27, సెప్టెంబర్ 2020, ఆదివారం

*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏

 *వందేమాతరం*




*పద్యం: 1910 (౧౯౧౦)*


*10.1-894-వ.*

*10.1-895-*


*క. గుఱ్ఱముల పరువు మెచ్చని*

*నఱ్ఱల గట్టిన రథంబు నందప్రముఖుల్*

*గుఱ్ఱ ల యార్పులు చెలఁగఁగఁ*

*దొఱ్ఱలగమి వెంట నంటఁ దోలి రిలేశా!*🌺



*_భావము: ఓ పరీక్షిన్మహారాజా! ఈ విధముగా యాదవులు కృష్ణునితో కూడి కొండకు పూజలు చేసి నైవేద్యములు సమర్పించి సద్బ్రాహ్మణుల ఆశీర్వచనపూర్వక వచనముల మధ్య తమ గో సంపదతో సహా ఆ గిరికి ప్రదక్షిణలు చేసి గోకులమునకు బయలుదేరారు. నందుడు మొదలగు పెద్దలు బలిసి యున్న ఎడ్లతో పూన్చబడిన బళ్లను గుఱ్ఱముల కంటే వేగముగా పరుగెత్తించారు. ఆవుల మందలను తోలుకొని పోవుచూ గోపబాలురు హుషారుగా కేకలు వేసుకుంటూ వాటి వెంటే నడిచారు._* 🙏



*_Meaning: O king Parikshit! The Yadava folk along with Sri Krishna performed pooja to the Hill, offered food items as prasadam, had blessings (Aseervachanam) from Brahmins. Along with the herd of cows, all of them went round the hill and then started for Gokulam. Nanda and other elders used strong and potent bulls for their carts and rode them at a speed that was faster than horses. As they drove their cows towards home, the yadava boys walked behind them chatting enthusiastically with loud clamour and cheer._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454).*

కామెంట్‌లు లేవు: