శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
#శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;
మ||
పురవిధ్వంసక ! తావకీన పదాసంపుల్లాబ్జ కాసార సు
స్థిరసంవాస వరప్రసాద గరిమన్ స్వేచ్ఛోర్మికా డోలలన్
నిరతం బుయ్యెలలూగు హంసమును దీనిం బట్టి దేహంపుపెన్
జెర లసాలన్ పడవైచి చూచెదె 'మజా'! శ్రీ సిద్దలింగేశ్వరా!
భావం;( నాకు తెలిసినంత వరకు)
త్రిపురాలను దగ్ధం చేసిన ఈ మహేషా! నీ యొక్క పాద పద్మములు వెలసివుండే తటాకంలో నీ వరప్రసాద మహిమవలన నిత్యము హాయిగా, ఆ నీటి అలలపై స్వేచ్ఛగా ఊయలలూుగే హంసమును(నా ఆత్మను) తీసుకువచ్చి ఈ దేహము అనేటువంటి పెద్ద చెరసాలలో పడేసి తమాషా చూస్తావేమయ్యా!
నాకు విముక్తి ప్రసాదించి నీలో కలుపుకో స్వామి, శ్రీ సిద్ధ లింగేశ్వరా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి