21, డిసెంబర్ 2025, ఆదివారం

వేద ఆశీర్వచనం


  *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - హేమంత ఋతువు - పుష్య మాసం - శుక్ల పక్షం - ప్రతిపత్ - పూర్వాషాఢ -‌‌ భాను వాసరే* (21.12.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.




.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

21-12-2025 రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

21-12-2025 రాశి ఫలితాలు

మేషం

ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.

---------------------------------------

వృషభం

సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో విశేషమైన ఆధరణ పెరుగతుంది.

---------------------------------------

మిధునం

కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల కష్టం ఫలించింది నూతన అవకాశాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణకు పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. సన్నిహితుల నుండి కొత్త విషయాలు సేకరిస్తారు. స్థిరస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.

---------------------------------------

కర్కాటకం

కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కలసిరావు. చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు ఉంటాయి. బంధు వర్గంతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ తప్పదు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.

---------------------------------------

సింహం

ఉద్యోగాలు ఆశించిన రీతిలో రాణించవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార వ్యవహారాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. 

---------------------------------------

కన్య

వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలిగి పదోన్నతులు పెరుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్ కు ఉపయోగపడతాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.  

---------------------------------------

తుల

చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఇంటాబయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------

వృశ్చికం

బంధు మిత్రులతో ఒక వ్యవహారంలో వివాదాలు తప్పవు. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులుంటాయి. దూరప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది.

---------------------------------------

ధనస్సు

ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.

--------------------------------------

మకరం

ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగడం మంచిది. ఆత్మీయుల నుంచి అందిన శుభవార్త ఆనందం కలిగిస్తుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------కుంభం

ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు ఉంటాయి. ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు ఆకస్మికంగా నిర్ణయాలు మార్పు. చేయడం వలన నష్టాలు తప్పవు.

---------------------------------------

మీనం

వ్యాపారాల్లో ఆశించిన విధంగా రాణిస్తాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఒక వార్త ఊరట కలిగిస్తుంది. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. గృహమున శుభకార్యాల నిర్వహణ పై చర్చలు చేస్తారు.

---------------------------------------

తిరుప్పావై ప్రవచనం‎-6 వ రోజు*

 🍀```21వ తేదీ ఆదివారం…

వేకువఝామున పాడుకొనుటకు…

```

*తిరుప్పావై ప్రవచనం‎-6 వ రోజు*

                 ➖➖➖✍️

              6 వ పాశురము:


*పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్*

*వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో*

*పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు*

*కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి*

*వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై*

*ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుం యోగిగళుం*

*మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం*

*ఉళ్ళం పుగుందు కుళిరుందేలోర్ ఎమ్బావాయ్*



*🌺భావము:*```

భగవదనుభవము క్రొత్తదవుట వల్ల ఈ వ్రతము గురించి తెలియక తానొక్కత్తె తన ఇంటిలో పడుకొని బయటకు రాకుండా వున్న ఒక అమ్మాయిని లేపుచున్నారు.


ఆహారము సంపాదించుటకు పక్షులు లేచి కిలకిలలాడుచున్నవి. ఆ పక్షులుకు నాయకుడైన గరుత్మంతునకు స్వామి యగు 

శ్రీ మహా విష్ణువు ఆలయములో తెల్లని శంఖము ‘సమయము అయినది’ అని పెద్ద శబ్దము చేయుచున్నది. ఆ ధ్వని వినబడుటలేదా ! ఓ పిల్లా ! లే!. మేము ఎవరు లేపగా లేచామని అనుమానం కలుగవచ్చు .

పుతనస్తనములందుండు విషమునారగించినవాడును అసిరావేశము గలిగి చంప నుద్యమించిన కృత్రిమ శకటమును కేలుడునట్లు, పాలకై ఏడ్చి కాలు చాచి పొడి పొడి యగునట్లు చేసినవాడును, క్షీర సాగరమును చల్లని మెత్తని సుకుమారమైన శేషశయ్యపై లోకరక్షచింతనతో యోగనిద్ర సమరియున్న జగత్కారణభూతుడగు ఆ సర్వేశ్వరుని తమ హృదయముల పదిలపరచుకుని మెల్లగా లేచుచున్న మునులును యోగులను ‘హరి -హరి -హరి’ అనుచున్నప్పుడు వెలువడిన పెద్ద శబ్దము మా హృదయములలో చొచ్చి, చల్లబరచి , మమ్ములను మేల్కొల్పినది. నీవునూ లేచి రా!

```


*🌸అవతారిక :*```

ధనుర్మాస వ్రతంలో చేయవలసినది, పొందవలసినది, దానికి తగు యోగ్యత మొదలైనవాటిని గురించి మొదటి ఐదు పాశురాలలోను వివరించింది గోదా తల్లి. అందరినీ ఉత్సాహంగా వ్రతంలో పాల్గొనజేసింది. ఈ మొదటి ఐదు పాశురాలను వ్రతానికి మొదటి దశగా (అభిముఖ్య దశ) చెపుతారు.


ఇక 6 నుంచి 15 వరకు రెండవ దశ, అనగా ఆశ్రయణదశగా వర్ణిస్తారు. భగవంతుని సంశ్లేషము, సాక్షాత్కరము కావాలంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని పొందటానికి ఆచార్య కృప కావాలి. ఆచార్య కృపకావలెనంటే వారిని సమాశ్రయించాలి. భాగవదనుభవజ్ఞులైన సదాచార్య సమాశ్రయణమే భవగద్ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.


కావున యీ పది పాశురాలలో గోదా తల్లి భగవదనుభవాన్ని పొందిన పదిమంది గోపికలను మాతో కలిసిరండని, మీఅనుభావాన్ని మాకూ పంచండనీ, ఆ భగవదానందాన్ని మీరొక్కరే అనుభవించరాదనీ, అందరికీ పంచవలెనని గోపికారూపులు, సదాచార్యులైన ఆళ్వారు రూపాలను మేలుకొలుపుతోంది గోదాతల్లి. వ్రతంలో అనుభవం లేని ఒక గోపికను లేపుతోందీ పాశురంలో.```



*🌷6.వ మాలిక:*

*(అఠాణారాగము - ఆదితాళము)*


ప. చూడవె! సఖియరో! ఓ చిన్నదాన!

పడక వీడవె! పక్షులెగిరే కనవే!

చూడవే! సఖియరొ!


అ.ప. గడి వెడలిన గుడి శంఖ నాదములు

వడి బిలువగ వినలేదే! లేవవె! చూడవె! సఖియరొ!


1 చ. స్తన విషమును, పూతన, శకటాదుల

ప్రాణమ్ముల నవలీల హరించిన

పన్నగ శయనుని జగన్నాధుని

మనసున నిలిపి ధ్యానింపరాగదే!

చూడవె! సఖియరో


2. చ. మునులు యోగులును మెల్లన లేచి

ధ్యానమగ్నులై 'హరి హరి' యన - నది

ఘనరవమై మా మనసులను జేరి

తనువు పులకింప నిదుర లేపినది

చూడవె! సఖియరో!



🌼*ఆరవ ప్రవచనం‎:*


*6 వ రోజు - స్థిత ప్రజ్ఞుల దశ*

ఆండాళ్ తిరువడిగలే శరణం


*పాశురము:*


*పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్*

*వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో*

*పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు*

*కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి*

*వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై*

*ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుం యోగిగళుం*

*మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం*

*ఉళ్ళం పుగుందు కుళిరుందేలోర్ ఎమ్బావాయ్*```


ఈ రోజు నుండి మన ఆండాళ్ తల్లి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్క గోపబాలికలను లేపడం ప్రారంభిస్తుంది. మనకో సందేహం రావచ్చు. శ్రీకృష్ణ ప్రేమ అందరికీ సమానమైనప్పుడు కొందరికేమో నిద్ర పట్టడంలేదు, వెంటనే శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తుంటే మరి కొందరెలా నిద్ర పోతున్నారని మనకు అనిపించవచ్చు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. భగవంతుని గుణాలు, ప్రేమ అనేవి ఒక మత్తు మందులాంటివి. అలాగే భగవంతుని గుణాలు ఒక్కొక్కరిపై ఒక్కోలా పనిచేసి కొందరికి నిద్రమత్తులో ఉంచేట్టు చేసాయే తప్ప వారికి శ్రీకృష్ణ ప్రేమ తక్కువని కాదు అని గమనించాలి. పైగా వారు సాత్విక నిద్రలో ఉన్నారు, మన నిద్ర లాంటి తామసిక నిద్ర కాదు అని గుర్తించాలి.


శ్రీకృష్ణ పరమాత్మ …

రెండో అధ్యాయమంలో స్థితప్రజ్ఞుల గురించి చెప్పాడు. వారు ఎలా ఉంటారంటే అందరూ మేల్కొనేపుడు వాళ్ళు పడుకొని ఉంటారు, అందరు పడుకొనేపుడు వాళ్ళు మెలుకువగా ఉంటారు. సామన్యులు శారీరక సుఖాలలో మెలుకువై ఉంటారు. మరి ఏ జ్ఞానం లేకుండా ఉన్నది దేనిలో అంటే లోపల ఉండే మన విషయంలో, వెనకాల ఉండి నడిపే వాడి విషయంలో జ్ఞానం శూన్యం. ప్రాపంచిక విషయాల్లో చాలా జ్ఞానం కల్గి ఉంటారు. మరి జ్ఞానులేమో ప్రాపంచిక విషయాలు అంతగా పట్టించుకోకుండా, భగవంతుని విషయంలో జాగరూకులై ఉంటారు. ఆలోపల ఉండే గోపికలూ అట్లాంటివారే. అందుకే మనం వాళ్ళను మన తోడుపెట్టుకొని భగవంతుని దగ్గరకు వెళితే తప్ప భగవంతుడు మనకేసి చూడడు. అలా భగవంతుని విషయంలో నిమగ్ఞమై ఉన్న ఒక పది మంది గోపికలను లేపుతూ భగవత్ జ్ఞాన దశల్లోని ఒక్కొక్క స్థితిని మనకు చూపిస్తూ మన ఆండాళ్ తల్లి మనకున్న పొరల్ని తొలగిస్తుంది. అప్పుడు మనకు భగవంతుని అనుగ్రహాన్ని పొందే యోగ్యత సంప్రాప్తిస్తుంది.


ఈ రోజు లేపే గోపబాలిక ఒక చిన్ని పిల్ల. చిన్నపిల్లలు మనసులో చేతల్లో ఒకేరకమైన భావం కల్గి ఉంటారు. అలాంటి ఒక గోపబాలికను లేపుతూ *"పుళ్ళుం శిలమ్బిన కాణ్ "* పక్షులు అరుస్తున్నాయ్ లేవవోయ్. భౌతిక జీవితంలోనైనా అంతరమైన జ్ఞాన జీవితంలోనైన పక్షుల అరుపులే మనల్ని రక్షించేవి. అంటే రెండు రెక్కల పక్షులు మనకు తెల్లవారడాన్ని సూచించినట్లే, జ్ఞానము దానికి ఉచితమైన ఆచరణ అనే రెండు రెక్కలతో ఆకాశము అంటే అంతటా వ్యాపించి ఉన్న భగవతత్వములో విహరించే మహానుభావుల పలుకులు, మనల్ని అజ్ఞానములోంచి బయటకు తెచ్చే పక్షుల అరుపులు అవే. అందుకే మనవాళ్లు ఒక గుర్తుగా చెప్పారు. 


లోపల గోపబాలిక వీళ్ళు చేసే అల్లరికి పక్షులు లేచి ఉంటాయి అని భావించినట్లుంది, మనవాళ్ళు రెండో గుర్తు చెప్పడం ప్రారంభించారు ``` *"పుళ్ళరైయన్ కోయిల్ వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో పిళ్ళాయ్! "ఆ ఊరిలో ఉండే పక్షిరాజు అయిన గరుత్మంతుని స్వామి - విష్ణు ఆలయంలో తెల్లని పిలుపు శంఖం ధ్వని కుడా వినిపించడం లేదా ఓ చిన్నపిల్లా అని అంటుంది. అక్కడి దీప కాంతి శంఖం ఊదే వాడి బుగ్గలపై పడి శంఖం మెరుస్తుందని ఆండాళ్ తల్లి ఆలయ సన్నివేశాన్ని భావిస్తూ - తెల్లని పిలుపు శంఖం అని వర్ణిస్తుంది. శంఖం ఓంకారానికి సంకేతంగా పోలుస్తారు. లోపలుండే గోపబాలిక అది ఝాము ఝాముకు వినిపించే ధ్వని ఇంకా తెల్లవారలేదన్నట్లుగా భావించి ఇంకా నిద్ర లేవలేదు. *"ఎళుందిరాయ్"-* మేలుకో. మరి ఆండాళ్ తల్లి తాను ఎలా మేలుకొందో కొన్ని గుర్తులు చెబుతుంది. *"మునివర్గ ళుం యోగిగళుం మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం ఉళ్ళం పుగుందు కుళిరుంద్"* మునులూ,యోగులూ మెల్లగా లేస్తూ శ్రీకృష్ణ పరమాత్మను తలుస్తూ హరి-హరి-హరి అంటూ అనుకునే శబ్దం ఒక్కసారిగా పెద్దగావినిపించి మా చెవులను చేరి ఒక్కసారిగా లేచాం, నీకు వినబడలేడా! మరి వాళ్ళు మూడు సార్లు హరినామం ఎందుకు అన్నారో ఆండాళ్ తల్లి వివరిస్తుంది. 


*"పేయ్ములై నంజుండు"* పూతన స్తనాలకు అంటి ఉన్న విషాన్ని ఆరగించాడు- దూదిపింజ నిప్పుపై పడి కాలిపోయినట్లు ఆమెను సంహరించాడు - వదలని వాడు కాబట్టే ఆయనను అచ్యుత అని అంటారు. ప్రకృతి మనకు ఇచ్చే "అహం-మన" అనే విషాలను హరించేవాడా - హరి అని జ్ఞానులు తలుస్తున్నారు. 


*"కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి"* శ్రీ కృష్ణుని తల్లి యశోదమ్మ ఒక బండి క్రింద పడుకోబెట్టింది, ఒక అసురుడు బండిపై ఆవహించి శ్రీ కృష్ణుని సంహరించాటానికి చూసాడు. కపట శకటాసురుణ్ణి కాలుజాచి సంహరించాడు. ఆయన పాదం అలాంటిది. ఈ శరీరం మనకు ఒక శకటం లాంటిది, పుణ్య-పాపాలు దాని చక్రాలవంటివి, మనల్ని నడిపించే పరమాత్మను దానిక్రింద పెట్టి ఆయన పాదాలను- చరణౌ శరణం ప్రపద్యే అంటే చాలు- మనకు అంటి ఉన్న పుణ్య-పాప సంపర్కాన్ని హరించువాడా - హరి. 


*"వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై ఉళ్ళత్తు క్కొండు"* - ```

ఆదిశేషువుపై సుకుమారంగా పవళించి ఉన్న జగత్తుకు బీజమైన స్వామి. అయిదు తలల ఆదిశేషువు - అయిదు రకాల జ్ఞానములను తెలియ జేస్తుంది. నేను వాడికి చెందిన వాన్ని, వాడు నన్ను తరింపచేయువాడు, వాణ్ణి చేరే సాధనం వాడి శరణాగతే, వాణ్ణి చేరితే కలిగే ఫలితం వాని సేవ, వాణ్ణి చేరకుండా ఉంచే ఆటకం వానియందు రుచిలేకుండుట అనే అయిదు జ్ఞానాలు కల్గి ఉండే వారి హృదయాల్లో ఉంటాడు స్వామి. ఇతరమైన వాటిపై రుచి హరింపచేసినవాడా- హరి. అంటూ మూడు సార్లు హరి అని పిలుస్తుంటే లేచామని తెలుపుతూ అండాళ్ తల్లి గోప బాలికను లేపింది.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

మాంసం తినే పాశ్చాత్య ఆవులు*

 

*మన ఆరోగ్యం…!


*మాంసం తినే పాశ్చాత్య ఆవులు*

               ➖➖➖✍️


```

అమెరికాలో ఎక్కడ చూసినా కనిపిస్తున్న ఆటిజం (పిల్లలలో బుద్ధిమాంద్యం), జైగాంటిజం (చిన్నపిల్లలు కూడా రాక్షసులలాగా పెరిగిపోవడం), ఒబెసిటీ (ఊబకాయం), ప్రికోసియస్ ప్యూబర్టీ (తొమ్మిదేళ్లకే ఆడపిల్లలు రజస్వలలు కావడం, ఎనిమిదేళ్లకే అబ్బాయిలకు గడ్డాలు మీసాలు రావడం), 25 ఏళ్లకే వస్తున్న రకరకాల కేన్సర్లు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఇవన్నీ ఎందుకొస్తున్నాయా అని తెగ పరిశీలించాను చాలాసార్లు. 


వీటన్నిటికీ కొన్ని కారణాలు కనిపించాయి. 

అవి…```


*1. జీవనవిధానాలు లేదా లైఫ్ స్టైల్స్:*```

అంటే, ఒక వేళకు నిద్ర లేవడం, నిద్రపోవడం లాంటి ఒక నియమిత జీవనవిధానం లేకపోవడం. ```


*2. ఆహారదోషాలు…*```

అంటే, ప్రాసెస్ చేసినవి, ఫ్రోజెన్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, రెడ్ మీట్ లాంటివి తెగ తినడం.```



*3. సిగరెట్లు, త్రాగుడు, వీడ్ మొదలైనవి విపరీతంగా తీసుకోవడం.*



*4. ఉద్యోగ టెన్షన్లు. విపరీతమైన పని ఒత్తిడితో, టెన్షన్ తో, బాగా చేయకపోతే ఉద్యోగం పోతుందేమో అన్న భయంతో ఏళ్లకేళ్లు పనిచేయడం.*



*5. మోడ్రన్ మెడిసిన్ లో వాడబడుతున్న సింథటిక్ డ్రగ్స్, ఇంకా స్టెరాయిడ్స్ మొదలైన వాటి వాడకం. ప్రతి చిన్నదానికీ భయపడి హై పవర్ మందులు వాడెయ్యడం.*



*6. వందలాది టీకాలను పుట్టినప్పటినుండీ పిల్లలకు విచక్షణారహితంగా వేయించడం.*

```

ఇలా చాలా కారణాలు నాకు కనిపించాయి. 



కానీ వీటిని చెప్పినా కూడా ఎవరూ నమ్మనంతగా జనం తయారయ్యారు. 

పైగా, 'ఇవి కారణాలు కాదులే' అని తేలికగా కొట్టిపారేస్తున్నారు. సరే ఎవరి ఖర్మకు ఎవరు బాధ్యులు? అని నేనూ వదిలేస్తూ ఉంటాను.



మూడేళ్ళ క్రితం మావాడు నాతో ఫోన్లో మాట్లాడుతూ, 'నాన్నా నేను పాలు పెరుగు మానేశాను. వీగన్ నయ్యాను' అన్నాడు.


నేను షాకయ్యాను.


'అదేంటి నాన్నా? పాలూ పెరుగూ మానేస్తే ఎలా? మనం తినే ఆహారంలో కాస్త ప్రోటీన్ అదే కదా? పైగా పెరుగేమో ప్రో బయాటిక్. గట్ హెల్త్ కి అది చాలా అవసరం. అది మానేస్తే ఎలారా?' అని కొంచం గదిమినట్లే అన్నాను.


మావాడు తేలికగా, 'నువ్వు ఇక్కడికొచ్చినపుడు నీకర్థమౌతుందిలే నాన్నా' అన్నాడు.


'సరే. అక్కడి పరిస్థితులేంటో మనకు తెలీవు కదా. వెళ్ళినపుడు చూద్దాం' అనుకొని నేనూ ఊరుకున్నాను.  


ఇక్కడికొచ్చి నలభై రోజులయ్యాయి. ఈ నలభై రోజులలో అరుగుదలలో చాలా తేడా వచ్చింది. ముందు నీళ్ల తేడా అనుకున్నాను. కానీ రోజురోజుకూ కొన్ని సమస్యలు ఎక్కువౌతున్నట్లు అనిపిస్తున్నది. మొదటిరోజునుంచీ ఇక్కడ పాలు, పెరుగుల మీద నాకేదో అనుమానంగానే ఉంది. అవి సహజంగా ఉన్నట్లు అనిపించవు. రుచి తేడాగానే ఉంటుంది, అదీగాక వాటిని తీసుకున్న తర్వాతే అరుగుదల సమస్యలు ఎక్కువౌతున్నట్లు అనిపించింది. అందుకని ఈ మధ్యనే అవి రెండూ మానేశాను. 

వెంటనే అప్పటిదాకా కనిపిస్తున్న డైజెషన్ సమస్యలన్నీ మంత్రం వేసినట్లుగా మాయమయ్యాయి. ఈ రెండే అసలైన దొంగలని అర్ధమైంది. వీటిమీద ఇంకాస్త రీసెర్చి చేద్దామని నిర్ణయించుకున్నాను. 


ఈ లోపల డెట్రాయిట్ రిట్రీట్ వచ్చింది. నాలుగైదు రాష్ట్రాల నుండి సభ్యులు వచ్చారు. ఒకరోజున మాటల మధ్యలో ఇదే టాపిక్ వచ్చింది.


'డైరీ ప్రొడక్స్ ఇక్కడివాళ్లకు అసలైన చేటు చేస్తున్నాయని నా ఉద్దేశ్యం' అన్నాను.


సభ్యులలో ఒక డాక్టర్ ఉన్నారు. ఆమె గత ముప్పై ఏళ్ళనుంచీ ఇక్కడ డాక్టర్ గా ఉన్నారు. ఆమె నా మాటలతో ఏకీభవించడమే గాక, ఇలా అన్నారు…


'ఇక్కడ ఆవులకు మాంసం తినిపిస్తున్నారు. వాటి పాలను కల్చర్ చేసి, చాలా మార్చేసి మార్కెట్లో పెడుతున్నారు. వాటిని త్రాగిన పిల్లల్లో మీరు చెప్పిన రోగాలన్నీ వస్తున్నాయి. చిన్నచిన్న పిల్లల్లో కూడా కేన్సర్లు వస్తున్నాయి. ఇక్కడి తిండే ఇక్కడి రోగాలకు కారణం, పాలు బాగా త్రాగాలని ఇక్కడి పిల్లలకు మనవాళ్లు తెగ తాగిస్తారు. అవే వాళ్ళ కొంప ముంచుతాయి. కానీ ఆ విషయం అర్ధమయ్యేసరికి చేయి దాటిపోతుంది.'


నేను నిర్ఘాంతపోయాను.


'ఆవులకు మాంసమా?' అన్నాను నోరెళ్ళబెట్టి. 

కానీ అమెరికాలో ఆమె చాలా సీనియర్ డాక్టర్ అవడం చేత ఆమె చెప్పినది నమ్మక తప్పలేదు.


తరువాత రీసెర్చి చేస్తే దిమ్మెరపోయే నిజాలు బయటపడ్డాయి…


ఇక్కడ స్టోర్స్ లో... 

'గ్రాస్ ఫెడ్ కౌ మిల్క్' అని విడిగా పాలపేకెట్లు దొరుకుతాయి. 

అంటే, 'గడ్డి తినే ఆవుల పాలు' అన్నమాట. 

మొదటిసారి స్టోర్స్ లో ఈ పాల పాకెట్స్ చూసినపుడు నాకు మళ్ళీ మతిపోయింది. 


'ఆవులు గడ్డి తినక ఇంకేం తింటాయి?' అనడిగాను.


'అలా కాదు, బలం కోసం, మరిన్ని పాలివ్వడం కోసం వాటికి బీన్స్ పెడతారు. అంతేగాక హార్మోన్ ఇంజక్షన్లు ఇస్తారు' అని నాకు చెప్పారు.


ఇప్పుడు, ఆ బీన్స్ తో బాటు, మాంసాన్ని బాగా ఎండబెట్టి, పొడిచేసి, అందులో కలిపి ఆవులకు తినిపిస్తున్నారన్న దిగ్భ్రాంతికరమైన వాస్తవం బయటపడింది. అందులో పందిమాంసం కూడా ఉంటుందట. అందుకే ఇక్కడి పాలు ఏదోగా ఉంటాయి. పెరుగేమో బంక బంకగా సాగుతూ ఉంటుంది. సహజమైన రుచి వాటిలో ఉండదు.


అంటే, అలాంటి మాంసం తిని, హార్మోన్ ఇంజక్షన్లు చేయించుకున్న ఆవుల పాలు, డబల్ పాశ్చరైజేషన్, కల్చర్ చెయ్యబడిన తర్వాత, మనం త్రాగుతున్నాం. అదే పెరుగును తింటున్నామన్న మాట !


మరి పైన చెప్పిన నానా రోగాలు రాక ఇంకేమొస్తాయి?


అమెరికాలో అడుగుపెట్టిన మొదటిరోజునుంచీ నాకీ పాలంటే, పెరుగంటే ఎందుకు అసహ్యంగా ఉందో ఇప్పుడర్థమైంది. వాటిని మానేశాక, ఎందుకు హాయిగా ఉందో ఇంకా బాగా అర్ధమైంది.



ఇవీ ఫుడ్ మాఫియా లీలలు !



అందుకేనేమో, అమెరికాలో ఎక్కడ చూసినా వీగన్ కల్చర్ బాగా ఎక్కువైంది. ఇప్పుడు ఇండియాలో కంటే అమెరికాలోనే శాకాహారులు ఎక్కువగా ఉన్నారు. ఇండియాలో మనం పాలు పెరుగులు కూడా తీసుకుంటాం. ఇక్కడ వీగన్స్ అవి కూడా తినరు. పూర్తిగా మొక్కల నుండి తయారైన ఆహారాన్నే వీళ్ళు వాడతారు. వీగనిజం అనేది ప్రస్తుతం ఇక్కడొక ఉద్యమంలా వ్యాపిస్తోంది. ఎక్కడచూచినా వీగన్ రెస్టారెంట్లు కనిపిస్తున్నాయి. ఇండియాలో తినే శాకాహారమే అన్నిటికంటే బెస్ట్ బేలన్సుడ్ ఫుడ్ అని అమెరికన్లు చాలామంది అంటున్నారు.



చావుకొస్తుంటే చస్తారా మరి?


ఒకే ఒక్క ఉదాహరణ చెప్పి ముగిస్తాను…


బాక్సింగ్ రంగంలో ఎప్పటికీ గుర్తుండే పేరు - మైక్ టైసన్. రెడ్ మీట్ లేనిదే అతనికి ముద్ద దిగదు, అతనితో రింగ్ లోకి దిగాలంటే భయపడి చచ్చేవాళ్ళు ప్రత్యర్ధులు. కానీ ప్రస్తుతం అతను వీగన్.


'ఎందుకిలా అయ్యావు? అని ఎవరో అడిగితే అతనిలా చెప్పాడు.


'రెడ్ మీట్ నాకు చేసిన హానిని నా బాడీ నుంచి క్లీన్ చేసుకోవడానికి ఇంతకంటే నాకు మార్గం కనిపించలేదు, అందుకే వీగన్ నయ్యాను. ఇప్పుడు నాకు హాయిగా ఉంది' అన్నాడు. 


మైక్ టైసన్ నుండి ఈ మాటను ఊహించగలమా? కానీ ఇది నిజం. యూట్యూబ్ లో ఉంది చూడండి.


అమెరికా నాశనమౌతున్నది ఫుడ్డు, మందులు, జీవన అలవాట్ల నుంచి మాత్రమే. ఇప్పుడు ఈ జాడ్యం మన ఇండియాకి కూడా దిగుమతి అవుతున్నది. ఇప్పటిదాకా లేని రోగాలను మనం ఇండియాలో కూడా చూస్తున్నాం. ముఖ్యంగా యువతలో. ముప్ఫైకే అన్నీ ఉడిగిపోయి జీవచ్ఛవాలైపోతున్నారు.


ప్రపంచ వినాశనం అణ్వస్త్రాలతో కాదుగాని, ఆహారపు అలవాట్లతోనే వచ్చేటట్టు ఉంది.


విపరీతంగా డబ్బు చేతిలో ఉన్నా, ఆకులూ అలములూ తినాల్సి రావడం ఎంత విచిత్రమో కదా? 

ఆ డబ్బు ఎందుకు సంపాదిస్తున్నట్లో మరి?? ఎటు పోతోంది మానవజాతి?


వేపచెట్టుకు తియ్యటి పండ్లు కాస్తాయి, చింతచెట్టు నుంచి పాలు కారతాయి. అని బ్రహ్మంగారు వ్రాశారు.


'ఆవులు మాంసం తింటాయి, మానవజాతి వినాశనానికి అదొక గుర్తు'. అని కూడా వ్రాశారో లేదో మరి. కాలజ్ఞాన పండితులు చెప్పాలి.


ఏదేమైనా పాలూ పెరుగూ తినడం మానేశాక నాకు చాలా హాయిగా ఉంది. నేనూ వీగన్నయ్యానా? చూడబోతే అలాగే ఉంది మరి !✍️

-సేకరణ -బాబ్ లాల్*```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

పుష్య మాసమును..* *శూన్య మాసమని…*

  


*పుష్య మాసమును..*

              *శూన్య మాసమని…*

                         *ఎందుకంటారు?*

                   ➖➖➖✍️

```

సూర్యమానం ప్రకారం, చాంద్రమానం ప్రకారం కలిసి ఉండే కొన్ని మాసాలను శూన్య మాసాలంటారు. ఉదాహరణకు సూర్యమానం ప్రకారం ధనుర్మాసం చాంద్రమానం ప్రకారం పుష్యమాసం కలిసి ఉన్న కొన్ని రోజులను శూన్య మాసమంటారు. 


ధనుర్మాసము మొత్తము కూడా శూన్య మాసం కాదు అదేవిధంగా పుష్య మాసం మొత్తము కూడా శూన్య మాసం కాదు. 


ధనుర్మాసం ప్రారంభమైన కొద్దిరోజులకు పుష్య మాసం ప్రారంభం అవుతుంది. అంటే ధనుర్మాసం ప్రారంభమైన మొదటి రోజు నుంచి పుష్యమాసం ప్రారంభమయిన ముందు రోజు వరకు శూన్య మాసం కాదు. 


అదేవిధంగా ధనుర్మాసము అయిపోయిన తర్వాత పుష్యమాసంలో మిగిలిన రోజులు శూన్య మాసం కాదు.


మీన మాసంతో కూడిన చైత్రమాసం, మిధున మాసంతో కూడిన ఆషాడ మాసం, కన్యా మాసంతో కూడిన భాద్రపద మాసం, ధనుర్మాసంతో కూడిన పుష్య మాసాలను శూన్య మాసాలంటారు.


ఈకాలంలో గృహ ప్రవేశం, ఉపనయనం, వివాహాది ముఖ్య శుభ కార్యాలకు ముహుర్తాలు శూన్యం. 


అధిక మాసంలో కూడా శుభ కార్యాలకు ఎటువంటి ముహుర్తాలుండవు. 

కనుక ముహుర్తాలు లేని ఈ నెలలను శూన్య మాసాలంటారు. 


ఎటువంటి దైవకార్యాలయినా, పితృ కార్యాలయినా శూన్య మాసంలో చేయవచ్చు. ఎటువంటి నిషేధం లేదు.


మనకు చాంద్రమానము, సూర్యమానమని రెండు రకాల కాలమానాలు(క్యాలెండర్) ఉన్నాయి. చంద్రుడి గమనాన్ని ఆధారం చేసుకుని చాంద్రమాన మాసాలు ఏర్పడతాయి. 


చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం అని పన్నెండు మాసాలు ఉన్నాయి. 


శుక్ల పాడ్యమి మొదలుకొని అమావాస్య వరకు ఒక మాసముగా పరిగణిస్తారు. 


ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాలలో పూర్ణిమ తరువాత వచ్చే కృష్ణ పాడ్యమి మొదలు మళ్లీ వచ్చే పూర్ణిమ వరకు ఒక మాసముగా పరిగణిస్తారు.


రోజుకు ఒక నక్షత్రం చొప్పున 27 రోజులు 27 నక్షత్రాలకు దగ్గరగా చంద్రుడు ప్రయాణం చేయడానికి 27.32 రోజులు పడుతుంది. దీనికి sidereal month అని పేరు. 


చంద్రుడు కొంతకాలం వృద్ధి చెందుతూ పూర్ణ స్థితికి చేరుకుంటాడు. పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్టి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ అని పదిహేను రోజులకు (తిధులకు) నామకరణం చేశారు. 

ఈ పదిహేను రోజులను వృద్ధి పక్షము లేదా శుక్లపక్షము అని పిలుస్తారు. 


తిరిగి చంద్రుడు, పాడ్యమి నుంచి అమావాస్య వరకు క్షీణించి పూర్తిగా కనిపించడు. 

ఈ పదిహేను రోజులను బహుళ పక్షం లేదా కృష్ణ పక్షం అని పిలుస్తారు. 


చంద్రుడు వృద్ధి చెంది తిరిగి పూర్తిగా క్షీణించడానికి సగటున 29.530587981 రోజులు పడుతుంది. దీనిని Synodic month అంటారు. సంవత్సరం పూర్తి కావడానికి 354.37 రోజులు పడుతుంది. 


భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి ఒక సంవత్సరం అంటే 365.25 రోజులు పడుతుంది. 


ప్రతి సంవత్సరం 11.12 రోజులు ముందుగానే పూర్తవుతుంది. ఈ కారణంగా తెలుగు పండుగలు పది పదకొండు రోజులు ముందుగానే వస్తాయి. దీనిని సరి దిద్దటం కోసం ప్రతి మూడు సంవత్సరాలకు ఒక నెలను అధిక మాసంగా చేరుస్తారు. చైత్రమాసం నుంచి ఆశ్వీయుజ మాసం వరకు వచ్చే మాసాలను మాత్రమే అధిక మాసంగా కలుపుతారు. 


మొదటి అధిక మాసం 28 నెలల తరువాత వస్తుంది. వరుసగా 28, 34, 34, 35 నెలల తరువాత అధిక మాసం పునరావృతం అవుతుంటుంది. 


అధిక మాసమెప్పుడూ ముందు వచ్చి తరువాత నిజ మాసం వస్తుంది. 


అధిక మాసం కూడా శూన్య మాసంగా పరిగణించ బడుతుంది. 


ఇటువంటి సవరణ లేదు కాబట్టి అరబిక్ కాలమానం ప్రకారం జరుపుకొనే రంజాన్ శీతాకాలంలో, ఎండాకాలంలో, వానాకాలంలో కూడా వస్తుంది.


పూర్ణిమ రోజున చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడో ఆ నక్షత్రం పేరుతో ఆ మాసాన్ని పిలుస్తారు. 

ఉదాహరణకు చంద్రుడు పూర్ణిమనాడు చిత్త నక్షత్రం దగ్గర ఉంటాడు కాబట్టి చైత్ర మాసం అంటారు. 

చంద్రుడు విశాఖ నక్షత్రమునకు దగ్గరగా ఉన్నప్పుడు వైశాఖ మాసమని పిలుస్తారు.


సూర్యుడు ప్రతినెలా ఒక రాశిలో ఉంటాడు. ధనుర్మాసంలో ధనుస్సురాశి దగ్గర ఉంటాడు. మేషం, వృషభం, మిధునం, కర్కాటకం, సింహం, కన్యా, తులా, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం అను పన్నెండు రాశుల పేర్లతో పన్నెండు సూర్య మాన నెలలు ఉంటాయి.


సూర్యుని చుట్టూ భూమి ఒక స్థిరమైన కక్ష్యలో తిరుగుతూ ఉంటుంది. అందువల్ల సూర్యమానం ఆధారంగా చేసుకొని తయారుచేసిన కాలమానం ఋతువులకు సామీప్యంగా ఉంటుంది.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము*

*సరళ వ్యావహారిక భాషలో...!*


* 597వ రోజు*


అనుశాసనిక పర్వము ప్రథమాశ్వాసము


ధర్మరాజు

అగ్నిదేవుడు సుదర్శన

అగ్నిదేవుడికి సుదర్శనకు ఒక కుమారుడు కలిగాడు. అతడికి సుదర్శనుడు అను నామకరణం చేసాడు. అతడు సుగుణసంపన్నుడు ధర్మపరుడు. సుదర్శనుడు పెద్దవాడై తాతగారి రాజ్యభారమును వహించి రాజ్యపాలన చేయసాగాడు. సుదర్శునుడికి వివాహమై ఒక కుమారుడిని పొందాడు. అతడి పేరు ఓఘవంతుడు. ఓఘవంతుడికి ఒక కుమార్తె ఓఘవతి ఒక కుమారుడు ఓఘరధుడుకలిగారు. ఓఘవతికి వివాహ వయసురాగానే ఆమెకు తగిన వరుడి కొరకు వెతికి చివరకు తాతగారైన సుదర్శనుడితో వివాహము జరిపించారు. ఓఘవతిని చేపట్టిన సుదర్శనుడు " నేను గృహస్థధర్మమును పాటిస్తూ మృత్యువును జయిస్తాను " అని ప్రతిజ్ఞ చేసాడు. తరువాత అతడు కురుక్షేత్రముకు వెళ్ళి అక్కడ ఒక పర్ణశాల నిర్మించుకుని భార్య ఓఘవతితో గృహస్థ జీవితం కొనసాగించాడు. ఒక రోజు సుదర్శనుడు భార్యతో " ఓఘవతీ ! నాకు అతిథి పూజలంటే మక్కువ ఎక్కువ. అందు వలన నేను గృహంలో ఉన్నా లేకున్నా ! నీవు మాత్రము అతిథి మర్యాదలు చేయాలి. ఎందుకంటే ఎవరి ఇంట్లో అతిథి తన కోర్కెలు తీర్చుకుంటారో ఆ గృహస్థు కృతార్ధుడు ఔతాడు. మన ఇంటికి వచ్చిన అతిథి ఏకోరిక కోరినా నీవు ఆ కోరిక సంకోచించచక తీర్చాలి. పతి ఆజ్ఞ నెరవేర్చడమే సతికి ధర్మము కదా ! " అని అన్నాడు. భర్త మాటలకు ఓఘవతి అంగీకరించింది. సుదర్శనుడు సమిధల కొరకు అడవికి పోయిన సమయంలో వారి ఇంటికి ఒక అతిథి వచ్చాడు. ఓఘవతి అతడికి అతిథి మర్యాదలు చేసింది. అతడు ఓఘవతి వంక మోహంతో చూసి " లలనా ! నా మనసు నీ అందు లగ్నమైనది కనుక నీవు నా కోరిక తీర్చు. అతిథి మర్యాద చేయడమూ అతడి కోరిక తీర్చడము ధర్మము కదా ! నీకు తెలియనిది ఏమున్నది. అది నీధర్మమని నీభర్త నీకు చెప్ప లేదా ! " అన్నాడు. ఓఘవతి " మహానుభావా ! మీరు మరే కోరిక అడిగినా తీరుస్తాను " అన్నది. కాని అతడు " లలనా ! నాకు మరే కోరికా అవసరం లేదు " అన్నాడు. ఓఘవతి " తన భర్తమాట గుర్తుకు వచ్చి భర్తమాట నెరవేర్చిన తన శీలం పోతుంది. తీర్చక పోతే తన భర్తమాటలను ఉల్లంఘించినట్లౌతుంది అనుకుని చివరకు అతడి కోరికకు అంగీకరించింది " ఇంతలో సుదర్శనుడు తిరిగి వచ్చి ఓఘవతిని పిలిచాడు. అతిథి ఓఘవతిని మాట్లాడకుండా కట్టడి చేసాడు. ఆ బ్రాహ్మణ అతిథి శాపానికి భయపడి ఓఘవతి మాటాడక ఊరకున్నది. భార్య ఎంతకీ పలకనందున సుదర్శనుడు పర్ణశాలలోకి తొంగిచూసి ప్రేమగా ఓఘవతిని పిలిచాడు. బ్రాహ్మణుడు లోపల నుండి " ఓ యజమానీ ! నీ భార్య నాకు అతిథి సత్కారము ఇస్తుంది. నీకు గృహస్థధర్మాలు అతిథి సత్కారాలు తెలుసు కనుక కోపించకుము " అన్నాడు. అప్పుడు సుదర్శనుడు లోపల ఉన్న " అతిథితో మహాభాగా ! నీకు ఆతిథ్యము ఇచ్చినందు వలన నా జన్మధన్యము అయింది. అతిథి పూజలు నిర్వహించే గృహము ధన్యము పవిత్రము అంటారు కదా ! అతిథిపూజ అయ్యేంత వరకు నేను వెలుపల ఉంటాను " అని " అతిథీ ! నా మనసు నా వాక్కు ఒక్కటే దీనికి ఈ భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు సాక్షి " అన్నాడు. అప్పుడు ఆకాశవాణి " ఇతడు ధన్యుడు అందరూ గౌరవించ తగిన వాడు " అని పలికింది. అప్పుడు లోపల ఉన్న వ్యక్తి తేజోమంతుడై సాక్షాత్కరించి " సుదర్శనా ! నేను ధర్మదేవతను. నీ చిత్తము ఎటువంటిదో తెలుసుకోవడానికి వచ్చాను. నీవు నిశ్చలవ్రతుడవు. నీవు ధర్మము ఎప్పుడు తప్పుతావో అప్పుడు నిన్ను చంపాలని మృత్యుదేవత నీ వెంటనే పొంచి ఉన్నది. కాని నీవు మృత్యువును జయించావు. నీ భార్య కూడా మహాపతివ్రత. మీరు సశరీరంగా ఊర్ధ్వలోక ప్రవేశానికి అర్హులు. కనుక మీకు ఎప్పుడు ఊర్ధ్వలోకాలకు రావాలని అనిపిస్తుందో అప్పుడే ఊర్ధ్వలోకాలకు భార్యాసమేతంగా రావచ్చు. నీవు చేసిన సగభాగం తపః ఫలము చేత నీ భార్య ఓఘవతి పుణ్యనది అయి ఈ లోకములో ప్రవహిస్తూ జనులను పావనం చేస్తుంది. మిగిలిన సగం తపః ఫలము వలన నీకు సేవచేస్తుంది. నేను నీ ఇంటికి రావడము నీ భార్యను కోరడమూ అన్నీ నీ కీర్తి లోకాలకు తెలియజేయడానికే నేను కల్పించాను. అంతే కాని నీ భార్యశీలానికి ఎంటువంటి హానీ జరగలేదు . ఇది నిజము " అని పలికి అంతర్ధానం అయింది. ధర్మనందనా ! ఇదీ ఓఘవతీనది చరిత్ర. ఈ కథసారాంశం ఏమంటే గృహస్థుకు అతిథి పూజకు మించిన పరమధర్మము వేరొకటి లేదు " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.



*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీ ముఘ్దేశ్వర్ ఆలయం

 🕉 మన గుడి : నెం 1332


⚜  తమిళనాడు : కోడుముడి - ఈరోడ్ 


⚜  శ్రీ ముఘ్దేశ్వర్ ఆలయం



💠 బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు వేరు వేరుగా ఆలయాలు మనం చూస్తూనే ఉంటాం కాని ఒకే ఆలయంలో త్రిమూర్తులు ముగ్గురూ కొలువు తీరి ఉండటం చాలా అరుదుగా చూస్తాం. అలాంటి ఒక ఆలయమే తమిళనాడులోని ఈరోడ్ దగ్గరలో ఉన్న కొడుముడి దేవాలయం.

ఈ ఆలయం కావేరి నది ఒడ్డున కలదు..


💠 ఈ విశాలమైన ఆలయంలో తూర్పు వైపున 3 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. 

మధ్య ద్వారానికి ఉత్తరాన కొడుముడి నాథర్ మరియు మకుటేశ్వరర్ అని పిలువబడే ప్రధాన దైవం శివుని మందిరానికి ప్రవేశ ద్వారం ఉంది. మధ్య ద్వారానికి దక్షిణాన పన్మోళి నాయకి మరియు సౌందరంబిక అని పిలువబడే తల్లి పార్వతిదేవి ఆలయానికి ప్రవేశ ద్వారం ఉంది. విష్ణువును వీరనారాయణ పెరుమాళ్ అని పిలుస్తారు. 

కుంచితపాద నటరాజర్ తన రెండు పాదాలను నేలపై ఉంచాడు, ఎడమ పాదం పైకి లేచింది. 


💠 ఇక్కడి శివుడిని ముఘ్దేశ్వర్ అని, అమ్మవారిని సౌందర్యవల్లి అని అంటారు. 


💠 ఈ ఆలయ పురాణం అగస్త్య మహర్షికి సంబంధించినది . 

ఒకసారి ఆ మహర్షి విగ్రహం అదృశ్యమవుతుందని గమనించి, తన చేతిలో ఆ విగ్రహాన్ని పట్టుకున్నాడు మరియు ఆయన వేలిముద్రలు ఆ దేవతపై కనిపిస్తున్నాయి.


💠 పాండ్యరాజులు ఈ ఆలయాన్ని క్రమం తప్పకుండా పోషించారు మరియు పాండ్య రాజుల సంబంధం కారణంగా, ఈ శివస్థలాన్ని తిరుప్పండికొడుముడి అని పిలుస్తారు.


💠 ఒక పురాణగాథ ప్రకారం ఆదిశేషుడికి, వాయుదేవుడికి మధ్య ఎవరి బలం గొప్పదో అనే దాని మీద వాదోపవాదాలు జరిగి ఇద్దరు మేరు పర్వతం దగ్గరకి వచ్చి యుద్ధానికి తలపడ్డారు. 

ఆదిశేషుడు మేరు పర్వతాన్ని గట్టిగా పట్టుకుని ఉండగా వాయుదేవుడు తన శక్తి మేర గట్టిగా ఊదితే అతని ప్రతాపానికి ఈ పోరాటంలో మేరు పర్వతం పైభాగం ఐదు ముక్కలుగా (కొన్ని ఏడు అని చెబుతారు) విరిగి వివిధ ప్రదేశాలలో రత్నాలుగా పడిపోయింది, వాటిలో తిరువన్నమలై, రత్నగిరి (తిరువత్పోకి), ఈంగోయిమలై మరియు పోతిగైమలై ఉన్నాయి. 


💠 ఇక్కడ ఒక వజ్రం పడి స్వయంభు లింగంగా మారింది. ఆదిశేషుని సంబంధం దృష్ట్యా, ఈ ఆలయం నాగదోషాన్ని తొలగించడానికి కూడా ప్రసిద్ధి చెందింది మరియు పాములను మగుడితో మచ్చిక చేసుకోవడం వల్ల, ఇక్కడ శివుడిని మగుడేశ్వరర్ అని పిలుస్తారు. 


💠 అలా వజ్రంతో సమానమైన మేరు పర్వత శిఖర భాగం వచ్చి ఈ కొడుమూడిలో పడి శివలింగ రూపం దాల్చింది. అదే ముఘ్దేశ్వర శివలింగం.


💠 శివుడి పెళ్లి జరిగిన తరువాత పార్వతి దేవితో కలిసి అగస్త్య మహర్షికి ఈ ప్రదేశంలోనే ప్రధమ దర్శనమిచ్చారు. అలాగే భరద్వాజ మహర్షికి శివుడి తాండవం చూసే అదృష్టం కూడా ఈ ప్రదేశంలోనే కలిగింది. 


💠 ఈ ఆలయ ప్రాంగణంలోనే భరద్వాజ తీర్థం, దేవ తీర్థం, బ్రహ్మ తీర్థం అనే మూడు తీర్థాలని మనం చూడవచ్చు.


💠 ఇక విష్ణుమూర్తి రూపాన్ని వీర నారాయణ పెరుమాళ్ అని అంటారు. అమ్మవారిని తిరుమంగ నాచియార్ అని పిలుస్తారు. 

పెళ్లికాని వారు ఇక్కడ పరిహార పూజలు చేయించుకుంటే వెంటనే పెళ్లి కుదురుతుందనే ఒక నమ్మకం కూడా ఉంది. 

అంతేకాదు రాహు కేతువులకు కూడా పహిహార పూజలు చేసుకోవచ్చు. కుజదోషం ఉన్నవారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. 

మొత్తానికి ఎలాంటి జాతక దోషాలకైనా ఇక్కడ పరిహార పూజలు చేయటం పరిపాటి.


💠 బ్రహ్మ దేవుడు ఒక చెట్టు రూపంలో ఉండటం ఇక్కడి మరొక విశేషం. 

వణ్ణి చెట్టుగా పేరుపొందిన ఈ మహావృక్షం దాదాపు 3000 సంవత్సరాల నాటిదని చెప్తున్నారు ఆలయ నిర్వాహకులు. 

ఈ చెట్టుకున్న మరొక విశేషం దీనికి ఒక వైపు ముళ్ళు ఉంటే మరో వైపు ఉండవు, అంతేకాదు దీనికి పళ్ళు పువ్వులు కూడా కాయవు. 

ఈ చెట్టు ఆకు ఒక్కటైనా ఒక బిందెడు నీళ్ళల్లో వేసి ఉంచితే ఆ నీళ్ళు ఎన్నాళ్లయినా పాడవ్వవు అని ఇక్కడి భక్తుల నమ్మకం. 


💠 ఈ ఆలయంలో అనేక గణేశులు ఉన్నప్పటికీ, వాటిలో ముఖ్యమైన వ్యక్తిని కావేరీ కంద గణేశన్ (కావేరీని చూసినవాడు) అని పిలుస్తారు.   వయస్సుకు సమానమైన కుండలతో వినాయకుడికి అభిషేకం చేయడం ఈ ఆలయంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. 


💠 ఈ ఆలయంలోని మరొక ప్రత్యేక వినాయకుడిని వ్యాక్రపాద వినాయకుడు అని పిలుస్తారు, ఎందుకంటే ఆయన పులి పాదాలను కలిగి ఉంటాడు మరియు ఈ మూర్తి ఒక స్తంభంలో కనిపిస్తాడు!   

ఈ రకమైన మూర్తి మరే ఇతర ఆలయంలోనూ కనిపించడు. 

ఏనుగు మొహంతో ఉండే వినాయకుడికి కాళ్ళు మాత్రం పులి పంజాలా ఉంటాయి.


💠 బ్రహ్మోత్సవం తమిళ మాసం చిత్తిరైలో జరుపుకుంటారు.

పంగుని మరియు ఆవణి అనే తమిళ నెలలలో 4 రోజుల పాటు సూర్యకిరణాలు శివుడు మరియు అంబాల్ గర్భగుడిలో ప్రకాశిస్తాయి.



💠 ఈ ఆలయం ఈరోడ్ జిల్లాలోని కరూర్ నుండి 25 కి.మీ మరియు ఈరోడ్ నుండి 40 కి.మీ దూరంలో ఉంది . ఈరోడు - కరూర్ రైల్వే లైన్ లో కొడుముడి రైల్వే స్టేషన్ వస్తుంది..


Rachana


©️ Santosh Kumar

పంచాంగం