27, సెప్టెంబర్ 2020, ఆదివారం

ధార్మికగీత - 32*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                            *

                                      *****

           *శ్లో:-  క్షణం చిత్తం క్షణం విత్తమ్ ౹*

                   *క్షణం జీవిత  మావయో: ౹*

                   *యమస్య కరుణా  నాస్తి  !*

                   *ధర్మస్య   త్వరితా   గతిః  ౹౹*

                                      *****

*భా:-  మానవ జీవితము ఒక నీటి బుడగ వంటిది. క్షణ భంగురము. మరి అదే క్షణిక మైనప్పుడు సంకల్ప వికల్పాలకు కొలువు, నెలవైన "మనసు" కూడా క్షణికమే. మనసు కోరే కోరికలకు అంతే ఉండదు. "మనోరథానాం అగతి ర్న విద్యతే"-  కోరికలకు కోరరాని చోటు ఉండదట. కోరికలు తీర్చుకుంటూ పోతుంటే, అవి పెరగడం తప్ప తరగడం అనేది ఉండదు. ఇక మనిషి మనసు పడి తరతరాలకు సరిపడ గడించిన  "డబ్బు" కూడా చంచలమే. స్థిరంగాదు. నేటి లక్షాధికారి రేపు భిక్షాధికారి కావచ్చు. నేటి కుచేలుడు రేపు కుబేరుడు కావచ్చు. మనస్సు, డబ్బు ,జీవితం ఆశాశ్వతమే. యమునికి దయ అనేది లేదు. మృత్యువు రాక తెలియదు. శ్రీకృష్ణుడు అడగ్గానే కర్ణుడు ఎడమచేతిలోని స్వర్ణపాత్రని ఆ చేతిలోనే దానం చేస్తూ,  వామహస్తంతో చేసింది దక్షిణహస్తానికి తెలియకూడదంటంలో ఆంతర్యం ధర్మం వెంటనే చేయమని చెప్పడమే. కాన ఉన్న నాలుగు రోజులు సత్కర్మల నాచరిస్తూ, దాన ధర్మాలు చేయాలి. ఆ పుణ్యఫలమే నిన్ను, నీ వారసులను నీడలా వెన్నంటి, కంటికి రెప్పలా కాపాడుతుంది. అందుకనే "అనిత్యాని శరీరాణి" అని, "ధర్మో రక్షతి రక్షతః " అని పెద్దలు చెబుతారు* .

                                   *****

                     *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: