27, సెప్టెంబర్ 2020, ఆదివారం

సంతోషం

 

-------------

ఒకడు ఓ గురువు వద్దకొచ్చాడు. తనకన్నీ ఉన్నా లోటల్లా సంతోషమే అని వాపోయాడు. అప్పుడు గరువు అతనితో కలిసి దగ్గర్లో ఉన్న ఒక పూలతోటకు వెళ్ళాడు. 


అక్కడ పూలమీద వాలుతున్న సీతాకోకచిలుకలను చూపించి ఒకటి రెండు పట్టుకోమన్నాడు. 


అతనెంతసేపు ప్రయత్నించినా ఒక్కటీ పట్టుకోలే గురువు వద్దకు నీరసంగా నిరాశతో నిల్చున్నాడు. 


అతని భుజంమీద చేయి వేసి కొన్ని అడుగులు నడిచి మొక్కల మధ్య ఉన్న ఓ బల్ల మీద కూర్చున్నాడ గురువు. ఇద్దరూ అవీ ఇవీ మాట్లాడుతున్నారు. ఇంతలో బోలెడు సీతాకోకచిలుకలు వారి చుట్టూ విహరించాయి. అంతేకాదు, మూడు నాలుగు సీతికోకచిలుకలు గురుశిష్యుల మీద వాలాయి. దాంతో శిష్యుడి ఆనందానికి అంతులేదు.


అంతట, గురువుగారిలా అన్నాడు......


"జీవితమంటే ఇలానే ఉంటుంది. సంతోషం కోసం మనం పరుగులు తీయడం వృధా ప్రయాస. ఉన్న చోటనే సంతోషాన్ని కల్పించుకోవాలి" అని.

కామెంట్‌లు లేవు: