9, ఏప్రిల్ 2023, ఆదివారం

_పురుషునికి

 🙏 *_సుభాషితము_* 👌

⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️

*_ఆశైవ రాక్షసీ పుంసాం_*

*_ఆశైవ విషమంజరీ !_*

*_ఆశైవ జీర్ణమదిరా_*

*_నైరాశ్యం పరమం సుఖం !!_*


*_పురుషునికి ఆశయే రాక్షసి వంటిది, త్రాచుపాము వంటిది, మద్యపానము వంటిది. అట్టి ఆశను వదిలినవాడు ఎక్కువ సుఖములను అనుభవించును.!!_*

⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️

బృందావ‌నంలో

 🕉🌺 ఆధ్యాత్మికం🌺🕉 @aadyaatmikam360°:

ప్రతి రోజూ దుప్పటి నలిగి...

పట్టీల శబ్దం వినిపించే పుణ్యక్షేత్రం ఇదే  నిధివన్  🌺


.    🌿 శ్రీకృష్ణ లీల‌ల గురించి తెలియ‌నివారు ఉండ‌రు. 


🌿బృందావ‌నంలో శ్రీకృష్ణుడు గోపిక‌ల‌తో క‌లిసి చేసిన రాస‌లీల‌లు కోకోల్ల‌లు. అలాంటి క‌థే బృందావ‌నంలోని నిధి వ‌న్ తో ముడిప‌డి ఉంది. 


🌿ఉత్తర ప్రదేశ్ లోని మధుర జిల్లాలో బృందావన్ ఉంది. ఇక్కడే మన నిధివన్ ఉంటుంది. 


🌿మధుర నుంచి బృందావన్ కు 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది లో ఉన్న నిధి వ‌న్ లో ఇప్ప‌టికీ రాత్రిపూట శ్రీకృష్ణడు గోపిక‌ల‌తో క‌లిసి రాస‌లీల‌లు ఆడతాడ‌ట‌. 


🌿అందుకే ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కే ఈ నిధి వ‌న్ ప్ర‌వేశం ఉంటుంది. సంధ్యా స‌మ‌యం కాగానే నిధి వ‌న్ ను మూసేస్తారు. 


🌿ఆ త‌ర్వాత ఎవ్వ‌రూ అక్క‌డ ఉండ‌రు. చివ‌ర‌కు నిధి వ‌న్ లో ఉండే ప‌క్షులు కూడా సంధ్యా స‌మ‌యం కాగానే అక్క‌డ్నుంచి వెళ్లిపోతాయి.  


🌿ఒక‌వేళ ఎవ‌రైనా నిధి వ‌న్ లో రాత్రి పూట ఉండి శ్రీకృష్ణ రాస‌లీల‌ల‌ను దొంగ‌త‌నంగా చూడాల‌ని ప్ర‌య‌త్నిస్తే వారి సంగ‌తి అంతేనట‌. 


🌿ప‌దేళ్ల కింద జ‌య‌పూర్  కు చెందిన ఓ కృష్ణ భ‌క్తుడు ఎక్క‌డ ఏం జ‌రుగుతుందో చూడాల‌ని దొంగ‌త‌నంగా అక్క‌డే ఉండిపోయాడ‌ట‌. 


🌿రాత్రి ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ తెల్లారేస‌రికి నిధివ‌న్ ప్ర‌వేశ‌ద్వారంలో అత‌ను అచేత‌న అవ‌స్థ‌లో ప‌డి ఉన్నాడు. ఆ త‌ర్వాత అత‌ను పిచ్చివాడిగా మారిపోయాడ‌ట‌.  

          


🌿నిధి వ‌న్ లోప‌ల రంగ మ‌హ‌ల్ ఉంది. ఇక్క‌డ రోజూ రాత్రిపూట శ్రీకృష్ణుడు, రాధ క‌లిసి వ‌స్తార‌ట‌. 


🌿అందుకే రంగ్ మ‌హ‌ల్ లో ఉండే గంధ‌పు మంచాన్ని ప్ర‌తిరోజూ సాయంత్రంలోపే అలంక‌రిస్తారు. 


🌿మంచ‌ప‌క్క‌నే ఒక చెంబులో నీరు, రాధ కోసం అలంకార సామాగ్రి పెట్ట‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. 


🌿అంతేకాదు ఇక్క‌డి మ‌రో విశేషం ఏంటంటే తెల్ల‌వారగానే రంగ్ మ‌హ‌ల్ లోని మంచంపైన దుప్ప‌ట్లు అస్త‌వ్య‌స్తంగా ఉంటాయ‌ట‌. అలాగే చెంబులోని నీరు ఖాళీ అయిపోతుంది. 


🌿దీని వెన‌క‌ ర‌హ‌స్య‌మేంటో ఎవ‌రూ క‌నిపెట్ట‌లేకపోయారు. 


🌿అందుకే దీన్ని శ్రీకృష్ణ‌లీల‌గానే భావిస్తారు.  

                     

🌿గోపిక దప్పిక తీర్చడానికి Image source ఇక్కడ వనంలో ఉన్న కొలనును విశాఖ కుండ్ అని అంటారు. 


🌿విశఆఖ అనే కోపిక దప్పిక తీర్చడానికి కృష్ణుడు తన పిల్లనగోవితో ఈ కొలనును సృష్టించారని చెబుతారు. 


🌿నిధివన్ కు వెళ్లినవారు ప్రధాన ఆలయమైన రంగమహల్ లోని రాధకృష్ణుడి విగ్రహాలతో పాటు విశాఖ కుండ్ ను దర్శించుకుని వస్తారు. 


          🌿నిధి వ‌న్ లో మ‌రో వింత ఏంటంటే.. ఎక్క‌డైనా చెట్లు పైకి ఎదుగుతాయి. 

🌿ఇక్క‌డ మాత్రం చెట్లు కింద‌కు పెరుగుతాయి. 

అంటే భూమిలోకి... ఇక నిధివ‌న్ లో అన్నీ తుల‌సి చెట్లే ఉంటాయి. 

అవి కూడా జంట‌గా క‌లిసి ఉంటాయి. ఏ చెట్టును చూసి ఇలానే జంట‌గా ఉంటాయి. 


🌿ఇంత‌కు దీని వెన‌క విశేషం ఏంటంటే ఈ తుల‌సి చెట్లే గోపిక‌ల‌ట‌. 


🌿సాయంత్రం కాగానే తులసిచెట్ల‌న్నీ గోపిక‌ల రూపంలో మారిపోతాయ‌ట‌. 


🌿ఉదయం కాగానే ష‌రామామూలుగానే తిరిగి తులసి చెట్ల రూపంలోకి వెళ్లిపోతాయ‌ట‌. 


🌿అందుకే నిధి వ‌న్ నుంచి తుల‌సిమొక్క‌ల‌కు చెందిన చిన్న ఆకును కూడా తీసుకుపోనివ్వ‌రు. ఒక‌వేళ అలా తీసుకుపోయినా అరిష్ట‌మ‌ట‌.  

          

🌿ఇక నిధి వ‌న్ కు స‌మీపంలో స్థానికుల ఇళ్లు ఉన్నాయి. అయితే ఆ ఇళ్ల‌కు కిటికీలు ఉండ‌వు. ఎందుకంటే నిధి వ‌న్ వైపు వారి చూపు ఉండ‌కూడ‌ద‌ని కిటికీలు పెట్టుకోరు. 


🌿ఒక‌వేళ ఎవ‌రైనా కిటికీలు పెట్టినా వాటి నుంచి నిధి వ‌న్ వైపు రాత్రిపూట మాత్రం చూడ‌రు. 


🌿నిధి వ‌న్ లో రాత్రిపూట జ‌రిగే రాస‌లీల‌ల‌ను చూడాల‌నుకోవ‌డం పాపంగా బావిస్తారు స్థానికులు. అందుకే ఇలా కిటికీలు పెట్టుకోకుండా జాగ్ర‌త్త ప‌డ‌తారు. ఇదండీ నిధి వ‌న్ ర‌హ‌స్య‌మ‌య గాథ‌.


హరే కృష్ణ గోవిందా

🌺⛳️🌺🌿🌺🌾🌺🙏🌺


భగవంతుడు... భక్తుడు...!

మొదట్లో భక్తుడు తన మనస్సును బలవంతంగా భగవంతునిపై ఉండేటట్లు చేయాలి. 

ఆయన పాదాలపై దృష్టిని మోపాలి. 

ఊడుగు (అంకోల) గింజలు పండిపోయి నేలమీద రాలిపడి మరల వానికవియే చెట్లనంటుకుని పోతాయి. 

ఇది భక్తిలోని మొదటి దశకు ఉదాహరణ.


భక్తుని మనస్సు భగవంతునిపై నిలబడినప్పుడు భగవంతుని కృప కారణంగా భగవంతునివైపు భక్తుని మనస్సు ఆకర్షింపబడుతుంది...

సూదంటురాయి సూదిని ఆకర్షించినట్లుగా వుంటుంది...

ఇది రెండవ దశ...


భక్తుని హృదయం పూర్తిగా భగవంతునితో నిండిపోయినప్పుడు, భగవంతుడు కూడా భక్తునిపై ప్రేమను సంపూర్ణంగా ప్రదర్శిస్తాడు. 

అది పతివ్రత అయిన స్త్రీ తన పతిని అంటి పెట్టుకుని యున్నట్లు. 

అప్పుడు పతి కూడా తన పత్ని పట్ల విపరీతమైన ప్రేమను ప్రదర్శిస్తాడు. 

ఇది మూడవ దశగా మనం చెప్పవచ్చు...


నెమ్మదిగా భక్తుడు భగవంతునికి భూషణమవుతాడు...

ప్రహ్లాదుడు లేకపోతే నరసింహావతారం ఎత్తి భగవంతుడు ఈ లోకాన్ని ఆశీర్వదించేవాడు కాదు కదా...

అలా ఒకవిధంగా భక్తుడు భగవంతుని ప్రఖ్యాతిని పెంచుతాడు. 

ఒక లత చెట్టును అల్లుకునిపోయి దాని సౌందర్యాన్ని పెంచినట్లుగా ఉంటుందది. 

ఈ నాల్గవ దశ దాటిన తరువాత భక్తుడు భగవంతునితో మమైక్యమైపోతాడు.


నదులు సముద్రంలో విలీనమైపోయినట్లు... 

ఒకసారి నదులు సముద్రంలో కలిస్తే ఇక వాటికి ప్రత్యేక అస్తిత్వం ఉండదు. 

సముద్రం నుండి నదులను విడిగా చూడలేము. 

అలాగే భక్తుడు కూడా భగవంతుని నుంచి వేరుగా ఉండడు..🙏

శ్రీశైల పర్వతం మీది రహస్య మూలికా విశేషాలు

 శ్రీశైల పర్వతం మీది రహస్య మూలికా విశేషాలు  -


            ఇప్పుడు మీకు నేను వివరించబోయే విశేషాలు అన్నియు నిత్యసిద్ధనాధుడు రచించిన రసరత్నాకరం అనే ఒక ప్రాచీన గ్రంధం నుంచి తీసుకోవడం జరిగింది.


          శ్రీశైల పర్వతంలోని చెట్లు, మన్ను, దుంపలు , నీరు , రాళ్లు , ఖనిజాలు మొదలయిన వాటితో అతిశీఘ్రంగా కాయసిద్దని పొందే మార్గాలు పరమ శివునిచేత చెప్పబడి భారతీయ రసశాస్త్రాలలో మహా గోప్యంగా ఉన్న వాటిని మాత్రమే సాధకులకు భక్తులకు ముక్తి, భక్తి ప్రధములుగా వివరిస్తున్నాను అని నిత్యనాధుడు తన ముందు మాటలో వివరించాడు.


   

   ప్రస్తుత పరిస్థితులలో నిత్యనాద సిద్ధుడు తన గ్రంధంలో వివరించిన ప్రకృతి పరిసరాలు చాలా మారిపోయాయి. ప్రయత్నిస్తే కొంతవరకు కనుక్కోవచ్చు.


  *   శ్రీ మల్లిఖార్జున స్వామి సన్నిధికి ఎదురుగా ఏనుగుతో సమానం అయిన శిల ఒకటి ఉన్నది. అది రాత్రి సమయంలో ఎల్లప్పుడు గుగ్గిలం వంటి పదార్థాన్ని స్రవిస్తుంది. దానిని ముట్టుకోనుకుండా బ్రహ్మవ్రుక్షం అయిన తెల్ల మోదుగ కొయ్యతో గీకి ఎండబెట్టిన సొరకాయ బుర్రలో నిలువ చేసుకోవాలి ఆ గుగ్గిలం తో సమాన తూకంగా శుద్దిచేసిన గంధకం కలపాలి. ఆ మిశ్రమాన్ని రొజూ ఒకపూట విష్క మెత్తు మోతాదుగా భక్షిస్తూ ఉండాలి.ఇలా ఒక నెలరోజులు భక్షిస్తూ ఉంటే ఆ వ్యక్తి జరామరణాలు లేనివాడై ఆచంద్రార్కం జీవిస్తాడు.


          అదే గుగ్గిలాన్ని కరిగిన తామ్రంతో కోటికొక వంతు చొప్పున వేస్తే అది దివ్యమైన బంగారం అవుతుంది.


 *  మల్లిఖార్జున స్వామికి ఎడమ దిక్కున ఘంటా సిద్దేశ్వరుని ఆలయం ఉంది. దాని ద్వారం నందు గల ఒక కుండములో ఒక గంట వ్రేలాడుతూ ఉంటుంది. కృష్ణ చతుర్దశి నాటి రాత్రి యందు ఉపవాసమున్న ముగ్గురు సాధువులు నిరంతరంగా నిర్వికల్పంగా చేయవలసిన సాధన ఇది. అదేమంటే ముగ్గురు సాదువుల్లో ఒకడు నిరంతరంగా శివుడిని అభిషేకం చేస్తూ ఉండాలి. రెండోవాడు అలసిపోకుండా రాత్రి అంతా అభిషేకానికి నీరు అందిస్తూ ఉండాలి. మూడోవాడు విరామం లేకుండా గంట వాయిస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే తెల్లవారేసరికి ఈశ్వరుడు ప్రత్యక్షం అయ్యి ఆ ముగ్గురికి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు.మరియు అదృశ్య శక్తిని కూడా ప్రసాదిస్తాడు.


 *  ఘంటా సిద్దేశ్వరుని ఆలయానికి దక్షిణభాగంలో క్రోసేడు దూరంలో నేలలో తవ్వితే గోరోజనం వంటి మట్టి లభిస్తుంది. ఆ మట్టిని తులం ప్రమాణంలో పాలలో కలిపి పంచదార కలుపుకుని తాగితే 7 దినాలలో ఆ వ్యక్తికీ అమరత్వం సిద్ధించి మృత్యువుని జయించగలడు.


 *  మల్లినాదునికి పశ్చిమ దిక్కులో చంద్రోదకం అనే పేరు గల ఒక తీర్ధం ఉంది. విశాక పౌర్ణమి నాడు సాధకుడు దాని సమీపంలో ఉండి సిద్ధిని సాధించాలి. రాత్రిపూట ప్రతిరోజూ జపం చేస్తూ ఉండాలి. అర్ధరాత్రి పూట ఏ సమయంలో చంద్రుడు ఆ నీటిని తాకుతాడో అదే సమయంలో ఆ నీటిని దోసిలి పట్టుకొని తాగాలి. దానివల్ల వజ్రకాయం , శరీర పటుత్వం కలుగుతాయి. జరామరణాలు లేనివారై జీవిస్తారు.


            మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  

స్నేహభావం

 .

        _*సుభాషితమ్*_


శ్లో॥

*వైరాయతే సుహృద్భావః*

*ప్రదానం హరణాయతే|*

*దర్పభూతాభిభూతస్య*

*విద్యామౌర్ఖ్య శతాయతే||*

                          ~దర్పదలనమ్


తా॥

*గర్విష్టియైనవాడికి స్నేహభావం

 శత్రుత్వంలా అవుతుంది.... దానం దొంగతనం వలె అవుతుంది, జ్ఞానం నూరింతల మూర్ఖత్వమవుతుంది....కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ గర్వాన్ని దరిచేరనీయరాదని భావము..*

పరమాచార్య చూసుకుంటారులే

 పరమాచార్య చూసుకుంటారులే


నేను, మా చెల్లెలు అవయాంబళ్ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇలయత్తాంగుడిలో మొదటిసారి పరమాచార్య స్వామివారిని దర్శించుకోవడమే మాకు గుర్తు. కొన్ని సంవత్సరాల క్రితం తను పూణే వచ్చి, అక్కడి నుండి బాంబేకు మరలా చెన్నైకు వెళ్ళాలని ప్రణాళిక వేసుకుంది. అంతకు ముందు రోజే ఒక ప్రముఖ రాజకీయ నాయకుని భార్య మరణించడంతో మహారాష్ట్ర పరిస్థితిని అదుపులో ఉంచడానికి బంద్ ప్రకటించడంతో బస్సులు ఆటోలు తిరగడంలేదు. నేను పూణేకు ఫోను చేసి తన ప్రయాణం వాయిదా వేసుకొమ్మని తెలిపాను. చెన్నైలో ఆరోజు తప్పక కార్యాలయానికి వెళ్ళాల్సిఉండడంతో ప్రయాణాన్ని వాయిదా వెయ్యలేనని తెలిపింది. “సంఘ వ్యతిరేక శక్తుల వల్ల సమస్యగా ఉంది. కొంతమంది వ్యక్తుల ప్రాణాలు కూడా పోయాయి” అని తెలిపాను.


దానికి ఒకే ఒక ముక్కలో, “అవన్నీ పరమాచార్య స్వామివారు చూసుకుంటారులే” అని బదులిచ్చింది. ‘ఇది నాకెందుకు స్ఫురించలేదు’ అనుకున్నాన్నేను. మరుసటి రోజు నేను కళ్యాణ్ కి వెళ్లి తనను తీసుకుని ములంద్ కు వచ్చాను. మేము బయటకు రాగానే, అంతా కేవలం పోలీసుల తలకాయలు మాత్రమే కనబడుతున్నాయి. పెద్ద ట్రంకు పెట్టె ఒక బ్యాగు మా వద్ద ఉన్నాయి. దాదాపు ఇరవై అయిదు నిముషాలు నడవాలి. ఏం చెయ్యాలో తెలియక అలా నిల్చుని ఉన్నాము.


“అమ్మా, ఇక్కడకు ఎందుకు వచ్చారు? ఇంటికి వెళ్ళాలా?” అన్న మాటలు వినబడ్డాయి. తల తిప్పి చూస్తే, వేలు కనబడ్డాడు, మా పక్క వీధిలో వార్తాపత్రికలు వేసే అబ్బాయి. ఒకట్రెండు సార్లు అతనితో మాట్లాడాను నేను. అతను ముందుకు వచ్చి, బ్యాగును ట్రంకు పెట్టెను తీసుకుని తన సైకిలు బుట్టలో ఉంచుకుని మాతోపాటుగా నడుస్తూ ఇంటి దాకా వచ్చాడు. 


--- శ్రీమతి ఇందిరా బాలసుబ్రమణియమ్, పశ్చిమ థానే, ముంబై. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 6


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

సజ్జన సాంగత్యం - కర్మ ఫలం

 *సజ్జన సాంగత్యం - కర్మ ఫలం.*


చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పపూర్తిగానిండి , రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది.


ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డు పై ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది.


ప్రయాణికులందరు చూస్తుండగానే ఒక పిడుగుపాటు వల్ల బస్సుకు 50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు. ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ వైపు విరిగిపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు.


కొద్దిసేపటి తరువాత బస్సు మళ్లి బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరు ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు.


ఆ బస్సు రెండు కిలోమీటర్లు వెళ్లిందో లేదో మరో పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టుకు కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్లి బస్సును ఆపివేశాడు.

ఇలా మూడు సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 30అడుగుల దగ్గరలో కొట్టింది. ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి.


అందులోంచి ఒక పెద్దమనిషి ఇలా అన్నాడు.”చూడండీ! మనందరిలో ఈ రోజు ‘పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ‘ఎవరో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది.


నేను చేప్పేది జాగ్రత్తగా వినండి!


ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందికి దిగి, అదిగో! ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకుని మళ్లి బస్సులో వచ్చి కూర్చోండి. మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు. మిగిలిన వాళ్లం క్షేమంగా వెళ్లవచ్చు! ఒక్కరి కోసం అందరు చస్తారో ? అందరి కోసం ఒక్కరు చస్తారో? ఆలోచించుకోండీ! ” అన్నాడు.


చివరకు ఒక్కొక్కరుగా వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి సిద్ధపడ్డారు.


మొదట ఆ పెద్దమనిషే మనుసులో చాలా భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకున్నాడు. ఏమీ జరగలేదు. అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు.


ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు. చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు. ఇక మరణించేది అతడే! అని అందరికీ పూర్తిగా నిశ్చయమైపోయింది.


చాలా మంది అతని వైపు అసహ్యంతో, కోపంతో చూడసాగారు. కొందరు జాలి పడుతూ చూడసాగారు. అతను కూడా భయపడుతూ బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి నిరాకరించాడు.


కాని, బస్సులోని ప్రయాణికులందరు నీవల్ల మే మందరం మరణించాలా? వీల్లేదు అంటూ బస్సు నుంచి బలవంతంగా క్రిందికి నెట్టారు.


చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్లి చెట్టును ముట్టుకున్నాడు. వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చి కొట్టింది. తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది. కాని పిడుగు వచ్చి కొట్టింది ఆ చివరి వ్యక్తిపై కాదు!


బస్సుపై. అవును. బస్సుపై పిడుగు పడి అందులోని ప్రయాణికులందరూ మరణించారు.


నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే ఇంతవరకు ఆ బస్సు కు ప్రమాదం జరగలేదు. ఇతని పుణ్యఫలం, దీర్ఘాయుష్షు వారినందరిని కాపాడింది.

ఈ కథలో లాగానే మనం జీవితంలో సాధించిన విజయాలలో కానీ, ఆపదల నుండి రక్షించబడిన సందర్భాలలో కానీ, ఆ క్రెడిటంతా మనదే అనుకుంటాము.


కాని, ఆ పుణ్యఫలం


🔸మన తల్లిదండ్రులది కావచ్చు

🔸జీవిత భాగస్వామిది కావచ్చు

🔸పిల్లలది కావచ్చు

🔸తోబుట్టువులది కావచ్చు

🔸మన క్రింద పని చేసే వారిది కావచ్చు లేదా

🔸మన శ్రేయస్సును కోరే స్నేహితులది – బంధువులది కావచ్చు!


మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు.


ఎంతో మంది పుణ్య ఫలితం, ఆశీర్వాద బలం, వారు వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉంటాయి.🙏

శుభోదయం

 *శుభోదయం* 💐🙏


పట్టించుకుంటే ప్రపంచంగా 

కనబడే దైవం...


వదిలించుకుంటే మిథ్యగా 

కనబడే మాయ...


*ఇదే సృష్టి రహస్యం..*.


🙏🙏🙏🙏🙏