...
బాలుగారి మృతదేహాన్ని #ఖననం చెయ్యడానికి కారణం ఏమిటి...!? మామూలు గా ఐతే...
#దహనం చేయాలి కదా...?
అని చాలా మంది ప్రశ్నించారు...
వారు జంగాలు అని, వీరశైవులు అని, శివార్చకులు అని, లింగాయతులు అని, బలిజలు అని, స్మార్తులు అని, . చాత్తాద శ్రీ వైష్ణవులు అని,రాద్దాంతం మొదలైంది...
అట్టి వారందరికీ అ సాంప్రదాయమును అనుసరిస్తన్న వానిగా ఇదే నా సమాధానం.గా భావించి స్వస్థత పొధుతారని ఆశిస్తాను...
క్లుప్తంగా వివరిస్తున్నాను...బ్రాహ్మణ వర్ణంలో శ్రీ వైష్ణవ, నియోగ, వైదిక, శైవ సాంప్రదాయాలు అనాదిగా ఉన్నాయి...అందులో వైష్ణవ సాంప్రదాయమును అనుసరించే వారు శ్రీ వైష్ణవులు గాను...,గ్రామ కార్యక్రమాలు నిర్వహించడానికి ఆనాటి ప్రభువులచే నియోగింపబడినవారిని ఆరువేల నియోగులని లేదా కరణాలు అని....యజ్ఞయాగాది అనిష్ఠాన క్రియలు చేసేవారిని వైదికులని, శైవ సాంప్రదాయాన్ని అనుసరించే వారిని శైవులని వ్యవహరించారు...
దేశాన్ని, లేదా ఒక ప్రాంతం పాలించే రాజు ఏ మతానికి చెందిన వాడైతే ఆ మతం ప్రభావం, ప్రజలపై రాజులపై ఆ మత గురువుల ప్రభావం ఉండేది...అలా ద్రవిడదేశంలో, ఆంధ్ర దేశంలో ఊపిరిపోసుకున్నవే శైవ వైష్ణవ మతాలు...
శ్రీ వైష్ణవ మతం ప్రాచుర్యం పొందాలని ఆనాటి మతగురువులు ప్రజలందరికీ వైష్ణవ మతాన్ని స్వీకరిం చేసారు... అలా అన్ని కులాల వారు వైష్ణవం లోకి రావడంతో దానిలో మత్స్య, మాంస, మద్యఇత్యాదులు స్వీకరించేవారు కూడా చేరారు...ఆ సమూహం లోనివారే..సాతాన్లు ( చాత్తాదులు ), హరిదాసులు, రంగదాసులు,. ఇత్యాదులు...వేద బాహ్యులు...(అప్పటి మాట) అసలు శ్రీ వైష్ణవులు మాత్రమే వేదప్రతిపాదితమైనవారు...వారే అసలైన వారని నా అభిప్రాయం...
ఇక శైవం:-
వైష్ణవ మతం లాగానే శైవ మత గురువులు రాజులను, ప్రజలను శైవ మతాన్ని అవలంబింవచ్చిను...అందుకు నిదర్శనం కర్ణాటకలో సాక్షాత్తు శివాంశ సంభూతునిగా పిలువబడే బసవేశ్వరులవారు, ద్రావిడాంధ్ర ప్రభువులు...వీరిలో కూడా ఆ కాలంలో మత్స్య మాంస మధిర, మొదలైన వారు ఉండేవారు... వారు వేద బాహ్యులై ఉండేవారు... వారిలో తెగలే, వీరశైవులు, లింగాయతులు, బలిజలు, జంగాలు, శివార్చకులు ఇలా వివిధ రకాలుగా పిలువబడ్డారు. (పిలువబడుతున్నారు)...శివలింగమును వీరు మెడలో ధరించి నిత్యశివపూజ చేసే చరలింగధారులు...
ఇక మొదట్లో తెలిపినట్లు బ్రాహ్మణ వర్ణంలో గురు స్థానాన్ని పొందినవారు శైవులు్...వీరికి వేదం ప్రమాణం...లింగ ధారణ, ఉపదేశాది క్రతువులు, వేద ప్రతిపాదిత మైన శైవ సాంప్రదాయ కార్యక్రమాల నిర్వహణ తదితరములు చేస్తుంటారు
శివలింగం మెడలో ధరించి నిత్యం శివపూజ చేయడం ప్రదాన కర్తవ్యం... ప్రాణలింగముగా భావిస్తార...శివారాధన చేయడం, ఇతరులచే ఆరాధింపబడేవారు కనుక ఆరాధ్యులు అనడం జరిగింది.
చర్చకు మూలమైన విషయం బాలుగారు ఆరాధ్య సాంప్రదాయమునకు చెందినవారు అగుటచే వారిని ఖననం చేసారు... మేము ఇలాగే చేస్తాము...మరొక విషయం ఇతరుల అందరి వలె అపర కర్మలలో చేసే పిండప్రదాన ప్రక్రియ కానీ, యజ్ఞోపవీత సవ్యాపవసవ్య మార్పులు కానీ ఉండవు...భోక్త అని పిలువము...దశ, ద్వాదశ దిన కర్మలలో వచ్చిన( భోక్త ) వారిని మహేశ్వరునిగా భావించి, ఈశ్వరునకు ఏ విదంగా నైతే పూజలు చేస్తామో అదే విధంగా ,అర్చన చేస్తాము...శివారాధనలో యజ్ఞోపవీతం అపసవ్యం ఉండదు కదా...
మరొక విషయం మనందరికీ తెలిసిన మహామహులు , ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వర రావు గారు, కందుకూరి శివానంద మూర్తి గురువుగారు, సినీ దిగ్గజాలు కాశీనాధుని విశ్వనాధ్ డైరెక్టర్, యస్.పి కోదండపాణి గారు, హీరో చంద్రమోహన్ గారు, అమృతాంజనం ఔషధాన్ని కనిపెట్టిన, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు ఇలాంటి మహనీయులు అందరూ శ్రౌత శైవ ఆరాధ్య సాంప్రదాయములో పుట్టిన వారే...కనుక మన
S.P. BALA SUBRAHMANYAM గారిని ఖననం చేసారు.
...మీ అనుమానం నివృత్తి అయిందని తలుస్తాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి