12, సెప్టెంబర్ 2022, సోమవారం

కోరికలే గుర్రాలయితే?

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*🌷"కోరికలే గుర్రాలయితే?"🌷*        

        అనే డోపమైన్ హై కథ!                   


 *"ఏం ఐఏఎస్ అండీ బాబు?* 

ఆ గ్లామర్ ఎప్పుడో పోయింది . ఒకప్పుడు కలెక్టర్ బంగాళా  రాజ ప్రాసాదంలా ఉండేది.  ఇప్పుడు కొత్త జిలాల్ల్లో కనీసం సరైన అద్దె కొంప దొరకడం లేదు.  పిల్లల చదువుకు మంచి స్కూల్ ఉండదు. వీధి స్థాయి ఛోటా నాయకుడు సైతం కలెక్టర్ ను నిలదీసేవాడే! రాత్రి - పగలు గొడ్డు చాకిరీ.   పగవాడికి కూడా ఈ శాపం వద్దు" అంటాడో ఐఏఎస్ అధికారి.


" అధికారం లో ఉన్న పార్టీ లకు ఊడిగం చేయడంతోటే సరిపోతోంది.  మిగతా ప్రభుత్వ విభాగాలు చేయలేని పనులన్నీ మాకు అప్పచెబుతారు.  ఒకప్పుడు ఎస్సై  బులెట్ వేసుకొని తిరుగుతుంటే ఆ ఊళ్ళో రౌడీ లకు తడిచిపోయేది.  ఇప్పుడు ఎస్పీ అంటే కూడా వీధి రౌడీ  లెక్క చెయ్యని స్థితి"  వాపోతాడో సీనియర్ ఐపీఎస్. 


రెవిన్యూ ఉద్యోగులు, డాక్టర్ లు, ప్రభుత్వ-  ప్రైవేట్ టీచర్ లు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, ఎవరిని కదిపినా అసంతృప్తి."  ఒకప్పుడు ఇలా ఉండేది కాదు.  ఇప్పుడు ఉద్యోగం చేయడం కష్టమై పోతోంది.  బతక లేక ఈ ఉద్యోగంలో వేగాల్సి వస్తోంది అంటారు.


   రోగి ప్రాణాన్ని కాపాడడానికి తమ వంతు ప్రయత్నం  చేసినా తమ పై దాడి చేసారంటూ డాక్టర్ ల సమ్మె . పిల్లల్ని కొట్టడం కాదు, తమపైనే బెదిరింపులు వస్తున్నాయంటూ టీచర్ లు.  అందరికీ న్యాయం చెప్పాల్సిన న్యాయమూర్తులు తమకు న్యాయం జరగడం లేదు అంటూ వ్యవస్థపట్ల అసంతృప్తితో.


అందరినీ నడిపించేది రాజకీయనాయకుడు.  "నేను ఎంపీ గా ఎంపికయిన కొత్తలో ఏదో లక్షల్లో ఖర్చు.  ఇప్పుడు వంద కోట్లు చాలడం లేదు.  కౌన్సిలర్ పోస్ట్ కు,   సర్పంచ్ పోస్ట్ కు కోట్లు ఖర్చుపెట్టాల్సిన స్థితి.  ఎక్కడినించి తేవాలి?  తిరిగి ఆ ఆ సొమ్మును ఎలా రాబట్టాలి " వాపోతాడో సీనియర్ రాజకీయనాయకుడు.


"ప్రైవేట్ ఉద్యోగం అయితే గొడ్డు చాకిరీ .. బానిసత్వం .. ప్రభుత్వ ఉద్యోగం అయితే హాయి" అంటాడో ప్రైవేట్ ఉద్యోగి . 


   "ప్రభుత్వ ఉద్యోగమా?  కంటికి నిద్ర లేదు.  ఒకప్పుడు నలుగురు చేసే పని నేనొక్కడే చెయ్యాల్సి వస్తోంది.  మంచి పోస్టింగ్ రావాలంటే లక్షల్లో ఖర్చు.  ట్రాన్స్ఫర్ అంటే ఖర్చు.  ముందుగా పెట్టుబడి. ఆ తరువాత లంచాలతో సంపాదన.  దిగితే లోతు తెలుస్తుంది.  ఈ ప్రుభుత్వ ఉద్యోగాల గ్లామర్ పాతకాలం మాట.  అందుకే నా పిల్లలని మంచి కంపెనీ ల్లో పని చేయమని చెప్పా. సొంత బిజినెస్ అయితే తానే రాజు .. తానే మంత్రి .. రిటైర్మెంట్ ఉండదు" అంటాడో ప్రభుత్వోద్యోగి. 


"కళ్ళకెదురుగా నాతోటి పరిశ్రమాధిపతులు నాశనం!   వందలకొద్దీ పరిశ్రమలు మూతపడ్డాయి.  మల్టీనేషనల్ కంపెనీ లనుంచి తట్టుకోలేని  పోటీ. వారివి మోసపూర్తిత పద్ధతులు. ప్రభుత్వ విధానాలు కూడా వారికే అనుకూలం.  అధికారులకు, రాజకీయనాయకులకు లంచాలు ఇవ్వలేము.  ఇదో నరకం .. నా పిల్లల్ని అమెరికా కు పంపిస్తున్నా. ఎక్కడయితే హాయిగా బతికేస్తారు " అంటాడు మూడు తరాలుగా పరిశ్రమ నడిపి దివాళా అంచుల్లో ఉన్న కోయింబత్తూర్ పారిశ్రామిక వేత్త. 


ఇండియా లో బతికలేము అంటూ అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలకు వలస పోయే వారు ఎంతో మంది.  అమెరికాలో ఎన్నో తరాలుగా స్థిరపడిన వారు అమెరికాలో హ్యాపీ  లైఫ్ గడపలేము అంటూ డబ్బెట్టి గోల్డెన్ వీసా కనుక్కొని వెళ్ళిపోతున్నారు  గ్రీస్ కు లేదా స్కాండినేవియన్ దేశానికి.  


అసలు భూమి నివాసయోగ్యం కాదు, త్వరగా మార్స్ పైకి వెళ్ళిపోతే   బాగుండు అని మరి కొందరు.


అసంతృప్తి .. కలెక్టర్ మొదలు బిల్లబంట్రోతు వరకు .. స్టార్ట్ అప్  మొదలు ఫామిలీ బిజినెస్ మాన్  వరకు .. రాజకీయనాయకుడు మొదలు కార్యకర్త వరకు .. అందరిలో అసంతృప్తి. 


ఎందుకు?


👇👇👇👇👇👇👇👇👇


1950  లో ప్రపంచ జనాభా 250  కోట్లు . ఇప్పుడు 800  కోట్లు .


 డెబ్భై  సంవత్సరాల్లో మూడు రెట్లకు కు పైగా పెరిగిన జనాభా ! ఇల్లు కట్టు కోవడానికి పంటలు పండించడానికి భూమి అవసరం .

  కానీ  అప్పుడూ ఇప్పుడూ అదే భూమి .  


 *అంటే?* 

 


పరిమతమైన వనరులు .. అపరిమితంగా పెరిగిపోతున్న డిమాండ్ ..


తిండి కోసం , నివాసం కోసం .. బతకడం కోసం పోటీ .విపరీతమైన పోటీ . 

  పోటీ తెచ్చే  ఒత్తిడి . 


ఇదీ నేడు సర్వత్రా కనిపించే స్థితి .


కానీ శాస్త్రసాంకేతిక రంగాల్లో అభివృద్ధి పుణ్యమా అంటూ జనాభా ఇంతగా  పెరిగినా,  అందరి అవసరాలూ తీర్చగలిగిన స్థితి లో నేడు మానవాళి ఉంది. ఎనభై ఏళ్ళ క్రితం బెంగాల్ లో కరువు వల్ల ముప్పై లక్షల మంది చనిపోయారు అంటే నమ్మగలరా ?  నేటి ప్రపంచం లో ఆకలి చావులు , కరువులు కాటకాలు ఎక్కడో కొన్ని ఆఫ్రికా దేశాలకు పరిమితం .


ఆవసరాలు తీరుతాయి .


  మరి కోరికలు ? 


👎👎👎👎👎👎👎


స్కూటర్ కొన్నాయనకు కారు కావాలి . కారు కొన్నాయనకు లగ్జరీ కారు కావాలి . దాన్ని కొన్నాయనకు ప్రైవేట్ జెట్ కావాలి . 


ఫ్లాట్ కొన్నాయనకు ఇండిపెండెంట్ హౌస్ కావాలి . అది కొన్నాయనకు విల్లా కావాలి . గేటెడ్ కమ్యూనిటీ కావాలి . అది కొన్నాయనకు డిజైనర్ బంగాళా కావాలి . అది ఉన్నాయనకు సొంత దీవి కావాలి .


గ్రామ సర్పంచి గా గెలిచినాయనకు ఎంపీటీసీ అయ్యేదాకా నిద్ర ఉండదు . ఆదియితే జడ్పీటీసీ కావాలి .. ఎమ్మెలే కావాలి .. మంత్రి కావాలి .. మంత్రి అయితే సీఎం కావాలి . సీఎం అయితే పీఎం కావాలి . రాష్ట్రపతి పదవి రాలేదని అసంతృప్తి తో గుండెఆగి చనిపోయాడో పెద్దాయన . ప్రధాని కావాలని కలలు కని కని తీవ్ర ప్రయత్నాలు చేసి  విసిగి తీవ్ర నిరాశ తో వృద్ధాప్యం లో పడి కొట్టుమిట్టాడుతున్న వృద్ధ జంబూకాలెన్నో !  


ఆవసరాలు పరిమితం . గుర్రాలయిన కోరికలు ! 


కోరికలే మనిషి బాధలకు మూలం అన్నాడు గౌతమ బుద్ధుడు . 


2500 ఏళ్ళ  క్రితమే మనిషి కోరికలకు పగ్గాలు ఉండేవి కావు . ఇప్పుడు గ్లోబల్ సమాజం . కోరికలు ఇప్పుడు గుర్రాలు కావు  .. రాకెట్ లు .. సూపర్ సోనిక్ జెట్ లు!

 నలభై ఏళ్ళ ప్రపంచీకరణ ! అప్పటిదాకా ఏదైనా సామజిక విలువలు మిగిలుంటే దాన్ని తుడిచి పెట్టేసింది ! 


తనకు రాముడు లాంటి భర్త కావాలనుకొనేది ఒక నాటి స్త్రీ ! అంటే మరో స్త్రీని తలపులోకి కూడా రానివ్వ కూడదు . తనకు సీత లాంటి భార్య కావాలి అనుకునేవాడు ఒకప్పటి యువకుడు . అంటే కష్టాల్లో నష్టాల్లో తనవెంట నిలవాలి . న్యాయం కదా ?


ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ప్రపంచం . తనకు రష్మిక మందన లాంటి భార్య కావాలి !  సరిపోతుందా ? లేదు వీలైతే మృణాల్ ఠాకూర్ రెండో  భార్య గా ! పోనీ అక్కడితో ఓకే ?   సన్నీ లియోన్ లాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలి ! పూనమ్ పాండే  షెర్లీన్ .. ఇంకా ఇంకా కావాలి ! 


వ్యయసాయం చేసే భర్త వద్దు . సిటీ లో ఉద్యోగం చేసేవాడు కావాలి . అక్కడితో హ్యాపీ నా ? పక్కింటాయనకు కారుంది . మనకు లేదు . ఆఫీస్ లో పని చేసే కొలీగ్ కు సిక్స్ ప్యాక్ వుంది . నీకు లేదు .


  "  లైఫ్  ఈజ్  షార్ట్ .  చేతకానోళ్లే నీతులంటూ ఉపన్యాసాలిస్తారు . ఎంజాయ్ . దానికోసం ఏమైనా చేయొచ్చు . ఆన్లైన్ గేమ్ లో డబ్బు కోసం అమ్మనైనా చంపొచ్చు . పక్కింటి కుర్రాడితో సుఖం కోసం భర్తకు అన్నంలో విషం పెట్టొచ్చు . ఎంజోయ్మెంట్ ముఖ్యం . " ఇదీ గ్లోబల్  యుగం లో మిలీనియం యూత్ ఫిలాసఫీ . 


 స్మగ్లర్ లు  గూండా లు రౌడీ షీటర్లు నేటి యువత కు ఆదర్శ పురుషులు .


తెలంగాణకు చెందిన ఒక నాయకుడు తన నియోజకవర్గం లో యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేసాడు . అబ్బే ప్రైవేట్ ఉద్యోగాలు ఎవరికీ కావాలి అని ఎక్కువ శాతం నోరు చప్పరించేసారుట ! తమ కళ్ళకెదుట రాజకీయాల్లో చేరి కోట్లు కూడబెట్టిన వారు వీరికి ఆదర్శం . సంవత్సరం లో వంద కోట్లు కూడబెట్టాలనుకున్నోళ్లకి నెలకు ఇంత జీతం చొప్పున చేసే ఓపిక ఉంటుందా ?

జీవితం చిన్నది . నిజమే ! ఆనందంగా బతకాలి . కరెక్ట్ .. కానీ ...  

✔️✔️✔️✔️✔️✔️✔️

ఆనందం అంటే ?  

వస్తువుల్లో ఆనందాన్ని  వెతుక్కోంటోంది  నేటి సమాజం .


వేలకోట్ల సంపద వున్నా తీవ్ర అనారోగ్యం తో చనిపోయిన రాకేష్ జున్ఝున్వాలా , గోవా బీచ్ లు .. బికిని మోడల్స్ .. క్యాలండర్ గర్ల్స్  విజయ్ మాల్యా .. నేడు  లండన్ లో బోడి మల్లయ్య గా మారిన తీరు  .. సమకాలీన ప్రపంచం ఎన్ని ఉదారణలను విసిరేసినా నేర్చుకోలేని స్థితికి చేరుకొంది మానవాళి . 


ఆనందం అనేది కిలోల్లో టన్నుల్లో దొరికే వస్తువు కాదు . డబెట్టి దాన్ని కొనలేవు . డబ్బు అవసరమే ! ధర్మార్థకామమోక్ష అన్నారు . అర్థం అంటే డబ్బు కావాలి . కామ అంటే సెక్స్ { సెక్స్ ఒక్కటే కాదు } .. అదీ  కావాలి . కానీ ధర్మ ముఖ్యం అని  చెప్పే గురువులు లేకపోయారు . చెప్పినా...  వారి రీచ్ తక్కువ .ప్రవచనాలు ముసలాళ్లకే ! నేటి తరానికి చెప్పేవారెవరు ? 


ధర్మం అంటే ? 


ధర్మం అంటే జడ పదార్థం కాదు . కాల ధర్మం .. దేశ ధర్మం .  ఆపద్ధర్మం . దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా మారుతుంది . 


ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో చెప్పేదే ధర్మం . భూప్రపంచం లో నువ్వొక్కడే ఉంటే నీ ఇష్టం . నువ్వు ఆడిందే అట.. పాడిందే పాట ! కానీ ఒక్కడే బతకలేవే ! కన్న వెంటనే తల్లి వదిలిస్తే గంటలో శవం అయిపోయేవాడివి . పొద్దునే నువ్వు వాడే బ్రష్ మొదలు రాత్రి పడుకొనే బెడ్ దాకా నలుగురి శ్రమ  తో వచ్చిందే . నీకు నచ్చినా నచ్చక పోయినా నువ్వు సంఘ జీవి . పట్టుకముందు నుంచి కట్టే కాలే దాక ! 


సమాజమంటే మనుషులు . నీ లాంటి వారు . పెద్దవారు .. చిన్న వారు .

  నువ్వేమి చెయ్యాలి .. ఏమి చేయకూడదు చెప్పేదే ధర్మం ! అదొక సామజిక  నియంత్రణా సూత్రం . 


నువెక్కిన బోట్ లో ఎవడో చిల్లు పెడితే?  నీ మునక గ్యారంటీ . నా బోట్ నా ఇష్టం అంటూ నువ్వు దాన్ని తగలేస్తే అందరూ పోవడం  గ్యారంటీ ! 


సమాజం అలాంటిదే ! ప్రేమ ,  పెళ్లి , పెటాకులు , పిల్లలు , చదువులు,  ఉద్యోగాలు అన్నిటికీ రూల్స్ వున్నాయి . ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో చెప్పే సూత్రాలు వున్నాయి .  నేటి నీ సుఖం .

 అన్నింటినీ కాలదన్ని నా సుఖమే నే కోరుకొన్నా అంటే ? 


పోనీ సుఖాన్నయినా అనుభవిస్తున్నావా ? 


 *ఒకప్పుడు శుక్రవారం అరగంట చిత్ర లహరి చూసి ఫుల్ హ్యాపీ అయిన మహిళా నేటి బామ్మ. ఎంటో!  యు ట్యూబ్ లో అన్ని* గంటలు పాటలు చూసినా సంతృప్తి రాలేదంటుంది . ఆది వారం సంక్షిప్త శబ్ద చిత్రం విని ఆనంద  బాష్పాలు రాల్చిన మొన్నటి బాలుడు  నేడు వృద్ధాప్యం లో స్మార్ట్ టీవీ లో ఎన్ని సినిమా లు చూసినా సాటిస్ఫాయ్ కావడం లేదు . సిల్క్ స్మిత మోకాటి పై దుస్తులకే గంగవెర్రులెత్తిన నాటి తరం .. పూర్తి నగ్న చిత్రాలను చూసిన కిక్ రాని నేటి తరం .


ఏంటిది ?


   కాలం మారిందా ?


    అది మారుతూనే  ఉంటుంది . మీరు ఈ మెసేజ్ చదవడం మొదలెట్టి నిముషాలు గడిచిపోయాయి . సమస్య కాలం కాదు . జెనెరేషన్ గ్యాప్ కాదు . 


సమస్య  డోపామైన్ హై .


   దీన్ని  అందరికీ అర్తం అయ్యేలా చెప్పాలంటే ఇప్పటికే కొండవీటి చేంతాడంటయినా ఈ మెసేజ్ మరీ లాంగ్ అయిపోతుంది . తోలి సారి ఒక బీర్ కే కిక్ . ఆరు నెలలు గడిస్తే రెండు పెగ్గులు . ఆరేళ్లు గడిస్తే ఫుల్ బాటిల్ కొట్టినా కిక్ రాదు . అదే డోపామైన్ హై . 


నేడు జరుగుతోంది ఇదే ! 


గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ .. విల్లా .. విమానం .. అమెరికా .. అంటార్కిటికా టూర్.. ఏదైనా సరి పోవడం లేదు . ఇంకా ఇంకా కావాలి . 


ఇంకేం ఇంకేం కావాలి .. చాల్లే ఇది చాల్లే .. 


ఆనందం ఒక గుణాత్మక అంశం . అదో అమూర్త భావన . దీన్ని  అందరికీ  అర్థం అయ్యేలా చెప్పి సమాజం లో మార్పు తెచ్చే గురువులు కావాలి . నేడు ఉపాధ్యాయ దినోత్సవం . తల్లే  మొదటి గురువు . అటు పై బడి . తల్లి ఒడి లో అటు పై బడిలో మనిషి నేర్చేదే ధర్మం . అంటే మంచి చెడు.


ధర్మో రక్షతి రక్షితః ! చాల సింపుల్ సామజిక సూత్రం . "అరే వెర్రి నాగన్నా! బోట్ లో ఉన్నావు. ఎలా కూర్చోవాలి? ఎలా లేవాలి ?ఎప్పుడు లేవాలి? ఇలా అన్నిటికీ పద్దతులున్నాయి ..అని చెప్పేదే ధర్మం .


నీ సుఖం కోసం ధర్మాన్ని తుంగలోకి తొక్కితే దాని ఫలం  నిన్ను వెంటాడుతుంది 


సిస్టం సెల్ఫ్ కరెక్షన్ చేసుకొంటుంది .


 అందరూ తమకు తోచిన రీతిలో వ్యవహరిస్తే ?


 రేప్ లు .. హత్యలు .. మర్డర్ లు అంతర్యుద్ధాలు .. ఇలా సమాజం సర్వనాశనం అయిపోతుంది . వినాశంనుండి సమాజం అంటే భావి తరాలు పాఠాన్ని  గ్రహిస్తారు . ధర్మ సంస్థాపనార్థం సంభవామి యుగే యుగే అంటే ఇదే .. అన్ని మతాల్లో దేవుడొస్తాడు .. బాగుచేస్తాడు అని నమ్మకం వెనుకనున్న సామజిక శాస్త్రం ఇదే . సమాజము - సెల్ఫ్  కర్రెక్క్షన్ . అప్పటికీ మీరు నేను  ఉండము. 


నేడు మీరు తేల్చుకోవాలింది ఒక్కటే .. ఏది దారి ? ధర్మాన్ని రక్షించి మన ఓడను ఒడ్డుకు చేర్చడమా ? లేక ప్రళయాన్ని సృష్టించి తిరిగి ఎప్పుడో ధర్మం మొలిచేలా కాల చక్రానికి  ఒదిలెయ్యడమా ?


గురువుల దారా ? 


స్మశాన దారా ?


  తేల్చుకోవాల్సిన సమయం ఇదే !


తల్లి తో మొదలెట్టి మంచిచెడు చెప్పి ధర్మాన్ని రక్షించిన గురువులందరికీ వందనములు.

సేకరణ:  వాట్సాప్ పోస్ట్.

కామెంట్‌లు లేవు: