1, ఆగస్టు 2024, గురువారం

Panchaag


 

గణపతి - పంచీకరణం

 ✳️గణపతి - పంచీకరణం✳️


ఆకాశం నుండి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు ఏర్పడ్డాయి. నీటి నుంచి భూమి ఏర్పడింది. జడపదార్ధమైన భూమి చైతన్యం కలిగిన నీళ్ళతో చేరినప్పుడు ప్రాణశక్తి కలిగి - ఆహారపదార్ధాలనూ, ఓషధులని మనకు అందిస్తుంది.


నీరు ప్రాణాధారశక్తి. జడశక్తులు కలయికతో ఈ సృష్టి ఏర్పడిందనడానికి సంకేతంగా గణపతి విగ్రహాన్ని మట్టి నీరు కలిపి తయారుచేస్తాం. అప్పుడది పూజార్హం అవుతుంది.


మన శరీరంలో 6 చక్రాలు ఉన్నాయి అంటుంది యోగశాస్త్రం. 6 చక్రాల్లో మొదటిది మూలాధారచక్రం, వెన్నుపూస చివరి భాగాన ఉంటుంది. నాలుగు రేకులు పద్మంవలే, ఎరుపు రంగు కాంతులు విరజిమ్ముతూ ఉంటుంది.


యోగశాస్త్రం ప్రకారం మూలాధారచక్రానికి గణపతి అధిష్ఠానదేవత. మూలాధారం - పృధ్వీ తత్వం, అంటే భూమికి సంకేతం. కనుక వినాయకున్ని మన్నుతోనే చేయాలి.


పంచభూతాల్లో, ప్రతి భూతంలోనూ, దాని తత్వం 1/2 వంతు, తక్కిన 4 భూతాల తత్వాలు ఒక్కొక్కటి 1/8 వంతుగా ఉంటాయి.


ఉదాహరణకు భూమి- అందులో 1/2 భూతత్వం అయితే, 1/8 జలం, 1/8 అగ్ని, 1/8 వాయువు, 1/8 ఆకాశం ఉంటాయి.  దీన్నే 'పంచీకరణం' అంటారు.


ఒక్కో తత్వానికి ఒక్కో అధిష్ఠానదేవత ఉంటారు. భూతత్వానికి అధిష్ఠానదేవత గణపతి, ఆకాశతత్వానికి ఈశ్వరుడు (శివుడు), జలతత్వానికి నారాయణుడు, అగ్నితత్వానికి అంబిక, వాయుతత్వానికి ప్రజాపతి (బ్రహ్మ).


మనం పూజించే విగ్రహంలో గణపతి తత్వం 1/2 భాగం ఉండగా, మిగిలిన ఈ దేవతల తత్వం 1/8 భాగంగా ఉంటుంది.


పరమాత్ముడు ఒక్కడే, ఎన్నో విధాల కనిపించినా, అన్ని ఒక్కడినే చేరుతాయి.  వినాయక విగ్రహ నిర్మాణంలో 1/2 భూతత్వం, తక్కినవి 1/8 ప్రకారం ఉంటాయి.


మనం మట్టితో చేసే గణపతి విగ్రహం పంచ మహాభూతాల సమాహారం. ఆ మట్టి ప్రతిమను పూజించడం ద్వారా పంచభూతాలను, వాటి అధిష్ఠాన దేవతలను పూజిస్తున్నాం. ఇది ఇతర పదార్ధాల చేత చేయబడిన గణపతి మూర్తులను ఆరాధించడం వలన కలుగదు.


పంచభూతాలతో ఆధునిక మానవుడు సంబంధం తెంచుకున్న కారణం చేతనే అనేక సమస్యలకు, ఒత్తిళ్ళకు, రోగాలకు బాధితుడవుతున్నాడు.


ఏ తత్వాలతో ఒక వస్తువు ఏర్పడుతుందో, చివరికది ఆ తత్వాలలోనే లయం అవుతుంది. అదే సృష్టి ధర్మం. కనుక వినాయక విగ్రహాన్ని నీళ్ళలో కలపడం వల్ల, ఆ విగ్రహంలో ఉన్న పంచతత్వాలు క్రమంగా వాటిల్లో లీనమవుతాయి.

**** శివాయ గురవే నమః🙏✳️

గురువే దేవుడు

 ✳️ *గురువే దేవుడు* ✳️

        


*'గురువూ, దేవుడూ ఒకేసారి కనిపిస్తే ముందు నేను గురువుకే నమస్కారం చేస్తాను. దేవుడిని నాకు ముందు చూపించినవాడు గురువే కదా!'*

అంటారు కబీర్ 


యుద్ధరంగం మధ్య విషాదయోగంలో పడ్డ అర్జునుడికి *'సుఖదుఃఖే సమైకృత్వా'* అంటూ గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడిని కొందరు *'జగద్గురువు'* గా భావిస్తారు. అద్వైతబోధ చేసిన ఆదిశంకరులు మరో జగద్గురువు. 


రాయికి రూపం ఇచ్చేవాడు శిల్పి. శిష్యుడికి రూపం తెచ్చేవాడు గురువు. 'గు' అంటే చీకటి, 'రు' అంటే పోగొట్టేది. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడు గురువే కనకే, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తరవాత పూజనీయుడవుతున్నాడు.


గురువును పరబ్రహ్మ స్వరూపంగా సంభావించే సంప్రదాయం మనది.

అధర్వణ వేదంలోని శిష్టాచార సంప్రదాయం ప్రకారం - చదువుకు కూర్చునే ముందు శిష్యుడు ఇష్టదేవతా ప్రార్థన తరవాత *'స్వస్తినో బృహస్పతిర్దదాతు'* అంటూ గురువును స్మరించే విధానం ఉంది. 


మహాభారతం అరణ్యపర్వంలో యక్షుడు, *'మనిషి మనీషి ఎలాగవుతాడు?'* అనడిగినప్పుడు - 'అధ్యయనం వలన... గురువుద్వారా' అని సమాధానం చెబుతాడు ధర్మరాజు.  అందరూ ప్రణామాలు చేసే ఆ శ్రీరామచంద్రుడు కూడా విశ్వామిత్రుడి ముందు చేతులు జోడించి నిలబడి ఉండేవాడు. సమాజంలో గురుస్థానం అంతటి ఘనమైనది కనకనే శ్రీకృష్ణుడు చదువుచెప్పిన సాందీపుని కోసం అతని మృతశిశువును తిరిగి తెచ్చేందుకు అంత లావు శ్రమ తీసుకున్నది!.


గురువును గౌరవించటం రానివారు జీవితంలో రాణించలేరనటానికి కౌరవులే ప్రబలతార్కాణం.‌ చిన్నతనంలో విద్యాబుద్ధులు చెప్పిన గురువును ఔరంగజేబు‌ కూడా చక్రవర్తి అయిన తరవాత దారుణంగా అవమానించాడు. 


క్రీస్తు పుట్టుకకు మూడు శతాబ్దాల ముందే మహామేధావి అరిస్టాటిల్‌ ఏథెన్స్‌లో ఒక పెద్ద విశ్వవిద్యాలయన్నే స్థాపించి అలెగ్జాండర్‌ లాంటి విశ్వవిజేతను తయారుచేశాడు. అదేదారిలో చంద్రగుప్తుడిని తీర్చిదిద్దిన మహాగురువు మన కౌటిల్యుడు.  కృష్ణదేవరాయలుకు తిమ్మరుసు మామూలు మంత్రేకాదు, గురువు కూడా. మనిషి భూమిమీద పడిననాడే బడిలోపడినట్లు లెక్క. ఇంటివరకూ తల్లే ఆది గురువు. తల్లితండ్రులు ప్రేమపాశంచేత కఠిన శిక్షణనీయలేరు గనక గురువు అవసరం కలిగింది. గురుకుల సంప్రదాయంలో మహారాజు కుమారుడైనా కౌమారదశలో గురుకుల విద్యాభ్యాసం చేయవలసిందే! మహాచక్రవర్తి అయిన హిరణ్యకశిపుడు కూడా చెక్కిట పాలుగారే ప్రహ్లాదుడిని మంచి విద్యాబుద్ధులు నేర్పించమని చండామార్కులవారికి అప్పగించాడు.  పాటలీపుత్రాన్ని ఏలే సుదర్శనుడు తన బిడ్డలు విద్యాగంధం లేక అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉన్నారనే గదా వారిని విష్ణుశర్మ అనే పండితుడి వద్దకు విద్య నేర్చుకోవటానికి సాగనంపింది! 


నాటి చదువులు నేటి విద్యలంత సుకుమారంగా ఉండేవికావు. వేదాధ్యయనం తరవాత పరీక్షలు మరింత కఠినంగా ఉండేవి. నింబ, సారసమనే రెండు పరీక్షలు మరీ సంక్లిష్టం. సామవేదం సంగీతమయం. తలూపకుండా వల్లించటం తలకు మించిన పని. బోడిగుండు మీద నిమ్మకాయ పెట్టుకుని అది దొర్లకుండా వల్లింపు పూర్తిచేస్తేనే పరీక్ష అయినట్లు, అది నింబ పరీక్ష. మెడకు రెండువైపులా సూదులుతేలిన నారసంచుల్ని కట్టి సామగానం చేయమనేవాడు గురువు. తల కదిలితే సూదులు నేరుగా గొంతులో దిగుతాయి! అది నారస పరీక్ష. గురువు మాట వేదవాక్కుగా సాగిన కాలం అది.

మన పురాణాలు, ఉపనిషత్తులు, చరిత్రల్లోనే కాదు- ప్రపంచవ్యాప్తంగా కూడా గురుప్రసక్తి లేని, గురుప్రశస్తి చేయని సంస్కృతులే లేవు. 


జార్జి చక్రవర్తి తన కొడుకు 'ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌' చదివే పాఠశాలకు వెళ్ళి కొడుకు ఎలా చదువుతున్నాడో చూడాలని ఉబలాటపడ్డాడు ఒకసారి. చక్రవర్తి వస్తున్నాడని తెలిసి ఆ పాఠాలు చెప్పే పంతులుగారు 'మహాప్రభో! మీరు రావద్దు' అని కబురు చేశాడు. 'ఎందుకయ్యా?' అనడిగితే,  'తమరు వస్తే నేను మర్యాదపూర్వకంగా నా తలపాగా తీసి, లేచి నిలబడాలి. ఇంతవరకూ నా విద్యార్థుల దృష్టిలో నేనే పెద్దను. నాకంటే పైన మీరొకరున్నారని తెలిసిపోతే, నా మాట విలువ తగ్గిపోతుంది. అది వారి భవిష్యత్తుకు మంచిది కాదు!' అని విన్నవించుకున్నాట్ట. రాజుగారు మన్నించి అటువైపు వెళ్లటం మానుకున్నారు. అదీ ఆ రోజుల్లో గురువుకిచ్చిన విలువ!


దేవతలకూ గురువు ఉన్నాడు బృహస్పతి. రాక్షసులకు శుక్రాచార్యుడు గురువు. మృతసంజీవనీ విద్య అతనికొక్కనికే తెలుసు. కచుడు ఆ తంత్రం తెలుసుకునేందుకే శిష్యరికం చేయటానికి వచ్చి, చచ్చి బతికిన కథ మనకు తెలుసు. 'ద్రోణ' పేరుతో గురువులకు ఇవాళ బిరుదులిస్తున్నారు. ఆ ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకోవాలని తంటాలుపడి భంగపడినా ఆయన పిండి విగ్రహం ముందు పెట్టుకుంటేగాని ఏకలవ్యుడికి ఆ శాస్త్రరహస్యం పట్టుబడలేదు.

బలి అమాయకంగా వామనుడి రూపంలో వచ్చిన విష్ణువుకు సర్వం ధారబోసే ప్రయత్నంలో ఉండగా, శిష్యవాత్సల్యంతో అడ్డుపడి కన్నుపోగొట్టుకున్నాడు గురువు శుక్రాచార్యుడు.

 

గురుస్థానం అంత గొప్పది కనకనే మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం దేశాధ్యక్షుడి పదవికన్నా బడిపిల్లలకు పాఠాలు చెప్పటానికే ఎక్కువ మక్కువ చూపుతున్నాడు. ఓ తమిళ పత్రికలో బాలలకు ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో ఓ చిన్నారి 'చిన్నతనంలో మీరు చాలా కష్టాలు పడి ఓ పెద్ద శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు, రాష్ట్రపతి అయ్యారుగదా! మీ విజయానికి కారణం అదృష్టమా?' అని అడిగితే 'అవును. చిన్నతనంలో నాకు మంచి దారిచూపించే ఉపాధ్యాయులు దొరికిన అదృష్టం' అని బదులిచ్చాడు కలాం. అలాంటి గురువుకి నేటి మన సినిమాల్లో పడుతున్న గతిని చూస్తుంటే దిగులు కలుగుతుంది.

'గురువు' అంటే గుండ్రాయి కాదు అంటాడు ఓ సినిమా కవి. కాదు గుండ్రాయే! మనిషి అజ్ఞానాన్ని, మొండితనాన్ని చితక్కొట్టే గుండ్రాయే నిజమైన గురువు. తాను ఆనాడు 'గోడకుర్చీ' వేయించాడు గనకే మనమీనాడు ఓ 'కుర్చీ'లో కూర్చుని గొప్పగా పనిచేసుకోగలుగుతున్నాం.


గురువులు అష్టవిధాలు.

అక్షరాభ్యాసం చేయించినవాడు,

గాయత్రి ఉపదేశించినవాడు,

వేదాధ్యయనం చేయించినవాడు,

శాస్త్రజ్ఞానం తెలియజెప్పేవాడు,

పురోగతి కోరేవాడు,

మతాది సంప్రదాయాన్ని నేర్పించేవాడు,

మహేంద్రజాలాన్ని విడమరిచి చెప్పేవాడు,

మోక్షమార్గాన్ని చూపించేవాడు

అని పురాణజ్ఞానం తెలియజేస్తున్నా వాటిని పట్టించుకొనే శిష్యులు ఇప్పుడు లేరు. గురువుకు నామాలు పెట్టే శిష్యులు తయారవుతున్నారు.


*దొంగలపాలు కానిది, దొడ్డకీర్తిని తెచ్చేది, పరమ సౌఖ్యానిచ్చేది, భద్రతనిచ్చేది, యాచకులకిచ్చినా రవంత తరగనిది, గొప్ప నిధి అయిన జ్ఞానాన్ని ఇచ్చే గురువును లఘువు చేయకుండా ఉంటేనే ఏ జాతికైనా మేలు జరిగేది.*


***** శివాయ గురవే నమః🙏****

శౌనక మహర్షి

 #మన_మహర్షులు -43


#శౌనక మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


పూర్వం విజ్ఞానఖని తపస్సంపన్నుడైన ఒక మహర్షి శునకుడనే పేరుతో వుండేవాడు. ఆయన  కొడుకే మన శౌనక మహర్షి. 


శౌనకుడు వేదవేదాంగాలు నేర్చుకుని, అన్ని యజ్ఞాలు చేయించగల సామర్థ్యం వచ్చాక తపస్సు చేసుకుందుకు నైమిశారణ్యానికి వెళ్ళాడు.


 నైమిశారణ్యం ఎంత అందంగా వుండేదో కొంచెం మనం కూడా తెలుసుకుందాం...


నైమిశారణ్యం విష్ణుమూర్తి మందిరంలా, మాధవీ మన్మధులకి ఇష్టమయినట్లు, సరస్వతీదేవితో కలిసివున్న బ్రహ్మగారిల్లులా, ఈశ్వరసభలా, వహ్ని, వరుణ, సమీరణ చంద, రుద్ర, హైమవతీ, కుబేర, గాలవ, శాండిల్యలాంటి మునులతో కూడుకుని, కుబేరుడి ఖజానాలా, రఘురాముడి యుద్ధంలా, పరశురాముడి పౌరుషంలా, కురుక్షేత్రంలా ఇంకా వేదాల్లా గాయత్రీ నిలయమై అమరావతీ పట్టణంలా, వైకుంఠపురంలా, పురుషోత్తముడి

సేవకవసరమైన ఫలాల్తో, లంకానగరంలా, సుగ్రీవుడి సైన్యంలా, గొప్ప గొప్ప మునుల తపస్సులతో పవిత్రమై, సూర్యరథంలా ఉండేది. కాబట్టి  ఆ ప్రదేశానికి శ్రీవిష్ణుక్షేత్రం అనే పేరు వచ్చింది .


అలాంటి  నైమిశారణ్యంలో బ్రహ్మజ్ఞానిగా వెలిగిపోతున్న ఆ శౌనక మహర్షి ఎంతోమంది మునుల్ని శిష్యులుగా చేసుకుని ఉండిపోయాడు.


ఒకసారి శౌనకుడు వెయ్యి సంవత్సరాలు జరిగే సత్రయాగం చెయ్యాలని అనుకుని దాన్ని జరిపించడానికి సూతుణ్ణి ఎంచుకున్నాడు. సూతుడు ఎన్నో గ్రంథాలు చదివి, ఎన్నో పురాణాలు విని దివ్యజ్ఞానం పొందినవాడు.

 శౌనక మహర్షి కి ఇంకా అక్కడ మునులందరికి భగవంతుడి ఏకవింశత్యవతార కథలు అంటే విష్ణుమూర్తి 21 

అవతారాలు  ఎత్తిన కథలు, అన్ని పురాణలు కూడా వాళ్ళకి విన్పించాడు సూతుడు.


కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ శౌనకుడు లోకానికంతకీ మంచి జరగాలని ద్వాదశ సంవత్సర సత్రయాగం మొదలుపెట్టి మళ్ళీ సూతుణ్ణి పిలిచి మునులందరికీ భారత కథలు చెప్పించాడు.


ఈరకంగా నైమిశారణ్యం శౌనక మహర్షి చేసే యాగ సమయంలో విజ్ఞాన కథలు పురాణాలు, ఇతిహాసాలు, సూతుడు శౌనకాదులకి చెప్తుంటే ఆ ప్రదేశం పుణ్యక్షేత్రమై బ్రహ్మలోకంలా అనిపించేది.


పాండవులు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు గంగాతీరంలో ఒక చెట్టు కింద ఒక రాత్రి గడిపి మళ్ళీ బయలుదేరారు.


 అక్కడున్న బ్రాహ్మణులు   పాండవుల వెనకాలే బయలుదేరారు. 


 ధర్మరాజు శౌనక మహాముని చెప్పినట్లు విని సూర్యుడ్ని ఆరాధన చేసి, ఆయన

అనుగ్రహంతో అనేకవేల బ్రాహ్మణులకి అతిథిపూజ చేసి తర్వాత వెళ్ళాడు.


 మునులందరూ మళ్ళీ చేరి శౌనక మహామునిని పద్మపురాణం చెప్పించమని అడిగారు. అదే సమయానికి సూతుడు వచ్చాడు. అందరూ ఆనందించి మాకు పద్మపురాణం చెప్పమని అడిగారు.


పద్మపురాణమంటే విష్ణుమూర్తి నాభినుంచి పుట్టిన కమలం గురించి చెప్పేది. కల్పాంతంలో మత్స్యరూపంలో వున్న ఆదిదేవుడు సముద్రం నుంచి వేదవేదాంగ పురాణలతో పద్మపురాణం కూడా దేవలోకంలోనూ, మనుష్య లోకంలోనూ ప్రతిష్టించబడింది


దానిని హరి బ్రహ్మకీ, బ్రహ్మ నారదుడికి, నారదుడు వ్యాసుడుకి, వ్యాసుడు నాకు చెప్పారని సూతుడు శౌనకాది మహామునులకి పద్మపురాణం వివరంగా చెప్పాడు.


శౌనకమహర్షి బ్రహ్మాజ్ఞానిగా, బహువిధ యజ్ఞకర్తగా, మహాధర్మవేత్తగా కూడ ప్రసిద్ధికెక్కాడు.


జిజ్ఞాసువు శౌనకుడు అంగీరస మహర్షి వద్దకు వచ్చి "ఏది తెలుసుకుంటే సర్వమూ తెలుసుకున్నట్లవుతుంది?" అని అడిగిన ప్రశ్నకు అంగిరసుడు "పరావిద్య, అపరావిద్య అని రెండు రకాలు తెలుసుకోవలసినవి ఉన్నాయని బ్రహ్మవిదులు అంటారు. పరావిద్య అంటే పరబ్రహ్మకు సంబంధించిన జ్ఞానం. అపరావిద్య అంటే లౌకికమయిన ధర్మాధర్మాలకు సంబంధించినది. రెండవదానికంటే మొదటిది గొప్పది. దాన్ని తెలుసుకున్నవాడు సంసారచక్రం నుంచి విముక్తుడవుతాడు." అంటూ ముండకోపనిషత్తు అనే ఉపనిషత్తును అంగీరసుడు బోధించాడు.


శౌనక మహర్షి చరణవ్యూహ అను ధర్మశాస్త్రమునకు గ్రంథకర్త.


 'మదనరత్నప్రదీప' అనే ధర్మశాస్త్రం, 'చరణవ్యూహ' అనే ధర్మశాస్త్రం కూడ ఈయనవే. మను ధర్మశాస్త్రంలో శౌనకుడు ధర్మశాస్త్ర కర్తగా ఉండటమే కాకుండా 'ప్రణకల్ప అనే గ్రంథం కూడా రచించాడు


శౌనక మహర్షి సూతుడు చేత ఎన్నో పురాణాలు, భారత కథలు, విష్ణుకథలు అన్నీ చెప్పించడం వల్ల ఎంతోమంది మునులు విని తరించారు. ..

*శ్రీ క్షణాంబిక శ్రీచక్రాలయం*

 🕉 *మన గుడి : నెం 396*


⚜ *కర్నాటక  : శ్రీరంగపట్నం - మండ్య*


⚜ *శ్రీ క్షణాంబిక శ్రీచక్రాలయం* 



💠 *క్షణాంబికా దేవి శ్రీ చక్రాలయం కర్ణాటకలోని మాండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణ పట్టణంలో ఉంది*.

 

🔆 *శ్రీ క్షణాఃబికా ఆలయ చరిత్ర:*


 💠 ఈ ఆలయం 1200 సంవత్సరాల పురాతనమైనది.

ఈ ఆలయాన్ని శ్రీ క్షణాంబికా దేవి గుడితో పాటు జ్యోతిర్మహేశ్వర (శివుడు) మరియు వేధనాయకి (క్షణాంబికా) ఆలయం అని కూడా పిలుస్తారు. 


💠 క్షణాంబికా దేవి అత్యంత ప్రజాదరణ పొందిన నిమిషాంబ దేవి కంటే శక్తివంతమైనదని నమ్ముతారు.

ఆమె ఒక 'నిమిష' (ఒక నిమిషం)లో కోరికలను తీర్చే శక్తిని కలిగి ఉంటుంది, అయితే క్షణాంబికా దేవి భక్తుల కోరికలను క్షణoలో తీర్చే శక్తిని కలిగి ఉంది.  .


💠 ఆలయ ప్రాంగణంలో రెండు లింగాలు మరియు ఒక దేవి గుడి ఉన్నందున చాలా శక్తివంతమైన ప్రకంపనలను అనుభవించవచ్చు. 


💠 ఈ ఆలయం నిమిషాంబ ఆలయంతో పోలిస్తే తక్కువ ప్రజాదరణ పొందింది. 


 💠 క్షణాంబిక లక్ష్మీ, పార్వతి మరియు సరస్వతి దేవి కలయిక తప్ప మరొకటి కాదు.  పార్వతి శరీరంతో, లక్ష్మీ దేవి  విగ్రహంలాగా 

తన రెండు చేతులపై కమలాన్ని పట్టుకుంది మరియు సరస్వతీ దేవి లాగా ఆమె అపారమైన జ్ఞానం, సంగీతం, కళ మరియు అభ్యాసానికి ప్రసిద్ధి చెందింది, అందుకే ఆమెను కూడా పిలుస్తారు.  "వేదనాయకి" గా. 


💠 దేవతా విగ్రహాన్ని శ్రీ ఆదిశంకరాచార్యులు స్థాపించారని నమ్ముతారు. 


💠 నిమిషాంబ దేవి కూర్చున్న దేవత అయితే, క్షణాంబిక దేవత విగ్రహం క్రింద ఉన్న శ్రీ యంత్రం (శ్రీచక్రం) వద్ద నిలబడి ఉన్న దేవత యొక్క విగ్రహం.  

యంత్రంలో బీజాక్షరిమూల మంత్రం పూర్తిగా నల్లని రాతిపై చెక్కబడి ఉంది, ఇది దేవతకి అర్పించే పసుపు మరియు కుంకుమతో అలంకరించే వరకు కనిపించదు.


💠 శ్రీ యంత్రం చాలా శక్తివంతమైనదని నమ్ముతారు, ఇది విశ్వాన్ని రేఖాగణిత రూపంలో సూచిస్తుంది.  

శ్రీ యంత్రానికి 9 త్రిభుజాలు ఉన్నాయి.  

వాటిలో 4 నిటారుగా ఎదురుగా ఉన్నవి శివుడిని సూచిస్తాయి, మిగిలిన 5 త్రిభుజాలు శక్తి (పార్వతి)ని సూచిస్తాయి.

శ్రీ యంత్రం విశ్వ శక్తిని గ్రహిస్తుంది మరియు మండలం శక్తులను క్రియాశీలం చేస్తుంది.


💠 క్షణాంబికా ఆలయానికి ఆనుకుని శ్రీ దండపాణి సుబ్రహ్మణ్యేశ్వరుని మందిరం, ఆ పక్కనే శ్రీ జ్యోతిర్మహేశ్వర స్వామి ఆలయం మరియు గిరిజా కళ్యాణ మంటపం అనే పెద్ద హాలు ఉన్నాయి.


💠 క్షణాంబికా దేవి ఆలయం చాలా పురాతనమైనది మరియు ఆచార్య ఆదిశంకరులు ఈ ఆలయంలో (6వ శతాబ్దంలో) శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. 


💠 18వ శతాబ్దం ప్రారంభంలో కలలే నంజరాజా అనే వడయార్ రాజవంశానికి చెందిన దళవాయి (కమాండర్ ఇన్ చీఫ్) ఇది నిర్మించారు. 

అందువల్ల ఆలయ స్తంభంలో ఒకదానిపై కలలే నంజరాజా మరియు అతని భార్య చిత్రాలు చెక్కబడ్డాయి.


💠 సుబ్రహ్మణ్యేశ్వర మందిరం ముందు అందమైన గాయత్రీ దేవి విగ్రహం కూడా ఉంది.

తదనంతర కాలంలో, ఆలయం కొన్ని శతాబ్దాలపాటు ఉపేక్షకు గురైంది మరియు దట్టమైన వృక్షసంపదతో మరుగున పడింది. కేవలం 50 సంవత్సరాల క్రితం, ఆలయ ఉనికి వెలుగులోకి వచ్చింది మరియు గత 10 సంవత్సరాల నుండి మాత్రమే ఇది పునర్నిర్మించబడుతోంది మరియు ఈ రోజు వరకు, దీనికి మరింత పునరుద్ధరణ అవసరం.


💠 దేవి ఆలయానికి ఎదురుగా, గణేశుడి విగ్రహం సుబ్రమణ్య స్వామి మరియు అతని భార్యలతో పాటు ఉంచబడుతుంది.

ఆలయంలో ప్రదక్షిణ కోసం విశాలమైన ఆవరణ ఉంది. 

మార్గంలో కలుపు మొక్కలు మరియు మట్టి దిబ్బలను తొలగించడం అవసరం, తద్వారా ఒకరు సౌకర్యవంతంగా ప్రదక్షిణ చేయవచ్చు. అయితే ఈ శక్తివంతమైన ఆలయం యొక్క గత వైభవాన్ని కేవలం ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా చూడవచ్చు మరియు ఈ పవిత్ర స్థలం యొక్క నిర్మాణాన్ని ఆస్వాదించవచ్చు.


💠 ఈ ఆలయం రోజురోజుకు మెల్లగా ప్రాచుర్యం పొందుతోంది మరియు అమ్మవారి పేరు సూచించిన విధంగా ఒక క్షణంలో తమ కోరికలు నెరవేరాలని ప్రజలు ఈ ఆలయానికి పోటెత్తుతున్నారు. 

క్షణాంబికా దేవి ఆలయం పట్టణంలో రద్దీగా ఉండే వీధిలో ఉన్నప్పటికీ ఆలయ పరిసరాలు నిజంగా ప్రశాంతంగా ఉన్నందున సందర్శించదగినది.


💠 శ్రీరంగపట్టణo బెంగుళూరు నుండి 125 కిలోమీటర్లు మరియు మైసూర్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.

దేహతాదాత్మ్యము

 #దేహతాదాత్మ్యము..*


ఒక పట్టణంలో ఒక గొప్ప శిల్పి ఉన్నాడు. అతడు జీవకళ ఉట్టిపడేటట్లు శిల్పాలను చెక్కుతాడు. అతడు శిల్పాలను చెక్కితే అది శిల్పంలాగా కాక ఆ మనిషే అక్కడ నిలబడి ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆయనకు ముసలితనం వచ్చింది. ఎప్పుడో ఒకప్పుడు చావు తప్పదు అని అతడికి తెలుసు. అయినప్పటికి చావును తప్పించుకోవాలనుకొని ఒక ఆలోచన చేశాడు. రూపం, రంగు, ఒడ్డు, పొడుగు, డ్రెస్ అన్నీ తనలాగే అచ్చు గ్రుద్దినట్లుగా ఉండే 9 శిల్పాలను తయారుచేశాడు. వాటిని చూసిన వారెవరైనా వాటిని శిల్పాలు అని అనుకోరు. ఆ శిల్పియే అనుకుంటారు. ఆ తొమ్మిదింటిని జాగ్రత్తగా దాచిపెట్టాడు. కొంతకాలం గడిచింది.


అతడికి జబ్బు చేసింది. డాక్టర్లు పరీక్షించి ఇక ఎంతోకాలం జీవించటం జరగదు. బహుశా రెండు మూడు గంటలు మాత్రమే అని చెప్పారు. అప్పుడా శిల్పి తన ఇంటి బయట 9 శిల్పాలను పరుండబెట్టి అన్నింటిపై ఒకేరకం వస్త్రాన్ని కప్పి, తాను కూడా వాటి మధ్య పడుకొని అదే రకం వస్త్రాన్ని కప్పుకున్నాడు. మరణ సమయం ఆసన్నమైంది. యమధర్మరాజు చేత పాశాన్ని ధరించి ఆ శిల్పి కోసం వచ్చాడు. అయితే అక్కడ 10 మంది శిల్పులు పరుండినట్లు గమనించాడు.ఆదిత్యయోగీ.


ఒక్కొక్క శిల్పం మీద వస్త్రాన్ని తొలగించి చూస్తుంటే అందరూ ఒక్కటిగానే ఉన్నారు. ఇందులో ఆయుష్షు తీరిపోయిన శిల్పి ఎవరా? అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఎంత ఆలోచించినా ఆయనకు బోధ పడటం లేదు.


ఒకరికి బదులు మరొకరి మెడలో పాశాన్ని వేయటం తన వృత్తి ధర్మానికే కళంకం. తనకున్న 'సమవర్తి' అనే పేరు తొలగిపోతుంది. అందువల్ల అందరినీ మరొకసారి పరికించి చూచి తిరిగివెళుతూ వెళుతూ "వీడెవడో గాని అన్నింటిని ఎంతో నైపుణ్యంతో, జీవకళ ఉట్టి పడేటట్లుగా చక్కగా చెక్కాడు గాని ఒక్క పొరపాటు చేశాడు" అని పెద్దగా అన్నాడు. ఆ మాట వినటంతోనే విగ్రహాల మధ్య పడుకున్న శిల్పి అమాంతంగా లేచి "ఏమిటయ్యా.. ఆ పొరబాటు..?" అన్నాడు. "..నీవు లేవటమే ఆ పొరపాటు" అని యమధర్మరాజు.. అతడి మెడలో యమపాశాన్ని వేసి ప్రాణాలు గైకొని పోయాడు. ఆ శిల్పి కొద్దిసేపు ఆగితే ప్రాణాలు దక్కేవి. కాని దేహాభిమానం అతణ్ణి వీడలేదు. నేను ఇంతటి గొప్ప శిల్పినే.. నేనేం పొరపాటు చేశాను..? అనే అభిమానం పొడుచుకు వచ్చింది. లేచాడు. పొయ్యాడు. దేహాభిమానమే అతడి కొంప ముంచింది, అతడి ప్రాణాలు తీసింది.

 

దేహాభిమానం గలవారు 'ఈ దేహమే నేను' అనే భావంతో ‘నేను’ 'నేను' అనే అహంకారాన్ని కలిగి ఉంటారు. ఈ దేహానికి సంబంధించిన వారిని 'నావారు' అని, ఈ దేహానికి సంబంధించిన వాటిని 'నావి' అనే మమకారాన్ని కలిగి ఉంటారు. ఈ అహంకార మమకారాల కారణంగానే జీవితంలో ప్రశాంతతను పోగొట్టుకొని, మనస్సును అనవసరమైన ఆందోళనలకు, ఉద్రేకాలకు లోనుగావించుకొని అశాంతిని, దుఃఖాన్ని కొని తెచ్చుకుంటారు. లోకంలో సాధారణంగా అందరూ ఈ అహంకార మమకారాలకు లోనవుతూనే ఉంటారు. అందుకే నిర్గుణోపాసన అనేది కష్టతరమవుతున్నది. ఈ "దేహతాదాత్మ్యమే మానవులు కున్న పెద్దదోషం".


ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించిన అనేక మంది సాధకులు జపధ్యానాదులు, ఉపాసనలు చేస్తున్నప్పటికీ మంచి ఫలితాన్ని పొందలేక పోవటానికి కారణం ఈ దేహాభిమానమే.. దేహతాదాత్మ్యమే.. దేహమే నేను అని భావించే అహంకారమే. క్షేత్రాన్ని శుద్ధం చేయకుండా.. పొలాన్ని సరిగ్గా దున్ని తయారు చేయకుండా విత్తనాలు చల్లితే ఏం ప్రయోజనం.. పునాది గట్టిగా వేయకుండా ఎన్ని అంతస్థుల మేడ కడితే అది ఎంతకాలం ఉంటుంది.. అలాగే అంతరంగం లోని దేహాభిమానం తొలగకుండా పరమాత్మయందు మనస్సు నిలుపుదాం అని ప్రయత్నిస్తే నిలుస్తుందా..? నిలవదు. కనుక ముందుగా దేహాభిమానాన్ని వదలాలి. ఆ దోషం తొలిగితే గాని నిర్గుణోపాసన కుదరదు...

.

శ్రీరామకృష్ణులు:..


                       "ఇతరులకు బోధించాలంటే అధికారిక ఆమోదం పొంది ఉండాలి. లేకుంటే బోధన అపహాస్యంగా పరిణమిస్తుంది. తానే అజ్ఞాని, ఇతరులకు జ్ఞానోపదేశం చేయటానికి పూనుకోవటమా? ఇది అంధుడు అంధుడికి దారిచూపటం వంటిది. అలా బోధచేయటం మేలుకంటే కీడే ఎక్కువ వాటిల్లజేస్తుంది. భగవత్సాక్షాత్కారానంతరం అంతర్దృష్టి కలుగుతుంది. ఆ తరువాతనే ఒక వ్యక్తిలోని ఆధ్యాత్మిక రుగ్మత నిర్ధారించి, సముచిత ఉపదేశం చేయగలిగేది.ఆదిత్యయోగీ.


"భగవదాదేశం లేకుంటే, మనిషికి 'నేను జనులకు ఉపదేశం చేస్తున్నాను' అని అహంకారం జనిస్తుంది. ఈ అహంకారం అతడి అజ్ఞాన జనితమే; అజ్ఞాని తాను కర్తనని భావించుకొంటాడు. గదా! 'భగవంతుడే కర్త ఆయనే సమస్తం చేస్తున్నాడు. నే నేమీ చేయటం లేదు.' ఇలా భావిస్తున్న వ్యక్తే నిజానికి జీవన్ముక్తుడవుతాడు. 'నేను కర్తను. నేను కర్తను' అనే భావంనుండే మనిషి యొక్క సమస్త దుఃఖాలు, అశాంతి ఉద్భవిస్తాయి...

.

"శూన్యం" పరానికి సంబంధించినది.

" ధర్మం" ఇహానికి చెందినది.


ఎప్పుడయితే మనం ఆలోచనల్ని దాటి శూన్యంగా.. నిశ్శబ్దంగా అయిపోతామో అప్పుడే అసలైన ధర్మం మన జీవితంలోకి ప్రవేశిస్తుంది. దీనినే శ్రీకృష్ణుడు భగవద్గీతలో "స్వధర్మం" అన్నాడు.


 శ్రీ రామకృష్ణులు ఆరాధించిన "ఖాళీ" యే కాళీమాత. కాళీమాత అనేది ఓ విగ్రహం కాదు. అర్ధరాత్రి..ఆదిత్యయోగీ.

ప్రపంచంలో ఉండే నిశ్శబ్దాన్ని , అంధకారాన్ని (అభేదాన్ని) ఆస్వాదించడమే కాళీమాత దర్శనం. రాత్రి నిద్ర పోతున్నపుడే కాదు.. పట్టపగలు కూడా ఆ నిశ్శబ్దాన్ని.. ఆ శూన్యాన్ని అనుభవించగలగడమే సహజ సమాధి. 


 నిజానికి తాను ఖాళీ అయిపోతే ఆ ఖాళీ...ఖాళీగా ఉండదు. ఆ "ఖాళీ" దైవంతో నిండిపోయి ఉంటుంది. అదే నిన్ను సదా నడిపిస్తూ ఉంటుంది. దీనిని అర్ధం చేసుకోగలగడం మానవుడికి మాత్రమే ఉన్న గొప్ప వరం...

.

శ్రీకృష్ణుడు భగవద్గీతలో

 " జహి శత్రుం,మహాబాహో, కామరూపం దురాసదమ్"

(ఓ మహాబాహువుడవైన అర్జునా!జయించడానికి అసాధ్యమైన ఈ కామము అనే శత్రువును నాశనము చేయుము),

అని అర్జునునితో అంటాడు.

స్త్రీయొక్క బాహ్య సౌందర్యం చూచి చలించని పురుషుడు లేడు.

కామమును జయించడం ఎంత కష్టమో "భర్తృహరి మహాయోగి" ఇలా అంటున్నారు..


(కేవలము వాయు భక్షణము చేసి గాని,ఆకులు తినిగాని, లేక నీటిని మాత్రమే ఆహారంగా స్వీకరించిగాని తపస్సు చేసుకునే విశ్వామిత్రుడు, పరాశరుడు వంటి మునీశ్వరులు కూడా పద్మమువంటి అందమైన, స్త్రీ ముఖమును చూడగానే మోహపరవశులయినారు.

నెయ్యి, పాలు, పెరుగులతో కూడిన వరి అన్నము తినే మానవులు నిజముగా ఇంద్రియములను (కామమును)జయిస్తే, వింధ్యపర్వతం సముద్రములో తేలుతుంది! ).ఆదిత్యయోగీ.

దేనికైనా పట్టుదలతో సాధన చేయాలి.

చంద్రబాబు, జగన్ , కె.సి.ఆర్ , కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తుంటే కాలం కూడా తెలియకుండా కాలగర్భంలో కలవడం తప్ప జీవితంలో ఏదీ సాధించలేము...


గోవులు రంగులు వేరైనా గోక్షిరము ఒకటే,

ఆభరణములు వేరైన బంగారు ఒకటే,

ప్రాంతములు వేరైనా ప్రాణులు ఒకటే,

నక్షత్రములు అనేకములైనా ఆకాశము ఒకటే,

అలాగె సర్వమతముల సారము భగవంతుడు ఒక్కడే..

"భగవంతుడు" అంటే సాకారము "ఆత్మ" అంటే నిరాకారము.....

.

దాశరధీ



దాశరధీ!


"ఎంతటిపుణ్యమో శబరి యెంగిలిగొంటివి వింతగాదె! నీ

మంతన మరయగా ఉడుతమైని కరాగ్ర నఖాంచలమ్మునన్.

సంతస మంద రాసివి;సత్కులజన్మములేమిలెక్క? వే

దాంతముగాదె నీమహిమ; దాశరధీ! కరుణాపయోనిధీ!

     🙏🙏🙏🙏

*01-08-2024 / గురువారం / రాశి ఫలితాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️


*01-08-2024 / గురువారం / రాశి ఫలితాలు*

•••••┉━•••••┉━•••••┉━•••••

మేషం


ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.  స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. వ్యాపార విషయమై కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలు మిశ్రమంగా సాగుతాయి.

---------------------------------------

వృషభం


దీర్ఘకాలిక రుణాలు నుండి బయట పడతారు. సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు విస్తృతమౌతాయి. అన్ని రంగాల వారికి అనుకూలత పెరుగుతుంది. ఆర్థికంగా ఆశించిన మార్పులుంటాయి. విలువైన  వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు అనుకూల స్థానచలనాలు కలుగుతాయి.

---------------------------------------

మిధునం


నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కొంత నిదానంగా సాగుతాయి. స్థిరస్తి విషయమైన సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగ ప్రయత్నలు నిదానంగా  సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

---------------------------------------

కర్కాటకం


గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. 

---------------------------------------

సింహం


స్నేహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నలు ఫలిస్తాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

కన్య


సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. దీర్ఘకాలిక ఋణాలు తీర్చడానికి చేసే ప్రయత్నలు ఫలిస్తాయి.  వృత్తి ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలుంటాయి. దూర  ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------

తుల


నిరుద్యోగులకు  నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారమున కీలక  నిర్ణయాలు అమలుచేసి లాభాలు అందుకుంటారు. మిత్రులతో  ఉన్న  వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.  ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం.

---------------------------------------

వృశ్చికం


గృహమున సంతాన శుభకార్య విషయమైన చర్చలు చేస్తారు.   సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ప్రయాణాలలో వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తంగా  వ్యవహారించాలి. వృత్తి ఉద్యోగాలు అనుకూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------

ధనస్సు


నిరుద్యోగులకు  అధికారుల అండదండలు లభిస్తాయి. అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. దూర ప్రాంత బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలు  నిర్వహిస్తారు. నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన విద్యావిషయాలలో శుభవార్తలు అందుతాయి.

---------------------------------------

మకరం


దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు.  దూరప్రాంత బంధు మిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.  వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు చెయ్యడం మంచిది.  సంతాన ఆరోగ్య  విషయంలో కొంత శ్రద్ద వహించాలి. 

---------------------------------------

కుంభం


చిన్ననాటి మిత్రులతో ఒక విషయమై మాటపట్టింపులు కలుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో  అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు.   నూతన   వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగ వ్యాపారములు అంతంత మాత్రంగా సాగుతాయి.

---------------------------------------

మీనం


ఆప్తులతో విందు   వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత   సంఘటనలు గుర్తుచేసుకుని  బాధపడతారు. గృహమున శుభకార్యాలకు ఖర్చులుచేస్తారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక లాభాలు అందుకుంటారు. దాయదులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు.

•••••┉━•••••┉━•••••┉━•••••

🍁 *శుభం భూయాత్* 🍀

గురువారం*🌷 🌹 *ఆగష్టు,01, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       🌷 *గురువారం*🌷

  🌹 *ఆగష్టు,01, 2024*🌹

      *దృగ్గణిత పంచాంగం*

                

*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - గ్రీష్మ ఋతౌః*

*ఆషాఢమాసం - కృష్ణపక్షం*


*తిథి : ద్వాదశి* మ 03.28 వరకు ఉపరి *త్రయోదశి*

వారం :*గురువారం* ( బృహస్పతివాసరే)

*నక్షత్రం : మృగశిర* ఉ 10.24 వరకు ఉపరి *ఆరుద్ర*


*యోగం : వ్యాఘాత* మ 12.50 వరకు ఉపరి *హర్షణ*

*కరణం : తైతుల* మ 03.28 *గరజి* రా 03.24 ఉపరి *వణజి*


*సాధారణ శుభ సమయాలు* 

*ఉదయం 07.00 - 09.30 వరకు*

అమృత కాలం :*రా 12.44 - 02.22*

అభిజిత్ కాలం :*ప 11.48 - 12.39*


*వర్జ్యం : రా 07.00 - 08.38*

*దుర్ముహుర్తం : ఉ 10.05 - 10.57 మ 03.14 - 04.05*

*రాహు కాలం : మ 01.50 - 03.26*

గుళిక కాలం :*మ 09.01 - 10.37*

యమ గండం :*ఉ 05.48 - 07.24*

సూర్యరాశి : *కర్కాటకం* 

చంద్రరాశి : *మిధునం*

సూర్యోదయం :*ఉ 05.48* 

సూర్యాస్తమయం :*సా 06.39*

*ప్రయాణశూల :‌ దక్షిణ దిక్కుకు* 

*ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.48 - 08.22*

సంగవ కాలం :*08.22 - 10.57*

మధ్యాహ్న కాలం :*10.57 - 01.31*

అపరాహ్న కాలం :*మ 01.31 - 04.05*

*ఆబ్ధికం తిధి :ఆషాఢ బహుళ ద్వాదశి*

సాయంకాలం :*సా 04.05 - 06.39*

ప్రదోష కాలం :*సా 06.39 - 08.53*

నిశీధి కాలం :*రా 11.51 - 12.36*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.19 - 05.04*

______________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


🌹🙏 *శ్రీ దత్తాత్రేయ అజపాజప స్తోత్రం...!!*


స్వాధిష్ఠానే షడ్దలచక్రే తనులింగే|

బాలాం తావత్ వర్ణవిశాలైః సువిశాలైః |

పీతం వర్ణం వాక్పతిరూపం ద్రుహిణం తం |

దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ||


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

       🌹🌷🌹🌹🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🌷🌷🌹🌷

 🌹🍃🌿🌹🌹🌿🍃🌹

ఈరొజు ఆంధ్ర ప్రభలొ వ్యాసం "ప్రజ్ఞ్యానం బ్రహ్మ"


 

తెలుసా మీకు.

 పెళ్లిలో కన్యను గంపలో మేనమామ ఎందుకు మోసుకుంటూ వస్తాడో తెలుసా మీకు.?

వెదురు బుట్ట తయారుచేసి దానిలో కొద్దిగా ధాన్యం పోసి ఆ పిల్లని అందులో కూర్చోమని గౌరీ పూజ చేయిస్తారు. బుట్టలో కూర్చుని వివాహ వేదిక మీదకి రావడం కన్నా ముందే గౌరీ పూజ చేసేటప్పుడు బుట్టలో కూర్చుంటుంది.


గౌరీ పూజ చేసేటప్పుడు బుట్టలో ఎందుకు కూర్చుంటోంది అంటే అప్పుడు ఆమె ఒకరికి లక్ష్మి అవుతోంది. అవతలి వారి వద్ద భార్యా స్థానాన్ని పొందుతోంది. పత్నీ స్థానాన్ని పొందుతోంది. 

సనాతన ధర్మంలో ఆమె కామపత్ని కాదు. 

సహధర్మచారిణి. ఆమె ఉంటే తప్ప ఆయనకి ధర్మం నడవదు. 

అసలు ఆయనకి అభ్యున్నతి లేదు. ఆయనకు ఉన్నటువంటి లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యం కాదు. ఆయన అభ్యున్నతి అంతా ఎవరిమీద ఆధారపడింది అంటే ఆమె మీదే ఆధారపడింది. ఆయన ఒక యజ్ఞం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి. 

ఆయన కన్యాదానం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి. ఆమె లేనినాడు ఆయన ఏమీ చేసుకోలేడు. మరి లక్ష్మియే కదా జీవుడికి! 


 పైగా ఇల్లాలు కాగానే ఐశ్వర్యం ఆయనది కాదు ఆవిడది. ఐశ్వర్యం అంతా ఆమెకి చెందుతుంది. 

అందుకే ఆయన వృద్ధి కూడా దేనిమీద ఆధారపడుతుంది అంటే భార్య మీద ఆధారపడుతుంది. 

ఆమెయే ఆతని లక్ష్మి. 

అందుకే లక్ష్మి ఉండే అయిదు స్థానాలలో ఒక స్థానం సువాసిని పాపట ప్రారంభ స్థానం. 

అక్కడ బొట్టు పెట్టుకు తీరాలి. 

అక్కడ పెట్టుకున్న బొట్టు భర్తకు కలిసి వచ్చేటట్లుగా చేస్తుంది. లక్ష్మీ స్థానం అది. 

ఆమె లక్ష్మియై నారాయణుడిని చేరుతోంది. లక్ష్మికి ఒక లక్షణం ఉంటుంది. 


ఆమె ‘నిత్యానపాయినీ’. 

ఆమె ఎన్నడూ విష్ణువును విడిచి పెట్టి ఉండదు. 

****

శ్రీరమ సీత గాఁగ,నిజ సేవక బృందము వీరవైష్ణవా 

చారజనంబు గాఁగ, విరజానది గౌతమిగా, వికుంఠము 

న్నారయ భద్రశైలశిఖరాగ్రము గాఁగ వసించు చేతనో 

ద్దారకుఁడైన విష్ణుఁడవు దాశరథీ!కరుణాపయోనిధీ!

****

అని గోపరాజు గారు. 

 శ్రీమహా విష్ణువు రామచంద్రమూర్తిగా వస్తే ఆమె సీతమ్మగా వస్తుంది. 

ఆయన కృష్ణ భగవానునిగా వస్తే ఆమె రుక్మిణీదేవిగా వస్తుంది. ఆయన ఎక్కడ అవతార స్వీకారం చేస్తే ఆమె ఆయన వెంటే వస్తుంది. ఎన్నడూ విడిచిపెట్టదు. 

అలాగే ఆ పిల్ల ఇక్కడ పుట్టింది. 


ఆడపిల్ల – ఆడ అంటే తెలుగులో అక్కడ. 

అక్కడికి వెళ్ళిపోయే పిల్ల ఇక్కడ పుట్టింది. 

ఎక్కడో నారాయణుడు ఉన్నాడు వెతుక్కుని వెళ్ళిపోతుంది. 


ఇక్కడ లక్ష్మి పుట్టింది. 

అదృష్టం ఏమిటి? ఆ లక్ష్మిని పెంచి పెద్ద చేస్తున్నాను. 

ఆ లక్ష్మిని కన్యాదానం చేస్తాను. ఎవరికి? లక్ష్మి ఎప్పుడూ నారాయణునికే చెందుతుంది. 

అందుకే ఆమె లక్ష్మి గనుక పద్మంలో కూర్చోవాలి. 


కాబట్టి వెదురు బుట్ట పద్మానికి సంకేతం. 

ఎందుకు పద్మంలో కూర్చోవాలి? ఆయనకు లక్ష్మిగా నేను వెళ్ళిన వేళ ఆయనకు కలిసిరావాలి. ఆయన వృద్ధిలోకి రావాలి. ఎన్నో యజ్ఞములు చేయాలి. 


ఎంతో ధార్మికంగా సంపాదించాలి. 

ఆయనకి సంతానం కలగాలి. 

ఆయన సంతోష పడిపోవాలి. 

ఆయన తండ్రి కావాలి, తాత కావాలి, ముత్తాత కావాలి. 

ఆయనకు కావలసిన అభ్యున్నతులలో పెద్ద అభ్యున్నతి పితృ ఋణం తీరాలి. తండ్రి ఋణం తాను సంతానాన్ని పొందితే తీరుతుంది. 

ఆ సంతానం నానుండి రావాలి. ‘ధర్మ ప్రజాపత్యర్థం’ ఆయనకు నాయందున్న కామము ధర్మము చేత ముడిపడి నానుండి సంతానం కలగాలి. ఇన్ని లక్ష్ములకు ఆదిలక్ష్మిని నేనే. నడిచి వెళ్ళకూడదు వేదికమీదకి. లక్ష్మి అంటేనే ఐశ్వర్యం.

 లక్ష్మిగా ఆమె వేదికమీదకి వెళ్తోంది నారాయణ మూర్తిని పొందడానికి. పద్మంలో వెళ్ళాలి. 

అయ్యా నీ లక్ష్మిని తీసుకువస్తున్నాం. 

ఈ ప్రేమ ఎవరిది? మా అక్కచెల్లెళ్ళది. మా అక్క చెల్లుళ్ళు కన్న బిడ్డ అని మేనమామలు పరమ పరవశంతో ఆమెను లక్ష్మిగా బుట్టలో పెట్టి తీసుకుని వెడతారు. 

తీసుకువెళ్ళి బుట్టలోనే ఎదురుగుండా కూర్చోబెడతారు. 

ఈమె నీ లక్ష్మి. 

ఇద్దరూ ఒకటి అయిపోయాక ఇక ఆమె బుట్టలో కూర్చోవక్కరలేదు. నారాయణుడి ప్రక్కన లక్ష్మియే. అందుకు ఒకపీట మీదకి మారిపోతారు ఇద్దరూ. 

మారేవరకు బుట్టలోనే కూర్చుంటుంది. 

బుట్టలో కూర్చోబెట్టడం అనేది కేవలం మౌడ్యమైన విషయం కాదు. ఆయన ప్రక్కకి లక్ష్మి చేరుతోంది ఇప్పుడు సుసంపన్నుడు అవుతున్నాడు.

 అన్ని విధాలా ఆయన వృద్ధిలోకి వస్తాడు అన్న భావనయే ఆమెని బుట్టలో కూర్చోబెట్టి మేనమామలు తీసుకు వెళ్తారు. 

మేనమామలు ప్రేమైక మూర్తులు. 

లక్ష్మిని తీసుకువచ్చారు మా అబ్బాయి కోసం. 

నా ఇంటికి లక్ష్మి వచ్చింది అంటే నా కోడలు వచ్చింది. 


నా కోడలు వస్తే నా ఇంటికి లక్ష్మి వచ్చేసిందని గుర్తు. లక్ష్మీదేవి వచ్చింది నా కొడుకు ఇంకా వృద్ధిలోకి వస్తాడు అని పరవశించి పోయేవాడు మగపిల్లవాడి తండ్రి.

 అందుకే అయ్యా మీరు ఇంత ఆదరభావంతో పిల్లను తెచ్చారు. 

లక్ష్మీదేవిని తెచ్చారు నారాయణుడు అని నా కొడుకుని చూసి. 

మీరు పదికాలాలు బ్రతకండి అని ఆయుః కారకం కనుక అంచు ఉన్న పంచెల చాపు మేనమామలకి ఇస్తారు. 

మేనమామలే ఎందుకు తేవాలి? తెలుగునాట ఒక లక్షణం ఉంది. 

అక్క చెల్లెళ్ళకి ఆడపిల్ల పుడితే ఒరేయ్ నీకు భార్య పుట్టింది అంటారు. ఎన్నడూ నేను నా మేనకోడలిని ఆ దృష్టితో చూడలేదు. ఆమెను లక్ష్మిగానే చూశాను. నారాయణుడిని చేరుతుంది అనుకున్నాను. 

భర్తృ  భావనతో చూడలేదు. 

 పవిత్రభావంతో ఏ లక్ష్మిగా చూశానో ఆ లక్ష్మిగా నారాయణుడి దగ్గరికి తెచ్చాను అని తెస్తాడు. 

అది మేనమామ పవిత్ర హృదయానికి ఆవిష్కారం. 

అందుకే పెళ్ళి కూతుర్ని బుట్టలో తేవడం మేనమామలు తెస్తే పెళ్ళి అయిపోయాక? నిజంగా వాళ్ళు ఐశ్వర్యవంతులు కాకపోయినా ఆమెని నడిపించి కానీ, ఇంకొకలా కానీ వెళ్ళకుండా ఊర్లో ఐశ్వర్యవంతులు ఎవరో వాళ్ళు తమ వాహనం ఇచ్చి పంపించాలి. 

అధవా ఎద్దులబండిలో తీసుకు వెళ్తారు. 

వాహనంలో వెళ్ళాలి తప్ప నడిచి వెళ్ళకూడదు. 


ఆడపిల్లని అంత పెద్ద ఎత్తున గౌరవించి లక్ష్మిగా ఆహ్వానించినటువంటి జాతి మన జాతి.

(సేకరణ)

ఐశ్వర్యం* అంటే

 💐💐💐శుభోదయం 💐💐


"*Golden facts* 

ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటే అదే ఐశ్వర్యం..

*ఐస్క్రీమ్ తిన్నా కరిగిపోద్ది, తినకపోయినా కరిగిపోద్ది*.

జీవితం కూడా అంతే...

*ఏంజాయ్ చేసి నా కరిగిపోద్ది, చేయకపోయినా కరిగిపోద్ది*.


• *తర్వాత నరకం, స్వర్గం అంటారా*?!?! ఉన్నాయో, లేవో కూడా ఎవడికి తెలియదు, నువ్వు మళ్ళీ పుడతావో లేదో కూడా తెలియదు.

• తాగినోడు *ఎదవ కాదు, తాగలేనోడు మహానుభావుడు* కాదు.

• పోని తాగలేనోడు నూరేళ్ళు బ్రతుకుతాడా అంటే, ఆ గ్యారంటీ లేదు.

• ఎవడిపాయింట్ ఆఫ్ వ్యూ వాడిది, ఎవడి జీవితం వాడిది. 

ఫైనల్ గా చెప్పదేంటంటే...

*టైం టు టైం తినండి, పడుకొండి, ఎక్కువ ఆలోచించకండి, ఆరోగ్యాలు జాగ్రత్త*. 

• ఎక్కడ పోతుందో అని లాకర్లలో భయంతో దాచుకునే సంపద *ఐశ్వర్యమా*?

• లేక ఎప్పుడు మనతోనే ఉంటుంది అనే ధైర్యం *ఐశ్వర్యమా*!.

• *ఐశ్వర్యం* అంటే నోట్ల కట్టలు, లాకర్స్ లోని తులాల బంగారాలు కాదు?!?!?!

• ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జల చప్పుడు *ఐశ్వర్యం*.

• ఇంటికిరాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య *ఐశ్వర్యం*. 

• ఎంత ఎదిగినా, నాన్న తిట్టే తిట్లు *ఐశ్వర్యం*. 

• అమ్మ చేతి భోజనం *ఐశ్వర్యం*. 

• భార్య చూసే ఓర చూపు *ఐశ్వర్యం*. 

• పచ్చటి చెట్టు, పంటపొలాలు *ఐశ్వర్యం*. 

• వెచ్చటి సూర్యుడు *ఐశ్వర్యం*. 

• పౌర్ణమి నాడు జాబిల్లి *ఐశ్వర్యం*. 

• మనచుట్టూ ఉన్న పంచభూతాలు *ఐశ్వర్యం*. 

• పాల బుగ్గల చిన్నారి చిరునవ్వు *ఐశ్వర్యం*. 

• ప్రకృతి అందం *ఐశ్వర్యం*.  

• పెదాలు పండించే నవ్వు *ఐశ్వర్యం*. 

• అవసరంలో ఆదరించే ప్రాణస్నేహితుడు *ఐశ్వర్యం*. 

• బుద్ధికలిగిన బిడ్డలు *ఐశ్వర్యం*. 

• బిడ్డలకొచ్చే చదువు  *ఐశ్వర్యం*. 

• భగవంతుడిచ్చిన ఆరోగ్యం  *ఐశ్వర్యం*. 

• చాలామందికన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి *ఐశ్వర్యం*. 

• పరులకు సాయంచేసే మనసు మన *ఐశ్వర్యం*.

• *ఐశ్వర్యం* అంటే చేతులు లేక్కేట్టే కాసులు కాదు. 

• కళ్ళు చూపెట్టే ప్రపంచం *ఐశ్వర్యం*. 

• మనసు పొందే సంతోషం *ఐశ్వర్యం*


పది మందికి పంపించండి

ధన్యవాదాలు.....👌💐💐 🙂🙏🏻😎 🙏

ఒక్క రెక్కతోనే పక్షి ఎగుర లేదు

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


     శ్లో𝕝𝕝 *జ్ఞానం ప్రథానం న తు కర్మ హీనం*

          *కర్మ ప్రథానం న తు బుద్ధి హీనమ్* l

          *తస్మాదుభాభ్యాం తు భవేత్ప్రసిద్ధిః*

          *న హ్యేక పక్షో విహగః ప్రయాతి* ll


తా𝕝𝕝 "జ్ఞానం ప్రథానమే కానీ, కర్మహీనమైన జ్ఞానం నిరుపయోగము.... కర్మ ప్రథానమే కానీ, జ్ఞానం లేని కర్మ కూడా నిష్ప్రయోజనమే.... *జ్ఞాన, కర్మ సముచ్ఛయము వలననే మానవుడు తరిస్తున్నాడు*.... ఒక్క రెక్కతోనే పక్షి ఎగుర లేదు కదా!"

పాపాలు చేయడం

 *మనిషి పుణ్యం కంటే పాపాలు చేయడం సర్వసాధారణం.*


పుణ్యకార్యాలు మాత్రమే చేసి పాపాలను దూరం చేసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి.  అయితే మనిషి పుణ్యం కంటే పాపాలు చేయడం సర్వసాధారణం.  పాపపు పనులు భరించలేనంత కష్టమైన బాధలను తెచ్చిపెడతాయనే దృఢ నిశ్చయం మనస్సులో తలెత్తిన వెంటనే, ఒక వ్యక్తి పాపాలకు దూరంగా ఉంటాడు. 

 అటువంటి ఆలోచన కలిగి ఉండాలంటే శాస్త్రాలపై నమ్మకం ఉండాలి.  ఇదీ ప్రయత్నం.  రోజువారీ జీవితంలో కూడా మనం ఇతరుల మాటలతో ఏకీభవించాలంటే వారి మాటలను నమ్మాలి.  అలాగే శాస్త్రాలపై విశ్వాసం ఉంటేనే పాపాలను పోగొట్టుకోవచ్చు. 

 మనం చూడని వాటిని నమ్మొద్దని పట్టుబట్టడం తప్పు.  నిజానికి మనం ఇతరులు, స్నేహితులు చెప్పే చూడని విషయాల మాటలను నమ్మి ఎన్నో పనులు చేస్తాం. అలానే శాస్త్రాల ఆజ్ఞలు మన ప్రయోజనం కోసమే తప్ప మనల్ని ఎప్పుడూ మోసం చేయవు.  మహర్షులు  శాస్త్రాలలో చెప్పిన మాటలపై మనకు ఎలాంటి సందేహాలు ఉండకూడదు. 

 ఈ లోకంలో చాలా మంది పాపపు పనులు చేయడంద్వారా బాధపడటం చూస్తుంటాం.  శాస్త్రాలను నమ్మకుండా పాపాలు చేస్తే మహా కష్టాలను అనుభవిస్తాం. 

 అందుచేత శాస్త్రాల చెప్పిన మాటలపై నమ్మకంతో జీవితాన్ని గడపడం మనిషి ప్రాథమిక కర్తవ్యం.


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

జ్ఞానం ప్రధానం

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


     శ్లో𝕝𝕝 *జ్ఞానం ప్రధానం న తు కర్మ హీనం*

          *కర్మ ప్రధానం న తు బుద్ధి హీనమ్* l

          *తస్మాదుభాభ్యాం తు భవేత్ప్రసిద్ధిః*

          *న హ్యేక పక్షో విహగః ప్రయాతి* ll


*తా𝕝𝕝 "జ్ఞానం ప్రధానమే కానీ, కర్మహీనమైన జ్ఞానం నిరుపయోగము.... కర్మ ప్రధానమే కానీ, జ్ఞానం లేని కర్మ కూడా నిష్ప్రయోజనమే.... జ్ఞాన, కర్మ సముచ్ఛయము వలననే మానవుడు తరిస్తున్నాడు ...ఒక్క రెక్కతోనే పక్షి ఎగుర లేదు కదా!*


 ✍️🌷💐🌹🙏

పాప పుణ్యాలు

 🙏🌟🌟🌟🙏

మనం చేసే పాప పుణ్యాలు !!  అనుభవాలు !! 


మనం చేసే పాపపుణ్యాలు మూడు విభాగాలుగా ఉంటాయి..

.

ఒకటి. అతిసామాన్య  పుణ్యము  అతిసామాన్య పాపము. .

.

    .

రెండు. సామాన్య పుణ్యము. సామాన్య పాపము..

.

మూడు. అనన్య సామాన్య పుణ్యము. అతి ఘోర పాపము..

.

    దైవము అతిసామాన్య పుణ్యములను, అతిసామాన్య పాపములను, కలలో అనుభవించేవిధముగా చేస్తుంది..

.

     ఉదాహరణకు మనం బిక్షాటనకు వచ్చేవానికి దానం చేయలనుకుని జేబులో చెయ్యిపెట్టుకుంటే,

మనం అనుకున్న పైకం, జేబులో సమయానికి లేకపోతుంది. మనం మనస్సులో నొచ్చుకుంటాము..

.

ఈలోపల మన ఎక్కవలసిన బస్సు వచ్చేస్తుంది. మనం దానం చేయకుండానే ఇంటికి వెళ్ళిపోతాము.దానం చేయాలనే భావన రావడం కూడా ఒకరకమైన పుణ్యమే. కాని దానం చేయలేదు కాబట్టి  ఇది అతిసామాన్య పుణ్యఖాతాలోనికి  వెళుతుందన్నమాట.

ఇలాంటిఅతిసామాన్య పుణ్యాలను మనము కలలో " ఏదో పదోన్నతి పొందినట్లో" అనుభవింపచేస్తుంది. అలాగే అతిసామాన్య పాపములు.

    ఇఖ అనన్య సామాన్య పుణ్యములను, అతి ఘోరపాపములను ఈ జన్మలోనే అనుభవించేటట్లు చేస్తుంది.

     మనం ఎదో పెద్దయాగము చేశామనుకోండి, దైవము ఆ ఫలితము ఈజన్మలోనే అనుభవింపచేస్తుంది. అలాగే అతి ఘోరపాపములు చేసేవారు కూడా ఈ జన్మలోనే దాని ఫలితము అనుభవించేటట్లు చేస్తుంది. సంఘములో అవినీతికి పాల్పడినవారిని ప్రభుత్వము, శాసనము శిక్షించడము ఈ కోవలోనికే వస్తుంది.

    ఇఖ సామాన్య పుణ్యపాపములను దైవము ముందు జన్మలలో అనుభవింపచేస్తుంది.

    ఈ సామాన్య పుణ్యఫలితము దైవం ప్రకృతి భీభస్తమములలో మీ పుణ్యఫలితమును ఉపయోగించి సృష్టిని    కాపాడి మీ పుణ్యమును అనేక రెట్లు పెంచి మీకు కావలసిన సమయములో ఆ పుణ్య ఫలితమును అందిస్తుంది. 

అదేవిధముగ మనము చేసే పాపములను అనుభవించటానికి వలసిన  ఓర్పును నేర్పును మనకు కాలక్రమేణా అందేటట్లు చేస్తుంది.

కాబట్టి దైవలీలలను మనము ఓర్పుతో అర్ధము చేసుకుని, సహనము వహించి, దైవభక్తితో ఉండటము అలవాటు చేసుకోవాలి. దైవమును దూషించరాదు.  

శ్రీరామాయణములో రాముని పట్టాభిషేకము రేపు అనగా, రాత్రికి రాత్రి ఘట్టములు సంభవించి శ్రీరాముడు అడవులకు వెళ్ళే పరిస్థితి దాపురిస్తే, లక్ష్మణస్వామి చలించిపోయి "అన్నయ్యా! నాకు అనుమతినిస్తే తండ్రిని ఎదిరించి, నీకు పట్టాభిషేకము చేస్తా! ఏమిటి! దైవము, దైవము అంటావు?" అని దైవదూషణకు దిగుతాడు.  అప్పుడు శ్రీరాముడు ఎంతో ఓర్పుతో "లక్ష్మణా! దైవము నీకు కనబడితేకదా? నువ్వు దైవాన్ని ఎమైనా చేశేది?" అని వారించి లక్ష్మణస్వామిని దైవదూషణా పాపాన్నించి తప్పించి అడవులకు పయనమవుతాడు.

ఇక్కడ గమనించాల్సింది," కనపడని దైవాన్ని నిందించి ప్రయోజనము లేదు,దైవశాసనాన్ని పాలించడమే మానవకర్తవ్యం" అనే శ్రీరామవాక్యాన్ని.

కాబట్టి మనమందరం సదా మన మనస్సనే రాగి చెంబును మలినం కాకుండా  భక్తి అనే చింతపండుతో ఎల్లప్పుడూ తోముతూ,  నిరంతరము దైవచింతనతో ఉంటే మనస్సు నిర్మలంగా ఉండి, జీవితంలో కలిగే ఆటుపోటులకు కృంగిపోకుండా సాగిపోయేటట్లు,

చేసుకోవాలి. దానికి పూర్తిశరణాగతి ఒక్కటే మార్గము.  భగవంతుని  పాదములు  మనస్సులో తలచుకుని, ఆయన పాదములు 

పట్టుకుని, " నేను నీశరణాగతుడను, నీపాదములు పట్టి ప్రార్ధిస్తున్నాను. జన్మజన్మలలో నేను చేసిన పాపములు మన్నించి, నన్నురక్షించు, తండ్రీ ,  మనసా,వాచా, కర్మణా, ఎటువంటి తప్పులు నాతో చేయించకుండా,  నా మనసు నీ పాదపద్మములలో లగ్మమయేలా చేసి, నన్ను మంచి మార్గములో నడిపించు తండ్రి!" అని   ఆర్తితో ప్రార్ధించండి.  ఆ ప్రార్ధనకు భగవంతుడు కరిగిపోయి, మీకు వెంటనే కావలిసినవన్నీ సమకూరుస్తాడు.

🙏🌟🙏🌟🙏

తేదీ ... 01 - 08 - 2024,పంచాంగం

 🙏సర్వేజనాః సుఖినోభవంతు:🙏


        🌼శుభోదయం🌺

       

🏵️ నేటిపెద్దలమాట 🏵️

       

ఈ సమాజంలో మనం ఎప్పుడూ కూడా ఇతరులు మెచ్చేవిధంగా ప్రవర్తించాలి.

మంచి వ్యక్తిత్వం అనేది జీవితంలో విజయాలు సాధించాలనుకునే వారికి చాలా అవసరం.


🌹 నేటిమంచిమాట 🌹


సమాజ సేవకు గంధపు చెక్కగా ఉపయోగపడాలి గానీ, తుప్పు పట్టిన ఇనుప ముక్కలా అడ్డం పడకూడదు.


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸



 🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

        🥀పంచాంగం🥀

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,


తేదీ    ... 01 - 08 - 2024,

వారం ...  బృహస్పతివాసరే ( గురువారం )

శ్రీ క్రోధి నామ సంవత్సరం,

దక్షిణాయణం - గ్రీష్మ ఋతువు,

ఆషాఢ మాసం -  బహుళ పక్షం,


తిథి      :  ద్వాదశి సా4.18 వరకు,

నక్షత్రం  :  మృగశిర మ12.13 వరకు,

యోగం :  వ్యాఘాతం మ3.24 వరకు,

కరణం  :  తైతుల సా4.18 వరకు,

                తదుపరి గరజి తె4.00 వరకు,


వర్జ్యం                :  రా8.38 -10.14,

దుర్ముహూర్తము :  ఉ9.58 - 10.49,

                              మ3.05 - 3.57,

అమృతకాలం     :  రా2.14 - 3.51,

రాహుకాలం        :  మ1.30 - 3.00,

యమగండం       :  ఉ6.00 - 7.30,

సూర్యరాశి          :  కర్కాటకం,

చంద్రరాశి            :  మిథునం,

సూర్యోదయం     :  5.42,

సూర్యాస్తమయం:  6.31,


               *_నేటి మాట_*


         ⚜️ *జీవితం-మరణం* ⚜️


ఈ సృష్టిలో ప్రతీ ఒక్కరూ మరణ ద్వారం దగ్గర నిలబడి ఉన్నారన్నది కాదనలేని చేదు నిజం.                                              మనిషికి తానెప్పుడు చనిపోతానో తెలియనప్పుడు ప్రతీ ఘడియనూ మరణ సమయంగానే భావించాలి, మనిషి వేసే ప్రతీ అడుగూ మరణానికి దగ్గర చేసేదే !                                                                                                            నేడు జీవితం, రేపు మరణం అన్న భావనతోనే జీవన ప్రయాణాన్ని కొనసాగించాలి.                                                      తెలిసిన ప్రపంచం నుంచి తెలియని లోకానికి ప్రయాణమే మరణం.           

                                                                    కానీ, మనిషి దీన్ని గుర్తించడు, 

మరణమనే మాటనే జీర్ణించుకోలేడు. 


ఇప్పట్లో చావు తన దరికి రాదనుకుంటాడు. 

ఈ భావనే అతణ్ని మోసానికి గురిచేస్తుంటుంది. 


కానీ, నిత్యం మరణాన్ని గుర్తుంచుకున్న వారే వివేకవంతులు. 


‘చివరకు ప్రతి మనిషీ మరణిస్తాడు. 

ఎవరికైనా మరణ సమయం ఆసన్నమైనప్పుడు వ్యవధి ఉండదు.


‘ఎవరికైనా మరణ సమయం సమీపించినప్పుడు.. 

ఆ వ్యక్తి ...

‘భగవాన్  నీవు నాకు మరికొంత వ్యవధి ఎందుకివ్వలేదు. 


నేను దానధర్మాలు చేసి సజ్జనులలో కలిసిపోయేవాణ్ని కదా?’ అని వాపోయే పరిస్థితి రాకముందే మంచిని ఆచరించండి. 


ఎవరి ఆచరణ వ్యవధి అయినా ముగిసిపోయే సమయం ఆసన్నమైనప్పుడు, దైవం అతనికి ఎంతమాత్రం అదనపు వ్యవధి ఇవ్వడు’. 


‘ఆయన అందరికీ ఒక నిర్ణీత కాలం వరకు గడువు ఇస్తాడు. 


అంత్యకాలం సమీపించినప్పుడు, ఒక్క ఘడియ కూడా వెనుకా ముందూ కాజాలదు’ 

శరీరమున్నప్పుడే చేతనైనంత మంచిని ఆచరించు, సత్కర్మలలో పాల్గొను,

ఆర్తిక శక్తి చాలకపోతే, 

చెవుల ద్వారా మంచిని విను,

కళ్ళ ద్వారా మంచిని చూడు,

నోటి ద్వారా మంచి పలుకు,

కాళ్ళను మంచి వైపుకి నడిపించు, చేతులతో మంచి పనుల్లో సహకారం అందజేయు...


అందుకే !!...


*శరీరం ఆద్యం ఖలు ధర్మసాధనం’’ అన్నాడు మహాకవి కాళిదాసు.*


               *_🥀శుభమస్తు🥀_*

 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏