22, మే 2021, శనివారం

పిల్లలున్న వారు జాగ్రత్తగా ఉండాలి

 * ⛔ * బ్రేకింగ్ న్యూస్ 

"""""""""""""""""""""""

             🙏🏻🙏🏻


 👧🏻 పిల్లలున్న వారు జాగ్రత్తగా ఉండాలి.   శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక నోటీసు *


 👦🏻పదేళ్ల లోపు పిల్లలతో తల్లిదండ్రుల దృష్టికి ..


 కరోనా చెడుగా పెరుగుతోంది.  ఇది ఏ క్షణంలోనైనా చేరుకోవచ్చు మరియు సంపర్క అనారోగ్యం పెరుగుతోంది.  పరిస్థితి చాలా ఘోరంగా ఉంది.  దయచేసి ఈ క్రింది పాయింట్లతో జాగ్రత్తగా ఉండండి ..


 ▪️చిన్న పిల్లలను దగ్గరకు తీసుకోటానికి లేదా ముద్దు పెట్టుకోవడానికి ఇతరులను అనుమతించవద్దు.  తల్లిదండ్రులు తమ పిల్లలను మాత్రమే దగ్గరకు తీసుకోవడానికి ప్రయత్నించాలి. అంతేకాని ఇతరుల పిల్లలను ప్రస్తుత పరిస్తితులలో యేమాత్రం దగ్గరకు తీసుకోవద్దని మనవి. 


 ▪️పిల్లలను రద్దీగా ఉండే ప్రదేశాలకు తీసుకెళ్లవద్దు.


▪️ తల్లి పాలిచ్చే పిల్లల తల్లిదండ్రులు బయటకు వెళ్లకూడదు.


 ▪️పిల్లలతో కుటుంబ సందర్శనలు మరియు విందులను తప్పనిసరిగా తప్పించడం.

 ▪️ తండ్రి ఇల్లు, తల్లి ఇల్లు, ఇతర బంధువుల ఇళ్ళు * తరలించకూడదు.  సురక్షితంగా ఉండండి.


 ▪️మీకు ఏదైనా అనారోగ్యం ఉంటే, దానిని సమీప ఆరోగ్య కేంద్రానికి నివేదించండి మరియు తదుపరి చికిత్స సూచించినట్లయితే మాత్రమే మరొక ఆసుపత్రికి వెళ్లండి.


 ▪️ స్పిన్నింగ్, హెయిర్ రిమూవల్ మరియు నామకరణ వంటి పిల్లల సంబంధిత ఆచారాలన్నీ వాయిదా వేయండి !


 ▪️పిల్లల ఆహారంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని చేర్చండి


 ▪️పొరుగు ఇళ్లలో కూడా పిల్లలను ఆడనివ్వవద్దు. *


▪️ పిల్లల చేతులను తరచుగా హ్యాండ్ వాష్ తో కడగాలి


 ▪️బిస్కెట్లు, చాక్లెట్లు, క్యాండీలు, మీరు కొన్నవన్నీ శుభ్రపరచాలి మరియు చేతితో కడిగిన తర్వాత మాత్రమే పిల్లలకు ఇవ్వాలి !


 ▪️పిల్లలతో బయటకు వెళ్ళడానికి బలవంతపు పరిస్థితులు ఉంటే ఆరోగ్య అధికారులకు తెలియజేయండి.


▪️ ఇంట్లో శానిటైజర్ జాగ్రత్త తీసుకోవాలి.  శిశువు చేతులు శుభ్రపరచాలి.


 ▪️సూచనలను ఖచ్చితంగా

 పాటించాలి. అందరం బాగుండాలి ఆ అందరిలో మనంకూడా ఉండాలి.


▪️ ఇది మన కోసమే, మన పిల్లల కోసం, మన దేశం కోసం అని ఇతరులకు తెలియజేయండి! చట్టపరమైన నిబందనలను ఉల్లంగిస్తే చట్టం తనపనితాను చేసుకుపోతుంది జాగ్రత్త.



 ▪️ఈ సందేశాన్ని వీలైనన్ని సమూహాలు, స్నేహితులు మరియు బంధువులతో పంచుకోండి !🙏🏻

👦🏻👧🏻👶🏼👦🏻👧🏻👶🏼👦🏻

అర్ధం- అపార్థం.

 అర్ధం- అపార్థం...


రెండు పదాలు కు మద్య ఓక అక్షరం తేడా అంతే, కానీ బావం మారతుంది, సంబంధాలను, భవబంధాలను ప్రశ్నార్థకం చేస్తుంది.

   

పూర్వము భారవి అనే కవి వుండేవాడు. ఆయన చిన్నతనంలోనే కవిత్వం చెప్పేవాడు. కావ్యాలు వ్రాసేవాడు. ఊర్లో వాళ్ళంతా చాలా మెచ్చుకునేవారు. 


భారవి తండ్రితో నీకొడుకు చాలా బాగా వ్రాస్తాడయ్యా అనేవారు.  


ఆయన మాత్రం వాడింకా చిన్నవాడు యింకా నేర్చు కోవలిసింది చాలా వుంది. ఏదో వ్రాస్తాడులే అనేవాడు.


భారవికి తండ్రి తనను మెచ్చుకోవడం లేదని చాలా అసంతృప్తి.


తల్లి దగ్గర నాన్నగారు నన్ను తీసిపారేసినట్టు మాట్లాడుతారు. వూర్లో వారంతా నన్ను మెచ్చుకుంటూ వుంటే తనేమో ఏమున్నది, యింకా వాడు చిన్నవాడు అన్నట్టు మాట్లాడుతారు.

అని చాలా సార్లు చెప్పుకున్నాడు.


ఎన్నాళ్ళయినా తండ్రి ధోరణి మారక పోయే సరికి భారవికి  తండ్రిమీద కసి పుట్టింది, ఆయనను చంపాలని నిశ్చయించుకున్నాడు


ఒకరోజు రాత్రి ఆయన వంటింట్లో భోజనం చేస్తున్నాడు భార్య వడ్డిస్తూ వుంది.


భారవి, ఆయన పెరట్లోకి చెయ్యి కడుక్కునేందుకు వస్తే చంపెయ్యాలని పెద్ద బండరాయి పట్టుకొని పెరట్లో ఒక పక్క కాచుకొని కూర్చున్నాడు


అప్పుడు భారవి తల్లి భర్తతో మీరెందుకు వాడిని అస్తమాను చిన్నబుచ్చినట్లు మాట్లాడుతారు?వాడు చాలా బాధ పడుతున్నాడు. 


వూరు ఊరంతా వాడిని మెచ్చుకుంటూ వుంటే మీరు మాత్రం వాడికేమీ తెలీదని అంటారట!


అప్పుడు తండ్రి నవ్వి.... పిచ్చిదానా! నాకు మాత్రం వాడిని చూసి గర్వంగా లేదనుకున్నావా? తండ్రి పొగిడితే బిడ్డకు ఆయుఃక్షీణం అంటారు. అంతే కాకుండా పొగడ్త మనిషిని పాడు చేస్తుంది, వాటి అభివృద్ధికి ఆటంకమవుతుంది. ఇంకా యెంతో పైకి రావలిసినవాడికి గర్వం పెరిగి తనంతవాడు లేడని విర్రవీగుతాడు, దానితో వాడి అభివృద్ధి ఆగిపోదా? అన్నాడు.


అదివిని భారవికి బుర్ర తిరిగి పోయింది.


పశ్చాత్తాపంతో రగిలి పోయాడు. వెంటనే బండ అక్కడ పారవేసి లోపలికి వెళ్లి తండ్రి పాదాలమీద పడి భోరున ఏడ్చాడు.


తాను తండ్రిని చంపాలనుకున్న విషయం చెప్పి నాకేదయినా శిక్ష వేయమని బ్రతిమాలుకున్నాడు.


 "పశ్చాత్తాపం తో నీపాపం పోయింది! శిక్ష ఎందుకు? అని తండ్రి చెప్తున్నా వినకుండా  తనకు శిక్ష వేయమని పట్టు బట్టాడు".


తండ్రి సరే అలాగయితే మీ అత్తవారింట్లో ఒక సంవత్సరం ఎవరికీ, చివరికి నీ భార్యకు కూడా ఎందుకు, ఏమిటి, ఏ కారణాలు చెప్పకుండా అక్కడవుండి రా! అన్నాడు. 


ఇంత  చిన్న శిక్షనా? అన్నాడు భారవి.


తండ్రి నవ్వి అది చాల్లే వెళ్ళుఅన్నాడు.


భారవికి చిన్నతనంలోనే పెళ్లయింది. అప్పటికి యింకా  భారవి భార్య కాపురానికి రాలేదు.


సరేనని భారవి అత్తగారి వూరికి వెళ్ళాడు. వాళ్ళు అల్లుడుగారు వచ్చారని చాలా మర్యాద చేశారు.


రోజుకో పిండివంట చేసి ఆదరించారు.నెల రోజులు గడుస్తున్నా అల్లుడు వెళ్ళటం లేదేమని వాళ్ళు విసుక్కున్నారు.


చిన్న చిన్న పనులు చెయ్యమని చెప్పడం ప్రారంభించారు. మర్యాదలు తగ్గాయి. బావ మరుదులు పొలం పనులు కూడా పురమాయించారు.


అందరూ విసుక్కుంటూ మాట్లాడేవారు....


దేనికీ బదులు చెప్పకుండా విసుక్కోకుండా అన్ని పనులు చేసేవాడు. 


అతని భార్యను కూడా పొలం పనులకు పంపేవారు. భారవి భార్యకు చాలా బాధగా వుండేది. భర్తకు ఆవిడ మీరు మీ ఊరు వెళ్లిపోండని  యెంతో చెప్పి చూసింది.


భారవి సమాధానం చెప్పకుండా మౌనం వహించేవాడు. 


ఇలా సంవత్సరం గడిచింది. అప్పుడు భారవి యింక నేను  మావూరికి పోయివస్తానని బయల్దేరాడు.


ఇంత  హఠాత్తుగా  ఎందుకు వెళ్లాలని అంటున్నాడో వాళ్లకు అర్థం కాలేదు. 


భార్యకు, అత్తామామలకూ విషయం వివరించి నాశిక్ష పూర్తి  అయింది అందుకని వెళుతున్నాను అని చెప్పాడు.


ఇది విని వాళ్ళు తమ ప్రవర్తనకు సిగ్గుపడ్డారు.


భారవి తనతండ్రి వేసిన శిక్ష తనలో ఎంతో ఓర్పును, నేర్పును, సహనాన్ని, అవగాహనను పెంచాయని గ్రహించాడు.


తండ్రిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి! మీ అభివృద్ధిని కోరుకునే వారిలో ఆయనే ప్రథముడు. 


కోపం గా మాట్లడే ప్రతివారి ని శతృత్వము తో చూడరాదు.


చిన్నప్పుడు తల్లి కోప్పడిందని, తండ్రి దండించాడని వారి మీద కోపం పెంచుకోకండి!


అదంతా మీరు బాగుపడాలనీ, వృద్ధి లోకి రావాలనీ చేసి వుంటారని గుర్తు పెట్టుకోండి!


"తల్లిదండ్రులను ద్వేషించకండి!

అంతకంటే పాపం ఇంకోటి వుండదు"


బంధాన్ని కాపాడుకోడానికి తల వంచాల్సివస్తే వంచేయి .

            🌹🌹🌹🙏🙏🙏

నా దేశాన్ని మేలుకొలుపు తండ్రీ..!!

 ||నా దేశాన్ని మేలుకొలుపు తండ్రీ ||

ఎక్కడ పవిత్ర నదుల్లో శవాలు ప్రవహించవో

ఎక్కడ సామాన్యుల మృతదేహాలను  శ్మశానాలు తిరస్కరించవో

ఎక్కడ నిరుపేదలను కాసుల ఆసుపత్రులు నిరాదరించవో

ఎక్కడ  ప్రాణం కంటే ప్రాణవాయువు ఖరీదు కాదో

ఎక్కడ అత్యవసర మందులు నల్లబజారులో బందీకావో

ఎక్కడ ఆరోగ్యం అంగడి సరుకు కాదో

ఎక్కడ ప్రజారోగ్యం కంటే ఎన్నికల ప్రయోజనాలే  పరమావధి కావో

ఎక్కడ దేశం కంటే కొందరు వ్యక్తులు గొప్పవారు కాలేరో

ఎక్కడ అసత్యాలూ, ఆర్భాటాలూ, అహంకారాలూ ఏలికలకు ఆభరణాలు కావో

ఎక్కడ బడులూ, ఆస్పత్రుల కంటే గుడులు గొప్పవి కావో 

ఎక్కడ సైన్స్ మీద అజ్ఞానం పెత్తనం  చేయదో 

ఎక్కడ సత్యానికీ నిర్భయత్వానికీ సంకెళ్ళు పడవో

ఎక్కడ దేశద్రోహం దేశభక్తిగా..దేశభక్తి దేశద్రోహంగా చెలామణి కావో

ఎక్కడ త్యాగాన్ని స్వార్థం.. నిజాయితీని నిర్లక్ష్యం..

దేశ లాభాన్ని సొంత లాభం కబళించవో 

అక్కడ ఆ సుందర సుప్రభాత స్వేచ్ఛా స్వర్గంలో 

 నా దేశాన్ని మేలుకొలుపు తండ్రీ..!!

          ........................   ...................

(రవీంద్రుడి జ్ఞాపకంలో..)

భరోసా ఇస్తే

 కృష్ణపట్నం ఆయుర్వేదిక్ మందు గురించి ఫేస్ బుక్ టైమ్ లైన్ లో కొంతమంది డాక్టర్లు పెట్టిన పోస్టులను చూసిన తర్వాత తలెత్తిన ప్రశ్నలు.. 


కృష్ణపట్నం ఆయుర్వేద ముందుకి ప్రామాణికం ఏంటి అని అడుగుతున్నారు కొందరు డాక్టర్లు..??

మరి డాక్టర్లు చేస్తున్న ట్రీట్మెంట్ కి ప్రామాణికం ఏంటి..??


*ప్లాస్మా థెరపీ* అన్నారు, కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది.. ఇప్పుడు తూచ్ అది కరెక్ట్ కాదు అంటున్నారు. 


*రెమిడీశ్వర్* అన్నారు... కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది.. ఇప్పుడు తూచ్ అది కరెక్ట్ కాదు అంటున్నారు. 


మరి ప్రామాణికం ఏంటి..?? 


ఈ రోజు బ్లాక్ ఫంగస్ పడగ విప్పింది అంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లలో డిస్టిల్డ్ వాటర్ పోయాలి మామూలు వాటర్ కాదు అనే కనీస అవగాహన కూడా లేని కొందరి డాక్టర్ల వల్ల కాదా..!! ఎప్పుడైతే బ్లాక్ ఫంగస్ ఆ నీటి వల్ల వస్తుంది అని వార్తలు వచ్చాయో అవి చూసి నీతులు చెప్తూ పోస్టులు పెట్టే వారున్నారు.


అంతర్జాతీయ మీడియాలో ఆ మందు కరెక్ట్, ఈ మందు కరెక్ట్, ఆ ఇంజెక్షన్ కరెక్ట్ అంటూ వచ్చే వాటినే ప్రామాణికంగా తీసుకుంటున్నారు తప్పించి ఇది కరెక్ట్ మెడిసిన్ అంటూ దేనినైనా చెప్పగలుగు తున్నారా.


నిజానికి కోవిడ్ అనేది అందరికీ ఔట్ ఆఫ్ సిలబస్ టాపిక్.. ఔట్ ఆఫ్ సిలబస్ ప్రశ్న పరీక్షలో వస్తే ఆ ప్రశ్నని అటెంప్ట్ చేస్తే చాలు మార్కులు వేసేస్తారు అనే ఉద్దేశంతో అటెంప్ట్ లు జరుగుతున్నాయి తప్పించి ప్రామాణికం అయి మాత్రం కాదు.. 


చివరగా.. కృష్ణపట్నం మందు తీసుకున్న వారికి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రశ్నించే వారికి.. ఇప్పుడు హాస్పిటళ్లల్లో చనిపోతున్న వేలాది మందికి బాధ్యత ఎవరు తీసుకుంటున్నారో కూడా చెప్తే బాగుంటుంది.. ఈ డాక్టర్లలు మేము బాధ్యత తీసుకుంటాం.. పేషంట్ చనిపోడు మేము కాపాడుతాం అనే భరోసా ఇస్తే ప్రజలకు ఇంకేమి కావాలి..??


🤔🤔

దక్షయజ్ఞనాశము

 _*వైశాఖ పురాణం - 10 వ అధ్యాయము*_




🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉




*దక్షయజ్ఞనాశము కామదహనము*




☘☘☘☘☘☘☘☘☘



రుద్రుడా వార్తను విని కాలాంతకునివలె భయంకరాకారుడై వేయి బాహువులుకల మహాబలశాలియగు వీరభద్రుడు వెలువడెను. అతడును పరమేశ్వరునకు నమస్కరించి నన్ను సృష్టించిన కారణమును తెలుపుమని చేతులు జోడించి యడిగెను. పరమేశ్వరుడును నా భార్య వినజాలనిరీతిలో నన్ను నిందించిన ఆమె శరీర త్యాగమునకు కారణమైన దక్షుని సంహరింపుమని యానతిచ్చెను. భూతసంఘములను వీరభద్రుని వెంటపొండని పంపెను.


ఇట్లు పరమేశ్వరుని యాజ్ఞనందిన వీరభద్రుడు , వాని వెంట వెళ్లిన పరివారము యజ్ఞశాలను చేరి యచటనున్న దేవతలు , రాక్షసులు , మానవులు మున్నగు మహావీరులను అందరనుకొట్టిరి. సతీదేవి మాటలకు నవ్విన సూర్యుని దంతములను వీరభద్రుడు రాలగొట్టెను. సతీదేవి మాటను సతీదేవిని పరిహసించుచు నెవరు యే అవయవమును సవరించుకొనిరో వారి ఆ అవయవమును వీరభద్రుడు నాశము గావించెను. దక్షుని శిరమును ఖండింపవలెనని వీరభద్రుడు ప్రయత్నించెను. కాని మునిమంత్ర రక్షితమగు వాని శిరస్సును ఖండింపలేక పోయెను. పరమేశ్వరుడా విషయమును గ్రహించి తానే స్వయముగ దక్షుని శిరమును ఖండించెను. ఈ విధముగ వీరభద్రుడు శివుడు వారి పరివారము యజ్ఞశాలలోని వారిని భంగపరచి తమ వారితో గలసి కైలాసమునకు మరలిపోయిరి. యజ్ఞశాలలోని మిగిలినవారు బ్రహ్మవద్దకు వెళ్ళి శరణు వేడిరి.


బ్రహ్మయు వారితో గలసి కైలాసమునకు పోయెను. రుద్రుని వివిధరీతులలో నూరడించెను స్తుతించెను. శివుని సమాధానపరచి శివునితో గలసి యజ్ఞశాలకు వెళ్ళెను. యజ్ఞశాలలో మరణించిన వారినందరిని శివుని ప్రార్థించి యతనిచేతనే బ్రతికింపజేసెను , శివుడును దక్షుని అవినయమునకు శిక్షగా బ్రహ్మప్రార్థనకు గుర్తుగా దక్షునకు మేక ముఖము నమర్చి బ్రతికించెను , మరియు మేక గడ్డమును తెచ్చి భృగుమహర్షికి అమర్చెను. సూర్యునికి దంతముల నీయలేదు. కాని వానికి పిండిని తినునట్టి శక్తిని మాత్రమిచ్చెను. అవయవములను పోగొట్టుకొన్నవారికి ఆ అవయవముల నిచ్చెను. కొందరికీయలేదు.


యజ్ఞశాల యీ విధముగా శివబ్రహ్మల వలన పునర్జన్మనందెను. యజ్ఞశాలలోని వారు శివుని ప్రార్థించిరి. యజ్ఞమును మరల చేసి పూర్తి చేసిరి.


యజ్ఞాంతమున అందరును తమ తమ స్థానములకు పోయిరి. శివుడును భార్యా వియోగమున దుఃఖితుడై గంగాతీరమున పున్నాగ వృక్షము క్రింద తపమాచరించు కొనుచుండెను.


దక్షుని కుమార్తెయగు సతీదేవి శరీరమును విడిచి మేనాహిమాచలముల పుత్రికగా పుట్టి పెరుగుచుండెను.


ఈ సమయమున తారకుడను రాక్షసుడు తీవ్ర తపమునాచరించి బ్రహ్మను మెప్పించెను. శివుని పుత్రుని వలన తప్ప మరెవ్వరివలన మరణము లేకుండునట్లు వరములను పొందెను. పరమేశ్వరునికి భార్యయే లేదు పుత్రుడెట్లు కలుగును ?  కావున నేను అవధ్యుడను నన్ను చంపువారెవరును లేరని తారకుడు తలచెను. వరగర్వితుడై సర్వలోకములను , సర్వదేవతలను బాధింపసాగెను. దేవతలను , తన గృహములునూడ్చుటకును, దేవతాస్త్రీలను దాసీలుగను నియమించెను. దేవతలను బహువిధములుగ బాధించుచుండెను.


దేవతలు వాని వలని బాధలను భరింపజాలక బ్రహ్మవద్దకు బోయి తమను రక్షింపుమని బహువిధములుగ ప్రార్థించిరి. బ్రహ్మయును వారి మాటలను విని యిట్లు పలికెను. దేవతలారా ! నేను తారకునకు రుద్రపుత్రుని విడిచి యెవరు నిన్ను గెలువజాలరని వరమిచ్చిన మాట నిజము. రుద్రపత్నియగు సతీదేవి దక్షునియజ్ఞశాలలో శరీరమును విడిచినది. ఆమె ఇప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతీయను పేరుతో పెరుగుచున్నది. రుద్రుడును హిమాలయ ప్రాంతమున తపము చేసికొనుచున్నాడు. కావున మీరు పరమేశ్వరుడు పార్వతితో కలియునట్టి విధానము నాలోచింపుడని వారికి దగిన ఉపాయమును సూచించెను. వారిని యూరడించి పంపెను.


దేవతలందరును యఇంద్రుని ఇంట సమావేశమైరి బృహస్పతితో నాలోచించిన ఇంద్రుడును, నారదుని మన్మధుని స్మరించెను. ఇంద్రుడు స్మరించినంతనే నారదుడును , మనధుడు ఇంద్రుని వద్దకు వచ్చిరి.


ఇంద్రుడు - నారదుని జూచి నారదమహర్షీ ! నీవు హిమవంతుని కడకు పోయి దక్షయజ్ఞమున శరీరత్యాగమొనర్చిన సతీదేవియే నీ కుమార్తె పార్వతిగా జన్మించినది. భార్యావియుక్తుడగు శివుడును నీ హిమాలయశృంగమునందే తపమాచరించుచున్నాడు. పూర్వజన్మలో పరమశివుని భార్యయై ప్రస్తుతము నీ కుమార్తెగానున్న పార్వతిని శివుని సేవించుటకై పంపుము. ఆమెయే శివునికి భార్య కాగలదు. శివుడే ఆమెకు భర్త కాగలడు. కావున నీవు నీ కుమార్తెను పూర్వజన్మయందలి భర్తయగు శివునికి భార్య చేయమని భోదింపుమని చెప్పి నారదుని హిమవంతుని కడకు పంపెను. నారదుడు ఇంద్రుడు చెప్పినట్లుగ హిమవంతుని కడకు పోయి పార్వతిని శివుని సేవకు పంపునట్లుగా శివునికి పార్వతినిచ్చి వివాహము కావించునట్లుగ హిమవంతుని ప్రబోధించెను. హిమవంతుడును శివుని సేవకై పార్వతిని నియమించెను.


నారదుని పంపిన తరువాత నింద్రుడు మన్మధుని జూచి తారకాసుర పీడితులగు దేవతల హితము కొరకు భార్యా వియుక్తుడగు శివుని హితము కొరకు నీవు నేను చెప్పు కార్యమును చేయుము. నీ మిత్రుడగు వసంతునితో శివుడు తపమాచరించు ప్రదేశమునకు పొమ్ము. హృదయ మనోహరములగు వసంతర్తుశోభలను ప్రవర్తింపజేయుము. పార్వతి శివునకు సన్నిహితురాలైనప్పుడు నీవు మోహబాణములను ప్రయోగింపుము. శివపార్వతులకు పరస్పరానురాగము కలిగి వారిద్దరికిని సమాగమమేర్పడినచో రుద్రపుత్రుడు జన్మించి తారకాసురవధ జరుగును. దేవతలకు పరపీడనముపోవును. ఈ ప్రకారము చేయుమని వానిని పంపెను.


మన్మధుడును ఇంద్రుని యాజ్ఞను పాటించి మిత్రుడగు వసంతునితోను , భార్యయగు రతీదేవితోను , మలయానిలాది పరివారముతోను శివుడున్న తపోభూమికి పోయెను.


అకాలమున వసంతకాలము ఆ ప్రాంతమున విజృంభించెను. ఆ ప్రాంతమంతయును బహువిధ పుష్పసమృద్దము , మలయానిల బహుళము అయ్యెను. ఆ సమయమున తనకు పూజా పుష్పములు మున్నగువానిని సమర్పింప వచ్చిన పార్వతితో శివుడు సంభాషించుచుండెను. మన్మధుడును శివపార్వతుల సమాగమమునకిదియే తగిన సమయమని తలచెను. శివుని వెనుక భాగమున చెట్టుచాటున నిలుచుండి యొక బాణమును ప్రయోగించెను. మరలనింకొక బాణమును ప్రయోగింప సిద్దముగనుండెను. శివుడు తన మనస్సు చలించుటను గుర్తించెను. కారణమేమని విచారించెను. నిశ్చలమైన నా మనసిట్లు చంచలమగుటయేమి నాకిట్టి చాంచల్యమును కలిగించిన వారెవ్వరిని విచారించి నలువైపుల పరిశీలించెను.

బాణప్రయోగమొనర్పబోవు మన్మధుని జూచెను. తన చూపును పార్వతి నుండి మరల్చెను. మన్మధునిపై నిటలాక్షుడు తన నుదుటనున్న మూడవ కన్నును తెరచెను. లోకభీషణమైన ఆ శివుని నేత్రాగ్ని మన్మధుని వాని ధనుర్బాణములతో దహించెను.


తమ కార్యమేమగునోయని చూచుచున్నదేవతలు భయపడి కకావికలై పారిపోయిరి. వసంతుడు , మన్మధుని భార్య రతి - శివుడు తమను కూడ శిక్షించునేమో ? ఆ శిక్షయెట్లుండునోయని భయపడి కనులను మూసికొని దూరముగ పోయెను. స్త్రీ సన్నిధానము యుక్తముగాదని పరమశివుడంత్ర్దాన మయ్యెను.


మన్మధుడు చేసినపని దేవతలకు , శివునకు ఇష్టమే అయినను మన్మధునకు మాత్రము అనిష్టమైన అనర్థము కలిగినది. ఒకవేళ శివునకు దేవతలకు అనిష్టమైన పనిని చేసినచో నింక నెంతటి ఆపద మన్మధునకు కలుగునో యెవరు చెప్పగలరు ?


కావున శ్రుతకీర్తి మహారాజు ! ఇక్ష్వాకు వంశమువాడైన హేమాంగదుడు సత్పురుషులకు అనిష్టుడేయగును. సజ్జనులను గౌరవింపక పరమాత్మకు అహితమును వైకల్యము కలవారిని , అప్రసిద్ధులను ఆదరించి గౌరవించుటచే చేసినదానికి శునకాది హీనజన్మలనెత్తి బాధపడెను. కావున సాధుసేవ ముఖ్యకర్తవ్యము. అనాధలయెడ దయజాలి మితిమీరరాదు. ఈ విషయము గమనింపవలయునని శ్రుతదేవుడు వివరించెను. పరమశివునికనిష్టమును చేయుటచే మన్మధుడు తరువాతి జన్మయందును బాధలుపడెను.


పరమపుణ్యప్రదమైన ఈ కధను , రాత్రిగాని , పగలుగాని యెవరు విన్నను , జన్మ , మృత్యువు , ముసలితనము మున్నగు భయములనుండి విడువబడుదురు. అనగా వారికి జన్మాదులవలన భయము నుండదు. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి వివరించెను.



*వైశాఖ పురాణం  పదవ అధ్యాయం  సంపూర్ణం*


_*వైశాఖ పురాణం - 11 వ అధ్యాయము*_ 



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉




*రతి దుఃఖము - దేవతల ఊరడింపు*



☘☘☘☘☘☘☘☘☘



నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమహాత్మ్యమును వివరించునిట్లనెను. మిధిలాపతియగు శ్రుతకీర్తి శ్రుతదేవుని ముక్కంటి కంటిమంటకు యెర అయిన ఆ మన్మధుని జన్మయెట్టిది ? అతడు చేసిన కర్మ వలన అతడెట్టి దుఃఖముననుభవించెనో వివరింపుమని కోరెను. శ్రుతదేవుడిట్లనెను.


కుమారస్వామి జన్మకథ పవిత్రమైనది. విన్నంతనే చేసిన పాపములన్నియు నశించును. కీర్తిని , పుత్రులను కలిగించును. ధర్మబుద్దిని కలిగించును. సర్వరోగములను హరించును. అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను సావధానముగ వినుము.


శివుని కంటిమంటకు మన్మధుడు దహింపబడుటను చూచి మన్మధుని భార్యయగు రతి బూడిగప్రోగు అయిన భర్తను జూచి దుఃఖపీడితయై మూర్చిల్లెను. ముహూర్త కాలమునకు తెప్పరిల్లి బహువిధములుగ దుఃఖించెను. ఆమె దుఃఖము చూచు వారికిని దుఃఖమును కలిగించుచుండెను.


ఆమె తన భర్తతో సహగమనము చేయవలెనని తలచెను. అందులకై తగిన యేర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడగు వసంతుని తలచెను. వీరపత్నియగు ఆమె కోరిక ప్రకారము చితిని యేర్పరచుటకై వసంతుడచటకు వచ్చెను. మిత్రుని దుర్మరణమునకు, మిత్రుని భార్య దురవస్థకు విచారించుచున్న వసంతుడు రతిదేవిని ఊరడించుచునిట్లనెను. అమ్మా నేను నీ పుత్రునివంటివాడను. పుత్రుడనగు నేనుండగ నీవు సహగమనమొనర్ప వలదు. అని వసంతుడు బహువిధములుగ జెప్పినను రతి సహగమనము చేయుటకే నిశ్చయించుకొనెను. వసంతుడు ఆమె నిశ్చయమును మరలింప లేకపోయెను. ఆమె కోరినట్లు చితిని నదీతీరమున యేర్పరచెను ఆమె గంగాస్నానము చేసి సహగమనమున చేయవలసిన పనులను పూర్తిచేసి భర్తను తలచుకొనుచు చితినెక్కబోయెను. అప్పుడు ఆకాశవాణి కల్యాణీ పతిభక్తిమతీ ! అగ్ని ప్రవేశము చేయకుము. శివుని వలనను , శ్రీకృష్ణావతారము నెత్తిన శ్రీమహావిష్ణువు వలనను నీ భర్తకు రెండు జన్మలు కలవు. రెండవ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీ దేవికి ప్రద్యుమ్నుడుగా జన్మించును. నీవు బ్రహ్మశాపమున శంబరాదురుని యింటనుందువు. అప్పుడు నీ భర్తయగు ప్రద్యుమ్నుడునీతో గలసి శంబరాసురుని యింటనుండగలడు. ఆ విధముగ నీకు భర్తృసమాగమము కలదు. అందువలన అగ్ని ప్రవేశమును మానుమని పలికెను. ఆకాశవాణి మాటలను పాటించి రతి అగ్నిప్రవేశమును మానెను. తరువాత బ్రహస్పతి ఇంద్రుడు మున్నగు దేవతలు ఆచటకు వచ్చిరి. తమ ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యయగు రతిదేవిని బహువిధములుగ నూరడించిరి. ఆమెకు అనేక వరములనిచ్చిరి. శివుని కంటి మంటలో దహింపబడి శరీరము లేనివాడై అనంగుడను పేరును మన్మధుడు పొందును. నీకు మాత్రము యధాపూర్వముగ కనిపించునని ఆమెకు వారు వరములనిచ్చి యూరడించి పెక్కు ధర్మములను నుపదేశించి ఇట్లనిరి.


కల్యాణీ ! పూర్వజన్మలోనితడు సుందరుడను మహారాజు. అప్పుడును నీవే ఇతని భార్యవు. అప్పుడు రజోదోషమునందినను ఆ ధర్మములను పాటింపక పోవుటచే నీకిప్పుడీ స్థితి వచ్చినది. కావున వైశాఖమాసమున గంగాస్నానము చేయుచు వైశాఖ వ్రతము నాచరింపుము. పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తమగును. ప్రాతఃకాలమున గంగాస్నానము చేసి శ్రీమహావిష్ణువును అర్చింపుము. పూజానంతరము విష్ణు కథా శ్రవణము చేయుము. నీవిట్లు చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి అశూన్యశయన వ్రతము నాచరించు విధమును చెప్పి దేవతలు వెళ్లిరి.


రతిదేవియు అతి కష్టముపై దుఃఖమును మ్రింగి సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖమాసమున వైశాఖవ్రతము నాచరించుచు అశూన్యశయనమను వ్రతమును చేసెను. ఆ వ్రత ప్రభావమున ఆమెకు భర్తయగు మన్మధుడు కంటికి కనిపించెను. ఆమెతో యధాపూర్వముగ సుఖించుచుండెను. మన్మధుడు పూర్వజన్మలో సుందరుడను మహారాజుగనుండెను. అప్పుడతడు వైశాఖవ్రతము చేయలేదు. వైశాఖదానములను చేయలేదు. అందుచే నితడు శ్రీమహావిష్ణువు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకొనెను. విష్ణుపుత్రునికే వైశాఖవ్రతము నాచరింపకపోవు వలన నిట్టి పరిస్థితి వచ్చినచో మిగిలిన వారికేమి చెప్పవలయును ? కావున ఇహలోక సుఖముల నాశించువారు అందరును తప్పక వైశాఖవ్రతము నాచరింపవలయును సుమా !



*వైశాఖ పురాణం పదకొండవ అధ్యాయం సంపూర్ణం*

_*వైశాఖ పురాణం - 12 వ అధ్యాయము*_



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉




 *కుమారజననము*




☘☘☘☘☘☘☘☘☘




మన్మధుని దహించి శివుడంతర్ధానము చెందగా గిరిరాజ పుత్రికయగు పార్వతి నిరాశపడి యేమి చేయవలెనో తెలియనిస్థితిలో నుండెను. భయపడిన తన కుమార్తెను జూచిన హిమవంతుడును భయపడి యామెను ఇంటికి జేర్చెను. పార్వతియు పరమశివుని రూపమును , ఔదార్యాదిగుణములను జూచి నాకితడే భర్త కావలయునని తలచెను. తన తలపు తీరుటకై గంగా తీరమున తపమాచరింప నిశ్చయించెను. తల్లితండ్రి ఆత్మీయులు సుకుమారివైన నీకీ తపము వలదని వారించినను ఆమె మానలేదు.


పార్వతి గంగాతీరమును జేరి మహాలింగస్వరూపము నేర్పరచి నిరాహారియై జటాధారిణియై కొన్నివేల సంవత్సరములు పరమశివునికై తపమాచరించెను. శివుడును పార్వతిని పరీక్షింపగోరి బ్రహ్మచారి వేషమున వచ్చెను. ఆమె శివుని భర్తగా పొందుటకై తపము చేయుచున్నట్లు తెలిసికొని శివుని పరిహసించెను. నిందించెను. అయినను ఆమెకు శివునిపై గల దృఢానురాగము నెరిగి ప్రత్యక్షమై వరమును కోరుకొమ్మనెను. పార్వతి శివుని భర్తగా కోరెను. శివుడును ఆమె కోరిన వరము నిచ్చి యంతర్ధానమందెను.


శివుడు సప్తర్షులను తలచెను. శివుడు తలచినంతనే సప్తర్షులు నమస్కరించుచు వచ్చి శివుని యెదుట నిలిచిరి. శివుడు మీరు నాకై కన్యనిమ్మని హిమవంతుని  యడుగుడని చెప్పెను. సప్తర్షులు శివుని యాజ్ఞను శిరసావహించి తమ కాంతులచే దిక్కులను ప్రకాశింపజేయుచు నాకాశమార్గమున హిమవంతుని కడకేగిరి. హిమవంతుడును వారి కెదురువెళ్ళి నమస్కరించి గృహములోనికి దీసికొని వచ్చి పూజించెను. వారిని సుఖాసీనులగావించి మీరు నాయింటికి వచ్చుటచే నేను ధన్యుడనైతిని. మీవంటి తపోధనులు నాయింటికి వచ్చుట నా తపఃఫలము. పుణ్య ప్రయోజనము కల మహాత్ములగు మీకు నా వలన కాదగిన కార్యము నాజ్ఞాపించుడని ప్రార్థించెను. అప్పుడు సప్తర్షులు నీవు మాటలాడిన మాటలు యుక్తములై యున్నవి. మా రాకకు గల కారణమును వినుము. దక్షప్రజాపతి కుమార్తె సతీదేవి యజ్ఞశాలలో శరీర త్యాగము చేసి నీ కుమార్తె పార్వతిగ జన్మించినది. ఆమెకు తగిన వరుడు శివుడు తప్ప వేరెవరును ముల్లోకములయందును లేరు. ఆమె ఆనందమును కోరు నీవామెను పరమశివునకిచ్చి వివాహము చేయవలయును. వేలకొలది పూర్వజన్మల యందు నీవు చేసిన తపమిప్పటికి నీకిట్లు ఫలించినది అని పలికిరి.


హిమవంతుడును సప్తర్షుల మాటలను విని నా కుమార్తె నారచీరలను గట్టి గంగా తీరమున శివుని భర్తగా కోరి తపమాచరించుచున్నది. పరమేశ్వరుని వివాహమాడుట ఆమెకు మాకు ఇష్టమే. నేను నా కుమార్తెను మహాత్ముడగు త్రినేత్రునకిచ్చితిని. మీరు పరమేశ్వరుని వద్దకు బోయి హిమవంతునిచే కుమార్తెయగు పార్వతి నీకు ఈయబడినదని చెప్పుడు. ఈ వివాహమును మీరే నిర్వహింపుడు అని సవినయముగ పరమానందముతో బలికెను. సప్తర్షులును హిమవంతుని మాటలను విని శివుని వద్దకు వెళ్లిరి. శివునకు హిమవంతుని మాటలను చెప్పిరి.


లక్ష్మీదేవి మున్నగు దేవకాంతలు , విష్ణు మున్నగు దేవతలు షణ్మాతలు , మునులు అందరును శివపార్వతుల కల్యాణ మహోత్సవమును జూడవచ్చిరి. శివుడును సర్వదేవతాగణములు , మునులు , షణ్మాతలు పరివేష్టించియుండగా వృషభ వాహనారూఢుడై వేదఘోషతో భేరీ మృదంగప్రభృతి వాద్యధ్వనులతో బంధు పరివారములతో హిమవంతుని పట్టణమును చేరెను.


హిమవంతుడు శుభగ్రహ నిరీక్షితమగు శుభలగ్నమున పార్వతిని శివునకిచ్చి వివాహము గావించెను. వారి వివాహము ముల్లోకములకును మహోత్సవమయ్యెను. వివాహమైన తరువాత శంకరుడు పార్వతితో గలసి లోక ధర్మాను సారముగ సుఖించుచుండెను. పగలు సర్వ సంపత్సంపన్నమగు హిమవంతుని ఇంటను , రాత్రులయందు సరస్తీరముల యందు , పుష్ప ఫల సమృద్ధములగు వనములయందు మనోహరములగు పర్వత సీమలయందును శివపార్వతులు స్వేచ్చావిహారములతో సుఖించుచుండిరి. ఈ విధముగ కొన్ని వేల సంవత్సరములు గడచినవి.


ఇంద్రుని శాసనముననుసరించి ఆ కాలమున సంయోగమున నేర్పడిన గర్భము మరల సంయోగమున స్రవించెడిది. అందుచే శివుని కలయిక వలన పార్వతీదేవికేర్పడిన గర్భము శివపార్వతుల పునస్సమాగమముచే పోయెడిది. ఈ విధముగ గర్భస్రావములు జరుగుచుండెను. పార్వతీ గర్భము నిలుచుటలేదు. శివుని వలన పార్వతికి కలిగిన గర్భము నిలువకపోవుటచే పార్వతీ గర్భమున బుట్టిన రుద్రపుత్రుని వలన తారకాసుర వినాశమున కెదురు చూచుచున్న దేవతలకు ఆశాభంగము నిరాశ కలిగి విచారమధికమయ్యెను.


వారందరు నొకచోట కలిసికొని పరమేశ్వరుడు నిత్యము రతాసక్తుడై యున్నాడు. ఇందువలన గర్భములు నిలుచుట లేదు. కావున శివునకు పార్వతితో మరల కలయిక లేకుండునట్లు చేయవలయును. ఇట్లు చేయుటకు అగ్నియే తగినవాడని నిశ్చయించిరి. అగ్నిహోత్రుని పిలిచి అగ్నిదేవా ! నీవు దేవతలకు ముఖము వంటివాడవు. దేవతలకు బంధువువు. నీవు ఇప్పుడు శివపార్వతులు విహరించుచోటకు పొమ్ము. రతాంతమున శివుని దర్శించి శివపార్వతులకు మరల కలయిక లేకుండునట్లు వ్యవహరింపుము. వారికి పునస్సంగమము లేనిచో పార్వతి గర్భము నిలుచును. రతాంతమున నిన్ను జూచి పార్వతీదేవి సిగ్గుపడి తొలగిపోవును. అందుచే వారికి మరల పునస్సంగమముండదు. శివపార్వతుల రతాంతమున నీవు శివునకెదురు నిలిచి శిష్యుడవై వేదాంత విషయమును ప్రశ్నింపుము. శివుడు నీ సందేహమును తీర్చును. ఈ విధముగనైనచో గర్భవతియగు పార్వతి పుత్రుని ప్రసవించును. తారకాసురుడు రుద్రపుత్రునిచే నిహతుడగును. మన కష్టములు తీరునని దేవతలు అగ్నిని ప్రార్థించిరి. అగ్నియు దేవతల ప్రార్థన నంగీకరించి శివపార్వతులున్నచోటకు బోయెను. శివపార్వతుల సంగమమున శివుని వీర్యము విముక్తము కాకుండగనే అగ్ని శివ పార్వతుల వద్ద ప్రత్యక్షమయ్యెను. వస్త్ర విహీనయై యున్న పార్వతి అగ్ని రాకడను గమనించి సిగ్గుపడి బాధపడుచు చాటునకు బోయెను.


శివుడును పార్వతి తన దగ్గరనుండి దూరముగ వెళ్లుటచే అందుకు కారణమగు అగ్నిపై కోపించి మా సంగమమున కాటంకము చేసితివి. వీర్యపతనమునకు స్థానము కాదగిన పార్వతి ఇచ్చట లేకుండుటకు నీవే కారణము. నా యీ వీర్యమును నీవే భరింపుమని పతనోన్ముఖమైన తన వీర్యమును అగ్నియందుంచెను.


అగ్నియును దుర్భరమగు శివవీర్యమును భరింపలేక బాధపడుచు యెట్లో దేవతల యొద్దక బోయి జరిగిన దానిని వారికి చెప్పెను. దేవతలును అగ్నిమాటలను విని శివ వీర్యము లభించినదని సంతోషమును , ఆ వీర్యమునుండి సంతానమెట్లు కలుగునని విచారమును పొందిరి. అగ్నిలోనున్న శివవీర్యము పిండిరూపమున పెరుగుచుండెను. పురుషుడగు అగ్ని దానిని ప్రసవించుటయెట్లు విచారపడిన అగ్ని దేవతలను చేరి రక్షింపగోరెను. దేవతలు విచారించి అగ్నితో గలసి గంగానది యొద్దకు పోయిరి. ఆమెను బహు విధములుగ స్తుతించిరి. నీవు మా అందరికిని తల్లివి. అన్ని జగములకు అధిపతివి. దేవతల ప్రార్థన నంగీకరించెను. దేవతలు అగ్నికి గర్భమున విడిపించుకొను మంత్రమునుపదేశించిరి. అగ్నియు దేవతలు చెప్పిన మంత్రబలమున తనలోనున్న రుద్రవీర్యమును గంగానదిలో నుంచెను. గంగానదియు కొన్ని మాసముల తరువాత నా రుద్రవీర్యమును భరింపలేకపోయెను. దుర్భరమగు ఆ శివవీర్యమును తన తీరముననున్న రెల్లు పొదలలో విడిచెను. రెల్లు దుబ్బులోపడిన శివ వీర్యము ఆరు విధములయ్యెను.


బ్రహ్మ పంపగా వచ్చిన షట్ కృత్తికా దేవతలు ఆరు విధములుగ నున్న ఆ రుద్ర తేజస్సు నొకటిగా చేసిరి. అప్పుడు శివ తేజస్సు ఆరు ముఖములు కల పురుషాకారమై యుండెను. ఆరు ముఖములు కల ఆ రూపమచటనే ఎవరి రక్షణ లేకున్నను పెరుగు చుండెను.


ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు వృషభము నెక్కి శ్రీశైలమునకు పోవుచు ఆ ప్రాంతమును చేరిరి. అప్పుడు పార్వతీస్తనములనుండి క్షీరధారలు స్రవించినవి. పార్వతియు తన స్తనముల నుండి నిష్కారణముగ క్షీరస్రావము జరిగినందుల కాశ్చర్యపడి విశ్వాత్మకా ! నా స్తనముల నుండి క్షీరధారలిట్లు నిష్కారణముగ స్రవించుటకు కారణమేమని యడిగెను. అప్పుడు శివుడు పార్వతీ వినుము , పూర్వము మనము సంగమములో నుండగా అగ్ని వచ్చెను. అప్పుడు నీవతనిని జూచి చాటునకు పోతివి. నేనును కోపించి పతనోన్ముఖమైన నా తేజమునగ్నియందుంచితిని. అగ్నియు దానిని భరింపలేక దేవతల సహాయమున గంగానదిలో విడిచెను. గంగానదియు నా తేజమును భరింపజాలక రెల్లు పొదలో విడిచెను. ఆరు విభాగములైన ఆ తేజస్సును షట్ కృత్తికలు ఒకటిగా చేసిరి. అప్పుడు ఆరు ముఖములు కల పురుష రూపమయ్యెను. ఆ పురుష రూపమున్న చోటకు మనము వచ్చితిమి. ఇతడు నీ పుత్రుడగుచేతనే నీ స్తనములు క్షీరమును స్రవించుటచే నితడే నీ పుత్రుడు. నా తేజస్సు వలన జన్మించిన వాడు. ఇతడు శ్రీ మహావిష్ణు సమ పరాక్రమశాలి. వీనిని నీవు రక్షించి పాలింపుము. వీని వలన నీకు మిక్కిలి ప్రఖ్యాతి వచ్చునని శివుడు పార్వతితో పలికెను.


పార్వతియు శివుని మాటలను విని యా బాలుని తనయుడి యందుంచుకొని తన స్తన్యమును వానికిచ్చెను. పరమశివుని మాటలచే ఆ బాలుని యందు పుత్ర వాత్సల్యమును చూసిన పార్వతి వానియందు పుత్రస్నేహమునంది యుండెను. ఈ విధముగా నా బాలుని దీసికొని ఆమె కైలాసమునకు వెళ్ళెను. పుత్రుని లాలించుచు నామె మిక్కిలి ఆనందమునందుచుండెను.


రాజా ! పరమాద్భుతమగు కుమార జననమును నీకు వివరించితిని. దీనిని చదివినను , వినినను పుత్ర పౌత్రాభివృద్ధి నందుదురు. సందేహము లేదు. మన్మధుడు తపస్వియగు శివునిపై బాణప్రయోగమును చేసి వాని తపోదీక్షకు భంగము కలిగించి శివుని కోపమునకు దుఃఖమునందినను మరుసటి జన్మయందు వైశాఖవ్రతమును చేసి పూర్వము కంటె గొప్పవాడయ్యెను. కావున *వైశాఖమాస వ్రతము* అన్ని పాపములను పోగొట్టును , మరియు వైధవ్యమును కలిగింపదు. స్త్రీలకు భర్తలేకపోవుటను , పురుషులకు భార్య లేకపోవుటను వైధవ్యమని చెప్పవచ్చును. వైశాఖ వ్రతమును చేసి రతి దహింపబడిన మన్మధుని పొందినది. మన్మధుడును దగ్ధుడైనను వైశాఖ మహిమ వలన భార్యను పొందెను. విశాఖ అను పదము కుమారస్వామిని చెప్పును. వైశాఖ వ్రతమున విశాఖ జనన శ్రవణము పుణ్యప్రదము. శివుని కోపాగ్నికి గురి అయినను మన్మధుడు అనంగుడైనను యే వైశాఖ వ్రత మహిమ వలన సర్వోన్నతడు సర్వోత్తముడు , భార్యా ద్వితీయుడు అయ్యెనో ఆ వైశాఖవ్రతము నాచరింపని వారికి వైశాఖ స్నానము చేయని వారికి , దానము చేయనివారికి వారెన్ని ధర్మముల నాచరించిన వారైనను కష్టపరంపరలనందుదురు. ఏ ధర్మముల నాచరింపని వారైనను వైశాఖ వ్రతము నాచరించినచో వారికి అన్ని ధర్మముల నాచరించినంత పుణ్యలాభము కలుగును.



*వైశాఖ పురాణం పన్నెండవ అధ్యాయం సమాప్తం*

కర్మ సిద్థాంతం

 🌞కర్మ సిద్థాంతం చాలా కఠినమైనది🌞

🙇🙏అది ఎవ్వరికీ అర్థంకాదు 🙇🙏

మహాజ్ఞానులను కూడా మోసం చేస్తుంది "కర్మను"అనుభవించాలి .

నిందిస్తే ప్రయోజనం లేదు .

రమణ మహాశయలు వారు ప్రతిదినము  స్నానం కొరకు  నదికి పోతుండేవారు.

ఆయన వెంట కృష్ణా  అను భక్తుడు పోయెడివాడు. ఒకనాడు రమణ మహాశయులు 

నదికి పోతుంటే ఉన్నట్టుండి ,తన వెనుకనున్న కృష్ణా  తో " కృష్ణా  ! నేను కట్టుకున్న పంచెను కొంచెం చించు ".అని అన్నారు 

కృష్ణా కు అర్ధం కాలేదు .వారిద్దరూ ఒకరి వెనుక ఒకరు నడుస్తూనే ఉన్నారు .

ఇంతలో ఒక ఇటుక వచ్చి రమణ మహాశయుల కాలివేలు,మీద పడినది .

కాలి వేలు చితికింది .రక్తం కారుతుంది .ఆ రక్తాన్ని ఆపేందుకు రమణ మహాశయులు పంచెను చింపమన్నారని అర్థం చేసుకున్నాడు,కృష్ణా అప్పుడు గ్రహించాడు,వెంటనే రమణ మహాశయుల పంచెను చింపి, కట్టు కట్టాడు ,ఆనుకోకుండా జరిగిన ఆ సంఘటను గుర్తించి ,రమణ మహాశయులతో 

"మహారాజ్ ! ఇటుక వచ్చి మీ కాలివేలు మీద 

పడుతుందనే విషయము ముందే మీకు తెలుసు కదా ! మరెందుకు ఆ ఇటుక దెబ్బనుంచి తప్పుకోలేదు ? " అని ప్రశ్నించారు ,అప్పుడు రమణ మహాశయులు కృష్ణా తో " ఆలా 

జరగదు కృష్ణా ! పక్కకి తప్పుకొంటే ,ఎప్పుడో 

ఒకప్పుడు వడ్డీతో సహా కర్మను అనుభవించాల్సిందే ,రుణం ఎంత తొందరగా 

తీరిపోతే అంత మంచింది కదా ! "అని అన్నారు .

కర్మ శేషాన్ని ఎవరయినా అనుభవించ వలసిందే.

ఓం శ్రీ అరుణాచల రమణాయ నమో నమః🙇🙏

19000 HINDI SONGS with video.

 I am forwarding 19000 HINDI SONGS with video. IT IS CREDITABLE WHO MADE THIS POSSIBLE, AND *WHAT TECHNOLOGY CAN PLACE IN YOUR PALM.*


*Lata Mangeshkar (3206)* <http://www.hindigeetmala.net/singer/lata_mangeshkar.php>


*Mohammad Rafi (2019)* <http://www.hindigeetmala.net/singer/mohammad_rafi.php>


*Asha Bhosle (1624)* <http://www.hindigeetmala.net/singer/asha_bhosle.php>


*Kishore Kumar (1431)* <http://www.hindigeetmala.net/singer/kishore_kumar.php>


*Alka Yagnik (1228)* <http://www.hindigeetmala.net/singer/alka_yagnik.php>


*Udit Narayan (947)* <http://www.hindigeetmala.net/singer/udit_narayan.php>


*Mukesh (880)* <http://www.hindigeetmala.net/singer/mukesh.php>


*Kumar Sanu (800)* <http://www.hindigeetmala.net/singer/kumar_sanu.php>


*Sonu Nigam (714)* <http://www.hindigeetmala.net/singer/sonu_nigam.php>


*Sunidhi Chauhan (524)* <http://www.hindigeetmala.net/singer/sunidhi_chauhan.php>


*Anuradha Paudwal (480)* <http://www.hindigeetmala.net/singer/anuradha_paudwal.php>


*Talat Mahmood (451)* <http://www.hindigeetmala.net/singer/talat_mahmood.php>


*Shaan (352)* <http://www.hindigeetmala.net/singer/shaan.php>


*Kavita Krishnamurthy (304)* <http://www.hindigeetmala.net/singer/kavita_krishnamurthy.php>


*Abhijeet (295)* <http://www.hindigeetmala.net/singer/abhijeet.php>


*Manna De (269)* <http://www.hindigeetmala.net/singer/manna_de.php>


*Shreya Ghoshal (235)* <http://www.hindigeetmala.net/singer/shreya_ghoshal.php>


*Suraiya (226)* <http://www.hindigeetmala.net/singer/suraiya.php>


*Sadhana Sargam (220)* <http://www.hindigeetmala.net/singer/sadhana_sargam.php>


*Ghulam Ali (209)* <http://www.hindigeetmala.net/singer/ghulam_ali.php>


*Sukhwinder Singh (204)* <http://www.hindigeetmala.net/singer/sukhwinder_singh.php>


*Geeta Dutt (203)* <http://www.hindigeetmala.net/singer/geeta_dutt.php>


*Hemant Kumar (199)* <http://www.hindigeetmala.net/singer/hemant_kumar.php>


*Mahendra Kapoor (179)* <http://www.hindigeetmala.net/singer/mahendra_kapoor.php>


*Shankar Mahadevan (164)* <http://www.hindigeetmala.net/singer/shankar_mahadevan.php>


*Shamshad Begum (163)* <http://www.hindigeetmala.net/singer/shamshad_begum.php>


*Suresh Wadkar (158)* <http://www.hindigeetmala.net/singer/suresh_wadkar.php>


*Amit Kumar (155)* <http://www.hindigeetmala.net/singer/amit_kumar.php>


*Hariharan (148)* <http://www.hindigeetmala.net/singer/hariharan.php>


*Kunal Ganjawala (144)* <http://www.hindigeetmala.net/singer/kunal_ganjawala.php>


*Pankaj Udhas (144)* <http://www.hindigeetmala.net/singer/pankaj_udhas.php>


*Jagjit Singh (141)* <http://www.hindigeetmala.net/singer/jagjit_singh.php>


*K. K. (129)* <http://www.hindigeetmala.net/singer/k_k.php>


*Vinod Rathod (129)* <http://www.hindigeetmala.net/singer/vinod_rathod.php>


*S P Balasubramaniam(119)* <http://www.hindigeetmala.net/singer/s_p_balasubramaniam.php>


*Suman Kalyanpur (104)* <http://www.hindigeetmala.net/singer/suman_kalyanpur.php>


*Adnan Sami (98)* <http://www.hindigeetmala.net/singer/adnan_sami.php>


*Mohammed Aziz (91)* <http://www.hindigeetmala.net/singer/mohammed_aziz.php>


*Himesh Reshammiya (86)* <http://www.hindigeetmala.net/singer/himesh_reshammiya.php>


*Alisha Chinai (83)* <http://www.hindigeetmala.net/singer/alisha_chinai.php

స్త్రీ అంటే

 స్త్రీ అంటే అవసరం కాదు ధైర్యం..


రామునికి       —       సీత

కృష్ణునికి        —       రాధ 

ఈశునకు      —    ఈశ్వరి

మంత్రపఠనంలో —   గాయత్రి 

గ్రంధ పఠనంలో    —      గీత

దేవుని యెదుట

     వందన, అర్చన, పూజ, హారతి, ఆరాధన

     వీరికి తోడుగా  శ్రద్ధ


మన దినచర్యలో భాగంగా

ఉదయానికే—ఉష, అరుణ

సాయింత్రం     —   సంధ్య

చీకటైతే           —   జ్యోతి, దీప

పడకలో -            మేనక 

పడుకున్నాక    —   స్వప్న


చూచేటప్పుడు— నయన

వినేటప్పుడు  —   శ్రావణి

మాట్లాడునప్పుడు—వాణి

ఓరిమిలో        -వసుధ

వడ్డించేటప్పుడు-అన్నపూర్ణ

నడుస్తున్నప్పుడు—  హంస

నవ్వుచున్నప్పుడు  —  హాసిని, ప్రసన్న

అద్దంలో చూస్తే—  సుందరి

చేసేపనికి  -స్పూర్తి

పని చేయడానికి    —  స్పందన

మంచి పనికి —  పవిత్ర

ఇష్టంగాచేసే పనికి  —  ప్రీతి

నీరు త్రాగునపుడు —  గంగ

ఐస్క్రీమ్ తినేటప్పుడు —  హిమజ

సినిమా చూస్తున్నప్పుడు —  చిత్ర

అబద్ధ మాడునపుడు —  కల్పన

నిజం చెప్పేటపుడు —సత్యవతి, నిర్మల

ఆలోచనలప్పుడు  —  ఊహా, భావన

చదువుచున్నప్పుడు  —  సరస్వతి

వ్యాపారంలో      —   ప్రతిభ , ప్రగతి

సంతోషంలో—   సంతోషి

కోపంలో       —   భైరవి

ఆటలాడునప్పుడు—  ఆనంది 

గెలుపు కోసం— జయ, విజయ

గెలిచిన తర్వాత  —   కీర్తి

     

      సరిగమలు నేర్చునపుడు  —  సంగీత

      పాటలు పాడునపుడు  —  శృతి, కోకిల

      తాళం వేయునపుడు  —   లయ

      

సాహిత్య గోష్టిలో    —   కవిత 

నగరాన్ని కాపాడుతూ  —   ప్రకృతి


జీవిత గమనంలో మనతో

విద్యాభ్యాసంలో  —   విద్య

సంపాదనప్పుడు —   లక్ష్మి

చేసేవృత్తిలో        —   ప్రేరణ,

పని చేసి వచ్చాక —  శాంతి

చిన్నతనంలో — లాలన

మధ్యవయస్సులో -మాధురి

ముసలితనంలో- కరుణ, మమత

జీవితాంతం మనతో  —  “జీవిత”.🙏 


బాగుంది కదా!మన తెలుగుభాష యొక్క గొప్పతనం.


🌹💐🙏🙏

అనుష్ఠానం

 " *అనుష్ఠానం* "

 

నేను ఎప్పుడు " *అనుష్ఠానానికి* " కూచున్నా సరిగ్గా టాయిలెట్స్  కడిగే అమ్మాయి అప్పుడే వస్తుంది. మనిషి బక్కపలచగా నీరసంగా ఉంటుంది. జక్కంపూడి నుంచి రానూపోనూ 50/-ఇచ్చి ఆటో లో వస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా మంగళ,శుక్రవారాల్లోనే వస్తుంది. మొదట్లొ కొంచెం విసుక్కున్న మాట నిజమే! 


కానీ ఆ అమ్మాయికి ఆకలి, అరడజను ఆడపిల్లల ఆలనా పాలనా తప్ప మన సెంటిమెంట్ పట్టదు అని గ్రహించా.


నాలాంటి వారు నలుగురు పని చెబితేనే ఆరోజు గడుస్తుంది ఆ ఇంటిల్లిపాదికి. 

ఆటో చార్జీలు దాన్లో మళ్ళీ ఆసిడ్ బాటిల్, ఫినాయిల్ కి పెట్టుబడి పోగా మిగిలే ఏ యాభయ్యో, వందో రూపాయల కోసం మనం అసహ్యించుకునే పనిని ఆప్యాయంగా చేస్తుంది. అటువంటి అమ్మాయిని ఇవ్వాళ  శుక్రవారం.. పైగా పూజ మధ్యలో ఉన్నా..రేపురా అని ఎలా అనగలను??


అలా అంటూ.." *అన్తశ్చరతి* *భూతేషు* *

* *గుహాయామ్* *విశ్వమూర్తిషు* "అంటూ మననం చేస్తుంటే  పూజిస్తున్న దేవుడు తెల్లబోడూ?? 


చదువుతున్నది ఏమిటి, చేస్తున్నది ఏమిటి?? అని అడిగితే మొహం ఎక్కడ పెట్టుకోను?? అందుకే పూజ ఆపి ఆ అమ్మాయి పని అయి పంపాకే శేషానుష్ఠానాన్ని సాగిస్తున్నా.


 *ఇక్కడే* *నాకు* *సందేహం* ** వచ్చింది!!


అసలు " *అనుష్ఠానం* "అంటే ఏమిటని!!??


అనుష్ఠానం ఒక పవిత్రమైన పదం. 

పదం ఎంత గంభీరమో! దాని అర్ధం కూడా అంతే గూఢం.

భగవంతుడికి సంబంధించిన పదం  కాబట్టి దీని అర్ధం  విలక్షణంగానూ విస్తృతంగానూ  ఉంటుంది.

 " *ఫలానా*లా చేస్తేనే అనుష్ఠానం *"*  అని గిరి గీసి చెప్పటానికి లేకుండా  " *గిరి* "  అంత ఉన్నతమైన విలువ కలది.  ఒక్క మాటలో చెప్పాలంటే భగవంతునిలానే అనిర్వచనీయం. 


సమాజహితం కోసం ఏకాగ్రత తో  చేసే అనుష్ఠానం, ధ్యానం లేదా తపస్సు ఒక దృఢమైన సంకల్పశక్తి గా లోకకల్యాణానికి  ఎలా మారుతుందో! మహానుభావుల చరిత్ర చూస్తే తెలుస్తుంది.


మరి మనం అలా చెయ్యాలంటే అంత మానసిక శారీరక తుష్టి పుష్టి మనకి ఉందా? అంత ఏకాగ్రత మనం సంపాదించుకోగలమా?? ఖచ్చితంగా నాలాంటి వాడు చెయ్యలేడనే చెప్పాలి. మరి సమాజానికి మన అనుష్ఠానం ఉపయోగపడటం ఎలా??


ఎలా అంటే, " *మన* *స్థాయిలో* *సమాజానికి* " ఉపయోగపడేలా మనం చేసే  ప్రతీ చర్యా అనుష్ఠానమే. అలాంటి అనుష్ఠానాలు అవలోకించి చూస్తే అడుగడుగునా బోలెడు.


ఉదాహరణకు జోరున వర్షం పడుతోంది.పక్కవాటా వాళ్ళు లేరు.కానీ వారు ఆరేసిన బట్టలు వానలో తడుస్తున్నాయి. వెంటనే మీరు అవి తీసి మడతబెట్టి  రాగానే ఇస్తే  వాళ్ళు ఎంత ఆనందిస్తారో కదా?


తెల్లవారుజామున మీరు జిమ్ కని బండి మీద వెళ్తున్నారు. ఇంతలో ఒక పెద్దమనిషి చేతిలో సూట్ కేస్ తో అటూ ఇటూ ఆదుర్దాగా చూస్తున్నాడు.

మీకు అర్ధం అయ్యింది ! ఆయన స్టేషన్ కి వెళ్లాలని. కనుచూపుమేరలో ఆటో కనపడటం లేదు. పోనీ మీ పని అంత అర్జంట్ కానప్పుడు ఆగి స్టేషన్ దగ్గర దింపితే ఆయన కి ఎంత ఊరట!! రైలు లో కూచొని " *దైవం* *మానుష* *రూపేణా* "!! అన్నట్లు " దేముడిలా అతనెవరో దించాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఏమయ్యేది?"  అన్న  ఆయన *కృతజ్ఞతా* *తలంపు*  మీకు ఎంత పెద్ద దీవెన!! 

ఇలాంటివన్నీ అనుష్ఠానాలు కాదూ!!


పండగ వచ్చింది. లాక్ డౌన్ మూలంగా పక్కవారు ఎక్కడో ఉండిపోయారు. పండగ రోజు  కాస్త ముగ్గు, నాలుగు మామిడాకులు వాళ్ళ గుమ్మం ముందు ఉంచితే  మన బతుకు *పచ్చ* *తోరణం* అవ్వదూ!!


 * మన నోటికి భయపడి జోరు వర్షం లో కూడా మానకుండా వచ్చే పనిమనిషికి మనం తాగే కాఫీ లాంటిది ఇస్తే ఆ అమ్మాయి లో కలిగే 

 *అల్ప* *కృతఙ్ఞత* మనకి 

అనల్పసంతోష హేతువవ్వదూ!!


మన ఇంట్లో మనం తినటం కన్నా పక్క ఇంట్లో భోజనానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత సంతోషంగా వడ్డిస్తారో అలాగే మన ఒంట్లో భగవానుడు..పక్క ఒంట్లో వాడికి పెడితే అంతగానూ సంతోషపడతాడు కదా!!.


భార్య శ్రద్ధగా వంట చేసి పెడుతుంటే మెచ్చుకోవడం,

పక్కవాడి తులసిమొక్కకి కాసిని నీళ్లు పోయడం,

వాళ్ళ కుక్కకి అన్నం పెట్టడం..ఇలా ఎన్ని రకాల అనుష్ఠానాలని!!


చీరల షాపులో  పనిచేసేవారికి సరైన పౌష్ఠీ కాహారం ఎక్కడ ఉంటుంది?? పైగా షాపులో ఉన్నంతసేపు అలా నుంచొని ఉండాల్సిందే.!!.డజన్లకొద్దీ చీరలు తీయిస్తూ, 

ఆ సేల్స్ గర్ల్ సహనాన్ని పరీక్షిస్తూ, ఒక చీర కనీసం జాకెట్ కూడా తీసుకోకుండా వెళ్ళేవాళ్ళు ఎందరో??

ఆ అమ్మాయికి " *అమ్మే* *తెలివితేటలు* *లేవని* "  ఓనర్ తిట్టే అరుపులు మన చెవికి వినపడవు. గతిలేని ఆ అమ్మాయి కన్నీరు మనకి కనపడదు...ఇది గ్రహించని మనం చేసే పూజకి పరమార్థం ఉందంటారా??


ఎక్కే గుమ్మం దిగేగుమ్మం గా ఉద్యోగాలు చేసేవారు.. ఉంటారు. 

ఉదాహరణకు కేబుల్ టీవీ వాళ్ళుబిల్లు కోసం మూడంతస్తులు ఆయాసపడి ఎక్కివస్తే " *మళ్ళీ* *రండి* "అని విసుక్కోకుండా  వెంటనే కట్టేస్తే ఆ చిరుద్యోగి  " అందరూ ఇలా ఉంటే ఎంత బాగుండు!!" అనుకోడూ!! అతనికి లభించిన ఆ *చిన్న* *స్వాంతన* భగవంతుడు మీ వైపు చూసేలా చెయ్యదూ?


ఒక చిన్న సైకిల్ మూలంగా మొత్తం ట్రాఫిక్ ఆగిపోతే ఎవరికి వారు నామోషీకి పోయి కార్లు, బళ్ల మీద బిర్రబిగుసుకుని కూచోకుండా ఆ సైకిల్ మీరు జరిపితే కొంతైనా సంస్కారం ఉన్న వ్యక్తులు మీ వైపు కృతజ్ఞతతో చూసే చూపు మీ వైటల్ ఎనర్జీ ని రెట్టింపు చెయ్యదూ??


ఏదో వీక్ ఎండ్ లో మీరు ఏ పుణ్యక్షేత్ర మో వెళ్తున్నప్పుడు మీ కుటుంబసభ్యులు తో బాటు ఏ బీదవారినో ఒకర్ని తీసుకెళ్లి దర్శనం చేయిస్తే గుళ్లో దేముడు బోల్డు సంతోష పడిపోడూ?? 


మన ఇంట్లో పూచినవో, కాచినవో నలుగురికీ మనస్ఫూర్తిగా అందిస్తే,  ఆ చెట్లు మరింత ఇవ్వడానికి సిద్దమవుతాయట. వాటి సగటు ఆయుర్దాయం కూడా  పెరుగుతుందని చదివా. మనఇంటి పూలతో నలుగురూ చేసే పూజ, మన కాయలతో చేసే వైద్యమో,  నైవేద్యమో!! ఎంత మంది చేస్తే  అంత  అనుష్ఠానం మనం చేస్తున్నట్లు కాదూ!!


 నేను చూస్తూ ఉంటా..చాలామంది ఇంట్లో చెత్త ని రోడ్డు మీద ఎవరూ చూడట్లేదన్న భ్రమలో ఇంకోరి ఇంటిముందు పారపోసేస్తూంటారు.

కొంతమంది చెత్త బుట్ట లో వేస్తారు కానీ దాన్లో కుమ్మరించడం వలన తీసుకెళ్లే పారిశుధ్య కార్మికులకు ఎంతో అవస్థ. కొన్ని చెత్తబుట్టలు చిల్లులు పడినా మార్చరు.. వాటినుంచి చెత్తరాలుతూ, కారుతూ ఉంటుంది..తినడానికి, సినిమాలకి పెడతాం కానీ చెత్త బుట్ట మంచిది కొననే కొనం.


పాపం ఆకార్మికుడు మనసు కష్టపెట్టుకున్నా మనకి చెప్పే ధైర్యం అతనికి ఉండదు. చెత్త నంతటినీ కారి బాగ్స్ లో పెట్టి వేస్తే తీసుకెళ్లే అతనికి ఎంత సౌకర్యంగా ఉంటుంది!!   ఇలాంటి *చిన్న* *సామాజిక* *బాధ్యత* ని గుర్తించి మన వంతు కర్తవ్యాన్ని మనము నిర్వహిస్తే అంతకన్నా పెద్ద అనుష్ఠానం ఇంకేముంటుంది??


చివరిగా ఒక ఆహ్లాదమైన అనుష్ఠానాన్ని చెబుతా..


ఆ మధ్య "హంసల దీవి " కి వెళ్ళా...నాకు తెలుసు అక్కడ బెస్తవారి పిల్లలు ఉంటారు. వాళ్ళకి చేపలు, సముద్రం తప్ప వేరే లోకం తెలియదు. 

కార్లు, బైకులు వేసుకొచ్చి సముద్రంలో దిగి ఆటలాడుతూ తింటూ, తాగుతూ ఉండే మనుష్యులని ఆశ్చర్యంగా ఆశగా చూస్తూ దూరంగా ఉంటారు.


నేను వారికి సర్ ప్రైజ్ ఇద్దామని "కొన్ని వేఫర్లు..కొన్ని మిల్క్ డైరీ చాకలెట్స్ తీసుకెళ్లి పిలిచా"  అవి చూపిస్తూ. 


ముందు రామంటూ అడ్డంగా తల ఊపుతూ పారిపోయారు. తర్వాత దూరంగా నన్ను చూస్తూ నిలబడ్డారు. ఒకళ్లిద్దరు గుడిసె లో దూరి వాళ్ళమ్మకి చెప్పినట్లున్నారు. ఆవిడ తల బైట పెట్టి నన్ను చూసి ఏమనుకుందో ఏమో!! వాళ్ళకి ఏదో చెప్పింది. 

అప్పుడు వాళ్ళు భయం భయం గానే దగ్గరకి వచ్చారు. అప్పుడు నేను చాకలెట్స్ ఇస్తూ వాళ్ళ వివరాలు కనుక్కుంటూ కబుర్లు చెప్పా. 


 ఆ వేఫర్స్, చాకలెట్స్..వాళ్ళు ఎప్పుడూ తినలేదట!.ఎవరూ ఇవ్వలేదట!! అసలు వాళ్ళని చేరదీసి ఇలా పలకరించింది లేదనే !చెప్పారు. 

మాటల్లో సముద్రం గురించి ఎన్ని విషయా లు చెప్పారో?? ఆశ్చర్యం వేసింది.

 "అలలు, వారి వలలు 

చేపలు , తెరచాపలూ

బోటులు,  కడలి అటు పోటులూ"..

ఇలా మా మధ్య స్నేహం కుదిరిన ఆ గంట అలా అలలా జారిపోయింది..నా హృదయం అల జారిన మెత్తని ఇసుకగా మారిపోయింది.


కొందరు ఆ చాక్ లెట్స్ కాగితాలు దాచుకున్నారు జేబుల్లో. 

ఆడపిల్లలయితే నెమ్మదిగా తింటూనే ఉన్నారు. 

చెలియల కట్ట దాటిన ఆ చిన్నారుల స్వచ్ఛ దరహాస తరంగాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. పరుగున వెళ్లి   వాళ్ళు దాచుకున్న గవ్వలూ, ఆల్చిప్పలు,నత్తగుల్లలు..ఇత్యాదివి పోటీపడి చూపించారు.  " *అచ్చంగా* *నన్ను* ** *తీసుకోమని* "  ఒకరిద్దరు కోరారు కూడా. నాకు ఏదో ఒకటి ఇవ్వాలన్న ఆ  " *శైశవతపన* " చూస్తే  ఎంత ముచ్చటేసిందో!!


నేనిచ్చిన  చిన్న కానుక్కే వాళ్ళ మొహాలు లైట్ హౌస్ లా మారి వింతకాంతిపుంజం విరబూసి జీవితం పట్ల నా కున్న దృక్కోణానికి దిశానిర్దేశం చేసాయా ?? అనిపించింది.


చాలు ఈ జీవితానికి!!  ఆ పసిమనసుల సమక్షంలో నేను చేసుకున్న ఈ " *చిన్ని* ** *అనుష్ఠానం* " . *


 ఇలా చేసే "అనుష్ఠానాలు" కాకుండా కొన్ని  చేయకుండా ఉంటే "అనుష్ఠానాలుగా" మారేవి ఉన్నాయి.  


ఉదాహరణకు

తన దారిన తాను పోతున్న కుక్కనో, పందినో ఊరికే కొట్టడం,  నడుస్తున్న వారి మీద  రోడ్డుపై నిలిచిన వాననీళ్లు పడేలా బళ్లు వేగంగా నడపడం, 

అందుతున్నాయికదా!! అని అనుమతి లేకుండా పక్కవారి పూలు కాయలు కోసేయడం ఇలాంటివి చేయకుండా ఉంటే అనుష్ఠానం చేసినట్లే!!


ఇలా రాస్తూ పోతే ఎన్ని రకాల అనుష్ఠానాలైనా చెప్పచ్చు , చేస్తూ పోవచ్చు..

తోటివారి ని సంతోష పెట్టేదో, సాటివారి కన్నీరు తుడిచేదో!! ఏదైనా " *అనుష్ఠానమే* "

మీరూ ఆలోచించండి...ఆరంభించండి.

 *శరీరానికి*ఎంత* *కాంతి* 

* *మనసుకి* *ఎంత* *శాంతి* !!

I gave him 200.

 My friend who is Anti Modi, asked me to give 1 reason to Vote for Modi.


I gave him 200.


Here are 200 reasons to vote for Modi:


1. Fragile five to Fastest growing economy - India 


2. 11th largest to 5th largest economy - India


3. Share of world GDP from 2.43% in 2014 to 3.08% in 2018


4. Average GDP 7.3% against 6.7% in previous regime


5. Forex reserves from 300 bn USD in 2014 to 420 bn USD in 2018


6. Doubling of FDI inflow from 36 bn USD in 2014 to 66 billion USD in 2018


7. Inflation less than 2.3 % (Nov 18) against 10.1% in 2014


8. Growth of sensex from 24,121.74 in 2014 to 36,395.03 on 12 Feb 19 (50.88%)


9. Fiscal deficit under control 


10. Per capita income increased by 45% from Rs 86,647 in 2014 to Rs 1,25,397


11. IT exemption from 2 lakh in 2014 to 5 lakh (effectively 9.85 lakh with home loan)


12. Restaurant bills tax reduced from 18% in 2014 to 5% 


13. Transaction charges through card down from 1% to 0%, domestic money transfer fee down from Rs 5 in 2014 to zero


14. Financial inclusion (32 crore bank accounts with 260 billion worth deposits). Almost 100% coverage from earlier 50%


15. DBT (savings of 83000 crores @ 15000 crore annually), No of govt schemes DBT applied to increased from 34 in 2014 to  433, 2.7 lakh fake mid-day meal students, 3.3 crore fake LPG connections, 87 lakh fake MNREGA job cards, 3 crore fake ration cards eliminated


16. Zero IT for businesses with turnover upto 60 lakhs


17. GST  exemplifying cooperative federalism, rates of 83 items down from pre-GST rates, out of 1211 items only 35 items in above 18% slab, 39% reduction of cost of basic household items. Average 1 lk crore monthly revenue through GST collection. Exempted for business upto 40 lk


18. Insolvency and Bankruptcy Code, constitution of NCLT, 3 lakh crores of NPAs recovered, 66 cases resolved, 260 cases liquidated, resolution of stressed assets, 2100 companies pay back 83000 crore to banks settling their pending loan repayments


19. 75 billion $ or Yen to Rupee exchange agreement with Japan


20. 1 lakh shell companies deregistered, FCRA licenses of 4800 NGOs cancelled


21. Fugitive Economic Offenders Bill, properties of economic fugitives seized and auctioned


22. 1.9 lakh km of rural roads. Rural road connectivity at 91% from 55%


23. 36 new airports, from 65 in 7 decades to 106, all states now in air connectivity map


24. Effective international diplomacy following 59 visits to nations, 38 single, 10 double, 3 triple and 2 quadruple visits by PM.(Seen during Airstrikes,No Country opposed India)


25. Benami Act for action against Money Laundering


26. Rural sanitation coverage 95 % up from 39% (8.8 crore toilets)


27. Solar energy capacity increased 8 fold from 2.63 GW to 22 GW, 19. 8.5 GW of biogas grid installed. 


28. Ganga waterway transportation, usage by shipping giant Maersk, cost of transportation reduced from 10/ton (road) / Rs 6/ton (rail) to Re 1/ton


29. More than 2.4 crore households lit up, rural electricity coverage to households up from 70 to 95%, only 19836 homes remain (in Chhatisgarh) out of 2,48,09,235 


30. Electricity accessibility rank jump from 99 in 2014 to 26 in 2019


31. 7 crore new gas connections to 3.5 crore households @69000 conections per day, coverage 90% from 55%, 82% return for refill, 42% beneficiaries Dalits


32. 14.4 crore mudra loans worth Rs 7 lakh crore disbursed


33. 18000 remote villages connected with electricity


34. 2.92 lakh km of optical fibre laid, 0.02% to 50% gram Panchayat connectivity


35. Swachh bharat mission has saved, according to WHO, 3 lakh lives and will save 1.5 lakh lives per year.


36. IT filers increase from 3.79 crore to 6.08 crore, enterprises registered for indirect tax up from 64 lk to 118 lakh


37. Entry of India in global regimes Missile Technology Control regime (MTCR), WA (Wassenaar Arrangement) and Australia Group


38. 17 crore soil health cards


39. 1.5 crore houses built, 91.37 crore in rural areas and 13.5 lakh in urban areas against 25 lakh houses built between 2010-2014. House for all target year is 2022.


40. 1,78,346 houses built in NE over existing 2875 houses built till 2014


41. Home loan interest rate down from 10.3 % in 2014 to 8.4% in 2018, annual savings of Rs 47,160 for 30 lakhs over 30 years, no GST on affordable housing, 5% on remaining


42. Trading agreement in rupee with Iran and UAE


43. Common service centres up from 84k to 3 Lakh


44. OROP implemented after 43 years, 35000 crores disbursed to 8 crore veterans


45. India's vaccination programme Indradhanush amongst 12 best practices of world


46. 5035 Jan Aushadhi and - 1054 medicines under price control (60-90% discounts).


47. More than 150 Amrit stores, reduction of cost of cromium cobalt Knee implant from 1.58-2.5 lakh to 54,720 and high flex implant from Rs181728 to 56490 (69%), 85% reduction in cardiac stent price to Rs 28000


48. 87% reduction in 400 cancer drugs


49. Rate of Interest on higher education loans dropped from 14.75 in 2013 to 10.88% in 2019, savings of 1.18 lakh on 10 lakh loan over tenure of 60 months, Rs 2000 savings on EMI


50. Data revolution: Cost of 1 GB $0.26 in India against $12.37 in US, $6.66 in UK and $75.2 in Zimbabwe. Unlimited mobile+ 45 Gb data = Rs 150 against Rs 1000 in 2013; annual savings of 10,200


51. Katra rail line work completed after 16 years


52. Dhola Sadiya bridge work completed after 16 years


53. Sardar Sarovar Dam work completed after 15 years


54. Aadhaar act


55. Pakyong airport completed after 10 years


56. Chennai Nashri Tunnel after 10 years


57. Assam NRC after 40 years


58. National War Memorial after 50 years


59. NE cpas after 60 years


60. Kollam bypass after 43 years


61. Indo-Bangladesh enclaves after 42 years


62. Bansagar canal project after 40 years


63. Bogibeel bridge after 23 years


64. Western peri expressway after 15 years


65. Kota Chambal bridge after 11 years


66. Maibang-Lumding Stretch completed


67. Delhi Meerut Expressway completed


68. Ganga Expressway project (world's longest) underway


69. Metros in Ahmedabad, Nagpur, Jaipur, Lucknow, Washermenpet


70. All umanned level crossings eliminated


71. Ayushman Bharat: annual 5 lakh health care to every family, 15.05 lakh hospital admissions for secondary/ tertiary treatment, 2.4 crore e-cards generated as on 10 Mar 19 in 170 days. Target 50 crore people.


72. 59minutes loan portal: 92,000 loan applications of MSME amounting to 30,000 crores approved, 6000 crores sanctioned till Nov 18


73. 87% of farming house (owning land of 2 hctrs) or 12 cr ppl to get kisaan sammaan nidhi of Rs 6000 pr year. Rs 5215 cr transferred directly to 2.6 crore farmers in 37 days (for households with holding less than 0.01 hectares incm per month so far was Rs 8136 agnst exp of 6594


74. 1.5 million electric rickshaws


75. Procurement of 36 Rafale on Government to Government Basis avoiding middlemen


76. 05 billion$ S 400 Triumf air defence missile system deal with Russia


77. 145 M777 howitzer deal


78. 22 Apache AH 64E multi-role combat helos


79. 200 KA-226T helicopters


80. 56 EADS CASA C-295 transport aircraft


81. 15 CH 47 Chinook tactical transport helicopters


82. 2.3 lakh Bullet proof jackets


83. 1.6 lakh Bullet-proof helmets


84. 777 mn USD Barak 8 LRSAM contract


85. 5 bn USD S-400 air defence systems


86. 10 Heron TP armed drones


87. 4 additional P8I MR aircraft


88. 40 units of Laser sensor border fence installed


89. 72,400 Sig Sauer Assault rifles


90. 100 self-propelled K9 Vajra howitzers


91. 700000 AK-103 Kalashnikov assault rifles indigenous facility


92. Surgical strikes in Myanmar, across LoC and in Pakistan. Only Country to bomb a Nuclear Powered Country


93. 240 million visitors at Kumbh Mela 2019, cost 4236 crores @ Rs 177 per tourist, revenue 1.2 Lakh crores


94. 833 teraflop supercomputer Param Shivay by IIT BHU at Rs 32.5 crores


95. Divisional status to Ladakh


96. 470 bed ESIC hospital in Ennore


97. 100 bed ESIC hospital in Tiruppur


98. Namami Gange - Ganga is 30% cleaner, 83 out of 97 ganga towns and 4456 villages achieved ODF status, 08 out of 16 drains emptying 16 crore l sewage into Ganga tapped. Target date Mar 2020 


99. 5,45,122 ODF villages, 598 ODF districts, 27 ODF states/ villages


101. RERA implementation


102. Udaan scheme - flight cost down from Rs 5000/1000 km in 2013 to 3400/1000 km in 2018, 34 airports operationalised, small towns connected, all states on aerial 


103. Preventive conservation of 39275570 folios, curative conservation of 3656863 filios, digitisation of 2.83 lakh manuscripts consisting of 2.93 crore pages


104. India is now world's largest 2-wheeler manufacturer, 2nd largest smartphone manufacturer (94% of mobiles sold now made in India), 4th largest automaker, 2nd largest steel producer


105. 5100 m Mandvi Bridge in Goa in 3.5 years


106. Ease of doing Business ranking jump from 134 in 2014 to 77 in 2019


107. Therubali - Singapur Bridge No 588


108. Restoration of Asurgarh Fort, Kalahandi


109. GeM portal with 731431 product categories, 180,862 registered sellers and 32114 govt buyers


110. 10% EWS reservation


111. 40% of ongoing 700 NH projects completed, adding 40,039 km between 2014-18 against 91,287 km between 1947-2014


112. Highway construction rate jumped from 12 km/day in 2014 to 27 km/day in 2019


113. 101 terrorists and 11 offenders extradited


114. 90,000 ex-partite Indians evacuated


115. Chabahar port, Sittwe port and Duqm port


116. Military installation in Seychelles


117. International logistics agreements with US, France and Singapore


118. Work underway on 25 MLD ZLD Common Effluent Treatment Plant at Gujarat Eco Textile Park and will save 25 million litres of water per day


119. Beautification of 65 railway stations, all stations fitted with LED lights, wi-fi, multi-brand food centres, kiosks, executive lounges, lifts (445 from 97 in 2014), escalators (603 from 199 in 2014), travellators and ramps


120. Record number of foot over bridges built


121. 871 new train services


122. 180 new rail lines


123. Dedicated railway freight corridor - 2 sections completed


124. 100% electrification of railways underway, first solar powered railway station (Guwahati). First solar powered train (world's second), savings of Rs 40 Lakhs and 90,000 ltrs diesel per year


125. Make in India semi-high-speed trains - Tejas, Gatiman and Vande Bharat


126. Humsafar and Antodaya trains, Deen Dayalu and Anubhuti coaches, UDAY double decker, glass dome Vistadome coaches


127. Project Swarn and Project Utkrisht to upgrade Rajdhani/Shatabdi and Mail/Express respectively


128. Largest coach production in world at ICF, Chennai


129. No more human extreta on railway tracks. Installation of 1.37 lakh out of 2.5 lakh completed in Jun 18.


130. 400 wi-fi railway stations (Aug 18)


131. 80% reduction in rail accidents


132. 10 high speed rail corridors underway, target date 2025-26


133. Export of world class customised coaches from MCF, Rae Bareli


134. LIC and Air India register profit


135. 2300 km rail tracks constructed, speed jumped from 4.1 km/day in 2014 to 6.53 km/day in 2018


136. Neem coating of urea


137. Gokul mission - record 160 million ton milk production 


138. Online availability of CBSE and NCERT books


139. 10 crore LED bulbs distributed, 5000 crore savings


140. Investment in urban infrastructure jumped from 157703 crores to 795500 crores


141. Statue of Unity to commemorate Iron Man of India


142. Rs 2509 crore sales in Khadi


143. 482.36 million digital transactions worth Rs 74,978 crores in Oct 2018 against 0.3 million transactions worth Rs 90 crores in Nov 2016


144. 30% increase in ATMs, 208% increase of PoS machines from 10.81 lakh in May 14 to 33.32 lakh in Aug 18, 111% increase in credit cards from 1.94 crore in May 14 to 4.10 crore in Aug 18, 144% increase in debit cards from 40.17 crore to 98.02 crore


145. Ease of Doing Business Index 142 (2014) to 100 (2018)


146. Ease of getting electricity index 99 (2014) to 26 (2018)


147. UN's e-govt index 118 (2014) to 97(2018)


148. Globalisation index 112 to 107 (2018)


149. Innovation index 76 to 60 (2018)

150. Competitiveness index 71 to 39


151. Logistics performance index 54 to 35


152. Global peace index 141 to 137


153. DBR ranking 100 to 77


154. India ranks 3rd in global start up ecosystem


155. 06 crore jobs in MSME sector based on CII data


156. 448 million formal jobs based on EPFO, NPS and PPF data


157. 10 crore jobs in entrepreneurship via mudra and other schemes 


158. 80% increase in tax payers, 51.3 % increase in gross tax revenue


159. Black Money report card - Voluntary income declaration scheme (Rs 65250 crore), IT search and survey operations (35,460 crore), Pradhan Mantri Garib Kalyan Yojana(5000 crore), Benami transactions Act (4300 crore), Black Money and Imposition of Tax Act (4100 crore)


160  Rs 6000 financial assiatence for pregnant women


161/1 . Sagarmala: port capacity increase from 8 to 14.7 lakh ton, cargo up from 89 to 116 MMT 8 new national waterways including ganga waterway NW-1 and Brahmaputra waterway NW-2.


161/2. domestic cruise service between Mumbai and Goa, ro-ro services on Ghoga-Dahej reducing travel distance from 294 to 31 km


161/3. New international cruise terminals at Chennai and Goa, railway line between Haridaspur and Paradip underway, LNG import terminal at Kamarajar port, Oil berth ai Jawahar Dweep,Coal berth at Mangalore port


161/4 . deep draft Iron ore berth at Paradip berth, JNPT SEZ, Kandla and Paradip smart industrial port city, largest dry dock and international ship repair facility at CSL, modernisation of 17 fishing harbours


162. 800 km Delhi-Mumbai Expressway underway


163. Replacement of bio-toilets with upgraded vacuum bio toilets in trains underway. Order for 500 placed on experimental basis.


164. No terror strikes in hinterland


165. 103 new KVs


166. 62 new Navodaya Vidyalayas


167. 6 new IITs against  16 in previous 57 years


168. 6 new IIMs against 13 in previous 57 years


169. 7 IIITs against 7 in previous 57 years


170. 02 new IISER


171. 12 new AIIMS against 7 in previous 57 years.


172. 141 new universities against 30 in previous 57 years


173. 01 new NIT


174. Life Insurances @ Rs 12 annual and @ Rs 12 monthly premiums


175. Atal Pension Yojana


176. Pension to 42 crore people of unorganised sector


177. Ambedkar memorial


178. BHIM application for digital payments


179. Khelo India Initiative for tracking of athletes' development, Rs 5 lk per annum scholarship for 1000 budding athletes per year for eight years each; monthly Rs 50000 out-of -pocket exptr, 2000  PETs, salary cap of coaches doubled from Rs 1-2 lk per month, target 15 yrs


180. Special Task Force for Olympics


180. RERA Act 


181. Bullet train maiden project


182/1.

Rs 6.92 lakh crore Bharatmala project, 44 economic corridors with 9000 km road, 2000 km port connectivity, 9000km roads to connect district HQs with NH,


182/2. 

2000 km road with Nepal, Bhutan, Bangladesh and Myanmar, opening up of 185 choke points, road development to char dham, 12 greenfield expressways spanning 1900 km


183. 36 murtis retrieved and brought back to India in 2014-2019 under India Pride Project against 02 between 2000-2013, 02 in 90s, 03 in 80s, 01 in 70s and nil in 50s and 60s


184. Unemployment rate 3.8% against 13.8 % in 2013


185. India is a less-cash society now


186. Develpment of Trincomalee and Columbo port while checkmating China's Hambantota by taking operations of near by (15 km away) Mattala Rajapaksha International Airport


187. Plugging the 'double taxation avoidance' black money loophole through a new tax agreement with Mauritius


188. Deal with Switzerland for automatic tax data sharing from 01 Jan 2019


189/1

Varanasi - Varanasi ring road phase 1 completed, phase 2 underway, inland waterways terminal, Babatpur airport highway, 140 MLD Dinaput STP, facelift to railway station, big cow shelter for stray cattle, BPO centre, piped gas project, Varanasi-Balia rail project,


189/2.

Vande Bharat Express, Kashi Vishwanath temple - Ganga Ghat corridor project, renovation of all bathings ghats, LED illuminations of ghats and major roads, underground electricity cabling,


189/3.

new sewage plants, 02 cancer treatment facilities, 65th to 29th rank in swachhata sarvekshan (2016), 90%  ODF district.


190. Creation of 100 Smart cities, 100 crore per year per city for 05 years, 500 acres for retrofitting, 50 acres for redevelopment, 250 acres for green field projects, 10% of energy from renewable resources, 80% of green building construction, special purpose vehicles.


191/1

Development of 500 AMRUT cities underway, urbanization project of rejuvenation and transformation which includes beach front development, prevention of beach erosion, improvement of water supply, replacement of pipelines,


191/2.

New sewerage connections, greenery and open spaces, digital and smart facilities, e-governance, LED streetlights, public transport, storm water drainage projects in a phased manner, Target date 2022


192. Increase in Child Sex Ratio (CSR) in 104 BBBP (Beti Bachao Beti Padhao) districts, anti-natal care registration in 119 districts and institutional deliveries in 146 out of total 640 districts as in Mar 18. CSR of Haryana increased from 871 to 914.


193. International Yoga Day


194. Aspirational Districts Programme: 115 'backward' districts placed under 'prabharis' and for competitive development on the basis of 49 performance indicators, target year 2022.


195/1.

Make in India: 16.4 lakh crore investment committments, 1.5 lakh crore investment inquiries, 60 bn USD FDI, 26 sectors covered, 23 positions jump in World Bank's Doing Business Report (DBR), 32 places in WEF's  Global Competitiveness Index (GCI),


195/2

19 places in Logistics Performance Index, 42 places in Ease of Doing Business index, schemes include Bharatmala, Sagarmala, dedicate freight corridors, industrial corridors, UDAN-RCS, Bharat Broadband Network, Digital India.


196. 251 Passport Seva Kendras (PSKs) and Post Office Passport Seva kendras (POPSKs) against 77 till 2014, target of one PSK every 50 km across India.


197. Unanimous election of Justice Dalveer Bhandari to ICJ forcing UK to pull out own nominee Christopher Greenwood, demonstrating India's clout in international arena.


198. India Post Payments Bank: India's biggest banking outreach with 1.55 lakh post offices (2.5 times banking network) linked to IPPB system


199. Philip Kotler award, Seoul Peace prize, Champion of the Earth Award, Grand Collar of the State of Palestine, Amir Abdulla Khan Award, King Abdulaziz Sash award, Amir Amanullah Khan award.


200. 1900 gifts and memorabilia received by Modi auctioned and 11.7 crores added to Namami Gange fund, 1.4  c of Seoul Peace award also to Nammami Gange.


#NamoSureAgain

2024

💐🌹🙏💐🌹🙏💐

ఆయూర్వేదాన్ని 100% నమ్మొచ్చు....

 కృష్ణపట్నం ఆనందయ్య ఆయూర్వేదాన్ని 100% నమ్మొచ్చు.... 

------------------------------------------------------------ 

*ఒక కెమిస్ట్రీ లెక్చరర్ గారి  విశ్లేషణ*


 సైన్స్ పేరిట ఆ మందును హేళన చేస్తున్న వారికి ఈ పోస్ట్ అంకితం...

 ఒక సైన్స్ విద్యార్థిగాకాదు ఒక కెమిస్ట్రీ లెక్చరర్ గా అందులో ఔషధ రసాయన శాస్త్రం పాఠాలు చెప్పిన బోధకుడిగా చెప్తున్నా...

 సైన్స్ పేరిట ఆయూర్వేదాన్ని దుష్ప్రచారం చేయొద్దు.. ? 


 ఈ ప్రపంచానికి జ్జాన బిక్ష పెట్టింది భారతదేశ బౌద్ద విశ్వవిద్యాలయాలు. ఈ ప్రపంచానికి ఆరోగ్యాన్ని ప్రసాదించిన తక్షశీల, నలంద ,వల్లాభీ , విక్రమశీల లాంటి అనేక బౌద్ద విధ్యాలయాలు...

వేల సంవత్సరాల క్రితమే శరీరధర్మ శాస్త్రం , ప్రకృతి శాస్త్రం , ఆయుస్సును ఇచ్చే విజ్జానం ఆయూష్ విజ్ఞానం మీద అనేక పరిశోధనలు చేసి మానవజాతికి ఆరోగ్య బిక్ష పెట్టారు. ఈ రోజు విజ్జానానికి ఊహకు అందని   ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి మొక్క మీద పరిశోధనలు చేసి వాటి గూర్చి క్లుప్తంగా మూడు వేల సంవత్సరాల క్రితమే బోధించారు...

 మూడువేల సంవత్సరాల క్రితమే బుద్దుడి ఆస్థాన వైద్యుడు జీవకుడు శస్త్ర చికిత్సలు చేశాడు. బ్రైన్ సర్జరీ కూడా చేశాడు. 

 దేనికి ఏవిడెన్స్ కావాలి ? ఆయుర్వేదానికా...

సరే నీవు నమ్ముతున్న సైన్స్ ఎవిడెన్స్ ఇస్తున్న వైధ్యం గూర్చి నీకు తెలుసా...???

WHO ప్రమాణాలతో తయారు చేస్తున్న ఏ ఒక్క ఔషదానికైనా ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేదు అని నిరూపించండి చూద్దాము. అప్పుడు సైన్స్ అందులో అల్లోపతి సైన్స్ గూర్చి మాట్లాడదాము...

_____________ ఈ విషయాలు తర్వాత చూద్దాము.

 ప్రస్తుత కృష్ణపట్నం ఆనందయ్య కరోనా రోగులకు ఇస్తున్న ఆయూర్వేదిక్ మందు గూర్చి మాట్లాడదాము...

 ఆనందయ్య తయారు చేస్తున్న మందులో ఈ క్రింది మూలికలు వాడుతున్నాడు...

 1) అల్లం - అల్లం శ్వాసకోశ వ్యాధుల్లో ఉపయోగపడుతుందని సైన్స్ చెబుతుంది.

2) తాటిబెల్లం - ఆయుర్వేదంలో చేదు లేదా ఘాటైన మొక్కలను ఔషదంగా ఉపయోగెంచడానికి ఆ ఔషదాన్ని తాటిబెల్లంతో తీసుకుంటారు. తాటిబెల్లం రుచికి తియ్యగా ఉన్నా ఆ ఔషదం యొక్క గుణధర్మానికి నష్టం చేయదు కాబట్టి తాటిబెల్లాన్ని వాడతారు. 

3) తేనే - తేనె ను ఆయుర్వేదంలో చాలా ఔషదాల్లో వాడతారు. ఔషధాలు డైరెక్ట్ గా రక్తంలో కలవడానికి చాలా రకాల ఔషధాలను తేనెతో కలిపి తీసుకుంటారు. తేనే కు కఫాన్నీ తగ్గించే గుణధర్మం ఉంటుంది.

4 ) నల్లజిలకర్ర - ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది.

 అలసట , బలహీనతలను తగ్గిస్తుంది.

నల్లజిలకర్రకు యాంటీ మైక్రోబయాల్ లక్షణం ఉండటంచేత ఉదరంలో ఏర్పడే పురుగులను తొలగించడానికి , కడుపునొప్పికి , విరచనాల్లో మరియు గ్యాస్ట్రిక్ సమస్యల్ని తొలగిస్తుంది.

తేనే , నల్లజీలకర్ర , వెల్లుల్లి కలిపి వాడితే జలుబు , దగ్గు తగ్గుతుంది.

నల్లజిలకర్ర ఇన్సులిన్ ను అదుపులో ఉంచుతుంది కాబట్టి మధుమేహాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు.

నల్లజిలకర్ర లో క్యాల్షియం, మెగ్నీషియం ,పోటాషియం ,పాస్ఫరస్ ,జింక్ ,మాంగనీస్ ,కాపర్ మరియు ఐరన్ ఖనిజ పోషకాలు ఉన్నాయి.

నల్లజిలకర్ర లో థైమోక్వీనోన్ ఉండటంచేత ఇది బయోయాక్టీవ్ కాంపోనెంట్ గా ఉపయోగపడుతుంది.

నల్లజిలకర్ర హనీకర , సూక్ష్మజీవుల నుండి మరియు బ్యాక్టీరియా నుండి శరీరాన్ని కాపాడుతుంది.

నల్లజిలకర్ర అధిక కోవ్వును కూడా తగ్గిస్తుంది.

5 ) తోకమిరియాలు-  ఆయుర్వేదంలో తోకమిరియాలను స్వరపేటిక దోషాలను తొలగించడానికి ఉపయోగిస్తారు మరియు జలుబు , దగ్గు , కండరాల నొప్పికి తోకమిరియాలను వాడతారు.

6) లవంగాలు - లవంగాల్లో ఉండే యాంటీ బ్యాక్టిరియల్ , యాంటీ వైరల్ లక్షణాలు జలుబు ,దగ్గను నివారిస్తుంది. లవంగాల్లోని యుజెనల్ అనే పధార్థానికి శక్తివంతమైన యాంటీ ఇన్ఫామెంటరీ గుణాలు ఉండటంచేత శరీరంలో సైటోకైన్లను తగ్గిస్తుంది కాబట్టి కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. లవంగాలను తలనొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారు.

7) వేప - వేప మూడువేల సంవత్సరాల నుండి భారతదేశంలో వాడుతున్న ఒక ఔషధ మూలిక.

వేపలో సహజ కీటకనాసిని అజాదిరాచ్టిన్ కలిగి ఉంటుంది.

వేప రోగనిరోధక చర్యను మోరుఘుపరచడానికి, విభిన్న  బ్యాక్టీరియా ,వైరస్ , శిలీంధ్రం మరియు పరాన్నజీవుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది.

దగ్గు , ఆస్తమా , కఫం వంటి శ్వాసకోశ సమస్యల్లో వేప ఉపయోగపడుతుంది.

వేప తెల్లరక్తకణాలైన లింఫోసైట్స్ , మోనోసైట్స్ లను గణనీయంగా పెంచుతుంది కాబట్టి శరీరంలో సంక్రమించే సూక్ష్మ జీవులపై పోరాడుతుంది.

వేపను కడుపునొప్పి , అతిసారం ,గ్యాస్ , అల్సర్ మొదలగు రోగాలను నయం చేయడానికి ఉపయోగిస్తారు.

 8) నేరేడు - ఈ మొక్క లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల మూలంగా ఇది దివ్వ ఔషదంగా పనిచేస్తుంది. కాలేయాన్ని శుభ్రపర్చడానికి ఈ ఔషదాన్ని వాడతారు

జ్వరాన్ని తగ్గించడానికి నేరెడు చెట్టు ను వాడతారు.

ఈ మొక్క బ్యాక్టీరియల్ , వైరల్ ఇన్ఫెక్షన్ ల నుండి కాపాడుతుంది. అధిక రక్తపోటు ను నివారిస్తుంది.

9) మామిడి - కడుపులో పురుగులను తొలగించడానికి , జ్వరాన్ని తగ్గించడానికి , కాలేయసమస్యలో ఈ చెట్టును వాడతారూ.

10) నేల ఉసిరి- వైరల్ జ్వరాలకు తగ్గించడానికి ఈ మొక్కను వాడతారు. ఉదర మరియు మూత్ర సంబందిత రోగాలను తగ్గించడానికి మరియు హెపటైటిస్ -బి వైరస్ ను నిర్ములించడానికి వాడతారు.

11) కొండపల్లేరు - ఆయాసం , ఉబ్బసంను తగ్గించడానికి వాడతారు. క్షయ వ్యాధితో దగ్గు మరియు దెర్బల్యాన్ని తొలగించడానికి ఉపయోగిస్తారు.

ఈ చెట్టు మూత్ర సంబందిత రోగాలను తగ్గించడానికి మరియు సంతోష శక్తిని పెంచడానికి ఉపయోగిస్తారు.

12) కుప్పింటాకు - రోగనిరోధక శక్తిని పెంచడానికి , దగ్గు ,జలుబు , గొంతునొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారు. కడుపులో ఉన్న నూలిపురుగులను తొలగించడానికి , కీళ్ల నొప్పులకు ఈ మొక్కను వాడతారు.   

13) తెల్లజిల్లేడు పువ్వు : దీర్ఘకాలికంగా ఉన్న అస్తమాను నివారించడానికి ఉపయోగిస్తారు. ఈ మొక్క వేర్లను పాముకుటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు.

14) పట్టా , 15) బుడ్డబుడస ఆకు , 16 ) ముళ్ళ వంకాయ గూర్చి నాకు తెలియదు. తెలుసుకునే ప్రయత్నం చేస్తాను.

 ఆనందయ్య తయారుచేసిన ఔషదం కరోన రోగులకు 100% ఉపయోగపడుతుంది.

నిలువు దోపిడికి భజన చేద్దామా..??*

 *కార్పొరేట్ ఆసుపత్రుల నిలువు దోపిడికి భజన చేద్దామా..??*

*మిత్రమా..!! నాదొక చిన్న ప్రశ్న నిద్రాహారాలు మాని రేయింబవళ్ళు కష్టపడి ఆయుర్వేద మందు తయారు చేసి పైసా ప్రతిఫలం ఆశించకుండా, నిస్వార్థంగా ఉచిత కరోనా మందు పంపిణీ చేస్తున్న ఆనందయ్య గారి మందులో శాస్త్రీయత లేదు అని గగ్గోలు పెడుతున్నాం..*

*మరి నిలబెట్టి మూడు లక్షల డిపాజిట్ కట్టించుకుని రోజుకు లక్ష రూపాయలు కడితేనే వైద్యం లేకపోతే రోడ్డు పై పడేస్తామంటున్న కార్పొరేట్ ఆసుపత్రులు శాస్త్రీయత గురించి ఒక్కరైనా ప్రశ్నిస్తున్నారా..??*

*వాడు 10 రోజులు ICU లో ఉంచి 10 లక్షలు గుంజి చచ్చిపోయాడు తీసుకెళ్ళమంటే అసలు వాళ్ళు ట్రీట్మెంట్ చేశారా..?? లేక అక్కడ పడేసి పట్టించుకోకుండా డబ్బు గుంజి నిలువునా చంపారా..?? అనేదానిలో శాస్త్రీయత ఎవరైనా ప్రశ్నించారా..??*

 *అల్లోపతి లో అసలు మందే లేని వైద్యానికి రోజుకు 30 వేలు మెడిసిన్స్ వాడుతున్నాం అంటే అందులో శాస్త్రీయత ఎవరైనా ప్రశ్నించారా..??*

*అసలు అల్లోపతి లో మందేలేని కరోనాకు మల్టీ డ్రగ్ థెరపీ పేరుతో ఏది పడితే అది  వాడుతుంటే 2, 3 యాంటిబయాటిక్స్ ఒకేసారి వాడుతుంటే దానిలో శాస్త్రీయత ఎవరైనా ప్రశ్నించారా..??.*

 *WHO నిషేధించిన రెమిడెసివిర్ 40 వేలకు బ్లాక్ లో తెచ్చి వాడుతుంటే దాని ప్రయోజనం ఏమిటి..?? దాని వాడకం వల్ల కలిగే తీవ్ర దుష్పరిణామాల శాస్త్రీయత ఎవరైనా ప్రశ్నించారా..??*

*విచ్చలవిడిగా అతి భయంకరమైన స్టెరాయిడ్స్ వాడుతుంటే ఆ తర్వాత బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ లాంటి తీవ్ర దుష్పరిణామాలతో కళ్ళు, పళ్ళు, ప్రాణాలు పోతుంటే వాటి శాస్త్రీయత ఎవరైనా ప్రశ్నించారా..??*

*కానీ.. కానీ.. కానీ..* *ఆక్సిజన్ తో వచ్చిన పేషెంట్ పదినిమిషాల్లో 85 నుంచి 95 సాచ్యురేషన్ తీసుకొచ్చిన ఉచిత మందును ప్రశ్నిస్తున్నాం..??*

*ఒక్క ప్రాణ నష్టం కానీ, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కానీ లేదని వేలాది మంది ఘోషిస్తున్న ఉచిత మందును ఆపివేయాలని అంటున్నాం..*

 *ఇది ఎంత వరకు సమంజసమో మీరే ఆలోచించండి..??.* *చివరిగా ఒక్క మాట మనలాంటి మధ్యతరగతి ఎందరికో లక్షలకు లక్షలు కట్టి కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళలేక చావడం ఒక్కటే మార్గం అయితే చీకటి లో కాంతి పుంజం లా ఉన్న ఒకే ఒక ఆశ ఆనందయ్య ఉచిత మందు దానిని కూడా మాకు దూరం చేసి మా ఉసురు తీయకండి అని చేతులు జోడించి వేడుకుంటున్నాను.*

*మీకు నచ్చకపోతే ఉచిత ఆయుర్వేద మందును వదిలేయండి, కానీ నిలువు దోపిడి కార్పొరేట్ డ్రగ్ మాఫియా ఉచ్చులో మీరు పడి మా లాంటి నిర్భాగ్యుల పాలిట సంజీవని లాంటి అమృత తుల్యమైన ఉచిత ఆయుర్వేద మందును ఆపివేసి నిలువునా మీ చేతులతో మాకు మరణ శాసనం రాసే ప్రయత్నం చేయకండి అని చేతులు జోడించి మరీ మరీ ప్రార్థిస్తూ..*


*ఒక నిర్భాగ్య  సామాన్య మనిషిని..!!*

🙏🙏

ఆనందయ్య గారు ఇచ్చు కరోనా ఔషధం

 నెల్లూరు కృష్ణపట్నం శ్రీ ఆనందయ్య గారు ఇచ్చు కరోనా ఔషధంలో వాడు మూలికల పైన నా సంపూర్ణ విశ్లేషణ  - 1 . 



 *   తెల్ల జిల్లేడు పువ్వుల మొగ్గలు  - 


    ఇది శరీరముకు వేడిని కలిగించు గుణము కలిగినది . క్షయ మీద అద్బుతముగా పనిచేయును . క్షయ అనునది శ్వాస సంబంద సమస్య . ఈ పువ్వుల మొగ్గలకు నాభి , లవంగాలు కలిపి ఆయాసం , దగ్గు పైన ప్రయోగిస్తారు . గొంతులోని నంజును పోగొట్టును . క్రిమిదోషమును పోగొట్టు శక్తి కలిగినది . కఫాన్ని హరించును . ఉదరము మరియు మలము నందలి క్రిములను హరించును . 


 *  తేనె  - 


     ఇది శ్లేష్మాన్ని హరించును . గొంతులో తీగలు తీగలుగా వచ్చు శ్లేష్మాన్ని కోయును . గొంతులో శ్లేష్మం తీగలుతీగలుగా ఏర్పడినప్పుడు శ్వాసనాళాన్ని చుట్టి శ్వాస తీసుకోనివ్వకుండా చేసి మనిషిని చంపును.  ఎక్కిళ్లను హరించును . శ్వాస , కాసలను హరించును . ఇది క్రిముల వలన జనించు రోగములను హరించును . 


 *  అల్లం  -  


     ఇది కారముగా , శరీరానికి వేడి కలిగించునదిగా ఉండును . గొంతులోని నంజును , కఫమును , కంఠ రోగమును నివారణ చేయును . దగ్గు , శ్వాసరోగమును హరించును . కఫమును హరించును . అల్లపు ద్రావకం జ్వరాన్ని హరించును .

ముక్కునుంచి  నీరు కారు పీనస రోగమును హరించును . కఫము వలన కలుగు దాహరోగమును తగ్గించును . లివర్ ని శుభ్రపర్చును..



       నేను అంతకు ముందు కరోనా గురించి వివరించిన పోస్టు నందు కరోనా అనేది శరీరము నందు కఫదోషము పెంచును అని వివరించటం జరిగింది. శ్రీ ఆనందయ్య గారి ఔషధ మిశ్రమము నందు ఉపయోగించు మూలికలను పరిశీలించినప్పుడు అన్నియు శరీరము నందు వేడిని కలిగించి ప్రాణశక్తిని పెంచేవిగా ఉన్నాయి. 


     మిగిలిన  మూలికల సంపూర్ణ సమాచారాన్ని మరొక పోస్టు నందు వివరిస్తాను . 



              కాళహస్తి వేంకటేశ్వరరావు 


          అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                      9885030034

తెలంగాణ ప్రభుత్వ GO నంబర్ 248

 🚨🚨🚨🛑🛑🛑🏥🏥🏥జిల్లాలలోని ఏ ప్రయివేట్ హాస్పిటల్ లో అయినా అధిక బిల్లులు వేస్తే వెంటనే ఈ  ఫోన్ నంబర్లకు  చేయండి..

 తెలంగాణ ప్రభుత్వ GO నంబర్ 248 ప్రకారం ప్రయివేట్ హాస్పిటల్స్ వేయాల్సిన BED CHARGES MRP i. e ఒక రోజుకి 

1) Normal Bed :4000/- 

 2) Oxygen Bed : 6500/-

 3) Ventilator Bed: 9000/- 

ఇంతకంటే 1 రూపాయి మీరు ఎక్కువ కట్టినా మీరు మోసపోయినట్టే..

 కాబట్టి BE CAREFUL..

 BE ALERT..

  జిల్లాలలో అధిక బిల్లులు వేసి కోవిడ్ కరోనా పేషంట్లను దోచుకుంటున్న హాస్పిటల్స్ సమాచారం మా దృష్టికి తీసుకురండి..

మేము మీ వివరాలు గోప్యంగా ఉంచుదాం..

 STING ఆపరేషన్ చేసి మోసగాళ్లను పట్టుకుందాం..

మీ యొక్క సోషల్ మీడియా ద్వారా ఈ వీడియోని VIRAL చేయండి... 

  

 ప్రశ్నించే గొంతు &   ప్రజల సేవకుడు

 టాస్క్ ఫోర్స్ 

సీఎం క్యాంపు ఆఫీస్ నెంబర్ : 04023403999

డి ఏం హెచ్ ఓ సెల్  నెంబర్: 9705462662 

ఆర్ డి ఓ సెల్ నెంబర్ : 7680906650

డీపీవో సెల్ నెంబర్ : 99491865049

డ్రగ్ ఇన్స్పెక్టర్ సెల్ నెంబర్ : 9704199455

ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం  సెల్ నెంబర్ : 9849766789

(మంగళవారం  నుండి  అన్నీ డయాగ్నస్టిక్  సెంటర్,  ఆసుపత్రిలలో  2500 రూపాయలకే 

ఫిల్మ్  తో పాటు, ఫిల్మ్  లేకుండా అయితే  2000 రూపాయ  లకే

స్కానింగ్  జరగాలి🛑🛑🛑🛑🚨🚨🚨🏥🏥

మనకూ కట్టుబాట్లు అవసరం*

 🙏🙏*మనకూ కట్టుబాట్లు అవసరం*

బ్రాహ్మణేతరులు పౌరోహిత్యం చేయకుండా చూస్తే తప్ప మన బ్రాహ్మణులకు రాబోయే తరాలకు జీవనోపాధి ఉండదు.

ఈ మధ్య కాలంలో బ్రాహ్మణేతరులు మన కుల వృత్తి అయిన పౌరోహిత్యం లో చొరబడ్డారు.

వారికి మన నియమాలు,

సాంప్రదాయాలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల..ఎవరో చేసిన తప్పిదాలకు ,పొరపాట్లకు నిష్కారణంగా..మన బ్రాహ్మణ జాతి నిందలు మోయాల్సి వస్తుంది.

తూప్రాన్ మండలంలో జరిగిన సంఘటన ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతుంది.

ఇకనైనా మనం.

 మేల్కొందాము.

మౌనం వీడి..

మనకెందుకులే..ఎవడి పాపాన వాడే పోతాడు..దేవుడు చూసుకుంటాడు..వాళ్లకు పుట్టగతులుండవ్ లాంటివి కొంత పక్కన పెట్టి ఒక నిర్ణయానికి రావాల్సిన సమయం వచ్చింది.

మనమేం చేయలేము.ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి..రాజ్యాంగ పరంగా ఇది కుదరదు అని కొంతమంది పెద్దలు అంటారు..

కానీ మన చేతిలో ఉన్నది అయినా చేద్దాం..

ఇప్పటినుండి అయినా 

1.ఇతర కులాలను మన పౌరోహిత్యం లో ప్రోత్సహించవద్దు..

2.బ్రాహ్మనేతరులతో ఎలాంటి వైదిక కార్యక్రమాల భాగస్వామ్యం పెట్టుకోరాదు.

వీటిని భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని ఒక నియమం,కట్టుబాటు ఏర్పర్చుకుంటే బాగుంటుంది.

3.కట్టు తప్పిన వారికి ఇతర కులాల్లో ఉన్నట్టు కొన్ని నియమాలు రూపొందించుకోవాలి..

ఈ విషయంపై పెద్దలందరు,మరియు పౌరోహిత వృత్తిలో ఉన్నవారు  ఒక సమగ్ర చర్చ చేయ0డి.

చిత్తశుద్ధితో ఒక నిర్ణయం తీసుకోండి.

 బ్రాహ్మణ ఐక్యత వర్ధిల్లాలి.

జై బ్రాహ్మిన్.🌷🌷

తెలుగువారి ఊళ్ల పేర్లు

 తెలుగువారి ఊళ్ల పేర్లు – ఇంటి పేర్లు.

----------------------------------------------------


*రచన: యార్లగడ్డ* *బాలగంగాధరరావు*


ప్రతి జాతికీ ఉన్నట్టే తెలుగువారికీ ఊళ్ల పేర్లూ, ఇంటి పేర్లూ ఉన్నాయి. ఇవి ఏర్పడ్డంలో తెలుగువారికో ప్రత్యేకత ఉంది. ప్రాంతాల స్వభావాలను బట్టి ఊళ్ల పేర్లు, ఊళ్లను బట్టి, వృత్తిని బట్టి ఇంటి పేర్లు ఏర్పడ్డాయి. అలా ఏర్పడిన పద్ధతికి ఒక పరిణామం ఉంది.


తెలుగువారి ఊళ్ల పేర్లు


గ్రామనామాధ్యయనం నామవిజ్ఞానశాస్త్రంలో ఒక భాగం. గృహనామా ధ్యయనం, వ్యక్తి నామాధ్యయనం, పశుపక్ష్యాది ప్రాణి కోటికి సంబంధించిన నామాధ్యయనం, మానవకల్పిత వస్తుసముదాయానికి చెందిన నామశాస్త్రాధ్య యనం అనేవి నామ విజ్ఞానశాస్త్రం లోని ఇతర భాగాలు. ఇది భారతదేశంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న విజ్ఞానశాస్త్రం.


 గ్రామనామాలను గూర్చి, తద్వారా గ్రామనామాధ్యయన ఆవశ్యకాన్ని తెలియజెప్పడం ఈ వ్యాస లక్ష్యం.

సాధారణంగా జనావాసాలను గ్రామాలని, ఊళ్ళనీ సంభావిస్తూ వుంటాము. కాని ఇది సరికాదు. సంస్కృత శబ్దమైన గ్రామానికి, ప్రాకృత శబ్దమైన ఊరికి కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. అవి కలిగిన జనావాసాలనే గ్రామాలుగా, ఊళ్లుగా సంభావించాలి. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో గ్రామాన్ని ఇలా నిర్వచించాడు. జనావాసంలో కనీసం 500ల కుటుంబాలుండాలని, అందులో ముఖ్యంగా వ్యవసాయ కుటుంబాలధికంగా వుండాలని, చేతివృత్తుల వారు వుండాలని, స్వయంపోషకంగా ఉంటూ, దగ్గరి నగరానికి వ్యవసాయోత్పత్తులను, పాడి ఉత్పత్తులను సరఫరా చేయగలిగిన స్థితిలో వుండాలని నిర్దేశించాడు. ప్రభువులు కొత్తగా గ్రామాలను నిర్మించేటప్పుడు పై లక్షణాలను దృష్టిలో పెట్టుకుని, అవసరమైతే కొన్ని కుటుంబాలను కొత్తగా నిర్మించిన గ్రామాలకు తరలించాలని సూచించాడు. సుమతీ శతకకారుడు కూడా అన్యాపదేశంగా దేనిని ఊరని సంభావించవచ్చునో నిర్దేశించాడు. ‘అప్పిచ్చువాడు, వైద్యుడు, ఎడ తెగక పాఱునేరును ద్విజుడును చొప్పడిన ఊరనుండుము, చొప్పడ కున్నట్టి ఊరు చొరకుము’ అని అంటాడు. ఇక్కడ ఆయన ఊరు అనేదాన్ని జనావాసం అనే సామాన్యార్థంలోనే ఉపయోగించాడు. అయితే ఆ లక్షణాలున్న దానినే ఊరు అనడం సమంజసం. కాని ‘ఊరు’ అర్థం వేరు. శివాలయం లేని జనావాసాన్ని ‘కొట్టిక’ అని అనాలని మన నిఘంటుకారులు నిర్దేశించారు. ఈ అవగాహనతో పరిశీలించినపుడు జనావాసాలన్నీ ఊళ్లు కావని తేలుతుంది. కోడూరు, మేడూరు, తిరువూరు మొదలైనవి మాత్రమే ఊళ్ళు.


 పురాలు, నగరాలు, ఆబాద్‌లు (నరసాపురం, విజయనగరం, హైదరాబాదు) — ఈ పదాలకు నిఘంటువుల్లో అర్థాలు దొరుకుతాయి. పూడి (పారుపూడి), తుర్రు (మొగిలితుర్రు), కుర్రు (కేసనకుర్రు), పల్లె (చల్లపల్లె), పాడు (గూడపాడు), పెంట (పాచిపెంట) మొదలైన గ్రామనామాలలో కన్పించే పదాలకు గ్రామనామ సంబంధంగా నిఘంటువుల్లో అర్థాలు కన్పింపవు. వీటిని మరికొంత వివరంగా పరిశీలిద్దాం.


తెలుగునాట సుమారుగా 27 వేల రెవిన్యూ గ్రామాలున్నాయి.  రెట్టింపు సంఖ్యలో వాటికి శివారు గ్రామాలున్నాయి. అన్నింటికి పేర్లున్నాయి. కొన్ని సందర్భాలలో ఒకే పేరు కలిగిన జనావాసాలు రెంటికి మించిన సంఖ్యలో కూడా లేకపోలేదు. ప్రతి మనిషికి పేరున్నట్లే ప్రతి జనావాసానికి పేరుంది. పేరనేది గుర్తింపు కోసం ఏర్పడింది. అయితే ఈ పేర్లు పెట్టడంలో కొన్ని అంతరువులున్నాయి. మనుషులందరికి పేర్లున్నాయి. మానవ జనావాసాలన్నింటికి పేర్లున్నాయి. 


కాని జంతుకోటికి, వృక్షకోటికి, అలా పేర్లులేవు. పులులు, పిల్లులు, చింతచెట్లు, మామిడిచెట్లు, కాకులు, నెమళ్ళు, కుర్చీలు, బల్లలు అని అంటున్నామే తప్ప ఆ తరగతిలోని ప్రతి జంతువుకు, ప్రతి చెట్టుకు, ప్రతి వస్తువుకు విడివిడిగా పేర్లు లేవు. దీనికి కారణం మనిషికి మనిషికి ఉండే సంక్లిష్టమైనవి సంబంధాలు. ఈ సంబంధాల నుండే ప్రతి వ్యక్తిని గుర్తింపవలసిన ఆవశ్యకమేర్పడింది. అందుండే పేరు ఏర్పడింది. మనుష్యులు ఏ ఇద్దరో, ముగ్గురో, నలుగురో వుండివుంటే పేరుతో పనిలేదు. అదే విధంగా జనావాసాలు కూడా నియమితంగా వుంటే పేర్లతో పనిలేదు. జనంతో పాటు జనావాసాలు అధికం కావడంతో ఒకదాని నుండి మరొకదానిని వివక్ష చేయవలసి రావడంతో ప్రతి దానికి పేరు ఏర్పడింది. అందువల్లనే ఒకటి చల్లపల్లె అయితే మరొకటి కళ్ళేపల్లి అయింది. ఇక్కడ రెండూ పల్లెలే. కాని ఒకటి చల్ల -పల్లె, రెండవది కళ్ళే-పల్లె, మరొకటి ముని-పల్లె, ఇక్కడ పల్లె, అనేది జనావాసాన్ని సూచించే పదం. చల్ల, కళ్ళే, ముని అనేవి, అనేకంగా వున్న పల్లె అనే జనావాసాలను వివక్ష చేస్తున్నాయి. అయితే అన్నీ పల్లెలు కావు. కొన్ని పట్టణాలు, కొన్ని తుర్రులు, మరికొన్ని కుర్రులు. ఈ విధంగా జనావాసాలను సూచించే పేర్లలో ఎంతో వైవిధ్యం కన్పిస్తుంది.


ప్రతి గ్రామనామంలోను సాధారణంగా రెండు పదాలుంటాయి. కొన్ని సందర్భాలలో మూడు నాలుగు పదాలున్నవి కూడ లేకపోలేదు. రెండుపదాల కలయిక: నీరు-కొండ, పారు-పూడి, మూడు పదాల కలయిక : తూర్పు-లంక-పల్లి, దొంగల-గన్న-వరం, చెరువు-మాధవ-వరం, నాలుగు పదాలు గలవి: నీళ్ళు-లేని-తిమ్మా-పురం, భుజ-భుజ-నెల్లూరు (నెల్లు-ఊరు.) ఒకేపదం గలవి: దర్శి, తడ, కంభం, నగరం, చీకటి మొదలైనవి. రెండు పదాలు కలిగిన గ్రామనామాలలో ఉత్తర పదాలకు (-పూడి, -పర్రు, -తుర్రు), పూర్వపదాలు విశేషాలుగా ఉపకరిస్తున్నాయి. ఉదా: పారుపూడి, జబర్లపూడి, కత్తిపూడి అనే గ్రామనామాల్లో -పూడి అనేది ఉత్తరపదం. కాగా పారు-, జబర్ల, -కత్తి, అనేవి దానిపై విశేషణాలుగా చేరి మూడు స్వతంత్ర గ్రామాలకు పేర్లుగా సిద్ధించాయి. ఈ నేపథ్యంలో ఈ క్రింది గ్రామనామాలను పరిశీలించండి.


కళింగపట్నం, విశాఖపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం

మేడూరు, కోడూరు, తుళ్ళూరు.

కప్తానుపాలెం, చోడిపాలెం.

పసుమర్రు, పామర్రు, యలమర్రు.

కోగల్లు, మాగల్లు, చాగల్లు, ఈడుపుగల్లు.

విజయవాడ, నందివాడ, మర్రివాడ.

నరసాపురం, కృష్ణాపురం, పండితాపురం.

కసుకుర్రు, ఇక్కుర్రు, పాలకుర్రు.

తుంగతుర్రు, మొగలితుర్రు.

ఈలప్రోలు, పెదప్రోలు.

ఇట్లా ఎన్నో చెప్పవచ్చు. కేవలం ఏదో ఒక పేరు పెట్టడమే లక్ష్యమైతే, ఉత్తరపదంగా కన్పిస్తున్న వాటిలో ఏదో ఒక పదంపై విశేషణాలు అనేకం చేర్చితే జనావాసాలకు పేర్లు ఏర్పడి ఉండేవి. అలా కాక, పూర్వపదంలో వైవిధ్యం పాటించడమే కాక ఉత్తర పదంలో కూడ వైవిధ్యాన్ని పాటించారంటే మన ప్రాచీనుల ఉద్దేశం కేవలం ఏదో ఒక పేరు పెట్టడం కాదని బోధపడుతుంది. అంటే అవి కేవలం జనావాసాలనే కాక ఆ జనావాసాల్లో వున్న వివిధ తరగతులను, వైరుధ్యాలను బోధిస్తున్నాయని అర్థం. ఆ పదాల అర్థం తెలిస్తే ఆ వైవిధ్యం బోధపడుతుంది. 


పేర్లు పెట్టడంలో మన ప్రాచీనుల భావాలు తెలియ వస్తాయి. తెలుగు గ్రామ నామాల్లో కన్పించే ఈ వైవిధ్యాన్ని పరిశీ లించండి.

కొండ (నీరుకొండ) – గుండం (మోక్షగుండం)

గుంట (త్రోవగుంట) – తోట (మల్లెతోట)

కాలువ (కాటిగాని కాలువ) – వనం (తులసివనం)

చెరువు (మేళ్ళచెరువు) – బయలు (గుర్రాలబయలు)

కట్టుబడి (అధ్వాన్నం నారాయణ కట్టుబడి) – మంద (ఆవులమంద)

కుంట (యాతాలకుంట) – పెంట (వనిపెంట)

కొండ్రలు(చేబ్రోలు వీరప్పకొండ్రలు) – వాకిలి (యాటవాకిలి)

కటకం (ధాన్యకటకం) – కడప (దేవునికడప)

వరం (గన్నవరం) – దరి (పెన్నదరి)

ఏరు (పాలేరు) – మామిడి (దొరమామిడి)

మడక (పూడిమడక) – మడుగు (గుండ్లమడుగు)

దొరువు (పూడిరాయని దొరువు) – సముద్రం (తిమ్మసముద్రం)

రేవు (వాడరేవు) – వాడ (విజయవాడ)

రాల (దుగ్గిరాల) – మెట్ట (దిగువమెట్ట)

బండ ( గాజులబండ) – వంపు (నదివంపు)

తిప్ప (నాగాయతిప్ప) – పాలెం (కృష్ణాయపాలెం)

లోవ (ముడసరలోవ) – అంకి (పోరంకి)

లంక (కృష్ణలంక) రాయి (విజయరాయి)

గడ్డ (పులిగడ్డ) – ముక్కల (నిడుముక్కల)

కోట (దేవరకోట) – పట్టు (పూతలపట్టు)

త్రోవ (తలుపులమ్మత్రోవ) – శాత్తు (పరమశాత్తు)

నరవ (బెడుదుల నరవ) – కాణి (వరగాణి).


ఇందులో ఏవో కొన్ని తప్ప మిగిలినవి సులభంగానే బోధపడుతున్నాయి. కటకం, అడవిలో వుండే పల్లెను సూచిస్తుంది. నరవ, కొండత్రోవలో వుండే జనపదాన్ని సూచిస్తుంది. పై పదాలకు ఉదాహరణంగా చూపిన గ్రామనామాలను ప్రత్యక్షంగా చూచిన వారికి, ఆయా గ్రామాలు, ఆయా పదాలు సూచిస్తున్న పరిసరాలలోనే ఉన్నాయనేది తెలుసు.

దీనిని బట్టి మన ప్రాచీనులు తమ జనావాసాలకు పేర్లు పెట్టడంలో స్థానిక నైసర్గిక స్థితిగతులకు ఎంతో ప్రాధాన్యమిచ్చినట్లు తెలుస్తుంది. -పూడి, -పర్రు, -తుర్రు, -కుర్రు మొదలైన పదాలకు నిఘంటువుల్లో అర్థాలు కన్పింపవు. పూడి అనేది వాగులు వంకలు మొదలైన ప్రవాహాల ప్రక్కన, ఆ ప్రవాహాలకు ఏ మాత్రం వరద వచ్చినా మునిగిపోయేచోట కన్పిస్తుంది. నేడు కాలబోధకంగా ఉపయోగిస్తున్న సామెత ‘ఏండ్లు పూండ్లు గడిచా’యనేది నిజానికి ఆ అర్థంలో వచ్చింది కాదు. ఏండ్లు, పూండ్లు గడవడం అంటే ఏరులు అంటే నదులు, పూండ్లు అంటే బురదనేలలు దాటి వచ్చాయనేది అసలైన అర్థం. కాని ఈ అర్థం పెద్దన నాటికే మాసిపోయింది. పర్రు, పై స్థితికంటే ఎత్తైన భూభాగానికి వర్తిస్తుంది. తుర్రు, కుర్రు అనేవి పర్రు కంటే ఎత్తైన భూభాగాలను, ఇసుక, నల్లరేగడి కలిసిన భూములను సూచిస్తాయి. ఈ అనుబంధాలతో కూడిన గ్రామాలన్నీ, పై వివరించిన పరిసరాల్లోనే నెలకొని వుండడం గమనార్హం.


రావికంపాడు, పోలకంపాడు మొదలైన గ్రామనామాల్లో కన్పిస్తున్న ‘కమ్మ’కు నది అని అర్థం. గుండ్లకమ్మ మనం ఎరిగినదే. కృష్ణానదికి ‘పేరకమ్మ’ అనేది అచ్చపు తెనుగు పేరు. ఈ రెండు కమ్మలకు మధ్య వున్న నాడు ‘కమ్మనాడు’. ‘కమ్మగుట్టు గడప దాటదు’ అనే సామెతను కమ్మవారి కుటుంబాలలోని గుట్టు గడప దాటి బయటకు రాదనే అర్థంలో వివరించడం పరిపాటి. నిజానికిది సరికాదు. కమ్మనాటి గుట్టు కడప దాటిపోదు అని అర్థం. అంటే పాకనాడు దాటినా, రేనాడు దాటిపోదని అర్థం. ‘పెంట’ అంటే పశువులను మంద వేసే స్థలం. ‘తడ’కు సరిహద్దు అని అర్థం. గుర్రాల బయలులోని ‘బయలు’ కర్థం మేతకు వదిలే చోటు అని. పాలెం మొదటి అర్థం, పాలెగాడు వుండే చోటు. అనంతరం కాలంలో శివారు అని అర్థంలో రూఢమైంది.


పల్లె మొదట బౌద్ధుల నివాసం. పాడు జైనులుండే చోటు. వాడ శాఖా నగరానికి పేరు. చెరువు, కుంట, గుంట, కొలను, కుళం, మడుగు, కంభం మొదలైనవి పరిమాణాన్నిబట్టి జలాశయాల్ని సూచించేవి. చీకటి అంధకారం అనే అర్థంలో కాక చెట్టును సూచిస్తుంది. నెమలి, కాకి కూడ పక్షుల పేర్లు కావు. చెట్ల పేర్లే. ప్రోలు, పురానికి వికృతిగా భావించడం కద్దు. కాని ప్రోలు దేశ్యపదం. ప్రభుత్వ ఖజానా వుండే చోటు. దానిమీద అధికారి ప్రోలయ. తరువాత వ్యక్తి నామంగా మారింది. చీరాల, పేరాల, గూటాల, కడియాల మొదలైన వానిలోని ‘ఆల’ గడ్డిజాతికి చెందిన మొక్క. ఆకూ అలము అనడం మన ఎరుకలోనిదే. ‘గడ్డ’ ఏటి ఒడ్డున వున్న ఎత్తైన భూభాగాన్ని సూచిస్తుంది.


 ‘లంక’ నదీ మధ్యంలోని విశాలమైన భూభాగాన్ని, ‘తిప్ప’ అంతకంటె తక్కువ పరిమాణం గల భూభాగాన్ని సూచిస్తాయి. పిన్నదరి, వైరదరి ఆయా నదుల తీరాల నెలకొని వున్న వైనాన్ని సూచిస్తాయి.

‘వరం’ అనేది ఒకరి అనుగ్రహం వల్ల పొందిన వరం లాంటిది కాదు. వరాని కర్థం ఒక పెద్ద గ్రామంలోని కొంత భూభాగాన్ని విడదీసి ఇచ్చినది. ఆ విడదీయబడిన భూభాగం ‘వరం’. అంతేకాని ఇవ్వడమనే క్రియకు సంబంధించినది కాదు. అయితే గన్నవరం, అడవివరం ఇలాంటివి కావు. నిజానికవి గనివారం, అడివారం. చెరువు క్రింది భూమి గనివారం. క్రిందనున్న (సింహాచలం దేవస్థానానికి) భూమి ఆడివారం. వైవాకలోని ‘వాక’, పాలువాయిలోని ‘వాయి’ చిన్న ప్రవాహాలను సూచిస్తాయి.


 వినుకొండ, బెల్లంకొండ, నీరుకొండల లోని ‘కొండ’ పర్వతసూచే. కాని మానికొండ, పోలుకొండ, కొండ పాటూరులలోని ‘కొండ’ శిలాసూచి కాదు. కొండంగి అనేది గడ్డి జాతి మొక్క. దీనిని బట్టి ఇచ్చట కొండ అనేది మొక్క అని బోధ పడుతుంది. ఈ ఉదాహరణల వలన, ముందు చెప్పినట్లుగా, మన ప్రాచీనులు పరిసరాలను దృష్టిలో వుంచుకొని తమ ఆవాసాలకు పేర్లు పెట్టారని అవగతమవుతుంది.


ఇక గ్రామనామాల్లోని ప్రథమ భాగాలను పరిశీలిద్దాం. వీటిలో కూడ చాల వైవిధ్యముంది. వ్యక్తినామాలు, కులనామాలు, వృత్తి నామాలు, నైసర్గిక స్థితికి సంబంధించినవి. వృక్షాల పేర్లు, పక్షుల పేర్లు, సంఘటనల పేర్లు — ఇలా మానవ నాగరికత, సంస్కృతి వికాసాలు ముడిపడి వున్న అన్ని అంశాలు ఇందులో చోటుచేసుకున్నాయి. గ్రామనామాల్లోని వ్యక్తినామాలు ఆ గ్రామాన్ని నిర్మించిన వారి పేర, గ్రామాన్ని దానంగా పుచ్చుకొన్నవారి పేర, ప్రముఖులైన వ్యక్తుల పేర వస్తుంటాయి. కులాలు, వృత్తుల పేర్లు, వారు ముందుగా ఆ చోట నివాసమేర్పరచుకోవడం వల్ల వస్తాయి (ఉదా. మేదర మెట్ల, బోయగూడెం, బ్రాహ్మణతర్ల, రెడ్డిపాలెం, నాయుడుపేట.)

జొన్నపాడు, వరికుంట, నేలమామిడి చెలక, తాడికొండ, నెమలికల్లు, తోటకూరపాడు, రావిరేల, మర్రిబంధం, వేములదిన్నె, తుమ్మల పెంట, మద్దిపట్ల, రేణి గుంట, జమ్ములమడక, అవురుపూడి, కొడవటికల్లు, కలిగిరి, కడవ కుదురు, చింతమోటు, వెదుళ్ళచెరువు, ఈతముక్కల, గొట్టిపాడు, మెంతిదిబ్బ, పెసర్లంక, చాగర్లమూడి, సామర్లకోట, కందిమళ్ళ, బెండపూడి, వెణుతురుమిల్లి మొదలైన గ్రామనామాలలోని పూర్వ పదాలన్నీ వృక్షజాతి సంబంధులు. ఆవులెన్న, గుఱ్ఱాలబయలు, ఎడ్లపాడు, తోడేళ్ళదిబ్బ, చీమలమర్రి, వింజమూరు మొదలైనవి.


 జంతువుల పేర్లను, పక్షుల పేర్లను, గడ్డిపేర్లను సూచిస్తాయి. ‘వింజ’ అనేది ఒక నీటిపక్షి దాని ఈకలతో చేసినది వింజామర. పులిగడ్డ, పులివెందుల, పులిప్రొద్దుటూరులలోని ‘పులి’ జంతువు కాదు. పులి అంటే అనాది బంజరు. బోరుపాలెం, కొండపల్లి, బండమీదపల్లి, లోయ, లాము, నరవ, ఎదురుమొండి, నంగేగడ్డ మొదలైనవి, అవి నెలకొన్న ప్రాంతపు భూస్థితిని వ్యక్తపరుస్తాయి. ‘బోరు’ శబ్దానికర్థం మధ్యలో ఎత్తుగా వుండి, ఇరువైపులకు వాలి వున్న భూస్థితిని సూచిస్తుంది. ‘మొండి’ భూమి ఆగిపోయిన చోటును సూచిస్తుంది. లాము అంటే కొండ అంచునగల ఆవాసం. నంగే శబ్దానికర్థం రేవు. అయినవోలు, అయినంపూడి లలో గల ‘అయిన’ శబ్దానికర్థం నదివంపు తిరిగేచోట అభిముఖంగా వున్న భూభాగం అని అర్థం.


కొన్ని ఊళ్ళ పేర్లు, రెండు మూడు చోట్ల కూడ వుంటాయి. ఇలాంటి సన్నివేశంలో మరికొన్ని విశేషణాలు చేర్చి వాటిని వివక్ష చేసిన వైనం కన్పిస్తుంది. ఇక కొన్ని దిక్కులను సూచించేవి. కాగా మరికొన్ని పరిమాణ, పౌర్వాపర్య సూచకాలు. ఉదా: తూర్పు లంకపల్లి, పడమటి ఆలేరు, ఎగువతడకర, దిగువమిట్ట, సౌత్‌ వల్లూరు, నార్త్‌ వల్లూరు, పెదమద్దాలి, కురుమద్దాలి, పాతకురు మద్దాలి కొత్త పెదమద్దాలి మొదలైనవి. శేరీగొల్వేపల్లి, జమీ గొల్వేపల్లి, శేరికల్వ పూడి, జమీకల్వపూడి, మొఖాసా కల్వపూడి మొదలైనవి రెవిన్యూ పదాలతో చేసిన వివక్ష. పండిత విల్లూరు, దొంగ తిమ్మాపురం, నీళ్లులేని తిమ్మాపురం మొదలైనవి వాటి వాటి ఆధిక్యాన్ని అభావాన్ని సూచించేవి.


సంఘటనలతో వచ్చిన పేర్లు


రణస్థలం – అక్కడ జరిగిన యుద్ధం కారణంగా వచ్చింది. సంక్రాంతిపాడు – ఆ గ్రామాన్ని కట్టించి సంక్రాంతినాడు దానమివ్వడం కారణంగా వచ్చింది. వసంతవాడ – మార్గమధ్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రం కారణంగా వచ్చింది. పాయకరావు పేట – ఒకానొక సర్దార్‌కు నైజాం నవాబు ఫాయక్‌రావు అనే బిరుదు ఇవ్వడం కారణంగా, అతడు నివాసమున్న చోటుకు ఆ పేరు స్థిరపడిరది. సర్వసిద్ధి – తెలుగు చాళుక్యులలోని ఒకరికి బిరుదు. అతడిమీద గౌరవంతో విశాఖజిల్లాలోని సర్వసిద్ధి గ్రామం ఏర్పడింది.

సోమవారపు పేట, బేస్తవారపు పేటలు ఆయా రోజుల్లో అక్కడ సంత జరగడం కారణంగా వచ్చాయి. బంటుమిల్లి, భట్టి ప్రోలులు సైనికుల పోషణకు గాను ఏర్పాటు చేయబడిన గ్రామాలు. జోడి ధర్మాపురం ఆ గ్రామంపై ‘జోడి’ అనే పన్నును విధించడం కారణంగా, మరొక ధర్మాపురం నుండి దీనిని వివక్ష చేయడానికి గాను స్థిరపడింది. కప్తానుపాలెం నిజానికి కేప్టెన్‌ పాలెం. పోర్చుగీసులు ధాన్యం కొనుగోలుకు ఏర్పాటు చేసికొన్న నెలవు. 


హంపి పంపానది కారణంగా వచ్చింది. విజయ నగరం చరిత్ర తెలిసిందే. వళందపాలెం డచ్చివారి రాజధాని హాలెండు శబ్దం నుంచి వారి మకాముకు పేరుగా నెలకొన్నది. ఫ్రెంచివారి నెలవు పరాసుపేట. ఫరంగుల (విదేశీయులు) ఆవాసం ఫిరంగి పురం. (Foreign అనే ఆంగ్లపదం తెలుగు లిప్యంతరీకరణంలో ఫరంగి అయి, వ్యవహారంలో ఫిరంగి అయింది.)


ఇలా ఊళ్ల పేర్లలో అనేక విశేషాలు నిక్షిప్తమై ఉన్నాయి. వాటిని శాస్త్రీయపద్ధతిలో అధ్యయనం చేయడం వల్ల చరిత్ర, చారిత్రక భూగోళం, ఒకప్పటి నైసర్గికస్థితి, జనుల ఆచార వ్యవహారాలు, వారు పండించిన పంటలు, వారు సాకిన జంతుజాలం — ఈ విధంగా మానవేతిహాసానికి సంబంధించిన అన్ని అంశాలను సమంగా అర్థం చేసికోవడానికి ఉపకరిస్తుంది. గ్రామనామాలు భాషా సంకేతాల రూపంలో ఉన్న శిలాజాలు. అవి కదిలిపోయిన కాలపు గుర్తులు.


మన ఇంటి పేర్లు


ప్రతి వ్యక్తికీ పేరుంది. ఇంటి పేరూ వుంది. ఈ ఇంటిపేరు నిజానికి కుటుంబనామం. కొందరు తాము నిర్మించుకున్న నివాస భవనాలకు పేర్లు పెట్టుకుంటారు. నిజానికవే ఇంటిపేర్లు. అయితే ఈ భావన ఇటీవల ప్రాచుర్యంలోనికి వచ్చింది. వెనుకటి శతాబ్దాల్లో రాజభవనాలకు పేర్లున్నట్టు దాఖలా వుంది. సాధారణ భావనలో కుటుంబ నామమే ఇంటిపేరుగా వ్యవహరింప బడుతోంది. కారణం కుటుంబానికి ఆశ్రయమిచ్చేది ఇల్లు గనుక, కుటుంబ నామం ఇంటి పేరుగా చెలామణిలోనికి వచ్చింది. ఇలాంటి వ్యవహారం, దీని విషయంలోనే కాదు మరోచోట కూడ కన్పిస్తుంది. ఇలువరుస అనే వ్యవహారముంది. అక్కడ కూడ ఇండ్ల వరుస అని కాక కుటుంబ చరిత్ర అనే అర్థాన్నే ఇస్తోంది.

ఇక ఈ ఇంటిపేర్లు ఏదో ఒక పద్ధతిలో ప్రపంచమంతటా వున్నాయి. ఇలా చెప్పడానికి కారణం, మన ఇంటి పేర్లు, వ్యక్తి నామానికి ముందుండగా, ఇతర భాషా సమాజాల్లో వెనుక వున్నాయి. దేనినయినా సమంగా గుర్తించేటందుకు పేరు అవసరముంటుంది. అది మనిషైనా, జంతువైనా, వస్తువైనా, స్థలమైనా అంతే. అయితే సమాజం లోని వ్యక్తులకు, వారు నివసించే స్థలాలకు మాత్రమే అన్నింటికి పేర్లుంటాయి. మిగతా వాటికి జాతి గతమైన పేర్లు తప్ప, ప్రతి దానికి పేరుండదు. పిల్లులలో ప్రతి పిల్లికీ పేరుండదు. అలాగే ప్రతి వేపచెట్టుకు పేరుండదు. ఇక వ్యక్తులందరికీ పేర్లున్నా, ఒకే విధమైన పేర్లు చాలా మంది వ్యక్తులకుంటాయి. దీని వలన సమమైన గుర్తింపుకు విఘాత మేర్పడుతుంది. దానిని అధిగమించే ప్రయత్నంలో భాగంగా ఇంటి పేర్లు అవసరమైనాయి.


 అయితే కొన్ని సందర్భాలలో అప్పుడు కూడ ఇబ్బంది ఎదురవుతుంది. అప్పుడు తండ్రి పేరు లేదా వారు చేసే వృత్తి పేరు లేదా వారి శరీర వర్ణం. ఇలా ఆయా వ్యక్తులలోని ఏదో ఒక ప్రత్యేకతను బట్టి ఇచ్చే శబ్దంతో ఆ ఇబ్బందిని పరిహరిస్తాము.

ఇలా ఏర్పడ్డ ఇంటిపేర్లు, ఒక భాషా సమాజపు అంటే ఒక జాతి జీవనానికి ప్రతీకలుగా భాసిస్తాయి. అంటే సమాజపు అన్ని ముఖాలు అందులో దర్శనమిస్తాయి. కాలగతిలో జన జీవనంలో అనేక మార్పులు వస్తాయి. జీవవశైలి మారిపోతూ వుంటుంది. ఆ మార్పు కనుగుణంగా దానిని సూచించే వ్యవ హారం సంఘ జీవనంలో చోటు చేసుకొంటుంది. దాని కనుగుణ మైన భాషా వ్యవహారమేర్పడుతుంది. అంటే క్రొత్త భావనలు, దాని కనుగుణమైన పదజాలం వ్యాప్తిలోనికి వస్తూ వుంటుంది. కాని మారనివి పేర్లు. అందువలన అవి పురా సమాజపు జీవ నానికి దర్పణంగా భాసిస్తాయి. అందులోను, ఒకనాటి సమా జాన్ని అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగపడేవి ఇంటిపేర్లంటే అతిశయోక్తి లేదు. వాని అధ్యయనం వలన చరిత్ర, సంస్కృతు లకు నేపథ్యాన్ని సవదరించే సమస్త అంశాలు బోధపడతాయి. ఒక భాషా సమాజపు సాంస్కృతిక చరిత్రను అధ్యయనం చేయ డంలో విస్మరింపరానిది గృహనామాధ్యయనం. దీనిని కొంత వివరంగా చూద్దాము.


మన ఇంటిపేర్లలో నూటికి తొంబదికి మించి ఊళ్లపేర్లే చోటు చేసుకున్నాయి. అంటే ఆయా పేర్లు గల ఇంటిపేరులున్న కుటుంబాలు ప్రాయికంగా మొదలు ఆ గ్రామానికి చెందిన వారన్నమాట. అంటే ఇప్పుడున్న గ్రామానికి వారు ఆ గ్రామం నుంచి తరలి వచ్చారని తెలుస్తుంది. మరి అలా తరలి రావడానికి కారణాలను తరచి చూస్తే ఆ కారణాల నేపథ్యం తెలుస్తుంది. అవి యుద్ధాలు కావచ్చు, వర్షాభావం కావచ్చు, రాజకీయ కారణాలు కావచ్చు, భయంకరమైన వ్యాధులు కావచ్చు. ఏ కారణం లేకుండా వున్న ఊరును విడిచి పోవడానికి ఎవరూ ఇష్టపడరు. ఆ కారణాలను అన్వేషించుట వలన, ఆ నాడు సమాజంలో నెలకొన్న పరిస్థితులపై అవగాహన కల్గుతుంది. ఇక, మరికొన్ని కుటుంబాల ఇంటి పేర్లు, ప్రస్తుతం వారు ఏ గ్రామంలో వున్నారో, ఆ గ్రామ నామాలే అయి వుంటాయి. అంత మాత్రంచేత, అనాది నుండి వారు ఆ గ్రామవాసులేనని, అంటే ఆ గ్రామానికి వారే గడ్డ ఎత్తారని చెప్పడం సాధ్యంకాదు. ఎందుకంటే జనం వచ్చాకే, ఆ జనావాసానికి పేరు ఏర్పడుతుందనేది సాధారణ సూత్రం. అయితే కొన్ని ఇంటిపేర్లతో ఏర్పడ్డ గ్రామాలు లేకపోలేదు. వలేటివారి పాలెం, యార్లగడ్డవారి లంక లాంటివి వాటికి ఉదాహరణలు. అయితే ఇలాంటి గ్రామ నామాలు ఇంటిపేర్లు గావడం చాలా అరుదు. అయితే పై సన్నివేశాలకి — అంటే, ఇప్పుడున్న ఊరి పేరే ఇంటిపేరు గావడానికి కొన్ని కారణాలున్నాయి. సాధారణంగా ఇలాంటి సన్నివేశం, గ్రామాధిపతుల, పంచాణం వారి విషయంలో వుంటుంది. అంటే కరణాలు, వెట్టి, తలారి, మున్సిఫ్‌, కమ్మరి, వడ్రంగం, కంసాలి, పురోహితుల కుటుంబాల విషయంలో మాత్రమే ఇది సాధారణంగా కన్పిస్తుంది. ఇది ఊళ్ళ పేర్లు ఇంటి పేర్లయిన వాని విషయం.


కొందరి ఇంటిపేర్లు వ్యక్తి నామాలుగా వుంటాయి. భైరవభట్ల, అప్పాజోస్యుల, వీరమాసినేని, తమ్మిశెట్టి, గుండుబోయిన, తిమ్మావఝల మొదలైనవి ఇలాంటివి. ఇందులో భైరవ, అప్ప, వీరమాచ, తమ్మి, గుండు, తిమ్మ అనేవి ఆయా వ్యక్తుల పేర్లు. భట్ల, జోస్యుల, నేని, శెట్టి, బోయిన, వఝల అనేవి ఆయా వ్యక్తులు అనుసరించిన వృత్తులు. 


భట్టు అనేది బ్రాహ్మణుల్లో ఒక స్థాయిని సూచిస్తుంది. జోస్యుల, వారి జ్యోతిష్య పరిజ్ఞానానికి సంకేతం. నేని నాయక శబ్దభవం. శెట్టి వాణిజ్యపరమైనది. బోయడు అనేది దేవాలయానికి చెందిన ఒక వృత్తి. భక్తులు ఇచ్చిన పశువులను సాకి, ఇచ్చిన వారి అభీష్టం మేరకు, దేవాలయానికి నేయి అందించే వృత్తి ఇది. వఝల ఉపాధ్యాయ శబ్దానికి మారు రూపం. ఆ పేర్లు గల వ్యక్తులు ప్రసిద్ధులు గావడం వలన తరువాతి కాలంలో, వారి వారి సంతతికి, వారి పేర్లు ఇంటి పేర్లు అయినాయి.

ఇవిగాక కొన్ని వృత్తులు, సాధారణ నామాలు కూడ ఇంటి పేర్లుగా కన్పిస్తాయి. అవసరాల, సమయమంతుల, గడియారం, అయాచితుల, సోమయాజుల, భారతుల, రామాయణం, పంతులు, వ్యాకరణం, దిట్టకవి, సంగీతం, కప్పగంతుల, గుడి సేవ, అర్చకం, భండారు, జన్యావుల, సుంకరి, కిలారి, ఉపద్రష్ట, వాజపేయాజుల, అవధానుల, పచ్చిపులుసు, వరికూటి, జొన్న కూటి, ఆరిగె కూటి, భాగవతుల, శరణు, అగ్నిహోత్రం, అశ్వ ధాటి, నీరుకట్టి, దశబంధాలు, ఆరాధ్యుల, సూరి, బందా, వేదాంతం, పడితరం — ఇలా అనేక విధాలైన పేర్లు కన్పిస్తాయి. 


ఇందులో కొన్ని తేలికగా బోధపడతాయి. మరికొన్నింటికి వివరణలు అవసరం. అవసరాల అనేది, ప్రభువు కాలోచితమైన వ్యవహారాలను గుర్తుచేసేవారు. సమయమంతుల అలాంటిదే. గడియారం కాలమానాన్ని పరిగణించేవారిది. అయాచితుల, యజ్ఞం నిర్వహించేటపుడు, ఆహ్వానం లేకుండానే, యధాలాపంగా హాజరయ్యేవారు. సోమయాజుల, యజ్ఞం చేసి సోమ యాజి ఐన వారికి వచ్చినది. భారతుల, ఒక ఆధ్యాత్మికవ్యవస్థకు సంబంధించినది.

కప్పగంతుల వేదం చదివే తీరులోని ఒక విశేషం. జన్యావుల, పునరుత్పత్తి కొరకు పశువులను సాకేవారిది. కిలారి, ప్రభువు ఆలమందలపై అధికారులకు సంబంధించినది. ఉపద్రష్ట యజ్ఞ నిర్వహణ పర్యవేక్షకుడు. వాజపేయాజుల, తత్సంబంధమైన యజ్ఞం చేయింప సామర్థ్యం గలవారు. శరణు, శైవ మతానుయాయులలో ఒక అంతరువు. అశ్వధాటి కవిత్వం చెప్పడంలోని విశేషాన్ని సూచిస్తుంది. నీరు కట్టి, గ్రామంలోని చెరువునీటిని వంతుల ప్రకారం సరఫరా చేసే ఉద్యోగం. దశబంధం చెరువులను నిర్మించడంలో, మరమ్మత్తులు చేయడం లోని నిర్వహణకు పరిహారంగా చెల్లించవలసిన శిస్తులో పొందిన రాయితీ. బందా దేవాలయ నిర్వహణలో ఒక ఉద్యోగం. పడితరం, ఆలయంలో ప్రసాదాలను వినియోగించే పదార్ధాల వంతు. పై వివరణలను బట్టి ఒకనాటి మన సమాజపు తీరు తెన్నులెలాంటివో అర్థమవుతున్నాయి గదా!


అయితే మరి కొన్ని ఇంటిపేర్లు కొంత తబ్బిబ్బుకులోను చేస్తాయి. గాలి, మల్లెమాల, ఇందుకు ఉదాహరణలు. ఇక్కడ గాలి అంటే వాయువు కాదు. అదొక ప్రాంతనామం. ఆ ప్రాంతానికి ఆ పేరు, గాలి అనే చెట్ల వలన వచ్చింది. మల్లెమాల అంటే మల్లెపూలదండ కాదు. అది ఒక ఊరిపేరు. కొండదాపున గల అడవిలో నున్న పల్లెను మాల అంటారు. అలాంటి చోట వచ్చిన గ్రామాలు అర్తమాల, వికృత మాల, మల్లెమాల మొదలైనవి. అలాగే తేళ్ళ. ఇది విష జంతువుకు సంకేతం కాదు. త్యాడ అనే ఊరి పేరుపై బహువచనం తేళ్ళ. ఇలా ఇంటిపేర్లలో చాల వైవిధ్యముంది. అన్నీ తెలుసుకోదగ్గవే.

---------------------------------------------------------------------------------------- రచన: - యార్లగడ్డ బాలగంగాధరరావు.