17, జూన్ 2021, గురువారం

అక్షర ఙ్ఞానము

 అక్షర ఙ్ఞానము, దాని శక్తి, లక్షణము, వ్యాప్తము , వస్తు తత్వమును అవగాహన యే ఙ్ఞానమని నిర్వచనం. దానిని వకసారి పరిశీలన చేద్దాం. య, ర, ల, వ, శ, ష, స, హ, యివి బీజాక్షర ములు శక్తి వ్యాప్త సూత్రమును దెలుపుచున్నవి.య, అనగా యత్ ఏదైతే తెలియాలో దానిని యత్ అని, ర అనగా రుద్ర తత్వమని, ల అనగా పృధివియని, వ అనగా వ్యాప్తమని,శ, పూర్ణ శక్తి అనగా శివ, వ్యాప్తమని, ష  అనగా ఉష కాంతి రూపమని, స,అనగా సత్ యని, ఎల్లప్పుడు కలిగియున్నదని హ అనగా రూపము మారి అంతటా వ్యాపించు సూక్మమైన ఆత్మ శక్తిగా తెలియుచున్నది. మిగిలిన అక్షరముల కన్నా హ అనగా విశేష శక్తియని, దానిని పలుకుటకు కూడా మిగతా అక్షరముల కన్నా ఎక్కువ శక్తి జీవికి కావలెను. యిట్లు పలుకుటలోనే పూర్ణ తత్వ ఙ్ఞానమైన శక్తి రూపముగా మారి విసర్గ యని తెలియును. యీఅక్షరము మాత్రమే నాభినుండి వుత్పన్నమై బాహ్య వ్యాప్తి యని  శక్తి సమూహమును తెలిపే  బీజాక్షరమని తెలియుచున్నది. ఏ భాషలోనైనా అక్షర శబ్దము శక్తియే జీవ వునికిని తెలియజేయు సమాధానముగా తెలియుచున్నది. ప్రతీ అక్షరమునకు ౦ పూర్ణాక్షరమువలననే దాని జీవ లక్షణము తెలియును. ప్రతీ అక్షర శబ్ద శక్తి పదార్ధ సూచనను తెలియు గుణము కలదని తెలియిను. ఏ భాషలోనైనా సరే. ఙ్ఞాన సముపార్జనే ధ్యేయం. దాని గురించి భాషయెుక్క వునికి.పరతత్వమును తెలియుటయే దీని ముఖ్య వుద్దేశ్యము.

కామెంట్‌లు లేవు: