో రొట్టెను కొనడం అమ్మడం వంటి పాపపు పనిని తలంచనైనా లేదు. మాకు డబ్బు అంటే ఏమిటో తెలియదు. ప్రతీ మనిషికి తనకు సరిపడా తిండి గింజలు వారి దగ్గర ఉండేవి" అన్నాడు.


    "అలా అయితే" అంటూ రాజు "మీ పొలాలు ఎక్కడ ఉన్నాయో చెప్పు, ఎక్కడ ఇలాంటి తిండి గింజలు పండించావో చెప్పు" అన్నాడు.


    ఆ వృద్ధుడు "నా పొలం దేవుడి భూమి. నేనెక్కడ నాగలితో దున్నితే అక్కడే నా భూమి. ఏ మనిషీ ఇది నా సొంత  భూమి అని అనేవాడు కాదు. శ్రమ ఒక్కటే తమ సొంతం అనేవారు ఆనాటి ప్రజలు" అన్నాడు.


     "నా మరో రెండు ప్రశ్నలకు జవాబు చెప్పు" అంటూ రాజు  మరింత వివరిస్తూ " "మొదటి ప్రశ్న: "అప్పుడు అలాంటి గింజలు పండించిన భూమి ఇప్పుడు ఎందుకు పండించటం లేదు? రెండవ ప్రశ్న: ఎందుకు నీ మనవడు రెండు కర్రల ఊతంగా చేసుకుని నడుస్తున్నాడు, నీ కొడుకు ఒకే కర్ర ఊతంగా చేసుకుని నడుస్తున్నాడు, నీవు మాత్రం ఏ ఊతం లేకుండా నడుస్తున్నావు, నీ కళ్ళు కూడా కాంతివంతంగా ఉన్నాయి, నీ పళ్ళూ గట్టిగానే ఉన్నాయి, నీ మాట్లాడే తీరూ స్పష్టంగా, వీనుల విందుగా ఉంది. మనుషుల్లో ఆ గుణాలన్నీ ఇప్పుడెందుకిలా మారిపోతున్నాయి అన్నాడు.


 "అప్పుడలా ఉండి ఇప్పుడు ఆ గుణాలు ఎందుకిలా మారిపోతున్నాయంటే ఆ రోజుల్లో మనుషులు ఎవరి శ్రమ మీద వారు బతికేవారు, మరొకరి శ్రమపై ఆధారపడేవారు కాదు. పాత రోజుల్లో దేవుడు చేసిన చట్టం ప్రకారమే జీవించేవారు. వారికి ఏదైతే తమ స్వంతమో వాటితోనే సంతోషంగా ఉండేవారు, ఇతరులు ఉత్పత్తి చేసిన వాటిని ఆపేక్షించేవారు కాదు" అన్నాడు.


                        ****** 


ఆర్.ఎస్. వెంకటేశ్వరన్. 


(A Grain as Big as a Hen's Egg అన్న టాల్ష్టాయ్ కథకు ఆంగ్లం నుంచి అనువాదం)


వెంకటేశ్వరన్ ఋషి నారద సుబ్రహ్మన్యం వాల్ నుండి సేకరణ

ధర్మాకృతి : పరమ గురువుల అనుగ్రహం - 1

 ధర్మాకృతి : పరమ గురువుల అనుగ్రహం - 1


1905ప్రాంతాలలో పరమగురువులు తిండివనం సమీప గ్రామాలలో పర్యటన చేస్తున్నారు. పెరుముక్కల్ చాతుర్మాస్య సమయంలో శ్రీసుబ్రహ్మణ్య శాస్త్రి గారు సకుటుంబంగా స్వామివారిని దర్శించారు. అప్పుడు స్వామివారు చంద్రమౌళీశ్వర పూజలో ఉన్నారు. పూజ చేస్తున్నంతసేపూ స్వామివారు గిణిని పరీక్షగా చూస్తూనే ఉన్నారు. మొదటి కలయికలోనే మరి వారికేమి స్ఫురించిందో! మరి మన స్వామివారి కేమి తోచిందో వారి మాటలలోనే చెప్పుకుందాం.


“వారిని చూస్తున్నప్పుడు మిగతా మనుష్యులనందరినీ చూసినపుడు కలిగే భావం కలగలేదు. పూర్వకాలపు ఋషీంద్రులనో మునీంద్రులనో ఎవరో ఒక మహానుభావుని దర్శించిన భావన అప్పటివరకూ ఎవరి యెడా ఏర్పడని ఒక పూజ్య భావం ఏర్పడింది. అంతవరకూ నాటకాలలో ఋషులను చూశాను కానీ వారి యెడ ఈ రకమైన పూజ్య భావం కలగలేదు. వారిపైన పూజ్య భావమే కాదు ఒక ప్రియం కలిగింది. ఎంతో ఆత్మీయులను, కావలసిన వారిని చూసిన భావం. ఏదో దర్శనం చేసుకొని పోదాం అని వచ్చిన నాకు వారి వద్దనే ఎల్లకాలం ఉండిపోవాలనే తీవ్ర ఆకాంక్ష ఏర్పడింది”.


పూజ పూర్తి అయిన తరువాత స్వామివారు గిణిని దగ్గరకు పిలిచి అనేక ప్రశ్నలు వేసి వీరి చురుకుదనానికి, సమయస్ఫూర్తికి ఎంతో అబ్బురపడ్డారు. చాలా సమయం బాలునితో గడిపిన తరువాత అందరి సమక్షంలో ఈ బాలుడు ఎంతో గొప్ప వాడవుతాడని చెప్పారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అది ఎంతో పెద్ద ఆశీర్వాదంగా తీసుకొని తమ పిల్లవాడు గొప్ప ప్రభుత్వోద్యోగి అవుతాడనుకొని సంతోష పడ్డారు. జగద్గురువులవుతారనే ఆలోచన వారికి ఏ కోశానా లేదు. అలాంటి ఆలోచన కలగడానికి కూడా అప్పటి పీఠాదిపతులకు వయస్సు ఎక్కువ లేదు. వారిముందు పీఠాదిపతులు 40 ఏళ్ళు పీఠాధిపత్యం నిర్వహించారు. అయితే పూజ చేస్తున్నంత సేపు తీక్షణంగా చూస్తూనే ఉండిపోయిన స్వామివారి మనస్సులో ఏమి భావం కలిగి ఉంటుంది? వారికి గిణి తమ వారసులవుతారనే భావం మనస్సులో మెదిలి ఉండాలి. అలా అనుకోవడానికి తగిన ఆధారాలు తరువాతి సంఘటనలో కన్పిస్తున్నాయి. మరి 12సంవత్సరాల మన గిణి ఏమనుకున్నారో?


“అంత పెద్ద స్వామికి మనమీద ఇంత ప్రియం ఏమిటి? పొంగిపోయాను. వారు సర్వ సాధారణమైన ప్రశ్నలే వేశారు. క్లాసులో మంచి మార్కులు వస్తున్నాయి కదా! మరి నిన్ను క్లాసు మానిటర్ ణి చేశారా? రోజూ సంధ్యావందనం విడువకుండా చేస్తున్నావా? సూక్తాలు, శ్లోకాలూ చెప్పుకొంటున్నావా? సంస్కృతం ఏమైనా నేర్చుకొంటున్నావా? లాంటివి?.


“వారి తీక్షణమైన చూపు నాలో స్పిరిట్యువల్ గా మార్పు తెచ్చిందా అనే విషయం నాకు తెలియదు. దాని గురించి ఆలోచించే మనస్సు, వయస్సు అప్పటికి నాకు లేవు. అస్సలు స్పిరిట్ అంటే ఏమిటో కూడా అప్పుడు నాకు తెలియదు. మానిటర్ వా అన్న ప్రశ్నలో నాయకత్వ లక్షణాలున్నాయా అని పరిశీలించారు అని మీరు చెప్పుకొంటే చెప్పుకోండి. నాకు మాత్రం వారడిగిన ప్రశ్నలు సర్వసాధారణంగానే తోచాయి. పసివాని తొక్కు పలుకులు వినడానికి రకరకాలుగా ప్రశ్నించే పెద్దల ప్రశ్నలుగానే తోచాయి.


బాలుని తరచుగా తమ వద్దకు తీసుకొని రావలసినదిగా చెబుతూ అనుగ్రహ ప్రసాదాలు ఇచ్చి పంపారు స్వామివారు. శాస్త్రిగారు అది ఆజ్ఞగా తీసుకొని తరచూ గిణితో కలసి స్వామివారిని దర్శించడం అలవాటు చేసుకున్నారు. అయితే గిణికి ఏర్పడిన ప్రియం మూలాన తండ్రితోనే కాక విడిగా కూడా దగ్గరలో ఉన్న ప్రదేశాలన్నింటిలోనూ వీలయినప్పుడల్లా వెళ్ళి దర్శనం చేసుకోనారంభించారు. పెరుముక్కల్ విశ్వరూప యాత్ర సందర్భంగా స్వామివారు ఒక దేవాలయం నుండి బయటకు వచ్చేటప్పుడు గుంపులో దూరంగా మన గిణి ఉన్నారు. బయటకు వస్తూనే సూటిగా గిణి కళ్ళల్లోకి చూశారట. ఆ చూపు మన మహాస్వామి వారి స్మృతి పథంలో నిత్యనూతనంగా నిలిచిపోయింది. “ఆ వీక్షణం నా మస్తిష్కంలో ఒకానొక అలజడిని రేపింది. ఆ అలజడిని వివరించేందుకు సరి అయిన పదములు దొరకడం లేదు. తదాదిగ మనస్సులో మళ్ళీ మళ్ళీ స్వామివారిని దర్శించాలని ఒకటే ఆరాటం తహ తహ అంటారు స్వామివారు. దీక్షల్లో మూడు రకాలు గదా! గిణికి స్వామివారు మత్స్య దీక్ష(నయన దీక్ష)ను అనుగ్రహించారేమో అయితే ఈ విషయం మహాస్వామివారినడిగితే మీరంతా పెద్దవాళ్ళు పెద్దపెద్ద విషయాలన్నీ తెలిసిన వారు కాబట్టి ప్రతి విషయాన్ని ఏదో పెద్ద విశేషం చేసి చెప్పగలరు అని చురకలేస్తారు.


(సశేషం)


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కాశీలోని విశేషాలు

 కాశీలోని కొన్ని వింతలు విశేషాలు


1. కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు కంపుకొట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.

2. కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ జాడ దొరకకుండా ఉంటుంది.

3. కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు.

4. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశీి లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్యపోయ్యారు.

5. అస్సలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి?

6. అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు.

7. అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.

8. కాశీి విశ్వేశ్వరునికి శవభస్మలేపనంతో పూజ ప్రారంభిస్తారు.

9. కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది.

10. కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది; పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది.

11. విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.

12. ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశి.

13. ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీిలోనే వున్నది.

కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి......


ఇందులో దేవతలు, ఋషులు, రాజుల తో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి ఎన్నో వున్నాయి. అందులో కొన్ని :


1) దశాశ్వమేధ ఘాట్:

బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. రోజూ సాయకాలం విశేషమైన గంగా హారతి జరుగుతున్నది.


2) ప్రయాగ్ ఘాట్:

ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా,సరస్వతిలు కలుస్తాయి.


3) సోమేశ్వర్ ఘాట్:

చంద్రుని చేత నిర్మితమైనది.


4) మీర్ ఘాట్:

సతీదేవీ కన్ను పడిన స్థలం. విశాలాక్షి దేవి శక్తి పీఠం.

ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది.


5) నేపాలీ ఘాట్:

పశుపతి నాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టినాడు.


6) మణి కర్ణికా ఘాట్:

ఇది కాశీలో మొట్ట మొదటిది. దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది. ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలిగి పోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట.


7) విష్వేవర్ ఘాట్:

ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు. ఇక్కడే అహల్యా బాయి తప్పసు చేసింది. ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుణ్ణి దర్శిస్తారు.


8) పంచ గంగా ఘాట్:

ఇక్కడే భూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి.


9) గాయ్ ఘాట్:

గోపూజ జరుగుతున్నది.


10) తులసి ఘాట్:

తులసి దాస్ సాధన చేసి రామాచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం పొందినది.


11) హనుమాన్ ఘాట్:

ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం వున్నది

ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించారు.


12) అస్సి ఘాట్:

పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గంను వెయ్యడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్బవించింది.


13) హరిశ్చంద్ర ఘాట్:

సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహన కూలీగా పని చేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు. నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది...


14) మానస సరోవర్ ఘాట్:

ఇక్కడ కైలాసపర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తున్నది.

ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తున్నది.


15) నారద ఘాట్:

నారదుడు లింగం స్థాపించాడు.


16)చౌతస్సి ఘాట్:

ఇక్కడే స్కంధపురాణం ప్రకారం ఇక్కడ 64 యోగినిలు తపస్సు చేసినారు.

ఇది దత్తాత్రేయునికి ప్రీతి గల స్థలం... ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలిగి 64 యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయి.


17) రానా మహల్ ఘాట్:

ఇక్కడే పూర్వం బ్రహ్మ దేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి తపస్సు చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు.


18)అహిల్యా బాయి ఘాట్

ఈమె కారణంగానే మనం ఈరోజు కాశీ

విశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాము.

కాశీలోని గంగా నది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి.


పూర్వం కాశీలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది.


కానీ మహమ్మదీయ దండ యాత్రికులు కాశీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి ధ్వంసం చేసిన తరవాతి కాశిని మనం చూస్తున్నాము.

విశ్వనాథ, బిందు మాధవ తో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు.


నేటికీ విశ్వనాథ మందిరంలో నంది, మసీదు వైపు గల కూల్చ బడ్డ మందిరం వైపు చూస్తోంది.


అక్కడే శివుడు త్రిశూలం తో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది.

ఈరోజు మనం దర్శించే విశ్వనాథ మందిర అసలు మందిరానికి పక్కన ఇండోర్ రాణి శ్రీ అహల్యా బాయి హోల్కర్ గారు కట్టించారు.

అస్త్రాలన్నీ మిస్సైల్సే

 Intersting Article. Forwarding as received.


*మహాభారత యుద్ధం లో అస్త్రాలన్నీ మిస్సైల్సే!*


18 రోజులు జరిగిన మహాభారత యుద్ధంలో మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం పాల్గొంది.


అసలు అక్షౌహిణి అంటే ఎంత? ఒక రథము, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, అయిదుగురితో కాల్బలం (పదాతి దళం) కలిసిన సైన్యానికి ‘పత్తి' అని పేరు. అనగా 1:1:3:5 నిష్పత్తిలో ఉంటుంది సేన. దీనికి మూడు రెట్లయిన సైన్యాన్ని ‘సేనాముఖము' అంటారు. మూడు రథాలు, మూడు ఏనుగులు, తొమ్మిది గుర్రాలు, పదిహేను మంది కాల్బలము ఇందులో ఉంటారు. సేనాముఖానికి మూడు రెట్లను ‘గుల్మము' అంటారు. ఇందులో తొమ్మిది రథాలు, తొమ్మిది ఏనుగులు, 27 గుర్రాలు, 45 మంది కాలిబంట్లు వుంటారు. గుల్మానికి మూడు రెట్లు ‘గణము' ఇందులో 27 రథాలు, 27 ఏనుగులు, 81 గుర్రాలు, 135 మంది కాలిబంట్లుంటారు. గణానికి మూడు రెట్లు ‘వాహిని'. ఇందులో 81 రథాలు, 81 ఏనుగులు, 2432 గుర్రాలు, 405 మంది కాలిబంట్లు వుంటారు. వాహినికి మూడు రెట్లు ‘పృతన' అంటే 243 రథాలు, 243 ఏనుగులు, 729 గుర్రాలు, 1215 మంది కాలిబంట్లు. పృతనకు మూడు రెట్లు ‘చమువు' ఇందులో 729 రథాలు, 729 ఏనుగులు, 2187 గుర్రాలు, 3645 మంది కాలిబంట్లుంటారు.చమువుకు మూడు రెట్లు ‘అనీకిని'. ఇందులో 2187 రథాలు, 2187 ఏనుగులు, 6561 గుర్రాలు, 10925 మంది కాలిబంట్లు వుంటారు. అనీకినికి పది రెట్లయితే ‘అక్షౌహిణి' అవుతుంది. అంటే అక్షౌహిణిలో 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 మంది కాల్బలము వుంటారు. 


ఇటువంటి అక్షౌహిణులు 18 కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాయి. అంటే 3,93,660 రథాలు, 3,93,660 ఏనుగులు, 11,80,890 గుర్రాలు, 19,88,330 కాల్బలము అన్నమాట. 


ఇక్కడ మరో విషయాన్ని తెలియజేయాలి. ఒక్కొక్క రథం మీద ఒక యుద్ధవీరునితోపాటు ఒక సారథి కూడా వుంటాడు. కాబట్టి సారథులను కూడా లెక్కలోకి తీసుకోవాలి. అప్పుడు రథబలం 7,87,320 అవుతుంది. అలాగే గజబలంలో కూడా ఒక్కొక్క ఏనుగు మీద యుద్ధవీరునితోపాటు ఒక మావటీవాడు కూడా వుంటాడు. కాబట్టి గజబలం కూడా 7,87,329 అవుతుంది. వీటన్నింటిని కలిపితే కురుక్షేత్ర యుద్ధంలో 47,23,920 మంది పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఈ 18 అక్షౌహిణుల్లో పాండవ బలం మాత్రం 7 అక్షౌహిణులు, కౌరవ బలం 11 అక్షౌహిణులు.


మహాభారత యుద్ధంలో అస్త్రాలు మహాభీకర యుద్ధానికి దారితీశాయి. దాదాపు ఒక కోటిమంది మరణించిన మహాభారత యుద్ధాన్ని చరిత్రకారులు మొదటి ప్రపంచ యుద్ధంగా భావించారు. ధనుస్సుతో బాణాలను ఉపయోగించి జరిగిన ఈ యుద్ధంలో ఇంత గొప్ప సంఖ్యలో యోధులు మరణించడానికి గల కారణాలేమై వుండవచ్చు?

దాదాపు 7 వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ మహాభారత భీకర సమరంలో భయానకమైన రసాయనిక అస్త్రాలు వినియోగించారని చరిత్రకారులు భావిస్తున్నారు. బాణాలను మాత్రమే ఉపయోగించి వుంటే ఇంత పెద్ద సంఖ్యలో సైనికులు మరణించి వుండేవారు కాదని ఎవరైనా ఊహించవచ్చు. అయితే రసాయనిక అస్త్రాలు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం 7 వేల సంవత్సరాల క్రితం కౌరవ పాండవులకు ఎలా లభించి వుండవచ్చు? 


అత్యంత ఆసక్తికరమైన ఈ అంశాలపై ప్రత్యేక కథనమిది...


హరివంశం చరిత్రాత్మక గ్రంథం. చరిత్రాత్మకంగా ఏ సంఘటన ఎప్పుడు జరిగిందో ఇదమిత్థంగా తెలియచెప్పేదే చరిత్ర. చరిత్రాత్మక సంఘటనలకు రుజువులు లభ్యమవుతాయి. కుణాలుడు రాసిన మాగధ (మగధ రాజ్య) చరిత్ర, కల్హణుడు రాసిన రాజతరంగిణి ఆయా రాజుల జనన మరణాల గురించి తేదీలతో సహా విశదంగా వివరించబడ్డాయి. ఇందులో వాదోపవాదాలకు తావులేదు. అలాగే శ్రీ కృష్ణద్వైపాయనుడు రాసిన హరివంశం కూడా. రాజతరంగిణి రచనలో ఆయా రాజుల జనన మరణాల గురించి తేదీలతో సహా విశదంగా వివరించబడింది. ఇందులో వాదోపవాదాలకు తావులేదు. అలాగే శ్రీ కృష్ణద్వైపాయనుడు రాసిన హరివంశం కూడా రాజతరంగిణి లాంటి చరిత్రాత్మక గ్రంథమే. 16,374 శ్లోకాలు వున్న ఈ గ్రంథంలో సూర్యవంశపు రాజుల చరిత్ర, చంద్రవంశపు రాజుల చరిత్ర వున్నాయి.


క్రీ.పూ. 7536 సంవత్సరంలో శ్రీ కృష్ణద్వైపాయనుడు హరివంశం రాసినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. హరప్పా మొహంజదారో నాగరికతలకన్నా దాదాపు మూడువేల సంవత్సరాల క్రితం హరివంశం రాసినట్లు తెలుస్తోంది. వ్యాసపీఠానికి ఆద్యుడు శ్రీ కృష్ణద్వైపాయనుడని అంటారు. హరివంశ చరిత్రలో సరస్వతీ నదిని గురించిన ప్రస్తావన వుంది. ఎటొచ్చీ హరివంశం ఒక చరిత్రాత్మక గ్రంథం. క్రీ.పూ. 22 డిసెంబర్‌ 5561న ఉత్తరాయణంలో భీష్ముడు ప్రాణత్యాగం చేసినట్లు వ్యాసుడు రాశాడు. హరివంశం శ్రీ కృష్ణద్వైపాయనుడు రాయటం ప్రారంభించిన తర్వాత ఆ హరివంశ చరిత్రలో వ్యాసపీఠాధిపతులు చారిత్రాత్మక సంఘటనలను నమోదు చేస్తూ వచ్చారు.


*మహాభారత యుద్ధ కాలం*


దీని ప్రకారం భీష్ముడు 58 రాత్రులు అంపశయ్యపై శయనించి జీవించాడని తెలుస్తుంది. భీష్ముడు సైన్యాధిపతిగా పది రోజులు యుద్ధం చేశాడు. పదో రోజు సాయంత్రం శిఖండితో యుద్ధం చేయాల్సిన పరిస్థితిలో అస్త్రసన్యాసం చేశాడు. అంటే 68 రోజుల పూర్వం మహాభారత యుద్ధం ప్రారంభమైందన్నమాట. 22 డిసెంబర్‌ 5561లో భీష్ముడు ప్రాణత్యాగం చేశాడు గనక మహాభారత యుద్ధం సరిగ్గా క్రీ.పూ. 16.09.5561న ప్రారంభమైంది. 18 రోజులు జరిగిన ఈ అత్యంత భీకరమైన యుద్ధంలో 92 లక్షల మంది మరణించినట్లు హరివంశంలో వుంది. మహాభారత యుద్ధ చరిత్రలో సైతం దాదాపు ఈ సంఖ్యనే (89 వేలు) అని నమోదు చేశారు.


దాదాపు ఒక కోటిమంది మరణించిన మహాభారత యుద్ధాన్ని చాలామంది చరిత్రకారులు మొదటి ప్రపంచ యుద్ధంగా భావిస్తారు. బ్రహ్మశ్రీ కోట వేంకటాచలం గారు వ్రాసిన   మహాభారత యుద్ధకాలం అనే గ్రంథంలో ఈ యుద్ధం అత్యంత భీకరంగా జరిగినట్లు వర్ణించారు. ధనుస్సుతో బాణాలను ఉపయోగించి జరిగిన ఈ యుద్ధంలో ఇంత గొప్ప సంఖ్యలో యోధులు మరణించడానికి గల కారణాలేమై వుండవచ్చు?


దాదాపు 7వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ మహాభారత భీకర సమరంలో భయానకమైన రసాయనిక అస్త్రాలు వినియోగించారని చరిత్రకారులు భావిస్తున్నారు. బాణాలను మాత్రమే ఉపయోగించి వుంటే ఇంత పెద్ద సంఖ్యలో సైనికులు మరణించి వుండేవారు కాదని ఎవరైనా ఊహించవచ్చు. అయితే రసాయనిక అస్త్రాలు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం 7 వేల సంవత్సరాల క్రితం కౌరవ పాండవులకు ఎలా లభించి వుండవచ్చు?


భారతదేశంలో అర్జునుని మనుమడైన పరీక్షిత్తు కాలం వరకూ నారదుడు భూలోకంలో సంచరించినట్లు భాగవతంలో వుంది. ఈ నారదుడు 372 కాంతి సంవత్సరాల దూరంలో "ఎబ్సులా"అనే నక్షత్ర మండలంలోని "బర్హోస్‌" అనే గ్రహానికి చెందినవాడుగా శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. కాంతికన్నా వేగంగా ప్రయాణించే సాంకేతిక పరిజ్ఞానం వుండేదనీ "సిరియా"లోని పురావస్తు శాస్త్రజ్ఞుల పరిశోధనలో తేలింది.

అస్త్ర శస్త్ర తయారీలో వీరు నిపుణులు. వివిధరకాలైన అస్త్రాలు (మిస్సైల్స్‌) వైవిధ్యమైన ధనుస్సులు (లాంచర్స్‌) పరిజ్ఞానం శ్రీకృష్ణుని సహకారంతో పాండవులకు లభించినట్లుగా తెలుస్తోంది. ఖాండవ దహనం సందర్భంలో అగ్నిదేవుడు శ్రీకృష్ణునికి అర్జునునికి ఇచ్చిన సుదర్శనచక్రం, గాండీవం (లాంచర్‌), అక్షయ బాణ తూణీరాలు (మిస్సైల్స్‌) రసాయనికి ఆయుధాలుగానే పరిగణిస్తున్నారు. ఖాండవ దహనం సందర్భంగా అర్జునునికి ఇంద్రునికీ జరిగిన యుద్ధం ఒకరకంగా స్టార్‌వార్‌ గానే భావించవచ్చు. దాదాపు 3 వేల ఎకరాల్లోని ఖాండవ వనం యావత్తూ ఈ రసాయనిక అస్త్రాల వినియోగం వల్ల కాలి బూడిదైపోయింది.


ఈ అస్త్రాలను వినియోగించేందుకు పాస్‌వర్డ్‌లాంటి  అక్షరాలను (మంత్రాలను) ఉచ్ఛరించేవారని కొందరు పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. రసాయనిక అస్త్రాలను ట్రిగ్గర్‌ లాంటి ఒక పరికరాన్ని వొత్తిడికి గురిచేసి భయానక విస్ఫోటం కలిగించేవారని మరికొందరు విశ్లేషిస్తున్నారు.


మహాభారత యుద్ధంలో రిమోట్‌ కంట్రోల్‌తో పాస్‌వర్డ్‌ను గ్రహించి విస్ఫోటనం కలిగించేవారని కూడా కొందరు శాస్త్రజ్ఞులు ఊహిస్తున్నారు.


రిమోట్‌ ద్వారా అస్త్రాల ప్రయోగం:


మహాభారత యుద్ధంలో అస్త్రాలు మహా భీకర యుద్ధానికి దారితీశాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానం శ్రీకృష్ణునికీ భీష్ముడికీ అర్జునునికి కర్ణుడికీ అభిమన్యుడులాంటి 36 మంది మహారథులకు మాత్రమే వుండేదని భావిస్తున్నారు. 


జిపిఎస్‌ పరిజ్ఞానం మహాభారత యుద్ధంలో వారికి వుంది అనడంలో ఆశ్చర్యంలేదు. 


7 వేల సంవత్సరాల క్రితమే రసాయన ఆయుధాలను తయారుచేయగల సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారికి జిపిఎస్‌ అడ్వాన్స్‌డ్‌ జ్ఞానసంపత్తి తెలిసి వుండడంలో ఆశ్చర్యంలేదు. .

ప్రతి అస్త్రాన్ని ఉపయోగించ దలచుకొన్నా ఆ అస్త్రం కోడ్‌ నెంబరూ తనకు కేటాయించిన పాస్‌వర్డ్‌ (మంత్రం) ఉచ్చరించినంత మాత్రముననే టెలీపతీ తరంగాల ద్వారా, గ్రహాంతర సాంకేతిక యుద్ధ నిపుణునికి క్షణాల్లో చేరటంతో రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ఆ అస్త్రం (మిస్సైల్‌) శత్రువులను నాశనం చేయగలిగేదని ఊహిస్తున్నారు.


ఇలాంటి ఊహ నిజం అనుకోవడానికి గల మౌలిక కారణం ఈ మహాభారత యుద్ధంలో లక్షలాదిమంది మూకుమ్మడిగా హతం కావడమే!


అయితే కొన్ని సాధారణ అస్త్రాలు (మిస్సైల్స్‌) వినియోగించే నైపుణ్యం యుద్ధం చేసేవాడికే వుండేది. కొన్ని అస్త్రాలకు "ఐపీ" అడ్రసులు సైతం వుండి వుండవచ్చని జర్మనీకి చెందిన కొల్విన్‌ హెచ్చర్‌ అంటున్నారు. మహాభారత యుద్ధం జరిగిన విధానంపై హెచ్చర్‌ 22 సంవత్సరాల క్రితమే పరిశోధన చేసి పి.హెచ్‌.డి. పట్టా పొందాడు. 


అయితే ఈ అస్త్రాలన్నీ (మిస్సైల్స్‌) ప్రస్తుతం ఉపయోగిస్తున్న శాస్త్ర పరిజ్ఞానానికన్నా భిన్నంగా వుండే అవకాశాలు వున్నాయి.


మహాభారత యుద్ధంలో ఉపయోగించిన శస్త్రాల్లోనుంచి భయానకం గామా కిరణాలు సైతం వెలువడి వుండవచ్చు. ఈ గామా కిరణాలకు శత్రువు శరీరాన్ని తుత్తునియలు చేసే అవకాశం వుంది. ధృతరాష్ట్రునికి సంజయుడు మహాభారత యుద్ధం గురించి ప్రత్యక్షంగా వివరిస్తూ కౌరవుల తరఫున, పాండవుల తరఫున చాలామంది యోధులు తుత్తునియలై పడిపోతున్నారని చెపుతాడు. మహాభారత యుద్ధంలో అస్త్రాలను ఎదుటివాడిపై ప్రయోగించడానికి మాత్రమేకాక స్వీయరక్షణకు సైతం వినియోగించినట్లు వ్యాస మహాభారతంలో వుంది.


ఆధునిక సాంకేతిక యుద్ధ అస్త్రాల్లో "టెస్లాషీల్డ్‌" అనే అస్త్రం (మిస్సైల్‌) వుంది. శత్రువు ప్రయోగించిన వందలాది అస్త్రాలను ఈ "టెస్లాషీల్డ్‌" అనే అస్త్రం నిర్వీర్యం చేస్తుంది. అంటే ఈ అస్త్రం స్వీయ రక్షణకన్నమాట. 


ఇలాంటి అస్త్రాలు సైతం మహాభారతంలో వినియోగించబడ్డాయి. అర్జునుడు మహాభారత యుద్ధం జరిగిన తొలి రెండు రోజులూ శత్రువు ప్రయోగిం చిన అస్త్రాలనన్నింటినీ నిర్వీర్యం చేశాడని వ్యాసుడు రాశాడు. 


నిర్వీర్యం అంటే ఈ అస్త్రం నుంచి వెలువడే అత్యంత శక్తి శత్రువు ఉపయోగించిన అస్త్రాన్ని తాకి వెంటనే ఆవిరి చేస్తుంది.


మహాభారత యుద్ధంలో కోటికి పైగా యోధులు మరణించారంటే ఈ యుద్ధం మహాభీకరమైన అస్త్ర శస్త్రాలతో కొనసాగిందనే చెప్పాలి.

18 రోజుల్లోనే ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించడం సామాన్య యుద్ధంలో జరిగే పనికాదు. 


సామ్రాట్‌ అశోకుడు చేసిన కళింగయుద్ధంలో 16 వేల మందే మరణించారని చరిత్రకారులు రాశారు. మహాభారత యుద్ధంలో చాలా భయానకమైన న్యూక్లియర్‌ ఆయుధాలను వినియోగించి వుండాలని శాస్త్రజ్ఞులు అనుమానిస్తున్నారు.

ప్రతిరోజూ మూకుమ్మడి మరణాలు సంభవించి వుండాలి. మొహంజొదారో నాగరికత ఒకే ఒక్క రోజులో నాశనం అయి వుండవచ్చని చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. నాగసాకిపై ప్రయోగించిన అణుబాంబు విస్ఫోటం లాంటిదే "మొహంజొదారో" నగరంలో జరిగి వుండవచ్చన్నది శాస్త్రజ్ఞుల అనుమానం.


క్రీస్తుకు పూర్వం భూమిపైని మానవుల్లో ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం వున్నట్లు ఇటలీకి చెందిన మిలన్‌ అనే పరిశోధకుడు 1979లో తను రాసిన "అటామిక్‌ డిష్ట్రక్షన్ ఇన్  3000 బి.సి"అనే పుస్తకంలో పేర్కొన్నాడు. కురుక్షేత్రంలోని 50 గజాల విస్తీర్ణంలో ఎపి సెంటర్‌ (భూకంపన కేంద్రం) వున్నట్టు కనుగొన్నారు. ఆ 50 గజాల విస్తీర్ణంలో చాలా లోహాలు కరిగి శిలాజాలై కనపడ్డాయి. వీటిపై పరిశోధనలు జరిపితే ఇవి దాదాపు 3000 బి.సి. కాలం నాటివని తేలింది. రోమ్‌కు చెందిన ప్రొఫెసర్‌ అంటోనియో క్యాస్టెల్లానీ కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత ఒక వ్యాసం రాస్తూ అక్కడ ప్రాణాలు కోల్పోయినవారి శరీరాల్లోని ఎముకల శకలాలను పరిశీలించిన తర్వాత ఆ మరణాలు అణుయుద్ధం వల్ల సంభవించినవిగానే నిర్ధారించారు.


అస్త్రాల వివరాలు:


మహాభారతంలోని మౌసల పర్వంలో మహాభారత యుద్ధంలో వినియోగించిన అస్త్రాల గురించిన వివరాలు వున్నాయి. అతి వేగంతో ప్రయాణించే విమానాల్లో విశ్వాన్ని సైతం నాశనం చేయగల అణుబాంబులు వున్నాయని రాశారు. పది సూర్యులు ప్రసరించగల వేడిని పుట్టించే అస్త్రాలు వున్నాయని వుంది. ఒకేసారి వేయిమందిని భస్మం చేసే అస్త్రాలను వినియోగించారని పేర్కొన్నారు. వెంట్రు కలు, గోళ్ళు లాంటి వాటితోసహా దగ్ధం చేయగల మారణాస్త్రాలు వుండేవి.


మహాభారత యుద్ధం జరిగిన 18 రోజులు వందల కిలోమీటర్ల దూరంలోని పక్షులు సైతం ప్రాణాలు కోల్పోయాయి. యుద్ధ గుడారాల్లోని భోజన పదార్థాలు సైతం సూక్ష్మక్రిములకు నిలయంగా మారాయి. వేలాదిమంది సైనికులు పారిపోయి నదీనదాల్లో మునిగి తేలుతూ ప్రాణాలు కాపాడుకొన్నారు.


మహాభారతంలో బ్రహ్మాస్త్రాన్ని ఎవరూ ప్రయోగించలేదు. బ్రహ్మాస్త్ర ప్రయోగం వల్ల భూమి యావత్తూ నాశనం కావడమేకాక సముద్రాలు సైతం ఎడారులుగా మారతాయి. మహాభారత యుద్ధం ఒక చారిత్రక సత్యం. 


శ్రీకృష్ణుని ఆధ్వర్యంలో జరిగిన ఈ యుద్ధంలో ఆయన తన యుద్ధ నైపుణ్యం కన్నా వ్యూహాత్మకంగా యుద్ధం నడిపించగలిగాడు.


శ్రీకృష్ణుడు దైవాంశ సంభూతుడు. అంతటి భీకర యుద్ధంలో తాను ఎలాంటి అస్త్ర్రాన్ని ప్రయోగించకుండా పాండవులకు విజయం సాధించి పెట్టి కౌరవులను భూమిపై లేకుండా చేయగలిగాడు....

🙏 తొలి తిరుపతి

 🎻🌹🙏 తొలి తిరుపతి- ప్రచారానికి నోచుకోని క్షేత్రం....!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


తిరుపతి అనగానే మనకు గుర్తుకువచ్చేది చిత్తూరు జిల్లాలోని తిరుమల తిరుపతి.


అయితే తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురం లో తిరుపతి వుందని అదే తొలి తిరుపతి అని --- అది సింహాచలం 8000 సంవత్సరాలు , తిరుమల తిరుపతి 6000 సంవత్సరాలు ... మరియు దేశంలోని ఇతర ప్రసిద్ది చెందిన నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల కంటే మిక్కిలి పురాతనమై , పరమ పవిత్రమై న చిరుమందహాస చిద్విలాస శ్రీ శృంగార వల్లభ స్వామి


 శోభాయమానంగా స్వయంభువుగా కొలువుదీరిన దేవాలయానికి 9000 (తొమ్మిది వేల సంవత్సరాల) చరిత్ర వుందని చాలా మందికి తెలియదు.


విష్ణుమూర్తి శిలా రూపంలో మొదట ఇక్కడే వెలసినందుకు ఈ తిరుపతిని తొలి తిరుపతి అని పిలుస్తారు ...


స్వయంభువుగా స్వామి వారు వెలసిన ప్రతి చోటా ఆళ్వారులు వుంటారు అలాగే ఇక్కడ కూడా గర్బాలయం పక్కన ఎడమ వైపు ఆళ్వారుల విగ్రహాలు వున్నాయి.


🌹ఆలయ చరిత్ర : 🌹


ఒకానొకప్పుడు ఇప్పుడు తొలి తిరుపతి ఉన్న గ్రామమంతా కీకారణ్యం ధృవుని సవతి తల్లి అయిన సురుచి ధృవుని కి సింహాసనం దక్కకుండా కుతంత్రాలు నడుపుతున్నసమయంలో


ధృవుని తల్లి అయిన సునీతి నువ్వు సింహాసనం అధిష్టించి రాజ్యపాలన చేయాలంటే శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోమని చెప్పిందట అప్పుడు ధృవుడు తపస్సు చేయడానికి ఈ కీకారణ్యం చేరుకున్నాడట.


అదే సమయంలో అక్కడ శాండిల్య మహాముని ఆశ్రమం ఉందట అప్పుడు ధృవుడు శాండిల్య మహాముని దర్శనం చేసుకుని శ్రీ మహా విష్ణువు యొక్క తపస్సు విదానం అడుగగా


ఆ ముని " నాయనా విష్ణుమూర్తి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని తలుచుకుంటూ తపస్సు చేయి" స్వామి ప్రత్యక్షమై నీ కోరిక నేరవేరుస్తాడు అని చెప్పి తపస్సుకి కావాల్సిన ఏర్పాటు చేసాడట.


ఆ మహాముని చెప్పినట్లే "దివ్య కాంతులతో శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడట" అయితే ఆ కాంతి ని చూడలేక ధృవుడు బయపడ్డాడట. 


అప్పుడు విష్ణుమూర్తి నాయనా భయమెందుకు * నేనూ నీ అంతే వున్నాను కదా * అని నవ్వుతూ ధృవుని తలనిమిరి అతని భయాన్ని పోగొట్టాడట


ఆ తరువాత స్వామి ధృవుని కి దర్శనమిచ్చిన చోటే శిలా రూపంలో వెలిసాడట.


స్వామి * నీ అంతే వున్నాను కదా * అని చెప్పినందుకు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గచ్చు మీద ఉన్న పుష్పం పై నుంచుని చూసిన వాళ్ళు ఎంత ఎత్తులో వుండి చూస్తే అంత ఎత్తులోనే దర్శనమిస్తాడు (చిన్న వాళ్లకు చిన్నవాడిగా పెద్దవాళ్ళకు పెద్ద వాడిగా)


ఆ అరణ్య ప్రాంతం లో వెలిసిన స్వామి ఎండకు ఎండి వానకు తడవడం చూసి దేవతలే స్వయంగా స్వామికి ఆలయాన్ని నిర్మించారు. 


ఆ తరువాత శ్రీ లక్ష్మీ దేవి వారిని - నారద మహర్షి ప్రతిష్టించారట. తరువాత శ్రీ కృష్ణ దేవరాయల వారు భూదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు (దీనికి శిలా శాసనాలే ఆధారం).


ఆలయ విశిష్టత : 


1) చిద్విలాస వేంకటేశ్వరుడు (నవ్వుతున్నట్టుగా వుండే విగ్రహం ) 


2) విగ్రహం చిన్న పిల్లలకు చిన్నగానూ పెద్దవారికి పెద్దగానూ (ఎంత ఎత్తులో ఉండేవారికి అంతే ఎత్తులో కన్పిస్తుంది ) 


3) తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని విగ్రహానికి పూర్తి విభిన్నంగా శంఖ – చక్రాల స్థానం మారి వుంటాయి 


4) ఆలయ ప్రాంగణం లోనే శివాలయం వైష్ణవాలయం రెండూ వున్నాయి. 


5) సంతానం లేని దంపతులు ఆలయం వద్ద నూతిలో స్నానం చేసిన సంతాన ప్రాప్తి లబిస్తుంది. 


6) ఏకశిలా కళా ఖండాలు... విగ్రహమూర్తి .. ఉత్సవ మూర్తి ... ప్రదాన ఆకర్షణ.


కార్యక్రమాలు - పూజా విధానం : 


1) నిత్య ధూప దీప నైవేద్యం.


2) ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకూ దర్శనం.


3) శ్రీరామ నవమి తరువాత వచ్చే మొదటి ఏకాదశి అనగా చైత్ర శుద్ద ఏకాదశి రోజు స్వామి వారి కళ్యాణం అంగ రంగ వైభవంగా .. ప్రారంభిస్తారు, ఆరోజు నుంచీ ఆరు రోజులపాటూ ఉత్సవాలు జరుపుతారు.


4) ధనుర్మాసం లో నెల రోజుల పాటూ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 


చరిత్రలో స్వామి వారిని దర్శించుకొన్న ప్రముఖులు :


బోజమహా రాజు

బట్టీ విక్రమార్క 

రాణీ రుద్రమదేవి 

శ్రీ కృష్ణ దేవరాయలు 

పెద్దాపురం - పిఠాపురం సంస్థాన మహారాజులు 

లక్ష్మీ నరసాపురం రాజులు ( లక్ష్మీ నరసాపురం రాజులు 


ఆలయానికి 600 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు కానీ ఇప్పుడు కేవలం 21 ఎకరాలు మాత్రమే గుడి పేర వున్నట్టు ... ఆలయం ప్రభుత్వ ఆదీనంలోనే ఉన్నప్పటికీ యాత్రికులకి... దర్శనానానికి ... బసకి సరైన సదుపాయాలు లేవు అని స్థానికులు బాధపడుతున్నారు )..సేకరణ..🙏💐


చేరేదెలా :


తొలితిరుపతి  శృంగార వల్లభస్వామి ఆలయం సామర్లకోట కు 10 కిమీ దూరం లో ఉంది. సామర్లకోట నుంచి ప్రత్తిపాడు వెళ్లే దారిలో దివిలి వస్తుంది. ఈ దివిలి కి 1 కిమీ దూరం లోనే ఈ ఆలయం ఉంది.


 పిఠాపురం నుంచి వచ్చేవారు దివిలి చేరుకోవడానికి ఆటో లు ఉంటాయి. సామర్లకోట రైల్వేస్టేషన్ కోడ్ SLO అన్ని ప్రధాన ట్రైన్స్ ఇక్కడ ఆగుతాయి...🚩🌞🙏🌹🎻


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

మంచి నడవడిక వస్తుంది.

 మీరు, రామాయణ, మహా భారతాదులు వేదాలు, అష్టా దశ పురాణాలు చదవక పోయిన ఏమి నష్టం లేదు వాటి వల్ల మనకు జ్ఞానం వస్తే రావచ్చు కానీ ఒక్క శ్రీమత్ భగవత్ గీత చదివితే మీకు మంచి నడవడిక వస్తుంది. ఇప్పుడు సమాజంలో లోపిస్తుంది వినయము విధేయత, గౌరవము, మర్యాద. అదే గీత చదివి ఆకళింపు చేసుకునే వాడి వల్ల ఈ సమాజం ఉద్దరించ బడుతుంది. ఏది సత్యం ఏది అసత్యం అనే జ్ఞానం కలుగుతుంది. కాబట్టి మిత్రులారా మీరంతా తప్పక గీతను ముందుగా  చదవండి, చదివించండి. మారె ఇతర హిందూ గ్రంధాన్ని ఆయన గీత చదివిన తరువాత చదవండి. మన హిందూ వాగ్మయం చాలా ప్రశస్తమైనది ప్రతి గ్రంధం అపార జ్ఞానాన్ని మనకు ఇస్తుంది. మన వాగ్ముయం చదవటం కాదు దానిని గూర్చి తెలుసుకోవటానికి ఒక జీవిత కాలం సరిపోదు. అటువండి ఈ మహా వట వృక్షన్ని గడ్డి పరకకన్నా చిన్న గున్న మతాల వాళ్ళు విమర్శిస్తూ ఉంటే మనం చూస్తూ వున్నాము. యెందుకు మనకు మన ధర్మం మీద అవగాహన లేకపోవటం వల్ల శ్రీమత్ భగవత్ గీత గూర్చి ఏమాత్రం తెలియని మూర్ఖులు శ్రీకృష్ణ భగవానుని నీచంగా విమర్శిస్తూ ఉంటే మనం ఏమి చేయటంలేదు. ఎందుకు మనకు శ్రీమత్ భగవత్ గీత గూర్చి తెలియక పోవటం వల్ల.  ఇలా వ్రాసుకుంటూ పోతే ఏమైనా వ్రాయవచ్చు. ఎంతయినా వ్రాయవచ్చు. మన ధర్మం అపారం, ఇది నిరంతరంగా సాగే ఒక ఝరి. అనంతమైనది.  

ఆదివారం సెలవువద్దు

 💥ఆదివారం సెలవువద్దు💥


ఆదివారం పవిత్ర దినం, ఇకనైనా మేల్కొందాం! ఆదివారం నాడు ఏం చేయకూడదో చెప్పిన శాస్త్రాల లోని ఓక శ్లోకం మీకోసం. 

అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే | 

సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా ||

 

స్త్రీ తైల మధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |

న వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం స గచ్చతి ||


💥తాత్పర్యం: 


మాంసం తినడం..! మద్యం తాగడం..!

స్త్రీతో సాంగత్యం..! క్షవరం చేసుకోవటం..!

తలకు నూనె పెట్టుకోవడం..!


ఇలాంటివి ఆదివారం నాడు  నిషేధించారు, కానీ ఈ పనులన్నీ మనం ఆదివారమే చేస్తున్నాం..! ఈ కర్మలు చేసినవాడు  జన్మ జన్మలకు దరిద్రుడు అవుతాడు అని నొక్కి చెప్పారు మన పెద్దలు దరిద్ర్యం అంటే డబ్బు లేకపోవడం ఒక్కటే కాదు.. 

కుటుంబ సౌఖ్యం లేకపోవటం...

ఆనారోగ్యం కూడా..!!

ఆదివారం సూర్యుడు జన్మించిన రోజు

ఇలాంటి పవిత్రమైనరోజు తాగుబోతులకి, తిండిపోతులకి ఇష్టమైన రోజు అయింది..!!


మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు..!!


ఎందుకంటే.. అనాదిగా మన వాళ్ళందరూ సూర్యోపాసకులు.. సూర్యుణ్ని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి..!! సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్షదైవం..!!


అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారం గానే వస్తాయి..!!


ప్రాతః కాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యా వందనాలు లాంటి సనాతన సాంప్రదాయ కర్మలు సూర్యుణ్ని ఆరాధించే పద్దతిలో ముఖ్యమైనవి..!!


ఇలాంటి ఆదివారం మనకి చాలా పవిత్రమైన రోజు.. 


అలాంటి ఆదివారాన్ని వీకెండ్ పేరుతో ఆదివారం సెలవు అనే పేరుతో అపవిత్రం పాలు చేశారు..!! చేస్తున్నాము..!!


మనది భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతి అందరికీ తెలుసు ...ఎన్ని ఆచారాలు, సంస్కృతులు భిన్నంగా ఉన్న మన అందరిది హిందూ ధర్మమే అనే ఏకత్వాన్ని తెలిపేది మన హైందవ సంస్కృతి...!!


అది చూసి తట్టుకోలేక బ్రిటీషు వాడు (Thomas Babington Macaulay, ఈ నీచుడు గురించి ఎంత చెప్పినా తక్కువే) ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు.. మన హిందువులే మన సంస్కృతిని నాశనం చేసేలా చేశారు..!! ఆదివారం నాడు మన హిందూ దేవాలయాలు వెలవెల బోతాయి.!!


పూర్వకాలంలోవృత్తి పనులు చేసుకునే వారు అమావాస్యను సెలవు దినంగా పాటించేవారు.! ఇప్పటికీ కొన్ని దుకాణాల వారు అమావాస్య నాడు తెరువరు.!


మన హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించే వారు.. ఆరోజు జీవహింస చేసి మాంసాన్ని తినేవారు కాదు.. మధ్యాన్ని తాగేవారు కాదు..!!


కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయ్యింది!!


ఆదివారమొస్తే సెలవు దినం కదా అని మద్యాహ్నం 12 గంటల దాకా పడుకునే వారున్నారు.! ఇప్పటికైనా కళ్ళు తెరవండి.! విదేశీ సంస్కృతిని విడనాడండి.! #స్వదేశీ_సాంప్రదాయాలను పాటించండి..!


యోగ చేయండి.! ప్రాణాయామం చేయండి.! 

#సూర్య_నమస్కారాలు చేయండి.!  #సూర్యోపాసన చేయండి.!! ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందండి..!!


ఈ పోస్టు కొందరు సోదరులకు ఉత్సాహాన్ని మరియు కొందరికి నిరుత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది..!! కానీ దీన్ని పాటించడానికి ప్రయత్నించండి..!!


ఒకేసారి అన్నీ మార్పులు సాధ్యపడకపోవచ్చు కానీ క్రమ క్రమముగా ఒక్కొక్కటి మార్చుకుంటూ పోతే కొన్ని సంవత్సరాలకు అన్నీ మార్పులు చేసుకోవచ్చు. 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

పోరాట యోధులు

 Cost of Mangalyan 447 cr

Cost of Brahmastra movie 450 cr


ఆలోచింపజేసే సందేశం.

అద్భుతంగా రాశారు.

ఎవరిని కించపరచాలి అనే ఉదేశం కాదు.

ప్రతి ఒక్కరూ ఆలోచించాలి అనే...........


ఒక్కో సినిమాకి 50 కోట్లు లేదా 100 కోట్లు వసూలు చేసే ఈ సినిమా నటులు లేదా నటీమణులు ప్రజలకు ఏం చేస్తారో నాకు అర్థం కాలేదు.


అగ్రశ్రేణి సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, అధికారులు తదితరులకు ఏడాదికి 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు మాత్రమే సంపాదన ఉంటే, అదే దేశంలో ఒక సినిమా నటుడు ఏడాదికి 10 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు!


అతను ఏమి చేస్తాడు అసలు?


దేశాభివృద్ధిలో వారి సహకారం ఏమిటి? అంతెందుకు, దేశంలోని అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు సంపాదించడానికి 50 ఏళ్లు పడితే కేవలం ఒక్క సంవత్సరంలోనే అంత సంపాదించడానికి వారు ఏమి చేస్తారు!


నేడు దేశంలోని కొత్త తరాన్ని ఆకట్టుకున్న మూడు రంగాలు సినిమా, క్రికెట్ మరియు రాజకీయాలు.


ఈ మూడు రంగాలకు చెందిన వ్యక్తుల సంపాదన, పలుకుబడి అన్ని హద్దులకు అతీతం.


ఈ మూడు ప్రాంతాలు ఆధునిక యువతకు ఆదర్శాలు, అయితే వారి విశ్వసనీయత ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉంది.


కనుక ఇది దేశానికి, సమాజానికి పనికిరాదు.


బాలీవుడ్‌లో డ్రగ్స్ మరియు వ్యభిచారం, క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్, గూండాయిజం మరియు రాజకీయాల్లో అవినీతి. వీటన్నింటికీ డబ్బు ప్రధాన కారణం మరియు ఈ డబ్బును వారికి అందించేది మనమే.


మన డబ్బును మనమే తగులబెడుతూ మనకు హాని చేసుకుంటున్నాం. ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట.


70-80 ఏళ్ల క్రితం వరకు ప్రముఖ నటీనటులు సాధారణ జీతం పొందేవారు.


30-40 ఏళ్ల క్రితం క్రికెటర్ల సంపాదన కూడా ఎక్కువగా  ఉండేది కాదు.


30-40 ఏళ్ల క్రితం రాజకీయాల్లో ఇంత దోపిడీ ఉండేది కాదు.


మెల్లగా వాళ్ళు మనల్ని దోచుకోవడం మొదలుపెట్టారు మరియు మనం వాళ్ళు దోచుకోవడానికి సహకరిస్తున్నాం.

 

ఈ మాఫియా కబంధ హస్తాల్లో చిక్కుకుని మన పిల్లల భవిష్యత్తును, మన దేశాన్ని నాశనం చేసుకుంటున్నాం.

 

50 ఏళ్ల క్రితం ఇంత అసభ్యంగా, సినిమాలు తీయలేదు. క్రికెటర్లు, రాజకీయ నాయకులు ఇంత అహంకారంతో ఉండేవారు కాదు. ఈరోజు వాళ్ళు మన దేవుల్లయ్యారు(?). ఇప్పుడు వాళ్ల నిజమైన స్థితిగతులను తెలుసుకునేందుకు వీలుగా వాళ్ల తలని పైకెత్తి చెంపదెబ్బ కొట్టాల్సిన అవసరం ఏర్పడింది.


ఒకసారి, అప్పటి వియత్నాం అధ్యక్షుడు హో-చి-మిన్, భారత మంత్రులతో సమావేశానికి భారతదేశానికి వచ్చినప్పుడు "మీరు ఏమి చేస్తారు?" అని అడిగారు.


వారు చెప్పారు - "మేము రాజకీయాలు చేస్తాము."


ఈ సమాధానం అతనికి అర్థం కాలేదు కాబట్టి మళ్ళీ అడిగాడు - "అంటే, మీ వృత్తి ఏమిటి?"


వీళ్ళు చెప్పారు - "రాజకీయం మా వృత్తి."


హో-చి మిన్‌కి కొంచెం చిరాకు వచ్చి ఇలా అన్నాడు - "మీకు నా ప్రశ్న అర్థం కాకపోవచ్చు. నేను కూడా రాజకీయాలు చేస్తాను, కానీ వృత్తి రీత్యా నేను రైతును మరియు వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం నా జీవనాధారం. ఉదయం మరియు సాయంత్రం నేను నా పొలాలకు వెళ్లి  పని చేస్తున్నాను. పగటిపూట రాష్ట్రపతిగా దేశం కోసం నా బాధ్యత నిర్వర్తిస్తున్నాను."


అదే విషయాన్ని హో-చి-మిన్ మళ్లీ అడగ్గా, ప్రతినిధి బృందంలోని ఒక సభ్యుడు భుజం తట్టి చెప్పాడు - "రాజకీయాలు మా వృత్తి."


దీనికి భారత నాయకుల వద్ద సమాధానం లేదని స్పష్టమైంది. తరువాత, భారతదేశంలో 6 లక్షల మందికి పైగా ప్రజల జీవనోపాధి రాజకీయాల మద్దతుతో ఉందని ఒక సర్వే వెల్లడించింది. నేడు ఈ సంఖ్య కోట్లకు చేరింది.


కొన్ని నెలల క్రితం, యూరప్‌లో కరోనా విలయతాండవం చేస్తున్నప్పుడు, వైద్యులు వరుసగా చాలా నెలలు కొంచెం కూడా విశ్రాంతి తీసుకోలేదు, అప్పుడు ఒక పోర్చుగీస్ వైద్యుడు కోపంగా అన్నాడు - "రొనాల్డో దగ్గరికి వెళ్ళు, అతనికి మిలియన్ డాలర్లు ఇస్తారుగా అతని ఆట చూడటానికి. నాకు మాత్రం కొన్ని వేల డాలర్లు మాత్రమే లభిస్తాయి."


ఏదైనా ఒక దేశంలో యువ విద్యార్థుల ఆదర్శం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యావేత్తలు కాకుండా నటులు, రాజకీయ నాయకులు మరియు క్రీడాకారులు అయితే అది వారి స్వంత ఆర్థిక పురోగతికి మాత్రమే దోహద పడవచ్చు కానీ దేశ అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగ పడదని నేను గట్టిగా నమ్ముతున్నాను.


సామాజికంగా, మేధోపరంగా, సాంస్కృతికంగా, వ్యూహాత్మకంగా దేశం ఎప్పుడూ వెనుకబడి ఉంటుంది. అటువంటి దేశం యొక్క ఐక్యత మరియు సమగ్రత ఎల్లప్పుడూ ప్రమాదంలో ఉంటుంది.


ఏ దేశంలో అనవసర, అప్రస్తుతమైన రంగాల ఆధిపత్యం పెరుగుతుందో, ఆ దేశం రోజురోజుకూ బలహీనపడుతుంది. దేశంలో అవినీతిపరులు, దేశ వ్యతిరేకుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. నిజాయితీపరులు అట్టడుగున ఉంచబడతారు మరియు కష్టతరమైన జీవితాన్ని గడపవలసి వస్తుంది.


ప్రతిభావంతులైన, నిజాయితీ గల, మనస్సాక్షి ఉన్న, సామాజిక కార్యకర్తలు, పోరాట యోధులు మరియు దేశభక్తి గల పౌరులను పెంపొందించడానికి మరియు ప్రోత్సహించడానికి అనుకూలమైన వాతావరణాన్ని మనం సృష్టించాలి.....


     🙏🙏🌹🌹🙏🙏

విత్తనం

 🙏 *చాల బాగా రాశారు*.🙏.

    👏👏👏👏👏👏👏👏👏👏👏

                  *విత్తనం తినాలని*

                 *చీమలు చూస్తాయ్*..

                *మొలకలు తినాలని*

                 *పక్షులు చూస్తాయ్*..

           

                 *మొక్కని తినాలని*

                *పశువులు చూస్తాయ్*


                 *అన్ని తప్పించుకుని*

             *ఆ విత్తనం వృక్షమైనపుడు*..


            *చీమలు, పక్షులు, పశువులు*..

         *ఆ చెట్టుకిందకే నీడ కోసం వస్తాయ్*....


            *జీవితం కూడా అంతే TIME*

          *వచ్చే వరకు వేచివుండాల్సిందే*

          *దానికి కావాల్సింది ఓపిక మాత్రమే*.....        


               *లైఫ్ లో వదిలి వెళ్ళిన*

           *వాళ్ళ గురించి ఆలోచించకు*..


              *జీవితంలో ఉన్న వాళ్ళు*

              *శాశ్వతం అని భావించకు*..


           *ఎవరో వచ్చి నీ బాధను అర్థం*

           *చేసుకుంటారని ఊహించకు*...


              *నీకు నీవే ధైర్యం కావాలి*.....

          *నీకు నువ్వే తోడుగా నిలబడాలి*...


                  *లోకులు కాకులు,*

                 *మనిషిని చూడరు*,

              *మనస్సును చూడరు,*

              *వ్యక్తిత్వాన్ని చూడరు.*


                     *కనిపించింది,*

            *వినిపించింది నమ్మేస్తారు*,

                 *మాట అనేస్తారు,*


                 *ఒక్కోసారి మన కళ్ళే*

              *మనల్ని మోసం చేస్తాయి.*


           *మరొకసారి చెప్పుడు మాటలు*

                        *జీవితాలను*

                  *తలకిందులు చేస్తాయి*


             *అబద్దాలతో, మోసాలతో*

                   *కీర్తి, ప్రతిష్టలను*

         *ఎంత గొప్పగా నిర్మించుకొన్నా*..

          *అవి కుప్పకూలి పోవడానికి*

               *ఒక్క "నిజం"చాలు*.

             *అందుకే కష్టమైనా సరే*

          *నీతిగా బ్రతకడమే మనిషికి*

                  *ఉత్తమ మార్గం.*

         

                *ఒక చిన్న మొక్కనాటి*

      *ప్రతిరోజూ వచ్చి కాయకాసిందా అని*      

                   *చూడకూడదు.*


             *ఎందుకంటే అది పెరగాలి*

                *మొక్క వృక్షం కావాలి*

          *పుష్పించాలి, పిందెలు రావాలి*

         *అవి కాయలై , పండితే తినగలం.*


              *అలాగే నేను ఇది కావాలి*

              *అనే కోరిక కూడా మొలకై*

       *వృక్షమై ఫలవంతం ఔతుందని తెలిసి*    

         *మసలుకోండి*


               *జీవితంలో కష్టము,*

             *కన్నీళ్ళు, సంతోషము,*

        *భాధ ఏవి శాశ్వతంగా ఉండవు*,


     *కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు.*

       *ఆనందం, ఆవేదన కూడా అంతే.*


              *నవ్వులూ, కన్నీళ్ళూ*

              *కలగలసినదే జీవితం*


             *కష్టమూ శాశ్వతం కాదు,*

       *సంతోషమూ శాశ్వతమూ కాదు.*


                   

    


                      *ఓడిపోతే*

            *గెలవడం నేర్చుకోవాలి*,


                     *మోసపోతే*

       *జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి*


                  *చెడిపోతే ఎలా*

           *బాగుపడలో నేర్చుకోవాలి,*


         *గెలుపును ఎలా పట్టుకోవాలో*

                *తెలిసిన వాడికంటే*

                   *ఓటమిని ఎలా*

          *తట్టుకోవాలో తెలిసిన వారే*

               *గొప్ప వారు నేస్తమా* !


              *దెబ్బలు తిన్న రాయి*

            *విగ్రహంగా మారుతుంది*


              *కానీ దెబ్బలు కొట్టిన*

             *సుత్తి మాత్రం ఎప్పటికీ*

          *సుత్తిగానే మిగిలిపోతుంది*....


          *ఎదురు దెబ్బలు తిన్నవాడు*,

         *నొప్పి విలువ తెలిసిన వాడు*

          *మహనీయుడు అవుతాడు*...


       *ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు*

    *ఎప్పటికీ ఉన్నదగ్గరే ఉండిపోతాడు*...

    

         

  


                 *డబ్బుతో ఏమైనా*

           *కొనగలమనుకుంటున్నారా*

             *అయితే కొనలేనివి ఇవిగో*


            *మంచం పరుపు కొనవచ్చు*

                    *కానీ నిద్ర కాదు*


                 *గడియారం కొనవచ్చు*

                    *కానీ కాలం కాదు*


                  *మందులు కొనవచ్చు*

                   *కానీ ఆరోగ్యం కాదు*


                  *భవంతులు కొనవచ్చు* 

                   *కానీ ఆత్మేయిత కాదు*


                   *పుస్తకాలు కొనవచ్చు*

                      *కానీ జ్ఞానం కాదు*


          *పంచభక్ష పరమాన్నాలు కొనవచ్చు*

                     *కానీ జీర్ణశక్తిని కాదు*

       

        *తెలిసి మసులుకో  --  కలిసి జీవించు.....*

             *శుభమ్ భవతు*

🌹🌹🌹🚩🚩🚩🌹🌹🌹