17, జూన్ 2021, గురువారం

భారతీయ ఆరోగ్య చిట్కాలు.*

🙂🙂🙂🙂🙂 *కొన్ని ప్రాచీన భారతీయ ఆరోగ్య చిట్కాలు.* 

 1. *అజీర్నే భోజనమ్ విశం.* ముందు తీసుకున్న లంచ్ జీర్ణం కాకపోతే, డిన్నర్ తీసుకోవడం, పాయిజన్ తీసుకోవడంతో సమానం (మునుపటి ఆహారం జీర్ణమైతే, మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు మరియు అనుభూతి చెందుతాము. ఆకలి అనేది మునుపటి ఆహారం జీర్ణం కావడానికి ఒక సంకేతం)

 2. *అర్ధరోగహరి నిధ్రా* 

సరైన నిద్ర, మీ వ్యాధులలో సగం నయం చేస్తుంది. 

3. *ముద్గధాలి గధవ్యాలి* 

   అన్ని రకాల పప్పుధాన్యాలలో, పచ్చ పెసలు (గ్రీన్‌గ్రామ్‌లు)

 ఉత్తమమైనవి.

ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇతర పప్పుధాన్యాలు అన్నీ, ఒకటి లేదా మరొకటి దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి.

4. *బాగ్నస్తి సంధనకరో రాసోనాహా* 

    వెల్లుల్లి విరిగిన ఎముకలతో కలుస్తుంది. 

5. *అతి సర్వత్రా వర్జయెత్*

    అధికంగా తినేది ఏదైనా, అది మంచి రుచిని కలిగి ఉన్నా, ఆరోగ్యానికి మంచిది కాదు. మితంగా (తక్కువ) తినండి. 

6. *నాస్తిమూలం అనౌషాధం*

   శరీరానికి ఎటువంటి ఔషధ ప్రయోజనం లేని కూరగాయలు అంటూ లేవు. 

7. *నా వైద్యా ప్రభుయుయుషా*

    ఏ డాక్టర్ కూడా మన దీర్ఘాయువుకు ప్రభువు కాదు. 

వైద్యులకు కొన్ని పరిమితులు ఉన్నాయి. 

8. *చింతా వ్యాధి ప్రకాషయ*

   చింత అనారోగ్యాన్ని తీవ్రతరం చేస్తుంది. 

9. *వ్యాయమాస్చ సనైహి సనైహి*

   ఏదైనా వ్యాయామం నెమ్మదిగా చేయండి. వేగవంతమైన వ్యాయామం మంచిది కాదు. 

10. *అజవత్ చార్వనం కుర్యాథ్*

  మీరు తినే ఆహారాన్ని మేక లాగా నమలండి. ఎప్పుడూ ఆత్రుత తో ఆహారాన్ని మింగకూడదు. జీర్ణక్రియలో లాలాజలమే మొదట సహాయపడుతుంది. 

11. *స్నానమ్ నామా మనప్రసాధనకరం ధుస్వాప్న విధ్వసం* 

   స్నానం డిప్రెషన్ ను తొలగిస్తుంది. 

ఇది బాడ్ డ్రీమ్స్ (చెడ్డ కలలను) ను దూరం చేస్తుంది. 

12. *నా స్నానం ఆచరేత్ భుక్త్వా*. ఆహారం తీసుకున్న వెంటనే బాత్ తీసుకోకండి. జీర్ణక్రియ ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. 

13. *నాస్తి మేఘసమం తోయం.* 

   స్వచ్ఛతలో వర్షపునీటిని, ఏ నీరు సరిపోలడం లేదు. 

14. *అజీర్నే భేజాజం వారీ*

     త్రాగునీరు తీసుకోవడం ద్వారా అజీర్ణాన్ని పరిష్కరించవచ్చు. 

15. *సర్వత్ర నూతనం శాస్తం సేవకన్న పురతనం.* 

   తాజా విషయాలను ఎల్లప్పుడూ ఇష్టపడండి. 

ఓల్డ్ రైస్ మరియు ఓల్డ్ సర్వెంట్‌ను కొత్తగా మార్చాల్సిన అవసరం ఉంది. (ఇక్కడ సేవకుడి విషయంలో అసలు అర్థం ఏమిటంటే: అతని విధులను మార్చండికానీ, ముగించవద్దు.) 

16. *నిత్యామ్ సర్వ రసభ్యాసహా.* 

   ఉప్పు, తీపి, చేదు, పులుపు, ఆస్ట్రింజెంట్ మరియు పంజెంట్) అన్ని రుచులు కలిగి ఉన్న పూర్తి ఆహారాన్ని తీసుకోండి. 

17. *జతారామ్ పూరైధార్ధమ్ అన్నాహి*

 మీ కడుపు అరవంతు ఘనపదార్థాలతో, పావువంతు నీటితో నింపండి మరియు మిగిలినది ఖాళీగా ఉంచండి. 

18. *భుక్త్వోపా విసస్థాంద్ర*

  ఆహారాన్ని తీసుకున్న తర్వాత ఎప్పుడూ పనిలేకుండా కూర్చోవద్దు. కనీసం అరగంటైనా నడవండి. 

19. *క్షుత్ సాధూతం జనయతి*

  ఆకలి, ఆహార రుచిని పెంచుతుంది. (ఇంకా చెప్పాలంటే, ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే తినండి.)

 20. *చింతా జరానామ్ మనుష్యానమ్* 

    చింతించడం అనేది వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. 

21. *సతం విహయ భోక్తవ్యం*

   ఆహారం తీసుకొనే సమయం వచ్చినప్పుడు, 100 ఉద్యోగాలను కూడా పక్కన పెట్టండి. 

22. *సర్వ ధర్మేశు మధ్యమామ్*. 

  ఎల్లప్పుడూ మధ్యే మార్గాన్ని ఎంచుకోండి. దేనిలోనైనా విపరీతంగా వెళ్లడం మానుకోండి.

🙏 ఓం తత్ సత్ 🙏🏻

గొప్ప మానవతావాది

 ★ ఆయన గొప్ప మానవతావాది. కాళ్లకు వేసుకునే చెప్పులు ఎంత పాతవి అయిపోయినా, ఊడిపోతూ ఉన్నా, వాటిని తిరిగి కుట్టించుకుంటూ, బాగు చేయించుకుంటూ అవే తొడుక్కునేవారు. ''ఎందుకు పాతవాటితో అవస్థ పడటం'' అని ప్రశ్నిస్తే ''చెప్పులు కుట్టేవాడికి పని పెట్టాలి కదా! అతడికి దానం చేస్తే తీసుకోడు మనం ఇవ్వకూడదు. పని చేయించుకుని ఏదైనా ముట్ట చెప్పాలి. కొత్త చెప్పులు కొనుక్కుంటే అతడి బతుకెలా గడుస్తుంది? రిపేరు చేయటం నా వల్లకాదు అని అతగాడు అన్నప్పుడే కొత్తవి కొంటాను'' అన్న నిజమైన మనీషి తెలుగు జాతికి అవిస్మరణీయ పూజనీయులు "మల్లాది రామకృష్ణ శాస్త్రి" గారి 116 వ  జయంతి (16 -6 -1905 ) నేడు.

★ అది పద్యమైనా లేక గద్యమైనా. కథ అయినా, కవిత అయినా, సినిమా పాటైనా లేక మాటైనా  -- తెలుగు భాషా సుగంధ పుష్ప పరీమళం నలుదెసలా వ్యాపింప చేసిన ' సాహితీ మహర్షి ' శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు చేసుకున్న పాపం వల్ల, మనం చేసుకున్న పుణ్యం వల్ల వీరు తెలుగు రచయితగా పుట్టారు. ఇటువంటి కవి, మరే భాషలో ఉన్నా అంతర్జాతీయ ఖ్యాతి పొంది ఉండేవాడు.నిజంగా ఎప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఒకే పని తెలుగు భాషను గొంతు నులిమి చంపడం కంటి ముందే జరుగుతున్నా ..దాన్ని చూస్తూ మనం బ్రతికి ఉండడం మన ఖర్మ!

★ మద్రాసులోని పానగల్ పార్క్ చూసినప్పుడల్లా అందరికీ గుర్తుకు వచ్చే మొదటి వ్యక్తి శ్రీ రామకృష్ణ శాస్త్రి గారు.పానగల్లు పార్కుకు వచ్చి శాస్త్రిగారిని కలిసినవారిలో ఆకలిగొన్నవారికి తన బ్యాగులో ఉన్న హోటల్ భోజనం టిక్కెట్ల కట్టలోంచి ఓ టిక్కట్టును చింపి ఇచ్చి వారి కడుపునింపిన వెన్నలాంటి కన్నతల్లి మనసు ఆయనది. కేవలం ఇలా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టించడంకోసమే ఆయన తన చేతికి డబ్బు రాగానే పాండీ బజార్ లో ఉన్న హోటల్ కి వెళ్లి ప్రత్యేకంగా భోజనం టిక్కెట్ల పుస్తకాన్ని కొనుక్కొచ్చేవారని ఆయన్ని బాగా ఎరిగినవారు చెబుతారు. 

★ అందరినీ తన వాళ్లుగా భావించి ఆదరంగా చూసుకునే మంచి మనసు ఆయనది.బ్రతకడం అంటే అది.కేవలం మనకున్న తెలివితేటలను, అధికారాలను అమ్ముకొని సుఖాలనే ఎండమావుల వెంట బతికే పె(గె)ద్దలకు ఈ మంచితనం అర్థం కాదు.

★ తెలుగు వారికి చిరకాలం గుర్తుండే పాట అయిన 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్'(పాత దేవదాసు సినిమా లోనిది),  ఆ పాటను గురించి అంతరార్ధాన్ని వేదాంత భాషలో ఎంత గొప్పగా చెప్పారో చూడండి. తెలుగు భాషలో 'కుడి' అంటే శరీరం అనే అర్ధం కూడా ఉంది,ఇక 'ఎడం' అంటే దూరం.శరీరం విడిపోయి నంత మాత్రాన ఓడిపోయినట్లు కాదు. శరీరం పోయినా ప్రేమ మాత్రం ఎన్నటికీ ఓడదు అన్న వారి మేథోవైభవాన్ని ఈ నేలలో స్థిరంగా ఉండిపోతుంది. 


★ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వీరికి పలు భాషలలో ప్రవేశమే గాక ప్రావీణ్యం కూడా ఉంది. సంస్కృతం, ప్రాకృతం, పాళీ, భాషలే కాకుండా, జర్మనీ, సింహళ, గ్రీకు భాషలలో కూడా వీరికి ప్రావీణ్యం ఉంది. ఓ సందర్భం లో ఆరుద్ర "గురువుగారూ మీకసలు ఎన్ని భాషలు తెలుసును?" అని అడిగారు. దానికి సమాధానంగా శాస్త్రిగారు జాబితా రాసుకోమని చెబితే, అప్పుడు ఆరుద్ర "అలా కాదు. మీకెన్ని భాషల్లో కవిత్వం చెప్పగల సాధికారత ఉందో, అన్ని భాషల్లోనూ ఈ విసనకర్ర ఆకులపై ఒక్కో ఆకుమీద ఒక్కో సంతకం చొప్పున ఆయా భాషల్లోనే చేసివ్వండి" అంటూ తాటాకు విసనకర్రను, ఇంకు పాళీ కలాన్ని ఆయన చేతికి ఇచ్చారు. అప్పుడు శాస్త్రిగారు ఒక్కో ఆకుమీద ఒక్కో భాషలో సంతకం చేస్తూపోతే మొత్తంగా ఆ తాటాకు విసనకర్రకు రెండు వైపులా ఉన్న ఆకులన్నీ నిండిపోయాయి.

★ ఇంతటి వైభవ పాండిత్యాన్ని కలిగినా సామాన్యంగా  బ్రతికిన వినమ్రతాశీలి  వారు.

ఆశ్చర్యం కలిగించే ఆయన జీవితాన్ని తెలుసుకోండి మీ పిల్లలకు చెప్పండి వారి హృదయాల్లో ఆరని మంచిదీపాన్ని వెలిగించండి.పూజ్య శ్రీ "మల్లాది రామకృష్ణ శాస్త్రి" వారి కి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కనకవల్లి, నరసింహశాస్త్రి గార్ల దివ్యపాదపద్మాలకు ప్రణమిల్లుతూ 


రచన..

🙏 సాయి కుమార్ రెడ్డి. బత్తిన

స్వార్ధం

 🔸🔸

స్వార్ధం

🔸🔸


ఒక గ్రామంలో ఒక సాధువు నివసించేవాడు.ఆయన చాలా మహిమ కలవాడు. ఆయన వద్దకు నిత్యమూ అనేకమంది జనులు వచ్చి తమ

కష్టాలను ,సమస్యలను ఆయనవద్ద మొరపెట్టుకుని

తగిన ఉపశమనం పొందేవారు. బయట ఊళ్ళ నుండి కూడా జనాలు వచ్చేవారు. 


ఒకనాడు  ఒక స్త్రీ సాధువు వద్దకు వచ్చి  " నాకు  వివాహమై చాలాకాలమైనా సంతానభాగ్యం కలుగలేదు.

ఎన్నో వ్రతాలు, పూజలు,

చేశాను.గుళ్ళూ గోపురాలు తిరిగినా ఏ ప్రయోజనమూ కలుగలేదు. తమరే ఏదైనా పరిహారం చెప్పి, అనుగ్రహించాలని వేడుకుంది.

మొరపెట్టుకున్న  ఆ 

స్త్రీని ఒక

నిముషం తీక్షణంగా చూశాడు సాధువు.

ఆమెకి చేతినిండా వేరుశనగ కాయలు యిచ్చారు. " అమ్మా ..నీవు ఆ తలుపు వద్ద కూర్చో, నేను కాసేపట్లో మరల పిలుస్తాను " అని అన్నాడు.


ఆ స్త్రీ  తలుపు దగ్గరకు వెళ్ళి కూర్చుంది. సాధువు యిచ్చిన వేరుశెనగలు చేతినిండా వున్నవి. ఆమె ఒక్కొక్కటిగా ఒలిచి తినడం మొదలుపెట్టింది. ఇంతలో అటువేపుగా కొంతమంది

చిన్నపిల్లలు వచ్చారు.

వచ్చిన పిల్లలో ఒక బాలిక ఆ స్త్రీ వద్దకు

వచ్చి, అమ్మా ..నాకు కొంచెం వేరుశెనగలు పెట్టవా ? అని ఆశగా అడిగింది.

 ఆ పిల్లమీద ఆ స్త్రీకి కోపం వచ్చింది.

" నీకు ఒక్క దానికి యిస్తే మిగతా పిల్లలు కూడా వచ్చి చేయి చాచుతారు. మీకోసం నేనేమీ వేరుశనగ మడులేవీ పెంచడంలేదు.  ఫో  ఫొమ్మని కఠినంగా కసిరి పంపింది. ఆ బాలిక చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయింది.


ఇదంతా దూరం నుండి సాధువు గమనించాడు. ఆ స్త్రీని  తన ధగ్గరకు రమ్మని పిలిచాడు.

ఆ స్త్రీ లేచి సంతోషంగా సాధువు వద్దకి వెళ్ళింది. ఆమె రాగానే " నీకు  ఈ జన్మలో సంతాన భాగ్యం లేదు  నీవు వెళ్ళవచ్చు" అన్నాడు సాధువు.

ఆ స్త్రీ ఆశ్చర్య పోయినది.

" ఎందకు స్వామీ? అని అడిగింది. సాధువు ప్రశాంతంగా జవాబిచ్చాడు " అమ్మా! 

నీలో ఒక తల్లికి వుండవలసిన మమతానురాగాలు లేవు. నీవు స్వార్ధపరురాలివి.

ఇప్పుడు 

నీవు తింటున్న వేరుశెనగలు నీవి కావు.

అయాచితంగా లభించినవి.

ఎవరో యివ్వగా వూరికే వచ్చినవి. వాటిలో ఒక కొంచెం భాగం ఆశతో అడిగిన ఆ చిన్నపిల్లకు ఇవ్వడానికి నీకు మనసురాలేదు కసిరికొట్టావు. 


పసిపిల్లల పట్ల  ప్రేమానురాగాలు చూపడం తెలియని నీకు దైవం సంతాన భాగ్యం ఎందుకు అనుగ్రహిస్తాడు ?  

దేవుడి అనుగ్రహంలేకపోతే నేను మాత్రం ఏం పరిహారం చెప్పగలను అని అడిగాడు సాధువు.

ఆ స్త్రీ సిగ్గుతో అక్కడనుండి వెళ్ళిపోయింది. 

ఈ సంఘటన ద్వారా చుట్టూ వున్న భక్తులు ఒక మంచి పాఠం నేర్చుకున్నారు.

సేకరణ

https://chat.whatsapp.com/J2smXvOBzztJK9Nsz8h8oi

పండగలాంటి వార్తను చెప్పిన రైల్వే

 *పండగలాంటి వార్తను చెప్పిన రైల్వే.. టికెట్ లేకుండా రైల్లో ప్రయాణించొచ్చు.. కానీ..

రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ముందుగా రిజర్వేషన్ చేయించుకోకపోయినా, టికెట్ తీసుకోకపోయినా కూడా నిరభ్యంతరంగా రైలు ఎక్కవచ్చు. కేవలం ప్లాట్‌ఫామ్ టికెట్ ఉంటే చాలు. ట్రైన్‌లోకి ఎక్కిన తర్వాత దానిని టీటీఈకి చూపించి టికెట్ తీసుకుంటే సరిపోతుంది. చివరి నిమిషంలో హడావిడిగా రైల్వే స్టేషన్‌కు వచ్చి హైరానా పడనవసరం లేకుండా భారతీయ రైల్వే ఈ వెసులుబాటు కల్పించింది. 


రిజర్వేషన్ లేకుండా స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు అక్కడి టికెట్ కౌంటర్ల ముందు బారులు తీరిన లైన్లలో నిల్చోవాల్సిన అవసరం లేదు. యూటీసీ యాప్ ద్వారా లేదా స్టేషన్లలోని వెండింగ్ మెషిన్ల ద్వారా ప్లాట్‌ఫామ్ టికెట్ తీసుకుంటే చాలు. దానితో రైలు ఎక్కేయవచ్చు. ట్రైన్ ఎక్కిన తర్వాత దానిని టీటీఈకి చూపించి టికెట్ తీసుకోవచ్చు. అంతేకాదు సీట్లు అందుబాటులో ఉంటే రిజర్వేషన్ చేయించుకుని బెర్త్ కూడా సంపాదించవచ్చు

దీపం.. ప్రత్యక్ష దైవం

💐 దీపం.. ప్రత్యక్ష దైవం 💐


🌹 అన్ని అర్హతలున్నా మంచి ఉద్యోగం లేకపోవడం.. పెళ్లి కాకపోవడం., లోపంలేకపోయినా పిల్లలు కలగక పోవడం., కారణం లేకుండా గొడవలో ఇరుక్కుని పోవడం., ఇంట్లో ఎప్పుడు ఎందుకు గొడవలు జరుగుతుంది తెలియక మనసుకు శాంతి లేకపోవడం., ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యంతో మానసికరుగ్మతలు., ఎంత సంపాదించినా నిలవక పోవడం., ఇంట్లో ఏదైనా దోషమున్నా తెలియక పోవడం., అకాల మృత్యు భయం., దిష్టిదోషాలు., శాపనార్థాలు., కోర్టు గొడవలకు., వ్యాపారాభివృద్ధికి .. యిలా అన్నిటికీ ఒక మంచి పరిష్కారమార్గమిది.


🌹 ఈ పద్ధతి ఇప్పుడున్నదికాదు.. ఎంతో పురాతనమైన శాస్త్ర సమ్మతమైన విధానం దీపారాధన. ఇంకా కొన్ని దేవాలయాలలో ఇప్పటికీ జరుగుతున్న దీపంతో ఉపాసన. మహా శక్తివంతమైన ఆరాధన. 

రాజా రవివర్మ గారు దేవుడిబొమ్మలు గీసాక దేవుడిరూపం ఇలాగుంటుంది అని మనకు చిత్రపటాలొచ్చాయి. అంతకుముందు మహా శిల్పులు , శిల్పతంత్రాన్ని ఆధారంగా చేసుకొని సాముద్రికలోపం లేకుండా చేసిన విగ్రహాలు గుడిలో చూడటమేతప్ప ఇంట్లో ఎవరికీ దేవుడి పటాలు ఉండేవికాదు. అప్పుడు ఇంటి మధ్యభాగాన్ని కనపడేలా సపారులో దీపంగూడు అని ఉండేది. అక్కడ గోడకు తమలపాకులుగాని తులసి ఆకులు కాని రాశి దేవతనామాలను అందులో కుంకుమతోపెట్టి ఆ దీపంలోనే దేవతలను ఆరాధించే వారు.


🌹 మీఇంట్లో బాగా పెద్దవారు ఉంటే అడిగి చూడండి. ఆ రోజుల్లో కరెంటు కూడా లేనందువల్ల సాయంత్రం కూడా ఖచ్చితంగా దీపారాధన చేసేవారు. అప్పుడు పంటలు, ప్రజలు రోగాలు రాకుండా హాయిగానే ఉండేవి. దీపానికి ఒక్కో అర్ధగంటకు ఒక్కో దేవత అధిపతిగా ఉంటారు.. ఉదయం 5 గంటల సమయానికి దీపానికి అదిపతి వినాయకుడు. 5.30 నుండి 6 గంటలవరకు దీపానికి అధిపతి లక్ష్మీదేవి. ఆ సమయంలో ఎక్కడ దీపం వెలుగుతున్నా ఆ దీపంలో లక్ష్మీదేవి కూర్చుని నారాయణుడిని ఆరాధిస్తుంది. అంతటి తల్లి పిలుపు విన్న స్వామి  దృష్టి ఆ ఇంటిపైన పడుతుంది. అలా ప్రతి గడియకు దీపానికి అధిపతులుగా దేవతలు ఆజ్యోతిలో కొలువై ఉంటారు. దోషనివారణకు ,జోతి స్వరూపమైన దైవాన్ని అనుగ్రహంకోసం ఎలా పూజించాలి ఇప్పుడు తెలుసుకుందాము.. 


🍂 దీపంతో ఆరాధన విధానం 🍂 


🌹🌻 ముందుగా ఒక పళ్ళెం తీసుకొని అందులో నీరుపోసి పసుపు వేయాలి, ఆ నీరు ఉన్న పళ్లెంలో కామాక్షి, కానీ అష్టలక్ష్మీ ఉన్న దీపం తీసుకొని పసుపు కుంకుమపెట్టి ఇష్ట దైవాన్ని సంకల్పించుకుని మీ సమస్య చెప్పుకుని, సమస్య లేకపోతే దైవానుగ్రహం కోసం అని ఇష్టదైవాన్ని ,ఇలవేల్పుని తల్చుకుని, వినాయకుడిని తల్చుకుని దీపంవెలిగించి మీరు చేసే నిత్యపూజ చేసుకోవాలి. దీపం కచ్చితంగా 41 రోజులు కొండెక్కకుండా జాగర్తపడాలి. ఒత్తి చిన్నదైతే  ఇంకో కొత్తఒత్తిని చేర్చి ఆ జ్యోతిని ఈ ఒత్తికి మార్చాక పాత ఒత్తిని తీయాలి. కానీ దీపం కొండెక్కకూడదు. దీపంకింద ఉన్న పళ్లెంలో నీరు ఆవిరైపోతూ ఉంటుంది. నీరు పోస్తూ, పసుపువేస్తూ ఉండాలి.


🌹🌻 41రోజు పూర్తియ్యేసరికి మీ సమస్యలకు చాలావరకు పరిష్కారం లభిస్తుంది. లలితా పారాయణం, విష్ణు సహస్త్రనామం, శివుని శ్లోకాలతో, శ్రీ సూక్తం, లక్ష్మీ అష్టకం, మీ ఇష్టదైవం కావచ్చు ఆ శ్లోకాలతో ఈ దీపంజ్యోతిని ఆరాధించి నివేదనచేసి హారతివ్వాలి. ఇది గృహంలోచేసే అఖండ దీపారాదన.


🍂 ఈ విధానంలో నియమాలు 🍂


 1.ప్రత్యేకంగా గది ఉన్నవారు చేయాలి.

 2. వ్యాపారస్థలంలో అందరి ఎదురుగా కాకుండా పూజ చేసుకునేచోటు వేరుగాఉంటే పెట్టచ్చు.

3. ఈ 41 రోజులు కొండెక్కితే మళ్ళీ మొదటినుండి చేయాలి. కానీ దోషమేమీలేదు.

4. మైల ఉన్నవారు అటుగా రాకూడదు. వారిని తాకి దీపంలో నూనెపోయాకుడదు.

5.అఖండ దీపారాధన అంటే జోతి స్వరూపంలో భగవంతుడిని  ప్రత్యక్షంగా ఆరాధించడం. కాబట్టి నివేదన పూజ ఖచ్చితంగా చేయాలి.

6. ఈ 41 రోజులు అఖండదీపారాధనలో మట్టి దీపము పెట్టకూడదు. ఎందుకంటే దీపాన్ని నీటిపళ్లెం లో ఉంచాలి, ఆనీరు ఎంతగా ఆవిరౌతుందో మీఇంట కరువంతగా తీరుతుంటుంది.

7. 41రోజులు పూజ అయ్యాక మీరు మాములుగా అందులో దీపంపెట్టుకోవచ్చు లేదా మళ్ళీ 41రోజులు కొనసాగించచ్చు. ఆ పళ్లెం మటుకు అప్పుడప్పుడు శుభ్రంచేసి పెట్టాలి.

8. ఈ విధానం లో కొందరికి  ఒక సందేహం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడో ఉదయం వెళ్లి రాత్రికొస్తాము ఈలోపు దీపంలో నూనె అయిపోతే, ఒత్తి అయిపోతే చూసుకునే వారు లేరని. అలా సౌకర్యంలేనివారు ఉదయం కచ్చితంగా 5.30 కి ఇంట్లో దీపారాధనచేసి పూజ చేసుకోవాలి. పూజ సంకల్పంతో యదావిధిగా 41రోజులు చేసుకోవాలి. ఆర్ధికఇబ్బందులుండవు.

9. ఈ అఖండదీపం 41రోజుల సమయంలో పాలు, పెరుగు, బెల్లం నివేదనలో ఉండేలా చూసుకోండి. ఖచ్చితంగా అని కాదు. వేరే దీక్షానియమాలు ఏమీ లేవు. దీపం 41 రోజులు కొండెక్కకూడదు అదే ముఖ్యమైన నియమం.. (ఈదీపం ఎలాపెట్టాలో చెప్పినా సరిపోతుంది. కానీ, అర్థంమయ్యేలా వివరించడంవల్ల మీకు ఈపూజ విలువ తెల్సుకుని ఇంకొందరికి తెలియచేస్తారని వివరంగా చెప్పడం జరిగింది). 


💐  మీరు చేయాలి అనుకున్నంత సులభంగా దీపం నిలవదు. ఎంతో భక్తిగా ప్రార్ధన చేయాలి. అమ్మవారిని వేడుకోవాలి. లేకపోతే దీపం కొండెక్కుతూనే ఉంటుంది. మీరు మనసుపెట్టి చేస్తేనే అఖండదీపం నిలుస్తుంది.  ప్రయత్నం చేయడంలో తప్పులేదు ప్రయత్నించండి 💐

మరో రామదాసుని కథ

 🌿🌼🙏ఇది మరో రామదాసుని కథ🙏🌼🌿ఒక అన్నదాత గాథ🙏🌼🌿ఒళ్ళు గగురుపొడిచే అద్భుతమైన శ్రీరాముని లీల🙏🌼🌿పూర్తిగా చదవండి🙏🌼🌿

#అందరికీ_తెలిసేందుకు_దయచేసి_షేర్_చేయండి  

#అందరూ_దర్శించేందుకు_దయచేసి_షేర్_చేయండి 

#సంభవామి_యుగే_యుగే 


🌿🌼🙏ముందుగా ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియకపోవచ్చు, శాస్త్రాలలో చెప్పిన ధర్మ మార్గాలు తెలియకపోవచ్చు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియకపోవచ్చు, మన పండుగల విశిష్టత తెలియకపోవచ్చు, అందుకు ఎన్నో కారణాలూ ఉండవచ్చు, కానీ నేర్చుకుని, ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు, అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా ఇవన్నీ తెలిసేలా చేయవలసిన కర్తవ్యం మనదే, ఏదీ ఆలస్యం కాదు, అందరమూ తెలుసుకుని, ఆచరించే ప్రయత్నం చేద్దాం, ఈ సంభవామి యుగే యుగే అనే పేజీని సృష్టించింది అమూల్యమైన, అపూర్వమైన, అద్భుతమైన లీలలను, చిత్రాలను, స్తోత్రాలను నేను తెలుసుకున్నవి, సేకరించినవి నలుగురికీ తెలియజేసే ప్రయత్నంలో భాగమే. కేవలం లైక్స్ కోసమో, పేరు కోసమో, పోటీ కోసమో కాదు సుమా ... అందరికీ ఉపయోగపడితే అదే సత్ఫలితంగా భావిస్తాను, అందుకే అందరినీ ఈ మహాయజ్ఞంలో భాగస్వాములను చేయాలనే దయచేసి షేర్ చేయమని అభ్యర్ధిస్తుంటాను ...  మనందరికీ భగవంతుని అనుగ్రహం కలుగుతుందని ఆకాంక్షిస్తూ 🙏🙏🙏Sai Sankalp🙏🌼🌿


🌿🌼🙏భద్రాచలం అనగానే మన మదిలో శ్రీసీతారామ లక్ష్మణులతో పాటుగా, పరమ భక్తుడైన రామదాసు గారు కూడా గుర్తొస్తారు. అంతటి భక్తులే మరొకరు భద్రాచలంలో జీవించి, రాముని సేవలో తరించి, రామ భక్తుల ఆకలి తీర్చారు🙏🌼🌿


🌿🌼🙏ఆయనది యాయావార వృత్తి. యాయావారం అంటే ఈ రోజు భాషలో చెప్పాలంటే అడుక్కోవడం,కానీ ఆ వృత్తిని చులకనగా చూడకూడదు, హేళన చేయకూడదు, అది పవిత్రమైనది, క్రమేణా అది సంఘంలో అవమానకరమైన వృత్తిగా మారిపోయింది నేడు🙏🌼🌿


🌿🌼🙏ఇక ఈ రామభక్తుడు ఇల్లిల్లూ తిరిగి యాయవారం చేసేవాడు. తాను తినేందుకు కాదు సుమా, ఇతరులకు పెట్టేందుకు🙏🌼🌿


🌿🌼🙏ఇతరులెవరు? ఇతరులంటే భక్తులు. ఎక్కడెక్కడినుంచో రామచంద్రస్వామిని చూసేందుకు వచ్చే భక్తులు🙏🌼🌿


🌿🌼🙏ఆ రోజుల్లో భద్రాద్రి రామయ్యను చూడటమంటే మాటలా? బస్సులు, కార్లు, రైళ్లు లేని రోజులవి.అశ్వారావుపేట అడవులనో, పాల్వంచ అడవులనో దాటుకుని గోదారి అవతలి ఒడ్డుకు చేరాలి. అక్కడ నుంచి పడవలో విశాల గోదావరిని దాటిరావాలి🙏🌼🌿


🌿🌼🙏అందుకే భద్రాద్రికి వచ్చే సరికి భక్తులు అలసిపోతారు, సొలసిపోతారు. ఆకలితో అలమటిస్తూంటారు🙏🌼🌿


🌿🌼🙏ఒడ్డున దిగి స్నానం చేయగానే ఆవిరులు చిమ్మే వేడివేడి అన్నం, కమ్మనిపప్పు, కాసింత మజ్జిగ, అయితే గియితే ఒక అవకాయ బద్ద.... అది దొరికితే చాలు. ఆత్మారాముడు శాంతిస్తాడు. అప్పుడు అసలు రాముడిని ఆత్మశాంతితోచూడొచ్చు🙏🌼🌿


🌿🌼🙏సరిగ్గా ఒడ్డుకి దగ్గరలో ఆయన అన్నం వండి పెట్టేవాడు. క్రమేపీ భక్త కోటికి ఈ సంగతి తెలిసింది. వచ్చేవారి సంఖ్య పెరిగింది. ఆయన కూడా వచ్చిన వారందరికీ లేదనకుండా అన్నం పెట్టేవాడు. ఈ రోజుల ఉడిపి హోటల్ కాదది. అంతా ఉచితమే🙏🌼🌿


🌿🌼🙏ఒంటిపై ఒక చిన్న కౌపీనం తప్ప ఆయనకు ఇంకో ఆస్తి లేదు. రోజూ యాచించడం, తెచ్చింది వచ్చినవారికి వండి పెట్టడం. ఇదే అతని రామ సేవ. ఏదైనా రాముడే చూసుకుంటాడన్న ధీమా ఒక్కటే ఆయన సంపద🙏🌼🌿


🌿🌼🙏నిజంగా అంతా రాముడే చూసుకున్నాడు కూడా🙏🌼🌿


🌿🌼🙏ఒక సారి వంటపాత్రలు చోరీ అయ్యాయి. వంట వాళ్లూ పారిపోయారు. సరిగ్గా భక్తులు వచ్చే సమయం. ఏం చేయాలో పాలుపోలేదు ఆయనకి. రామా లక్ష్మణా మీరే దిక్కు అనుకున్నాడు🙏🌼🌿


🌿🌼🙏అంతలో ఇద్దరు కుర్రాళ్లు వచ్చారు. చేతుల్లో పెద్ద గుండిగలు (అన్నం వండే పెద్ద పాత్రలు). చకచకా అన్నం, పప్పూ వండేశారు. అందరికీ వడ్డించేశారు🙏🌼🌿


🌿🌼🙏ఇంత రుచి ఇంతకుముందెన్నడూ చూడలేదు అన్నారు భక్తులు🙏🌼🌿


🌿🌼🙏ఆయన వంట కుర్రాళ్లను చూసే సరికి వాళ్లు మాయమైపోయారు. కనుచూపుమేరలో కనిపించలేదు. ఎంత వెతికినా దొరకలేదు. గుండిగలు మాత్రం మిగిలిపోయాయి🙏🌼🌿


🌿🌼🙏ఆయనకి అర్థమైపోయింది. వచ్చినవాళ్లు అన్న రాముడు, తమ్ముడు లక్ష్మణుడు. అన్నం అంత రుచిగా ఎందుకుందో ఆయనకి తెలిసిపోయింది🙏🌼🌿


🌿🌼🙏శ్రీరామ నీనామమేమి రుచిరా అనుకున్నాడు ఆయన🙏🌼🌿


🌿🌼🙏భక్తులుపెరిగిపోతున్నారు. యాచించింది సరిపోవడం లేదు. రామా నీవే దిక్కు అనుకున్నాడు🙏🌼🌿


🌿🌼🙏హఠాత్తుగా ఒక వాహనం వచ్చి సత్రం ముందు ఆగింది. అందులోనుంచి ఒక ధనవంతుడు దిగాడు🙏🌼🌿


🌿🌼🙏అయ్యా ... !!! నాకు రాత్రి కల వచ్చింది. ఆ కలలో చనిపోయిన నా తల్లి కనిపించింది. మీ సత్రానికి నా భూములన్నిటినీ ఇచ్చేయమని చెప్పింది. నా నాలుగు వేల ఎకరాలు ఇదిగో మీకు రాసిచ్చేస్తున్నాను అని పత్రాలు ఇచ్చి వెళ్లిపోయాడు🙏🌼🌿


🌿🌼🙏ఆయన ఒక పెద్ద వకీలు. హనుమకొండ ఆయన ఊరు. తుంగతుర్తి నరసింహారావు ఆయన పేరు. ఇక ఆ సత్రానికి ఏలోటూ లేదు. నాలుగువేల ఎకరాలూ ఆ సత్రానివే🙏🌼🌿


🌿🌼🙏సత్రం నడిపిస్తున్న ఆయన కొంతకాలానికి వృద్ధుడైపోయాడు. అన్నం పెట్టీ పెట్టీ పున్నెం గడించాడు. అంతా రాముడికే వదిలేశాడు. నాలుగువేల ఎకరాల్లో అంగుళం కూడా ముట్టుకోలేదు. దేవుడే ఇచ్చిన గోచీపాతను కూడా వదిలేసి ఒక రోజు ఆయన ఆ దేవుడి దగ్గరకే వెళ్లిపోయాడు🙏🌼🌿


🌿🌼🙏ఇప్పుడు భద్రాచలానికి రోడ్డు వచ్చింది. కొత్తగూడెం దాకా రైలూ వచ్చింది. ఇప్పుడు క్షణాల్లో భద్రాచలంలో వాలిపోవచ్చు. దేవుడిని చూసి వెళ్లిపోవచ్చు. ఆకలేస్తే అన్నం పెడతా అని పాడే హోటళ్లు వచ్చాయి (డబ్బులు మాత్రం చెల్లించాలి)🙏🌼🌿


🌿🌼🙏ఇప్పుడు గుడికి దారి కూడా మారిపోయింది. ఎవరూ పడవ దాటాల్సిన అవసరం లేదు. సత్రాన్ని కూడా అందరూ మరిచిపోయారు. సత్రం పాడుపడిపోయింది. గబ్బిలాల్లాంటి వాళ్లు వచ్చి చేరారు. నాలుగు వేల ఎకరాల్లో ఒక్క అంగుళం కూడా మిగల్లేదు. ఆ సత్రం పేరు చెబితే కూడా అదేమిటి అని అడిగేలా అయిపోయింది🙏🌼🌿


🌿🌼🙏చాలా ఏళ్లయిన తరువాత ఈ మధ్యే కొన్ని సంవత్సరాల క్రితం ఆ సత్రాన్ని శృంగేరీ పీఠం తన అధీనంలోకి తీసుకుంది. శ్రీచక్ర సిమెంటు వారు దీనికి కావలసిన వనరులుసమకూరుస్తున్నారు. ఒక వేద పాఠశాల నడుస్తోంది. వేదవిద్యార్థులకు అక్కడ అన్నం దొరుకుతుంది. అంటే అన్నదాన యజ్ఞం మళ్లీ మొదలైందన్న మాట. ఆ సత్రం ముందు ఈ అన్నదాన యజ్ఞాన్ని ప్రారంభించిన వ్యక్తి విగ్రహం ఉంటుంది🙏🌼🌿


🌿🌼🙏ఇంతకీ ఆయన పేరు చెప్పనే లేదు కదూ🙏🌼🌿


🌿🌼🙏ఆయన పేరు శ్రీ పమిడిఘంటం వెంకటరమణ దాసు గారు🙏🙏🙏

🌿🌼🙏 1850 లో పుట్టిన ఈయన ప్రకాశం జిల్లా నుంచి భద్రాచలం వచ్చాడు. ఇక్కడే జీవితమంతా గడిపేశాడు. ఆ సత్రం పేరు అంబ సత్రం🙏🌼🌿

 

ఈసారి భద్రాచలం వెళ్ళినప్పుడు శ్రీరామలక్ష్మణులు స్వయంగా వండి, వడ్డించిన ఆ రెండు పాత్రలూ అంబ సత్రంలో ఉన్నాయి, తప్పకుండా దర్శించుకోండి🙏🌼🌿


🌿🌼🙏ఆ రెండు పాత్రల పేర్లు🙏🌼🌿


🌿🌼🙏ఒకటి రామ గుండిగ🙏🌼🌿

🌿🌼🙏ఒకటి లక్ష్మణ గుండిగ🙏🌼🌿


🌿🌼🙏వాటిని ఈ చిత్రంలో చూడవచ్చు🙏🌼🌿


🌿🌼🙏అందరికీ ఆ భగవంతుని అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ... 🙏🙏🙏 Sai Sankalp🙏🌼🌿

#అందరికీ_తెలిసేందుకు_దయచేసి_షేర్_చేయండి 

#అందరూ_దర్శించేందుకు_దయచేసి_షేర్_చేయండి 

#సంభవామి_యుగే_యుగే 


🌿🌼🙏మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి . మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి , ఇవి చదవలేని వారికీ తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో,ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు. " సంభవామి యుగే యుగే " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం కలిగుతుందని మా ఆశ. అందరికీ దర్శనభాగ్యం కలగాలి , ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే " సంభవామి యుగే యుగే "ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం🙏🌼🌿


🌿🌼🙏అందరికీ దర్శనభాగ్యం కలగాలి , ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే " సంభవామి యుగే యుగే "ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం🙏🌼🌿 https://www.facebook.com/sambhavami2498/


🌿🌼🙏అందరం భక్తితో " జై శ్రీరామ్ జై హనుమాన్ " అని వ్రాసి స్వామివార్ల అనుగ్రహం పొందుదాం ... ఎన్ని సార్లు స్మరిస్తే అంత మేలు చేస్తారు శ్రీ రామచంద్రుడు, ఆంజనేయ స్వామి వారు🙏🌼🌿


జై శ్రీరామ్

జై హనుమాన్

Rishis were beyond wise

 Clear instructions taught by puranas and vedas in 5000 BC (ie 7000 years ago and earlier). Obviously, our Rishis were beyond wise. Even today, if we follow our ancient wisdom we will benefit, especially during these Pandemic times.


1. लवणं व्यञ्जनं चैव घृतं

    तैलं तथैव च । 

    लेह्यं पेयं च विविधं 

    हस्तदत्तं न भक्षयेत् ।। 

    धर्मसिन्धू ३पू. आह्निक


Salt, ghee, oil, rice and other food items should not be served with bare hand. Use spoons to serve.


2. अनातुरः स्वानि खानि न 

    स्पृशेदनिमित्ततः ।।

    मनुस्मृति ४/१४४


Without a reason don't touch your own indriyas (organs like eyes, nose, ears, etc.)


3. अपमृज्यान्न च स्न्नातो

    गात्राण्यम्बरपाणिभिः ।। 

    मार्कण्डेय पुराण ३४/५२


Don't use clothes already worn by you & dry yourself after a bath.


4. हस्तपादे मुखे चैव पञ्चाद्रे

    भोजनं चरेत् ।।

    पद्म०सृष्टि.५१/८८

    नाप्रक्षालितपाणिपादो

    भुञ्जीत ।।

    सुश्रुतसंहिता चिकित्सा

    २४/९८


Wash your hands, feet, mouth before you eat.


5. स्न्नानाचारविहीनस्य सर्वाः 

    स्युः निष्फलाः क्रियाः ।।

    वाघलस्मृति ६९


Without a bath or Snan and Shudhi, all Karmas (duties) done are Nishphal (no use).


6. न धारयेत् परस्यैवं

    स्न्नानवस्त्रं कदाचन ।I

    पद्म० सृष्टि.५१/८६


Don't use the cloth (like towel) used by another person for drying yourself after a bath.


7. अन्यदेव भवद्वासः

    शयनीये नरोत्तम ।

    अन्यद् रथ्यासु देवानाम

    अर्चायाम् अन्यदेव हि ।।

    महाभारत अनु १०४/८६


Use different clothes while sleeping, while going out, while doing pooja.


8. तथा न अन्यधृतं (वस्त्रं 

    धार्यम् ।।

   महाभारत अनु १०४/८६


Don't wear clothes worn by others.


9. न अप्रक्षालितं पूर्वधृतं

     वसनं बिभृयाद् ।।

     विष्णुस्मृति ६४


Clothes once worn should not be worn again before washing.


10. न आद्रं परिदधीत ।।

      गोभिसगृह्यसूत्र ३/५/२४


Don't wear wet clothes.


These precautions were taught to every Indian five thousand years ago in the Sanatana Dharma .

We were forewarned about importance of maintaining personal hygiene, when no microscopes existed, but our ancestors using Vedic knowledge prescribed these Dharma as Sadhaachaaram and followed these.

*రైలు బండి బెర్త్ రిజర్వేషన్

 💲🟣🚃🚃🚃🚃🚃🚃🔵💲


*రైలు బండిలో మనకు బెర్త్ రిజర్వేషన్ నెంబర్లు.. ఏ క్రమంలో కేటాయిస్తారో తెలుసా.?*

*ఎక్కువమందికి తెలియని (భౌతిక శాస్త్ర సాంకేతిక) ఆసక్తికర సమాచారం.!*


సినిమా హాల్లో మనకు నచ్చిన నంబరు సీటును మనం బుక్ చేసుకోవచ్చును.  కాని, IRCTC లో మనం టికెట్లు బుక్ చేసుకునేటపుడు అది మహా అయితే అప్పర్ బెర్త్ కావాలా, మిడిల్ బెర్త్ కావాలా లేక లోయర్ బెర్త్ కావాలా అని మాత్రమే అడుగుతుంది కాని, ఒక బోగీలో 72 బెర్త్ లు ఉంటాయి కదా, అందులో మీరు కోరిన నంబరు బెర్తు కావాలా అని మాత్రం అడుగదు.  ఎందుకు.?   


దీని వెనుక భౌతికశాస్త్రపు ప్రాథమిక సాంకేతికాంశాలు ఉన్నాయి కాబట్టి..!


సినిమాహాలులో సీటు బుకింగు  వేరు, రైలుబండిలో సీటు బుకింగు వేరు.  సినిమా హాలు నిశ్చలంగా ఉండే ఒక విశాలమైన గది మాత్రమే.  కాని, రైలుబండి ఒక పరుగెత్తే గదుల సమూహం.  


ఆ పరుగు ప్రయాణీకులకు ప్రమాదకరంగా ఉండరాదు, వారి ప్రయాణం క్షేమంగా జరగాలన్నది చాల ముఖ్యమైన విషయం.  


అందువల్ల రైలుబండిలో ప్రయాణమయ్యే బరువు బండి అంతటా సమానంగా పంపకమయ్యే విధంగా భారతీయ రైల్వే టికెట్ బుకింగ్ విధానపు సాఫ్ట్ వేర్ ను రూపుదిద్దారు. 


ఉదాహరణకు – ఒక రైలుబండిలో S1 నుండి S10 వరకు స్లీపర్ క్లాసు బోగీలు ఉన్నాయనుకుందాం.  ఒకొక్క బోగీలో 72 సీట్లు ఉంటాయి.  అందువల్ల, మొట్టమొదట టికెట్ బుక్ చేసుకునేవారికి నడుమనున్న బోగీలో (S5 లేదా S6లో) టికెట్ కేటాయింపబడుతుంది.  పైగా అందులో కూడా, 30 – 40 నంబరు సీటు కేటాయింపబడుతుంది.  అందులోనూ, లోయర్ బెర్త్ కేటాయింపబడుతుంది.  (ఎటువంటి బెర్త్ కావాలో మన ఎంపిక లేకపోతే)   రైలుబండిలో గ్రావిటీ సెంటర్లు (గరిమనాభి కేంద్రాలు) సాధ్యమైనంత తక్కువగా ఉండేందుకు గాను, అప్పర్ బెర్త్ ల కంటే ముందుగా లోయర్ బెర్త్ లను కేటాయించడం జరుగుతుంది.  


ఇలా మొదటగా మధ్యలో ఉండే బోగీలలో మధ్య సీట్లు, అలాగే క్రమంగా చివరి సీట్లు, (మొదట లోయర్ బెర్త్, ఆ తరువాతనే అప్పర్ బెర్త్, మిడిల్ బెర్త్) కేటాయింపబడతాయి.  ఆ తరువాత మధ్య బోగీలకు పక్కన ఉండే బోగీలలో (S4, S7) మరలా అదే విధంగా సీట్ల కేటాయింపు జరుగుతూ పోతుంది.  


ఇలా బరువు అన్ని రైలు బోగీలలోనూ సమానంగా ఉండే విధంగా టికెట్ల కేటాయింపు జరుగుతుంది.


మనం చివరి నిమిషాలలో టికెట్ కోసం ప్రయత్నించినపుడు మనకు అప్పర్ బెర్త్ లు, 1-6 లేదా 66-72 నంబరు సీట్లు, కేటాయింపబడటానికి కారణం ఇదే.  మనం వెయిటింగ్ లిస్టులో ఉన్నపుడు ఎప్పుడైనా ఎవరైనా తమ సీటు క్యాన్సిల్ చేసుకుంటే మనకు మధ్యలో కూడా సీటు దొరకవచ్చు. 


ఈ విధానంలో కాకుండా IRCTC తనకు నచ్చిన బోగీలో నచ్చిన సీటును ఇష్టారాజ్యంగా కేటాయించుకుంటూ పోతే ఏం జరుగుతుంది?  


S1, S2, S3  బోగీలు ప్రయాణికులతో నిండుగా కిటకిటలాడుతున్నాయి, S5, S6 బోగీలు ఖాళీగా ఉన్నాయి, మిగిలిన బోగీలలో ప్రయాణికులు అరకొరగా ఉన్నాయనుకుందాం.  ఎక్స్ ప్రెస్ రైలుబండ్లు ఒకొక్కసారి గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో పరుగెడుతుంటాయి.  అంతటి వేగం వలన చాల బలమైన గమనశక్తి పుడుతూ ఉంటుంది.  అంతటి వేగంలో రైలుబండి మలుపు తిరగవలసి వచ్చిందనుకోండి.  ఆ సమయంలో అసమభారం కలిగిన (అనీవెన్లీ లోడెడ్) బోగీలన్నిటిమీద కేంద్రపరాఙ్ముఖబలం (సెంట్రి-ఫ్యూగల్ ఫోర్స్) సమానంగా ఉండటం సాధ్యం కాదు.  అందువల్ల అంతటి వేగంలో బరువు కలిగిన బోగీలు ఒకవైపు ఈడ్వబడితే బరువు లేని బోగీలు మరొకవైపు బలంగా విసిరివేయబడతాయి.  అప్పుడు రైలుబండి పట్టాలు తప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  


అంతే కాదు, అసమానమైన బరువు కలిగిన బోగీలు రైలుబండిలో ఉన్నపుడు బ్రేకులు వేస్తే అన్ని బోగీలమీదా సమానమైన వత్తిడి పడదు.  అప్పుడు కూడా రైలుబండి చలనం మీద డ్రైవరుకు అదుపు తప్పవచ్చు.  


మాకు అనుకూలమైన సౌకర్యవంతమైన సీట్లు బెర్తులు కేటాయించలేదని రైల్వే రిజర్వేషన్ వ్యవస్థను నిందించే వారికి అసలు విషయాన్ని కారణాలను వివరించేందుకు ఇది ఒక ప్రయత్నం. 


_(ఎలైట్ ఫిజిక్స్ అకాడమీ ఫౌండర్, డైరెక్టర్ అయిన శ్రీ అఖిలేశ్ మిశ్రా గారి వ్యాసానికి శ్రీనివాస్ కృష్ణ గారి స్వేచ్ఛానువాదం.)_

హంస ,ఒక కాకి

ఒకానొకప్పుడు ఒక హంస ,ఒక కాకి స్నేహం గా ఉండేవి. ఒక రోజున కాకి హంసను తన ఇంటికి తీసుకోని వెళ్ళింది. ఒక ఎండిన చెట్టు మోడుపై అవి కూర్చున్నాయి. ఆ ప్రేదేశమంతా పేడ మాంసము ,ఎముకలు అన్ని చెల్లా చెదురుగా పది ఉండి దుర్వాసన వస్తున్నది. హంస కాకితో సోదరా ! ఇటువంటి మురికి ,దుర్గంధ ప్రదేశం లో నేను క్షణికాలం కూడా ఉండలేను. నన్ను ఏదయినా పవిత్రమైన ప్రదేశానికి తీసుకెళ్ళు అని అడిగింది.


అందువల్ల కాకి హంసను రాజుకు చెందిన ఒక చెట్టు తొర్రలో రహస్యంగా కూర్చోబెట్టి తాను కూడా హంస పక్కనే కూర్చుంది. క్రిందికి చూస్తే హంసకి రాజుగారు చెట్టుకింద కూర్చొని ఉండటం ఆయనకి తలకి బాగా ఎండతగులుతూ ఉండటం కనిపించింది. సాదు స్వభావం కల హంస ఎంతో దయతో తన రెక్కలు విప్పి రాజుకు ఎండతగలకుండా నీడను కల్పించింది. దానివల్ల రాజు కి కాసేపు సుఖం కలిగింది. ఈ లోగా కాకి తన సహజ నిర్లక్ష్య స్వభావంతో రెట్ట వేసింది. అది సరిగ్గా రాజు గారి తలమీద పడింది. రాజు కోపంతో వెంటనే పైకి బాణం వేసేసరికి అది హంసకి తగిలి అది క్రింద పడిపోయంది. 

                                      హంస చనిపోతూ ఓ రాజా ! నీపైన రెట్ట వేసింది కాకి నేను కాదు.  ఎప్పుడు నిర్మలమైన స్వచ్ఛమైన నీటిలో జీవించే హంసను నేను .కానీ చెడ్డ కాకితో చేసిన స్నేహం వలన నా జీవితం కూడా నాశనం అయిపోయింది అని ధుఃకించింది. 

☘️☘️☘️☘️☘️☘️☘️☘️🌺🌺🌺🌺🌺🌺🌺🌺


*నీతి*: మంచితనము ప్రజలను ఎంతగా ప్రభావితం చేస్తుందో అదే విధంగా చెడ్డతనం కూడా మనుషులను ప్రభావితం చేస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరు మంచివారితో మాత్రమే స్నేహం చేసి సత్సాగత్యం లో మెలగాలి. మంచివారితో సాంగత్యం మనుషులపై మంచి ప్రభావాన్ని కలిగిస్తుంది. చెడ్డవాతావరణం లో తిరిగే మంచి వారి లోని మంచి గుణాలను ఎవరు గుర్తించరు. చెడ్డవ్యక్తి తోటి స్నేహం వలన మంచివారు కూడా చెడుఫలితాలను అనిభవించవలసి వస్తుంది. 

🌞🌞🌞🌞🌞🌞🌞🌞🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🦚🦚🦚🦚🦚🦚🦚🦚🤝🤝🤝🤝🤝🤝🤝🤝

అక్షర ఙ్ఞానము

 అక్షర ఙ్ఞానము, దాని శక్తి, లక్షణము, వ్యాప్తము , వస్తు తత్వమును అవగాహన యే ఙ్ఞానమని నిర్వచనం. దానిని వకసారి పరిశీలన చేద్దాం. య, ర, ల, వ, శ, ష, స, హ, యివి బీజాక్షర ములు శక్తి వ్యాప్త సూత్రమును దెలుపుచున్నవి.య, అనగా యత్ ఏదైతే తెలియాలో దానిని యత్ అని, ర అనగా రుద్ర తత్వమని, ల అనగా పృధివియని, వ అనగా వ్యాప్తమని,శ, పూర్ణ శక్తి అనగా శివ, వ్యాప్తమని, ష  అనగా ఉష కాంతి రూపమని, స,అనగా సత్ యని, ఎల్లప్పుడు కలిగియున్నదని హ అనగా రూపము మారి అంతటా వ్యాపించు సూక్మమైన ఆత్మ శక్తిగా తెలియుచున్నది. మిగిలిన అక్షరముల కన్నా హ అనగా విశేష శక్తియని, దానిని పలుకుటకు కూడా మిగతా అక్షరముల కన్నా ఎక్కువ శక్తి జీవికి కావలెను. యిట్లు పలుకుటలోనే పూర్ణ తత్వ ఙ్ఞానమైన శక్తి రూపముగా మారి విసర్గ యని తెలియును. యీఅక్షరము మాత్రమే నాభినుండి వుత్పన్నమై బాహ్య వ్యాప్తి యని  శక్తి సమూహమును తెలిపే  బీజాక్షరమని తెలియుచున్నది. ఏ భాషలోనైనా అక్షర శబ్దము శక్తియే జీవ వునికిని తెలియజేయు సమాధానముగా తెలియుచున్నది. ప్రతీ అక్షరమునకు ౦ పూర్ణాక్షరమువలననే దాని జీవ లక్షణము తెలియును. ప్రతీ అక్షర శబ్ద శక్తి పదార్ధ సూచనను తెలియు గుణము కలదని తెలియిను. ఏ భాషలోనైనా సరే. ఙ్ఞాన సముపార్జనే ధ్యేయం. దాని గురించి భాషయెుక్క వునికి.పరతత్వమును తెలియుటయే దీని ముఖ్య వుద్దేశ్యము.

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..


*అంతుపట్టని అంతరంగం..*


*(అరవై ఒకటవ రోజు)*


శ్రీ స్వామివారు ప్రాణత్యాగం చేయడానికే నిశ్చయించుకున్నారని శ్రీధరరావు దంపతులు నిర్ణయించుకున్నారు..శ్రీ స్వామివారి ఆశ్రమం నుంచి తిరిగివచ్చిన తరువాత..ప్రభావతి గారు దుఃఖం ఆపుకోలేక పోయారు.."అమ్మా..నన్ను నీ పెద్ద కుమారుడిగా భావించుకో.." అని శ్రీ స్వామివారు చెప్పిన మాటలు ఆవిడ చెవుల్లో మారుమ్రోగుతున్నాయి..ఆమాటే శ్రీధరరావు గారితో చెప్పుకొని కళ్లనీళ్లు పెట్టుకున్నారు..


"ప్రభావతీ..సాధకులు.. సన్యాసులు.. అవధూతలు..భవబంధాలకు దూరంగా ఉంటారు..వారు తాము ఈ జన్మలో తమకు నిర్దేశించిన కార్యాన్ని పూర్తి చేసుకొని వెళ్ళిపోతారు..మనబోటి గృహస్థులం మాత్రం ఈ లంపటం లోంచి బైటపడలేము..మనసు స్థిర పరచుకో..మనమూ ఏ వార్త వినడానికైనా సిద్ధపడి ఉండాలి..ఆ మహనీయుడి సాంగత్యం మనకు ఇంతకాలం ప్రాప్తి!..అదే ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం అనుకుందాము.." అని ఊరడించారు.. ప్రక్కరోజు నుంచి ఆ దంపతులు తమ పనుల్లో తాము మునిగిపోయారు..


ఆ మరుసటి రోజు సాయంత్రం..శ్రీ స్వామివారు ఏప్రిల్ 30 వతేదీనాడు తనను కలువమని శ్రీధరరావు గారికి చెప్పి పంపారు..సరిగ్గా నాలుగు రోజుల గడువుంది 30 వ తేదీకి..ఇన్నాళ్ల తమ పరిచయం లో శ్రీ స్వామివారు ప్రత్యేకంగా ఇలా తేదీ చెప్పి ఆరోజే కలువమని చెప్పలేదు..ఏ వార్త వినాల్సి వస్తుందో అని కొద్దిగా అయోమయానికి గురయ్యారు ప్రభావతి శ్రీధరరావు గార్లు ..సరే!..అంతా భగవదేచ్ఛ!..జరగాల్సింది జరుగుతుంది..అనుకోని ఊరుకున్నారు..


ఈలోపల శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారు గారు ఒక ఉత్తరం వ్రాసారు  తాను వ్రాసిన "సాయి లీలామృతం" గ్రంధాన్ని పంపుతున్నాననీ..ఆ గ్రంధాన్ని

పారాయణం చేసి అభిప్రాయం తెలుపమని..ఆధ్యాత్మిక గ్రంథ రచనలో తమకు సహకరించమని.. ప్రభావతి గారికి ఆ ఉత్తరం ద్వారా కోరారు..ప్రభావతి గారు తమ జవాబులో..శ్రీ స్వామివారి గురించి వివరంగా తెలియచేసి..తానిప్పుడు రచనలు చెయ్యడం దాదాపుగా మానుకొన్నాననీ..సాయిలీలామృతాన్ని పారాయణ చేసి అభిప్రాయం త్వరలోనే తెలుపుతాననీ..వీలైతే భరద్వాజ మాస్టారు గారిని ఒకసారి మొగలిచెర్ల కు వచ్చి, శ్రీ స్వామివారిని దర్శించమని సవినయంగా వ్రాసారు..మాస్టారు గారు కూడా త్వరలోనే వస్తానని జవాబు వ్రాసారు..


ఆరోజుకు ప్రభావతి గారికి తెలియదు..శ్రీ భరద్వాజ మాస్టారు గారు వెలిగించిన శ్రీ శిరిడీ సాయిబాబా జ్యోతి ఆంధ్రరాష్ట్రం నలుచెరుగులా దేదీప్యమానంగా వెలుగును విరజిమ్మబోతోందనీ..శ్రీ భరద్వాజ మాస్టారు గారి ఆధ్వర్యంలో ఏర్పడిన "శ్రీ సాయిబాబా మిషన్ " ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందనీ.. వారి "సాయిబాబా" పక్షపత్రిక లోనే మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్రను ధారావాహికంగా తాను వ్రాయబోతాననీనూ..


"అమ్మా!..నీవు నా చరిత్ర వ్రాస్తావు కదూ..నువ్వే వ్రాస్తావులే!.." అని శ్రీ స్వామివారు పలికిన పలుకులు ఆ తరువాతి కాలంలో..శ్రీ భరద్వాజ మాస్టారు గారి స్పూర్తితో నిజమయ్యాయి..తెలుగు ప్రజలకు అవధూతల చరిత్రలను పరిచయం చేసిన శ్రీ భరద్వాజ మాస్టారు గారికి మనం ఎంతగా ఋణపడి ఉన్నామో కదా!..


ఏప్రిల్ 30వతేదీ నాడు శ్రీ స్వామివారు తమను కలువమని చెప్పిన ప్రక్కరోజు..ఒంగోలు నుంచి కొంతమంది అధ్యాపకులు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఒక బస్సు వేసుకొని శ్రీ స్వామివారిని దర్శించాలని మొగలిచెర్ల కు వచ్చారు..ముందుగా తెలుపకుండా ఉన్నఫళాన వచ్చేస్తే ఎలా అని శ్రీధరరావు గారు వాళ్ళను సున్నితంగా అడిగి..శ్రీ స్వామివారు ఎవ్వరినీ కలవొద్దని చెప్పిన వైనం వాళ్లకు తెలియచేసారు..వాళ్ళందరూ ముక్తకంఠంతో.."ఇంతదూరం వచ్చాము..అక్కడిదాకా వెళదాము..మా ప్రాప్తం ఎలా వుంటే..అలా జరుగుతుంది.." అన్నారు..శ్రీధరరావు గారూ సరే నని చెప్పి..అదే బస్సులో వాళ్ళతో పాటు ఆశ్రమానికి వెళ్లారు..


ఆశ్రమం బైట..ప్రధాన ద్వారానికి కూడా కొద్దిదూరంలో..శ్రీ స్వామివారు నిలబడి వున్నారు..పాదుకలు ధరించి..దండ కమండలాలు చేతబూని..అచ్చం మహర్షి లా గోచరించారు..వచ్చిన వారందరూ బస్సు దిగి..శ్రీ స్వామి వారిని చూసి చేతులు జోడించి..దగ్గరకు వచ్చి పాదాలకు నమస్కారం చేయబోయారు..పాద నమస్కారాలు వద్దని సైగ ద్వారా వారించి..కొద్ది నిముషాల పాటు నిలబడి..కళ్ళతోనే తాను వెళుతున్నట్లుగా సంకేతం ఇచ్చి..ఆశ్రమం లోపలికి వెళ్లిపోయారు..మళ్లీ అందరూ బస్సు ఎక్కి..శ్రీధరరావు గారిని వారింటివద్ద దింపుతూ.."మాకింతే ప్రాప్తం!..మహనీయుడి దర్శనానికి నోచుకున్నాము..వాక్కు వినలేకపోయాము.." అన్నారు..శ్రీధరరావు గారు చిరునవ్వు నవ్వి వారికి వీడ్కోలు చెప్పి పంపారు..


శ్రీధరరావుగారికి ఎంత ఆలోచించినా అర్ధం కాని విషయమేమిటంటే..శ్రీ స్వామివారు సరిగ్గా వాళ్ళు వచ్చే సమయానికి ఆశ్రమం బైటకు వచ్చి నిలుచుని వున్నారే!..ఆయనకు ముందుగా వీరందరూ వస్తున్న సంగతి తెలీదు కదా?


అదే సాధకుడికి..సంసారికి ఉన్న తేడా!..అవధూతల అంతరంగాన్ని అంచనా వేయడం కష్టతరం..


ఏప్రిల్ 30 వ తేదీ భేటీ గురించి..రేపటి భాగం లో..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం... లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..సెల్ : 94402 66380 & 99089 73699).