21, ఫిబ్రవరి 2023, మంగళవారం

నవ్వుకోండి

 *కాసేపు నవ్వుకోండి. ఆ తర్వాత మన తెలుగు భాష గొప్పదనాన్ని చూసి గర్వపడండి.* 😄👏🙏

-----------------------------------

(FWD)

-----------------------------------

*'చచ్చిన' అనే పదాన్నికూడా బ్రతికించే భాష తెలుగుభాష!!*


తెలుగువాడికి సాటి ఇంకొకడు లేడు. అందరిదీ ఒక దారైతే మనవాడిది ఇంకోదారి! 


అందరూ పొగ  *పీలిస్తే* తెలుగువాడు పొగ *తాగుతాడు.* 


-ఇంతేకాదు తెలుగువాడు దెబ్బలు ‘తింటాడు’. దెబ్బలు ఏమైనా తినే పదార్థాలా? అంటే ఉలకడు పలకడు. 


సంస్కృతం అమరభాష అంటారు. దాని సంగతేమో కానీ తెలుగు మాత్రం కచ్చితంగా అమరభాషే! ఇందుకు ఉదాహరణలు ఉన్నాయి. 

*ఎవరి మీద అయినా ప్రేమ వచ్చినా, కోపమొచ్చినా ‘సచ్చినోడా’ అని తెలుగువాడు పిలుస్తాడు. ‘సచ్చినోడు’ ఎలా పలుకుతాడని ఆలోచించడు. 


*చచ్చినా ఒప్పుకోను అంటాడు. చస్తే ఎలా ఒప్పుకుంటాడు? చచ్చినాక ఒప్పుdకుని చూపించిన వాడు ఒక్కడైనా ఉన్నాడా? 


*ఆశ చావడం లేదంటాడు. చెట్లకే ప్రాణం ఉందని చెప్పుకుని చావనివాళ్లు ఇంకా ఉన్నారు. అలాంటి వాళ్లు ఆశకు ప్రాణం ఉంటుందని ఎలా ఒప్పుకుని ‘చస్తా’రు? 


*తెలుగువాడు కంటి చూపుతో చంపేస్తాడు. అతడి శక్తి అలాంటిది. 


ఇలాంటి అతీత శక్తులు యావత్‌ ప్రపంచంలో తెలుగువాడికి మాత్రమే ఉన్నాయి. 

ఎంత గొప్ప! ఎంత చిత్రం !


 *మత్తు పానీయాలైన సారా, బ్రాందీ, విస్కీలను ‘సేవిస్తున్నా’ నంటాడు. అదే సమయంలో మంచినీళ్లు తాగుతున్నానంటాడు తప్ప సేవిస్తున్నాననడు. 

ఇదేం చిత్రమో! 


*ఇంకా చిత్రమేంటంటే మందు ‘కొడుతున్నా’నంటాడు. కొట్టడానికి మందేమన్నా మనిషా? పశువా? 


*బాతాఖానీ కొట్టకు అంటాడు. దీని పరిస్థితీ ఇదే. 


*అనారోగ్యకరమైన నిషా పానీయాన్ని ఆరోగ్యప్రదాయిని అయిన మందు పేరుతో పిలుస్తాడు! అంతా ‘మందే’ అనుకునేవాడు తప్ప ఇంకెవ్వడైనా ఈ పని చేయగలడా? 


*తెలుగువాడు ఎందులోనైనా ఆటను చూడగలడు. మాట్లాడతానంటాడు. పోట్లాడతానంటాడు. 


*మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటాడు. మనసు పూర్తిగా కాకుండా అందులో ఏభై శాతమో, డెబ్భైఅయిదు శాతమో ఉంచి కోరుకుంటాడా ఏంటి? 


ఇంకోమాట! 


*హృదయపూర్వకంగా అభినందిస్తున్నానంటాడు. కాసేపు హృదయాన్ని పక్కనబెడితే, అభినందించే అవకాశం ఉందా? ఉంటుందా? 


*తెలుగువాడి ‘న్యాయమే’ వేరు. 


బడాయి గానీ మాట మాట్లాడితే ‘మనస్సాక్షిగా’ అంటాడు. మనసుకు ఏమన్నా రూపం ఉందా? మాట ఉందా? వచ్చి సాక్ష్యం చెప్పడానికి! 


*అగ్నిసాక్షిగా పెళ్లాడాను అని కూడా అంటాడు. అగ్ని ఏదో చిటపటలాడుతుంది కానీ ఎవరైనా సంసారంలో చిచ్చుపెడితే అదొచ్చి అడ్డుపడుతుందా ఏంటి? 


*కళ్లలో నిప్పులు పోసుకుంటున్నాడంటాడు! పోసుకోమనండి చూద్దాం! 


*పెళ్లికాని ఆడపిల్లను గుండెల మీద కుంపటి అంటాడు. ఇది ఎంత తప్పు! గుండెల మీద కుంపటి పెట్టుకున్న మొనగాళ్లు యావత్‌ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? 


*మాటేగా ఏదైనా అంటాడు. గుండె మీద బరువు తగ్గించుకున్నానంటాడు. గుండెల మీద బట్టల బరువు తప్ప ఇంకేం బరువు ఉంటుంది! 


*నవ్వితే నవరత్నాలు రాలతాయంటాడు. రత్నాలా పాడా? మరీ గట్టిగా నవ్వితే పళ్లు రాలిపోతాయేమో! చిటికెలో పని అయిపోతుందంటాడు. 


*అతిశయం కాకపోతే చిటికె వేస్తే శబ్దం అవుతుంది కానీ పని ఎలా అవుతుంది !

 

*ఒట్టిమాటలు కట్టిపెట్టోయ్‌ అని గురజాడ చెప్పినా మనవాళ్లు వినరు. 


*అప్పు తీసుకునేటప్పుడు ‘నీ డబ్బు వడ్డీతో సహా పువ్వుల్లో పెట్టి ఇస్తా’నంటారు. వడ్డీ ఇస్తే ఇవ్వచ్చుగానీ పువ్వుల్లో పెట్టి ఇచ్చినవాడు ఎవడైనా ఉన్నాడా? ఇది అప్పిచ్చిన పిచ్చివాడి చెవిలో పువ్వు పెట్టడం కాదూ! 


*ఎవరో చిన్నచూపు చూస్తున్నారని తెలుగువాడు ఆక్షేపిస్తాడు. దూరపు చూపు, దగ్గరి చూపు ఉంటాయి తప్ప చిన్న చూపు, పెద్ద చూపు అని ఎక్కడైనా ఉంటాయా? 


*వంట చేయడాన్ని చేయి కాల్చుకోవడం అంటాడు. ఇదే నిజమైతే ఆడవాళ్ల చేతులన్నీ ఏమైపోయేవి !

 

 *సంగీతమంటే చెవి కోసుకుంటానని ఒక్కొక్కరు వంకర్లు తిరిగిపోతుంటారు. అయితే అతడు ఎంతసేపు పాటలు వింటున్నా కోసుకున్న చెవి కిందపడదే అని నిరాశ పడ్డవాళ్లూ ఉన్నారు. 


*తప్పు చేసినవాడు అడ్డంగా దొరికిపోయాడు అంటారు. దొరికినవాడెవడైనా అడ్డంగా దొరుకుతాడా? నిలువుగా దొరుకుతాడు తప్ప. 


*అన్నట్టు గిట్టనివాణ్ని అడ్డమైనవాడు అని తిడతారు. అదేంటి? దాని భావ మేంటి? పండితార్థం ఏమైనా పిండితార్థం ఒకటుంది. 


*పశువా అని తిట్టినట్టు. మనుషులు నిలువుగా ఉంటారు. పశువులు అడ్డంగా ఉంటాయి. అదీ సంగతి! 


*ఎవడి మీదైనా కోపం వస్తే ఏ మొహం పెట్టుకుని వచ్చావంటాడు తెలుగువాడు. ఎవడికైనా ఒకటే ముఖం ఉంటుంది కానీ బ్రహ్మలాగా నాలుగు ముఖాలు, రావణబ్రహ్మలాగా పది ముఖాలు ఉండవు కదా! 


*ఫలానావాడు తలలు మార్చేరకం అనేది కూడా తెలుగువాడి వాడుక. ఇదెలా సాధ్యం? వినాయక వృత్తాంతంలోలాగా తలలు మార్చేశక్తి సామాన్య మానవులకు ఉంటుందా ?


*తెలుగువాడు బండ చాకిరీ చేస్తానంటాడు. బండ దాని మొహం! ఎక్కడ పడేస్తే అక్కడే ఉంటుంది కానీ అది చేసే చాకిరీ ఏముంటుంది? 


*ఏముంది ఎడమ చేత్తో చేస్తానంటాడు. ఎడమ చేత్తో చేసే పనులేంటో అందరికీ తెలుసు. దానితో అన్ని పనులూ అతివేగంగా చేస్తానంటే ఎలా కుదురుతుంది? 


*అన్నం ఉడకలేదా అంటాడు. ఇదేంటి? ఉడికితే కానీ అన్నం కాదు కదా! 


*జోకులు పేల్లేదు అంటాడు. జోకు ఏమైనా బాంబా? పేలడానికి! 


*వీపు విమానం మోత మోగుతుందని అంటాడు. విమానం మోత మోగితే ఆ వీపు అసలు ఉంటుందా? మనిషి అసలు ఉంటాడా? 


*లేస్తే మనిషిని కానంటాడొకడు. మరి లేచినవాళ్లందరూ ఏంటి? అలాంటప్పుడు కూర్చుని ఉంటేనే మేలు కదా! 


*శక్తిని కూడా భక్తికి ముడి పెట్టడం తెలుగువాడికి రివాజు. 


*ఉన్న పూజలు చాలక బడితెపూజ ఒకటి.


  *జంతువుల్లో కూడా దేవుళ్లను చూసుకుని భారతీయులు ఆరాధిస్తారు. ఇందుకు తెలుగువాడు కూడా మినహాయింపు కాదు. ఎటొచ్చీ మనుషుల్లో జంతువుల్ని చూడటం అతగాడి ప్రత్యేకత. 


*గిట్టనివాళ్లను పంది, కుక్క, గాడిద అని తిట్టే తెలుగువాడు, ఇష్టమైనవాణ్ని పులి, సింహం, గుర్రం అని అభిమానంగా చూస్తాడు. పిలుస్తాడు.


*ఏదైనా కళ్లారా చూస్తే తప్ప నమ్మకూడదు. తెలుగు భాష ఇందుకు ఇంపు అయిన మినహాయింపు. 

*గుండె జారిపోయింది అంటారు. ఇప్పటివరకు ఎవరికైనా జారిపోయిందా? లేదే! 


*నీ నోరు పడిపోను అని తిట్టిపోస్తారు. ఎవరి నోరు అయినా ఎప్పుడైనా పడిపోవడం చూశామా? 


*పాడమని అడిగితే గాయకులు గొంతుపోయింది అంటారు. గొంతు ఎక్కడికి పోతుంది? పోతే ఎవరు తీసుకురాగలరు? 


*నోరు పారేసుకోవడం అంటారు. అది ఎలా సాధ్యం? 


*మా ఆయనకు నోట్లో నాలుకలేదని ఓ ఇల్లాలు వాపోతుంటుంది. నోట్లో నాలుక లేకుండా మనిషి ఎలా ఉంటాడు? 


*‘వాసన చూడు’ అంటారు. వాసనను పీలుస్తారు కానీ ఎలా చూస్తాం? 


*రుచి చూడటం కూడా అంతే. ఎవరు చూడగలరు? 


 *పత్రికలు చదివి చదివి వాటిలోని పడికట్టు మాటలను కంఠస్థం చేసేశాడు తెలుగువాడు. 


*ఫలానావాడు బాధకు గురయ్యాడు అంటాడు. మధ్యలో గురి ఎందుకు? బాధపడ్డాడు అనొచ్చుగా. 


*దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడంటారు. దిగ్భ్రాంతి చెందాడు అనడు. దిగ్భ్రాంతిని ఎలా వ్యక్తం చేస్తాడంటే చెప్పడు. 


*తప్పు చేస్తే పాపం అంటాడు సరే. ఎదుటివాడు కష్టాల్లో ఉంటే అయ్యో ‘పాపం’! అంటాడు. తెలుగు భాష ఏమన్నా పుణ్యానికి వచ్చిందా ఏంటి?


 *దేశ భాషలందు తెలుగు లెస్స*

*తెలుగు భాష జిందాబాద్‌*

💐💐💐

ఫాల్గుణ మాసం

 *"ఫాల్గుణ మాసం" ప్రాముఖ్యత!*


(నేటి నుండి ఫాల్గుణ మాసం ప్రారంభం)


శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన మాసాల్లో "ఫాల్గుణం" ఒకటి. పూర్ణిమ తిథిలో చంద్రుడు పూర్వ ఫల్గుణి లేదా ఉత్తర ఫల్గుణి నక్షత్ర సమీపంలో సంచరిస్తే, ఆ మాసాన్ని ‘ఫాల్గుణి’ గా పరిగణిస్తారు. గోవింద వ్రతాలను విరివిగా చేస్తుంటారు. విష్ణుపూజకు ‘పయోవ్రతం’ విశిష్టమైంది. దీన్ని శుద్ధ పాడ్యమినాడు ప్రారంభించి పన్నెండు రోజుల పాటు కొనసాగిస్తారు.

సమీపంలోని నదుల్లో స్నానమాచరించి, సూర్యుడికి అర్ఘ్యమిచ్చి, విష్ణువును షోడశోపచారాలతో పూజించి, పాలను నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. 


"పయస్సు" అంటే పాలు. అదితి ఈ వ్రతం ఫలితం వల్లే వామనుడు జన్మించాడట. లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరుల్ని శుద్ధ తదియనాడు పూజించి నైవేద్యం సమర్పిస్తారు. ఈ మాసంలో రెండు రోజులు వినాయకుణ్ని ఆరాధిస్తారు. కాశీ, ద్రాక్షారామంలో వెలసిన డుండి గణపతికి సంబంధించిన పూజ ఇది. శుక్ల పాడ్యమి, చతుర్థినాడు అవిఘ్న, పుత్ర గణపతి వ్రతాల్ని ఆచరిస్తారు. శుద్ధ ద్వాదశి పయోవ్రతానికి చివరిరోజు. ఈ రోజున నరసింహస్వామిని పూజిస్తారు.


దివ్యౌషధంగా భావించే ఉసిరిని శుద్ధ ఏకాదశినాడు పూజించి, ఆ చెట్టు వద్దనే ‘అమలక ఏకాదశి’ వ్రతం నిర్వర్తిస్తారు. దీన్ని ‘అమృత ఏకాదశి’ గా పరిగణిస్తారు. మదురైలోని మీనాక్షీ సుందరేశ్వరుల కల్యాణం రోజు ఇది. అందుకే శివపూజ చేస్తారు. ఈ నెలలో విష్ణుపూజకు ప్రాధాన్యత ఉంటుంది. ఫాల్గుణ మాసంలో అతి ముఖ్యమైంది వసంతోత్సవం. ఇది కాముని పండుగ, హోలికా పూర్ణిమ, కామ దహనం పేరుతో ప్రఖ్యాతి చెందింది. శుద్ధ త్రయోదశి- కాముని పండుగగా ప్రసిద్ధి చెందింది. ఈ పర్వదినాన శివుడు, మన్మథుడు, కృష్ణుడు, లక్ష్మీదేవి పూజలందుకుంటారు.


ఫాల్గుణమాసంలో ప్రతి తిథికీ ఒక ప్రత్యేకత ఉంది. చవితినాడు ‘సంకట గణేశ’ వ్రతం ఆచరిస్తారు. బహుళ అష్టమినాడు సీతాదేవి భూమి నుంచి ఆవిర్భవించింది. అందుకే ఆ రోజున రామాయణాన్ని చదివి, సీతారాముల్ని కొలుస్తారు. బహుళ అమావాస్యనాడు పితృదేవతలకు పిండప్రదానం చేసి, అన్నదానం చేస్తారు.

*కర్మ అనేది

 *కర్మ అనేది గోడకు కొట్టిన బంతి లాంటిది. ఎంత గట్టిగా కొడితే తిరిగి అంతే గట్టిగా మన వైపు వస్తుంది. ఏ దెబ్బ నుండి అయినా తప్పించుకోవచ్చునేమో కానీ కర్మ దెబ్బ నుండి మాత్రం తప్పించుకోలేం ఎంతటివరైనా సరే తాను చేసిన ప్రతీ కర్మకు ఇప్పుడో మరెప్పుడో ఫలం అనుభవించాలి*

*కనుక  కర్మ  చేసినపుడు                               మంచిదా? చెడ్డదా? అని ఆలోచించి చేయాలి. లాభం వస్తుంది కదా అని ఏది పడితే అది చేసేస్తే కర్మ కూడా తన పని తాను చక్కగా చేసుకు‌ పోతుంది. కనుక విచక్షణతో కర్మలను ఆచరించాలి. దేవుణ్ణి మనసు నిండుగా నింపుకోవాలి. నిజముగా దేవుణ్ణి  ప్రేమించినవాడే   కర్మకు భయపడి ఉంటాడు.*

మనుస్మృతి

 మనుస్మృతి ఇలా చెబుతోంది: "త్రిభ్య ఏవ తు వేదేభ్యః పదం పదమదుదుహం".


గాయత్రీ యొక్క ప్రతి పదం (మూడు) వేదాలలో ఒకదాని నుండి తీసుకోబడింది. 

వేదసంబంధమైన అన్నిటినీ విడిచిపెట్టాము. 

గాయత్రీ మంత్రాన్ని కూడా వదులుకుంటే మన గతి ఏమవుతుంది?


శాస్త్రాల ప్రకారం చేసే అన్ని ఆచారాలకు గాయత్రీ-జపం చాలా అవసరం.

[20/02, 06:53] *Mcp Rajanala Phanibabu/Srivatsa: Says the Manusmriti: "Tribhya eva tu Vedebyhah padam padamaduduham". 

It means that each pada of Gayatri is taken from one of the (three) Vedas. We have forsaken all else that is Vedic. What will be our fate if we give up the Gayatri mantra also?

Gayatri-japa is essential to all rites performed according to the sastras.

ఏడు అద్భుతాలు

 *మన చుట్టూ ఉన్న ఏడు అద్భుతాలు*


 *1* . *తల్లి* 


మనల్ని ఈలోకానికి  పరిచయం చేసిన వ్యక్తి... మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్లివచ్చిన...  తల్లి మొదటి అద్భుతం. 


 *2* . *తండ్రి* 


మన కళ్ళల్లో  ఆనందాన్ని చూడాలని  తన కన్నీళ్లను దాచేస్తాడు.మన పెదవులపై  చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు.దుఃఖాన్ని  తాను అనుభవిస్తూ.. సంతోషాన్ని  మాత్రమే మనకు ఇచ్చే తండ్రి రెండో అద్భుతం.....


 *3* . *తోడబుట్టిన*  *వాళ్ళు* 


మన తప్పులను వెనుకెసుకురావాడానికి...  

మనతో పోట్లాడడానికి...  మనకు నేను ఉన్నా అనే ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్ళు... 

తోడబుట్టినవాళ్లు మూడో అద్భుతం......


 *4* . *స్నేహితులు*  


మన భావాలను పంచుకోడానికి..  

మంచిచెడు అర్థం అయ్యేలా చెప్పడానికి...

ఏది ఆశించకుండా..  మనకు దొరికిన స్నేహితులు  నాలుగో  అద్భుతం....


 *5* . *భార్య* / *భర్త* 


ఈ ఒక్క బంధం కోసం అన్ని బంధాలను... ఎదిరించేలా 7 చేస్తుంది.కలకాలం తోడు ఉంటూ... ఇన్నిరోజులు తోడు ఉన్న అన్ని బంధాలకంటే...  ఈ బంధం ఇంకా గొప్పదని నిరూపిస్తుంది .....భార్య/భర్త అర్థం చేసుకునేవారు దొరికితే  ఐదో అద్భుతం మన సొంతం .


 *6* . *పిల్లలు* 


మనలో స్వార్థం మొదలవుతుంది..  మన పిల్లలు బావుండాలని పదే పదే మనసు ఆరాటపడుతుంది...  

వారి ఆలోచనలే  ఎప్పుడూ చుట్టూ ఉంటాయి..  

వారికోసం మాత్రమే గుండె  కొట్టుకుంటూ  ఉంటుంది.. 

వారి కోసం ఏదో ఒకటి త్యాగం చేయని... తల్లి తండ్రులు  అసలు ఉండరు...  పిల్లలు ఆరో అద్భుతం.


అన్ని అయిపోయాయి ఇంకా 7 అద్భుతం ఏంటా అని అనుకుంటున్నారా?


 *7* . *మనవళ్ళు* *మనవరాళ్లు* 


వీరికోసం ఇంకా కొన్నిరోజులు  బతకాలనే  ఆశపుడుతుంది.. వీరితో కలిసి ఆడుకోవడానికి వయసును మరిచి, అద్భుతం మళ్ళీ పసిపిల్లలం... అయిపోతాం.వీరు మన జీవితానికి  దొరికిన.. ఏడో అద్భుతం....


ఇలా అద్భుతాలన్నీ  మన చుట్టూ ఉంటె అక్కడెక్కడో వెళ్లి వెతుకుతుంటాం... 

కాసింత ప్రేమ చాలు... ఇంకెన్నో అద్భుతాలు  మన సొంతం అవుతాయి  

చిన్న పలకరింపు  చాలు... మనల్ని ఆ అద్భుతంగా  చూడడానికి.  

అందుకే అందరిని చిరునవ్వుతో స్వాగతించి  మరో అద్భుతాన్ని  సృష్టించేద్దాం ...


ఇప్పుడు మన మధ్య ఉన్న మనిషి తెల్లవారేసరికి వుంటాడో లేదో తెలియని కాలం ఇది అందుకే ఉన్న దానిలో సర్దుకుపోయి హాయిగా జీవించడం లోనే ఆనందం.

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

సెల్ ఫోన్*

 

*మన ఆరోగ్యం…!


                      *సెల్ ఫోన్*

                     ➖➖➖✍️


#BecarefulChildren.....


*పిల్లలు సెల్ ఫోన్ తో ఆదుకోవడం గొప్పగా భావించకండి.. తరువాత బాధపడేది మనమే... పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే...అవగాహనా కోసం*


*Naveen Nadiminti సలహాలు* 


సెల్ ఫోన్ వికరణాల ప్రభావం , Cell phone radiation effects


సెల్ ఫోన్ వికరణాల ప్రభావం


Cell phone radiation effects


మనిషి ఆరోగ్యం మీద సెల్ ఫోన్ వికరణాల ప్రభావం


మొబైల్ ఫోన్ వాడకం ద్వారా ప్రమాదకరమైన రేడియో ధార్మిక దుష్ప్రభావాలకు గురయ్యే అవకాశం ఉంది . ప్రజల దైనందిన జీవితాలలో సెల్ ఫోన్లు ముఖ్యమైన ఉపకరణము గా ఈరోజు మారాయి. సెల్ ఫోన్లు మానవ శరీరానికి రోగాలని కలగచేసే లేదా మన ఆరోగ్యానికి హాని కలగచేసే సూక్ష్మ తరంగాలని ప్రసరిస్తాయి .


పిల్లలో సెల్-ఫోన్‌ ప్రభావము :


మన దేశంలో సెల్ ఫోన్ ల వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. రింగ్ టోన్లు, కాలర్ ట్యూన్లు, ఎస్ ఎం ఎస్ లు అంటూ ఎన్నో రకాలుగా సెల్ ఫోన్ ల వాడకం పెరిగిపోతుంది. ఇది బాగానే ఉందిగాని, ఈ సెల్ ఫోన్ల వల్ల వచ్చే అనార్థల గురించి ఎవరూ పట్టించుకోక పోవడం విచారకరమని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ల పిల్లలు ఎక్కువగా అనారోగ్యం పాలు అవుతున్నారని వారు పేర్కొంటున్నారు. గేమ్స్ ఆడడం, పాటలు వినడం , సినిమాలు చూడడంలో పిల్లలు సెల్ ఫోన్స్ ని ఎక్కువగా వాడుతున్నారు. మూడు సంవత్సరాల వయసు కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకి సెల్ ఫోన్స్ ని దూరంగా ఉంచడం చాలా మంచిదని నిపుణులు, డాక్టర్లు చెబుతున్నారు. సెల్ ఫోన్ లు రిసీవ్ చేసుకునే సిగ్నల్స్ కారణంగా రేడియో ధార్మికత వల్ల చిన్న పిల్లల్లో మెదడుకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాలు ఎక్కువగా ఉన్నాయి. వారి ఆలోచనా శక్తి క్రమేపీ మోద్దుబారే ప్రమాదం ఏర్పడుతోందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఓ బ్రిటీష్ శాస్త్రవేత్త ఈ సెల్ ఫోన్ల్ వల్ల వస్తున్న అనర్థాల గురించి కొన్ని హెచ్చరికలు చేసారు. ముఖ్యంగా వైర లెస్, సెల్ ఫోన్ లు, విల్ ఫోన్ లు నుంచి విడుదలయ్యే రేడియో ధార్మిక కిరణాలు సున్నితమైన మెదడు కణజాలాన్ని నాశనం చేస్తున్నాయని, చిన్న పిల్లల్లో ఇది బాగా ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. బ్రిటన్ హెల్త్ ప్రొడక్షన్ ఏజన్సీకి చెందినా సర్ విలియం స్టీవార్డ్ ఫిన్క్ష్లన్ద్లొ జరిపిన పరిశోధనలో పాలు విభ్రాంతికరమైన సంగతులు వెలుగు చూశాయి.


సెల్ ఫోన్ లు బాగా వాడే యువకుల రోజువారీ ప్రవర్తనను పరిశీలించిన బృందం వారు తీవ్రమైన మానసిక వత్తిడికి, చిరాకుకీ గురవుతున్నారని తెల్సింది. సెల్ ఫోన్ ల ప్రభావం వల్ల చిన్న పిల్లలు వత్తిడికి గురవ్వడంతో పాటు సరిగా చదవలేక పోతున్నారని, తలనొప్పికి గురవుతున్నట్లుగా కూడా వెల్లడైంది. సెల్ ఫోన్ లతో పాటు మ్యూజిక్ సిస్టమ్స్ వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన వెల్లడించారు. ముభావంగా ఉండడం, ఆకలి మందగించడం, ఎక్కువసేపు మెలకువగా ఉండడం, సరిగా చదవలేకపోవడం, చదివింది గుర్తుంచుకోకపోవడం వంటి లక్షణాలు చిన్నారుల్లో కనిపించినట్లు స్టీవార్డ్ తన పరిశోధన ఫలితాలు వివరించారు. అందుకే ఆస్ట్రేలియా మెడికల్ అసోసియేషన్, పాఠశాలల్లో మ్యూజిక్ సిస్టమ్స్, సెల్ ఫోన్ వాడకాన్ని నిషేదించాలని సూచించింది. ఆస్ట్రేలియా, చైనా అమెరికాలోనూ చిన్నారుల్లో ఇలాంటి లక్షణాలు అధికంగా నమోదవుతున్నాయి. భారత్ లో ఈ అనారోగ్య లక్షణాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన దేశంలో వివిధ సెల్ ఫోన్ కంపెనీలు అందిస్తున్న ఆఫర్ల వలలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా చిక్కుకుంటున్నారు. క్రమేపీ మనదేశంలో కూడా చిన్నారుల ఆరోగ్యాన్ని ఈ సెల్ ఫోన్ రేడియో ధార్మికత కబళించే ప్రమాదం ఉందని స్వచ్చంద సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అందుకే సెల్ ఫోన్ లు మీ చిన్నారులకు అందుబాటులో లేకుండా చూసుకుంటే వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది.


పెద్దవారిలో-- మొబైల్ ఫోన్ వికరణాలు వల్ల కలిగే అనారోగ్యాలు : ->


హై బ్లడ్ ప్రెజర్,


తలనొప్పులు,


మెదడు వాపు వ్యాధి,


ఆల్జీమెర్,


క్యాన్సర్


మరియు అంతకన్నా ఎక్కువ ఆరోగ్య సమస్యల్ని కలగచేస్తాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అయినా, సెల్ ఫోన్ ఉపయోగం , కలిగే హాని గురించి పూర్తిగా ఏ ఒక్కరికీ తెలియదు


ఇక్కడ ఇచ్చిన కొన్ని చిట్కాల్ని చూడండి:


1. వీలైనంత వరకు చాలా తక్కువగా వికరణాలకి మాత్రమే గురికావాలి. దీని అర్థం ఏమిటంటే తెలివిగా వీలైనంత తక్కువ ఫోన్ లో మాట్లాడడము, అతి దీర్ఘమైన సంభాషణల్ని జరగకుండా మీరు ప్రయత్నించడం. రెండు నిమిషాల కాల్ తరువాత, మెదడు యొక్క ఎలక్ట్రికల్ ఏక్టివిటీస్/పనితీరు ఒక గంటవరకు మార్పుచేస్తుందని కనుగొన్నారు.


2. సెల్ ఫోన్ ని అత్యవసర పరిస్థితులలో మాత్రమే పిల్లలు ఉపయోగించడాన్ని అనుమతించాలి.


3. మీ మొబైల్ ఫోన్ని ఉపయోగించనప్పుడు, వీలైనంతవరకు మీ శరీరానికి దూరంగా ఉంచాలి. కొంతమంది సెల్ ఫోన్ ఉన్నవారు సెల్ ఫోన్ పనిచేస్తూ ఉండగా తమ పేంటు జేబులో పెడతారు. మానవ శరీరము యొక్క క్రింది భాగము, పై భాగము కన్నా చాలా త్వరగా వికరణాలని లీనం చేసుకుంటుంది.


4. హెడ్ ఫోన్లని ఉపయోగించాలని అనుకున్నట్లైతే, వైర్డు హెడ్ సెట్ల కన్నా వైర్ లెస్ హెడ్ సెట్లని వాడండి. వైరు వికరణాన్ని ప్రసరించడమే కాకుండా ఏంటీనాలా కూడా పనిచేసి చుట్టుప్రక్కల ఉన్న ఎలక్ట్రోమేగ్నెటిక్ ఫీల్డులను (EMFs) ఆకర్షిస్తుంది. హెడ్ సెట్ లేకుండా మీరు సెల్ ఫోన్ ఉపయోగించినప్పుడు, మీ చెవి దగ్గరికి తీసుకునే ముందు కాల్ వచ్చే వరకు వేచి చూడాలి.


5. మీరు సెల్ ఫోన్, హోల్ సేల్ లేదా ఒకొక్కరిగా అమ్మే వారి దగ్గర కొనేటప్పుడు తక్కువ ఎస్ ఎ ఆర్ (నిర్దుష్టమైన విలీన రేటు) ఉన్నది చూసుకుని ఎంచుకోవాలి.ఇన్సట్రక్షన్ మేన్యువల్ లో ఇచ్చిన ఎస్ ఎ ఆర్ నంబరుని చూడండి ఎంత తక్కువ ఎస్ ఎ ఆర్ విలువ ఉంటే అంత మంచిది.


6. ఎలివేటర్లు/ లిఫ్టులు లేదా వాహనాలు వంటి, మూసివేసిన మెటల్ స్పేసులలో వికరణం ఉధృతంగా ఉంటుంది కాబట్టి కాల్స్ ని తీయకుండా ఉండండి.


మీ సెల్‌ఫోన్‌ హాని చేయనిదేనా..తెలుసుకోండిలా ..!


బ్రాండెడ్‌ సెల్‌ఫోన్లతో ఎక్కువసేపు మాట్లాడినా ఇబ్బందేమీ ఉండదు. అదే అన్‌బ్రాండెడ్‌ మొబైల్‌తో 5 నిమిషాలు మాట్లాడినా.. చెవి దగ్గర వేడెక్కుతుంది. ఫోన్‌ నుంచి అధిక రేడియేషన్‌ వెలువడటమే ఇందుకు కారణం. అందుకే సెల్‌ఫోన్‌ కొనేటప్పుడు కెమేరా, వీడియో ప్లేయర్‌, ఎంపీ 3, ఇంటర్నెట్‌ వంటి ఫీచర్లతో పాటు రేడియేషన్‌ ఎంత వెలువరిస్తుందో కూడా తెలుసుకోవడమూ అవసరమే.


మొబైల్‌ ఫోన్‌ రేడియో తరంగాలను ప్రసారం చేయడంతో పాటు గ్రహిస్తుంది కూడా. అందుకే ఫోన్‌ నిర్దిష్ట శోషణ సూచి (ఎస్‌ఏఆర్‌) అంటే రేడియో తరంగాల నుంచి ఎంత శక్తిని మన శరీరం గ్రహిస్తుందో కూడా తెలుసుకోవాలి.


* 'కిలోగ్రాముకు 2 వాట్ల కంటే తక్కువ రేడియేషన్‌ వెలువరించేవి మంచి ఫోన్లు' అని స్వతంత్ర సాంకేతిక సంస్థ ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ నాన్‌ అయొనైజింగ్‌ రేడియేషన్‌ ప్రొటెక్షన్‌ (ఐసీఎన్‌ఐఆర్‌పీ) తేల్చింది. 10 గ్రాముల కణజాలాన్ని సగటుగా తీసుకుని లెక్కించారు. దీనినే అంతర్జాతీయంగా అనుసరిస్తున్నారు. అయితే చెవి దగ్గర ఫోన్‌ ఉంచి మాట్లాడేందుకు ఎస్‌ఎఆర్‌ 1.29 వాట్లు/కిలోగ్రామ్‌ ఉండాలని ఐసీఎన్‌ఐఆర్‌పీ నిర్దేశించింది.


* ఎస్‌ఏఆర్‌ పరిమాణం నిర్ధరించిన అత్యధిక విలువ కంటే తక్కువే ఉండాలి. ఎందుకంటే నెట్‌వర్క్‌ను చేరేందుకు మాత్రమే సెల్‌ఫోన్‌ తన బ్యాటరీ నుంచి శక్తిని వినియోగించాల్సి ఉంటుంది. నెట్‌వర్క్‌ బేస్‌ స్టేషన్‌ నుంచి మనం ఎంత దూరాన ఉన్నాం అనే అంశంపై సెల్‌ఫోన్‌ శక్తి వినియోగం ఆధారపడుతుంది.


ఎస్‌ఏఆర్‌ ప్రమాణాలు ఆయా దేశాల్లో


అమెరికాలో 1.6 వాట్స్‌/కిలోగ్రామ్‌


కెనడాలో 1.6 వాట్స్‌/కిలోగ్రామ్‌


ఐరోపాలో 2 వాట్స్‌ / కిలోగ్రామ్‌


ఆస్ట్రేలియాలో 2 వాట్స్‌ / కిలోగ్రామ్‌


కంపెనీల ప్రత్యేక వెబ్‌సైట్లు


కంపెనీలు తాము తయారుచేసిన సెల్‌ఫోన్లు విక్రయించే ముందు రేడియేషన్‌ పరీక్షను అమలు చేస్తాయి. అందులో అర్హత పొందిన వాటినే మార్కెట్లోకి విడుదల చేస్తాయి. ఈ సమాచారం ఫోన్‌తో పాటు ఇచ్చే యూజర్‌ గైడ్‌లో ఉంటుంది. దీంతోపాటు బ్రాండెడ్‌ కంపెనీలన్నీ ప్రత్యేక వెబ్‌సైట్లు కూడా నిర్వహిస్తున్నాయి. కంపెనీ, ఫోన్‌ మోడల్‌, దేశాన్ని ఆయా సైట్లలో నమోదు చేస్తే, ఎంత రేడియేషన్‌ వెలువరిస్తుందో తెలుస్తుంది. కొన్ని వెబ్‌సైట్లు ఇవీ..


సెల్‌ఫోన్లకు రేడియేషన్‌ షీల్డులు విక్రయించే ఎస్‌ఎఆర్‌ షీల్డ్‌ వెబ్‌సైట్‌ www.sarshield.comలో కూడా పూర్తి సమాచారం లభిస్తుంది


ఈ జాగ్రత్తలు పాటిస్తే


* ఎస్‌ఏఆర్‌ తక్కువగా ఉండే సెల్‌ఫోన్లు కొనాలి.


* సాధ్యమైన చోట్ల ఫోన్‌ చెవి దగ్గరకు చేర్చకుండా, స్పీకర్‌ ఆన్‌ చేసి మాట్లాడాలి


* హెడ్‌సెట్‌ (ఇయర్‌ఫోన్లు) వినియోగించినా సెల్‌ఫోన్‌ రేడియేషన్‌ ప్రభావం పూర్తిగా పోదు


* అవసరమైన కాల్స్‌ మాత్రమే మాట్లాడి, మిగిలిన వాటికి టెక్ట్స్‌ మెసేజ్‌ (ఎస్‌ఎంఎస్‌) వినియోగించాలి


* సెల్‌ఫోన్‌ తీసుకెళ్లేటప్పుడు మన శరీరానికి కనీసం అంగుళం దూరాన ఉండేలా చూసుకోవాలి


* నెట్‌వర్క్‌ బలహీనంగా ఉన్నచోట, సిగ్నల్‌ కోసం ఫోన్లు అత్యధిక రేడియేషన్‌ను వెలువరించే అవకాశముంది. అలాంటి ప్రదేశాల్లో ఫోన్‌ వినియోగం తగ్గించాలి


* నిద్రించేటప్పుడు తలగడ వద్ద ఫోన్‌ ఆన్‌చేసి ఉంచవద్దు.



సెల్‌తో ఎముకలకు ముప్పు


ఈమధ్య కాలంలో సెల్‌ఫోన్‌ వాడనివారు పాపాత్ములు. టెక్నాలజీని మేం మాత్రం వాడుకోకూడదా అనే పంథాలో. కానీ దేన్నైనా అవసరాన్ని మితిమీరి వాడితే ముప్పులు తప్పవ్ఞ. కొంతమంది హోదాకోసమో, హుందా కోసమో ఎప్పుడూ సెల్‌ఫోన్‌ను బెల్టుకో, జేబులోనో ధరిస్తుంటే వాటి నుంచి వెలువడే విద్యుదయస్కాంత కిరణాలు కటి ప్రాంతంలోని ఎముక సాంద్రతను దెబ్బతీస్తున్నాయని టర్కీ పరిశోధకులు చెబుతున్నారు.


ఆరేళ్లుగా రోజుకి 15 గంటల పాటు ఇలా బెల్టుకి సెల్‌ఫోన్‌ ధరిస్తున్న వారి ఎముకల సాంద్రతను పరీక్షించినపుడు తుంటి ఎముక పైభాగంలోని వంపు (ఇలియాక్‌ వింగ్స్‌) దగ్గర అవతలి వైపు ఎముక కన్నా బలహీనంగా ఉంటున్నట్టు గుర్తించారు. కాబట్టి సెల్‌ఫోన్‌ ప్రియులూ తస్మాత్‌ జాగ్రత్త!


సెల్‌ఫోన్లతో బ్రెయిన్‌ క్యాన్సర్‌


        యూత్‌లో సెల్‌ ఫోన్ల వాడ కం పెరగడంపై ఆమె హెచ్చరికలు చేస్తున్నారు. మొబైల్‌ ఫోన్ల వాడకంతో రాబోయే మూడు సంవత్సరాల్లో యువతలో పలు ఆరోగ్య సమస్యలు ఎదుర య్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. వీటి ఉపయోగంతో మగ వారిలో వ్యంధత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఆమె యుఎస్‌, చైనా, ఆస్ట్రేలియా తదితర ఏడు దేశాల్లో పరిశోధనలు నిర్వహించారు. యువ కులు స్విచాన్‌ చేసిన మొబైల్‌ ఫోన్స్‌ను ప్యాంట్‌ జేబుల్లో పెట్టుకొనే వారిలో స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. కొత్తగా తండ్రులు కావాలనుకునే యువకులు ప్రతిరోజు కనీసం నాలుగు గంటల పాటు సెల్‌ ఫోన్‌ వాడితే అంతే సంగతులు. ఈవిధంగా మొబైల్‌ను వాడితే ఇతరులతో పోల్చుకుంటే వారిలో స్పెర్మ్‌ కౌంట్‌ సగానికి సగం తగ్గుతుందని పరిశోధనల్లో దేవ్‌రా డేవిస్‌ చెప్పడం గమనార్హం.


మొబైల్‌ రేడియేషన్‌ మధ్య స్పెర్మ్‌లను ఉంచితే అవి బలహీనపడడమే కాకుండా సన్నబడి వేగంగా ఈదలేకపోతున్న విషయం తమ పరిశోధనలో తేలిందని ఆమె పేర్కొన్నారు. తక్కువ శక్తితో కూడిన రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌మిట్టర్‌లైన మొబైల్‌ ఫోన్లు మైక్రోవేవ్‌ రేడియే షన్‌ను సృష్టిస్తాయి. సెల్‌ ఫోన్‌ రేడియేషన్‌ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందనీ ఈ విషయంలో సెల్‌ఫోన్‌ కంపెనీలు ఏం చేస్తా యో చూడాల్సిందేనని ఆమె పేర్కొన్నారు. మొబైల్‌ ఫోన్లను ఎక్కువగా వాడ డం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలున్నాయనీ ఇవి ఆరోగ్యవంతమైన పిల్లలు కలిగే అవకాశాలను నీరుకారుస్తాయని ఆమె హెచ్చరిస్తున్నారు. ఇవి మనకు దీర్ఘకాల సమస్యలను సృష్టిస్తూ మనుషుల మెదడు, శరీరాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయని దేవ్‌రా డేవిస్‌ పేర్కొన్నారు.


      కొంతకాలానికి వాటిలో ట్యూమర్లు ఏర్పడిన విషయం బయటపడి అందరూ నిర్ఘాంతపోయారు. కనుక సెల్‌ ఫోన్లతో జాగ్రత్త పడక తప్పదు.


15నిమిషాలు సెల్‌ఫోన్‌ మాట్లాడితే బ్రెయిన్‌ కేన్సర్‌


    : మొబైల్‌ ఫోన్‌లలో ఎక్కువ సమయం సంభాసించే వారికి బ్రెయిన్‌ కాన్సర్‌ వచ్చే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వినియోగదారులకు ఓ హెచ్చరిక చేసింది. 15 నిమిషాల పాటు ఏకధాటిగా మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడితే తప్పనిసరిగా బ్రెయిన్‌ కాన్సర్‌ వస్తుందని, తాజా అధ్యయనంలో వెల్లడైనట్లు డబ్ల్యుహెచ్‌ఓ పేర్కొంది. దాదాపు 13 దేశాలలో మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులపై పరిశోధనలు నిర్వహించగా, ఈ ఆందోళనకర విషయం వెలుగుచూసిందని తెలిపింది. ఓ రోజులో 15 నిమిషాలు మొబైల్‌ ఫోన్‌లో సంభాషణలు జరిపినా బ్రెయిన్‌ ట్యూమర్‌ వచ్చే అవకాశా లున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.


మొబైల్ తో మతిమరుపు :


ఏ వయస్సులో ఉన్నా , ఎవ్వరి చేతిలో చూసినా సెల్ ఫోన్‌ కనిపించాల్సిందే . క్షణాల్లో విషయాలు తెల్సుకోగల ఈ సంకేతికవిప్లవం మంచిదే అయినా .. అతి అనర్ధదాయకం అన్న సూత్రం ఇక్కడా పనిచేస్తుంది . ఎక్కువగా మొబైల్ ఫోన్లు వాడేవారిలో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది . అంతేకాదు -రియక్షన్‌ సమయమూ నెమ్మదించి తప్పుల్ని ఎక్కువగా చేస్తుంటారు . 12 , 14 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మద్య గల విద్యార్ధులపై " మొనష్ యూనివర్సిటీ " పరిశోధనలు నిర్వహించగా ... ఎన్నో విషయాలు వెళ్ళడైనాయి. ఎక్కువగా మొబైల్ ఫోన్లు వాడేవారిలో శీఘ్రగతి తగ్గిపోయినట్లు , జ్ఞాపకశక్తి తగ్గిపోతున్నట్లు , శీఘ్రగతి తగ్గిపోతున్నట్లు , తప్పులు ఎక్కువగా చేస్తున్నట్లు గుర్తించారు .


సెల్ ఫోన్‌ తో తంటా ? :


సెల్ పోన్‌ అవసరమే కాని అతిగా ఉప్యోగించడము అనర్ధము అంటున్నది ప్రపంచ ఆరోగ్యసంస్థ . భారతదేశము లోని కొన్ని పరిశోధన సంస్థలు సెల్ పోన్‌ తో వచ్చే అనారోగ్యము మీద అధ్యయనము చేసాయి. 20 నిముషాలు పాటు విడవకుండా సెల్ ఫ్ఫ్న్‌ మాట్లాడితే చెవి లోపలి ఉష్ణోగ్రత ఒక డిగ్రీ మేరకు పెరుగుతుంది . సె ఫ్ఫ్న్‌ వాడకం పెరిగిన కొద్దీ మెదడు మీద దాని ప్రభావము పడుతుంది . మెదడులో కణితలు (Tumours) ఏర్పడడానికి కారణము సల్ ఫోన్‌ వాడకము అని నిర్ధారించారు . 9 నిముషాలు సెల్ ఫోన్‌ లో మాట్లాడడము అంటే మక్రోవేవ్ ఒవెన్‌ లో ఒక సెకను పాటు తలపెట్టినటే అని నిర్ధారించారు మన శాస్త్రజ్ఞులు . మానసిక సమస్యలు పెరుగుదలకు, పురుషులలో పెరుగుతున్న వంధ్యత్వానికి కూడా సెల్ ఫోన్‌ కారణము అంటున్నారు .


సిగ్నల్స్ సరిగా లేనిచోట సెల్ ఫోన్‌ వాడవద్దు . సెల్ ఫోన్‌ జేబులో పెట్టకంది ... జేబులో పోన్‌ పెట్టుకునే పురుషులు దానిని స్విచ్ ఆఫ్ చేయండి . గర్భిణీ స్త్రీలు సెల్ ఫోన్‌ వాడకాన్ని ఎంత తగ్గిస్తే అంతమంచిది. సెల్ కాల్స్ 6 నిముషాలకు మించి వాడడము ఆరోగ్యానికి హానికరము .


సెల్ ఫోన్‌ తో చెవులకు చిక్కు : 


ఎక్కువసేపు సెల్ ఫోన్‌ లో మాట్లాడే వారికి మిగిలిన శబ్దాలు వినబడడము మానేస్తాయి. సెల్ ఫోన్‌ లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే రోడ్డు ప్రమాదాలు జరగడం అందరికీ తెలినదే ... దీనికి కారణము మెదడు రెండుపనులు మీద ఒకేసారి దృష్టి పెట్టలేక పోవడమే . రెండవ కారణము సెల్ ఫోన్‌ లో వచ్చే ధ్వనుల స్థాయి..ధ్వని తప్పించి మిగిలిన స్థాయి ధ్వనులను వినడం , విన్నా గ్రహించడం చెవులు చెయ్యలేకపోవడం . ఎక్కువగా చెవిలో గుసగుసలు చెప్పుకునే అలవాటు ఉన్నవారికి ఇటువంటి వినికిడి సమస్యే వస్తుంది్స్


సెల్‌ఫోన్లతో మరో ప్రమాదం జన్యుమార్పులు కలిగే ప్రమాదము


సెల్‌ఫోన్లు వచ్చినప్పటి నుండీ వాటిని వాడటం వల్ల వచ్చే అనేక ప్రమాదాల గురించి తెగవార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిలో కొన్ని ఊహాత్మకమైనవి. కొన్ని నిజమైనవే. ఆ క్రమంలో ఇప్పుడు పరిశోధకులు సెల్‌ఫోన్ల వల్ల వచ్చే మరో ప్రమాదాన్ని కనుగొన్నారు. అధికంగా సెల్‌ఫోన్లు వాడటం వల్ల శరీర కణాలలో ఆక్సిడేషన్‌ ఒత్తిడి పెరిగి, జన్యుమార్పులు కలిగే ప్రమాదముందని తేలింది. ఆక్సిడేషన్‌ ఒత్తిడివల్ల విషపూరిత పైరోక్సైడ్‌లు, ఫ్రీరాడికల్స్‌ కలిసి కణాల కేంద్రకంలో ఉండే డి.ఎన్‌.ఎ.తో సహా ఉన్న అన్ని భాగాలనూ తీవ్రంగా ప్రభావితం చేస్తారు. ఈ కారణంగా క్యాన్సర్‌ కణితి వంటివి ఏర్పడే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు.  


గర్భిణులూ సెల్‌ మాట్టాడవద్దు 


                              -గర్భంతో భర్తకు దూరంగా ...పుట్టింట ఉండటం కాస్త కష్టమే. కానీ అంతా అయినవారు ఉన్నా మనసెరిగిన మారాజు చెంతనలేడన్న లోటు తీర్చుకునేందుకు పూర్వకాలంలో ఉత్తరాలు రాసుకుంటే ...ఇప్పుడు ఆ జంటల మధ్య దూరాన్ని తగ్గించే బాధ్యత సెల్‌ఫోన్లే తీసుకున్నాయని చెప్పాలి. దీంతో అదే పనిగా అవసరం ఉన్నా లేకున్నా సెల్‌ఫోన్లతో గర్భంతో ఉన్నవారు ఎక్కువగా తన భర్తతో మాట్లాడేస్తున్నారు.గర్భంతో ఉండే మహిళలు సెల్‌ ఫోన్‌తో ఎక్కువగా మాట్లాడితేj పుట్టబోయే బిడ్డకు ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పరిశో ధకులు. ఈ విషయమై కాలిఫోర్నియా, దక్షిణ కాలిఫోర్నియా లకు చెందిన శాస్త్రజ్ఞుల బృందం జరిపిన తాజా అధ్యయనంలో ఈ నిజం వెలుగు చూసినట్లు వెల్లడించారు. కాలిఫోర్నియాలో దాదాపు 30 వేల మంది చిన్నారులపెై వివిధ రకాల పరీక్షలు జరిపి, శోధించగా వారిలో 50శాతం మందికి పెైగా రేడియేషన్‌ ప్రభావానికి గురెైనట్లు తేలిందని తేల్చి చెప్పారు.అందుకు కారణం ఆ బిడ్డల తల్లులు గర్భంతో ఉన్నప్పుడు ఎక్కువగా సెల్‌ఫోన్‌ వాడటమే ప్రధానంశంగా తేల్చి చెప్పారు. పుట్టగానే ఆ రేడియేషన్‌ ప్రభావం పెైకి కనిపించదని, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించినా వయసు పెరుగుతున్న కొలది అవలక్షణాలు బెైటకు వస్తున్నట్లు తాము గుర్తించినట్లు శాస్త్రవేత్తల బృందం స్పష్టం చేసింది. తల్లి గర్భంతో ఉన్నప్పుడు రేడియేషన్‌ ప్రభావానికి గురయ్యే చిన్నారులు 30 శాతంగా నమోదు కాగా... చిన్నారుల ముద్దు మాటలకు ముచ్చటపడి సెల్‌ ఫోన్లలో మాట్లాడించడం వల్ల 20 శాతం మంది రేడియేషన్‌ ప్రభావానికి 


గురవుతున్నారని, దీని వల్ల ఈ చిన్నారు లు ఏడేళ్ల వయసుకు వచ్చేసరికి వారి ప్రవర్తనలో అసాధారణ మార్పులు కల్గడమే కాకుండా ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎదుర్కొంటున్నట్లు గమనించామని పరిశోధకులు చెబుతున్నారు.


గర్భిణులు నిరిష్టకాల పరిమితిలో అవసరానికి అనుగుణంగా మొబెైల్‌ వినియోగిస్తే తప్పుకాదని, రోజులో కావా ల్సిన వారితో మూడు, నాలుగుసార్లు సంభాషించుకో వచ్చని... అయితే అది కూడా నాలుగు నిమిషాలకు మించకుండా ఉండాలని, అంతకన్నా ఎక్కువ సేపు మాట్లాడితే పుట్టే బిడ్డపెై రేడియేషన్‌ ప్రభావం అధికంగా ఉండటం తధ్యమని హెచ్చరిస్తున్నారు. మరి పుట్టే పిల్లల భవిష్యత్‌ని తామే అంధ కారంగా మార్చకుండా...కొన్నాళెైనా సెల్‌ ఫోన్లకి దూరంగా ఉంటే మంచిదేమో? మీ సమాచారం కన్నా మీ బిడ్డ క్షేమం కూడా ముఖ్యమే కదా.✍️


.                      🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

మాతృభాషా దినోత్సవ

 *అంతర్జాతీయ మాతృభాషా      దినోత్సవ సందర్భంగా*

(ఎల్లనాడుల అమ్మనుడి పొద్దేడుక కైకట్టుగా)

.....*ఇన్ని మాతృభాషా దినోత్సవాలు అవసరమా*....

అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా నాదొక చిన్న మాట .మనకు ఇన్ని మాతృభాషా దినోత్సవాలు అవసరమా !?అని ఆలోచిస్తే ,నిజంగా అవసరమే, ఎందుకంటే మనం ఎప్పుడూ జీవన సమరంలో జీతభత్యాల కోసం  పరుగిడుతూనే ఉంటాం .అయితే ఈ ఒక్క రోజైనా మాతృభాష గురించి మనలో కొందరైనా ఆలోచిస్తారని ,ఆవేశిస్తారని ఇలాంటి రోజులు జరుపుకోవాలని భాషావేత్తల అభిప్రాయం. కనుక ఇలాంటి దినోత్సవాలు చాలా అవసరం.


మనిషిగా మనం జన్మనిచ్చిన అమ్మ ఒడిని ,మొదటగా మాట నేర్పిన అమ్మనుడిని మరిచిపోకూడదు. అమ్మ గురించి చెప్పాలంటే అమ్మ మమతానురాగాలు చవి చూడాలి. అమ్మనుడి గురించి చెప్పాలంటే ఆ మాతృభాషా సౌందర్యాన్ని, ఆ భాష గొప్పదనాన్ని తెలుసుకోవాలి.

భాషించినది భాష (నుడివినది  నుడి), భాష ( నుడి) మానవుని భావాలను, ఆలోచనలను, అభిప్రాయాలను ,తలపులను ఇతరులకు తెలియజేయడానికి అదొక మాధ్యమం ( తెన్నువ) .మనిషి పుట్టినప్పుడు శిశువు తొలిసారిగా ,తన వారి ననుసరించి, తన సమూహంలో, సహజంగా, ప్రకృతి పరంగా ,తన పరిసరాలలోని భాషని ,విని , కని అనుకరించే మొదటగా మాట్లాడిన భాష మాతృభాష.


ఎవరి అమ్మవారికి గొప్ప అన్నట్లుగా, ఎవరి మాతృభాష వారికి గొప్పే కదా! కనుక ఎవరు అమ్మనుడిని వారు తప్పక రక్షించుకోవాలి. ఇంగ్లీష్ వారి వలసవాదం వలన, వారు కాలిడిన ,ఏలిన సీమలలో అనేక భాషలు ,అనేక సంస్కృతులు ,ఇంగ్లీషు ప్రభావం వలన, వారి మత ప్రభావం వలన కనుమరుగైనవి. ఒక భాష నశిస్తే, ఆ భాషకు చెందిన జాతి ,జాతి భావన ,సంస్కృతి ,సాంప్రదాయాలు కూడా నశిస్తాయి. ఇది చరిత్ర చెప్పిన, నిరూపించిన సత్యం .అంటే మన అమ్మనుడిని మనమే కాపాడుకోవాలి .ఎవరి భాషను వారే రక్షించుకోవాలి. రాబోయే తరాల కోసం భాషను పదిలపరుచుకోవాలి .పరిరక్షించుకోవాలి.


అందుకే ఇతర భాషల ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకొని, అమ్మనుడిని పరీక్షించుకోవాలనే  తలంపుతోనే,ఆ భాష జాతి నైతిక బాధ్యతగా ,ప్రతి మనిషి కర్తవ్యం గా ,అమ్మనుడిని రక్షించుకోవాలoటూ గుర్తు చేయడానికే , ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఏర్పాటు చేయడమైనది.


బంగ్లాదేశ్ లో తమ మాతృభాష బంగ్లాను నిలబెట్టుకోవడానికి ఉద్యమ నడిపి ఆ ఉద్యమంలో ప్రాణాలర్పించిన నలుగురి యువకుల ప్రాణత్యాగానికి గుర్తుగా ఫిబ్రవరి 21ని  ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం గా ప్రకటించింది.


ప్రపంచంలో దాదాపు 6000 పైచిలుకు భాషలు ఉన్నాయి .వాటిలో సొంత లిపి ఉన్న భాషలు దాదాపు 400 లోపే. కొన్ని భాషలకు ఇప్పటికీ సొంత లిపిలు లేవు .కనుక అమ్మనుడిని అందరూ కాపాడుకోవాలని, రేపటి జాతికి భాషను పునరoకితం చేయాలనే,ఉద్దేశంతో ఈ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకోవాలని ఆవశ్యకత ఎంతైనా ఉంది.


తల్లి ఒడిలో, తొలి బడిలో వెలసిన నుడి ,వెలిగిన నుడి ,నేర్చిన నుడి ,గుండె లోతుల నిలిచిన నుడి, మన అమ్మనుడి, అన్ని భాషల కన్నా అమ్మనుడి గొప్పది. దానిని గౌరవించాలి .నేర్చుకోవాలి, తన వారికి నేర్పాలి ,అప్పుడే ఆ భాష అంతరించిపోకుండా ఉంటుంది.


అయితే మనదేశంలో ఎక్కువగా తెలుగు ప్రాంతాలలో డాలర్లు మోజుతో ,ఇంగ్లీషు డాబుసరితో మాతృభాషను విస్మరించి , ఆంగ్లమాధ్యమం వైపు తల్లిదండ్రులు పరిగెడుతున్నారు, పిల్లలను బలవంతంగా పరిగెత్తిస్తున్నారు.

పరభాష లు నేర్వడం తప్పుకాదు. ముందు కనీసం ప్రాథమిక విద్య అయిన అమ్మనుడిలో ఉండాలి. ఎందుకంటే అమ్మనుడిలో విద్యార్థికి( నేర్వరి) పాఠము సులభంగా అర్థమవుతుంది. తన భాషలో చదివితే ,ఎక్కువ అవగాహనతో వివరణ అవుతుంది.

మాతృభాష గొప్పతనాన్ని గురించి, చదువు మాతృభాషలో ఉంటే ఎంత ఉపయోగకరమో ,విద్యార్థికి ఎంత  వికాసవంతంగా ఉంటుందో, ప్రముఖులు గాంధీజీ ,రవీంద్రనాథ్ ఠాగూర్ ,నేతాజీ ,స్వామి వివేకానంద ఎందరో మహానుభావులు వివరించారు. మన దురదృష్టం అవన్నీ చెవిటి వాడి ముందుఊదిన శంఖములా అయిపోయాయి .ఇప్పుడు చాలామంది ఇంగ్లీష్ మీడియం పిల్లలను పరిశీలిస్తే ,అటు ఇంగ్లీషు రాదు, ఇటు తెలుగు రాదు. ఇప్పటి ప్రభుత్వాలు కూడా తెలుగు భాషను తమ ఓట్ల కోసం, రాజకీయం కోసం వాడుకుంటూ ,అమ్మనుడికి వెన్నుపోటు పొడుస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఇలాగే సాగితే ఐక్యరాజ్యసమితి వారు ఈ మధ్య ప్రకటించిన ఒక నివేదిక ప్రకారం రాబోయే 30 సంవత్సరాలలో మరుగయ్యే భాషలలో తెలుగు ఒకటనే మాట నిజం కాబోతుందేమోనని అనుమానంగా ఉంది. అవును నిజమే, ఇప్పటి పిల్లలలో 90% ఇంగ్లీష్ మాద్యములో చదువుతున్నారు ,వారికి తెలుగు రాయడం, చదవడం రాదు. ఇక తెలుగు అక్షరాలతో పనేముంది. ఇలాగే సాగితే ముందు తరాలు వారు తెలుగు అక్షరాలను మ్యూజియంలో (ముట్టు చూపులి )లో చూడవలసి వస్తుంది .


అందుకే ఆంగ్ల ఉద్యోగి మేకలే గొప్పదైన హిందూ సంస్కృతిని ,జాతిని చూసి, వీరిని జయించడం చాలా కష్టమని భావించి ,ఈ జాతిని నాశనం చేయాలంటే ,మొదటగా వారి మాతృభాషను నాశనం చేస్తే చాలు అని చెప్పాడు. అందుకే ఇంగ్లీషును ,వారి మతాన్ని జనంపై రుద్దారు. ఫలితం చూస్తూనే ఉన్నాము.

మాతృభాష అమ్మ పాలు లాగా మధురమైనది. పరభాష డబ్బా పాలవలే కల్తీకి అవకాశం ఉంటుంది. మన మాతృభాష కళ్ళు ఉంటుంది .పరభాష కళ్ళజోడు వంటిది .కళ్ళుంటే కదా కళ్ళజోడుకుతో పని. కనుక మనం మొదటగా అమ్మనుడిని కాపాడుకోవాలి ,మాతృభాషను ప్రేమించాలి, పర భాషలను ఆదరించాలి ,అవసరానికి పరభాషను నేర్చుకోవడంలో తప్పేమీ లేదు .మనం ఇతర భాషలకు వ్యతిరేకం కాదు .అలాగే ఏదైనా ఒక కొత్త మాట ఇతర భాషలు నుండి వస్తే దానికి మొదటగా మన అమ్మ నుడి నుండే కొత్త మాటను పుట్టించాలి. ఆ పనిని హిబ్రూ ,చైనా,జపాన్ ,కొరియా , తమిలులు ,కన్నడిగులు చేస్తున్నారు. అయితే మన తెలుగువారు ఇంగ్లీష్ మాటను సంస్కృతికరణ చేస్తున్నారు. చక్కగా ఆలోచిస్తే అచ్చ తెలుగులో మాటలను పుట్టించవచ్చు.

ఈమధ్య తెలుగు భాషా పరిరక్షణకు, అనేక వేదికలు ,సంస్థలు ముందుకు వచ్చి ఎంతో కొంత కృషి చేస్తున్నారు .అయితే తెలుగు నాట జరిగిన, జరుగుతున్న అనేక ప్రపంచ తెలుగు మహాసభలలో ఎలాంటి పురోగతి లేదని భావించవచ్చు. వారు కేవలం తీర్మానాలకు ,ఒకరిపై ఒకరు పొగడ్తలతో వేదికను అలంకరిస్తున్నారు .నిజానికి ఎవరు ప్రజలతో మమేకమై ,ప్రజా ఉద్యమాలకు బాసటగా నిలబడి ఉద్యమించడం లేదనీ,అటువంటప్పుడు తీర్మానాలు, ప్రణాళికలు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయని  తెలుగు భాషావేత్తల అభిప్రాయం. ఏది ఏమైనా ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందర్భంగా ,మనందరం ఒకసారి మాతృభాష గురించి మీకు మాట్లాడుకోవడానికి అవకాశం వస్తుందని పరస్పర భావాలను  ఒకరినొకరు పంచుకోవడానికి సహకరిస్తుoదని అనడంలోఎలాంటి అనుమానం లేదు.


అయితే ఇప్పటికీ ,కొన్ని దేశాలలో మొదలిడు చదువు (ఎల్కేజీ) నుండి పెనుపాటి చదువు ( పీజీ) వరకు

సాంకేతిక, వైద్య చదువులుఅన్నీ కూడా వారి మాతృభాషలోనే జరుపుతున్నారు.

కనుక మనమంతా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా అమ్మనుడిని కాపాడుకోవాలి. అలాకాకుండా పరభాష వ్యామోహంలో పడితే, పరభాషను నేర్చి ,దాని వెంట ప్రాకులాడితే ,అనుకోకుండా ఆ భాషతో పాటు, ఆ భాష వారి సంస్కృతి ,సాంప్రదాయాలు మెల్లగా మనలోనికి ప్రవేశిస్తాయి. ఒకసారి చూస్తే మనకే అర్థమవుతుంది. ఇంగ్లీషు ప్రభావం వలన ,వారి మతము ,వారి తిండి ,వారి కట్టుబొట్లు ,వారి సంస్కృతి సాంప్రదాయాలు అన్ని వచ్చి మన సంస్కృతినీ  పక్కకు నెట్టి ,అవి ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి .నిజమా !కాదా!?


కాబట్టి మన జాతి మన సంస్కృతి నిలవాలంటే, మన మాతృభాషలను నిలబెట్టుకోవాలి, మాతృభాష  నిలబడాలి, కలబడాలి, కనబడాలి, వినబడాలి అప్పుడే ఆ భాష వలన జాతి, జాతి వలన దేశము ఒక విశిష్టమైన గౌరవాన్ని పొందుతాయి. జై మాతృభాష. జై జై అమ్మనుడికి కైమొడ్పులు.

*రాఘవ మాస్టారు కేదారి*

పండితుడు

 శ్లోకం:☝️

*ప్రవృత్తవాక్ విచిత్రకథ*

 *ఊహవాన్ ప్రతిభానవాన్ l*

*ఆశు గ్రంధస్య వక్తా చ*

 *యః స పండిత ఉచ్యతే॥*


భావం: మంచి మాటకారి, తన ప్రసంగ చతురతతో ప్రజలను ఆకర్షించగల వ్యక్తి, గ్రంథాలలో విషయాలను త్వరగా గ్రహించి వివరించగల వ్యక్తి, తార్కికంలో నైపుణ్యం ఉన్న వ్యక్తిని పండితుడు అంటారు.

శివయ్య ఇచ్చిన

 🌹🌹శివయ్య    ఇచ్చిన🌹🌹🌹

🌹🌹 శరీరం తిప్పలు, 🌹🌹🌹

☘️☘️☘️☘️🕉️☘️☘️☘️☘️

సూర్యరశ్మి అనేక ప్రదేశాల్లో కిరణాలు ప్రసరింప చేస్తున్న దాని కాంతి నీరున్న చోట ఎక్కువగా అంతకన్నా ఎక్కువ అద్దంలోనూ ప్రతిబింబిస్తుంది! అది నీటి, అద్దం గొప్పదనం కాదు! సూర్యభాగవానుడి గొప్పదనం!  అదే విధముగా నీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణం కావాలి! కాని ఒకరి భాధకు కాని కన్నీళ్లకు కాని కారణం కాకు! ఎందుకంటే అది ఎప్పుడైనా తిరిగి నిన్ను కన్నీళ్లకు గురించేస్తుంది ప్రతి మనిషి మనకంటే, ఉన్నవాళ్ళతో పోల్చుకునే దానికంటే, మనకంటే లేనివారితో పోల్చుకొని తృప్తి పడితే జీవనం శాంతంగా సాగిపోతుంది! మానవ శరీరంలో అన్ని వ్యాధులకన్నా అహంకారం,

తొందరపాటు తనం,మనిషిని

ఇది సోకిన వారు వాళ్ళు సంతోషంగా ఉండలేరు! మానసికంగా కుంగిపోయి, ఎదుటివారిని కూడ సంతోషంగా ఉండనివ్వరు!

ఒక్క విషయం మనం చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగ పదితుంది అలాగే మనo చేసిన మంచి పనికూడా ఏదో ఒక రోజు మనకు ఉపయోగ పడుతుంది! చివరికి చెడిపోయిన గడియారం కూడ రోజుకి రెండు సార్లు కరెక్ట్ సమయాన్ని చూపిస్తుంది! అలాగే ఎన్ని తెలివి తేటలు ఉన్న పరమేశ్వరుడు ఉత్తమ జన్మ ఇచ్చినందుకు సార్ధకత చేసుకొని, పరమేశ్వర లీలలు ఎలా ఉంటాయంటే అన్ని ఉన్న వానికి దురాశని ఇచ్చి, మధ్యతరగతి వానికి ఆరాటన్ని ఇచ్చి ఏమి లేని వారికి అత్మాభి మానాన్ని ఇచ్చి మాయ లీలలు, లీలగా చూపించే శివయ్య మా స్థితి గతులు మార్చవయ్య! శివయ్య నీవిచ్చే ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చేయక పోవడం కాదు! ప్రమాదాన్ని సరిగా మేము అంచనా వేయలేక పోవడం,

అధికమించక పోవడం!


సర్వం    శివార్పణ      మస్తు


కాశీనాధుని సుబ్రహ్మణ్యం

సిద్ధాంతిగారు, విజయవాడ

🌹🌹🌹🌹🕉️🌹🌹🌹🌹

☘️☘️☘️☘️🕉️☘️☘️☘️☘️

భగవద్గీత



🌹భగవద్గీత🌹               


మూడవ అధ్యాయము కర్మయోగము నుంచి 8 వ శ్లోకము. పదచ్ఛేద , టీకా , తాత్పర్య సహితముగా.

    

నియతం కురు కర్మ త్వం 

కర్మ జ్యాయో హ్యకర్మణః ౹

శరీరయాత్రాఽపి చ తే 

న ప్రసిద్ధ్యేదకర్మణః ll(8)


నియతమ్ , కురు , కర్మ , త్వమ్ , 

కర్మ , జ్యాయః , హి , అకర్మణః ౹

శరీరయాత్రా , అపి , చ , తే , 

న , ప్రసిధ్యేత్ , అకర్మణః ౹౹(8)


త్వమ్ = నీవు ;

నియతమ్ = విధ్యుక్తమైన ;

కర్మ = కర్తవ్యకర్మను ;

కురు = చేయుము ;

హి = ఏలననగా ;

అకర్మణః = కర్మలనాచరింప కుండుట కంటె ;

కర్మ = కర్మలను చేయుటయే ;

జ్యాయః = శ్రేష్ఠము ;

చ = మఱియు ;

అకర్మణః = కర్మలనాచరించక పోవుటచే ;

తే శరీరయాత్రా అపి  = నీ శరీరనిర్వహణ కూడా ;

న ప్రసిద్ధ్యేత్ = కొనసాగదు .


తాత్పర్యము :- నీవు శాస్త్రవిహిత కర్తవ్య కర్మలను ఆచరింపుము. ఏలనన కర్మలను చేయకుండుట కంటెను చేయుటయే ఉత్తమము. కర్మలను ఆచరింపనిచో నీ శరీర నిర్వహణము కూడా సాధ్యము కాదు. (8)   


      ఆత్మీయులు అందరికి శుభోదయం

               Yours Welwisher

Yennapusa Bhagya Lakshmi Reddy 

Advocate AP High Court Amaravathi

కలి ఏమియు చేయలేడు

 .              _సుభాషితమ్_


*𝕝𝕝 శ్లో* 𝕝𝕝 

*సదయం హృదయం యస్య*

*భాషితం సత్యభూషితం|*

*కాయం పరహితం యస్య*

*కలిస్తస్య కరోతి కిమ్ ||*


తా𝕝𝕝 *దయతో కూడిన హృదయముండి సత్యవాగ్భూషణుడై పరహితమే పరమావధి పరమాత్మను చేరుటకునే అని నమ్మిన వానిని  ఇక ఆ "*కలి "  ఏం చేయగలడు*?? (కలి ఏమియు చేయలేడు అని భావము)

ప్రణవ ప్రకరణము

 

ప్రణవ ప్రకరణము






       ఇక్కడ ఓంబొమ్మలో 1,2,3,4,5 అంకెలు వేశారు.

శ్లో||
            ప్రథమం తారకంచైవ, ద్వితీయందండ ముచ్యతే |
            తృతీయం కుండులాకారం చతుర్థంచ అర్థ చంద్రికం |
            పంచమం బిందు సంయుక్తం, ఓం ఇతి జ్యోతి స్వరూపం ||

ప్రథమం తారకం చైవ : తారకం అంటే తరింపజేసేది, అని ఒక అర్థం. ఇక్కడ 1అంకె దగ్గర ఓంబొమ్మ చూస్తే ఒక అర్థ చంద్రాకారంగా గొడుగులాగా ఉంటుంది.
ద్వితీయం దండముత్యతే : 2అంకె దగ్గర నిట్టనిలువుగా గీత దండంలాగా ఒక కఱ్ఱలాగా ఉంటుంది.
తృతీయం కుండలాకారం : 3దగ్గర చూస్తే కుండలాకారంగా. కుండకు ఏ కర్వు ఉంటుందో ఆ కర్వు 3దగ్గర ఉంది.
చతుర్థంచ అర్ధచంద్రికం : ‘4’ దగ్గర ఏమో చంద్రుడు పూర్ణ చంద్రుడిపైన సగం తీసివేస్తే అర్థ చంద్రాకారం ఉన్నది.
పంచమం బిందు సంయుక్తం : దాని ప్రక్కన ఒక బిందువు పెట్టాం. బిందువు అంటే సున్నా.
ఓం ఇతి జ్యోతి స్వరూపం : ఇదే జ్యోతి స్వరూపం. జ్యోతి స్వరూపం ఎప్పుడు వచ్చింది? ‘కి పైన ఒక పొల్లుపెట్టాం. అదే జ్యోతి.

       కి పైన పొల్లుకు అంకె వెయ్యలేదు. పొల్లు లేదు. 1, 2, 3, 4, 5 చెప్పినప్పుడు పొల్లు చెప్పలేదు. అదే జ్యోతి స్వరూపం. ఈ జ్యోతి స్వరూపమే ప్రణవం. ప్రణవానికి ఓంకారానికి ఏమిటి తేడా? ‘ఓంకారం యొక్క అవ్యక్త స్థితి ప్రణవం. ప్రణవం యొక్క వ్యక్త స్థితి ఓంకారం. ఓంలో కార, ‘కార, ‘కార మాతృకలున్నాయి. ప్రణవం దగ్గర  ఏ మాతృకా లేదు. ఏ మాతృకా కాని ప్రణవం అమాతృక. ఒక రకంగా అమాతృకా ప్రణవం ఏమిటంటే, నాదము. నాదమంటే శబ్దము యొక్క అవ్యక్త స్థితి ప్రణవం. ఓంయొక్క అవ్యక్త స్థితి ప్రణవం. నిశ్శబ్దమే శబ్దంగా మారిందా? నిశ్శబ్దమే నిశ్శబ్దంగా ఉండగా, శబ్దాలు వచ్చాయా? మీరందరు ఆలోచించండి. నిశ్శబ్దం, నిశ్శబ్దంగా ఉండగా, నిశ్శబ్దమందు కొన్ని శబ్దములు వచ్చి, ఆ శబ్దములే ఆగిపోయినవా? ఎప్పుడూ నిశ్శబ్దమే రాజ్యమేలుతోంది. అప్పుడు సృష్టి లేదు. నిశ్శబ్ద బ్రహ్మమే శబ్ద బ్రహ్మగా మారాడు. అంటే శబ్దము నిశ్శబ్ద బ్రహ్మయందు అవ్యక్తంగా ఉన్నది. అప్పుడు నిశ్శబ్ద బ్రహ్మ నుండి శబ్దం వ్యక్తమైనది.

       శబ్దం ఏ రకంగా ఉంది? ముందు ఆ...ఆ...ఆ..అని వ్యక్తమైనవి. నోరు సున్నా ఆకారంలో పెట్టితే ఊ...ఊ...ఊ... అని వ్యక్తమైంది. పెదవులు రెండు మూస్తే మ్‌అని వ్యక్తమైంది.

       మూసి అలాగే ఉంచితే కారం కొనసాగేలా, ‘మ్‌అనే శబ్దం వచ్చింది. లో ఒక శబ్దం ఉన్నది. లో కూడా శబ్దం ఉంది. మ్‌అనటంలో కూడా ఒక శబ్దం ఉన్నది. అకార, ఉకారం, మకారం అనడం అంతా పూర్తి అయిన తరువాత కూడా ఓ...మ్‌అని శబ్దం కంటిన్యూ చేస్తున్నాం. ఒక మూగవాడు అ, , మ అని అనగలడా? మూగవాడు అనలేడు. మాట బయటికి వ్యక్తం కానివాడు శబ్దం బయటకు వ్యక్తం చేయలేనివాడు అనలేడు. ఎవరైతే శబ్దం బయటకు వ్యక్తం చేయడో వాడికి మాటలు రావు. అప్పుడు ఎట్లా అంటాడు? అదే మాటలు వచ్చినవాడు ఎలా అంటాడు? ఆఆఆ, ఊఊఊ మ్‌మ్‌మ్‌ అంటాడు. ఆ ఊమ్‌ అంటానికి ముందు వీటియందు అన్నిటిలో ఒక శబ్దం ఉంది. ఆ శబ్దమే తురీయం. ఈ శబ్దం అవ్యక్తంగా ఉన్నప్పుడు తురీయాతీతం. అందుకే ఇప్పుడు ఏమి చెయ్యాలి.  ఆ...ఆ... అంటూ ఉలోకి మారండి. ఆ..ఆ...ఊ.. అంటూ ఊలో నుండి మ్‌కు వెళ్ళి ఊఊ....మ్‌ అనండి. మకారం అయిన తరువాత వట్టి శబ్ద కంటిన్యూ చెయ్యండి. ఆ...ఊ...మ్‌... అనేది ఆగితే కేవలం ఒక శబ్దం ఉంటుంది. అదే తురీయం. మాట మొదలు పెట్టాక ముందు ఏమున్నది? నిశ్శబ్దం. నిశ్శబ్దం శబ్దంగా మారలేదు. నిశ్శబ్దమందు వేరుగా శబ్దములు కలిగి మళ్ళీ ఆగినవి. శబ్దానికి శబ్దానికి మధ్య నిశ్శబ్దమే ఉన్నది. నిశ్శబ్దం బ్రహ్మ ముచ్యతే.

       కారం అంటే స్థూలము, ‘కారము అంటే సూక్ష్మము. కారం అంటే కారణము స్థూల, సూక్ష్మ, కారణాలే, అకార, ఉకార, మకారాలు. అఉమ్‌లో కామన్‌గా ఉన్న శబ్దమే తురీయం. శబ్దం యొక్క అవ్యక్త స్థితి ప్రణవం. అంటే ప్రణవంలో శబ్దం అవ్యక్తంగా ఉన్నది. కనుక ప్రణవము నిశ్శబద్ద బ్రహ్మ కాదు, శబ్ద బ్రహ్మమే. తాత్కాలికంగా శబ్దం అవ్యక్తంగా కలిగినవాడు ప్రణవ స్వరూపుడు. ప్రణవ స్వరూపుడు తాత్కాలికంగా నిశ్శబ్దంగా ఉన్నా, శబ్ద బ్రహ్మ అందులో అవ్యక్తంగా ఉండి వ్యక్తమయ్యేసరికి అ,,మ కారములుగా వ్యక్తమయ్యాడు. ఈ ఓంకారమునకు అంతరార్థము చెప్పుకుందాము.

ప్రథమం తారకంచైవ: తారక యోగంలోకి వెళ్ళామండి.
ద్వితీయం దండముచ్యతే : వెన్ను దండాన్ని వెన్నుపూసను నిట్టనిలువుగా ఉంచాము.
తృతీయం కుండలాకారం : నిట్టనిలువుగా ఉన్న వెన్ను పూసలో కుండలి శక్తిని మేలుకొలిపాము. మూలాధారం నుండి పైకి  ప్రయాణం చేస్తున్నాము.
చతుర్థకం అర్థ చంద్రికం : అర్థచంద్రికం అంటే సహస్రారం పైన ద్వాదశాంతమున ఒక చంద్రకళా స్థానమున్నది. ఆ చంద్ర కళాస్థానమే అర్థ చంద్రిక.
పంచమం బిందు సంయుక్తం : బిందువుతో కల్సిపోయినది. బిందువుతో కలవడం వలన ఏమైంది. అర్థనారీశ్వరి యొక్క దర్శనం జరిగింది. శివుడు పార్వతి. అనగా ప్రకృతి పురుషులు కలయికగా ఉన్నట్టి చిత్‌ జడం, రెండు కల్సినటువంటి దర్శనం జరిగింది. ఓంకారం రూపంలో ఈ మాదిరిగా వచ్చింది. మళ్ళీ కి పొల్లుగా ఉన్నది ఏదో అదే జ్యోతి. 

       తారక యోగంలో ప్రవేశించి వెన్నుపూసను నిట్టనిలువుగా దండలాగా పెట్టి లోపల కుండలిశక్తిని జాగరణ చేసుకొని సహస్రారం దాకా ప్రయాణం చేసి అర్థనారీశ్వరుని దర్శించి, చంద్రకళా స్థానానికెళ్ళి జ్యోతి దర్శనం చేసుకోవాలి.

       ఇప్పటివరకు చెప్పినది ఒకసారి చూస్తే, ప్రణవమందు శబ్దం అవ్యక్తంగా ఉన్నది. ప్రణవం నిశ్శబ్దం బ్రహ్మ కాదు. ప్రణవమందు శబ్దం అవ్యక్తంగా ఉన్నది. ప్రణవమునుండి నాదం వచ్చింది. ప్రణవనాదము బ్రహ్మనాదము అంటారు. ప్రణవం నుండి నాదం వచ్చింది. ఆ నాదంలో కళలు లేవు. అ,,మలు ఎప్పుడైతే వచ్చినవో ఆ నాదం కళలతో కూడినది. ఆ కళలు అవ్యక్తంగా ఉండి సృష్టి బిందువుగా ఏర్పడి ఉంది. ఆ బిందువు నుండి అకార ఉకారమకారమనే కళలు వ్యక్తమయ్యాయి. ఈ విధముగా నాద బిందు కళలు మూడు వచ్చినవి. సృష్టి బిందువే వ్యాపించి సృష్టి బిందువునుండి విమర్శ బిందువు వచ్చి ఆ విమర్శ బిందువు నుండి మిశ్రమ బిందువు వచ్చి మూడు బిందువులయందు ప్రకాశం, మండలత్రయ ప్రకాశమై, ఆ మూడు బిందువులు త్రికోణముగా, త్రిభుజముగా కల్సినపుడు, అంతర దీపికగా ఒక ఎరుక పుట్టింది. అదే ప్రజ్ఞ.       

       ఎరుక పోవాలంటే ఏమి కావాలి? నిశ్శబ్ద బ్రహ్మ కావాలి. ప్రణవం ఏమిటి? శబ్దంయొక్క అవ్యక్త స్థితి, వ్యక్త స్థితి ఎలా ఉన్నది? త్రిపుటులుగా దృక్కు, దృశ్యము దర్శనములుగా, జ్ఞాత జ్ఞానము జ్ఞేయముగా, ధ్యాత ధ్యానము ధ్యేయముగా, అకార ఉకార మకారములుగా, స్థూల సూక్ష్మ కారణాలుగా, విరాట్‌, హిరణ్యగర్భ, అవ్యాకృతులుగా, విశ్వ తైజస ప్రాజ్ఞులుగా, అకార ఉకార మకారములును ఇన్ని రకాలుగా ఇన్ని త్రిపుటులుగా భావన చేస్తే ఈ మూడు రకాలుగా వచ్చిన యావత్‌ సృష్టియందు ప్రణవము సర్వ వ్యాపకముగా ఉన్నది. అందువలన ఈ సృష్టి యావత్తు ప్రణవాత్మకం. ఈ ప్రణవమే అన్నిటియందు వ్యాపించి ఆత్మగా, అన్నిటికీ కేంద్రంగా, అన్నిటికి అంతరాత్మగా ఉన్నది. అకార మాతృకలో ప్రణవం ఉన్నది. ఉకార మాతృకయందు ప్రణవం ఉన్నది. మకార మాతృకయందు ప్రణవం ఉన్నది. అర్థ మాతృకలో కూడా ప్రణవం ఉన్నది. అది అ మాతృక అయినప్పటికీ కూడా శబ్దం యొక్క అవ్యక్త స్థితి ఉన్నది.

       అసలు బ్రహ్మ ఎలా ఉన్నాడు? ముందు నిశ్శబ్ద బ్రహ్మగా ఉన్నాడు. తరువాత నాద బిందు కళగా ఉన్నాడు. కి కుడి ప్రక్క సున్నాలో చేర్చితే ఓం అయినది. ఓం నుండి సృష్టి వచ్చినది. ఓం యే మహత్తు. మహత్తు నుంచే మహదహంకారం ద్వారా సృష్టి వచ్చింది. ఓం నుండి మూడు గుణాల సృష్టి వచ్చింది. అకార ఉకార మకారాలే మూడు గుణాలు. ఓం నుండి త్రిపుటి వచ్చింది. ఓం నుండి జ్ఞాత జ్ఞేయం జ్ఞానం వచ్చినవి. ఓం నుండి స్థూల, సూక్ష్మకారణ సృష్టి వచ్చింది. ఓం నుండి మూడవస్థలు వచ్చినవి. వ్యష్టిలో సమష్టిలో కూడా జీవుడికి ఈశ్వరుడికి కూడా ఓంయే మూలం. సృష్టికి ఓంయే మూలం. అప్పుడు ప్రవణము ఆధార బ్రహ్మ అయ్యాడు.

       జగత్తుకు మూలం ఓంకారము. ఓం తనకు తానే పుట్టింది. నిశ్శబ్దంలోనుండి శబ్దం తనకు తానే వచ్చింది. నిశ్శబ్దం ఎప్పుడూ రాజ్యం ఏలుతుంది. అప్పుడప్పుడు శబ్దాలు వాటికవే వచ్చి మరల అణిగిపోతున్నాయి. శబ్దాలు పుట్టి అణిగిపోతున్నాయి. శబ్దాలు పుట్టి అణిగే లోపల మరో శబ్దం పుట్టేలోపు గ్యాప్‌లో నిశ్శబ్దమే ఉన్నది. శబ్దాలు ఎప్పుడూ లేనపుడు, శాశ్వతంగా నిశ్శబ్దమే ఉన్నది. త్రిపుటిలయొక్క ఎరుక, అనగా జ్ఞాత అనే ఎరుక, జ్ఞేయమనే ఎరుక, జ్ఞానమనే ఎరుక లేనపుడు బయలే ఉన్నది. జ్ఞాత జ్ఞాన జ్ఞేయముల యొక్క ఎరుకయొక్క గ్యాప్‌లో కూడా బయలే ఉన్నది. ఈ బయలంటే ఏమిటి? అన్ని రకాలుగా ఏమీ లేదు. ఏమీ లేదు. ఏమీ లేదు. బయలంటే ఎరుక పద్ధతిలో ఏమి చెప్పినా ఏమీలేదు. ఎరుక పద్ధతిలో చూసేవన్నీ ఏమీలేదు అనే దానికి సున్నా గుర్తు. కనుక బయలును ఎలా చూడాలి? నీకు తెల్సివన్నీ ఏమీలేవు అనే పద్ధతిగా చూస్తే సున్నా. కనుక ఈ ఓంకి వెనుక నిశ్శబ్ద బ్రహ్మ ఎలా ఉన్నాడు? సున్నాగా ఉన్నాడు? ఒకవేళ సున్నాయే నీవై నిశ్శబ్ద బ్రహ్మమే నీవై దృశ్య తాదాత్మ్యత లేకపోతే, దృశ్యాత్మ కాకపోతే, దృగాత్మ కూడా కాకపోతే, ఏమై ఉన్నావు? నీవు సున్నాగా ఉన్నావు. అంటే బయలుకు సంకేతం అయింది. అప్పుడు బయలైంది. గురువుగారు నీ వెనుక నీ మూలం ఏమిటి? అన్నారు. సున్నా! అంటే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీలేదు అని. ఈ విధముగా బయలును సూచించడానికి ‘‘ంఓం’’ అని సంకేతముగా చూపించడమైనది. నీ మూలం ఒకసారి చూసుకో అన్నారు. గొడ్రాలి బిడ్డ సామెతగా నీకు తల్లి లేదు, తండ్రి లేరు. నీ మూలం సున్నా అన్నాడు. నీ మూలాన్ని ఎప్పుడైతే సున్నాగా చూచావో అప్పుడు నీవే లేకుండా పోయావు. నీకు మూలం లేదు. కాని ఉన్నానంటున్నావు. ఎలా వున్నావు? ఉన్నాననుకుంటే ఉన్నావు. లేననుకుంటే లేవు. యత్‌భావం తత్‌ భవతిగా ఉనికిలోకి వచ్చావు. నీవు అభావం అయితే లేనేలేవు. నీ సంగతి ఇది! ఉన్నానుకుంటే ఉన్నావు. లేదనుకుంటే లేవు కనుక ఉండడము కల్ల. ఉండడము భ్రాంతి. అనుకోకపోవడం వల్ల ఉండటం ఏమిటి? అది భ్రాంతి. అనుకోవడంవల్ల లేకపోవడం ఏమిటి? ఏమి అనుకోకపోతే నీవు ఏమి లేవన్నమాట!

       ఏమి అనుకోకపోతే ఏమీలేదు అంటే నీవు నాదబిందు కళాతీతము. నీవు ప్రణవాతీతము నీవు నిశ్శబ్ద బ్రహ్మము. అదే బయలు. అందుకే ఓంకి వెనుక ప్రక్కన సున్నా పెట్టేసి, ఎడమ ప్రక్కన సున్నా పెట్టేసి నీకు మూలం లేదని నీ మూలాన్ని చూచుకో అని గురువుగారు పరబయలు చూపిస్తున్నారు. మూలం లేని గుర్తు ఎరిగే నేనేలేనప్పుడు నేననేఎరుక మాయ. కనుక నేనుపోవాలి. నా అంతట నేను పోలేను. కనుక లేకనే తోచిన నేనులేదని నిర్ణయమై నేను లేనని తెలిశాక భ్రాంతి రహితమై నేనేలేకుండా పోవాలి. లేనిదే ఉన్నట్లు తోచింది. లేనిదే లేకుండా పోతుంది. దేనిలోనుంచి వస్తే తిరిగి దాంట్లోకి పోతుంది. దేంట్లోనుంచి రాలేదుగా! అష్ట ప్రకృతుల లయం అంటే ఏమి చేశాము? కర్మేంద్రియాలను, విషయాలను, జ్ఞానేంద్రియాలను, పంచ ప్రాణాలను, అంతఃకరణ చతుష్టయాన్ని, జ్ఞాతను, వీళ్ళందరిని సూక్ష్మ భూతాలలోకి లయం చేశాము. వాటిని మహదహంకారంలోను, మహదహంకారంను మహత్‌లో, మహత్‌ను ప్రణవంలోను దానిని అవ్యక్తంలో లయం చేశాము. అవ్యక్తం మళ్ళీ తిరిగి వ్యక్తమవుతుంటే ఇక్కడే పరిపూర్ణ బోధ కావాలి. నీకు మూలం లేదని మహత్‌ వెనుక సున్నా చూపిస్తూ మహదహంకారమై, అష్ట ప్రకృతుల సృష్టి లేకుండా ఉండాలంటే తిరిగి రాకూడదు అంటే ఏమి చెయ్యాలి? మహత్‌గా ఉన్నప్పుడే నాకు మూలం లేదని షోడశి మంత్రం చెప్పుకోవాలి. అకార, ఉకార, మకార మాతృకల సృష్టి అంతా కూడా మిథ్య అని, ఓంకారం ద్వారా వచ్చిన సృష్టి అంతా మాయాకల్పితమని, లేకనే ఉన్నట్లు తోచినది తెలుసుకోవాలి. మూలంలో ప్రణవం కూడా ఈ రకంగా అభివ్యక్తమవుతుంది. కనుక అది కూడా మాయద్వారా కల్పితమే. కాబట్టి విచారిస్తే ఏమీ లేదు అనేది నిర్ణయం. ఏమీ లేదు. అనేదే బయలు.

       ఓంకారేశ్వరుని ఓంకారాన్ని ఉపాసనగా చేసి ప్రణవోపాసన చేసి బ్రహ్మ జ్ఞానం పొందుతానంటే పొందవచ్చు. ప్రణవోపాసన, బ్రహ్మోపాసన అనేది చెయ్యవచ్చు, కాని అది ఎరుక బ్రహ్మమే. బయలు నిర్ణయం కాదు. పరబ్రహ్మ నిర్ణయం కాదు. పరబ్రహ్మ నిర్ణయం కేవలం శ్రవణ, మనన, నిదిధ్యాసల వల్లనే అవుతుంది. కుండలిని జాగరణ వలన కాదు, శ్వాసమీద ధ్యాస, ధ్యానం వలన కాదు. ఈ ధ్యానం అంతా కూడా ఒక ధ్యాన వస్తువుమీద పెట్టారు. ధ్యాన వస్తువు కూడా కల్పితమే. ఓంకారమే కల్పితం అయ్యాక, కల్పిత ఓంకారంతో ఉపాసన చేస్తే కల్పిత బ్రహ్మమే అవుతావు కదా! ఓంకారం వలన అకార, ఉకార, మకార శబ్దములు వస్తే శబ్ద బ్రహ్మమే అవుతావు గదా! నిశ్శబ్ద బ్రహ్మ అయినా గాని శబ్దము యొక్క అవ్యక్త స్థితిలో ఉన్న నిశ్శబ్దం అయితే, మళ్ళీ వ్యక్త బ్రహ్మలోకి శబ్ద బ్రహ్మలోకి వచ్చి ఎరుక బ్రహ్మ అవుతావు గదా! కనుక నీకు మూలం లేదనప్పుడు వెనుక సున్నా పెట్టుకుంటే వ్యక్తా వ్యక్తములు రెండు కానిది ఏదో, అది బయలు. ఆ బయలు నిర్ణయాన్ని మనం గురు కృపతో తెల్సుకొని దృఢం చేసుకోవాలి. కనుక ప్రణవ ప్రకరణం అని ఏదైతే చెప్పామో అది అచల పద్ధతికి తిప్పాము. ఈ అచల పద్ధతికి తిప్పితే ఓంకారోపాసన ప్రణవ బ్రహ్మ ప్రణవేశ్వరుడు అయ్యేదాకా పనికి వస్తుంది. కాని ఆ తరువాత పరిపూర్ణ బోధలో ప్రణవము కూడా లేనిది అని తెలియాలిగా! కనుక అమాతృక అంటే అకార మాతృక లేదు. ఉకార మాతృక లేదు. మకార మాతృక లేదు. తురీయంలో ఉన్న అర్థ మాతృక లేదు. తురీయాతీతమైన అవ్యక్తము, లేక ప్రణవము లేదు. అది తిరిగి వ్యక్తం కాకపోతే అదే బయలు. అదే పరబ్రహ్మ. పరబ్రహ్మ నిర్ణయానికి ఓంకారమనేది ఒక సోపానము. ఓంయే మాయ ద్వారం. ఓంయొక్క అవ్యక్త స్థితి ప్రణవము. కనుక ప్రణవాతీత పరబ్రహ్మము అంటే బయలే. సాధనలన్నీ ప్రణవంతో ఆగిపోయినవి. ఆ పైన పరబ్రహ్మ అవ్వాలంటే ‘‘ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు’’ అని మొదలుపెట్టాము.

       ఇంతవరకు చెప్పిన బోధ అంతా శబ్ద ప్రమాణంగా జరిగింది. శబ్ద ప్రమాణమే శృతులు, శృతులే వేదాలు. కనుక వేదాలు వేదాంత పద్ధతిలో శృతి, స్మృతి పద్ధతిలో సాధనా పద్ధతులలో చేసిందంతా కూడా ప్రణవం వరకే. ప్రణవాతీత స్థితికి తీసుకెళ్ళాలంటే ఏ సాధన పనికిరాదు. గురుశిష్య న్యాయంగా జరగాలి. ఈ గురు శిష్య న్యాయంగా జరగాలంటే స్థూల దృష్టి, సూక్ష్మాతి సూక్ష్మ దృష్టిగా మారాలి. అప్పుడు చతుర్విధ శుశ్రూషలు స్థూలంగా కాకుండా సూక్ష్మంగా కూడా కాకుండా అశరీర పద్ధతిలో చెయ్యాలి. అశరీర పద్ధతిలో అంగ శుశ్రూష, అశరీర పద్ధతిలో స్థానశుశ్రూష, అశరీర పద్ధతిలో భావ శుశ్రూష, అశరీర పద్ధతిలో ఆత్మ శుశ్రూష చేసినప్పుడు అశరీరం పద్ధతిలో గురువులో మమైకం అవ్వడం ద్వారా, ఎరుక విడుస్తావు. దానికి ముందు గురువు పరబయలు దర్శింపచేసి ఎరుకను విడిపిస్తాడు. ఇక్కడితో ఈ జ్యోతి స్వరూపం అంతా కూడా ఎరుకే నుక, జ్యోతికి పరమైనది పరంజ్యోతి. ఈ పరంజ్యోతి సంగతే పరిపూర్ణ బోధగా అచల సిద్దాంతం అక్కడ మొదలవుతుంది. దీన్ని వేదాంతాతీత బోధ అంటారు. పరిపూర్ణ బోధను వేదాంతీత బోధ అంటారు. ఇంతవరకు జరిగినది ప్రబోధఅయితే ఆ వేదాంతాతీత బోధను నిజప్రబోధఅంటారు.

       ప్రణవముఅంటే అవ్యక్త శబ్దము. ఓంఅంటే శబ్దము ధ్వనిగా ఉన్నది. ధ్వని రూపములో బహిర్గతమైనది ఓం’. బహిర్గతము కాకమునుపు ఉన్నటువంటిది అవ్యక్త శబ్దము అది. ప్రణవమువ్యక్తావ్యక్తములు రెండూ కాని నిశ్శబ్ద బ్రహ్మమే అన్ని కాలాల్లో మార్పు చెందకుండా ఉన్నది. నిశ్శబ్దమందు శబ్దములు ఉత్పన్నమై మళ్ళీ నశిస్తూ ఉంటాయి. శబ్దములు సృష్టించబడి లయం చెందుతూ ఉంటాయి. శబ్దములకే ఆది, అంతము ఉన్నది. నిశ్శబ్దము శాశ్వతము. నిశ్శబ్దము శబ్దముగా మారలేదు. నిశ్శబ్దము నిశ్శబ్దముగానే శాశ్వతముగా ఉండగా, ఒక శబ్దము ఉత్పన్నము కావడానికి ముందు అవ్యక్త స్థితిలో, తరువాత మహత్‌ స్థితిలో, తరువాత కార, ‘కార, ‘కారములుగా వ్యక్తమైనది. అవ్యక్తస్థితిలో ఉన్నదానిని నాదముఅంటాము. దానినే ప్రణవముఅంటాము, ‘ప్రణవనాదముఅంటాము. వ్యక్త స్థితిలో ఉన్నదేమో ధ్వని రూపంగా ఉన్నది. దానిని ఓంకారముఅంటాము. ఓంమహత్తు. మహత్తునుండే సృష్టి ప్రారంభం అయినది. ఓంబిందువునుండి సృష్టి ప్రారంభమైనది. మహత్తుఅన్నా ఓంబిందువన్నా ఒక్కటే! తిరుగు ప్రయాణంలో మనమందరం ఓంబిందువుకు చేరాలి. ఓంనుంచి అవ్యక్తంకావాలి. ఓంకారంనుంచి ప్రణవ స్వరూపముకావాలి.

       ఓం ఇతి జ్యోతి స్వరూపం  జ్యోతిఅంటే ప్రకాశిస్తుంది అని అర్థము. ప్రకాశము అంటే పరమాత్మగా ప్రకాశిస్తుంది. పరమాత్మ ప్రకాశమది. ఆత్మ ప్రకాశము, బ్రహ్మ ప్రకాశము, పరమాత్మ ప్రకాశము, అదీ జ్యోతి అంటే! ఇంకో శబ్దములో తరించాలి అంటే, వెన్నుపూసని నిట్టనిలువుగా పెట్టుకుని, కుండలనీ శక్తిని జాగరణ చేసి, సహస్రారమందున్నటువంటి సహస్రదళ స్థానానికి లక్ష్యం పెట్టుకుని, తురీయంలోకి వెళ్ళాలి.

       మూడు అవస్థలలో ఉండి, మూడవస్థలకి అతీతముగా కూడా ఉండేది తురీయము’. నిశ్శబ్దము మూడు అవస్థలలో ఉంది. మూడవస్థలకి సాక్షిగా ఉంది. నిశ్శబ్దముతనకు తానే నిశ్శబ్దముగా శాశ్వతముగా ఉంది. అదీ తురీయమంటే. శబ్దముఒకప్పుడు ఉంటోంది, ఒకప్పుడు ఉండడం లేదు. కార, ‘కార, ‘కారములుగా మూడు రకాల శబ్దాలు ఉంటే, ఈ మూడు రకాల శబ్దాలకు మూలమైనది నాదం’. నాదమే తురీయము’. నాదాంతములో నాదము అంతమైతే నిశ్శబ్దముఉంది. నిశ్శబ్దమేమో శాశ్వతము. నిశ్శబ్దములో పరిణామము లేదు. నిశ్శబ్దములో వికారము లేదు. నిశ్శబ్దములోనుంచి ఏమీ పుట్టలేదు. నిశ్శబ్దములో ఏమీ లయం కాదు. శబ్దమే తనకు తానే పుట్టి, తనకు తానే కళల రూపములో ఉండి, ఆ ధ్వని తనకు తానే లయం అవుతూ ఉంటుంది. కనుక  కార, ‘కార, ‘కారములని ఎలా తీసుకున్నప్పటికీ, ‘ధ్యాతయొక్క ప్రకాశము, ‘ధ్యానముయొక్క ప్రకాశము, ‘ధ్యేయవస్తువుయొక్క ప్రకాశము. అలా తీసుకుంటూ విశ్వ, తైజస, ప్రాజ్ఞుల యొక్క ప్రకాశముగా తీసుకోవచ్చు. విరాట్‌, హిరణ్యగర్భ, అవ్యాకృతుల ప్రకాశముగా తీసుకోవచ్చు. స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలుగా, స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా తీసుకోవచ్చు. ఈ కార, ‘కార, ‘కార మాతృకలు ఇప్పుడు చెప్పిన అన్నిటికికూడా సంకేతము.

       లింగము’, ‘గుర్తుఅంటే సంకేతము. ఈ సంకేతాలన్నీ కూడా ఈ గుర్తులు అన్నీ కూడా ఎఱుకే’. ‘గుర్తులేకపోతే, ‘ఎఱుకలేకపోతే, ‘శబ్దములేకపోతే, ‘విశ్వ తైజస ప్రాజ్ఞుల అనుభవంలేకపోతే, ‘తురీయానుభవముకూడా లేకపోతే అప్పుడు ఏ అనుభవము కూడా లేకపోతే, ఏ ప్రపంచానుభవము లేకపోతే, ఏ శరీర సంబంధానుభవములు లేకపోతే, ఏ ఇంద్రియ సంబంధ అనుభవములు లేకపోతే, ఊహ లేకపోతే, ఆలోచన లేకపోతే, సాక్షిత్వము లేకపోతే ఇవన్నీ లేకపోతే ఏదైతే ఉన్నదో, అది ప్రణవాతీతము. అది పరబ్రహ్మము. అది తురీయాతీతము. తురీయాతీతమే పరబ్రహ్మ. సాధనలో ఏమిటంటే, తురీయాన్ని దాటి, తురీయాతీత స్థితిలో మనం ఉంటే, మనం ఆ పరబ్రహ్మమే.

       ఇక్కడ అతీతమైన మాట వాడుతున్నాము. తురీయాతీతము, ప్రణవాతీతము అని. వ్యక్తావ్యక్తములుగా ఉన్న శబ్దానికి కూడా అతీతము. ఆ అతీతస్థితినే పరము అంటాము. ఆ పరమైనదే పరబ్రహ్మ. ఆ పరమైనది ఉన్నది ఉన్నట్లున్నది. కనుక ఓంకి వెనుక ప్రక్క ఒక సున్నా పెడితే, ఆ సున్నాయే పరం. ప్రణవమే సృష్టికి మూలము, మూలాధారము, మూలకారణము, మూలకారణాంశము. ఈ సృష్టి అంతా కూడా మూలకారణమైన ఓంయొక్క అంశము ఉన్నది. అంటే, ప్రతీ దాంట్లో స్థూల సూక్ష్మ కారణాలు కలిసి ఉన్నాయి. స్థూలం ఏమో కార్యరూపంలో అనుభవానికి పనికి వస్తుంది పనిముట్టుగా! సూక్ష్మమేమో అనుభవిస్తుంది. కారణంఏమో ఏ అనుభవం రావాలో, ముందస్తుగా వాసనా రూపంలో ఉండి, ఆ కారణము. కార్యరూపము కాగానే, అనుభవాలు వస్తూ, పోతూ ఉంటాయి. కనుక కార్యకారణాలు ఉన్నంత వరకూ, అవి ప్రణవానికి, ఓంకారానికి లోబడి ఉన్నాయి.

       కార్య, కారణాలకి అతీతమైనది, పరమైనది, ఈ ప్రణవానికి, ఓంకారానికి ఎట్టి సంబంధము లేకుండా తనకు తానే స్వతఃసిద్ధమై ఉండి, దాని నుండి ప్రణవము పుట్టలేదు. దాని నుండి ఓంకారము పుట్టలేదు. అందువల్ల ప్రణవ స్వరూపుడికి, ఓంకార స్వరూపుడికి ఆ పరబ్రహ్మము మూలము కాదు. ఇలా మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదుఅంటే, ఆ ప్రణవ స్వరూపుడికి చెబుతున్నమాట. క్రింద నుంచి చెబుతున్నాము. మూలం లేని గుర్తెరిగే స్థూల శరీరము ఏమీ లేదు’, ‘మూలం లేని గుర్తెరిగే సూక్ష్మ శరీరము ఏమీ లేదు’, ‘మూలం లేని గుర్తెరిగే కారణ శరీరము ఏమీ లేదు’, ‘మూలం లేని గుర్తెరిగే విశ్వ తైజస ప్రాజ్ఞులు ఏమీ లేరు’, ‘మూలం లేని గుర్తెరిగే విరాట్‌, హిరణ్యగర్భ, అవ్యాకృతులు ఏమీ లేరు’, ‘మూలం లేని గుర్తెరిగే క్షరాక్షరులు ఏమీ లేనే లేరు’. ముందుగా సంకల్పమే అవ్యక్తముగా ఉండి, సంకల్ప రూపంలో తిరిగి వ్యక్తమౌతుంది కనుక విస్మృతిగా ఉన్నప్పటికీ, అవి అవ్యక్తముగా ఉన్నటువంటి స్మృతులే. స్మృతి రూపంలో వ్యక్త రూపంలో బహిర్గతమౌతున్నాయి. కనుక స్మరణ, విస్మరణలు లేవు.

       క్షేత్రము, క్షేత్రజ్ఞుడు లేడు. క్షరము, అక్షరము లేదు. ఇట్లా అష్ట తనువులు లేదు. స్థూల, సూక్ష్మ, కారణాలే కాకుండా విరాట్‌ హిరణ్యగర్భ అవ్యాకృతులే కాకుండా, తురీయంలో ఉన్న ప్రత్యగాత్మ, పరమాత్మలు కూడా ఈ తురీయమే సర్వకారణము.  ఈ తురీయమే కారణము, మహాకారణము. కనుక స్థూల, సూక్ష్మ, కారణ సృష్టికి తురీయం మూలమైంది. ఆ తురీయంగా, మూలంగా ఉన్నటువంటి ప్రణవము. ఓంకారానికి అవ్యక్తంగా ఉన్నది. అనాహత శబ్దమే ప్రణవము, ఆ తరువాత ఉపక్రమించేటటువంటి, ఉపక్రమణకు, ఆ తరువాత విజృంభించేటటువంటి గుణమయ ప్రపంచానికి, నామ రూప వస్తువులకి కారణమైంది. కాని, దానికి కారణమేంటి? ప్రణవానికి కారణమేంటి? ఆ ప్రణవం పైన ఏదైతే ఉందో, అతీతంగా ఏదైతే ఉందో, ‘పరంఅనే పేరుతో ఏదైతే ఉందో, అది స్వతఃసిద్ధంగా, దానికదే ఉండి, ‘ఏకమేవా అద్వయం బ్రహ్మగా ఉండి, దానియందు నానా అస్తి న కించనఃనానా రకాలుగా ఏదైనా కాని, ఏ ఒక్కటి కూడా అస్తిత్వాన్ని పొంది ఉండలేదు. కనుక ఈ అస్తిత్వము, నానాత్వము భేదాలతో వచ్చినటువంటివి అన్నీ కూడా ఓంకారము వల్లే స్థూల, సూక్ష్మ, కారణ సృష్టిగా, ఆ సృష్టియే స్థూల రూపం వచ్చేసరికి, నామ, రూప, వృత్తి నటనలుగా ఉంటున్నది. మోక్షము కావాలంటే, వీటి అతీత స్థితికి వెళ్ళాలి. అతీత స్థితి వీటికి మూలమా? కాదా? ఇంతసేపూ మనం చెప్పుకునేది ఏమిటంటే, దీనికి అతీతంలో మూలం లేదని, క్షేత్రజ్ఞుడు అయిన వాడు, అక్షర పరబ్రహ్మ అయినవాడు, ప్రత్యగాత్మ అయినవాడు, పరమాత్మ అయినవాడు ప్రణవ స్వరూపుడు అయినవాడు కూడా తనకు మూలంలేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని, తాను గొడ్రాలి బిడ్డ సామెతగా, తాను లేకనే ఉన్నట్లుగా తోచాడని, తాను కూడా మాయా కల్పితుడే అని తెలుసుకుని, తాను దృక్‌ మాత్రమయినటువంటి ఎఱుక, తాను దృశ్యమైన ఎఱుక దృశ్య తాదాత్మ్య రూప ఎఱుక, సకల ఎఱుకలనుండి అతను విడుదల పొందాలి.

       ఎఱుకే లేక ఉన్నట్లు తోచింది కాబట్టి, ఎఱుకకు మూలం లేదు. ఎఱుక దృశ్యం కాదు. ఎఱుక దృశ్యం అయినదంటే అది భ్రాంతి. ఎఱుక దృశ్యం కాలేదు అంటే అది అవ్యక్తము, ఎఱుక యొక్క అవ్యక్త స్థితి. లేనెఱుకే అవ్యక్త స్థితిలో ఘన రూప అఖండ ఎఱుకగా ఉండి, వ్యక్త స్థితిలో ఖండ ఎఱుకలై, మూడు గుణాల చేత, మూడు ఖండ ఎఱుకలై, తమో గుణం చేత, జడజగత్తు అనే ఎఱుకయై, రజోగుణం చేత జీవుల, ప్రాణుల ఉనికిగా ఎఱుక పుట్టి, సత్వగుణ ఎఱుక త్రిమూర్తులుగా, అధిష్ఠాన దేవతలుగా, ఈశ్వరుని యొక్క ఇంద్రియాలైన అధిష్ఠాన దేవతలుగా ఉన్నది. ఈ సత్వగుణ ఎఱుకనేమో కేవలపుటెఱుక అంటారు. ఈ తమో గుణ ఎఱుకనేమో, మలినపుటెఱుక అంటారు. అసలు ఉన్నది తమోగుణం, సత్వగుణమే! రజోగుణం లేదు. ఆత్మయేమో సత్వగుణం, అనాత్మయేమో తమోగుణం. రజోగుణం లేదు. చిత్తేమో సత్వగుణం, జడమేమో తమోగుణం. అక్కడ కూడా రజోగుణంలేదు. చిత్‌ జడముల కలయికలో, చిత్‌ జడ గ్రంధిలో ఒక నేనుఅనేటటువంటిది రజోగుణ సంబంధముగా తోచింది. నేనుఅనేటటువంటి జీవుడు రజో గుణ సంబంధముగా తోచాడు. అంటే తమో సత్వ గుణముల యొక్క మిశ్రమముగా ఈ రజోగుణం ఆవిర్భవించింది. అందుకని ఈ రజోగుణాన్ని మిశ్రపుటెఱుక అంటాము. చిత్‌ జడముల యొక్క గ్రంధిలో పుట్టినది. అలాగే ఆత్మ, అనాత్మల యొక్క సందులో పుట్టినది. తమో, సత్వ గుణముల యొక్క సందులో పుట్టినది, వాటి యొక్క మిశ్రమము వలన కలిగినది, రజోగుణం కనుక రజోగుణాన్ని మిశ్రపుటెఱుక అంటారు.

       ఇట్టి ఎఱుకకు మూలం లేదు. అన్ని కాలాల్లో ఏదైతే ఉందో, అది ఉన్నదున్నట్లున్నది. అది దీనికి మూలంకాదు. అది దేనికీ మూలం కాదు. కాని దాన్ని బయలు అనుకుంటే, బయలందు లేని ఎఱుక బయలులోకి చేరి, ఎఱుక తనంతట తానే లేకనే ఉన్నట్లు తోచినది. మళ్ళీ ఎఱుక లయమైనప్పుడు, లేనెఱుక లేకుండా పోయింది. అట్లాగే ఓంకారములో లేని శబ్దము ఉత్పన్నమై, ఓంకార రూపమై, అకార, ఉకార, మకార సృష్టి చేసింది. మాయ మూలకారణాంశము అవ్వడం వలన అకార, ఉకార మాతృకల చేత, సంకేతముగా ఉన్నటువంటి, స్థూల సూక్ష్మ ప్రపంచములన్నీ కూడా లేకనే ఉన్నట్లు కల్పించబడ్డాయి. మాయ యొక్క లక్షణాలు, మూడు గుణాలు ఈ మూడు ప్రపంచాలకు ఉన్నవి. మాయ లేనిది కనుక మూడు ప్రపంచాలు లేనివే. మాయ లేకనే ఉన్నట్లు ఉంది కాబట్టి, మూడు ప్రపంచాలు కూడా లేకనే ఉన్నట్లు ఉన్నాయి. కనుక ఓంకి మూలం లేదు కాబట్టి, ‘ఓంకి మూలం సున్నా! ఈ సున్నాఅంటే ఎఱుక పద్ధతిలో సున్నా’! అంటే క్షేత్రజ్ఞుడు లేడని, అక్షర పురుషుడు లేడని, వ్యక్తావ్యక్తములు లేవని, మరి ఈ రకంగా కార్యకారణాలు ఏవీ లేవని, దానికదే ఉన్నదున్నట్లున్నదని, అవి స్థూల, సూక్ష్మ, కారణాలు కావని, వీటన్నింటికి ఆధారమైనటువంటి ప్రణవ బ్రహ్మము,  ప్రణవేశ్వరుడు కూడా కాదని, ఈ లేనివాటికి ఎవరైతే ఆధారమో వారున్నూ లేనివారే. ఈ లేని ప్రపంచానికి ఎవరైతే ఆధారమో, అట్టి బ్రహ్మకూడా లేనివాడే. ఇవన్నీ లేనెఱుక కాబట్టి, కారణ బ్రహ్మము కూడా లేనెఱుక. లేనెఱుక లేదు కనుక ఎఱుక బ్రహ్మము లేనివాడే. ఎఱుక బ్రహ్మము దాకా తెగ్గొట్టేస్తే, ఆ పైన ఎవరున్నారంటే బయలు. అన్ని రకాలుగా ఎఱుక సంబంధముగా ఉన్నవి ఏవీ లేవు అనేటటువంటి నిర్ణయంగా ఈ ఉత్తబట్టబయలు ఏమీ లేదుఅని చెప్తున్నాము. దాన్ని సున్నగా పెట్టాము. ఆ సున్నఎఱుకకు మూలం కాదు.

       నువ్వు అనుకుని కలగన్నావా? ఫలానా కలరావాలని కలగన్నావా? కల రాకూడదని పడుకున్నా కూడా కల వస్తోంది కదా! నీ ప్రమేయం లేకుండా కల వచ్చినట్లుగానే, ఆ ప్రణవాతీతమైనటువంటి ఉత్తబట్టబయలందు, నాద బిందు కళాతీతమైనటువంటి ఉత్తబట్టబయలందు, ఈ ప్రణవమనేది ప్రణవనాదమనేది, ప్రణవ బ్రహ్మమనేది, బ్రహ్మనాదమనేది, కారణ బ్రహ్మ, సర్వకారణ బ్రహ్మ, సర్వ కారణ ఈశ్వరుడు, ఇవన్నీ కూడా మాయచేత, లేకనే ఉన్నట్లు తోచారు. కలలో తోచినట్లు తోచారు. మూలకారణ అంశము కాబట్టి, తోచినవాడు, వీడు వేరుకాదు, వీరు కూడా మాయా స్వరూపులే. ఓంకారేశ్వరుడు, ప్రణవస్వరూపుడు మాయా స్వరూపులే. వీరంతా లేనివారే. ఉన్నంత కాలము లేని వారిగా, ఉన్నట్లున్నారు కాబట్టి, వీళ్ళని లేనెఱుక అనాలి. కలనుండి మేల్కొంటే ఏమీ లేదు. అలాగే ఇది లేనెరుక. లేనెఱుక ఎలా పోతుంది? యద్భావం తద్భవతి. భావాన్ని బట్టి ఎఱుక ఉన్నది. ఎఱుకను బట్టే ఉండుట ఉన్నది. ఎఱుక ఎట్టిదో, అట్టిదిగా ఉండడం జరుగుతుంది. ఎఱుక జీవుడు అంటే జీవుడుగా ఉండడం జరుగుతుంది. ఎఱుక ఈశ్వరుడు అంటే ఈశ్వరుడుగా ఉండడం జరుగుతోంది. ఎఱుక స్త్రీ అంటే, స్త్రీగా ఉండడం జరుగుతోంది. ఎఱుక అక్షరుడు అంటే, అక్షరుడుగా ఉండడం జరుగుతోంది. యద్భావం తద్భవతి’. అభావమందు ఎఱుకేలేదు. ఎఱుకే లేనప్పుడు అవ్వడం కూడా లేదు, ఉండడం కూడా లేదు, కనుక లేకుండుట అనేదే సత్యం.

       మరి ఉన్నది లేకుండా పోవాలంటే ఏమి చేయాలి? దాని మూలంలోకి వెళ్తే, ఇది లేకుండా పోతుంది. ఎలా? పృథ్వి జలంలోకి వెళ్తే, పృథ్వి లేదు. జలం అగ్నిలోకి లయమైతే జలం లేదు. అగ్ని వాయువులోకి లయమైతే అగ్ని లేదు. వాయువు ఆకాశంలోకి వెళ్తే వాయువు లేదు. అకాశము మహదహంకారములోకి పోతే ఆకాశము లేదు. మహదహంకారము మహత్తులోకి పోతే మహదహంకారము లేదు. మహత్తు అవ్యక్తంలోకి పోతే, మహత్తు లేదు. అవ్యక్తంతిరిగి వ్యక్తం కాకపోతే, ఉన్నది బయలు. అదే పరమ పదము.
       అవ్యక్తంతిరిగి మహత్తైతే అదే తిరిగి వస్తుంది. పునరావృత్తి కలిగి ఉన్నది. కనుక దీనికి చక్ర దోషం వచ్చింది. అవ్యక్తంలోకి తిరిగి వ్యక్తం అవ్వకూడదు. వ్యక్తావ్యక్తం కానిది ఒకటి పెడితే చక్రదోషం పోతుంది. ఆ చక్రదోషం పోవాలి అంటే, బయలే నిర్ణయం కావాలి. కనుక బయలు దేనికీ మూలం కాదు కనుక, ఎఱుకలో ఆఖరి మెట్టుగా, మలినపుటెఱుక పోగొట్టి, శుద్ధ చైతన్యానుభవంగా ఉన్న పరమాత్మ ప్రకాశానుభవం అన్న జ్ఞానాన్ని పోగొట్టుకుని, చివరికి విజ్ఞాన స్వరూపం కావాలంటే, ఆ విజ్ఞాన స్వరూపుడు బయలై ఉండాలి.

       బయలు నిర్ణయం కాకుండా, విజ్ఞానస్వరూపుడు అయితే, మళ్ళీ అతడు జ్ఞాన స్వరూపుడై, జ్ఞానియై, జ్ఞానమై అజ్ఞనానికి మూలకారణమై, అజ్ఞానాన్ని సృష్టిస్తాడు. తాను సృష్టించిన దాంట్లో, తానే ప్రవేశించి, సృష్టి కర్త బదులు, సృష్టిగా ఉన్న నామ రూప ప్రపంచాకారమే తాను అవుతాడు. నామ రూప ఆకారాలు తాను చెందుతాడు. తాను ఏమేమో అనుకున్నది తాను అయిపోతున్నాడు. తాను ఊహించిన నామరూపాదులు తన ఊహామాత్రంగానే ఉండి పోకుండా, అవిద్యాదోషం చేత, తానే ఆ నామరూపాలు అవుతున్నాడు. కనుక ఈ బ్రహ్మ సంకల్పం చేసి, సృష్టి చేసినప్పుడు ఆ బ్రహ్మే అవిద్య కారణంగా సృష్టితో తాదాత్మ్యం చెందినప్పుడు ఆ నామరూపాలే తాను అవుతున్నాడు. ఆ ఈశ్వరుడే తాను అవుతున్నాడు. ఆ జీవుడే తాను అవుతున్నాడు. మెల్లిమెల్లిగా క్రమక్రమంగా తనలో కలిగిన సంకల్పాలనుబట్టి దిగజారిపోతున్నాడు. సంకల్పమే ఎఱుక, నిర్వికల్పమే బయలు. సంకల్పం ఆగిపోయి నిర్వికల్పమైనా, తిరిగి సంకల్పములు పుట్టరాదు. అప్పుడు శాశ్వత నిర్వికల్పమే బయలు అవుతుంది. ఓంకారము యొక్క అవ్యక్తమే ప్రణవము. ప్రణవములో అవ్యక్త స్థితి ఉన్నంత సేపు, అది ఓంకారాన్ని సృష్టిస్తుంది. అనగా మహత్తుని సృష్టిస్తుంది. మహత్తు నుంచి మహదహంకారము, తన్మాత్రల సృష్టి పునరావృతి అవుతుంది. అందువల్ల దీనిని మనం అధిగమించాలి.

       ఈ చైతన్యానికి చలన గుణము ఉంది. వ్యాపకత్వము ఉంది. మళ్ళీ ఘన రూపము ఉంది. వ్యాపకత్వము కుంచించుకు పోవడము రెండూ ఉన్నవి. అసలు విశ్వమంతా కూడా బిందు స్వరూపం నుంచి వ్యాపకమై, కొంతకాలము వరకూ వ్యాపిస్తూనే ఉండి, కాల ప్రభావముచేత మళ్ళీ ఆ వ్యాపించినదంతా సంకోచిస్తూ, తిరిగి బిందురూపం అవుతుంది. వ్యాపకమౌతున్నంత సేపు సృష్టి జరుగుతూ ఉంటుంది. కుంచించుకు పోతున్నంత సేపు, సృష్టి మళ్ళీ లయమౌతూ, అవ్యక్తమౌతూ ఉంటుంది. కనుక ఉచ్ఛాస, నిశ్వాసాల్లో నీ ఊపిరితిత్తులు ఎలాగైతే వ్యాకోచిస్తూ, సంకోచిస్తూ ఉంటాయో, విశ్వం కూడా విశ్వ ఆవిర్భావానికి ఏ విధమైనటువంటి పరమాణు రూపం కాకుండా, అత్యంత సున్నితమైనటువంటి వాయువులు విశ్వరూపమై, అవి వ్యాకోచిస్తూ, సంకోచిస్తూ ఉంటాయి. వ్యాకోచిస్తూ ఉన్నంత సేపూ సూక్ష్మమై, స్థూలమై నామరూపమౌతూ ఉంటుంది. సంకోచిస్తూ ఉన్నంతసేపూ నామరూపాలు స్థూలంనుండి సూక్ష్మంలోకి, సూక్ష్మాలు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి మహాకారణమందు లయమౌతాయి.

       ఈ మహాకారణము ఇవన్నీ కూడా వాయురూపమైనటువంటి మనస్సు, ఎందుకంటే బ్రహ్మమే మనస్సు. బ్రహ్మము నుండి మొట్టమొదటగా డైరెక్టుగా పుట్టినవాళ్ళు బ్రహ్మ మానసులు. అందుకని బ్రహ్మ మానసులు అంటే చైతన్యము ద్వారా నేరుగా వచ్చిన వాళ్ళు. చైతన్యమే తానై ఉన్నవాళ్ళు. చైతన్య నిష్ఠులు, బ్రహ్మనిష్ఠులు. ఆ చైతన్యమే అక్కడ దివ్యమనస్సు. వ్యష్టి మనస్సు రాక ముందు చైతన్యమే దివ్యమనస్సు. అదే బ్రహ్మమనస్సు. ఈ సృష్టి ఎలా వచ్చిందంటే, ప్రతీ దశలోనూ కొన్ని వ్యక్తమై సృష్టించబడ్డాయి. అన్నిటికి పరిణామం లేదు. బ్రహ్మం చైతన్యం అయితే, ఆ బ్రహ్మ యొక్క మనసైతే, ఆ మనసు ద్వారా బ్రహ్మమానస పుత్రులు బ్రహ్మనిష్ఠులుగానే పుట్టారు. దేహోపాధులు లేకుండానే పుట్టారు. ఆత్మ నుండి ఆకాశం వస్తే, ఆత్మ ఆత్మగా ఉండే ఆకాశంగా వచ్చింది కాని, ఆత్మ ఆకాశంగా మారలేదు. మళ్ళీ ఆకాశం నుండి వాయువు వస్తే, ఆకాశం అంతా వాయువు అవ్వలేదు. తొమ్మిది వంతులు ఆకాశంగా ఉండిపోయి, ఒక వంతు వాయువు అయ్యింది. వాయువునుండి అగ్ని వచ్చింది అంటే, ఒక వంతు వాయువు అగ్ని అయితే, తొమ్మిది వంతులు వాయువు, వాయువుగానే ఉంది. అలా మిగిలి ఉండకపోతే మోక్షానికి మీకు పరబ్రహ్మ దొరకడు. మాయా వరణములో పరబ్రహ్మ పరబ్రహ్మగా మూడు వంతులు వుంటే, ఒక వంతు బ్రహ్మ మాయావరణలో ఉంటాడు. అంతా మాయావరణలోకి దిగితే లక్ష్యమైన పరబ్రహ్మ ఉండదు. అప్పుడు మోక్ష ప్రసక్తియే ఉండదు. అటువంటి మూడు వంతులు బ్రహ్మ బ్రహ్మగా ఉంటే, ఒక వంతు బ్రహ్మము ఆకాశము అయ్యింది.  ఆకాశం తొమ్మిది వంతులు అలా వుండగా, ఒక వంతు వాయువు అయ్యింది. అందుకే అపంచీకృతమైనవన్నీ కూడా ఉన్నాయి.  అంతా ఆకాశములోకి దిగిపోతే అప్పుడు మోక్షం పొందడానికి ఏమి ఉందని? కొంత అలాగే ఉంటూ మిగతా సృష్టి పరిణామం చెందింది. కాబట్టి, ప్రతీ దశలోనూ దిగబడి ఉన్నాయి కొన్ని. ఆ దిగబడి ఉన్నటువంటివన్నీ మనకి ఇప్పుడు, తిరుగు ప్రయాణంలో అనుభవంలోకి వస్తే మనం పొందగలుగుతున్నాము.

       ఆత్మ కూడా ఎఱుకే! పరమాత్మ కూడా ఎఱుకే. చైతన్యము కూడా ఎఱుకే!  బ్రహ్మ నిష్ఠ అంటే ఎఱుక యొక్క స్థిరత్వము. ఎఱుక కాసేపు స్థిరంగా ఉంటుంది. కాసేపు వ్యాపకం అవుతుంది. కనుక ఆ స్థిరమైన ఎఱుకను, బ్రహ్మనిష్ఠ అన్నాము, ఆత్మనిష్ఠ అన్నాము. మళ్ళీ అది నిష్ఠ అన్నప్పుడు శాశ్వతముగా ఉండాలి. అంటే అచలం అవ్వాలి. నిష్ఠ అనే పేరే చెరిపేసి, అచలం అనే పేరు పెట్టాలి. అచలం అంటే, ఏమిటంటే ఎప్పటికీ, ఎప్పటికీ కదలదు. అచలం సిద్ధించకపోతే అవ్యక్తంగా ఉన్నప్పుడు బ్రహ్మనిష్ఠలో ఉండి, వ్యక్త స్థితిలోకి జారిపోతాడు. దిగజారిపోతాడు. అందువల్ల మనకు ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక దశల వారీగా, ప్రతీ దశలో కూడా ఆ దశకు సంబంధించినటువంటి అనుభవమును అనుభవించి, ఆ అనుభవాన్ని అనుభవింప చేసేటటువంటి గురుతత్త్వం సహాయముగా ఉంటూనే ఉంటాయి. అందుకే  మెహెర్‌బాబా చెప్తారు. అన్ని భూమికలలోనూ, అన్ని భూమికలకు ఆవల కూడా ఉన్నారు, భూమికకు, భూమికకు మధ్య సందులో ఉండి, ఒక శిష్యుడు తన భూమికని, ఒకటో భూమికను అధిగమించి, రెండవ భూమికకు చేరాలంటే, ఒకటి - రెండు మధ్యలో ఉన్నటువంటి గురుతత్త్వము, అవతార తత్త్వము, భగవంతుడు క్రింది భూమికనుంచి, పై భూమికకు అనుభవానికి, అధిగమించడానికి అక్కడ సహాయపడుతాడు. గురువే ఉండక్కర్లేదు. ఆ భూమిక మధ్యలో ఆ భూమికానుభవం పొందుతున్నటువంటివారు ఉంటారు. అటువంటి వారిలో మమైకం అయినప్పుడు వారి అనుభవమే నీ అనుభవంగా నీకు సంక్రమిస్తుంది. ఇదీ వ్యవస్థ. ఆధ్యాత్మిక వ్యవస్థ.

       అవతార పురుషుని యొక్క సచ్ఛిష్యులతో దశల వారీగా ఆ దిగువ వారికి పై వారు సహాయం చేసే పద్ధతిలో ఒక నెట్‌ వర్క్‌ ఉంది. దానినే మండలి సభ్యులు అంటారు. ఆ నెట్‌వర్క్‌ ద్వారా అవతార తత్త్వము, చైతన్యానుభవాలు, గురు తత్త్వము ఆ జ్ఞాన భూమికలని, చైతన్య భూమికలని అధిగమింపచేస్తూ, అనుభవాలు పొందిస్తూ, ఉద్ధరించబడడం అనేటటువంటిది ఈ సృష్టితో పాటే అది కూడా వచ్చింది. ఈ సృష్టితో పాటే అదీ ఉన్నది. అది లేకపోతే ఎవరు అధిగమిస్తారు? అజ్ఞానంలో కూరుకున్నవారు ఎప్పటికీ అజ్ఞానంలోనే ఉంటారు. యద్భావం తద్భవతిగానే ఉంటారు. జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటారు. తనని తాను ఉద్ధరించుకోలేడు. వీళ్ళని ఉద్ధరించేవాడు ఒకడు కావాలిగా! అందుకే మహత్తు అనేటటువంటి సృష్టి ఎప్పుడు కలిగిందో, ఆ మహత్తు నుంచి గురుతత్వం వచ్చింది. ఆ తరువాతే మహత్తు నుంచి ప్రకృతి శక్తులు వచ్చి, సృష్టి అంతా వచ్చింది. మొదట్లో వచ్చిన గురుతత్త్వంలో ప్రకృతి శక్తులు అన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. ఆ ప్రకృతి శక్తుల కంటే, ఇంకా గొప్ప శక్తులు ఆ గురుతత్త్వం కలిగి ఉన్నది. కనుక ప్రకృతిని శాసించ గలిగేటటువంటిది గురుతత్త్వము.

       ఎఱుక - బయలు అనేదానిని విడమరచుకోవాలి. అవ్యక్త స్థితిలో ఉన్నటువంటి ఎఱుక  జ్ఞాన రూప అఖండ ఎఱుక వ్యక్త స్థితిలో ఉన్న ఎఱుక మూడు గుణాలచేత మలినపుటెఱుక, మిశ్రపుటెఱుక, కేవలపుటెఱుకగా జగత్తుగా, జీవుడుగా, ఈశ్వరుడుగా వ్యవహారం జరుగుతోంది. ఇది అంతా ఈ రకంగా ఎఱుక యొక్క లీలా విలాసం. మాయ యొక్క లీలా విలాసం. ఎఱుకన్నా, మాయన్నా ఒక్కటే. చైతన్యం యొక్క లీలావిలాసం, చిద్విలాసం. చైతన్యమన్నా, ఎఱుకన్నా, మాయన్నా ఒక్కటే. కనుక ఈ ఎఱుకకు మూలం లేదు అన్నప్పుడు, ప్రణవానికి మూలం లేదు అన్నప్పుడు, దేనికీ మూలంకాని బయలే ఉన్నది. అది ఉత్తబట్టబయలు ఏమీ లేదు. కనుక ఈ ప్రణవం దాకా ఎవరైతే సాధన చేత అధిగమిస్తారో, కుండలినీ చేత అధిగమిస్తారో, వేరే ఉపాయం చేత, అనుష్ఠానం చేత అధిగమిస్తారో, ఎఱుక బ్రహ్మమై ఉంటారు. ప్రణవ స్వరూపులై ఉంటారు. ఓంకార స్వరూపులై ఉంటారు. వారికే ఆ పరమపదమైనటువంటి ఉత్తబట్టబయలు, దానికి మూలం కాదని, షోడశి, ద్వాదశి మంత్రాలతోటి తన వెనుకున్నదంతా కూడా ఎఱుక పరంగా ఏమీ లేదని, సున్నా ని పెట్టుకుని, ఆ సున్నాని దర్శించి, ఆ సున్నా ద్వారా మనం రాలేదనుకుని, సున్నా ద్వారా రానప్పుడు గొడ్రాలి బిడ్డ అనుకుని, మనకు మనమే ఒక తల్లి ఉందనుకుని, ఒక మాతృక ఉందనుకుని, ఆ తల్లిదండ్రులున్నారనుకుని, దాని పేరే బ్రహ్మ అని పేరు పెట్టి, అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందాము. తీరా చూస్తే, ఆ బ్రహ్మ నీకు మూలం కాదు కాబట్టి, ద్వాదశి, షోడశి మంత్రాలచేత నేనే లేకుండా పోయే పద్ధతిలో పోవాలి. అంటే,  నీకు అతీతంగా ఉన్నటువంటి, నాద బిందు కళాతీతంగా, ప్రణవాతీతంగా, సకల ఎఱుకలకు అతీతంగా ఉన్నటువంటి, ఉత్తబట్టబయలు అనే సున్నాని దర్శించడం ద్వారా గురువు దర్శింప చేస్తే, ఆ పరబయలు దర్శనమైనటువంటి నీవు, గురువు ద్వారా ఎఱుక విడిచి, మాయను దాటి, మాయకు పరమైన, మాయాత్పరమైన బయలు, ఎఱుకకు పరమైనటువంటి, చైతన్యానికి పరమైనటువంటి, చిత్పరమైనటువంటి బయలు, వ్యక్తమయ్యే ఆస్కారమున్న అవ్యక్త పరమునకంటే కూడా పరమైనది పరాత్పరమునకు లక్ష్యము పెట్టుకుని, అదిగా మిగిలి ఉంటాడు. దానిని లక్ష్యంగా పెట్టుకుని, గురువు ఎఱుక విడిపించగానే, శిష్యుడు పరబయలు దర్శించగానే తను గొడ్రాలిబిడ్డ సామెతగా, మూలం లేదని తెలిసి నాద బిందు కళా తీత స్థితిలో, ప్రణవాతీత స్థితిలో తాను బట్టబయలై ఉంటాడు. ఇదీ పరమపదము.

       లోకంబులు, లోకేశులు, లోకస్థులు దెగిన తుది నలోకంబగు, పెం
       జీకటి కవ్వల నెవ్వడు | నేనాకృతిగా వెలుగు నతని నే సేవింతున్‌ ||

       అక్కడ అకార, ఉకార, మకారములు కూడా త్రిపుటిలో లోకములు, లోకేశులు, లోకస్థులు అనే పద్ధతిలో కూడా తీసుకోండి. ఈ మూడూ కూడా ఎఱుకే కాబట్టి, ఎఱుక లేనిది కనుక మూడూ తెగిపోవాలి. కానీ మూడూ జట్టుకట్టి ఒకదానిని మించి ఒకటి, ఒకదానిని బట్టి ఒకటి ఉంటోంది. లోకము ఉంటేనే ఆ లోకానుభవంలో లోకస్థులు ఉన్నారు. లోకేశ్వరుడైనటువంటి ఈశ్వర సంకల్పం చేతనే, ఈ లోకస్థులైనటువంటి జీవులు తోస్తున్నారు. లోకేశుడు లేకపోతే లోకస్థులు లేరు. లోకస్థులుంటే తనకు కారణం ఆ లోకేశుడనే అనుష్ఠానం చేసుకుంటాడు. లోకాలేమో నామ, రూప, ప్రపంచాలుగా లేక నామరూపాలు లేకపోతే సూక్ష్మ ప్రపంచాలుగా, లేక ఏడు అథోలోకాలు, అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలుగాను, ఊరనీఈ్వలోకాలు ఏడుగా భూలోక, భువర్లోక, సువర్లోక, జనలోక, మహాలోక, తపోలోక, సత్యలోకాలుగా ఈ పద్నాలుగులోకాలు సృష్టించబడ్డాయి.

       ఎవరిచేత సృష్టించబడ్డాయి? సృష్టి అంటే కల్పితం అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరి చేత కల్పించబడ్డాయి? పంచబ్రహ్మల చేత. బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు. వీరిచేత కల్పించబడ్డాయి. వీరిలో ఈశ్వరుడు చేత లోకాలు కల్పించబడ్డాయి. ఆ లోకానుభవం పొందడానికి, ఆ లోకానుభవ వాసన ఉన్నటువంటి జీవులు, ఆ లోకంలో తగినటువంటి అనుభవము పొందడానికి, అనుగుణమైనటువంటి శరీరాన్ని సృష్టి కర్త బ్రహ్మ సృష్టిస్తే, ఆ లోకానుభవం పొందేదాక, విష్ణువు ఆ ఉపాధులను పోషిస్తే, ఆ ప్రారబ్దం, ఆ కర్మానుభవం, ఆ సాధనానుభవం. ఆ లోకానికి సంబంధించినది పూర్తికాగానే, ఆ లోకానికి సంబంధించిన ఉపాధిని రుద్రుడు లయం చేసుకుంటే, ఆ లోకములలో లోకానుభవానికి సంబంధించిన సంస్కారములు ఏ లోకస్థులకు ఉన్నవో ఆ లోకస్థులను ఆయా లోకాలలోకి ఆకర్షించేవాడు సదా శివుడు. ఇలా పంచబ్రహ్మలు లోకేశులు లోకస్థులను, లోకంబులను కల్పిస్తూ ఒక ఆట ఆడుతున్నారు. లోకమంటే మాయాకల్పితమైనది కనుక ఎఱుకే. లోకేశులు, కూడా ఎఱుకే. ఈశ్వరుడు కూడా ఎఱుకే. సచ్చిదానంద పరమాత్మ ఎఱుకే. లోకస్థులు 14 లోకాల్లో, ఊహాలోకాల్లో, స్వప్నలోకాల్లో ఎక్కడ ఉన్నా వారుకూడా ఎఱుకే. ఎఱుక మూడు రకాలుగా ఉన్నదని తెలిస్తే, ఆ ఎరుకపోతే అలోకంబగు, లోకం లేనప్పుడు లోకానుభవం లేదు. లోకానుభవం ఇచ్చేటటువంటి ఈశ్వరుడు లేడు. లోకానుభవాన్ని అనుభవంగా తీసుకునేటటువంటి లోకస్థులు లేరు. ముగ్గరూ లేకపోతే ఏమైందట? ముగ్గురి లేనితనమే పెంజీకటి. ఇక్కడ బయలు పెను చీకటి కాదు. బయలు వెలుగుకాదు. బయలు చైతన్యం కాదు. బయలు ప్రకాశము కాదు. బయలు చీకటి కాదు. చీకటి వెలుగులు రెండూ బయలు కాదు.  కనుక పెను చీకటి అంటే గాఢ తమస్సు, మూలావిద్య, మూల ప్రకృతి. వీటికి ఆవల ఏదైతే ఉన్నదో, అది మాత్రమే ఉన్నదో, దేనికినీ మూలము కాదో అదే ఉత్తబట్టబయలు ఏమీలేదు.

       ఆత్మ ప్రకాశము అంటున్నాము, పరమాత్మ ప్రకాశము అంటున్నాము. ఈ పరమాత్మ ప్రకాశము లేకపోతే, అది పెను చీకటి. పెనుచీకటి అంటే అర్థం ఏమిటి? సృష్టికి పూర్వం గాఢ తమస్సు ఉంది. లోకంబులు, లోకేశులు, లోకస్థులు లేనప్పుడు గాఢతమస్సే పెనుచీకటి రూపంలో ఉంది. ఈ త్రిపుటిని ప్రకాశింపజేసే ప్రకాశం పరమాత్మ ప్రకాశం ఎప్పుడైతే తురీయస్థితిలో ఉంటుందో, సర్వవ్యాపక స్థితిలో ఉంటుందో, దాంట్లో సృష్టిని సంకల్పించి, వ్యక్తం చేసేటటుంవంటి జ్ఞానవాసన ఉన్నదో, దాని ప్రకారం పంచబ్రహ్మల ద్వారా లోకంబులు, లోకేశులు, లోకస్థుల యొక్క సృష్టి జరిగింది. జరిగనవన్నీ ఆ ప్రకాశంలో తెలిసినాయి కాబట్టి, వీటియందు కూడా ఆ ప్రకాశం ప్రతిఫలించి ఉంటోంది. స్వయం ప్రకాశం, అక్కడ ప్రతిబింబ ప్రకాశంగా లేనప్పటికీ బింబప్రకాశం ఎప్పుడూ ఉంటుంది, అన్నిటిలో. కానీ, బింబ, ప్రతిబింబ ప్రకాశాలు రెండూ ఉన్నవి. ప్రతిబింబ ప్రకాశ వ్యవహారానికి, బింబ ప్రకాశము ఆధారము అధిష్టానము. ఆధారమైనప్పుడేమో ఎఱుక బ్రహ్మ ప్రకాశమైనది. అధిష్ఠానమైనటువంటిది తనకు తానై ఉన్న పరబ్రహ్మ ప్రకాశము అయి ఉన్నది.

       ఈ మూడూ తెగాలి. ఈ మూడు తెగితే అలోకమైనది. ఆ లోకంబులు, లోకేశులు, లోకస్థులు మూడు లేవు. వాటి యొక్క అనుభవాలు కాని, వాటియొక్క ఎఱుకలు కాని, అవి అనుభవించేటటువంటి, జ్ఞాత అనేటటువంటి, జ్ఞాతగా ఉనికి అనేటటువంటి ప్రకాశము లేదు. జ్ఞేయ వస్తువు ప్రకాశము లేదు. జ్ఞాన ప్రకాశము లేదు. ప్రకాశమే లేదు అన్నిరకాలుగా. అందుకని అది పెనుచీకటి పెనుచీకటికావల ఏకాకృతిగా ఏదైతే ఉన్నదో అది ఉత్తబట్టబయలు ఏమీ లేదు. దానినే సేవింతున్‌’ - నేను ఏకాకృతి వెలుగునతనిసేవింతున్‌’’ అతని అంటే ఆ పరమపురుషుడు, పురుషోత్తముడు, బయలే తానైనటువంటివాడు అచల పరిపూర్ణుడే తానైనటువంటివాడు, ‘వాడిని నేను సేవింతున్‌’ - వాడిని ఎలా సేవిస్తారయ్యా? ఎఱుకైతే అనుష్ఠాన పూర్వకంగా సేవించవచ్చు. బయలుని ఎలా సేవిస్తారు? బయలును సేవించడం కుదరదు.
       కనుక బయలైనటువంటి అశరీర గురువును సేవించండి. అది మళ్ళీ ఎలా సేవిస్తారు? అశరీరి గురువు శరీరం లేనివాడు కాబట్టి, మీ భావనలో శరీరం లేనివాడుగా భావన చేసి సేవించాలి. సద్గురువుకి ఒక స్థానం లేదు గనుక బయలందు స్థానం లేదు కనుక ఎఱుకకి ఎఱుక విడిచే స్థానం ఉన్నది. ఆ స్థానాన్ని అదే కల్పించుకుంది. దేశ కాల వస్తువులని, దేశ కాల వస్తువులందు ఎఱుక ఆ స్థానమందు నిలిచి వున్నది. మళ్ళీ స్థానము, పదవి వీటిని వెనక్కి తీసుకుంటే, జీవుడికి జీవుడనే పదవి, ఈశ్వరుడికి ఈశ్వరుడనే పదవి ఉన్నది. ఏ పదవీ లేనిది పరమపదము. ఏ పదమూ, ఏ పదవీ లేనిది పరమపదము. కనుక ఈ పదవిలన్నీ కూడా ఎఱుకలోనే ఉన్నవి. అందుకని స్థానము లేదు అశరీర గురువుకి. ఎఱుకలోనే స్థానాలున్నాయి. బయలైన గురువుకు స్థానం లేదు. బయలైన గురువు అభావం. ఆత్మ కూడా శుద్ధ సత్వగుణం అని చెప్పాము. ఆత్మ - శుద్ధ సత్వగుణం. అనాత్మ - శుద్ధ తమోగుణం. రెంటియొక్క మిశ్రమం  నేను, నేను అనే నీవు, ఈ రజోగుణం. ఆత్మ త్రిగుణ రహితం గనుక శుద్ధ సత్వగుణం కూడా పోవాలి. శుద్ధ సత్వగుణం కూడా పోతేనే బయలు. మూడుగుణాలు లేకపోవడమే బయలు. రహిత పద్ధతిగా పోవాలి. మళ్ళీ వచ్చేపద్ధతిగా కాదు. వ్యక్తావ్యక్త పద్ధతి కాదు. రహిత పద్ధతి అన్నప్పుడు వ్యక్తావ్యక్తము కాదని, రహిత పద్ధతిలో ఏమీలేదు అనేది శాశ్వతము.  అది పెను చీకటికి ఆవల ఏకాకృతిగా వెలుగు’ - ఎవరు వెలుగుతున్నారు? అశరీరి గురువు వెలుగుతున్నారని, అటువంటి గురువును సేవించాలి. చతుర్విధ శుశ్రూషల ద్వారా, అంగ స్థాన భావ ఆత్మలు లేనివని, శిష్యుడు కూడా తన పరంగా అంగ, ఆత్మ, స్థాన, భావ, ఆత్మలు లేనట్టి పద్ధతిలో, ఆ గురువుని ఇంట, వెంట, జంట పెట్టుకుని వెంబడించి, గురుశుశ్రూష చేస్తే, అటువంటి గురువును సేవించినప్పుడు, శిష్యుడు లేకుండా పోతాడు. అప్పుడు ఉనికి నాలుగు విధాలుగా ఉండే అవకాశం లేదు. గురువును అశరీర పద్ధతిగా, అంగ రహిత పద్ధతిగా, స్థాన రహిత పద్ధతిగా, భావ రహిత పద్ధతిగా, ఆత్మ రహిత పద్ధతిగా, శిష్యుడు ఆ గురువుకి సేవ చేసినప్పుడు శిష్యుడు లేకుండా పోతాడు. అంటే, గురుసేవ అన్నా, గురుశుశ్రూష అన్నా, ఆ శుశ్రూష ద్వారా శిష్యుడు లేనివాడు అవుతాడు. నాలుగు పద్ధతుల్లో ఉన్నవాడు కాబట్టి, ఈ నాలుగు పద్ధతుల్లో గురుశుశ్రూష చేస్తే, ఆ శిష్యుడు నాలుగు పద్ధతుల్లో లేకపోతే, ఇక ఏ పద్ధతిగానూ ఉండడు. ఇక ఏ పద్ధతిగానూ లేకపోతేనే బయలే ఉన్నది.

       అంతర్జ్యోతి బహిర్జ్యోతి | ప్రత్యక్‌ జ్యోతిః పరాత్పరః |
       జ్యోతిర్జ్యోతి పరంజ్యోతిః | ఆత్మజ్యోతిః శివోస్మ్యహం ||

       ఇది సాధన గురించి చెబుతున్నారు. బయట ప్రపంచం కనబడుతోంది బహిర్ముఖంగా ఉన్న ఇంద్రియాలకి. కాసేపు ధ్యాననిష్ఠుడై జ్యోతిని ధారణ చేస్తే, జ్యోతి ఆకారం చెందినటువంటి స్థితి అంతర్ముఖంలో కలిగితే, అంతర్జ్యోతి అయ్యింది. సర్వం ఖల్విదం బ్రహ్మంగా అయినప్పుడు, బయట నామరూప ప్రపంచాన్ని కూడా, విశ్వరూపంగా, బ్రహ్మాకారంగా చూసినప్పుడు అది బహిర్జ్యోతి అయినది. బ్రహ్మనిష్ఠలో ఉన్నవాడు అంతర్జ్యోతి. సర్వం ఖల్విదం బ్రహ్మగా ఉన్న జ్ఞాన దృష్టిచేత బహిర్జ్యోతి. లోపల ఉన్నటువంటి, బయట ఉన్నటువంటివి రెండు ఉంటాయా? లోపల, బయట అనేటటువంటిది ఏదైతే విభజనగా ఉంటుందో, సాధకుడు లోపల బ్రహ్మనిష్ఠుడిని, ఇంద్రియముల యొక్క బయట వ్యాపారం చేత, బయట ప్రపంచం తోస్తుంది. అపుడు లోపల, బయట అనే పేరు పెట్టాల్సి వచ్చింది. ఈ లోపల, బయట అనేది లేదు కాబట్టి అలా లేకుండా పోవడం కష్టం. బ్రహ్మనిష్ఠలో, అంతర్ముఖ సాధనలో, లోపలిది జ్యోతి స్వరూపంలో గోచరించింది. బయట కూడా నామ రూప జగత్తులో, జగత్తు కూడా బ్రహ్మమే. ఆ బ్రహ్మమే జగదాకారుడు, విశ్వాకారుడు, విశ్వరూపుడు అయ్యాడని, విశ్వరూప సందర్శనం జరిగింది (అర్జునినికి) అంటే, బ్రహ్మం విశ్వరూపంలో ఉన్నాడు అనేటటువంటి జ్యోతి దర్శనం జరిగింది. బహిర్జ్యోతి దర్శనం జరిగింది. విశ్వాన్ని నామ రూపంగా కాకుండా, విశ్వాన్ని కూడా జ్యోతి రూపంగా చూడడమే జ్ఞాన నేత్రము, జ్ఞాన చక్షువు, జ్ఞాన దృష్టి. ఆ దృష్టిని ఇచ్చాడు విశ్వరూప సందర్శనానికి కృష్ణపరమాత్మ. అర్జునునికి ఆ దివ్య దృష్టిని ఇచ్చాడు. ఆ దివ్య దృష్టితో విశ్వాన్ని దివ్యత్వంగా, దైవీచైతన్యంగా, చైతన్య రూపంగా చైతన్యం యొక్క విభూతులే దానియందున్నట్లుగా చూచాడు.

       అనేక ఆభరణాలన్నిటిలో కూడా విడివిడిగా ఆభరణాల యొక్క సొగసు, ఆకర్షణ చూడకుండా, ఆ ఆభరణాలలో ఉన్నది బంగారమే అనే దృష్టి తోచినప్పుడు, విశ్వసందర్శన, విశ్వరూప సందర్శన అలా చూసినప్పుడు బయట, లోపల కూడా జ్యోతి స్వరూపమే. అప్పుడు జ్యోతి స్వరూపం ఎప్పుడైతే బయట, లోపల దర్శనమైందో, వెంటనే లోపల, బయట అనే విభజన చెరిగిపోయి, ఒకే ఒక జ్యోతి ప్రత్యేకంగా, స్పెషల్‌గా కనబడుతోంది. అది ప్రత్యక్‌ జ్యోతి. ఈ ప్రత్యక్‌ జ్యోతియే పరాత్పరము. పరము అన్నప్పుడేమో అంతర్జ్యోతి,  బహిర్జ్యోతి, అంతర్జ్యోతి ఎప్పుడైతే ఒక్కటి అయ్యిందో, అది ప్రత్యక్‌ జ్యోతి. ఈ ప్రత్యక్‌ జ్యోతిలో ఏముంది? బహిర్జ్యోతేమో అనాత్మప్రపంచము. అంతర్జ్యోతేమో, అనాత్మకి పరమైనది పరమాత్మ. బహర్జ్యోతి అనాత్మ సంబంధమైతే, అంతర్జ్యోతి పరమాత్మ. అనాత్మకి పరమాత్మ పరమైతే, పరమాత్మకి పరమైనది పరాత్పరం. కనుక ఈ ప్రత్యక్‌ జ్యోతి పరాత్‌పరం అయ్యింది. పరమునకంటే పరం.

       అజ్ఞానమునకు పరమైనది జ్ఞానము. జ్ఞాన, అజ్ఞానములకు పరమైనది పరాత్పరం. అనాత్మ జడము. అనాత్మ భావన అజ్ఞానము. ఇలాగా పరము, పరము అని రెండు పరములు పెట్టాము. ఒక పరమేమో అనాత్మకంటే పరమైనది పరమాత్మ. రెండవ పరమేమో పరమాత్మ కంటే పరమైనది పరబ్రహ్మం. ఈ పరబ్రహ్మమే పరాత్‌ పరం. ఈ పరబ్రహ్మానికి సరిగ్గా నిర్వచనం చెబితే, ఆ నిర్వచనం ప్రకారంగా, పరాత్‌ పరం సరిపోతుంది. ఆ పరబ్రహ్మాన్ని సృష్టికి బీజ ప్రదాతగా పెట్టుకుంటే, మరి పరాత్పార పరబ్రహ్మము అని మూడు పరాలు పెట్టాల్సి వస్తుంది. వీరు ఆ పరబ్రహ్మని బయలుగా నిర్ణయిస్తే, అదే పరాత్‌పరం. ఒక పరబ్రహ్మ తాను కారణమైతే సృష్టికి, కారణమైన బ్రహ్మకి పరమైనవాడు పరబ్రహ్మ. ఈ పరబ్రహ్మ దేనికీ కారణం కాదు అనగానే, అక్కడికి బయలు నిర్ణయం అయిపోయింది. ఇంకా ఏమీ అక్కర్లేదు. కొందరు ఏమంటున్నారంటే, ఆ పరబ్రహ్మ సృష్టికి బీజ ప్రదాత అంటున్నారు. అప్పుడు ఈ పరాత్పరుడే పరబ్రహ్మ అయినప్పడు, సృష్టికి అతీతంగా దేనికీ సంబంధం లేకుండా, తనకు తానే స్వతఃసిద్ధమై ఉన్నవాడే, బట్టబయలై ఉన్నవాడే కదా ఆ పరబ్రహ్మ!! అందువలన పరాత్పర పరబ్రహ్మ అని పేరు పెట్టవలసి వచ్చింది.

       ఎఱుక ఉన్నంతసేపూ ఒక పర చేర్చాలి. పరబ్రహ్మ జ్ఞానం నాకు అయ్యింది అన్నారంటే, దానికి పరమైనది బయలు అనాలి. జ్ఞానాతీతం అది. బయలు అనేది జ్ఞానాతీతం.

       జ్యోతిర్జ్యోతి పరం జ్యోతిః’ - ఇక్కడేమయ్యింది? ఇన్ని జ్యోతులు కలిపి ఒకే జ్యోతి అయ్యింది. బహిర్జ్యోతి కూడా అంతర్జ్యోతి తోటి సమానం అయ్యింది. ఎప్పుడైతే సమానం అయ్యిందో, అది ప్రత్యక్‌ జ్యోతి అయ్యింది. అద్వయంగా ఉన్నది. రెండవది లేని, ఏకమేవాద్వయంగా ఉన్న జ్యోతి. ఆ జ్యోతియే పరాత్పరం. ఈ పరాత్పరమైనది. ఇక్కడ ఒకమాట చూడండి. బ్రహ్మ యొక్క లక్షణాలు పరబ్రహ్మయందు లేవు. ఆత్మయొక్క లక్షణాలు పరమాత్మయందు లేవు. ఆ బ్రహ్మము పరమాత్మ, సత్‌చిత్‌ ఆనందమైతే, పరబ్రహ్మమందు సచ్చిదానందము లేదు. కనుక పరాత్పర అనేదాంట్లో సచ్చిదానందము లేదు అనేటటువంటిది గ్రహించాలి.

       పరుడు కాని వాడిలో అనృత జడ దుఃఖములు ఉన్నవి. పరుడైన వాడిలో సత్‌, చిత్‌, ఆనందము ఉన్నది. పరాత్పరుడైన వాడిలో సచ్చిదానందము లేదు. పరుడు కాని వాడికి అనృత జడ దుఃఖములు ఉన్నవి. పరుడైన వాడికి అనృత, జడ, దుఃఖములులేకపోగా సత్‌ చిత్‌ ఆనందముఉన్నది. పరాత్‌ పరడైనవాడికి సత్‌ చిత్‌ ఆనందముకూడా లేదు. అది కూడా లేకపోవడమే త్రిగుణ రహితము.

       ఎందుకని? ఆనందం అనేటటువంటిది సత్‌ అనేటటువంటి ఉనికి మాయావరణలోనే ఉన్నది. ఆ ఉనికి యొక్క అనుభూతి ఏదంటే, శుద్ధ సత్వగుణం. సత్‌చిత్‌ఆనంద అనుభవం అనేది శుద్ధసత్వగుణం వల్ల వచ్చింది. ఆ శుద్ధసత్వగుణం కూడా రహితమైతే, సత్‌చిత్‌ఆనందము కూడా ఉండదు. సత్‌అనేటటువంటి, శాశ్వత ఉనికి అనేటటువంటి చైతన్యానుభవం ఉండదు. చైతన్యం ఉంటేనే అనుభవం. విడగొట్టి చెప్పినప్పటికి సత్‌చిత్‌ఆనందం అనేది ఒకటే రూపం, ఒకటే లక్షణం. సత్తేచిత్తు, చిత్తేసత్తు. చిత్తు ఉన్నటువంటి ఉనికి యొక్క అనుభూతి ఏదో, అది ఆనందము. మూడు కలసి ఒకటే లక్షణం. ప్రకృతిని బట్టి అనృత, జడ, దుఃఖములకు వ్యతిరేకార్థములో సత్‌ చిత్‌ ఆనందము సృష్టించబడింది. కనుక పరము అనేది సృష్టించబడినప్పుడు, అది కూడా కల్పితమైనప్పుడు సత్యవస్తువు పరాత్పరం అనబడుతుంది.

       జ్యోతిర్జ్యోతి పరంజ్యోతిః’ - మరిక్కడ పరంజ్యోతికి ఏం చెప్పాలి? జ్యోతిలో జ్యోతి. జ్యోతియే తానైనటువంటి జ్యోతి. నేను నేనైన నేను, తనలో తాను రమించేటటువంటి బ్రహ్మము. ఇది జ్యోతిర్జ్యోతి. ఆ రమించుట ఆగిపోతే, అది పరంజ్యోతి. జ్యోతిలో ఉన్నటువంటి, తనలోతాను రమించుట అనేటటువంటి అద్వైత స్థితి ఏదైతే ఉన్నదో, జ్యోతికి పరమైనటువంటి పరంజ్యోతియని ఎప్పుడైతే అన్నామో, జ్యోతిలో ఉన్న తనలో తాను రమించుట అనేటటువంటిది కూడా పోయింది. దానికి కూడా అతీతం. దానికి కూడా విలక్షణం. పరంజ్యోతి అంటే బయలే. తనలోతాను రమించుట కూడా లేనిది పరంజ్యోతి. జ్యోతి అని పేరు పెట్టినప్పటికీ జ్యోతికి పరమైనది, జ్యోతి యొక్క లక్షణాలు లేనిది, ఆనంద లక్షణాలు లేనిది అని తీసుకోవాలి.

       ఆత్మజ్యోతిః శివోస్మ్యహం’ - ఆత్మ అంటే ఇక్కడ ఎవరు? సచ్ఛిష్యుడే అటువంటి పరంజ్యోతి స్వరూపుడు అయ్యాడు. ఆ సచ్ఛిష్యుడు జ్యోతి స్వరూపాన్ని పొందినప్పుడు  ఆ పరంజ్యోతియే ఈ జ్యోతి. ఆ జ్యోతి పరంజ్యోతియే! లోపలి జ్యోతియైనటువంటి సాక్షాత్కారము, బయటకూడా లోపలున్న జ్యోతినే దర్శించడము. ఈ దర్శించినటువంటి బయట, లోపల ఒకటే అనేటటువంటిది ఏదైతే ఉన్నదో, ఆ అపరోక్షానుభూతి ప్రత్యక్‌జ్యోతి. ఈ అపరోక్షానుభూతిలో ఉన్న సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మఅని ఏదైతే ఉన్నదో అది పరం. ఆ పరమునకు పరమైనది బయలు. పరాత్పరం. మళ్ళీ జ్యోతినుంచి క్రిందికి వచ్చాము. జ్యోతిర్జ్యోతి  జ్యోతియే అంతరాత్మకూడా! జ్యోతి యొక్క అంతర్యామి కూడా జ్యోతియే.

       మొదటి జ్యోతి ప్రకాశము, రెండవ జ్యోతేమో ప్రకాశ ఘనము. మొదటి జ్యోతి ఆవరణ ప్రకాశము. రెండవజ్యోతి నిరావరణ జ్యోతి. అసలు నిరావరణ జ్యోతియే సత్యం. మాయకల్పించిన ఆవరణలో ఉన్నటువంటి ప్రకాశము, మాయావరణలో ఉంది కనుక, మాయయొక్క నిర్వచనం చేత, ఆ ప్రకాశం లేనిది కనుక, ఆజ్యోతి లేదు. కనుక ఇప్పుడు ఒక జ్యోతి స్వరూపుడు మాయావరణలో ప్రకాశిస్తూ ఉన్నప్పడు, ఆ మాయావరణ ప్రకాశమే పరమాత్మ అయినప్పుడు అది ఎనిమిదవ శరీరం అయినప్పుడు, ఆ శరీరం పేరు ఏమిటి? జ్యోతిర్మయ శరీరము. జ్యోతి యొక్క ప్రకాశం చేత వ్యాపకమైనది జ్యోతిర్మయం. ఆ జ్యోతిర్మయమే మాయావరణ యందు పరమాత్మ. ఆ పరమాత్మే అష్టతనువులలో ఎనిమిదవ శరీరము. కనుక జ్యోతిర్మయం అనేటటువంటి శరీరానికి అంతర్యామి, అంతరాత్మగా ఉన్నటువంటి జ్యోతియే ఆ పరబ్రహ్మ.

       జ్యోతిర్జ్యోతి’ - ఈ పరబ్రహ్మ ఇప్పుడు ఏమయ్యాడు? పరంజ్యోతి అయ్యాడు. కనుక ఆ పరబ్రహ్మ పరాత్పరుడు అయ్యాడు. ఈ పరంజ్యోతి అనేటటువంటిది మీకు అవగాహన కోసం, ఏదైతే సబ్జెక్టుగా, విషయంగా చెప్పానో, ఇక మీమీద అప్లై చేసుకోండి, ఆత్మ అంటే, నేను నేనైన నేను. ఆత్మ అంటే సచ్ఛిష్యుడు. ఇప్పడు సచ్ఛిష్యుడి మీదే అప్లై చేస్తున్నాము.

       ఆత్మజ్యోతిః’ - ఇప్పుడు ఆత్మకి ఒక జ్యోతి అనేటేటటువంటి అనుభవం, అపరోక్షానుభూతి కలిగింది. ఈ అపరోక్షానుభూతి పైన నిర్ణయించిన నిర్ణయంగా, తత్వమసి వాక్యార్థంతోటి, ఆత్మజ్యోతి అనేటటువంటి త్వం’, పరంజ్యోతి అనేటటువంటి తత్‌అనేటటువంటి దానికి భేదం లేదు అనే పద్ధతిలో, ఆత్మజ్యోతి ఏమిటయ్యా? అంటే, ‘శివోస్మ్యహం’ - ఆ శివుడే తానై ఉన్నాడు, ఆ శివుడే బయలు. ఇక అంతకంటే ఏమీ లేదు.

       హంసనే ప్రణవము అందురు. హంసఅంటే ఎఱుక. ప్రణవముఅన్నా ఎఱుకే. ఈ అనాహత శబ్దమగు ప్రణవమందు త్రివ్యాహృతులైన అకార, ఉకార, మకారములచే సృష్టి అయినది. ఈ ప్రణవము అనేటటువంటి, హంస అనేటటువంటి ఎఱుక, ప్రణవము అనేటటువంటిది, ఓంకార ధ్వనియొక్క అవ్యక్తస్థితి. ధ్వని ఎప్పుడొస్తుందండి? గంటకొడితే ధ్వని వస్తుంది. హత’ - అంటే కొట్టడం. అనాహత’ - కొట్టకుండా ఉండే ధ్వని. అంటే ధ్వని యొక్క అవ్యక్త స్థితి.

అనాహతమంటే ధ్వని గుణము. అదే నాదము.

       గంట ఉందండీ, కొడితే ఓంఅని శబ్దం వచ్చింది. గంట కొట్టక ముందు ఓంఅక్కడ అవ్యక్తంగా ఉంది. అక్కడ ధ్వని లేదుగా, గంట కొట్టలేదుగా. గంట కొట్టలేదు అంటే అనాహతం. కొట్టడం అంటే హతం. కొట్టకపోతే అనాహతం. అనాహతంలో ప్రణవము నిశ్శబ్దము. మహత్తు బిందు రూపం ఆ బిందువు విస్తరించడము ఆరంభించింది. వ్యాహృతి అంటే విస్తరించడం. త్రివ్యాహృది అంటే మూడుగా విస్తరించడము. ఏమిటా మూడు? అకార, ఉకార, మకారములుగా. ప్రణవమందు అకార, ఉకార, మకారములు ఏకీకృతంగా ఉన్నాయి. శబ్దమేమో అనాహతంగా ఉంది. శబ్దము ఉత్పత్తి అయ్యింది. అవుతూనే త్రివ్యాహృతంగా అయ్యింది. అకార, ఉకార, మకార మాతృకలుగా, మూడు పద్ధతులుగా, మూడు చీలికలుగా, మూడు విభాగాలుగా స్థూల సూక్ష్మ కారణాలుగా, త్రిపుటులుగా, త్రివ్యాహృతులైంది. అకార, ఉకార, మకారాలనే సృష్టి అయ్యింది. ప్రణవంవిన్నవారికి, స్మరించు వారికి జన్మ ఉండదు. అనాహత శబ్దం, ఎవరికైతే వినబడుతోందో, శబ్దం చెవులకు వినబడే శబ్దం హతశబ్దం. హతశబ్దం నిన్ను బంధిస్తోంది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలన్నీ కూడా శబ్ద రూపంలో అవి నిన్ను బంధిస్తున్నాయి. అవి విషయాలుగా ఉండబట్టి, విషయాసక్తిగా నీకు ఉండబట్టి, విషయాలు నీకు తెలియబడడం బంధమైనది. అనాహతం దగ్గర శబ్దం కూడా లేదు గనుక, అనాహత శబ్దాన్ని ఎవరైతే వింటారో, అంటే అక్కడ వినడం లేదు. తానే ప్రణవ స్వరూపుడై, తానే ఆ ప్రణవనాద రూపుడై ఉంటాడు. తానే ఆ ప్రణవనాద రూపుడౌతాడు.

       ప్రణవ రూపుడు ఎవడైతే ఉన్నాడో, వాడు ఆ నాదరూప బ్రహ్మని స్మరించువాడు. ఈ స్మరణ అజపంగా, అప్రయత్నంగా జరుగుతుంది. స్మరించుట, అజపము, అప్రయత్నము, నిష్ఠ అన్నప్పుడు తదాకారమే, ఆ బ్రహ్మాకారమే తానైపోతాడు. ఏదైతే స్మరిస్తున్నాడో, ఆ స్మరణ రూపుడు అంటే తదాకారుడు. అట్టివారికి జన్మ ఉండదు. అంటే బ్రహ్మనిష్ఠుడై, చలించని వానికి జన్మ ఉండదు. అయితే ఈ జన్మ ఎటువంటిదో చెప్దాము. కేవలము అకార, ఉకారములతో ప్రణవము కాలేదు. మళ్ళీ దీనిని, ఈ మూడింటిని విభజన చేస్తున్నాడు. అకార, ఉకారాలతో అయినది. కారమను బిందువుతో చేరగా ఓంఅను అక్షరమైనది. ఓంఅన్నప్పుడే పెదవులు రెండూ కలిసి కారం వచ్చింది, అప్పుడు ఓంఅను అక్షరమైంది. ఇక్కడ అక్షరం అంటే ఏంటి? క్షరము కానిది. ఓంఅనేది అక్షరమైతే, ‘ఓంద్వారా ఓంకారేశ్వరుడి యొక్క, ఓంకార బ్రహ్మము యొక్క సంకల్పము చేత, వచ్చినవన్నీ కూడా ఊహామాత్రం, సంకల్ప మాత్రం. భావనామాత్రం. కనుక ఊహలాగిపోతే అవి ఆగిపోతాయి. ఊహలు లయమైతే, అవి లయమౌతాయి. ఊహ ఎప్పుడొస్తే, అప్పుడు సృష్టించబడుతాయి. ఊహలు కొనసాగుతూ ఉంటే, అవి కూడా కొనసాగుతూ ఉంటాయి. ఊహలో మార్పు వస్తే, వికారం చెందుతూ ఉంటాయి. ఊహఆగిపోతే అవి లయం చెందుతాయి కనుక ఊహద్వారా వచ్చినవి మాత్రమే సృష్టి, స్థితి, లయలుగా ఉన్నాయి. ఊహకు ఆధారమైన ప్రణవము, సృష్టి స్థితి లయములకు అతీతంగా ఉంది. కనుక అది కూడా బ్రహ్మమే. కాకపోతే ఎఱుక బ్రహ్మ. మూలం ఉందిగా దీనికి! మూలం లేనిదైతే అచల బ్రహ్మ. మూలం ఉన్నది కనుక ఎఱుక బ్రహ్మ. ఇక్కడ అక్షరము. క్షర అక్షరుడనే ద్వంద్వంలో అక్షరము. ఇదే ప్రణవము. ఇది వర్ణత్రయంతో కూడి ఉన్నది. అకార, మకారములు రెండునూ బ్రహ్మసంబంధమైనవి. ఉకారము మాత్రము త్రిపుటిగా తెలుపు, ఎరుపు, నలుపు వర్ణములు కలిగియున్నది. కనుక ఉకారమే మాయ. ఉకారమే త్రిగుణములు. ఇది ప్రకృతి సంబంధమైనది. ఉకారము గుణరహితుడగు పరబ్రహ్మ సంబంధమైన ’, ‘వాటికి గుణ సహితమగు ప్రకృతి సంబంధమైన ’, దానికి తాదాత్మ్య సంబంధమైన బిందువుతో కూడిక కలిగి ఓంఅయినది.

ఫై వ్యాసము

"సర్వ వేదాంత శిరోభూషణం" అను బ్లాగు నుండి సేకరణ

బ్లాగును చేరుటకు క్రింద క్లిక్ చేయగలరు

https://svsbblog.blogspot.com/p/15.html

గమనిక: ఈ వ్యాసము ఇక్కడ ముముక్షువులకు ఉపయుక్తముగా వుండునను భావనతో మాత్రమే  ప్రకటించబడినది.  ప్రకటించుటయందు ఎవరికైనా ఆక్షేపణలు వున్నా, తెలిపిన ఈ బ్లాగునుండి ఈ వ్యాసమును తొలగించుటకు బ్లాగరు సంసిద్దుడు.