17, జూన్ 2021, గురువారం

హంస ,ఒక కాకి

ఒకానొకప్పుడు ఒక హంస ,ఒక కాకి స్నేహం గా ఉండేవి. ఒక రోజున కాకి హంసను తన ఇంటికి తీసుకోని వెళ్ళింది. ఒక ఎండిన చెట్టు మోడుపై అవి కూర్చున్నాయి. ఆ ప్రేదేశమంతా పేడ మాంసము ,ఎముకలు అన్ని చెల్లా చెదురుగా పది ఉండి దుర్వాసన వస్తున్నది. హంస కాకితో సోదరా ! ఇటువంటి మురికి ,దుర్గంధ ప్రదేశం లో నేను క్షణికాలం కూడా ఉండలేను. నన్ను ఏదయినా పవిత్రమైన ప్రదేశానికి తీసుకెళ్ళు అని అడిగింది.


అందువల్ల కాకి హంసను రాజుకు చెందిన ఒక చెట్టు తొర్రలో రహస్యంగా కూర్చోబెట్టి తాను కూడా హంస పక్కనే కూర్చుంది. క్రిందికి చూస్తే హంసకి రాజుగారు చెట్టుకింద కూర్చొని ఉండటం ఆయనకి తలకి బాగా ఎండతగులుతూ ఉండటం కనిపించింది. సాదు స్వభావం కల హంస ఎంతో దయతో తన రెక్కలు విప్పి రాజుకు ఎండతగలకుండా నీడను కల్పించింది. దానివల్ల రాజు కి కాసేపు సుఖం కలిగింది. ఈ లోగా కాకి తన సహజ నిర్లక్ష్య స్వభావంతో రెట్ట వేసింది. అది సరిగ్గా రాజు గారి తలమీద పడింది. రాజు కోపంతో వెంటనే పైకి బాణం వేసేసరికి అది హంసకి తగిలి అది క్రింద పడిపోయంది. 

                                      హంస చనిపోతూ ఓ రాజా ! నీపైన రెట్ట వేసింది కాకి నేను కాదు.  ఎప్పుడు నిర్మలమైన స్వచ్ఛమైన నీటిలో జీవించే హంసను నేను .కానీ చెడ్డ కాకితో చేసిన స్నేహం వలన నా జీవితం కూడా నాశనం అయిపోయింది అని ధుఃకించింది. 

☘️☘️☘️☘️☘️☘️☘️☘️🌺🌺🌺🌺🌺🌺🌺🌺


*నీతి*: మంచితనము ప్రజలను ఎంతగా ప్రభావితం చేస్తుందో అదే విధంగా చెడ్డతనం కూడా మనుషులను ప్రభావితం చేస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరు మంచివారితో మాత్రమే స్నేహం చేసి సత్సాగత్యం లో మెలగాలి. మంచివారితో సాంగత్యం మనుషులపై మంచి ప్రభావాన్ని కలిగిస్తుంది. చెడ్డవాతావరణం లో తిరిగే మంచి వారి లోని మంచి గుణాలను ఎవరు గుర్తించరు. చెడ్డవ్యక్తి తోటి స్నేహం వలన మంచివారు కూడా చెడుఫలితాలను అనిభవించవలసి వస్తుంది. 

🌞🌞🌞🌞🌞🌞🌞🌞🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🦚🦚🦚🦚🦚🦚🦚🦚🤝🤝🤝🤝🤝🤝🤝🤝

కామెంట్‌లు లేవు: