9, ఏప్రిల్ 2023, ఆదివారం

పరమాచార్య చూసుకుంటారులే

 పరమాచార్య చూసుకుంటారులే


నేను, మా చెల్లెలు అవయాంబళ్ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇలయత్తాంగుడిలో మొదటిసారి పరమాచార్య స్వామివారిని దర్శించుకోవడమే మాకు గుర్తు. కొన్ని సంవత్సరాల క్రితం తను పూణే వచ్చి, అక్కడి నుండి బాంబేకు మరలా చెన్నైకు వెళ్ళాలని ప్రణాళిక వేసుకుంది. అంతకు ముందు రోజే ఒక ప్రముఖ రాజకీయ నాయకుని భార్య మరణించడంతో మహారాష్ట్ర పరిస్థితిని అదుపులో ఉంచడానికి బంద్ ప్రకటించడంతో బస్సులు ఆటోలు తిరగడంలేదు. నేను పూణేకు ఫోను చేసి తన ప్రయాణం వాయిదా వేసుకొమ్మని తెలిపాను. చెన్నైలో ఆరోజు తప్పక కార్యాలయానికి వెళ్ళాల్సిఉండడంతో ప్రయాణాన్ని వాయిదా వెయ్యలేనని తెలిపింది. “సంఘ వ్యతిరేక శక్తుల వల్ల సమస్యగా ఉంది. కొంతమంది వ్యక్తుల ప్రాణాలు కూడా పోయాయి” అని తెలిపాను.


దానికి ఒకే ఒక ముక్కలో, “అవన్నీ పరమాచార్య స్వామివారు చూసుకుంటారులే” అని బదులిచ్చింది. ‘ఇది నాకెందుకు స్ఫురించలేదు’ అనుకున్నాన్నేను. మరుసటి రోజు నేను కళ్యాణ్ కి వెళ్లి తనను తీసుకుని ములంద్ కు వచ్చాను. మేము బయటకు రాగానే, అంతా కేవలం పోలీసుల తలకాయలు మాత్రమే కనబడుతున్నాయి. పెద్ద ట్రంకు పెట్టె ఒక బ్యాగు మా వద్ద ఉన్నాయి. దాదాపు ఇరవై అయిదు నిముషాలు నడవాలి. ఏం చెయ్యాలో తెలియక అలా నిల్చుని ఉన్నాము.


“అమ్మా, ఇక్కడకు ఎందుకు వచ్చారు? ఇంటికి వెళ్ళాలా?” అన్న మాటలు వినబడ్డాయి. తల తిప్పి చూస్తే, వేలు కనబడ్డాడు, మా పక్క వీధిలో వార్తాపత్రికలు వేసే అబ్బాయి. ఒకట్రెండు సార్లు అతనితో మాట్లాడాను నేను. అతను ముందుకు వచ్చి, బ్యాగును ట్రంకు పెట్టెను తీసుకుని తన సైకిలు బుట్టలో ఉంచుకుని మాతోపాటుగా నడుస్తూ ఇంటి దాకా వచ్చాడు. 


--- శ్రీమతి ఇందిరా బాలసుబ్రమణియమ్, పశ్చిమ థానే, ముంబై. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 6


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: