17, జూన్ 2021, గురువారం

మరో రామదాసుని కథ

 🌿🌼🙏ఇది మరో రామదాసుని కథ🙏🌼🌿ఒక అన్నదాత గాథ🙏🌼🌿ఒళ్ళు గగురుపొడిచే అద్భుతమైన శ్రీరాముని లీల🙏🌼🌿పూర్తిగా చదవండి🙏🌼🌿

#అందరికీ_తెలిసేందుకు_దయచేసి_షేర్_చేయండి  

#అందరూ_దర్శించేందుకు_దయచేసి_షేర్_చేయండి 

#సంభవామి_యుగే_యుగే 


🌿🌼🙏ముందుగా ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియకపోవచ్చు, శాస్త్రాలలో చెప్పిన ధర్మ మార్గాలు తెలియకపోవచ్చు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియకపోవచ్చు, మన పండుగల విశిష్టత తెలియకపోవచ్చు, అందుకు ఎన్నో కారణాలూ ఉండవచ్చు, కానీ నేర్చుకుని, ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు, అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా ఇవన్నీ తెలిసేలా చేయవలసిన కర్తవ్యం మనదే, ఏదీ ఆలస్యం కాదు, అందరమూ తెలుసుకుని, ఆచరించే ప్రయత్నం చేద్దాం, ఈ సంభవామి యుగే యుగే అనే పేజీని సృష్టించింది అమూల్యమైన, అపూర్వమైన, అద్భుతమైన లీలలను, చిత్రాలను, స్తోత్రాలను నేను తెలుసుకున్నవి, సేకరించినవి నలుగురికీ తెలియజేసే ప్రయత్నంలో భాగమే. కేవలం లైక్స్ కోసమో, పేరు కోసమో, పోటీ కోసమో కాదు సుమా ... అందరికీ ఉపయోగపడితే అదే సత్ఫలితంగా భావిస్తాను, అందుకే అందరినీ ఈ మహాయజ్ఞంలో భాగస్వాములను చేయాలనే దయచేసి షేర్ చేయమని అభ్యర్ధిస్తుంటాను ...  మనందరికీ భగవంతుని అనుగ్రహం కలుగుతుందని ఆకాంక్షిస్తూ 🙏🙏🙏Sai Sankalp🙏🌼🌿


🌿🌼🙏భద్రాచలం అనగానే మన మదిలో శ్రీసీతారామ లక్ష్మణులతో పాటుగా, పరమ భక్తుడైన రామదాసు గారు కూడా గుర్తొస్తారు. అంతటి భక్తులే మరొకరు భద్రాచలంలో జీవించి, రాముని సేవలో తరించి, రామ భక్తుల ఆకలి తీర్చారు🙏🌼🌿


🌿🌼🙏ఆయనది యాయావార వృత్తి. యాయావారం అంటే ఈ రోజు భాషలో చెప్పాలంటే అడుక్కోవడం,కానీ ఆ వృత్తిని చులకనగా చూడకూడదు, హేళన చేయకూడదు, అది పవిత్రమైనది, క్రమేణా అది సంఘంలో అవమానకరమైన వృత్తిగా మారిపోయింది నేడు🙏🌼🌿


🌿🌼🙏ఇక ఈ రామభక్తుడు ఇల్లిల్లూ తిరిగి యాయవారం చేసేవాడు. తాను తినేందుకు కాదు సుమా, ఇతరులకు పెట్టేందుకు🙏🌼🌿


🌿🌼🙏ఇతరులెవరు? ఇతరులంటే భక్తులు. ఎక్కడెక్కడినుంచో రామచంద్రస్వామిని చూసేందుకు వచ్చే భక్తులు🙏🌼🌿


🌿🌼🙏ఆ రోజుల్లో భద్రాద్రి రామయ్యను చూడటమంటే మాటలా? బస్సులు, కార్లు, రైళ్లు లేని రోజులవి.అశ్వారావుపేట అడవులనో, పాల్వంచ అడవులనో దాటుకుని గోదారి అవతలి ఒడ్డుకు చేరాలి. అక్కడ నుంచి పడవలో విశాల గోదావరిని దాటిరావాలి🙏🌼🌿


🌿🌼🙏అందుకే భద్రాద్రికి వచ్చే సరికి భక్తులు అలసిపోతారు, సొలసిపోతారు. ఆకలితో అలమటిస్తూంటారు🙏🌼🌿


🌿🌼🙏ఒడ్డున దిగి స్నానం చేయగానే ఆవిరులు చిమ్మే వేడివేడి అన్నం, కమ్మనిపప్పు, కాసింత మజ్జిగ, అయితే గియితే ఒక అవకాయ బద్ద.... అది దొరికితే చాలు. ఆత్మారాముడు శాంతిస్తాడు. అప్పుడు అసలు రాముడిని ఆత్మశాంతితోచూడొచ్చు🙏🌼🌿


🌿🌼🙏సరిగ్గా ఒడ్డుకి దగ్గరలో ఆయన అన్నం వండి పెట్టేవాడు. క్రమేపీ భక్త కోటికి ఈ సంగతి తెలిసింది. వచ్చేవారి సంఖ్య పెరిగింది. ఆయన కూడా వచ్చిన వారందరికీ లేదనకుండా అన్నం పెట్టేవాడు. ఈ రోజుల ఉడిపి హోటల్ కాదది. అంతా ఉచితమే🙏🌼🌿


🌿🌼🙏ఒంటిపై ఒక చిన్న కౌపీనం తప్ప ఆయనకు ఇంకో ఆస్తి లేదు. రోజూ యాచించడం, తెచ్చింది వచ్చినవారికి వండి పెట్టడం. ఇదే అతని రామ సేవ. ఏదైనా రాముడే చూసుకుంటాడన్న ధీమా ఒక్కటే ఆయన సంపద🙏🌼🌿


🌿🌼🙏నిజంగా అంతా రాముడే చూసుకున్నాడు కూడా🙏🌼🌿


🌿🌼🙏ఒక సారి వంటపాత్రలు చోరీ అయ్యాయి. వంట వాళ్లూ పారిపోయారు. సరిగ్గా భక్తులు వచ్చే సమయం. ఏం చేయాలో పాలుపోలేదు ఆయనకి. రామా లక్ష్మణా మీరే దిక్కు అనుకున్నాడు🙏🌼🌿


🌿🌼🙏అంతలో ఇద్దరు కుర్రాళ్లు వచ్చారు. చేతుల్లో పెద్ద గుండిగలు (అన్నం వండే పెద్ద పాత్రలు). చకచకా అన్నం, పప్పూ వండేశారు. అందరికీ వడ్డించేశారు🙏🌼🌿


🌿🌼🙏ఇంత రుచి ఇంతకుముందెన్నడూ చూడలేదు అన్నారు భక్తులు🙏🌼🌿


🌿🌼🙏ఆయన వంట కుర్రాళ్లను చూసే సరికి వాళ్లు మాయమైపోయారు. కనుచూపుమేరలో కనిపించలేదు. ఎంత వెతికినా దొరకలేదు. గుండిగలు మాత్రం మిగిలిపోయాయి🙏🌼🌿


🌿🌼🙏ఆయనకి అర్థమైపోయింది. వచ్చినవాళ్లు అన్న రాముడు, తమ్ముడు లక్ష్మణుడు. అన్నం అంత రుచిగా ఎందుకుందో ఆయనకి తెలిసిపోయింది🙏🌼🌿


🌿🌼🙏శ్రీరామ నీనామమేమి రుచిరా అనుకున్నాడు ఆయన🙏🌼🌿


🌿🌼🙏భక్తులుపెరిగిపోతున్నారు. యాచించింది సరిపోవడం లేదు. రామా నీవే దిక్కు అనుకున్నాడు🙏🌼🌿


🌿🌼🙏హఠాత్తుగా ఒక వాహనం వచ్చి సత్రం ముందు ఆగింది. అందులోనుంచి ఒక ధనవంతుడు దిగాడు🙏🌼🌿


🌿🌼🙏అయ్యా ... !!! నాకు రాత్రి కల వచ్చింది. ఆ కలలో చనిపోయిన నా తల్లి కనిపించింది. మీ సత్రానికి నా భూములన్నిటినీ ఇచ్చేయమని చెప్పింది. నా నాలుగు వేల ఎకరాలు ఇదిగో మీకు రాసిచ్చేస్తున్నాను అని పత్రాలు ఇచ్చి వెళ్లిపోయాడు🙏🌼🌿


🌿🌼🙏ఆయన ఒక పెద్ద వకీలు. హనుమకొండ ఆయన ఊరు. తుంగతుర్తి నరసింహారావు ఆయన పేరు. ఇక ఆ సత్రానికి ఏలోటూ లేదు. నాలుగువేల ఎకరాలూ ఆ సత్రానివే🙏🌼🌿


🌿🌼🙏సత్రం నడిపిస్తున్న ఆయన కొంతకాలానికి వృద్ధుడైపోయాడు. అన్నం పెట్టీ పెట్టీ పున్నెం గడించాడు. అంతా రాముడికే వదిలేశాడు. నాలుగువేల ఎకరాల్లో అంగుళం కూడా ముట్టుకోలేదు. దేవుడే ఇచ్చిన గోచీపాతను కూడా వదిలేసి ఒక రోజు ఆయన ఆ దేవుడి దగ్గరకే వెళ్లిపోయాడు🙏🌼🌿


🌿🌼🙏ఇప్పుడు భద్రాచలానికి రోడ్డు వచ్చింది. కొత్తగూడెం దాకా రైలూ వచ్చింది. ఇప్పుడు క్షణాల్లో భద్రాచలంలో వాలిపోవచ్చు. దేవుడిని చూసి వెళ్లిపోవచ్చు. ఆకలేస్తే అన్నం పెడతా అని పాడే హోటళ్లు వచ్చాయి (డబ్బులు మాత్రం చెల్లించాలి)🙏🌼🌿


🌿🌼🙏ఇప్పుడు గుడికి దారి కూడా మారిపోయింది. ఎవరూ పడవ దాటాల్సిన అవసరం లేదు. సత్రాన్ని కూడా అందరూ మరిచిపోయారు. సత్రం పాడుపడిపోయింది. గబ్బిలాల్లాంటి వాళ్లు వచ్చి చేరారు. నాలుగు వేల ఎకరాల్లో ఒక్క అంగుళం కూడా మిగల్లేదు. ఆ సత్రం పేరు చెబితే కూడా అదేమిటి అని అడిగేలా అయిపోయింది🙏🌼🌿


🌿🌼🙏చాలా ఏళ్లయిన తరువాత ఈ మధ్యే కొన్ని సంవత్సరాల క్రితం ఆ సత్రాన్ని శృంగేరీ పీఠం తన అధీనంలోకి తీసుకుంది. శ్రీచక్ర సిమెంటు వారు దీనికి కావలసిన వనరులుసమకూరుస్తున్నారు. ఒక వేద పాఠశాల నడుస్తోంది. వేదవిద్యార్థులకు అక్కడ అన్నం దొరుకుతుంది. అంటే అన్నదాన యజ్ఞం మళ్లీ మొదలైందన్న మాట. ఆ సత్రం ముందు ఈ అన్నదాన యజ్ఞాన్ని ప్రారంభించిన వ్యక్తి విగ్రహం ఉంటుంది🙏🌼🌿


🌿🌼🙏ఇంతకీ ఆయన పేరు చెప్పనే లేదు కదూ🙏🌼🌿


🌿🌼🙏ఆయన పేరు శ్రీ పమిడిఘంటం వెంకటరమణ దాసు గారు🙏🙏🙏

🌿🌼🙏 1850 లో పుట్టిన ఈయన ప్రకాశం జిల్లా నుంచి భద్రాచలం వచ్చాడు. ఇక్కడే జీవితమంతా గడిపేశాడు. ఆ సత్రం పేరు అంబ సత్రం🙏🌼🌿

 

ఈసారి భద్రాచలం వెళ్ళినప్పుడు శ్రీరామలక్ష్మణులు స్వయంగా వండి, వడ్డించిన ఆ రెండు పాత్రలూ అంబ సత్రంలో ఉన్నాయి, తప్పకుండా దర్శించుకోండి🙏🌼🌿


🌿🌼🙏ఆ రెండు పాత్రల పేర్లు🙏🌼🌿


🌿🌼🙏ఒకటి రామ గుండిగ🙏🌼🌿

🌿🌼🙏ఒకటి లక్ష్మణ గుండిగ🙏🌼🌿


🌿🌼🙏వాటిని ఈ చిత్రంలో చూడవచ్చు🙏🌼🌿


🌿🌼🙏అందరికీ ఆ భగవంతుని అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ... 🙏🙏🙏 Sai Sankalp🙏🌼🌿

#అందరికీ_తెలిసేందుకు_దయచేసి_షేర్_చేయండి 

#అందరూ_దర్శించేందుకు_దయచేసి_షేర్_చేయండి 

#సంభవామి_యుగే_యుగే 


🌿🌼🙏మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి . మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి , ఇవి చదవలేని వారికీ తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో,ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు. " సంభవామి యుగే యుగే " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం కలిగుతుందని మా ఆశ. అందరికీ దర్శనభాగ్యం కలగాలి , ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే " సంభవామి యుగే యుగే "ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం🙏🌼🌿


🌿🌼🙏అందరికీ దర్శనభాగ్యం కలగాలి , ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే " సంభవామి యుగే యుగే "ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం🙏🌼🌿 https://www.facebook.com/sambhavami2498/


🌿🌼🙏అందరం భక్తితో " జై శ్రీరామ్ జై హనుమాన్ " అని వ్రాసి స్వామివార్ల అనుగ్రహం పొందుదాం ... ఎన్ని సార్లు స్మరిస్తే అంత మేలు చేస్తారు శ్రీ రామచంద్రుడు, ఆంజనేయ స్వామి వారు🙏🌼🌿


జై శ్రీరామ్

జై హనుమాన్

కామెంట్‌లు లేవు: