ఆయుర్దాయ నిర్ణయం(లగ్నచక్రం నుంచి)
రెండు పద్దతులను తెలియజేసారు.
మొదటి పద్దతి:
1. భిన్నాష్టక వర్గురీత్యా ఆయుర్థాయ గణన చేయు విధానము.(రాశిగుణకార సంఖ్య భచక్ర
భాజకములు), గ్రహగుణకార సంఖ్య(గ్రహ భాజకములు)
రాశి గుణకార సంఖ్య, గ్రహ గుణకార సంఖ్యలను కనుగొనుటకు గ్రహముల భాన్నాష్టక వర్గు(శోధనల తర్వాత) లను గ్రహించవలెను.
రాశి గుణకార సంఖ్య:
భ చక్రమందు గల ప్రతి రాశికి ఒక సంఖ్య(fixed number) నిర్దేశింపబడినది. దీనిని ఆ రాశియోక్క "రాశి గుణకార సంఖ్య అందురు.
ఈ క్రింద తెల్పిన రాశి గుణకార సంఖ్యలు అందరి జాతకములందు ఒకే విధముగా ఉండును. అవి
మేషం -7 సింహం - 10 ధనస్సు -9
వృషభం- 10 కన్య - 5 మకరం -5
మిథునం -8 తుల - 7 కుంభం - 11
కర్కాటకం - 4 వృశ్చికం - 8 మీనం -12
ప్రతి గ్రహము యొక్క అష్టక వర్గునందుగల వివిధ రాసులయందలి (రెండు శోధనల తరువాత) బిందువులను ఆయా రాశులయొక్క రాశి గుణకార సంఖ్య చే (పైన పేర్కొకబడినవి) హెచ్చవేసి, ఈ పవిధముగా వచ్చు 12 రాశుల యోక్క లబ్దమును కూడవలెను.ఆ మొత్తమును బట్టి గ్రహము యొక్క రాశి పిండ సంఖ్య అందురు.
పై సూత్రమును అన్ని గ్రహములకు(9కి) వర్తింపజేయగా ఆయా గ్రహముల యొక్కరాశి పిండ సంఖ్యలు వచ్చు ను.
గ్రహపిండ
ప్రతి రాశికి ఒక గుణకార సంఖ్య(రాశి గుణకారం) వున్న విధంగానే ప్రతి గ్రహమునకు కూడా ఒక గుణకార సంఖ్య(గ్రహ గుణకారము)
ప్రత్యేకించబడింది.
ప్రతి గ్రహము యొక్క అష్టక వర్గు లందుగల వివిధ గ్రహముయొక్క అష్టక వర్గులలో (రెండు శోధనల తరువాత) మిగిలిన గ్రహములువున్న ఆయా రాశులయొక్క రాశి యందలిబిందువు సంఖ్య ను గ్రహ గుణకార సంఖ్య హెచ్చవేసి, ఈ విధముగా వచ్చు లబ్దమును కూడవలెను.ఆగ్రహము యోక్క మొత్తమును బట్టి గ్రహము యొక్క గ్రహపిండ సంఖ్య వచ్చును.
వివిధ గ్రహములకు ప్రత్యేకించబడిన గ్రహ గుణకార సంఖ్యలు ఈ విధముగా కలవు.
అందరి జాతకములకు ఈ సంఖ్యలు ఇదేవిధముగా ఉండును.
రవి - 5; గురు - 10; చంద్ర - 5 ; శుక్ర - 7
కుజ - 8; శని - 5 ; బుధ - 5
🏵 🏵🏵
జాతక పారిజాతము ననుసరించి గ్రహము యొక్క శోధ్యపిండ సంఖ్యను 30 చే భాగించగా వచ్చు భాగాహార లబ్దము గ్రహము ఇచ్చు"" ఆయువును ""సూచించును.
ఈ భాగాహార లబ్దము 12 కంటె హెచ్చు వుంటే
దానని 12 చే భాగించి శేషమును మాత్రమే పరిగ్రహించవలెను.
గ్రహము ఉఛ్ఛలో నున్నచో రెట్టింపు చేయవలెను.
గ్రహము నీచ అస్తంగత్వ గ్రహములయందున్నచో సగము చేయవలెను.🙏
(సశేషం) శోధ్యపిండ సంఖ్య
రాశి పిండ సంఖ్య గ్రహపిండసంఖ్య కూడినచో
గ్రహము యొక్క శోధ్యపిండ సంఖ్య వచ్చును.
శోధ్యపిండను "యోగ పిండ" అని కూడా పిలుస్తారు.
శోధపిండ సంఖ్యను 7 చే గణించి(మండలసంఖ్య యగు) 27 చే భాగించవలెను. భాగాహార లబ్దము 27 కంటె హెచ్చుగ నున్నచో దాని నుండి 27 తీసివేయవలెను. ఈ విధముగా వచ్చు సంఖ్య అట్టి గ్రహము ఇచ్చు ఆయుర్దాయము (హరణలకు(తగ్గింపు లకు) ముందుగా సూచించును.
ఇదే విధముగా మిగిలిన గ్రహముల మొత్తము(రాహువు, కేతువు లు మినహా యించి) ద్వారా నికర ఆయువును చంద్రమాన సంవత్సరములను తెల్పును.
దీనిని సౌరమాన సంవత్సరములుగా మార్చుటకు పైన వచ్చి న నికర ఆయువును 324 చే గుణించి ఆ లబ్ధమును 365 చే భాగించవలెను.🙏
రెండవ పద్దతి
నక్షత్రాయు పద్దతి
(సశేషం) to be continued
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి