💐 దీపం.. ప్రత్యక్ష దైవం 💐
🌹 అన్ని అర్హతలున్నా మంచి ఉద్యోగం లేకపోవడం.. పెళ్లి కాకపోవడం., లోపంలేకపోయినా పిల్లలు కలగక పోవడం., కారణం లేకుండా గొడవలో ఇరుక్కుని పోవడం., ఇంట్లో ఎప్పుడు ఎందుకు గొడవలు జరుగుతుంది తెలియక మనసుకు శాంతి లేకపోవడం., ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యంతో మానసికరుగ్మతలు., ఎంత సంపాదించినా నిలవక పోవడం., ఇంట్లో ఏదైనా దోషమున్నా తెలియక పోవడం., అకాల మృత్యు భయం., దిష్టిదోషాలు., శాపనార్థాలు., కోర్టు గొడవలకు., వ్యాపారాభివృద్ధికి .. యిలా అన్నిటికీ ఒక మంచి పరిష్కారమార్గమిది.
🌹 ఈ పద్ధతి ఇప్పుడున్నదికాదు.. ఎంతో పురాతనమైన శాస్త్ర సమ్మతమైన విధానం దీపారాధన. ఇంకా కొన్ని దేవాలయాలలో ఇప్పటికీ జరుగుతున్న దీపంతో ఉపాసన. మహా శక్తివంతమైన ఆరాధన.
రాజా రవివర్మ గారు దేవుడిబొమ్మలు గీసాక దేవుడిరూపం ఇలాగుంటుంది అని మనకు చిత్రపటాలొచ్చాయి. అంతకుముందు మహా శిల్పులు , శిల్పతంత్రాన్ని ఆధారంగా చేసుకొని సాముద్రికలోపం లేకుండా చేసిన విగ్రహాలు గుడిలో చూడటమేతప్ప ఇంట్లో ఎవరికీ దేవుడి పటాలు ఉండేవికాదు. అప్పుడు ఇంటి మధ్యభాగాన్ని కనపడేలా సపారులో దీపంగూడు అని ఉండేది. అక్కడ గోడకు తమలపాకులుగాని తులసి ఆకులు కాని రాశి దేవతనామాలను అందులో కుంకుమతోపెట్టి ఆ దీపంలోనే దేవతలను ఆరాధించే వారు.
🌹 మీఇంట్లో బాగా పెద్దవారు ఉంటే అడిగి చూడండి. ఆ రోజుల్లో కరెంటు కూడా లేనందువల్ల సాయంత్రం కూడా ఖచ్చితంగా దీపారాధన చేసేవారు. అప్పుడు పంటలు, ప్రజలు రోగాలు రాకుండా హాయిగానే ఉండేవి. దీపానికి ఒక్కో అర్ధగంటకు ఒక్కో దేవత అధిపతిగా ఉంటారు.. ఉదయం 5 గంటల సమయానికి దీపానికి అదిపతి వినాయకుడు. 5.30 నుండి 6 గంటలవరకు దీపానికి అధిపతి లక్ష్మీదేవి. ఆ సమయంలో ఎక్కడ దీపం వెలుగుతున్నా ఆ దీపంలో లక్ష్మీదేవి కూర్చుని నారాయణుడిని ఆరాధిస్తుంది. అంతటి తల్లి పిలుపు విన్న స్వామి దృష్టి ఆ ఇంటిపైన పడుతుంది. అలా ప్రతి గడియకు దీపానికి అధిపతులుగా దేవతలు ఆజ్యోతిలో కొలువై ఉంటారు. దోషనివారణకు ,జోతి స్వరూపమైన దైవాన్ని అనుగ్రహంకోసం ఎలా పూజించాలి ఇప్పుడు తెలుసుకుందాము..
🍂 దీపంతో ఆరాధన విధానం 🍂
🌹🌻 ముందుగా ఒక పళ్ళెం తీసుకొని అందులో నీరుపోసి పసుపు వేయాలి, ఆ నీరు ఉన్న పళ్లెంలో కామాక్షి, కానీ అష్టలక్ష్మీ ఉన్న దీపం తీసుకొని పసుపు కుంకుమపెట్టి ఇష్ట దైవాన్ని సంకల్పించుకుని మీ సమస్య చెప్పుకుని, సమస్య లేకపోతే దైవానుగ్రహం కోసం అని ఇష్టదైవాన్ని ,ఇలవేల్పుని తల్చుకుని, వినాయకుడిని తల్చుకుని దీపంవెలిగించి మీరు చేసే నిత్యపూజ చేసుకోవాలి. దీపం కచ్చితంగా 41 రోజులు కొండెక్కకుండా జాగర్తపడాలి. ఒత్తి చిన్నదైతే ఇంకో కొత్తఒత్తిని చేర్చి ఆ జ్యోతిని ఈ ఒత్తికి మార్చాక పాత ఒత్తిని తీయాలి. కానీ దీపం కొండెక్కకూడదు. దీపంకింద ఉన్న పళ్లెంలో నీరు ఆవిరైపోతూ ఉంటుంది. నీరు పోస్తూ, పసుపువేస్తూ ఉండాలి.
🌹🌻 41రోజు పూర్తియ్యేసరికి మీ సమస్యలకు చాలావరకు పరిష్కారం లభిస్తుంది. లలితా పారాయణం, విష్ణు సహస్త్రనామం, శివుని శ్లోకాలతో, శ్రీ సూక్తం, లక్ష్మీ అష్టకం, మీ ఇష్టదైవం కావచ్చు ఆ శ్లోకాలతో ఈ దీపంజ్యోతిని ఆరాధించి నివేదనచేసి హారతివ్వాలి. ఇది గృహంలోచేసే అఖండ దీపారాదన.
🍂 ఈ విధానంలో నియమాలు 🍂
1.ప్రత్యేకంగా గది ఉన్నవారు చేయాలి.
2. వ్యాపారస్థలంలో అందరి ఎదురుగా కాకుండా పూజ చేసుకునేచోటు వేరుగాఉంటే పెట్టచ్చు.
3. ఈ 41 రోజులు కొండెక్కితే మళ్ళీ మొదటినుండి చేయాలి. కానీ దోషమేమీలేదు.
4. మైల ఉన్నవారు అటుగా రాకూడదు. వారిని తాకి దీపంలో నూనెపోయాకుడదు.
5.అఖండ దీపారాధన అంటే జోతి స్వరూపంలో భగవంతుడిని ప్రత్యక్షంగా ఆరాధించడం. కాబట్టి నివేదన పూజ ఖచ్చితంగా చేయాలి.
6. ఈ 41 రోజులు అఖండదీపారాధనలో మట్టి దీపము పెట్టకూడదు. ఎందుకంటే దీపాన్ని నీటిపళ్లెం లో ఉంచాలి, ఆనీరు ఎంతగా ఆవిరౌతుందో మీఇంట కరువంతగా తీరుతుంటుంది.
7. 41రోజులు పూజ అయ్యాక మీరు మాములుగా అందులో దీపంపెట్టుకోవచ్చు లేదా మళ్ళీ 41రోజులు కొనసాగించచ్చు. ఆ పళ్లెం మటుకు అప్పుడప్పుడు శుభ్రంచేసి పెట్టాలి.
8. ఈ విధానం లో కొందరికి ఒక సందేహం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడో ఉదయం వెళ్లి రాత్రికొస్తాము ఈలోపు దీపంలో నూనె అయిపోతే, ఒత్తి అయిపోతే చూసుకునే వారు లేరని. అలా సౌకర్యంలేనివారు ఉదయం కచ్చితంగా 5.30 కి ఇంట్లో దీపారాధనచేసి పూజ చేసుకోవాలి. పూజ సంకల్పంతో యదావిధిగా 41రోజులు చేసుకోవాలి. ఆర్ధికఇబ్బందులుండవు.
9. ఈ అఖండదీపం 41రోజుల సమయంలో పాలు, పెరుగు, బెల్లం నివేదనలో ఉండేలా చూసుకోండి. ఖచ్చితంగా అని కాదు. వేరే దీక్షానియమాలు ఏమీ లేవు. దీపం 41 రోజులు కొండెక్కకూడదు అదే ముఖ్యమైన నియమం.. (ఈదీపం ఎలాపెట్టాలో చెప్పినా సరిపోతుంది. కానీ, అర్థంమయ్యేలా వివరించడంవల్ల మీకు ఈపూజ విలువ తెల్సుకుని ఇంకొందరికి తెలియచేస్తారని వివరంగా చెప్పడం జరిగింది).
💐 మీరు చేయాలి అనుకున్నంత సులభంగా దీపం నిలవదు. ఎంతో భక్తిగా ప్రార్ధన చేయాలి. అమ్మవారిని వేడుకోవాలి. లేకపోతే దీపం కొండెక్కుతూనే ఉంటుంది. మీరు మనసుపెట్టి చేస్తేనే అఖండదీపం నిలుస్తుంది. ప్రయత్నం చేయడంలో తప్పులేదు ప్రయత్నించండి 💐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి