27, సెప్టెంబర్ 2020, ఆదివారం

రోహిణి నక్షత్రం-గుణగణాలు, ఫలితాలు

 


రోహిణీ నక్షత్రానికి అధిదేవత బ్రహ్మ. నక్షత్రాధిపతి చంద్రుడు. ఈ నక్షత్ర జాతకులు మానసిక ధృఢత్వము కలిగి ఉంటారు. మానవ గణము కనుక ధర్మచింతన కలిగి ఉంటుంది. జీవితంలో లౌక్యంగానూ ప్రవర్తిస్తారు. అనుకున్నది నయనా భయానా చెప్పి సాధిస్తారు. అనుకూలంగా నడుచుకుంటూ ఆధిక్యత సాధిస్తారు. సాహస క్రీడలంటే ఇష్టపడతారు. అందులోనూ ప్రావీణ్యత, గుర్తింపు సాధిస్తారు.


రోహిణి నక్షత్రం 4 పాదాలూ వృషభ రాశిలోనే ఉంటాయి. 


రోహిణి మొదటి పాదము

రోహిణి మొదటి పాదములో జన్మించిన వారి ప్రధాన బలహీనత అనవసర విషయాలపై దృష్టిపెట్టడం. అవసరం లేని ఇతర విషయాల మీదే ఎక్కువగా ఆలోచిస్తారు. ఆలోచన అంతగా లేకుండానే తొందరపడి పనులు మొదలుపెడతారు. దీనివల్ల ఇబ్బందుల్లో కూరుకుపోతారు. నిదానంగా ప్రవర్తించాల్సిన విషయాల్లో జాగరూకత అవసరం. ఇతర విషయాలవైపు మనసు లాగితే చేసే పనిమీద శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి, అనవసర విషయాలకు ప్రాధాన్యం తగ్గించాలి. పరిస్థితుల్ని బట్టి సర్దుకోగలగడం ఒక వరం అనుకోవాలి. సానుకూలతను బట్టి మెలగాలి. 


రోహిణి మొదటి పాదము గ్రహ దశలు    

ఈ నక్షత్రంలో జన్మించిన వారి గ్రహ దశల విషయానికి వస్తే.. ముందుగా చంద్ర మహర్దశ పదేళ్లు, ఆ తర్వాత కుజ మహర్దశ 7 ఏళ్ళు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, ఆపై గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ దశ 17సంవత్సరాలు, కేతు దశ 7 సంవత్సరాలు ఉంటుంది.


రోహిణి రెండో పాదము

రోహిణి రెండో పాదములో జన్మించిన వారు అదృష్ట జాతకులు. కలిసివచ్చిన అవకాశాల్ని చక్కగా ఉపయోగించుకునే నేర్పు ఉంటుంది. ఈ విషయంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మాటల్లో పటుత్వం కలిగి ఉంటారు. ఈ ధోరణితో నెగ్గుకొని రాగలుగుతారు. ఇక జీవితంలో తరచూ తారసపడే అనవసరమైన విషయాల మీద ఆందోళన తగ్గించుకోవాలి. ప్రతిభా సామర్థ్యాలు ఏ స్థాయిలో వినియోగించుకోవాలనే విషయంలో స్పష్టత సాధిస్తే మరింత మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. 


రోహిణి రెండో పాదములో గ్రహ దశలు   

ఈ పాదములో జన్మించిన వారికి ముందుగా చంద్ర మహర్దశ ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత కుజ మహర్దశ 7 ఏళ్ళు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, ఆపై గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ దశ 17 సంవత్సరాలు, కేతు దశ 7 సంవత్సరాలు ఉంటుంది.


రోహిణి మూడో పాదం 

రోహిణి మూడో పాదంలో జన్మించిన వారికి రకరకాల ఆలోచనలు పరిభ్రమిస్తుంటాయి. అయితే ఆ ఆలోచనలు బయటపెట్టకుండా జాగ్రత్త పడతారు. కళలయందు ఆసక్తి ఉంటుంది. కొంచెం పట్టు ఉన్నా ఎక్కువ పట్టు ఉన్నట్లు చూపగల నేర్పు ఉంటుంది. అయితే ఎల్లప్పుడు అనవసరపు ఆందోళనలు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. భావోద్వేగాలను ప్రకటించే విషయంలో పరిమితి తప్పనిసరి. 


గ్రహ దశలు   

తొలుత చంద్ర మహర్దశ 5 సంవత్సరాలు, ఆ తర్వాత కుజ మహర్దశ 7 సంవత్సరాలు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, తదుపరి గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ దశ 17సంవత్సరాలు, కేతు దశ 7 సంవత్సరాలు ఉంటుంది.


రోహిణి నాలుగో పాదం

రోహిణి నాలుగో పాదంలో జన్మించిన వారు అంది వచ్చిన అవకాశాల్ని పసిగడుతారు. జాగరూకులై ప్రవర్తించడం వీరి సహజసిద్ధ లక్షణం. జాగ్రత్తలో ఉన్నప్పటికీ ఒక్కోసారి ఎదురుదెబ్బలు తగిలే అవకాశం. అటువంటి సందర్భాల్లో సైతం మెరుగైన అవకాశాలకోసం అన్వేషిస్తారు. ముఖ్యమైన సందర్భాల్లో తమను తాము గుర్తెరిగి ప్రవర్తిస్తుంటారు. 


గ్రహ దశలు   

తొలుత చంద్ర మహర్దశ రెండున్నర సంవత్సరాలు, ఆ తర్వాత కుజ మహర్దశ 7 సంవత్సరాలు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, తదుపరి గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, అనంతరం బుధ దశ 17సంవత్సరా లు, కేతు దశ 7 సంవత్సరాలు ఉంటుంది.

రోహిణి నక్షత్రము గుణగణాలు

ఈ నక్షత్ర జాతకులు మానసిక ధృఢత్వము కలిగి ఉంటారు. అనుకూలంగా నదచుకుంటూ ఆధిక్యత సాధిస్తారు. త్వరగా కోపం రాదు. చిరునవ్వుతో ఉంటారు. ఎన్ని విమర్సలనైనా ఎదుర్కొని అనుకున్నది సాధిస్తారు. ఎగుమతి, దిగుమతి వ్యాపారం కలసి వస్తుంది. అపనిందలు, ఆరోపనలు జీవితములో ఒక భాగము ఔతాయి. జీవితములో ఒడిదుడుకులు సహజము. వీరు హాస్యప్రియులు, కళ ప్రియులు కనుక కళారంగములో ప్రగతిని సాధిమ్చి అవార్దులు పొందగలరు. సంతానముతో విభేదిస్తారు. 


గురు మహర్ధశ, శని మహర్ధశ వీరికి కలసి వస్తుంది. ప్రేమ వివాహాలు కలసి రావు. భార్యా భర్తల నడుమ అన్యోన్యత ఉంటుంది. క్రీడలు, కోర్టు వ్యవహారాలలో విజయము సాధిస్తారు. గజ ఈతగాళ్ళూ ఔతారు.తనకు తాను సుఖపడుతూనేతన వారిని సుఖ పెడతారు. వంశానికి కుటుంబానికి పేరు తెస్తారు. తాము అనుకున్నట్లు సంతానాన్ని తీర్చి దిద్దుతారు....మీ.... *చింతా గోపి శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్ :- 9866193557

కామెంట్‌లు లేవు: