27, సెప్టెంబర్ 2020, ఆదివారం

ఉద్యద్భానుసహస్రాభా – చతుర్భాహుసమన్వితా

 Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 10 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu

ఉద్యద్భానుసహస్రాభా – చతుర్భాహుసమన్వితా  

లలితాసహస్రనామస్తోత్త్రములో ఇక్కడ పెద్ద రహస్యము ఉన్నది. దేవతల ఆ కార్యము కోసమని వస్తున్న అమ్మవారిని వశిన్యాదిదేవతలు స్తోత్త్రము చేస్తూ కేశపాదాదిపర్యంతము అనగా తలదగ్గరనుంచి పాదములవరకు అందించారు. ముందు తల చెప్పకుండా చతుర్భాహుసమన్వితా అని తల, చేతుల గురించి చెప్పడానికి ముందు ఉద్యద్భానుసహస్రాభా చేతులు – ఆయుధములు చెప్పారు. ఉద్యద్భానుసహస్రాభా అనగా ఉదయిస్తున్న వేయిసూర్యుల కాంతి కలిగిన తల్లి. సూర్యుడు ఉదయిస్తున్న సమయములో కాంతి ఎంతో ఎఱ్ఱగా ఉంటుంది. వేయిమంది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందన్న ఊహకికూడా అందదు. ముందు ఎఱ్ఱటికాంతి కనపడుతున్నదని ‘ఉత్’ అన్న శబ్దము వేశారు. ఉత్ అనగా పైకెత్తడము. కొన్ని కోట్లజన్మల తరవాత ఈ నామము వినబడి లోపల దర్శనమయితే ఆ జీవుడి జీవయాత్రలో పైకి ఎక్కడము ప్రారంభమయింది. బ్రహ్మ, విష్ణు, శివుడనే మూడుతత్త్వములను కలిపి ముద్ద చేసిన ఒకగుళిక అన్నట్టుగా సూర్యబింబము ఉన్నది. లలితాపరాభట్టారిక ఎరుపురంగులో ఎందుకు ఉంటుంది? ఆకాశము అంతా ఆ కాంతితో నిండిపోయి అన్నీ లేత ఎరుపులోకి వచ్చేస్తాయి. అమ్మవారి ఆవిర్భావమును ఎర్రటికాంతితో ధ్యానము చేస్తే ఏమవుతుంది ? ఆ ఎరుపునకు సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు చెప్పిన విషయమును పట్టుకుంటే జీవనయాత్రలో కొత్తమలుపు వస్తుంది. సూర్యబింబము ఉదయిస్తున్నప్పుడు ఎఱ్ఱటికాంతి – ‘శ్రీసరణిభిః’ ముందు వచ్చి కూర్చున్న ప్రాంతము అంతా ఎరుపులో మునిగిపోయి ఆ ఎరుపులో ధ్యానము చేస్తే ఊర్వశితో సహా మూడులోకములలోని దేవవేశ్యలు అంతా వశమైపోతారని అన్నారు. ఈ శ్లోకము స్త్రీలకు ఉపాసన చెయ్యడానికి, వృద్ధిలోకి వద్దామని అనుకున్న వారికి పనికిరాదు. జగద్గురువైన శంకరులు ఇటువంటి శ్లోకము ఇవ్వడమేమిటి? ఎరుపురంగు గురించి ఈ మాట చెప్పడము ఏమిటి? అనిపిస్తుంది. గురువుల బిగింపు చాలా విచిత్రముగా ఉంటుంది. వారి వెంటపడితే తప్ప దాని రహస్యము దొరకదు. మూడులోకములలోని అందగత్తెలు వశమయ్యారు అంటే మూడులోకములలోని ఆనందము ఏది ఉన్నదో అది తామైపోయి, జ్ఞాని అయి పూర్ణులయినట్టు. ఆనందమును బయట వెతుక్కోక లోపలే అనుభవిస్తూ ఆనందస్వరూపులై ఉంటారు. ‘చిదానంద రూపం శివోహం శివోహం’ అన్న భావనలు ఏర్పడడానికి కావలసిన అమ్మవారి అనుగ్రహపు ఎర్రటికాంతులను సూర్యమండలమునందు దర్శనము చేసి ఉపాసన చెయ్యడము. అమ్మవారి ఈ అనుగ్రహము ఎర్రగా ఉండే క్రియాశక్తిగా ఉంటుంది. అన్నిపనులు చేసే చేతిని క్రియాశక్తి అంటారు. కరమే కిరణము. ఆ కిరణముల వలన మొదట వచ్చిన కాంతి ఎరుపు. ఆ ఎరుపే అమ్మవారు. ఆవిడే భగవంతునిలో కలపగలదు. ఎరుపుని ధ్యానిస్తే పూర్ణత్వం వస్తుంది. ఈ ఎరుపు కారుణ్యము. ఈ ఎరుపులో రాజసం ఉన్నది. చిక్కబడిన ఎరుపు మెల్లగా ప్రవహిస్తుంది. పలుచగా ఉన్నది తొందరగా పరిగెడుతుంది. అమ్మవారి అనుగ్రహము బాగా ప్రసరించి ఎరుపుతో కలసిపోయినవారు మెల్లమెల్లగా కదిలి వెళ్ళి ఈశ్వరునిలో కలసిపోతారు. గొప్ప అనుగ్రహము అక్కడ మొదలయితే అనుభవించవలసిన ఆనందము ఇంకొకటి ఉండదు. అమ్మవారు అందరికీ దర్శనము కావాలన్న కోరికతో వశిన్యాదిదేవతలతో స్తోత్రము చెప్పిస్తూ ఈ కాంతి పడని వారికి తన దర్శనము కుదరదని, అలా తనను చూడలేని వారికి తల దగ్గరనుంచి చూడడము కుదరదని చెప్పింది. చేతులు క్రియాశక్తి. చేతుల వలన ఆ శక్తిని దర్శనము చేసి జీవితమును మార్చుకుంటున్నవారు వారిని తలనుంచి పాదముల వరకు చూడగలుగుతారు. అందుకని ముందు కాంతి మీద పడాలి. ఆవిడ ఆవిర్భావము ధ్యానము చేస్తే ఆ ఎరుపుకాంతిలో మునిగిపోతే ఆనాడు జన్మకు ధన్యత కలుగుతుంది. ఎరుపు దర్శనము చేసి అనుభవిద్దామని తాపత్రయము ఏర్పడనంత కాలము జీవయాత్ర సాగుతూనే ఉంటుంది. ఏదో ఒకనాడు ఒకసారి అమ్మవారి అనుగ్రహమును బలముగా సంపాదించుకుంటే వాళ్ళయందు క్రియాశక్తి ప్రారంభము అవుతుంది. ఇది కేవలము ఒక శ్లోకములో చెప్పడము కాదు. గురుముఖతః తెలుసుకుని ధ్యానములో అనుభవించగలగాలి. గురువు అనుగ్రహముగా ముడి విడిపోతే ధ్యానము చేసి పూర్ణులు కావాలి. ఎరుపుకాంతి వెనక ఇంత రహస్యము ఉన్నది. 

www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage

మధుమేహం గురించి సంపూర్ణ వివరణ -

        మధుమేహము మహారోగములలో ఒకటిగా పేర్కొనబడినది . అధిక ప్రమాణమున మాటిమాటికి మూత్రము ఈ వ్యాధి నందు వెడలుటచే ఇది మేహరోగం అనబడును. ఈ రోగం జనించుటకు ప్రధానకారణాలు గురించి ప్రాచీన ఆయుర్వేద వైద్యులు అనేక కారణాలు తెలియజేసారు. 

              సుఖముగా ఉండు ఆసనము పైన ఆసీనుడై యుండి ఏ పనిచేయక సోమరిగా ఉండుట , ఎక్కువసేపు సుఖముగా నిద్రించుట , పెరుగు , జలచరమాంసాదులు , పాలు , బెల్లం , తీపివస్తువులు , కఫవర్ధక పదార్థాలు ఎక్కువుగా సేవించుట , కొవ్వుపదార్ధాలు అధికంగా తీసుకొనుట , శరీరానికి శ్రమ లేకపోవుట , పగటినిద్ర మరియు శీతల , మధుర , స్నిగ్ధ ద్రవముగా ఉండు అన్నపానాదులు అధికంగా సేవించుట వలన ప్రమేహము వచ్చును. 

              ఆరోగ్యవంతుని యందు ఒక పగలు , రాత్రి అంటే 24 గంటల కాలమున విసర్జించబడు మూత్రము యొక్క ప్రమాణము 800 - 2500 మీ.లీ గా ఉండును. పైన పేర్కొనబడిన సాధారణ ప్రమాణము కన్నా అధికముగా మూత్రవిసర్జన జరిగినచో అది ప్రమేహం అనబడును. ఉదాహరణకు ఉదకమేహము ( Daibetes insipidus ) అను సమస్య నందు 5 - 10 లీటర్లు మూత్రము 24 గంటల కాలంలో విసర్జించబడును. ప్రమేహము నందు మూత్రము నిర్మలముగా ఉండక కలుషితమై కలకపరి ఉండును. 

         మధుమేహము కారణములను ఆధారం చేసుకుని రెండు విధములుగా పేర్కొనబడినది . 

      1 - సహజము .

      2 - అపథ్య నిమిత్తజము . 

 * సహజము - 

        సహజముగా కలుగు ప్రమేహము తల్లితండ్రుల బీజదోషము వలన కలుగును. శిశువు జన్మకు కారణం అయిన బీజము , శుక్రము యొక్క దోషములు సామాన్యముగా సహజ వ్యాధులకు కారణము. కావున మధుమేహము కూడా బీజదోషముల వలనే జనించును. 

 * అపథ్య నిమిత్తజము - 

        ఇది బీజదోష రహితముగా , జన్మించిన తరువాత అపథ్య ఆహార అలవాట్ల వలన జనియించును. ప్రమేహవ్యాధి జనియించినప్పుడు సరైన చికిత్స చేయక ఉపేక్షించిన యడల ప్రమేహములు ( 20 రకాలు ) అన్నియు మధుమేహములుగా మారును. 

                         మధుమేహము నందు మూత్రము కషాయ , మధుర రసములు కలిగి తెలుపుగా ఉండును. ఈ వ్యాధిని నిర్ధారించుటలో మూత్రపరీక్ష మరియు రక్తపరీక్షలు దోహదపడును. ఈ పరీక్షల ఆధారముగా వ్యాధితీవ్రత మరియు చికిత్సా ఫలితములను అంచనా వేయుట సాధ్యపడును. 

       కడుపులో చిన్నపేగు మొదటి భాగమునకు ( Duodenum) , పిత్తాశయం ( Gallblader ) నకు మధ్యభాగములో పైత్యనాళము (Bileduct ) పక్కగా క్లోమము ( Pancrease ) అను వినాళగ్రంధి ఉండును. ఇందులో ఎంజైములు మరియు హార్మోనులు ఉండును. ఎంజైములు ఆహార జీర్ణక్రియలో పాల్గొనును. ఇన్సులిన్ మరియు గ్లూకాగాన్ అను రెండు హార్మోనులు ఈ క్లోమగ్రంధి యందు ఉండి రక్తములోని గ్లూకోజ్ ప్రమాణమును నియంత్రించుతూ శరీర అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూడును . మధుమేహ రోగికి పలుకారణాల వలన ఇన్సులిన్ అనే హార్మోన్ చురుకుగా లేకపోవడం , కావలిసినంత ప్రమాణముగా అందుబాటులో లేకపోవటం వలన రక్తములో గ్లూకోజ్ స్థాయులు పెరుగును . రక్తములో అధికంగా ఉన్న గ్లూకోజ్ మూత్రపిండాల ద్వారా మూత్రములో బయటకు వెళ్ళును. ఈ విధముగా శరీరంలో పలు జీవక్రియలకు ఆధారమైన మరియు శక్తిని సమకూర్చే గ్లూకోజ్ నిలువలు క్రమేణా తరిగిపోవడం మరియు శరీర అవయవాలు ఉపయోగించుటకు వీలులేని వాతావరణము నెలకొనుట మూలముగా క్రమముగా మధుమేహరోగి కండరాలు క్షీణించి నరముల బలహీనత , కంటిచూపు తగ్గుట మరియు మూత్రపిండముల సామర్ధ్యము తగ్గుట మొదలగు ఉపద్రవములతో మరణించును . సక్రమమైన ఆహారవిహారాలు , క్రమం తప్పకుండా ఔషధసేవన పాటించడం వలన రోగికి వ్యాధి లొంగుబాటులో ఉండి ఆయువును పెంపొందించును. 

                  మధుమేహా సమస్య నివారణలో ఔషధ సేవనతోపాటు ఆహార నియమాలు కూడా ప్రధానపాత్ర పోషిస్తాయి. ఇప్పుడు మీకు తినవలసిన మరియు తినకూడని ఆహారనియమాల గురించి వివరిస్తాను. 

   తినవలసిన ఆహారపదార్ధాలు - 

       యవలు , గోధుమలు , కొర్రలు , రాగులు , పాతబియ్యపు అన్నం , పెసలు , చేదు గల కాయగూరలు , మరియు ఆకుకూరలు , చేదుపోట్ల , కాకరకాయ , మెంతులు , దొండకాయ , వెలగపండు , మారేడు , నేరేడు విత్తనాలు , ఉసిరిక పండు , పసుపు , అడివిమాంస రసములు ఎక్కువుగా వాడవచ్చు . 

  తినకూడని ఆహార పదార్దాలు - 

      కొత్త బియ్యపు అన్నం , అధిక నూనె కలిగిన ఆహారాలు , బెల్లపు పదార్దాలు , నెయ్యి వంటకములు , మద్యము , గంజి , చెరుకు రసము , పుల్లటి పదార్థాలు , చింతపండు , పెరుగు , వెన్న , జున్ను , దుంప కూరలు , కొవ్వులు అధికంగా ఉండు పదార్దాలు వాడకూడదు. అదేవిధముగా పగలు నిద్రించరాదు , ధూమపానం , రాత్రి సమయములో మేల్కొని ఉండటం నిషిద్దం . మలమూత్ర వేగాలను నియంత్రించరాదు.   

        పైన చెప్పిన నియమాలు పాటిస్తూ మధ్యాహ్న సమయంలో మజ్జిగ అన్నంలో 50 గ్రాముల ఉల్లిపాయని నంజుకొని తినండి. పలుచటి మజ్జిగని మాత్రమే వాడవలెను. శరీరం నందు వేడిమి పెరగకుండా జాగ్రత్తవహించండి. నేను రాసిన గ్రంధాల నందు పెద్ద పెద్ద అనారోగ్యాలకు కూడా చిన్నచిన్న చిట్కాల సహాయంతో తగ్గించుకునే విధముగా అత్యంత సులభయోగాలు ఇచ్చాను . ప్రతి ఇంటి నందు ఉండవలసిన గ్రంధములు . తప్పక చదవగలరు.

                       * సంపూర్ణం *

 మధుమేహ నివారణా చూర్ణం నాదగ్గర లభ్యం అగును . నన్ను సంప్రదించగలరు . 

   గమనిక -

           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.

           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.

            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.

      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 50 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.

            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .

                  కాళహస్తి వేంకటేశ్వరరావు 

                         9885030034 

               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

నంది_శివునికి_ఎదురుగా_ఎందుకుంటుంది

 # ?

#అందరికీ_తెలిసేందుకు_దయచేసి_షేర్_చేయండి

#సంభవామి_యుగే_యుగే

శివాలయంలోకి అడుగుపెట్టగానే శివుని కంటే ముందుగా నందిని దర్శించుకుంటారు. నంది రెండు కొమ్ముల మధ్య నుండి శివుడ్ని చూస్తే మరికొందరు నంది చెవి లో తమ కోరికలను చెప్పుకుంటారు. మరియు నంది యొక్క చరిత్ర, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం…

శిలాదులనే ఋషి ఉండేవాడు ఎంతో జ్ఞానాన్ని సంపాదించినా ఆ ఋషికి పిల్లలు లేకపోవటం లోటుగా ఉండేది. ఎలాగైనా తనకు సంతాన భాగ్యం కలిగేందుకు శివుడికి తపస్సు చేయటం మొదలుపెట్టాడు. అలాగే కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తూనే వున్నాడు. అతని వంటినిండా చెదలు పట్టినా సరే శిలాదుడు ఆపలేదు. చివరికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. తనకి సంతానం ప్రసాదించమని ఆ శివుడ్ని వేడుకున్నాడు.

అతని పరమభక్తి కి మెచ్చిన శివుడు తధాస్తు అన్నాడు. శివుడి వరాన్ని పొందిన శిలాదుడు ఒకసారి యజ్ఞం చేస్తుండగా ఆ అగ్ని నుంచి బాలుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుడికి నంది అని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచుతున్నాడు శిలాదుడు. నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడు అని అర్ధం. ఆ బాలుడి మేధస్సు అసాధారణంగా ఉండేదట. అతను చిన్నతనంలోనే వేదాలన్నీ అవపోసన పట్టేసాడు. ఒకనాడు శిలాదుడు ఆశ్రమానికి మిత్ర వరధులు అనే దేవతలు వచ్చారు. ఆ ఆశ్రమంలో తిరుగుతున్న నందిని చూసి అతను తమకు చేసిన అతిధి సత్కారాలు చూసి మురిసిపోయారు. ఆ దేవతలు వెళుతూ వెళుతూ ఆ పిల్లవాడ్ని దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించబోయి ఒక్కసారి ఆగారు. నంది వంక దీక్షగా చూస్తున్నారు. శిలాధుడు అంత భాదలో ఎందుకు వున్నారో అర్ధం కాలేదు. ఎంతగానో ప్రాధేయపడిన తర్వాత నంది ఆయుషు త్వరలోనే తీరిపోతుందనే వార్త శిలాదుడికి తెలిసింది.

ఈ విషయం తెలిసి నంది దీనికి మార్గం కూడా శివుడే చూపిస్తాడని శివుని కోసం తపస్సు చేయసాగాడు. బాలుని తపస్సుకి మెచ్చి శివుడు త్వరలోనే బాలునికి ప్రత్యక్షమయ్యాడు. శివుడ్ని చూసిన నందికి నోటమాట రాలేదు. శివుడి పాదాల చెంత ఎంత బాగుందో కదా అనుకున్నాడు. అందుకే తన ఆయుష్షు గురించి వరం కోరుకోకుండా చిరకాలం నీ చెంతే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని కోరుకున్నాడు. అలాంటి భక్తుడు తన చెంతనే ఉంటే శివుడికి కూడా సంతోషమే కదా. అందుకే నందిని వృషభ రూపంలో తన వాహనంగా ఉండిపొమ్మంటూ అనుగ్రహించాడు శివుడు. ఆనాటి నుంచి శివుడి ద్వారపాలకుడిగా తనని కాచుకొని ఉంటూ కైలాసానికి రక్షణ నందిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు నంది.

శివునికి సంబంధించిన చాలా కధలలో నంది ప్రసక్తి ఉంటుంది. ఒకసారి క్షీరసాగర మధనంలో ఆలాహలం అనే విషం వెలువడినప్పుడు దాని నుంచి లోకాలను కాపాడేందుకు శివుడు ఆ విషాన్ని తాగాడు. ఆ సమయంలో కొద్దిపాటి విషం కిందికి ఒలికిందట. అప్పుడు శివుడి చెంతనే ఉన్న నంది ఏ మాత్రం ఆలోచించకుండా ఆ కాస్త విషాన్ని తాగేసాడట. మహామహా దేవతలే ఆ విషానికి భయపడి పారిపోతుంటే నంది శివుని మీద నమ్మకంతో ఈ మాత్రం ఆలోచించకుండా ఆ విషాన్ని తాగేసిందట. నంది గురించి ఇంత చరిత్ర ఉంది కాబట్టే ఆయన్ని శివుడికి సేవకుడిగానే కాకుండా ముఖ్య భక్తుడిగా కూడా భావిస్తారు పెద్దలు.

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

తిరుమల కు వెలితే

 తిరుమల కు వెలితే తప్పకుండ చూడవలసినవి ఏంటో తెలుసు కుందామా 🙏

శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశ గోవిందా....

తిరుమల... ..శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న కలియుగ వైకుంఠం. చారిత్రక, పురాణ ప్రాశస్త్యమున్న ఎన్నో ఆలయాలు, తీర్థాలకు ఏడు కొండలు నెలవుగా ఉన్నాయి. ఒక విధంగా తిరుమల ఎన్నో విశేషాల సమాహారం. సప్తగిరులే శయన రూపంలో ఉన్న శ్రీనివాసుడి ముఖాన్ని పోలి కనిపించడం ఎంతో విశేషమైనది. ఒకసారి తిరుమలకు వెళితే తప్పకుండా చూడాల్సినవేంటో తెలుసుకుందాం. తిరుమల గురించి అరుదైన విశేషాలను కూడా తెలుసుకుందాం.

️లోక కల్యాణార్థం, ప్రజల సంరక్షణార్థం తిరుమలలో నారాయణుడు శ్రీ వెంకటేశ్వరుడిగా వెలిశాడని అందరికీ తెలిసిందే. వైకుంఠ లోకం నుంచి స్వామి వారు భూలోకంలోని ఏడుకొండలపై దిగిపోయి పద్మావతీ అమ్మవారిని పరిణయమాడిన కథనం గురించి వినే ఉంటారు. విషయం తెలుసుకుని లక్ష్మీదేవి అమ్మవారు భూలోకానికి వచ్చి స్వామి వారిని నిలదీయడం, దాంతో స్వామి వారు విగ్రహ రూపంలోకి మారిపోవడాన్ని ఆలయ స్థల పురాణం చెబుతోంది. స్వామి వారు శిలామూర్తిగా మారిపోయిన వెంటనే లక్ష్మీదేవీ అమ్మవారు స్వామి ఎడమ వక్షస్థల ప్రాంతంలో, పద్మావతీ అమ్మవారు కుడి వక్షస్థల ప్రాంతంలో అంతర్లీనమైనట్టు చెబుతారు. చూడ్డానికి స్వామి వారి విగ్రహం ఒక్కటే కనిపిస్తుంది. కానీ అక్కడ స్వామి, అమ్మవార్లు కూడా ️ఉన్నట్టు భావించాలి. 

భూ వరాహస్వామి🙏

స్వామి వారి ఆలయం ఉత్తర దిశగా పుష్కరిణిని ఆనుకుని ఉండే ఆలయమే శ్రీ భూవరాహ స్వామి ఆలయం. బ్రహ్మపురాణం ప్రకారం తిరుమల ఆది వరాహ క్షేత్రం. భూవరాహస్వామి వారి ఆధ్వర్యంలో ఉన్నది. శ్రీ మహావిష్ణువు భూమిపైకి రాక ముందు భూ వరాహస్వామి ఏడుకొండలపై నివసించేవారు. ఏడుకొండలపై నివాసం ఉండాలన్న శ్రీనివాసుడి కోరిక మేరకు వరాహస్వామి అక్కడి భూమి అంతటినీ స్వామి వారికి కేటాయించేశారు. ఇందుకు స్వామి వారు కృతజ్ఞతతో తొలి దర్శనం, తొలి నైవేద్యం భూవరాహ స్వామి వారికే దక్కాలని అనుగ్రహించారు. ఫలితంగా తిరుమలకు వచ్చే భక్తులు ముందుగా భూ వరాహస్వామి వారిని దర్శించుకున్న తర్వాతే శ్రీనివాసుడ్ని దర్శించుకోవాలని స్థల పురాణం చెబుతోంది. దీని ద్వారా స్వామి వారి కృపకు పాత్రులు కావడానికి వీలుంటుంది.

భూ వరాహ స్వామి ఆలయం ప్రతి రోజు ఉదయం 5.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటలకు దర్శనాల కోసం తెరిచి ఉంటుంది. వరాహ స్వామి జన్మనక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని శ్రావణ మాసంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు.

బేడీ ఆంజనేయస్వామి ఆలయం 🙏

️తిరుమలకు వచ్చే వారు ఆలయ ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండే ఆంజనేయస్వామి ఆలయాన్ని కూడా దాదాపు చూసే ఉంటారు. ప్రతి రోజూ నిత్య నైవేద్యాన్ని తొలుత భూ వరాహస్వామి వారికి తర్వాత వెంకటేశ్వరస్వామి వారికి సమర్పణ చేసిన తర్వాత ఆ నైవేద్యాన్ని బేడీ ఆంజనేయస్వామి ఆలయానికి కూడా తీసుకెళ్లి ఆరగింపు చేస్తారు. ఆంజనేయుడు యుక్త వయస్సులో ఉన్నప్పుడు తిరుమల నుంచి వెళ్లిపోవాలని భావిస్తాడు. తల్లి అంజనాదేవి ఇది తెలుసుకుని ఆంజనేయుడి రెండు చేతులను కలిపి బేడీలు వేసినట్టు కట్టేసి తాను తిరిగి వచ్చే వరకు కదలవద్దని చెప్పి అదృశ్యం అవుతుంది. ఆకాశగంగ వెనుక భాగంలోకి వెళ్లిన అంజనాదేవి ఎంతకీ తిరిగి రాలేదు. దాంతో ఆంజనేయుడు అలానే ఉండిపోతాడు. బేడీ ఆంజనేయస్వామి అనే పేరు ఇలానే వచ్చింది. స్వామి వారికి ప్రతీ ఆదివారం అభిషేకం నిర్వహిస్తారు.

విమాన వెంకటేశ్వరుడు🙏

️తిరుమలలో స్వామి వారిని దర్శించుకుని గర్భగుడి చుట్టూ తిరిగి వెళ్లే క్రమంలో విమాన వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం కనిపిస్తుంది. గర్భగుడి బయట పై భాగంలో స్వామి వారి రూపు వెండి, బంగారు తొడుగుతో దర్శనమిస్తుంది. 16వ శతాబ్దంలో వ్యాసతీర్థులు విమాప వెంకటేశ్వరుడిని ఆరాధించి మోక్షం పొందినట్టు స్థల పురాణం.

స్వామి పుష్కరిణి🙏

️స్వామి వారి ఆలయం పక్కనే ఉండే పుష్కరిణికి చాలా విశిష్టత ఉంది. వైకుంఠంలోని పుష్కరిణియే ఇదని చెబుతారు. స్వామి భూమిపైకి రావడంతో ఆయన వాహనమైన గరుత్మంతుడు పుష్కరిణిని ఇక్కడకు తీసుకొచ్చినట్టు చెబుతారు. ధనుర్మాసంలో ముక్కోటి ద్వాదశి రోజున ముక్కోటి పుష్కరిణిగా మారుతుందని నమ్మకం. ఆ రోజున ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే నదుల్లో చేసినంత పవిత్రత, పుణ్యం వస్తుందంటారు. పురాణాల ప్రకారం పుష్కరిణిలో ముక్కోటి తీర్థాలు కలుస్తాయని, ఇక్కడ దేవతలు సైతం స్నానాలు ఆచరిస్తారని చెబుతారు. 

తీర్థాలు🙏

️పాండవతీర్థం, కుమారధార, తుంబుర తీర్థం, రామకృష్ణ, చక్ర, వైకుంఠ తీర్థం, శేష తీర్థం, సీతమ్మ తీర్థం, పసుపు తీర్థం, జాబాలి తీర్థం, సనక సనందన తీర్థం ఇవి కొన్నే. తిరుమల అంతటా పవిత్ర తీర్థాలు కోటి వరకు ఉన్నాయని చెబుతుంటారు.

తీర్థాల వద్ద జరిగే ముఖ్యమైన పండుగలు🙏

కుమారధార వద్ద మాఘ పౌర్ణమి రోజున, రామకృష్ణ తీర్థం వద్ద పుష్య పౌర్ణమినాడు, తుంబురు తీర్థం వద్ద ఫాల్గుణ పౌర్ణమి నాడు, చక్రతీర్థం వద్ధ కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజున ప్రత్యేక పూజలు జరుగుతాయి.....

శిలాతోరణం🙏

️ఆలయం ఉత్తరలో కిలోమీటరు దూరంలో ఉండే అటవీ ప్రాంతంలో ఇది కనిపిస్తుంది. రెండు భారీ రాతి శిలలు సూక్ష్మ పరిమాణంలో అనుసంధానమై ఉండడం ఇక్కడి విశిష్టత. ఇటువంటి అరుదైనది అమెరికాలోని రెయిన్ బో ఆర్చ్, ఆస్ట్రేలియా మినహా మరెక్కడా లేదని చెబుతారు. స్వామి వారు శిలా రూపంలోకి మారిపోవడానికి సంబంధించి కీలక సమాచారం ఇక్కడే సమాధి కాబడిందని చెబుతారు. 10 అడుగుల ఎత్తులో, 25 అడుగుల వెడల్పుతో ఉండే ఈ రాతి ఆర్చ్ దగ్గరకు ప్రైవేటు వాహనంలో వెళ్లాల్సి ఉంటుంది. నడచి వెళ్లాలనుకుంటే వరాహస్వామి ఆలయం నుంచి 20 నిమిషాలు పడుతుంది. చక్ర తీర్థం కూడా ఇక్కడే ఉంటుంది.

పాపవినాశనం🙏

️కొండల్లోంచి సహజసిద్ధంగా వచ్చే జలధార ఇది. ఈ జలాల్లో స్నానమాచరించడం ద్వారా పాపాలు నశించిపోతాయన్నది భక్తుల విశ్వాసం. అందుకే దీనికి పాపనాశనం తీర్థమనే పేరు స్థిరపడింది. భక్తుల నీటి అవసరాల కోసం ఇక్కడ ఏర్పాటు చేసిన డ్యామ్ కూడా చూడవచ్చు. తొలుత పాపవినాశనం తీర్థ జలాలను స్వామి వారికే వినియోగించేవారు. ఆలయానికి దూరంగా ఉండడంతో ప్రస్తుతం ప్రత్యేక దినాల్లోనే ఈ జలాలను తీసుకెళుతున్నారు.

ఆకాశగంగ🙏

ఆలయానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో పాపవినాశనానికి వెళ్లే మార్గంలోనే ఇది ఉంది. ఇది కూడా సహజసిద్ధ తీర్థమే. ఈ తీర్థంతో శ్రీవెంకటేశ్వస్వామి వారికి నిత్య అభిషేకం నిర్వహిస్తుంటారు.

స్వామివారి పాదాలు🙏

తిరుమల బస్ స్టేషన్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో నారాయణగిరి పర్వత ప్రాంతంలో రాతి రూపంలో ఉన్న స్వామి వారి పాదాలను చూడవచ్చు. ఏడుకొండలపై మొదట స్వామి వారు అడుగు పెట్టింది ఇక్కడేనని, ఆ పాద ముద్రలే ఇవని చెబుతారు. ఈ పాదాల చుట్టూ గ్లాస్ బాక్స్ ను ఏర్పాటు చేసి భక్తులు తాకకుండా రక్షణ కల్పించారు. దీనికి సమీపంలోనే శిలా తోరణం కూడా ఉంటుంది. ప్రైవేటు ట్యాక్సీ లేదా షేర్ ట్యాక్సీలో ఇక్కడికి వెళ్లవచ్చు.

చక్రతీర్థం🙏

శిలాతోరణానికి సమీపంలోనే చక్రతీర్థం ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ బ్రహ్మ తపస్సు చేసుకోవాలని భావిస్తారు. తనకో మంచి ప్రదేశం చూపాలని కోరడంతో వెంకటేశ్వరస్వామి తన సుదర్శన చక్రంతో రాతిని చీల్చి బ్రహ్మకు స్థానం చూపించారు. కొండపై నుంచి వచ్చిన నీటితో ఇక్కడ తీర్థం ఏర్పడింది. బ్రహ్మోత్సవ సమయంలో స్వామి ఉత్సవమూర్తిని ఇక్కడకు కూడా తీసుకొస్తారు.

తుంబురు తీర్థం🙏

తిరుమల నుంచి 12 కిలోమీటర్లు, పాపవినాశనం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఈ తీర్థం ఉంది. ఏటా ఫాల్గుణ పౌర్ణమి సమయంలో ఈ తీర్థానికి వెళ్లే దారిని తెరుస్తారు. దట్టమైన అటవీ మార్గంలో మొత్తం ఐదు జలపాతాలను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. గంధర్వుడైన తుంబురుడు తన భార్యను శపించడంతో ఆమె కప్ప రూపంలో మారి తుంబుర తీర్థంలో ఉంటుంది. అగస్త్య ముని ఓరోజు ఇక్కడి తీర్థానికి రావడంతో ఆమె తన చరిత్ర గురించి చెప్పగా, అగస్త్యుడు అనుగ్రహం వల్ల ఆమె తిరిగి తన యథా రూపాన్ని సంతరించుకుంటుంది. అప్పటి నుంచి ఇది తుంబుర తీర్థంగా వెలుగులోకి వచ్చింది. మరో కథనం ప్రకారం తుంబురు మహర్షి ఇక్కడ ఘోరమైన తపస్సు చేయడం వల్ల ఈ తీర్థానికి తుంబుర తీర్థం పేరు స్థిరపడినట్టు చెబుతారు.

జాబాలి తీర్థం🙏

తిరుమలలో పాపవినాశనానికి వెళ్లే మార్గంలోనే ఈ తీర్థం ఉంది. ఇక్కడే ఆంజనేయస్వామి ఆలయాన్ని సైతం చూడవచ్చు. జాబాలి అనే ముని ఇక్కడ తపస్సు చేయగా ఆంజనేయుడు దర్శనమిచ్చినట్టు చెబుతారు. శ్రీరాముడు వనవాసంలో భాగంగా సీతమ్మవారు, లక్ష్మణ, ఆంజనేయస్వామి వార్లతో ఇక్కడ కొంత కాలం ఉన్నారని కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

నాగ తీర్థం🙏

దేవాలయం నుంచి కిలోమీటరు దూరంలో ఉంటుంది నాగతీర్థం. అలాగే, ఈ తీర్థానికి సమీపంలోనే బాలతీర్థం కూడా చూడవచ్చు. ఇక్కడ స్నానం చేస్తే బాలల్లా మారిపోతారని, అంటే అలాంటి శక్తిని సంతరించుకుంటారని చెబుతారు. ప్రస్తుతానికి ఈ తీర్థంలో జలం కనిపించడం లేదు. సృష్టికి విరుద్ధం కనుక జలం అంతరించిందని అంటారు.......

శేషతీర్థం🙏

సాక్షాత్తూ శ్రీ మన్నారాయణుడు ఆదిశేషుడు (నాగేంద్రుడు) రూపంలో కొలువై ఉన్న తీర్థం ఇది. తిరుమల పాపవినాశనం డ్యామ్ నుంచి దట్టమైన అటవీ ప్రాంతంలో కొంతదూరం ప్రయాణించడం ద్వారా చేరుకోవచ్చు. ఈ తీర్థాన్ని చేరుకోవాలంటే నీటి ప్రవాహాలను దాటాల్సి ఉంటుంది. చివరిగా పది మీటర్ల వ్యాసార్థంతో కూడిన పెద్ద తీర్థం ఉంటుంది. ఈత బాగా వచ్చిన వారు ఇందులోకి దిగి కొంత మేర లోపలికి వెళ్లినట్టయితే అక్కడ ఆదిశేషుడి శిలారూపాన్ని దర్శించుకోవచ్చు.

ఈత రాని వారు గాలి నింపిన వాహనాల ట్యూబులు, తాడును రక్షణగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. గైడ్ సహకారం తప్పనిసరి. ఎందుకంటే అటవీ ప్రాంతం... శేష తీర్థంలో పేరులో ఉన్నట్టుగానే నాగు పాములు ఈ తీర్థంలో, చుట్టు పక్కల సంచరిస్తుంటాయి. కనుక తెలియకుండా వెళ్లి అపాయాన్ని కొని తెచ్చుకోకుండా గైడ్ సాయం తీసుకుని వెళ్లడం మంచిది.

ఒకరోజు శ్రీ మహావిష్ణువుకు బాగా దాహం వేసింది. దాంతో జలాన్ని తీసుకురావాలని గరుత్మంతుడ్ని పురమాయించారు. కానీ ఆయన ఎంత సేపు అయినా నీరు తేకపోవడంతో అప్పుడు స్వామివారు ఆదిశేషుడ్ని కోరతారు. దీంతో ఆదిశేషుడు జలాన్ని తన తోక ద్వారా రప్పించి స్వామి వారి దాహం తీర్చారని,కే ఇది శేష తీర్థం అయ్యిందని పురాణ చరిత్ర.

పాండవ తీర్థం🙏

వనవాస సమయంలో పాండవులు తిరుమలలో పర్యటిస్తూ ఈ తీర్థంలో స్నానం చేశారని చెబుతుంటారు. దీనికి గోగర్భ తీర్థం అని మరో పేరు కూడా కలదు. స్వామి వారి ఆలయానికి ఈశాన్య దిశలో ఉంది. ఈ నీటిని ఒడిసి పట్టుకునేందుకు టీటీడీ 1963లో గోగర్భం డ్యామ్ నిర్మించింది. 

కుమారధార తీర్థం🙏

కుమారధార తీర్థానికి విశిష్ట చరిత్ర ఉంది. మాఘమాసంలో పౌర్ణమి రోజున సంతాన భాగ్యం లేని మహిళలు ఈ తీర్థంలో స్నానం ఆచరిస్తే సంతాన భాగ్యం సిద్ధిస్తుందని చెబుతుంటారు.

*సేకరణ*

విగ్రహం

మహనీయుని మాట

 🙏శుభోదయం 🚒

------------------

-------------------

 అజ్ఞానం కన్నా నిర్లక్ష్యం ఎక్కువ కీడు చేస్తుంది....!!

               -ప్రాంక్లీన్ / 

-------------------------

🍀నేటి మంచిమాట 🍿

-------------------------

వాగేవాడితో "సీక్రెట్"

             చెప్పకూడదు....!!

వాదించేవాడితో   

 ఆర్గ్యుమెంట్ చేయకూడదు

తెలివైనవాడితో పోటీ 

                 పడకూడదు

 తెగించేవాడితో తల    

               పడకూడదు...!!

☀️నియంత్రణ అవసరమే☀️

వ్యక్తి నిరంతరం తాను ‘ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి’కి చేరడమే అభ్యున్నతి. అదే జీవన సాఫల్యం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే..

🔸 అతినిద్ర

🔸 బద్ధకం

🔸 భయం

🔸 క్రోధం

🔸 అలసత్వం

🔸 ఎడతెగని ఆలోచన

...అనే ఈ ఆరుదోషాలను జయించినప్పుడే లక్ష్యాన్ని చేరగలుగుతాడని భారతం చెబుతోంది. భారతంలోని ఉద్యోగ పర్వంలో విదురుడు చెప్పిన మాటలివి. నిజానికి జీవితం మన భావోద్వేగాలకు అనుకూలంగా నిర్మించబడిలేదు. మన భావోద్వేగాలూ జీవితాన్నీ మార్చలేవు. ప్రతి ప్రయాణం గమ్యాన్ని చేరుస్తుందని చెప్పలేం. కానీ, ప్రయాణించిన దూరం గమ్యాన్ని దగ్గరగా చేస్తుంది. అనుకున్నది జరగడం, జరగకపోవడం సంభవమే. విజయంలో పొంగిపోతే అహంకారం పలకరిస్తుంది. అపజయంలో క్రుంగిపోతే ఆత్మన్యూనత వరిస్తుంది. మన ఉన్నతికి విఘాతం కలిగించే దోషాలను వదిలివేయడం, లోపాలను సవరించుకుంటూ, ముందుకు సాగడం వల్ల పరిణతి ఉన్నతి లభిస్తాయి. 

ఈ క్రమంలో పైన చెప్పిన ఆరు దోషాలను విశ్లేషించుకుంటే..

నిద్రలో శరీరం విశ్రాంతమౌతుంది. ప్రాకృతిక శక్తి మనలోకి ప్రవేశించి శక్తిమంతులను చేస్తుంది. కానీ.. అతినిద్ర లేదా నిద్ర లేమి వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యమే మహాబాగ్యం. అది చెడిపోతే అన్నీ పోయినట్లే. 

రెండో లక్షణం బద్ధకం. ఇష్టమయిన దాని కోసం అవసరమైన దానిని వదిలివేయడం బద్ధకం. దానివల్ల వాయిదా వేసే జబ్బు కలిగి, సమయానికి ఏ పనీ పూర్తిచేయలేం. 

అనుకోని పరిస్థితులు ఎదురైతే వాటిని అనుమోదించలేని సమయంలో కలిగేది భయం. భయం వల్ల ఏ పనిని సంకల్పించినా.. ‘‘ఇది నాకు సాధ్యపడుతుందా.. అపహాస్యం పాలవుతానేమో... అపజయం కలుగుతుందా’’ అనే అనుమానాలు వెన్నాడుతూ ఉంటాయి. అనుమానాల వల్ల ఉత్సాహం తగ్గుతుంది, ధైర్య సాహసాలు సన్నగిల్లుతాయి. బుద్ధి పనిచేయదు, శక్తి సామర్థ్యాలు మందగిస్తాయి. ప్రయత్నం మధ్యలోనే విడిచిపెడతాం. 

ఇక.. క్రోధం అన్ని అనర్థాలకూ మూలకారణం. పరిస్థితులు మనం అనుకున్నట్లుగా లేనప్పుడు కోపం వస్తుంది. కోపం మనలోని భావోద్వేగానికి సంకేతం. కోపం దీర్ఘమైతే క్రోధంగా మారుతుంది. క్రోధం వల్ల మోహం కలుగుతుంది. మోహం వల్ల స్మృతి తపుఁతుంది. దాని వల్ల బుద్ధి సరిగా పనిచేయదు.

అలసత్వం వల్ల విద్య దక్కదు. విద్య లేనివానికి ధనం లేదు, ధనం లేక మిత్రులు ఉండరు, మిత్రులు లేకపోతే సుఖమూ ఉండదు. 

అలాగే.. 

ఎడతెగని ఆలోచనల వల్ల కార్యరంగంలోకి దిగడం కుదరదు. ఈ ఆలోచనలు ప్రతిబంధకాల వైపు మాత్రమే నడిపిస్తాయి. ప్రణాళికలు రూపొందాలంటే ఆలోచనలు అవసరమే కానీ, అవి ఆచరింపబడితేనే విజయం. ఇలా ఈ ఆరు దోషపు అలవాట్లను వదిలితేనే అభ్యున్నతి అంటుంది భారతం.......

☀️🌹🙏 ఓం తత్సత్🌹☀️

  💐 శుభోదయం💐

శివార్చకులు

 ...

బాలుగారి మృతదేహాన్ని #ఖననం చెయ్యడానికి కారణం ఏమిటి...!? మామూలు గా ఐతే...

#దహనం చేయాలి కదా...?

అని చాలా మంది ప్రశ్నించారు...

వారు జంగాలు అని, వీరశైవులు అని, శివార్చకులు అని, లింగాయతులు అని, బలిజలు అని, స్మార్తులు అని, . చాత్తాద శ్రీ వైష్ణవులు అని,రాద్దాంతం మొదలైంది...

అట్టి వారందరికీ అ సాంప్రదాయమును అనుసరిస్తన్న వానిగా ఇదే నా సమాధానం.గా భావించి స్వస్థత పొధుతారని ఆశిస్తాను...

క్లుప్తంగా వివరిస్తున్నాను...బ్రాహ్మణ వర్ణంలో శ్రీ వైష్ణవ, నియోగ, వైదిక, శైవ సాంప్రదాయాలు అనాదిగా ఉన్నాయి...అందులో వైష్ణవ సాంప్రదాయమును అనుసరించే వారు శ్రీ వైష్ణవులు గాను...,గ్రామ కార్యక్రమాలు నిర్వహించడానికి ఆనాటి ప్రభువులచే నియోగింపబడినవారిని ఆరువేల నియోగులని లేదా కరణాలు అని....యజ్ఞయాగాది అనిష్ఠాన క్రియలు చేసేవారిని వైదికులని, శైవ సాంప్రదాయాన్ని అనుసరించే వారిని శైవులని వ్యవహరించారు...

దేశాన్ని, లేదా ఒక ప్రాంతం పాలించే రాజు ఏ మతానికి చెందిన వాడైతే ఆ మతం ప్రభావం, ప్రజలపై రాజులపై ఆ మత గురువుల ప్రభావం ఉండేది...అలా ద్రవిడదేశంలో, ఆంధ్ర దేశంలో ఊపిరి‌పోసుకున్నవే శైవ వైష్ణవ మతాలు...

శ్రీ వైష్ణవ మతం ప్రాచుర్యం పొందాలని ఆనాటి మతగురువులు ప్రజలందరికీ వైష్ణవ మతాన్ని స్వీకరిం చేసారు... అలా అన్ని కులాల వారు వైష్ణవం లోకి రావడంతో దానిలో మత్స్య, మాంస, మద్య‌ఇత్యాదులు స్వీకరించేవారు కూడా చేరారు...ఆ సమూహం లోనివారే..సాతాన్లు ( చాత్తాదులు ), హరిదాసులు, రంగదాసులు,. ఇత్యాదులు...వేద బాహ్యులు...(అప్పటి మాట) అసలు శ్రీ వైష్ణవులు మాత్రమే వేదప్రతిపాదితమైనవారు...వారే అసలైన వారని నా అభిప్రాయం...

ఇక శైవం:-

వైష్ణవ మతం లాగానే శైవ మత గురువులు రాజులను, ప్రజలను శైవ మతాన్ని అవలంబింవచ్చిను...అందుకు నిదర్శనం కర్ణాటకలో సాక్షాత్తు శివాంశ సంభూతునిగా పిలువబడే బసవేశ్వరులవారు, ద్రావిడాంధ్ర ప్రభువులు...వీరిలో కూడా ఆ కాలంలో మత్స్య మాంస మధిర, మొదలైన వారు ఉండేవారు... వారు వేద బాహ్యులై ఉండేవారు... వారిలో తెగలే, వీరశైవులు, లింగాయతులు, బలిజలు, జంగాలు, శివార్చకులు ఇలా వివిధ రకాలుగా పిలువబడ్డారు. (పిలువబడుతున్నారు)...శివలింగమును వీరు మెడలో ధరించి నిత్యశివపూజ చేసే చరలింగధారులు...

ఇక మొదట్లో తెలిపినట్లు బ్రాహ్మణ వర్ణంలో గురు స్థానాన్ని పొందినవారు శైవులు్...వీరికి వేదం ప్రమాణం...లింగ ధారణ, ఉపదేశాది క్రతువులు, వేద ప్రతిపాదిత మైన శైవ సాంప్రదాయ కార్యక్రమాల నిర్వహణ తదితరములు చేస్తుంటారు

శివలింగం మెడలో ధరించి నిత్యం శివపూజ చేయడం ప్రదాన కర్తవ్యం... ప్రాణలింగముగా భావిస్తార...శివారాధన చేయడం, ఇతరులచే ఆరాధింపబడేవారు కనుక ఆరాధ్యులు అనడం జరిగింది. 

చర్చకు మూలమైన విషయం బాలుగారు ఆరాధ్య సాంప్రదాయమునకు చెందినవారు అగుటచే వారిని ఖననం చేసారు... మేము ఇలాగే చేస్తాము...మరొక విషయం ఇతరుల అందరి వలె అపర కర్మలలో చేసే పిండప్రదాన ప్రక్రియ కానీ, యజ్ఞోపవీత సవ్యాపవసవ్య మార్పులు కానీ ఉండవు...భోక్త అని పిలువము...దశ, ద్వాదశ దిన కర్మలలో వచ్చిన( భోక్త ) వారిని మహేశ్వరునిగా భావించి, ఈశ్వరునకు ఏ విదంగా నైతే పూజలు చేస్తామో అదే విధంగా ,అర్చన చేస్తాము...శివారాధనలో యజ్ఞోపవీతం అపసవ్యం ఉండదు కదా...

మరొక విషయం మనందరికీ తెలిసిన మహామహులు , ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వర రావు గారు, కందుకూరి శివానంద మూర్తి గురువుగారు, సినీ దిగ్గజాలు కాశీనాధుని విశ్వనాధ్ డైరెక్టర్, యస్.పి కోదండపాణి గారు, హీరో చంద్రమోహన్ గారు, అమృతాంజనం ఔషధాన్ని కనిపెట్టిన, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు ఇలాంటి మహనీయులు అందరూ శ్రౌత శైవ ఆరాధ్య సాంప్రదాయములో పుట్టిన వారే...కనుక మన 

S.P. BALA SUBRAHMANYAM గారిని ఖననం చేసారు. ‌

.‌..మీ అనుమానం నివృత్తి అయిందని తలుస్తాను.

మానవులుగా బతకటం

 🌹🌹🌹👏👏👏

*మానవులుగా బతకటం కాదు.. మానవత్వంతో బతకాలి*

💐💐💐💐💐

*_ఐకమత్యం అంటే మనం కుక్కమీద రాయి విసిరితే కుక్కపారిపోతుంది. అదే.. తేనెతుట్టి మీద విసిరితే మనమే పారిపోవాలి !_*

*_ఇద్దరు కొట్టుకుంటే.. ఒక్కరే గెలుస్తారు. రాజీపడితే... ఇద్దరూ గెలుస్తారు !_*

*_దేవుడికోసం తీర్ధాలు, పుణ్యక్షేత్రాలంటూ తిరుగుతావ్, ఆయనెక్కడోలేడు. శ్వాస తీసుకుంటూ సృష్టితో నువ్వేసుకున్న 'లంకె'లోనేవున్నాడు._*

*_సృష్టంతా అద్భుతమే. అందులో నువ్వూ భాగమే. ఆ అద్భుతమే భగవానుడు. అది తెలుసుకుని దాన్ని అనుభవించు, ఆనందించు._*

*_కష్టమొస్తే భగవంతుణ్ణి కొలుస్తావు. ఆయన నీకు రాబోయే కష్టాన్ని ఆపడు. నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని గోరంత చేసి, సులువుగా దాటే శక్తి నీకిస్తాడు. కష్టాలు కుంభవృష్టిలా నిన్ను ముంచేస్తే... నీకు గొడుగుపట్టి కాపాడతాడు... గుర్తుంచుకో !_*

*_జ్ఞానం.. ఆలోచించి మాట్లాడుతుంది. అజ్ఞానం.. మాట జారాక ఆలోచిస్తుంది. అమాంతం అజ్ఞానం పోయి జ్ఞానంరాదు._*

*_కొబ్బరిచెట్టు పెరిగేకొద్దీ పాతమట్టలు రాలిపోతాయి. జ్ఞానం కలిగేకొద్దీ తనపర భేదాలు తొలగిపోతాయి._*

*_పుండు మానితే పొలుసు అదేపోతుంది. పుండు మానకుండానే పొలుసు పీకేస్తే… పుండు తీవ్రమై రక్తం కారుతుంది ! జ్ఞానసిద్ధి అంచెలంచెలుగా కలగాలి. ఆత్రపడితే లాభంలేదు !_*

*_సముద్రమంత సమస్యొచ్చిందని దిగులుపడకు. ఆకాశమంత అవకాశం కూడా వుంది. తలెత్తి చూడు ముందు. నీపై నీకు నమ్మకం కావాలి._*

*_నీపై నమ్మకం నీకుబలం. నీపై అపనమ్మకం అవతలివారికి బలం !నీబలం ఎవరికీ తెలియకపోయినా నీవు బ్రతికేయవచ్చు.. నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు నిన్ను నిన్నుగా బ్రతకనివ్వరు !_*

*_మరణం అంత మధురమైనదా ? ఒక్కసారి దాన్ని కలిసినవారు వదిలిపెట్టలేరు ?ప్రకృతికి కూడా అదంటే ఎంత పక్షపాతం ! ప్రాణంపోయిన జీవుల్ని నీళ్ళలో తేలుస్తుంది. ప్రాణమున్న జీవుల్ని నీళ్ళలో ముంచుతుంది !_*

*_నీపరిసరాలనెంత శుభ్రంగా వుంచినా నీకు అనారోగ్యం రావచ్చు. బుద్ధి అనే ఆసుపత్రిలో ఆలోచనలు అనే వైద్యుడు నీ రోగాలను తగ్గించగలడు. వాటిని ఆరోగ్యంగా వుంచుకో._*

*_వెంటరాని ఇంటిని, ఒంటిని రోజూ కడుగుతావ్.. నీవెంట వచ్చే మనసునెప్పుడు కడుగుతావు ?_*

*_నిజాయితీపరులు సింహంలాంటి వాళ్ళు. సింహం కూర్చోటానికి సింహాసనమెందుకు ? అదెక్కడ కూర్చుంటే అదే సింహాసనం. నిజమైన నిజాయితీపరులకు గుంపు అక్కర్లేదు !_*

*_ముని-మహర్షి-తపస్వి-యోగి.. వీరు వేరువేరు._*

*_మౌనంగావుండేవాడు ముని._*

*_నియమనిష్టలతో తపింపచేసుకునే వాడు తపస్వి._* 

*_అతీంద్రియ శక్తుల్ని ఆకళింపు చేసుకున్నవాడు ఋషి._*

*_ధ్యానంలో మునిగి వుండేవాడు యోగి._*

*_పండు తింటే అరిగిపోతుంది. తినకపోతే ఎండిపోతుంది. జీవితం నువ్వు ఖుషీగా గడిపినా, భయపడుతూ గడిపినా కరిగిపోతుంది !_*

*_ఇప్పటిదాకా ఇతరుల కోసమే (నావాళ్ళనుకుంటూ) బతికేశావు. ఇప్పటికైనా ఆరోగ్యంగా, ఆనందంగా నీకోసం నువ్వు బతుకు._*

*_వచ్చే జన్మలో నువ్వెవరో, ఎక్కడ, ఎలా పుడతావో, అసలు జన్మవుందో లేదో తెలీదు._*

*_నువ్వు 'నావాళ్ళు నావాళ్ళు' అనుకుంటుంటే వాళ్ళు తర్వాత 'వాళ్ళవాళ్ళకోసమే' బతుకుతారు. నీకంటూ ఎవరూ ఉండరు. ఏమీ మిగలదు !_*

*_అర్ధం చేసుకుంటే.. పుట్టిందగ్గర్నుంచీ- పోయేందుకే మన ప్రయాణం ! ఈమాత్రం దానికి పుట్టటమెందుకో తెలియదు. తెలుసుకోటంలోనే వుంది కిటుకంతా.. అందుకే ఈ జీవితమంతా !_*

*_మరణం దగ్గరపడితేనే మహాసత్యాలు బోధపడ్తాయ్._*

*_పని చేయటానికి పనిమనిషి దొరుకుతుంది. వంట చెయ్యటానికి వంటవాళ్ళు దొరుకుతారు._* *_రోగమొస్తే నీబదులు భరించటానికి ఎవరూ దొరకరు._*

*_వస్తువుపోతే దొరకచ్చు.. జీవితం పోతే మళ్ళీ దొరకదు తెరపడేరోజు ఏంతెలిసినా ప్రయోజనమేంటి ?_*

*_పక్కనెంతమందున్నా,ఎంత సంపదున్నా ఏంటి ?_*

*_30 లక్షల కారైనా, 3 వేల సైకిలైనా రోడ్డు ఒకటే.. పదంతస్తుల మేడైనా, పూరిగుడిసైనా వదిలేసే పోవాలి !_*

*_జనరల్ బోగీలో వెళ్ళినా, ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించినా స్టేషన్ రాగానే ఒకేసారి దిగిపోతారు !_*

*_మానవులుగా బతకటం కాదు.._*

*_మానవత్వంతో బతకాలి !_*

*లోకా సమస్తా సుఖినోభవంతు*

🌷🌷🌷👏👏

          *_మీ_*

*_ టీ. వైద్యనాథ్ న్యాయవాది_*

🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

భాగవతామృతం

 **

శ్రీకృష్ణుడు తనభామలను చూడబోవుట

1-262-వ.వచనము

తదనంతరంబ యష్టోత్తర శత షోడశసహస్ర సౌవర్ణసౌధకాంతం బయిన శుద్ధాంతభవనంబు సొచ్చి హరి తన మనంబున.

తదనంతరంబ = ఆ తరువాత; అష్టోత్తరశతషోడశసహస్ర = పదహారు వేలనూట ఎనిమిది, సహస్ర +షోడశ +శత +అష్ట *; సౌవర్ణ = బంగారు; సౌధ = మేడలలో; కాంతంబు = కాంతలున్నవి, భార్యలు ఉన్నవి; అయిన = అయినట్టి; శుద్ధాంత = అంతఃపుర; భవనంబు = భవనములు; చొచ్చి = ప్రవేశించి; హరి = కృష్ణుడు; తన = తనయొక్క; మనంబున = మనసులో.

పిమ్మట గోవిందుడు పదహారువేల నూటయెనిమిది స్వర్ణ సౌధాలతో కూడిన అంతఃపుర ప్రాంగణంలోకి ప్రవేశిస్తూ ఇలా అనుకొన్నాడు.

1-263-మ.మత్తేభ విక్రీడితము

ఒక భామాభవనంబు మున్నుసొర వేఱొక్కర్తు లోఁగుందునో

సుకరాలాపము లాడదో సొలయునో సుప్రీతి వీక్షింపదో

వికలత్వంబున నుండునో యనుచు నవ్వేళన్ వధూగేహముల్

ప్రకటాశ్చర్యవిభూతిఁ జొచ్చె బహురూపవ్యక్తుఁడై భార్గవా!

ఒక = ఒక; భామా = భార్య యొక్క; భవనంబు = భవనము; మున్ను = ముందుగ; చొరన్ = చేరితే; వేఱొకర్తు = ఇంకొకామె; లోన్ = మనసులో; కుందునో = క్రుంగునేమో; సుకర = సుఖకరములైన; ఆలాపములు = మాటలు; ఆడదో = పలుకదేమో; సొలయునో = వైముఖ్యమును పొందునేమో; సుప్రీతిన్ = బాగా ప్రేమతో; వీక్షింపదో = చూడదేమో; వికలత్వంబునన్ = చెదిరినమనసుతో; ఉండునో = ఉండునేమో; అనుచున్ = అనుకొనుచు; ఆ = ఆ; వేళన్ = సమయములో; వధూ = భార్యల; గేహముల్ = గృహములు; ప్రకట = ప్రకటింపబడిన; ఆశ్చర్య = ఆశ్తర్యకరమైన; విభూతిన్ = వైభవముతో; చొచ్చె = ప్రవేశించెను; బహు = అనేకములైన; రూప = రూపములతో; వ్యక్తుఁడు = వ్యక్తమైనవాడు, కనిపించినవాడు; ఐ = అయి; భార్గవా = శౌనకా {భార్గవ - భృగు వంశమున జన్మించినవాడు, శౌనకుడు}.

ముందుగా ఒక సతి మందిరానికి వెళ్తే వేరొకామె కుందుతుందేమో; తొందరపాటుతో సరిగా మాట్లాడదేమో; సొక్కిపోతుందేమో; ప్రేమతో వీక్షించదేమో; వైకల్యం వహిస్తుందేమో అని అందరు భార్యల గృహాలలోకి అన్ని రూపాలు ధరించి అత్యద్భుతమైన మహిమతో ఒకేమారు ప్రవేశించాడు.

1-264-వ.వచనము

ఆ సమయంబున

ఆ = ఆ; సమయంబున = సమయమున.

ఆవిధంగా వచ్చిన తమ హృదయేశ్వరుడైన నందనందనుణ్ణి చూసి.

1-265-క.కంద పద్యము

శిశువులఁ జంకలనిడి తను

కృశతలు విరహాగ్నిఁ దెలుప గృహగేహళులన్

రశనలు జాఱఁగ సిగ్గున

శశిముఖు లెదురేఁగి రపుడు జలజాక్షునకున్.

శిశువులన్ = పిల్లలను; చంకలన్ = చంకలో; ఇడి = ఉంచి, ఎత్తుకొని; తను = శరీరము; కృశతలు = చిక్కిపోవుటలు; విరహ = ఎడబాటు అనే; అగ్నిన్ = అగ్నిని; తెలుప = తెలుపుతుండగ; గృహ = ఇంటి; గేహళులన్ = గుమ్మములలో; రశనలు = మొలనూళ్లు; జాఱఁగ = జారిపోతుండగ; సిగ్గున = లజ్జవలన; శశిముఖులు = స్త్రీలు {శశిముఖులు - (కుందేలు కలవాడు) చంద్రునివంటి ముఖము కలవారు / స్త్రీలు}; ఎదుర = ఎదురుగ; ఏఁగిరి = వెళ్ళిరి; అపుడు = ఆ సమయమున; జలజాక్షున్ = కృష్ణుని {జలజాక్షుడు - (నీట పుట్టిన) పద్మములవంటి కన్నులు ఉన్నవాడు, కృష్ణుడు}; కున్ = కి.

ఆ చంద్రముఖు లందరు చంటిబిడ్డలను చంకలలో ఎత్తుకొని, విరహతాపంవల్ల చిక్కిపోయిన శరీరాలతో, దిగ్గున లేచి కాంచీకలాపాలు జారిపోగా సిగ్గుతో యదుచంద్రునికి ఎదురువచ్చారు.

1-266-మ.మత్తేభ విక్రీడితము

పతి నా యింటికి మున్ను వచ్చె నిదె నా ప్రాణేశుఁ డస్మద్గృహా

గతుఁడయ్యెన్ మును సేరెఁ బో తొలుత మత్కాంతుండు నా శాలకే

నితరాలభ్య సుఖంబు గంటి నని తారింటింట నర్చించి ర

య్యతివల్ నూఱుఁబదారువేలు నెనమం డ్రవ్వేళ నాత్మేశ్వరున్.

పతి = భర్త; నా = నాయొక్క; ఇంటి = ఇంటి; కిన్ = కి; మున్ను = ముందు; వచ్చెన్ = వచ్చెను; ఇదె = ఇదిగో; నా = నాయొక్క; ప్రాణేశుఁడు = భర్త {ప్రాణేశుడు - ప్రాణములకు ఈశ్వరుడు, భర్త}; అస్మత్ = మాయొక్క; గృహా = ఇంటికి; ఆగతుఁడు = వచ్చినవాడు; అయ్యెన్ = ఆయెను; మును = ముందుగ; సేరెన్ = చేరెను; పో = కదా; తొలుత = ముందు; మత్ = నాయొక్క; కాంతుండు = ప్రియుడు; నా = నాయొక్క; శాల = ఇంటి; కిన్ = కి; ఏన్ = నేను; ఇతర = ఇంకొక విధమున; అలభ్య = లభ్యము కానట్టి; సుఖంబున్ = సుఖమును; కంటిని = చూసితిని; అని = అని; తారు = తాము; ఇంటింటన్ = అన్ని ఇళ్ళలోను; అర్చించిరి = పూజించిరి; ఆ = ఆ; అతివల్ = స్త్రీలు; నూఱుఁ బదారువేలు నెనమండ్రు = నూటపదహారువేల ఎనమిదిమంది / నూఱు + పదారు * వేలు + ఎనమండ్రు; ఆ = ఆ; వేళన్ = సమయములో; ఆత్మ = తమ; ఈశ్వరున్ = భర్తను.

పదహారువేల నూట యెనిమిదిమంది రమణీమణులు”యిదుగో నా భర్త తొట్టతొలుత నా యింటికే వచ్చాడు. నా మనోనాథుడు ముందుగా నా గృహంలోనే అడుగుపెట్టాడు. నా ప్రాణేశ్వరుడు నా మందిరానికే ముందుగా చేరాడు. అనన్య సామాన్యమైన ఆనందాన్ని నేనే పొందాను” అనుకొంటూ ఇంటింటా తమ ఆత్మేశ్వరుణ్ణి ఆర్చించారు.

1-267-వ.వచనము

వారలం జూచి హరి యిట్లనియె.

వారలన్ = వారిని; చూచి = చూసి; హరి = హరి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

ఆ శుభ సమయంలో ప్రేమాస్పదుడైన శ్రీకృష్ణుడు ఆ కామినీమణులను ఇలా క్షేమసమాచారాలు అడిగాడు.

1-268-మ.మత్తేభ విక్రీడితము

"కొడుకుల్ భక్తివిధేయు లౌదురు గదా? కోడండ్రు మీ వాక్యముల్

గడవంజాలక యుందురా? విబుధ సత్కారంబు గావింతురా?

తొడవుల్ వస్త్రములుం బదార్థ రస సందోహంబులుం జాలునా?

కడమల్ గావు గదా? భవన్నిలయముల్ గల్యాణయుక్తంబులే?

కొడుకుల్ = కొడుకులు; భక్తి = భక్తితో; విధేయులు = లొంగినవారు; ఔదురు = అవుతారు; కదా = కదా; కోడండ్రు = కోడళ్ళు; మీ = మీ యొక్క; వాక్యముల్ = మాటలు; గడవన్ = దాటుటకు; చాలక = సరిపోకుండగ; ఉందురా = ఉంటారా; విబుధ = పండితులకు; సత్కారంబున్ = మర్యాదలు; కావింతురా = చేయుదురా; తొడవుల్ = ఆభరణములు; వస్త్రములున్ = బట్టలు; పదార్థ = పదార్థములు; రస = రసముల; సందోహంబులున్ = సమూహములు; చాలునా = సరిపోవుచున్నవా; కడమల్ = కొరతలు; కావున్ = కలుగుట లేదు; కదా = కదా; భవత్ = మీయొక్క; నిలయముల్ = ఇండ్లలో; కల్యాణ = శుభములు; యుక్తంబులే = కూడినవేనా.

“మీ కొడుకులు వినయవినమ్రులై మీ ఆజ్ఞలను పాలిస్తున్నారా; మీ కోడళ్లు మీ మాటలు జవదాటకుండ ఉన్నారా; బాగా చదువుకున్న విద్వాంసు లరుదెంచి నప్పుడు సత్కారాలు చేస్తున్నారా; నగలు, చీరలు, రసవంతాలైన మధర పదార్థాలు సమస్తం సమృద్ధిగా ఉన్నాయా; మీకు ఎట్టి లోటూ వాటిల్లటం లేదు కదా.

1-269-సీ.సీస పద్యము

తిలక మేటికి లేదు తిలకనీతిలకమ! ;

పువ్వులు దుఱుమవా పువ్వుఁబోఁడి!

కస్తూరి యలఁదవా కస్తూరికాగంధి! ;

తొడవులు దొడవవా తొడవుతొడవ!

కలహంసఁ బెంపుదే కలహంసగామిని! ;

కీరముఁ జదివింతె కీరవాణి!

లతలఁ బోషింతువా లతికాలలిత దేహ! ;

సరసి నోలాడుదే సరసిజాక్షి!

1-269.1-ఆ.

మృగికి మేఁత లిడుదె మృగశాబలోచన!

గురుల నాదరింతె గురువివేక!

బంధుజనులఁ బ్రోతె బంధుచింతామణి!

యనుచు సతులనడిగెనచ్యుతుండు."

తిలకము = నుదిటి బొట్టు; ఏటి = ఎందుల; కిన్ = కు; లేదు = లేదు; తిలకనీ = తిలకము ధరించువారిలో / స్త్రీలలో; తిలకమా = గౌరవింపదగినదానా; పువ్వులున్ = పువ్వులను; తుఱుమవా = ధరింపవా; పువ్వున్ = పువ్వులవంటి; బోఁడి = శరీరము కలదానా; కస్తూరి = కస్తూరి అనే శ్రేష్ఠ మైన సుగంధం; అలఁదవా = రాయవా; కస్తూరికా = కస్తూరివంటి; గంధి = వాసన కలదానా; తొడవులు = ఆభరణములు; తొడవవా = ధరింపవా; తొడవు = ఆభరణములకే; తొడవ = ఆభరణమా; కలహంసన్ = (మధుర కంఠధ్వని) కలహంసలను; పెంపుదే = పెంచుతున్నావా; కలహంస = చక్కటిహంస; గామిని = నడక కలదానా; కీరమున్ = చిలుకలకు; చదివింతె = మాటలు చెప్పుతావా; కీర = చిలుకపలుకుల వంటి; వాణి = కంఠము కలదానా; లతలన్ = లతలను; పోషింతువా = పెంచుతావా; లతికా = పూలతీగవలె; లలిత = సుకుమార; దేహ = దేహము కలదానా; సరసిన్ = కొలనులో; ఓలాడుదే = జలకాలాడుదే; సరసిజ = పద్మముల వంటి; అక్షి = కన్నులు ఉన్నదానా;

మృగి = లేడి; కిన్ = కి; మేఁతల్ = గడ్డి / మేతలు; ఇడుదె = ఇచ్చెదవా; మృగ = లేడి; శాబ = పిల్లకి వంటి; లోచన = కన్నులు ఉన్నదానా; గురులన్ = గురువులను / పెద్దలను; ఆదరింతె = ఆదరించెదవా; గురు = గొప్ప; వివేక = వివేకము కలదానా; బంధుజనులన్ = బంధువులను; ప్రోతె = రక్షింతువా; బంధు = బంధువులకు; చింత = తలచినవి; ఆమణి = ఇచ్చుదానా; అనుచున్ = అంటూ; సతులన్ = భార్యలను; అడిగెన్ = అడిగెను; అచ్యుతుండు = కృష్ణుడు {అచ్యుతుడు - నాశము లేని వాడు, విష్ణువు}.

నుదుటికి బొట్టంత ఉన్నతురాలా! నుదట బొట్టెందుకు పెట్టుకోలేదు? పువ్వులాంటి మృదువైన మోహనాంగి! తలలో పూలు పెట్టుకున్నావా? కస్తూరి పరిమాళాలు వెదజల్లే కాంతా! కస్తురి రాసుకున్నావా? అలంకారాలకే అందాన్నిచ్చే అందగత్తె! ఆభరణాలు అలంకరించుకున్నావా. హంసనడకల చిన్నదాన! కలహంసలని పెంచుతున్నావా? చిలుకపలుకుల చిన్నారి! చిలుకలకి పలుకులు నేర్పుతున్నావా లేదా? పూతీగె అంతటి సుకుమారమైన సుకుమారి! పూలమొక్కలు పెంచుతున్నావా? పద్మాక్షి! కొలనులలో ఈతలుకొడుతున్నావు కదా? లేడికన్నుల లేమ! లేడికూనలకి మేత మేపుతున్నావు కదా? మహా వివేకవంతురాలా! పెద్దలను చక్కగా గౌరవిస్తున్నావు కదా? బందుప్రేమకి పెరుపొందిన పడతీ! బంధువుల నందరిని ఆదరిస్తున్నావు కదా?” అంటూ ప్రియకాంతల నందరినీ పరామర్శించాడు.

1-270-వ.వచనము

అని యడిగిన వారలు హరిం బాసిన దినంబు లందు శరీరసంస్కార కేళీవిహార హాస వనమందిరగమన మహోత్సవదర్శనంబు లొల్లని యిల్లాండ్రు కావున.

అని = ఆ విధముగా; అడిగినన్ = అడుగగా; వారలు = వారు; హరిన్ = కృష్ణుని; పాసిన = ఎడబాటు చెందిన; దినంబులు = రోజులు; అందున్ = లో; శరీర = శరీరములను; సంస్కార = చక్కదిద్దు కొనుటలు; కేళీ = సరదాలకి; విహార = విహరించుటలు; హాస = నవ్వుటలు; వన = వనములకు; మందిర = మందిరములకు; గమన = వెళ్ళుటలు; మహోత్సవ = మహోత్సవములను; దర్శనంబులు = చూడబోవుటలు; ఒల్లని = అంగీకరింపని; ఇల్లాండ్రు = భార్యలు; కావున = అగుట మూలమున.

ఆ కాంత లంతా తమ కాంతుడు ద్వారకలో లేని దినాలలో శరీర సంస్కారాలు, లీలా విలాసాలు, పరిహాస భాషణాలు, ఉద్యాన విహారాలు, ఆలయ గమనాలు, మహోత్సవ సందర్శనాలు ఇష్టపడని ఇల్లాండ్రు. అందువల్ల వారు.

1-271-మ.మత్తేభ విక్రీడితము

సిరి చాంచల్యముతోడిదయ్యుఁ దనకున్ జీవేశ్వరుం డంచు నే

పురుషశ్రేష్ఠు వరించె నట్టి పరమున్ బుద్ధిన్ విలోకంబులన్

గరయుగ్మంబులఁ గౌఁగిలించిరి సతుల్ గల్యాణబాష్పంబు లా

భరణశ్రేణులుగాఁ బ్రతిక్షణ నవప్రాప్తానురాగంబులన్.

సిరి = లక్ష్మి; చాంచల్యము = చంచలత్వము; తోడిది = కూడినది; అయ్యున్ = అయినప్పటికి; తన = తన; కున్ = కు; జీవేశ్వరుండు = భర్త, జీవమునకు ఈశ్వరుడు; అంచున్ = అనుచు; ఏ = ఏ; పురుషశ్రేష్ఠున్ = కృష్ణుని {పురుషశ్రేష్ఠుడు - పురుషులలో శ్రేష్ఠుడు, విష్ణువు}; వరించెన్ = వరించెను; అట్టి = అటువంటి; పరమున్ = అందరికన్న పైన ఉన్నవానిని; బుద్ధిన్ = బుద్ధిశాలిని; విలోకంబులన్ = చూపులతో; కర = చేతుల; యుగ్మంబులన్ = జంటలతో; కౌఁగిలించిరి = ఆలింనగనము చేసిరి; సతుల్ = సత్ప్రవర్తన కల స్త్రీలు; కల్యాణ = ఆనందపు; బాష్పంబులు = కన్నీళ్ళు; ఆభరణ = ఆభరణముల; శ్రేణులుగాన్ = వరుసలుగా; ప్రతిక్షణ = క్షణక్షణము; నవ = కొత్తగా; ప్రాప్త = పొందబడిన; అనురాగంబులన్ = అనురాగములతో.

తన జీవితేశ్వరుడని ఏ పురుషోత్తముణ్ణి వరించి, చంచల స్వాభావం కలదైన శ్రీదేవి ఒక్క క్షణం కూడ వదలిపెట్టకుండా ఉందో, అటువంటి పరమాత్ముణ్ణి ముందు మనస్సుతో, తరువాత చూపులతో, అటుపిమ్మట చేతులతో ఆనందాతిశయంతో కనుల వెంట ద్రవించే కల్యాణ బాష్పాలు అణిముత్యాల సరాలుగా జాలువారుతుండగ, క్షణక్షణం క్రొత్తదనంతో కూడిన అనురాగంతో గట్టిగా కౌగిలించుకొన్నారు.

1-272-మత్త.మత్తకోకిల

పంచబాణుని నీఱు సేసిన భర్గునిం దన విల్లు వ

ర్జించి మూర్ఛిలఁ జేయఁ జాలు విశేష హాస విలోక నో

దంచి దాకృతులయ్యుఁ గాంతలు దంభచేష్టల మాధవుం

సంచలింపఁగ జేయ నేమియుఁ జాలరైరి బుధోత్తమా!

పంచబాణుని = మన్మథుని {పంచబాణుడు - ఐదు బాణముల వాడు, మన్మథుడు}; నీఱు = భస్మము; సేసిన = చేసిన; భర్గునిన్ = శివుని; తన = తనయొక్క; విల్లు = ధనస్సు; వర్జించి = వదిలివేసి; మూర్ఛిల్లన్ = మూర్చ పోవునట్లు; చేయన్ = చేయుటకు; చాలు = సరిపడ; విశేష = విశిష్టమైన; హాస = నవ్వులు; విలోకన = చూపులు; ఉదంచిత = మిక్కిలి శోభ కలిగిన; ఆకృతులు = ఆకారములు కలవారు; అయ్యున్ = అయినప్పటికిని; కాంతలు = స్త్రీలు; దంభ = కపట; చేష్టలన్ = చేష్టలతో; మాధవున్ = కృష్ణుని {మాధవుడు - మాధవి భర్త, కృష్ణుడు}; సంచలింపఁగన్ = మనసుని చలింపగా; చేయన్ = చేయుటకు; ఏమియున్ = ఏమాత్రము; చాలరు = చాలనివారు; ఐరి = అయిరి; బుధోత్తమా = ఙ్ఞానులలో శ్రేష్ఠుడా, శౌనకుడా.

ఓ సుధీసత్తమా! మన్మథుని మూడోకంటి మంటతో నుసి చేసిన మహాశ్వరుని సైతం విల్లు పడేసి మూర్ఛపోయేలా చేసే చిరునవ్వులు, వాల్చూపులు, మనోహర మైన దేహాలు కల వాళ్ళు అయి కూడ ఆ కాంతలు తమ శృంగార చేష్టలతో మాధవుని మనస్సు చలింప చేయ లేకపోయారు.

1-273-వ.వచనము

ఇవ్విధంబున సంగవిరహితుం డైన కంసారి సంసారికైవడి విహరింప నజ్ఞాన విలోకులయిన లోకులు లోక సామాన్య మనుష్యుం డని తలంతు; రాత్మాశ్రయయైన బుద్ధి యాత్మ యందున్న యానందాదులతోడం గూడని తెఱంగున నీశ్వరుండు ప్రకృతితోడం గూడియు నా ప్రకృతిగుణంబులైన సుఖదుఃఖంబులఁ జెందక యుండుఁ; బరస్పర సంఘర్షణంబులచే వేణువులవలన వహ్నిఁ బుట్టించి వనంబుల దహించు మహావాయువు చందంబున భూమికి భారహేతువులై యనేకాక్షౌహిణులతోడం బ్రవృద్ధతేజులగు రాజుల కన్యోన్యవైరంబులు గల్పించి నిరాయుధుండై సంహారంబు సేసి, శాంతుండై పిదపం గాంతామధ్యంబునఁ బ్రాకృతమనుష్యుండునుం బోలె సంచరించుచుండె నా సమయంబున.

ఈ = ఈ; విధంబున = విధముగ; సంగ = సంబంధము, బంధనములు; విరహితుండు = లేనివాడు; ఐన = అయినట్టి; కంసారి = కృష్ణుడు {కంసారి - కంసునకు శత్రువు, కృష్ణుడు}; సంసారి = సంసార బంధములు ఉన్నవాని; కైవడి = వలె; విహరింపన్ = చరించుచుండగ; అజ్ఞాన = అజ్ఞానముతోకూడిన; విలోకులు = దృష్టికలవారు; అయిన = అయినట్టి; లోకులు = ప్రజలు; లోక = లోకములో; సామాన్య = సామాన్యముగా ఉండు; మనుష్యుండు = మానవుడు; అని = అని; తలంతురు = అనుకొందురు; ఆత్మా = ఆత్మను; ఆశ్రయ = ఆశ్రయించినది; ఐన = అయినట్టి; బుద్ధి = బుద్ధి; ఆత్మ = ఆత్మ; అందున్ = లో; ఉన్న = ఉన్నట్టి; ఆనంద = ఆనందము; అదులు = మొదలగువాటి; తోడన్ = తో; కూడని = కూడకుండగా ఉండు; తెఱంగునన్ = విధముగ; ఈశ్వరుండు = హరి; ప్రకృతి = ప్రకృతి; తోడన్ = తో; కూడియున్ = కూడి ఉన్నప్పటికిని; ఆ = ఆ; ప్రకృతి = ప్రకృతి యొక్క; గుణంబులు = గుణములు; ఐన = అయినట్టి; సుఖ = సుఖములను; దుఃఖంబులన్ = దుఃఖములను; చెందక = సంబంధములేక; ఉండున్ = ఉండును; పరస్పర = ఒకదానికొకటి; సంఘర్షణంబుల = రాసుకొనుట, ఒరసికొనుట; చేన్ = చేత; వేణువుల = వెదుళ్ళు; వలనన్ = వలన; వహ్నిన్ = అగ్నిని; పుట్టించి = పుట్టించి; వనంబులన్ = అడవులను; దహించు = కాల్చివేయు; మహా = గొప్ప; వాయువు = గాలి; చందంబున = వలె; భూమి = భూమండలము; కిన్ = నకు; భార = బరువు పెరుగుటకు; హేతువులు = కారణములు; ఐ = అయి; అనేక = లెక్కకుమించిన; అక్షౌహిణులు = అక్షౌహిణులు; తోడన్ = తో; ప్రవృద్ధ = బాగుగా పెరిగిన; తేజులు = తేజస్సుకలవారు; అగు = అయిన; రాజులు = రాజులు; కున్ = కి; అన్యోన్య = వారిలోవారికి; వైరంబులు = శత్రుత్వములు; కల్పించి = కలుగజేసి; నిరాయుధుండు = ఆయుధములు లేనివాడు; ఐ = అయి; సంహారంబున్ = సంహారమును; చేసి = చేసి; శాంతుండు = శాంతిపొందినవాడు; ఐ = అయి; పిదపన్ = తరువాత; కాంతా = స్త్రీల; మధ్యంబునన్ = మధ్యలో; ప్రాకృత = సామాన్య; మనుష్యుండునున్ = మానవుని; పోలెన్ = వలె; సంచరించుచు = తిరుగుతూ; ఉండెన్ = ఉండెను; ఆ = ఆ; సమయంబునన్ = సమయములో.

ఈ విధంగా సర్వసంగ పరిత్యాగియైన కంసారి, సంసారిలాగా విహరించటం చూసి, మూర్ఖులైన లోకులు సామాన్య మానవునిగా భావిస్తారు. ఆత్మాశ్రయమైన బుద్ధి ఆత్మగతమైన గుణాలతో కలవని విధంగా పరమేశ్వరుడు ప్రకృతితో కలిసి ఉండి కూడా ఆ ప్రకృతిగుణాలైన సుఖదుఃఖాలను పొందకుండా ఉంటాడు. వెదురు గడలకు పరస్పరం సంఘర్షణ కలిగించి. అగ్ని పుట్టించి. అరణ్యాలను దహించే మహాప్రభంజనం వలె వాసుదేవుడు, అనేక అక్షౌహిణీ సైన్యాలతో భూమికి బరువుచే టైన, ప్రవృద్ధ తేజులైన రాజులకు అన్యోన్యకలహాలు కల్పించి తాను మాత్రం ఆయుధం పట్టకుండా దుష్టసంహారం చేయించి పరమశాంతుడై ఇప్పుడు అంతఃపురాలలో కాంతాజనము మధ్యలో సామాన్య మానవుని వలె సంచరిస్తున్నాడు.

1-274-క.కంద పద్యము

యతు లీశ్వరుని మహత్త్వము

మిత మెఱుఁగని భంగిఁ నప్రమేయుఁడగు హరి

స్థితి నెఱుఁగక కాముకుఁ డని

రతములు సలుపుదురు తిగిచి రమణులు సుమతీ!

యతులు = ఇంద్రియములను నియమించినవారు; ఈశ్వరుని = కృష్ణుని; మహత్త్వము = గొప్పదనము యొక్క; మితమున్ = పరిమాణమును, హద్దులను; ఎఱుఁగని = తెలిసికొనలేని; భంగిన్ = విధముగ; అప్రమేయుఁడు = మితము లేనివాడు; అగు = అయినట్టి; హరి = కృష్ణుని; స్థితిన్ = స్థితిని; ఎఱుఁగకన్ = తెలిసికొనలేక; కాముకుఁడు = కామ ప్రకోపముతో నుండువాడు; అని = అని; రతములు = సురతములు; సలుపుదురు = చేయుదురు; తిగిచి = ఆకర్షించి; రమణులు = స్త్రీలు; సుమతీ = మంచి బుద్ధి కలవాడా.

ఓ బుద్ధిమంతుడైన శౌనకా! తపోనియతులైన యతులు పరమేశ్వరుని ప్రభావం ఇదమిత్థమని ఎరుగని విధంగా అప్రమేయుడైన వాసుదేవుని మహత్త్వన్ని గుర్తించకుండా కాముకుడనే భావంతో రమణులందరూ ఆ రమారమణునితో క్రీడించారు.

1-275-క.కంద పద్యము

ఎల్లప్పుడు మా యిండ్లను

వల్లభుఁడు వసించు; నేమ వల్లభలము శ్రీ

వల్లభున కనుచు గోపీ

వల్లభుచే సతులు మమతవలఁ బడి రనఘా!"

ఎల్లప్పుడు = ఎప్పుడు; మా = మా యొక్క; ఇండ్లను = ఇండ్ల యందే; వల్లభుఁడు = భర్త; వసించు = ఉండును; నేమ = మేమే; వల్లభలము = ప్రియ మైన వారము; శ్రీవల్లభు = కృష్ణున {శ్రీవల్లభుడు - లక్ష్మీపతి, విష్ణువు}; కున్ = కు; అనుచున్ = అంటూ; గోపీవల్లభు = కృష్ణుడు {గోపీవల్లభుడు - గోపికలకు ప్రియుడు, కృష్ణుడు}; చేన్ = చేత; సతులు = భార్యలు; మమత = మమకార మనెడి; వలన్ = వలలో; పడిరి = తగలు కొనిరి; అనఘా = పాపము లేనివాడా.

పుణ్యవంతుడైన శౌనక! మా వల్లభుడు మా గృహాలను ఎప్పుడు వదలిపెట్టడు, రమావల్లభు డైన యదువల్లభునకు మేమే ప్రియమైన వారమని భావిస్తు ఆ భామ లందరు యశోదానందనుని వలపుల వలలో చిక్కుకొన్నారు.”

1-276-వ.వచనము

అని చెప్పిన విని శౌనకుండు సూతున కిట్లనియె.

అని = అని; చెప్పిన = చెప్పగ; విని = వినిన; శౌనకుండు = శౌనకుడు; సూతున = సూతున; కున్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

ఈ విధంగా చెప్పిన సూతుని మాటలు విని శౌనకుడు ఇలా అన్నాడు.

1-277-సీ.సీస పద్యము

"గురునందనుండు సక్రోధుఁడై యేసిన;

బ్రహ్మశిరోనామబాణవహ్నిఁ

గంపించు నుత్తరగర్భంబు గ్రమ్మఱఁ;

బద్మలోచనుచేతఁ బ్రతికె నండ్రు;

గర్భస్తుఁ డగు బాలుఁ గంసారి యే రీతి;

బ్రతికించె? మృత్యువు భయము వాపి

జనియించి యతఁడెన్ని సంవత్సరములుండె? ;

నెబ్భంగి వర్తించె? నేమిసేసె?

1-277.1-ఆ.

వినుము, శుకుఁడు వచ్చి విజ్ఞానపద్ధతి

నతని కెట్లు సూపె నతఁడు పిదపఁ

దన శరీర మే విధంబున వర్జించె

విప్రముఖ్య! నాకు విస్తరింపు."

గురు = ద్రోణుని; నందనుండు = కొడుకు / అశ్వత్థామ; సక్రోధుఁడు = క్రోధముతో ఉన్నవాడు; ఐ = అయ్యి; యేసిన = ప్రయోగించిన; బ్రహ్మశిరస్ = బ్రహ్మశిరస్సు అను; నామ = పేరు కల; బాణ = బాణముయొక్క; వహ్నిన్ = అగ్నికి; కంపించు = వణికిపోతున్న; ఉత్తర = ఉత్తరయొక్క; గర్భంబున్ = గర్భమును; క్రమ్మఱన్ = మరల; పద్మలోచను = కృష్ణుని; చేతన్ = వలన; బ్రతికెను = బ్రతికెను; అండ్రు = అందురు; గర్భస్తుఁడు = గర్భములో ఉన్నవాడు; అగు = అయినట్టి; బాలున్ = పిల్లవానిని; కంసారి = కృష్ణుడు; ఏ = ఏ; రీతి = విధముగ; బ్రతికించెన్ = బ్రతికించెను; మృత్యువు = మరణము వలన; భయమున్ = భయమును; వాపి = పోగొట్టి; జనియించి = పుట్టి; అతఁడు = అతడు; ఎన్ని = ఎన్ని; సంవత్సరములు = ఏండ్లు; ఉండెన్ = ఉండెను; ఏ = ఏ; భంగిన్ = విధముగ; వర్తించెన్ = చరించెను; ఏమి = ఏమి; చేసెన్ = చేసెను;

వినుము = వినుము; శుకుఁడు = శుకుడు; వచ్చి = వచ్చి; విజ్ఞాన = విజ్ఞానము యొక్క; పద్ధతిన్ = మార్గమును; అతని = అతని; కిన్ = కి; ఎట్లు = ఎట్లు; సూపె = చూపెను; అతఁడు = అతడు; పిదపన్ = తరువాత; తన = తనయొక్క; శరీరము = శరీరము; ఏ = ఏ; విధంబునన్ = విధముగ; వర్జించెన్ = విడిచిపెట్టెను; విప్ర = బ్రాహ్మణులలో; ముఖ్య = ముఖ్యుడా; నాకు = నాకు; విస్తరింపు = వివరింపుము.

“ బ్రహ్మణ్యులలో అగ్రగణ్యుడవైన సూతమహర్షీ! అశ్వత్థామ ఆగ్రహావేశంతో ప్రయోగించిన బ్రహ్మశిరోనామకమైన మహాస్త్రం మంటలకు, తపించిపోతున్న ఉత్తర గర్భంలోని పసికందును దేవకీ నందనుడు తిరిగి బ్రతికించాడని విన్నాను. తల్లి గర్భంలో ఉన్న అర్భకుణ్ణి కమలాక్షుడు మృత్యువు బారిపడకుండా ఎలా రక్షించాడు? అలా రక్షింపబడి జన్మించిన ఆ బాలుడు భూమ్మీద ఎన్ని సంవత్సరాలు జీవించాడు? ఏ విధంగా ప్రవర్తించాడు? ఏయే ఘనకార్యాలు చేసాడు? చివరకి తన తనువును ఏ విధంగా త్యజించాడు? ఈ విషయాలన్నీ నాకు వివరించు.”

1-278-వ.వచనము

అనిన సూతుం డిట్లనియె; "ధర్మనందనుండు చతుస్సముద్ర ముద్రి తాఖిల జంబూద్వీప రాజ్యంబు నార్జించియు; మిన్నుముట్టిన కీర్తి నుపార్జించియు; నంగనా, తురంగ, మాతంగ, సుభట, కాంచ నాది దివ్యసంపదలు సంపాదించియు; వీరసోదర, విప్ర, విద్వజ్జన వినోదంబులఁ బ్రమోదించియు, వైభవంబు లలవరించియు; గ్రతువు లాచరించియు; దుష్టశిక్షణ శిష్టరక్షణంబు లొనరించియు; ముకుందచరణారవింద సేవారతుండై సమస్త సంగంబు లందు నభిలాషంబు వర్జించి యరిషడ్వర్గంబు జయించి రాజ్యంబు సేయుచు.

అనినన్ = అనగా; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; ధర్మనందనుండు = ధర్మరాజు {ధర్మనందనుండు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు}; చతుస్ = నాలుగు; సముద్ర = సముద్రములచే; ముద్రిత = ఆవరింపడడిన; అఖిల = సమస్తమైన; జంబూ = జంబూ; ద్వీప = ద్వీపపు; రాజ్యంబున్ = రాజ్యమును; ఆర్జించియు = సంపాదించినప్పటికి; మిన్ను = ఆకాశమును; ముట్టిన = అంటిన; కీర్తిన్ = కీర్తిని; ఉపార్జించియు = సముపార్జించినప్పటికిని; అంగనా = స్త్రీలు; తురంగ = గుఱ్ఱములు; మాతంగ = ఏనుగులు; సుభట = మంచి యోధులు; కాంచన = బంగారము; ఆది = మొదలగు; దివ్య = దివ్యమైన; సంపదలు = సంపదలు; సంపాదించియున్ = సంపాదించినప్పటికిని; వీర = వీరులైన; సోదర = సోదరులు; విప్ర = బ్రాహ్మణులు; విద్వత్ = విద్వాఁసులైన; జన = జనుల వలన; వినోదంబులన్ = వినోదములతో; ప్రమోదించియున్ = మిక్కిలి సంతోషించినప్పటికిని; వైభవంబులు = వైభవములను; అలవరించియున్ = పొందియున్; క్రతువులు = యజ్ఞములు; ఆచరించియున్ = చేసినప్పటికిని; దుష్ట = దుష్టులను; శిక్షణ = శిక్షించుట; శిష్ట = శిష్టులను; రక్షణంబులు = రక్షించుటలు; ఒనరించియున్ = ఏర్పరిచినప్పటికిని; ముకుంద = హరియొక్క; చరణ = పాదములనే; అరవింద = పద్మముల; సేవా = భక్తిమీద; రతుండు = మిక్కిలి ప్రేమ కలవాడు; ఐ = అయి; సమస్త = సమస్తమైన; సంఘంబులు = సంబంధములు; అందున్ = ఎడల; అభిలాషంబు = కోరికలను; వర్జించి = వదిలివేసి; అరిషడ్వర్గంబున్ = అరిషడ్వర్గములు {అరిషడ్వర్గములు - కామ క్రోధ లోభ మోహము మద మాత్సర్యములు అను ఆరుగురు శత్రువులు}; జయించి = జయించి; రాజ్యంబున్ = రాజ్యమును; చేయుచున్ = చేయుచు.

అప్పుడు సూతుడు ఈ విధంగా చెప్పసాగాడు”ధర్మనందనుడు నాల్గు సముద్రాల నడుమ గల జంబూద్వీప సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. ఆకాశాన్నంటే అఖండకీర్తీని ఆర్జించాడు. అంగనామణులు, ఉత్తమాశ్వాలు, మత్త మాతంగాలు, సుభట నికాయాలు, సురుచిర సువర్ణాలు మొదలైన అపార సంపదలను సంపాదించాడు. వీరాధివీరులైన తన సోదరులతో, విద్వాంసులైన విప్రవరేణ్యుల విద్యావినోదాలతో ఆనందించాడు. భోగభాగ్యాలను కైవసం చేసుకొన్నాడు. యజ్ఞాలు ఆచరించాడు. దుష్టులను శిక్షించాడు. శిష్టులను రక్షించాడు. గోవింద పాదారవింద సేవారతుడై, సమస్త ఐహిక విషయాల యందు విరక్తుడై, అరిషడ్వర్గాన్ని జయించినవాడై రాజ్యపాలన సాగించాడు.

1-279-తే.తేటగీతి

చందనాదుల నాఁకట స్రగ్గువాఁడు

దనివి నొందని కైవడి ధర్మసుతుఁడు

సంపదలు పెక్కు గలిగియుఁ జక్రిపాద

సేవనంబులఁ పరిపూర్తి సెందకుండె.

చందన = మంచిగంధం; ఆదులన్ = మొదలగు వాని వలన; ఆఁకటన్ = ఆకలితో; స్రగ్గువాఁడు = కుంచించుకొని పోవు వాడు; తనివిన్ = సంతృప్తిని; ఒందని = పొందని; కైవడిన్ = విధముగ; ధర్మసుతుఁడు = ధర్మరాజు {ధర్మసుతుఁడు – యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు}; సంపదలు = సంపదలు; పెక్కున్ = చాలా; కలిగియున్ = కలిగి ఉన్నప్పటికిని; చక్రి = చక్రాయుధుని, హరి{చక్రి – చక్రము ఆయుధముగా గల వాడు, కృష్ణుని }; పాద = పాదములను; సేవనంబులన్ = కొలచుట యందు; పరిపూర్తి = సంతృప్తి; చెందకన్ = చెందకుండగ; ఉండెన్ = ఉండెను.

మంచి గంధం లాంటి శృంగార ద్రవ్యాలు ఎన్ని ఉన్నా ఆకలితో అల్లాడే వాడు తిండి కోసం ఎంతో ఆతృతతో ఉంటాడు. కౌరవులను ఓడించి ధర్మరాజు సమస్త రాజ్య సంపదలు పొందాక కూడ, శ్రీకృష్ణ భగవానుని ఎంత సేవిస్తున్నా, ఇంకా సేవించాలని ఎంతో ఆతృత కలిగి ఉన్నాడుట.

1-280-వ.వచనము

అంతం గొన్ని దినంబులకు నభిమన్యుకాంతాగర్భంబు నందున్నడింభకుండు దశమమాసపరిచ్ఛేద్యుండై గర్భాంతరాళంబున దురంతంబైన యశ్వత్థామ బాణానలంబున దందహ్యమానుండై తల్లడిల్లుచు.

అంతన్ = అంతట; కొన్ని = కొన్ని; దినంబుల = రోజుల; కున్ = కి; అభిమన్యు = అబిమన్యుని {అభిమన్యుకాంత - ఉత్తర}; కాంతా = భార్యయొక్క; గర్భంబున్ = గర్భము; అందున్ = లోపల; ఉన్న = ఉన్నటువంటి; డింభకుండు = పిల్లవాడు; దశమ = పదవ; మాస = నెల; పరిచ్ఛేద్యుండు = దాటినవాడు; ఐ = అయి; గర్భ = గర్భముయొక్క; అంతరాళంబున = లోపల; దురంతంబు = అంతములేనిది; ఐన = అయినట్టి; అశ్వత్థామ = అశ్వత్థామ; బాణ = బాణముయొక్క; అనలంబునన్ = అగ్నివలన; దందహ్యమానుండు = దహింపబడుచున్న వాడు; ఐ = అయి; తల్లడిల్లుచున్ = తల్లడిల్లుతూ.

ఇంతలో కొన్నాళ్ళకు, అభిమన్యుని అర్ధాంగి అయిన ఉత్తరకు నవమాసాలు నిండాయి. పదవనెల ప్రవేశించింది. ఇంతలో కడుపులోని శిశువు గురుపుత్రుడు అశ్వత్థామ అస్త్రపు అగ్నిజ్వాలలకు కమిలి, కమిలిపోతూ ఇలా ఆక్రోశించసాగాడు.

☘ *హిందూ ధర్మం*

కాథలిక్ క్రిస్టియన్ 

కుటుంబంలో జన్మించిన

"మార్టీన" అనే ఆవిడ

హిందూ ధర్మం పై...వెలిబుచ్చిన 

అభిప్రాయాన్ని 

ప్రతి హిందువు తెలుసుకుని

ఆలోచించాల్సిన అవసరం ఉంది. ☘

🌹నేను ఒక కాథలిక్ క్రిస్టియన్

కుటుంబంలో జన్మించాను .

నాకు చిన్నప్పటినుండి 

మా చర్చి ఫాస్టర్.. 

యేసు ఒక్కడే దేవుడు 

అని చెప్తుండే వాడు.

ఐతే నాకు అంతగా 

అతని మాటలు నమ్మబుద్ధి కాలేదు.🌹

☘నేను పాత, కొత్త నిబంధనలు చదివి... మా పాస్టర్నిఅడిగాను. ☘

🌹భూమి ఆకారం గురించిబైబిల్ ఎందుకుతప్పుగాచెప్పింది? 🌹

☘తండ్రితో కూతురు కామాలీలల్లో

పాల్గోవచ్చు అని ఉంది ...☘ 

🌹ఇంతకు బైబిల్ ముఖ్య ఉద్దేశం

ఏమిటి?🌹

☘ఒక గ్రంధంలోఇలాంటి వాటికి 

ఎలా స్థానం కల్పించారు?... 

అని ప్రశ్నించేసరికి...

ఆ చర్చి సభ్యులు నన్ను ఇంకోసారి చర్చికి రావొద్దు! 

అని నన్ను అక్కడ నుండి తరిమేసారు.అప్పుడు నావయస్సు13 ఏళ్ళు.☘

🌹ఆ తరువాత 

నాకు ముస్లిం స్నేహితులతో

పరిచయం అయింది.

ఒకసారి మసీద్ కు వెళ్ళగా...

అక్కడ నాకు చేదు అనుభవం

ఎదురయ్యింది.🌹

☘నేను ముందు హిజాబ్ వేసుకోవాలనిఆర్డర్ ఇచ్చారు. హిజాబ్ వేసుకొని ఇంటికి వెళ్లి అక్కడే నమాజ్ చేయాలనీ...☘

🌹"ఓ అల్లాహ్ నేను పాపిని,

నేను ఏ జన్మలోనో ఎంతో పాపం చేశాను...అందుకు 

నన్ను మహిళగాసృష్టించావు" అంటూవేడుకోవాలని చెప్పారు.ఆమాట విని నాకు కన్నీళ్ళు ఆగలేదు. 🌹

☘అల్లాహ్ ఎవ్వరు? అని ...నేను అడిగాను

అల్లాహ్ దైవం అని...అల్లాహ్ కి 

రూపంలేదుఅని ...వాళ్ళుచెప్పారు .

రూపం లేని దైవానికిమగాడు 

అనే ఎలా ముద్ర వేసారు?

అని అని అడిగాను.

"మొహమద్ ప్రవక్తచెప్పారు" 

అనిమాత్రమేవాళ్ళుబదులిచ్చారు.

అప్పుడే అర్ధం అయ్యింది. ☘

🌹ఇస్లాంలో మహిళలకు చాలా తీవ్రమైనఇబ్బందులు ఉన్నాయి అని... ఇస్లాంలో మహిళలను కేవలం కామావాంఛతీర్చుకోడానికి 

ఒక బొమ్మగాఉపయోగిస్తారు అని...

మహిళలకు మసీద్ లోపలికి 

ప్రవేశం కూడా ఉండదుఅని తెలిసింది.

మహిళను ఎంత అపవిత్రంగా

చూస్తున్నారో తెలుసుకొని... 

నాలో నేను కుమిలిపోయాను.

అలా కుమిలిపోతూ

ఏడుస్తున్న తరుణంలో...🌹

☘ఒకవృద్దమహిళనాచెంతకువచ్చి 

పవిత్రమైన భావాలకుఆధ్యాత్మికతకు నిలయం

"భారతదేశం" అనీ.... కొన్ని ఆధారాలతో నాకు మొత్తం వివరించి చెప్పారు .☘

🌹ఐతే నేను ఆమె మాటకు 

అంత ప్రాముఖ్యతఇవ్వలేదు . 🌹

☘ఎందుకంటేఇంతకుముందు వెళ్ళిన మతాలలో 

మహిళలకు విలువ లేదు

అని తెలుసుకున్నాను.భారతదేశంలో

మహిళల పరిస్దితి ఇంకా దారుణంగా ఉంటుంది అనిపాస్టర్ చెప్పినవాఖ్యలు గుర్తొచ్చి ...

ఇంక హిందుత్వం వైపు

వెళ్ళకూడదనినిశ్చయించుకున్నాను.☘

🌹ఒక రోజు నా స్నేహితురాలు భారతదేశం నుండి తీసుకు వచ్చిన గంగ నీళ్ళు ఇచ్చి నన్ను త్రాగామని చెప్పింది. ఎందుకో కొంచెం అయిష్టం గానే తాగాను. 

నేను నా స్నేహితురాలిని అడిగా

"గంగ ఎవ్వరు? ఏమిటి ఈ కధ?" అని.

"గంగ అంటే నీరు...భారతీయులు 

మంచి నీటిలో దైవాన్ని చూస్తారు.🌹

☘గంగానదిని 'గంగాదేవి' అని దేవతగా పూజిస్తారు 

అని ఆమె చెప్పింది." నేను ఆశ్చర్యంగా అడిగా 

"గంగ మహిళ కదా, మరి మహిళ మీద 

అక్కడ వివక్ష చూపరా?"అని అడిగాను. 

అప్పుడు ఆమె చెప్పింది..."వాస్తవానికి ☘

☘🌹భారతీయులుఆరాధించేది...

భూమాత, 

వేదమాత, 

గోమాత, 

ధన మాత,

ధాన్యమాత,

గంగామాత " అని... ఇలా భారతీయులు 

ప్రతి మంచి విషయాలలో కూడా 

మహిళలకే ప్రథమస్థానం ఇస్తారు.  

ప్రతి ప్రాణిలోనూ మంచిని చూస్తారు.

మనం అక్కడికి వెళితే తప్ప... 

మనకు భారతీయత యొక్కపవిత్రత తెలియదు 

అని ఆమె చెబుతుంటే ఆశ్ఛర్యపోయాను.

అప్పుడు నేను అడిగా ...🌹☘

"

☘మరి అంత మంచి హిందుత్వం కదా, మరి నేడు ప్రపంచంలో

అత్యధిక శాతం క్రిస్టియన్ మతం, ఇస్లాం మతం 

ఎందుకు తీసుకుంటున్నారు?

ఆమె దానికి చాల చక్కగా

జవాబు ఇచ్చారు ☘

"🌹స్వర్గం చాల చిన్నది... నరకం చాల పెద్దది. 

నరకం వైపు వెళ్ళడానికి అన్ని తలుపులు తెరిచి ఉంటాయి.కానీ స్వర్గం వైపుపయనించాలంటే ....

ఒక చిన్న ఇరుకు సందులోనుండి ప్రయాణించాలి"

అనే సమాధానం నా గుండె అంతర్భాగానికి తాకింది.

ఆ మరుసటి నెలలో నేను భారతదేశానికి

ఎలాగైనా వెళ్లి అక్కడ వాస్తవ రూపం తెలుసుకోవాలి అని అనుకున్నాను.🌹

☘ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తరువాత

తెలుసుకున్నాను..."ప్రపంచానికి 

తల్లీ, తండ్రి లాంటిది ఈ వేద భూమి భారతదేశం .

ఇక్కడ ఉన్న ప్రేమ ప్రపంచం మొత్తం 

ఎక్కడ వెతికినా దొరకదు.

నాకు ఇంకో జన్మంటూ ఉంటే ...

ఈ వేద భూమిలోఒక మహిళగా  

పుట్టాలని ఉంది" అంటూ... ☘

🌹స్థానికి ఛానల్ కి 

ఇచ్చిన ఇంటర్వ్యూ లో

మార్టీన చెప్పింది. - 

(Hindu Jwala నుండి)🌹

☘హిందూధర్మం సనాతన ధర్మము... 

పునాది చాలా బలమైంది. ☘

🌹మధ్యలో కొన్ని లోపాలు చేరాయని

మొత్తం హిందూ ధర్మాన్నిఅగౌరపరచడం అవివేకం.🌹

☘🌹దయచేసి భారతీయ సంస్కృతిని,

మన ధర్మాన్ని, మన సంప్రదాయాలను...

జాగ్రత్తగా కాపాడుకుందాము......🌹☘

🌹☘🌹🙏జై హింద్..🙏🌹☘🌹

🌹☘ప్రతి భారతీయుడు తెలుసుకోవలసినది ఇది పరమతాలమీద మోజు పెంచుకున్న వాళ్ళుమళ్ళి ఒకసారి ఇది చదవాలి. మంచి విషయం కదాఅని మీఅందరికోసం పోస్ట్ చేస్తున్నా. బాగుంది నలుగురు తెలుసుకోవలసిన విషయం ఆనిపిస్తే షేర్ చేయండి ☘🌹🙏🙏🙏

ఉద్యద్భానుసహస్రాభా – చతుర్భాహుసమన్వితా

 Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 10 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu

ఉద్యద్భానుసహస్రాభా – చతుర్భాహుసమన్వితా  

లలితాసహస్రనామస్తోత్త్రములో ఇక్కడ పెద్ద రహస్యము ఉన్నది. దేవతల ఆ కార్యము కోసమని వస్తున్న అమ్మవారిని వశిన్యాదిదేవతలు స్తోత్త్రము చేస్తూ కేశపాదాదిపర్యంతము అనగా తలదగ్గరనుంచి పాదములవరకు అందించారు. ముందు తల చెప్పకుండా చతుర్భాహుసమన్వితా అని తల, చేతుల గురించి చెప్పడానికి ముందు ఉద్యద్భానుసహస్రాభా చేతులు – ఆయుధములు చెప్పారు. ఉద్యద్భానుసహస్రాభా అనగా ఉదయిస్తున్న వేయిసూర్యుల కాంతి కలిగిన తల్లి. సూర్యుడు ఉదయిస్తున్న సమయములో కాంతి ఎంతో ఎఱ్ఱగా ఉంటుంది. వేయిమంది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందన్న ఊహకికూడా అందదు. ముందు ఎఱ్ఱటికాంతి కనపడుతున్నదని ‘ఉత్’ అన్న శబ్దము వేశారు. ఉత్ అనగా పైకెత్తడము. కొన్ని కోట్లజన్మల తరవాత ఈ నామము వినబడి లోపల దర్శనమయితే ఆ జీవుడి జీవయాత్రలో పైకి ఎక్కడము ప్రారంభమయింది. బ్రహ్మ, విష్ణు, శివుడనే మూడుతత్త్వములను కలిపి ముద్ద చేసిన ఒకగుళిక అన్నట్టుగా సూర్యబింబము ఉన్నది. లలితాపరాభట్టారిక ఎరుపురంగులో ఎందుకు ఉంటుంది? ఆకాశము అంతా ఆ కాంతితో నిండిపోయి అన్నీ లేత ఎరుపులోకి వచ్చేస్తాయి. అమ్మవారి ఆవిర్భావమును ఎర్రటికాంతితో ధ్యానము చేస్తే ఏమవుతుంది ? ఆ ఎరుపునకు సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు చెప్పిన విషయమును పట్టుకుంటే జీవనయాత్రలో కొత్తమలుపు వస్తుంది. సూర్యబింబము ఉదయిస్తున్నప్పుడు ఎఱ్ఱటికాంతి – ‘శ్రీసరణిభిః’ ముందు వచ్చి కూర్చున్న ప్రాంతము అంతా ఎరుపులో మునిగిపోయి ఆ ఎరుపులో ధ్యానము చేస్తే ఊర్వశితో సహా మూడులోకములలోని దేవవేశ్యలు అంతా వశమైపోతారని అన్నారు. ఈ శ్లోకము స్త్రీలకు ఉపాసన చెయ్యడానికి, వృద్ధిలోకి వద్దామని అనుకున్న వారికి పనికిరాదు. జగద్గురువైన శంకరులు ఇటువంటి శ్లోకము ఇవ్వడమేమిటి? ఎరుపురంగు గురించి ఈ మాట చెప్పడము ఏమిటి? అనిపిస్తుంది. గురువుల బిగింపు చాలా విచిత్రముగా ఉంటుంది. వారి వెంటపడితే తప్ప దాని రహస్యము దొరకదు. మూడులోకములలోని అందగత్తెలు వశమయ్యారు అంటే మూడులోకములలోని ఆనందము ఏది ఉన్నదో అది తామైపోయి, జ్ఞాని అయి పూర్ణులయినట్టు. ఆనందమును బయట వెతుక్కోక లోపలే అనుభవిస్తూ ఆనందస్వరూపులై ఉంటారు. ‘చిదానంద రూపం శివోహం శివోహం’ అన్న భావనలు ఏర్పడడానికి కావలసిన అమ్మవారి అనుగ్రహపు ఎర్రటికాంతులను సూర్యమండలమునందు దర్శనము చేసి ఉపాసన చెయ్యడము. అమ్మవారి ఈ అనుగ్రహము ఎర్రగా ఉండే క్రియాశక్తిగా ఉంటుంది. అన్నిపనులు చేసే చేతిని క్రియాశక్తి అంటారు. కరమే కిరణము. ఆ కిరణముల వలన మొదట వచ్చిన కాంతి ఎరుపు. ఆ ఎరుపే అమ్మవారు. ఆవిడే భగవంతునిలో కలపగలదు. ఎరుపుని ధ్యానిస్తే పూర్ణత్వం వస్తుంది. ఈ ఎరుపు కారుణ్యము. ఈ ఎరుపులో రాజసం ఉన్నది. చిక్కబడిన ఎరుపు మెల్లగా ప్రవహిస్తుంది. పలుచగా ఉన్నది తొందరగా పరిగెడుతుంది. అమ్మవారి అనుగ్రహము బాగా ప్రసరించి ఎరుపుతో కలసిపోయినవారు మెల్లమెల్లగా కదిలి వెళ్ళి ఈశ్వరునిలో కలసిపోతారు. గొప్ప అనుగ్రహము అక్కడ మొదలయితే అనుభవించవలసిన ఆనందము ఇంకొకటి ఉండదు. అమ్మవారు అందరికీ దర్శనము కావాలన్న కోరికతో వశిన్యాదిదేవతలతో స్తోత్రము చెప్పిస్తూ ఈ కాంతి పడని వారికి తన దర్శనము కుదరదని, అలా తనను చూడలేని వారికి తల దగ్గరనుంచి చూడడము కుదరదని చెప్పింది. చేతులు క్రియాశక్తి. చేతుల వలన ఆ శక్తిని దర్శనము చేసి జీవితమును మార్చుకుంటున్నవారు వారిని తలనుంచి పాదముల వరకు చూడగలుగుతారు. అందుకని ముందు కాంతి మీద పడాలి. ఆవిడ ఆవిర్భావము ధ్యానము చేస్తే ఆ ఎరుపుకాంతిలో మునిగిపోతే ఆనాడు జన్మకు ధన్యత కలుగుతుంది. ఎరుపు దర్శనము చేసి అనుభవిద్దామని తాపత్రయము ఏర్పడనంత కాలము జీవయాత్ర సాగుతూనే ఉంటుంది. ఏదో ఒకనాడు ఒకసారి అమ్మవారి అనుగ్రహమును బలముగా సంపాదించుకుంటే వాళ్ళయందు క్రియాశక్తి ప్రారంభము అవుతుంది. ఇది కేవలము ఒక శ్లోకములో చెప్పడము కాదు. గురుముఖతః తెలుసుకుని ధ్యానములో అనుభవించగలగాలి. గురువు అనుగ్రహముగా ముడి విడిపోతే ధ్యానము చేసి పూర్ణులు కావాలి. ఎరుపుకాంతి వెనక ఇంత రహస్యము ఉన్నది. 

www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage

తలరాతను మార్చుకోవడానికి వీలుంటుంది.

1) మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతను

రాసేస్తాడు కదా

2) మరి మనం పూజలు ఎందుకు చేయాలి ? 

3) అయితే బ్రహ్మగారు నుదుటిన రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాసాడంట 

4) 'నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను.మీరు మీ ఉపాసన /పూజలతో మార్చుకోగలరు' 

5) పూర్వం విభుముఖుడు అనే రాజు ఉండేవాడు. ఇతనికి 50వ ఏట మరణ గండం ఉంది. 

6) అతని అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించి అర్చన, మృత్యుంజయ జపం చేసి చావవలసినవాడు బ్రతికాడు.

7) 128 ఏళ్ల ఆయువు ఉన్న దుర్యోధనుడు, ద్రౌపదిని జుట్టుపట్టి దుశ్శాసనునితో ఈడ్పించడం వలన, చేసిన పాపానికి 60 వ ఏట చనిపోయాడు. 

8) జప, ధ్యాన, దానాది కర్మలతో తలరాతను మార్చుకోవచ్చు.

9) మనస్సులో నిరంతరం భక్తితో భగవన్నామ స్మరణ చేస్తే, అంతా ఆ కృష్ణయ్యే చూసుకుంటారు..!

*బ్రాహ్మణ జాతిలో ఆరాధ్యులు*

శైవఆగమము చాలా ప్రాచీనమైనది. వైదీకులలో కొంతమంది పూర్వం రోజుల్లో శివదీక్ష తీసుకుని శివ ఆరాధ్యులు గా మారారు.

విజయవాడలోని సత్యనారారణ పురంలో మూడుగుళ్ళు ఉన్నాయి అక్కడ శైవపీఠం ఉన్నది. కొండపై జమ్మిచట్టుకు

జమ్మిచట్టుకుఈ శైవులే నిప్పును

నిప్పునుమూటకట్టి కొమ్కకుకట్టగా 3రోజులు ఊరిలో నిప్పు లేకుండాపోతే

లేకుండాపోతేమల్లికార్జనపనడితునికి అపచారము చేసినామని

చేసినామనివారిని ప్లార్ధించగా

ప్లార్ధించగాతిరిగి నిప్పును దానంచేసినఘనయ వారిదే

వారిదేగుంటూరులో కలెక్టరు

కలెక్టరుగారు శైవులకు నూనె

నూనెఇవ్వవద్దని ఆదేశినచగా

ఆదేశించగానూతిలో గారెలు

గారెలుకాల్టిన వైనం చూసి

చూసికలెక్టరుగారు అచ్చరు ఒందారట. ఇదీ శైవులచరిత్ర.

ఈమనిలో శైవ హ్రాహ్మణ 

కుటుంబాలు ఉన్నాయి.

కార్తీక మాసం ఆవెలుగులు

ఆవెలుగులుఇప్పటికినీ చూడవచ్చు.

*అంతిమ సంస్కారం ఇలా*

 మరణించిన వారి ఖననం తర్వాత

ఈపది రోజూలూ సమాధిపై పంచ నందులను మట్టితో

మట్టితో చేసినవి నలువైపులా 

ఉంచి తలనుండి వెంటృకలౠ ఒకదారం చివర

చివరముడి వైచి ఆధారమును

ఆధారమునుచక్కగా సమాధిఫైకి

సమాధిఫైకితీసుకొనవచ్చి ఆధారముచుట్టూ మట్టితో 

లింగానికి ఎదురుగా పంచమనందిని ఉంచి 

వాటికి ఈపదిరోజులు నిత్యాభిషేకంచేసి 11 వరోజు

వరోజుఉన్న నాల్గు నందులనూ

నందులనూమట్టితోచేసిన లింగాన్ని నదిలో కలపాలి.

కూర్టొన పెట్టి సమాధి లోఉత్తరముఖంగా కృర్చోనపేట్టి

కృర్చోనపేట్టిచేతిలో ధారణలింగాన్ని పెట్టి పూడ్చాలి.

ఇంటివద్ద ద్వాదశ షోడశ కళారాధన చేసి ఖర్మనుపూర్తి 

చేయాలి. సమాధిపై లింగ ప్రతిష్ట

ప్రతిష్టచే సి ఎదురుగా నంది స్థంభప్రతిష్ట చేసి అన్నసమారాదన చేయాలి.

(ఇదీ తత్వకళా సంయోజనం)

జెందెం అపసవ్యం ఉండదు.

శివపూజే ప్రేత శబ్దం ఉండదు

 ఈ 16 రోజులలో ఖర్మలోఎకకడాకూడా ప్రేతశబ్దం

ప్రేతశబ్దంరాదు.

మహేశ్వర  

సదాశివ

శివరూపములు

నంది 

మహాకాళులు రూపములతోనే

రూపములతోనేఆబ్దికాదులు

పూర్తి అవుతాయి.

ఈ క్రియనూ ఆరాధన అని అంటారు. అంత్యేష్టి అంటారు. వీరినే బ్రాహ్మణ జాతిలో ఆరాధ్యుల శాఖగా పిలుస్తారు.

 బాలసుబ్రహ్మణ్యం గారు బ్రాహ్మణ జాతిలో ఆరాధ్యుల శాఖ. ఇలాంటి శాఖలు బ్రాహ్మణ జాతిలో దేశవ్యాప్తంగా సుమారు 75 శాఖలు వున్నాయి

ఆరాధ్యులను, లింగధారులను మరణాంతరం ఖననం చేస్తారు.. కావున శవాన్ని దహనం చేయరు. వీరి సమాధిపై శివలింగం స్ధాపన చేస్తారు..  

కొన్ని తరాల తరువాత , కొందరు గురువులు, మహానుభావుల యొక్క ఆ బృందావనాలే ( సమాధులే) రాబోయే తరాలకు శివాలయాలుగా మారుతూంటాయి. ఇది యదార్థ విషయం.

ఈ సమాచారాన్ని అనుమానం ఉన్నట్లయితే చరిత్రను విచారించుకోగలరు.

*బ్రాహ్మణ చైతన్య వేదిక*

నిష్కామ భక్తి

🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

    ఒకసారి ఓ గురువు గారు గ్రామాంతరం వెళ్తూ తన శిష్యునికి ఒక బొమ్మ కృష్ణుని ఇచ్చి తాను తిరిగి వచ్చే వరకు జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండమని చెప్పారు.

 సరేనన్నాడు శిష్యుడు. 

 మరుక్షణం నుంచి ఆ బొమ్మను ముద్దులాడుతూ ఉయ్యాలలో వేసి ఊపుతూ, ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ, చాలా బాగా చూసుకున్నాడు,   

పొద్దున సాయంత్రం బొమ్మ కృష్ణుడి కోసం అరిసెలు అప్పాలు సున్నుండలు మీగడ వెన్న తెచ్చే వాడు.

 'తిను కన్నయ్య' అని బతిమిలాడే వాడు...

 కానీ కన్నయ్య తింటేనా!!!

 శిష్యుడికి ఏం చేయాలో తోచక దిగులు పడి కూర్చునేవాడు.

     నివేదన చేయడం అనేది మన భక్తికి సూచనగా చేసి క్రియే గాని దేవుడు నిజంగా వచ్చే తినడు. పారవశ్యంలో ఈ చిన్న విషయం కూడా శిస్యుని బుద్ధికి తట్టలేదు.

 బొమ్మని గుండెల్లో పొదుపు కుంటూ సందిట్లో దోచుకుంటూ.. "కన్నయ్య నన్ను కన్న తండ్రి! ఈ ఒక్క సున్నుండ తినరా తీయ తీయని ఈ మీగడ నీకోసమే తెచ్చాను రా" అని బ్రతిమిలాడుతున్నా ..

 కృష్ణయ్య ఉలక లేదు పలకలేదు ..కనీసం ఒక్క అప్పమైనా తినలేదు.

 దాంతో శిష్యునికి కోపం వచ్చింది విసవిసా లేచి వెళ్లి బెత్తం ఒకటి పట్టుకొచ్చి తింటావా నాలుగు తగిలించి ఉంటావా అని బెదిరించాడు.

 బొమ్మ కృష్ణుడు భయంతో వణికిపోయాడు బుద్ధిగా వచ్చి అప్పాలు అరిసెలు అన్ని ఆరగించాడు. 

ఇక శిష్యుడి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. 

అతని కళ్ళు ఆనంద ఆశ్రువులతో నిండి పోయాయాయి. 

కృష్ణయ్యను కౌగిలించుకొని సతమతమై పోయాడు.

  అప్పటికి అతను అన్నము తిని మూడు రోజులైంది లేచి వెళ్లి గబగబా రెండు ముద్దలు తిన్నాడు. 

 తిన్నాక పొలం వైపు నడిచాడు గడిచిన మూడు రోజులుగా అతనికి కృష్ణయ్యను బ్రతిమిలాడడానికే సరిపోయే. ...

పొలం చేయడానికి వెళ్లింది ఎక్కడ. పొలం పనులు చేసుకున్నది ఎక్కడ? మనసులో పోగు పడ్డ ఆలోచనల చిక్కు తీసుకుంటూ వచ్చేసరికి పొలం గట్టు దగ్గర ఉన్నాడతను. 

తన పొలాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. పొలం గట్లన్నీ తీర్చినట్టు వున్నాయి. పని చేసి పొలమంతా మడులు చేసి నీరు పెట్టినట్టు ఉంది. 

అది కలో లేక వైష్ణవమాయయో అర్థం కాలేదు. ఊహించడానికి శక్తి కూడా చాలలేదు.  

ఆనందం తో కళ్ళు మూతలు పడ్డాయి కళ్ళ ముందు తన చేతిలో ఉన్న బెత్తాన్ని చూసి భయపడి అరిసెలు అప్పాలు అన్ని ఒకేసారి నోట్లో కుక్కుకుంటూ వున్న కృష్ణయ్య దర్శనమిచ్చాడు. 

 అప్రయత్నంగా చేతులు జోడించి దండం పెట్టాడు. 🙏🙏

 నిష్కామ భక్తికి నిర్మల భక్తి కి ఉన్న శక్తి అది.

" నా భక్తులు నాకు పూర్తిగా సొంతం కావాలి నాకు అంకితం కావాలి. వారి హృదయాలను స్వచ్ఛంగా పరిశుభ్రంగా చేసుకుని అందులో నన్ను మాత్రం ప్రతిష్టించుకోవాలి నన్ను మాత్రమే కొలవాలి " అని గీతలో కృష్ణుడు అర్జునుడితో అంటాడు. 

   శాస్త్రాలు చదవడం వల్ల, జ్ఞానం వల్ల కూడా భక్తి అలవడదు.  

ఎవరైనా భక్తులు కావాలంటే వాళ్ళు వాళ్ళ సర్వస్వాన్ని విడిచిపెట్టాలి, చివరికి జ్ఞానాన్ని కూడా వదులుకోవాలి అది రహస్యం. 

భగవంతుడు నుంచి వేరు చేసే అగాధాలు కొన్ని ఉన్నాయి అవి సిగ్గు, అహంకారం, బిడియం, కోపం వంటివి మనిషి మనసుని దేవుడి మీద నిలవ నీయకుండా అంధకారంలోకి నెట్టివేస్తుంది.

కాబట్టి వీటి విషయం లో చాలా జాగరూకత తో ఉండాలి. 

🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

మూకపంచశతి

 దశిక రాము**

*జయ జయ జగదంబ శివే*

*జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే|*

*జయ జయ మహేశదయితే* 

*జయ జయ చిద్గగన కౌముదీధారే||*

🏵️ శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏

🌷 **** 🌷

🌷 **ఆర్యాశతకము**

🌹9.

**ఆదృతకాఞ్చీనిలయాం**

**ఆద్యామారూఢయౌవనాటోపామ్**

**ఆగమావతంస కలికాం**

**ఆనన్దాద్వైతకన్దలీం వన్దే ౹౹**

🌺భావం: 

కాంచీనగరముననే ఆదరముతో నివసించియుండు కామాక్షీ దేవి ,ఆద్యురాలు . ఆ తల్లి నిత్యయౌవనవతి ,ఆగమములకే వందనీయురాలు.వేదమాతలు అమ్మవారిని పూజ్యతతో తమ శిరమున నిలుపుకొన్నారు.జీవుని యందుండు ద్వైదీభావమే దుఃఖహేతువుకదా.ఉపాసనాక్రమమున సాధకుడు చేరుకొనే అద్వైతసిద్ధియే ఆనందసిద్ధి ! పరమేశ్వరి ఆరాధనతో మాత్రమే చిదానంద స్థితిని పొందగలము.ఆ పరిపూర్ణ స్థితియే పరమశివం!అట్టి శివానందాద్వైతవృక్షమునకు మూలకందము ఐనట్టి ఆ పరాంబికకు నమస్కరించుచున్నాను. 🌺

🔱 అమ్మ పాదపద్మములకు నమస్కరిస్తూ. 🔱

🌹 లోకాస్సమస్తా స్సుఖినోభవంతు 🌹

సశేషం....

🙏🙏🙏 

సేకరణ

**ధర్మము-సంస్కృతి**

🙏🙏🙏

**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం మన ధర్మాన్ని రక్షిద్దాం**

**ధర్మో రక్షతి రక్షితః**

శ్రీశ శ్రియా ఘటికయా త్వదుపాయ భావే*

 శ్రీశ శ్రియా ఘటికయా త్వదుపాయ భావే*

*ప్రాప్యేత్వయి స్వయ ముపేయ తయా స్పురంత్యా*

*నిత్యాశ్రితాయ నిరవద్య గుణాయ తుభ్యం*

*స్యాం కింకరో వృషగిరీశ న జాతు మహ్యమ్.*

*తా:-* ఓ వేంకటశైలవాసా!మోక్షానికి నీవే ఉపాయభూతుడవు,తెలిసినవాడవూ,ఘటికుడువుగా జ్ఞానప్రాప్తి అయినప్పుడు నీవున్నూ ఆ క్షణమే ప్రాప్తుడువగుదువు.సదా ఆశ్రయింప దగినవాడవును,మంగళప్రదగుణాలను పొందినవాడవునుయగు ఓ వృషభాచలపతీ!శ్రీ వేంకటేశ్వరా!నేను నీ సేవకుడను.నీవు తప్ప ఇతరమునెరుగను.

యంబుదముల్

 అంబరమందు నాశ్వీయుజ 

          యంబుదముల్ విహరించు చుండగన్ ,

సంబర మొప్ప భూతలము 

         చక్కటి వానల పొందుచుండ , యా

యంబువు గాంచి కర్షకులు

          హర్షము నొందగ , శాంతి నీయ లో

కంబుకు వచ్చె " శారద " , వి 

          కాశము నిచ్చుచు వెన్నె లిచ్చుచున్

గోపాలుని మధుసూదన రావు