27, సెప్టెంబర్ 2020, ఆదివారం

**సౌందర్య లహరి శ్లోకము - 9**

 దశిక రాము**




**శ్రీ శంకర భగవత్పాద విరచితము**


**శ్రీ లలితాంబికాయైనమః**


9వ శ్లోకం


**మహీం మూలాధారే**


**కమపి మణిపూరే హుతవహం**


**స్థితం స్వాధిష్ఠానే** 


**హృది మరుత మాకార ముపరి,**


**మనోపి భ్రూమధ్యే** 


**సకలమపి భిత్వా కులపథం**


**సహస్రారే పద్మే**


**సహ రహసి పత్యా విహరసి**


ఓ భగవతీ ! నువ్వు మూలాధారంలో వున్న పృథివీ

తత్త్వాన్ని , మణిపూర చక్రం లోని అగ్ని తత్త్వాన్ని ,

అనాహత చక్రం లోని వాయు తత్త్వాన్ని , అంతకు

పైనవుండే విశుద్ద చక్రం లోని ఆకాశ తత్త్వాన్ని , కను

బొమలనడుమనుండే అజ్ఞా చక్రం లోని మనస్తత్త్వాన్ని

వీడి సుషుమ్నా మార్గాన్ని ఛేధించుకొని సహస్రార

కమలంలోని నీ భర్త ఐన సదాశివుడితో కూడి

రహస్యంగా క్రీడిస్తున్నావు.


**ఓం గిరితనూభవాయైనమః,**


**ఓం వీరభద్రప్రసువేనమః**


**ఓం విశ్వవ్యాపిణ్యేనమః.**


🙏🙏🙏



**ధర్మో రక్షతి రక్షితః**

కామెంట్‌లు లేవు: